సాక్షి, హైదరాబాద్ : 35 ఏళ్లు పనిచేసిన డిపార్ట్‌మెంట్‌ను వీడిపోతున్నందుకు తనకు చాలా బాధగా ఉందన్నారు తెలంగాణ తొలి డీజీపీ అనురాగ్ శర్మ. ఆదివారం ఉదయం తెలంగాణ పోలీసు అకాడమీలో ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ పదవీ విరమణ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు హాజరై ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. పదవీ విరమణ అనంతరం తొలి డీజీపీగా సేవలందించిన అనురాగ్‌శర్మ మీడియాతో మాట్లాడుతూ.. 'దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు పనిచేసిన పోలీస్ శాఖను వీడుతున్నందుకు బాధగా ఉంది. నా సర్వీస్‌లో ముఖ్యంగా 1992లో పాతబస్తీ డీసీపీగా సేవలందించినప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను.
సౌత్ జోన్‌లో డీసీపీగా పనిచేయడం కూడా నా కెరీర్‌లో పెద్ద ఛాలెంజింగ్ విధి నిర్వహణ. అయితే తెలంగాణ ఏర్పడ్డాక అన్ని సవాళ్లను అధిగమించేలా పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. లా అండ్ అర్డర్‌ను అదుపులో పెట్టేందుకు మాకు ఎంతో సహకరించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. హోంగార్డు నుంచి ఐజీ వరకు రాష్ట్ర పోలీసింగ్‌ను ప్రపంచ వ్యాప్తంగా చాటామని' అనురాగ్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. కాగా, మాజీ డీజీపీ అనురాగ్ శర్మను రాష్ట్ర అంతర్గత భద్రతా సలహదారుగా తెలంగాణ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment