anurag sharma
-
అంబర్‌పేట్‌లో దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ కార్యాలయం ప్రారంబోత్సవం
-
ఎంపీకే టోకరా.. రూ. 25 కోట్లకు కుచ్చుటోపి
న్యూఢిల్లీ: బ్యాంకులో తనఖా పెట్టి.. 20 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్న ప్రాపర్టీని.. మాయమాటలు చెప్పి.. మరో వ్యక్తికి ఏకంగా 5 కోట్ల రూపాయలకు అంటగట్టారు నిందితులు. ఇక్కడ మోసపోయిన వ్యక్తి ఓ ఎంపీ కావడం విషేశం. నిందితులను అరెస్ట్ చేశారు ఆర్థిక నేరాల విభాగం అధికారులు. ఆ వివరాలు.. ఝాన్సీ ఎంపీ అనురాగ్ శర్మకు నాలుగేళ్ల క్రితం నిందితుడు వినోద్ కుమార్ శర్మతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వినోద్ కుమార్ ఢిల్లీలో తనకు ఓ ప్రాపర్టీ ఉందని.. దాని విలువ సుమారు 5 కోట్ల రూపాయలుంటుందని తెలిపాడు. ఆ ప్రాపర్టీని ఢిల్లీ మెట్రో రైల్వై ప్రాజెక్ట్ లీజుకు తీసుకుందని.. నెలకు 8-9 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తుందని నమ్మబలికాడు. (చదవండి: చందమామపై ఇల్లు 289 కోట్లే!) వినోద్ మాటలు నమ్మిన అనురాగ్.. అతడు చెప్పిన మేరకు 5.6 కోట్ల రూపాయలు చెల్లించి 2017, ఫిబ్రవరి 21న కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అసలు మోసం వెలుగులోకి వచ్చింది. విషయం ఏంటంటే అనురాగ్‌కు ప్రాపర్టీని అమ్మడానికి ముందే వినోద్ దాని మీద కెనరా బ్యాంక్‌లో 20.2 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఆ ప్రాపర్టీ మీద కెనరా బ్యాంక్ అనేక చార్జీలు విధించినట్లు తెలుసుకున్నారు. (చదవండి: ఆస్తులు తాకట్టు పెట్టిన సోనూసూద్!) అంతేకాక ప్రాపర్టీని అనురాగ్ శర్మకు అమ్మిన తర్వాత నిందితుడు.. ఆ విషయాన్ని దాచిపెట్టి డీఎంఆర్‌సీతో చేసుకున్న లీజ్ అగ్రిమెంట్‌ను తన పేరు మీదనే పొడగించుకున్నాడు. మోసపోయానని తెలుసుకున్న అనురాగ్ శర్మ.. నిందితుల మీద ఫిర్యాదు చేయడంతో ఆర్థిక నేరాల విభాగం అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వినోద్ శర్మ తనను తాను మాజీ న్యాయశాఖ అధికారిగా పరిచయం చేసుకున్నట్లు విచారణలో వెల్లడయ్యింది. చదవండి: ‘రూ.30 లక్షలు కట్టు.. గవర్నమెంట్ జాబ్ పక్కా’ -
అనురాగ్ శర్మ పదవీ కాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అనురాగ్ శర్మ పదవీకాలాన్ని పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన పదవీకాలం ఈ నెల 12తో ముగియనుండగా, మరో మూడేళ్లు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు, శాంతిభద్రతలు, నేర నియంత్రణ అంశాల సలహాదారుడిగా అనురాగ్ శర్మ వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి డీజీపీగా పని చేసిన ఆయన 2017లో పదివీ విరమణ పొందారు. (తెలంగాణలో కోర్టులు తెరవాలని హైకోర్టు నిర్ణయం) -
అతివకు అండగా ఆమె సేన
ఆదిలాబాద్‌లోని మారుమూల ప్రాంతంలో పోకిరీల వేధింపులపై యువతి ఫోన్ చేయగానే.. 10 నిమిషాల్లో ఘటనాస్థంలో చేరుకుని ఆకతాయిల భరతం పట్టి ఆ యువతిని సురక్షితంగా ఇంటికి చేర్చింది ‘షీ టీమ్’. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉత్తర భారతదేశానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తాను అర్ధరాత్రి 2 గంటలకు సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా ఇంటికి చేరుకోగలుతుంది. ఆ యువతి వెనుక ధైర్యం ‘షీ టీమ్’. సాక్షి, హైదరాబాద్: మహిళ అర్ధరాత్రి సమయంలోనూ స్వేచ్ఛగా రోడ్డుమీద నడిచే పరిస్థితి ఉన్నప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లన్న మహాత్మా గాంధీ మాటల స్ఫూర్తిగా ఆకతాయిల ఆటకట్టి అతివలకు అండగా ఉండేందుకు ఏర్పడిన షీ టీమ్ (ఆమె సేన) ఇప్పుడు ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ ఐదేళ్లలో ఎంతోమంది మహిళల్ని లైంగిక వేధింపుల నుంచి, యువతుల్ని ఈవ్‌టీజింగ్ నుంచి రక్షించింది. షీ టీమ్ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు ఈ ఐదేళ్లలో వచ్చి చేరాయి. వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలుపెడతాం అన్నట్లుగా ఐదేళ్ల క్రితం నగరంలో మహిళల రక్షణకు మొదలుపెట్టిన ఆమె సేన.. నేడు రాష్ట్రవ్యాప్తంగా తన సేవలను విస్తరించింది. 33 జిల్లాల్లో 300 పైగా షీ టీమ్స్ మహిళలకు భద్రత కల్పిస్తున్నాయి. 2015, అక్టోబరు 24న అప్పటి డీజీపీ అనురాగ్‌శర్మ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీసులు మహిళల రక్షణ కోసం హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన షీటీమ్స్ నేడు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. నగరంలోని మూడు కమిషనరేట్లలో షీటీమ్స్ ఇచ్చిన ప్రేరణే ఇందుకు కారణం. ఇపుడు వేలాది కేసులు, ఫిర్యాదులతో ప్రజలకు ముఖ్యంగా విద్యార్దినులు, మహిళలకు చేరువైంది. అన్నివర్గాల ప్రశంసలు అందుకుంటోంది. పొరుగు రాష్ట్రాలకు స్ఫూర్తిగా.. మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా పనిచేసే షీటీమ్స్ కేవలం కేసుల నమోదుకే పరిమితమవలేదు. వేధింపులు జరిగినపుడు ఎలా ఎదుర్కోవాలి? ఆపద సమయాల్లో ఎలా వ్యవహరించాలి? అన్న విషయాలపై వివిధ కార్యక్రమాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. రోజూ రాష్ట్రవ్యాప్తంగా కనీసం 70 నుంచి 80 అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండటం షీటీమ్స్ పనితీరుకు నిదర్శనం. ఈ ఫలితాలు చూసి పొరుగు రాష్ట్రం ఏపీ తరువాత దేశంలోని అన్ని మెట్రోనగరాల్లో షీటీమ్స్ సేవలు ప్రవేశపెట్టేలా స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కేసులను నిరంతరం పర్యవేక్షిస్తుండటం గమనార్హం. వేధింపులు ఎక్కువగా జరిగే ప్రదేశాల(హాట్స్పాట్లు)ను గుర్తించి అందుకు అనుగుణంగా పోలీసుల మోహరింపు చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసు కళా బృందాలు షీటీమ్స్పైనా ప్రచారం చేస్తుండటంతో ఫిర్యాదులు పెరుగుతున్నాయి. మొత్తం ఫిర్యాదుల్లో సోషల్ మీడియా ద్వారానే అధికంగా వస్తుండటం గమనార్హం. ఆఫీస్‌లు, స్కూళ్లు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో పనిప్రదేశాల్లో చేస్తోన్న అవగాహన కార్యక్రమాలు మహిళలపై వేధింపుల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు షీటీమ్స్ పోలీసులు నమోదు చేసే పెట్టీ కేసులను సైతం సీసీటీఎన్ఎస్ (క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్కింగ్ సిస్టమ్)తో అనుసంధానిస్తున్నారు. -
మార్చి 31 నాటికి ‘భగీరథ’ నీళ్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటిలో నల్లా బిగించి, పరిశుభ్రమైన మంచినీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఎవరు కూడా మంచినీళ్ల కోసం బిందె పట్టుకుని బయట కనిపించవద్దని చెప్పారు. కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు అనే తేడా లేకుండా రాష్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ పథకం ద్వారానే మంచినీళ్లు అందివ్వాలని స్పష్టం చేశారు. ఈ పథకం పూర్తి చేయడంలో ఖర్చుకు వెనుకాడవద్దని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో మిషన్ భగీరథ పథకంపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు అనురాగ్‌శర్మ, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, మిషన్ భగీరథ ఈ.ఎన్.సీ. కృపాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, జోగు రామన్న, గొంగిడి సునీత, రాజేందర్‌రెడ్డి, కె.విద్యాసాగర్‌రావు, ఎన్.భాస్కర్‌రావుతో పాటు వివిధ జిల్లాల సీఈలు, ఈఈలు హాజరయ్యారు. సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. నీళ్లు ఇవ్వడంతోనే బాధ్యత తీరిపోదు.. రాష్ట్రంలో 23,968 ఆవాస ప్రాంతాలు ఉండగా... మిషన్ భగీరథతో ప్రస్తుతం 23,947 ప్రాంతాలకు ప్రస్తుతం నీరు అందుతోందని, మరో 21 గ్రామాలకు మాత్రమే అందాల్సి ఉందన్నారు. ఆ గ్రామాలు కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాల్లో ఉన్నవేనని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని 95 శాతం ఇళ్లకు నల్లాలు బిగించి మంచినీరు అందిస్తున్నట్లు నివేదించారు. ఓవర్ హెడ్ స్టోరేజీ రిజర్వాయర్ (ఓహెచ్ఎస్ఆర్) నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని వివరించారు. కేసీఆర్ మాట్లాడుతూ... ‘దళితవాడలు, ఆదివాసీగూడేలు, శివారు ప్రాంతాలు, మారుమూల పల్లెలు అన్నింటికీ మిషన్ భగీరథతోనే శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయడం ప్రభుత్వ లక్ష్యం. అచ్చంపేట, సిర్పూరు నియోజకవర్గాలు... ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కొత్తగూడెం లాంటి జిల్లాల్లోని మారుమూల చిన్న పల్లెలకు, ఎత్తయిన ప్రాంతాల్లోని ఆవాస ప్రాంతాలకూ కష్టమైనా, ఆర్థికంగా భారమైనా‡ మిషన్ భగీరథతోనే మంచినీరు సరఫరా చేయాలి. జనవరి 10లోగా అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు చేరుకోవాలి. మార్చి 31లోగా అన్ని ప్రాంతాల్లో అన్ని పనులు పూర్తి చేయాలి. ఆ తర్వాత రాష్ట్రంలో నల్లా ద్వారా మంచినీళ్ల సరఫరా కాని ఇల్లు ఒక్కటీ మిగలొద్దు. ప్రతీ ఊరికి నీళ్లు పంపి, ప్రతీ ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు ఇవ్వడంతోనే బాధ్యత తీరిపోదు. ఆ తర్వాత కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా మంచినీటి సరఫరా జరగాలి. ఒకసారి భగీరథతో శుద్ధి చేసిన నీరు తాగిన తర్వాత ప్రజలు మరో రకం నీళ్లు తాగలేరు. ఏ ఒక్క రోజు నీరు అందకున్నా తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. మిషన్ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేయడం ఎంత ముఖ్యమో ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా దాన్ని నిర్వహించడం అంతే ముఖ్యం. ప్రతీ రోజు మంచినీటి సరఫరా చేయడానికి అవలంబించాల్సిన వ్యూహం ఖరారు చేసుకోవాలి’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సందేహాలు తొలగాయి... ‘మిషన్ భగీరథ చేపట్టాలని అనుకున్న రోజు చాలా మందికి చాలా అనుమానాలుండేవి. ఈ కార్యక్రమం అవుతుందా? అనే సందేహాలు ఉండేవి. అధికారులు, ఇంజనీర్లు కష్టపడి ఇంజనీరింగ్ పరంగా అద్భుతమైన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వేల కిలోమీటర్ల పైపులైన్లు వేశారు. నదీ జలాలను ప్రతీ ఊరికి తరలిస్తున్నారు. ప్రతీ ఇంటికి మంచినీళ్లు అందిస్తున్నారు. దేశంలో మరెవ్వరూ చేయని అద్భుతాన్ని తెలంగాణ రాష్ట్రం చేసి చూపెడుతున్నది. దేశానికి ఇది ఆదర్శంగా నిలిచింది. అనేక రాష్ట్రాలు మిషన్ భగీరథ లాంటి పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించాయి. మన నుంచి సహకారం కోరుతున్నాయి. ఆయా రాష్ట్రాలకు అవసరమైన సహకారం అందించడానికి మనం సంసిద్ధత వ్యక్తం చేశాం. మిషన్ భగీరథ తెలంగాణకు గర్వకారణం. దీన్ని విజయవంతం చేసిన ఘనత అధికారులు, ఇంజనీర్లదే. వారికి నా అభినందనలు. ఎంతో శ్రమకోడ్చిన ప్రతీ ఒక్కరికీ కతజ్ఞతలు’’అని సీఎం చెప్పారు. కాళేశ్వరం పర్యటన వాయిదా ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం వాయిదా పడింది. మంగళ, బుధవారాల్లో ఆయన కాళేళ్వరం ప్రాజెక్టును, పంప్‌హౌజ్‌లను సందర్శించాల్సి ఉంది. అయితే తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన ఎప్పుడు ఉంటుందో త్వరలో నిర్ణయిస్తారు. -
వచ్చే మార్చి కల్లా ప్రతి ఇంటికి నల్లా: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పనులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్లో సోమవారం సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటిలో నల్లా బిగించి మంచినీరు సరఫరా చేయాలని ఆధికారులకు సూచించారు. వచ్చే ఏప్రిల్ నాటికి కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలనే తేడా లేకుండా రాష్ర్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ పథకం ద్వారానే మంచినీళ్లు అందించేల చర్యలు తీసుకోవాలని ఆధికారులకు సూచించారు. మిషన్ భగీరథ పనులపై ప్రస్తుతం జరుగుతున్నపనుల వివరాలు వెల్లడించిన ఆధికారులు. రాష్ట్రంలో 23,968 ఆవాస ప్రాంతాలకు గాను, 23, 947 ఆవాస ప్రాంతాలకు ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందుతున్నాయని ఆధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని 95 శాతం ఇండ్లకు నల్లాలు బిగించి మంచినీరు అందిస్తున్నట్లు సీఎంకు నివేదించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, దళిత వాడలు, ఆదివాసీ గూడేలు, శివారు ప్రాంతాలు, మారుమూల పల్లెలు అన్నింటికీ మిషన్ భగీరథ ద్వారానే శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆర్థికంగా భారమైనా సరే మిషన్ భగీరథ ద్వారానే మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు. వచ్చే జనవరి 10లోగా అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు చేరుకోవాలని సీఎం గడువు విధించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేయడం ఎంత ముఖ్యమో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడం కూడా అంతే ముఖ్యమన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టాలని అనుకున్న రోజు చాలా మందికి చాలా అనుమానాలుండేవి. ఈ కార్యక్రమం అవుతుందా? అనే సందేహాలుండేవి. కానీ అధికారులు, ఇంజనీర్లు ఎంతో కష్టపడి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, మిషన్ భగీరథ ఇ.ఎన్.సీ. కృపాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, జోగు రామన్న, గొంగిడి సునిత, రాజేందర్ రెడ్డి, కె.విద్యాసాగర్ రావు, భాస్కర్ రావు, తదితరులు హాజరయ్యారు. -
ఆస్ట్రేలియాలో తెలం‘గానం’..
సిడ్నీ: ఆస్ట్రేలియాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ఏటీఎఫ్) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర హోం శాఖ సలహాదారు అనురాగ్ శర్మ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ముఖ్య అతిథులుగా, ఆస్ట్రేలియా ప్రజా ప్రతినిధులు జూలీ ఓవెన్స్, జూలియా ఫిన్, స్కాట్ ఫార్లో, హగ్ మెక్ డర్మాట్, డేవిడ్ క్లార్క్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. తెలంగాణ అమరులు, ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళులు అర్పించిన అనంతరం అతిథులు వేడుకలు ప్రారంభించారు. తెలంగాణ ఆట, పాటలతో సభా ప్రాంగణం ఉర్రూతలూగింది. జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధించడమే కేసీఆర్ లక్ష్యమనీ, పారిశ్రామిక ప్రగతికి, రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాదాన్యిమిస్తోందని అన్నారు. రాష్ట్రంలో విరివిగా పెట్టబడులు పెట్టి బంగారు తెలంగాణ సాధనలో భాగం కావాలని ఎన్నారైలను కోరారు. విదేశాల్లో ఉంటూ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతున్న ఎన్నారైల కృషి ఎనలేనిదని అనురాగ్ శర్మ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఎన్నారైలు కీలక పాత్ర పోషించారని అభినందించారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందనీ.. టీఎస్ ఐపాస్ విధానంలో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘తెలంగాణ సాధించుకోవడంతోనే మన కర్తవ్యం పూర్తయినట్టు కాదనీ.. బంగారు తెలంగాణ నిర్మాణానికి అందరం బాధ్యత వహించాల’ని ఏటీఎఫ్ అధ్యక్షుడు అశోక్ మాలిష్ అన్నారు. బంగారు తెలంగాణ సాధనలో తమవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఏటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సేరి మాట్లాడారు. ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులు, ప్రవాస భారతీయులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరం (ఆస్ట్రేలియా) అధ్యక్షుడు అశోక్ మరం, సందీప్ మునగాల, సున్లీ్ కల్లూరి, మిథున్ లోక, వినయ్ యమా, ప్రదీప్ తెడ్ల, గోవర్దన్ రెడ్డి, అనిల్ మునగాల, కిశోర్ రెడ్డి, నటరాజ్ వాసం, శశి మానెం, డేవిడ్ రాజు, ఇంద్రసేన్ రెడ్డి, పాపి రెడ్డి, నర్సింహ్మ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణకు సేఫ్టీ డిపార్ట్మెంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, వాటి నియంత్రణకు పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించబోతోంది. జాతీయ, రాష్ట్ర రహదారులపై జరిగే ప్రమాదాలపై అధ్యయనం చేసిన పోలీస్ శాఖ.. వాటి నియంత్రణకు ప్రణాళిక తయారు చేసింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏయే రహదారుల్లో ఎక్కువగా ప్రమాదాలు జరిగాయి? ఎందుకు జరిగాయి? అన్న పలు కారణాలను విశ్లేషించింది. రోడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రస్తుతం పోలీస్ శాఖలో రోడ్ సేఫ్టీ వింగ్ పనిచేస్తోంది. అయితే పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడంతోపాటు చాలీచాలని బడ్జెట్‌తో కునికిపాట్లు పడుతోంది. ప్రమాదాల నివారణకు ప్రత్యేక అధికారాలు, సిబ్బంది, బడ్జెట్.. ఇలా అన్నీ కేటాయిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గతంలో డీజీపీ అనురాగ్ శర్మ రోడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల అది పెండింగ్‌లో పడింది. అయితే ప్రస్తుతం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సందర్భంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు వీలుగా రోడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏర్పాటును వేగవంతం చేసేందుకు పోలీస్ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన బ్లాక్‌స్పాట్స్‌ను దృష్టిలో పెట్టుకొని 18 రోడ్ సేఫ్టీ పోలీస్ స్టేషన్లు ఏర్పాటుచేస్తే బాగుంటుందని నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే వికారాబాద్ జిల్లాలో రెండు రోడ్ సేఫ్టీ పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. రోడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏర్పాటయితే, ఈ విభాగానికి డిప్యుటేషన్‌పై అధికారులు, సిబ్బందిని కేటాయించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం కొత్త కానిస్టేబుళ్ల శిక్షణ ముగియగానే అందులో నుంచి కొందరు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కొందరిని ఈ డిపార్ట్మెంట్కు డిప్యుటేషన్‌పై పంపించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కో పోలీస్ స్టేషన్‌కు ఎస్ఐ స్థాయి అధికారితో పాటు 8మంది కానిస్టేబుళ్లు ఉండేలా ప్రతిపాదనలు రూపొందించినట్టు తెలిసింది. బ్లాక్ స్పాట్స్‌లో స్టేషన్లు: పదేపదే ఒకేచోట ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా పోలీస్ శాఖ గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారుల్లో 23 ప్రాంతాలను గుర్తించారు. 20 ప్రమాదాలు జరిగి, ఇద్దరికన్నా ఎక్కువ మంది మృతులు ఉన్న ప్రమాద ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా అంచనా వేశారు. ఇక్కడ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. -
సంతృప్తితో వెళ్తున్నా
సాక్షి, హైదరాబాద్: ‘వెనక్కి తిరిగి చూసుకోకుండానే 35 ఏళ్ల సర్వీసు పూర్తయింది. శిక్షణ తర్వాత 1984లో నా ఫస్ట్ పోస్టింగ్ నిర్మల్ నుంచి ఇప్పుడు డీజీపీ హోదా వరకు ఎన్నో సవాళ్లు, వాటిని మించిన విజయాలు. నాతో పాటు పనిచేసి పోలీస్ శాఖకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన వారందరిని వదిలి వెళ్లిపోవడం బాధనిపించినా.. అంతకుమించిన సంతోషాన్ని పంచుకుంటున్నాను. డీజీపీ బాధ్యతలు చేపట్టే నాటికి అధికారుల విభజన పూర్తి కాలేదు. కేవలం 29 మంది ఐపీఎస్ అధికారులతో ప్రభుత్వం, సీఎం అప్పగించిన బాధ్యతలను పూర్తిచేస్తూ వచ్చాం. తోటి ఐపీఎస్ అధికారులతో కలసి ఎన్నో సమస్యలు పరిష్కరించాం. వాటికి తగ్గట్టుగా వచ్చిన విజయాలను పంచుకున్నాం. పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో పనిచేశా. కేంద్ర సర్వీసు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్.. ఇలా అన్ని చోట్ల పూర్తి స్థాయిలో సంతృప్తి చెందా. నా విజయానికి బాటలు వేసి, రాష్ట్ర పోలీస్ శాఖను దేశంలోనే బెస్ట్‌గా నిలిచేలా కృషిచేసినా హోంగార్డుల నుంచి ఐపీఎస్‌ల వరకు అందరికీ కృతజ్ఞతలు’అంటూ అనురాగ్ శర్మ డీజీపీ హోదా నుంచి భావోద్వేగంతో పదవీ విరమణ చేశారు. ఆదివారం రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన వీడ్కోలు పరేడ్‌లో ఆయన పాల్గొని పోలీస్ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గ్రేహౌండ్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ తనతోటే ప్రారంభమయ్యాయని, అవి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగిన విభాగాలుగా గుర్తింపు రావడం గర్వకారణంగా ఉందన్నారు. పదేళ్ల ముందుగానే.. దేశంలో ఉన్న అన్ని పోలీస్ విభాగాల కన్నా పదేళ్ల ముందుగానే రాష్ట్ర పోలీస్ శాఖ ఆధునీకరణ చెందిందని అనురాగ్ శర్మ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో మహేందర్‌రెడ్డి, సైబరాబాద్‌లో అప్పటి కమిషనర్ సీవీ ఆనంద్ అద్భుతంగా పని చేసి స్మార్ట్ పోలీసింగ్‌లో అదుర్స్ అనిపించారని ప్రశంసించారు. ఉన్న సిబ్బందితోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. తెలంగాణ ఏర్పడితే నక్సలిజం వస్తుందని, మత కల్లోలాలు జరుగుతాయని ఆరోపణలు వచ్చినా, అలాంటి ఒక్క సందర్భం కూడా జరగకుండా విజయం సాధించామని తెలిపారు. ఇలాంటి అనేక విజయాలను నూతన డీజీపీ మహేందర్‌రెడ్డి అందిస్తారని ఆకాక్షించారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న తోడ్పాటుతో మరింత ముందుకెళ్లాలని, ప్రజలకు మరింత చేరువై అంకితభావంతో సేవలందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తన భార్య కూడా ఐపీఎస్ కావడంతో సమస్యల విషయంలో కొత్త ఆలోచనలు, వ్యూహాలు అందించిందని తెలిపారు. హోంశాఖ సలహాదారుడిగా బాధ్యతలు స్వీకరించిన అనురాగ్ శర్మ రాష్ట్ర పోలీస్, శాంతి భద్రతలు, నేర నియంత్రణ ప్రభుత్వ సలహాదారుడిగా రిటైర్డ్ డీజీపీ అనురాగ్ శర్మ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం ఈ మేరకు ప్రభుత్వం నుంచి అందిన అధికారిక ఉత్తర్వులను స్వీకరించి, జాయినింగ్ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. సచివాల యంలో పూర్తి స్థాయిలో కార్యాలయం ఏర్పాటైన తర్వాత కార్యకలాపాలు సాగించనున్నట్టు తెలిపారు. ఆ గొప్పతనం అనురాగ్ శర్మదే: మహేందర్‌రెడ్డి మూడున్నరేళ్ల పాటు రాష్ట్ర పోలీస్ శాఖను దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన ఘనత డీజీపీ అనురాగ్ శర్మకు దక్కుతుందని నూతన డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. హోంగార్డు నుంచి ఐపీఎస్‌ల వరకు అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి అనేక సమస్యలు పరిష్కరించుకుంటూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టిన గొప్పతనం ఆయనకే దక్కుతుందన్నారు. మావోయిస్టుల సమస్య, ఉగ్రవాద సమస్య రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరికలు వచ్చిన సమయంలోనూ ఆయన ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పనిచేసి విజయవంతమయ్యామని చెప్పారు. స్పెషల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సైబర్ టీమ్స్, లా అండ్ ఆర్డర్.. ఇలా అన్ని విభాగాల ఆధునీకరణకు కృషి చేసి సక్సెస్ అయ్యారని కొనియాడారు. అనురాగ్ శర్మ అందిస్తున్న ఈ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని అధికారులు, సిబ్బందికి మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. -
రాష్ట్రమంతా ఒకే పోలీసింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసింగ్ మొత్తం ఒకేలా ఉండేలా చూడటమే తన ప్రధాన కర్తవ్యమని నూతన డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీగా ఆదివారం పదవీవిరమణ చేసిన అనురాగ్‌శర్మ నుంచి పదవీ బాధ్యతలను స్వీకరించిన అనంతరం మహేందర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసుశాఖ అధిపతిగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని, ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. హైదరాబాద్‌లో అయినా లేక ఆదిలాబాద్‌లో అయినా పోలీసుల పనితీరు ఒకేలా ఉండేలా చూస్తానని, హైదరాబాద్ కమిషనరేట్‌లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో అమలు చేయడంతోపాటు నేరాల నియంత్రణ, మహిళల భద్రత తన లక్ష్యాలన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిదిలో 1.5 లక్షల సీసీటీవీలు ఏర్పాటు చేశామని, మూడు కమిషనరేట్ల పరిధిలో మొత్తం 10 లక్షల కమ్యూనిటీ సీసీటీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. తొలి దశలో మూడు కమిషనరేట్లలో, రెండో దశలో కొత్తగా ఏర్పడ్డ కమిషనరేట్లలో టెక్నాలజీ, సీసీటీవీలు, సైబర్ ల్యాబ్‌లు, షీటీమ్స్లు ఏర్పాటు చేస్తామ న్నారు. మూడో దశలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో సీసీటీవీల ఏర్పాటుపై దృష్టి సారిస్తామన్నారు. ప్రజా భాగస్వామ్యంతో ముందుకు... హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో సర్వీసు డెలివరీ సమయం 4–5 నిమిషాలుగా ఉందని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. నిరంతర పెట్రోలింగ్, జీపీఎస్ ట్రాకింగ్ వంటి సేవల ద్వారా సర్వీసు డెలివరీలో మరింత ముందుకు వెళ్లొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల సహకారం లేనిదే ఎంతటి కార్యక్రమమైనా విజయవంతం కాదని, ప్రతి కార్యక్రమంలోనూ ప్రజలను భాగస్వాములను చేస్తూ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో నేర నియంత్రణ చేయవచ్చన్నారు. రాష్ట్రంలో నేరం చేస్తే పోలీసులు క్షణాల్లో పట్టుకుంటారన్న భయం నేరస్తుల్లో ఏర్పడే స్థాయిలో సీసీటీవీలు ఏర్పాటు చేస్తామన్నారు. అనురాగ్‌శర్మకు ఘనంగా వీడ్కోలు డీజీపీగా పదవీ విరమణ చేసిన అనురాగ్‌శర్మకు రాష్ట్ర పోలీస్ కేంద్ర కార్యాలయంలో అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసు ఆనవాయితీ ప్రకారం రిటైర్డ్ డీజీపీ వాహనాన్ని ఐపీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులంతా తాళ్లతో లాగుతూ గేటు వరకు తీసుకువచ్చారు. అనంతరం గౌరవ వందనం చేసి అనురాగ్‌శర్మకు వీడ్కోలు పలికారు. సిబ్బంది పనితీరు మదింపు... పోలీసు సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు గుర్తించేందుకు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ విధానాన్ని అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో ప్రవేశపెడతామని డీజీపీ చెప్పారు. దీనివల్ల ప్రతి జిల్లా, సబ్ డివిజన్, పోలీసు స్టేషన్ పరిధిలో హోంగార్డులు మొదలు ఐపీఎస్‌ల వరకు వారి పనితీరు సులభంగా తెలుస్తుందని, దాని ఆధారంగా ప్రతిభగల సిబ్బందికి గుర్తింపునిచ్చి తోడ్పాటు అందిస్తామన్నారు. హోంగార్డులు, కానిస్టేబుళ్లకు ఆఫీసర్లుగా గుర్తింపు లభించేలా చూస్తానని డీజీపీ హామీ ఇచ్చారు. ఈ మేరకు వారి రీ డెసిగ్నేషన్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదిస్తానన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో 18 వేలకుపైగా పోలీసు పోస్టులు మంజూరయ్యాయని, ప్రస్తుతం 10 వేల మందికిపైగా కానిస్టేబుళ్లు శిక్షణలో ఉన్నారని వివరించారు. గవర్నర్‌తో మర్యాదపూర్వక భేటీ నూతన డీజీపీగా పదవీబాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎం. మహేందర్‌రెడ్డి, డీజీపీగా పదవీవిరమణ సందర్భంగా అనురాగ్‌శర్మ ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలిశారు. -
సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన అనురాగ్ శర్మ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్, శాంతిభద్రతలు, నేర నియంత్రణ ప్రభుత్వ సలహదారుడిగా రిటైర్డ్ డీజీపీ అనురాగ్ శర్మ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అందిన అధికారిక ఉత్తర్వులను స్వీకరించి జాయినింగ్ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అనురాగ్ శర్మ పంపించారు. సచివాలయంలో పూర్తి స్థాయిలో కార్యాలయం ఏర్పాటైన తర్వాత తన కార్యకలాపాలు సాగించనున్నట్టు ఆయన తెలిపారు. -
'నా కెరీర్లో అవే పెను సవాళ్లు'
సాక్షి, హైదరాబాద్ : 35 ఏళ్లు పనిచేసిన డిపార్ట్మెంట్ను వీడిపోతున్నందుకు తనకు చాలా బాధగా ఉందన్నారు తెలంగాణ తొలి డీజీపీ అనురాగ్ శర్మ. ఆదివారం ఉదయం తెలంగాణ పోలీసు అకాడమీలో ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ పదవీ విరమణ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు హాజరై ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. పదవీ విరమణ అనంతరం తొలి డీజీపీగా సేవలందించిన అనురాగ్‌శర్మ మీడియాతో మాట్లాడుతూ.. 'దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు పనిచేసిన పోలీస్ శాఖను వీడుతున్నందుకు బాధగా ఉంది. నా సర్వీస్‌లో ముఖ్యంగా 1992లో పాతబస్తీ డీసీపీగా సేవలందించినప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను. సౌత్ జోన్లో డీసీపీగా పనిచేయడం కూడా నా కెరీర్లో పెద్ద ఛాలెంజింగ్ విధి నిర్వహణ. అయితే తెలంగాణ ఏర్పడ్డాక అన్ని సవాళ్లను అధిగమించేలా పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. లా అండ్ అర్డర్‌ను అదుపులో పెట్టేందుకు మాకు ఎంతో సహకరించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. హోంగార్డు నుంచి ఐజీ వరకు రాష్ట్ర పోలీసింగ్‌ను ప్రపంచ వ్యాప్తంగా చాటామని' అనురాగ్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. కాగా, మాజీ డీజీపీ అనురాగ్ శర్మను రాష్ట్ర అంతర్గత భద్రతా సలహదారుగా తెలంగాణ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. -
అందరి సహకారంతో ‘బెస్ట్’గా నిలిచాం
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర పోలీసుశాఖను దేశంలోని అత్యుత్తమ పోలీసు విభాగాల్లో ఒకటిగా నిలపడంలో సహకరించిన, మద్దతు పలికిన వారందరికీ ధన్యవాదాలు’అని డీజీపీగా ఆదివారం పదవీవిరమణ చేయనున్న అనురాగ్‌శర్మ శనివారం తన అధికారి క ట్వీటర్ ఖాతాలో పేర్కొన్నారు. తన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వ సలహదారుగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నూతన డీజీపీ మహేందర్‌రెడ్డికి అభినందనలు తెలుపుతూ వీడ్కోలు చెప్పారు. ‘ఫ్రెండ్స్ ఇన్ యూనిఫాం’ ఆవిష్కరణ ఫ్రెండ్లీ, స్మార్ట్ పోలీసింగ్‌పై పోలీస్ అధికారులు రూపొందించిన ‘ఫ్రెండ్స్ ఇన్ యూనిఫాం’టేబుల్ బుక్‌ను డీజీపీ అనురాగ్‌శర్మ శనివారం ఆవిష్కరించారు. పోలీస్‌శాఖ చేపట్టిన అనేక కార్యక్రమాలను ప్రతిబింబించేలా ఫిల్మ్ మేకర్ అనితా సలూజ చిత్రీకరించిన వీడియో ఫిల్మ్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. అలాగే పోలీస్ సేవలపై అభినయ శ్రీనివాస్, చంద్రప్రకాశ్ రూపొందించిన ఆడియో అల్బమ్‌ను డీజీపీ శనివారం ఇక్కడి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విడుదల చేశారు. -
రాష్ట్ర డీజీపీగా మహేందర్‌రెడ్డి
-
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు 60 మార్కులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమలు చేస్తు న్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి 60 మా ర్కులు వేస్తానని, ఈ విసయంలో ఇంకా 40 శాతం పురోగతి సాధించాల్సి ఉందని డీజీపీ అనురాగ్‌శర్మ అభిప్రాయపడ్డారు. ఆదివారం పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఏర్పా టు చేసిన మీట్ ది ప్రెస్‌లో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా అనురాగ్‌శర్మ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కేవలం ఉన్నతాధికారులు, ఐపీఎస్‌లు పాటి స్తే వచ్చేది కాదని, కింది స్థాయిలో పనిచేసే కానిస్టేబుళ్లు, ఎస్సై ల నుంచి రావాల్సి ఉంటుందన్నారు. ఈ విధానం నూరు శాతం విజయవంతమయ్యేందుకు దశలవారీగా కార్యచరణ రూపొందించుకోవాల్సి ఉందన్నారు. మావోయిస్టు ప్రాబల్యం పెరగదు... రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టు ప్రాబల్యం పెరుగుతుందని వచ్చిన వార్తలకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా పనిచేశామని అనురాగ్‌శర్మ చెప్పారు. విభజన సమయంలో కేవలం 29 మంది ఐపీఎస్ అధికారులతో విభాగాలను ఏడాదిపాటు నెట్టుకొచ్చామని, అయినా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలేవీ లేకుండా టీంవర్క్‌తో విజ యం సాధించామన్నారు. తాను మూడున్నరేళ్లపాటు డీజీపీగా సక్సెస్ అవడం వెనుక హోంగార్డుల నుంచి ఐపీఎస్‌ల దాకా అందరి కృషి ఉందని, ఇది మొత్తం పోలీస్‌శాఖ గొప్పతనమన్నారు. రాష్ట్రంలో మావోయిస్టు ప్రాబల్యం పెరుగుతుందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అలాంటి అవకాశాలు ఏమాత్రం లేవని స్పష్టం చేశారు. మిగతా రాష్ట్రాలకన్నా మిన్న 35 ఏళ్ల సర్వీసులో చాలా చోట్ల పనిచేశానని, అన్ని చోట్లా తనకు సంతృప్తికరంగా అనిపిం చిందన్నారు. సర్వీసులోకి రాకముందు మూడేళ్లపాటు అటవీశాఖలో పనిచేశానని తెలిపారు. ప్రతి కానిస్టేబుల్‌కు టెక్నాలజీపై పట్టు ఉండేలా ట్యాబ్‌లు ఇస్తున్నామని, దీనివల్ల అంకితభావ సేవలు ప్రజలకు అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఇచ్చిన తోడ్పాటుతో మిగతా రాష్ట్రాలకన్నా తెలంగాణ పోలీస్ 100 శాతం అద్బుతమైన పనితీరును ప్రదర్శించిందని, ఇకపైనా కొనసాగిస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. తన విజయంలో మీడియా ప్రధాన పాత్ర పోషించిందని, ప్రతి చిన్న సమాచారాన్ని తనతో మీడియా ప్రతినిధులు పంచుకున్నారని, రాష్ట్రానికి ఇబ్బంది తెచ్చే విషయాలను సైతం తనకు చెప్పి నియంత్రణ చర్యలు తీసుకోవడంలో కృషి చేశారని ఆయన కితాబునిచ్చారు. పదవీ విరమణ చేయనున్న అనురాగ్ శర్మను హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు రాజమౌళిచారి, విజయ్‌కుమార్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. -
నూతన డీజీపీగా మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర డీజీపీగా మహేందర్‌రెడ్డి నియమితులయ్యారు. అనురాగ్ శర్మ ఆదివారం పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో డీజీపీగా హైదరాబాద్ పోలీసు కమిషనర్, 1986 బ్యాచ్‌కు చెందిన ఎం.మహేందర్‌రెడ్డిని నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం శాంతి భద్రతల విభాగం అదనపు కమిషనర్‌గా ఉన్న వీవీ శ్రీనివాస్‌రావును హైదరాబాద్ ఇన్చార్జి కమిషనర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. సోమవారం రాత్రికల్లా రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు పోలీసు అకాడమీలో ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ పదవీ విరమణ పరేడ్ జరగనుంది. అనంతరం 11.30 గంటలకు మహేందర్‌రెడ్డి ఇన్చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర పోలీసు ముఖ్య కార్యాలయ వర్గాలు స్పష్టంచేశాయి. అనురాగ్ శర్మను రాష్ట్ర అంతర్గత భద్రతా సలహదారుగా నియమిస్తూ సంబంధిత ఫైల్‌పై సీఎం సంతకం చేశారు. డీజీపీ సేవలను ప్రశంసించిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ ఆదివారం పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆయన సేవలను ప్రశంసిస్తూ శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో అభినందనలు తెలిపింది. మూడున్నరేళ్ల పాటు హౌసింగ్ కార్పొరేషన్‌కు ఆయన తోడ్పాటు అందించారని, సలహాలు, సూచనలు చేశారని గుర్తు చేసుకుంది. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ దామోదర్‌గుప్తా, డీజీపీ అనురాగ్‌శర్మ, ఫైర్ సర్వీసెస్ డీజీ రాజీవ్ రతన్, హౌజింగ్ కార్పొరేషన్ ఎండీ బి.మల్లారెడ్డి, చీఫ్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతలు నిర్వర్తించడం సంతృప్తినిచ్చింది
-
‘తెలంగాణకు తొలి డీజీపీని కావడం సంతోషం’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి తొలి డీజీపీగా బాధ్యతలు నిర్వహించడం సంతోషకరమైన విషయమని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ మూడున్నరేళ్ల పనితీరు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర తొలి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆదివారం (12వ తేదీ) పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతుందనే వాదన తెరమీదకు వచ్చిందని, అయితే సీఎం కేసీఆర్ సహకారంతో ఆ సమస్యను అధిగమించామన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తగ్గిందని, టెక్నాలజీ సాయంతో ఉగ్రవాదాన్ని అణిచివేశామన్నారు. పోలీస్ వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో చాలామంది సమర్థులైన పోలీస్ అధికారులు ఉన్నారన్నారు. రిటైర్డ్ అయ్యాక ప్రభుత్వం కోరితే తన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అనురాగ్ శర్మ తెలిపారు. -
ప్రభుత్వం కోరితే నా సేవలు అందిస్తా
-
పోలీసుల త్యాగాలు గుర్తిద్దాం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : దేశ రక్షణలో పోలీస్ త్యాగాలు వెలకట్టలేనివని, అమరుల త్యాగాలను స్మరించుకోవాలని డీజీపీ అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఈ నెల 15న హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో నిర్వహిస్తున్న పోలీస్ రన్‌కు సంబంధించి టీషర్ట్, మెడల్‌లను సీపీ మహేందర్‌రెడ్డి, కృష్ణప్రసాద్, ఇతర అధికారులతో కలిసి డీజీపీ అనురాగ్‌శర్మ గురువారం పోలీస్ ముఖ్య కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులో 2 కె, 5 కె, 10 కె రన్ ను నిర్వహిస్తున్నట్లు అయన తెలిపారు. పరుగు పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి మెడల్ ఇస్తామన్నారు. 2014లో గువాహటిలో నిర్వహించిన డీజీపీల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ పోలీస్ త్యాగాలకు గుర్తింపులేదని, వివిధ కార్యక్రమాలు, సందర్బాలలో ప్రజలకు తెలియజేయాలని సూచించారని తెలిపారు. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వెబ్సైట్లో పోలీస్ సిబ్బంది చేసిన మంచి కార్యక్రమాలను అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలు అప్ లోడ్ చేస్తాయని పేర్కొన్నారు. గతేడాది రాష్ట్రంలో వివిధ పోలీస్ సంస్థలు, పారా మిలిటరీతో కలసి పోలీస్ సిబ్బంది ఉపయోగించే ఆయుధాలు, పరికరాల ప్రదర్శన నిర్వహించామన్నారు. ఈసారి కూడా 14వ తేదీ నుంచి 16 వరకు ఎక్స్పో నెక్లెస్‌రోడ్‌లో ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈ రన్లో పాల్గొని, కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. -
మరో మూడు నెలలు పొడిగింపు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కొత్త డీజీపీ ఎవరు? ఆ స్థానంలో ఎవరిని తీసుకువస్తారు? పోలీస్ శాఖలోనే కాదు రాజకీయపరంగా కూడా ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడతో ముందుకు వెళ్తోందన్న వాదన సైతం అధికార వర్గాల్లో వినిపిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ నవంబర్ 14న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే మరో మూడు నెలల పాటు డీజీపీ పదవీ కాలాన్ని పొడిగించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సచివాలయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజీవ్ శర్మ పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది. ఇప్పుడు అనురాగ్ శర్మ వ్యవహారంలోనూ ప్రభుత్వం అదే రీతిలో వ్యవహరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పదోన్నతులు కల్పిస్తూనే బదిలీలు.. నవంబర్ 14న పదవీ విరమణ చేసేకంటే ముందే ఇన్చార్జి డీజీపీగా పలువురు అధికారుల పేర్లపై కసరత్తు జరగాల్సి ఉంది. ప్రస్తుతం అలాంటి చర్చలు, కసరత్తు జరగడం లేదు. అనురాగ్ శర్మ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించడంపై కూడా ఒక ఎత్తుగడ ఉన్నట్టు వినిపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో పలువురు అధికారులకు పదోన్నతులు కల్పించాల్సి ఉంది. అప్పటి వరకు రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీలు లేకుండా చూసుకోవాలని, పదోన్నతులు కల్పిస్తూనే డీజీపీతో పాటు ఇతర కీలకమైన అధికారులను బదిలీ చేసేందుకు కసరత్తు చేసుకోవాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సీనియర్ ఐపీఎస్‌ల్లో చర్చ జరుగుతోంది. పదోన్నతుల్లో భాగంగా సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్యా ఐజీ హోదా నుంచి అదనపు డీజీపీగా పదోన్నతి పొందనున్నారు. అలాగే తరుణ్‌జోషి సీనియర్ ఎస్పీ హోదా నుంచి డీఐజీగా పదోన్నతి పొందనున్నారు. వీరిద్దరికీ నూతన పోస్టింగ్‌తో పాటు రెండేళ్ల పాటు పోస్టింగ్ పూర్తి చేసుకున్న సీనియర్ ఐపీఎస్‌లకు స్థాన చలనం చేయాల్సి ఉంది. ఇందుకోసం ఒకేసారి డీజీపీతోపాటు భారీ ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాదే డీజీపీ ఎంపికపై కసరత్తు ఇక డీజీపీగా ఎవరిని నియమించాలన్న దానిపై సర్కార్ పెద్దగా కసరత్తు చేసినట్టు కనిపించడంలేదు. జనవరిలోనే ఆ తతంగం పూర్తిచేస్తారని, ఇందుకోసం కేంద్ర సర్వీసులో ఉన్న సుదీప్ లఖ్టకియాతో పాటు నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, రోడ్ సేఫ్టీ డీజీ కృష్ణప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నలుగురిలో ఎవరో ఒకరికి డీజీపీ పోస్టు ఖాయమన్న చర్చ ఐపీఎస్‌ల్లో నడుస్తోంది. అయితే ఫిబ్రవరిలో ఇన్చార్జి డీజీపీగా ఒకరిని నియమించి ఆ తర్వాత డీవోపీటీ, కేంద్ర హోంశాఖకు పంపే ప్యానల్ జాబితాలో ఈ నలుగురితో పాటు డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న మరో ముగ్గురి పేర్లు కూడా పంపనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి వచ్చే ముగ్గురి పేర్లలో ఒకరిని పూర్తి స్థాయి డీజీపీగా నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. -
26 వేల పోలీస్ కొలువులు
గోదావరిఖని/సాక్షి, హైదరాబాద్ : పోలీసు శాఖలో 26 వేల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ప్రకటించారు. అందులో 33 శాతం రిజర్వేషన్ ప్రకారం 8 వేల ఉద్యోగాలను మహిళలతో భర్తీ చేస్తామని వెల్లడించారు. బుధవారం గోదావరి ఖనిలో రూ.4.50 కోట్లతో నిర్మించనున్న మోడల్ పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘మహిళలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకం ఉండాలి. అందుకే ముందుగా సబ్ డివిజన్, జిల్లా కేంద్రాల్లోని స్టేషన్లలో మహిళా పోలీసుల నియామకంపై దృష్టి సారిస్తాం..’’అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఎండీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాదరావు, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, రామగుండం నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, వరంగల్ ఐజీ నాగిరెడ్డి, కరీంనగర్ డీఐజీ రవి వర్మ, రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ తదితరులు పాల్గొన్నారు. భర్తీ ఒకే దఫాలో కాకపోవచ్చు.. 26 వేల పోస్టులను ఒకేసారి భర్తీ చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో నియామక ప్రక్రియ చేపట్టడం వల్ల ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుందని, రెండుదశల్లో నియామకాలు జరిపితే సమస్య ఉండదని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. పోలీస్ శాఖ కూడా రెండు దశల్లో నియామకాలకే మొగ్గుచూపుతోంది. ఇందులో భాగంగా మొదటి దఫాలో 10 వేల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి అనుమతి కోసం డీజీపీ కార్యాలయం చర్యలు చేపట్టనున్నట్టు తెలిసింది. దీంతోపాటు ప్రస్తుతం 11 వేల మంది సిబ్బంది శిక్షణలో ఉన్నారు. వారి శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ట్రైనింగ్ కాలేజీలు బిజీగా ఉన్నాయి. 11 వేల మంది సిబ్బంది శిక్షణకే సమస్యలు ఎదురవుతున్నాయని, అలాంటిది ఒకేసారి 26 వేల పోస్టులు భర్తీ చేస్తే మరింత క్లిష్టంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోనుంది. -
అనుక్షణం.. అప్రమత్తం..
ఏరియల్ సర్వే చేస్తున్న హోంమంత్రి నాయిని, సీపీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న డీజీపీ అనురాగ్ శర్మ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి డీజీపీ పర్యవేక్షణ హోంమంత్రి, సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్ ఏరియల్ సర్వే సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో వినాయక నిమజ్జన ఏర్పాట్లు, బందోబస్తును డీజీపీ అనురాగ్ శర్మ, నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం నుంచి ఖైరతాబాద్ గణేశ్ శోభా యాత్ర రాత్రి 10 గంటల వరకు డీజీపీ కార్యాలయంలోని కంట్రోల్ సెంటర్ ద్వారా అనురాగ్ శర్మ, అదనపు డీజీపీ అంజనీ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్‌చంద్, పీఅండ్ఎల్ ఐజీ సంజయ్‌జైన్, నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి, శాంతి భద్రతల ఇన్చార్జి ఐజీ రమేశ్‌రెడ్డితో కలసి సీసీ కెమెరాల్లో వీక్షించారు. అనంతరం ఎల్బీస్టేడియం, అబిడ్స్, అఫ్జల్‌గంజ్, చార్మినార్ ప్రాంతంలో శోభాయాత్రను పరిశీలించారు. హోంమంత్రి ఏరియల్ సర్వే.. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీపీ మహేందర్ రెడ్డి, అదనపు డీజీపీ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు. అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్టులో నాయిని మీడియాతో మాట్లాడుతూ.. ఖైరతాబాద్ వినాయకుడు మధ్యాహ్నంలోపే నిమజ్జనం కావడం హర్షించదగ్గ విషయ మన్నారు. శోభాయాత్ర ప్రశాంతంగా, ఆహ్లాదకర వాతావరణంలో జరిగిందని, నిమజ్జనోత్సవంలో ప్రజల సహకారం మరు వలేనిదని, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. అనురాగ్‌శర్మ.. 1992 నుంచి.. భాగ్యనగరంలో నిమజ్జనాలకు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించడం అంత సులువుకాదు. అయితే డీజీపీ అనురాగ్‌శర్మ 1992 నుంచి నగరంలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండటం గమనార్హం. సౌత్‌జోన్ డీసీపీగా 1992 జూన్‌లో బాధ్యతలు స్వీకరించిన ఆయన.. అప్పటి నుంచి 1995 సెప్టెంబర్ వరకు బందోబస్తు బాధ్యతలు నిర్వర్తించారు. తదనంతరం నగర కమిషనర్‌గా 2012, 2013లో రెండుసార్లు యూనిట్ ఆఫీసర్‌గా గణేశ్ నిమజ్జన బందోబస్తులో పాల్గొన్నారు. ప్రస్తుతం డీజీపీ çహోదాలో నాలుగేళ్లుగా గణేశ్ నిమజ్జన బందోబస్తు, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పదిసార్లు వినాయక నిమజ్జనాల్లో స్వయంగా పాల్గొనడం గర్వంగా ఉందని, నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని డీజీపీ అనురాగ్‌శర్మ ‘సాక్షి’కి చెప్పారు. వైభవంగా మహాగణపతి నిమజ్జనం సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. సంప్రదా యానికి భిన్నంగా ఈసారి ఉదయం ఏడు గంటలకే శోభాయాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం రెండు గంటలలోపే నిమజ్జన వేడుకలు ముగిశాయి. భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఖైరతాబాద్ నుంచి లక్డీకాఫూల్, టెలిఫోన్‌భవన్, సెక్రటేరియట్ మీదుగా వేలాది మంది భక్తుల ఆనందోత్సాహాల నడుమ శోభాయాత్ర సాగింది. ఉదయం 10.25 గంటలకు మహాగణపతి బయలుదేరిన వాహనం ఎన్టీఆర్ రోడ్డులోని నాలుగో నంబర్ క్రేన్ వద్దకు చేరింది. అక్కడ గణనాథుడికి తుది పూజలు నిర్వహించిన అనంతరం వెల్డింగ్ పనులు చేపట్టారు. సరిగ్గా మధ్యాహ్నం 1.57 గంటలకు భక్తుల జయజయ ధ్వానాల నడుమ నిమజ్జన ఘట్టం పూర్తయ్యింది. -
26 వేల మందితో బందోబస్తు
రాజధానిలో గణేశ్ నిమజ్జన భద్రతా ఏర్పాట్లపై డీజీపీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో మంగళవారం జరిగే వినాయక నిమజ్జనానికి 26 వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. రాష్ట్ర పోలీసుశాఖలోని ప్రత్యేక బెటాలియన్లు, ఆర్మ్డ్ రిజర్వ్, పారామిలిటరీ బలగాలతో కలసి భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైబరాబాద్, రాచకొండ, సిటీ కమిషనరేట్లలో మొత్తం 25,850 విగ్రహాలు ఏర్పాటయ్యాయని, ఒక్క హైదరాబాద్ కమిషన రేట్ పరిధిలోనే 11,572 విగ్రహాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే మూడు కమిషనరేట్ల పరిధిలో సగం వరకు విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని తెలిపారు. నిమజ్జన రూట్‌మ్యాప్ ఆధారంగా మొత్తం సీసీటీవీలను ఏర్పాటు చేశామని, సిటీ కమిషనరేట్, డీజీపీ కార్యాలయంలో కమాండ్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఏరియల్ సర్వే కూడా చేస్తామని వివరించారు. నిమజ్జన బందోబస్తును పర్యవేక్షించేందుకు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పదకొండు మంది ఐజీలు, నలుగురు డీఐజీలు, పదిహేను మంది ఎస్పీలు, ఏడుగురు అదనపు ఎస్పీలు, 132 మంది డీఎస్పీలు, 349 మంది ఇన్స్పెక్టర్లు, 1,209 మంది ఎస్సైలు, 11,642 మంది కానిస్టేబుళ్లను రంగంలోకి దించామన్నారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు, వాహనదారులకు ఎప్పటికప్పుడు నగర కమిషనరేట్ తగు సూచనలిస్తుందన్నారు. జీహెచ్ఎంసీ, విద్యుత్‌శాఖ, వాటర్ బోర్డు విభాగాలతో అత్యవసర సేవల బృందాలనూ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాల్లో ఇప్పటికే సగం మేర గణేశ్ విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని, భైంసా, వరంగల్ తదితర సున్నిత ప్రాంతాల్లోనూ అదనపు బలగాలను రంగంలోకి దించి ప్రశాంత వాతావరణంలో మంగళవారం నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేస్తామని డీజీపీ తెలిపారు. కిందటి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. -
మోకాళ్లపై కూర్చుని మంత్రికి వినతి
గోవిందరావుపేట (ములుగు): భూపాలపల్లి జిల్లాలో ఐదో పోలీసు బెటాలియన్ ఏర్పాటుచేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా గోవిందరావుపేట మండలం చల్వాయి శివారులోని భూమిని తాజాగా డీజీపీ అనురాగ్‌శర్మ పరిశీలించారు. అయితే, అది ప్రభుత్వ భూమే అయినా దశాబ్దాలుగా నిరుపేద రైతులు ఖాస్తులో ఉన్నారు. ప్రస్తుతం ఆ భూమిని బెటాలియన్‌కు కేటాయిస్తే తాము అన్యాయానికి గురవుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈక్రమంలో మండలంలోని నేతాజీనగర్‌కు మంత్రి చందూలాల్ రాగా ఆయనకు వినూత్న రీతిలో తమ సమస్యను రైతులు తెలియజేశారు. మంత్రి కాన్వాయ్ వెళ్తుండగా రైతులు మోకాళ్లపై కూర్చుని వినతిప త్రాలు చూపించారు. దీంతో మంత్రి కాన్వాయ్ ఆపి రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యను తెలుసుకున్నారు. తాను అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. -
జిల్లాల పర్యటనకు డీజీపీ..
హైదరాబాద్: మంచిర్యాల, రామగుండం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌లలో డీజీపీ అనురాగ్ శర్మ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. శుక్రవారం, శనివారం సాగే ఈ పర్యటనలో కొత్త జిల్లాల పోలీసింగ్, శాంతి భద్రతల పటిష్టత, నేరాల నియంత్రణ, గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులు వాటి భద్రత తదితర అంశాలకు సంబంధించి అధికారులతో భేటీ కానున్నట్లు తెలిసింది. మావోల నియంత్రణా చర్యలపై కమిషనర్లు, ఎస్పీల కు దిశానిర్దేశం చేయనున్నారని పోలీస్ వర్గాలు తెలిపాయి. కొత్తగా నిర్మించాల్సిన జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్లు, ఆర్మ్డ్ రిజర్వ్ బ్యారక్, పరేడ్ గ్రౌండ్.. తదితర భవనాలకు సంబంధించి స్థలాల పరిశీలనను కూడా డీజీపీ ఆరా తీయనున్నారు. -
కేబినెట్ ముందుకు పోలీస్ పోస్టులు
13వేలకుపైగా పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో భారీగా పోస్టుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ రాబోతోంది. నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మరిన్ని అదనపు పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి డీజీపీ అనురాగ్‌శర్మ ప్రతిపాదనలు పంపారు. కొత్త జిల్లాలకు సంబంధించి ఎస్పీ పోస్టుల నుంచి కానిస్టేబుల్ పోస్టుల వరకు కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న కేబినెట్ ముందుకు పోస్టుల ప్రతిపాదనలు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. 27 ఎస్పీ, 18 అదనపు ఎస్పీ పోస్టులు: నూతన జిల్లాలకు 27 ఎస్పీ, 18 అదనపు ఎస్పీ, 62 డీఎస్పీ పోస్టులు మంజూరు చేయాలని పోలీస్ శాఖ ప్రతిపాదించింది. 38 సీఐ, 210 ఎస్ఐ, 9 వేల కానిస్టేబుల్ పోస్టులు, బెటాలియన్లలో 2,028 సిబ్బంది పోస్టులు, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో 2వేల కానిస్టేబుల్ పోస్టులు కోరింది. డీఎస్పీ నుంచి నాన్ క్యాడర్ ఎస్పీ పదోన్నతులకు సంబంధించి పోస్టుల మంజూరుపై కూడా కేబినేట్ ఆమోదంతో స్పష్టత రానుందని తెలిసింది. డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల్లో 1,166 పోస్టులను భర్తీ చేసేందుకు కళాశాల విద్యా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఫైలును ఆమోదం కోసం ఆర్థిక శాఖకు బుధవారం పంపించినట్లు సమాచారం. -
ఎంత బడ్జెట్ కావాలో చెప్పండి!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయా జిల్లాల పోలీస్ విభాగానికి ఎంత బడ్జెట్ కావాలో ప్రతిపాదనలు పంపాలని డీజీపీ అనురాగ్ శర్మ ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించారు. నూతన జిల్లాల్లో చేపటాల్సిన నిర్మాణాలు, వాటికయ్యే నిధులు, ఇతరత్రా ఖర్చులపై ప్రతిపాదనలను వారంలోగా పంపాలని ఆదేశించారు. త్వరలో పోలీస్ శిక్షణ కేంద్రాలు, బెటాలియన్లు, ప్రధాన బందోబస్తులకు కావల్సిన మెయింటెన్స్లపై కూడా నిధులు కోరాలని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో జరిగే గణేష్ నిమజ్జనం బందోబస్తు, దానికి కావాల్సిన ఏర్పాట్లు, అయ్యే ఖర్చు వివరాలను సైతం బడ్జెట్ ప్రతిపాధనల్లోనే పేర్కొనాలని ఆదేశించారు. నూతనంగా ఏర్పడిన పోలీస్స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలకు ప్రతి నెలా అయ్యే మెయింటెన్స్ ఖర్చుల ప్రతిపాదనలను పేర్కొనాలని ఆదేశించారు. ప్రస్తుతం కమిషనరేట్ల పరిధిలో రూ.75 వేలు, అర్బన్ ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్లకు రూ.50 వేలు, రూరల్ ప్రాంతాల్లోని ఠాణాలకు ప్రతి నెల రూ.25 వేలు ప్రభుత్వం కేటాయిస్తోంది. నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ఎస్పీ బంగ్లా, అదనపు కార్యాలయం, బంగ్లా, సీసీఎస్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, ఆర్మ్డ్ రిజర్వ్ క్వార్టర్స్, బెల్ ఆఫ్ ఆర్మ్డ్, పరేడ్ గ్రౌండ్ తదితర నిర్మాణాలను చేపట్టేందుకు భారీ ఎత్తున నిధులు ఖర్చయ్యే అవకాశం ఉంది. మొత్తం రూ.600 కోట్ల వరకు ఈ నిర్మాణాలకే అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. టెక్నాలజీ వినియోగం, ప్రతీ జిల్లాలో కమాండ్ కంట్రోల్‌సెంటర్, అర్బన్, మండల ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి కనెక్టివిటీ తదితర కార్యక్రమాల కోసం కూడా బడ్జెట్లో భారీ నిధులు కేటాయించాల్సి ఉంటుందని అధికారులు కోరుతున్నారు. -
తెలంగాణలో పెరిగిన అత్యాచారాలు
► మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై పెరిగిన నేరాలు ► వార్షిక నేర నివేదికను విడుదల చేసిన డీజీపీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలపై అత్యాచారాలు, హింస పెరిగాయి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు పెరిగాయి. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచా రాలకు సంబంధించి 2014లో 117 కేసులు, 2015లో 147 కేసులు నమోదు కాగా 2016లో ఇప్పటి వరకు 169 కేసులు నమోదయ్యాయి. ఎస్టీ, ఎస్టీలపై అన్ని రకాల నేరాలకు సంబం« దించి నవంబర్ 2015 నాటికి 1288 కేసులు నమోదు కాగా నవంబర్ 2016 వరకు 1398 కేసులు నమోదయ్యాయి. క్రైం రేటు 8.5శాతం పెరిగింది. అదే విధంగా మహిళలపై అత్యా చారాల కేసులు 2014లో 972, 2015లో 1,117 నమోదు కాగా, 2016 నవంబర్ వరకు 1,138 నమోదయ్యాయి. వీటిల్లో 253 కేసులు ప్రేమ, పారిపోవడాలకు సంబంధించినవి ఉన్నాయి. మహిళలపై అన్ని రకాల నేరాలకు సంబంధించి 2015 నవంబర్‌లోగా 12,422 కేసులు నమోదు కాగా.. 2016 నవంబర్ వరకు 12,281 కేసులు నమోదయ్యాయి. డీజీపీ అనురాగ్‌శర్మ గురువారం ఇక్కడ విడు దల చేసిన 2016 వార్షిక నేర నివేదికలోని గణాంకాలివి. గతంతో పోల్చితే బాధితులు స్వేచ్ఛగా ఫిర్యాదులు చేస్తున్నారని, ఫిర్యాదుల న్నింటిపై కేసులు నమోదు చేస్తున్నామని, అందుకే ఎస్సీ, ఎస్టీలు, మహిళలపై అత్యా చార కేసులు పెరిగాయని డీజీపీ వివరణ ఇచ్చారు. మహిళల రక్షణ కోసం రాష్ట్రంలో 221 షీ టీములు పనిచేస్తున్నాయని, వీటీ ద్వారా 3,171 కేసులు నమోదు చేయగా, 2,733 మంది నిందితులకు కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. సామాజిక మాద్యమాల పోస్టుల ఆధారంగా నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. తగ్గిన హత్యలు, దోపిడీలు, దొంగతనాలు.. రాష్ట్రంలో హత్యలు, లబ్ధి కోసం హత్యలు, దోపిడీ, దొంగతనాలు తగ్గాయి. 2016 నవంబర్ వరకు శిక్షార్హ నేరాలకు సంబంధించి 95,124 కేసులు నమోదయ్యాయని, గడిచిన రెండేళ్లతో పోల్చితే నేరాలు స్వల్పంగా తగ్గు ముఖం పట్టాయని డీజీపీ తెలిపారు. అయితే, చైన్ స్నాచింగ్ ఘటనల్లో బాధితులు గాయప డిన కేసుల సంఖ్య మాత్రం స్వల్పంగా పెరి గింది. మొత్తానికి 2015లో 1,418 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కాగా 2016లో ఇప్పటి వరకు 958 కేసులకు తగ్గాయి. పదేపదే నేరాలకు పాల్పడుతున్న 665 మందిపై పీడీ చట్టాన్ని ప్రయోగించారు. నిత్యం నెత్తురోడుతున్న రోడ్లు... తెలంగాణలో రహదారులు నిత్యం నెత్తురోడు తున్నాయి. 2015లో 17,999 రోడ్డు ప్రమాదా లు చోటుచేసుకోగా 5,725 మంది మృత్యు వాతపడ్డారు. 2016 నవంబర్ వరకు 19,395 రోడ్డు ప్రమాదాలు జరగగా, 5,563 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదాలు 8శాతం పెరగగా, ప్రమాదాల్లో మృతుల రేటు 2శాతం తగ్గింది. 2015లో ప్రతి 100 ప్రమా దాలకు 31.80 మృత్యు రేటు ఉండగా, 2016 లో 28.68కు తగ్గింది. జాతీయ సగటు 29.34 కన్నా ఇది తక్కువని పోలీసు శాఖ తెలిపింది. 51,642 డ్రైవింగ్ లైసెన్సుల సస్పెన్షన్ చేసిన ట్లు పేర్కొంది. నిబంధనలను ఉల్లం ఘించిన వాహనదారుల నుంచి 2015లో 83.41 కోట్ల జరిమానాలు వసూలు చేయగా, 2016లో రూ.85.19 కోట్లు వసూలు చేసింది. తీవ్రవాదులకు ప్రవేశం లేదు.. తెలంగాణలో మావోయిస్టుల సంఖ్య చాలా తక్కువని డీజీపీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీ (టీఎస్సీ), ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల కమిటీలు, కేకేడబ్ల్యూ డివిజనల్ కమిటీలు పనిచేస్తున్నాయని, వీటిలో 92 మంది మావోయిస్టులు ఉన్నారన్నారు. వీరిని రాష్ట్రంలోకి రానీయమన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా జాతి వ్యతిరేక కార్యకలాపాల పట్ల ఆకర్షితులైన యువతకు కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. తగ్గిన సైబర్ నేరాలు రాష్ట్రంలో సైబర్ నేరాల సంఖ్య తగ్గింది. 2015లో 634 సైబర్ నేరాల కేసులు నమోదు కాగా, 2016లో 513 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచడం వల్ల మోసపోయే వారి సంఖ్య తగ్గిందని డీజీపీ అనురాగ్ శర్మ గురువారం తెలిపారు. పెద్దనోట్ల రద్దు తర్వాత పెద్ద మార్పు కనిపించలేదని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో ఆర్థిక నేరాలు, నమ్మక ద్రోహాలు, మోసాలు పెరిగాయి. 2015లో 7,303 ఆర్థిక నేరాల కేసులు నమోదు కాగా 2016లో 7,987కు పెరిగాయి. 9.37 శాతం వృద్ధి నమోదైంది. -
టఫ్ కార్యాలయం తెరిపించండి
హోంమంత్రి, డీజీపీలకు విమలక్క విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: పోలీసులు సీజ్ చేసిన ‘తెలంగాణ యునై టెడ్ ఫోరం’ (టఫ్) కార్యాలయాన్ని తిరిగి తెరిపిస్తామని డీజీపీ అనురాగ్‌శర్మ హామీ ఇచ్చారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కన్వీనర్ విమలక్క తెలిపారు. మానవ హక్కుల ఫోరం (హెచ్ఆర్ఎఫ్) కన్వీనర్ జీవన్‌కుమార్, సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యుడు రాము తదితరులతో కలసి మంగళవారం ఆమె డీజీపీని కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ విషయమై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కూడా కలిశామన్నారు. హోంమంత్రి సూచన మేరకు డీజీపీని కలసి వినతిపత్రం సమర్పించామని చెప్పారు. తమ విజ్ఞప్తిపై డీజీపీ సానుకూలంగా స్పందించారని, మంగళవారం సాయంత్రంగానీ, బుధవారం ఉదయంగానీ తెరిపి స్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఎలాంటి సెర్చ్ వారెంట్, నోటీసులు లేకుండానే పోలీసులు హైదరాబాద్‌లోని దోమలగూడలో ఉన్న టఫ్ కార్యాలయంలో తనిఖీలు జరిపి, సీజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అప్రజాస్వామిక ఘటన పునరావృతం కాకూడదని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. -
ఈ నెల 16న పోలీస్ రన్: అనురాగ్‌శర్మ
హైదరాబాద్ : అమరులైన పోలీసుల ఆత్మశాంతి కోసం అక్టోబర్ 16వ తేదీన 5 వేల మందితో పోలీస్ రన్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో అనురాగ్‌శర్మ విలేకర్లతో మాట్లాడుతూ...ఈ రన్లో పోలీసు ఉన్నతాధికారులతోపాటు కేంద్ర బలగాలకు చెందిన అధికారులు కూడా పాల్గొంటారని అనురాగ్‌శర్మ వెల్లడించారు. -
డీజీపీని కలసిన పీసీసీ మాజీ చీఫ్
హైదరాబాద్ : వరంగల్ జిల్లాలోని జనగామలో 144 సెక్షన్ ఎత్తివేయాలని డీజీపీ అనురాగ్ శర్మకు పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్‌లో డీజీపీ కార్యాలయంలో అనురాగశర్మను పొన్నాల కలిశారు. జనగామ ప్రత్యేక జిల్లా కోసం పోరాడుతున్న వారిపై కేసులు ఉపసంహరించాలని ఈ సందర్భంగా అనురాగశర్మను పొన్నాల కోరారు. పొన్నాలతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కూడా అనురాగశర్మను కలిసినవారిలో ఉన్నారు. -
నిశ్శబ్ద జోన్ల ప్రచారానికి డీజీపీ శ్రీకారం
హైదరాబాద్: పాఠశాలలు, ఆస్పత్రులు, కార్యాలయాల పరిసరాల్లో నిశ్శబ్ద జోన్ల ప్రచారానికి డీజీపీ అనురాగ్‌శర్మ శ్రీకారం చుట్టారు. హార్న్ నాట్ ఒకే జోన్ అనే స్వచ్ఛంద సంస్థ పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని డీజీపీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిశ్శబ్ద జోన్ల పరిధిలో స్కూళ్లు, ఆస్పత్రులతో పాటు డీజీపీ కార్యాలయాన్ని చేర్చడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో శాంతిభద్రతల డీఐజీ కల్పనా నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అనురాగ్‌శర్మను కలిసిన ఏపీ డీజీపీ సాంబశివరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జీ డీజీపీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన నండూరి సాంబశివరావు రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మను సోమవారం తన కార్యాలయంలో కలుసుకున్నారు. నూతనంగా డీజీపీ బాధ్యతలు చేపట్టిన సాంబశివరావు మర్యాద పూర్వకంగా డీజీని కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు డీజీపీలు పాలసీ అంశాలపై కాసేపు చర్చించుకున్నారు. -
11 మంది డీఎస్పీల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 11 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అనురాగ్ శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ప్రతిపాదనల మేరకు ఈ బదిలీలు జరిగాయి. బదిలీ అయిన అధికారులను విధుల నుంచి రిలీవ్ చేయాల్సిందిగా సంబంధిత యూనిట్ అధికారులను డీజీపీ ఆదేశించారు. -
పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తాం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచడంలో పోలీసుల కృషి ఎనలేనిదని, వారి సంక్షేమానికి మరింత కృషి చేస్తామని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. పోలీసుల సంక్షేమంలో భాగంగా సిబ్బంది కంట్రిబ్యూషన్‌తో నడుస్తున్న ‘భద్రత’ పొదుపు సంఘం మొదటి సర్వసభ్య సమావేశం ఆదివారం డీజీపీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా 2014-15 సంవత్సర కార్యకలాపాలను ఐజీ సౌమ్యామిశ్రా, సంఘం కార్యదర్శి గోపాల్ రెడ్డిలు వివరించారు. సిబ్బంది జీతభత్యాలు, వారి కుటుంబ సభ్యుల మేలును దృష్టిలో పెట్టుకొని పొదుపు, ఆరోగ్య భద్రత పథకాలను మరింత ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2,441 మందికి వ్యక్తిగత రుణాల కింద రూ.30.06 కోట్లు అందజేసినట్లు వివరించారు. అలాగే 252 మందికి గృహ అవసరాల కోసం రూ.17.23 కోట్లు, పిల్లల ఉన్నత చదువుల కోసం రూ.8.78 కోట్లు అందజేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆరోగ్య భద్రతపై ప్రత్యేకంగా చర్చించారు. వివిధ జిల్లాల ప్రతినిధులు మాట్లాడుతూ... కొన్ని ఆస్పత్రులు పోలీసు సిబ్బందిని పట్టించుకోవడం లేదని, ఎమర్జెన్సీ సమయంలో చేర్చుకోవడం లేదని అన్నారు. భద్రత సంస్థ చైర్మన్, డీజీపీ అనురాగ్‌శర్మ మాట్లాడుతూ పోలీసు సంక్షేమం కోసం నూతన పద్ధతులు అవలంబిస్తామని చెప్పారు. భద్రత, ఆరోగ్య సేవలకు సంబంధించి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామన్నారు. త్వరలో ప్యానల్లో ఉన్న ఆస్పత్రులను పరిశీలిస్తామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ మేనేజింగ్ కమిటీ సభ్యులు వీవీ శ్రీనివాసరావు, బాలనాగదేవి, కల్పనా నాయక్, శివధర్‌రెడ్డిలతో పాటు పోలీసు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి, కరణ్‌కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
దేశంలోనే తెలంగాణ రికార్డు
హైదరాబాద్: పాస్ పోర్టుల జారీలో తెలంగాణ రికార్డు నెలకొల్పింది. దేశంలోనే మిగతా రాష్ట్రాలతో పోల్చితే పాస్ పోర్టు వెరిఫికేషన్‌లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ చేతుల మీదుగా డీజీపీ అనురాగ్ శర్మకు అవార్డు ప్రదానం చేశారు. -
సీసీ కెమెరాలతో పోలీసుల పనితీరులో పారదర్శకత
సాక్షి, హైదరాబాద్: ఠాణాల్లో సీసీ కెమెరాలు ఉండటం వల్ల పోలీసుల్లో జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతుందని రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. వివిధ ఠాణాల్లో ఏర్పాటు చేసిన 450 సీసీ కెమెరాలు అనుసంధానించిన సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసుస్టేషన్ సీసీటీవీ ప్రాజెక్టు, వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. దేశంలోనే ఈ ప్రాజెక్టు మొదటిది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల విధానం వల్ల ప్రజలు, పోలీసుల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెరుగుతుందని అన్నారు. ఈ తొలి అడుగు పీపుల్ ఫ్రెండ్లీ ఇమేజ్‌కు దర్పణం పడుతుందన్నారు.‘సీసీ కెమెరాల వల్ల ఠాణాల్లో ఏం జరుగుతుందనేది స్పష్టంగా తెలిసిపోతుంది. పోలీసు సిబ్బంది ఏ మేరకు విధులు నిర్వహిస్తున్నారో వీడియో రూపంలో కనబడుతుంది. ఈ విధానాల వల్ల ప్రజల్లో కూడా పోలీసులకు మంచి పేరు లభిస్తుంది. లాకప్లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం బాగుంది’ అని డీజీపీ అన్నారు. విద్యో యాప్ ద్వారా ఠాణాకు రాలేని వారి వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయడంతోపాటు ఘటనాస్థలికి వెళ్లి బాధితుల వివరణ తీసుకుంటే మంచి సాక్ష్యాలు లభిస్తాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనులు చకచకా జరిగిపోతాయన్నారు. సైబరాబాద్ విభజనపై విలేకరులు అడిగిన ప్రశ్నకు డీజీపీ సమాధానమిస్తూ విభజనపై కసరత్తు జరుగుతోందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అడిషనల్ డీజీ రవిగుప్తా, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, జాయింట్ సీపీ శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పీఎస్‌లలో సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ సెంటర్‌ను డీజీపీ అనురాగ్ శర్మ ఆదివారం ప్రారంభించారు. దీని ద్వారా హైదరాబద్ పరిధిలోని 44 పోలీస్ స్టేషన్లలో సిబ్బంది పనితీరును ఒకేసారి పర్యవేక్షించే సదుపాయం కలుగుతోందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. 450 సీసీ టీవీ కెమెరాలను పోలీసు విభాగం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. సైబరాబాద్ పరిధిలోని 126 ప్రాంతాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేయనున్నట్లు అనురాగ్ శర్మ తెలిపారు. -
తాత్కాలిక డీజీపీగా సుదీప్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఉన్నతాధికారులను అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. డీజీపీ అనురాగ్ శర్మ బాధ్యతలను తాత్కాలికంగా సుదీప్ లక్టాకియాకు అప్పగించనున్నారు. అలాగే రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది బాధ్యతలను అధర్ సిన్హాకు అప్పగిస్తారు. శివశంకర్‌కు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు బాధ్యతలను అప్పగిస్తారు. జితేందర్‌కు సీటి పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి బాధ్యతలు అప్పగిస్తారు. ఈ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా మోడ్రన్ పోలీసింగ్, సీసీ కెమెరాల వ్యవస్థపై అధ్యయనానికి యూఎస్, యూకేలో పర్యటించనున్నారు. -
నక్సలిజంపై అభివృద్ధి అస్త్రం
క్యాటో సమన్వయ భేటీలో డీజీపీల నిర్ణయం సాక్షి, హైదరాబాద్/భోగాపురం: మావోయిస్టులను అణచివేసేందుకు అభివృద్ధి అస్త్రాన్ని ప్రయోగించాలని క్యాటో సమావేశం నిర్ణయిం చింది. మెరుగైన వైద్య సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించడం, ఉపాధి కల్పించడం, రవాణా, సమాచార వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలను పెంచడానికి ప్రణాళిక రూపొంచింది. మావోయిస్టులకు గిరిజనులు సహాయ నిరాకరణ చేసేలా చర్యలు తీసుకుంటే.. నక్సలిజాన్ని కూకటివేళ్లతో పెకలించి వేయవచ్చునని తీర్మానించింది. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని సన్‌రే విలేజ్ రిసార్ట్స్‌లో శుక్రవారం ‘క్యాటో’(చత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణ, ఒడిశా) సమన్వయ సమావేశం ప్రారంభమైంది. రెండు రోజుల ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, ఒడిశా డీజీపీలు జేవీ రాముడు, అనురాగ్ శర్మ, కేబీ సింగ్, ఛత్తీస్‌గఢ్ అదనపు డీజీపీ టీజే లాంగ్ కుమేర్, ఆయా రాష్ట్రాల నిఘా అధికారులు, సీఆర్పీఎఫ్ డెరైక్టర్ జనరల్, బీఎస్ఎఫ్, కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులు, మెరైన్ పోలీసు విభాగం అధికారులు పాల్గొన్నారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దులోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోరాపుట్, మల్కన్‌గిరి తదితర జిల్లాల ఎస్పీలు, డీఐజీలు, ఐజీలు పాల్గొన్నారు. దేశ అంతర్గత భద్రతను పరిరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజులపాటు సాగే క్యాటో సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణ, ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో రహదారి, సమాచార వ్యవస్థను అభివృద్ధి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎవరిపై ఆధారపడకుండా జీవించే వాతావరణాన్ని గిరిజనులకు కల్పిస్తే నక్సల్స్‌కు వారు సహకరించే పరిస్థితి ఉండదని సమావేశం అభిప్రాయపడింది. నాలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య సమన్వయం, సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా నక్సల్స్‌తోపాటు మాదక ద్రవ్యాల స్మగ్లర్లు వంటి సంఘ విద్రోహక శక్తులను నియంత్రించవచ్చని సమావేశం అభిప్రాయపడింది. -
సిటీ యాప్.. సూపర్ కాప్..
పోలీసులకు అందుబాటులోకి ‘హైదరాబాద్ కాప్ యాప్ సాక్షి, హైదరాబాద్: నిఘా.. దర్యాప్తు.. పర్యవేక్షణ.. ప్రజా భద్రతలో ఇవే కీలకాంశాలు. వీటన్నింటినీ ఒకేసారి సమన్వయపరచడం కష్టంతో కూడుకున్న వ్యవహారం. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసుల కోసం ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది నగర పోలీసు విభాగం. హైదరాబాద్ కాప్ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి సోమవారం కమిషనరేట్‌లో ఆవిష్కరించారు. దర్యాప్తు అధికారులు క్షేత్రస్థాయి నుంచే కీలక వివరాలు సేకరించడానికి, నేరగాళ్లు, అనుమానితుల వివరాలు తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపకరించనుంది. అలాగే నగరవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా రికార్డవుతున్న దృశ్యాలను ప్రతి పోలీసు అధికారి తన సెల్‌ఫోన్ ద్వారానే పర్యవేక్షించే అవకాశం ‘హైదరాబాద్ కాప్’ యాప్ ద్వారా లభించనుంది. హైదరాబాద్ పోలీసులను సూపర్ కాప్లుగా మార్చే ఈ యాప్‌లో ఉండే ప్రధానాంశాలు ఏమిటంటే.. ఈ-బీట్ వ్యవస్థ.. ఠాణాల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలు, కీలక ప్రదేశాలకు గస్తీ సిబ్బంది కచ్చితంగా వెళ్లిరావడం కోసం ఆయా చోట్ల బీట్ పుస్తకాలు ఏర్పాటు చేస్తారు. ఈ యాప్ ద్వారా ఈ-బీట్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. జీపీఎస్ పరిజ్ఞానం ఆధారంగా పని చేసే ఈ యాప్ అక్షాంశ, రేఖాంశాలను సంగ్రహించడం ద్వారా పక్కాగా, కచ్చితంగా ఆయా ప్రాంతాలకు వెళ్లేలా చేస్తుంది. క్రైమ్ స్పాట్స్.. గడిచిన నాలుగేళ్ల గణాంకాల ఆధారంగా పోలీసుస్టేషన్ల వారీగా క్రైమ్ ప్రోన్ ఏరియాలను గుర్తించి, జీపీఎస్ మ్యాపింగ్ రూపంలో అందుబాటులోకి తెచ్చారు. గస్తీ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్న వెంటనే అప్రమత్తం చేసే ప్రత్యేక వ్యవస్థ ఈ యాప్‌లో ఉంది. వెహికల్ డేటాబేస్ ఓ వాహనచోదకుడు వాహనానికి చెందిన పత్రాలను పోలీసులకు తనిఖీ సమయంలో చూపినప్పుడు ఆ జిరాక్సు ప్రతులు అసలో కాదో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మరోవైపు చోరీ వాహనాల జాబితా కూడా ఈ యాప్‌కు అనుసంధానిస్తున్నారు. ఎంవో క్రిమినల్స్.. సిటీకి చెందిన 3,600 మంది పాత నేరగాళ్లు నివసిస్తున్న తాజా చిరునామాలను జీపీఎస్ ఆధారంగా ట్యాగిం గ్ చేశారు. దీంతో పాటు జైలు నుంచి విడుదలవుతున్న వారి వివరాలనూ పొందుపరిచారు. ఫలితంగా క్షేత్రస్థాయి సిబ్బంది కచ్చితంగా వారి ఇళ్లకు వెళ్లి తనిఖీ చేయడంతో పాటు ఏదైనా నేరం జరిగిన వెంటనే అలాంటి నేరాలు చేసే వాళ్లు ఎవరున్నారు? వారు ప్రస్తుతం ఎక్కడున్నారు? అనేవి తక్షణం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మిస్సింగ్‌కు చెక్.. సిటీలో నిత్యం తప్పిపోయిన, గుర్తుతెలియని శవాల కేసులు నమోదవుతుంటాయి. ఈ యాప్ సర్వర్‌లో ఎప్పటికప్పుడు మిస్సింగ్ కేసులు, లభించిన గుర్తుతెలియని మృతదేహాల పూర్తి వివరాలను అప్లోడ్ చేస్తారు. ఇవి అన్ని స్థాయిల అధికారులకు అందుబాటులో ఉండటంతో ఫిర్యాదు వచ్చిన మరుక్షణమే సరిచూడటానికి అవకాశం ఏర్పడుతోంది. పరిరక్షణ విధివిధానాలు నేర స్థలాల్లో లభించే ఆధారాలు దర్యాప్తునకు కీలకం. అధికారులు, సిబ్బందికి వీటిని ఎలా పరిరక్షించాలి? తదితర అంశాలపై పట్టుండట్లేదు. దీనికోసం క్రైం సీన్ మేనేజ్మెంట్ను యాప్‌లో అందించారు. దీని ద్వారా ఆధారాల సేకరణ, దర్యాప్తు విధివిధానాలు, నిబంధనలు అన్ని స్థాయిల సిబ్బందికీ అందుబాటులోకి వస్తున్నాయి. క్షణాల్లో చిరునామాలు వివిధ కేసుల దర్యాప్తులో వాహనాలు, సెల్‌ఫోన్, పాస్‌పోర్ట్ నంబర్లు తదితరాల ఆధారంగా సేకరించే ఆయా వ్యక్తుల చిరునామాలు కీలకంగా మారతాయి. ఇవి ఎంత త్వరగా తెలుసుకోగలిగితే దర్యాప్తు అంత వేగవంతం అవుతుంది. ఈ డేటాబేస్‌ను యాప్ సర్వర్‌కు అనుసంధానించారు. దీంతో కొన్ని రకాలైన ఫిర్యాదుల విచారణ, కేసుల దర్యాప్తుల్లో జాప్యాన్ని నివారించడానికి ఆస్కారం ఏర్పడనుంది. -
'నిమిషం ఆలస్యమైనా అనుమతికి నో'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎస్సై రాత పరీక్ష కోసం డీజీపీ అనురాగ్ శర్మ 'ఫైండ్ మి' యాప్‌ను ప్రారంభించారు. అభ్యర్థి వివరాలు, పరీక్ష కేంద్ర సమాచారం, రూట్ మ్యాప్ ఈ యాప్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. ఈ యాప్ ప్రారంభించిన సందర్భంగా అనురాగ్ శర్మ మాట్లాడుతూ పరీక్షకు ఒక నిమిషం ఆలస్యం అయినా అనుమతి ఇవ్వడం జరగదని చెప్పారు. 500 ఎస్సై పోస్టుల కోసం లక్షా 86వేల మంది పోటీలో ఉన్నారని చెప్పారు. స్మార్ట్ ఫోన్లు లేని వారు వే టు ఎస్సెమ్మెస్ 9222273310 నెంబర్ ద్వారా సమాచారం పొందవచ్చని అన్నారు. -
మెట్రో రైలు భద్రతపై డీజీపీ సమీక్ష
హైదరాబాద్ : మెట్రో రైలు భద్రతపై డీజీపీ అనురాగ్ శర్మ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అన్ని విధాలుగా భద్రత కల్పిస్తామని, మెట్రో రైల్వేస్టేషన్లో తీసుకోవాల్సిన నేర నిరోధక చర్యలు, శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం పోలీసుల బందోబస్తు, రైల్వేస్టేషన్లు, రైల్వే ట్రాక్‌లపై ఉగ్రవాద నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై మెట్రో అధికారులపై అనురాగ్ శర్మ సమీక్ష జరిపారు. ప్రయాణికుల లగేజ్, ఇన్ అండ్ అవుట్ లో కల్పించే భద్రత, ట్రాఫిక్ రెగ్యులరైజేషన్, పార్కింగ్ భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు, డాగ్ స్వ్కాడ్, బలగాల ఏర్పాటుతో నిర్వహణ ఖర్చుపై కూడా ఆయన సమీక్షించారు. -
మెట్రో అధికారులతో డీజీపీ సమీక్ష
హైదరాబాద్ : జంట నగరాలకు త్వరలో అందుబాటులోకి రానున్న మెట్రో రైళ్లలో ప్రజలకు అన్ని విధాలుగా భద్రత కల్పిస్తామని డీజీపీ అనురాగశర్మ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మెట్రో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనురాగశర్మ మాట్లాడుతూ.. మెట్రో రైల్వేస్టేషన్లలో తీసుకోవాల్సిన నేర నిరోధక చర్యలు, శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయునున్నట్లు తెలిపారు. ప్రయాణికుల లగేజ్, ఇన్ అండ్ అవుట్, పార్కింగ్ భద్రత, ట్రాఫిక్ రెగ్యులరైజేషన్, సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యత ఇవ్వనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్‌లపై ఉగ్రవాద నిరోధకానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. స్టేషన్లలో డాగ్‌స్వ్కాడ్, పోలీస్ బలగాల ఏర్పాటుకు అయ్యే నిర్వహణ ఖర్చుపై డీజీపీ సమీక్షించారు. -
జాతీయస్థాయిలో నగర భద్రతకు ప్రశంసలు
సేఫ్టీ, సెక్యూరిటీ ఇండియా సదస్సులో డీజీపీ అనురాగ్‌శర్మ హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి దేశవ్యాప్తంగా రక్షణ విషయంలో ప్రశంసలు అందుతున్నాయని రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో మూడు రోజులపాటు నిర్వహించనున్న సేఫ్టీ, సెక్యూరిటీ ఇండియా-2016 జాతీయ సదస్సును గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రమాదకర పనులు చేసేటప్పుడు సేఫ్టీ సామగ్రిని తప్పకుండా వాడాలన్నారు. హ్యుమన్, వర్క్‌మెన్, ఫైర్‌సేఫ్టీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండస్ట్రీయల్, ఎలక్ట్రికల్ సేఫ్టీల్లో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, వస్తువులను వాడుకోవాలని సూచించారు. సదస్సులో 70 మంది సేఫ్టీ, సెక్యూరిటీకి సంబంధించిన ఉత్పత్తులను ప్రదర్శించారు. కార్యక్రమంలో యూఎస్ జనరల్ కాన్సులేట్ మైకేల్ సి.ముల్లిన్స్, ఫార్మర్ వన్ఎఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ కేసీ రెడ్డి, మాజీ డీజీపీ స్వర్ణజీత్సేన్ పాల్గొన్నారు. -
డాక్టర్ల కాల్పుల కేసు సీసీఎస్‌కి బదిలీ
రాజధానిలో సంచలనం కలిగించిన డాక్టర్ల కాల్పుల ఘటన కేసును సీసీఎస్‌కు బదిలీ చేస్తూ అనురాగ్‌శర్మ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న కేసులన్నీ ఇకపై సీసీఎస్ పరిధిలోకి వస్తాయి. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ శశికుమార్ భార్య వినతి మేరకు డీజీపీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్పత్రి నిర్వహణ విషయంలో ముగ్గురు డాక్టర్ల మధ్య తలెత్తిన విభేదాలు కాల్పులకు, ఒక డాక్టర్ ఆత్మహత్యకు దారి తీసిన విషయం విదితమే. -
ఉత్తమ సేవలు అందిస్తాం -డీజీపీ అనురాగ్ శర్మ
♦ సంగారెడ్డిలో సెంట్రల్ కమాండ్, కంట్రోల్ ప్రారంభం ♦ మహిళల కోసం రిసెప్షన్ సెంటర్ జిల్లాలలోనూ చలానాలు సంగారెడ్డి టౌన్: తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తామని రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను ప్రజలకు దగ్గరకు తీసుకెళ్లి వారి భయాందోళనలు తొలగిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు, పోలీసుల మధ్య ఫ్రెండ్లీ వాతావరణం ఉన్నప్పుడే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్‌ను ఆయన ప్రారంభించారు. రూరల్ షీ బస్సును కూడా ప్రారంభించారు. చేతన సావనీర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతకు ముందు ప్రజలు ముఖ్యంగా మహిళలు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఉండేదన్నారు. మహిళలు తమ సమస్యలను చెప్పుకోడానికి ప్రతేక్యంగా రిసెప్షన్ సెంటర్‌ను ప్రారంభించామని వివరించారు. కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రమాదాలు జరిగితే తెలుసుకొని సిసి కెమెరాల ద్వారా నింధితులను పట్టుకోవచ్చని చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్‌లో పాటు జిల్లాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. చలాన పద్ధతిని జిల్లాలో కూడా ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించారు. సిసి కెమెరాలను సమకూర్చిన మహీంద్రా, అరబిందో పరిశ్రమలను ఆయన అభినందించారు. అనంతరం జిల్లా ఐటి ల్యాబ్‌ను సందర్శించారు. వెంటనే జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కోహీర్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫైరింగ్ రేంజ్‌కు భూమి పూజ నిర్వహించారు. అనంతరం చిరాక్‌పల్లి ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్‌ను సందర్శించారు. జహీరాబాద్ పట్టణంలో నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కర్యాక్రమంలో ఐజిపి నవీన్ చంద్, ఎస్పీ బడుగుల సుమతి, అదనపు ఎస్సీ వెంకన్న, ఓయస్డి జ్యోతిప్రకాష్, ఎఆర్ అదనపు ఎస్పీ బాపురావు, వివిధ సబ్ డివిజన్ల డిఎస్పిలు, చేతన సెంటర్లో సేవలందిస్తున్న రిటైర్డ్ ఉపాధ్యాయులు, సిఐలు, ఎస్సైలు, జిల్లా పోలీసు సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రిసెప్షన్ సెంటర్ నూతన భవనం ప్రారంభం సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ సెంటర్ నూతన భవనాన్ని డీజీపీ అనురాగ్ శర్మ శనివారం ప్రారంభించారు. ఈ సెంటర్‌ను మహిళా కానిస్టేబుల్‌తో రిబ్బన్ కట్ చేయించడం విశేషం. -
పోలీస్‌లో మరో 2 వేల పోస్టులు!
* ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో 2 బెటాలియన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు * కరీంనగర్, ఖమ్మం జిల్లాలో ఏర్పాటు యోచన * కేంద్ర హోంశాఖకు నివేదించిన డీజీపీ అనురాగ్‌శర్మ * సానుకూలంగా స్పందించిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో అదనంగా రెండు వేల కానిస్టేబుల్ పోస్టులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో మరో రెండు స్పెషల్ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో కరీంనగర్, ఖమ్మం జిల్లాలో వీటి ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కు డీజీపీ ఈ నివేదిక అందజేశారు. అంతర్గత భద్రతలో భాగంగా రాష్ట్రాల పోలీస్ వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సిన అవసరముందని కేంద్రం గతంలో పలుమార్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో పోలీస్ బెటాలియన్ల సంఖ్య 12కు చేరనుంది. ఇప్పటికే ఎనిమిది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బెటాలియన్లు (టీఎస్ఎస్పీ), మరో రెండు ఇండియన్ రిజర్వు(ఐఆర్) బెటాలియన్లు ఉన్నాయి. భద్రతపై ప్రధాన దృష్టి అంతర్గత భద్రతపై ఇటీవలి కాలంలో అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూ కేంద్రం లేఖలు రాసింది. అల్లర్లు, ధర్నాలు, రాస్తారోకోలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. అందుకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను బలోపేతం చేసుకోవడంతో, ఎప్పటికప్పుడు సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని సూచించింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అన్ని జిల్లాలో కూడా సివిల్ పోలీసులతో పాటు ప్రత్యేక బెటాలియన్లు ఉండేలా చూస్తోంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో మినహా అన్ని జిల్లాల్లో కూడా ప్రత్యేక బెటాలియన్లు ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు కాస్త ఎక్కువ కావడంతో ప్రభుత్వం భద్రతపై దృష్టిసారించింది. అందుకు అనుగుణంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దుగా ఉన్న కరీంనగర్ జిల్లాతో పాటు, ఖమ్మంలో కూడా మరో బెటాలియన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. -
మేడారంలో 10 వేల మందితో భారీ భద్రత
వరంగల్: మేడారం సమ్మక్క సారక్క జాతరకు 10వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. ఆదివారం ఆయన జాతర జరిగే ప్రాంతాన్ని సందర్శించారు. అమ్మవారి గద్దెల చుట్టూ పర్యవేక్షించిన అనంతరం భద్రత ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అనురాగ్‌శర్మ మాట్లాడుతూ...ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకుంటున్నామని తెలిపారు. డీజీపీ వెంట ఐజీ నవీన్‌చంద్, ఎస్పీ అమరకిషోర్ తదితరులు ఉన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల ఏడు కొండల వాడిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రాతఃకాల సమయంలో స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి శ్రీ వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. -
కొత్తగా 3 పోలీస్ కమిషనరేట్లు!
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన డీజీపీ అనురాగ్‌శర్మ ప్రతిపాదనల్లో మంచిర్యాల, ఖమ్మం, గోదావరిఖనికి చోటు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మూడు పోలీసు కమిషనరేట్ల ఏర్పాటు దిశగా కసరత్తు మొదలైంది. ఈ మేరకు డీజీపీ అనురాగ్‌శర్మ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, కరీంనగర్ జిల్లా గోదావరిఖనితోపాటు ఖమ్మంలో కమిషనరేట్లు నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని ప్రతిపాదించారు. డీజీపీ ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే రాష్ట్రంలో కమిషనరేట్ల సంఖ్య ఆరుకు పెరగనుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లు ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 జనవరి 25న వరంగల్‌ను కమిషనరేట్‌గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్‌కు మెజిస్టీరియల్ అధికారాలు పోలీస్ కమిషనరేట్ ఏర్పడితే కమిషనర్‌గా ఉండే ఐపీఎస్ అధికారికి మెజిస్టీరియల్ అధికారాలు లభిస్తాయి. ఆయుధాల లెసైన్స్‌లు, ఎన్వోసీల జారీ, సెక్షన్ 144, పీడీ యాక్టు అమలు, ఐపీసీ పరిధిలోకి రాని లోకల్ లాస్ వంటి అధికారాలన్నీ కూడా కమిషనర్ చేతిలోనే ఉంటాయి. కమిషనరేట్ ఏర్పడితే కేంద్రం నుంచి మెగాసిటీ పోలీస్ పేరిట పెద్దఎత్తున నిధులు సమకూరుతాయి. కమిషనరేట్‌లోని ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు హౌస్ ఆఫీసర్‌గా కచ్చితంగా ఇన్స్పెక్టర్ ర్యాంకు కలిగిన అధికారినే నియమించాల్సి ఉంటుంది. పోలీసు కానిస్టేబుల్ నియామకాలు కమిషనరేట్ పరిధిలోనే జరుగుతాయి. అయితే వీటన్నింటి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రత్యేక చట్టం హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లకు మాత్రమే ఉంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏర్పడి ఏడాది గడిచినా ప్రత్యేక చట్టం రూపొందించకపోవడంతో మెజిస్టీరియల్ అధికారాలు బదలాయించలేదు. కొత్త కమిషనరేట్లకు అధికారుల కొరత తీవ్రంగా ఉంది. కొత్తగా కమిషనరేట్ల పరిధిలో డీసీపీలుగా ఐపీఎస్‌లను నియమించాల్సి ఉంటుంది. ఐపీఎస్‌ల కొరత కారణంగా ప్రస్తుత వరంగల్ కమిషనరేట్ పరిధిలో డీసీపీలను నియమించలేదు. కేవలం ఏసీపీలతోనే శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. -
2016 ఆశలు-ఆశయాలు
నూతన సంవత్సరం రోజున ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన అధికారులు ఏమనుకుంటున్నారు.. కొత్త సంవత్సరంలో వారి ఆశలు, ఆశయాలు ఏమిటి..? ఈ ప్రశ్నలకు వారి నుంచి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది సాక్షి. కొత్త సంవత్సరంలో అయినా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని అందరూ కాంక్షించారు. పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు పరిష్కారం కావాలని అన్నారు. అధికారులు ఏమన్నారో వారి మాటల్లోనే.. - సాక్షి, హైదరాబాద్ రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి, ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్త కొత్త సంవత్సరంలో రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి. వరుణ దేవుడు కరుణించాలి. మంచి వర్షాలు కురవాలి. పాడిపంటలు సమృద్ధిగా పండాలి. ప్రజలు సుఖ సంతోషాలతో మెలగాలి. శాంతి సామరస్యాలు వెల్లివిరియాలి. అవినీతి రహిత, నిర్లక్ష్య రహిత పాలన ఉండాలి. ప్రభుత్వాలు జవాబుదారీతనంతో పనిచేయాలి. ఎక్కడ అవినీతి జరుగుతుందో గుర్తించి కట్టడి చేయాలి. లంచం ఇచ్చే వారికి శిక్షలు వేయాలి. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా చూడాలి. తిరుపతిలోనే న్యూ ఇయర్ : భన్వర్‌లాల్, ఇరు రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి ప్రతి ఏడాది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనంతో కొత్త సంవత్సరం ప్రారంభిస్తాను. దాదాపు 20 ఏళ్లుగా డిసెంబర్ 31 లేదా జనవరి 1న తిరుపతికి వెళ్తున్నా. ఈ ఏడాది కూడా కొత్త సంవత్సర వేడుకలు అక్కడే. కుటుంబ సభ్యులతో పాటు తిరుపతిలోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్. రెండు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఏడాదిలో ఎన్నికల కమిషన్ ముందున్న లక్ష్యాలన్నీ నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఏపీలో చిత్తూరు ఎమ్మెల్సీ సీటు ఒకటి ఖాళీగా ఉంది. హైకోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉన్నందున ఎన్నిక నిర్వహించలేదు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఈ ఎన్నిక జరుపుతాం. ఫిబ్రవరి 25 లోపు తెలంగాణలో ఖాళీగా ఉన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సీటుకు ఎన్నికలు నిర్వహిస్తాం. 2016 మార్చి 11న తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో కొత్త ఓటర్ల జాబితాను ప్రచురిస్తాం. జనవరి 25న రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’ నిర్వహిస్తాం. బెస్ట్ పోలీసింగ్.. ఇదే మా విజన్ : అనురాగ్ శర్మ, డీజీపీ రాష్ట్ర పోలీసు విభాగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాం. కొత్త రాష్ట్రానికి మొదటి డీజీపీగా అరుదైన అవకాశం దక్కింది. దీన్ని సద్వినియోగం చేసుకొని దేశంలోనే తెలంగాణ పోలీస్ బెస్ట్ అనేలా చేయాలన్నదే ఆకాంక్ష. బంగారు తెలంగాణలో శాంతిభద్రతలు కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. పట్టణీకరణ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాలు అదుపు చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. సైబర్‌క్రైం అదుపు చేయడం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మావోయిజం, ఉగ్రవాదం అభివృద్ధికి ప్రధాన విఘాతంగా మారినట్లు ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది. వీటి విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. అంతిమంగా మా లక్ష్యం ప్రజా శ్రేయస్సు.. ఫ్రెండ్లీ పోలీసింగ్. ప్రజల సహకారంపైనే ఆశలు బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ నూతన సంవత్సరంలో హైదరాబాద్ నగర ప్రజల సహకారంపైనే ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నా. పురపాలనలో ప్రజల సహకారం లేనిదే ఏ పని విజయవంతం కాదు. ప్రజల భాగస్వామ్యాన్ని పొందడమే ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన పని. కొత్త ఏడాదిలో ప్రజల నుంచి మంచి భాగస్వామ్యం పొందుతామని ఆశిస్తున్నాం. ట్రాఫిక్ నియమాలను పాటించడం, ఎక్కువగా ప్రభుత్వ రవాణా వాహనాలను వినియోగించటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, క్రీడా మైదానాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవటం, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించటం.. తదితర అంశాల్లో ప్రజల భాగస్వామ్యం కావాలి. ‘స్వచ్ఛ హైదరాబాద్’ కోసం అందరూ కృషి చేయాలి. ఆరోగ్యకరమైన హైదరాబాద్‌ను తీర్చిదిద్దటమే నా ప్రధాన ధ్యేయం. నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం రవీంద్ర గుప్తా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ దక్షిణ మధ్య రైల్వే అంటే ప్రయాణికులకు ఓ భరోసా. వారి మనోగతానికి తగ్గట్టుగా రైళ్లను నడపడంతోపాటు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయనే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మరింత పెంచటమే కొత్త సంవత్సరంలో మా కర్తవ్యం. సకాలంలో భద్రంగా వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇందుకు 24 గంటల పర్యవేక్షణకు మరింత పదును పెడతాం. సౌరశక్తి లాంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో విద్యుత్‌ను ఆదా చే స్తూ, పర్యావరణానికి మేలు చేసే చర్యలకు ప్రాధాన్యమిస్తాం. మన ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూస్తే దేశం మొత్తం పరిశుభ్రంగా మారుతుంది. అందుకే అంతా స్వచ్ఛభారత్‌ను విజయవంతం చేద్దాం. హరిత భారత నిర్మాణంలో పాలు పంచుకుందాం. రైల్వే ఉద్యోగుల కుటుంబాలతో కలిసి రైల్వే క్లబ్లో కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొంటా. 2016.. ఇయర్ ఆఫ్ టెక్నాలజీ మహేందర్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ నగర పోలీసు విభాగం వచ్చే ఏడాదిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించుకుంటుంది. పోలీసు విధి నిర్వహణను మరింత పారదర్శకంగా చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. నేరాలను అరికట్టేందుకు, జరిగిన నేరాలకు కొలిక్కి తీసుకురావడంలో టెక్నాలజీని మరింతగా వినియోగించుకుంటాం. ట్రాఫిక్ విభాగంలో ఇప్పటికే కాప్ లెస్ జంక్షన్స్ విధానాన్ని అమలు జరుగుతోంది. పోలీసు ప్రమేయం లేకుండా వాహనచోదకులు తమంతట తామే నిబంధనలు పాటించేలా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. భవిష్యత్తులో హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ పోలీసులే కనిపించకుండా పూర్తి స్థాయిలో టెక్నాలజీ వాడతాం. నగర పోలీసుకు సంబంధించి 2016 ఈజ్ ఏ ఇయర్ ఆఫ్ టెక్నాలజీ. అన్ని రంగాల్లోనూ దూసుకెళ్లాలి రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలి’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ ఆకాంక్షించారు. ‘కొత్త సంవత్సరంలో ఉద్యోగులు మరింత అంకితభావంతో పని చేయాలి. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు మరింత సమర్థంగా విధులు నిర్వహించాలి. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరంలో మరింత అభివృద్ధి సాధించాలి. అన్ని రంగాల్లోనూ అప్రతిహతంగా దూసుకెళ్లాలి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులందరికీ చేరేలా ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలి. -
అన్ని పోలీస్ స్టేషన్లలో వీసీ వ్యవస్థ
-
అన్ని పోలీస్ స్టేషన్లలో వీసీ వ్యవస్థ
పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లో ఏర్పాటు పోలీసు విభాగం ఛీఫ్ అనురాగ్ శర్మ వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని పోలీసుస్టేషన్లనూ వీడియో కాన్ఫరెన్సింగ్ (వీసీ) సౌకర్యం ద్వారా అనుసంధానించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. ఇందులో భాగంగానే పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో వీసీ వ్యవస్థను డీజీపీ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తీసుకున్న ఈ చర్య ఎంతో ఉపయుక్తమైంది. హైదరాబాద్ మాదిరిగానే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా ఎస్పీ కార్యాలయాలు, డీఎస్పీలు పర్యవేక్షించే సబ్-డివిజన్, సర్కిల్ ఆఫీస్లతో పాటు పోలీసుస్టేషన్లనూ వీసీ ద్వారా అనుసంధానించాలని నిర్ణయించాం. సిటీలో ఏర్పాటైన పెలైట్ ప్రాజెక్టు ద్వారా ఇందులో ఉన్న లోపాలు, ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధ్యయనం చేసి అధిగమిస్తాం. ఆపై విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తాం. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) పర్యవేక్షణలో పని చేసే ఈ విధానం పూర్తి సాఫ్ట్వేర్ ఆధారంగా పని చేస్తుంది. ఎంతో ఉపయుక్తమైన ఈ సౌకర్యాన్ని నగర పోలీసులు సద్వినియోగం చేసుకుని, పోలీసు ప్రతిష్టను మరింత పెంచాలి’ అని అన్నారు. ‘వీసీ’తో కొత్వాలే హోంగార్డుతో సంప్రదింపులు చేయొచ్చు నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘కమిషనరేట్‌లోని శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్ పోలీసుస్టేషన్లతో పాటు డీసీపీ, ఏసీపీ కార్యాలయాలు, ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి అధికారులు సహా మొత్తం 150 మంది వీసీని వినియోగించుకునే అవకాశం ఇచ్చాం. ప్రతి అధికారీ తమ సౌలభ్యానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు గ్రూప్స్ ఏర్పాటు చేసుకుని, వాటి ఆధారంగా సమాచార మార్పిడి చేసుకోవచ్చు. వీసీ విధానం ద్వారా నేరుగా కొత్వాలే క్షేత్రస్థాయిలో ఉండే హోంగార్డుతోనూ సంప్రదింపులు జరిగే అవకాశం ఏర్పడింది. కేవలం కమిషనరేట్ పరిధిలో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఎన్ఐసీ ఆధీనంలో పని చేసే ప్రతి పోలీసుతోనూ అధికారులు వీసీ ద్వారా సంప్రదింపులు జరిపి, సమాచార మార్పిడి చేసుకునే అవకాశం ఉంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీలు అంజనీకుమార్, వై.నాగిరెడ్డి, స్వాతి లక్రా, సంయుక్త పోలీసు కమిషనర్ మురళీకృష్ణ, ఎస్పీ రమేశ్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. -
భువనగిరి ఖిల్లాపై డీజీపీ కుమార్తె సాహసం
నల్లగొండ జిల్లాలోని భువనగిరి ఖిల్లాను డీజీపీ అనురాగ్ శర్మ భార్య, కుమార్తె సోమవారం ఉదయం సందర్శించారు. వీరి వెంట ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. డీజీపీ కుమర్తె, ఇద్దరు విదేశీయులు ఖిల్లాపైకి ఎక్కి పరిశీలించారు. అనంతరం ఖిల్లాలో ఏర్పాటు చేసిన రాఫ్టింగ్ సెక్షన్ లో సాహసాలు చేశారు. ఖిల్లా పై నుంచి తాడు సాయంతో కిందకు దిగారు. ఈ పర్యటనలో డీజీపీ కుటుంబ సభ్యులతో పాటు.. డీఎస్పీ మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. -
'నక్సల్స్ విషయంలో విధానం మారలేదు'
నక్సల్స్ విషయంలో తమ విధానం మారలేదని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన అత్యాధునిక టెక్నాలజీ తో పోలీసు శాఖకు కొత్త హంగులను జత చేస్తామని తెలిపారు. ఎఫ్ ఆర్ ఐ తో సహా అన్నీ ఆన్ లైన్ చేస్తామని చెప్పారు. మరో వైపు పోలీస్ రిక్రూట్ మెంట్ లో తరచూ వివాదాస్పదమైతున్న 5కే రన్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసు ఉద్యోగాల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మహిళల భద్రతకు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నామన్నారు. -
తెలంగాణ రాష్ట్ర పూర్తిస్థాయి డిజీపిగా అనురాగ్ శర్మ
-
తెలంగాణ పూర్తి స్థాయి డీజీపీగా అనురాగ్ శర్మ
-
తెలంగాణ పూర్తి స్థాయి డీజీపీగా అనురాగ్ శర్మ
హైదరాబాద్: తెలంగాణ పూర్తి స్థాయి డీజీపీగా ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ నియమితులయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. అనురాగ్ శర్మను డీజీపీగా నియమించాలని నిర్ణయించారు. 1982 బ్యాచ్‌కు చెందిన అనురాగ్ శర్మ...రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎస్పీగా పని చేశారు. హైదరాబాద్ సిటీ సౌత్ జోన్ డీసీపీగా, సీపీగా, వరంగల్ డీఐజీగా పనిచేశారు. గ్రేహౌండ్స్ ఐజీ, అడిషనల్ జిల్లా డిజీగా, అలాగే 18 నెలలుగా ఇన్ఛార్జ్ డీజీపీగా పనిచేశారు. తెలంగాణ డీజీపీ ఎంపిక కోసం ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను ఇటీవల యూపీఎస్సీ రాష్ట్రానికి పంపింది. ఈ జాబితాలో సీనియర్ ఐపీఎస్ అధికారులు అరుణా బహుగుణ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్ పేర్లు ఉన్నాయి. తెలంగాణ సర్కార్ అనురాగ్ శర్మ వైపే మొగ్గు చూపింది. -
పోలీసు కొలువులు వస్తున్నాయ్
పోలీసు, అగ్నిమాపక శాఖల్లో 9,096 పోస్టుల భర్తీకి సర్కార్ పచ్చజెండా పోలీసు శాఖలో 8,401, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 186, అగ్నిమాపక దళంలో 509... వారం రోజుల్లో నియామక ప్రకటనలు! మహిళలకు సివిల్‌లో మూడో వంతు, రిజర్వ్ విభాగంలో 10% కోటా 5 కి.మీ. పరుగుపందేనికి ఫుల్స్టాప్.. దేహదారుఢ్య పరీక్షలు సరళతరం ఆర్మీ తరహాలో వ్యక్తిత్వ వికాస పరీక్షలు సాక్షి, హైదరాబాద్: పోలీసు ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 9,096 పోలీసు ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపడంతోపాటు భారీ సంస్కరణలకు ఆమోదముద్ర వేసింది. దీంతో నూతన పోలీసు నియామక విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉత్తర్వులపై సంతకాలు చేశారు. మహిళలకు సివిల్ విభాగంలో 33 శాతం(మూడో వంతు), ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అత్యంత కఠినంగా ఉన్న దేహదారుఢ్య పరీక్షలు సైతం ఇకపై సరళీకృతం కానున్నాయి. ఈ నూతన విధానాన్ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్పీఎస్సీ) ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్ర హోంశాఖ ఖాళీ పోస్టుల భర్తీకి పాలనపరమైన అనుమతులు జారీ చేయనుంది. ఆ వెంటనే నియామక ప్రకటనలు జారీ చేసేందుకు తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, అగ్నిమాపక శాఖలు చర్యలు తీసుకుంటాయి. పోలీసు శాఖలో 8,401 పోస్టులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సులో 186, అగ్నిమాపక దళంలో 510 పోస్టుల భర్తీకి వెంటనే ప్రకటనలు రానున్నాయి. అనుకున్న సమయంలో ఈ ప్రక్రియ ముగిస్తే వారం రోజుల్లో నియామక ప్రకటనలు జారీ చేస్తామని రాష్ట్ర పోలీసు విభాగం డెరైక్టర్ జనరల్ అనురాగ్ శర్మ తెలిపారు. వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పోలీసు నియామకాల్లో అత్యంత కీలకమైన దేహదారుఢ్య పరీక్షల విధానంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. పోలీసు శాఖలో చేరే వారికి ఆర్మీ మాదిరిగా వ్యక్తిత్వ వికాస పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. సమాజం, దేశం, మహిళలు, అణగారిన వర్గాల పట్ల అభ్యర్థులకు ఉన్న అవగాహనను తెలుసుకోవడానికి వ్యక్తిత్వ వికాస పరీక్షలు నిర్వహిస్తారు. విధి నిర్వహణలో ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడకుండా మానసిక స్థైర్యాన్ని కలిగి ఉన్నారా.. లేదా? అని మానసిక నిపుణుల ద్వారా పరీక్షించనున్నారు. ఇప్పటివరకు జరిగిన నియామకాల్లో పురుషులకు 5 కి.మీ., మహిళలకు 2.5 కి.మీ. పరుగుపందెం నిర్వహిస్తున్నారు. ఈ పరుగు పందెంలో పలువురు అభ్యర్థులు మృత్యువాతపడడం, మరికొందరు అస్వస్థతకు గురైన ఘటనలు గతంలో అనేకం చోటుచేసుకున్నాయి. నిరుద్యోగ అభ్యర్థుల పాలిట ప్రాణాంతకంగా మారిన పరుగు పందెంను తొలగించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ పరుగు పందెం పరీక్షను తొలగించింది. పీఈటీలో మార్పులు ఇలా.. ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ) ప్రక్రియలో సైతం మార్పులు చేసింది. గతంలో పురుష అభ్యర్థులు షాట్‌ఫుట్, హైజంప్, లాంగ్ జంప్, 100 మీటర్ల పరుగు, 800 మీటర్ల పరుగు కలిపి మొత్తం 5 విభాగాల్లో కచ్చితంగా ప్రతిభను చాటాల్సిందే. కానీ ఇప్పుడు 800 మీటర్ల పరుగుతో పాటు ఏవేని మరో రెండు విభాగాల్లో ప్రతిభ చూపితే సరిపోతుంది. మహిళా అభ్యర్థులకు 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్ఫుట్తో కలిపి మొత్తం మూడు విభాగాల్లో పరీక్షలు నిర్వహించనుండగా.. అందులో ఏ రెండు పరీక్షల్లోనైనా ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. పోలీసు శాఖలో మెకానికల్ ఉద్యోగాల కోసం ఆర్టీసీ తరహాలో ట్రేడ్ టెస్ట్ నిర్వహించనున్నారు. రాత పరీక్షల సిలబస్‌లో తెలంగాణ చరిత్రను తప్పనిసరి చేశారు. స్పెషల్ ప్రొటెక్షన్, అగ్నిమాపక శాఖల్లో కేటగిరీల వారీగా భర్తీ చేయనున్న పోస్టులు ఇవీ.. === స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సులో.. కేటగిరీ పోస్టుల సంఖ్య ఎస్ఐ 12 కానిస్టేబుళ్లు 174 ---------------------- మొత్తం 186 ------------------------ అగ్నిమాపక శాఖలో.. కేటగిరీ పోస్టుల సంఖ్య ఫైర్‌మెన్/డ్రైవర్ 500 ఎస్ఐ 9 ------------------------ మొత్తం 509 --------------------- పోలీసు శాఖలో భర్తీ చేయనున్న పోస్టులు కేటగిరీ పోస్టులు సివిల్ కానిస్టేబుళ్లు 1,880 ఆర్మ్డ్ కానిస్టేబుళ్లు 2,800 స్పెషల్ కానిస్టేబుళ్లు 3,200 ఎస్ఐ(సివిల్) 107 ఎస్ఐ(ఆర్మ్డ్) 91 ఎస్ఐ(స్పెషల్ పోలీసు) 288 ఎస్ఐ(కమ్యూనికేషన్) 35 మొత్తం 8,401 -
గోదావరి తరహాలో కృష్ణా పుష్కరాలు
నల్గొండ : నల్గొండ జిల్లాలో కృష్ణా పుష్కరాలపై తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ మంగళవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం నల్గగొండ జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న అనురాగ్ శర్మ జిల్లాలో 30 పుష్కరఘాట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గోదావరి పుష్కరాల తరహాలోనే కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది కృష్ణా పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పుష్కరఘాట్లు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేస్తుంది. ఆ క్రమంలో అనురాగ్ శర్మ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ ఏడాది జరిగిన గోదావరి పుష్కరాల్లో తెలంగాణలో ఎక్కడ ఏటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. -
అజ్ఞాతంలోకి 36 మంది విద్యార్థులు?
