న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్‌కు జ్ఞాపిక అందజేస్తున్న ఎన్నారైలు
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్
సాక్షి, హైదరాబాద్: భారతదేశాన్ని ఎన్నోసార్లు సందర్శించానని, భారతీయ సంస్కృతి తనకెంతో ఇష్టమని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ చెప్పారు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు జరిపిన వేడుకల్లో న్యూజిలాండ్ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా క్రిస్టోఫర్ మాట్లాడుతూ పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మసీ రంగాల్లో దూసుకుపోతోందని ప్రశంసించారు. ఈ ఏడాది భారత్ పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సందర్శిస్తానని వెల్లడించారు. ఈ సంఘ అధ్యక్షుడు మాల్గారి శైలేంద్ర రెడ్డి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ఒక ప్రధాన మంత్రి పాల్గొనడం ఇదే తొలిసారని సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment