తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో ఈ నెల 2న నిర్వహించనున్న నేపథ్యంలో పలు మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.
సాక్షి, సిటీబ్యూరో : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో ఈ నెల 2న నిర్వహించనున్న నేపథ్యంలో పలు మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపుతో పాటు అవతరణ దినోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే వాహనాల కోసం వేర్వేరు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. నగరంలో సోమవారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
1. ఎస్‌బీహెచ్ ఎక్స్ రోడ్స్ నుంచి బేగంపేట వైపు వెళ్లే వాహనాలను ఎస్‌పీ రోడ్డు మీదుగా అనుమతించరు. ప్యాట్నీ- ఆర్పీరోడ్, ఎస్‌డీ రోడ్డు నుంచి వచ్చే వాహనాలు ప్యాట్నీ- ప్యారడైజ్ మీదుగా, జేబీఎస్ మార్గం నుంచి వచ్చే వాహనాలు స్వీకార్ ఉపకార్- టివోలీ- బాలంరాయి మీదుగా సీఈఓ వైపు నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
2. బేగంపేట నుంచి సికింద్రాబాద్ వచ్చే వాహనాలు... బాలంరాయి- స్వీకార్ ఉపకార్- ఎస్‌బీహెచ్ మార్గంలో లేదా ప్యారడైజ్- ఎస్‌డీ రోడ్-ప్యాట్నీ- క్లాక్‌టవర్- సంగీత్ చౌరస్తా మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది.
3. టివోలీ మార్గంలో వచ్చే వాహనాలు టివోలీ జంక్షన్ నుంచి బాలంరాయి- సీటీఓ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. టివోలీ నుంచి ప్లాజా జంక్షన్ మార్గంలో వాహనాలను అనుమతించరు.
4. పార్క్ లేన్ నుంచి ప్లాజా చౌరస్తాకు వెళ్లే వాహనాలు సైతం ప్యారడైజ్- ప్యాట్నీ మార్గాల గుండా వెళ్లాల్సి ఉంటుంది.
5. వైఎంసీఏ, సీటీఓ ఫై ్ల ఓవర్లపై వాహనాల రాకపోకల్ని అనుమతించరు.
6. ఇక రాజ్‌భవన్‌లో సీఎం ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రాజ్‌భవన్ రహదారిలో సాధారణ ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు. ఈ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది.
పార్కింగ్ ఏర్పాట్లు ఇక్కడే..
1. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ఉప్పల్, తార్నాక నుంచి వచ్చే వాహనాల కోసం రైల్ నిలయం సమీపంలోని రైల్వే రిక్రియేషన్ క్లబ్ (ఆర్‌ఆర్‌సీ) ఆవరణలో, బేగంపేటలోని వెస్లీ కాలేజీలో పార్కింగ్ ఏర్పాటు చేశారు.
2. నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఎన్‌హెచ్-7 (మేడ్చల్ మార్గం), ఎన్‌హెచ్-9 (బాలానగర్ మార్గం) గుండా వచ్చే వాహనాలను కంటోన్మెంట్‌లోని ఇంపీరియల్ గార్డెన్ సమీపంలోని దోబీఘాట్, బాలంరాయి చౌరస్తా వద్ద ఉన్న ఇసుక లారీల అడ్డా, టివోలీ సమీపంలోని మిలీనియం గార్డెన్, పెర్ల్ గార్డెన్ ఎదురుగా ఉన్న ఈద్గా ప్రాంతాల్లో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
3. కరీంనగర్, సిద్ధిపేట, చేర్యాల తదితర ప్రాంతాల నుంచి రాజీవ్ రహదారి గుండా వచ్చే వాహనాల కోసం కేజేఆర్ గార్డెన్ సమీపంలోని ఖాళీ ప్రదేశం, ఇంపీరియల్ గార్డెన్ ముందు ఖాళీ స్థలం, స్వీకార్-ఉపకార్ చౌరస్తా సమీపంలోని సెంటినరీ స్కూల్‌లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
4. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పశ్చిమ ప్రాంతాల గుండా వచ్చే వాహనాలను సికింద్రాబాద్ పీజీ కాలేజీ, బేగంపే ఎయిర్‌పోర్టు, ఎయిర్ కార్గో, హైదరాబాద్ ఉత్తర ప్రాంతం మల్కాజిగిరి, కుషాయిగూడ, అడ్డగుట్ట మార్గాల్లో వచ్చే వాహనాలను లాంబా రోడ్డులో పార్క్ చేయాల్సి ఉంటుంది.