వెల్లింగ్టన్: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పొగాకు వాడకంపై గత ప్రభుత్వం తీసుకువచి్చన నియంత్రణలను తొలగిస్తామని న్యూజిలాండ్ నూతన ప్రధాని క్రిస్టొఫర్ లక్సాన్ చెప్పారు. మాజీ వ్యాపారవేత్త, నేషనల్ పార్టీ నేత అయిన లక్సాన్‌తో సోమవారం గవర్నర్ జనరల్ సిండీ కిరో ప్రధానిగా ప్రమాణం చేయించారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో నేషనల్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది.
మరో రెండు పారీ్టలతో కలిసి తాజాగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రమాణ స్వీకారం అనంతరం క్రిస్టొఫర్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం గత ఏడాది పొగాకు వినియోగంపై తీసుకువచి్చన నియంత్రణలను తొలగిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు ఏదేశంలోనూ లేని విధంగా సిగరెట్లలో నికొటిన్ స్థాయిలను తగ్గించడం, యువతపై జీవిత కాల ధూమపాన నిషేధం, సిగరెట్ విక్రేతల తగ్గింపు వంటివి అప్పటి ప్రభుత్వం ప్రకటించిన చర్యల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment