సెకండియర్‌లో ప్రైవేటుకు మించి గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో ఉత్తీర్ణత
టాపర్ల జాబితాలో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకూ చోటు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో ప్రైవేటు కాలేజీలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ కాలేజీలు సత్తా చాటాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం తగ్గినా అత్యధిక మార్కులు కైవసం చేసుకున్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ గురుకులాలు, కేజీబీవీలు ప్రైవేటు కాలేజీలను మించి ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుంచి 77,022 మంది పరీక్ష రాస్తే 37,842 (49.13%) పాసయ్యారు.
గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల నుంచి 80,331 మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయగా 59,530 (74.11%) మంది పాసయ్యారు. ప్రైవేటు కాలేజీల నుంచి 3,44,724 మంది పరీక్షలు రాస్తే వారిలో 2,23,911 (65.24%) మందే పాసవడం గమనార్హం. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థుల్లో కొందరు రాష్ట్రంలోనే అత్యధిక మార్కులు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment