సాక్షి, హైదరాబాద్: పొగాకు ఉత్పత్తుల బారి నుంచి యువతను కాపాడుకోవడమే లక్ష్యంగా, రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్ని పొగాకు రహితంగా మార్చేయాలని అన్ని జిల్లాల ఇంటర్ విద్యాధికారులు, నోడల్ అధికారులు, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రధానోపాధ్యాయుల్ని ప్రభుత్వం ఆదేశించినట్లు వాలంటరీ హెల్త్ అసో సియేషన్ ఆఫ్ ఇండియా (వీహెచ్‌ఏఐ) ప్రతినిధి శిరీష శనివారం తెలిపారు. తమ విన్నపం మేరకు ఈ ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. ఇంటర్ విద్యా కమిషనర్ ఆదేశాల ప్రకారం అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాల (జనరల్ అండ్ వొకేషనల్)ల్లో ‘పొగ తాగరాదు’సూచిక బోర్డుల్ని ఏర్పాటు చేయాలి.
పొగాకు రహిత కళాశాలగా స్వీయ హామీ పత్రాన్ని ఇంటర్మీడియట్ విద్యాధికారికి ప్రధానోపాధ్యాయులు సమర్పించాలి. పొగాకు రహిత కళాశాలల జిల్లాగా స్వీయ హామీ పత్రాన్ని డిసెంబర్ 28 లోగా సంబంధిత జిల్లా ఇంటర్ అధికారి, ఇంటర్ విద్యా కమిషనర్ కార్యాలయంలో సమర్పిం చాలి. దీనిని వీహెచ్‌ఏఐకు పంపిస్తారు. రాష్ట్రంలోని జిల్లాల ఇంటర్ విద్యాధికారులు ప్రతి 3 నెలలకోసారి త్రైమాసిక నివేదికల్ని సమర్పించాలి. పొగాకు ఉత్ప త్తులు (ప్రొహిబిషన్ ఆఫ్ అడ్వర్టయిజ్మెంట్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్, ప్రొడక్షన్, సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్) 2003 చట్టం (కోప్టా) సెక్షన్ 6 ప్రకారం మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం నిషేధం. విద్యాసంస్థలకు 100 గజాలకంటే తక్కువ దూరంలో పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. కోప్టా చట్టం సెక్షన్ 6 (బి) ప్రకారం విద్యా సంస్థలకు 100 గజాల లోపు పొగాకు ఉత్పత్తులు అమ్మడం నేరమంటూ బోర్డుల్ని ఏర్పాటు చేయాలి.
జూనియర్ కాలేజీల్లో ‘పొగ తాగరాదు’ బోర్డులు
Published Sun, Nov 11 2018 3:22 AM | Last Updated on Sun, Nov 11 2018 3:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment