Christopher
-
భారతీయ సంస్కృతి ఎంతో ఇష్టం
సాక్షి, హైదరాబాద్: భారతదేశాన్ని ఎన్నోసార్లు సందర్శించానని, భారతీయ సంస్కృతి తనకెంతో ఇష్టమని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ చెప్పారు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు జరిపిన వేడుకల్లో న్యూజిలాండ్ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా క్రిస్టోఫర్ మాట్లాడుతూ పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మసీ రంగాల్లో దూసుకుపోతోందని ప్రశంసించారు. ఈ ఏడాది భారత్ పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సందర్శిస్తానని వెల్లడించారు. ఈ సంఘ అధ్యక్షుడు మాల్గారి శైలేంద్ర రెడ్డి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ఒక ప్రధాన మంత్రి పాల్గొనడం ఇదే తొలిసారని సభ్యులు తెలిపారు. -
గురక పెట్టొద్దన్నందుకు పొడిచేశాడు
మేరీల్యాండ్: చెవులకు చిల్లులు పడేలా గురుక పెట్టకురా అన్నందుకు ఓ పెద్దాయనను పొడిచి చంపిన ఘటన అమెరికాలో జరిగింది. పెన్సిల్వేనియా రాష్ట్రం మోంట్గోమేరీ కౌంటీలో 62 ఏళ్ల రాబర్ట్ వాలెస్ తల్లితో కలిసి ఉంటున్నాడు. అదే డూప్లెక్స్ భవనంలో 55 ఏళ్ల క్రిస్టఫర్ కేసీ ఒంటరిగా ఉంటున్నాడు. క్రిస్టఫర్ పెడుతున్న భారీ గురకను వినలేకపోతున్నానని ఏడాదిన్నరగా రాబర్ట్ చెప్పీచెప్పీ విసిగిపోయాడు. విషయం పోలీసుల దాకా వెళ్లింది. వాళ్లు నచ్చజెప్పినా లాభం లేకపోయింది. క్రిస్టఫర్, రాబర్ట్‌ల పడక గదులు పక్కపక్కనే ఉండటం, ఒక చెక్క గోడ మాత్రమే అడ్డుగా ఉండటంతో గురక రాబర్ట్‌కు బాగా ఇబ్బందిపెట్టేది. విసిగిపోయిన పెద్దాయన చివరకు జనవరి 15న సాయంత్రం క్రిస్టఫర్ వరండా దగ్గరికొచ్చి బెదిరించాడు. వినకపోవడంతో అతని కిటికీ స్క్రీన్‌ను చింపేసి చంపేస్తానని అరిచాడు. ఒకనొక సమయంలో నీ గురక సమస్యకు శస్త్రచికిత్స చేయిస్తానని కూడా మాట ఇచ్చాడు. వాగ్వాదం చాలాసేపు జరిగి ఆగిపోయే సమయానికి క్రిస్టఫర్ తలుపుతీయడంతో రాబర్ట్ మళ్లీ తిట్లపురాణం మొదలెట్టాడు. వీరావేశంతో ఉన్న గురకమహాశయుడు వెంటనే కత్తితో రాబర్ట్ గుండెలపై పలుమార్లు పొడిచి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
పొగాకు ఉత్పత్తులపై ఆంక్షలు ఎత్తేస్తాం
వెల్లింగ్టన్: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పొగాకు వాడకంపై గత ప్రభుత్వం తీసుకువచి్చన నియంత్రణలను తొలగిస్తామని న్యూజిలాండ్ నూతన ప్రధాని క్రిస్టొఫర్ లక్సాన్ చెప్పారు. మాజీ వ్యాపారవేత్త, నేషనల్ పార్టీ నేత అయిన లక్సాన్‌తో సోమవారం గవర్నర్ జనరల్ సిండీ కిరో ప్రధానిగా ప్రమాణం చేయించారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో నేషనల్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. మరో రెండు పారీ్టలతో కలిసి తాజాగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రమాణ స్వీకారం అనంతరం క్రిస్టొఫర్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం గత ఏడాది పొగాకు వినియోగంపై తీసుకువచి్చన నియంత్రణలను తొలగిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు ఏదేశంలోనూ లేని విధంగా సిగరెట్లలో నికొటిన్ స్థాయిలను తగ్గించడం, యువతపై జీవిత కాల ధూమపాన నిషేధం, సిగరెట్ విక్రేతల తగ్గింపు వంటివి అప్పటి ప్రభుత్వం ప్రకటించిన చర్యల్లో ఉన్నాయి. -
ఆదివాసుల హృదయ దీపాలు
తూర్పు గోదావరి జిల్లా కొండ అడవుల్లో డాక్టర్ ఊర్మిల పింగ్లె తీసిన ఇక్కడ కనిపిస్తున్న ఫొటో... హైమండార్ఫ్ దంపతులు కలిసి ఉన్న దాదాపు తుది చిత్రం. పదవీ ఉద్యోగాలు లేకపోయినా మానవ శాస్త్రవేత్తగా తనతో యాభై ఏళ్లుగా వెన్నెముకలా ఉండి అలుపెరగకుండా కలిసి పని చేసిన బెట్టీ సాహచర్యం గురించి లోతుగా తలపోస్తున్నట్టు క్రిస్టోఫ్ హైమండార్ఫ్ కనిపిస్తున్నారు ఈ చిత్రంలో. ఆ తర్వాత కొద్ది రోజులకే హైదరాబాద్‌లో 11 జనవరి 1987 నాడు బెట్టీ అని అందరూ అభిమానంగా పిలిచిన ఎలిజబెత్ హైమండార్ఫ్ గుండెపోటుతో హఠాత్తుగా ప్రాణాలు విడిచారు. ఆమె మరణం క్రిస్టోఫ్ హైమండార్ఫ్‌ను బాగా కుంగదీసింది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకే ఆయన కూడా తనువు చాలించారు. భారత్ ఈశాన్య ప్రాంతంలోని కొన్యక్ నాగాలు, ఆపతానీలు, హైదరాబాద్ నిజాం సంస్థానంలోని చెంచులు, కొండ రెడ్లు, రాజ గోండులు, ఇంకా నేపాల్ షేర్పాలు, మధ్య ప్రదేశ్ భిల్లులు.. ఈ జాతుల గురించి క్రిస్టోఫ్ వాన్ ఫ్యూరర్ హైమండార్ఫ్ చేసిన పరిశోధనలు ఇప్పటికీ ప్రామాణికంగా నిలుస్తున్నాయి. అయితే వీటన్నింటిలో ఆదిలాబాద్ రాజ్ గోండులతో ఆయన 1940ల్లో ఏర్పరచుకొని, జీవన పర్యంతం కొనసాగించిన బాంధవ్యానికి సాటి రాగలిగి నది ఏదీ లేదు. మార్లవాయి గ్రామంలో రాజ్ గోండుల మధ్య వారిలో ఒకరిగా ఒక గుడిసెలో జీవిస్తూ వారి సంప్రదాయాలు, పురాణాలను, వారి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సాధికారికంగా నమోదు చేస్తూ, ఆదివాసీ జీవన దృక్పథ సార్వజనీనమైన విలువను గుర్తుండి పోయేలా ఆవిష్కరించగలిగారు. హైదరాబాద్ సంస్థానంలోని ఆదివాసీలను దాదాపు మూడు సంవత్సరాల పాటు అధ్యయనం చేసిన తరువాత 1945లో, ఆయన విశ్లేషణల నాణ్యతను చూసిన నిజాం ప్రభుత్వం ఆయనను గిరిజన తెగలు, వెనుకబడిన తరగతుల సలహాదారుగా నియమించింది. సంస్థానంలోని ఆదివాసీల అభ్యున్నతికి కీలకమైన నూతన ప్రణాళికల రూపకల్పన, వాటి అమలు బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఆ పదవిలో ఉంటూ కుమ్రం భీం తిరుగుబాటు, వీర మరణం తరువాత పూర్తిగా ధైర్యాన్ని కోల్పోయి, తీవ్రమైన నిరాదరణకు గురవుతున్న ఆదిలాబాద్ జిల్లా గోండుల కోసం తొలి పాఠశాలలు ఏర్పరిచి, భూములు లేని వేలాది ఆదివాసీ కుటుంబాలకు దాదాపు 160 వేల ఎకరాల భూమిని పట్టాలతో సహా అందించి వారి సమగ్ర పునరుజ్జీవనానికి గొప్ప పునాది వేయగలిగారు హైమండార్ఫ్. 1950లో లండన్‌కు వెళ్లి పోయిన తర్వాత కూడా తరచుగా ఆదిలాబాద్‌ను సందర్శిస్తూ గోండుల బాగోగుల గురించి తెలుసుకుంటూ ఉండేవారు హైమండార్ఫ్ దంపతులు. 1960ల తరువాత బయటి నుండి వచ్చిన చొరబాటుదారుల దురాక్రమణకు ఆదివాసీల భూములు గురికావడం, వారి పరిస్థితి మళ్లీ హీనం కావడం హైమండార్ఫ్ దంపతులను ఎంతో బాధించేది. తమను ఎంతో ఆదరించి, అభిమానించిన గోండుల సన్నిధిలో మార్లవాయి లోనే తమ సమాధులు ఉండాలని హైమండార్ఫ్ దంపతులు కోరుకున్నారు. బెట్టి మరణం తర్వాత, ఆమె అస్థికలను మార్లవాయికి తీసుకు వచ్చి, ప్రేమాభిమానాలతో తరలివచ్చిన వేలాది ఆదివాసీల సమక్షంలో మార్లవాయి గ్రామం పక్కనే ఖననం చేశారు. క్రిస్టోఫ్ అవశేషాలను కూడా ఆయన మరణించిన చాలా ఏళ్ళ తర్వాత బెట్టి సమాధి పక్కనే పూడ్చి మరో సమాధి నిర్మింపజేశారు. బెట్టి వర్ధంతినే హైమండార్ఫ్ దంపతుల ఉమ్మడి సంస్మరణ దినంగా ప్రతి ఏడాది మార్లవాయి గ్రామంలో 11 జనవరి నాడు నిర్వహిస్తూ వస్తున్నారు. గత కొన్నే ళ్లుగా ఇది పెద్ద కార్యక్రమంగా వికసిస్తూ వస్తున్నది. మార్లవాయి గ్రామ గుసాడి నృత్య కళాకారుడు కనక రాజుకు పద్మశ్రీ గౌరవం దక్కడం దీనికి తోడయ్యింది. తమ జాతి సంస్కృతిని అధ్యయనం చేసి, తమ అభ్యున్నతి కోసం పరితపించిన మానవ శాస్త్రవేత్త దంపతులకు ఆ జాతి నుంచి లభించిన ఇటువంటి ఆరాధనకు సాటిరాగల ఉదాహరణ మరెక్కడా లేదేమో! 1980వ దశకం నుండి చివరిదాకా హైమండార్ఫ్ దంపతులను బాగా ఎరిగిన, క్రిస్టోఫ్‌తో కలిసి రెండు పరిశోధన గ్రంథాలను కూడా రాసిన ఊర్మిళ పింగ్లె, బెట్టి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు: ‘తనను కలిసిన వారందరి పట్లా గొప్ప అనురాగం చూపుతూ... గొప్ప చమత్కారం, హాస్య దృష్టిలతో జీవ చైతన్యం ఉట్టిపడుతూ ఉండేది అమె. ఆదివాసీ సమాజాల పరిస్థితి పట్ల ఎనలేని సానుభూతితో వారి అభ్యున్నతి కోసం అంతటా వాదిస్తూ ఉండేది. తన భర్తకు నిజమైన ఆత్మబంధువుగా నిలిచిన వ్యక్తి!’ (క్లిక్ చేయండి: అజ్ఞానం కంటే అహంకారం ప్రమాదం) - సుమనస్పతి రెడ్డి ఆకాశవాణి విశ్రాంత అధికారి (జనవరి 11 హైమండార్ఫ్ దంపతుల సంస్మరణ దినం) -
హీరోయిన్ కేథరిన్ సోదరుడి ఆత్మహత్య
'ఇద్దరమ్మాయిలు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ కేథరిన్ థెరిసా సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆమె సోదరుడు క్రిస్టోఫర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేథరిన్ సోదరుడు క్రిస్టోఫర్.. బుధవారం సాయంత్రం బెంగళూరులోని మురుగేష్ పాలియాలోని తన గదిలో కిటికీకి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సోదరుడి మరణవార్త విన్న కేథరిన్ ....చెన్నై నుంచి హుటాహుటీన బెంగళూరు బయల్దేరి వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసి.. క్రిస్టోఫర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు క్రిస్టోఫర్‌కు కుటుంబంతో సరైన సంబంధాలు లేనట్లు సమాచారం. అతడు గత కొంతకాలంగా విడిగానే ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే క్రిస్టోఫర్ ఆర్థిక ఇబ్బందులు కారణంగానే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు అతని స్నేహితులు చెబుతున్నారు. -
ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో ఇద్దరు ఎన్నారై డాక్టర్లు
న్యూయార్క్: ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా 3,00,000 డాలర్ల మేర అనుచిత లబ్ధ్ది పొందారంటూ ఆరుగురిపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. వీరిలో సుకేన్ షా, షిముల్ షా అనే ఇద్దరు ప్రవాస భారతీయ డాక్టర్లు ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. జీఎస్ఐ కామర్స్ అనే సంస్థను 2011లో ఈబే సంస్థ కొనేందుకు సిద్ధమైంది. సదరు జీఎస్ఐ కామర్స్ సీఈవో క్రిస్టొఫర్ సారిడాకిస్.. ఈ విషయాన్ని అనధికారికంగా సుకేన్, షిముల్ తదితరులకు తెలియజేశారు. దీంతో ఆ కంపెనీ షేర్లలో ట్రేడింగ్ చేయడం ద్వారా వీరు లాభాలు పొందారని అభియోగాలు ఉన్నాయి. మొత్తం మీద కేసు సెటిల్ చేసుకోవాలంటే ఎన్నారై డాక్టర్లతో పాటు అయిదుగురు ట్రేడర్లు 4,90,000 డాలర్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదే శించింది. క్రిస్టోఫర్‌పై 6,64,822 డాలర్ల పెనాల్టీ విధించింది.