marks
-
‘ప్రత్యేక’ విద్యార్థులకు పాస్‌మార్కులు 10
సాక్షి, అమరావతి: మానసిక వైకల్యం గల విద్యార్థులకు పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులను పాఠశాల విద్యాశాఖ కుదించింది. ఇప్పటి వరకు 35 ఉన్న పాస్ మార్కులను 10 మార్కులకు తగ్గించింది. వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నుంచి ఈ విధానం అమలు చేయనుంది. 4 నుంచి ఎస్జీటీలకు శిక్షణ ఆంధ్రాస్ లెరి్నంగ్ ట్రాన్స్ఫార్మేషన్ (సాల్ట్) ప్రోగ్రామ్‌లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు నిర్వహంచే రెండోవిడత శిక్షణ వచ్చేనెల 4 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 34 వేలమంది ఎస్జీటీలకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఇందులో ఇప్పటికే ఒకవిడత శిక్షణ పూర్తయిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 9 కేంద్రాల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీలో మొత్తం 14 విడతల్లో ఈ శిక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. -
విచారణ జరిపించాలి..
డాక్టర్ కావాలని ఎంతో కష్టపడి చదివి ‘నీట్’ పరీక్షకు హాజరైన లక్షలాది విద్యార్థుల ఆశలపై ఆ పరీక్షల ఫలితాలు నీళ్లు చల్లాయి. ఎన్నడూ లేనివిధంగా 67 మందికి 720 మార్కులకు 720 రావడం, అలా వచ్చినవారిలో పలువురు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడం విద్యార్థులనే కాక, వారి తల్లి తండ్రులనూ నిరుత్తరులను చేసింది.దీనికి తోడు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వందలాదిమందికి పరీక్షానిర్వహణ సంస్థ ఎన్టీఏ గ్రేస్ మార్కులను ఇవ్వడం కూడా విమర్శలకు దారితీసింది. ప్రజల ఆందోళనల నేపథ్యంలో చివరికి గ్రేస్ మార్కులను ఎన్టీఏ ఉపసంహరించుకుంది. కాని, పరీక్షల నిర్వహణలో మాత్రం ఎటువంటి అవకతవకలూ జరగలేదని అనడమే విడ్డూరంగా ఉంది.ప్రతిసారీ విద్యార్థులతో ‘పరీక్షా పే’ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని... కీలకమైన నీట్ పరీక్షపై ఆరోపణలు, అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ మాట్లాడకపోవడం విద్యార్థుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. నీట్ పరీక్ష మాత్రమే కాక దేశంలోని ఎన్నో పోటీ పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది. తాజాగా బయటపడ్డ వివాదస్పద అంశాల కారణంగా దానిపై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది.ప్రతిసారీ ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువగా ర్యాంక్‌లు రావడం, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తక్కువ ర్యాంకులు రావడంపై దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అనేక అనుమానాలు కల్గుతున్నాయి.ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి అవకతవకలు ఉన్నవని తేలితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా లబ్ధిపొందిన వారిపైనా చర్యలు తీసుకోవాలి. నీట్లో జరిగిన అక్రమాల కారణంగా కష్టపడి చదివిన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. – గడ్డం శ్యామ్, పీడీఎస్‌యూ తెలంగాణ ఉపాధ్యక్షుడు -
‘నీట్’పై ఉన్నత కమిటీ
న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)–అండర్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశ పరీక్షలో ఈ ఏడాది పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా 67 మంది అభ్యర్థులకు మొదటి ర్యాంకు రావడంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు అభ్యర్థులున్నారు. అందుకే నీట్–2024ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 1,500 మందికిపైగా విద్యార్థులకు కేటాయించిన గ్రేసు మార్కులపై పునఃసమీక్ష చేయడానికి యూజీసీ మాజీ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కేంద్ర విద్యా శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబో«ద్‌కుమార్ సింగ్ శనివారం వెల్లడించారు. కమిటీ వారంలోగా ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుందని అన్నారు. గ్రేసు మార్కులతో అర్హత ప్రమాణాలపై ప్రభావం ఉండదన్నారు. కొందరు అభ్యర్థుల ఫలితాలను పునఃసమీక్ష చేయడం వల్ల ప్రవేశాల ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగదని స్పష్టం చేశారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరగలేదన్నారు. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో మార్పులు, కొన్ని సెంటర్లలో ఇచి్చన గ్రేసు మార్కుల కారణంగానే అభ్యర్థులకు ఈ ఏడాది ఎక్కువ మార్కులొచ్చాయని వివరించారు. ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలా వద్దా అనేది కమిటీ తేలుస్తుందన్నారు. పేపరు లీక్ కాలేదన్నారు. నీట్ విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. గ్రేసు మార్కుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, అందుకే చాలామందికి ఫస్టు ర్యాంకు వచి్చందని తల్లిదండ్రులు ఆరోపిస్తుండటం తెలిసిందే. ఆరు సెంటర్లలో పరీక్ష నిర్వహణలో జాప్యం జరగడంతో అక్కడ రాసిన విద్యార్థులకు గ్రేసు మార్కులు ఇచ్చారు. మేఘాలయా, హరియాణాలోని బహదూర్గఢ్, ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, బాలోద్, గుజరాత్‌లోని సూరత్‌తోపాటు చండీగఢ్‌లో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈసారి దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీట్ రాశారు. ఈ నెల 4న ఫలితాలు వెల్లడయ్యాయి. -
‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎవరి రహస్యాలూ దాగడం లేదు. ఓ కుర్రాడు తన తండ్రికి సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కుర్రాడు తండ్రి భద్రంగా దాచుకున్న అతని 10వ తరగతి మార్కు షీట్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఇందులో అన్ని సబ్జెక్టుల్లో తండ్రి ఫెయిల్ అయ్యాడు. ఆ మార్క్ షీట్ ఫోటోకు క్యాప్షన్‌గా ‘తన తండ్రి మార్క్ షీట్ దొరికింది’ రాశాడు.ఆ కుర్రాడు వీడియోలో ‘మా నాన్న నాతో తరచూ పాస్ కావాలని చెబుతుంటారని, అయితే ఇప్పుడు చూడండి మా నాన్న మార్క్స్‌షీట్.. అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. ఈ వీడియోను చూసినవారంతా నవ్వకుండా ఉండలేకపోతున్నారు.ఈ మార్క్‌షీట్‌ను @desi_bhayo88 పేరిట సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఈ పోస్టును ఇప్పటివరకూ ఐదు లక్షల మంది చూడగా, ఐదు వేల మంది లైక్ చేశారు. ఈ పోస్ట్‌పై పలువురు కామెంట్లు కూడా చేశారు. ఒక యూజర్ ఇప్పటితో పోల్చిచూస్తే సీబీఎస్ఈ బోర్డులో తండ్రి ఫెయిల్ అయిన మార్కులు 90 శాతానికి సమానం అని రాశారు. మరొకరు ఫెయిల్ అయితే ఏమవుతుందో తెలుసు కనుకనే పాస్ కావాలని చెప్పారని రాశారు. Pitaji ki marksheet mil gayi 😂 pic.twitter.com/3dXn0yKJh1— Desi Bhayo (@desi_bhayo88) April 19, 2024 -
మార్కులు చూసి మూర్చబోయిన విద్యార్థి.. ఐసీయూలో చేరిక
మీరట్: పదో తరగతి పరీక్షల్లో తనకు వచ్చిన మార్కులు చూసి మూర్చపోయి ఐసీయూలో చేరాడో విద్యార్థి. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థి తనకు బోర్డు పరీక్షల్లో చెప్పుకోదగ్గ 93.5 శాతం మార్కులు రావడంతో ఉప్పొంగిపోయాడు. రిజల్ట్స్ చూసి కుప్పకూలిపోవడంతో ఐసీయూలో చేర్చవలసి వచ్చింది.ఉత్తర ప్రదేశ్ బోర్డ్ హైస్కూల్ లేదా 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఫలితాలను శనివారం ప్రకటించింది. 10వ తరగతి విద్యార్థులు 89.55 శాతం ఉత్తీర్ణత సాధించగా, 12వ తరగతి విద్యార్థులు 82.60 శాతం ఉత్తీర్ణత సాధించారు.మీరట్‌లోని మోడిపురం మహర్షి దయానంద్ ఇంటర్ కాలేజ్‌కు చెందిన అన్షుల్ కుమార్ తన పరీక్షలలో 93.5 శాతం మార్కులు సాధించాడు. అయితే, ఫలితాలను చూడగానే అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు అన్షుల్ తండ్రి, పోస్టాఫీసులో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేసే సునీల్ కుమార్ తెలిపారు. కాగా అన్షుల్ పరిస్థితి ప్రస్తుతం కుదటపడినట్లు తెలిసింది. -
ఫలితాల్లో సర్కార్ కాలేజీల సత్తా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో ప్రైవేటు కాలేజీలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ కాలేజీలు సత్తా చాటాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం తగ్గినా అత్యధిక మార్కులు కైవసం చేసుకున్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ గురుకులాలు, కేజీబీవీలు ప్రైవేటు కాలేజీలను మించి ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుంచి 77,022 మంది పరీక్ష రాస్తే 37,842 (49.13%) పాసయ్యారు.గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల నుంచి 80,331 మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయగా 59,530 (74.11%) మంది పాసయ్యారు. ప్రైవేటు కాలేజీల నుంచి 3,44,724 మంది పరీక్షలు రాస్తే వారిలో 2,23,911 (65.24%) మందే పాసవడం గమనార్హం. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థుల్లో కొందరు రాష్ట్రంలోనే అత్యధిక మార్కులు సాధించారు. -
పరీక్షల్లో మ్యాజిక్ చేసిన ట్విన్స్ : ఇలా కూడా ఉంటారా?
కర్ణాటకలోని హాసన్ ప్రాంతానికి చెందిన కవల అక్కాచెల్లెళ్లు మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. రెండు నిమిషాల తేడాతో పుట్టిన ట్విన్స్ చుక్కి, ఇబ్బని ఒకే పోలికలతో ఉంటారు. అంతేకాదు పరీక్షా ఫలితాల్లో కూడా ఒకేలా మార్కులు తెచ్చుకోవడం విశేషంగా నిలిచింది. కర్ణాటకలో విడుదలైన 12వ తరగతి పరీక్షలలో ఇద్దరికీ సమానంగా మార్కులు వచ్చాయి. 600 మార్కులకు గాను ఇద్దరూ 571 మార్కులు సాధించారు. అంతే కాదు గతంలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఇలాంటి మ్యాజిక్కే జరిగింది.ఇద్దరూ 625 మార్కులకు 620 మార్కులు తెచ్చు కున్నారు. దీంతే భలే అదృష్టం అంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. సాధారణంగా కవలలు ఒకేలాగా ఆలోచించడం, ఒకేసారి శారీరక సమస్యలు రావడం చూస్తాం. కానీ పరీక్షల్లో కూడా ఒకేలా మార్కులు రావడం అదృష్టం అంటూ వ్యాఖ్యానించారు. ఇద్దరికీ 97 శాతం మార్కులొస్తాయని ఆశించాం. కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించ లేదని పెద్ద అమ్మాయి అయినా చుక్కి సంతోషం ప్రకటించింది. తమకూ ఇది ఆశ్చర్యకరంగా ఉందని తెలిపింది. రెండేళ్ల క్రితం పదో తరగతిలో కూడా ఇలానే సమాన మార్కులు సాధించా మని చెప్పుకొచ్చింది. చుక్కి, ఇబ్బని కర్ణాటకలోని హసన్ నగరంలో ఎన్డిఆర్కె పియు కాలేజీలో 12వ తరగతిపూర్తి చేశారు. ప్రస్తుతం నీట్‌కోసం సిద్ధమవుతున్నారు. నీట్ పరీక్షలో వచ్చిన ఫలితాన్ని ఇంజనీరింగ్, మెడిసిన్ అనేది నిర్ణయించుకుంటారట. మీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడు తున్నారా..? అని ప్రశ్నించగా నా కంటే అక్క ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే నేను ఎలా సంతోషిస్తానో అక్క కూడా అంతే.. ఇద్దరికీ పోటీ ఏమీ లేదు అని చెప్పింది. కేవలం చదువులు మాత్రమే కాకుండా సంగీతం, నృత్యం, అలాగే ఆటల్లో కూడా ముందుంటాం అని చెప్పారు. ఇద్దరిదీ ఒకే ఆశయమట. అటు తండ్రి వినోద్ చంద్ర తన బిడ్డలు సాధించిన ఘనతపై ఆశ్చర్యాన్ని ప్రటకించారు. ఇది తనకు గర్వకారణమని చెప్పారు ఇబ్బానీ తన సోదరి కంటే భాషలలో మెరుగ్గా స్కోర్ చేసిందనీ, సైన్స్, మిగిలిన సబ్జెక్టులలో ఒకటి నుండి రెండు మార్కులే తేడా అని చెప్పారు. వాళ్ళు కలిసే పనులు చేసుకుంటారు స్నేహంగా ఉంటారు. కలిసే చదువుకుంటారు. ఒకవిధంగా చెప్పాలంటే ఇద్దరూ పుస్తకాల పురుగులు అని తెలిపారు చంద్ర ఒకింత గర్వంగా. -
ఉద్యోగులకు బాబు మార్క్ దగా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులు, ఇంక్రిమెంట్ల కోసం రాసే డిపార్ట్మెంటల్ టెస్టుల్లో వారు పాసవకుండా గత చంద్రబాబు సర్కారు అడ్డుకుంది. అందుకోసం ప్రత్యేకంగా జీవోను సైతం జారీ చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చే దాకా ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించిన అన్ని డిపార్ట్మెంటల్ టెస్టుల్లోనూ గరిష్టంగా 4 నుంచి 6 శాతం మాత్రమే పాసయ్యారంటే ప్రభుత్వ ఉద్యోగులపై చంద్రబాబుకున్న ప్రేమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఏపీపీఎస్సీ ఏటా రెండుసార్లు డిపార్ట్మెంటల్ టెస్టులు నిర్వహిస్తుంది. సరీ్వస్ కమిషన్ ద్వారా భర్తీ చేసిన పోస్టుల్లో చేరిన అభ్యర్థులు ప్రొబేషన్‌లో ఉంటారు. వారి ప్రొబేషన్ పూర్తవ్వాలంటే సరీ్వస్ టెస్ట్ పాసవ్వాలి. ఫెయిలైతే వారు ప్రొబేషన్‌లోనే కొనసాగుతారు. టెస్ట్ పాసైనవారు మాత్రం సీనియారిటీలోకి వెళ్లిపోతారు. అలాగే ఇతర డిపార్ట్మెంట్లలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందేందుకు కూడా డిపార్ట్మెంటల్ టెస్టు పాసవ్వాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు సరీ్వసులో సీనియారిటీలోనూ ముందుంటారు. జీవో నం.101తో ఉద్యోగులకు మేలు ప్రభుత్వ ఉద్యోగుల వయసు రీత్యా గతంలో డిపార్ట్మెంటల్ టెస్టులను ఆఫ్‌లైన్‌లో డ్రి స్కిప్టివ్ విధానంలో నిర్వహించేవారు. ఉద్యోగులు నిబంధనల ప్రకారం పుస్తకాలను చదివి, సరైన జవాబులను రాసేవారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం డిపార్ట్మెంట్ టెస్టును మల్టీపుల్ చాయిస్ విధానంలో మార్చి ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టింది. మైనస్ మార్కు విధానాన్ని తీసుకొచ్చి ప్రతి తప్పు సమాధానానికి 1/3 (0.33 శాతం) మార్కులు కోత విధించారు. దీంతో పెద్ద వయసులో ఉన్న ఉద్యోగులు ఆన్లైన్, మల్టీపుల్ చాయిస్ విధానంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని ఈ విధానంతో 2017–19 సంవత్సరాల మధ్య తాము ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కోల్పోతున్నామని, నెగిటివ్ మార్కుల విధానం రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. అయినా నాటి ప్రభుత్వం పట్టించుకున్నది లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక డిపార్ట్మెంటల్ పరీక్షల్లో మైనస్ మార్కులను తొలగించాలని అభ్యరి్థస్తూ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు సర్వీస్ కమిషన్‌కు అనేక విజ్ఞప్తులు అందజేశాయి. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసిన అనంతరం ఉద్యోగులకు మేలు చేసేందుకు మైనస్ మార్కుల విధానం రద్దు చేస్తూ జీవో నం.101 జారీ చేసింది. దీంతో ఇప్పుడు డిపార్ట్మెంటల్ టెస్టుల్లో 85 శాతం పైగా ఉత్తీర్ణత సాధించి, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా.. ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానాన్ని ప్రోత్సహించేందుకు చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారు. వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రాకుండా అడ్డుకునేందుకు 2017లో జీవో నం.55ను విడుదల చేసి డిపార్ట్మెంటల్ టెస్టుల్లో ‘మైనస్ మార్కు’లను అమల్లోకి తెచ్చారు. దాంతో గతంలో ఏటా సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ పరీక్షల్లో 60 శాతం మంది ఉత్తీర్ణులైతే.. జీవో నం.55 వచ్చాక ఆ సంఖ్య 4–6 శాతం మించలేదు. కొన్ని విభాగాల డిపార్ట్మెంటల్ టెస్టుల్లో ఒక్క శాతం కూడా పాసవలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ జీవోతో దాదాపు ఉద్యోగులు మూడేళ్లపాటు తమ పదోన్నతులు, ఇంక్రిమెంట్ అవకాశాలను కోల్పోయారంటే ఆశ్చర్యం కలుగుతుంది. -
మార్కుల డివిజన్ ప్రకటించం
సాక్షి, న్యూఢిల్లీ: 10, 12 తరగతుల మార్కుల ఫలితాల్లో ఇకపై డివిజన్, డిస్టింక్షన్‌ను ప్రకటించబోమని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పేర్కొంది. మెరిట్ లిస్టును ప్రకటించే విధానానికి గతంలోనే స్వస్తి చెప్పిన బోర్డు తాజాగా డివిజన్, డిస్టింక్షన్‌పై నిర్ణయాన్ని వెలువరించింది. ఈమేరకు సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ భరద్వాజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్కుల శాతాన్ని లెక్కించడం, ప్రకటించడం వంటివి బోర్డు ఇకపై చేయదని స్పష్టం చేశారు. ఉన్నత చదువులకు మార్కుల శాతం అవసరమనిపిస్తే సదరు సంస్థ వాటిని గణించుకోవచ్చని వివరించింది. ఒకవేళ విద్యార్థి అయిదుకు మించి సబ్జెక్టులను ఎంచుకున్నట్లయితే..వాటిలో అయిదు ఉత్తమ సబ్జెక్టులను గుర్తించడంపై సంబంధిత ఉన్నత విద్యా సంస్థ లేదా యజమాని నిర్ణయం తీసుకోవచ్చని భరద్వాజ్ తెలిపారు. 10, 12వ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు 2024 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మొదలవుతాయని తెలిపారు. -
హాజరుకూ మార్కులు!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులను కళాశాలకు రప్పించే విధానానికి ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టబోతోంది. సమగ్ర నిరంతర మూల్యాంకన విధానంలో భాగంగా వారి హాజరుకూ మార్కులివ్వనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఈ ఏడాది దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టగా, మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలోనే డిగ్రీ స్థాయిలోనూ దీన్ని అమలులోకి తేవాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. అకడమిక్ మార్కులే కాకుండా, వాస్తవ ప్రతిభను వెలికి తీయడం దీని ముఖ్యోద్దేశమని మండలి అధికారులు చెబుతున్నారు. మూల్యాంకన విధానంపై అధ్యయనానంతరం ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ)చేసిన సిఫారసులకు విశ్వవిద్యాలయాల వీసీలూ ఆమోదం తెలిపారు. ఐఎస్బీ అభిప్రాయ సేకరణ అధ్యయనంలో భాగంగా ఐఎస్బీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. 258 కాలేజీల అధ్యాపకుల మనోగతాన్ని పరిశీలించింది. 692 మంది విద్యార్థులతో మూల్యాంకన విధానంపై చర్చించింది. విద్యార్థి ప్రతిభను అంచనా వేయాలని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. థియరీ ద్వారా మార్కులు నిర్ణయించే ప్రస్తుత విధానం కన్నా సమర్థవంతమైంది కావాలని 82 శాతం తెలిపారు. ఉపాధి కోర్సుల అవసరం ఉందని 24 శాతం మంది పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం డిగ్రీ స్థాయిలో నైపుణ్యం పెంచాలని 38 శాతం తెలిపారు. డిగ్రీ క్లాసులకు హాజరయ్యేలా విద్యార్థులను ప్రోత్సహించాలని 76 శాతం అధ్యాపకులు పేర్కొన్నారు. కొత్త అంశాల అన్వేషణకు క్లాస్ రూం వేదిక కావాలని 84 శాతం మంది ఆకాంక్షించారు. ఈ అభిప్రాయాల ఆధారంగానే ఐఎస్బీ కొన్ని సిఫార్సులు చేసింది. ముఖ్యంగా హాజరు తప్పనిసరి చేయడమే కాకుండా, క్లాసు రూంలో వివిధ బోధన పద్ధతులను సూచించింది. ప్రతి 20 రోజులకు విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా పరీక్షలుండాలని స్పష్టం చేసింది. ప్రతి అంశానికీ మార్కులు సంవత్సరం మొత్తంలో 75 శాతానికి పైగా హాజరు ఉన్న వారికి 10 మార్కులు ఇవ్వాల్సిన అవసరాన్ని ఐఎస్బీ ప్రస్తావించింది. యాక్టివ్‌గా ఉండే విద్యార్థులను వెలికితీయడం, వారు ఏ అంశాల్లో ఆసక్తిగా ఉన్నారనేది అధ్యాపకుడు గుర్తించాలి. దీనికీ కొన్ని మార్కులు నిర్దేశించారు. మంచి సంస్థలను గుర్తించి, అక్కడే ప్రాజెక్టు వర్క్ చేయాలి. ప్రాజెక్టు వర్క్‌లో నైపుణ్యానికి మార్కులుంటాయి. నెలకు కనీసం నాలుగు క్విజ్లు, వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, మార్కులివ్వాలి. ఈ విధానం ఎలా ఉండాలనేది ఆయా యూనివర్సిటీలు నిర్ణయిస్తాయి. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అనుసంధానం పెంచడం, ఇంటర్న్‌షిప్, ప్రాంగణ నియామకాల కల్పనకు ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటును వర్సిటీలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి వారం విద్యార్థి ప్రతిభకు మార్కులు నిర్ణయించి, వాటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తారు. ప్రతి యూనివర్సిటీలోనూ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఎవాల్యుయేషన్ అండ్ అసెస్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. డిగ్రీ స్థాయిలోనూ పరిశోధన సంస్కృతికి ఊతం ఇవ్వడం కొత్త విధాన లక్ష్యం. కృత్రిమ మేధ కోర్సులు, డేటాసైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ కోర్సులను పెద్ద ఎత్తున డిగ్రీలో చేపట్టాలని ఐఎస్బీ సిఫారసు చేసింది. గుణాత్మక మార్పుకు దోహదం దేశంలోనే తొలిసారి నిరంతర మూల్యాంకన విధానం ఈ ఏడాది ప్రవేశపెట్టాం. పీజీ (నాన్– ఇంజనీరింగ్) కోర్సుల్లో దీన్ని అమలు చేస్తున్నారు. దీనికోసం సాఫ్ట్వేర్ కూడా రూపొందించాం. ప్రశ్నపత్రాల రూపకల్పనపై అన్ని వర్గాల ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. ఇబ్బందులుంటే చర్యలు చేపడుతున్నాం. గుణాత్మక మార్పునకు ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నాం. దీన్ని డిగ్రీ స్థాయికీ విస్తరించాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. – ప్రొఫెసర్ డి.రవీందర్ (వీసీ, ఉస్మానియా యూనివర్సిటీ) -
‘నారాయణ’ కళాశాలలో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం
మీర్‌పేట: ‘సారీ అమ్మానాన్న.. ఇదే నా చివరి రోజు. మార్కులు ఎక్కు వగా తెచ్చుకోవాలని కళాశాల యాజమాన్యం చేస్తున్న ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నా’ అంటూ సూసైడ్ లెటర్ రాసి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. మీర్‌పేటలోని గౌతంనగర్‌కు చెందిన పాల వ్యాపారి మంచన ఆనంద్, కృష్ణవేణి దంపతుల పెద్ద కుమారుడు వైభవ్ (16) చైతన్యపురిలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ (ఎంపీసీ) చదువుతున్నాడు. అప్పుడప్పుడూ వ్యాపారంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండే వైభవ్ మంగళవారం తెల్లవారుజామున పని ముగించుకొని కళాశాలకు వెళ్తానని ఇంటికి వచ్చాడు. అనంతరం బెడ్రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంట్లో లభించిన సూసైడ్ నోట్లో ‘మంచి మార్కులు తెచ్చుకోవాలని టీచర్లు, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఒత్తిడి, టార్చర్ చేస్తున్నారు. సారీ అమ్మానాన్న, తమ్ముడు.. దయచేసి ఎవరూ నారాయణ కళాశాలలో చేరొద్దు. ఇదే నా జీవితంలో చివరి రోజు. దయచేసి విద్యార్థులపై ఒత్తిడి చేయొద్దు. నా తమ్ముడిని మంచి కళాశాలలో చేర్పించండి. అతని భవిష్యత్తు బావుండాలని కోరుకుంటున్నా. చివరగా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌కు క్షమాపణలు’ అని లేఖలో రాశాడు. దీంతో నారాయణ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ మృతుడి బంధువులు, స్థానికులు, ఏబీవీపీ నాయకులు పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. -
69 మంది పదో తరగతి విద్యార్థుల సర్టిఫికేట్లలో ఒకే ఫొటో..
ఒడిశా: సెకంటరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన పదో తరగతి సర్టిఫికేట్లలో 69 మంది విద్యార్థులకు ఒకే ఫొటో వచ్చింది. దీంతో చిన్నారులు ఆందోళనకు గురయ్యారు. కటక్ జిల్లాలోని నిశింతకోహిలీ మండలంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సర్టిఫికేట్లలపై వేరొకరి ఫొటో ఉన్న కారణంగా ఉన్నత విద్య కోసం కాలేజీల్లో అడ్మిషన్లు రద్దవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 69 మంది విద్యార్థుల సర్టిఫికేట్లలో వేరొకరి ఫొటో వచ్చింది. అందరి మెమోలపై ఒకరి ఫొటోనే రిపీట్ అయింది. సమ్మేటివ్ అసెస్మెంట్లో తప్పుగా ఉన్న అడ్మిట్ కార్డులు వచ్చినప్పుడే విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామని బాధిత విద్యార్థులు తెలిపారు. ఆ తప్పును రెండో సమ్మేటివ్ అసెస్మెంట్లో సరిదిద్దుతామని పాఠశాల యాజమాన్యం హామీ ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. కానీ రెండో సమ్మేటివ్ అసెస్‌మెంట్‌లోనూ అడ్మిట్ కార్డ్‌లో అదే లోపం కనిపించినట్లు విద్యార్థులు తెలిపారు. అడ్మిట్ కార్డులపై తమ ఫొటోలు అతికిస్తే పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించారని విద్యార్థులు తెలిపారు. మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్లు తీసుకోవడానికి వెళ్లినప్పుడు అందరి మెమోల్లోనూ అదే తప్పు దొర్లినట్లు విద్యార్థులు చెప్పారు. అందరి సర్టిఫికెట్‌పై ఒకటే ఫొటో ముద్రించినట్లు పేర్కొన్నారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగానే ఈ తప్పు దొర్లినట్లు ఒడిశా బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ వైస్ ప్రెసిడెంట్ నిహార్ రంజన్ మొహంతి స్పష్టం చేశారు. త్వరలోనే తప్పును సవరించి బాధిత విద్యార్థులకు కొత్త సర్టిఫికేట్లను విడుదల చేస్తామని తెలిపారు. ఇదీ చదవండి: ఏమైందో తెలియదు.. యువకుని చెంప చెల్లుమనిపించింది.. వీడియో వైరల్ -
పదో తరగతి పరీక్షల్లో మా అమ్మాయికి 582 మార్కులు వచ్చాయి.. తల్లిగా నాకు చాలా గర్వంగా ఉంది
-
ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పదో తరగతి ఫలితాల్లో 582 మార్కులు సాధించాను..!
-
ఒకటి, ఒకటి, రెండు, రెండు.. ‘చై-నా’ ర్యాంకులు కాదు.. జగనన్న ఆణిముత్యాలు
ఒకటి.. ఒకటి.. ఒకటి.. రెండు.. రెండు.. రెండు.. అన్నీ చైనా (చైతన్య, నారాయణ) ర్యాంకులు.. అయితే అది ఒకప్పటి మాట. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులు సాధించిన ర్యాంకులివి... ఇటీవల ప్రకటించిన పదో తరగతి ఫలితాలలో ప్రభుత్వ స్కూళ్లు విజయదుందుభి మోగించాయి. వాటిలో చదువుతున్న నిరుపేద విద్యార్థులు మునుపెన్నడూ ఎరుగని రీతిలో సత్తా చాటారు... రాష్ట్రప్రభుత్వం తల్లిదండ్రులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు.. సంక్షేమ పథకాలు ఒకవైపు.. మౌలిక సదుపాయాలతో సహా స్కూళ్లను సమూలంగా మార్చేస్తున్న నాడు నేడు వంటి కార్యక్రమాలు మరోవైపు.. దారితప్పిన విద్యావ్యవస్థను పట్టాలపైకి ఎక్కించాయి.విద్యార్థులలో పెల్లుబికిన ఉత్సాహం చదువుల విప్లవాన్ని సృష్టించింది. అందుకు పది ఫలితాలు ప్రత్యక్ష నిదర్శనం.. అద్భుతమైన ప్రతిభ చూపించిన ఈ ప్రతిభామూర్తులను ‘జగనన్న ఆణిముత్యాలు’గా ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలతో సత్కరించనుంది. వారిలో కొంతమందితో సాక్షి ముచ్చటించింది. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే... ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది.. పేరు:మిట్టు మహాపాత్రో పాఠశాల: పాతపట్నంప్రభుత్వ స్కూల్ శ్రీకాకుళం జిల్లా మాది పేద కుటుంబం. మా నాన్న వాహనాల టైర్లకు పంచర్లు వేస్తుంటారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివాను. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ ఒడియా పాఠశాలలోనూ, 6 నుంచి 10వ తరగతి వరకు పాతపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాను. చిన్నతనం నుంచి మా చిన్నాన్న రవి మహాపాత్రో ఎక్కువగా చదువుకోవాలని ప్రోత్సాహం అందించారు. ♦ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది. జగనన్న విద్యా కానుక కింద నాకు, అక్కకు పుస్తకాలు, బ్యాగ్, షూ, డ్రస్‌లు అందించారు. ♦ పదో తరగతిలో 600కు 570 వస్తాయని అనుకున్నాను. 594 మార్కులు వస్తాయని ఊహించలేదు. ప్రశ్నలవారీగా కాకుండా పాఠ్యాంశాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకునేవాడిని. పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా అర్థం చేసుకునేలా పాఠ్యాంశాలను బోధించారు. దీనివల్ల పాఠ్యాంశంలో ఏ ప్రశ్న ఇచ్చినా రాయగలిగాను. సకాలంలో సిలబస్‌ను పూర్తి చేయడంతో రివిజన్‌కు ఎక్కువ సమయం కేటాయించేందుకు అవకాశం ఏర్పడింది. రివిజన్లో వెనుకబడిన సబ్జెక్టులకు ఎక్కువ సమయం వెచ్చించాను. ♦ మంచి మార్కులు రావడం పట్ల సంతోషంగా ఉంది. ట్రిపుల్ ఐటీలో చదివి ఇంజనీర్‌ను కావడమే నా లక్ష్యం. తొలి రోజే విద్యా కానుక అందింది.. పేరు: గోవుల గోకుల కృష్ణారెడ్డి పాఠశాల: కేఎన్నార్ మున్సిపల్ స్కూల్, నెల్లూరు పాఠశాల ప్రారంభం రోజే జగనన్న విద్యాకానుక కింద అన్ని పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, తదితర వస్తువులు ఇచ్చారు. అలాగే నాడు – నేడు కింద పాఠశాలలో అన్ని వసతులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. బెంచీలు, బ్లాక్‌బోర్డు, సరిపడా గదులు ఉండటం వల్ల ఎలాంటి అసౌకర్యం కలగలేదు. మినిరల్ వాటర్‌తో పాటు నాణ్యమైన భోజనం అందించారు. అమ్మఒడి కింద రూ.15 వేల నగదును ప్రభుత్వం అందించింది. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 593 మార్కులు సాధించడానికి పాఠశాల హెడ్మాస్టరు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారు. ప్రతి సబ్జెక్టుకు టైమ్ టేబుల్ వేసుకుని దాని ప్రకారం చదివాను. సబ్జెక్టులకు వాటి ప్రాధాన్యత ప్రకారం సమయం కేటాయించా. ముందు ఇంటర్లో మంచి మార్కులు సాధించడమే నా లక్ష్యం. ఆ తర్వాత బెస్ట్ ఐఐటీలో ఇంజనీరింగ్ చదువుతా. నాడు–నేడుతోఅన్ని వసతులు పేరు: పి.శ్రీనివాసరావు పాఠశాల: బీఎన్ఆర్ మున్సిపల్ స్కూల్, గుంటూరు ఒకటో తరగతి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నాను. అయితే అప్పట్లో పాఠ్యపుస్తకాలు మినహా మాకు ఏమీ ఇవ్వలేదు. అదికూడా స్కూళ్లు తెరిచిన రెండు నెలల కానీ చేతికి ఇచ్చేవారు కారు. పాత కాలం బెంచీలు, బల్లలపై కూర్చోవాల్సి వచ్చేది. అయితే గత నాలుగేళ్లుగా ప్రతి ఏటా జగనన్న విద్యాకానుక కింద కిట్ అందుకున్నాను. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా చదువు చెప్పడంతో పాటు టెక్ట్స్‌బుక్స్, యూనిఫామ్, నోట్‌బుక్స్, బ్యాగు, బూట్లు వంటివన్నీ ఉచితంగా ఇచ్చారు. జగనన్న గోరుముద్దతో నాణ్యమైన భోజనాన్ని అందించారు. అధిక మార్కులు తెచ్చుకునేందుకు జగనన్న విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ కూడా ఫ్రీగా ఇచ్చారు. నాడు–నేడు ద్వారా పాఠశాల రూపురేఖలను ప్రభుత్వం మార్చేసింది. కూర్చునేందుకు డ్యూయల్ డెస్క్‌లు ఏర్పాటు చేసింది.క్లాస్ రూమ్‌లో ఫ్యాన్లు, లైట్లతో ప్రశాంతంగా చదువుకునే వాతావరణాన్ని కల్పించింది. ఎక్కువ మార్కులు సాధించడానికి ఈ వసతులు అన్నీ ఉపయోగపడ్డాయి. కార్పొరేట్ స్కూళ్లతో పోల్చితే ఎక్కడా తగ్గకుండా అన్ని సదుపాయాలు కల్పించారు. మా స్కూల్లో వసతులు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఉన్నాయి. ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటా. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం. ‘కార్పొరేట్’లో చదివినఅనుభూతి.. పేరు: ఎ.వైష్ణవి పాఠశాల: జెడ్పీహెచ్ స్కూల్, పొదలకూరు, నెల్లూరు జిల్లా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే అన్ని సబ్జెక్టులకు క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు. వారు అర్థమయ్యే రీతిలో మెరుగ్గా బోధించారు. నాడు – నేడు కింద మా పాఠశాలలో ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు కల్పించింది. బెంచీలు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు ఇలా అన్ని సదుపాయాలు ఉన్నాయి. దీంతో నాకు కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్న అనుభూతి ఉండేది.పేద విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి పథకాలను అందజేస్తోంది. ప్రభుత్వ పథకాలే ఆదుకున్నాయి పేరు: పేడాడ షణ్ముఖ వికాస్ పాఠశాల: లక్ష్మీనగర్ మున్సిపల్ హైసూ్కల్, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా జగనన్న విద్యాకానుక కింద నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలతోపాటు అమ్మఒడి, మధ్యాహ్న భోజన పథకం వంటివి పేద విద్యార్థినైన నన్ను ఆదుకున్నాయి. దీంతో ఎలాంటి ఒత్తిడి, ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా చదువుకోవడానికి అవకాశం కలిగింది. నా తల్లిదండ్రుల పైన ఎలాంటి ఆర్థిక భారం పడకపోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇందుకు సీఎం వైఎస్ జగన్‌కు నా కృతజ్ఞతలు. మా పాఠశాలలో ఉపాధ్యాయులు.. విద్యార్థులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. సందేహాలు ఉంటే ఆ గ్రూప్‌లో పోస్ట్ చేస్తూ సందేహాలు నివృత్తి చేసుకునేవాళ్లం. పాఠశాలలో మొదటి నాలుగు నెలల్లోనే సిలబస్ పూర్తి చేశారు. తర్వాత రివిజన్ చేస్తూ ప్రతిరోజూ పరీక్షలు నిర్వహించేవారు. ‘ఆక్స్ఫర్డ్’తోనే అధిక మార్కులు పేరు: సోముల వెంకట రామ శరణ్య పాఠశాల: వైవీఎస్ మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్, ప్రొద్దుటూరు,వైఎస్సార్ జిల్లా ప్రభుత్వం జగనన్న విద్యా కానుకలో భాగంగా అందించిన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎంతగానో ఉపయోగపడింది. దీంతో ఇంగ్లి‹Ù సబ్జెక్టులో వందకు 99 మార్కులు సాధించగలిగాను. నాడు–నేడు కింద ప్రభుత్వం మా పాఠశాలను సమగ్రంగా అభివృద్ధి చేసింది. అలాగే జగనన్న గోరుముద్ద కింద మంచి పౌష్టికాహారాన్ని అందించారు. ప్రభుత్వ పథకాలతో మా తల్లిదండ్రులపై రూపాయి భారం కూడా పడలేదు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినడంతోపాటు తెల్లవారుజామున 2 గంటలు, రాత్రి 2 గంటలు, పాఠశాలలో స్టడీ అవర్స్‌లో బాగా చదివాను. ఇంగ్లి‹Ù, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ట్రిపుల్ ఐటీలో బీటెక్ సీఎస్ఈ చదువుతా. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా. ప్రభుత్వమేఅన్ని సౌకర్యాలు కల్పిస్తోంది.. పేరు: నాగరాజుగారి ఐశ్వర్య పాఠశాల: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రొళ్ల, శ్రీసత్యసాయి జిల్లా ‘అనంత సంకల్పం’ పేరుతో అధికారులు 100 రోజుల ప్రణాళిక అమలు చేశారు. పరీక్షల్లో అధిక మార్కులు సాధించడానికి అధికారులు ప్రత్యేకంగా అందించిన బుక్లెట్ ఎంతగానో ఉపయోగపడింది. ఇంటి దగ్గర తల్లిదండ్రులు బాగా చదువుకోవాలని ఎంతో ప్రోత్సహించారు. దీంతో 590 మార్కులు సాధించగలిగాను. గతంలో మా పాఠశాలలో అరకొర సౌకర్యాలు ఉండేవి. ఇటీవల ప్రభుత్వం ‘మనబడి నాడు–నేడు’ కింద అన్ని వసతులు కల్పించింది. దీంతో మంచి వాతావరణంలో చదువుకునే అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో మాలాంటి పేద పిల్లలకు ఎంతో మేలు జరుగుతోంది. ప్రభుత్వ బడుల్లో ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు కూడా ఇస్తున్నారు. అలాగే జగనన్న విద్యాకానుక కింద స్కూల్ బ్యాగు, నోటు పుస్తకాలు, షూ..ఇలా అన్నీ అందిస్తున్నారు. ఇప్పుడు చదువుకోవాలనే తపన ఉంటే చాలు ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలోనే బాగా చెప్పే ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వ బడి బాగుండదని అనుకున్నా పేరు: షేక్ మహ్మద్ సమీర్ పాఠశాల: మోడల్ స్కూల్, అవుకు,నంద్యాల జిల్లా మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో నన్ను ఆరో తరగతి నుంచి ఆదర్శ పాఠశాలలో చేరి్పంచారు. అయితే ప్రభుత్వ పాఠశాలలో వసతులు ఉండవేమో, మంచిగా చెప్పరేమోనని ఆందోళనపడ్డాను. అయితే నేను ఊహించినట్టు ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులు లేవు. ప్రభుత్వం నాడు–నేడు కింద మా పాఠశాలలో అన్ని వసతులు కల్పించింది. ప్రభుత్వ చర్యలతో ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే ఎంతో బాగున్నాయి. ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన పుస్తకాలను, దుస్తులను, షూ, బెల్ట్, టై లాంటివి ఉచితంగా అందించింది. అంతేకాకుండా ప్రతిరోజు మధ్యాహ్నం ఒక మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందజేసింది. అంతేకాకుండా అమ్మఒడి పథకం ద్వారా మా చదువులకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించింది. భవిష్యత్తులో ఐఏఎస్ సాధించడమే నా లక్ష్యం. ప్రభుత్వ మెటీరియల్ బాగుంది పేరు: ఎస్.హరిణి పాఠశాల: ఎస్‌పీసీఎన్ మునిసిపల్ హైసూ్కల్, ప్రొద్దుటూరు రామేశ్వరం,వైఎస్సార్ జిల్లా పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం డీసీఈబీ మెటీరియల్ అందించింది. ఇది మాకు ఎంతో ఉపయోగపడింది. అలాగే ప్రభుత్వం జగనన్న విద్యా కానుకతో అందించిన ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీతో ఇంగ్లిష్ సబ్జెక్టులో అధిక మార్కులు సాధించగలిగాను. ప్రభుత్వ పథకాలతో ఎంతో లబ్ధి కలిగింది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మా పాఠశాలలో విద్యాబోధన చేయడం వల్లే 590 మార్కులు వచ్చాయి. రోజూ తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10.30 గంటల వరకు చదివాను. స్టడీ టైమ్ టేబుల్‌ను అనుసరించడంతోపాటు పాఠ్యాంశాల్లో వచ్చిన సందేహాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి నివృతి చేసుకున్నాను. ప్రతి పాఠ్యాంశాన్ని రివైజ్ చేశాను. ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. స్టడీ అవర్స్ నిర్వహించి పాఠ్యాంశాల్లో పట్టు సాధించేలా శిక్షణ ఇచ్చారు. దీంతో మ్యాథ్స్‌లో 100కు 100 మార్కులు సాధించాను. ట్రిపుల్ ఐటీలో చేరి భవిష్యత్తులో ఐఏఎస్ కావడమే నా లక్ష్యం. -
టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్! పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు మేలు జరిగేలా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా విద్యార్థి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నిర్ణీత ప్రశ్నల సంఖ్య కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉంటే.. వాటిలో ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ విద్యార్థి మొత్తం మార్కులను నిర్ణయించనున్నారు. తక్కువ మార్కులు వచ్చిన ప్రశ్నల జవాబులను తీసివేయనున్నారు. ఈ మేరకు తాజాగా పాఠశాల విద్యాశాఖ ప్రొసీడింగ్స్ విడుదల చేసింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 3నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 18వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. 19 నుంచి మూల్యాంకనం ఈ నెల 19నుంచి 26వ తేదీ వరకు విద్యార్థుల సమాధాన పత్రాల మూల్యాంకన చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూల్యాంకన ప్రక్రియలో తీసుకోవాలి్సన జాగ్రత్తలపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ పలు మార్గదర్శకాలతో కూడిన ప్రొసీడింగ్స్ జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లా కేంద్రాల్లో (పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, నంద్యాల జిల్లా కేంద్రాలు మినహా) మూల్యాంకనకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం అన్ని జిల్లాల విద్యా శాఖాధికారులకు మార్గదర్శకాలతో కూడిన బుక్లెట్లను కూడా పాఠశాల విద్యాశాఖ అందించింది. ఆయా జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలన్నిటినీ ఏర్పాటు చేసే బాధ్యతను ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులకు అప్పగించింది. మూల్యాంకనం సందర్భంగా అందులో పాల్గొనే సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులను తాజా ప్రొసీడింగ్స్‌లో కమిషనర్ వివరించారు. వాటిని తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత డీఈవోలదేనని స్పష్టం చేశారు. మార్గదర్శకాలు ఇవీ ♦ మూల్యాంకనంలో పాల్గొనే అసిస్టెంట్ ఎగ్జామినర్లు రోజుకు 40 సమాధానాల పత్రాలను మాత్రమే మూల్యాంకన చేయాలి ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకన చేసే సమాధాన పత్రాలన్నిటినీ స్పెషల్ అసిస్టెంట్లు పూర్తిగా పరిశీలన చేసి మార్కులను లెక్కించాలి. ♦ పరీక్ష రాసిన అభ్యర్థి నిర్ణీత సంఖ్యకు మించి ప్రశ్నలకు సమాధానాలు రాశాడా అన్న అంశాన్ని స్పెషల్ అసిస్టెంట్లు గమనించాలి. ♦ ఒకవేళ నిర్ణీత సంఖ్యకు మించి ప్రశ్నలకు సమాధానం రాసి ఉంటే.. వాటిని మూల్యాంకనం చేసి మార్కులు వేశారా? లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలన చేయాలి. ♦ అదనంగా రాసిన ప్రశ్నల సమాధానాలను అసిస్టెంట్ ఎగ్జామినర్ మూల్యాంకన చేసి మార్కులు ఇచ్చినట్టయితే ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని విద్యార్థికి నిర్ణీత ప్రశ్నల సంఖ్య మేర మార్కులను కేటాయించాలి. తక్కువ మార్కులు వచ్చిన ప్రశ్నల సమాధానాలను పరిహరించాలి. ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకన చేసిన సమాధాన పత్రాల్లోని కనీసం 20 ఆన్సర్ స్క్రిప్టులను ఆయా కేంద్రాల్లోని చీఫ్ ఎగ్జామినర్లు పరిశీలించాలి. రోజులో మొత్తంగా 60 వరకు ఆన్సర్ స్క్రిప్టులను పరిశీలన చేయాలి. ♦ అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు మూల్యాంకన పూర్తయిన రెండు సమాధానాల పత్రాలను పరిశీలించాలి. ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకన చేసిన సమాధాన పత్రాల్లో డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ ప్రతి రోజూ కనిష్టంగా 45 పత్రాలను పరిశీలన చేయాలి. ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన సమాధాన పత్రాల్లో క్యాంప్ ఆఫీసర్ ప్రతి రోజూ కనిష్టంగా 20 పత్రాలను పరిశీలించాలి. పొరపాట్లు జరిగితే చర్యలే ♦ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం అభ్యర్థులకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం, ఫొటోస్టాట్ కాపీలను అందించడం వంటివి ఉన్నందున మూల్యాంకనంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ల సమయంలో ఏ విధమైన మార్పులు చేయాల్సి వచ్చినా అందుకు వరుసగా స్పెషల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ♦ పొరపాట్లు చేసిన వారిపై నిబంధనల ప్రకారం పెనాల్టీ సహా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటారు. ♦ మూల్యాంకనాన్ని ఎలాంటి పొరపాట్లు, ఇతర అవాంఛిత అంశాలకు తావులేని విధంగా ప్రశాంతంగా ముగించేందుకు డీఈవోలు చర్యలు తీసుకోవాలి. ♦ జిల్లాస్థాయి పరిశీలకులు మూల్యాంకన కేంద్రాలను తొలి రెండు రోజులు తప్పనిసరిగా సందర్శించి తగిన జాగ్రత్తలు తీసుకునేలా చూడాలి. -
‘పోలీస్’ పరీక్షలో 7 మార్కులు కలపడంపై హర్షం
ముషీరాబాద్ (హైదరాబాద్): ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షలో అభ్యర్థులకు 7 మార్కులు కలపాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హర్షం వ్యక్తంచేశారు. ఇది పోలీస్ కానిస్టేబుళ్ల, ఎస్సై అభ్యర్థుల పోరాట ఫలితమేనని స్పష్టంచేశారు. మల్టిపుల్లోని 7 తప్పుడు ప్రశ్నలకు 7 మార్కులు కలపాలని హైకోర్టు జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో పలు కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులు విద్యానగర్‌లోని బీసీ భవన్ వద్ద సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ 6 లక్షల మంది రాసిన ఈ పరీక్షలో కేవలం 1,84,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారని, 4 లక్షల మందికి పైగా అర్హత సాధించలేకపోయారని తెలిపారు. కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, మాసం ప్రదీప్, రాజ్‌కుమార్, నీలం వెంకటేశ్, చందన, రాజా, సునీత, దివ్య, రాజమల్లేశ్, శివ, కల్యాణ్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కారణాలేంటో తెలియజేయండి
