tobacco products
-
పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో పాల్గొంటున్నందుకు..
లక్నో: పొగాకు కంపెనీల తరఫున ప్రకటనల్లో కన్పిస్తున్న బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అక్షయ్‌కుమార్, అజయ్ దేవ్‌గణ్‌లకు కేంద్రం నోటీసులు పంపింది. ప్రజల ఆరోగ్యానికి చేటు తెస్తున్న పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో సెలబ్రిటీలు, ముఖ్యంగా పద్మ అవార్డు గ్రహీతలు నటిస్తుండటంపై మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది గతంలో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. కేంద్రం స్పందించడం లేదని, ఇది ధిక్కరణేనని పిటిషనర్ మరోసారి కోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. షారూక్, అక్షయ్, అజయ్‌లకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అక్టోబర్ 20వ తేదీనే నోటీసులిచ్చిందని కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే కోర్టుకు తెలిపారు. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. విచారణ 2024 మే 9కి వాయిదా పడింది. -
పొగాకు ఉత్పత్తులపై ఆంక్షలు ఎత్తేస్తాం
వెల్లింగ్టన్: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పొగాకు వాడకంపై గత ప్రభుత్వం తీసుకువచి్చన నియంత్రణలను తొలగిస్తామని న్యూజిలాండ్ నూతన ప్రధాని క్రిస్టొఫర్ లక్సాన్ చెప్పారు. మాజీ వ్యాపారవేత్త, నేషనల్ పార్టీ నేత అయిన లక్సాన్‌తో సోమవారం గవర్నర్ జనరల్ సిండీ కిరో ప్రధానిగా ప్రమాణం చేయించారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో నేషనల్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. మరో రెండు పారీ్టలతో కలిసి తాజాగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రమాణ స్వీకారం అనంతరం క్రిస్టొఫర్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం గత ఏడాది పొగాకు వినియోగంపై తీసుకువచి్చన నియంత్రణలను తొలగిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు ఏదేశంలోనూ లేని విధంగా సిగరెట్లలో నికొటిన్ స్థాయిలను తగ్గించడం, యువతపై జీవిత కాల ధూమపాన నిషేధం, సిగరెట్ విక్రేతల తగ్గింపు వంటివి అప్పటి ప్రభుత్వం ప్రకటించిన చర్యల్లో ఉన్నాయి. -
తండ్రికి ఇచ్చిన మాట కోసం సచిన్ ఏం చేశాడంటే..?
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (మే 31) సందర్భంగా ముంబైలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కెరీర్ ప్రారంభంలో పొగాకు ఉత్పత్తుల ప్రమోషన్స్ కోసం భారీ ఆఫర్లు వచ్చాయని, పొగాకు ఉత్పత్తులకు ప్రచారం చేయనని తన తండ్రికి ఇచ్చిన మాట కోసం వాటిని తిరస్కరించానని సచిన్ చెప్పుకొచ్చారు. Sachin Tendulkar said, "tobacco companies offered me a blank cheque in the past to promote them, but I promised my father that I'll never promote it as he said I'm a role model and people will follow what I do". pic.twitter.com/oi5jqgYroJ — Mufaddal Vohra (@mufaddal_vohra) May 31, 2023 పొగాకు కంపెనీలు తమ తరఫున ప్రచారం చేయమని బ్లాంక్ చెక్‌లు ఇచ్చేవారని, అయినా ఏ రోజు వారికి ఓకే చెప్పలేదని తెలిపారు. తన సహచరుల్లో చాలామంది బ్యాట్‌పై పొగాకు ఉత్పత్తుల (సిగరెట్) స్టిక్కర్లు అంటించుకుని ప్రచారం చేసే వారని, తాను కెరీర్ ఆరంభంలో రెండేళ్ల పాటు ఏ అడ్వర్టైజ్మెంట్ స్టిక్కర్‌ను తన బ్యాట్‌పై అంటించుకోలేదని తెలిపారు. తన తండ్రి తాను ప్రజలకు రోల్ మోడల్‌గా ఉండాలని కోరుకున్నారని.. నేను చేసే ప్రతి పనిని వారు అనుకరించే ప్రయత్నం చేస్తారని ఆయన చెప్పారని, అందుకే పొగాకు ఉత్పత్తుల ప్రచారానికి దూరంగా ఉంటున్నానని పేర్కొన్నారు. తన తండ్రికి ఇచ్చిన మాటకు నేటికీ కట్టుబడి ఉన్నానని.. మున్ముందు కూడా పొగాకు ఉత్పత్తులకు ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయనని సచిన్ స్పష్టం చేశారు. చదవండి: AsiaCup 2023: కొత్త ట్విస్ట్.. పాక్ లేకుండానే టోర్నీ నిర్వహణ! -
స్మగ్లింగ్ దందా.. 51 లక్షల ఉద్యోగాలకు ఎసరు
సాక్షి, అమరావతి: తక్కువకు వస్తాయనే ఉద్దేశంతో కొంతమంది స్మగుల్ గూడ్స్ కొంటూ ఉంటారు. ఈ అక్రమ వ్యాపారం ద్వారా ఏటా లక్షల కోట్లు చేతులు మారతాయంటే నమ్మగలమా? ఈ స్మగ్లింగ్ వల్ల ఏటా వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తోంది. దేశంలో పరిశ్రమల విస్తరణకు విఘాతంగా మారి ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తోంది. స్మగ్లింగ్ దందా దేశ ఆర్థిక వ్యవస్థను ఎంతగా దెబ్బతీస్తోందనే అంశంపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ప్రముఖ మార్కెట్ అధ్యయన సంస్థ ‘థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(టీఏఆర్‌ఐ) ద్వారా అధ్యయనం చేయించింది. దేశ మార్కెట్లోకి అక్రమంగా చొరబడుతున్న ఉత్పత్తుల్లో మొదటి ఐదు స్థానాల్లో ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, గృహ వినియోగ, మద్యం, పొగాకు ఉత్పత్తులు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఈ ఐదు కేటగిరీల్లో స్మగ్లింగ్ దందా ప్రభావాన్ని టీఏఆర్‌ఐ ద్వారా అధ్యయనం చేశారు. విదేశాల నుంచి దేశంలోకి స్మగ్లింగ్ చేస్తున్న టాప్–5 ఉత్పత్తుల విలువ ఏటా రూ. 2.60 లక్షల కోట్లుగా ఉంటోంది. దాంతో భారత ప్రభుత్వం పన్నుల ద్వారా రావాల్సిన రూ. 58 వేల కోట్ల ఆదాయాన్ని ఏటా కోల్పోతోంది. అంతే కాదు 51 లక్షల ఉపాధి అవకాశాలకు కూడా గండి పడుతోంది. ఆ ఐదు కేటగిరీల స్మగ్లింగ్ తీవ్రత ఎలా ఉందంటే.. ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు దేశంలోకి ఏటా సగటున రూ. 1,42,284 కోట్ల విలువైన ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారు. దేశంలో ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తుల మార్కెట్లో ఈ అక్రమ దిగుమతి ఉత్పత్తుల వాటా ఏకంగా 25.09 శాతం ఉంటోంది. తద్వారా దేశం రూ. 17,074 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. అంతేకాదు అక్రమ ఉత్పత్తులతో దేశంలో ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తుల పరిశ్రమను దెబ్బతీస్తోంది. దాంతో దేశంలో 7.94 లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. గృహ వినియోగ ఉత్పత్తులు గృహోపకరణాలు, గృహవినియోగ ఉత్పత్తులు, వ్యక్తిగత వినియోగ ఉత్పత్తులే దేశంలో అత్యధిక మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. ఈ మార్కెట్‌ను కూడా స్మగ్లింగ్ ఉత్పత్తులు కొల్లగొడుతున్నాయి. దేశంలోకి ఏటా రూ. 55,530 కోట్ల విలువైన గృహవినియోగ ఉత్పత్తులు అక్రమగా దిగుమతి అవుతున్నాయి. మొత్తం మార్కెట్ వాటాలో ఈ ఉత్పత్తుల వాటా 34.25 శాతం ఉంది. దాంతో దేశం ఏటా రూ. 9,995 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. ఇక పరిశ్రమలు దెబ్బతినడంతో దేశంలో ఏటా 2.89 లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. మద్యం ఉత్పత్తులు.. విదేశాల నుంచి వచ్చే అక్రమ మద్యం దేశ మార్కెట్‌ను కొల్లగొడుతోంది. ఏటా రూ. 23,466 కోట్ల విలువైన విదేశీ అక్రమ మద్యం దేశ మార్కెట్లోకి చొరబడుతోంది. దేశంలో మద్యం మార్కెట్లో ఈ అక్రమ మద్యం వాటా 19.87 శాతం. దాంతో దేశం ఏటా రూ. 15,262 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. దేశంలో 97 వేల మంది ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. పొగాకు ఉత్పత్తులు విదేశాల నుంచి దేశ మార్కెట్లోకి ఏటా రూ. 22,930 కోట్ల విలువైన పొగాకు ఉత్పత్తులు అక్రమంగా ప్రవేశిస్తున్నాయి. దేశ పొగాకు మార్కెట్లో ఈ ఉత్పత్తుల వాటా 20.04 శాతం ఉంది. దాంతో దేశం ఏటా సగటున రూ. 13,331 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. దేశంలో 3.7 లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. మొబైల్ ఫోన్ల మార్కెట్ దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న మొబైల్ ఫోన్ల మార్కెట్‌ను కూడా స్మగ్లింగ్ చీడ పీడిస్తోంది. విదేశాల నుంచి స్మగ్లింగ్ ద్వారా దేశంలోకి ఏటా రూ. 15,884 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు వచ్చి చేరుతున్నాయి. దేశ మొబైల్ ఫోన్ల మార్కెట్లో ఈ ఫోన్ల వాటా 7.56 శాతంగా ఉంది. దాంతో దేశం రూ. 2,859 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుండటంతో పాటు దేశంలో 35 వేల మంది ఉపాధి అవకాశాలకు గండి పడుతోంది. -
పొగాకు వేలానికి వేళాయె..!
పొగాకు వేలానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పొగాకు బోర్డు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రీజియన్ పరిధిలోని ఉమ్మడి ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల పరిధిలో ఉన్న 11 వేలం కేంద్రాలను దశలవారీగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే కర్నాటకలో వేలం చివరి దశకు చేరుకుంది. రికార్డు స్థాయిలో ధరలు పలకడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. అవే ధరలు వస్తే తమ పంట పండినట్టేనని సంబరపడుతున్నారు. కందుకూరు: ఈ ఏడాది సాగులో మాండూస్ లాంటి తుఫాన్లు ఇబ్బంది పెట్టినా పొగాకు సాగులో రైతులు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అంతర్జాతీయ మార్కెట్లో పొగాకుకు విపరీత డిమాండ్ రావడం, పక్క రాష్ట్రం కర్ణాటకలో జరిగిన పొగాకు అమ్మకాల్లో కిలో పొగాకు రికార్డు ధరల పలకడం రైతుల్లో ఉత్సాహం నింపింది. 2022–23 సీజన్‌కు సంబంధించి రైతులు పెద్ద ఎత్తున పొగాకు సాగు చేశారు. పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 61,639 హెక్టార్లలో పొగాకు రైతులు సాగు చేశారు. పంట సాగు విస్తీర్ణం పెరగడంతో బోర్డు అనుమతిని మించి ఉత్పత్తి రావచ్చునని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోపక్క ఈనెలాఖరు నుంచి పొగాకు వేలం అధికారికంగా ప్రారంభించేందుకు బోర్డు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. 23 నుంచి దశల వారీగా.. పొగాకు వేలాన్ని ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభించేలా పొగాకు బోర్డు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. 23వ తేదీన తొలుత ఒంగోలు, పొదిలి, కొండపి, వెల్లంపల్లి వేలం కేంద్రాల్లో, మార్చి 9న రెండో దశలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధి కందుకూరు–1,2 కలిగిరి, డీసీ పల్లి వేలం కేంద్రాలతో పాటు జిల్లాలోని కనిగిరి, ఒంగోలు, టంగుటూరు కేంద్రాల్లో వేలం ప్రారంభం కానుంది. కర్నాటకలో ఈ ఏడాది కిలో పొగాకు రూ.274ల వరకు పలికింది. ఇక్కడ గతేడాది కిలో పొగాకు అత్యధిక ధర రూ.184 వచ్చింది. అదే కిలో సరాసరి ధర అత్యధికంగా రీజియన్ పరిధిలో రూ.172 వరకు వచ్చింది. కర్ణాటక మార్కెట్లో ఒక్కసారిగా రికార్డు స్థాయిలో ధరలు రావడంతో అదే స్థాయిలో ఇక్కడ కూడా రేట్లు ఉంటాయనే ఆశలు రైతులు పెట్టుకున్నారు. అధిక విస్తీర్ణంలో సాగు: పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్‌లో 11 వేలం కేంద్రాలున్నాయి. వీటిలో తేలిక నేలల పరిధిలో (ఎస్ఎల్ఎస్) నెల్లూరు జిల్లాలోని కందుకూరు–1, కందుకూరు–2, కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాలతో పాటు జిల్లాలోని పొదిలి, కనిగిరి వేలం కేంద్రాలున్నాయి. నల్లరేగడి నేలల (ఎస్బీఎస్) పరిధిలో జిల్లాలోని వెల్లంపల్లి, ఒంగోలు–1, ఒంగోలు–2, టంగుటూరు, కొండపి వేలం కేంద్రాలున్నాయి. 2022–23 సీజన్‌కు గాను 57,744 హెక్టార్లలో పొగాకు సాగుకు బోర్డు అనుమతిచ్చింది. అయితే రికార్డు స్థాయిలో 61,639 హెక్టార్లలో పంట సాగైంది. అదే 2021–22లో బోర్డు 49,889.15 హెక్టార్లలో పంట సాగుకు బోర్డు అనుమతిస్తే సాగైంది మాత్రం 46,647.01 హెక్టార్లు మాత్రమే. అంటే బోర్డు అనుమతికంటే తక్కువగా సాగైంది. కానీ ఈ ఏడాది మాత్రం బోర్డు అనుమతిని మించి సాగు చేపట్టారు. గత ఏడాది వేలంలో పొగాకు మంచి ధరలు రావడం, ఈ ఏడాది కూడా అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో అధిక శాతం మంది రైతులు పొగాకు సాగువైపు మొగ్గు చూపారు. గతేడాది డిసెంబర్లో వచ్చిన మాండూస్ తుఫాన్ వల్ల పంట నష్టపోయినా రైతులు మాత్రం తిరిగి పొగాకునే సాగు చేశారు. జనవరి చివరి వరకు సాగుచేస్తూనే ఉన్నారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. దీని వల్ల ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో పొగాకు పంట సాగైందని అధికారులు చెప్తున్నారు. 99 మిలియన్ కేజీల ఉత్పత్తి అంచనా: పంట సాగు విస్తీర్ణం పెరగడంతో ఆ మేరకు పొగాకు ఉత్పత్తి కూడా పెరుగుతుందని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. బోర్డు 11 వేలం కేంద్రాల పరిధిలో 87 మిలియన్ కేజీల పొగాకును విక్రయించుకునేందుకు అనుమతించింది. కానీ అనుమతిని మించి 12 మిలియన్ కేజీలు అధికంగా అంటే 99 మిలియన్ కేజీల ఉత్పత్తి వస్తుందని బోర్డు అధికారుల అంచనా. అలాగే ఈ ఏడాది క్యూరింగ్‌లో నాణ్యత కూడా పర్వాలేదని చెప్తున్నారు. 55–60 శాతం వరకు బ్రైట్ గ్రేడ్(గ్రేడ్–1) పొగాకు వస్తుందని, 25 శాతం మీడియం, మరో 25 శాతం లోగ్రేడ్ పొగాకు ఉత్పత్తులు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. అంటే ఒక రకంగా ఈ ఏడాది పొగాకు రైతులకు ఆశాజనకంగా ఉందని చెప్పవచ్చు. -
పొగరాయుళ్లకు కేంద్రం షాక్! ఇక సిగరెట్లు అలా లభించడం కష్టమే?
పొగరాయుళ్లకు కేంద్రం షాకివ్వనుంది. రానున్న రోజుల్లో విడిగా సిగరెట్ల అమ్మకాల్ని బ్యాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని అరికట్టేలా సింగిల్ సిగరెట్ల అమ్మకాల్ని బ్యాన్ చేయాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. వదులుగా ఉన్న సిగరెట్ల అమ్మకాలు పొగాకు నియంత్రణపై చేస్తున్న ప్రచారాన్ని ప్రభావితం చేస్తున్నాయని కమిటీ సభ్యులు వాదించారు. దీంతో పాటు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌లలో స్మోకింగ్ జోన్లను తొలగించాలని కమిటీ సిఫార్స్ చేసింది. స్టాండింగ్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తే, పార్లమెంట్ త్వరలో సింగిల్ సిగరెట్ల అమ్మకాల్ని నిషేధించవచ్చు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు 3 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఇ-సిగరెట్ల అమ్మకం, వాడకాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. జీఎస్టీ అమలు తర్వాత కూడా పొగాకు ఉత్పత్తులపై పన్నులో పెద్దగా పెరుగుదల లేదని స్టాండింగ్ కమిటీ గుర్తించింది. మద్యం, పొగాకు ఉత్పత్తుల వినియోగం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని కమిటీ హైలైట్ చేసింది.తాజా పన్ను శ్లాబుల ప్రకారం..బీడీలపై 22 శాతం, సిగరెట్లపై 53 శాతం, పొగలేని పొగాకుపై 64 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. మరోవైపు, పొగాకు ఉత్పత్తులపై 75శాతం జీఎస్టీ విధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది. ఏడాదికి 3.5లక్షల మందికి మరణం పలు నివేదికల ప్రకారం, మన దేశంలో స్మోకింగ్ కారణంగా ఏడాదికి 3.5 లక్షల మంది మరణిస్తున్నట్లు తేలింది. 2018 లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ నిర్వహించిన ఒక సర్వేలో ధూమపానం చేసే వారిలో 46 శాతం మంది నిరక్షరాస్యులు, 16 శాతం మంది కాలేజీ విద్యార్ధులు ఉన్నారు. ఫౌండేషన్ ఫర్ స్మోక్ ఫ్రీ వరల్డ్ నివేదిక ప్రకారం.. భారత్‌లో ప్రతి సంవత్సరం సుమారు 6.6 కోట్ల మంది సిగరెట్లు తాగుతుండగా, 26 కోట్లకు పైగా ఇతర పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. పొగాకు వాడకం వల్ల భారతదేశంలో సుమారు 21శాతం మందికి క్యాన్సర్ సోకుతున్నట్లు ఓ అధ్యయనం వెలుగులోకి తెచ్చింది. -
పొగాకు ఉత్పత్తులపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక కొత్తగా..!
న్యూఢిల్లీ: దేశంలో విక్రయించే పొగాకు ఉత్పత్తుల ప్యాక్‌లపై డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ‘టొబాకో కాజెస్ పెయిన్ఫుల్ డెత్’ అనే కొత్త ఆరోగ్య హెచ్చరిక, కొత్త చిత్రం ముద్రితమవుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అవి ఏడాది పాటు కొనసాగుతాయని వివరించింది. 2023 డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ప్రమాదాన్ని తెలిపే మరో కొత్త చిత్రంతోపాటు ‘టొబాకో యూజర్స్ డై యంగర్’ అని ముద్రితమవుతుందని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సిగరెట్స్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్ రూల్స్–2008 చట్టానికి 2022 జూలై 21వ తేదీన చేసిన సవరణ డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని వివరించింది. పొగాకు ఉత్పత్తుల తయారీదారు, దిగుమతి దారు, పంపిణీదారులు ఎవరైనా సరే ఈ హెచ్చరికలను ముద్రించకుంటే జైలు శిక్ష, జరిమానా విధించేందుకు చట్టం వీలు కల్పిస్తోందని హెచ్చరించింది. ఇదీ చదవండి: ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల పెండింగ్ కేసులు -
గుట్కా దందా.. తమ్ముళ్ల పంథా
సాక్షి, ఒంగోలు: చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి చాటుమాటు పనులు అన్న చందంగా ఉంది తెలుగు తమ్ముళ్ల తీరు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలకు తెగబడిన టీడీపీ నాయకులు.. అధికారంలో లేనప్పుడు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి, గుట్కా దందాకు తెరలేపారు. ఒంగోలు నగరానికి చెందిన టీడీపీ నాయకుడు గుట్లాపల్లి శ్రీమన్నారాయణ గంజాయి, గుట్కా వ్యాపారం చేస్తూ మాఫియాగా మారాడు. చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన శ్రీమన్నారాయణ తల్లి మస్తానమ్మ ప్రస్తుతం ఒంగోలు 46వ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు. ఆయన సోదరుడు కూడా టీడీపీలో క్రియాశీలకమైన పదవిలో ఉన్నాడు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఏళ్ల తరబడి గంజాయి, గుట్కాల వ్యాపారం చేస్తూ జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా గంజాయి, గుట్కా ప్యాకెట్లను తరలిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాడు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు శ్రీమన్నారాయణ అత్యంత సన్నిహితుడు. దామచర్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా గంజాయి, గుట్కా వ్యాపారం జోరుగా సాగించాడు. మాజీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు కూడా అత్యంత సన్నిహితుడుగా మెలుగుతూ వచ్చాడు. యువతకు ఉపాధి కోసం టీడీపీ ధర్నాలో ప్లకార్డు పట్టుకొని నిరసన తెలుపుతున్న శ్రీమన్నారాయణ (ఫైల్) గుడ్లూరు పోలీసులకు గంజాయితో పట్టుబడి గుడ్లూరు పోలీసులకు గుట్లాపల్లి శ్రీమన్నారాయణ గత ఏడాది గంజాయితో పట్టుబడ్డాడు. 2021 ఏప్రిల్ 25వ తేదీన గుడ్లూరు పోలీసులు జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తుండగా బెంగళూరు నుంచి కారులో గంజాయితో వస్తూ దీనిని గమనించిన గుట్లాపల్లి శ్రీమన్నాయణ బృందం కారును తిరిగి కావలి వైపునకు తిప్పడంతో పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. అప్పట్లో వారి వద్ద కారులో 10 కేజీల గంజాయి దొరికింది. గుడ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీమన్నారాయణతో పాటు తెట్టుకు చెందిన తిరుమలరాజు వెంకటేశ్వరరాజు, ఏకొల్లు కృష్ణార్జున రావు, బెంగళూరుకు చెందిన శంకర్ మోహన్, ప్రధాన నిందితుడు శ్రీమన్నారాయణ కారు డ్రైవర్ రమేష్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: (ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు) ) గుట్కా ప్యాకెట్లతో నిందితులు శ్రీమన్నారాయణ, కారు డ్రైవర్ ఒంగోలులో గుట్కాల నిల్వలతో... ఒంగోలు నగరంలో కారులో గుట్కాలు తరలిస్తున్నట్లు ఎస్పీ మలికాగర్గ్‌కు సమాచారం వచ్చింది. దీంతో ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ ఎన్.సూర్యచంద్రారావు తన సిబ్బందితో దాడి చేసి కారును పట్టుకున్నారు. కారును స్వాధీనం చేసుకొని కారు నడుపుతున్న ముల్లూరి వెంకట నాగ శివ చరణ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న 27,375 గుట్కాప్యాకెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు గుట్లాపల్లి శ్రీమన్నారాయణ అక్రమ వ్యాపారం బయటపడింది. ఒంగోలు నగరంలోని బృందావన్ నగర్ 11 వ లైన్‌లోని ఒక పాడుబడిన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్ల గుట్టు రట్టయింది. ఆ ఇంట్లో 2,39,556 గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఆ ఇల్లు 46వ డివిజన్ టీడీపీకి చెందిన కార్పొరేటర్ గుట్లాపల్లి మస్తానమ్మ, కుమారుడు గుట్లాపల్లి శ్రీమన్నారాయణది అని తేలింది. మొత్తం గుట్కా ప్యాకెట్ల విలువ రూ.3,43,224 గా ఎస్ఈబీ పోలీసులు తేల్చారు. ఇలా గంజాయి, గుట్కా అక్రమ వ్యాపారంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. -
పొగాకు రహిత ప్రాంతాలుగా పాఠశాలలు
సాక్షి, అమరావతి: పాఠశాలలు, వాటి పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల రహిత వాతావరణం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఇప్పటికే విద్యా సంస్థల ప్రహరీల నిర్మాణంతో పాటు, పాఠశాలకు వంద గజాల్లోపు ప్రాంతంలో సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదే విధంగా విద్యాసంస్థలు, వాటి పరిసరాలు పొగాకు రహిత ప్రాంతాలుగా ఉండేలా ఇతర కార్యక్రమాలు చేపడుతోంది. వైద్యారోగ్య శాఖ ఇతర శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. విద్యా సంస్థలను పొగాకు రహిత ప్రాంతంగా ధ్రువీకరించేలా 9 ప్రమాణాలతో వైద్య శాఖ ‘టుబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్’(టోఫీ) పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చి.. దానిని ఏపీ ఏఎన్ఎం హెల్త్ యాప్‌తో అనుసంధానించింది. ఏఎన్ఎంలు తమ పరిధిలోని పాఠశాలలను సందర్శించి.. ప్రభుత్వం సూచించిన 9 ప్రమాణాలను పాటిస్తున్న పాఠశాలల వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 51,717 పాఠశాలలుండగా.. ఇప్పటి వరకూ 14,020 తొమ్మిది పాఠశాలలు ప్రభుత్వ ప్రమాణాలను సంపూర్ణం చేశాయి. ఆ 9 ప్రమాణాలు.. ► విద్యా సంస్థ ఆవరణలో పొగాకు రహిత ప్రాంతం అనే సంకేతాలతో సైన్ బోర్డ్‌ల ఏర్పాటు. ► పాఠశాల ద్వారం బయట పొగాకు రహిత విద్యా సంస్థ అనే సైన్ బోర్డ్ ఏర్పాటు ► పాఠశాల ఆవరణ లోపల పొగాకు ఉత్పత్తులను వినియోగించిన ఆధారాలు లేకుండా ఉండాలి. ► గోడల మీద పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలపను వివరించే, ఇతర అవగాహన పద్ధతుల ప్రదర్శన. ► పొగాకు నియంత్రణ కార్యకలాపాలను గత 6 నెలల్లో ఒక్కసారైనా నిర్వహించడం. ► పొగాకు పర్యవేక్షకుడి నియామకం ► పాఠశాలను పొగాకు రహితంగా నిర్ణయించడం. ► సరిహద్దు గోడ బయట 10 గజాల దూరాన్ని గుర్తించి.. కాల్చి పడేసిన సిగరెట్ ముక్కలు, గుట్కా, ఖైనీ కవర్లు, వీటిని నమిలి ఉమ్మిన ఆనవాళ్లు లేకుండా చూడటం ► 100 గజాల్లోపు పొగాకు ఉత్పత్తులను విక్రయించే దుకాణాల సంఖ్యను నివేదించడం. -
పొగాకు ఉత్పత్తులపై కొత్త హెచ్చరికలు
న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ముద్రించే ఆరోగ్య హెచ్చరికలకు కొత్త వాటిని చేరుస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ తర్వాత తయారైన, దిగుమతి చేసుకున్న, ప్యాక్ అయిన పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై మొదటి సెట్ హెచ్చరికలను, రెండో సెట్ హెచ్చరికలను వచ్చే ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ తర్వాత ముద్రించాలి. వీటి తయారీ, సరఫరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యత వహించే వారు ఈ హెచ్చరికలను ప్యాకేజీలపై ముద్రించాలంటూ సవరించిన ప్యాకేజింగ్, లేబులింగ్ నిబంధనలను ఆ నోటిఫికేషన్లో వివరించింది. వీటిని అతిక్రమించిన వారికి చట్ట ప్రకారం జైలుశిక్ష, జరిమానా ఉంటాయి. ప్యాకేజీలపై ముద్రించాల్సిన హెచ్చరికలు.. ‘పొగాకు వాడకంతో దేశంలో ఏటా 12 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. భారతదేశంలో వచ్చే అన్ని రకాల క్యాన్సర్లలో 50 శాతం పొగాకు వల్లే సంభవిస్తున్నాయి. నోటి క్యాన్సర్లలో 90 శాతం పొగాకుతో సంబంధం ఉన్నవే’. ఈ హెచ్చరికలతో కూడిన రెండు చిత్రాలను 12 నెలలకు ఒకటి చొప్పున అన్ని పొగాకు ఉత్పత్తుల ప్యాకేజీలపైన ముద్రించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపింది. -
పిల్లిని చంకలో పెట్టుకుని..ఊరంతా వెతికిన పోలీసులు
టీడీపీ ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ నాయకులు ఇసుక, మట్టిని కూడా వదలకుండా అక్రమంగా విక్రయించి జేబులు నింపుకున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతలు నిషేధిత ఖైనీ తయారీని సైతం వదల్లేదు. వాటిని తయారు చేసే అక్రమార్కులు రాష్ట్రం నలుమూలలకు సరఫరా చేసి అందిన కాడికి దండుకున్నారు. అక్రమార్కులకు టీడీపీ నాయకులు తమ అండదండలు అందించి ఇప్పటికీ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఇటీవల వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక నిషేధిత గుట్కాలపై పోలీసులు కన్నెర్ర చేశారు. అన్ని ప్రాంతాల్లోని షాపుల్లో తనిఖీలు చేపట్టి జిల్లా వ్యాప్తంగా పలువురు వ్యాపారులను కటకటాల వెనక్కి నెట్టారు. చివరకు జిల్లా కేంద్రం ఒంగోలుకు కూతవేటు దూరంలో ఖైనీల తయారీ కేంద్రాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. పోలీసుల తీరు పిల్లిని చంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్లు ఉంది. సాక్షి, మేదరమెట్ల: పారిశ్రామిక కేంద్రంగా వేలాది మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్న మేదరమెట్ల.. అక్రమ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా కూడా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. నిషేధిత పొగాకు ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మేదరమెట్ల రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చుకుంటోంది. స్పెషల్ బ్రాంచి పోలీసులు సమాచారం మేరకు మేదరమెట్ల పోలీసులు నిషేధిత ఖైనీ ఉత్పత్తుల తయారీ కేంద్రం గుట్టురట్టు చేశారు. ఈ వ్యవహారం అంతా ఓ టీడీపీ నేత గోడౌన్లో మూడేళ్ల నుంచి గుట్ట చప్పుడు కాకుండా నడుస్తున్నట్లు గుర్తించారు. చివరకు రూ.3 కోట్ల విలువైన ఖనీ తయారీ ముడి సరుకు, యంత్రాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన బలగాని ప్రసాద్ కొరిశపాడు మండలం మేదరమెట్లలోని పోకూరి హనుమంతురావుకు చెందిన మౌనిక పొగాకు గోడౌన్‌ను రెండేళ్ల కిందట అద్దెకు తీసుకున్నాడు. దాన్ని నిఖిత పొగాకు కంపెనీగా పేరు మార్చుకొని నిషేధిత ఖైనీ తయారు చేసే కేంద్రంగా మార్చాడు. ఖైనీ తయారీకి వినియోగిస్తున్న ముడిసరుకు, యంత్రాలు ఈ క్రమంలో గోడౌన్లో పొగాకు కంపెనీ పేరుతో ముడి సరుకులను తెచ్చి ఖైనీ ప్యాకెట్లు తయారు చేసి రాష్ట్రం నలుమూలలకు విక్రయిస్తున్నారు. స్పెషల్ బ్రాంచి హెడ్‌కానిస్టేబుల్ జిలానీ సమాచారంతో ఎస్పీ ఆదేశాల మేరకు అద్దంకి సీఐ అశోకవర్థన్, మేదరమెట్ల ఎస్ఐ బాలకృష్ణలు తమ సిబ్బందితో ఖైనీ తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించేందుకు వెళ్లారు. అప్పటికే నిర్వాహకుడు కేంద్రాలకు తాళం వేసి పరారైనట్లు తెలుసుకున్నారు. గోడౌన్ షట్టర్ల తాళాలు పగులగొట్టి పరిశీలించగా రూ.3 కోట్ల విలువైన ఖైనీ తయారీకి వినియోగించే ముడు సరుకు, యంత్రాలను పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. గోడౌన్ యజమాని పోకూరి హనుమంతురావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పక్కాగా కూపీలాగి ఖైనీ తయారీ కేంద్రాన్ని గుర్తించడంలో సహకరించిన ఎస్బీ హెడ్‌కానిస్టేబుల్ జిలానీ, సీఐ, ఎస్ఐలను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్బీ డీఎస్పీ శ్రీరాంబాబు, సీఐ శ్రీకాంత్‌బాబు, దర్శి డీఎస్పీ ప్రభాకర్‌రావు, ఫుడ్‌సేఫ్టీ అధికారులు నాగశేషయ్య, సీహెచ్ లక్మీనారాయణ పాల్గొన్నారు. -
పోలింగ్ ప్రాంతంలో పొగాకు ఉండదిక!
న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తులపై చట్టపరమైన నిషేధ నిబంధనలను పటిష్టస్థాయిలో అమలుచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులోభాగంగా, పోలింగ్ బూత్‌లలో పొగాకు సంబంధ ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయనున్నారు. బీడీ, సిగరెట్, గుట్కాలతోపాటు నమిలే పొగాకు ఉత్పత్తులనూ పోలింగ్ బూత్‌లలో నిషేధించింది. పొగ తాగడంసహా, ఉత్పత్తులపై నిషేధం పూర్తిగా అమలయ్యేలా జిల్లా ఎలక్టోరల్/జిల్లా మెజిస్ట్రేట్లను ఆదేశించాలని సూచిస్తూ అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఈసీ లేఖలు రాసింది. ‘దేశంలోని అన్ని పోలింగ్ బూత్‌లు పొగాకురహితంగా ఉండాలి’ అని ఈసీ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. -
జూనియర్ కాలేజీల్లో ‘పొగ తాగరాదు’ బోర్డులు
సాక్షి, హైదరాబాద్: పొగాకు ఉత్పత్తుల బారి నుంచి యువతను కాపాడుకోవడమే లక్ష్యంగా, రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్ని పొగాకు రహితంగా మార్చేయాలని అన్ని జిల్లాల ఇంటర్ విద్యాధికారులు, నోడల్ అధికారులు, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రధానోపాధ్యాయుల్ని ప్రభుత్వం ఆదేశించినట్లు వాలంటరీ హెల్త్ అసో సియేషన్ ఆఫ్ ఇండియా (వీహెచ్ఏఐ) ప్రతినిధి శిరీష శనివారం తెలిపారు. తమ విన్నపం మేరకు ఈ ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. ఇంటర్ విద్యా కమిషనర్ ఆదేశాల ప్రకారం అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాల (జనరల్ అండ్ వొకేషనల్)ల్లో ‘పొగ తాగరాదు’సూచిక బోర్డుల్ని ఏర్పాటు చేయాలి. పొగాకు రహిత కళాశాలగా స్వీయ హామీ పత్రాన్ని ఇంటర్మీడియట్ విద్యాధికారికి ప్రధానోపాధ్యాయులు సమర్పించాలి. పొగాకు రహిత కళాశాలల జిల్లాగా స్వీయ హామీ పత్రాన్ని డిసెంబర్ 28 లోగా సంబంధిత జిల్లా ఇంటర్ అధికారి, ఇంటర్ విద్యా కమిషనర్ కార్యాలయంలో సమర్పిం చాలి. దీనిని వీహెచ్ఏఐకు పంపిస్తారు. రాష్ట్రంలోని జిల్లాల ఇంటర్ విద్యాధికారులు ప్రతి 3 నెలలకోసారి త్రైమాసిక నివేదికల్ని సమర్పించాలి. పొగాకు ఉత్ప త్తులు (ప్రొహిబిషన్ ఆఫ్ అడ్వర్టయిజ్మెంట్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్, ప్రొడక్షన్, సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్) 2003 చట్టం (కోప్టా) సెక్షన్ 6 ప్రకారం మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం నిషేధం. విద్యాసంస్థలకు 100 గజాలకంటే తక్కువ దూరంలో పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. కోప్టా చట్టం సెక్షన్ 6 (బి) ప్రకారం విద్యా సంస్థలకు 100 గజాల లోపు పొగాకు ఉత్పత్తులు అమ్మడం నేరమంటూ బోర్డుల్ని ఏర్పాటు చేయాలి. -
సిగరెట్ ప్యాకెట్లపై భయానక చిత్రాలు
న్యూఢిల్లీ : సిగరెట్లు, గుట్కా, ఖైనీలు వంటి పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని ప్రజల్లో ఎలాగైనా మాన్పించాలనే ఉద్దేశ్యంతో, ఆ ఉత్పత్తులపై ముద్రించే చిత్రాలను కేంద్రం మరింత భయానకంగా రూపొందించింది. పొగాకు ఉత్పత్తుల ప్యాకేజింగ్ నిబంధనలను మారుస్తూ, భయానకమైన ఆరోగ్య హెచ్చరికల చిత్రాలను విడుదల చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు రెండు సెట్ల ఇమేజ్‌లను విడుదల చేసింది. తొలి సెట్ 12 నెలల పాటు అన్ని పొగాకు ఉత్పత్తులపై ముద్రించాలని, ఆపై రెండో సెట్ బొమ్మలను ముద్రించాలని తేల్చిచెప్పింది. ఇదే సమయంలో పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించే టోల్ ఫ్రీ నంబర్ '1800-11-2356'ను విధిగా ప్రతి ప్యాక్‌పై ముద్రించాలని కూడా ఆదేశించింది. ఈ హెల్ప్ లైన్నెంబర్ పొగాకు వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తోంది. పొగాకు ఉత్పత్తులను మానడానికి వారికి కౌన్సిలింగ్ సర్వీసులను కూడా అందించనుంది. కాగా, ప్రస్తుతం సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లపై ఉన్న హెచ్చరికల చిత్రాలతో పోలిస్తే ఇవి మరింత భయానకంగా ఉండటం గమనార్హం. గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే వెల్లడించిన నివేదిక ప్రకారం, ప్రస్తుతం సిగరెట్లు తాగుతున్న వారిలో 15 ఏళ్లలోపు వారు కూడా ఉన్నారని వెల్లడైన సంగతి తెలిసిందే. బీడీ స్పోకర్లు 53.8 శాతం, స్మోక్ చేయని పొగాకు వినియోగదారులు 46.2 శాతం మంది ఉన్నట్టు సర్వే తెలిపింది. కొత్త హెచ్చరికల చిత్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్ సైట్(www.mohfw.gov.in) నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ కొత్త హెచ్చరికల చిత్రాలను అన్ని స్థానిక భాషల్లో త్వరలోనే మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1 2018 నుంచి ఈ కొత్త హెచ్చరికల చిత్రాలను ముద్రించాల్సి ఉంది. -
గుట్కాకు అడ్డాగా..
గుట్కా అమ్మకాలకే కాదు.. దాని తయారీకి కూడా జిల్లా అడ్డాగా మారుతోంది. జిల్లా కేంద్రమైన కాకినాడతోపాటు.. వాణిజ్య కేంద్రమైన రాజమహేంద్రవరం నగరాలు ఈ అక్రమ దందాకు కేంద్రాలుగా నిలుస్తున్నాయి. మన జిల్లాతోపాటు, రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు ఈ దందాలో ప్రధాన భాగస్వాములుగా నిలుస్తున్నారు. ఈ గుట్టును జిల్లా, రాజమహేంద్రవరం అర్బన్ పోలీసులు శనివారం ఛేదించారు. కాకినాడ రూరల్ : గుట్కా అమ్మకాలతోపాటు దాని తయారీకి కూడా కాకినాడ నగరం నిలయంగా మారుతోంది. తూరంగి పంచాయతీ పరిధి కాకినాడ – యానాం రోడ్డులోని ఓ ప్రైవేటు గోడౌన్‌పై ఇంద్రపాలెం పోలీసులు, ఆహార అధికారులు శనివారం చేసిన దాడి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ దాడుల్లో గుట్కా తయారీకి సిద్ధంగా ఉంచిన రూ.50 లక్షలకు పైగా విలువైన ముడిసరుకు, తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి సీఐ రాజశేఖర్, ఇంద్రపాలెం ఎస్సై డి.రామారావుల కథనం ప్రకారం.. గోడౌన్లో గుట్కా తయారీకి అవసరమైన ముడి సరుకు, దానిని పొడిగా మార్చేందుకు అవసరమైన యంత్రాలు ఉన్నాయి. అక్కడ ముడిసరుకు తయారు చేసి, ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజవోలు గ్రామంలోని మరో గుట్కా తయారీ కేంద్రానికి తరలిస్తారు. అక్కడ గుట్కా ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. రాజవోలు గుట్కా కేంద్రానికి సంబంధించి తొమ్మిది మంది అనుమానితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని, వారి ద్వారా వచ్చిన సమాచారంపై తూరంగిలోని గోడౌన్‌పై దాడి చేశారు. అయితే ఈ దాడిలో ఎవ్వరూ పట్టుబడలేదని, ముందుగానే సమాచారం తెలుసుకొని పరారైనట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. గుట్కా తయారీకి అవసరమైన ముడి సరుకు ఎక్కడి నుంచి వస్తోందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి, సంబంధిత వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని రాజశేఖర్, రామారావు చెప్పారు. ఈ దాడిలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వై.పాండురంగారావు, ఇంద్రపాలెం ఏఎస్సై మురళీకృష్ణ, కానిస్టేబుళ్లు రవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఆ నిషేధంతో వీధిన పడతాం
సాక్షి,బెంగళూరు: చిల్లర దుకాణాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై చట్టబద్దమైన నిషేధాజ్ఞాలు జారీ చేయడానికి సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కర్ణాటక రాష్ట్ర పొగాకు ఉత్పత్తుల వ్యాపారస్థుల సంఘం నాయకులు, సభ్యులు డిమాండ్ చేశారు. చిల్లర దుకాణాల్లో పొగాకు ఉత్పత్తులపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ మెజిస్టిక్ బస్టాండ్ నుంచి ఫ్రీడం పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం వల్ల చిల్లర వ్యాపారస్థులు తీవ్రంగా నష్టపోనున్నారన్నారు. చిల్లర దుకాణాల్లో పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మందికిపైగా చిల్లర వ్యాపారస్థుల కుటుంబాలు రోడ్డు పడనున్నాయన్నారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి పునరాలోంచించాలని, ఒకవేళ నిషేధం తప్పనిరి చేస్తే చిల్లర వ్యాపారస్థులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ర్యాలీలో సంఘం ప్రధాన కార్యదర్శి మునిరాజు తదితరులు పాల్గొన్నారు. -
పొగాకు ఉత్పత్తులు హానికరం..
విజయనగరం ఫోర్ట్: పొగాకు ఉత్పత్తులు హానికరమని జేసీ–2 నాగేశ్వరరావు అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతి రేక దినోత్సవం సందర్భంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిగరె ట్లు, చుట్ల తాగేవారికంటే ఆ పొగపీల్చే వారికే నష్టం ఎ క్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా స్త్రీ, పురుషల్లో లైంగిక పటుత్వం తగ్గిపోతుందని చెప్పా రు. పొగాకు ఉత్పత్తులు తినడం గాని తాగడం గాని చేయకూడదన్నారు. ఆరోగ్యంగా జీవించాలంటే పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డీఎల్ఓ జి.రవికుమార్, డీపీఎం బాలాజీ, డీఐసీ సాక్షి గోపాలరావు, డెమో విజయ, తదితరులు పాల్గొన్నారు. దూరంగా ఉండండి.. ప్రతి ఒక్కరూ పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడంతో పాటు వ్యాయామం చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ సి. పద్మజ సూచించారు. పొగాకు ఉత్పత్తులు తినడం వల్ల కలిగే అనర్థాలపై గ్రామీణ వైద్యుల సంఘం రుపొందించిన కరపత్రాలను జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పొగాకు ఉత్పత్తుల తినడం వల్ల క్యాన్సర్, బ్రాంకలైటిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సంఘ జిల్లా అధ్యక్షుడు గద్దె చిరంజీవి, ప్రధాన కార్యదర్శి శర్మ, జోనల్ కన్వీనర్ గోపి, ఉమాశంకర్, తదితరులు పాల్గొన్నారు. -
నమిలే పొగాకు ఉత్పత్తుల్ని నిషేధించరేం?
న్యూఢిల్లీ: గుట్కా, పాన్ మసాలా వంటి నమిలే పొగాకు ఉత్పత్తులను నిషేధించేందుకు చర్యలెందుకు తీసుకోరని ఆహార భద్రత ప్రమాణాల శాఖను ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. కేంద్రంగానీ లేదా ఏదేని రాష్ట్రాలు గానీ నమిలే పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించాయా అని కోర్టు ప్రశ్నించింది. గుట్కాపై నిషేధం విధించాలని ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఓ పొగాకు ఉత్పత్తి సంస్థ వేసిన వ్యాజ్యాన్ని కోర్టు విచారించింది. ఈ సందర్భంగా పోక చెక్క, పొగాకు, మరికొన్ని విషపదార్థాలను తమలపాకులో చుట్టి పాన్ మసాలా తయారు చేస్తున్నారని.. ఇది ఆరోగ్యానికి హానికరమైనదని తెలిసి కూడా సంబంధిత అధికారులు నిషేధం ఎందుకు విధించడంలేదని న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవ వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. నమిలే పొగాకు ఉత్పత్తులమీద నిషేధం విధిస్తే అసలు సమస్యే లేకుండా పోతుంది కదా అని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు ఆహార భద్రత ప్రమాణాల శాఖ తరఫున న్యాయవాది ఎం. ప్రచా సమాధానమిస్తూ.. నమిలే పొగాకు ఉత్పత్తుల నిషేధానికి ప్రత్యేక నోటిఫికేషన్ అవసరం లేదని.. గుట్కాపై విధించిన నిషేధం వీటికి వర్తిస్తుందన్నారు. అయితే, గుట్కాపై విధించిన నిషేధం చట్టాలు బలంగా అమలు కావడంలేదని ఆయన కోర్టుకు తెలిపారు. వాదనల అనంతరం విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. -
‘ఆహార భద్రత’ కింద నిషేధమా..?
పొగాకు ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఆహార నిర్వచనం కింద పొగాకు ఉత్పత్తుల తయారీ, పంపిణీ, నిల్వ, అమ్మకాలపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆహార భద్రత, ప్రమాణాల చట్టం కింద ఆహార భద్రత కమిషనర్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. పొగాకు ఉత్పత్తులకు ఆహార భద్రత, ప్రమాణాల చట్టం కింద నిషేధం ఎలా వర్తిస్తుందో వివరించాలంటూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, రాష్ట్ర ఆహార, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆహార భద్రత కమిషనర్, డీజీపీ, కరీంనగర్ జిల్లా ఎస్పీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం కింద రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆహార భద్రత కమిషనర్ ఈ ఏడాది జనవరి 10న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ కరీంనగర్ జిల్లా ప్రకాశంగంజ్కు చెందిన శ్రీ వెంకటేశ్వర జనరల్ స్టోర్ యజమాని కె.కరణ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున ఇ.మదన్మోహన్రావు వాదనలు వినిపిస్తూ... పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం కింద కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిందని... సిగరెట్లు, చుట్టలు, బీడీలు తదితరాలు పొగాకు ఉత్పత్తుల పరిధుల్లోకి వస్తాయని పేర్కొందన్నారు. అయితే రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకాలపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆహార భద్రతా చట్టం కింద నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. గతేడాది కూడా ఇదే విధంగా నోటిఫికేషన్ జారీ చేయగా, దానిపై హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. -
హెచ్చరిక చిత్రాలు ఉండాల్సిందే
పొగాకు పరిశ్రమలకు తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తులపై ‘ఆరోగ్యానికి హానికరం’ అని సూచించే చిత్రాలు 85 శాతం ముద్రించాలని సుప్రీంకోర్టు బుధవారం తేల్చిచెప్పింది. కేంద్రం ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్న నిర్ణయంపై కోర్టుకు వెళ్లిన పొగాకు పరిశ్రమలకు తాజా తీర్పుతో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కర్ణాటక కోర్టు ఇచ్చిన స్టేను నిలిపివేస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. ఇదివరకు సిగరెట్ ప్యాకెట్లపై ఉన్న ఆరోగ్యానికి హానికరమని సూచించే చిత్రాల సైజును 20 శాతం నుంచి 80 శాతానికి మారుస్తూ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. వాదనల సమయంలో సమాజం పట్ల మీకు బాధ్యత ఉండాలని పొగాకు పరిశ్రమలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. -
ఆ మాటకే కట్టుబడి ఉన్నా: సచిన్
ముంబై: గతంలో తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. తన జీవితంలో మద్యం, పొగాకు ఉత్పత్తుల కోసం ఎప్పుడూ ప్రచారం చేయలేదని, చేయబోనని సచిన్ టెండూల్కర్ మరోసారి చెప్పారు. ‘మా నాన్న నా కెరీర్ ఆరంభంలోనే నాకు ఈ విషయం స్పష్టంగా చెప్పారు. ఎప్పటికీ మద్యం, పొగాకు ఉత్పత్తుల కోసం ప్రచారం చేయనని ఆయనకు మాట ఇచ్చాను. అనేకసార్లు వీటికి సంబంధించి పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినా పట్టించుకోలేదు’ అని సచిన్ చెప్పారు. జీవితంలో ఎలాంటి కెరీర్ ఎంచుకున్నా సవాళ్లు ఎదురవుతాయని, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగితేనే గొప్పవాళ్లుగా ఎదుగుతారని అన్నాడు. -
మున్సిపల్ సంస్థలకు నిధులపై సర్కారుకు హైకోర్టు నోటీసు
మే 13లోగా జవాబివ్వాలని ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ : మున్సిపల్ సంస్థలకు నిధుల కేటాయింపై రాష్ట్ర ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసి సంజాయిషీ కోరింది. మున్సిపల్ సంస్థలకు నిధులు సమానంగా మంజూరు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణీ, న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లాతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనపై వాదనలు విన్న అనంతరం ఢిల్లీ సర్కారుతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్, మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు, భారత ఫైనాన్స్ కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుకు మే 13లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంది. మూడు మున్సిపల్ కార్పొరేషన్లు సరిగ్గా తమ విధులను నిర్వర్తించేందుకు తక్ష ణం నిధులు విడుదల చేసేలా ఢిల్లీ సర్కారును, లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ ‘క్యాంపెయిన్ ఫర్ పీపుల్ పార్టిసిపేషన్ ఇన్ డెవలప్మెంట్ ప్లానింగ్’ అనే ఎన్జీవో సంస్థ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. పొగాకు ఉత్పత్తుల నిషేధంపై సర్కారుకు నోటీసు నమిలే పొగాకు ఉత్పత్తులపై నగరంలో విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆప్ సర్కారుకు నోటీసు జారీచేసింది. మే 20న తదుపరి విచారణ జరిపేంత వరకు పొగాకు ఉత్పత్తుల అమ్మకందారులపై ఎలాంటి చర్యలు చేపట్టరాదని సర్కారును ఆదే శించింది. పొగాకు ఉత్పత్తుల తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్షక్దర్ బుధవారం విచారించారు. వాదనలు విన్న అనంతరం ఢిల్లీ ప్రభుత్వ ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు న్యాయమూర్తి నోటీసు జారీ చేసి సంజాయిషీ కోరారు. ఆహారభద్రత, ప్రమాణాల చట్టం కింద పొగాకు ఉత్పత్తులను నిషేధించే అధికారం ఢిల్లీ ప్రభుత్వానికి లేదని పిటిషనర్ సుగంధీ స్పఫ్ కింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ చెప్పారు. -
పాన్ కోకాలపై పోలీసుల దాడులు
రూ. 50 వేల విలువ చేసే పొగాలు ఉత్పత్తుల కాల్చివేత నిజామాబాద్ క్రైం : జిల్లా కేంద్రంలో పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు విక్రయించే కోకాలపై పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్, తదితర ప్రాంతాల్లో పాన్ కోకాలపై ఎస్హెచ్ఓ శ్రీనివాసులు దాడులు జరిపారు. జనసమ్మర్థమైన ప్రాంతమైనందున ఇక్కడ పాన్ కోకాలు ఎక్కువగా ఉన్నాయి.గుట్కా పాకెట్ట విక్రయాలూ ఎక్కువగానే ఉంటాయి. రైల్వేస్టేషన్, బస్టాండ్ రోడ్డు, గంజ్, బోధన్ రోడ్డు, అర్సపల్లి, మాలపల్లి ప్రాంతాలలో పాన్ కోకలపై దాడులు చేసి రూ. 50 వేల విలువ గల పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నారు. పట్టుకున్న ప్యాకెట్లు దహనం చేశారు. నగరంలోని అయిదవ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి వర్నిరోడ్డులోనూ పోలీసులు దాడులు చేశారు. టౌన్ రెండవ ఎస్సై నాగారాజు ఆధ్వర్యంలో వర్ని చౌరస్తా, నాగారం రోడ్డు, న్యాల్కల్ రోడ్డులో దాడులు చేశారు. పొగాకు, గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. గుట్కాపై పంజా - చిరు వ్యాపారులపైనే దాడులు - అసలు సూత్రధారులపై చర్యలు లేవు - రోజుకు కోట్ల రూపాయల వ్యాపారం - గతంలోనూ పట్టుకుని వదిలేశారు నిజామాబాద్ అర్బన్: జిల్లావ్యాప్తంగా రెండు మూడు రోజులుగా పోలీసులు కొనసాగిస్తున్న దాడులు గుట్కా వ్యాపారులను కలవరపెడుతున్నారుు. పాన్‌షాపులు, కిరా ణా దుకాణాలను విస్తృతంగా తనిఖీ చే స్తున్నారు. ఇప్పటికే లక్షల రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పట్టుకొని దహనం చేశారు. నగరంతోపాటు ఆర్మూర్, మోర్తాడ్, భీంగల్, మద్నూ ర్, జుక్కల్, కామారెడ్డిప్రాంతాలలో ఈ దాడులు జరిగారుు. సోమవారం దా దాపు అన్ని ఠాణాల పరిధిలో సోదాలు నిర్వహించారు. గుట్కాల అమ్మకాలను నిరోధించేందుకు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ప్రత్యేక టాస్క్ఫోర్సును ఏర్పాటు చేయడంతో అధికారులు కదిలారు. చిరువ్యాపారులేసరే.. అసలు సూత్రదారులపై చర్యలేవి? అయితే, పాన్కోకాలు, కిరాణాలపై దా డులు కొనసాగిస్తున్న పోలీసులు అస లు గుట్కా విక్రయదారులను ఎందుకు ఉపేక్షిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నా రు. జిల్లా కేంద్రంగా గుట్కా వ్యాపారం నిత్యం రూ. కోట్లలో జరుగుతుంది. ఓ పార్టీకి చెందిన మైనార్టీ నేత వ్యాపారం కొనసాగిస్తున్నారు. సారంగాపూర్ ప్రాంతంలోని ఓ గోదాంలో గుట్కాల సరఫరా కేంద్రం ఉంది. మండలాలకు ఇక్కడినుండే సరఫరా చేస్తున్నారు. గ తంలో నిజామాబాద్ రూరల్ పోలీసు లు ఈ నేతకు చెందిన గుట్కా ఫ్యాకెట్ల కంటె రుునర్ను పట్టుకున్నారు. దీంతో హడలెత్తిపోయిన ఈ వ్యాపారి ఓ మ హిళానేత సాయంతో విడిపించుకున్నా రు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇతర ప్రాంతాలకు కూడా ఇక్కడి నుండే సరఫరా చేస్తున్నారు. గాంధీచౌక్‌లోని ప్ర ధాన కేంద్రంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో నగరంలోని పం డ్ల మార్కెట్ సమీపంలో మున్సిపల్ వై ద్యాధికారి సిరాజొద్దీన్ అక్రమంగా కొ నసాగుతున్న జర్దా, గుట్కా కేంద్రాలపై దాడులు చేశారు. సుమారు ఆరు లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీ నం చేసుకున్నారు. మున్సిపల్‌కు చెంది న ఓ అధికారి మామూలు తీసుకొని అ క్రమ వ్యాపారస్తులను వదిలివేసినట్లు సమాచారం. కేసు కూడా నమోదు చే యకపోవడం గమనార్హం. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన బోధన్, జుక్క ల్, మద్నూరు, బిచ్కుంద ప్రాంతాల లో ఈ వ్యాపారం కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో పెద్ద మొత్తంలో నిల్వ కేం ద్రాలు ఉంటాయి. జిల్లా కేంద్రంలో కూడా ఈ విక్రయాలు ఎక్కువగా ఉండడంతో, రోజుకు లక్షలాది రూపాయల విక్రయాలు జరుగుతుంటాయి. పోలీ సులు అసలు సరఫరా చేసే గోదాములపై దాడులు చేస్తే ఇతర ప్రాంతాలకు గుట్కా,జర్దా చేరకుండా ఉంటుంది. వీ టిపై ఆరా తీసిన పోలీసులు దాడులు మాత్రం చేయడం లేదు. జిల్లా కేంద్ర ం లో సోమవారం బస్టాండ్, రైల్వేస్టేషన్, మాలపల్లి, వినాయక్‌నగర్ ప్రాంతాల లో దాడులు కొనసాగాయి. -
అండగా నేనుంటా
బీడీ కార్మికులకు కేంద్ర మంత్రి దత్తన్న భరోసా అవసరమైతే మహిళా కార్మికులను ఢిల్లీకి తీసుకెళతా సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానని వెల్లడి సిద్దిపేట అర్బన్ : పొగాకు ఉత్పత్తులపై అప్పటి కేంద్ర ప్రభుత్వం 2005లోనే కఠిన నిర్ణయాలు తీసుకుందని, కఠినమైన నిబంధనలపై పోరాడి ఎన్నింటినో తొలగింపజేశానని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. మంగళవారం పట్టణంలో ని శివమ్స్ గార్డెన్లో బీఎంఎస్, తెలంగాణ ప్రదేశ్ బీడీ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులు చెప్పిన పలు సమస్యలను విన్నారు. చేతినిండా పని కల్పించాలని, డేంజర్ మార్క్ గుర్తును తొలగింపజేయాలని, పీఎఫ్ కల్పించాలని, రూ. వెయ్యి పింఛన్ ఇవ్వాలని వారు కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బీడీ కట్టలపై 85 శాతం ప్రమాద హెచ్చరిక గుర్తును ముద్రించాలని విడుదల చేసిన జీఓ 727 (ఈ)ని అమలు చేయడంలో ఈ నెల 18, 19న ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులతో సమావేశం ఉందన్నారు. అందులో ఈ జీఓపై కఠిన నిర్ణయాలపై చర్చిస్తానని బీడీ కార్మికులకు తగిన న్యాయం జరి గేలా చూస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే మహిళా కార్మికులను ఢిల్లీకి తీసుకెళ్లి మంత్రితో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. చేతితో చేసే ఈ పరిశ్రమను ఆదుకునేందుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలో 17 లక్షల కుటుంబాలు ఈ బీడీ పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్నారని వారికి తన అండదండలు తప్పక ఉంటాయని స్పష్టం చేశారు. బీడీ కార్మికులకు యూవిన్ స్మార్ట్ కార్డులను కేంద్ర ప్రభుత్వం త్వరలో అందజేస్తుందని వీటి ద్వారా పీఎఫ్ సమాచారం నేరుగా కార్మికుల సెల్‌కు అందుతుందని పేర్కొన్నారు. ఈ కార్డు రాష్ట్రీయ స్వస్త్బీమా, ఆమ్ ఆద్మీ బీమా, పింఛన్లకు కూడా వర్తిస్తుందన్నారు. బీడీ కార్మికులందరికి ఇండ్ల స్థలాలను కొనుగోలు చేసి ఇంటి నిర్మాణాలను చేపడుతామని చెప్పారు. గతంలో ఇంటి నిర్మాణానికి రూ. 40 వేలు మాత్రమే ఇచ్చేవారని రూ. లక్ష ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అదే విధంగా వారికి ఆస్పత్రులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్దిపేటలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీడీ కార్మికులు, కమిషన్ ఏజెంట్లు, అంగన్వాడీ వర్కర్లు, మోటార్ వర్కర్స్, ఆర్చ్ ఫార్మా ఉద్యోగులు మంత్రికి తమ సమస్యలను తెలియజేస్తూ వినతి పత్రాలను అందజేసి సన్మానించారు. మంత్రి వారి సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి, బీఎంఎస్, తెలంగాణ ప్రదేశ్ బీడీ కార్మిక సంఘం, బీజేపీ, బీజేవైఎం నాయకులు కలాల్ శ్రీనివాస్, గంగాడి మోహన్‌రెడ్డి, అమర్‌సింగ్, అంజిరెడ్డి, వంగ రాంచంద్రారెడ్డి, సొప్పదండి విద్యాసాగర్, రాఘవులు, సుధీర్‌కుమార్, శివయ్య, మల్లేషం, కిష్టయ్య, రాజిరెడ్డి, ఉమేష్‌గౌడ్, కిషన్, రాజు, దత్తు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
‘హెచ్చరిక’ వద్దు..
నక్కలగుట్ట : బీడి, పొగాకు ఉత్పత్తులకు సంబంధించి కేంద్రప్రభుత్వం ఎలాంటి నియమ నిబంధనలు, సవరణలు చేయకూడదని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట వరంగల్ జిల్లా బీడి వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. బీడి కట్టలపై కొత్త హెచ్చరికను ముద్రించొద్దని కోరారు. ధర్నాలో బీడి వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య, ప్రధానకార్యదర్శి ఎండీ ఖాసిం ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టర్ వాకాటి కరుణకు వినతిపత్రం సమర్పించారు.