junior colleges
-
ఏప్రిల్ ఒకటి నుంచే ఇంటర్ తరగతులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్లో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను, సీబీ ఎస్ఈ విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూనియర్ కాలేజీలు ఏప్రిల్ 1వ తేదీనే ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఇంటర్ రెండో సంవత్సరం సిలబస్ బోధన మొదలవుతుంది. ఏప్రిల్ 5 నుంచి మొదటి సంవత్సరం ప్రవేశాలు చేపడతారు. ఏప్రిల్ 23 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు వేసవి సెలవులు ఇస్తారు. జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా ఇప్పటికే పాఠశాల విద్యలో సీబీఎస్ఈ విధానంలో ఎన్సీఈఆర్టీ పాఠాలను బోధిస్తున్నారు. ప్రస్తు త (2024–25) విద్యా సంవత్సరంలో పదో తరగతి బోధన సైతం ఇదే విధానంలోకి మారింది. వచ్చే నెలలో (మార్చిలో) పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అనుగుణంగా 2025–26 వి ద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యలో ఎన్సీఈఆర్టీ సిలబస్, సీబీఎస్ఈ విధానాలు అమలుచేస్తారు. ఇంటర్ విద్యలో జాతీయ స్థాయి సిలబస్ అమలు సాధ్యాసాధ్యాలు, చేపట్టాల్సిన మార్పులపై నియమించిన కమిటీలు 12 రాష్ట్రాల్లో పర్యటించి ఇచ్చిన నివేదిక మేరకు ఈ మార్పులకు శ్రీకారం చుట్టారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరం, 2026–27లో రెండో సంవత్సరంలో కొత్త సిలబస్ ప్రవేశపెడతారు. అలాగే, వచ్చే విద్యా సంవత్సరంలో కొత్తగా ఎంబైపీసీ కోర్సును సైతం ప్రవేశపెడుతున్నారు. సీబీఎస్ఈ తరహాలో మార్పులుఇప్పటి వరకు ఇంటర్ పరీక్షల తర్వాత వేసవి సెలవులు, ఆ తర్వాత జూన్ 1వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేది. 223 రోజులు పనిదినాలు ఉండేవి. అయితే, సీబీఎస్ఈ విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించి, ఇంటర్ రెండో ఏడాది బోధన మొదలు పెడతారు. ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు ఇస్తారు. జూన్ ఒకటిన కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయి. తొలి 23 రోజుల్లో కనీసం 15 శాతం సిలబస్ పూర్తిచేసి వేసవి సెలవులు ఇస్తారు. పని దినాలు సైతం నెల రోజులు పెరిగాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఏప్రిల్ 5 నుంచే మొదటి సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయి. అందువల్ల పదో తరగతి పరీక్షలు (రెగ్యులర్/ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ) రాసిన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశం పొందవచ్చు. పాసైన వారిని కొనసాగించి, ఫెయిలైనవారిని తొలగిస్తారు.ప్రభుత్వ కాలేజీల్లో జేఈఈ, ఎంసెట్ శిక్షణ రాష్ట్రంలోని సైన్స్ విద్యార్థుల్లో ఎక్కువ మంది జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు రాస్తున్నందున ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు కూడా వీటిలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లతోనే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అవసరం మేరకు ప్రత్యేక నిపుణులతో తరగతులు చెప్పిస్తారు. ఇందుకోసం ప్రత్యేక మెటీరియల్‌ను సిద్ధం చేస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అకడమిక్ తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకురెండు గంటలు జేఈఈ, ఎంసెట్ శిక్షణ ఇస్తారు. -
ఫలితాల్లో సర్కార్ కాలేజీల సత్తా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో ప్రైవేటు కాలేజీలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ కాలేజీలు సత్తా చాటాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం తగ్గినా అత్యధిక మార్కులు కైవసం చేసుకున్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ గురుకులాలు, కేజీబీవీలు ప్రైవేటు కాలేజీలను మించి ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుంచి 77,022 మంది పరీక్ష రాస్తే 37,842 (49.13%) పాసయ్యారు.గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల నుంచి 80,331 మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయగా 59,530 (74.11%) మంది పాసయ్యారు. ప్రైవేటు కాలేజీల నుంచి 3,44,724 మంది పరీక్షలు రాస్తే వారిలో 2,23,911 (65.24%) మందే పాసవడం గమనార్హం. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థుల్లో కొందరు రాష్ట్రంలోనే అత్యధిక మార్కులు సాధించారు. -
10 లక్షల మంది బాలికలకు ‘స్వేచ్ఛ’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న బాలికలకు ‘స్వేచ్ఛ’ పథకం కింద శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు నెలల కాలానికి గాను మొదటి విడతగా జూన్‌లో ప్యాడ్స్ అందించగా, రెండో విడత పంపిణీని అక్టోబర్ నెలలో ప్రారంభించనున్నారు. బాలికల స్కూల్ డ్రాప్ అవుట్‌కు కారణమవుతున్న రుతుక్రమ సమయంలో ఇబ్బందులను పరిష్కరించేందుకు 2020–21 విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఏడు నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న కిశోర బాలికలకు నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేస్తోంది. కౌమారదశలో ఉన్న బాలికలు రుతుస్రావం సమయంలో పాఠశాల, కాలేజీ మానేస్తున్నారు. దీంతో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించడంతో పాటు రుతుక్రమం సమయంలో బాలికల వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ నాణ్యమైన(బ్రాండెడ్) శానిటరీ ప్యాడ్స్‌ను ప్రభుత్వమే రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న 10,144 పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని విద్యార్థినులకు అందిస్తోంది. గతంలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టగా, ఈ ఏడాది నుంచి పాఠశాల విద్యాశాఖలోని మధ్యాహ్న భోజన విభాగానికి అప్పగించారు. వచ్చే నెలలో 4 కోట్ల ప్యాడ్స్ పంపిణీకి ఏర్పాట్లు దేశంలో 23 శాతం మంది విద్యార్థినులు బహిష్టు సమయంలో పాఠశాలలు, కళాశాలలకు దూరంగా ఉంటున్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని 10,144 స్కూళ్లు, కాలేజీల్లో 7 నుంచి 12వ తరగతి చదువుతున్న 10 లక్షల మంది విద్యార్థినులకు ఒకొక్కరికి నెలకు 10 ప్యాడ్స్ చొప్పున ఏడాదికి 12 కోట్ల ప్యాడ్స్‌ను పంపిణీ చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఈ ఏడాది రూ.35 కోట్ల నిధులను వెచ్చింది. ప్రతి నాలుగు నెలలకు ఒక పర్యాయం పంపిణీ కార్యక్రమం చేపడుతోంది. ఈ విద్యా సంవత్సరంలో సెపె్టంబర్ వరకు అవసరమైన ప్యాడ్స్‌ను జూన్ నెలలో అందించగా, రెండో విడత పంపిణీని అక్టోబర్‌లో ప్రారంభించనున్నారు. దీంతో రుతుక్రమంలో ఎదురయ్యే సమస్యలు, నివారణ చర్యలపై విద్యార్థినుల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి పాఠశాలలోను నెలకు ఒకసారి మహిళా ఉపాధ్యాయులు, మహిళా పోలీసుల ద్వారా సదస్సులు నిర్వహిస్తున్నారు. వినియోగించిన ప్యాడ్స్‌ను పర్యావరణ హితంగా నాశనం చేసేందుకు ప్రత్యేక డస్ట్బిన్లు, యంత్రాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. -
కొత్తగా మూడు గురుకుల జూనియర్ కళాశాలలు మంజూరు
సాక్షి, అమరావతి: మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో మరో మూడు కొత్త జూనియర్ కాలేజీలు మంజూరు అయ్యాయి. ఇప్పటికే రాష్ట్రంలో 14 జూనియర్ కాలేజీలు ఉండగా, కొత్తగా మంజూరైన వాటితో కలిపి ఆ సంఖ్య 17కు చేరింది. కొత్త జూనియర్ కాలేజీలను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించారు. నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బేతంచర్ల(బాలురు), చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని సదూం(బాలురు), శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస(బాలికలు) కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఒక్కో కాలేజీలో ఎంపీసీ 40, బైపీసీ 40 సీట్లు చొప్పున కేటాయించారు. కాగా, రాష్ట్రంలో బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో మొత్తం 105 గురుకులాలు ఉన్నాయి. వాటిలో 17 జూని యర్ కాలేజీలు కాగా, మిగిలిన 88 పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. మొత్తం 44 వేల మంది విద్యార్థులు వీటిలో చదువుతున్నారు. నీట్, జేఈఈలో బీసీ విద్యార్థుల ప్రతిభ నీట్, జేఈఈ పరీక్షల్లో బీసీ విద్యార్థులు ప్రతిభ చూపారని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి కృష్ణమోహన్ తెలిపారు. వాటి ఫలితాలను అంచనా వేస్తే మెడికల్ సీట్లు నలుగురు, డెంటల్ ఒకరు, వెటర్నరీ నలుగురు, అగ్రికల్చర్ బీఎస్సీ సీట్లు నలుగురు సాధించే అవకాశం ఉందని చెప్పారు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ ఆరుగురు విద్యార్థులు, ఇంజినీరింగ్ సీట్లు 24 మంది సాధించనున్నారని వివరించారు. -
వస్తున్నారు టాపర్లు! మారిన సర్కారు బడి.. మురిసిన చదువుల తల్లి
వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి దాకా 2019–23 మధ్య విద్యా రంగంలో పలు ప్రగతిశీల మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలను తలదన్నేలా సకల సదుపాయాలతో రూపు దిద్దుకున్నాయి. ‘మనబడి నాడు–నేడు’ పథకంతో ప్రభుత్వ విద్యా సంస్థలు సమూల మార్పులతో సమున్నతంగా మారాయి. ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లు అంటే చులకనగా చూసే పరిస్థితి నుంచి ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి పరీక్షలు రాసి.. టాప్ మార్కులు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ సంస్కరణలకు అద్దంపట్టారు. విద్యా రంగ సంస్కరణల కోసమే గత నాలుగేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.59,173.72 కోట్లు వెచ్చించింది. ఇందులో భాగంగా జగనన్న అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, పాఠశాల నిర్వహణ నిధి వంటి పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగు పరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలు అమలు చేశారు. స్కూళ్లలో చేపట్టిన నాడు–నేడు పనులు పూర్తయి విద్యార్థులకు అందుబాటులోకి రాగా, ప్రస్తుతం రెండో దశ పనులు జరుగుతున్నాయి. – సాక్షి, అమరావతి నాలుగేళ్లలోఎంత తేడా! నాడు విరిగిన బెంచీలు.. బీటలు వారిన గోడలు.. పెచ్చులూడే పైకప్పులు.. వర్షం వస్తే సెలవులే.. సగం విద్యా సంవత్సరం పూర్తయ్యే దాకా అందని పాఠ్య పుస్తకాలు, అసలు పిల్లలు బడికి వస్తున్నారో లేదో పట్టించుకోని పరిస్థితి. ఇదీ నాలుగేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. నేడు ప్రస్తుతం అందమైన భవనాలు.. పిల్లల కోసం డబుల్ డెస్క్ బెంచీలు.. డిజిటల్ తరగతి గదులు.. ద్విభాషా పాఠ్య పుస్తకాలు.. ఇంగ్లిష్ ల్యాబ్‌లు, ఆర్వో నీరు.. పరిశుభ్రంగా ఉండే మరుగుదొడ్లు.. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు జతల యూనిఫారం, బూట్లు, బెల్టు, పుస్తకాలు పెట్టి స్కూలు బ్యాగు అందజేత.. అన్నింటికీ మించి పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాలో ఏటా రూ.15 వేల కానుక. విద్యపై చేసే ఖర్చు భవిష్యత్‌కు పెట్టుబడి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇబ్బందులను చూశారు. కనీస సదుపాయాలు లేక ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోయి విద్యార్థుల భవిష్యత్ ఏంటో తెలియని పరిస్థితి. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వీలుగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే బృహత్తర సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నాడు–నేడు ద్వారా రూ.వేల కోట్ల ని«ధులతో పనులు చేపట్టారు. రాష్ట్రంలోని 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూడు విడతల్లో అభివృద్ధి పరిచేలా కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చారు. 2019–20లో తొలి విడతగా 15,715 స్కూళ్లలో రూ.3,669 కోట్లతో కనీసం 9 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. నీటి వసతితో మరుగు దొడ్లు, తాగునీటి సదుపాయం, మేజర్, మైనర్ మరమ్మతులు, విద్యుత్ సదుపాయం, విద్యార్థులు, టీచర్లకు డ్యూయెల్ డెస్కులు, బెంచీలు, కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు వంటి ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డులు, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్ నిర్మాణం వంటి వసతులు కల్పించారు. ఆ తర్వాత కిచెన్షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులు దీనికి జోడించారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, జిల్లా విద్యా బోధనా శిక్షణ కళాశాలల(డైట్స్)తో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెస్తున్న శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లనూ నాడు–నేడులోకి చేర్చింది. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు, కేజీబీవీలు.. మొత్తంగా తొలివిడతలో 61,661 విద్యా సంస్థల్లో రూ.16,450.69 కోట్లతో పది రకాల సదుపాయాలు కలి్పంచారు. నాడు–నేడు రెండో దశలో రూ.8,000 కోట్లతో 22,344 స్కూళ్లలో పనులు చేపట్టారు. అమ్మ ఒడి.. గోరుముద్ద.. విద్యా కానుక పిల్లల చదువుకు తల్లిదండ్రుల పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మ ఒడి పథకంతో అర్హురాలైన ప్రతి పేద తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఇప్పటి దాకా రూ.19,674.34 కోట్లు తల్లులకు అందించింది. జగనన్న గోరుముద్ద పథకంతో నాణ్యమైన, రుచికరమైన పోషకాహారాన్ని మధ్యాహ్న భోజనంగా పిల్లలకు అందించేందుకు రోజుకో రకం మెనూ ప్రకటించింది. వారంలో ఐదు రోజులు గుడ్డు, మూడు రోజులు చిక్కి (వేరుశనగ, బెల్లంతో తయారీ) పిల్లలకు అందిస్తున్నారు. ఏటా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.1,800 కోట్లు వెచ్చిస్తోంది. పాఠశాలల్లో పిల్లల ఆత్వవిశ్వాసాన్ని పెంచేందుకు ప్రభుత్వం బోధన–అభ్యాస సామగ్రిని సరఫరా చేస్తోంది. అందుకోసం జగనన్న విద్యా కానుకగా ప్రతి కిట్‌లో ఒక బ్యాగ్, స్టిచింగ్ చార్జీతో సహా 3 జతల యూనిఫారాలు, ఒక బెల్ట్, జత షూ, రెండు జతల సాక్స్‌లు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, వర్క్‌బుక్‌లు ఇంగ్లిష్–తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అందిస్తోంది. ప్రభుత్వం జగనన్న విద్యా కానుక కింద 47 లక్షల మంది విద్యార్థుల కోసం మూడేళ్లలో రూ.2,368.33 కోట్లు ఖర్చు చేసింది. బోధన, పాఠ్య ప్రణాళికలో సంస్కరణలు వైఎస్సార్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి, పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ప్రమాణాలను తీసుకొచ్చింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని దశల వారీగా అమలు చేస్తోంది. ఇప్పటికే 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ అమలు చేస్తోంది. పునాది స్థాయి నుంచే విద్యా రంగాన్ని పటిష్టం చేసేలా కరిక్యులమ్ సంస్కరణలు చేపట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను అందిస్తోంది. ఉన్నత పాఠశాలలో పదో తరగతి పాసైన బాలికలందరూ చదువుకు దూరం కాకూడదని ప్రతి మండలంలో ఒక జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైసూ్కల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేసింది. మొత్తం 352 కేజీబీవీలలో ప్లస్ 2 ప్రవేశపెట్టింది. మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం కనీసం ఒక జూనియర్ కళాశాల ఉంది. కోవిడ్ అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అన్ని స్థాయిల్లో పాఠ్య పుస్తకాలను డిజిటల్ పీడీఎఫ్ రూపంలో ఆన్లైన్లో ఉంచడంతో పాటు 2022–23లో 8వ తరగతి విద్యార్థులకు రూ.686 కోట్లతో బైజూస్ కంటెంట్‌తో కూడిన 5.18 లక్షల ట్యాబులను ఉచితంగా అందించింది. వీటితో పాటు నాడు–నేడు మొదటి దశలో అభివృద్ధి చేసిన 15,715 పాఠశాలల్లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, 10,038 స్మార్ట్ టీవీలను సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 1,858 మందికి రూ.132.41 కోట్ల లబ్ధి చేకూరింది. -
కళాశాలలకు కార్పొరేట్ కళ
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కార్పొరేట్ కళను సంతరించుకోనున్నాయి. నాడు–నేడు పనులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే నాడు–నేడు ద్వారా ప్రభుత్వ బడులకు కార్పొరేట్ సొబగులు అద్దిన ప్రభుత్వం తాజాగా జూనియర్ కళాశాలలపై దృష్టి సారించింది. డిసెంబరు నాటికి పూర్తి స్థాయిలో సకల వసతులు ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. అవసరమైన చోట్ల అదనపు తరగతి గదులు నిర్మించనున్నారు. నెల్లూరు (టౌన్): ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ పట్టింది. జిల్లాలో తొలి విడతలో 1,059, రెండో విడతలో 1,112 పాఠశాలలను అభివృద్ధి చేసిన ప్రభుత్వం తాజాగా జూనియర్ కళాశాలల్లో నాడు–నేడు కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. కళాశాలల్లో 9 రకాల వసతులను కల్పించనున్నారు. వీటి అభివృద్ధికి రూ.13.44 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పనులను బట్టి విడతల వారీగా నిధులను విడుదల చేయనున్నారు. త్వరలో పనులు ప్రారంభించి డిసెంబరు నాటికల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. కళాశాల డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో పనులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆధునిక వసతులు ఏర్పాటు కానుండడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 9 రకాల వసతుల ఏర్పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొత్తం 9 రకాల వసతులు కలి్పంచనున్నారు. అవసరమైన కళాశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణం చేపట్టనున్నారు. ప్రధానంగా మరుగుదొడ్లు, మేజర్, మైనర్ రిపేర్స్, రన్నింగ్ వాటర్, ఆర్వో ప్లాంట్లు, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రికల్ పనులు, ఫ్యాన్లు, లైట్లు, కుర్చీలు, బెంచీలు, టేబుల్స్, గ్రీన్ చాక్బోర్డు, పెయింటింగ్, కాంపౌండ్ వాల్ తదితర వసతులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర శిక్ష ఇంజినీరింగ్ విభాగం అధికారులు కళాశాలల్లో మౌలిక వసతులు పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కళాశాల డెవలప్మెంట్ కమిటీ ప్రతిపాదనల మేరకు తీర్మానాలు చేశారు. వీటికి కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు ఆమోదముద్ర వేశారు. డిసెంబరు నాటికి పూర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాడు–నేడు పనులను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను బట్టి విడతల వారీగా నిధులను విడుదల చేయనున్నారు. వారం రోజుల్లో తొలుత ఆయా కళాశాలలకు 15 శాతం నిధులు విడుదల చేయనున్నారు. పనులు ఆయా కళాశాల డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంటుంది. నాడు–నేడు పనులు పూర్తతే కళాశాలలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోనున్నాయి. – ఎ. శ్రీనివాసులు, డీవీఈఓ 22 కళాశాలల ఎంపిక జిల్లాలో మొత్తం 26 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటితో పాటు మరో 4 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 25 వేల మందికి పైగా విద్యార్థులు ఇంటరీ్మడియట్ చదువుతున్నారు. ప్రస్తుతం నాడు–నేడుకు జిల్లాలో 22 జూనియర్ కళాశాలలు ఎంపిక చేశారు. వీటి అభివృద్ధికి రూ.13,44,95,539 ని«ధులు మంజూరు చేశారు. -
బాలికల హైస్కూలు ప్లస్‌గా 292 హైస్కూళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోబాలికల కోసం జూనియర్ కాలేజీ కానీ, కస్తూరిబా బాలికా విద్యాలయం కానీ లేని 292 మండలాల్లో ఒక హైస్కూల్‌ను హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈమేరకు విద్యా శాఖాధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ హైస్కూల్ ప్లస్‌లలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్లస్ 2 (ఇంటర్మీడియెట్) తరగతులు ప్రారంభిస్తున్నారు. వీటిలో 40 చొప్పున విద్యార్థినులను చేర్చుకొనేలా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం సూచించింది. వీటిలో ఈ విద్యాసంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపులను మాత్రమే ప్రారంభిస్తున్నారు. ఒకటికన్నా ఎక్కువ జూనియర్ కాలేజీలు ఉన్న మండలాల్లో ఒక కళాశాలను బాలికలకు కేటాయించాలన్న ప్రభుత్వ ఆదేశాలను కూడా అమలు పరుస్తున్నారు. ఇలా 13 మండలాల్లో బాలికల కోసం ఒక జూనియర్ కాలేజీని కేటాయిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం (2022–23) నుంచే ఇవి ప్రారంభమవుతున్నాయి. హైస్కూల్ ప్లస్‌గా అన్ని కేజీబీవీలు రాష్ట్రంలోని అన్ని కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) జూనియర్ కాలేజీ ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 328 కస్తూరిబా బాలికా విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 220 కేజీబీవీల్లో 12వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. మిగతా కేజీబీవీల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నాయి. వీటిని కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి హైస్కూల్ ప్లస్ (12వ తరగతి వరకు)కు మారుస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో 11వ తరగతి ప్రారంభం అవుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 12వ తరగతి ఆరంభం అవుతుంది. హైస్కూల్ ప్లస్‌పై విస్తృత ప్రచారం చేయాలి బాలికల కోసం ఏర్పాటు చేస్తున్న హైస్కూల్ ప్లస్ పాఠశాలల గురించి తల్లిదండ్రులు, విద్యార్ధులందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని పాఠశాల విద్యా శాఖ అన్ని జిల్లాల విద్యా శాఖాధికారులకు సూచించింది. అలాగే బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌లుగా అప్‌గ్రేడ్ చేయడానికి ఎంపిక చేసిన స్కూళ్లలో తరగతి గదులు, ల్యాబ్‌లు వంటి సదుపాయాలకు వీల్లేని పరిస్థితి ఉంటే సమీపంలోని ఏపీ మోడల్ స్కూళ్లు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలలోని సదుపాయాలను వినియోగించాలని పేర్కొంది. బోధనా సిబ్బంది ఏర్పాటు అయ్యేవరకు హైస్కూళ్లలోని ప్రస్తుత సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని సూచించింది. -
AP: మండలానికి 2 జూనియర్ కాలేజీలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి మండలంలో రెండు చొప్పున ప్రభుత్వ జూనియర్ కాలేజీలను అందుబాటులోకి తెస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో 679 మండలాలు ఉండగా 1,358 ఇంటర్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం 474 జూనియర్ కాలేజీలున్నాయని, మిగతా 884 కళాశాలల్లో కూడా తరగతులు ఈ ఏడాదే కొత్త విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తామని బొత్స వెల్లడించారు. టెన్త్ పాసైన విద్యార్ధులు ఇంటర్లో చేరేందుకు వీలుగా ఆయా మండలాల్లో రెండేసి హైస్కూళ్లలో ఇంటర్ తరగతులు (10 + 2) ప్రారంభిస్తారు. వీటిలో ఒకటి కో ఎడ్యుకేషన్ కాలేజీ కాగా రెండోది ప్రత్యేకంగా బాలికల కోసమే నిర్వహించనున్నారు. బుధవారం విజ యవాడలో ఇంటర్ ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్ కాలేజీల కంటే మిన్నగా.. జూనియర్ కాలేజీలలో కొన్నిటిని బాలికల కళాశాలలుగా మార్పు చేస్తున్నందున 25 చోట్ల సమస్యలు తలెత్తుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటిని పరిశీలించి అవసరమైన మార్పులు చేస్తామని బొత్స వెల్లడించారు. ప్రైవేట్ కాలేజీల కంటే మిన్నగా మంచి సదుపాయాలతో పాటు ఉత్తమ బోధన అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ కాలేజీల్లో చేర్చి అధిక ఫీజుల భారంతో ఒత్తిడికి గురి కాకుండా ప్రభుత్వ కళాశాలల్లోనే చేర్చాలని సూచించారు. విద్యారంగాన్ని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి జగన్ విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారని బొత్స పేర్కొన్నారు. మనబడి నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, విద్యాదీవెన తదితర కార్యక్రమాలతో విద్యార్ధులను ప్రోత్సహించడమే కాకుండా ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హైస్కూల్, హై స్కూల్, హైస్కూల్ ప్లస్ లాంటి కొత్త విధానంతో పాఠశాల విద్యను పరిపుష్టం చేసే చర్యలు తీసుకున్నారని చెప్పారు. ప్రపంచంలో అందరికన్నా మిన్నగా మన విద్యార్ధులు ప్రత్యే క గుర్తింపు సాధించాలనేది సీఎం ఆకాంక్ష అన్నారు. బైజూస్‌పై బాబు ఆరోపణలు అర్థరహితం మన విద్యార్ధులను అత్యుత్తమ రీతిలో తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ తపిస్తుంటే విపక్ష నేత చంద్రబాబు మాత్రం ఓర్వలేనితనంతో అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ విధానం, ఫౌండేషన్ నుంచి ప్లస్ 2 వరకు విద్యార్ధులకు ఉత్తమ బోధన అందేలా సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. ఇందులో భాగంగా ప్రముఖ విద్యాసంస్థ ‘బైజూస్’ ద్వారా ఉత్తమ కంటెంట్ అందించేందుకు ఒప్పందం చేసుకుంటే అది జగన్ జ్యూస్ అని చంద్రబాబు మాట్లాడడం దారుణమన్నారు. బైజూస్ అంటే హెరిటేజ్ జ్యూస్ కాదన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రత్యేక యాప్ ద్వారా బైజూస్ కంటెంట్ ఉచితంగా అందుతుందన్నారు. 8వ తరగతి విద్యార్ధులకు ల్యాప్‌టాప్‌ల ద్వారా బైజూస్ కంటెంట్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఏటా 8వ తరగతిలోకి వచ్చే దాదాపు 4.5 లక్షల మందికి ల్యాప్‌టాప్‌లు అందిస్తామని చెప్పారు. డిజిటల్ తరగతుల కోసం టీవీలు, స్క్రీన్లు ఏ ర్పాటు చేయాలని సీఎం ఆదేశించా రని తెలిపారు. 35 లక్షల మంది పిల్లలకు మేలు చేకూరుతుందన్నారు. బైజూస్‌తో రూ.500 కోట్లతో ఒప్పందం చేసుకున్నామనడం సరికాదన్నారు.విధాన నిర్ణయాల్లో రాజీ లేదు విద్యార్థులు, ప్రజల మేలు కోసం ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల అమలులో సమస్యలు ఎదురైతే పరిష్కరించుకుని ముందుకు వెళ్తామే కానీ వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. జీవో 117 అమలుపై ఉపాధ్యాయ సంఘాలు, టీచర్ ఎమ్మెల్సీలతో చర్చించామని, వారు సూచించిన అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంగ్లీషు మీడియం, ఫౌండేషన్ స్కూళ్ల విధానం వద్దంటే కుదరదని స్పష్టం చేశారు. -
జూలై 1 నుంచి ఇంటర్ తరగతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు జూలై 1వ తేదీనుంచి ప్రారంభం కానున్నాయి. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. మొత్తం 295 రోజులకు సంబంధించి 220 పనిదినాలు ఉండగా 75 రోజులు సెలవు దినాలుగా పేర్కొంది. 2023 ఏప్రిల్ 21వ తేదీతో విద్యాసంవత్సరం ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచి మే 31వ తేదీ వరకు కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ మేరకు మాత్రమే ఆయా కాలేజీలు అడ్మిషన్లు నిర్వహించాలని బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు స్పష్టం చేశారు. అడ్మిషన్ల కోసం ప్రకటనలు ఇతర రకాల చర్యలతో విద్యార్థులను ఆకర్షించడం వంటి కార్యక్రమాలు చేయరాదని పేర్కొన్నారు. -
220 ప్రైవేటు విద్యాసంస్థల గుర్తింపు రద్దుకు సిఫారసు
బి.కొత్తకోట: రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న 220 ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల గుర్తింపును రద్దుచేయాలని కోరుతూ ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చినట్లు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ వెంబులూరు నారాయణరెడ్డి, బి.ఈశ్వరయ్య చెప్పారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం హార్సిలీహిల్స్‌లో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. 2022–23 విద్యాసంవత్సరంలో విద్య, బోధన సామర్థ్యంపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టిసారించిందని చెప్పారు. దీనిపై ఇప్పటికే మూడుసార్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించారన్నారు. ప్రభుత్వం గిరిజన విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఎనిమిది ఐటీడీఏల పరిధిలోని రెండువేల పాఠశాలలు, కళాశాలలను బలోపేతం చేసేందుకుగాను ఉపాధ్యాయుల్లో బోధన సామర్థ్యం పెంపునకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా అక్షరాస్యతను పెంచాలని సీఎం ఆదేశించారని చెప్పారు. మూడుశాతం బడిబయట పిల్లలున్నారని, వీరిని పాఠశాలల్లో చేర్పిస్తామని తెలిపారు. అక్షరాస్యతలో జాతీయస్థాయిలో రాష్ట్రాన్ని రెండు, మూడు స్థానాలకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. గత ఏడాది రాష్ట్రంలో ఎల్కేజీ నుంచి ఇంటర్ చదువుతున్న ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు. ప్రభుత్వం విద్యకు అందిస్తున్న ప్రోత్సాహం, పాఠశాలల అభివృద్ధితోనే ఇది సాధ్యమైందన్నారు. దేశంలో పాఠశాల విద్యకు రూ.29 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించిన ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పారు. సీఎం ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వృత్తివిద్య కోర్సులను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. విద్యాబోధనలో ఉపాధ్యాయులకు, ఫీజులపై తల్లిదండ్రులకు, అభ్యసన సామర్థ్యంపై విద్యార్థులకు త్వరలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. పాఠశాలల కమిటీలను బలోపేతం చేయడం కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు. -
బడి బాటలో పిల్లలు... బదిలీల బాధలో టీచర్లు
సాక్షి, హైదరాబాద్: దాదాపు మూడు వారాల తర్వాత పునః ప్రారంభమవుతున్న విద్యాసంస్థలకు టీచర్ల ఆందోళన ఇబ్బందిగా మారుతోంది. ఈ సెలవుల సమయంలోనే జోనల్ వ్యవస్థకు సంబంధించిన బదిలీల ప్రక్రియ పూర్తికాగా.. పలు అంశాలపై విభేదిస్తూ టీచర్లు ఆందోళన బాట పట్టారు. ప్రధానోపాధ్యాయలు మల్టీజోనల్ బదిలీల్లో హేతుబద్ధత లేదంటూ కోర్టుకెళ్లగా.. స్థానికత, మరికొన్ని అంశాలపై ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఆందోళనలకు పిలుపునిచ్చాయి. సోమవారం నుంచి ఈ నిరసనలను తీవ్రతరం చేయాలని ఉపాధ్యాయ ఐక్యపోరాట కమిటీ నిర్ణయించింది. ఫిబ్రవరి 5వ తేదీన హైదరాబాద్‌లో మహాధర్నాకు పిలుపునిచ్చింది. 317 జీవోలో ప్రధాన సమస్యలను పరిష్కారిస్తామని ప్రభుత్వం చెప్పినా.. ఇంతవరకు అధికారిక ఆదేశాలేవీ రాలేదు. పరస్పర బదిలీలు, ఒంటరి మహిళల ఆప్షన్లు, సీనియారిటీలో అన్యాయం వంటి పలు అంశాలపై ప్రభుత్వం తుది నిర్ణ యం ప్రకటించాల్సి ఉంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ 317 జీవో వేడి పుట్టిస్తోంది. బదిలీలను వ్యతిరేకిస్తూ లెక్చరర్లు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో బోధనకు ఇబ్బంది ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానోపాధ్యాయుల కొరతతో.. రాష్ట్రవ్యాప్తంగా 4,379 ప్రధానోపాధ్యాయుల పోస్టులుంటే.. ప్రస్తుతం 2,423 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 1,956 హెచ్ఎం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 45 శాతం పోస్టుల ఖాళీ ఒక సమస్య అయితే.. ప్రస్తుతం మల్టీ జోనల్ బదిలీల్లో 98 మందిని ట్రాన్స్ఫర్ చేశారు. వారంతా బదిలీలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది విధుల్లో చేరలేదు కూడా. ఇక రాష్ట్రంలో మొత్తం 591 మండలాల్లో 528 మండల విద్యాధికారుల పోస్టులున్నాయి. ఇందులో 20 మంది మాత్రమే రెగ్యులర్‌గా పనిచేస్తున్నారు. మిగతా వారంతా ఇన్చార్జులే. దీనికి తోడు 317 జీవో కారణంగా దాదాపు 15 వేల మంది ఉపాధ్యాయులు స్థానికేతర జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. వారు ఇంతవరకూ క్లాసులకు హాజరవ్వలేదు. కొత్తగా విద్యార్థులను పరిచయం చేసుకుని బోధన చేయాల్సి ఉంటుంది. అందులోనూ కొందరు టీచర్లు పరస్పర బదిలీల కోసం నిరీక్షిస్తున్నారు. వీటన్నింటితో బోధనకు మరికొంత ఆలస్యం పట్టే అవకాశం ఉంది. దీంతో విద్యా బోధన ఎలా జరుగుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
ఫీజుల ఖరారుకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు 2021–22 నుంచి 2023–24 బ్లాక్ పీరియడ్‌కు గాను ఫీజుల ప్రతిపాదనలను ఆన్లైన్లో తమకు సమర్పించాలని రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి కోరారు. ఇందుకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు కోరుతున్న ఫీజులు, అందుకు సంబంధించిన జమా ఖర్చుల వివరాలు, డాక్యుమెంట్లు, ఇతర సమాచారాన్ని కమిషన్ వెబ్సైట్ (www.apsermc.ap. gov.in)లో పొందుపరచాలని కోరారు. ఇందుకు ఫిబ్రవరి 15 తుది గడువుని పేర్కొన్నారు. ఇంతకుముందు గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలను ఆధారంగా చేసుకుని ఫీజులను నిర్ణయించామన్నారు. ఆ ఫీజుల పరిధిలోకి రాని విద్యాసంస్థలు అదనపు ఫీజుల వివరాల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పామన్నారు. దీన్ని సవాల్ చేస్తూ కొన్ని విద్యాసంస్థలు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం సూచనల మేరకు తిరిగి నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. హైకోర్టు సూచన మేరకు విద్యాసంస్థల్లోని మౌలిక సదుపాయాలు, ఇతర ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్ ఫీజులను సవరిస్తుందన్నారు. ఏదైనా విద్యా సంస్థ దరఖాస్తు చేసుకోకపోతే ఫీజులు వసూలు చేసుకోవడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. -
పాఠశాలల ఫీజుల ఖరారు జీవోలపై వివరాలివ్వండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఇటీవల జారీ చేసిన జీవోలు 53, 54లకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 2కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు. జీవోలు 53, 54లను సవాల్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్, మరికొన్ని విద్యా సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. గ్రామ, మునిసిపాలిటీ, మునిసిపల్ కార్పొరేషన్ ఇలా పలు స్థాయిల్లో పాఠశాలలను వర్గీకరణ చేసి ఫీజులను ఖరారు చేశారని తెలిపారు. ఇలాంటి వర్గీకరణను చట్ట నిబంధనలు ఆమోదించవన్నారు. ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయకుండా ఫీజులను ఖరారు చేసిందన్నారు. ప్రభుత్వ న్యాయవాది కె.రఘువీర్ స్పందిస్తూ.. పూర్తి వివరాలు సమర్పిస్తామని, కొంత గడువు ఇవ్వాలని కోర్టును కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. -
జూనియర్ కాలేజీ ఫీజులను ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని స్కూల్లు, జూనియర్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో తొలిసారిగా ఫీజులును ఏపీ సర్కార్ ఖరారు చేసింది. నర్సరీ నుంచి టెన్త్ వరకు ఫీజులు నిర్ణయించింది. ఫీజులు వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న స్కూళ్లకు ప్రైమరీ విద్యకు రూ.10,000, హైస్కూల్ విద్యకు రూ.12000. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న స్కూళ్లకు..ప్రైమరీ విద్యకు రూ.11,000, హైస్కూల్ విద్యకు రూ.15000. కార్పొరేషన్ల పరిధిలో ఉన్న స్కూళ్లకు.. ప్రైమరీ విద్యకు రూ.12,000, హైస్కూల్ విద్యకు రూ.18000 నిర్ణయించారు. ఇక గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న కాలేజీలకు ఎంపీసీ, బైపీసీలకు రూ.15000, ఇతర గ్రూపులకు రూ.12000. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న కాలేజీలకు.. ఎంపీసీ, బైపీసీలకు రూ.17,500, ఇతర గ్రూపులకు రూ.15000. కార్పొరేషన్ల పరిధిలో ఉన్న కాలేజీలకు.. ఎంపీసీ, బైపీసీలకు రూ.20,000, ఇతర గ్రూపులకు రూ.18000 గా నిర్ణయించారు. చదవండి:Vijayawada: వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్ -
ఎట్టకేలకు ఫస్ట్ ఇంటర్‌కు ఆన్‘లైన్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఎట్టకేలకు సోమవారం నుంచి ఆన్లైన్ తరగతులు మొదలయ్యాయి. సాయంత్రం 3 నుంచి 5.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నట్టు ఇంటర్మీడియెట్ బోర్డ్ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. జూమ్ ద్వారా జరిగే ఈ బోధనలో ఒక్కో సబ్జెక్టుకు అరగంట కేటాయిస్తున్నారు. ఆన్లైన్ విధానం కొత్త కావడం, బోధకులకు పూర్తిస్థాయి అలవాటు లేకపోవడం, కొన్నిచోట్ల ఇంటర్నెట్, సాంకేతిక సమస్యలు రావడం, విద్యార్థుల మొబైల్ డేటా ఎక్కువ ఖర్చు కాకుండా చూసేందుకు క్లుప్తంగా పాఠాలు చెబుతున్నామని వరంగల్‌కు చెందిన ఓ లెక్చరర్ చెప్పారు. రాబోయే కాలంలో సమయం పెంచే వీలుందని అధికారులు పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం ప్రత్యక్ష బోధనకు అనుమతిస్తే తాము సిద్ధంగా ఉన్నామని, మరింత మెరుగైన బోధన అందించే అవకాశం ఉంటుందన్నారు. సాధారణంగా తరగతి గదిలో 45 నిమిషాలు లేదా గంట వ్యవధిలో సబ్జెక్టు బోధన జరుగుతుంది. అయితే ఇప్పుడు అరగంటలోనే క్లాస్ ముగించడంతో సందేహాలు నివృత్తి చేసుకోలేకపోతున్నామని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన అడ్మిషన్లు ప్రభుత్వ కాలేజీల్లో ఈసారి ఇంటర్ ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2015 నుంచి 2020 వరకూ తగ్గిన అడ్మిషన్లు.. ప్రస్తుత సంవత్సరంలో ఏకంగా 1,00,687కు చేరాయి. గతంతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువని అధికారులు తెలిపారు. కాలేజీల ఆధునీకరణపై పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం, కోవిడ్ ప్రభావం, ప్రభుత్వ లెక్చరర్లు తీసుకున్న ప్రత్యేక చొరవ వల్లనే ప్రవేశాలు పెరిగాయని అంటున్నారు. రాష్ట్రంలో 5.78 లక్షల మంది పదో తరగతిలో ఉత్తీర్ణులైతే ప్రభుత్వ కాలేజీల్లో చేరింది అందులో నాల్గో వంతే. దాదాపు 4 లక్షల మంది కార్పొరేట్ కాలేజీల్లోకి వెళ్లారు. చాలా కాలేజీలు ఇంటర్ బోర్డు అనుబంధ అనుమతి ఇవ్వకున్నా విద్యార్థులను చేర్చుకున్నాయి. అనధికారికంగా ఆన్లైన్లోనే కాదు... ఆఫ్లైన్లోనూ పాఠాలు చెబుతున్నాయని ప్రభుత్వ లెక్చరర్స్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సగానికిపైగా సిలబస్ పూర్తి చేశాయని, ప్రభుత్వ కాలేజీల్లో రెండు నెలలు ఆలస్యంగా పాఠాలు చెప్పడం పేద విద్యార్థులకు నష్టం చేయడమేనని అంటున్నాయి. దీనివల్ల సబ్జెక్టుపై అవగాహన పొందే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నాయి. ఒత్తిడితో కళ్లు తెరిచారు ఆలస్యంగానైనా ఆన్లైన్ బోధన సరైన నిర్ణయమే. ఒత్తిడి కారణంగా ఇంటర్ బోర్డ్ అడుగులేసినట్టు కన్పిస్తోంది. అయితే, విద్యార్థులకు అర్థమయ్యేలా ఎక్కువ సమయంలో బోధన ఉంటే బాగుంటుంది. ప్రభుత్వ కాలేజీలపై పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని బోర్డ్ విశ్వసనీయత పెంచాల్సిన అవసరం ఉంది. – మాచర్ల రామకృష్ణ గౌడ్, తెలంగాణ విద్యా పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ -
TS: ఔట్‌సోర్సింగ్‌లో అధ్యాపకులా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అధ్యాపకులను ఔట్ సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తుండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ రాష్ట్రంలోనే ఈ తరహా నియామకాలు జరుగుతున్నాయా? దేశంలో మరెక్కడైనా ఇలా చేస్తున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో అధ్యాపకులను రెగ్యులర్ పద్ధతిలో నియమిస్తేనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కళాశాలల్లో అధ్యాపక నియామకాలకు సంబంధించి ఉన్న నియమ నిబంధనలను పేర్కొంటూ పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆర్థిక, పాఠశాల, సాంకేతిక విద్య ముఖ్య కార్యదర్శులతోపాటు జేఎన్టీయూ, ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్లను, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఔట్సోర్సింగ్ పద్ధతిలోనే నియామకాలు చేస్తుండటంతోపాటు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల అధ్యాపకులకు వేతనాలు ఇవ్వడం లేదంటూ న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ రాసిన లేఖను ధర్మాసనం సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది. ‘కరోనాతో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో వేలాది మంది అధ్యాపకులను తొలగించగా... విధులు నిర్వహిస్తున్న వారికీ వేతనాలు ఇవ్వడం లేదు’ అని శ్రవణ్‌కుమార్ లేఖలో పేర్కొన్నారు. తమ గుర్తింపు ఉన్న కళాశాలల్లో అధ్యాపకుల నియామకాలకు ఓ ప్రత్యేక కమిటీ ఉంటుందని జేఎన్టీయూ తరఫు న్యాయవాది నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం...నాణ్యమైన విద్య అందించేందుకు తీసుకుంటున్న చర్యలతోపాటు, అధ్యాపకుల నియామకాలకు సంబంధించి ఉన్న నియమ నిబం ధనలను పేర్కొంటూ పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది. -
వెలుగులోకి నారాయణ, శ్రీచైతన్య కాలేజీల బాగోతం
సాక్షి, విజయవాడ: విద్యాశాఖ కమిషన్ చేపట్టిన పాఠశాలల తనిఖీల్లో జూనియర్ కాలేజీలు నారాయణ, శ్రీ చైతన్యల అధిక ఫీజుల వసూళ్ల బాగోతం బట్టబయలైంది. రాష్ట్రంలోని పలు పాఠశాలపై విద్యాశాఖ కమిషన్ నాలుగు బృందాలు బుధవారం తనీఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రొఫెసర్ నారాయణరెడ్డి, డాక్టర్ ఈశ్వరయ్య కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ పాఠశాలల యాజమాన్యాలపై విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఈ సంక్రాంతికి 60 వేల రూపాయల నుంచి 70 వేల రూపాయల వరకు ఫీజులు కట్టించుకున్నారంటూ విద్యార్థులు అధికారులతో ఎదుట వాపోయారు. టాయిలెట్లలో కనీస సౌకర్యాలు లేవని, ప్రతి ఏడుగురికి ఒక బాత్రూమ్ కేటాయించారని తెలిపారు. ఇంటర్ మొదటి ఏడాదికి లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఇక గూడవల్లి శ్రీ చైతన్య కళాశాలలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కనీస వసతులు కూడా లేకుండానే తరగతులు నిర్వహిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. తాగునీరు, బాత్రూమ్ కుళాయిలు లేకపోవటంతో కమిషన్ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా సరైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక నారాయణ యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తోందని, జీవో 51ని కూడా యాజమాన్యం అమలు చేయడం లేదని వెల్లడించారు. నారాయణ యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిందని, విద్యార్థులకు సరైన సదుపాయాలు కూడా కల్పించడం లేదని కమిషన్ సభ్యులు సీఏవీ ప్రసాద్ పేర్కొన్నారు. అంతేగాక కాలేజీల్లో సామాజిక దూరం అమలు చేయడం లేదని, కనీసం శానిటైజర్లు కూడా అందుబాటు ఉంచలేదన్నారు. విద్యను వ్యాపారంగా మారుస్తున్నారన్నారని మండిపడ్డారు. సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని, మౌలిక వసతులు కూడా సరిగా లేని కళాశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గతేడాది ట్యూషన్ ఫీజులో 30 శాతం తగ్గించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కళాశాలలు ఉల్లంఘించాయన్న ఫిర్యాదులపై పాఠశాల విద్యాశాఖ కమిషన్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించింది. -
ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యల పరిష్కారానికి కృషి
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ ప్రతినిధులు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో మంగళవారం సమావేశమయ్యారు. సజ్జల మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేస్తామన్నారు. కాగా, ఉపాధ్యాయ బదిలీలను మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించాలని మంత్రి సురేష్, సజ్జలకు జాక్టో చైర్మన్ కె.జాలిరెడ్డి, వర్కింగ్ చైర్మన్ సీహెచ్.శ్రావణ్ కుమార్, సెక్రటరీ జనరల్ ఎం.శ్రీధర్‌రెడ్డిలు మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. -
జూనియర్ కాలేజీలకు ‘ఫైర్’!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ‘అగ్గి’రాజుకుంది. యాజమాన్యాలకు సెగ తగిలింది. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి జారీ చేసే కాలేజీ అనుబంధ గుర్తింపునకు అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని(ఎన్ఓసీ) సమర్పించాలనే నిబంధన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇదివరకు 15 మీటర్ల ఎత్తు వరకున్న భవనాలకు ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీ అవసరం లేదు. తాజాగా సవరించిన నిబంధన ప్రకారం ఆరు మీటర్లు మించి ఎత్తున్న భవనంలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తే ఫైర్ ఎన్ఓసీ తప్పకుండా సమర్పించాలి. రాష్ట్రంలో 2, 472 ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలున్నాయి. వీటిలో 404 ప్రభుత్వ కాలేజీలు కాగా... మరో మూడువందల వరకు గురుకుల, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలున్నాయి. తాజా నిబంధన ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1, 450 కాలేజీలు ఫైర్ ఎన్ఓసీలు సమర్పించాలి. ప్రస్తుతం ఈ కాలేజీలున్న భవనం తీరు, సెట్‌బ్యాక్ స్థితి ఆధారంగా ఫైర్ ఎన్ఓసీ వచ్చేది కష్టమే అని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో వీటికి 2020–21 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపు లభించడం అసాధ్యమే. హఠాత్తుగా అమల్లోకి తెచ్చిన ఫైర్ ఎన్ఓసీపై ఆయా యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గుర్తింపు రాకుంటే ఎలా...? రెండ్రోజుల్లో ఇంటర్ సెకండియర్ ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాము చదివే కాలేజీకి గుర్తింపు ఇవ్వకుంటే తమ పరిస్థితి ఏమిటనే ప్రశ్న విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు కరోనా వైరస్‌తో విద్యాసంవత్సరం తీవ్ర గందరగోళంగా మారింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జూనియర్ కాలేజీలు గుర్తింపునకు నోచుకోకుంటే ఇంటర్ విద్యపై తీవ్ర ప్రభావం పడనుంది. సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించేందుకు యాజమాన్యాలు సిద్ధమవ్వగా... టీశాట్ ద్వారా వీడియో పాఠాలు చెప్పేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఫస్టియర్ అడ్మిషన్లు ఎలా... ఇంటర్ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలుకావొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 5.3 లక్షల మంది ఇటీవల పదోతరగతి పాసయ్యారు. ఓపెన్ టెన్త్ ద్వారా మరో 70 వేల మంది ఇంటర్ ప్రవేశానికి అర్హత సాధించారు. రాష్ట్రంలోని కాలేజీలన్నీ పూర్తిస్థాయిలో అడ్మిషన్లు తీసుకుంటేనే ఆరు లక్షల మంది ఇంటర్లో ప్రవేశిస్తారు. అలా కాకుండా సగం కాలేజీలకు అనుమతి ఇవ్వకుంటే దాదాపు 3 లక్షల మందికి ఇంటర్లో చేరే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఫైర్ ఎన్ఓసీ నిబంధనపై ప్రభుత్వం త్వరితంగా నిర్ణయం తీసుకుంటే తప్ప గందరగోళానికి తెరపడదు. ‘గతంలో ఉన్న నిబంధన ప్రకారం 15 మీటర్ల వరకు ఎన్ఓసీ ఆవశ్యకత లేకుండా అనుబంధ గుర్తింపు ఇవ్వాలి ’అని ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరిసతీశ్ ‘సాక్షి’తో అభిప్రాయం వ్యక్తం చేశారు. -
కార్పొరేట్ కాలేజీల దోపిడీ షురూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు ఇంకా అనుబంధ గుర్తింపును ప్రకటించకున్నా కార్పొరేట్ కాలేజీలు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను చేర్చుకున్నాయి. కరోనా వైరస్ తాకిడి వల్ల ఓవైపు మిగతా విద్యాసంస్థలన్నీ మూతబడి ఉన్నా ఈ కాలేజీలు మాత్రం అప్పుడే ఒక్కో విద్యార్థి నుంచి రూ. 10 వేల చొప్పున అడ్వాన్స్‌లు వసూలు చేసి మరీ ఆన్లైన్ తరగతులు ప్రారంభించేశాయి. మరోవైపు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, సాధారణ జూనియర్ కాలేజీలు ఏం చేయాలో అర్థంకాక ఆందోళనలో పడ్డాయి. కార్పొరేట్ కాలేజీల దెబ్బతో తమ కాలేజీల్లో ప్రవేశాలపై ప్రభావం పడే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆగస్టులో మొదలు కావాల్సి ఉన్నా... రాష్ట్రంలో 2,558 జూనియర్ కాలేజీలుండగా వాటిలో 1,583 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. అందులో హాస్టల్ వసతిగల కార్పొరేట్ కాలేజీలు 570 వరకు ఉన్నాయి. వాటిల్లోనే ఏటా దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పుడు ఆ కాలేజీలే ముందస్తుగా ప్రవేశాలను చేపట్టి తరగతులను ప్రారంభించేశాయి. వాస్తవానికి జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభం కావాలి. ద్వితీయ సంవత్సర తరగతులు కొనసాగాలి. కానీ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తరగతుల ప్రారంభం వాయిదా పడింది. మరోవైపు జూలై 20 వరకు అఫిలియేషన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయితే ఆ తరువాత అనుబంధ గుర్తింపు ఇస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అంటే ఆగస్టులోనే ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. అయినా కార్పొరేట్ కాలేజీలు అప్పుడే ఆన్లైన్ తరగతులను ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుబంధ గుర్తింపుపై స్పష్టత రాకున్నా.. రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రమాదం పొంచి ఉంది. గతేడాది ఇంటర్ బోర్డు నిబంధనలను పాటించని భవనాల్లో కొనసాగుతున్న 68 కాలేజీలను హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఆ కాలేజీలు వేరే భవనాల్లోకి వెళ్తేనే వాటికి అనుబంధ గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే వాటిల్లో ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదు. అయితే కొత్తగా ఏ కాలేజీకి అనుబంధ గుర్తిం పు వస్తుందో, ఏయే కాలేజీలకు అనుబంధ గుర్తింపు రాదో తెలియని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కార్పొరేట్ కాలేజీలు మాత్రం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలను చేపట్టి తల్లిదండ్రుల నుంచి ఫీజులను దండుకుంటున్నాయి. ఇంత జరుగుతున్న ఇంటర్ బోర్డు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. రాయితీల పేరిట టెస్టులు.. రాయితీల పేరుతోనూ కార్పొరేట్ కాలేజీలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నా యి. తమ కాలేజీలో చేరేందుకు, ఫీజు రాయితీ పొందేందుకు ముందుగా రూ. 10 వేలు చెల్లించాల్సిందేననన్న నిబంధనను విధించి తల్లిదండ్రుల నుంచి డబ్బు దండుకుంటున్నాయి. కరోనా కారణంగా ఈసారి టెన్త్ విద్యార్థులందరినీ ప్రభుత్వం పరీక్షల్లేకుండానే పాస్ చేయగా కార్పొరేట్ కాలేజీలు మాత్రం తాము పెట్టే టెస్టులో టాప్ మార్కులు వచ్చిన వారికి ఫీజులో రాయితీ ఇస్తామంటూ పరీక్షలను నిర్వహిస్తున్నా యి. ఇటీవల నిజాంపేటలో ఓ కార్పొరేట్ కాలేజీ అడ్మిషన్ టెస్టు పెట్టగా విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. అయినా టెస్టు ల పరంపర కొనసాగుతూనే ఉంది. కఠిన చర్యలు తీసుకోవాలి... ఇంటర్ తరగతుల ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయమే తీసుకోలేదు. అయినా కార్పొరేట్ కాలేజీలు ఆన్లైన్ పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నాయి. భారీగా డబ్బు గుంజుతున్నా 4 వేల మంది అధ్యాపకులను ముందస్తు నోటీసులు లేకుండా తొలగించాయి. ఈ చర్యలకు పాల్పడిన కాలేజీలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలి. – డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు -
జూనియర్ కాలేజీల ప్రారంభం వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కాలేజీ ల ప్రారంభాన్ని ఇంటర్మీడియట్ బోర్డు వాయిదా వేసింది. ఇంటర్మీడియట్ అకడమిక్ కేలండర్ ప్రకారం వేసవి సెలవులు ముగిశాక జూన్ 1 నుంచి తరగతులను ప్రారంభించాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో ఆ తేదీన జూనియర్ కాలేజీలను ప్రారంభించడం లేదని, తరగతుల నిర్వహ ణను చేపట్టడం లేదని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. తిరిగి ఎప్పుడు ప్రారంభించేదీ తరువాత తెలియజేస్తామన్నారు. ‘అడ్వాన్స్డ్’లో రాసుకోవచ్చు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర జియాగ్రఫీ పేపరు–2, మోడర్న్ లాంగ్వేజ్ పేపరు–2 పరీక్షలను జూన్ 3న నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. ఉదయం 9 గంటల నుం చి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉం టాయన్నారు. విద్యార్థులు జ్టి్టpట://్టటbజ్ఛీ. ఛిజజ.జౌఠి.జీn వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసు కోవాలని సూచించారు. ఇక ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూలై మూడో వారంలో నిర్వహిస్తామని తెలిపారు. రవాణా సదుపాయం, ఇతరత్రా కారణాలతో 3న పరీక్షల కు హాజరు కాలేని విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఈ సబ్జెక్టులను రాసుకోవచ్చని, అపుడు పరీక్షలు రాసినా రెగ్యులర్ విద్యార్థులుగా నే పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. -
కార్పొరేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ముకుతాడు
సాక్షి, అమరావతి: అనుమతులకు భిన్నంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల అక్రమాలకు ఇక అడ్డుకట్ట పడనుంది. ఈ మేరకు ప్రభుత్వం కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యను పరిమితం చేయడంతో పాటు తగిన సదుపాయాలు ఉంటేనే అనుమతులు ఇచ్చేలా కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అడ్మిషన్లను ఆన్లైన్లో నిర్వహించడం, ఫీజుల నియంత్రణ వంటి అనేక సంస్కరణలకు చర్యలు చేపట్టింది. అలాగే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లూ నిబంధనల ప్రకారం నడిచేలా చర్యలు తీసుకుంటోంది. మరోపక్క జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లను కూడా ఆన్లైన్లో ఇంటర్‌బోర్డు నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. దీంతో కాలేజీల అడ్డగోలు అడ్మిషన్లకు అడ్డుకట్ట పడుతుంది. ఒక్కో సెక్షన్లో 40 మందికి మాత్రమే జూనియర్ కాలేజీల్లో ప్రతి సెక్షన్లో 40 మందినే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఈ నెల 13న జీఓ 23ను విడుదల చేసింది. గతంలోని జీఓలను సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఈ ఉత్తర్వులను విడుదల చేశారు. దీని ప్రకారం కాలేజీలో సెక్షన్‌కు 40 మంది చొప్పున కనిష్టంగా 4, సదుపాయాలను అనుసరించి గరిష్టంగా 9 సెక్షన్లకు అనుమతిస్తారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా 2002 మే 13న జీఓ 12ని విడుదల చేసి ప్రతి సెక్షన్లో 88 మందిని చేర్చుకోవచ్చని అనుమతులిచ్చారు. దీంతో అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సెక్షన్ల వారీగా విద్యార్థుల సంఖ్యను పరిమితం చేస్తూ పాత జీఓను సవరించి ప్రభుత్వం తాజాగా జీఓను విడుదల చేసింది. మాధ్యమిక శిక్షా అభియాన్, సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిబంధనల ప్రకారం కూడా తరగతికి 40 మంది మాత్రమే ఉండాలన్న నిబంధనల ప్రకారం ఈ మార్పులు చేపట్టింది. – ప్రతి ప్రైవేట్ జూనియర్ కాలేజీకి సెక్షన్‌కు 40 మంది చొప్పున 4 సెక్షన్లను మంజూరు చేస్తారు. కనిష్టంగా 160 మంది విద్యార్థుల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. – భవనాలు, ఫ్యాకల్టీ, తరగతి గదులు, ల్యాబ్‌లు, ఇతర వసతి సదుపాయాలన్నీ కల్పిస్తే గరిష్టంగా సెక్షన్‌కు 40 మంది చొప్పున 9 సెక్షన్లకు అనుమతిస్తారు. – ఎంపీసీ, బైపీసీ మాత్రమే కాకుండా ఇక నుంచి తప్పనిసరిగా కామర్స్, ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్ కోర్సులు కూడా నిర్వహించాలి. – నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలూ ఉంటేనే ఆన్లైన్ అనుమతి – ఇప్పటికే దీనిపై బోర్డు నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసి దరఖాస్తులను ఆన్లైన్లో అందించాలని స్పష్టం చేసింది. – ఇప్పటివరకు పలు కార్పొరేట్ జూనియర్ కాలేజీలు తమ ఇష్టానుసారం విద్యార్థులనుచేర్చుకోవడం, విద్యార్థులకు సరిపడ తరగతి గదులు లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేకుండానే కొనసాగుతూ వచ్చాయి. ఇకనుంచి వీటికి కళ్లెం పడనుంది. –నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలూ ఉంటేనే అన్లైన్ అనుమతి – రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ కోర్సులు నిర్వహించే కాలేజీల యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలన్నిటినీ పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అప్పుడే వాటికి ఇంటర్మీడియెట్‌బోర్డు 2020–21 అనుమతులు మంజూరు చేయనుంది. ఇప్పటికే దీనిపై బోర్డు సవివరమైన నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలని కాలేజీలకు సూచించింది. కాలేజీల ఏర్పాటు, అదనపు సెక్షన్లను నెలకొల్పడానికి ఉండాల్సిన సదుపాయాల గురించి స్పష్టంచేసింది. అందుకు సంబంధించిన అధికారిక డాక్యుమెంట్లను కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఈ సదుపాయాలుండాల్సిందే: – ఆన్లైన్ దరఖాస్తు ఫారం ‘హెచ్‌టీటీపీఎస్://బీఐఈ.ఏపీ.జీఓఈ.ఐఎన్’లో పొందుపరిచిన ఇంటర్మీడియెట్‌బోర్డు దరఖాస్తుతో పాటు సదుపాయాలపై సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలని స్పష్టంచేసింది. – కాలేజీ భవనం, తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీ, ఆటస్థలం తదితరాల ఫొటో ఇమేజ్‌లను జియో ట్యాగింగ్ ద్వారా అప్లోడ్ చేయాలి. – బోర్డు వాటన్నిటినీ పరిశీలించనుంది. వీటిని ప్రజలకు తెలిసేలా పబ్లిక్ డొమైన్లో ఉంచుతుంది. సదుపాయాలు లేనట్లుగా గుర్తిస్తే చర్యలు తీసుకుంటుంది. – అదనపు సెక్షన్లకు వీలుగా ఆర్సీసీ భవన వసతి, అదనపు తరగతులకు గదులు ఉండాల్సిందే. – భవనపు రిజిస్టర్డ్ లీజ్ డీడ్, సొంత భవనమైతే సంబంధిత రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, ఆటస్థలం కూడా ఉండాలి. – అనుమతి ఉన్న భవన నిర్మాణ ప్లాన్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్, శానిటరీ, స్ట్రక్చరల్ సౌండ్‌నెస్ సర్టిఫికేట్లతో పాటు సంబంధిత అధికారవర్గాల నిరభ్యంతర పత్రాలను కాలేజీలు బోర్డు పరిశీలనకు సమర్పించాల్సి ఉంటుంది. – పార్కింగ్ స్థలం, బోధన, బోధనేతర సిబ్బంది వివరాలు, వారి అర్హతలకు సంబంధించిన వివరాలనూ సమర్పించాలి – బోర్డునుంచి ఎలాంటి అనుమతి లేకుండా యాజమాన్యాలు కొత్తగా ఎలాంటి సెక్షన్లను తెరిచేందుకు వీలులేకుండా చర్యలు చేపట్టారు. అడ్డగోలు ఫీజులకూ అడ్డుకట్ట: ప్రైవేట్ కాలేజీలు సాగిస్తున్న ఫీజుల దందాలకు కూడా ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఆర్.కాంతారావు నేతృత్వంలోని ఈ కమిషన్ పాఠశాల విద్యలో ప్రమాణాల పెంపుతోపాటు, పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో నిబంధనల మేరకు సదుపాయాలుండేలా చర్యలు చేపట్టింది. స్కూళ్లు నిర్ణీత ఫీజులు మాత్రమే వసూలు చేసేలా కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకు సంబంధించి మంగళవారం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఫీజులను నిర్ధారించనుంది. ఇందుకోసం యాజమాన్యాలు తప్పనిసరిగా తమ వివరాలను కమిషన్‌కు సమర్పించాలి. లేకపోతే ఆ సంస్థలకు ఫీజు వసూలుకు అనుమతి ఉండదు. – అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు ఫీజుల ప్రతిపాదనలకు సంబంధించిన సమాచారాన్ని కమిషన్ వెబ్సైట్‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్ఈఆర్ఎంసీ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ కు ఆన్లైన్ ద్వారా నిర్ణీత ఫార్మాట్లో షెడ్యూళ్లలో సమర్పించాలి. ఇందుకు జూన్ 9 వరకు గడువిచ్చారు. యాజమాన్యాల ప్రతిపాదనలు, ఇతర వివరాల ఆధారంగా ఫీజులను నిర్ణయిస్తారు. –మొదటి త్రైమాసికానికి సంబంధించిన ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలి. – అధిక ఫీజులు వసూలు చేసినా, కాలేజీలు, స్కూళ్లు తెరవకుండానే ఫీజులు వసూలు చేసినా చర్యలు తప్పవు. – ప్రతి ప్రయివేటు అన్ ఎయిడెడ్ స్కూలు, కాలేజీ తమ సంస్థల భవనాలు, తరగతి గదులు, ల్యాబ్‌లు ఇతర సదుపాయాలను జియో ట్యాగింగ్ యాప్ ద్వారా కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. – కాలేజీ, పాఠశాల గుర్తింపు వివరాలు, సెక్షన్లు , బిల్డింగ్ వివరాలు , గత ఏడాది ఫీజుల వివరాలు , ఉద్యోగుల వివరాలు , కిచెన్ హాస్టల్ వివరాలు, వచ్చిన ఫీజులు. ఖర్చుల వివరాలు , ఇతర డాక్యుమెంట్లు అప్లోడ్ చేసేలా నిబంధనలు విధించారు. -
ఇక హాస్టళ్లలోనూ భౌతిక ‘దూరం’
సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని జూనియర్ కాలేజీ హాస్టళ్లలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఇంటర్మీడియెట్ బోర్డు కసరత్తు ప్రారంభించింది. వీటికి సంబంధించిన నిబంధనలు ఖరారు చేసేందుకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ కమిటీ హాస్టళ్ల అనుమతులకు సంబం ధించిన మార్గదర్శకాలపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో హాస్టళ్లలో ఉండే విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఒక్కో విద్యార్థికి కేటాయించాల్సిన కనీస స్థలాన్ని రెట్టింపు చేసే దిశగా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి హాస్టల్లో కనీసంగా 50 ఎస్ఎఫ్టీ స్థలం కేటాయించాలన్న నిబంధన ఉండగా దానిని రెట్టింపు చేయాలని బోర్డు భావిస్తోంది. వీలైతే అంతకంటే ఎక్కువ స్థలం కేటాయించేలా చూడాలన్న ఆలోచన చేస్తోంది. త్వరలోనే ఆ నిబంధనలను అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతోంది. వాటి ప్రకారమే హాస్టళ్ల గుర్తింపు కోసం యాజమాన్యాలు దరఖాస్తు చేసుకునేలా ఇంటర్మీడియెట్ బోర్డు నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. లక్షన్నర మందికిపైగా.. రాష్ట్రంలో 2,500కు పైగా జూనియర్ కాలేజీలుంటే అందులో ప్రభుత్వ, ఎయిడెడ్, సంక్షేమ శాఖల గురుకుల జూనియర్ కాలేజీలు పోగా ప్రైవేటు కాలేజీలు 1,556 ఉన్నాయి. అందులో నివాస వసతితో కూడిన(హాస్టళ్లతో) జూనియర్ కాలేజీలు 570 వరకు ఉన్నట్లు బోర్డు అధికారులు అంచనా. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివే 9.5 లక్షల మంది విద్యార్థుల్లో ప్రభుత్వ, గురుకుల కాలేజీల్లో దాదాపు 3.5 లక్షల మంది చదువుతుండగా, 6 లక్షల మంది ప్రైవేటు కాలేజీల్లోనే చదువుకుంటున్నారు. అందులో లక్షన్నర మందికి పైగా విద్యార్థులు హాస్టళ్లలోనే ఉంటున్నారు. ప్రస్తుతం ఆయా కాలేజీ హాస్టళ్లలో భౌతిక దూరం పాటించే పరిస్థితి లేదు. నలుగురు ఉండాల్సిన గదుల్లో 8 నుంచి 10 మందిని ఉంచుతున్నారు. సదుపాయాలు పెద్దగా కల్పించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు ఐదారు అంతస్తులుండే హాస్టళ్లలో లిఫ్ట్ సదుపాయం కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కరోనా రావడంతో అధికారులు ఆలోచనల్లో పడ్డారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భౌతిక దూరం పాటించడం కూడా ప్రధానమే కావడంతో 2020–21 విద్యా సంవత్సరంలో హాస్టళ్లలో నిబంధనలను పక్కాగా అమలు చేయాలన్న ఆలోచనల్లో పడ్డారు. మరో వేయి వరకు పాఠశాలల హాస్టళ్లు ఉన్నాయి. వాటిల్లోనూ ఇవే నిబంధనలను అమలు చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టనుంది. చదవండి: తగ్గిన కంటైన్మెంట్ జోన్లు 2018లోనే నిబంధనలు రూపొందించినా... హాస్టళ్లలో ఉండాల్సిన ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పించాల్సిన సదుపాయాలపై 2018 మార్చిలోనే ఇంటర్మీడియెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం హాస్టళ్లలో చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అయితే హాస్టళ్ల గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని, అందుకు ఫీజును నిర్ణయించింది. ముందుగా ఫీజు ఎక్కువగా ఉందని యాజమాన్యాలు పేర్కొనడంతో మూడుసార్లు ఫీజు తగ్గించింది. అయినా యాజమన్యాలు ముందుకు రాకపోగా, కోర్టును ఆశ్రయించాయి. దీంతో బోర్డు ఆ నిబంధనల అమలును పక్కన పెట్టింది. ప్రస్తుతం ఒక్కో హాస్టళ్లలో 300 నుంచి 500 వరకు విద్యార్థులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆ నిబంధనలను పక్కాగా అమలు చేసేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. అయితే గతంలో ఒక్కో విద్యార్థికి కేటాయించాల్సిన కనీస స్థలాన్ని రెట్టింపు చేయడం ద్వారా భౌతిక దూరం పాటించేలా చేయవచ్చన్న ఆలోచనకు వచ్చింది. దీంతోపాటు ప్రతి చోట భౌతిక దూరాన్ని పెంచేలా నిబంధనల్లో మార్పులు చేసేందుకు అధికారుల కమిటీ చర్యలు చేపట్టింది. మార్పులు చేయనున్న కొన్ని నిబంధనలు (ప్రస్తుతం ఉన్నవి)... ►25 మంది విద్యార్థులు ఉండే ఒక్కో డార్మెటరీ 1,000 ఎస్ఎఫ్టీ ఉండాలి. రూమ్ అయితే ఒక్కో విద్యార్థికి 50 ఎస్ఎఫ్టీ ఉండాలి. ► 25 మంది విద్యార్థులకు స్టడీ రూమ్ 300 ఎస్ఎఫ్టీ ఉండాలి. ►ఫస్ట్ ఎయిడ్/సిక్ రూమ్ ఒక్కో విద్యార్థికి 75 ఎస్ఎఫ్టీ ఉండాలి. డార్మెటరీ లాంటిదైతే 10 మందికి 750 ఎస్ఎఫ్టీ ఉండాలి. ►కిచెన్ 250 ఎస్ఎఫ్టీ, డైనింగ్ హాల్ కనీసంగా 500 ఎస్ఎఫ్టీ, రిక్రియేషన్ రూమ్ 300 ఎస్ఎఫ్టీ, లైబ్రరీ 500 ఎస్ఎఫ్టీ, ఆఫీస్ ఏరియా 500 ఎస్ఎఫ్టీ, కౌన్సెలింగ్/గైడెన్స్ రూమ్ 120 ఎస్ఎఫ్టీ ఉండాలి. కొన్నాళ్లు భౌతికదూరం పాటించేలా.. రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీల్లోనూ విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భౌతిక దూరం తప్పనిసరి కావడంతో ఏం చేయాలన్న ఆలోచనల్లో అధికారులు పడ్డారు. ఇప్పటికిప్పుడు అదనపు తరగతి గదులను నిర్మించడం సాధ్యం కాని పరిస్థితి. అయితే వీలైనంత వరకు విద్యార్థుల మధ్య దూరం పాటించేలా చేయాలని భావిస్తోంది. విద్యార్థులను విభజించి షిఫ్ట్ పద్ధతిలో తరగతులను కొనసాగించే ఆలోచన చేస్తోంది. దీనిపై ఇంకా అధికారికంగా చర్చించాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ పరిధిలోని హాస్టళ్లలోనూ విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా నిబంధనల రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. -
అనుమతులు, ప్రవేశాలు అన్నీ ఆన్లైన్లోనే
సాక్షి, అమరావతి: నిబంధనలను గాలికొదిలేస్తున్న కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కళాశాలలను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. కాలేజీలకు అనుమతులు, కోర్సులు, సీట్లు, ప్రవేశాలు, ఫీజులు, బుక్స్ ఇలా అన్ని విషయాల్లోనూ ఇష్టానుసారంగా చెలరేగిపోతున్న కార్పొరేట్ యాజమాన్యాలకు చెక్ పెడుతూ.. అడ్మిషన్లు, అనుమతులను ఆన్లైన్లో నిర్వహించనుంది. వసతుల కల్పన, సిబ్బంది నియామకం, వారికి జీతాలు, ప్రవేశాలు, ఫీజుల వివరాలను పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ (ఏపీఎస్ఈఎంఆర్సీ) నిర్ణయిస్తుంది. ఇంటర్ బోర్డు కూడా పలు సంస్కరణలు చేపట్టింది. తాజాగా వచ్చే ఏడాది (2020–21 విద్యాసంవత్సరం) నుంచి కాలేజీలకు ఈ–ప్రవేశాలు (ఆన్లైన్ అడ్మిషన్లకు) నిర్ణయించింది. ప్రయివేటు జూనియర్ కాలేజీలకు అనుమతులను కూడా ఆన్లైన్ చేసింది. ► కాలేజీలు పలు రకాల ఫీజులు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవడానికి ఇంటర్మీడియెట్‌బోర్డుకు అధికారాలు కల్పిస్తూ జీఓ జారీ చేశారు. ► అధిక ఫీజులపై క్రిమినల్ కేసుల నమోదు అధికారం బోర్డు డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారికి ఉంటుంది. ► కాలేజీలకు నిర్ణయించిన ఫీజులను కూడా పాఠశాల విద్య, పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ వెబ్సైట్లోనే పొందుపర్చనుంది. ► 2020–21 విద్యా సంవత్సరం నుండి ఈ–ప్రవేశాలు (ఆన్లైన్) అమలు చేయనున్నారు. ప్రైవేటు కళాశాలల్లోనూ రిజర్వేషన్లు కల్పించనున్నారు. ► ఎంసెట్ కౌన్సెలింగ్ తరహాలోనే ఈ– ప్రవేశాల్లోనూ కౌన్సెలింగ్‌ను ప్రవేశపెట్టనున్నారు. విద్యార్థులు ఆసక్తి ఉన్న కళాశాలలకు ఆప్షన్లు ఇచ్చే అవకాశం. ► వచ్చే ఏడాది నుంచి కాలేజీలకు కోర్సుల వారీగా అనుమతులకు ఇంటర్మీడియెట్‌బోర్డు ఆన్లైన్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ జాబితాను బోర్డ్ వెబ్సైట్లో కాలేజీలో ఉన్న కోర్సులు, సీట్ల వివరాలతో అప్లోడ్ చేయనుంది. ► విద్యార్థులు ఆప్షన్ల ప్రకారం ఆన్లైన్లో అనుమతులు పొందిన కాలేజీల్లోనే ప్రవేశాలు ఇస్తారు. ► కొత్త కాలేజీల ఏర్పాటుకు కూడా ఆన్లైన్ దరఖాస్తులనే ఆహ్వానించింది. ► ఏఏ ప్రాంతాల్లో జూనియర్ కాలేజీల అవసరముందో బోర్డ్ అధ్యయనం చేసింది. ఆయా మండలాలు, పట్టణాలకే కొత్త కాలేజీలకు అనుమతి. ► విద్యార్థుల అన్ని ధ్రువీకరణ పత్రాలను బోర్డు ఆన్లైన్లోనే వెరిఫికేషన్ చేయనుంది. ఈ మేరకు టెన్త్ ఫలితాల వివరాలను ఎస్సెస్సీ బోర్డునుంచి, కుల, ఆదాయ, నివాస ప్రాంతాల ధ్రువీకరణకు సంబంధించి మీసేవ వివరాలను వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయనుంది. ► ఈ ఏడాది నుంచి ప్రాక్టికల్ పరీక్షల పకడ్బందీ నిర్వహణకు ప్రత్యేక బృందాలతో తనిఖీ. -
ఇక గురుకుల జూనియర్ కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ గురుకుల పాఠశాలలు కొత్త రూపును సంతరించుకోనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్తగా ప్రారంభించిన గురుకుల పాఠశాలలు ఇప్పటివరకు పదో తరగతికే పరిమితం కాగా.. వాటిల్లో కొత్తగా జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ఆయా సొసైటీలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించగా సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో విడతల వారీగా మంజూరైన గురుకుల పాఠశాలలను ప్రాధాన్యత ఇంటర్మీడియట్ వరకు అప్‌గ్రేడ్ చేస్తారు. ఈ మేరకు సంక్షేమ గురుకుల సొసైటీలు కసరత్తు చేస్తున్నాయి. ఒక్కో తరగతి పెరుగుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకుల సొసైటీల పరిధిలో 959 విద్యా సంస్థలున్నాయి. ఇందులో 54 గురుకుల డిగ్రీ కాలేజీలు కాగా.. మిగతావి పాఠశాలలు, జూనియర్ కాలేజీలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 54 గురుకుల డిగ్రీ కాలేజీలతో పాటు 585 గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. 2015–16 విద్యా సంవత్సరం నుంచి విడతల వారీగా గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ దశలో గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ... వీటిలో 5 ,6, 7 తరగతులకు మాత్రమే ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలా తొలి ఏడాది మూడు తరగతులతో ప్రారంభమైన గురుకుల పాఠశాలల్లో ప్రతి సంవత్సరం ఒక తరగతి పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో పదో తగతికి చేరిన గురుకుల పాఠశాలల్లో ఇప్పుడు ఇంటర్మీడియట్ కోర్సులను ప్రారంభించనున్నారు. 71 మైనార్టీ జూనియర్ కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరంలో మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో కొత్తగా 71 గురుకుల పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం పదో తరగతి బ్యాచ్ వార్షిక పరీక్షలకు సిద్ధమవుతోంది. అదేవిధంగా 2021–22 విద్యా సంవత్సరంలో బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 119, మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలో 80, గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో 50 జూనియర్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. వీటితో పాటుగా సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలో మరో వంద జూనియర్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మొత్తంగా గురుకుల విద్యా సంస్థల్లో పాఠశాలలన్నింటా జూనియర్ కాలేజీలుగా ఏర్పాటు కానున్నాయి. నాలుగు కోర్సులతో ఇంటర్ గురుకుల జూనియర్ కాలేజీల్లో నాలుగు కోర్సులకు ప్రభుత్వం అనుమతిస్తోంది. ఎంపీసీ, బీపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సులుంటాయి. ఒక్కో కోర్సులో 60 సీట్లుంటాయి. గురుకుల జూనియర్ కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఇంటర్మీడియట్ కోర్సుతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఎంసెట్, నీట్, క్లాట్, జేఈఈ తదితర పోటీ పరీక్షలకు ఫస్టియర్ నుంచే అదనపు తరగతులు నిర్వహిస్తారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన గురుకుల పాఠశాలలు సొసైటీ పాఠశాలలు ఎస్సీ 104 ఎస్టీ 51 బీసీ 238 మైనారిటీ 192 -
కేటగిరీలుగా స్కూళ్లు, కాలేజీల ఫీజులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఫీజులను నిర్ణయించేందుకు ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలను కేటగిరీల వారీగా విభజిస్తామని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్.కాంతారావు తెలిపారు. సిటీ, టౌన్, మున్సిపాలిటీ, పంచాయతీ, అర్బన్, రూరల్ ఇలా పలు విభాగాలుగా విభజించి ఆయా సంస్థల్లోని టీచర్లు, సదుపాయాల ప్రమాణాలు అన్నింటినీ బేరీజు వేసుకుని ఫీజులను ఖరారు చేస్తామన్నారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని కమిషన్ కార్యాలయంలో వైస్ చైర్మన్ డాక్టర్ అరిమంద విజయశారదారెడ్డితో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చైర్మన్ పేర్కొన్న అంశాలు ఆయన మాటల్లోనే.. ఈనెల 28న జరిగిన సర్వసభ్య సమావేశంలో కమిషన్ పలు అంశాలపై చర్చించింది. ప్రస్తుతం కమిషన్ సభ్యులు మాత్రమే ఆయా స్కూళ్లను తనిఖీలు చేస్తున్నారు. ఇకపై జిల్లాకు 20 మంది సిబ్బందితో తనిఖీలు చేపడతాం. అన్ని స్కూళ్లను ఒకేసారి తనిఖీలు చేయడం సాధ్యం కానందున ఒక పోర్టల్‌ను ఏర్పాటుచేసి ఆయా స్కూళ్లు తమ సమాచారాన్ని అప్లోడ్ చేయాలని సూచించనున్నాం. వాటిని పరిశీలించి ఆ ప్రకారం ఏర్పాట్లు ఉన్నాయో లేదో చూసి ఫీజులు నిర్ణయిస్తాం. పాఠ్యాంశాల్లో నైతికత, లైంగిక విద్య ఇటీవలి కాలంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న తరుణంలో విద్యార్థి దశ నుంచే పిల్లల్లో మహిళలపట్ల గౌరవం పెరిగేలా సంబంధిత పాఠ్యాంశాలను ప్రవేశపెట్టించనున్నాం. నైతికత, లైంగిక విద్య వంటి అంశాలను కరికులమ్‌లో జతచేయాలని సూచిస్తున్నాం. అలాగే, జూనియర్ కాలేజీల్లోనూ త్వరలో తనఖీలు చేపడతాం. ఈ కాలేజీల్లో ఫీజులు, బోధనా సిబ్బంది నియామకం, ఇతర ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ప్రస్తుతం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఇవి ఎలా జరుగుతున్నాయో కొన్ని కేంద్రాలకు వెళ్లి పరిశీలిస్తాం. మూడు దశల్లో అనుమతుల ప్రక్రియ : వైస్ చైర్మన్ విజయశారదారెడ్డి పాఠశాలలకు అనుమతుల మంజూరు విషయంలో ప్రస్తుతం ఒక గడువంటూ లేదు. ఈసారి ఓ నిర్దిష్ట విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. మూడు దశల్లో ఇది ఉంటుంది. ముందు దరఖాస్తు, తదుపరి లెటర్ ఆఫ్ ఇంటెంట్, ఆపై అనుమతులుగా ఇది ఉంటుంది. పాఠశాలలు, కాలేజీలకు అనుమతులు, అడ్మిషన్లు, ఫీజుల చెల్లింపును కూడా ఆన్లైన్లోనే నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తాం. అలాగే, ఇటీవల కొన్ని స్కూళ్లలో తరగతి గదులు ఇరుకుగా ఉండడంతో పాటు ఆట స్థలాలు ఎక్కడో దూరంగా ఉన్నట్లు చూపించారు. చిన్న పిల్లలకు అయిదో అంతస్తులో తరగతులు నిర్వహిస్తున్నారు. టెర్రస్‌పై ఆటలాడిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఈ విషయంలో ప్రతినెలా డీఈఓ 4 హైస్కూళ్లు, డిప్యూటీ డీఈఓ 8 హైస్కూళ్లు, ఎంఈఓ 12 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఆర్ఐఓలు 4 జూనియర్ కాలేజీలు, డీఐఓలు 10 జూనియర్ కాలేజీలు తనిఖీ చేసేలా షెడ్యూల్ పెడుతున్నాం. ఈ విద్యా సంస్థలు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా ప్రజలు ఫిర్యాదు చేయడానికి కమిషన్ టోల్‌ఫ్రీ నెంబర్‌ను, గ్రీవెన్సు సెల్‌ను ఏర్పాటుచేస్తుంది. -
పరగడుపున ప్రత్యేకమా?
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పదోతరగతి, ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించేందుకుగాను ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వార్షిక పరీక్షలకు గడువు సమీపిస్తుండటంతో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వివిధ సబ్జెక్టుల బోధనపై దృష్టి సారించారు. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు పరగడుపున అలాగే వస్తున్నారు. దీంతో వారికి అర్ధాకలితో నీరసం తప్పడం లేదు. మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: చాలా మంది దూర ప్రాంతాల నుంచి ఆటోలు, బస్సులు ఎక్కి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలలకు హాజరవుతున్నారు. ముఖ్యంగా కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు కాకపోవడంతో ఉదయం వచ్చేటప్పుడు టిఫిన్ తెచ్చుకుంటే సరి లేదంటే సాయంత్రం వరకు ఇబ్బందులు తప్పడం లేదు. వీరితో పాటు గతంలో దాతలు, అధికారులు వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం స్నాక్స్ అందించేవారు. ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆకలితో చదివిన చదువులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడంలేదని కొందరు ఉపాధ్యాయులు, అధ్యాపకులు చెబుతున్నారు. అల్పాహారం అందిస్తేనే ఫలితాలు గతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో కలెక్టర్ రొనాల్డ్ రోస్ చొరవతో పదోతరగతి విద్యార్థులకు మల్టీగ్రెయిన్ బిస్కెట్లను ఉదయం, సాయంత్రం అందజేశారు. ఈ సంవత్సరం అలాంటి చర్యలేవీ తీసుకోలేకపోయారు. ఇక జిల్లా కేంద్రంలోని ఇంటర్మీడియెట్ బాలుర కళాశాలలో రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహకారంతో అధ్యాపకులు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అలాగే జడ్చర్ల, మిడ్జిల్‌లోనూ కొనసాగిస్తున్నారు. మిగతా చోట్ల విద్యార్థులకు దాతలు, నాయకులు, సంస్థలు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. పూర్తయిన సిలబస్ ఇప్పటికే అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా అధ్యాపకులు సిలబస్ పూర్తి చేశారు. వీరికి వచ్చే ఫిబ్రవరిలో ప్రాక్టికల్ పరీక్షలు, మార్చిలో వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం చదువులో వెనుకబడిన పిల్లలపై శ్రద్ధ చూపుతూ, స్లిప్‌టెస్టులు యూనిట్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇక పదో తరగతి విద్యార్థులకు దాదాపుగా సబ్జెక్టులన్నీ పూర్తయ్యాయి. అన్ని పాఠశాలల్లోనూ ప్రత్యేక ప్రణాళికతో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతుల్లో గణితం, సైన్స్, ఇంగ్లిష్‌పై ప్రిపరేషన్ సాగడంతో పాటు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చదువు ఒత్తిడితో పాటు దూరం నుంచి రావడం, పోవడంతో సరిగ్గా ఆహారం తీసుకోని కారణంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, దాతలు సహకరించి ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. దాతలు ఆదుకుంటేనే.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే దాదాపు అన్నిచోట్ల సిలబస్ పూర్తయింది. ఈసారి వందశాతం ఫలితాల దిశగా కృషి చేస్తున్నాం. అల్పాహారం అందించేందుకు దాతలు ముందుకు వచ్చి ఆదుకుంటేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.– వెంక్యానాయక్, జిల్లాఇంటర్మీడియెట్ శాఖ అధికారి, మహబూబ్‌నగర్ -
'పాఠశాల తీరుని బట్టి గ్రేడింగ్ ఇస్తాం'
సాక్షి, విజయవాడ : ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఫీజులు నియంత్రిస్తామని ప్రాథమిక విద్యా కమిషన్ కార్యదర్శి ఆలూరి సాంబ శివారెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే అన్ని జూనియర్ కాలేజీలు, ప్రైవేట్ పాఠశాలల్లో తనికీలు నిర్వహిస్తామని తెలిపారు. పాఠశాల తీరుని బట్టి గ్రేడింగ్ నిర్ణయిస్తామని, మెరుగయిన సదుపాయాలు ఉన్నాయో లేదో పరిశీలిస్తామని తెలిపారు. ఫీజుల నియంత్రణ కోసం శాస్త్రీయ విధానం రూపొందిస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలపై కమిషన్‌లో ప్రత్యేక గ్రీవెన్సు సెల్ ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. -
జూనియర్ కాలేజీల్లో కౌన్సెలర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు చర్యలు చేపడుతోంది. చదువులో వెనుకబడి పోతున్నామన్న ఆందోళనతో ఆత్మన్యూనతా భావానికి గురయ్యే విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపేందుకు కసరత్తు చేస్తోంది. విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయిం చేలా, వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించేలా కౌన్సెలింగ్ ఇప్పించేందుకు చర్యలు చేపడు తోంది. ఇందుకోసం విద్యార్థులకు అందుబాటులో ఉండేలా కౌన్సెలర్లను నియమిం చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బయట నుంచి కాకుండా కాలేజీల్లో బోధించే లెక్చరర్లలో ఒకరిని కౌన్సెలర్‌గా నియమించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 404 మంది లెక్చరర్లకు త్వరలోనే సైకాలజిస్టులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సైకాలజిస్టుల ఆధ్వర్యంలో శిక్షణ పొందిన లెక్చరర్లు నిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉంటూ విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గేలా కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. ముందుగా ప్రభుత్వ కాలేజీల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ తరువాత ప్రైవేటు జూనియర్ కాలేజీల్లోనూ అమలు చేసేలా చూడాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. సైకాలజిస్టుల ఆధ్వర్యంలో శిక్షణ పొందే లెక్చరర్లు కౌన్సెలర్లుగా నియమితులయ్యాక విద్యార్థులు ఒత్తిడి తట్టుకోవడం ఎలా అనే అంశాలతోపాటు పరీక్షల సూచనలు, సబ్జెక్టులను ఎలా గుర్తుపెట్టుకోవాలన్న దానిపై మెమరీ టిప్స్ కూడా నేర్పించనున్నారు. స్ట్రెస్ మేనేజ్మెంట్ విషయంలో వీడియో లెక్చర్స్‌ను విద్యార్థులకు చూపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కాలేజీల్లో కలివిడిగా ఉండని విద్యార్థులను గుర్తించి వారు చదువులో ఎలా ఉన్నారన్న అంశాలను తొలుత పరిశీలించనున్నారు. వారు కలివిడిగా ఉండకపోవడానికి కారణాలను గుర్తించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆ తరువాత విద్యార్థులందరికీ స్ట్రెస్ మేనేజ్మెంట్పై అవగాహన కల్పించనున్నారు. విద్యార్థుల్లో పరీక్షల భయం పోగొట్టి బాగా చదువుకునేలా అవగాహన కల్పించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు.. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించేలా ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. సెకండియర్ విద్యార్థులు ఎవరైనా ఒకవేళ ఫస్టియర్ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయితే ఆయా సబ్జెక్టుల్లో కోచింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు బాగా చదివే విద్యార్థులు ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ వంటి పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ శిక్షణను నవంబర్ 8 లేదా 9న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా ప్రారంభించేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే బోర్డు ప్రతి సబ్జెక్ట్‌లో స్పెషల్ కంటెంట్‌ను తయారు చేయించి వాటిని సీడీల్లో భద్రపరించింది. వాటిని త్వరలోనే అన్ని కాలేజీలకు పంపించనుంది. మరోవైపు ఆన్లైన్ పాఠాలను కూడా అందించే ఏర్పాట్లు చేస్తోంది. అన్ని కాలేజీల్లోని విద్యార్థులు ఒకేసారి పాఠాలు వినేలా చర్యలు చేపడుతోంది. -
నిబంధనలు పాటించని కళాశాలల మూసివేతలు
సాక్షి, మహబూబ్‌నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతం ప్రైవేటు జూనియర్ కళాశాలలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొటున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలల పూర్తవుతున్నా పూర్తి స్థాయిలో అడ్మిషన్లు లేక, అధ్యాపకులు రాక నిర్వహణ భారమై మూతపడే స్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వం గురుకులాలు, కేజీబీవీల్లో పూర్తి స్థాయిలో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రాకపోవడం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. కాస్త ఆర్థికంగా ఉన్న వారు హైదరాబాద్, ఇతర పట్టణాలకు పంపించి ఇంటర్ విద్య చదివిస్తున్నారు. పెరిగిన అడ్మిషన్లు ప్రైవేటు కళాశాలల్లో పేదలు, సామాన్య కుటుంబాలకు చెందిన పిల్లలను ప్రభుత్వం సర్కారు కళాశాలలకు మళ్లించడంలో విజయవంతం అయిందనే చెప్పాలి. ఇది శుభ పరిణామం కూడా. కేవలం ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే ప్రభుత్వ కళాశాలల్లో దాదాపు 3,300 అడ్మిషన్లు గత సంవత్సరం కంటే పెరిగాయి. అయితే గత సంవత్సరం కళాశాలలను సరిగ్గా నిర్వహించలేదని, పూర్తి స్థాయిలో అడ్మిషన్లు లేవని గమనించిన అధికారులు మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో కలిపి మొత్తం 5 ప్రైవేటు కళాశాలలు అఫ్లియేషన్ కోసం దరఖాస్తులు చేసుకున్నా ఈ విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు తీసుకునేందుకు అనుమతిని నిరాకరించారు. ఉమ్మడి జిల్లాలో ఈ సంఖ్య పదుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక ప్రతి సంవత్సరానికి ఒక సారి అఫ్లియేషన్ కోసం కళాశాలలు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తులు చేసుకున్న చాలా కళాశాలలకు ప్రభుత్వం గుర్తింపు ఇంకా మంజూరు చేయలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యతా, ప్రమానాలు పాటించే కళాశాలలకు మాత్రమే అనుమతి మంజూరు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. 37 కళాశాలలకు పెండింగ్.. జిల్లాలోని 37 ప్రైవేటు కళాశాలలకు ఇప్పటికి ప్రభుత్వ అఫ్లియేషన్ ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 109 ప్రైవేటు కళాశాలలు ఉంటే ఇప్పటివరకు అనుమతి ఇచ్చింది 72 కళాశాలలకు మాత్రమే. గద్వాల్లో 6 కళాశాలలు, వనపర్తిలో 13 కళాశాలలు, నాగర్‌కర్నూల్ 14 కళాశాలలు, మహబూబ్‌నగర్, నారాయణపేట కలిపి మొత్తం 39 కళాశాలలకు మాత్రమే అఫ్లియేషన్ ఇచ్చింది. ఇక నిబంధనల ప్రకారం గత సంవత్సరం కళాశాలలను నిర్వహించని కళాశాలలను అఫ్లియేషన్ కోసం దరఖాస్తులు చేసుకున్న, వాటికి కనీసం అడ్మిషన్లు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ జూనియర్ కళాళాల, భవిత, న్యూఎరా, మక్తల్‌లో సాయి చైతన్య, మద్దూర్‌లో వివేకానంద జూనియర్ కళాశాలలను ప్రభుత్వం అడ్మిషన్లకు అనుమతి నిరాకరించింది. అంతేకాకుండా అఫ్లియేషన్ ఇవ్వని 37 కళాశాలల్లో కూడా కొన్ని కళాశాలలు మాత్రమే పూర్తి స్థాయిలో నిబంధనల ప్రకారం కళాశాలలు నిర్వహిస్తున్నారని, చాలా కళాశాలలో ప్రభుత్వ నిభంధనల ప్రకారం నిర్వహించడం లేదని అధికారులు అంటున్నారు. గద్వాల జిల్లాలో చాలా జూనయర్ కళాశాలలు రేకుల షెడ్డుల్లో నిర్వహిస్తున్నారని, వాటిని అనుమతి వచ్చే అవకాశం లేదని తెలస్తుంది. ఇవీ నిబంధనలు.. కళాశాలలకు అనుమతి ఉండాలంటే ముఖ్యంగా ఆర్సీసీసీ బిల్డింగ్ సొంతమా లేక, అద్దె భవనమా అని చూసి కళాశాలకు తరగతులకు నాలుగు సెక్షన్ల వరకు అనుమతి ఉంటుంది. ఇక ప్లే గ్రౌండ్ విషయంలో మున్సిపాలిటీ పరిధిలో ఉంటే ఒక ఎకరా భూమిని, అర్బన్ ప్రాంతంలో ఉంటే 2.5 ఎకరాలు ఉన్నట్లు ప్రభుత్వానికి చూపించాలి. ఇక పారిశుద్ధ్య విషయంలో విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, వాష్బేసిన్లు, శుద్ధజలం వంటి వాటికి ముఖ్యమైనవి. స్ట్రక్షర్ సౌండ్ ఎఫెక్ట్‌కు సంబంధించి ఆర్అండ్బీ నుంచి అనుమతి, ఫైర్‌సేఫ్టీకి సంబంధించి ఎఫ్ఆర్డీ నుంచి అనుమతి తీసుకోవాలి. తరగతుల వారిగా సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి. ఇక ల్యాబరోటరీలు, ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీ, జువాలజీ వేరువేరుగా ప్రత్యేక ల్యాబ్‌లను ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇక లైబ్రరీలో అన్ని సబ్జెక్టులకు సంబంధించి పుస్తకాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రతి కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ ఉండాలి. అధ్యాపకుడి పూర్తి వివరాలు, ఒరిజినల్ సర్టికెట్లను ఆన్లైన్ పద్ధతిలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఆ శాఖల నుంచి అనుమతి పత్రాలను ప్రభుత్వానికి ఒరిజినల్‌వి పంపాలి. అన్ని ధ్రువీకరణ పత్రాలు సరిగ్గా ఉంటే అప్పుడు బోర్డు అధికారులు తనిఖీలకు వెళ్లి అనుమతిని ధ్రువీకరిస్తారు. ప్రభుత్వ కళాశాలల్లో పెరిగిన అడ్మిషన్లు ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఎక్కువ మొత్తంలో విద్యార్థులను ప్రభుత్వ కళాశాలోల్లో చేర్పించేందుకు కృషి చేస్తోంది. ఇటీవల కస్తూర్బా గాంధీ కళాశాలల్లో నియోజకవర్గానికి రెండు చొప్పున 22 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రభుత్వం ప్రారంభించింది. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల్లాలో కూడా పెద్ద సంఖ్యలో ప్రారంభించడంతో విద్యార్థులు అక్కడ అడ్మిషన్లు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ఎటువం టి ఫీజులు లేకుండా పుస్తకాలు, వసతి, యూనిఫాం లతో పాటు నాణ్యమైన విద్య అందించడం తో అటువైపు చాలా మంది విద్యార్థులు వెళ్తున్నా రు. వీటితో పాటు ఇంటర్ జూనియర్ కళాశాల ల్లో కూడా పూర్తిగా ఉచిత విద్యను అందించడం తో విద్యార్థులు అక్కడే ఆసక్తి చూపుతున్నారు. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే దాదాపు 3,300 అడ్మిషన్లు గతంలో కంటే పెరిగాయంటే పరిస్థితి అర్థం అవుతుంది. ఈ కారణాలతో ప్రైవేటు కళాశాలల్లో అడ్మిషన్లు కరువయ్యాయి. నిబంధనలు పాటిస్తేనే అనుమతి జిల్లాలో అఫ్లియేషన్ కోసం దరఖాస్తులు చేసుకున్న కళా శాలలు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తేనే అనుమతి లభిస్తుంది. నిబంధనలు ఖాతరు చేయని కళాశాలలకు అడ్మిషన్లు నిలిపివేశాం. అప్లియేషన్ రాని కళాశాలలు పూర్తి స్థాయిలో అన్ని వివరాలను సకాలంలో సమర్పిస్తేనే అనుమతి ఇస్తాం. ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా విద్యను అందించడం వల్ల చాలా వరకు అక్కడ అడ్మిషన్లు పెరిగాయి. – వెంక్యానాయక్, ఇంటర్మీడియెట్ అధికారి -
మండలానికో జూనియర్ కాలేజీ
ఒంగోలు టౌన్ :పదో తరగతి వరకు ఇంటికి, ఊరికి సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఇంటర్ మీడియట్‌కు ఎక్కడో దూరంగా ఉన్న కాలేజీలకు వెళ్లాల్సి వస్తోంది. కొత్త వాతావరణంలో ఇమిడేందుకు వారికి కొంత సమయం పడుతోంది. దీని వల్ల డ్రాప్ అవుట్స్ శాతం కూడా పెరుగుతోంది. విద్యార్థులకు దూరాభారాన్ని తగ్గించి, వారు పదో తరగతి వరకు ఎక్కడ చదువుకున్నారో అక్కడే జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తే...! విద్యార్థుల ఆనందానికి అవధులుండవు. తల్లిదండ్రులకు కూడా తమ బిడ్డలు తమ వద్దనే ఉండి కాలేజీ చదువులు చదువుకుంటున్నారని సంతోషపడతారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో బుధవారం సమీక్షించారు. మండలానికో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అది కూడా ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేస్తూ అక్కడే ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో జిల్లాలోని అన్ని మండలాల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించినవిధివిధానాలు విడుదల కావలసి ఉంది. ప్రస్తుతం 33 జూనియర్ కాలేజీలు జిల్లాలో 56 మండలాలు ఉండగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కలిíపి మొత్తం 206 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 33 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 12 ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, 161 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జిల్లాలో దాదాపు 56 వేల మంది విద్యార్థులు చదువుతుండగా, వారిలో 10500 మంది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతుండగా, మిగిలిన వారు ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో చదువుతున్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో అదనంగా మరికొన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ‘ఉన్నత’ అప్‌గ్రేడ్ జిల్లాలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఉన్నత పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ కానున్నాయి. ఉన్నత పాఠశాలలకు సంబం«ధించి పూర్తి స్థాయిలో తరగతి గదులు ఉండటం, విశాలమైన స్థలాలు ఉండటంతో అక్కడ జూనియర్ కాలేజీలకు భవన నిర్మాణాలు చేపట్టేందుకు వీలుకలగనుంది. దానికితోడు ఆ ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుకున్న విద్యార్ధులు, ఇంటర్ మీడియట్ కూడా అక్కడే చదువుకునే వెసులుబాటు కలగనుంది. పదవ తరగతి వరకు విద్యార్థులు కనబరిచే ప్రతిభను గమనించిన అక్కడి ఉపాధ్యాయులు వారు ఏ కోర్సుల్లో చదివితే బాగుంటుంది, ఆ కోర్సుల ద్వారా కలిగే ప్రయోజనాలను తెలియజేసి వారికి సరైన దిశానిర్దేశం చేసేందుకు వీలుకలగనుంది. కేజీబీవీలు అప్‌గ్రేడ్.. ఇదిలా ఉండగా జిల్లాలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో కొన్ని జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. బాలికల కోసం ప్రత్యేకంగా కేజీబీవీలను ఏర్పాటు చేశారు. ఆరు నుంచి పదో తరగతి వరకు కేజీబీవీల్లో చదువుకున్న బాలికలు తాము అప్పటి వరకు చదువుకున్న చోటే ఇంటర్ మీడియట్ చదివే అవకాశం రావడంతో ఆ బాలికల్లో డ్రాప్ అవుట్ శాతం కూడా తగ్గింది. కేజీబీవీలు ఇంటర్ విద్య వరకు అప్‌గ్రేడ్ అయిన నేపథ్యంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు జూనియర్ కాలేజీలకు అప్‌గ్రేడ్ కానున్న నేపథ్యంలో అక్కడ చదువుకునే వారిలో కూడా డ్రాప్ అవుట్ శాతం పూర్తిగా తగ్గించే వీలు కలగనుంది. -
ప్రతి మండలంలో జూనియర్ కాలేజీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ప్రతి మండలానికో జూనియర్ కాలేజీ ఉండాలని, ఇందుకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లను క్రమపద్ధతిలో ప్లస్ టూ వరకు పెంచుతూ జూనియర్ కాలేజీ స్థాయికి తీసుకు వెళ్లాలని సూచించారు. వీటిని ఎక్కడ, ఏ రకంగా చేయాలన్నదానిపై ఒక ప్రణాళికను రూపొందించాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అవసరమైన మౌలిక వసతులను కల్పించడం ద్వారా వాటిని అభివృద్ధి చేయడంపై సీఎం వైఎస్ జగన్ బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. స్కూళ్ల తరహాలోనే కాలేజీల్లో మౌలిక వసతుల కల్పనకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గానికి ఒక కాలేజీ చొప్పున బాగు చేయడంపై దృష్టి సారించాలని చెప్పారు. డైట్స్‌ను బలోపేతం చేయాలి వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధనను అమలు చేయాలని, ఆ తర్వాత 9, 10 తరగతులకూ వర్తింప చేయాలని ఆదేశించారు. ఇందు కోసం 70 వేల మంది టీచర్లకు ఆంగ్ల బోధనలో శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆంగ్ల బోధనపై శిక్షణ ఇచ్చేలా డైట్స్‌ను బలోపేతం చేయాలని చెప్పారు. టీచర్లకు ఇచ్చే శిక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నప్పటికీ తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ సందర్బంగా విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడానికి కసరత్తు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఖాళీల భర్తీ పక్రియను ప్రతి ఏడాది జనవరిలో పూర్తి చేయాలని, ఏ శాఖ ఏ పరీక్షలు పెట్టాలన్నా జనవరిలో పెట్టాలని సీఎం సూచించారు. పర్యావరణం, వాతావరణంలో మార్పులు, రహదారి భద్రతకు సంబంధించిన అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని స్పష్టం చేశారు. పుస్తకాలు, యూనిఫామ్, షూ, స్కూలు బ్యాగు,.. ఇవన్నీ కూడా వచ్చే ఏడాది విద్యార్థులు స్కూల్లో చేరిన రోజే ఇవ్వాలని, ఎక్కడా ఆలస్యం కాకుండా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో 15,410 స్కూళ్లలో మౌలిక వసతులు ‘నాడు – నేడు’ కింద మొత్తం 44,512 పాఠశాలలను బాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో భాగంగా తొలి దశలో 15,410 స్కూళ్లలో ఈ కార్యక్రమం చేపడతున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఇందులో భాగంగా పాఠశాలల్లో 9 రకాల కనీస వసతులను కల్పించనున్నట్లు తెలిపారు. పంచాయతీ రాజ్, మున్సిపల్, గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖలకు చెందిన పాఠశాలలు ప్రతి దశలో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. తొలి దశలో లక్ష్యం పెరిగినా పర్వాలేదని, ఏ పాఠశాల తీసుకున్నా 9 రకాల పనులు తప్పనిసరిగా పూర్తి కావాలని చెప్పారు. చేపట్టే పనుల్లో నాణ్యత ఉండాలని, ఈ విషయంలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు. 2020 మార్చి 14 నాటికి ‘నాడు – నేడు’ కింద తొలిదశ స్కూళ్లలో చేపట్టిన పనులు పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. స్కూళ్లలో చేపడుతున్న పనులకు విద్యా కమిటీల ఆమోదం ఉండేలా చూడాలని, ఈ కమిటీలు సామాజిక తనిఖీలు చేయాలని సీఎం సూచించారు. స్కూళ్ల బాగు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారంటూ ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. బడుల బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులదే అన్న భావన కలిగించాలని, స్కూళ్లను అభివృద్ధి చేయడంలో పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలన్నారు. స్కూళ్ల బాగు కోసం ప్రభుత్వం క్యాంపెయిన్ చేయడం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ప్రైవేట్ కాలేజీల్లో సరైన సదుపాయాలుఉండాలి ప్రయివేటు కాలేజీలకు అనుమతి ఇవ్వడం లేదన్నది అవాస్తవమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే అక్కడ సరైన మౌలిక సదుపాయాలు, ఉన్నాయా.. లేదా? అన్నది చూస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నప్పుడు ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లలో కూడా సరైన సదుపాయాలు ఉండాలని, అలా ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. కనీస ప్రమాణాలు, వసతులు లేకుండా ఏ విద్యా సంస్థ ఉండడం సరికాదని, ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుందని, ప్రయివేటు సంస్థలు చేయాల్సిన పనులు వాళ్లు చేయాలని సీఎం పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం కింద ఇస్తున్న కోడి గుడ్లపై గతంలో బాగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. అందుకే ప్రస్తుతం గుడ్ల పంపిణీని వికేంద్రీకరించామని చెప్పారు. నాణ్యమైన గుడ్లు విద్యార్థులకు అందేలా ఇంకా ఎలాంటి విధానాలు అనుసరించాలన్నదానిపై మరిన్ని ఆలోచనలు చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల సొమ్ము నేరుగా లబ్ధిదారులకు అందేలా అన్ ఇన్‌కంబర్డ్ బ్యాంకు ఖాతాలను తెరిచే బాధ్యత గ్రామ వలంటీర్లదేనని సీఎం స్పష్టం చేశారు. -
అంతా.. ట్రిక్కే..!
అధ్యాపకులు లేకున్నా రిజిస్టర్లలో పేర్లుంటాయి..విద్యార్థులు లేకున్నా లెక్కల్లో చూపిస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. అంతా మాయ చేస్తున్నాయి.. ఇదేమని అడిగేవారు లేకపోవడంతో బయోమెట్రిక్ విధానాన్ని యాజమాన్యాలు పక్కదోవ పట్టిస్తున్నాయి. విద్యార్థుల స్కాలర్ షిప్‌లు స్వాహా చేస్తున్నాయి. రూ.లక్షల్లో ప్రభుత్వ నిధులను కాజేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షి, నెల్లూరు : ఇంటర్ కళాశాలల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి. ఇంటర్ కళాశాలల్లో బయోమెట్రిక్ ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల హాజరును పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించి విధిగా యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. అయితే జిల్లాలో ఏ ఒక్క కళాశాలలో కూడా బయోమెట్రిక్ యంత్రాన్ని ఏర్పాటు చేయలేదు. బయోమెట్రిక్ ఏర్పాటుకు నిరాకరిస్తే కళాశాల గుర్తింపు రద్దు చేస్తామన్న హెచ్చరికను కూడా వారు పెడచెవిన పెట్టడం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాలు విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న ఇంటర్ బోర్డు అధికారులు కళాశాలల్లో ఉన్న పరిస్థితులపై ప్రస్తుతం నోరు మెదపడం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రతి ఏటా స్కాలర్షిప్ రూపంలో కొంత మొత్తాన్ని అందజేస్తున్నారు. బోగస్ హాజరుతో ప్రభుత్వం ఇచ్చే నిధులను కార్పొరేట్, ప్రభుత్వ యాజమాన్యాలు పక్కదారి పట్టిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు హాజరు తక్కువ ఉందని విద్యార్థుల నుంచి కొత్త మొత్తాన్ని అదనంగా వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. జిల్లాలో 126 కార్పొరేట్, 26 ప్రభుత్వ, 15 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి దాదాపు 60వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లను ప్రతినెలా మంజూరు చేస్తుంది. ఒక్కో విద్యార్థికి నెలకు రూ.325 చొప్పున 10 నెలలకు రూ.3,250 విడుదల చేస్తుంది. బోగస్ హాజరు చూపిస్తూ పలు కళాశాలలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. ప్రతిరోజు కళాశాలలకు రావాల్సిన అవసరం ఉండదని, పాస్ చేయించే బాధ్యత తమదేనని గ్యారెంటీ ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులనుఎక్కువ మొత్తంలో చేర్చుకుంటున్నారు. వారు రోజు కళాశాలకు రాకపోయిన రికార్డుల్లో హాజరు చూపిస్తూ స్కాలర్‌షిప్పును ఎంచక్కా మెక్కేస్తున్నారు. అక్రమాలను అరికట్టేందుకు బయోమెట్రిక్ జూనియర్ కళాశాలల్లో అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ యంత్రాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ప్రతి విద్యార్థి ఆధార్ నంబరును బయోమెట్రిక్‌కు అనుసంధానం చేసింది. ప్రతిరోజు విద్యార్థి ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ హాజరును పరిగణలోకి తీసుకుని స్కాలర్‌షిప్పును ప్రభుత్వం విడుదల చేస్తుంది. ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక బయోమెట్రిక్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని ఇంటర్‌బోర్డు అధికారులు ఆదేశించారు. కళాశాలలో పనిచేసే అధ్యాపకుల హాజరు సైతం బయోమెట్రిక్ ద్వారా తీసుకోవాలని తెలిపారు. ఆర్ఐఓలే బాధ్యులు ... జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేయకపోతే ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్ఐఓ)నే బాధ్యులు అవుతారని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం బయోమెట్రిక్ యంత్రాల అమలుపై ఎవరూ నోరు మెదపడం లేదు. ఇంటర్ బోర్డు అధికారులు సైతం పట్టించకోవడం లేదు. బయోమెట్రిక్ హాజరు లేకుండా ఏ ఒక్క కళాశాల నుంచి స్కాలర్షిప్పులకు దరఖాస్తులు స్వీకరించరాదని, పరీక్షల నిర్వహణకు, నామినల్ రోల్స్‌కు కూడా సిఫార్సు చేయవద్దని ఇంటర్‌బోర్డు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇంటర్ బోర్డు చెప్పినట్లు యంత్రాలు అమలు చేస్తే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టేనని కొన్ని కళాశాలల నిర్వాహకులు చెబుతున్నారు. మాన్యువల్ విధానం ఉంటే విద్యార్థులు వచ్చినా రాకున్నా హాజరు వేసుకుని స్కాలర్‌షిప్పు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించవచ్చనే ఆలోచనలో ఇంటర్ కళాశాలల యాజమాన్యాలు ఉన్నట్లు తెలిసింది. యంత్రాలు ఏర్పాటు చేస్తే అన్ని రకాలుగా నష్టదాయకమని భావించి వాటిని నిరాకరిస్తున్నారని సమాచారం. అయితే బయోమెట్రిక్ ద్వారా హాజరు పరిగణలోకి తీసుకంటే తమ పిల్లలు రోజు కళాశాలకు వెళుతున్నారా..లేదన్నది తల్లిదండ్రులకు తెలిసే అవకాశం ఉంది. దీంతో పాటు ఒక్కో యంత్రం ధర రూ.30వేల నుంచి రూ.35వేలుగా నిర్ణయించారు. ఇదిలా ఉండగా ప్రతి కళాశాలలో బయోమెట్రిక్ యంత్రం తప్పనిసరిగా బిగించాల్సిందేనని ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే శ్రీనివాసరావు, స్పష్టం చేశారు. ఏర్పాటు చేయనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మధ్యాహ్న భోజన పథకం అమలేది..!
సాక్షి, ఖమ్మం: జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి మూడేళ్లయినా ముందుకెళ్లడం లేదు. కళాశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా భోజనం జాడలు కనిపిం చడం లేదు. అసలు ప్రభుత్వం భోజన పథకం అమలు చేస్తుందా.. లేదా అనే సందిగ్ధంలో విద్యార్థులున్నారు. దీనిపై విధాన నిర్ణయం ప్రభుత్వం ప్రకటించకపోగా.. విద్యార్థి సంఘాలు మాత్రం మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు సంఘాలు ఆందోళనకు దిగాయి. జిల్లాలో 19 జూనియర్ కళాశాలలు ఉండగా.. వీటిలో మొదటి సంవత్సరం 3,267 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ద్వితీయ సంవత్సరంలో 3,128 మంది ఉన్నారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ కళాశాలలకు దీటుగా బోధన చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. ఈ క్రమంలో కళాశాలల్లో విద్యార్థుల చేరిక కూడా బాగానే ఉంది. అయితే ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థులు సాయంత్రం వరకు ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీంతో మధ్యాహ్న భోజనం లేక అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు బాక్స్‌లు తెచ్చుకుంటున్నా.. చాలా మంది విద్యార్థులు ఉదయమే కళాశాలకు వస్తుండడంతో భోజనం తెచ్చుకోవడం వారికి వీలు కావడం లేదు. అయితే ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని ప్రకటిస్తూ వస్తోందని, తమకు అమలు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. కళాశాలల్లో చేరిన విద్యార్థులు.. తమ పిల్లలను దూర ప్రాంతాలకు పంపించడం ఇష్టంలేని తల్లిదండ్రులు దగ్గర్లో ఉన్న జూనియర్ కళాశాలల్లో చేర్పిస్తున్నారు. ముఖ్యంగా బాలికలు ఎక్కువ మంది స్థానికంగా ఉండే జూనియర్ కళాశాలల్లో చేరుతున్నారు. అయితే ఉదయం వెళ్లిన వారు సాయంత్రమే మళ్లీ ఇంటికి రావడం కుదురుతోంది. అయితే కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు జరుగుతుందనే ప్రచారంతో చాలా మంది విద్యార్థులు కళాశాలల్లో చేరారు. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం గురించి ప్రభుత్వం కనీసం ప్రకటన కూడా చేయకపోవడంతో విద్యార్థులు సాయంత్రం వరకు ఆకలితో అలమటించాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయమే భోజనం సిద్ధం కాదు.. దీంతో కొందరు విద్యార్థులు కళాశాలకు వచ్చే సమయంలో ఇంటి వద్దే భోజనం చేసి బయలుదేరుతారు. ఇక సాయంత్రం వరకు వారికి తినేందుకు ఏమీ అందుబాటులో ఉండడం లేదు. మధ్యాహ్నం సమయంలో కేవలం మంచినీటితోనే కడుపు నింపుకోవాల్సి వస్తోంది. ఆకలితోనే పాఠాలు వినాల్సి వస్తోంది. కొందరు విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వస్తుండడంతో వారు ఆకలితో, ఒత్తిడితో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిందే.. కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు కాకపోవడంతో విద్యార్థులు ఇంటి వద్ద నుంచే భోజనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయమే భోజనం సిద్ధం కాని పరిస్థితి ఉండడవంతో విద్యార్థులు హడావుడి చేయాల్సి వస్తోంది. తల్లిదండ్రులు కళాశాల సమయానికంటే ముందే లేచి తమ పిల్లలకు భోజనం సిద్ధం చేయాల్సి వస్తోంది. దూర ప్రాంత విద్యార్థులు కళాశాలకు చేరుకోవాలంటే ముందుగానే బయలుదేరాలి. అలాగే సాయంత్రం ఇంటికి చేరే వరకు సమయం ఎక్కువ పడుతోంది. బస్సులో ప్రయాణించాల్సి రావడంతో వారు తప్పనిసరిగా భోజనం తీసుకెళ్లాల్సిందే. భోజనం లేకపోతే త్వరగా నీరసం వస్తుందని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు. విద్యార్థి సంఘాల ఆందోళన.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మధ్యాహ్న భోజనం అమలు చేస్తారనే ఉద్దేశంతో విద్యార్థులు జూనియర్ కళాశాలల్లో చేరారు. అయితే పథకం అమలు కాకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఇటీవల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. పలు కళాశాలల ఎదుట ఆందోళనలు కూడా చేశారు. ‘భోజన’ పథకాన్ని అమలు చేయాలి.. నాటి విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రభుత్వ పాఠశాలల్లో మాదిరిగానే కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తామని మూడేళ్ల క్రితం ప్రకటించారు. ఇప్పటివరకు అమలు కాలేదు. ఈ విషయంపై ప్రస్తుత విద్యా శాఖ మంత్రి సైతం స్పందించడం లేదు. ప్రభుత్వం, అధికారులు సత్వరమే స్పందించి కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి. – ఆజాద్, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఈ కాలేజ్‌లకు లెక్చరర్లే లేరు!
సాక్షి, ఆదిలాబాద్ : ప్రభుత్వ కళాశాలల్లో రెగ్యులర్ లెక్చరర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గత కొన్నేళ్లుగా జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ కాకపోవడంతో కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లతోనే నెట్టుకు రావాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో నాణ్యమైన బోధన లేక కొంతమేర విద్యార్థులు కూడా నష్టపోతున్నారు. ఏటా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా రెగ్యులర్ అధ్యాపకుల నియామకాలు జరగకపోవడంతో విద్యార్థుల చదువుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. జిల్లాలోని 13 ప్రభుత్వ కళాశాలల్లో కేవలం 13 మంది మాత్రమే రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నారంటే ఇంటర్ విద్య పరిస్థితి ఏమిటో అర్థమవుతోంది. అంతేకాకుండా ఒక్కరు కూడా లైబ్రేరియన్, పీడీ లేరు. ఈ పోస్టుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. కనీసం కాంట్రాక్ట్ పద్ధతిన కూడా నియామకాలు చేపట్టకపోవడంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. ఆదిలాబాద్ జిల్లాలో 13 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 13 మంది రెగ్యులర్, 138 మంది కాంట్రాక్ట్, 59 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. 2012 నుంచి జూనియర్ లెక్చరర్ల పోస్టులు భర్తీ కావడం లేదు. 2014లో ఇంటర్మీడియెట్ బోర్డులో పనిచేసే ఉద్యోగులకు పీజీ ఉన్నవారికి 10 శాతం కోట కింద పదోన్నతుల ద్వారా కొన్ని పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. దాదాపు ఏడేళ్లుగా జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీ లేకపోవడంతో సర్కారు కళాశాలల్లో పూర్తిస్థాయిలో నాణ్యమైన విద్య అందడం లేదని తెలుస్తోంది. దీని ప్రభావం ఇంటర్ ఫలితాలపై పడుతోంది. అయితే జిల్లాలో ఆదిలాబాద్, బేలలో మరాఠీ బోధన, మిగతా కళాశాలల్లో తెలుగు మీడియం తరగతులు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇంగ్లిష్ మీడియం కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం లేకపోవడంతో ప్రైవేట్ కళాశాలల బాట పడుతున్నారు. గతేడాది ఆంగ్ల మాధ్య మం బోధించాలని ఇంటర్‌బోర్డు సూచించినా రెగ్యులర్ లెక్చరర్లు లేకపోవడంతో తెలుగు మీడియంలోనే చదువులు సాగుతున్నాయి. కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లతోనే చదువులు.. కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లతో కొన్ని కళాశాలల్లో అంతంత మాత్రంగానే చదువులు సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే పరీక్షల సమయంలో కొంతమంది కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకొని పరీక్షల్లో విద్యార్థులకు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఆయా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత శాతం తగ్గితే వేటు పడుతుందనే ఉద్దేశంతో దగ్గరుండి మరీ చీటీలు అందిస్తున్నారు. కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో 95 శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధిస్తుండగా, ఆదిలాబాద్ పట్టణంలో మాత్రం 30శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత రావడం లేదు. ఇంటర్లో అధిక మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. డిగ్రీలో 25 నుంచి 30 శాతం కూడా ఫలితాలు రావడం లేదంటే ఇంటర్లో పరిస్థితి ఏందో అందరికీ తెలిసిందే. జాడలేని పీడీ, లైబ్రేరియన్ పోస్టులు జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ఒక్కరు కూడా ఫిజికల్ డైరెక్టర్ (పీడీ), లైబ్రేరియన్ లేరు. వ్యాయామ లెక్చరర్లు లేకపోవడంతో విద్యార్థులు క్రీడలకు దూరమవ్వడంతోపాటు శారీరక ధృడత్వాన్ని పొందలేకపోతున్నారు. విద్యాబోధన చేసేందుకు కనీసం కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నా పీడీలు మాత్రం లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అలాగే లైబ్రేరియన్ లేకపోవడంతో పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యేందుకు ఇబ్బందులు పడుతున్నారు. లైబ్రేరిలో ఉన్న పుస్తకాలు కూడా మూలన మూలుగుతున్నాయి. -
కలుషిత ఆహారం తిన్నందుకు....
గచ్చిబౌలి:శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..గత శనివారం శ్రీచైతన్య జూనియర్ కళాశాలలకు చెందిన మాదాపూర్, కొండాపూర్ బ్రాంచ్‌లలో పులిహోర, కొబ్బరి రైస్ తిని దాదాపు 70 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. దీంతో విద్యార్థులను కిమ్స్, తదితర ఆస్పత్రులకు తరలించిన యాజమాన్యం వారికి వైద్య చికిత్సలు అందించినట్లు తెలిసింది. ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కొందరిని ఇళ్లకు పంపించారు. మరికొందరు నీరసంగా ఉండటంతో మంగళవారం కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు సమాచారం. ఈ విషయం మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడినప్పటికీ కొందరు నిలదీయగా విద్యార్థులు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు చెప్పడం గమనార్హం. దీనిపై సమాచారం అందడంతో శేరిలింగంపల్లి హెల్త్ అసిస్టెంట్ పాండు కొండాపూర్‌లోని శ్రీచైతన్య కాలేజీని సందర్శించగా విద్యార్థులకు వైరల్ ఫీవర్ వచ్చిందని ప్రిన్సిపాల్ శ్రీదేవి చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. -
నేటి నుంచి ‘మోడల్ కాలేజీ’ల్లో ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్‌లోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్లైన్లోనూ ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరంలో మోడల్ జూనియర్ కాలేజీల్లో సీట్లను రెట్టింపు చేసిన (ఒక్కో కాలేజీలో 160 నుంచి 320కి పెంచింది) నేపథ్యంలో ప్రవేశాల కోసం ప్రిన్సిపాళ్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. మే 1 నుంచి ప్రవేశాలను చేపట్టాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో జూనియర్ కాలేజీ తరగతులు కొనసాగుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో సీట్ల సంఖ్యను ఈసారి రెట్టింపు చేసింది. ఒక్కో గ్రూపులో 40 సీట్లు పెంపు ఇంటర్మీడియెట్‌లోని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ఇప్పటివరకు ఒక్కో గ్రూపులో 20 సీట్లు మాత్రమే ఉన్నాయి. వాటిని 2019–20 విద్యా సంవత్సరం నుంచి 40 సీట్లకు పెంచింది. దీంతో ఒక్కో కాలేజీలో సీట్ల సంఖ్య భారీగా పెరగనుంది. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో నాలుగు గ్రూపుల్లో 80 సీట్లు ఉండగా వాటిని 160కి, అలాగే ద్వితీయ ఏడాదిలో ఉన్న 80 సీట్లను 160కి పెంచేలా ఏర్పాట్లు చేసింది. దీంతో ఒక్కో జూనియర్ కాలేజీలో మొత్తం సీట్లు 160 నుంచి 320 కానున్నాయి. ఇప్పటివరకు మోడల్ జూనియర్ కాలేజీల్లో ఉన్న 31,040 సీట్లు 62,080కి పెరుగనున్నాయి. మే రెండో వారంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఆ ఫలితాలు వచ్చిన వెంటనే ప్రిన్సిపాళ్లు ఆయా పిల్లలను మోడల్ జూనియర్ కాలేజీల్లో చేరేలా ప్రోత్సహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మోడల్ స్కూళ్లు/జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు చేరేలా, మోడల్ స్కూళ్ల ప్రాధాన్యాన్ని తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొంది. అలాగే ప్రిన్సిపాళ్లు తమ సిబ్బంది, సంబంధిత ఎంఈవో, పరిసరాల్లోని పాఠశాలల హెడ్మాస్టర్లతో సమన్వయం చేసుకుని ఆయా స్కూళ్లకు వెళ్లి మోడల్ కాలేజీల్లో చేరేలా సూచించాలని పేర్కొంది. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని పేర్కొంది. కాలేజీల్లో చేరతామని ముందుకు వచ్చే విద్యార్థులను ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు ఆన్లైన్ ప్రవేశాలు కూడా చేపట్టనుంది. అనంతరం విద్యార్థులకు సీట్లను కేటాయించనున్నట్లు విద్యాశాఖ వివరించింది. -
ఇట్లయితే ఎట్ల..?
ఖమ్మం సహకారనగర్: నిధులు విడుదలైనా నత్తనడకన నిర్మాణాలు. అనుకున్న సమయానికి పూర్తికాని భవనాల పనులు. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పనులు జరగని పరిస్థితి. జూనియర్ కళాశాలల భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తున్నా.. కొత్త భవనాలు అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని శాంతినగర్, చింతకాని మండలం నాగులవంచ, నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో కొత్త భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒక్కో భవన నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేశారు. ఇందులో ప్రధానంగా శాంతినగర్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరడంతో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక చొరవతో అదనంగా సుమారు రూ.కోటిన్నర నిధులు కేటాయించి.. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. తొలి రోజుల్లో పనులు వేగవంతం చేసి నిర్మాణాలు సగానికి పైగా పూర్తి చేశారు. ఆ తర్వాత అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడలేదనే విమర్శలున్నాయి. సుమారు రెండేళ్లు.. రెండేళ్లుగా కళాశాల భవనం నిర్మాణంలో ఉండగా.. ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సుమారు 600 మంది ఇబ్బంది పడుతున్నారు. భవన నిర్మాణం తొలి రోజుల్లో శాంతినగర్ పాఠశాలలో షిఫ్టులవారీగా తరగతులు నిర్వహించి.. ఆరు నెలలపాటు అవస్థలు పడ్డారు. తర్వాత పాఠశాల భవనం అరకొర పనుల్లో ఉండగానే విద్యార్థులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో నిర్మాణ సమయంలో పలు గ్రూపుల విద్యార్థులకు నిర్మాణ గదుల్లోనే తరగతులు బోధించిన సంఘటనలున్నాయి. అలాగే నేలకొండపల్లి, నాగులవంచ జూనియర్ కళాశాల విద్యార్థులు సైతం భవన నిర్మాణ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లో భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసినట్లయితే విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే ఆవకాశం ఉంది. శాంతినగర్ కళాశాల భవన నిర్మాణానికి యథావిధిగా రూ.కోటి కేటాయిస్తే.. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ తాను చదువుకున్న కళాశాల కావడంతో ప్రత్యేక సౌకర్యాలు ఉండేలా చూడాలని, తన మార్క్‌ను చూపించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అదనంగా సుమారు రూ.1.50కోట్లు తీసుకొచ్చారు. ఆ వెంటనే పనులు ముమ్మరం చేయగా.. తర్వాత మధ్యలోనే పనులు మందగించాయి. నత్తనడకన నిర్మాణాలు.. మూడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించిన భవన నిర్మాణాలన్నీ నత్తనడకన సాగు తుండడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడా ల్సి వస్తోంది. అరకొర వసతులతోనే విద్యాబోధన సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార యంత్రాంగం వీటి నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. కొన్ని పెండింగ్‌లోనే.. కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి. భవన నిర్మాణం ప్రారంభానికి ముందు జీఎస్టీ లేకపోవడం, తర్వాత జీఎస్టీ అమలు తదితర సమస్యలతో నిర్మాణాల్లో జాప్యం జరుగుతోంది. భవనం పూర్తయితే విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకునే అవకాశం ఉంది. – విజయ, శాంతినగర్ కళాశాల ప్రిన్సిపాల్, ఖమ్మం పురోగతిలో పనులు.. మూడు కళాశాలలకు సంబంధించిన భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 70 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరానికి కొత్త భవనాల్లో తరగతులు ప్రారంభమయ్యే ఆవకాశం ఉందని భావిస్తున్నాం. – రవిబాబు, డీఐఈఓ, ఖమ్మం బ్లాక్ లిస్టులో పెట్టాలి.. కళాశాలల భవన నిర్మాణాల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లను తక్షణమే బ్లాక్ లిస్టులో పెట్టాలి. నిర్మాణాలు పూర్తికాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పరీక్షలు సమీపిస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన పనులు పూర్తి చేయాలి. – తాళ్ల నాగరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి -
జూనియర్ కాలేజీల్లో ‘పొగ తాగరాదు’ బోర్డులు
సాక్షి, హైదరాబాద్: పొగాకు ఉత్పత్తుల బారి నుంచి యువతను కాపాడుకోవడమే లక్ష్యంగా, రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్ని పొగాకు రహితంగా మార్చేయాలని అన్ని జిల్లాల ఇంటర్ విద్యాధికారులు, నోడల్ అధికారులు, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రధానోపాధ్యాయుల్ని ప్రభుత్వం ఆదేశించినట్లు వాలంటరీ హెల్త్ అసో సియేషన్ ఆఫ్ ఇండియా (వీహెచ్ఏఐ) ప్రతినిధి శిరీష శనివారం తెలిపారు. తమ విన్నపం మేరకు ఈ ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. ఇంటర్ విద్యా కమిషనర్ ఆదేశాల ప్రకారం అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాల (జనరల్ అండ్ వొకేషనల్)ల్లో ‘పొగ తాగరాదు’సూచిక బోర్డుల్ని ఏర్పాటు చేయాలి. పొగాకు రహిత కళాశాలగా స్వీయ హామీ పత్రాన్ని ఇంటర్మీడియట్ విద్యాధికారికి ప్రధానోపాధ్యాయులు సమర్పించాలి. పొగాకు రహిత కళాశాలల జిల్లాగా స్వీయ హామీ పత్రాన్ని డిసెంబర్ 28 లోగా సంబంధిత జిల్లా ఇంటర్ అధికారి, ఇంటర్ విద్యా కమిషనర్ కార్యాలయంలో సమర్పిం చాలి. దీనిని వీహెచ్ఏఐకు పంపిస్తారు. రాష్ట్రంలోని జిల్లాల ఇంటర్ విద్యాధికారులు ప్రతి 3 నెలలకోసారి త్రైమాసిక నివేదికల్ని సమర్పించాలి. పొగాకు ఉత్ప త్తులు (ప్రొహిబిషన్ ఆఫ్ అడ్వర్టయిజ్మెంట్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్, ప్రొడక్షన్, సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్) 2003 చట్టం (కోప్టా) సెక్షన్ 6 ప్రకారం మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం నిషేధం. విద్యాసంస్థలకు 100 గజాలకంటే తక్కువ దూరంలో పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. కోప్టా చట్టం సెక్షన్ 6 (బి) ప్రకారం విద్యా సంస్థలకు 100 గజాల లోపు పొగాకు ఉత్పత్తులు అమ్మడం నేరమంటూ బోర్డుల్ని ఏర్పాటు చేయాలి. -
జూనియర్ కాలేజీల సెలవులు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు ఇచ్చిన దసరా సెలవులను మరో 3 రోజులు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెల 18వ తేదీ వరకే సెలవులు ఇచ్చినప్పటికీ, తాజాగా ఈ నెల 19, 20 తేదీలు కూడా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు 21వ తేదీ ఆదివారం కావడంతో మొత్తంగా మరో మూడు రోజులు సెలవులుగా వెల్లడించింది. ఈ నెల 22వ తేదీన కాలేజీలు తిరిగి ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డు పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఈ సెలవు దినాలను పాటించాలని స్పష్టం చేసింది. -
నేటి నుంచి జూనియర్ కాలేజీలకు సెలవులు
సాక్షి, హైదరాబాద్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 9 నుంచి 18 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. తిరిగి కాలేజీలు ఈనెల 19న ప్రారంభం అవుతాయని పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని మేనేజ్మెంట్లు ఈ సెలవులను పాటించాలని, సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే సంబంధిత మేనేజ్మెంట్లు, ప్రిన్సిపాళ్లపై కఠిన చర్యలు చేపడతామని తెలిపింది. -
విద్యార్థులున్నా.. కాలేజీలు సున్నా
సాక్షి, హైదరాబాద్ : ♦ పాత మహబూబ్‌నగర్ జిల్లా దౌలతాబాద్ మండలంలో 6 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఓ ఎయిడెడ్ పాఠశాల, మరో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ఉన్నాయి. వాటిల్లో 533 మంది పదో తరగతి చదువుతున్నారు. కానీ అక్కడ ఒక్క జూనియర్ కాలేజీ లేదు. దీంతో ఇంటర్ చదివేందుకు విద్యార్థులకు తంటాలు తప్పడం లేదు. ♦ వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట్ మండలంలో 4 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఓ కేజీబీవీ, ఓ గిరిజన ఆశ్రమ పాఠశాల ఉన్నాయి. వాటిల్లో 441 మంది పదో తరగతి చదువుతున్నారు. అక్కడా ఒక్క జూనియర్ కాలేజీ లేదు. దీంతో ఇంటర్ కోసం ఇతర మండలాల్లోని ప్రైవేటు కాలేజీలకు వెళ్లాల్సి వస్తోంది. ఆర్థిక స్తోమత లేని కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలను దూర ప్రాంతాల్లోని ప్రభుత్వ కాలేజీలకు పంపిస్తుండగా మరికొంత మంది పదో తరగతి తరువాత చదువు ఆపేస్తున్నారు. ఇక్కడే కాదు.. రాష్ట్రంలోని 106 మండలాల్లో జూనియర్ కాలేజీలు లేక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ కాలేజీల ఏర్పాటుపై ఇప్పటివరకు ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారులు దృష్టి సారించకపోగా, ప్రైవేటు కాలేజీల ఏర్పాటుకు యాజమాన్యాలు ముందుకు రాలేదు. దీంతో ఆయా మండలాల్లోని విద్యార్థులు నిత్యం ఇతర ప్రాంతాల్లోనే కాలేజీలకు వెళ్లేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత 125 మండలాలు పెరిగాయి. దీంతో మండలాల సంఖ్య 584కి చేరింది. కానీ 106 మండలాల్లో ఒక్క కాలేజీ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. కొత్తగా ఏర్పడిన మండలాలే కాదు.. పాత మండలాల్లోనూ కాలేజీలు లేక పిల్లల్ని ఇతర మండలాలకు పంపాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రజా ప్రతినిధులు, స్థానికుల ఒత్తిడి రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటైన నేపథ్యంలో జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. గతంలో 10 జిల్లాలుండగా వాటిని 31 జిల్లాలు చేయడం.. పాత మండలాలు 459 ఉండగా 584కు పెంచడంతో జూనియర్ కాలేజీల ఏర్పాటుకు స్థానికులు డిమాండ్ చేస్తు న్నారు. ఐదారు ఉన్నత పాఠశాలలున్న గ్రామాల స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఒక్క జూనియర్ కాలేజీ లేని మండలాల్లో ఏర్పాటుకు ఒత్తిడి తెస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రతిపాదనలూ సిద్ధం చేయించి ఇంటర్ విద్యా శాఖకు పంపుతున్నారు. దీంతో ఏయే మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు లేవు.. ఏయే మండలాల్లో ప్రైవేటు కాలేజీలున్నాయి.. అసలు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీ లు లేని మండలాలు ఏవో లెక్కలు తేల్చారు. మొత్తం గా 106 మండలాల్లో అటు ప్రభుత్వ జూనియర్ కాలే జీ గాని, ఇటు ప్రైవేటు కాలేజీ కానీ లేదని తేల్చారు. వాటి విషయంలో ఏం చేయాలని యోచిస్తున్నారు. కాలేజీలు లేని మండలాలు మరిన్ని.. వికారాబాద్ జిల్లా ధరూర్ మండంలో 8 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఓ కేజీబీవీ ఉంది. వాటిల్లో 459 మంది పదో తరగతి చదువుతున్నారు. అక్కడ ప్రభుత్వ లేదా ప్రైవేటు జూనియర్ కాలేజీ ఒక్కటీ లేదు. అదే జిల్లాలోని కోటపల్లిలో 5 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా పదో తరగతి విద్యార్థులు 203 మంది ఉన్నారు. అక్కడా ఒక్క కాలేజీ లేదు. జనగా మ జిల్లాలో తరిగొప్పుల, వరంగల్ రూరల్ జిల్లా లోని దుగ్గొండి, నల్లబెల్లి, యాదాద్రి జిల్లాలోని ఆత్మకూరు, రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు, నిర్మల్ జిల్లా లోని బాసర, నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో జూనియర్ కాలేజీలు లేవు. డిమాండ్ ఉన్న చోట ఏర్పాటు చేయాలి ఉన్నత పాఠశాలలు, విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న మండలాల్లో డిమాండ్ మేరకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. కాలేజీలు లేని కొత్త మండలాలతో పాటు పాత మండలాల్లోనూ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వానికి ఇంటర్మీడియట్ విద్యా శాఖ ప్రతిపాదనలు పంపాలి. – పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు -
అడ్డగోలు ప్రవేశాలకు అంతేలేదు!
సాక్షి, అమరావతి: ఇంటర్ విద్యను కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఆదాయ మార్గంగా మార్చేశాయి. నిబంధనలకు విరుద్ధంగా కుప్పలు తెప్పలుగా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. వాస్తవ సంఖ్యకు, రికార్డుల్లో చూపించే లెక్కకు ఎక్కడా పొంతన ఉండదు. నిర్ణీత ఫీజు కంటే పది రెట్లు ఎక్కువగా పిండుకుంటున్నా ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోంది. అనుమతులు లేకుండా హాస్టళ్లను తెరుస్తున్నా అధికారులు ఆవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. మూడొంతుల మంది ప్రైవేట్ కాలేజీల్లోనే.. రాష్ట్రంలో 3,361 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 1,143 మాత్రమే ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలు కాగా తక్కిన 2,218 కాలేజీలు కార్పొరేట్ సంస్థలవే. గతంలో ప్రభుత్వం రూపొందించిన గణాంకాల ప్రకారం శ్రీచైతన్య పరిధిలో 186 కాలేజీలుండగా అందులో 1.52 లక్షల మంది చదువుతున్నట్లు పేర్కొంది. నారాయణ పరిధిలోని 152 కాలేజీల్లో 85 వేల మంది, ఎన్ఆర్ఐ యాజమాన్యం పరిధిలోని 38 కాలేజీల్లో 14 వేల మంది, శ్రీగాయత్రి పరిధిలోని 27 కాలేజీల్లో 12 వేల మంది, ఇతర ప్రైవేట్ కాలేజీల్లో మిగతా విద్యార్థులు చదువుతున్నట్లు తేల్చారు. అప్పట్లో విద్యార్థుల సంఖ్య 7 లక్షలు మాత్రమే కాగా ఇప్పుడు ఇంటర్లో చేరే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల సంఖ్య గత ఏడాది 10.26 లక్షల వరకు ఉంది. వీరిలో 3 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ కాలేజీల్లో చదువుతుండగా మిగతా వారంతా ప్రైవేట్ కళాశాలల్లోనే చేరుతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు కొన్ని కాలేజీలకే ఇంటర్ గుర్తింపు తీసుకుని పలు బ్రాంచీలు నిర్వహిస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి తదితర పట్టణాల్లో ఇలా జోరుగా విద్యా వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. ఎండాకాలంలోనే ప్రవేశాలు పూర్తి ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి బోర్డు పలు నిబంధనలు విధిస్తూ సరŠుయ్యలర్లు జారీ చేసింది. నిర్ణీత షెడ్యూల్ విధించినా కార్పొరేట్ విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు వార్షిక పరీక్షల అనంతరం మార్చి 29 నుంచి మే 31 వరకు సెలవులు ఇచ్చి జూన్ 1న కాలేజీలను పునః ప్రారంభించాలి. మొదటి విడత ప్రవేశాలను అప్పుడే నిర్వహించాల్సి ఉండగా ప్రైవేట్ కాలేజీలు అంతకు ముందే వేసవి సెలవుల్లోనే చేపడుతున్నాయి. ఒక్కో సెక్షన్‌కు గరిష్టంగా 88 మంది చొప్పున ఎన్ని సెక్షన్లకు అనుమతి ఉంటే అంత మందిని మాత్రమే చేర్చుకోవాల్సి ఉన్నా పరిమితికి మించి ప్రవేశాలను కల్పిస్తున్నాయి. రిజర్వేషన్లకు చెల్లుచీటీ నిబంధనల ప్రకారం ఆయా కాలేజీల్లోని మొత్తం సీట్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం సీట్లు కేటాయించాలి. వెనుకబడిన తరగతులకు 29% సీట్లు ఇవ్వాలి. అందులో బీసీ(ఏ) 7%, బీసీ(బీ) 10 శాతం, బీసీ(సీ) 1%, బీసీ(డీ) 7 శాతం, బీసీ(ఈ)కి 4% చొప్పున సీట్లు ఇవ్వాలి. దివ్యాంగులకు 3 శాతం, ఎన్సీసీ, క్రీడల కోటా కింద 5 శాతం, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3 శాతం సీట్లు కేటాయించాలి. అంతేకాకుండా ఆయా కేటగిరీల్లోని సీట్లలో 33.33% సీట్లు బాలికలకు కేటాయించాలి. ఈ నిబంధనలను కార్పొరేట్ కాలేజీలు ఎక్కడా పట్టించుకోవడం లేదు. ఆన్లైన్లో ప్రవేశాలతో ఫీజుల దందాకు తెర ఇంజనీరింగ్ మాదిరిగానే ఆన్లైన్లో ప్రవేశాల విధానాన్ని తెస్తే ప్రైవేట్ కాలేజీల అరాచకాలకు కొంతైనా అడ్డుకట్ట పడుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఫీజులను కూడా ప్రభుత్వమే ఆన్లైన్ ద్వారా సంబంధిత కాలేజీలకు చెల్లించేలా ఏర్పాటు చేస్తే అడ్డగోలు వసూళ్లకు తెర పడుతుందని, ప్రవేశాల్లో పారదర్శకత వస్తుందని సూచిస్తున్నారు. అయితే ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల విద్యా వ్యాపారానికి కొమ్ము కాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ముందుకు రావడం లేదు. చీమల పుట్టల్లా హాస్టళ్లు... ఒకవైపు లెక్కకు మించి ప్రవేశాలను కల్పిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు అనుమతులు లేకుండానే కాలేజీలకు అనుబంధంగా ఇరుకు గదుల్లో హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. కాలేజీల్లో ప్రవేశానికి నిబంధనల ప్రకారం డేస్కాలర్లకు రూ.12,500 చొప్పున మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా రూ.60 వేల నుంచి రూ.లక్షకు పైనే గుంజుతున్నాయి. ఇక హాస్టళ్లలో చేరేవారి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల దాకా పిండుకుంటున్నాయి. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. -
విద్యార్థుల సౌకర్యాలపై ధ్యాసేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కాలేజీ హాస్టళ్లలోని దాదాపు 3 లక్షల మంది విద్యార్థుల సౌకర్యాలపై ఎవరికీ ధ్యాస లేకుండా పోయింది. ఇటు ఇంటర్మీడియెట్ బోర్డు, అటు యాజమాన్యాలు విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరో ఒక విద్యార్థి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినపుడు బోర్డు అధికారులు మేమున్నామంటూ యాజమాన్యాల వద్దకు వెళ్లడం, వారిచ్చే మామూళ్లతో సరిపుచ్చుకోవడం, ఆ తరువాత మిన్నకుండిపోవడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. చివరకు హాస్టళ్లకు గుర్తింపు ఇస్తామంటూ చెప్పిన ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులే అడ్డగోలు ఫీజులను నిర్ణయించి, యాజమాన్యాలు కోర్టుకు వెళ్లేలా చేశారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హాస్టళ్లలో సదుపాయాల కల్పనకు, విద్యార్థులకు మేలు చేసేందుకు చర్యలు చేపట్టకుండా, గుర్తింపు ఫీజు వ్యవహారాన్ని వివాదంగా మార్చేసి, విద్యార్థులకు సంబంధించిన సమస్యలను పక్కదోవ పట్టించినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వివాదాస్పదంగా ఇంటర్ బోర్డు వైఖరి రాష్ట్రంలో ఇంటర్ బోర్డు వైఖరి ప్రతి విషయంలో వివాదాస్పదంగానే ఉంటోంది. అనుబంధ గుర్తింపు, కంప్యూటర్ ప్రాసెసింగ్ ఏజెన్సీ ఖరారు.. ఇపుడు కాలేజీ హాస్టళ్ల గుర్తింపు.. ఇలా ప్రతి విషయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మామూళ్ల కోసం తాము అనుకున్నదే నిర్ణయంగా అమలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాలేజీ హాస్టళ్ల గుర్తింపునకు ఖరారు చేసిన ఫీజు అసంబద్ధంగా ఉందని యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. అంతమొత్తాన్ని చెల్లించలేమని, పైగా హాస్టళ్లను నియంత్రించే అధికారమే బోర్డుకు లేదని కోర్టులో సవాలు చేశాయి. దీంతో బోర్డు అధికారులు ముందుగా నిర్ణయించిన ఫీజుల ను సగానికి తగ్గించారు. అయినా యాజమాన్యాలు వినడం లేదు. ఇంకా తగ్గిస్తేనే కోర్టులో వేసిన కేసును విత్‌డ్రా చేసుకుంటామంటున్నాయి. ఆ ఫీజలను తగ్గించేందుకు బోర్డు సిద్ధమైంది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసింది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. అయితే ఫీజులే కాదు విద్యార్థుల సమస్యల పరిష్కారం, సదుపాయాల కల్పన విషయంలోనూ రాజీ పడేందుకు సిద్ధమైనట్లు తల్లిదండ్రుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఏటా ఇన్స్పెక్షన్, అనుమతి ఫీజులు.. మొదట నిర్ణయించినవి.. - కార్పొరేషన్ పరిధిలో ఇన్స్పెక్షన్కు ఏటా రూ. 80 వేలు. అనుమతికి రూ. లక్ష. - మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఇన్స్పెక్షన్కు రూ. 60 వేలు, అనుమతికి రూ. 80 వేలు. - గ్రామ పంచాయతీల్లో ఇన్స్పెక్షన్కు రూ. 50 వేలు, అనుమతికి రూ. 60 వేలు. తరువాత తగ్గించినవి.. - కార్పొరేషన్లలో ఇన్స్పెక్షన్కు రూ. 55 వేలు. అనుమతికి రూ. 65 వేలు. - మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో.. ఇన్స్పెక్షన్కు రూ. 40 వేలు, అనుమతికి రూ. 50 వేలు. - గ్రామ పంచాయతీల్లో ఇన్స్పెక్షన్కు రూ. 30 వేలు, అనుమతికి రూ. 40 వేలు. యాజమాన్యాల తాజా డిమాండ్.. - కార్పొరేషన్ పరిధిలో ఇన్స్పెక్షన్కు రూ. 25 వేలు, అనుమతికి రూ. 30 వేలు. - మున్సిపాలిటీ , నగర పంచాయతీల్లో ఇన్స్పెక్షన్కు రూ. 20 వేలు. అనుమతికి రూ. 25 వేలు. - గ్రామ పంచాయతీ పరిధిలో ఇన్స్పెక్షన్కు రూ. 10 వేలు, అనుమతికి రూ. 15 వేలు. - ఇవే కాకుండా హాస్టళ్లలో ప్రతి విద్యార్థికి 50 ఎస్ఎఫ్టీ స్థలం ఉండాలన్న నిబంధనను 30 ఎస్ఎఫ్టీకి పరిమితం చేయాలని, వార్డెన్లకు పోలీసు క్లియరెన్స్, ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్లను మినహాయించాలని డిమాండ్ చేస్తున్నాయి. హాస్టల్ ఫీజుల నిర్ణయంలో బోర్డు జోక్యం చేసుకోవద్దని పేర్కొంటున్నాయి. ఇదీ ఫీజుల పరిస్థితి.. మొదట నిర్ణయించిన ఫిక్స్డ్ డిపాజిట్లు.. - 50 మంది వరకు.. రూ. 4 లక్షలు. - 51 నుంచి 200 మంది విద్యార్థులుంటే.. రూ. 8 లక్షలు. - 201 నుంచి 500 విద్యార్థులుంటే రూ. 12 లక్షలు. - 500 కంటే ఎక్కువ ఉంటే రూ. 16 లక్షలు. తగ్గించిన ఫీజులు.. - 50 మంది విద్యార్థుల వరకు.. 2 లక్షలు. - 51 – 100 మందికి.. రూ. 3 లక్షలు. - 101 – 200 మందికి రూ. 4 లక్షలు. - 201 – 300 మందికి రూ. 5 లక్షలు. - 301 – 400 మందికి రూ. 6 లక్షలు. - 401 – 500 వరకు రూ. 7 లక్షలు. - 501 కంటే ఎక్కువుంటే రూ. 8 లక్షలు. యాజమాన్యాల తాజా డిమాండ్.. - 200 మంది వరకు రూ. లక్ష. - 201 – 500 వరకు రూ. 2 లక్షలు - 501 కంటే ఎక్కువుంటే రూ. 3 లక్షలు. -
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
బద్వేలు : ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం పథకాన్ని పాఠశాలల్లో మాత్రమే అమలు చేసేవారు. కానీ త్వరలో జూనియర్ కళాశాలల్లో కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జిల్లాలోని జూనియర్ కళాశాలల అమలుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆర్జేడీకి నివేదికలు అందజేస్తున్నారు. అయితే జూలై ఒకటి నుంచి అమలు చేస్తామంటున్నా ప్రస్తుతం కసరత్తు దశలోనే ఉండడంతో కొంతమేర ఆలస్యమయ్యే అవకాశముంది. ప్రభుత్వ పాఠశాలల తరహాలో ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మధ్యాహ్న భోజనంతో విద్యార్థుల గైర్హాజరు నివారించడంతో పేదలకు విద్యను అందించేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. ఆ దిశలోనే జూనియర్ కళాశాలలకు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు కొంతమేర బడ్జెట్ కూడా కేటాయించారు. కళాశాలల్లో వసతులు, ఇతర విషయాలను పరిశీలించి సాధ్యాసాధ్యాలపై నివేదికలు పంపాలని ఇంటర్ బోర్డు కమిషనర్ విజయలక్ష్మి ఆర్జేడీలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్జేడీలు ఆ పనిలో తలమునకలయ్యారు. 16 వేల మందికి లబ్ధి జిల్లాలో మొత్తం 46 ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో రెండో ఏడాదికి 7,582 మంది చదువుతున్నారు. మొదటి ఏడాది ఇప్పటికే 7 వేల అడ్మిషన్లు జరిగాయని అంచనా. మరో 1,500 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరే అవకాశముంది. గతేడాది కంటే మెరుగైన ఫలితాలను ప్రభుత్వ కళాశాలలు సాధించడంతో ఈ ఏడాది గతేడాది కంటే మరో వెయ్యి అధికంగా అడ్మిషన్లు రావచ్చని అధికారులు చెబుతున్నారు. పరిశీలనకు కమిటీ ఏర్పాటు కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలన జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో డీఈఓతో పాటు కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ఉన్నారు. వీరు మధ్యాహ్న భోజనం అమలవుతున్న తీరును పరి శీలించారు. ఎంత ఖర్చు, వంట తదితర వివరాలను తెలుసుకున్నారు. ప్రతి కళాశాలలో వసతి, వంటగదులు, విద్యార్థుల సంఖ్య, బియ్యం అవసరం, అందుబాటులో ఉన్న ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలలు, సరుకులు, కూరగాయలు, పండ్లు, గుడ్లు తదితర వివరాల సమాచారాన్ని పరిశీలించి సేకరించారు. ఒకటో తేదీ నుంచి అమలు కష్టమే.. ఉన్నత పాఠశాలల విద్యార్థుల కంటే ఇంటర్ పిల్లల కు అధిక క్యాలరీల భోజనం అవసరం. ఉన్నత పాఠశాలలో ఒక్కో విద్యార్థికి 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పులు, 75 గ్రాముల కూరగాయలు, 7.5 గ్రాముల నూనె ఇస్తారు. అయితే ఇంటర్ విద్యార్థులు శారీరకంగా, వయస్సురీత్యా పెద్దగా ఉంటారు. వీరికి ఈ స్థాయి భోజనం సరిపోదు. ఈ విషయమై వారికి ఎంత స్థాయి భోజనం అవసరమనే విషయాన్ని నిర్ధారించలేదు. కొన్ని చోట్ల పాఠశాలలుంటే వాటిలో చేయించాలనే ఆలోచన చేస్తున్నారు. అందుబాటులో లేని చోట ఇతర సౌకర్యాలు సమకూర్చుకోవాలి. వంట ఏజెన్సీలను ఎంపిక చేయాలి. వీటన్నింటిపై అంచనా వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో అమలుకు మరికొంత సమయం పట్టవచ్చని ఉపాధ్యాయులు అంచనా వేస్తున్నారు. వివరాలు సేకరిస్తున్నాం.. జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. అనంతరం వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – చంద్రమౌలి, జిల్లా వృత్తివిద్యాధికారి, కడప -
109 కాలేజీలకు అనుమతులివ్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 109 జూనియర్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం లేదని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో బుధ వారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కాలేజీల్లో విద్యార్థులను చేర్చుకుంటే సమీపంలో గుర్తింపు ఉన్న కాలేజీల్లో చేర్పించే బాధ్యత సదరు యాజమాన్యానిదేనని ఆయన స్పష్టం చేశారు. 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్ కాలేజీ అనుమతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,698 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిల్లో ఇప్పటివరకు 1,313 కాలేజీలకు మాత్రమే గుర్తింపు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మిగతా 385 కాలేజీలకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క ఇంటర్ కాలేజీకీ హాస్టల్ నిర్వహించే అనుమతి లేదని స్పష్టం చేశారు. జూనియర్ కాలేజీల అనుమతులపై మంగళవారం సాక్షిలో ‘ఇంటర్ బోర్డు అధికారుల గుర్తింపు దందా’శీర్షికతో వచ్చిన వార్తపై బోర్డు కార్యదర్శి స్పందించారు. కాలేజీల గుర్తింపు కోసం దరఖాస్తు గడువును పలుమార్లు పెంచడంపై ఆయన స్పందిస్తూ ప్రభుత్వ సూచనతోనే గడువును జూన్ 20 వరకు పెంచినట్లు చెప్పారు. వెబ్సైట్లో కాలేజీల వివరాలు.. గుర్తింపునకు అర్హతలేని కాలేజీల వివరాలను బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. ఈ నెల 20 వరకు గుర్తింపు గడువు ఉన్నందున జూన్ 21 నాటికి వెబ్సైట్లో అర్హత పొందిన, అర్హత పొందని కాలేజీల వివరాలు అందుబాటులో ఉంచుతామన్నారు. -
ఇంటర్ బోర్డు అధికారుల ‘గుర్తింపు’ దందా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) వ్యవహారంలో మరో అక్రమానికి తెరలేచింది. అనేక లోపాల కారణంగా ‘గుర్తింపు’పొందని కాలేజీల్లో భారీగా విద్యార్థుల అడ్మిషన్లు జరిగిపోతున్నాయి. ఇలా చేరిపోయిన ‘విద్యార్థుల భవిష్యత్తు’దెబ్బతింటుందనే సాకుతో ఆయా కాలేజీలకు ‘గుర్తింపు’ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆయా కాలేజీల యాజమాన్యాలతో ఇంటర్మీడియట్ బోర్డులోని కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని... ఈ వ్యవహారంలో భారీగా సొమ్ము చేతులు మారిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అనుబంధ గుర్తింపు ఇచ్చిన కాలేజీల్లోనూ కొన్నింటిలో లోపాలున్నా.. ముడుపులు పుచ్చుకుని అఫిలియేషన్ ఇచ్చినట్టుగా విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు బోర్డు కార్యదర్శికి ఉండాల్సిన అఫిలియేషన్ జారీ అధికారాన్ని ఇతర అధికారులకు కట్టబెట్టి మరీ అక్రమాలకు తెరతీసినట్టు బోర్డు వర్గాలే పేర్కొంటున్నాయి. అఫిలియేషన్ అధికారాలను పొందిన సదరు అధికారిని కలసి ముడుపులు ముట్టజెప్పితేనే ‘పని’జరుగుతోందని.. లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తోందని కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు పేర్కొంటుండటం గమనార్హం. గడువు ముగిసిపోయినా.. రాష్ట్రంలో మొత్తం 1,640 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా.. ఇంటర్ బోర్డు ఈసారి పలు సడలింపులతో 1,303 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. వాటికి ఫిబ్రవరి 21వ తేదీ నాటికే అఫిలియేషన్లను పూర్తి చేయాల్సి ఉన్నా.. కాలేజీల విజ్ఞప్తి మేరకు అంటూ మార్చి 31 వరకు గడువు పొడిగించింది. అయినా అనేక లోపాల కారణంగా 337 కాలేజీలకు గుర్తింపు లభించలేదు. గత నెల 21న ఇంటర్ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు నాటికి కూడా ఆయా కాలేజీలు సరైన డాక్యుమెంట్లు సమర్పించకపోవడంతో ‘గుర్తింపు’అవకాశం కోల్పోయాయి. కానీ తాజాగా ‘విద్యార్థుల భవిష్యత్తు’దెబ్బతింటుందనే పేరుతో ఆయా కాలేజీలకు గుర్తింపు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరో రెండు మూడు నెలల్లో లోపాలన్నీ సవరించుకుంటామంటూ కాలేజీలు అఫిడవిట్ ఇస్తే.. వాటికి ‘గుర్తింపు’ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో సొమ్ము చేతులు మారుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అటు ఆయా కాలేజీలు కూడా ‘బోర్డు ఇచ్చిన సమయంలోగా లోపాలను సవరించుకోకున్నా పోయేదేమీ లేదని.. విద్యా సంవత్సరం మధ్యలో కాలేజీలను మూసివేసే అవకాశం ఉండదని.. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకున్నా విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తారా? అన్న సాకుతో యాజమాన్యాలు ఆందోళన చేయవచ్చని..’కొందరు అధికారులే కాలేజీల యాజమాన్యాలకు సూచిస్తూ అక్రమాలకు తెరతీసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సగం వరకు కార్పొరేట్ కాలేజీలే.. అనుబంధ గుర్తింపు లభించని 337 కాలేజీల్లో సగం వరకు కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందిన కాలేజీలే ఉన్నట్టు తెలిసింది. దీంతో భారీగా సొమ్ము దండుకోవచ్చన్న ఆశతోనే అధికారులు కుమ్మక్కైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు ఈ కాలేజీలన్నీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఉన్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో ఇంటర్ బోర్డుకు చెందిన క్షేత్ర స్థాయి అధికారుల నుంచి పైస్థాయి అధికారుల దాకా భాగస్వామ్యం ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి. అందువల్లే పలు కాలేజీలు తమకు అనుబంధ గుర్తింపు లేకపోయినా అడ్మిషన్లు చేసుకోవడం మొదలుపెట్టాయని.. ఇది తెలిసినా అధికారులెవరూ పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. ముందుగా ప్రారంభించినా.. అంతే! ప్రైవేటు కాలేజీలు ఏటా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు పొందాలి. ఇందుకోసం తొలుత ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ ఇస్తే.. యాజమాన్యాలు దరఖాస్తు చేసుకుంటాయి. సాధారణంగా జూన్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందన్నది తెలిసిందే. అయినా నాలుగైదేళ్లుగా అధికారులు ముందుగానే అనుబంధ గుర్తింపు ప్రక్రియ చేపట్టకుండా జాప్యం చేశారు. కానీ ఈసారి మాత్రం మార్చి 31 నాటికే ‘గుర్తింపు’ప్రక్రియ పూర్తిచేసి.. గుర్తింపు పొందిన, గుర్తింపు రాని కాలేజీల జాబితాలను వెబ్సైట్లో పెడతామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గతేడాది ప్రకటించారు. ఈ మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరం కోసం గతేడాది డిసెంబర్లోనే అఫిలియేషన్ల దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన ఇంటర్ బోర్డు.. ఫిబ్రవరి నాటికే ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించింది. కానీ జాప్యం చేసింది. ‘గుర్తింపు’లేని జాబితా ఏదీ? ఇంటర్ బోర్డు మార్చి 31 నాటికి 1,303 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. వాటి జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. కానీ గుర్తింపు పొందని కాలేజీల జాబితాను మాత్రం వెబ్సైట్లో పెట్టకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ కాలేజీలు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి.. ఈ జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ కాలేజీలకు గుర్తింపు రాకపోతే ఎలా? అనుబంధ గుర్తింపు లభించని కాలేజీల్లో చేరిన విద్యార్థుల భవిష్యత్తు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో వనస్థలిపురంలోని ఓ కాలేజీ విషయంగా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. మామూళ్లకు అలవాటు పడిన అధికారులు.. గుర్తింపు లేకున్నా ఆ కాలేజీ ప్రవేశాలు చేపట్టడాన్ని చూసీ చూడనట్టు వదిలేశారు. చివరికి విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన సమయం వచ్చే సరికి.. అధికారులు చేతివాటం చూపారు. అడిగిన మొత్తం ఇవ్వకపోవడంతో తమ విద్యార్థుల వివరాలు అప్లోడ్ చేసేందుకు, ఫీజు చెల్లించేందుకు ఆ కాలేజీకి లాగిన్ ఐడీ ఇవ్వలేదు. దాంతో విద్యార్థులకు హాల్‌టికెట్లు రాక ఆందోళనకు దిగారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని.. వారందరినీ హయత్‌నగర్ ప్రభుత్వ కాలేజీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతించింది. దీనివల్ల ఆ విద్యార్థులు ఎంసెట్ ర్యాంకుల్లో తీవ్రంగా నష్టపోయారు కూడా. తాజాగా అనుబంధ గుర్తింపు పొందని 337 ఇంటర్మీడియట్ కాలేజీల్లోనూ వేల మంది విద్యార్థులు చేరినట్టు అంచనా. ఇప్పుడు వీరి భవిష్యత్తు ఏమిటన్నది ఆందోళనకరంగా మారింది. -
జూనియర్ కళాశాలల్లో సమస్యలు తీరేనా..?
కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ విద్యకు ఆదరణ కరువవుతోంది. జిల్లాలో పలు జూనియర్ కళాశాలల్లో సమస్యలు తిష్ట వేసి ఉన్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక దృష్టి సారించి, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. అలాగే కేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఇంటర్ కళాశాలల్లో కనీస వసతులు సమకూరలేదనే విమర్శలున్నాయి. కళాశాలల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టడంలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఇంటర్ విద్యకు రోజురోజుకు ఆదరణ కరువవుతోంది. కళాశాలకు కావల్సిన కనీస వసతుల కల్పన, పూర్తిస్థాయిలో అధ్యాపకుల నియామకంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వ కళాశాలలపై ప్రభుత్వం చిన్నచూపు చూడడంతో ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంటర్ చదివించాలంటే తల్లిదండ్రులు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇందుకు వేలాది రూపాయలు వెచ్చించాల్సి ఉంది. కళాశాలలు పున:ప్రారంభమైనా.. కళాశాలలు పున:ప్రారంభమైనా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు లేవు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి విద్యార్థుల చేతిలో పుస్తకాలు ఉండాలి.. కాని అది అమలు కావడం లేదు. జిల్లాలో 26 ప్రభుత్వ, 20 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 12 వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 77 వేలకు పైగా పుస్తకాలు అవసరం. సంబం«ధిత పుస్తకాలు త్వరలో జిల్లాకు రానున్నాయి. తరగతులు ప్రారంభం.. జూన్ 1 నుంచి జూనియర్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. ద్వితీయ సంవత్సరానికి తరగతులు మొదలయ్యాయి. ప్రథమ సంవత్సవానికి అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆర్ట్స్, సైన్సు గ్రూపు విద్యార్థులకు ప్రభుత్వమే పాఠ్య పుస్తకాలను ఉచితంగా ఇస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ప్రతి విద్యార్థికి పుస్తకాలు అందించాల్సి ఉన్నప్పటకీ ఇంతవరకూ ఈ ప్రక్రియ ఓ కొలిక్కిరాకపోవడంతో విమర్శలకు తావిస్తోంది. వేధిస్తున్న సొంత భవనాల కొరత.. జిల్లాలో 26 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా ఇందులో 21 వాటికి సొంత భవనాలు ఉన్నాయి. మిగతా 5 వాటికి సొంత భవనాల్లేవు. హైస్కూల్స్‌లో షిఫ్ట్ పద్ధతిన కళాశాలలను నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు ఉర్దూ, మైదుకూరు ఉర్దూ, రాజంపేట ఉర్దూ, నందలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనాల్లేవు. ఈ పరిస్థితుల్లో ఆయా కళాశాలల విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కనీస వసతులు కరువు.. సొంత భవనాల్లేని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కనీస వసతులు కూడా కరువు. కనీసం మంచినీరు. మరుగుదొడ్లు కూడా లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి సొంత భవనాలను ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇదేనా ప్రైవేటుకు దీటంటే.. ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యాబోధన జరుగుతోంది. కొన్ని విద్యా సంస్థలు వేసవి సెలవుల్లోనే తరగతులను నిర్వహించాయి. కానీ ప్రభుత్వ కళాశాలల్లో సకాలంలో పాఠ్యపుస్తకాలు అందని పరిస్థితి. ప్రైవేటుకు దీటుగా రాణించాలంటే సకాలంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉందని విద్యావేత్తలు, మేధావులు చెబుతున్నారు. 15 రోజుల్లో పాఠ్య పుస్తకాలు.. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు పదిహేను రోజుల్లో పాఠ్య పుస్తకాలు అం దజేస్తాం. విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాల జాబితాను ప్రభుత్వానికి పంపాం. త్వరలో వస్తాయి. అలాగే సొంత భవనాల గురించి కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపాం. సమస్యను త్వరలో పరిష్కరిస్తాం. – చంద్రమౌళి, జిల్లా వృత్తివిద్యాధికారి. ఇంటర్మీడియట్ -
21 నుంచి జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, మోడల్ స్కూల్స్, గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు షెడ్యూల్ జారీ చేసింది. ఈ నెల 21 నుంచి మొదటి దశ ప్రవేశాలు చేపట్టనున్నట్లు తెలిపింది. విద్యార్థులకు దరఖాస్తు ఫారాల పంపిణీ, ప్రవేశాలు చేపట్టేందుకు కాలేజీలకు అనుమతినిచ్చింది. మొదటి దశ ప్రవేశాలను వచ్చే నెల 30 నాటికి పూర్తి చేయాలని పేర్కొంది. జూన్ 1వ తేదీ నుంచే తరగతులను ప్రారంభించాలని స్పష్టం చేసింది. ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా ఈ ప్రొవిజనల్ ప్రవేశాలను చేపట్టాలని వెల్లడించింది. ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు, ఒరిజనల్ ఎస్సెస్సీ మెమోలు వచ్చాక ఆయా ప్రవేశాలను కన్ఫర్మ్ చేయాలని వివరించింది. రెండో దశ ప్రవేశాల షెడ్యూల్‌ను తరువాత జారీ చేస్తామని తెలిపింది. జూనియర్ కాలేజీల ప్రిన్పిపల్స్ రూల్ రిజర్వేజన్ ఆధారంగా సీట్లను కేటాయించాలని బోర్డు సూచించింది. షెడ్యూల్లో పేర్కొన్న అంశాలు: - విద్యార్థుల గ్రేడ్ పాయింట్ యావరేజ్, సబ్జెక్టుల వారీ గ్రేడ్ల ఆధారంగానే ప్రవేశాలు - ప్రవేశాలకు ఎలాంటి పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదు. అలా చేస్తే ఆయా కాలేజీలపై కఠిన చర్యలు - ఏ కాలేజీలో చేరినా విద్యార్థుల ఆధార్ నంబరు నమోదు తప్పనిసరి - కాలేజీలో మంజూరైన సీట్ల మేరకే ప్రవేశాలు, ప్రతి సెక్షన్ 88 సీట్లకు మించకూడదు - బోర్డు రద్దు చేసిన కాంబినేషన్లలో ప్రవేశాలు చేపట్టకూడదు. - బోర్డు అనుమతులు వచ్చాకే అదనపు సెక్షన్లలో ప్రవేశాలు - ఈ నిబంధలను అతిక్రమిస్తే జరిమానాతో పాటు కాలేజీ అనుబంధ గుర్తింపు రద్దు - కాలేజీలో కోర్సుల వారీగా మంజూరైన సీట్లు, భర్తీ అయిన సీట్ల వివరాలను కాలేజీ గేటు వద్దే ప్రదర్శించాలి - ఈ ప్రవేశాలకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు చేయకూడదు - జోగినిల పిల్లలకు రికార్డుల్లో తండ్రి పేరు స్థానంలో తల్లి పేరునే రాయాలి - అనుబంధ గుర్తింపు కలిగిన కాలేజీల వివరాలను బోర్డు వెబ్సైట్లో (tsbie.cgg.gov.in) పొందవచ్చు. తల్లిదండ్రులు అందులో గుర్తింపు కలిగిన కాలేజీల్లోనే తమ పిల్లలను చేర్చాలి. -
మైనార్టీ గురుకుల కాలేజీల్లో 960 సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన మైనార్టీ గురుకుల జూనియర్ కాలేజీల్లో 2018–19కి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం తెలంగాణ రాష్ట్ర మైనార్టీ గురుకులాల విద్యా సంస్థల సొసైటీ (టెమ్రీస్) చర్యలు చేపట్టింది. 12 జూనియర్ కళాశాల్లో ఇంటర్ ఫస్టియర్‌లో 960 సీట్లను భర్తీ చేయనుంది. 11 గురుకులాల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు ఏర్పాటు చేస్తోంది, నిజామాబాద్‌లో సీఈసీ, ఎంఈసీ గ్రూపులు మాత్రమే ఏర్పాటు చేస్తోంది. ప్రతి సెక్షన్లో 40 చొప్పున ఎంపీసీలో 440, బైపీసీలో 440 సీట్లు భర్తీ చేయనుంది. సీఈసీలో 40, ఎంఈసీలో 40 సీట్లు భర్తీ చేసేలా ప్రణాళిక రూపొందించింది. 12 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో బాలికలకు మూడింటిని ప్రత్యేకంగా కేటాయించింది. రంగారెడ్డి జిల్లాలోని హయత్‌నగర్(బాలుర), ఇబ్రహీంపట్నం(బాలికల), నిజామాబాద్(బాలుర), కామారెడ్డి(బాలుర), నల్లగొండ జీవీగూడెం(బాలుర), నల్లగొండ(బాలికల), వరంగల్ రంగసాయిపేట(బాలుర), మహబూబ్‌నగర్(బాలుర), వనపర్తి (బాలుర), హైదరాబాద్ బార్కాస్(బాలుర), సంగారెడ్డి(బాలుర), జహీరాబాద్(బాలుర) జూనియర్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం శనివారం నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నెల 5 నుంచి 15 వరకు ఆన్లైన్లో అడ్మిషన్ కోసం ఎలాంటి రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. 16 నుంచి 20 వరకు పదో తరగతిలో వచ్చిన గ్రేడ్ల ఆధారంగా విద్యార్థుల ఎంపిక, 21న ఎంపికైన వారి జాబితా విడుదల, 22 నుంచి 25 వరకు ఎంపికైన విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించేలా టెమ్రీస్ చర్యలు చేపట్టింది. మొత్తం సీట్లలో 75% సీట్లు మైనారిటీలకు, 25% మైనార్టీయేతరులకు కేటాయిస్తారు. -
సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు
సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే అనుమతులు రద్దు చేస్తామని జూనియర్ కాలేజీ యాజమాన్యాలకు ఇంటర్మీడియెట్ బోర్డు స్పష్టం చేసింది. వివిధ జిల్లాల్లో తరగతులు నిర్వహిస్తున్న 396 కాలేజీలపై ఆకస్మిక దాడులు నిర్వహించామని పేర్కొంది. వాటికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని వివరించింది. ఇందులో హైదరాబాద్ జిల్లాలో 132, రంగారెడ్డి జిల్లాలో 91, మేడ్చల్ జిల్లాలో 173 కాలేజీలున్నాయని పేర్కొంది. కాలేజీ హాస్టళ్లు, నిర్వహణ తదితర అంశాలపై శనివారం ఇంటర్ బోర్డు కార్యాలయంలో కార్యదర్శి అశోక్ మీడియాతో మాట్లాడారు. సెకండియర్ పూర్తయి ఎంసెట్, ఐఐటీకి సిద్ధమవుతున్న విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు సెలవుల్లో తరగతులు నిర్వహించే ప్రసక్తే లేదన్నారు. గుట్టుచప్పుడు కాకుండా తరగతులు నిర్వహిస్తే కాలేజీ అఫిలియేషన్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కొన్ని విద్యా సంస్థలు అకాడమీల పేరుతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయని, దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఒక కాలే జీలో ప్రవేశం పొంది మరో కాలేజీలో రెండేళ్ల పాటు కోర్సులో శిక్షణ తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, కాలేజీ తరగతులకు హాజరు కాకుండా అకాడమీ తరగతులకు మాత్రమే హాజరవడం బోర్డు నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. నోటిఫికేషన్ తర్వాతే ప్రవేశాలు.. జూనియర్ కాలేజీలకు సంబంధించి ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. మే 21న ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. బోర్డు నుంచి అనుమతి పొందిన కాలేజీలు తమ అఫిలియేషన్ సర్టిఫికెట్‌ను కాలేజీ ప్రాంగణంలో ప్రదర్శించాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,684 కాలేజీలు అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా 786 కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చామన్నారు. మరో 559 కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియ పెండింగ్‌లో ఉందని, వీటిలో ఎక్కువగా మౌలిక వసతుల లోపాలున్నాయన్నారు. ఏప్రిల్ 30 తర్వాత అఫిలియేషన్ కాలేజీల జాబితాను ఇంటర్ బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అఫిలియేషన్ ఉన్న కాలేజీల వివరాలను తెలుసు కున్న తర్వాతే అడ్మిషన్లు పొందాలని సూచించారు. కాలేజీ హాస్టళ్లను కూడా బోర్డు పరిధిలోకి తెచ్చామని, హాస్టళ్ల నిర్వహణకు ఈ నెల 20 వరకు వచ్చిన దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. దరఖాస్తుల సంఖ్య అతి తక్కువగా ఉందని, యాజమాన్యాలు దరఖాస్తులపై శ్రద్ధ చూపలేదనిపిస్తోందని వ్యాఖ్యానించారు. హాస్టల్ దరఖాస్తు గడువు పెంచాలని యాజమాన్యాలు కోరుతున్నాయని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
సెలవుల్లేవ్
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు అప్పడే సీనియర్ ఇంటర్ తరగతులను ప్రారంభించేశాయి. వేసవి సెలవుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించరాదన్న బోర్డు ఉత్తర్వులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వేసవి సెలవులను సరదాగా గడపాల్సిన సమయంలో ద్వితీయ సంవత్సర సిలబస్‌తో తరగతులను మొదలెట్టాయి. సప్లిమెంటరీ పరీక్షల పేరుతో యథేచ్ఛగా క్లాసులు నిర్వహిస్తున్నాయి. పరీక్షల హడావుడితో అలసిన విద్యార్థులు ఏడాది పొడవునా తరగతి గదులకు పరిమితమైన విద్యార్థులకు మానసిక విశ్రాంతి తప్పనిసరి. సెలవుల్లో వారు కొంత సేద తీరి ఊపిరి పీల్చుకుంటారు. సీనియర్ ఇంటర్ తరగతులతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు డే స్కాలర్‌తోపాటు హాస్టల్ క్యాంపస్‌లలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయి. గుంటూరు నగరంలోని చంద్రమౌళీనగర్‌తోపాటు శివారు గోరంట్ల, రెడ్డిపాలెం, పెద పలకలూరులో ఉన్న హాస్టళ్లలో యథేచ్ఛగా తరగతులు కొనసాగుతున్నాయి. కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తాం వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించరాదని కళాశాలల యాజమాన్యాలను స్పష్టంగా చెప్పాం. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న విషయమై విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై త్వరలోనే యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తాం. నిబంధనలు పాటించని యాజమాన్యాల తీరును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. -
కొత్తగా పది మైనారిటీ గురుకుల కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం కొత్తగా 10 మైనారిటీ గురుకుల జూనియర్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ సన్నాహాలు ప్రారంభించింది. ఈ సొసైటీ కింద 204 గురుకుల పాఠశాలలు, 2 జూనియర్ కాలేజీలు కొనసాగుతున్నాయి. కొత్త గురుకుల పాఠశాలల్లో 5 నుంచి తొమ్మిదో తరగతి వరకు, పాత 12 గురుకులాల్లో పదో తరగతి వరకు విద్యాబోధన కొనసాగుతోంది. పాత జూనియర్ కాలేజీలు 2 ఉన్నా యి. దీంతో కొత్తగా 10 జూనియర్ కాలేజీల ఏర్పాటు కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో కాలేజీల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పాత పది గురుకుల పాఠశాలల భవనాల్లోనే కాలేజీల విభాగాలు ఏర్పాటు చేయాలని సొసైటీ నిర్ణయించింది. అధ్యాపకుల భర్తీకి కసరత్తు..: కొత్త మైనారిటీ గురుకుల జూనియర్ కాలేజీల్లో అధ్యాపకులను భర్తీ చేసేందుకు మైనారిటీ గురుకుల సొసైటీ కసరత్తు చేస్తోంది. పది కాలేజీలకు బోధనావిభాగంలో 80 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. కాలేజీలకు టీఎస్పీఎస్సీ నుంచి అధ్యాపకులు భర్తీ అయ్యేవరకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా రెండు రోజులక్రితం ఆ సొసైటీ కార్యదర్శి ఔట్సోర్సింగ్ ఏజెన్సీలతో సమావేశమయ్యారు. ఏజెన్సీల ద్వారా అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 30 వరకు ఒక పోస్టుకు ముగ్గురు చొప్పున దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. సబ్జెక్టులవారీగా మే 5 నుంచి 10 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి మే 12న ఎంపిక జాబితా వెల్లడించనున్నారు. ఎంపికైన జూనియర్ లెక్చరర్లకు మే 13న నియామకపత్రాలు అందించి 15 నుంచి 25 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. జూన్ 1 నుంచి విధులకు హాజరయ్యేవిధంగా కార్యాచరణ రూపొందించారు. 27 తర్వాత అడ్మిషన్ నోటిఫికేషన్ మైనారిటీ గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్ తొలి ఏడాదిలో ప్రవేశాలకు ఈ నెల 27 తర్వాత నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మైనారిటీ గురుకులాల్లో చదివిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత వర్తింపజేస్తారు. గురుకుల పాఠశాలల మాదిరిగానే 75 శాతం సీట్లు మైనారిటీలకు, 25 శాతం మైనార్టీయేతరులకు కేటాయించనున్నారు. -
జూనియర్ కాలేజీలుగా 27 గురుకులాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలోని 27 గురుకుల పాఠశాలలను గురుకుల జూనియర్ కాలేజీలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో 13 బాలుర, 14 బాలికల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ కాలేజీల్లో రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సును 2018–19 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈసారి ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పించాలని, ప్రతి గ్రూప్‌లో 40 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని సూచించారు. ఇందుకు 405 పోస్టులను మంజూరు చేయాలని, అందుకోసం రూ.117.79 కోట్లు విడుదల చేయాలని విద్యా శాఖ గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రతిపాదనలు పంపారు. అయితే పోస్టుల మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులను వేరుగా జారీ చేస్తామని వెల్లడించారు. జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసిన గురుకులాలు బాలుర గురుకులాలు (ప్రాంతం–జిల్లా).. బెల్లంపల్లి– మంచిర్యాల, పెద్దాపూర్ క్యాంపు– జగిత్యాల, మేడారం– పెద్దపల్లి, వేలేర్– వరంగల్ అర్బన్, బండారుపల్లి– జయశంకర్ భూపాలపల్లి, ఎంకూర్– ఖమ్మం, తుంగతుర్తి– సూర్యాపేట, పోచంపాడు– నిజామాబాద్, మద్నూర్– కామారెడ్డి, బీచుపల్లి– జోగుళాంబ గద్వాల, తూప్రాన్– మెదక్, లింగంపల్లి– సంగారెడ్డి, బోరబండ– హైదరాబాద్. బాలికల గురుకులాలు (ప్రాంతం–జిల్లా).. నిర్మల్– నిర్మల్, తాటిపల్లి– జగిత్యాల, నేరెళ్ల– సిరిసిల్ల రాజన్న, వంగర– వరంగల్ అర్బన్, నెక్కొండ– వరంగల్ రూరల్, కొడకండ్ల– జనగాం, బూర్గంపాడ్– భద్రాద్రి కొత్తగూడెం, చౌటుప్పల్– యాదాద్రి భువనగిరి, పోచంపాడు– నిజామాబాద్, బోధన్– నిజామాబాద్, మెదక్– మెదక్, దిగ్వాల్– సంగారెడ్డి, బోరబండ– హైదరాబాద్, తాండూరు– వికారాబాద్. -
కాలేజీ హాస్టళ్లలో గదికి ఇద్దరే!
సాక్షి, హైదరాబాద్ : జూనియర్ కాలేజీల యాజమాన్యాల ఇష్టారాజ్య వైఖరికి ఇక చెక్ పడనుంది. ఒక్కో గదిలో పదిమంది వరకు విద్యార్థులను కుక్కిపడేసే కాలేజీ హాస్టళ్ల తీరుపై ఇంటర్ బోర్డు దృష్టి సారించింది. రెసిడెన్షియల్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసినా తగిన సదుపాయాలు కల్పించకుండా విద్యార్థులను ఇబ్బందులపాలు చేసే యాజమాన్యాలపై కొరడా ఝళిపించనుంది. ఇందుకోసం పక్కా నిబంధనలను సిద్ధం చేసింది ఇంటర్మీడియెట్ బోర్డు. జూనియర్ కాలేజీలు, హాస్టళ్లలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, ఒత్తిడిని దూరం చేసేందుకు త్వరలోనే మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో.. అరకొర వసతులు కలిగిన హాస్టళ్లలో ఉదయం 5 గంటలకు నిద్ర లేచింది మొదలుకొని అర్ధరాత్రి 12 గంటల వరకు చదువులతో ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థులు ఇటీవలి కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు గత నవంబరు, డిసెంబరు నెలల్లో హాస్టళ్లలో పరిస్థితులపై తనిఖీలు నిర్వహించింది. వసతుల లేమితో హాస్టళ్లలో ఉండలేక, ఇంటికి వెళ్లలేక, సరైన నిద్రలేక, చదువే లోకంగా ఉంటున్న విద్యార్థులు.. ఆ ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితు లున్నాయని తెలుసుకుంది. వాటిని మార్చేందుకు ఇన్నాళ్లు బోర్డు పరిధిలో లేని కాలేజీ హాస్టళ్లను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తమ పరిధిలోకి తెచ్చుకుంది. వాటి ని నియంత్రించేందుకు నిబంధనలను సిద్ధం చేసింది. ముఖ్యంగా కాలేజీ హాస్టళ్లలోని విద్యార్థులకు తగిన సదుపాయాలు కల్పించడంతోపాటు ఒత్తిడిని దూరం చేసే మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ఇవీ ప్రధాన నిబంధనలు.. ♦ హాస్టల్లోని గదిలో ఇద్దరు విద్యార్థులను మాత్రమే ఉంచాలి. ♦ బాలురైతే ప్రతి 8 మందికి ఒక బాత్రూమ్ ఉండాలి. బాలికలైతే ప్రతి ఆరుగురికి ఒక బాత్రూమ్ ఉండాలి. ♦ ప్రతి విద్యార్థికి 50 చదరపు అడుగుల ప్రదేశం ఉండేలా చూడాలి. ♦ 360 మంది విద్యార్థులను ఒక యూనిట్‌గా తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మరో యూనిట్ ఏర్పాటు చేయాలి. ♦ ప్రతి యూనిట్‌కు వంట చేసే సిబ్బంది ఆరుగురు ఉండాలి. పరిశుభ్రత కోసం తగిన సిబ్బందిని నియమించాలి. దానిని స్థానిక మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో కమిటీ పర్యవేక్షించాలి. ♦ భోజనం నాణ్యతపై ఫుడ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో కమిటీ నిరంతరం పర్యవేక్షించాలి. ♦ ప్రతి నెలా కచ్చితంగా పేరెంట్, టీచర్ మీటింగ్ ఉండాలి. సెలవు దినాల్లో విద్యార్థులను కలుసుకునే అవకాశం తల్లిదండ్రులకు కల్పించాలి. ♦ క్వాలిఫైడ్ కౌన్సెలర్లను అందుబాటులో ఉంచాలి. ఒత్తిడితో ఇబ్బంది పడే విద్యార్థులకు తగు సలహాలు అందజేయాలి. ♦ విద్యార్థులను ఉదయం 6 గంటల లోపు నిద్ర లేపకూడదు. రాత్రి 10 గంటల తరువాత స్టడీ అవర్స్ కొనసాగించవద్దు. ♦ ఈ నిబంధనలను అతిక్రమిస్తే యాజమాన్యాల గుర్తింపును రద్దు చేసే అవకాశం ఉంది. ♦ ఈ నిబంధనలు ప్రైవేటు రెసిడెన్షియల్ కాలేజీలకే కాదు.. ప్రభుత్వ కాలేజీలకు (ఫీజులు మినహా) వర్తిస్తాయి. ముందుగానే దరఖాస్తుల ఆహ్వానం.. జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు, హాస్టళ్లకు గుర్తింపు ఇచ్చేందుకు నిబంధనల జారీ కంటే ముందుగానే ఆయా యాజమాన్యాల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. 2018–19 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్ కోర్సును నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,667 కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం ఇంటర్మీడియెట్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే అందులో 700 వరకు హాస్టళ్లు కలిగిన కాలేజీలు ఉన్నట్లు బోర్డు అంచనా. కానీ ఇంతవరకు 267 కాలేజీలు మాత్రమే హాస్టళ్లకు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. మిగతా కాలేజీలు ఇంకా ముందుకు రాలేదు. గత నెల 22 తోనే దరఖాస్తుల గడువు ముగిసినా కాలేజీల విజ్ఞప్తి మేరకు ఈ నెల 20వ తేదీ వరకు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. అయినా ఇంతవరకు ఇంకా 400కు పైగా హాస్టళ్లు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోలేదు. మరి వాటిపై బోర్డు ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సిందే. ఇక కాలేజీల గుర్తింపు ఫీజును గతంలోనే ఖరారు చేసిన బోర్డు.. ఇపుడు హాస్టళ్లు కలిగిన కాలేజీలకు మొత్తంగా రూ.ఆరు లక్షలు గుర్తింపు ఫీజుగా ఖరారు చేసినట్లు తెలిసింది. వాటిపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. -
చదువుల తల్లీ క్షమించు
నిత్యం పాఠాలు మంత్రాల్లా వినిపించే అపురూపమైన చోటు అపవిత్రమవుతోంది. మహాయాగంలా బోధనలు సాగే స్థలం సిగ్గుతో తల దించుకుంటోంది. సభ్యసమాజాన్ని నిర్మించే కళాశాల ‘కొందరు’ చేసిన పని చూడలేక కన్నీళ్లు పెట్టుకుంటోంది. మందసలోని జూనియర్ కాలేజీలో రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఉదయం తలుపులు తెరిచిన వెంటనే దీనికి రుజువులు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా జరుగుతున్న ఈ తంతుపై అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందస:తరగతి గదిలో నలిగిపోయిన మల్లెపువ్వులు, వాడంబరాలు. మరో గదిలోకి వెళ్తే కంపు కొట్టే ఆహార పొట్లాలు, ఆ పక్కనే పడి ఉండే ఖాళీ మద్యం సీసాలు. గది బయటకు వస్తే విరిగిపోయి కనిపించే పైప్లైన్లు. సాయంత్రం అన్నీ శుభ్రం చేసి వెళ్తే పొద్దున్న వచ్చే సరికి మళ్లీ అవే దృశ్యాలు. మందస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రోజుల తరబడి సాగుతున్న దుశ్చర్యలివి. కళాశాల గది అనే స్పృహ లేకుండా ఆకతాయిలు చేస్తున్న ఆగడాలు విద్యార్థులు, అధ్యాపకులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. తాళం వేసి ఉన్నా వాటిని విరగ్గొట్టి మరీ గదుల్లోకి ప్రవేశిస్తున్న దుండగులు రాత్రిపూట కాలేజీని ఇలా అవసరాలకు వాడుకుంటున్నారు. తాగి పారేసిన మద్యం సీసాలను అక్కడే పగులగొట్టి వేస్తుండడంతో ఉదయం కాలేజీకి వస్తున్న విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకతాయిల పనేనా..?: కాలేజీని 1985లో ప్రారంభించారు. ప్రస్తుతం 600 మంది విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ, ఒకేషనల్ గ్రూపుల్లో ఉన్నారు. కాలేజీ పక్కనే ప్రసిద్ధ వాసుదేవ పెరుమాళ్ ఆలయం ఉంది. అయితే ఆలయ నిర్వాహకులతో కాలేజీ వారికి ఎప్పటి నుంచో వివాదాలు ఉన్నాయి. వాసుదేవ ఆలయ జీర్ణోద్ధరణ పనులు జరిగాక కాలేజీని ఆలయ ట్రస్టుకు అప్పగించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. దీన్ని విద్యార్థులంతా వ్యతిరేకించారు. అప్పట్లో దీనిపై ఉద్యమాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో కాలేజీలో ఇలాంటి సంఘటనలు జరగడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. తీవ్ర ఆవేదన గురవుతున్నాం కళాశాలలో అరాచకాలు ఎక్కువయ్యాయి. పైప్ లైన్లు ధ్వంసం చేస్తున్నారు. తలుపులు విరిచేస్తున్నారు. బాగు చేయించినా ఇదే పరిస్థితి. మల, మూత్ర విసర్జన చేస్తుండడంతో అధ్యాపకులే తీయాల్సివస్తోంది. వ్యభిచారం కూడా జరుగుతున్నట్లు అనుమానంగా ఉంది. సభ్య సమాజం తలదించుకునేలా దుండగులు వ్యవహరిస్తున్నారు. మద్యం బాటిళ్లను చెత్తా, చెదారం వేసి కాల్చుతున్నాం. పోలీసులు గట్టి నిఘా వేయాలి. – అసపాన కృష్ణారావు, ప్రిన్సిపల్, మందస ప్రభుత్వ జూనియర్ కళాశాల -
లెక్చరర్ తిట్టారని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
-
ఉత్తర్వులే
► జూనియర్ కళాశాలల్లో కానరాని బయోమెట్రిక్ విధానం ► బోగస్ హాజరుతో స్కాలర్షిప్లు మెక్కుతున్న యాజమాన్యాలు! ► పట్టించుకోని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు నెల్లూరు (టౌన్) : ఇంటర్మీడియెట్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు నమోదుకు విధిగా బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి. ఈ ఏడాది విద్యా సంవత్సర ప్రారంభం నుంచి బయోమెట్రిక్ విధానంలోనే విద్యార్థుల హాజరు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే, జిల్లాలో ఒక్క కళాశాలలోనూ బయోమెట్రిక్ యంత్రాన్ని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఈ విధానం అమలుకు నిరాకరించే కళాశాలల గుర్తింపు రద్దు చేస్తామన్న హెచ్చరి కను సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాలను విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న ఇంటర్మీ డియెట్ బోర్డు అ«ధికారులు సైతం ఈ విషయంలో మిన్నకుండిపోతున్నారు. ఉపకార వేతనాలను మేసేందుకేనా! జిల్లాలో 121 కార్పొరేట్, 26 ప్రభుత్వ, 15 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 60 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రతినెలా రూ.325 చొప్పున 10 నెలలకు రూ.3,250 స్కాలర్షిప్ మంజూరవుతోంది. ఈ సొమ్ము కోసం చాలా కళాశాలలు అక్రమాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కళాశాలలకు రావాల్సిన అవసరం ఉండదని, పాస్ చేయించే బాధ్యత తమదేనని భరోసా ఇస్తూ పలు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను తరగతుల్లో చేర్చుకుంటున్నాయి. విద్యార్థులు రోజూ కళాశాలకు రాకపోయిన రికార్డులో హాజరు చూపిస్తూ స్కాలర్ షిప్పు మొత్తాలను కాజేస్తున్నాయి. మరోవైపు ఇతర విద్యార్థులు తరగతులకు రాకపోయినా హాజరు నమోదు చేసి వారినుంచి వేలకు వేలు దండుకుంటున్నారు. కొన్ని సంద ర్భాల్లో హాజరు తక్కువగా ఉందంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారు. అక్రమాలను అరికట్టేందుకే బయోమెట్రిక్ జూనియర్ కళాశాలల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తెరపైకి తెచ్చింది. ప్రతి విద్యార్థి ఆధార్ నంబర్‌ను బయోమెట్రిక్‌కు అనుసంధానం చేసింది. కళాశాలకు వచ్చే ప్రతి విద్యార్థి ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా వేలిముద్ర ద్వారా హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే ప్రభుత్వం స్కాలర్షిప్ సొమ్ము విడుదల చేస్తుంది. ఈ దృష్ట్యా ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక బయోమెట్రిక్ యంత్రం చొప్పున కళా శాలల్లో ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు ఆదేశించింది. ఇవి ఏర్పాటు కాకపోతే ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్ఐఓ) బాధ్యులవుతా రని ఉన్నతాధికారులు హెచ్చరించారు. అయినా జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయలేదు. జిల్లాలో జూనియర్ కళాశాలలు 162 కార్పొరేట్ కాలేజీలు 121 ప్రభుత్వ కళాశాలలు 26 ఎయిడెడ్ పరిధిలో 15 ఇంటర్మీడియెట్ విద్యార్థులు 60 వేలు సెప్టెంబర్ వరకు గడువిచ్చాం జిల్లాలోని కళాశాలల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు బయోమెట్రిక్ యంత్రాల ఏర్పాటుకు సెప్టెంబరు నెలాఖరు వరకు గడువు ఇచ్చాం. అప్పటికి ప్రతి జూనియర్ కళాశాలలో బయోమెట్రిక్ యంత్రాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. లేకుంటే విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు కాదు. బయోమెట్రిక్ ద్వారా వచ్చే హాజరునే పరిగణనలోకి తీసుకుంటాం. – బాబూజాకబ్, ఆర్ఐఓ, ఇంటర్మీడియెట్ బోర్డు. -
నేడు జూనియర్ కాలేజీల బంద్
కర్నూలు సిటీ: జిల్లాలో గురువారం.. జూనియర్ కాలేజీల బంద్ చేపడుతున్నట్లు అఖిల భారత విద్యార్థి పరిషత్ జిల్లా కన్వీనర్ మహేంద్ర తెలిపారు. బుధవారం స్థానిక సెంట్రల్ ప్లాజాలోని ఏబీవీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మారుస్తోందన్నారు. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అనుమతులు లేకుండా అనుబంధ కాలేజీలను నిర్వహిస్తున్నా.. అధికారులు తనిఖీలే చేయడం లేదన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు గణేష్, హర్ష, జయసింహ, మహేష్, రవి, గోపి, తదితరులు పాల్గొన్నారు. -
రేపు జూనియర్ కళాశాలల బంద్
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఆన్లైన్ అడ్మిషన్లు అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం వెనుకడుగు వేయటం కార్పొరేట్ కళాశాలలకు రెడ్ కార్పెట్ పరచటమే అని ఏబీవీపీ ఆరోపించింది. కార్పొరేట్ కళాశాలల్లో ఆత్మహత్యలు, విద్యార్థుల మిస్సింగ్ లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. అంతేకాక, కార్పొరేట్ కళాశాలకు అమ్ముడు పోయిన ఇంటర్ బోర్డ్ సెక్రెటరీ అశోక్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కోరింది. తమ డిమాండ్ల సాధనకు, ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలోపేతానికి ఈనెల 14వ తేదీన జూనియర్ కళాశాలల రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపు ఇచ్చింది. -
నేటి నుంచి జూనియర్ కళాశాలల పునఃప్రారంభం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను గురువారం నుంచి పునఃప్రారంభించననున్నట్లు ఆర్ఐఓ పరమేశ్వరరెడ్డి తెలిపారు. ఎండలు ఎక్కుగా ఉన్న నేపథ్యంలో అవసరమైతే మధ్యాహ్నం వరకే కళాశాలలను నిర్వహించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రవేశాలను కల్పించాలని సూచించారు. కాగా, ఇప్పటికే ప్రైవేట్ కళాశాలల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం అడ్మిషన్ల ప్రక్రియ మొదలు కాలేదు. ఇంటర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది దారుణంగా పడిపోతున్న నేపథ్యంలో అడ్మిషన్లపై ప్రిన్సిపాళ్లు అయోమయంలో ఉన్నారు. కాగా, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యంకనం పూర్తయింది. -
కాలేజీల్లో ఇంటర్ బోర్డు దాడులు
హైదరాబాద్: వేసవి సెలవుల్లో కాలేజీలు నడపరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులను ఖాతరు చేయని కార్పొరేట్ సంస్థలపై ఇంటర్ బోర్డు అధికారులు దాడులు చేపట్టారు. మంగళవారం ఉదయం మెదక్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని కళాశాలల్లో తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం మియాపూర్‌లోని కళాశాలలకు చేరుకుని క్లాసులు నడుపుతున్న వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. -
రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల బంద్
విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలలు సోమవారం బంద్ పాటిస్తున్నాయి. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానాన్ని నిరసిస్తూ.. ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో అన్ని కాలేలు బంద్‌లో పాల్గొంటున్నాయి. -
కాంట్రాక్టు లెక్చరర్లపై ఇంత వివక్షా?
ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టో హామీని నెరవేర్చే పేరుతో ఏపీలోని 446 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 3,776 మంది, డిగ్రీ కాలేజీల్లోని 704 మంది, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టర్ లెక్చరర్ల సర్వీసు క్రమబద్ధీకరణపై, సమస్యలపై అధ్య యనానికి 2014 సెప్టెంబర్ 9న కేబినెట్ సబ్ కమిటీని ఏర్పర్చింది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, పల్లె రఘు నాధరెడ్డి సభ్యులుగా ఉన్న ఈ సబ్ కమిటీ గత రెండేళ్లలో ఒక్క సమావే శాన్ని కూడా నిర్వహించక పోవడం ప్రభుత్వ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షకు నిదర్శనం. కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ విజయవాడలో 25-02-2015న నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సమాచార మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణకు చర్యలు చేపడతామని హామీనిచ్చారు. మరోవైపున సీఎంతో సహా, కేబినెట్ సబ్ కమిటీ సభ్యు లను అసోసియేషన్ ప్రతినిధులు ప్రతి జిల్లాలో కలిసి తమ సమస్యల పరిష్కారం కోసం అభ్యర్థిస్తున్నా ఇదిగో అదిగో అంటూ మభ్యపెడుతూ, కాలం గడుపుతున్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చర ర్ల క్రమబ ద్దీకరణకు అడ్డంగా ఉన్న 2/94 చట్టాన్ని సవరించడానికి అడుగులేస్తోంది. కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తా మని తెలంగాణ సీఎం కేసీఆర్ పలుసార్లు స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కాంట్రాక్టు అధ్యాపకులను గతంలోనే క్రమబద్ధీ కరించారు. కానీ రాష్ట్రంలోని 13,671 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో విద్యాశాఖలోని అత్యధికంగా ఉన్న 5,757 మంది కాంట్రాక్టు లెక్చరర్లను గుర్తించడం వరకే పరిమిత మైన ఏపీ ప్రభుత్వం వీరి సమస్యను దాటవేయడంతోనే పొద్దు గడుపుతోంది. గత 16 ఏళ్లుగా మూసివేత దిశగా ఉన్న ప్రభుత్వ కళాశాలలకు ప్రాభవం తీసుకురావ డంలో కాంట్రాక్టు అధ్యాపక వ్యవస్థ సాటిలేని కృషి సల్పింది. విద్యార్థుల సంఖ్య పెంపుదల, పరీక్షా ఫలితాల సాధనలో గణనీయ ప్రగతిని సాధించినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. కానీ కాంట్రాక్టు లెక్చరర్ల సంక్షేమం పట్ల నేటి చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. 10వ వేతన సవరణ సంఘం కాంట్రాక్టు లెక్చరర్లకు మూలవేతనం, డీఎ ఇవ్వమని సిపార్సు చేసినా వాటి అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వైఖరితో ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎన్నడూ లేనివిధంగా 2016-17 సంవత్సరానికి రెన్యువల్ ప్రక్రియ ఉత్తర్వుల జారీలో తీవ్ర జాప్యం నెలకొంది. దీంతో గత 4 నెల లుగా పనిచేస్తున్నప్పటికీ జీతాలు అందుకోలేని స్థితి. ఈ ఏడాదిలో జీతం లేని వేసవిని, జీతం అందని కాలాన్ని కలుపుకుంటే సుమారు 6 నెలలుగా వేతనాలు లేకుండా కాంట్రాక్టు అధ్యాపకులు క్షోభకు గురవుతున్నారు. దినదినగండంగా ఉన్న ఉద్యోగాన్ని నమ్ముకుని చిత్తశుద్ధితో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను ప్రభుత్వం గుర్తించకపోగా అదనపు నిబంధనలు, అవ రోధాలు కల్గించడం దారుణం. దీంతో తమ ఉద్యోగాల కొనసాగింపు అంశంలో ఏర్పడుతున్న అవరోధాలు గమ నించడానికే వారి శక్తియుక్తులన్నీ సరిపోతున్నాయి. ఈ ఉదాశీనత కొనసాగితే అధ్యాపకులు మిలిటెంట్ పోరా టాలకు పాల్పడాల్సి వస్తుంది. ప్రభుత్వం మొండి వైఖ రిని విడనాడి కాంట్రాక్టు లెక్చరర్లను ఆదుకోవాలి. కుమ్మరకుంట సురేష్, అధ్యక్షులు, ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్, ప్రకాశం జిల్లా మొబైల్ : 94910 03093 -
‘ప్రైవేట్’ ఆగడాలకు చెక్
మే 31కి ముందే జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీల ఆగడాలకు చెక్ పెట్టాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రతి ఏటా కాలేజీల్లో ప్రవేశాలు పూర్తయ్యాక ఆయా కాలేజీల అనుబంధ గుర్తింపునకు బోర్డు చర్యలు చేపడుతోంది. వీటిలో లోపాలున్నా.. మధ్యలో కాలేజీ మూసేస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందన్న సాకుతో కాలేజీలు తమ ఆగడాలను కొనసాగించాయి. ఇలాంటి ఆగడాలకు చెక్ పెట్టేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మే 31లోగా కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. గుర్తింపు లభించిన కాలేజీల్లోనే జూన్ 1 నుంచి ప్రవేశాలు చేపట్టనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ వెల్లడించారు. అలాగే అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా, లభించని కాలేజీల జాబితాను తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. అనుబంధ గుర్తింపు కోసం ఆన్లైన్ దరఖాస్తులు, ఆన్లైన్లోనే అనుమతులు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈసారికి మాత్రం షరతులతో అనుబంధ గుర్తింపు.. రాష్ట్రంలో 1,642 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా, వాటిల్లో 1056 కాలేజీలకు 2016-17 విద్యా సంవత్సరంలో అనుబంధ గుర్తింపు లభించింది. మరో 586 కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు అనుబంధ గుర్తింపును ఇవ్వలేదు. అందులో 349 కాలేజీలు అనధికారికంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి షిఫ్ట్ చేసినవి ఉండగా, పక్కా భివనాలు లేకుండా షెడ్లలో కొనసాగుతున్నవి 85 ఉన్నాయి. 152 కాలేజీలకు ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేదు. వీటిపై బోర్డు ప్రభుత్వానికి నివేదిక పంపగా, షరతులతో అనుమతులు ఇవ్వాలని సూచించింది. దీంతో మూడు నెలల్లో ఫైర్ సేఫ్టీ ఎన్వోసీ తెచ్చుకుంటామని, వచ్చే విద్యా సంవత్సరంలోగా పక్కా భవనాల్లోకి షిఫ్ట్ చేస్తామన్న షరతుతో బోర్డు అనుబంధ గుర్తింపు ఇవ్వనుంది. -
కళాశాలల్లో విస్తృత తనిఖీలు
గోవిందరావుపేట : మండలంలోని పస్రా జూనియర్, డిగ్రీ కళాశాలల్లో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. గురువారం ఉదయమే దేవి ఒకేషనల్ జూనియర్ కళాశాల, నలంద కళాశాల, గాయత్రీ, కాకతీయ డిగ్రీ కళాశాలల్లో తనిఖీలు జరిగాయి. నలంద కళాశాలకు సీఐడీ డీఎస్పీ రవి కుమార్, డిగ్రీ కళాశాలలకు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, దేవి కళాశాలకు మైనింగ్ ఏజీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో బృందాలు చేరుకున్నాయి. లైబ్రరీ, ల్యాబ్‌లు, కళాశాలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఉన్నాయా, భవనాలకు నిర్మాణ అనుమతి ఉందా అనే విషయాలు పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, లెక్చరర్లు ఎంతమంది, వారి అర్హతలు వంటి వివరాలను పరిశీ లిస్తున్నారు. పూర్తిస్థాయి పరిశీలన అనంతరం ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ డీ డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా విజి లెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సుమారు 1200 కళాశాలల్లో తనిఖీలు చేపట్టనుండగా, ఇప్పటి వర కు 750 కళాశాలల్లో పూర్తయిందని వివరించారు. కళాశాలలో ఎలాంటి లోపాలున్నా ప్రాథమిక రిపోర్టును తయారు చేసి పంపిస్తామని చెప్పారు. ఆయన వెంట విజిలెన్స్ తహసీల్దార్ భవాని, సీఐడీ ఎస్సై పుష్పలత, ప్రొఫెసర్ అంజయ్య, పీఆర్ ఏఈ సుగుణాకర్‌రావు, సిబ్బంది ఉన్నారు. పస్రాలోని ఓ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఎప్పుడూ విద్యార్థులు కనిపించరని, ఇప్పుడు మాత్రం వస్తున్నారంటే తనిఖీ సమాచారం ముందే లీకై ఉండవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
కలెక్టరేట్ ముట్టడి
ఆదిలాబాద్ అర్బన్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ టీవీవీ నాయకులు, కళాశాలల విద్యార్థులు గురువారం కలెక్టరేట్ ముట్టడించారు. కలెక్టరేట్‌లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ప్రధాన గేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టీవీవీ జిల్లా అధ్యక్షుడు రాహుల్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రవేశపెడుతామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు దాని ఊసేత్తడం లేదని ఆరోపించారు. కళాశాలలు ప్రారంభమైన నెలన్నర గడుస్తున్నా మధ్యాహ్న భోజనం అమలు చేయడం లేదని పేర్కొన్నారు. కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఇబ్బందులను దష్టిలో ఉంచుకుని మరుగుదొడ్లు నిర్మించాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్యను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి విద్యార్థులు, నాయకులు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం కలెక్టర్ ఎం.జగన్మోహన్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీవీవీ నాయకులు వసంత్, సాగర్, సతీష్, వంశీ, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎస్సీ గురుకుల కాలేజీల్లో ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: తమ గురుకులాల పరిధిలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి(2016-17) ఆన్లైన్లో ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. రిజర్వేషన్ల నిబంధనలను పాటిస్తూ జిల్లాల వారీగా రూపొందించే మెరిట్ జాబితాకు అనుగుణంగానే విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. కాలేజీలను కూడా మెరిట్ ఆధారంగానే కేటాయిస్తారని, ఇందుకు ఎలాంటి కౌన్సెలింగ్ ఉండదని స్పష్టంచేశారు. కేవలం ఆన్లైన్ దరఖాస్తులనే ఆమోదిస్తామని, విడిగా ఇచ్చే దరఖాస్తులను స్వీకరించేది లేదన్నారు. దీనికై ఠీఠీఠీ.్టటఠీట్ఛజీట.్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తును చేసుకోవాలని పేర్కొన్నారు. -
లెక్చరర్లు లేరు!
- జూనియర్ కాలేజీల్లో 3,177 పోస్టులు ఖాళీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సగానికిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంజూరైన 4,552 పోస్టులకుగాను 3,177 ఖాళీగానే ఉన్నాయి. కేవలం 1,375 మంది మాత్రమే రెగ్యులర్ లెక్చరర్లు పని చేస్తున్నారు. 2007-08 సంవత్సరంలో ప్రారంభించిన మరో 69 జూనియర్ కాలేజీల్లో 743 అధ్యాపక పోస్టులు మంజూరు చేయాల్సి ఉంది. ఈ వివరాలను విద్యాశాఖ రూపొందించిన నివేదికలో పేర్కొంది. డిగ్రీ కాలేజీల్లోనూ అదే తీరు రాష్ట్రంలో 130 ప్రభుత్వ, 68 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు ఉండగా వాటిల్లో 3,007 మంజూరైన పోస్టులు ఉన్నాయి. ఇందులో 1,760 పోస్టులకు రెగ్యులర్ లెక్చరర్లు పనిచేస్తుండగా 1,247 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోపైపు 2007-08 సంవత్సరంలో ప్రారంభించిన 59 కొత్త డిగ్రీ కాలేజీల్లోనూ 134 పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది. ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల్లో రెగ్యులర్ అధ్యాపకులను నియమించకపోవడం వల్ల డిగ్రీ కాలేజీలు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు పొందలేకపోతున్నాయి. ఈ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని న్యాక్ ఇదివరకే స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద నిధులను ఇవ్వాలన్నా ఖాళీలను భర్తీ చేయాల్సిందేన ని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఇవీ సమస్యలు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అనేక కాలేజీలు విద్యను అందించలేకపోతున్నాయి. విద్యార్థి కేంద్రంగా అధ్యాపకులు వారి సామర్థ్యాలను మెరుగు పరుచుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో 52 కాలేజీలకు సొంత భవనాలు లేవు. కాలేజీలను మౌలిక సదుపాయల కొరత పీడిస్తోంది. దీంతో యూనివర్సిటీల్లో శాశ్వత అనుబంధ గుర్తింపు పొందలేకపోతున్నాయి. పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ మౌలిక సదుపాయాల కొరత, భవనాల సమస్య ఉంది. గత రెండేళ్లలో 14 కొత్త పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం మంజూరు చేసినా వాటిల్లో 320 మంది బోధన సిబ్బందిని మంజూరు చేయలేదు. ఉన్నత విద్యలో పెరిగిన విద్యా సంస్థలు ఉన్నత విద్యార ంగంలో విద్యా సంస్థల సంఖ్య పెరుగుతున్నా నాణ్యత ప్రమాణాలు అదే స్థాయిలో పెరగడం లేదు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో ఈ దుస్థితి నెలకొంది. సాంకేతిక విద్యా నిబంధనల ప్రకారం ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్, ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు (1:2:6) ఉండాలి. దీని ప్రకారం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 33,706 మంది సిబ్బంది అవసరం ఉంది. ఇందులో ఎంటెక్ అర్హత కలిగిన 22,470 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 11,236 అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు కావాలి. కానీ రాష్ట్రంలో ప్రొఫెసర్ల సంఖ్య తక్కువగా ఉంది. 2015-16 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 171 ఇంజీనరింగ్ కాలేజీల్లో 22, 470 మంది సిబ్బంది అవసరమున్నా కేవలం 15,152 మంది మాత్రమే ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లోనూ అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉండటంతో పరిశోధనలు లేకుండా పోయాయి. 11 యూనివర్సిటీల్లో 2,400కుపైగా అధ్యాపక పోస్టులు ఉంటే 1,100కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
అభద్రత అంచున..బోధన
దశాబ్దాల సర్వీసున్నా తప్పని దిగులు రెన్యువల్స్ పూర్తిచేయని సర్కారు 4నెలలుగా అందని జీతాలు కాంట్రాక్టు లెక్చరర్లతో ఇబ్బందులు శ్రీకాకుళం న్యూకాలనీ:ప్రభుత్వ లెక్చరర్లతో సమానంగానే విధులు నిర్వర్తిస్తుంటారు. వారికి ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని అర్హతలు, అనుభవం,ప్రతిభ ఉన్నప్పటికీ కాంట్రాక్ట్ లెక్చరర్ల(సీఎల్స్)పై రాష్ట్రప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. 2015-16 విద్యాసంవత్సరానికి డిసెంబర్ 31వరకే రెన్యువల్స్ చేశారు. ఈ తేదీ ముగిసినా ఇప్పటివరకూ రెన్యువల్స్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు జారీకాలేదు. దీంతో సీఎ ల్స్ అయోమయంలో ఉన్నారు. 4నెలలుగా వీరికి జీతాలు కూడా అందడం లేదు. 470 మంది వరకు సీఎల్స్.. జిల్లాలోని 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. 12 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. జూనియర్ కళాశాలల్లో 390 మంది, డిగ్రీ కళాశాలల్లో దాదాపు 70 మంది వరకు జనరల్ సబ్జెకులకు, ఒకేషనల్ కోర్సుల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. ఇందులో 120 మంది మహిళలు ఉన్నారు. మెజారిటీ సీఎల్స్ 8 ఏళ్లకుపైబడి నుంచి పనిచేస్తున్నారు. కనీసం 50 శాతం మంది దశాబ్దం పూర్తిచేసుకున్నవారు సైతం ఉన్నారు. గతంలో పార్డుటైం, గంటల ప్రాతిపదికన ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకులను తీసుకునేవారు. కాంట్రాక్ట్ వ్యస్థకు బీజం 2000లో అప్పటి ప్రభుత్వం పార్ట్‌టైం స్థానంలో కాంట్రాక్టు వ్యవస్థకు బీజం వేశారు. ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు గుర్తుచేస్తున్నారు. అక్కడి నుంచి వారి కష్టాలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం రూ.నెలకు 18వేలు చెల్లిస్తున్నా షరతులుపేరిట నరకయాతన చవిచూస్తున్నామని సీఎల్స్ వాపోతున్నారు. ఇన్నేళ్గు పనిచేస్తున్నా ఇన్సూరెన్స్, పిఎఫ్, గ్రాట్యూటీ వంటి సౌకర్యాలు లేవు. కనీసం భద్రత లేని ఉద్యోగాలతో మానసిక క్షోభను అనుభవిస్తున్నామని వీరంతా ఆందోళన చెందతున్నారు. రెన్యువల్స్ గడువు ముగిసినా.. 2015-16 విద్యాసంవత్సరానికి సీఎల్స్‌కు డిశంబర్ 31వరకే రెన్యువల్స్ చేశారు. గడువు ముగిసినా దీనిపై ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు పాఠాలు బోధిస్తునే మరోపక్క అభద్రతాబావానికి గురవుతున్నారు. తెలంగాణాలో మాదిరి రెగ్యులర్ చేయాలి ఐదేళ్లు అనుభవం ఉన్న కాంట్రాక్టు లెక్చలర్లును తెలంగాణా రాష్ట్రంలో రెగ్యులర్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం జీవోలను విడుదలచేసింది. పొరుగు రాష్ట్రంలో అమలవుతున్న విధానం ఇక్కడెందుకు వీలుకాదు. రెన్యువల్స్‌ను పొడిగిస్తున్నట్లు వెంటనే ప్రకటించాలి. బకాయి జీతాలు విడుదలచేయాలి. - డి. అక్ష్మున్నాయుడు, అధ్యక్షుడు, జిల్లా కాంట్రాక్టు లెక్చలర్లు సంఘ ప్రతినిధి చంద్రబాబు హామీని నిలబెట్టుకోవాలి రెగ్యులరైజ్ చేస్తానని 2014 తన ఎన్నికల మేనిఫేస్టోలో చంద్రబాబు హామీఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పలుమార్లు విన్నావించాం. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. చంద్రబాబు తన హామీని నిలబెట్టుకుని మాకు న్యాయం చేయాలి. - కె.బాలకృష్ణ, జిల్లా కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షులు క్రమబద్ధీకరణ ప్రభుత్వ నిర్ణయం రెన్యువల్స్ గడువు ముగిసినమాట వాస్తవమే. సీఎల్స్ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కజిల్లాకే పరిమితమైనదికాదు. రాష్ట్రవ్యాప్త సమస్య. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. బకాయి జీతాలకు చర్యలు తీసుకుంటాం. - ఆర్.పున్నయ్య, డీవీఈఓ, ఇంటర్మీడియెట్ విద్య -
జూనియర్ కళాశాలల్లో ఇక సీసీ కెమెరాలు
ఇంటర్ బోర్డు ఆర్జేడీమల్హల్రావు రామాయంపేట: వచ్చే విద్యా సంవత్సరంలోగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాలతోపాటు బయో మెట్రిక్ సిస్టం ఏర్పాటు చేయనున్నట్టు ఇంటర్మీడియెట్ బోర్డురీజినల్ జూయింట్ డెరైక్టర్ (ఆర్జేడీ) మల్హల్రావు పేర్కొన్నారు. మంగళవారం రామాయంపేటప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ప్రభుత్వ కళాశాలలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. సక్రమంగా విధులు నిర్వర్తించని లెక్చరర్లు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు విధిగా ప్రార్థనా సమయానికి కళాశాలకు రావాలని ఆదేశించారు. ఇంటర్ ఫలితాల మెరుగునకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. లెక్చరర్ల కొరతను అధిగమించడానికిగాను పార్ట్‌టైం ఉద్యోగులను నియమిస్తున్నట్టు ఆర్జేడీ తెలిపారు. -
14 నుంచి తెలుగు వర్సిటీ ప్రవేశ పరీక్షలు
హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలంగాణ ప్రాంతానికి ప్రకటించిన వివిధ కోర్సులకు ఈ నెల 14 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 14న ఎం.ఎ. తెలుగు, పి.హెచ్.డి తెలుగు, ఎం.ఎ సంగీతం, పి.హెచ్.డి తులనాత్మక అధ్యయనం కోర్సులకు పరీక్షలు జరుగుతాయి. 15న ఎం.సి.జె, ఎం.పి.ఎ రంగస్థల కళలు, పి.హెచ్.డి నృత్యం, పి.హెచ్.డి రంగస్థల కళలు, పి.హెచ్.డి. భాషా శాస్త్రం కోర్సులకు పరీక్షలు ఉంటాయి. 16 న ఎం.పి.ఎ జానపద కళలు, ఎం.ఎ. భాషాశాస్త్రం, పి.హెచ్.డి జ్యోతిష్యం కోర్సులకు హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలోనూ, 17న పి.హెచ్.డి జానపద గిరిజన విజ్ఞానం కోర్సుకు వరంగల్ పీఠంలోనూ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఎం.ఎ సంగీతం, ఎం.పి.ఎ రంగస్థల కళలు, జానపద కళల కోర్సులకు మధ్యాహ్నం ప్రాయోగిక పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు చివరి గడువు 17 హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో మూడేళ్ల డిగ్రీ కోర్సు (బీఏ, బీకాం, బీఎస్సీ)లో చేరేందుకు ఈ నెల 17 ఆఖరు తేదీ అని హైదరాబాద్‌లోని విద్యానగర్ వర్సిటీ స్టడీసెంటర్ కో ఆర్డినేటర్ వి.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధించి వారు, ఇంటర్మీడియెట్, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన వారు ప్రవేశాలకు అర్హులని చెప్పారు. వివరాలకు విద్యానగర్‌లోని స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలోని అంబేడ్కర్ వర్సిటీ అధ్యయన కేంద్రంలోగాని, 040 2005 1557 నంబర్లో గాని సంప్రదించాలన్నారు. 18న ఓయూసెట్ ఎంఈడీ కౌన్సెలింగ్ హైదరాబాద్: ఓయూసెట్-2015లో భాగంగా ఎంఈడీ కోర్సులో ప్రవేశానికి తొలిసారిగా ఈ నెల 18న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొ.గోపాల్‌రెడ్డి తెలిపారు. ఉస్మానియా, పాలమూరు వర్సిటీల్లోని 242 సీట్ల భర్తీకి ఓయూ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో ఈ నెల 18న కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చు. ‘దసరా’లో క్లాసులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు సాక్షి, హైదరాబాద్: ఈనెల 10 నుంచి ప్రారంభం కానున్న దసరా సెలవుల్లో జూనియర్ కాలేజీలు తరగతులు నిర్వహించినా, విద్యా సంబంధ కార్యక్రమాలు జరిపినా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10 నుంచి 25 వరకు అన్ని కాలేజీలు సెలవులు ప్రకటించాలని స్పష్టం చేశారు. మెదక్‌లో ఫారెస్ట్ కాలేజీకి రూ. 45.79 కోట్లు సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా నర్సంపేటలోని ములుగు ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిసరాల్లో ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు రూ.45.79 కోట్లు మంజూరు చేస్తూ పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ ఇన్స్టిట్యూట్లో బీఎస్సీ (ఫారెస్ట్రీ), ఎమ్మెస్సీ (ఫారెస్ట్రీ), పీహెచ్డీ (ఫారెస్ట్రీ) కోర్సులు ఆఫర్ చేస్తారు. కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, డెహ్రాడూన్ అనుబంధంగా ఈ ఇన్స్టిట్యూట్ పనిచేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
27న జూనియర్ కళాశాలల బంద్
ఒంగోలు : విద్యా వ్యాపారాన్ని అరికట్టాలనే డిమాండ్‌తో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీన జూనియర్ కళాశాలల బంద్ నిర్వహించనున్నట్లు ఏబీవీపీ ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంశీకృష్ణ తెలిపారు. అనుమతి లేని కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల అనుబంధ హాస్టళ్లను మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వమే నిర్దిష్ట ఫీజుల విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ మేరకు బంద్‌ను చేపడుతున్నట్లు వివరించారు. -
అందుబాటులో లేని ఇంటర్ పుస్తకాలు
♦ ‘ద్వితీయ’ ఆర్ట్స్ విద్యార్థులకు ప్రారంభం కాని బోధన ♦ సిలబస్‌లో మార్పుతో ఇంకా ప్రారంభం కాని ముద్రణ ♦ పరిశీలనలోనే నమూనా పుస్తకాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కాలేజీలు ఈనెల 1న ప్రారంభం అయినా పాఠ్య పుస్తకాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. పుస్తకాల ముద్రణ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆర్ట్స్ గ్రూపుల్లో పాఠ్యాంశాల బోధన జరగడం లేదు. దీంతో విద్యార్థులు కాలేజీలకు వచ్చి కూర్చొని వెళ్లిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఈసారి ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్ గ్రూపుల పుస్తకాల్లో సిలబస్‌ను మార్చేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. కానీ, ఈ మార్పులను సకాలంలో పూర్తి చేయకపోవడంతో దాదాపు 3 లక్షల మంది ద్వితీయ సంవత్సర ఆర్ట్స్ గ్రూపు విద్యార్థులకు పుస్తకాలు లేని పరిస్థితి ఏర్పడింది. విద్యాశాఖ సిలబస్‌ను ఏప్రిల్ నెలలో ఖరారు చేసింది. ఆ తరువాత పుస్తకాల రచన కోసం తెలుగు ఆకాడమీకి పంపించింది. అకాడమీ నెల రోజుల్లో పుస్తకాలను రాయించి, ఇంటర్మీడియెట్ బోర్డు, విద్యాశాఖ ఆమోదం కోసం పంపించింది. వారు అనుమతి ఇచ్చాకే ముద్రణను ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో ఇంకొన్నాళ్లు విద్యార్థులు పుస్తకాలు లేకుండానే కాలేజీలకు ఊరకే వెళ్లి రావాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులకు ఏదో ఒకటి చెబుతున్నా.. ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం బోధన ప్రారంభమే కాలేదు. మరోవైపు పాఠశాలల పుస్తకాల్లో చేసిన మార్పుల తరహాలోనే ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర ఆర్ట్స్ గ్రూపుల పుస్తకాల్లోనూ మార్పులు చేశారు. అంతర్జాతీయ, జాతీయ చరిత్రతోపాటు తెలంగాణ చరిత్రపైనా కొత్తగా పాఠాలు పెట్టారు. పొలిటికల్ సైన్స్, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు, తెలంగాణలో పంటలు, వాణిజ్య పరిస్థితులపై పాఠ్యాంశాలను పొందుపరిచినట్లు తెలిసింది. ప్రస్తుతం నమూనా పుస్తకాలను విద్యాశాఖ పరిశీలన జరుపుతోంది. వివాదాలకు తావులేకుండా పాఠ్యాంశాలను క్షుణ్ణంగా పరిశీలన జరుపుతోందని, అందుకే ఆలస్యం అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
140 కోట్లతో జూనియర్ కాలేజీల అభివృద్ధి
డీఎస్సీపై తగు సమయంలో నిర్ణయం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల బలోపేతానికి పక్కా చర్యలు చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రూ. 140.75 కోట్లతో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 402 కాలేజీలుంటే అందులో 332 కాలేజీలకు సొంత భవనాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలో 70 కాలేజీలకు సొంత భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మరో 15 కాలేజీలకు స్థలాలు లేవని, దీంతో అవి స్కూళ ్ల ఆవరణలో కొనసాగుతున్నాయన్నారు. వాటికి స్థలాలను సేకరించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ముందుగా ఆర్ఐడీఎఫ్-20 కింద రూ. 58.50 కోట్లతో 26 కాలేజీలకు (ఒక్కో దానికి రూ. 2.25 కోట్లు) సొంత భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేశామన్నారు. మిగతా కాలేజీలకు ఆర్ఐడీఎఫ్-21లో సొంత భవన నిర్మాణాలను ప్రతిపాదించామన్నారు. అవీ త్వరలోనే వస్తాయని, మొత్తంగా ఈ పనులను ఏడాదిలో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆర్ఐడీఎఫ్-20లోనే 69 కాలేజీలకు అదనపు తరగతి గదులను నిర్మిస్తున్నామన్నారు. స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా 177 జూనియర్ కాలేజీల్లో బాలికలు, బాలురకు వేర్వేరుగా టాయిలెట్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. కొత్త కాలేజీల మంజూరుపై మరో 15 రోజుల్లో పరిశీలించి అవసరాలను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లు కాకుం డా మరో 600 ఖాళీలు ఉన్నాయన్నారు. అయితే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై స్పష్టత వచ్చాక మిగతా వాటిపై నిర్ణయం ఉంటుందని, ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లలో ఇవీ ఉండే అవకాశం ఉందన్నారు. వర్సిటీల చట్టం రూపకల్పన తరువాత వీసీలను నియమిస్తామని, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, కొత్త డీఎస్సీ ప్రకటనపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. -
జూనియర్ కళాశాలలకు సెలవులు పొడిగింపు
గుంటూరు: భగభగమండుతున్న ఎండల దృష్ట్యా ప్రభుత్వ జూనియర్ కళాశాలల వేసవి సెలవులను మరో వారంపాటు పొడిగిస్తూ ఏపీ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అకడమిక్ కేలండర్ ప్రకారం జూన్ ఒకటో తేదీన కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, వేసవి దృష్ట్యా జూన్ 8వ తేదీన ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉందన్న విషయాన్ని ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు గమనించాలని ఇంటర్ బోర్డు పేర్కొంది. -
నేటి నుంచి జూనియర్ కాలేజీలకు సెలవులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు శుక్రవారం ముగియడంతో ఇంటర్మీడియెట్ బోర్డు శనివారం నుంచి జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను ప్రకటించింది. ఈనెల 28 నుంచి మే 31వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు, ప్రైవేటు, ఎయిడెడ్ తదితర అన్ని యాజమాన్య కాలే జీలకు ఈ సెలవులు వర్తిస్తాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి శైలజా రామయ్యార్ తెలిపారు. జూన్ 1వ తేదీన తిరిగి కాలేజీలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఈ షెడ్యూలును అన్ని కాలేజీలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. వేసవి సెలవుల సమయంలో ముఖ్యంగా ప్రైవేటు కాలేజీలు తరగతులు నిర్వహించడం, ప్రవేశాలు చేపట్టడం వంటివి చేస్తే యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. -
12 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు
తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవుల్లో మార్పు జరిగింది. ఇంతకుముందు కేవలం పండుగ మూడు రోజులు మాత్రమే సెలవులు ఉంటాయని చెప్పినా.. మళ్లీ ఇప్పుడు మార్చి వారం రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈనెల 12వ తేదీ సోమవారం నుంచి 18వ తేదీ ఆదివారం వరకు సంక్రాంతి సందర్భంగా సెలవులు ప్రకటించారు. దీంతో ముందు ఆదివారంతో కలుపుకొంటే మొత్తం 8 రోజుల పాటు జూనియర్ కళాశాలల విద్యార్థులకు సెలవులు వచ్చినట్లయింది. అయితే, కొన్ని కార్పొరేట్ కళాశాలలు మాత్రం ముందుగానే ఆ వారం రోజులకు సంబంధించి ప్రాజెక్టు వర్కులు కూడా ఇచ్చేశారు. -
యూనోఫామ్
దామరచర్ల : జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు విద్యాసంవత్సరం ముగింపు దశకు వచ్చినా యూనిఫామ్‌లు అందలేదు. దీంతో వారు పాత దుస్తులతోనే పాఠశాలలకు వెళ్తున్నారు. కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థులు రంగు దుస్తుల్లోనే తరగతులకు హాజరవుతున్నారు. పాతవి చినిగిపోవడం..కొత్తవి ఇవ్వకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ కింద నాలుగు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇవి దామరచర్ల, తుంగతుర్తి ,మిర్యాలగూడ, దేవరకొండలో ఏర్పాటుచేశారు. అదే విధంగా దామరచర్ల, మిర్యాలగూడలో రెండు జూనియర్ కశాశాలలు, జిల్లా పరిధిలో 9 కస్తూరీబాగాంధీ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. గురుకుల పాఠశాలల్లో సుమారు 3వేల మంది, కళాశాలల్లో 850 మంది, కస్తూరిబా గాంధీ పాఠశాలల్లో 1500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. యూనిఫామ్ అందించడంలో తీవ్ర జాప్యం ట్రైబల్ వెల్ఫేర్ సంస్థ ద్వారా ఆయా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు యూనిఫామ్‌లు అందించాల్సి ఉంది. 2014-15 విద్యా సంవత్సరంలో డ్రెస్‌లు ఇంతవరకు అందలేదు. దుస్తులకు కావాల్సిన బట్ట (క్లాత్) తానులను విద్యార్థుల సంఖ్యను బట్టి ఆయా పాఠశాలలకు, కళాశాలలకు అందజేస్తారు. ఈ విద్యాసంవత్సరం క్లాత్ అందజేయడంలో జాప్యం జరిగింది. దసరా సెలవుల ముందు పాఠశాలలకు అందజేశారు. దసరా సెలవులు 15 రోజులు రావడం, అదే విధంగా ట్రైబల్‌కు సంబంధించిన దర్జీతోనే కుట్టించాలన్న నిబంధనలు విధించారు. దీంతో మరికొంత జాప్యం జరిగింది. పర్సెంటేజీల బెడద..? డ్రెస్‌లు గిరిజన దర్జీలే కుట్టాల్సి ఉంది. జిల్లాలో గిరిజన దర్జీలు ఎక్కువగా లేరు. దీంతో ట్రైబల్ వారితో టెండర్లు వేయించి, మరొకరు కుట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సిబ్బంది కొందరు పర్సెంటేజీలు ఆశించడంతో దర్జీలు కుట్టేందుకు ముందుకు రాలేదన్న విమర్శలున్నాయి. కుట్టుకూలి జత దుస్తులకు రూ.40 ఇస్తున్నారు. బయటికంటే ఈ రేటు చాలా తక్కువ. దీంతో వచ్చే ఆదాయం కంటే పర్సెంటేజీలు ఎక్కువ అడుగుతున్నారన్న కారణంతో దర్జీలు కొందరు కుట్టేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులు రంగు దుస్తుల్లో.. జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దామరచర్ల బాలికల జూనియర్ కళాశాల, మిర్యాలగూడ అవంతి బాలుర కళాశాలల్లో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో ప్రవేశించిన విద్యార్థులకు యూనీఫామ్‌లు లేవు. దీంతో వారు రంగు దుస్తుల్లోనే తరగతులకు హాజరవుతున్నారు. అదేవిధంగా గురుకుల పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులది కూడా ఇదే పరిస్థితి. యూనిఫామ్ అందించడంలో జాప్యం నిజమే : మాణిక్యప్ప, ప్రిన్సిపాల్ గురుకుల జూనియర్ కళాశాల, దామరచర్ల సంస్థ వారు డైస్ క్లాత్ అందించడంలోనే జాప్యమైంది. డ్రెస్ కుట్టేందుకు గిరిజన దర్జీలకు అవకాశం ఇచ్చారు. వారు ముందుకు రావడంలోనూ ఆలస్యమైంది. పాఠశాలల, కళాశాలల ఆవరణలోనే డ్రెస్‌లు కుడుతున్నారు. మరో 15 రోజుల్లో యూనీఫామ్‌లు విద్యార్థులకు అందజేస్తాం. యూనిఫామ్‌లు త్వరగా అందించాలి నూతన యూనిఫామ్‌లు లేక ఇబ్బందిగా ఉంది. వెంటనే దుస్తులు అందించేలా చర్యలు తీసుకోవాలి. డిసెంబర్ ముగియవస్తుంది. ఇంతవరకు యూనీఫామ్‌లు లేవు. మార్చి 9నుంచి వార్షిక పరీక్షలే. నూతన యూనీఫామ్ కోసం ఎదురుచూస్తున్నాం. నూతన సంవత్సరం నాటికైనా దుస్తులు అందేలా చూడాలి. - సంగీత, విద్యార్థిని, దామరచర్ల -
25 నుంచి జూనియర్ కాలేజీలకు సెలవులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి అక్టోబర్ నెల 7వ తేదీ వరకు జూనియర్ కాలేజీలకు సెలవు దినాలుగా ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలు, ఇంట ర్మీడియెట్ కోర్సులు నిర్వహించే కాంపొజిట్ డిగ్రీ కాలేజీలు ఈ సెలవులను అమలు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కాలేజీలు తిరిగి 8వ తేదీ నుంచి కొనసాగుతాయని పేర్కొంది. ఇక మిగిలిన అర్ధవార్షిక పరీక్షలను 8వ తేదీ నుంచి నిర్వహించాలని స్పష్టం చేసింది. దసరా సెలవుల్లో మార్పు చేసిన నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సెలవులైన జనవరి 10, 11 తేదీల్లోనూ కాలేజీలు పనిచేస్తాయని వివ రించింది. ఈ షెడ్యూలును తెలంగాణలోని అన్ని జూనియర్ కళాశాలల యాజమాన్యాలు అమలు చేయాలని, సెలవుల్లో తరగతులు నిర్వహించరాదని స్పష్టం చేసింది.