వివిధ వర్సిటీల నుంచి వెళ్లినట్లు పోలీసుల అనుమానం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యాసంస్థలు మావోయిస్టు రిక్రూట్మెంట్ కేంద్రాలుగా మారాయా...? ఔననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి నిఘా వర్గాలు. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న దండకారణ్యంలో ఇటీవల మావోయిస్టుల కదలికలు పెరగడంతో పాటు ఇటీవ ల జరిగిన రెండు ఎన్కౌంటర్లలో మరణించినవారి వివరాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఈ అనుమానాలే వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఖమ్మం-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయ విభాగంలో రెండో సంవత్సరం చదివే వివేక్ మృతి చెందారు. మంగళవారం నాటి వరంగల్ జిల్లా ఎన్కౌంటర్లో ఎంటె క్ విద్యనభ్యసిస్తున్న మహిత ప్రాణాలు కోల్పోయింది. ఇటీవలి కాలంలో వివిధ యూనివర్సిటీల్లో విద్యనభ్యసిస్తున్న వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన 36 మంది అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అనుమానిస్తున్న పోలీసులు దీనిపై లోతుగా ఆరా తీస్తున్నారు. కఠినంగా వ్యవహరిస్తాం.. ‘‘మావోయిస్టుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. రాష్ట్రంలో వారి ప్రభావం మరింత తగ్గేలా చేస్తాం. పక్క రాష్ట్రాల నుంచి మావోయిస్టులు వచ్చారనే సమాచారం మేరకే కూంబింగ్ చేపట్టాం. ఆ క్రమంలోనే వరంగల్ జిల్లాలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో మేం ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. మృతుల్లో ఉన్నత విద్యను అభ్యసించేవారు ఉండటంపై లోతుగా విచారణ జరుపుతున్నాం. కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారనే సమాచారం నేపథ్యంలో గాలింపులు జరుపుతున్నాం. మావోయిస్టులు కొత్తగా రిక్రూట్మెంట్ చేపట్టినట్లు మా దృష్టికి రాలేదు..’’ - అనురాగ్‌శర్మ, డీజీపీ -
అంతా ఏసీబీనే చూసుకుంటుంది: డీజీపీ
వరంగల్ : ఓటుకు కోట్లు కేసు విచారణ చట్టప్రకారమే జరుగుతోందని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో అన్ని అంశాలు ఏసీబీనే చూసుకుంటుందన్నారు. చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఇస్తారా అన్న విలేకర్ల ప్రశ్నకు డీజీపీ పైవిధంగా సమాధారం ఇచ్చారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఆడియో, వీడియో టేపులపై త్వరలో ఫోరెన్సిక్ నివేదిక రానుంది. ఎమ్మెల్యే స్టీఫెన్ సన్తో ఫోన్ మాట్లాడింది చంద్రబాబు నాయుడా కాదా, అనేది తేలనుంది. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ నుంచి నివేదిక అందిన తర్వాతే పూర్తి ఆధారాలతోనే ఏసీబీ తన విచారణను మరింత ముమ్మరం చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. -
గవర్నర్‌తో తెలంగాణ డీజీపీ భేటీ
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డితో కలసి గవర్నర్ వద్దకు వెళ్లారు. తెలంగాణ పోలీసులు తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీస్ బెటాలియన్లను నియమించుకున్నారు. తెలంగాణ పరిధిలో ఉన్న హైదరాబాద్ నగరంలో ఏపీ పోలీసుల వ్యవహారంపై అనురాగ్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారని, ఇదే అంశాన్ని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. తాజా పరిణామాలను కూడా యన గవర్నర్‌కు వివరించినట్టు తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో తెలంగాణ పోలీస్ బాస్‌లు గవర్నర్‌తో సమావేశం కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. -
గవర్నర్‌తో తెలంగాణ డీపీజీ, సీపీ భేటీ
-
గవర్నర్‌తో తెలంగాణ డీజీపీ, సీపీ భేటీ
హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మంగళవారం గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో ఈ సమావేశం జరిగింది. ఓటుకు నోటు అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఇదే అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న గవర్నర్‌తో సమావేశమైన విషయం విదితమే. మరోవైపు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ఈరోజు ఉదయం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. -
స్వచ్ఛ తెలంగాణ - స్వచ్ఛ హైదరాబాద్ లోగో ఆవిష్కరణ
హైదరాబాద్: 'స్వచ్ఛ తెలంగాణ - స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లో స్వచ్ఛ తెలంగాణ - స్వచ్ఛ హైదరాబాద్ లోగోను అనురాగ్ శర్మ గురువారం ఆవిష్కరించారు. అనంతరం మింట్ కాంపౌండ్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు చెత్తను పోలీసులు శుభ్రం చేశారు. స్వచ్ఛ హైదరాబాద్ పేరిట తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తన భాగ్యనగరంలో కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం, తెలంగాణ కేబినెట్, ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున పాల్గొంటున్న విషయం విదితమే. -
అవయవదానం చేసేందుకు సిద్ధం : డీజీపీ అనురాగ్ శర్మ
హైదరాబాద్: అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వయంగా అవయవదానం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ ప్రకటించారు. ఒక్కరు అవయవదానం చేయడం ద్వారా మరో ఎనిమిది మందికి ప్రాణంపోయొచ్చని తెలిపారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవయవదానంపై మీడియా, ప్రభుత్వం మరింతగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిఒక్కరూ అవయవదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అవయవదాతలు లభించని కారణంగా రోగులు మృతిచెందే రోజు రాకూడదన్నారు. అవయవాలు తరలింపు సమయంలో తమశాఖ తరఫున ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే సాయం చేస్తున్నామన్నారు. ఇటీవల గుండె మార్పిడి సమయంలో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసిన తీరును తెలిపే ఫొటోలను చూపారు. నిమ్స్ జీవన్‌దాన్ కన్వినర్ డాక్టర్ స్వర్ణలత మాట్లాడుతూ 2013లో జీవన్‌దాన్‌ను ప్రారంభించామని ఇప్పటివరకూ 100 మంది డోనర్ల ద్వారా అవయవాలు సేకరించి ఎంతో మందికి ప్రాణదానం చేసినట్లు తెలిపారు. ఈ సంస్థలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 32 ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయని చెప్పారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జీవన్‌దాన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అవయవదానంపై ప్రజల్లో మరింతగా అవగాహన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా అవయవదానం చేసిన వారి కుటుంబసభ్యులకు జ్ఞాపికలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి చైర్మన్ పి.వి.ఎస్ రాజు, ఎండీ మల్లిఖార్జున్, ఈడీ పూర్ణచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేపు అమెరికాకు డీజీపీ అనురాగ్ శర్మ
హైదరాబాద్ సిటీ: తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఈ నెల 27న సొంత పనుల నిమిత్తం అమెరికా వెళ్లనున్నారు. ఈ నెల 27 నుంచి మార్చి 5 వరకు అమెరికాలో గడపనున్నారు. ఈ సమయంలో అడిషనల్ డీజీపీ సుదీప్ లటాకియా ఆయన స్థానంలో విధులు నిర్వర్తిస్తారు. -
టీ పోలీసు శాఖకు బీమా నిధులు మంజూరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖకు జీవిత బీమాకు సంబంధించి కోటి 90 లక్షల 93 వేల రూపాయలను మంజూరు చేస్తు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీకి చెల్లించేలా రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మకు ఆదేశాలు ఇచ్చారు. పోలీస్‌శాఖలోని కానిస్టేబుల్ మొదలుకుని ఐపీఎస్ అధికారుల వరకు, రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర భద్రతా దళాల సిబ్బంది, అధికారులకు కూడా ఈ ఇన్సూరెన్సు వర్తించేలా ఆదేశాలు ఇచ్చారు. అంతకు ముందు పోలీసు శాఖలోని సిబ్బంది, అధికారులకు బీమాను వర్తింపజేస్తు దానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరుతూ డీజీపీ అనురాగ్‌శర్మ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం ఈ మేరకు నిధులను మంజూరు చేసింది. -
బడుగులకు చిత్తశుద్ధితో సేవలందించాలి
మహిళ పోలీసులకు హోంమంత్రి నాయిని పిలుపు సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారానికి నీతి నిజాయితీతో పని చేయాలని, పేద, బలహీనవర్గాలకు చిత్తశుద్ధితో సేవలందించాలని మహిళాపోలీసులకు తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపు నిచ్చారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలోని అప్పా పోలీస్ అకాడమీలో 486 మంది మహిళా సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ ఆధునీకరణకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. డీజీపీ అనురాగ్‌శర్మ మాట్లాడుతూ తెలంగాణ పోలీసుశాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించటంతో ప్రతిష్ట పెరిగిందన్నారు. పోలీస్ అకాడమీ డెరైక్టర్ డాక్టర్ మాలకొండయ్య మాట్లాడు తూ 1986లో స్థాపించిన అకాడమీలో ఇప్పటివరకు 2865 బ్యాచ్‌ల ద్వారా లక్షారెండు వేల మందికి శిక్షణ ఇచ్చామన్నారు. 16 బృందాలుగా ఏర్పడిన పాసింగ్ అవుట్ పరేడ్‌కు కమాండర్‌గా ఆర్.కీర్తి వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన కవాతు, బ్యాండ్ అందరినీ అలరించా యి. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నాగజ్యోతి ఆల్‌రౌండర్‌గా నిలవగా వరంగల్‌లో శిక్షణపొందినవారిలో ఆల్‌రౌండర్‌గా రంగారెడ్డి జిల్లాకు చెందిన కె. మంజుల నిలిచారు. ఇండోర్ విభాగంలో బి.సంధ్య, ఖాజా ఉన్నీసాబేగం, బెస్ట్ ఫైరింగ్‌లో వై.రేణుక, జి.రాజేశ్వరి, బెస్ట్ ఇం డోర్, అవుట్ డోర్ విభాగంలో రాధికలు నిల వగా వారికి నాయిని పతకాలను అందజేశారు. -
డీఎస్పీల బదిలీ జిల్లాలో
* 14 మందికి స్థానచలనం * నలుగురికి ఇక్కడే పోస్టింగ్ సాక్షి ప్రతినిధి, వరంగల్ : పోలీసుశాఖలో సమూల మార్పులు జరిగాయి. ఒకేసారి భారీగా డీఎస్పీల బదిలీలు చోటు చేసుకున్నాయి. జిల్లాలో ప్రస్తుతం చేస్తున్న 14 మందికి బదిలీ అయ్యింది. వీరిలో నలుగురు డీఎస్పీలకు జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చారు. ఐదుగురు డీఎస్పీలను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. మామూనూరు డీఎస్పీ సురేశ్‌కుమార్‌కు కీలకమైన సుల్తాన్‌బజార్ ఏసీపీ పోస్టు ఇచ్చారు. ఐదుగురు డీఎస్పీలను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఐదుగురు డీఎస్పీలు బదిలీపై కొత్తగా మన జిల్లాకు వచ్చారు. రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) అనుర గా శర్మ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డీఎస్పీ బదిలీలు జరుగుతాయనే ప్రచారం జరుగుతూ వస్తోంది. ప్రజాప్రతినిధుల ప్రతిపాదనల ఆధారంగా ఎక్కువ బదిలీలు జరిగినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యమైన పోస్టింగ్‌ల విషయంలో మాత్రం ప్రభుత్వం ఇతర ఒత్తిడులను పట్టించుకోలేదని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవలే డీఐజీ, ఇద్దరు ఎస్పీల బదిలీలు జరిగాయి. తాజాగా డీఎస్పీల బదిలీ ప్రక్రియ ముగిసింది. గత నెలలో ఇన్స్పెక్టర్ల బదిలీలు చేసినా రాజకీయ కారణాలతో వాటిని నిలిపివేశారు. వారంలోపే ఇన్స్పెక్టర్ల బదిలీలు జరుగుతాయని తెలుస్తోంది. -
ప్రజలతో మమేకం కావాలి
సిద్దిపేట అర్బన్: పోలీసులు ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీర్చాలని, అప్పుడే పోలీసు వ్యవస్థపై ప్రజల్లో గౌరవభావం పెరుగుతుందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలో అధునాతన వసతులతో రూ. 2.20 కోట్ల నిధులతో నిర్మించిన వన్‌టౌన్ మోడల్ పోలీస్‌స్టేషన్‌ను డీజీపీ అనురాగ్‌శర్మ, మంత్రి హరీష్‌రావు, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని మాట్లాడుతూ, రాష్ట్రం లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని తెలిపారు. ప్రజలతో మర్యాదగా మాట్లాడి ఫ్రెండ్లీగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం కూడా పోలీస్ స్టేషన్ల నిర్వాహణ కోసం అధిక నిధులు కేటాయిస్తోందన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లకు ఠమొదటిపేజీ తరువాయి నెలకు రూ. 50 వేలు, రూరల్ పరిధిలో రూ. 25వేలు కేటాయించిందన్నారు. శాంతి ఉన్న చోటే అభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారన్నారు. అందుకోసం రూ.360 కోట్ల నిధులను మంజూరు చేశారని తెలిపారు. డీజీపీ అనురాగ్‌శర్మ పోలీస్ వ్యవస్థకే వన్నె తెచ్చేలా పని చేస్తున్నారని కితాబిచ్చారు. రాష్ట్రంలో తొలి బెటాలియన్‌ను సిద్దిపేట పట్టణ శివారులో ఏర్పాటు చేసేందుకు హోంమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా పోలీసు స్టేషన్ల నిర్వహణకోసం రూ. 4 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో రూరల్ పోలీస్ స్టేషన్‌కు రూ. 50 లక్షలు, టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు రూ. 45 లక్షలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం కోసం రూ. 2.22 లక్షలు, నాలుగు ఆర్ఐ క్వార్టర్ల నిర్మాణం కోసం రూ. 80 లక్షలు వినియోగిస్తారని చెప్పారు. అటెండర్‌ను చైర్మన్ చేసిన ఘనత ప్రజాస్వామ్యానిదే టీ అమ్ముకునే వ్యక్తిని ప్రధానిని, అటెండర్‌గా పని చేసే తనను మండలి చైర్మన్‌ను చేసిన ఘనత ప్రజాస్వామ్యానికే దక్కిందని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. సిద్దిపేటను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రాంతానికి సీఎం వాటర్ గ్రిడ్‌ను అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారన్నారు. స్టేషన్లు నిర్మించగానే సరిపోదని వాటిని కాపాడుకోవాలని, ప్రజలతో కలిసి మెలిసి వ్యవహరించాలని సూచించారు. సాలార్జంగ్ మ్యూజియం, శిల్పారామం, బిర్లా టెంపల్, చార్మినార్, గొల్కోండ కోటలను చూసేందుకు ఇపుడు అందరూ హైదరాబాద్‌కు ఎలా వెళతారో రానున్న రోజుల్లో సిద్దిపేటను మంత్రి హరీష్‌రావు ఎలా అభివృద్ధి చేశాడో.. ఎలా ఉంటుందో.. అని చూసేందుకు ఇక్కడి వస్తారన్నారు. హరీష్‌రావు కృషితో సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేటలో వాటర్ గ్రిడ్ పథకం, అదే విధంగా రోడ్ల వెంట చెట్లు, బటర్‌ఫ్లై వీధి లైట్లు, మోడల్‌గా పోలీస్ స్టేషన్, క్రైమ్ రేట్‌ను తగ్గించేందుకు పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో అభివృద్ధి కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోందన్నారు. అన్ని భవనాలను ఆధునీకరిస్తాం సిద్దిపేటలో ఇప్పటికే కోర్టు, ఆర్డీఓ కార్యాలయం, ఆర్ అండ్ బీ అతిధిగృహం, ఫైర్ స్టేషన్, తహశీల్దార్, మున్సిపల్ కార్యాలయాలు పూర్తయ్యాయని, త్వరలోనే అన్ని కార్యాలయాలను ఆధునీకరిస్తామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. పట్టణంలో నిర్వహిస్తున్న సబ్ జైల్లో వసతులు లేవని ఇరుకుగా మారిందని దీని స్థానంలో మరో జైలును మంజూరు చేయాలని హోంమంత్రిని కోరారు. సిద్దిపేటకు డీఎస్పీ భవనం, జిల్లా పోలీస్ కేంద్రం, టూటౌన్ మోడల్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ స్టేషన్, పోలీస్ బెటాలియన్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేటలో పట్టణంలో నేరాల అదుపునకు 128 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. వాటిని 24 గంటలు వన్‌టౌన్ మోడల్ పోలీస్ స్టేషన్లో పరిశీలిస్తారని చెప్పారు. సిద్దిపేట లౌకిక పట్టణం అనంతరం డీజీపీ అనురాగ్‌శర్మ మాట్లాడుతూ సిద్దిపేట పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఐజీ నవీన్ చంద్ మాట్లాడుతూ, పోలీస్ వ్యవస్థలో అన్ని విభాగాలను ఆధునీకరించి ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోనే లౌకిక పట్టణంగా సిద్దిపేటకు మంచి పేరుందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌లు పార్టీలకతీతంగా సేవలందిస్తున్నారని కొనియాడారు. ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోనే అధునాతన వసతులతో నిర్మించిన వన్‌టౌన్ మోడల్ పోలీస్ స్టేషన్లాగానే.. పోలీస్ విధులు కూడా మోడల్‌గానే ఉంటాయన్నారు. ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ మాట్లాడుతూ, కేజీ నుంచి పీజీ వరకు సిద్దిపేట పట్టణ కేంద్రంగా విద్యావకాశాలు కల్పించి ఉద్యమ గడ్డ సిద్దిపేట పేరు నిలబెట్టాలని మంత్రి హరీష్‌రావును కోరారు. కార్యక్రమంలో జేసీ శరత్, జెడ్పీ చైర్ పర్సన్ రాజమణి, వైస్ చైర్మన్ సారయ్య, ఆర్డీఓ ముత్యంరెడ్డి, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, తహశీల్దార్ ఎన్‌వైగిరి, ఎంపీపీలు యాదయ్య, శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సీఐలు సురేందర్‌రెడ్డి, సైదులు, ప్రసన్నకుమార్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
లైంగిక వేధింపులపై గళమెత్తండి: డీజీపీ పిలుపు
19న పీపుల్స్‌ప్లాజాలో భారీ ర్యాలీ సాక్షి, హైదరాబాద్: బాలికలపై జరిగే లైంగిక వేధింపులను దాచకుండా ఫిర్యాదు చేయడం ద్వారా దోషులకు శిక్ష పడేలా చూడాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు డీజీపీ అనురాగ్‌శర్మ పిలుపునిచ్చారు. ఐజీ చారుసిన్హాతో కలసి ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. తల్లిదండ్రుల్లో, ఉపాధ్యాయుల్లో చైతన్యం తెచ్చేందుకు ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు పాఠశాలల్లో పెద్దఎత్తున ప్రచారం జరుపుతున్నామని చెప్పారు. తొలిదశలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోలీసు సిబ్బందితో ప్రచారాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సమాజంలో చైతన్యాన్ని తీసుకురావడానికి 19న నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నాలుగు వేల మంది చిన్నారులతో ర్యాలీని నిర్వహిస్తున్నామని ఐజీ చారుసిన్హా తెలిపారు. -
మహిళల భద్రతపై కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: మహిళల రక్షణ, భద్రతపై సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. మహిళల రక్షణపై ఏర్పాటు చేసిన కమిటీ అందచేసిన నివేదికపై అధికారులతో కేసీఆర్ చర్చించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. -
మహిళా పోలీసుల సంఖ్య పెంచుతాం
మహిళా ఠాణా ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ సాక్షి, సిటీబ్యూరో: పోలీసు శాఖలో మహిళా సిబ్బంది సంఖ్యను పెంచుతామని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, సైబరాబాద్ సీపీ ఆనంద్ తో కలిసి ఆయన గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్‌లో ఏర్పాటు చేసిన మహిళా పోలీసుస్టేషన్‌తో పాటు గచ్చిబౌలిలోని శాంతి భద్రతల స్టేషన్‌ను బుధవారం ప్రారంభించారు. అనంతరం కమిషనర్ కార్యాలయంలోని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని, ఇందులో భాగంగా పోలీసులకు వాహనాల కొనుగోలు కోసం రూ.300 కోట్లు విడుదల చేసిందన్నారు. మహిళల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల అధ్యయనం కోసం ప్రభుత్వం నియమించిన మహిళా భద్రత కమిటీ త్వరలో సింగపూర్ వెళ్లి అక్కడి చట్టాలను అధ్యయనం చేస్తుందన్నారు. ఐటీ కారిడార్‌లో మహిళా ఉద్యోగుల భద్రతకు సైబరాబాద్ పోలీసులు తీసుకున్న చర్యలను కేటీఆర్ ఈ సందర్భంగా ప్రశంసించారు. అలాగే కార్డన్ సర్చ్ వల్ల మంచి ఫలితాలొచ్చాయన్నారు. డీజీపీ అనురాగ్‌శర్మ మాట్లాడుతూ, పోలీసు శాఖలో 33 శాతం మహిళా సిబ్బంది ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సేఫ్‌సిటీ ప్రాజెక్ట్‌ను గ్రామ స్థాయికి తీసుకెళ్తామన్నారు. రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ఐటీ ఉద్యోగుల సౌకర్యార్థంలో ఐటీ కారిడార్‌లో అదనంగా మరో 15 ఆర్టీసీ బస్సులను త్వరలో ప్రవేశపెడతామన్నారు. మహిళలు తమ కష్టాలను పోలీసులకు తెలపడంతో పాటు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫేస్బుక్ పేజీని, మహిళా స్టేషన్‌కు కేటాయించిన ఇన్నోవా వాహనాన్ని మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. మహిళల రక్షణ కోసం టెక్ మహింద్రా సంస్థ రూపొందించిన ఫైట్‌బ్యాక్ (ఎఫ్బీ) యాప్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ యాప్‌ను మహిళలందరూ డౌన్లోడ్ చేసుకోవాలని, ఆపదలో ఉన్నప్పుడు ఉపయోగిస్తే సెలెక్ట్ చేసిన ఐదుగురి సెల్ఫోన్లకు ఎక్కడ ఆపదలో చిక్కుకున్నది తదితర వివరాలతో మెసేజ్ వెళ్తుందన్నారు. తద్వారా త్వరగా రక్షణ చర్యలు చేపట్టడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ ఐటీ ఉద్యోగుల భద్రతకై తీసుకున్న చర్యలను వివరించారు. మహిళా ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో జాయింట్ పోలీసు కమిషనర్ గంగాధర్, డీజీపీలు అవినాష్ మహంతి, క్రాంతిరాణా టాటా, అదనపు డీసీపీ జానకీ షర్మిల, ఎం.శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ఎ.గాంధీ, జూపల్లి కృష్ణారావు, ఏనుగు రవీందర్‌రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ , ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు. అంతకు ముందు మహిళా ఠాణా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీ కారిడార్‌లో మహిళల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన ఇన్స్పెక్టర్ మధులత, శ్యామలక్ష్మిలకు మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డిలు జ్ఞాపికను బహూకరించారు. -
మహిళల భద్రత కోసం చర్యలు: డీజీపీ
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో మహిళల భద్రత పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి పోలీసు స్టేషన్లో మహిళా హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చే స్తున్నామని గురువారం తనను కలసిన మహిళా భద్రతా కమిటీ ప్రతినిధులకు డీజీపీ అనురాగ్‌శర్మ వివరించారు.పూనమ్ మాలకొండయ్య ఇటీవల మహిళల భద్రత విషయంలో వివిధ వర్గాల ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని డీజీపీకి అందించారు. దీనిపై స్పందించిన డీజీపీ పోలీసు శాఖ తరపున చేపట్టిన చర్యలు ప్రభుత్వానికి చేయనున్న సిఫార్సుల గురించి వారికి వివరించారు. పోలీసుస్టేషన్ లేదా పోలీసు సబ్‌డివిజన్ స్థాయిలో ఒక మహిళా కౌన్సిలర్‌ను కూడా నియమించాలని నిర్ణయించామన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు.ప్రతి పోలీసుస్టేషన్లో ఒక లీగల్ అడ్వైజర్‌ను కూడా నియమించి, పోలీసు దర్యాప్తు అధికారులు,కోర్టుల మధ్య సమన్వయాన్ని పెంచుతామన్నారు.డీజీపీతో సమావేశమైన మహిళా భద్రతా కమిటీ సభ్యులలో ఐఏఎస్ అధికారులు సునీల్‌శర్మ, శైలజఅయ్యంగార్, ఐపీఎస్ అధికారులు డాక్టర్సౌమ్యమిశ్రా, స్వాతిలక్రా, చారుసిన్హాలున్నారు. -
తెలంగాణలో ముగ్గురు డీఎస్పీలు బదిలీ
హైదరాబాద్: రాష్ట్రంలో ముగ్గురు డీఎస్పీలను బదిలీ చేస్తూ తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం డీఎస్పీ తిరుపతిని మహాంకాళిని ఏసీపీగా బదిలీ చేశారు. ట్రాన్స్‌కో డీఎస్పీ కృష్ణమూర్తిని మహబూబ్‌నగర్ ఎస్డీపీవోగా నియమించారు. అలాగే ఆ స్థానంలో విధులు నిర్వహిస్తున్న చెన్నయ్యను ఎస్డీపీవోగా బదిలీ చేశారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సురేశ్ రావు అనారోగ్యంతో బాధపడుతున్నారు: అనురాగ్ శర్మ
హైదరాబాద్: ఆత్మహత్యకు పాల్పడిన ఇంటిలిజెన్స్ డీఎస్పీ సురేష్‌రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని డీజీపీ అనురాగ్ శర్మ మీడియాకు తెలిపారు. యశోదా ఆస్పత్రిలో సురేశ్ రావు భౌతికకాయానికి నివాళులర్పించిన తర్వాత మీడియాతో అనురాగ్ శర్మ మాట్లాడారు. 15 రోజుల క్రితమే యశోదలో చికిత్స తీసుకున్నారని, ఈరోజే సురేష్‌రావు డ్యూటీకి వచ్చాడు అని అనురాగ్‌శర్మ తెలిపారు. కేసీఆర్ కు గతంలో భద్రతాధికారిగా పనిచేసిన సురేశ్ రావు శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం సురేశ్ రావు ఇంటలిజెన్స్ డీఎస్పీగా సేవలందిస్తున్నారు. ఆయన మృతికి కేసీఆర్, ఇతర పోలీసు అధికారులు సంతాపం తెలిపారు. -
'పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసులు అంతర్జాతీయ స్థాయిలో అందరికి ఆదర్శంగా నిలవాలని ఆ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. అందుకోసం పోలీసు సిబ్బంది బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. గురువారం హైదరాబాద్ నగరంలో పోలీసు సిస్టమ్‌లో పాల్గొనే సిబ్బంది కోసం సిస్కోలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని అనురాగ్ శర్మ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పోలీసు శాఖలో 3600 మంది డ్రైవర్లు, 1500 మంది ట్రాఫిక్ హోంగార్డుల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం తన బడ్జెట్లో పోలీసు శాఖకు అత్యధికంగా నిధులు కేటాయించిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా పోలీసు వ్యవస్థకు ఇంత మొత్తంలో బడ్జెట్ కేటాయించిందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఆగస్టు 15 నుంచి పోలీసు సిస్టమ్స్ ప్రారంభం కానుంది. ఈ శిక్షణ కార్యక్రమానికి హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లతోపాటు పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
డీఎస్పీలు, అదనపు ఎస్పీల బదిలీలకు రంగం సిద్ధం
హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి భారీ ఎత్తున డీఎస్పీలు, అదనపు ఎస్పీల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తును రాష్ట్ర పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు చైర్మన్ అనురాగ్‌శర్మ పూర్తి చేసినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ వారంలోనే ఉత్తర్వులను జారీ చేయడానికి పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధితోపాటు, తొమ్మిది జిల్లాల్లోని డీఎస్పీలు, అదనపు ఎస్పీలలో పలువురికి స్థానచలనం కలుగనున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా బదిలీల్లో రాజకీయ జోక్యం లేకుండా, పారదర్శకంగా జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పలుమార్లు తెలిపినప్పటికీ అధికారపక్షానికి చెందిన నాయకులు, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి పోలీసు అధికారులపై ఒత్తిడులు వస్తున్నట్టు సమాచారం. -
ఏక పోలీసు విధానం కష్టమే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏక పోలీసు నియామక విధానాన్ని అమలు చేయాలని భావిస్తుంటే.. పోలీసు ఉన్నతాధికారులు మాత్రం అది ఆచరణ సాధ్యం కాదని చెపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఏక పోలీసు విధానంపై తమిళనాడు, హర్యానాల్లో అధ్యయనం చేసి వచ్చిన పోలీసు ఉన్నతాధికారుల బృందం తమ నివేదికను డీజీపీ అనురాగ్‌శర్మకు అందజేసింది. ఈ నివేదికను ఒకట్రెండు రోజుల్లో డీజీపీ ప్రభుత్వానికి నివేదించనున్నారని తెలిసింది. ప్రస్తుతం స్పెషల్ పోలీస్ బెటాలియన్, ఆర్మ్డ్ రిజర్వు, సివిల్ పోలీసు విభాగాలకు ఎస్ఐ నుంచి కానిస్టేబుళ్ల వరకు నియామకాలు వేర్వేరుగా జరుగుతున్నాయి. ఈ విధానంలో సమన్యాయం జరగడం లేదని, ఇకపై రాష్ట్రంలో ఒకే నియామక విధానాన్ని అమలులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన విధివిధానాల రూపకల్పనకు రాష్ట్ర పోలీస్ పర్సనల్ అదనపు డీజీ ఉమేష్ షరాఫ్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఐజీ బాలనాగదేవి, హైదరాబాద్ కో-ఆర్డినేషన్ జాయింట్ కమిషనర్ సంజయ్‌జైన్, ఇంటెలిజెన్స్ ఎస్పీ రవీందర్‌తో కూడిన బృందాన్ని తమిళనాడు, హర్యానాలకు పంపింది. గతంలో తమిళనాడులో కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల భర్తీకి ఒకే రిక్రూట్మెంట్ విధానం అమలులో ఉండేది. దాని ప్రకారం అక్కడి ఫోర్సు (ఇక్కడ బెటాలియన్స్)లో మొదట సిబ్బందిని రిక్రూట్ చేసుకుని పదేళ్ల తర్వాత వారిని ఏఆర్‌కు.. అక్కడి నుంచి సివిల్ విభాగానికి బదిలీ చేసేవారు. అయితే ఈ విధానం వల్ల పలు సమస్యలు ఎదురవుతున్నాయని, సిబ్బంది సైతం అసంతృప్తితో ఉన్నారనే కారణంగా ప్రస్తుతం మన రాష్ట్రంలో అమలులో ఉన్న రిక్రూట్మెంట్ పాలసీనే అనుసరిస్తున్నారని అధికారుల అధ్యయనంలో తేలింది. హర్యానాలో సైతం ఈ విధానం అమలు చేసి తిరిగి పాత పద్ధతిలోకి మారిపోయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లోని నియామక విధానాలపైనా ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఏక పోలీసు విధానం కంటే ప్రస్తుతం రాష్ట్రంలో అనుసరిస్తున్న నియామక విధానమే మేలైనదిగా ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. అయినాసరే దీనిపై లోతుగా చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని డీజీపీ నిర్ణయించినట్లు సమాచారం. పోలీసు శాఖలో అధికారులు, సిబ్బందికి సమన్యాయం చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ యోచన ఆహ్వానించదగినదే అని, అయితే ఆచరణలో ఏక పోలీసు విధానం పలు సమస్యలకు దారితీస్తుందని సీనియర్ ఐపీఎస్ అధికారులు చెపుతున్నారు. -
ఖమ్మంలోకమిషనరేట్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోలీసు సంస్కరణల్లో భాగంగా జిల్లా పోలీసు శాఖ రూపురేఖలు కూడా మారిపోనున్నాయి. ఖమ్మం కేంద్రంగా పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు త్వరలోనే ప్రతిపాదనలు పంపాలని జిల్లా ఎస్పీ రంగనాథ్‌ను తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ ఆదేశించారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని కలెక్టర్‌తో సమన్వయం చేసుకుని సేకరించాలని, ఆరునెలల్లోనే ఖమ్మం జిల్లా పోలీసు శాఖలో సమూల మార్పులు చేపట్టాలని ఆయన ఎస్పీకి సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం హైదరాబాద్‌లో హోంమంత్రి, డీజీపీలతో పాటు పోలీసు శాఖ ఉన్నతాధికారులతో తొలిసారి సమీక్ష నిర్వహించి పోలీసు శాఖలో చేపట్టాల్సిన సంస్కరణల గురించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి ఎస్పీ రంగనాథ్ కూడా హాజరయిన నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన విషయాలపై ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ విశేషాలివి... సాక్షి: ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో జిల్లాకు సంబంధించిన విషయాలపై ఎలాంటి చర్చ జరిగింది ? ఎస్పీ: తెలంగాణ వ్యాప్తంగా చేపట్టాల్సిన సంస్కరణల గురించి సమావేశంలో చర్చ జరిగింది. అందులో భాగంగా జిల్లా పోలీసు శాఖకు సంబంధించిన నివేదికను ఇచ్చాం. ముఖ్యమంత్రితో పాటు అందరూ జిల్లా పోలీసు యంత్రాంగం పనితీరును అభినందించారు. జిల్లా పోలీసింగ్‌లో ఉన్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ముఖ్యంగా ఖమ్మం కేంద్రంగా పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సాక్షి: కమిషనరేట్ ఏర్పాటు ఎప్పటికి పూర్తవుతుంది? ఎస్పీ: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కాకుండా వైరా వరకు కమిషనరేట్‌ను విస్తృత పర్చాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలను కూడా వెంటనే పంపాలని ఆదేశించారు. కమిషనరేట్ ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణకు కూడా అనుమతి లభించింది. కలెక్టర్ సహకారంతో స్థలాన్ని ఎంపిక చేస్తాం. ఆరునెలల్లోపు ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నాం. కమిషనరేట్ ఏర్పాటు ద్వారా ఖమ్మం నగరంతో పాటు వైరా వరకు శాంతిభద్రతల పరిరక్షణ సులభతరమవుతుంది. అర్బన్ పోలీసింగ్‌లో మార్పులు రానున్నాయి. పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో నగరం మరింత భద్రంగా ఉండబోతోంది. మనతో పాటు వరంగల్, మంచిర్యాల, కోల్‌బెల్ట్ ఏరియాల్లో కూడా కమిషనరేట్లు ఏర్పాటు చేయబోతున్నారు. సాక్షి: జిల్లాలో ఒకే మహిళా పోలీస్ స్టేషన్ ఉంది. మరిన్ని స్టేషన్ల ఏర్పాటుకు అవకాశముందా? ఎస్పీ: ఈ విషయంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ప్రస్తుతానికి జిల్లా కేంద్రంలో మాత్రమే మహిళా స్టేషన్ ఉందని, కనీసం డివిజన్‌కు ఒకటయినా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అనుమతులు కూడా వస్తాయి. సాక్షి: సీసీఎస్ గురించి ఏమైనా మాట్లాడారా? ఎస్పీ: జిల్లాలో ప్రస్తుతం మూడు సెంట్రల్ క్రైమ్ స్టేషన్లు (సీసీఎస్)మంజూరయ్యాయి. సీసీఎస్‌లకు సంబంధించిన సిబ్బందిని కూడా కేటాయించారు. అందులో ఖమ్మంలో మాత్రమే సొంత భవనం ఉందని, కొత్తగూడెం, భద్రాచలంలలో లేవని, అందుకే అక్కడ కార్యకలాపాలు నిర్వహించలేకపోతున్నామని సమావేశం దృష్టికి తెచ్చాం. అక్కడ కూడా సొంత భవనాల నిర్మాణానికి నిధులిస్తామని చెప్పారు. అలాగే ఇప్పటికే జిల్లాకు అవసరమైన పోలీసు వాహనాలకు కూడా అనుమతి లభించింది. మొత్తం 50 వరకు కొత్త వాహనాలు జిల్లాకు త్వరలోనే రానున్నాయి. ఇక గతంలో సీఐడీ పర్యవేక్షణలో ఉన్న సైబర్ క్రైమ్ సెల్‌ను జిల్లాకొకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పీ పర్యవేక్షణలో ఈ సెల్‌ద్వారా సైబర్ నేరాలను నియంత్రించేందుకు కృషి చేస్తాం. సాక్షి: ఏజెన్సీలో పోలీసింగ్ ఎలా ఉండబోతోంది? మావోయిస్టులను ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎస్పీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పరిస్థితుల్లో అందరి దృష్టీ ఏజెన్సీ పోలీసింగ్‌పైనే ఉంది. అయితే, సమావేశంలో మాకిచ్చిన ఆదేశాల ప్రకారం పాత పద్ధతిలోనే మావోయిస్టులను ఎదుర్కోబోతున్నాం. గతంలో నిర్వహించిన పోలీసింగ్, ఇతర రాష్ట్రాలు, ప్రత్యేక దళాల సహకారంతో కూంబింగ్ కొనసాగుతుంది. మావోల విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గేది లేదు. సాక్షి: ఎన్నికల ముందు కొందరు పోలీస్ సిబ్బందిని బదిలీ చేశారు కదా? వారు మళ్లీ జిల్లాకు ఎప్పుడు రాబోతున్నారు? ఎస్పీ: ఎన్నికల ముందు బదిలీ చేసిన వారు ఇప్పుడప్పుడే జిల్లాకు వచ్చే అవకాశం లేదు. ఈ మేరకు ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. పోలీసు సిబ్బందికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం కచ్చితంగా రెండేళ్ల పాటు ఒక దగ్గర పనిచేస్తేనే బదిలీ ఉంటుంది. లేదంటే సదరు సిబ్బంది వ్యక్తిగత పనితీరు సంతృప్తికరంగా లేకపోతేనే బదిలీ చేయాలి. ఈ కారణంతో ఎన్నికలకు ముందు జిల్లా నుంచి బదిలీ అయిన వారిని అప్పుడే జిల్లాకు మార్చలేం. ఎస్ఐ స్థాయి నుంచి ఈ నిబంధన అమల్లో ఉంటుంది. -
పోలీసుల సమస్యల పరిష్కారానికి డీజీపీ హామీ
సంగారెడ్డి క్రైం: తెలంగాణ పోలీసు ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ కొత్త డీజీపీ అనురాగ్‌శర్మను తెలంగాణ పోలీసు ఫోరం జిల్లా అధ్యక్షుడు కృష్ణ గురువారం కలిశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల సమస్యల గురించి డీజీపీకి వివరించామన్నారు. ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించి పోలీసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని పోలీసులకు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారన్నారు. పోలీసు పిల్లలందరికీ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడి అందరికీ ఇప్పించడానికి కృషి చేస్తానని డీజీపీ హామీ ఇచ్చారన్నారు. హోంగార్డు సేవలను గుర్తించి ఆరోగ్య భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చారన్నారు. -
వారి నియామక వివరాలు మాకివ్వండి!
