సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు శుక్రవారం ముగియడంతో ఇంటర్మీడియెట్ బోర్డు శనివారం నుంచి జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను ప్రకటించింది. ఈనెల 28 నుంచి మే 31వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు, ప్రైవేటు, ఎయిడెడ్ తదితర అన్ని యాజమాన్య కాలే జీలకు ఈ సెలవులు వర్తిస్తాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి శైలజా రామయ్యార్ తెలిపారు. జూన్ 1వ తేదీన తిరిగి కాలేజీలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఈ షెడ్యూలును అన్ని కాలేజీలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. వేసవి సెలవుల సమయంలో ముఖ్యంగా ప్రైవేటు కాలేజీలు తరగతులు నిర్వహించడం, ప్రవేశాలు చేపట్టడం వంటివి చేస్తే యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.