ఇన్చార్జ్ డీజీపీలుగా రాముడు, శర్మల నియామకంపై క్యాట్ సాక్షి, హైదరాబాద్: సీనియర్లను కాదని జాస్తి వెంకట రాముడు, అనురాగ్‌శర్మలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇన్చార్జి డీజీపీలుగా నియమించడంపై పూర్తి వివరాలను వచ్చే వారం నాటికి తమ ముందుంచాలని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్) పేర్కొంది. ఈ మేరకు మంగళవారం కేంద్రం సహా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. క్యాట్ సభ్యులు బి. వెంకటేశ్వరరావు, మిన్నీ మాథ్యూస్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. జేవీ రాముడు, అనురాగ్ శర్మల నియమకాన్ని సవాలు చేస్తూ 1997 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు సయ్యద్ అన్వరుల్ హుడా, టీపీ దాస్‌లు ఈ నెల 14న క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. తమకంటే జూనియర్లైన రాముడు, అనురాగ్ శర్మను డీజీపీలుగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని, వారి స్థానాల్లో తమను డీజీపీలుగా నియమించేలా ఆదేశాలు జారీ చేయాలని వారు క్యాట్‌ను కోరారు. 1982 బ్యాచ్ తర్వాత అధికారులను తెలంగాణకు కేటాయించారని, దీంతో వారికంటే సీనియర్లైన అధికారులకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు వివరించారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తరువాతనే క్యాడర్ కేటాయింపులు జరపాల్సి ఉండగా, దీనిని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మే 30నే క్యాడర్ కేటాయింపులు జరిగాయని, వాస్తవానికి తెలంగాణ ఏర్పడింది జూన్ 2న కాబట్టి సదరు కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంతో పాటు ఐపీఎస్ సర్వీసు నిబంధనలకు సైతం విరుద్ధమని వివరించారు. ప్రకాశ్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి, నిబంధనలకు అనుగుణంగా 2 వారాల్లో పూర్తిస్థాయి డీజీపీలను నియమించేలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని పిటిషన్లో కోరారు. వాదనలను విన్న క్యాట్ ధర్మాసనం, ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
డీజీపీల నియామకంపై క్యాట్‌లో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇన్చార్జి డీజీపీలుగా జేవీ రాముడు, అనురాగ్‌శర్మల నియామకాన్ని సవాల్ చేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎస్ఏ హుడా, టీపీ దాస్ (1979 బ్యాచ్) శుక్రవారం కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)లో పిటిషన్లు దాఖలు చేశారు. తమకంటే జూనియర్లను ఇన్చార్జి డీజీపీలుగా నియమించడం చెల్లదని ఫిర్యాదు చేశారు. గత నెల 30వ తేదీనే క్యాడర్ కేటాయింపులు జరిగాయని, ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని పేర్కొన్నారు. 1982 బ్యాచ్ తరువాత అధికారులను తెలంగాణకు కేటాయించారని, దీంతో వారికంటే సీనియర్లైన అధికారులకు అన్యాయం జరిగినట్లయిందని నివేదించారు. -
డీజీపీ ప్రసాదరావుకు ఘనంగా వీడ్కోలు
హైదరాబాద్ : డీజీపీ ప్రసాదరావుకు రెండు రాష్ట్రాల పోలీసు సిబ్బంది వీడ్కోలు పలికారు. సమైక్య రాష్ట్రానికి చివరి డీజీపీగా ప్రసాదరావు పనిచేసిన విషయం తెలిసిందే. అంబర్ పేట పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు, తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాదరావు సేవలను గుర్తు చేసుకున్నారు. -
ఎక్కడా వెనక్కు తగ్గొద్దు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘మావోయిస్టు ప్రభావిత సరిహద్దు జిల్లా అయిన ఖమ్మంలో శాంతిభద్రతల అమలు తెలంగాణ రాష్ట్రంపైనే ప్రభావం చూపుతుంది. అప్రమత్తంగా ఉండండి. ఇప్పటివరకు మావోలపై ఎలాంటి వ్యూహంతో ముందుకెళుతున్నారో... అదే వ్యూహంతో ముందుకెళ్లండి..ఎక్కడా వెనక్కు తగ్గొద్దు’అని తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ అనురాగ్‌శర్మ జిల్లా ఎస్పీకి కర్తవ్యబోధ చేశారు. జిల్లా ఎస్పీ రంగనాథ్ బుధవారం హైదరాబాద్‌లో డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఖమ్మం జిల్లాలో శాంతిభద్రతలు, మావోయిస్టుల ప్రభావం, పోలవరం అంశంపై చర్చ జరిగింది. ఎస్పీ రంగనాథ్ క్షేత్రస్థాయి పరిస్థితులను డీజీపీకి తెలియజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మావోయిస్టులను ఎదుర్కోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, ఇప్పటివరకు అనుసరిస్తున్న వైఖరిని కొనసాగించాలని ఎస్పీని ఆదేశించినట్టు సమాచారం. గతంలో గ్రేహౌండ్స్ విభాగంలో పనిచేసినప్పు డు కూడా డీజీపీ, ఎస్పీల మధ్య సమన్వ యం ఉంది. ఈ నేపథ్యంలో ఇరువురూ గ్రేహౌండ్స్ సహకారంపై కూడా చర్చించినట్టు తెలిసింది. దీంతోపాటు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న మండలాల గురించి కూడా ఎస్పీని డీజీపీ అడిగి తెలుసుకున్నారు. ముంపు కిందకు వెళుతున్న మండలాల పరిస్థితిపై డీజీపీకి ఎస్పీ సవివరంగా నివేదిక అందించారు. ఇదే సమయంలో ముంపు మండలాల్లో ఇప్పటికే పనిచేస్తున్న జిల్లా పోలీసు సిబ్బంది అంశం కూడా చర్చకు వచ్చింది. దీనిపై డీజీపీ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా పోలీసు సిబ్బంది ఎక్కడికీ మారేది లేదని, అయితే ఇందుకు సంబంధించి స్పష్టత వచ్చేందుకు కొంత సమయం పడుతుందని చెప్పినట్టు తెలిసింది. -
ఎక్కడా రాజీపడొద్దు: డీజీపీ అనురాగ్ శర్మ
హైదరాబాద్: తెలంగాణ ఐపీఎస్ అధికారులతో ఆ ప్రాంత డీజీపీ అనురాగ్ శర్మ సమావేశమయ్యారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీపడొద్దని అనురాగ్ శర్మ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలని వారికి సూచించారు. ఉమ్మడి రాజధానిలో రాజకీయ ప్రముఖుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం వారికి సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు. సిబ్బంది కొరతపై సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. దీంతో ఖాళీల భర్తీకి త్వరలోనే రిక్రూట్మెంట్ చేపట్టాలని ఉన్నతాధికారులను డీజీపీ ఆదేశించారు. -
సమస్యలు..సవాళ్లు ఉన్నాయి..
-
సమస్యలు..సవాళ్లు ఉన్నాయి..
పోలీసు సిబ్బంది కొరత ఉంది మావోయిస్టు కార్యకలాపాలు తగ్గినా.. అప్రమత్తమే సైబర్‌క్రైం, వైట్‌కాలర్ నేరాలు.. అత్యాచారాలు పెరుగుతున్నాయి {పపంచంలోనే ప్రతిష్ట కలిగిన పోలీసు వ్యవస్థగా తీర్చిదిద్దుతా.. సమష్టి కృషితో అధిగమిస్తాం ‘సాక్షి’తో తెలంగాణ తొలి డీజీపీ అనురాగ్‌శర్మ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు, నేరాల పరంగా పలు సమస్యలున్నాయని, వాటిని పోలీసుశాఖ సమష్టికృషితో అధిగమిస్తామని తెలంగాణ రాష్ట్ర తొలి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనురాగ్ శర్మ చెప్పారు. సోమవారం డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రాల విభజనతో తెలంగాణకు పోలీసు సిబ్బంది కొరత ఏర్పడిన మాట నిజమేనని, అయితే మున్ముందు రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఖాళీలను పూరిస్తామని అన్నారు. రాష్ట్రానికి మావోయిస్టుల పరంగా ప్రస్తుతానికి ఎలాంటి సమస్యలు లేనప్పటికీ సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్, మహారాష్ర్టల్లో నక్సల్స్ కదలికలపై ఎల్లప్పుడూ అప్రమత్తంగా రాష్ట్ర పోలీసులు ఉండాల్సిందేనని అనురాగ్‌శర్మ చెప్పారు. అలాగే, హైదరాబాద్.. సైబరాబాద్‌తో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఐఎస్ఐ, దాని ప్రేరిత ఉగ్రవాద కార్యకలాపాలు వెలుగు చూసినప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ వస్తున్నామన్నారు. అయితే, దీనిపై మరింతగా కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్‌క్రైం, వైట్‌కాలర్ నేరాలు, మహిళలపై అత్యాచారాల వంటి నేరాల సంఖ్య పెరుగుతోందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ర్ట విభజన జరగక పూర్వం ఇలాంటి నేరాలను అరికట్టడానికి సీఐడీ వంటి ప్రత్యేక పోలీసు విభాగంలో తగినంత మంది అధికారులు.. సిబ్బంది ఉండేవారని.. ఇప్పుడు సిబ్బంది, అధికారుల కొరత ఏర్పడిందన్నారు. ఈ సమస్యపై దృష్టిసారించి ఉన్న అధికారులు, సిబ్బందితో ఇలాంటి నేరాల అదుపునకు వృత్తి నైపుణ్యం గల వారిని ఎంపిక చేసుకొని, సీఐడీ విభాగాన్ని పటిష్టపరుస్తామని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ రాష్ర్ట ప్రభుత్వ సహకారంతో అన్ని సమస్యలను అధిగమిస్తామని, సమష్టి కృషితో రాష్ట్ర పోలీసుల ప్రతిష్టను ఇనుమడింపజేస్తామని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో పేరు ప్రతిష్టలు గడించేలా పోలీసుశాఖకు మెరుగులు దిద్దుతామన్నారు. పోలీసు శాఖ రెండు రాష్ట్రాలకు విభజించినప్పటికీ... నేరాల అదుపులో కలిసి పని చేస్తామని చెప్పారు. వ్యవస్థీకృతంగా అవసరమైన మార్పులు.. చేర్పులు చేస్తామని, తెలంగాణలో కొత్త పోలీసు కమిషనరేట్ల ఏర్పాటునకు కూడా తగిన చర్యలు తీసుకుంటామని డీజీపీ వివరించారు. అలాగే, పోలీసు శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడం కూడా తన లక్ష్యంగా అనురాగ్‌శర్మ వివరించారు. -
రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ బాధ్యతలు స్వీకరణ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ రాజీవ్ శర్మ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1982 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ శర్మ పలు కీలక శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన రూర్కీలో ఐఐటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ చేశారు. తరవాత ఇంగ్లండ్‌లోని అంగీలియాలో గ్రామీణాభివృద్ధిలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. అమెరికాలోని మిలన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేశారు. 1982లో ఐఏఎస్‌గా ఎంపికై ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వచ్చారు. కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్‌గా, డెరైక్టర్ పోర్ట్స్, పురపాలక శాఖ స్పెషల్ కమిషనర్, సాంకేతిక విద్య డెరైక్టర్, వ్యవసాయ శాఖ కమిషనర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్య కార్యదర్శి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డెరైక్టర్ జనరల్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శిగా పని చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో కీలక భూమిక పోషించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అవసరమైన సమాచారాన్ని అందించడమేకాక, ఆ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరించారు. అలాగే తొలి డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా అనురాగ్‌శర్మ కూడా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ డీజీపీగా ఈరోజు ఉదయం 7.15కు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఐవైఆర్ కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. -
తొలి సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ
- హైదరాబాద్ సీపీగా మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్‌రెడ్డి - పదవీ విరమణ చేసిన మహంతి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ రాజీవ్ శర్మ నియమితులయ్యారు. అలాగే తొలి డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా అనురాగ్‌శర్మను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఉమ్మడి రాజధానిగా ఉంటున్న హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా ఎం.మహేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బి.శివధర్‌రెడ్డి నియమితులయ్యారు. 1982 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ శర్మ పలు కీలక శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం డెప్యుటేషన్‌పై కేంద్ర హోం శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన రూర్కీలో ఐఐటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ చేశారు. తరవాత ఇంగ్లండ్‌లోని అంగీలియాలో గ్రామీణాభివృద్ధిలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. అమెరికాలోని మిలన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేశారు. 1982లో ఐఏఎస్‌గా ఎంపికై ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వచ్చారు. కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్‌గా, డెరైక్టర్ పోర్ట్స్, పురపాలక శాఖ స్పెషల్ కమిషనర్, సాంకేతిక విద్య డెరైక్టర్, వ్యవసాయ శాఖ కమిషనర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్య కార్యదర్శి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డెరైక్టర్ జనరల్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శిగా పని చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో కీలక భూమిక పోషించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అవసరమైన సమాచారాన్ని అందించడమేకాక, ఆ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరించారు. మహంతి పదవీ విరమణ ప్రస్తుత ప్రభుత్వ సీఎన్ మహంతి ఆదివారం పదవీ విరమణ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను నియమించాక ఆయన తప్పుకున్నారు. మరో నెలరోజులు గడువున్నా ఈ నిర్ణయం తీసుకున్నారు. సంతోషంగా ఉంది: అనురాగ్ శర్మ తెలంగాణ రాష్ట్ర తొలి డీజీపీ కావడం సంతోషంగా ఉందని అనురాగ్ శర్మ సాక్షితో అన్నారు. పోలీసు శాఖలో కీలకమైన ఈ పదవిని నిర్వహించడం కత్తిమీద సామే అయినా ప్రజా సేవకు ఎక్కువ అవకాశముంటుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా తనకు ఎన్నికల బందోబస్తులో, శాంతిభద్రతల పరిరక్షణలో నగర పోలీసు సిబ్బంది, అధికారులు వెన్నుదన్నుగా నిలిచారంటూకృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ డీజీపీగా సోమవారం ఉదయం 7.15కు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక ఆయన స్థానంలో సీపీగా వస్తున్న మహేందర్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అదనపు డీజీగా ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు చేపట్టనున్న శివధర్‌రెడ్డిని ఇటీవలే వైజాగ్ సీపీ బాధ్యతల నుంచి తప్పించి తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగానికి అటాచ్ చేశారు. వీరిద్దరూ సమర్థులైన అధికారులుగా పేరు తెచ్చుకున్నారు. అత్యుత్తమ సేవలందించినందుకు రాష్ట్రపతి పోలీసు పతకాలు అందుకున్నారు. మహేందర్‌రెడ్డి 1986, శివధర్‌రెడ్డి 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు. మహేందర్‌రెడ్డి నిజామాబాద్ ఎస్పీగా, హైదరాబాద్ తూర్పు మండలం డీసీపీ, గ్రేహౌండ్స్ కమాండెంట్, సైబరాబాద్ నగర పోలీసు కమిషనర్, ఎన్పీఏ డీఐజీగా చేశారు. ఐదేళ్లుగా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు. శివధర్‌రెడ్డి శ్రీకాకుళం, నల్లగొండ జిల్లాల ఎస్పీగా, ఎస్ఐబీ డీఐజీ, వైజాగ్ సీపీగా పలు హోదాల్లో పని చేశారు. వీరిరువురూ సోమవారం నూతన బాధ్యతలు స్వీకరించనున్నారు. -
రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు: అనురాగ్ శర్మ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కే. చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రమాణ స్వీకారం నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు సీపీ అనురాగ్‌శర్మ మీడియాకు వెల్లడించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అనురాగ్ శర్మ తెలిపారు. ఎస్ బీహెచ్ క్రాస్ రోడ్స్ నుంచి బేగంపేట మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నట్టు ఆయన తెలిపారు. అలాగే సీటీవో క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే వాహనాలకు పరేడ్‌గ్రౌండ్స్‌కు వైపుకు అనుమతిలేదని సీపీ అనురాగ్‌శర్మ అన్నారు -
పోలీస్ బాస్‌లు.. తెలంగాణకు అనురాగ్ శర్మ, ఏపీకి జేవీ రాముడు
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త డీజీపీల నియామకానికి ఆమోద ముద్ర పడింది. తెలంగాణ డీజీపీగా అనురాగ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ డీజీపీగా జేవీ రాముడు నియమితులయ్యారు. రెండు రాష్ట్రాలకు కేటాంయిన ఐపీఎస్ అధికారుల్లో సీనియర్లయిన వీరి పేర్లను ఇంతకుముందు గవర్నర్ నరసింహన్‌కు ప్రతిపాదించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కాబోయే ముఖ్యమంత్రులు చంద్రశేఖర రావు, చంద్రబాబు నాయుడు గవర్నర్‌ను కలసి అనురాగ్ శర్మ, జేవీ రాముడులను నియమించాల్సిందిగా కోరారు. రాష్ట్రపతి పాలన అమల్లో ఉండటంతో గవర్నర్ ఆమోదం తెలిపారు. సోమవారం కేసీఆర్, ఈ నెల 8న చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
నేను మానేశా... మరి మీరు!
ధూమపానంపై అనురాగ్‌శర్మ సాక్షి, సిటీబ్యూరో: ‘ధూమపానాన్ని 23 ఏళ్ల క్రితమే మానేశా. ఈ అలవాటు ఉన్న వారందరూ మానుకోవాలి’ అంటూ పిలుపునిచ్చారు నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ. ‘వరల్డ్ నో టొబాకో డే’ను పురస్కరించుకుని సిటిజన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆయన శనివారం బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. పోలీసు విభాగంలోని తోటి అధికారులు కూడా ధూమపానం మానుకోవాలని కమిషనర్ కోరారు. సంస్థ నాయకులు రాజనారాయణ ము దిరాజ్, మీరా, అదనపు పోలీసు కమిషనర్లు జితేందర్, సందీప్ శాండిల్యా, జాయింట్ పోలీసు కమిషనర్ మల్లారెడ్డి పాల్గొన్నారు. అలాగే... ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్స్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద నిర్వహించిన 2కె రన్‌ను మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రారంభించారు. కామినేని హాస్పిటల్స్ డెరైక్టర్ వసుంధర కామినేని, సీఈఓ సత్యనారాయణ పాల్గొన్నారు. టొబాకో కంట్రోల్ సెల్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పొగాకు మానాలని పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అప్సా, జనచైతన్య వేదిక నిర్వహించిన కార్యక్రమంలో పొగాకు వాడకం ఆరోగ్యానికి హానికరమని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు సూచించారు. -
2న నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో ఈ నెల 2న నిర్వహించనున్న నేపథ్యంలో పలు మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపుతో పాటు అవతరణ దినోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే వాహనాల కోసం వేర్వేరు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. నగరంలో సోమవారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. 1. ఎస్బీహెచ్ ఎక్స్ రోడ్స్ నుంచి బేగంపేట వైపు వెళ్లే వాహనాలను ఎస్పీ రోడ్డు మీదుగా అనుమతించరు. ప్యాట్నీ- ఆర్పీరోడ్, ఎస్డీ రోడ్డు నుంచి వచ్చే వాహనాలు ప్యాట్నీ- ప్యారడైజ్ మీదుగా, జేబీఎస్ మార్గం నుంచి వచ్చే వాహనాలు స్వీకార్ ఉపకార్- టివోలీ- బాలంరాయి మీదుగా సీఈఓ వైపు నుంచి వెళ్లాల్సి ఉంటుంది. 2. బేగంపేట నుంచి సికింద్రాబాద్ వచ్చే వాహనాలు... బాలంరాయి- స్వీకార్ ఉపకార్- ఎస్బీహెచ్ మార్గంలో లేదా ప్యారడైజ్- ఎస్డీ రోడ్-ప్యాట్నీ- క్లాక్‌టవర్- సంగీత్ చౌరస్తా మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది. 3. టివోలీ మార్గంలో వచ్చే వాహనాలు టివోలీ జంక్షన్ నుంచి బాలంరాయి- సీటీఓ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. టివోలీ నుంచి ప్లాజా జంక్షన్ మార్గంలో వాహనాలను అనుమతించరు. 4. పార్క్ లేన్ నుంచి ప్లాజా చౌరస్తాకు వెళ్లే వాహనాలు సైతం ప్యారడైజ్- ప్యాట్నీ మార్గాల గుండా వెళ్లాల్సి ఉంటుంది. 5. వైఎంసీఏ, సీటీఓ ఫై ్ల ఓవర్లపై వాహనాల రాకపోకల్ని అనుమతించరు. 6. ఇక రాజ్‌భవన్‌లో సీఎం ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రాజ్‌భవన్ రహదారిలో సాధారణ ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు. ఈ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. పార్కింగ్ ఏర్పాట్లు ఇక్కడే.. 1. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ఉప్పల్, తార్నాక నుంచి వచ్చే వాహనాల కోసం రైల్ నిలయం సమీపంలోని రైల్వే రిక్రియేషన్ క్లబ్ (ఆర్ఆర్సీ) ఆవరణలో, బేగంపేటలోని వెస్లీ కాలేజీలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. 2. నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఎన్‌హెచ్-7 (మేడ్చల్ మార్గం), ఎన్‌హెచ్-9 (బాలానగర్ మార్గం) గుండా వచ్చే వాహనాలను కంటోన్మెంట్‌లోని ఇంపీరియల్ గార్డెన్ సమీపంలోని దోబీఘాట్, బాలంరాయి చౌరస్తా వద్ద ఉన్న ఇసుక లారీల అడ్డా, టివోలీ సమీపంలోని మిలీనియం గార్డెన్, పెర్ల్ గార్డెన్ ఎదురుగా ఉన్న ఈద్గా ప్రాంతాల్లో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. 3. కరీంనగర్, సిద్ధిపేట, చేర్యాల తదితర ప్రాంతాల నుంచి రాజీవ్ రహదారి గుండా వచ్చే వాహనాల కోసం కేజేఆర్ గార్డెన్ సమీపంలోని ఖాళీ ప్రదేశం, ఇంపీరియల్ గార్డెన్ ముందు ఖాళీ స్థలం, స్వీకార్-ఉపకార్ చౌరస్తా సమీపంలోని సెంటినరీ స్కూల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. 4. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పశ్చిమ ప్రాంతాల గుండా వచ్చే వాహనాలను సికింద్రాబాద్ పీజీ కాలేజీ, బేగంపే ఎయిర్‌పోర్టు, ఎయిర్ కార్గో, హైదరాబాద్ ఉత్తర ప్రాంతం మల్కాజిగిరి, కుషాయిగూడ, అడ్డగుట్ట మార్గాల్లో వచ్చే వాహనాలను లాంబా రోడ్డులో పార్క్ చేయాల్సి ఉంటుంది. -
ఫేస్బుక్లో సైబర్ కాప్స్
సైబర్ క్రైమ్ పోలీసు హైదరాబాద్ పేరుతో హోమ్ పేజ్ నెట్‌జనులకు విస్తృత అవగాహనే థ్యేయం నేడు ఆవిష్కరించనున్న నగర కమిషనర్ అనురాగ్ శర్మ సాక్షి, హైదరాబాద్: ‘‘ఆన్లైన్ ద్వారా నేరం చేసిన వారూ తప్పించుకోలేరు. సైబర్ పోలీసులు కన్నేసి ఉంచారు’’- సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసుల ఫేస్బుక్ పేజ్ నినాదమిది. ఇటీవల కాలంలో అందరికీ అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ ఆధారంగా ఆన్లైన్లో జరుగుతున్న నేరాలపై నెట్‌జనులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా ఫేస్బుక్ పేజ్‌ను ఏర్పాటు చేసింది. ‘సైబర్ క్రైమ్ పోలీస్ హైదరాబాద్’ పేరుతో అందుబాటులోకి రానున్న ఈ పేజ్‌ను నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ శనివారం తన కార్యాలయంలో ఆవిష్కరించనున్నారు. శుక్రవారం ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ పేజ్ని 12 గంటల్లోనే 14 మంది లైక్ చేశారు. ఈ పేజ్ ద్వారా ప్రాథమికంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. ఒకే తీరులో ఒకటి కంటే ఎక్కువ నేరాలు నమోదైతే తక్షణం ఆ వివరాలను ఫేస్బుక్ పేజ్‌లో అప్లోడ్ చేయడం ద్వారా ప్రజలు అప్రమత్తం చేస్తారు. ఈ తరహా నేరాల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్నీ వివరించేందుకు ‘అలెర్ట్స్’ను అందుబాటులోకి తేనున్నారు. భవిష్యత్తులో బాధితులు సంప్రదింపులు జరపడానికి, సందేహాలు తీర్చుకోవడానికీ ఈ పేజ్ ఉపయోగపడేలా చేయాలని సీసీఎస్ డీసీపీ జి.పాలరాజు నిర్ణయించారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ పరిధిలోకి వచ్చే నేరాలను మాత్రమే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. అయితే ప్రస్తుతం బాధితులకు ఏ తరహా నేరం ఈ చట్టపరిధిలోకి వ స్తుందనేది స్పష్టంగా తెలియట్లేదు. ఫలితంగా సమయం, ఖర్చుల్ని వెచ్చిస్తూ సీసీఎస్ వరకు వచ్చి వెళ్లాల్సి వస్తోంది. దీనికి పరిష్కారంగా ఫేస్బుక్ పేజ్‌ను తీర్చిదిద్దాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది అమలైతే ఓ బాధితుడు తాను మోసపోయిన తీరు, ఎదుర్కొన్న ఇబ్బంది తదితరాలను సైబర్ క్రైమ్ పోలీసుల ఫేస్బుక్ పేజీలో నిర్దేశించిన ప్రాంతంలో పొందుపరిస్తే... వాటిని పరిశీలించే పోలీసులు అవసరమైన సహాయసహకారాలు అందిస్తారు. దశల వారీగా ఈ విధానాన్ని అమలులోకి తేనున్నారు. -
డీజీపీ స్థాయికి సిటీ కొత్వాల్ పోస్టు
తాత్కాలికంగా అప్‌గ్రేడ్ చేసిన ప్రభుత్వం హైదరాబాద్: హైదరాబాద్ పోలీసు కమిషనర్ పోస్టుకు తాత్కాలికంగా ఎక్స్-క్యాడర్లో డీజీపీ స్థాయికి పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ (అప్పా)లోనూ అదనపు డీజీ స్థాయిలో స్పెషల్ డెరైక్టర్ పోస్టునూ తాత్కాలికంగా అప్‌గ్రేడ్ చేసింది. రెండేళ్లుగా నగర పోలీసు కమిషనర్‌గా పని చేస్తున్న 1982 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అనురాగ్ శర్మ ఈ ఏడాది ఏప్రిల్‌లో డీజీపీగా పదోన్నతి పొందారు. అయినప్పటికీ అదే పోస్టులో కొనసాగుతుండటంతో సాంకేతిక కారణాలతో ఆయన జీతభత్యాల చెల్లింపుల్లో ఇబ్బందులు లేకుండా ఈ చర్యలు తీసుకున్నారు. అదనపు డీజీ స్థాయిలోనే ఉన్న ఎం.మహేందర్‌రెడ్డిని జూన్ 2న నగర పోలీసు కమిషనర్‌గా నియమిస్తారని తెలుస్తోంది. ఆ సందర్భంలో ఈ పోస్టును యథాస్థితికి తెస్తూ ప్రభుత్వం -
కొత్త పోలీస్ బాస్‌లు!
ఆంధ్రకు ప్రసాదరావు, తెలంగాణకు అనురాగ్‌శర్మ , నగర పోలీసు కమిషనర్‌గా మహేందర్‌రెడ్డి? హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బి.ప్రసాదరావు, తెలంగాణ రాష్ట్రానికి అనురాగ్‌శర్మలు తొలి డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ)లుగా నియామకం కానున్నారని ఐపీఎస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అలాగే, హైదరాబాద్‌కు సీనియర్ ఐపీఎస్ అధికారి ఎం.మహేందర్‌రెడ్డి పోలీస్ కమిషనర్‌గా కానున్నారనే చర్చా సాగుతోంది. ఈ విషయంలో ఇప్పటికే ఉన్నతస్థాయిలో నిర్ణయం జరిగిందని, వాటిని అపాయిం టెడ్ డే జూన్ 2న గానీ, అంతకంటే ముందే ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా ఉన్న 1982వ బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీపీ హోదాలో ఉన్న అనురాగ్‌శర్మను తెలంగాణ డీజీపీగా నియమించే విషయంలో టీఆర్ఎస్ అధినేత సానుకూలం గా ఉన్నట్లు తెలిసింది. 1979వ బ్యాచ్‌కు చెందిన ప్రస్తుత డీజీపీ ప్రసాదరావు, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి టీపీదాస్, రాష్ట్ర పోలీసు గృహనిర్మాణ సంస్థ చైర్మన్ సయ్యద్ అన్వరుల్ హుదాలు ఏపీ కేడర్‌లోకి మారనున్నట్లు సమాచారం. ఇక ఇదే బ్యాచ్‌కు చెంది, శివరాంపల్లిలోని జాతీయ పోలీసు అకాడమి డెరైక్టర్ గా ఉన్న అరుణాబహుగుణ తెలంగాణ రాష్ట్ర కేడర్‌కి మారనున్నారని తెలుస్తోంది. 1980 బ్యాచ్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌ల్లో ఒకరైన అంబటి శివనారాయణ పదవీ విరమణ చేయగా, వాసన్ ఢిల్లీలో కేంద్రంలో డిప్యూటేషన్‌లో ఉన్నారు. 1981 బ్యాచ్‌నకు చెందిన డీజీపీ హోదా కలిగిన అధికారుల్లో కోడె దుర్గాప్రసాద్‌రావు ఎస్పీజీ చీఫ్‌గా ఢిల్లీలో ఉన్నారు. గ్రేహౌండ్స్ డీజీపీగా జేవీ రాముడు, ఏసీబీ డెరైక్టర్ జనరల్‌గా ఉన్న ఏకేఖాన్ ఉండగా, మరో అధికారి ఆర్పీ మీనా పదవీవిరమణ చేశారు. 1982 బ్యాచ్‌కు చెందిన వారిలో అనురాగ్ శర్మతో పాటు ఎస్వీ రమణమూర్తి (రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్)గా ఉన్నారు. వాసన్ కేంద్ర సర్వీసులోనే కొనసాగే అవకాశాలు ఉండగా, జేవీ రాముడు, కోడె దుర్గాప్రసాద్, ఏకే ఖాన్, రమణమూర్తిలు ఏపీ కేడర్‌లోకి వెళ్లే అకాశాలున్నాయి. దీంతో సీనియార్టీ ప్రకారం బి. ప్రసాదరావును ఏపీ రాష్ర్ట డీజీపీగా నియమించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆయన డీజీపీగా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వహించడం, వివాదాలకు అతీతుడు కావడంతో ఆయనకే ఏపీ పోలీసు పగ్గాలను అప్పగించవచ్చని భావిస్తున్నారు. తెలంగాణలో సీనియర్‌గా అరుణా బహుగుణ ఉన్నప్పటికీ శాంతిభద్రతల పరిరక్షణలో అనురాగ్‌శర్మకు ఉన్న సమర్థతను దృష్టిలో ఉంచుకొని ఆయనకే పోలీసుబాస్ పగ్గాలు దక్కనున్నాయని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో నగర పోలీసు కమిషనర్‌గా ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ ఎం.మహేందర్‌రెడ్డిని నియమించడం ఖాయమని ఐపీఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణ గవర్నర్ పరిధిలో ఉం డడం, ఆయనే నగర పోలీసు కమిషనర్‌ను నియమించాల్సి ఉంటుంది. అయితే, మహేందర్‌రెడ్డి విషయంలో గవర్నర్ సైతం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా సీఎంలు సైతం మహేందర్‌రెడ్డి విషయంలో సానుకూలంగానే ఉండే అవకాశాలున్నాయని ఐపీఎస్ వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. చివరి క్షణంలో ఏదైనా మార్పులు చేర్పులు జరిగితే తప్ప.. ఈ ముగ్గురు అధికారులకు కీలక పోస్టులు లభించడం ఖాయమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. -
కౌంటింగ్ సందర్భంగా నగరంలో ఆంక్షలు
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా హైదరాబాద్‌లో ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ర్యాలీలు, సంబరాలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు రేపు సాయంత్రం ఆరు గంటల వరకూ అమల్లో ఉంటాయన్నారు. ఇక 17వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకూ వైన్ షాపులు, క్లబ్బులు మూసివేత కొనసాగుతుందన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
హైదరాబాద్: నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ గురువారం ఎల్బీ స్టేడియంలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులను భారీగా మోహరించినట్లు అనురాగ్ శర్మ తెలిపారు. సభలు, విజయోత్సవాలు నిషేధమని, కౌంటింగ్ కేంద్రాల నుండి ఎలాంటి ర్యాలీలకు అనుమతిచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
లష్కర్ ఎన్నికలకు 20 వేల మంది సిబ్బంది: అనురాగ్ శర్మ
హైదరాబాద్: ఏప్రిల్ 30 తేదిన నగరంలో జరిగే ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని నియమించామని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో తొలి విడుతగా నగరంలో రెండు పార్లమెంట్ స్థానాలకు, 15 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. శాంతియుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు 20 వేల భద్రతా సిబ్బంది, 14 వేల సిటీ పోలీసులు, ఇంకా 37 కంపెనీల సెంట్రల్ పారా మిలిటరీ దళాలు, 8 కంపెనీల ఏపీఎస్పీ సిబ్బందిని నియమించినట్టు అనురాగ్ శర్మ తెలిపారు. ఓటర్లు పూర్తి స్వేచ్చ, శాంతియుత వాతావరణం మధ్య ఓటు హక్కును వినియోగించుకుంటారనే విశ్వాసాన్ని అధికారులు వ్యక్తం చేశారు. 3442 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో 17 పార్లమెంట్ స్థానాలకు, 119 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 30 తేదిన ఎన్నికలు నిర్వహించనున్నారు. -
కఠిన చర్యలు తీసుకుంటాం: అనురాగ్ శర్మ
హైదరాబాద్: ఎన్నికల అభ్యర్థుల ప్రచారం ఆపివేయాలని ఎన్నికల అధికారులు, పోలీసులు అధికారులు రాజకీయ పార్టీలకు సూచించారు. సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం నిలిపివేయాలని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అనురాగ్ శర్మ హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతంలో ఏప్రిల్ 30 తేదిన జరుగనున్న ఎన్నికల కోసం 37 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నామని అనురాగ్ శర్మ తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో 107 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని సీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఎలక్ష్ట్రానిక్ మీడియాపై ఆంక్షల్ని ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌పై ఎన్నికల కమీషన్ పూర్తిగా నిషేధం విధించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపిన సంగతి తెలిసిందే. -
కిడ్నీ రాకెట్లో ముగ్గురి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: కిడ్నీ రాకెట్ లో ముగ్గురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ తెలిపారు. కిడ్నీ విక్రయించేందుకు కొలంబో వెళ్లి మృత్యువాత పడ్డ దినేష్ కేసు దర్యాప్తులో కిడ్నీ రాకెట్ ఉదంతం వెలుగు చూసిందన్నారు. అదనపు కమిషనర్ అంజనీకుమార్, జాయింట్ కమిషనర్ బి.మల్లారెడ్డి, డీసీపీ పాలరాజుతో కలిసి మంగళవారం ఆయన వివరాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన దినేష్, పశ్చిమగోదావరి జిల్లా కొత్తపల్లికి చెందిన కిరణ్, కాశ్మీర్‌కు చెందిన అరాంజర్గర్లు కిడ్నీ అమ్మేందుకు ఫేస్బుక్, వెబ్సైట్ ద్వారా ప్రశాంత్సేఠ్ను సంప్రదించారు. తరువాత వీరు నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన వెంకటేశం(ఇతను కూడా కిడ్నీ ఇచ్చాడు), వనస్థలిపురానికి చెందిన ఎంబీఏ విద్యార్థి పవన్ శ్రీనివాస్ సహాయంతో గత నెల 23న కొలంబో వెళ్లారు. కిరణ్, అరాంజర్గర్కు కిడ్నీ తీసేందుకు డాక్టర్లు మార్చి 29వ తేదీని, దినేష్‌కు ఏప్రిల్ 1వ తేదీని ఖరారు చేశారు. అపరేషన్ తరువాత జల్సా చేయలేమనే ఉద్దేశంతో ఈ ముగ్గురు మార్చి 28న అక్కడి బీచ్‌లో మద్యం తాగగా దినేష్ వాంతులు చేసుకుని మృతి చెందాడు. కొలంబోలో కిడ్నీకి రూ.50 లక్షలు కిడ్నీ రాకెట్ సూత్రధారి ముంబ యికి చెందిన ప్రశాంత్‌సేఠ్ కొలంబోలో ఒక్కో కిడ్నీని రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు విక్రయిస్తాడు. ఇక్కడి ఏజెంట్ల ద్వారా కిడ్నీ అమ్మేందుకు సిద్ధమైన యువకులకు ఒక్కోక్కరికి రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఇస్తాడు. యువలను తీసుకువచ్చిన ఏజెంట్లకు మాత్రం రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షలు వరకు చెల్లిస్తాడు. మిగిలిన సొమ్మును ప్రశాంత్‌సేఠ్, కొలంబోలోని డాక్టర్ మౌనిక్ పంచుకుంటారు. ఎంపికచేసిన యువకులకు ప్రశాంత్‌సేఠ్ ఇక్కడే రక్తపరీక్షలు చేసి ఆ నివేదికను కొలంబోలోని డాక్టర్ మౌనిక్‌కు చేరవేస్తే మౌనిక్ అవసరమైన రోగితో బేరం కుదుర్చుకుంటాడు. ఆ తరువాతే ఇక్కడి నుంచి కిడ్నీ ఇచ్చేవారిని కొలంబోకు తీసుకెళ్తారు. వెంకటేశం ఆరుగురిని, శ్రీనివాస్ 15 మందిని ఇలా పంపించినట్లు తేలింది. ఇంకా ముంబ యి, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్, భువనేశ్వర్, హర్యానా కేంద్రాలుగా కిడ్నీ రాకెట్ నడుస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక కిడ్నీ అమ్మేందుకు వెళ్లే వారిని విజయవాడకు చెందిన సూర్యనారాయణ (ఇతను కూడా కిడ్నీ ఇచ్చినవాడే) బ్లాక్మెయిల్ చేసి అందినకాడికి దండుకునేవాడు. టూరిస్టు విసాపై వెళ్లిన యువకుల నుంచి కిడ్నీ తీసుకోవడం చట్ట ప్రకారం నేరం. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు త్వరలో ఒక పోలీసు బృందం శ్రీలంకకు పంపుతున్నట్టు కమిషనర్ అనురాగ్‌శర్మ తెలిపారు. -
హోదా డీజీపీ..పోస్టేమో కొత్వాల్!
నాడు రాములు, నేడు అనురాగ్ శర్మ ‘గ్రేటర్’ ఏర్పాట్లలో భాగమేనా ? సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు కమిషనరేట్ చరిత్రలో మరోసారి అరుదైన సందర్భం ఇది. డీజీపీ హోదాలో ఉన్న అధికారి నగరపోలీస్ కమిషనర్‌గా ఉండడం. పదమూడేళ్ల క్రితం కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు మరోసారి ఆవిష్కృతమైంది. నగర పోలీసు కమిషనరేట్‌కు అదనపు డెరైక్టర్ జనరల్ (ఏడీజీ) హోదాలో ఉన్న అధికారి కమిషనర్‌గా ఉంటా రు. ఇప్పటి వరకు పని చేసిన అందరూ ఆ హోదాలోని వారే. ఎవరికైనా పదోన్నతి వస్తే వారిని వెంటనే ఈ పోస్టు నుంచి బదిలీ చేయడం ఆనవాయితీ. అందుకే సాధారణంగా బదిలీలతో కూడిన పదోన్నతులనే ఇస్తుం టారు. అయితే 2000 డిసెంబర్ 15 నుంచి 2002 ఫిబ్రవరి 24 వరకు నగర పోలీసు కమిషనర్‌గా పని చేసిన పేర్వారం రాములుకు 2002 జనవరిలో డీజీపీగా పదోన్నతి వచ్చింది. అప్పట్లో నగరంలో నెలకొన్న పరిణామాల కారణంగా ఆ ఏడాది ఫిబ్రవరి 25 వరకు ఆయననే కొత్వాల్‌గా కొనసాగించింది. ప్రస్తుత కమిషనర్ అనురాగ్ శర్మ విషయంలోనూ అదే జరిగింది. అదనపు డీజీగా ఉన్న ఈయనకు డీజీపీగా పదోన్నతి ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో తదుపరి పోస్టింగ్ వచ్చే వరకు నగర కొత్వాల్గానే కొనసాగించాలని నిర్ణయించింది. మరోపక్క ఇది గ్రేటర్ పోలీసు కమిషనరేట్ ఏర్పాటులో భాగమే అనే వాదనా వినిపిస్తోంది. రెండు రాష్ట్రాల అపాయింటెడ్ డే అయిన జూన్ 2 నుంచి హైదరాబాద్ గరిష్టంగా పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగనుంది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో శాంతిభద్రత అంశం గవర్నర్ పరిధిలోకి వెళ్లిపోతుంది. అయితే ప్రస్తుతం భౌగోళికంగా ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో దీనికోసం హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్‌లోని మెజారిటీ ప్రాంతాన్ని కలుపుతూ గ్రేటర్ హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ ఏర్పాటు అనివార్యమైంది. ఇతర మెట్రోల్లో అనుసరిస్తున్నట్లే దీనికీ కచ్చితంగా జూనియర్ డీజీపీ స్థాయి అధికారి నేతృత్వం వహించాలి. అయితే ప్రస్తుతం రెండు కమిషనరేట్లకూ వేర్వేరు చట్టాలు ఉండటంతో వీటిని కలిపేయాలన్నా... రద్దు చేసి కొత్తగా ‘గ్రేటర్’ చట్టం తీసుకురావాలన్నా అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి. హైదరాబాద్ మహానగరం భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రంలో భాగం కావడంతో ఈ బిల్లును ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదించాల్సి ఉంటుంది. దీనికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు అనురాగ్ శర్మను డీజీపీ హోదాలో హైదరాబాద్ కమిషనర్‌గా కొనసాగిస్తున్నారు. ‘గ్రేటర్’ ఆవిర్భావం తరవాత ఆయననే కొత్త కమిషనర్‌గా నియమిస్తారని తెలుస్తోంది. కిషోర్‌కుమార్‌కు పదోన్నతి ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ(అప్పా) అదనపు డెరైక్టర్ కిషోర్‌కుమార్‌కు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు డీజీపీగా ప్రమోషన్ కల్పిస్తూ అప్పా స్పెషల్ డెరైక్టర్‌గా నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
'లైసెన్స్డ్ రివాల్వర్లను స్వాధీనం చేయండి'
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లెసెన్స్ కలిగిన రివాల్వర్లను ఈ నెల 15వ తేదీ లోపు స్థానిక పోలీసు స్టేషన్లోగాని ఆయుధ డీలర్ వద్దగాని డిపాజిట్ చేయాలని అనురాగ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ బ్యాంకుల వద్ద సెక్యూరిటీ గార్డులకు ఇందుకు మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్లు సోమవారం రాత్రి వరకు నగరంలోని అన్ని ఠాణాలలో కలిపి 360 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. దీంతో పాటు 250 మంది వద్ద ఉన్న లెసెన్డ్స్ రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఆయుధాలు కలిగిన వారు నగరంలో నాలుగు వేలకుపైగా ఉన్నారని కమిషనర్ తెలిపారు. ప్రచారం కోసం రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలకు ఆయా డివిజన్, జోన్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతి లేకుంటే కేసులు నమోదు చేస్తామన్నారు. పార్టీ ఎన్నికల కార్యాలయం పక్కనే మరో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు వంద మీటర్ల దూరం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. -
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు:అనురాగ్ శర్మ
హైదరాబాద్:మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నగర కమీషనర్ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. చట్టాన్ని ఎవరైనా చేతిల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే తాము కఠినంగానే వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు ఏర్పాటు చేయకూడదని సీపీ తెలిపారు. ఎవరికైనా అభ్యంతరాలుంటే పోలీసుల దృష్టికి తీసుకురావచ్చన్నారు. అభ్యర్థులు పర్యటించే ప్రాంతాల వివరాలను ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. ప్రార్ధన మందిరాల సమీపంలో ప్రచారానికి నిషేధాజ్ఞలున్నట్లుఅనురాగ్ శర్మ తెలిపారు. మతాల ఆధారంగా ఎవరూ ప్రచారం చేయకూడదన్నారు. డబ్బు, మద్యం పంపిణీలకు సంబంధించి కఠినంగా వ్యవహరిస్తామన్నారు. -
పవర్ స్టార్....... హార్ట్ వాక్
-
సిటీ కమిషనరేట్‌లో ఎలక్షన్ సెల్
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే ఇన్స్పెక్టర్ స్థాయి వరకు బదిలీల ప్రక్రియ పూర్తి చేసిన నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ మరో కీలక చర్య తీసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ల విడుదలకు ముందే భవిష్యత్తులో ఎలాంటి అవాంతరాలకు ఆస్కారం లేకుండా కమిషనరేట్ పరిధిలో ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల నుంచే పని ప్రారంభించిన ఈ విభాగానికి అదనపు పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) అంజనీకుమార్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) సంయుక్త పోలీసు కమిషనర్ బి.మల్లారెడ్డి సైతం కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ సెల్లో శాంతిభద్రతల విభాగం, ఎస్బీ సిబ్బందితో పాటు మినిస్టీరియల్ స్టాఫ్‌ను ఏర్పాటు చేశారు. షెడ్యూల్‌కు ముందు సంప్రదింపుల బాధ్యత... రాజధానిలో ఉన్న హైదరాబాద్ కమిషనరేట్‌ను ఎన్నికల కోణంలో అత్యంత కీలకమైంది. మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి ముందు రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాలు అనేక అంశాలపై నగర పోలీసుల నుంచి నివేదికలు కోరుతుంది. కొన్ని సందర్భాల్లో పోలీసులే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి కొన్ని వివరణలు తీసుకుంటారు. ఇటీవల ఇన్స్పెక్టర్ల బదిలీల అంశంలో అదే జరిగింది. షెడ్యూల్ విడుదలయ్యే వరకు ఎలక్షన్ సెల్ ఈ విధులను నిర్వర్తిస్తుంది. వివరాల సేకరణ, నివేదికల తయారీ సంప్రదింపులు ఇవన్నీ ఎలక్షన్ సెల్ సారథ్యంలోనే జరుగుతున్నాయి. షెడ్యూల్ తర్వాతా కీలకభూమిక... ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక కూడా ఎలక్షన్ సెల్ ఆ ఘట్టాన్ని ప్రశాంతంగా, వివాదరహితంగా పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నగరంలోని పరిస్థితులు ఎప్పటికప్పుడు బేరీజు వేయడానికి, సందర్భానుసారం అవసరమైన చర్యలు తీసుకోవడానికి, అన్ని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండటానికి దీన్ని వినియోగించనున్నారు. కోడ్ అమలులో ఉన్నన్నాళ్లూ ప్రతి రోజూ ఓ డీఎస్ఆర్ (డెరుులీ సిట్యువేషన్ రిపోర్ట్) తయూరు చేసి కమిషనర్‌కు, అవసరమైతే ఎన్నికల సంఘానికి ఈ సెల్ పంపుతుంది. ఈ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు, జోనల్ ఇన్చార్జిలతో అదనపు సీపీ అంజనీకుమార్ మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఈ విభాగం కొనసాగుతుంది. తనిఖీల కోసం ప్రణాళికలు... ఎన్నికల సందర్భంగా అసాంఘిక శక్తులు రెచ్చిపోకుండా, నగదు, మద్యం అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు నగర వ్యాప్తంగా నాకాబందీలు, సోదాలు విస్తృతంగా చేపట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనికోసం డీసీపీలతో పాటు సీసీఎస్, టాస్క్‌ఫోర్స్‌ల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా నగరంలోకి దారితీసే మార్గాలతో పాటు శివార్లపై వీరు దృష్టి పెట్టనున్నారు. బందోబస్తు వ్యూహాల ఖరారు... ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి బందోబస్తుకు అవసరమైన అన్ని చర్యలను ఈ విభాగం ద్వారానే నిర్వర్తిస్తారు. నగరంలోని ఐదు జోన్లలో సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, ఎన్నికల విధుల నిర్వహణ, అవసరమై బలగాల కేటాయింపు, వారికి అవసరమైన వనరులు, సౌకర్యాలు ఏర్పాటు చేయడం వంటి విధులు కూడా ఎన్నికల సెల్ నిర్వహిస్తుంది. ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖలో ఎన్నికల విధుల పనుల పర్యవేక్షణ, రాష్ట్ర, కేంద్ర పోలీసు విభాగాలతో సమన్వయం కోసం ఈ సెల్ పని చేస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ సెల్‌కు ప్రత్యేకంగా ఫోన్ నెంబర్లు కేటాయించాలని భావిస్తున్నారు. -
ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు: సీపీ
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. 20 ఫ్లాటూన్లతో భద్రత ఏర్పాటు చేశామని, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన బుధవారమిక్కడ పేర్కొన్నారు. -
తనిష్క్ లో చోరీ చేసింది కిరణే:సీపీ
హైదరాబాద్: తనిష్క్ బంగారం దుకాణంలో చోరీ చేసింది కిరణ్ అనే యువకుడని సీపీ అనురాగ్ శర్మ తెలిపారు. పోలీసులు గుర్తు పట్టకుండా ఉండేందుకు వికలాంగుడిగా నటించాడని సీపీ తెలిపారు. సీసీ పుటేజ్ ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దుకాణంలో కి ప్రవేశించిన అనంతరం లైట్లను ఆఫ్ చేసి చోరీకి పాల్పడ్డారన్నారని సీపీ తెలిపారు. సీసీ పుటేజ్ లో ఉన్న మరోవ్యక్తి కిరణ్ రూమ్ మేట్ గా తేలిందన్నారు. అతని పేరు ఆనంద్ అని కిరణ్ తెలిపాడన్నారు. ఈ ఘటనలో రూ. 23 కోట్ల విలువైన 30 కిలోల బంగారం చోరీకి గురయిందన్న యాజమాని ఫిర్యాదుతో దర్యాప్తు ఆరంభించామన్నారు. ప్రస్తుతం 5.98 కోట్ల విలువైన 15.97 కిలోల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. నగల దుకాణం యజమాని చెప్పినట్లు చోరీ గురయిన ఆభరణాల విలువ రూ.23 కోట్లు ఉండదన్నారు. చోరీకి పాల్పడిన విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. 24 వ తేదీ అర్ధరాత్రి దుకాణానికి కన్నం పెట్టి చోరీ చేసారన్నారు. చోరీ చేసే సమయంలో పూర్తి జాగ్రత్తలు పాటించారన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదన్నారు. ఆభరణాలను రసూల్ పూర్ లో దాచినట్లు సీపీ తెలిపారు. కాగా బంగారంలోంచి ఒక ఉంగరాన్ని విక్రయించరన్నారు.ఈ చోరీతో సంబంధమున్న ఆనంద్ అనే వ్యక్తి ఇంకా దొరకలేదన్నారు. గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని ఈపూరుకు చెందిన అతడు పోలీసులకు లొంగిపోయే ముందు అతడు ఒక ప్రైవేటు వార్తా చానల్‌తో మాట్లాడాడు. రాత్రి 2 నుంచి 4 గంటల మధ్య చోరీ చేసినట్టు తెలిపాడు. పక్కా ప్రణాళికతో దొంగతనం చేసినట్టు వెల్లడించాడు. చేతులకు, కాళ్లకు ప్లాస్టిక్ కవర్లు తొడుక్కుని వెళ్లినట్టు చెప్పాడు. పోలీసు జాగిలాలు గుర్తించకుండా సంఘటనా స్థలంలో కారంపొడి చల్లినట్టు చెప్పాడు. -
తనిష్క్ జ్యువెలర్స్‌కు ‘కన్నం’
నగరం నడిబొడ్డున.. పంజగుట్టలో తనిష్క్ జ్యువెలర్స్‌కు ‘కన్నం’ లోపల గంటకుపైగా తీరిగ్గా గడిపిన వైనం పక్కా ప్రొఫెషనల్స్ పనేనా? 9 కౌంటర్ల నుంచి రూ.23 కోట్ల విలువైన 30 కేజీల పసిడి తస్కరణ సెక్యూరిటీ గార్డుల నిర్లక్ష్యం సాక్షి, సిటీబ్యూరో: నగరం నడిబొడ్డున, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో భారీ చోరీ జరిగింది. పంజగుట్టలోని తనిష్క్ జ్యువెలర్స్ వెనుక వైపు గోడకు రంధ్రం చేసి ప్రవేశించిన చోరుడు రూ.23 కోట్ల విలువైన 30 కేజీల బంగారం, విలువైన రాళ్లు పొదిగిన నగల్ని మూటగట్టుకుపోయాడు. పక్కా ప్రొఫెషనల్ నేరగాళ్ల పనిగా అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేసును నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్)కు బదిలీ చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ను బట్టి.. దొంగ మొదట స్విచ్ బోర్డు వద్దకు వెళ్లి లైట్లన్నీ ఆర్పాడు. దీన్నిబట్టి అంతకుముందు దుకాణం లోపలి నుంచి కూడా రెక్కీచేశాడా? లేదా తెలిసిన వారు సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన రహదారిపైనే దుకాణం పంజగుట్ట కూడలి నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఫ్లైఓవర్ ముగింపు దగ్గర తేజస్విని ప్లాజా ఉంది. ఇందులో టాటా ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన తనిష్క్ జ్యువెలరీ దుకాణం నిర్వహిస్తున్నారు. ఇది సెల్లార్+జీ+టూ భవనం కాగా... సెల్లార్లో పార్కింగ్, కింది అంతస్తులో బంగారు నగలు, మొదటి అంతస్తులో వజ్రాభరణాల విక్రయ విభాగాలు, రెండో అంతస్తులో సంస్థ పాలనా కార్యాలయం ఉన్నాయి. కింది అంతస్తులోనే ప్రధాన ద్వారం ఉంది. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు షాపు మూసివేశారు. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సంస్థ జనరల్ మేనేజర్ మణికందన్ వచ్చి దుకాణం తెరిచి లోపలకు వెళ్లారు. నగల విక్రయ విభాగంలోని 9 కౌంటర్లలో ఆభరణాలు కనిపించలేదు. వెంటనే పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్కడా ఆధారాలు దొరక్కుండా.. రంధ్రం పరిమాణంతో పాటు ఇతర ఆధారాలను బట్టి పోలీసులు 25-30 ఏళ్ల మధ్య వయస్కుడైన బక్కపలుచని వ్యక్తి లోపలకు వచ్చినట్లు నిర్ధారించారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో చొరబడిన దుండగుడు గంటా పదిహేను నిమిషాల పాటు తచ్చాడుతూ, తీరిగ్గా చోరీ చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. దుండగుడు ఎడమకాలు కుంటుతున్నట్లు గుర్తించారు. ముఖకవళికలు తెలియకుండా మాస్క్, వేలిముద్రలు పడకుండా చేతులకు గ్లౌజులు, పాదముద్రలు చిక్కకుండా కాళ్లకు పాలథిన్ కవర్లు ధరించాడు. రంధ్రంలోంచి లోపలకు వస్తున్నప్పుడు దెబ్బలు తగలకుండా పాదాల పై భాగంలో గోనెసంచులు కట్టుకున్నాడు. లోపల మొత్తం 15 కౌంటర్లు, డిస్ప్లేలు ఉండగా, తొమ్మిది కౌంటర్లలోని బంగారాన్ని ఖాళీ చేశాడు. డిస్ప్లేల జోలికి పోలేదు. పోలీసు జాగిలాలకూ ఆధారం దొరక్కుండా.. వెంట కారం తీసుకెళ్లి, అవి వాసన పీల్చే అవకాశం లేకుండా పలుచోట్ల చల్లాడు. పై అంతస్తులో వజ్రాభరణాలున్నాయని, దుండగుడు అక్కడికీ వెళ్లి ఉంటే చోరీ సొత్తు విలువ భారీగా ఉండేదని పోలీసులు చెప్పారు. దాదాపు 30 కేజీల సొత్తు తస్కరణకు గురైంది. చోరీ తీరును అధ్యయనం చేసిన పోలీసులు.. బయట మరో ఇద్దరైనా కాపు కాసి ఉంటారని అనుమానిస్తున్నారు. రంధ్రం నుంచి ముందు చేతులు పెట్టిన దొంగ ఆ తరవాత తలపెట్టి లోపలకు రావడం సీసీ కెమెరాల్లో నమోదైంది. పోలీసు జాగిలం దుకాణం లోపలకెళ్లి చోరీ జరిగిన భవనం వెనక వైపు తిరిగి అక్కడి నుంచి పక్కనే ఉన్న టోపాజ్ భవనం పక్క సందులోకి వెళ్లింది. ‘పాత కిటికీ’ని పగులగొట్టి లోపలకు.. తేజస్విని ప్లాజాకు వెనుక వైపు ఓ కమర్షియల్/రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉంది. దీని ప్రహరీగోడకు, తేజస్విని ప్లాజా గోడకు మధ్య రెండడుగుల ఖాళీ సందు ఉంది. కాంప్లెక్స్ ప్లాజా కంటే ఎత్తులో ఉండటంతో, దాని గ్రౌండ్ ఫ్లోర్ దీని ఫస్ట్‌ఫ్లోర్‌కు సమాన ఎత్తులో ఉంది. కాగా, జ్యువెలర్స్ నిర్వాహకులు.. భద్రత నిమిత్తం భవనం గోడలకు ఎవరూ రంధ్రం వేయడం సాధ్యం కాకుండా లోపల ఇనుప మెష్‌లు ఏర్పాటు చేశారు. అయితే కింది అంతస్తులోని బంగారం విభాగంలో మూడో పిల్లర్ పక్కన గతంలో కిటికీ ఉండేది. కొన్నేళ్ల క్రితం దీన్ని మూసేయడంతో అక్కడ ఇనుప మెష్ ఏర్పాటుకు ఆస్కారం లేకపోయింది. భవనం ఎడమ వైపు కాంప్లెక్స్‌కు దారితీసే మార్గం నుంచి సందు వరకు చేరుకున్న దుండగుడు.. బయటి వైపు నుంచి పాత కిటికీ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అక్కడే రంధ్రం చేసి లోపలకు చొరబడ్డాడు. పాత నేరగాళ్ల పనిగా అనుమానం.. తనిష్క్ జీఎం మణికందన్ ఇచ్చిన ఫిర్యాదులో ప్లెయిన్, గోల్డ్ ఆర్నమెంట్స్ 18 కిలోలు (విలువ సుమారు రూ.11కోట్లు), కలర్ స్టోన్స్, ముత్యాలు పొదిగిన ఆభరణాలు 12 కిలోలు (విలువ రూ.12 కోట్లు) చోరీ అయినట్టు పేర్కొన్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది పాత నేరగాళ్ల పనిగా అనుమానిస్తున్న అధికారులు నగరం, ఇతర రాష్ట్రాల ముఠాల వివరాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో దొంగ కుంటుతున్నట్లు ఉంది. నిజంగానే అంగవికలుడా? లేక పోలీసుల దృష్టి మరల్చడానికి అలా చేశాడా? అనేది పరిశీలిస్తున్నారు. సీసీఎస్ అధికారులు 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నగరంలోని లాడ్జిలు, హోటళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో దర్యాప్తు చేయడంతో పాటు ఇవి ఇతర ప్రాంతాలకు వెళ్లాయి. పంజగుట్ట ప్రాంతంలోని ట్రాఫిక్ కెమెరాలు, పబ్లిక్ ప్లేసులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, శివార్లలోని టోల్గేట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. సంస్థకు చెందిన వారు చోరులకు సహకరించారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ, డీసీపీ సత్యనారాయణ, అదనపు డీసీపీ నాగరాజు, ఏసీపీ వెంకటనర్సయ్య, సీఐ తిరుపతిరావు, డీఐ సత్తయ్య పరిశీలించారు. అనురాగ్ శర్మ మాట్లాడుతూ... సీసీ కెమెరాల్లోని ఫీడ్ ఆధారంగా నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. నిర్లక్ష్యం ఖరీదు! ఘటనలో సెక్యూరిటీ గార్డుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సమయంలో పూర్తిగా నిద్రపోయి ఉంటారని భావిస్తున్నారు జ్యువెలర్స్‌ను రాత్రి మూసివేసేట ప్పుడు నగలు, బంగారాన్ని కౌంట ర్లు, డిస్ప్లేల్లోంచి తీసి కట్టుదిట్టమైన చెస్ట్‌ల్లో భద్రపరుస్తారు. తనిష్క్ నిర్వాహకులు ఆ పని చేయలేదు రూ.కోట్ల విలువైన సరుకు ఉండే, లావాదేవీలు చేసే ఈ దుకాణం బయట, వెనుక సీసీ కెమెరాల్లేవు పక్కా రెక్కీ చేశాకే చోరీ చేసినట్లు స్పష్టమవుతోంది. ఘటనకు రెండ్రోజుల ముందు దుకాణానికి కస్టమర్లా వచ్చి వెళ్లిన ఓ అనుమానితుడిని సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. ఒకరోజు ముందు ఓ అనుమానితుడు దుకాణం వద్ద తచ్చాడాడని స్థానికులు చెబుతున్నారు శుక్రవారం రాత్రి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు విధుల్లో ఉన్నారు. దుకాణం వెనుక వైపు సందులో గడ్డపారలు, ఇతర వస్తువులతో రంధ్రం చేయడం సాధ్యం కాదు. దీన్నిబట్టి దుండగులు డ్రిల్లింగ్ మిషన్ వాడినట్లు పోలీసులు తేల్చారు. ఈ శబ్దాన్ని సెక్యూరిటీ గార్డులు వినలేదు తొమ్మిది అంగుళాల మందం గల గోడకు 1.5 అడుగుల ఎత్తు, అడుగు వెడల్పుతో రంధ్రం చేశాడు. అంతసేపూ గార్డులు పసిగట్టలేదు ఒక్కో కౌంటర్లోనూ చోరీ తరవాత దొంగ ఆ సొత్తును బయట ఉన్న మరో వ్యక్తికి రంధ్రం ద్వారా అందిస్తున్నట్లు కెమెరాల్లో అస్పష్టంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారమూ సెక్యూరిటీ గార్డులకు తెలియలేదు ఉదయం సంస్థకు వచ్చిన మణికందన్ లోపలకు వెళ్లి గుర్తించే వరకు చోరీ అంశం సెక్యూరిటీ గార్డులకు తెలియలేదు. దొంగలు దుకాణం ముందు కారం చల్లినా గార్డులు గుర్తించలేదు. -
నేటి నుంచి బీఎస్ఎన్ఎల్ బ్యాడ్మింటన్ టోర్నీ
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఆలిండియా బీఎస్ఎన్ఎల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నేటి నుంచి నిర్వహించనున్నారు. మంగళవారం నుంచి 10వ తేదీ వరకు నాలుగు రోజుల ఈ టోర్నీ జరగనుందని బీఎస్ఎన్ఎల్ సీజీఎం వి.శ్రీనివాసన్ తెలిపారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈవెంట్ జరుగుతుంది. ఈ పోటీల్లో రాష్ట్ర బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులతోపాటు అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, కేరళ, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు పాల్గొంటారని సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ ముఖ్యఅతిథిగా విచ్చేసి టోర్నీని ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. -
సాగర్ చుట్టూ ‘నో ఎంట్రీ’
-
సాగర్ చుట్టూ ‘నో ఎంట్రీ’
=న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము 2 గంటల వరకు సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. =ఈ సమయంలో ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. =ఈ సమయంలో భారీ వాహనాలను సైతం సిటీలోకి రానీయరు. జంట కమిషనరేట్ల పరిధిలో ఉన్న అన్ని ఫ్లైఓవర్లను మూసేస్తారు. =సచివాలయం పక్కనున్న మింట్ కాంపౌండ్ లైన్‌ను పూర్తిగా మూసేస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. =వీవీ స్టాట్యూ నుంచి నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్, రాజభవన్ మీదుగా మళ్లిస్తారు. =బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వచ్చే ట్రాఫిక్‌ను ఇక్బాల్ మినార్, లక్డీకాపూల్, అయోధ్య సర్కిల్ వైపు పంపుతారు. =లిబర్టీ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి బీఆర్కే భవన్, తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, లక్డీకాపూల్, అయోధ్య సర్కిల్ మీదుగా మళ్లిస్తారు. =ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను మీరా టాకీస్ లైన్ మీదుగా పంపుతారు. =నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనాలను సంజీవయ్య పార్క్, నెక్లెస్‌రోడ్ పైకి పంపరు. వీటిని కర్బాలా మైదాన్, మినిస్టర్స్ రోడ్ మీదుగా పంపిస్తారు. =సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సెయిలింగ్ క్లబ్ నుంచి కవాడిగూడ చౌరస్తా, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు మళ్లిస్తారు. =డ్రంకన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, ట్రిపుల్‌రైడింగ్ తదితర ఉల్లఘనలపై స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించడానికి ప్రత్యేక బృందాల ఏర్పాటు. =రోడ్ల పక్కన, నో పార్కింగ్ జోన్లో వాహనాలు ఆపితే చర్యలు తప్పవు. -
‘నయాసాల్’ జోష్..పోలీస్ రెడీ
=ప్రత్యేక బృందాల ఏర్పాటు =హద్దు మీరితే చర్యలు =పబ్‌లు, హోటళ్లపై ఆంక్షలు =‘మాజీ డ్రగ్ పెడ్లర్స్’పై ప్రత్యేక దృష్టి =అనుమానిత డీజేలపై ‘మఫ్టీ’ నిఘా సాక్షి, సిటీబ్యూరో: న్యూ ఇయర్ వేడుకలు సాఫీగా సాగిపోయేందుకు నగర పోలీసులు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అంతా ఎంజాయ్ చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. నయా సాల్ సంబరాలు సజావుగా సాగేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని కొత్వాల్ అనురాగ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. స్టాగర్స్ జాబితాలు సిద్ధం వివిధ సందర్భాలు, సమయాల్లో సిటీలోని పబ్స్ కపుల్ ఎంట్రీలను మాత్రమే అనుమతిస్తుంటాయి. దీనిపై పలు సందర్భాల్లో కొందరు యువకులు గుంపులుగా వచ్చి పబ్స్ వద్ద హల్చల్ చేస్తుంటారు. స్టాగ్ గ్యాంగ్స్‌గా పిలిచే వీరు గతంలో చేసిన హంగామాలను బట్టి పోలీసులు ఓ బ్లాక్‌లిస్ట్ తయారు చేశారు. ఇలాంటి వారి కదలికలు, వ్యవహారాలపై డేగకన్ను వేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. పెడ్లర్స్‌కు కట్టడి... న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలో డ్రగ్స్ విక్రయం, వినియోగం పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో రెండు విడతల్లో పట్టుబడిన ముఠాలూ నగరానికి కొకైన్ రవాణా చేసినట్లు బయటపెట్టాయి. నగరంలోని మిగతా నాలుగింటితో పోలిస్తే పశ్చిమ మండలం పూర్తి విభిన్నమైంది. ఇది వీఐపీ జోన్ మాత్రమే కాదు.. ‘ఖరీదైన’ కుర్రకారు జోన్ కూడా. మాదకద్రవ్యాల విక్రయం, వినియోగం సైతం ఇక్కడే ఎక్కువగా సాగుతుంటుంది. సిటీలో చిక్కిన డ్రగ్స్ విక్రేతలు, వినియోగదారుల్లో అనేకమంది వెస్ట్‌జోన్‌లోనే పట్టుబడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అనురాగ్ శర్మ గతంలో మాదకద్రవ్యాలు విక్రయిస్తూ (పెడ్లర్స్) అరెస్టై, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న వారిని కట్టడి చేయాలని ఆదేశించారు. అవసరమైన పక్షంలో వీరందరినీ ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ద్వారా చెక్ చెప్పేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దింపాలని యోచిస్తున్నారు. మరోపక్క కొన్ని పబ్స్‌లోని డీజేలు కూడా పెడ్లర్స్‌గా మారి వ్యవహారాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. వీరిపై నిఘా వేయడానికి మఫ్టీ బృందాలు విధుల్లో ఉండబోతున్నాయి. వీటితో పాటు శాంతి భద్రతల సమస్యలు రాకుండా చూసేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (క్యూఆర్టీ), ఈవ్‌టీజింగ్ కంట్రోలింగ్‌కు ప్రత్యేక బృందాలు మోహరిస్తున్నారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఈ బృందాలన్నీ పని చేస్తుంటాయి. అలాగే న్యూ ఇయర్ నేపథ్యంలో వివిధ సామూహిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న హోటల్స్, పబ్స్ తదితర సంస్థలకు పోలీసులు పలు ఆంక్ష లు విధించారు. ఆంక్షలివీ... కార్యక్రమాలకు వచ్చే ఆర్టిస్టులు, డీజేలకూ నిబంధనలున్నాయి. వీరి వస్త్రధారణ, హావ భావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు. ఏర్పాటు చేసే సౌండ్ సిస్టం నుంచి వచ్చే ధ్వని తీవ్రత 45 డెసిబుల్స్‌కు మించకూడదు. అపార్ట్‌మెంట్స్‌లో వ్యక్తిగత పార్టీలు నిర్వహిస్తున్న వాళ్లూ పక్కవారికి ఇబ్బంది లేకుండా సౌండ్ పెట్టుకోవాలి. మాదకద్రవ్యాలు సేవించి వచ్చే వారినీ హోటల్స్, పబ్స్ నిర్వాహకులు అనుమతించకూడదు. యువతకు సంబంధించి ఎలాంటి విశృంఖలత్వానికి తావు లేకుండా, మైనర్లు పార్టీలకు రాకుండా నిర్వాహకులు చూసుకోవాలి. బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహూతులకు ఇబ్బందులు కలిగించినా వారితోపాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు. ఏసీపీల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేస్తాయి. వీరు కార్యక్రమాల చిత్రీకరణతో పాటు ఆడియో మిషన్ల సాయంతో శ బ్ద తీవ్రతనూ కొలుస్తారు. నెక్లెస్‌రోడ్, కేబీఆర్ పార్క్‌రోడ్, బంజారాహిల్స్ రోడ్ నెం.1, 2, 45, 36లతోపాటు జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 10, సికింద్రాబాద్, మెహిదీపట్నం, గండిపేట దారుల్లో రేసులు, డ్రంకన్ డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చకూడదు. వాహనాల్లో ప్రయాణిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చేస్తే చర్యలు. వాహనాలు టాప్స్, డిక్కీలు ఓపెన్ చేసి డ్రైవ్ చేయడం, కిటికీల్లోంచి టీజింగ్ చేయడం నిషేధం. -
బందోబస్తుల భారంతోనే రిక‘వర్రీ’లు
=సవాళ్లు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొన్నాం =మహిళలపై నేరాల కేసులు పెరిగాయి =నగర కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: ‘జనవరి నుంచి డిసెంబర్ వరకు పండుగలు, ఉద్యమాలు, రాజకీయ కార్యకలాపాల బందోబస్తుల భారం నేపథ్యంలో కేసుల దర్యాప్తులో నగర పోలీసులు పూర్తిస్థాయి దృష్టి పెట్టలేకపోయారు. ఫలితంగానే రికవరీల శాతం గత ఏడాది కన్నా తగ్గింది’ అని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ అన్నారు. మాసబ్‌ట్యాంక్‌లోని పోలీసు ఆఫీసర్స్ మెస్‌లో శనివారం ఏర్పాటు చేసిన వార్షిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర పోలీసులకు సాధారణ డ్యూటీలకు అదనంగా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని అనురాగ్ శర్మ అన్నారు. నగర పోలీసు టెలిఫోన్ డెరైక్టరీతో పాటు క్యాలెండర్‌ను కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంలో ఆయన నగరంలో నమోదైన నేరాలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేశారు. ఆద్యంతం వీధుల్లోనే విధులు... రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు మార్చి 13 నుంచి డిసెంబర్ 19 వరకు మూడు దశల్లో 34 రోజులు జరిగాయి. చలోరాజ్‌భవన్, అ సెంబ్లీ తదితర పిలుపులు, వివిధ రాజకీయ పార్టీల సమావేశాలు, బహిరంగ సభలు, జనవరిలో వచ్చిన మిలాదున్నబీ నుంచి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల వరకు వరుసపెట్టి బందోబస్తుల నేపథ్యంలో పోలీసులు అత్యధిక శాతం రోడ్లపైనే విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. కేసుల్లో తగ్గుదల...కొన్ని నేరాల్లో పెరుగుదల... గతేడాది నగరంలో 18,744 కేసులు నమోదు కాగా... ఈ సంఖ్య ఈ ఏడాది 18,013గా ఉండి తగ్గుదల కనిపించింది. దోపిడీ, బందిపోటు దొంగతనం, ఇళ్లల్లో చోరీలు, దాడులు వంటి కేసుల్లో తగ్గుదల ఉన్నా... సాధారణ చోరీలు, కిడ్నాప్‌లు, లైంగికదాడులు పెరిగాయి. మొత్తమ్మీద ఈ ఏడాది రూ.42,66,50,191 విలువైన సొత్తు చోరీ కాగా... కేవలం రూ.16,30,84,642 మాత్రమే రికవరీ అయింది. గతేడాది రికవరీల శాతం 51.26 శాతం ఉండగా ఈ ఏడాది 38.22 శాతానికి పడిపోయింది. మహిళలూ ముందుకొచ్చి ఫిర్యాదు... సైబరాబాద్‌లో మహిళలు బాధితులుగా ఉన్న నేరాల సంఖ్య గతేడాది కంటే ఈ ఏడాది పెరిగింది. 2012లో 1823 కేసులు నమోదు కాగా... ఈ ఏడాది 2124కు చేరింది. మహిళల్లో పెరిగిన అవగాహనతో పాటు పోలీసుస్టేషన్లలో లేడీ హోమ్‌గార్డుల్ని రిసెప్షనిస్టులుగా నియ మించడం తదితర చర్యల కారణంగా వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని, అందుకే ఈ సంఖ్యలో పెరుగుదల కనిపిం చిందని కమిషనర్ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. సైబర్ నేరాల్లోనూ 360 శాతం పెరుగుదల న మోదు కావడానికీ అవగాహనే కారణమన్నారు. సిబ్బంది సంఖ్యతో ఇబ్బందే... నగర కమిషనరేట్‌కు కేటాయించిన పోస్టుల సంఖ్య 12,401 కాగా ప్రస్తుతం 8554 మందే అందుబాటులో ఉన్నారు. మిగిలిన 3847 (32 శాతం) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బందోబ స్తు, లా అండ్ ఆర్డర్ డ్యూటీలకు తోడు సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటంతో ఎన్నో ఇబ్బం దులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల రిక్రూట్మెంట్ చేసుకున్న 2070 మంది అభ్యర్థులు మరో ఏడాదిలో శిక్షణ పూర్తి చేసుకుని వస్తే ఈ సమస్య కొంత వరకు తీరనుంది. భద్రత కోసం సీసీసీ, సేఫ్ సిటీ ప్రాజెక్ట్... నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు, సీసీఎస్ అధికారులు నేరాలు నిరోధించడానికి, కేసులు కొలిక్కితేవడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని కొత్వాల్ చెప్పారు. సిటీ సెక్యూరిటీ వింగ్ అధికారులు ఏడాదిలో 41,579 ప్రాంతాల్లో తని ఖీలు చేయడంతో పాటు 43 బోగస్ ఫోన్‌కాల్స్ కూ స్పందించారన్నారు. భద్రతా చర్యల్లో భా గంగా నగర కమిషనరేట్‌లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) ఏర్పాటు చేసి నగరంలోని 335 సీసీ కెమెరాలతో అనుసంధానించామన్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్టు కిందా అనేక ప్రతి పాదనల్ని కేంద్రానికి పంపామన్నారు. తగ్గిన ప్రమాదాలు, మరణాలు... నగర ట్రాఫిక్ విభాగం అధికారులు తీసుకుంటున్న చర్యల ఫలితంగా రోడ్డు ప్రమాదాల సంఖ్యతో పాటు మృతుల సంఖ్యా గణనీయం గా తగ్గిందని కమిషనర్ చెప్పారు. జరిమానా మొత్తాల్ని పెంచి వసూలు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడే వారి సంఖ్య తగ్గుతోంద న్నారు. ఈ ఏడాది మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిలో అత్యధికంగా 1181 మందికి జైలు శిక్ష పడిందని వివరించారు. ఇదీ విజన్ 2014... ప్రజలకు మరింత చేరువై, ఆశించిన విధంగా పని చేయడమే వచ్చే ఏడాది తమ లక్ష్యమని కమిషనర్ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. నేరాల్ని త్వరిగతిన పరిష్కరించడం పైనే దృష్టి పెట్టామన్నారు. నగర వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయడంతో పాటు మతసామరస్యాన్ని కాపాడతామన్నారు. ప్రతి జోన్‌కు ఓ మహిళా ఠాణా ఉండేలా మరో రెండింటి కోసం ప్రయత్నిస్తామని, పెండింగ్‌లో ఉన్న కొత్త ఠాణాల ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం పొందటంపైనా దృష్టి పెడతామన్నారు. -
సిటీ పోలీసులతో పోలో టీమ్
= పోలీసు మీట్స్‌లో పాల్గొనేందుకు తర్ఫీదు = స్టేబుల్స్ ప్రారంభోత్సవంలో వెల్లడించిన కొత్వాల్ సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనరేట్ తరఫున అశ్వక దళం నుంచి ఎంపిక చేసిన వారితో పోలో టీమ్‌ను తయారు చేయనున్నట్లు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ సోమవారం వెల్లడించారు. గోషామహల్లో ఉన్న మౌంటెడ్ పోలీసు (అశ్వక దళ) కార్యాలయంలో కొత్తగా నిర్మించిన గుర్రపు శాలల (స్టేబు ల్స్) ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భం గా కొత్తగా వచ్చి చేరిన పది గుర్రాలను ఈ విభాగానికి అందించారు. నగర పోలీసు కమిషనర్‌గా అనురాగ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆయన భార్య మమత అనురాగ్ శర్మ అధికారిక కార్యక్రమానికి విచ్చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న స్టేబుల్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్వాల్ మాట్లాడుతూ నగర అదనపు పోలీసు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఆయన కృషి వల్లే 10 కొత్త గుర్రాలు సైతం నామమాత్రపు ధరకు సమకూరాయి. వీటికి అవసరమైన శిక్షణను ఇవ్వనున్నాం. మౌంటెడ్ పోలీసుకు కేటాయించిన గుర్రాల సంఖ్య 40 కాగా ప్రస్తుతం 29 ఉన్నాయి. మిగిలిన వాటినీ దశల వారీగా సమకూర్చుకుంటాం. ఆలిండియా పోలీసు డ్యూటీ మీట్స్/స్పోర్ట్స్ మీట్స్‌లో పాల్గొనేందుకు సిటీ పోలీసు తరఫున పోలో టీమ్‌ను తయారు చేస్తాం’ అని అన్నారు. అనురాగ్ శర్మ భార్య మమత అనురాగ్ సైతం పోలీసు అధికారిణే. నగరానికి చెందిన మమత ఆయనతో పాటే 1982లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. వెస్ట్ బెంగాల్ క్యాడర్‌కు ఎంపికైనా ఆ తరవాత ఆంధ్రప్రదేశ్‌కు ఎలాట్ అయ్యారు. వివిధ హోదాల్లో పని చేసి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. మమత అనురాగ్ మాట్లాడుతూ ‘ఈ గుర్రాలను చూస్తుంటే మరోసారి ఫిట్నెస్ సంపాదించి గుర్రపు స్వారీ చేయాలని ఉంది’ అన్నారు. వివిధ డ్యూటీ/స్పోర్ట్స్ మీట్స్‌లో పాల్గొని పతకాలు సాధించిన పోలీసులకు ప్రస్తుతం లభిస్తున్న నామమాత్రపు ప్రోత్సాహకాలు భారీగా పెరగనున్నాయని అదనపు డీజీ (క్రీడలు) రాజీవ్ త్రివేది అన్నారు. స్వర్ణ పతకం సాధిస్తే రూ.3 లక్షలు రివార్డు, మూడు ఇంక్రిమెంట్లు, కాంస్య పతకానికి రూ.2 లక్షలు, రెండు ఇంక్రిమెంట్లు, రజతానికి రూ.లక్ష, ఒక ఇంక్రిమెంట్ ఇచ్చే ప్రతిపాదనతో కూడిన ఫైల్ ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందన్నారు. సిటీ పోలీసులూ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని మంచి పేరు తేవాలని కోరారు. క్రైమ్ సమాచారం ఐపాడ్స్లో... ఈ కార్యక్రమంలో నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న డీసీపీ స్థాయి అధికారులకు కమిషనర్ అనురాగ్ శర్మ ఐపాడ్స్ అందించారు. వీటిలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేయనున్నారు. అందులో ఉన్న ఫార్మట్ ప్రకారం కేసులు, దర్యాప్తు తీరుతెన్నుల్ని అధికారులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సమీక్ష సమావేశాలకు అధికారులు హాజరవుతున్నప్పుడు అంతా ఒకే రకంగా నివేదికలు రూపొందించట్లేదని కమిషనర్ గుర్తించారు. దీనికి పరిష్కారంగానే ఐపాడ్స్ అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల డీసీపీలు అవసరమైన సమాచారాన్ని ప్రతి రోజూ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఓ అధికారి తెలిపారు. -
రాష్ట్రపతి పర్యటన..ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో బస చేసిన దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ మంగళవారం గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్‌లో జరిగే విందుకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ అనురాగ్‌శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని ఆయన కోరారు. పరిస్థితుల్ని బట్టి ఆ సమయాల్లో, ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడమో, పూర్తిగా ఆపడమో జరుగుతుందన్నారు. రాత్రి 7.20- 8.10 మధ్య... బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం-మల్లారెడ్డినగర్-లోతుకుంట వై జంక్షన్-ఎసీఈఎంఈ సిగ్నల్-లాల్‌బజార్ టి జంక్షన్-హోలీఫ్యామిలీ చర్చ్-తిరుమలగిరి చౌరస్తా -ఆర్టీఏ ఆఫీస్-హనుమాన్ టెంపుల్-కార్ఖానా లా అండ్ ఆర్డర్ పోలీసుస్టేషన్-విక్రమ్‌పురిలోని ఆక్సిజన్ ఆసుపత్రి-సికింద్రాబాద్ క్లబ్ ఇన్‌గేట్-ఎన్సీసీ డెరైక్టరేట్ చౌరస్తా -టివోలీ ఎక్స్ రోడ్-ప్లాజా చౌరస్తా-సీటీఓ ఫ్లైఓవర్-రసూల్‌పుర చౌరస్తా-పీఎన్టీ జంక్షన్-బేగంపేట ఫ్లైఓవర్-గ్రీన్లాండ్స్ చౌరస్తా-మొనప్ప ఐలాండ్-యశోద ఆస్పత్రి-విల్లామేరీ కళాశాల-ఎంఎంటీఎస్ స్టేషన్-రాజ్‌భవన్. విందు పూర్తయిన తరవాత రాష్ట్రపతి తిరిగి వె ళ్లే సమయంలోనూ ఆంక్షలు అమలులో ఉంటాయి. మళ్లింపులు ఈ ప్రాంతాల్లో.. ఏఓసీ సెంటర్ నుంచి ఎయిర్టెల్ వైపు వెళ్లే వాహనాలను లక్ష్మీనగర్ నుంచి జేబీఎస్ మీదుగా మళ్లిస్తారు. అమ్ముగూడ బాలాజీనగర్, నాగదేవత దేవాలయం వైపు నుంచి లాడ్ బజార్ వైపు వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్కే పురం వైపు పంపిస్తారు. -
'కోర్టు ఆదేశాల మేరకే సల్మాన్‌పై కేసు నమోదు చేశాం'
హైదరాబాద్: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌పై కోర్టు ఆదేశాల మేరకే కేసు నమోదు చేశామని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. బిగ్‌బాస్ టీవీ రియాల్టీ షోలో ఆయన ముస్లింల మనోభావాలను కించపరిచేలా మాట్లాడారంటూ ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు దర్శకుడు రజత్ రవాలీపై కూడా కేసు నమోదైంది. కాగా, న్యాయ నిపుణల అభిప్రాయం తీసుకున్నాక తదుపరి చర్యలు తీసుకుంటామని అనురాగ్ శర్మ తెలిపారు. మహ్మద్ ఫసీహుద్దీన్ అనే వ్యాపారవేత్త బిగ్‌బాస్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా కోరుతూ ఆరో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. ముస్లింల మనోభావాలను కించపరిచేలా ఆ షో ఉందని ఆయన తెలిపారు. అందులోనే సల్మాన్‌ఖాన్, దర్శకుడు రజత్ రవాలీల విషయాన్ని కూడా ఆయన పేర్కొన్నారు. సల్మాన్‌ఖాన్ బిగ్‌బాస్‌లో పాల్గొంటున్నవారిని వారి ప్రదర్శన ఆధారంగా స్వర్గానికి, నరకానికి పంపుతాడని, ఆ రెండూ ముస్లింలకు చాలా పవిత్ర పదాలని తెలిపారు. దీంతో పిటిషన్‌ను విచారించిన కోర్టు, కేసు నమోదు చేయాలని ఫలక్‌నుమా పోలీసులను ఆదేశించింది. -
రాష్ట్రపతి నిలయానికి భారీ బందోబస్తు
బొల్లారం, న్యూస్‌లైన్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తొలిసారిగా హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఆయన ప్రత్యేక విమానం ల్యాండ్ కానుంది. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు తరలి రానున్నారు. గురువారం సాయంత్రం 5.15 గంటలకు రాష్ట్రపతి విమానం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో దిగనుంది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆయనను తీసుకువచ్చే వాహనాలతో బుధవారం మధ్యాహ్నం రూటు రిహార్సల్‌ను అధికారులు నిర్వహించారు. రాష్ట్రపతి నిలయం నుంచి ఎయిర్‌ఫోర్స్ స్టేషన్, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి రాష్ట్రపతి నిలయం వరకు కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. హైదరబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ, అడిషనల్ కమిషనర్ అంజనికుమార్, ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అమిత్‌గార్గ్, సంయుక్త కమిషనర్ (స్పెషల్ బ్రాంచ్) బి.మల్లారెడ్డి డీసీపీ జయలక్ష్మి, ఇతర పోలీసు, ఆర్మీ ఉన్నతాధికారులు బందోబస్తుతో పాటు ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ప్రణాళికలు రూపొందించారు. ఉన్నతాధికారుల కాకుండా 750 మంది సిబ్బందిని రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో మోహరించారు. ఆర్మీ, పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు స్పెషల్ బ్రాంచి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. నేడు ట్రాఫిక్ ఆంక్షలు రాష్ట్రపతి గురువారం హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం 5.15 గంటలకు హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఆయన ప్రత్యేక విమానం దిగనుంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ కింద తెలిపిన ప్రాంతాల మీదుగా ప్రయాణించే వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకోవాలని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అమిత్‌గార్గ్ కోరారు. ఆంక్షలున్న ప్రాంతాలివే: ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ‘వై’ జంక్షన్-ఎయిర్‌ఫోర్స్ బెటాలియన్ 2,3 గేట్లు-బొల్లారం చెక్‌పోస్ట్-సహేజ్ ద్వార్-ఈఎంఈ సెంటర్ వద్ద ఉన్న జేసీఓ మెస్, ఫస్ట్ బెటాలియన్-పంప్ హౌస్-బిసిన్ ఎన్వైర్మెంట్ పార్క్-బిసిన్ హెడ్ క్వార్టర్స్ మెయిన్ గేట్- యాప్రాల్-బిసిన్ బేకరీ ఎక్స్టెన్షన్- నేవీహౌస్ జంక్షన్- ఆంధ్రా సబ్-ఏరియా ఆఫీసర్స్ మెస్- ఆర్ఎస్సై జంక్షన్- ఈఎంఈ సెంటర్ హౌస్-గేట్ నెం.3, 2, 1- రాష్ట్రపతి నిలయం మెయిన్‌గేట్. -
ఎంవీఐపై చీటింగ్ కేసు
=కానిస్టేబుల్ ఉద్యోగాల ఎర..రూ.5 కోట్లు వసూలు =23 జిల్లాల్లోని 98 మంది హోంగార్డులకు టోకరా =హైదరాబాద్ సీసీఎస్‌లో బాధితుల ఫిర్యాదు సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రవాణా శాఖలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ)గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారిపై హైదరాబాద్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అతని వద్ద పనిచేస్తున్న మరో నలుగురు హోంగార్డులను సైతం నిందితులుగా చేర్చారు. ఆర్టీఏలో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని అదే సంస్థలో పనిచేస్తున్న 98 మంది హోంగార్డులను నమ్మించి సుమారు రూ.5 కోట్లు వసూలు చేసి మోసగించారని ఎంవీఐపై ఆరోపణ. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన కొందరు హోంగార్డులు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేయడంతో సీసీఎస్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన భీంరావు అదే జిల్లాలో కత్తిపూడి చెక్‌పోస్టు వద్ద రవాణా శాఖలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం మోసానికి తెర లేపాడు. రవాణా శాఖలో 23 జిల్లాల్లో పనిచేస్తున్న సుమారు 98 మంది హోంగార్డులకు నేరుగా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. తనకు ప్రభుత్వ పెద్దలతో పరిచయం ఉందని నేరుగా ప్రత్యేక జీవోను విడుదల చేసి తద్వారా కానిస్టేబుల్‌గా పదోన్నతులు కల్పిస్తానని కూడా నమ్మించాడు. అందుకు ఒక్కొక్కరు రూ.5 లక్షలు ఇవ్వాలని బేరం పెట్టాడు. అతని వలలో పడ్డ అన్ని జిల్లాల హోంగార్డులు అధికారి అడిగిన దాంట్లో విడతల వారీగా ఒక్కొక్కరు రూ.4 లక్షల చొప్పున చెల్లించారు. ఇక హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న 13 మంది హోంగార్డులు బెల్సన్ తాజ్ హోటల్లో భీంరావుకు ఒకసారి రూ.20 లక్షలు మరోసారి రాజమండ్రిలోని అతని గెస్ట్‌హౌస్‌లో అతని వద్ద విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు మస్తాన్‌రావు, కృష్ణ, సత్తిబాబు, రాజేష్‌లకు మరో రూ.20 లక్షలు, భీంరావుకు మూడు విడతలుగా రూ.12 లక్షలు ఇచ్చారు. ఇలా అన్ని జిల్లాల హోంగార్డుల నుంచి అతను సుమారు రూ.5 కోట్లు వసూలు చేశాడు. సంవత్సరాలు గడుస్తున్నా కానిస్టేబుల్ ఉద్యోగాలు రాకపోవడంతో ఒక్కో జిల్లా నుంచి హోంగార్డులు పలుమార్లు భీంరావుకు ఫోన్‌చేసి తమ బాధను వెళ్లబోసుకునేవారు. అయినా అతను రేపుమాపు అంటూ దాటవేస్తూ వచ్చాడు. అనుమానం వచ్చిన ఆయా జిల్లాల హోంగార్డులు రెండు నెలల నుంచి రాజమండ్రిలోని అతని నివాసానికి రావడం మొదలు పెట్టడంతో వారికి చిక్కకుండా తిరిగాడు. అతను విధులు నిర్వహిస్తున్న కత్తిపుడి చెక్‌పోస్టుకు వెళ్లితే అక్కడ కూడా కనిపించ లేదు. అతనికి ఫోన్ చేసి వేడుకుంటే తన ఇంటికి వస్తె ఎస్సీఎస్టీ కేసులు బుక్ చేయిస్తానని హోంగార్డులను బెదిరించాడు. దీంతో హోంగార్డులు అతని ఇంటికి వెళ్లడం మానేశారు. ఏం చేయాలో తెలియక తమలో తాము కుమిలిపోయారు. అప్పుగా తెచ్చిన డబ్బుకు వస్తున్న హోంగార్డు జీతం మొత్తం మిత్తీలకు పోతున్నాయని బాధపడ్డ పలువురు హోంగార్డులు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మను కలిసి ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు ఎంవీఐ భీంరావుతో పాటు అతనికి సహకరించిన హోంగార్డులు మస్తాన్‌రావు, కృష్ణ, సత్తిబాబు, రాజేష్‌లపై బుధవారం చీటింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
అసెంబ్లీకి 2కి.మీ పరిధిలో ఆంక్షలు : సీపీ
హైదరాబాద్ : శాసనసభ శీతాకాల సమావేశాలు సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. అసెంబ్లీకి రెండు కిలోమీటర్ల పరిధి వరకూ ఆంక్షలు విధించినట్లు ఆయన మంగళవారమిక్కడ చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఏపీ ఎన్జీవోల అసెంబ్లీ ముట్టడిపై సమాచారం లేదని ఆయన తెలిపారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ప్రత్యేక ఫోర్స్‌తో భద్రతను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. -
అసెంబ్లీకి గతంలో కంటే ఎక్కువ భద్రత: సీపీ
హైదరాబాద్ : శాసనసభ భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో డీజీపీ ప్రసాదరావు, ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ విలేకర్లతో మాట్లాడుతూ అసెంబ్లీకి గతంలో కంటే ఎక్కువ భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలు మోహరిస్తామని ఆయన తెలిపారు. సమావేశాల సమయంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు అనురాగ్ శర్మ పేర్కొన్నారు. ఈనెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. విభజన బిల్లు అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలను మూడు రోజులకు మించి నిర్వహించకూడదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ లెక్కన ఈ నెల 12న (గురువారం) అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి 15న (శనివారం) ముగించాలని షెడ్యూల్ రూపొందించుకున్నారు. విపక్షాలు గట్టిగా పట్టుపడితే మరో రోజు (అవసరమైతే ఆదివారం కూడా సభను కొనసాగించేలా) పొడిగించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. స్వల్పకాల వ్యవధిలోనే విభజన బిల్లుపై అందరి అభిప్రాయాలు తీసుకుని రాష్ట్రపతికి పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది -
ఫలించిన పోలీసు వ్యూహం
=ప్రశాంతంగా ముగిసిన ‘డిసెంబరు 6’ =మొఘల్‌పుర ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత =నిర్మానుష్యమైన పాతబస్తీ రహదారులు =అప్రమత్తత కొనసాగుతుంది: కమిషనర్ సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో బాబ్రీ మసీదు కూల్చివేత రోజైన ‘డిసెంబర్ 6’ ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం నగర వ్యాప్తంగా.. అడుగడుగునా పోలీసులే కనిపించారు. డిసెంబర్ 6 నేపథ్యంలో శుక్రవారం పాతబస్తీలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. దీంతో మధ్యాహ్నం వరకు వీధులన్నీ నిర్మానుష్యంగా మారి సెలవును తలిపించారుు. ఆ తర్వాత నెమ్మదిగా జనజీవనం సాధారణ స్థితికి వచ్చింది. ఇత ర విభాగాలకు చెందిన పోలీసులు బందోబస్తు విధులతో తలమునకలవగా... ట్రాఫిక్ పోలీసులు వాహనాల మళ్లింపులపై దృష్టి పెట్టారు. డీజేఎస్ సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న మొఘల్‌పురలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన డీజేఎస్ అధినేత మాజిద్ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన డీజేఎస్ కార్యకర్తలు, సానుభూతిపరులు 20 మంది వరకు ఉండగా... పోలీ సులు, విలేకరులు మాత్రం 80 మందికి పైగా ఉన్నారు. తూర్పు మండలంలోని సైదాబాద్లోనూ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పాతబస్తీతో పాటు తూర్పు, పశ్చిమ మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన నగర కమిషనర్ అనురాగ్ శర్మ ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సాయుధ బలగాలను మోహరించారు. గురువారం రాత్రి నుంచి తనిఖీలు నిర్విరామంగా జరి గారుు. పాతబస్తీలో ఎలాంటి నిరసన, వివాదం తలెత్తినా రాళ్లు రువ్వడం ప్రధాన సమస్యగా మారుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుకున్న పోలీసులు మున్సిపల్ అధికారుల సహాయంతో మూడు రోజుల ముందు నుంచీ రోడ్లకు ఇరువైపులా ఉండే రాళ్లను తొలగించారు. భద్రతా చర్యల్లో భాగంగా కీలకమైన అన్ని ప్రాంతాలలో తనిఖీలు, గస్తీ ముమ్మరం చేశారు. ప్రధాన వీధులలో నిరసన ర్యాలీ లు, నల్ల జెండాల ఏర్పాటు లేకుండా పక్కా చర్యలు తీసుకున్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా అదనపు బలగాలను మోహరించారు. మక్కా మసీదులో మధ్యాహ్న ప్రార్థనల అనంతరం మొఘల్‌పుర ఫైర్ స్టేషన్ వద్ద కొందరు యువకులు నినాదాలు చేయడంతో పాటు రాళ్లు రువ్వారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు, కొందరు అగ్నిమాపకశాఖ అధికారులతో పాటు దాదాపు ఏడుగురు గాయపడ్డారు. నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చార్మినార్ పోలీసుస్టేషన్ వద్ద విలేకరులతో మాట్లాడారు. పాతబస్తీ సహా నగర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని చెప్పారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న గస్తీ, తని ఖీలను కొనసాగిస్తామన్నారు. సిటీలో శాంతి భద్రతలకు కాపాండేందుకు అంతా సహకరించారని, పీస్ కమిటీలు చేసిన కృషి తమకు ఎంతగానో ఉపకరించిందన్నారు. పాత నగరంలో శుక్రవారం జరిగిన అల్లర్లకు సంబంధించి మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌లో 3 కేసులు నమోదయ్యాయి. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. -
ఏటీఎం సెంటర్లలో ప్యానిక్ అలారం
=తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్న పోలీసులు =మరికొన్ని విధివిధానాలు ఖరారు =నెల రోజుల గడువిచ్చాం : కొత్వాల్ అనురాగ్ శర్మ సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరు ‘ఏటీఎం ఉదంతం’తోపాటు నగరంలో బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద వరుసగా చోటు చేసుకుంటున్న చోరీలు, దోపిడీల నేపథ్యంలో ఏటీఎంల వద్ద భత్రతా చర్యలపై నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ బుధవారం బ్యాంకు అధికారులతో సమావేశమయ్యారు. కమిషనరేట్‌లో జరిగిన ఈ సమావేశంలో వివిధ బ్యాంకులకు చెందిన అధికారులతో పాటు అదనపు కమిషనర్లు అంజనీ కుమార్ (శాంతిభద్రతలు), సందీప్ శాండిల్య (నేరాలు), సంయుక్త కమిషనర్ (స్పెషల్‌బ్రాంచ్) బి.మల్లారెడ్డి పాల్గొన్నారు. ఇందులో బ్యాంకు అధికారులకు పోలీసులు చేసిన సూచనలివీ... ఏటీఎం కేంద్రాల్లో ‘ప్యానిక్ అలారం’ ఏర్పాటు చేయాలి. లోపల ఉన్న వినియోగదారుడు ఏవైనా అనుమానాస్పద పరిణామం గమనిస్తే దీన్ని మోగిస్తే అంతా అప్రమత్తం అవుతారు. ఈ కేంద్రాలకు ముందు భాగంలో ఉండే అద్దాలు పూర్తి పాదర్శకంగా ఉండి, లోపల ఏం జరుగుతోందో బయటి వ్యక్తులకు కనిపించేలా ఏర్పాటు చేయాలి. వీటి షట్టర్లు పటిష్టంగా ఉండటంతో పాటు సాధారణ వ్యక్తులు ఎప్పుడు పడితే అప్పుడు కిందికి లాగే అవకాశం లేకుండా ఏర్పాటు చేయాలి. ఏటీఎం కేంద్రం, బ్యాంకుల లోపల, బయట కచ్చితంగా సీసీ కెమెరా ఉండాలి. అది పూర్తి క్వాలిటీతో లోపలికి వచ్చే, బయటకు వెళ్లే వారిని స్పష్టంగా చిత్రీకరించే దిశలో ఏర్పాటు చేయాలి. పబ్లిక్ అడ్రస్‌సిస్టం ఏర్పాటు చేసుకుని ఖాతాదారులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ అప్రమత్తం చేయాలి. బ్యాంకులతో పాటు ఏటీఎం కేంద్రాల వద్దా కచ్చితంగా సెక్యూరిటీ గార్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. వీరు సుశిక్షుతులై ఉండేలా చూడాలి. పోలీసు అధికారులు సైతం తమ పరిధిలోని బ్యాంకులను నిత్యం సందర్శిస్తూ అవసరమైన సహాయసహకారాలు, సూచనలు అందించాలి. నెల రోజుల గడువిచ్చాం : అనురాగ్ శర్మ ‘బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల భద్రతను పటిష్టం చేయడంతో పాటు నేరాల నివారణ కోసం బ్యాంకు అధికారులకు అనేక సూచనలు చేశాం. వీటిని కచ్చితంగా అమలు చేయాలని కోరాం. నెల రోజుల పాటు గడువు ఇచ్చాం. అప్పటి లోగా అమలు కాకుంటే చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’. -
ఏటీఎం సెంటర్ల వద్ద గస్తీ ముమ్మరం: అనురాగ్ శర్మ
హైదరాబాద్‌లోని ఏటీఎం సెంటర్ల వద్ద గస్తీని ముమ్మరం చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. నగరంలోని ప్రతి ఏటీఎం వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఏటీఎంల వద్ద పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని బ్యాంకులకు సూచించామని అనురాగ్ శర్మ తెలిపారు. బెంగళూరు నగరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలే ఏటీఎంలో మహిళపై దాడి జరిగిన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ స్పందించారు. బెంగళూరులో ఏటీఎం సెంటర్లో డబ్బు తీసుకోవడానికి వెళ్లిన మహిళపై ఒక ఆగంతకుడు విచక్షణా రహితంగా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. -
సమైక్య శంఖారావం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని తెలిపారు. మరోపక్క స్టేడియం లోపలకు ప్రవేశించి ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలకు ప్రత్యేక ప్రవేశాలు కేటాయించారు. మళ్లింపులు ఇలా... నాంపల్లి, పోలీసు కంట్రోల్‌రూమ్‌ల వైపు నుంచి వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ చౌరస్తా నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు అనుమతించరు. సుజాత స్కూల్, చర్మాస్‌ల వైపు నుంచి వచ్చే వాహనాలు బీజేఆర్ స్టాట్యూ వైపు అనుమతించరు. వీటిని గన్‌ఫౌండ్రి ఎస్బీహెచ్ నుంచి అబిడ్స్ వైపు పంపిస్తారు. సిమెట్రీ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ చౌరస్తా నుంచి హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ వైపు పంపిస్తారు. రాజ్‌మొహల్లా రోడ్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వచ్చే వాహనాలను సిమెట్రీ నుంచి మళ్లిస్తారు. బొగ్గులకుంట, తాజ్ మహల్, ఈడెన్‌గార్డెన్స్, కింగ్ కోఠి వైపు నుంచి వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ వైపు అనుమతించరు. వీటిని కింగ్ కోఠి క్రాస్‌రోడ్స్ నుంచి అబిడ్స్ తాజ్‌మహల్ హోటల్ వైపు మళ్లిస్తారు. అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి బషీర్‌బాగ్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను లిబర్టీ చౌరస్తా నుంచి హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు. రవీంద్రభారతి, నాంపల్లి వైపుల నుంచి వచ్చే వాహనాలను ఓల్డ్ కంట్రోల్‌రూమ్ మీదుగా బషీర్‌బాగ్ వైపు అనుమతించరు. సాధారణ వాహనచోదకులు స్టేడియానికి నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉన్న మాసబ్‌ట్యాంక్, వీవీ స్టాట్యూ, ట్యాంక్‌బండ్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఏంజే మార్కెట్ మార్గాలను ఎంచుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నగర పోలీసులు విధించిన ఆంక్షలకు నగరవాసులు, సభకు తరలి వచ్చే వారు సహకరించాలని పోలీసులు కోరారు. నిబంధనలను కచ్చితంగా పాటించి కార్యక్రమం ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించాలని సూచించారు. -
సమైక్య సభకు పటిష్ట బందోబస్తు: అనురాగ్ శర్మ
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం నిర్వహించనున్న బహిరంగ సభకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సిటీ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. అదనపు పోలీసు కమిషనర్(శాంతిభద్రతలు) అంజనీకుమార్, సంయుక్త పోలీసు కమిషనర్ (స్పెషల్‌బ్రాంచ్) బి.మల్లారెడ్డిలతో కలసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. భద్రత ఏర్పాట్ల కోసం నగర పోలీసు సిబ్బందితో పాటు 34 ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలు, 16 కంపెనీల కేంద్రసాయుధ బలగాలు, 1800 మంది సివిల్ పోలీసుల్ని మోహరిస్తున్నామని అనురాగ్ శర్మ వెల్లడించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక రూట్లు, పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఎవరికీ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ‘ఈ సభను మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించుకోవడానికి అనుమతిచ్చాం. ఏపీఎన్జీవోల సభ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని.. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నాం. ఏపీఎన్జీవోల సభకు హాజరయ్యేవారు గుర్తింపుకార్డుల్ని కచ్చితంగా చూపాల్సి ఉండటంతో స్టేడియం లోపలికి కేవలం రెండు గేట్ల ద్వారానే అనుమతించాం. అయితే వైఎస్సార్సీపీది పబ్లిక్ మీటింగ్ కావడంతో దాదాపు అన్ని గేట్లనూ తెరిచి అనుమతిస్తాం. సభకు లక్షల్లో జనం వస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేపడుతున్నాం. ఓయూజాక్ సహా మరే ఇతర సంఘాలు సభను అడ్డుకునే విషయంపై మావద్ద ప్రత్యేకంగా ఏ సమాచారం లేదు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చిన్న చిన్న ఘటనలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాం’ అన్నారు. -
సమాజానికి 24 గంటలు సేవ చేసేవారే పోలీసులు
హైదరాబాద్ : సమాజానికి 24 గంటలు సేవ చేసేవారే పోలీసులు అని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ హాజరయ్యారు.విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. అనంతరం అనురాగ్ శర్మ మాట్లాడుతూ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 576మంది పోలీసులు వివిధ సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయారన్నారు. వారి త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. శత్రువులతో పోరాడి అమరులు అవుతున్న సైనికులకు లభిస్తున్న గుర్తింపు ...విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు లభించటం లేదన్నారు. -
'సమైక్య శంఖారావానికి అనుమతి ఇవ్వండి'
హైదరాబాద్ : ఈనెల 19న ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ విజ్ఞప్తి చేశారు. ఎల్బీస్టేడియంలో సభకు ఇప్పటికే శాప్ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నామని వారు ఈ సందర్భంగా కమిషనర్‌కు వివరించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శాంతియుత మార్గంలోనే సభ జరుగుతుందని తెలిపారు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ హామి ఇచ్చారని నేతలు తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సమైక్యరాష్ట్రం కోసం వైఎస్సార్సీపీ భారీ సభను ఈనెల 19న నిర్వహించనున్న విషయం తెలిసిందే. సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇవ్వాలని ఈనెల 4వ తేదీన డీజీపీ ప్రసాదరావుని వైఎస్ఆర్ సీపీ నేతలు కలిశారు. -
'సమైక్య శంఖారావానికి అనుమతి ఇవ్వండి'
-
‘సకల’ సన్నాహాలు
సాక్షి, సిటీబ్యూరో: మధ్య మండలంలోని నిజాం కాలేజీ మైదానంలో ఆదివారం టీజాక్ నేతలు తలపెట్టిన సకల జనుల భేరీకి నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గ్రౌండ్స్‌తోపాటు దాని చుట్టూ, పరిసర ప్రాంతాల్లో దాదాపు 3 వేల మంది పోలీసుల్ని మోహరించనున్నారు. బందోబస్తు, భద్రత విధుల్లో నగర పోలీసులతో పాటు కేంద్ర, రాష్ట్ర బలగాలు పాలు పంచుకోనున్నాయి. నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఆదేశాల మేరకు మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ఈ సభ నేపథ్యంలో కళాశాల చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 వరకు ఇవి అమలులో ఉంటాయి. తాజ్ మహల్ జంక్షన్, బొగ్గులకుంట వైపు నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వచ్చే వాహనాలను కింగ్ కోఠి చౌరస్తా నుంచి ఈడెన్ గార్డెన్ జంక్షన్ వైపు పంపిస్తారు అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వచ్చే వాహనాలను లిబర్టీ జంక్షన్ నుంచి హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ వైపు పంపిస్తారు ఈడెన్ గార్డెన్ జంక్షన్ వైపు నుంచి వచ్చే వాహనాలను కింగ్ కోఠి చౌరస్తా నుంచి తాజ్ మహల్ జంక్షన్, బొగ్గులకుంట వైపు మళ్లిస్తారు సిమెట్రీ జంక్షన్ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ వైపు పంపిస్తారు నారాయణగూడ చౌరస్తా నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ నుంచి లిబర్టీ వైపు మళ్లిస్తారు రవీంద్రభారతి, నాంపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలను పీసీఆర్, ఏఆర్ పెట్రోల్‌పంప్ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు అనుమతించరు చర్మాస్ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తాకు వచ్చే వాహనాలను ఎస్బీహెచ్ జంక్షన్ నుంచి సుజాత హైస్కూల్ వైపు పంపిస్తారు బహీర్ కేఫ్ వైపు నుంచి నిజాం కాలేజ్ గేట్ నెం.3, 4 వైపు వచ్చే వాహనాలను ఎన్సీసీ లైన్ నుంచి కోఠి చౌరస్తా వైపు పంపిస్తారు -
హైదరాబాద్‌లోనిషేధాజ్ఞల పొడిగింపు
రాష్ట్ర రాజధాని నగరంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిషేధాజ్ఞలను మరో వారం పాటు పొడిగిస్తూ కమిషనర్ అనురాగ్ శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ప్రకారం జంట నగరాల పరిధిలో ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, నిరసనలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. సచివాలయం చుట్టు పక్కల ప్రాంతాల్లో మైకులు, నినాదాలు నిషిద్ధం. మారణాయుధాలు, నిషేధిత వస్తువులతో పాటు ప్లకార్డులు, బ్యానర్లు చేతబూని తిరగకూడదు. ఈనెల 28 వరకు అములో ఉండే ఈ నిషేధాజ్ఞలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ అనురాగ్ శర్మ హెచ్చరించారు. -
సచివాలయ పరిధిలో నిషేధాజ్ఞలు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సచివాలయానికి చుట్టూ 500 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఉదయం 6 నుంచి నవంబర్ 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని, అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం బహిరంగ సభల నిర్వహణ, నలుగురికంటే ఎక్కువ మంది ఓ చోట గుమిగూడటం, నిషేధ వస్తువులతోపాటు కర్రలు తదితరాలు కలిగి ఉండటం, బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించడం, ఉపన్యాసాలు ఇవ్వడం, నినాదాలు చేయడం, ఊరేగింపులు నిర్వహించడం, ధర్నాలు, పికెటింగ్‌లు.. వంటివి నిషిద్ధం. -
నిమజ్జనం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో : గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం బుధవారం హుస్సేన్‌సాగర్‌లో జరగనుంది. దీనికి భారీ ఊరేగింపు సైతం ఉంటుంది. ఈ నేపథ్యంలో నగర శివార్లతో పాటు సిటీవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 66 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడమో, పూర్తిగా ఆపేయడమో చేస్తారు. బుధవారం ఉదయం నుంచి ఇవి అమలులో ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని పొడిగించే అవకాశం ఉంది. నిమజ్జనం పూర్తయిన తరవాత విగ్రహాలను తెచ్చిన ఖాళీ లారీల కోసం ప్రత్యేక రూట్లు కేటాయించారు. బుధవారం ఉదయం 9 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు ఊరేగింపు మధ్య నుంచి ఎలాంటి వాహనాల రాకపోకలకు అనుమతించరు. అవసరమైతే ఈ సమయాన్ని పొడిగిస్తారు. నిమజ్జనానికి వచ్చే ప్రజలు వ్యక్తిగత వాహనాలను వదిలి ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌లను ఆశ్రయించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రధాన ఊరేగింపు మార్గం కేశవగిరి-నాగుల్చింత-ఫలక్‌నుమ-చార్మినార్-మదీనా-అఫ్జల్‌గంజ్-ఎంజే మార్కెట్-అబిడ్స్-బషీర్‌బాగ్-లిబర్టీ-అప్పర్ ట్యాంక్/ఎన్టీఆర్ మార్గ్‌ల్లో నిమజ్జనం జరుగుతుంది. సికింద్రాబాద్ వైపు నుంచి... ఆర్పీ రోడ్-ఎంజీ రోడ్-కర్బాలామైదాన్-ముషీరాబాద్ చౌరస్తా-ఆర్టీసీ క్రాస్‌రోడ్స్- నారాయణగూడ ‘ఎక్స్’ రోడ్-హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ ద్వారా వచ్చి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో చేరుతుంది. ఈస్ట్‌జోన్ నుంచి... ఉప్పల్-రామాంతపూర్-అంబర్పేట్-ఓయూ ఎన్సీసీ-డీడీ హాస్పిటల్ మీదుగా ప్రయాణించి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌వద్ద సికింద్రాబాద్ రూట్ దాంతో కలుస్తుంది. వెస్ట్ జోన్ వైపు నుంచి వచ్చే ఊరేగింపు ఎంజే మార్కెట్ లేదా సెక్రటేరియేట్ వద్ద ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి. నిమజ్జనం ఊరేగింపు జరిగే మార్గాల్లో చిన్న వాహనాలకు అనుమతి ఉండదు. ఈ మార్గానికి అటు ఇటు ప్రాంతాల్లో ఉన్న వారు ప్రయాణించడానికి కేవలం బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద మాత్రమే అవకాశం ఇచ్చారు. సాధారణ ప్రజలు రింగ్‌రోడ్, బేగంపేట్ మార్గాలను ఆశ్రయించడం ఉత్తమం. వెస్ట్-ఈస్ట్ జోన్ల మధ్య రాకపోకలు సాగించే వారికి కేవలం బషీర్‌బాగ్ వద్దే అవకాశం ఉంటుంది. వాహనచోదకులు సాధ్యమైనంత వరకు ఔటర్‌రింగ్‌రోడ్, బేగంపేట్ మార్గాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. సందర్శకుల పార్కింగ్ స్థలాలివీ.. ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్‌నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జెడ్పీ ఆఫీస్ మధ్య, బుద్ధ భవన్ పక్కన, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, లోయర్ ట్యాంక్‌బండ్, గో సేవా సదన్, కట్టమైసమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి సందర్శకులు కాలినడకనే ట్యాంక్‌బండ్ పరిసరాలకు చేరుకోవాలి. నిమజ్జనం తరవాత విగ్రహాలను తెచ్చిన లారీలు/ట్రక్కులు తిరిగి వెళ్లేందుకు రూట్లు కేటాయించారు. ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జనం చేసినవి నెక్లెస్‌రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, వీవీ స్టాట్యూ, కేసీపీల మీదుగా వెళ్లాలి. వీటిని తెలుగుతల్లి స్టాట్యూ, మింట్ కాంపౌండ్స్‌లోకి అనుమతించరు. అప్పర్ ట్యాంక్‌బండ్ నుంచి నిమజ్జనం చేసిన లారీలు/ట్రక్కులు చిల్డ్రన్స్‌పార్క్, డీబీఆర్ మిల్స్, కవాడీగూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్లాలి. బైబిల్‌హౌస్ రైల్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా అనుమతించరు. ఇంటర్ డిస్ట్రిక్ట్ /స్టేట్ లారీలకు.. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే లారీలను నగరంలోకి అనుమతించరు. ఔటర్ రూట్లను వినియోగించుకొని వెళ్లాల్సి ఉంటుంది. హెల్ప్‌లైన్స్ ఏర్పాటు ఈ ఆంక్షలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం హెల్ప్‌లైన్స్‌ను ఏర్పాటు చేశారు. ఎలాంటి సహాయం కావాలన్నా 27852482, 27852486, 90102 03626 నంబర్లలో సంప్రదించవచ్చు. -
అలా ముందుకెళ్దాం..
సాక్షి,సిటీబ్యూరో: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సమన్వయంతో పనిచేద్దామని గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో నగర పోలీసుకమిషనర్ అనురాగ్‌శర్మ అన్నారు. నగరంలోని అన్నిజోన్ల కమిటీల ప్రతినిధులతో గురువారం కమిషనరేట్‌లో ఆయన భేటీ అయ్యారు. అదనపు కమిషనర్లు అంజనీకుమార్ (శాంతిభద్రతలు),అమిత్‌గార్గ్ (ట్రాఫిక్)లతోపాటు సంయుక్త కమిషనర్ బి.మల్లారెడ్డి (ఎస్బీ), కమిషనరేట్ పరిధిలోని ఇతర ఉన్నతాధికారులు, ఐదుజోన్ల డీసీపీలు, 50మంది ఉత్సవ కమిటీ ప్రతినిధులు సమావేశానికి హాజ రయ్యారు. ఉత్సవ నిర్వాహకులకు పోలీ సులు అన్ని సహాయసహకారాలు అందిస్తారని, ఆ మేరకు ఆదేశాలు కూడా జారీచేశామని కొత్వాల్ స్పష్టం చేశారు. నిర్వాహకులు కూడా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కమిషనర్ కోరారు. నిమజ్జనం ఊరేగింపును నిర్దేశించిన సమయంలోనే ప్రారంభించి తుదిఘట్టం ప్రశాంతంగా,ప్రణాళిక ప్రకారం పూర్తయ్యేందుకు సహకరించాలని అనురాగ్‌శర్మ పేర్కొన్నారు. ఊరేగింపునకు అవసరమైన లారీలతో సహా ఇతర అన్ని వసతుల్నీ ముందే సమకూర్చుకోవాలని కమిషనర్ సూచిం చారు. ఈసందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు తమ సమస్యల్ని కొత్వాల్‌కు వివరించారు. మండపాల వద్ద జరిగే సాంసృ్కతిక కార్యక్రమాలను రాత్రి వరకు అనుమతించాలని, మధ్యలో పోలీసులు జోక్యం చేసుకుని ఇబ్బందులు కలిగించవద్దని కోరారు. అనేక రహదారులు అధ్వానంగా మారిన నేపథ్యంలో నిమజ్జనం రోజు విగ్రహాలతో ఊగేరింపుగా వచ్చే వాహనాలు అనేక ఇబ్బం దులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. దీనికి సానుకూలంగా స్పంది ంచిన కమిషనర్ అనురాగ్‌శర్మ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామని, నిమజ్జనం నాటికి కీలక రహదారుల మరమ్మతులు పూర్తయ్యేలా ప్రయత్నిస్తామని హామీఇచ్చారు. -
‘సూడో’ల ఆటకట్టు
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసులతో పాటు సిటీ పోలీసుల్నీ ముప్పతిప్పలు పెడుతున్న సూడో పోలీసుల కోసం నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) వేట ముమ్మరం చేసింది. పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఏర్పాటైన ఏడు బృందాలు దేశ వ్యాప్తంగా 14 ప్రాంతాల్లో దాడులు చేసి.. తొమ్మిది మంది సూడో పోలీసులను పట్టుకున్నాయని డీసీపీ లేళ్ల కాళిదాస్ వేంకట రంగారావు ఆదివారం వెల్లండించారు. అదనపు డీసీపీ ఎంవీ రావుతో కలిసి ఆయన విలేకరులకు పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ ముఠాలు 2008 నుంచి దేశ వ్యాప్తంగా 50కి పైగా నేరాలు చేసినట్లు ఆయన తెలిపారు. చిరువ్యాపారుల ముసుగులో బస... రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలకు చెందిన ఇరానీ తదితర గ్యాంగులు ‘సూ డో నేరాలు’ చేస్తున్నాయి. దేహ దారుఢ్యమే పె ట్టుబడిగా రెచ్చిపోయే ఈ ముఠాలు ఒంటరిగా వెళ్తున్న మహిళలు, బ్యాంకుల నుంచి డబ్బు డ్రా చేసుకుని వస్తున్న వారినే ఎక్కువగా టా ర్గెట్ చేసి.. బంగారు నగలు, నగదును ఎత్తుకుపోతుంటాయి. వరుస నేరాలు చేయడం కోసం ఒక నగరాన్ని ఎంచుకొని.. ఎనిమిది నుంచి పది మంది ఓ ముఠాగా ఏర్పడి అక్కడ కు చేరుకుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉం డేందుకు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న తక్కువ ఖరీదైన లాడ్జిల్లో విడివిడిగా దిగుతారు. కళ్లజోళ్లు, రంగురాళ్లు అమ్మడానికి వచ్చినట్లు అందరినీ నమ్మిస్తారు. ఈ ముఠాకే చెందిన కొందరు రోడ్డు మార్గంలో ద్విచక్ర, తేలికపాటి వాహనాలనూ తీసుకుని వస్తారు. వెంటే నకిలీ వస్తువులు... సూడోల అవతారంలో ప్రజల్ని మోసం చేసేందుకు వీరు తమ వెంట నకిలీ బంగారు గాజులు, పుస్తెల తాడులు, నగలు, రంగు రాళ్లను తెచ్చుకుంటారు. రెక్కీ చేసి నేరం చేయడానికి అనువుగా ప్రాంతాన్ని గుర్తించి.. టార్గెట్లను ఎంచుకున్న తర్వాత పోలీసులుగా రంగంలోకి దిగి, జాగ్రత్తలు చెప్తున్నట్లు నటిస్తూ దోచుకుంటారు. సాధారణ ప్రజలను తేలిగ్గా బట్టులో వేసుకోవడానికి ఖాకీ రంగు లేదా అదే షేడ్స్‌తో ఉన్న ప్యాంట్లు, జర్కిన్లు, బెల్టులు, రేబాన్ కళ్లద్దాలు ధరిస్తారు. పోలీసులకు తమపై అనుమానం రాకుండా ఉండేందుకు చొక్కాలను మాత్రం సాధారణ రంగులవే వేసుకుంటారు. దృష్టి మరల్చి సొత్తు కాజేయడంతో పాటు చైన్‌స్నాచింగ్స్ కూడా పాల్పడుతుంటారు. భార్యల సహకారంతో విక్రయం... ‘పని’ పూర్తయ్యాక సూడో పోలీసులు నేరస్థలికి సమీపంలో సిద్ధంగా ఉంచుకున్న బైక్, తేలికపాటి వాహనాల్లో ఉడాయిస్తాయి. చోరీ సొత్తును తమ ప్రాంతాలకు తీసుకెళ్లి, భార్యల ద్వారా తమవే అని చెప్పించి విక్రయించి సొమ్ము చేసుకుంటారు. గత నెల్లో ఒకే రోజు నగరంలోని తొమ్మిది చోట్ల పంజా విసిరిన సూడో పోలీసులు అరకేజీకి పైగా బంగారం ఎత్తుకెళ్లారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు కమిషనర్ సీసీఎస్ అధికారుల నేతృత్వంలో ఏడు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలకు పంపారు. ఇన్స్పెక్టర్లు వి.శ్యాంబాబు, పి.రాజు, ఎంబీ శ్రీధర్, రమేష్, అర్జున్, కె.సుబ్బరామిరెడ్డి, మధుమోహన్‌రెడ్డి ఏకకాలంలో దాడులు చేసి తొమ్మిది మందిని పట్టుకున్నారు. చోరీ సొత్తు రికవరీ కోసం కోర్టు అనుమతితో నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. చిక్కిన గ్యాంగులకు సంబంధించి పరారీలో ఉన్న వారితో పాటు నగరంలో పంజా విసురుతున్న మరికొన్ని ముఠాల కోసం గాలింపు కొనసాగుతోందని డీసీపీ రంగారావు తెలిపారు. దాడులు చేసిన ప్రాంతాలివీ.. రాష్ట్రంలోని గుంతకల్, వాయల్పాడు, మదనపల్లి, హిందూపూర్ కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా, బెంగళూరు, గదర్ మహారాష్ట్రలోని ముంబ్రా, భివండి, అంబేవలి, శివాజీనగర్, లోని, కౌసా, హరాప్సర్, నాగ్‌పూర్ మధ్యప్రదేశ్‌లోని పివరియా అరెస్టు చేసింది వీరినే... అబాలు జాఫర్ ఇరానీ, ఔలాద్ హుస్సేన్, ఖాదిమ్ హుస్సేన్, మాషల్లా గరీబ్ షా సయ్యద్, మొహ్మద్ అలీ, అబ్బాస్ అలీ, సాధిక్ హుస్సేన్, మొగల్ అబ్బాస్ అలీ, సయ్యద్ జాఫర్ అలీ -
హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసిన అనురాగ్ శర్మ
తెలంగాణ-సీమాంధ్ర ప్రాంత న్యాయవాదుల పరస్పర ఘర్షణ నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తాను హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ కలిశారు. లాయర్ల గొడవకు దారితీసిన పరిణామాలపై వీరు చర్చించినట్టు తెలిసింది. ఘర్షణపై ఇరు ప్రాంతాల న్యాయవాదులు కూడా ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. సీమాంధ్ర న్యాయవాదులను హైకోర్టులో తెలంగాణ లాయర్లు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ రాజమండ్రిలో న్యాయవాదులు విధులు బహిష్కరించి, ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అరెస్ట్ చేసిన సీమాంధ్ర న్యాయవాదులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ-సీమాంధ్ర లాయర్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణతో హైకోర్టు ప్రాంగణం దద్దరిల్లింది. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన లాయర్లు హైకోర్టు ప్రాంగణంలో నిర్మిస్తున్న మానవహారాన్ని తెలంగాణ ప్రాంత న్యాయవాదులు అడ్డుకోవడంతో ఘర్షణ ప్రారంభమయింది. ఇరు ప్రాంతాల న్యాయవాదులు తోపులాటకు దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మాజీ అడ్వకేట్ జనరల్ సి.వి.మోహన్ రెడ్డి సహా అనేక మంది న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఏం జరిగినా ఏపీఎన్జీవోల సభా నిర్వాహకులదే బాధ్యత: అనురాగ్‌శర్మ
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోలు సభ నిర్వహించుకోవటానికి అనేక కోణాల్లో పరిశీలించిన మీదటే 19 షరతులతో అనుమతిచ్చామని.. సభ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా నిర్వాహకులదే బాధ్యతని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ స్పష్టం చేశారు. మిగిలినవారు తమ ర్యాలీ తేదీ మార్చుకుంటే పరిశీలించి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఏపీఎన్జీవో సభకు అనుమతి ఇవ్వటం వెనుక ముఖ్యమంత్రి, ఉన్నతాధికారుల ప్రమేయం ఉందన్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. ఎవరికైనా ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఆవేదన, నిరసన వ్యక్తం చేయటానికి హక్కు ఉందని, రాజధానిలో వారి గళం వినిపిస్తామంటే అంగీకరించాలని సీపీ పేర్కొన్నారు. అనురాగ్‌శర్మ గురువారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎల్బీ స్టేడియంలో ఈ నెల 7న సభ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి కోరుతూ ఏపీఎన్జీవోలు గత నెల 28న దరఖాస్తు చేసుకున్నారని, మధ్య మండల డీసీపీ అనేక కోణాల్లో పరిశీలించిన తర్వాతే అనుమతి ఇచ్చారని చెప్పారు. ‘ఇప్పుడు మరికొంత మంది శనివారమే వేర్వేరు కార్యక్రమాల నిర్వహణకు అనుమతి కోరుతూ దరఖాస్తులు ఇచ్చారు. కానీ శాంతిభద్రతలను పరిగణనలోకి తీసుకుని, తొలుత దరఖాస్తు చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యం లెక్కన ఏపీఎన్జీవోలకు అనుమతి ఇచ్చాం’ అని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నగరంలో ఎటువంటి ర్యాలీలకూ అనుమతి ఇవ్వట్లేదని సీపీ తెలిపారు. ఏపీఎన్జీవోలకు కూడా సభ నిర్వహణకే 19 షరతులతో అనుమతిచ్చామని స్పష్టంచేశారు. ‘ఈ సభను అడ్డుకుంటామని, జరగనివ్వబోమని అనేక ప్రకటనలు వెలుడుతున్నాయి. వారిని మీడియా ద్వారా కోరేది ఒక్కటే... ఎవ్వరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు’ అని ఆయన పేర్కొన్నారు. ఇతరులు ఏవైనా కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే 8వ తేదీ తర్వాత ఎప్పుడైనా, ఎక్కడైనా అనుమతి కోరవచ్చని.. పరిశీలించి అనుమతిస్తామని చెప్పారు. ‘ఈ నెల 6న ఎల్బీ స్టేడియంలో సభకు అనుమతించాలంటూ మంద కృష్ణ గత నెల 31న దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ తర్వాతి రోజు ఏపీఎన్జీవోల సభ అంటే ముందు రోజునే అనేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 6న సభకు అనుమతి ఇవ్వలేదు. తేదీ మార్చుకుంటే మాకు అభ్యంతరం లేదు’ అని సీపీ పేర్కొన్నారు. ఏపీఎన్జీవోల సభకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ‘ఇప్పటికే నగర పోలీసులతో పాటు 11 కంపెనీల పారా మిలటరీ బలగాలు, 45 ప్లటూన్ల ఏపీఎస్పీ, ఏఆర్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఏదైనా పరిణా మం జరిగితే దాని తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయా సినిమా ప్రదర్శనలకూ పటిష్ట బందోబస్తు కల్పిస్తామన్నారు. కొన్ని సభలకు ముందు, మరికొన్ని సభలకు ఆలస్యంగా అనుమతి ఇచ్చామనటం సరికాదన్న సీపీ గతంలో జరిగిన కార్యక్రమాలు, అనుమతిచ్చిన తేదీల్ని వెల్లడించారు. -
సెప్టెంబర్ 7 తేదిన ఏపీఎన్జీవోల సభకు పోలీసుల అనుమతి!
హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు తలపెట్టిన సభకు పోలీసుల అనుమతి లభించింది. ఏపీఎన్జీవోల సభకు షరతులతో కూడిన అనుమతిని సీపీ అనురాగ్ శర్మ ఇచ్చారు. ఎల్బీస్టేడియంలో సెప్టెంబర్ 7న ఏపీఎన్జీవోలు సమావేశం నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఏడవ తేది మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకే సభ నిర్వహించాలని పోలీసులు సూచించారు. సభకు వచ్చే ఉద్యోగులంతా ఐడీ కార్డులు తప్పనిసరిగా తీసుకురావాలి అని పోలీసులు తెలిపారు. కొన్ని పరిస్థితులు, భద్రతా కారణాల దృష్ట్యా ఇతరులకు అనుమతి లేదు అని పోలీసులు స్పష్టం చేశారు. -
పదో తేదీ వరకు ర్యాలీలు, సభలపై నిషేధం
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఈనెల పదో తేదీ వరకు ఎలాంటి సభలు, ర్యాలీలు, బహిరంగ ప్రదర్శనలకు అనుమతి లేదని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఈనెల ఏడో తేదీన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో ఏపీ ఎన్జీవోలు బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టడం, అలా నిర్వహిస్తే తాము దాన్ని అడ్డుకుని తీరుతామని తెలంగాణ ఉద్యోగులు, ఓయూ జేఏసీ నాయకులు ప్రకటించడం లాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి, డీజీపీ దినేశ్ రెడ్డి, సీపీ అనురాగ్ శర్మ తదితర ఉన్నతాధికారులు శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్ష జరిపారు. అలాగే, సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు ప్రత్యేకంగా సీఎస్ మహంతితో చర్చలు జరిపారు. ఉద్యోగులతో సమావేశం అనంతరం మహంతి మీడియాతో మాట్లాడారు. ఏ ప్రాంతం వారైనా సచివాలయం ప్రాంగణంలో ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని తెలిపారు. నగరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా శాంతి యుతంగా నిరసన తెలుపుకోవాలని ఉద్యోగులను కోరినట్లు ఆయన తెలిపారు. సచివాలయం జే బ్లాక్ వద్ద టి.ఉద్యోగులు శాంతియుత నిరసన చేపట్టడానికి మాత్రమే అవకాశం ఇచ్చామన్నారు. అలాగే సీమాంధ్ర ఉద్యోగులు అమ్మవారి ఆలయం దగ్గర నిరసన తెలిపేందుకు అనుమతి ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం నాడు సచివాలయంలో విధులకు 67 శాతం మంది ఉద్యోగులు హాజరయ్యారన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా అసెంబ్లీ, సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఈనెల 10వ తేదీ వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు సీపీ అనురాగ్ శర్మ తెలిపారు. -
ఏదో ఒకటి తేల్చిచెప్పండి : ఏపీఎన్జీవో
సమైక్య సభకు అనుమతిపై పోలీసులకు ఏపీఎన్జీవోల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను, విభజన వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించడానికి వచ్చే నెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తాము తలపెట్టిన సమైక్య సభకు అనుమతి ఇవ్వాలని, లేదంటే ఇవ్వలేమని తేల్చిచెప్పాలని ఎపీఎన్జీవోలు పోలీసులను కోరారు. సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి తదితరులు శుక్రవారం డీజీపీ దినేష్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మను కలిసి సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనుమతి మంజూరు చేస్తే శాంతిభద్రతల సమస్య తలత్తే అవకాశముందని పోలీస్ కమిషనర్ చెప్పారని ఏపీఎన్జీవో నేతలు వెల్లడించారు. ఉన్నతాధికారులకు నివేదించామని, రెండు మూడు రోజుల్లో చెబుతామని హామీ ఇచ్చారని వారు చెప్పారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి సభకు అనుమతిపై మాట్లాడటానికి ప్రయత్నించామని, అయితే ఆయన బిజీగా ఉండటం వల్ల కలవలేకపోయామని ఏపీఎన్జీవో నేతలు తెలిపారు. -
యాసిన్ భత్కల్ ను హైదరాబాద్ కు రప్పిస్తాం: అనురాగ్ శర్మ
భారత, నేపాల్ సరిహద్దులో అరెస్టైన ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అతని సహచరుడు అసదుల్లా అఖ్తర్ లను విచారించేందుకు ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు బీహార్ కు వెళ్లనున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమీషన్ అనురాగ్ శర్మ మీడియాకు వెళ్లడించారు. ఫిబ్రవరి 21 తేదిన దిల్ సుఖ్ నగర్ లో జరిగిన వరస పేలుళ్ల ఘటనలో భత్కల్, అసదుల్లాలను విచారిస్తారని శర్మ తెలిపారు. దిల్ సుఖ్ నగర్ పేలుళ్లతో సంబంధమున్న సీసీటీవీ దృశ్యాలతో భత్కల్, అసదుల్లాల చిత్రాలు సరిపోయాయని పోలీసులు తెలిపారు. విచారణలో పేలుళ్ల సంఘటనతో సంబంధమున్నట్టు తేలితే, తదుపరి విచారణకు భత్కల్, అసదుల్లాలను హైదరాబాద్ కు తీసుకువస్తామన్నారు. ఫిబ్రవరి 21 తేదిన జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 17 మంది మృత్యువాత పడగా, 100 మందికి తీవ్రగాయాలైన సంగతి తెలిసిందే. తొలుత ఈ కేసును ఆంధ్రప్రదేశ్ పోలీసులు దర్యాప్తు జరుపగా, ఆతర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. -
శాంతియుత నిరసనలు ఓకే : పోలీస్‌కమిషనర్ అనురాగ్‌శర్మ
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక, సమైక్య ఉద్యమాల నేపథ్యంలో టీఎన్జీవోలు, ఏపీ ఎన్జీవోలు శాంతియుతంగా నిరసనలు తెలిపితే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. అయితే ప్రజా జీవనానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా నిరసన లకు దిగితే మాత్రం ఉపేక్షించబోమన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఉద్యోగులు వారి కార్యాలయంలో శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన, ర్యాలీ తదితరాలు నిర్వహిస్తే అడ్డుకోమన్నారు. ఆవరణ దాటి బయటకు వచ్చి నిరసనలు, ర్యాలీలు చేసినా, ఘర్షణలకు అవకాశం ఉందని అనుమానం వచ్చినా వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ముందస్తు అరెస్టులు చేస్తామని చెప్పారు. విద్యుత్‌సౌధలో జరుగుతున్న ఆందోళనల్లో బయటి వ్యక్తులు వస్తున్నారని సమాచారం అందిందని, దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సచివాలయం లోపల భద్రత బాధ్యతలు స్పెషల్ ప్రొటెక్షన్స్ ఫోర్స్ చూసుకుంటుందని, అక్కడ జరుగుతున్న ర్యాలీలు తదితరాలపై వారే స్పందించాలన్నారు. అక్కడి నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే పోలీసులు జోక్యం చేసుకుంటారని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఇటీవల అధిక జరిమానా విధించింది ప్రభుత్వ ఆదేశాల మేరకేనని సీపీ స్పష్టం చేశారు.