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్)–2022కు హాజరైన విద్యార్థి జోత్స్నకు తొలుత ఓ మార్కులు(482), తర్వాత మరో మార్కుల(294)ను వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి గల కారణాలను తెలిపాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 11వ తేదీలోపు కారణాల నివేదికను కోర్టు ముందుంచాలని స్పష్టం చేసింది. కారణం చూపించకుండా ఎన్టీఏ తన మార్కులను 482 నుంచి 294కు తగ్గించడాన్ని సవాల్ చేస్తూ జీఎస్ జోత్స్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ సీహెచ్ సుమలతతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్.ఎస్.అర్జున్ కుమార్ వాదనలు వినిపించారు. నీట్(యూజీ)కు హాజరైన జోత్స ్నకు తొలుత 482 మార్కులు వచ్చాయన్నారు. ఆలిండియాస్థాయిలో 1,00,456 ర్యాంక్, ఓబీసీ కేటగిరీలో 50,567 ర్యాంక్ వచ్చిందన్నారు. ఈ మేరకు ఫలితాలు వచ్చిన సెప్టెంబర్ 7న ఎన్టీఏ ఫలితాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసిందన్నారు. తర్వాత కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అప్లోడ్ చేసిన జాబితా చూసి పిటిషనర్ షాక్‌కు గురయ్యారని చెప్పారు. మార్కులను 294కు తగ్గించారని, ఎన్టీఏ వెబ్‌సైట్‌ను తెరిచి చూడగా.. ఇదే మార్కులను చూపించిందన్నారు. దీంతో ర్యాంక్ ఆలిండియా స్థాయిలో 3,32,143కి, ఓబీసీ స్థాయిలో 1,44,313కి పెరిగిందన్నారు. దీనిపై ఎన్టీఏకు ఎన్నిసార్లు ఈ–మెయిల్ పంపినా స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. ఎన్టీఏ తరఫున న్యాయవాది బి.కవిత యాదవ్, కాళోజీ వర్సిటీ తరఫున న్యాయవాది ఎ. ప్రభాకర్‌రావు హాజరయ్యారు. వాదనలు విన్న ధర్మానసం తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. -
‘డాడీ నన్ను క్షమించు.. నా చావుకు ఎవరూ కారణం కాదు’
సాక్షి, శ్రీకాకుళం: ఆత్మహత్యలు ఆగడం లేదు. పరీక్ష బాగా రాయలేకపోయినందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువక ముందే పాతపట్నంలో మళ్లీ అలాంటి సంఘటన జరిగింది. ‘డాడీ నన్ను క్షమించు.. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అంటూ సూసైడ్ నోట్ రాసి పాతపట్నం బాలాజీ నగర్‌కు చెందిన యువతి సారా నేపాలి (27) గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం కోర్టు కూడలి ఎదురుగా ఉన్న బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న సారా నేపాలి గురువారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపింది. కాస్త తలనొప్పిగా ఉందంటూ తల్లితో చెప్పి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. గదిలోకి వెళ్లిన అమ్మాయి ఎంతకూ తిరిగి రాకపోవడంతో తల్లి ఆ గదికి వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి వారు హతాశులైపోయారు. వెంటనే ఆమెను కిందకు దించి కారులో పాతపట్నం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సారా నేపాలి మృతి చెందినట్లు వైద్యుడు సందీప్ ధ్రువీకరించారు. పోలీసులకు కూడా సమాచారం అందించడంతో ఎస్ఐ టి.కామేశ్వరరావు, పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని గదిని పరిశీలించారు. చదవండి: World Suicide Prevention Day 2022: ఆందోళన పరుస్తున్న ఆత్మహత్యలు అక్కడ సూసైడ్ నోట్‌తో పాటు సెల్ ఫోన్, డైరీని స్వాదీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్లో డాడీ నన్ను క్షమించు..నా చావుకు ఎవరు కారణం కాదు అంటూ రాసి ఉంది. నేపాలి ఎంఎస్సీ, బీఈడీ చదివింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టెట్ పరీక్షల కీ విడుదల చేసింది. సారా ఓసీ కాబట్టి 150కి 90 మార్కులు రావాలి, కానీ 87 మార్కులు రావడంతో మనస్తాపం చెందిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గతంలో సారా నేపాలి పాతపట్నం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసింది. సారాకు ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు ఉన్నాడు. అక్కలకు వివాహాలయ్యాయి. తమ్ముడు డిగ్రీ వరకు చదువుకున్నారు. తండ్రి దమ్మర్ బహదూర్ పాతపట్నం గురుకుల పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తుంటారు. తల్లి సరస్వతీ దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
విష ప్రయోగానికి గురైన బాలుడి మృతి
సాక్షి, చెన్నై: ఓ కిరాతక తల్లి చేసిన విష ప్రయోగంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శనివారం రాత్రి మృతి చెందాడు. సరైన వైద్యం అందక పోవడంతోనే ఆ బాలుడు మరణించాడని బంధువులు ఆస్పత్రిపై దాడి చేశారు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్‌లో తన కూతురు కంటే ఎక్కువ మార్కులు సాధిస్తున్నాడనే అసూయతో 8వ తరగతి విద్యార్థి బాల మణిగండన్‌పై ఓ విద్యార్థిని తల్లి శీతల పానీయంతో శుక్రవారం విష ప్రయోగం చేసిన విషయం తెలిసిందే. ఆ బాలుడికి పుదుచ్చేరిలో అత్యవసర చికిత్స అందించారు. ఆ బాలుడు తన తల్లిదండ్రులు రాజేంద్రన్, మాలతి ఇచ్చిన ఫిర్యాదుతో ఆ పాఠశాల సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో విద్యార్థిని తల్లి సహాయ రాణి విక్టోరియా చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. సరైన చికిత్స అందలేదా..? పోలీసులు కేసు దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారించినా, వైద్యులు మాత్రం ఆ బాలుడికి సరైన చికిత్స అందించ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలుత కోలుకున్నాడని భావించిన బాల మణిగండన్ ఆరోగ్యం శనివారం రాత్రి ఒక్కసారిగా క్షీణించింది. విషం శరీరంలోకి కొన్ని అవయవాలపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆ బాలుడు మరణించాడు. దీంతో అతడి కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగింది. అదే సమయంలో ఆస్పత్రిలో సరైన వైద్యం అందించ లేదని, నిర్లక్ష్యంగా వైద్యులు వ్యవహరించారని ఆరోపిస్తూ కుటుంబీకులు, బంధువులు దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ విద్యార్థిపై విష ప్రయోగం చేసి హతమార్చిన సహాయ రాణి విక్టోరియాపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
ఎంత పని చేశావు తల్లీ! తన కొడుకుకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని..
సాక్షి, చెన్నై: తన కుమారుడి కంటే ఎక్కువ మార్కులు సాధిస్తున్నాడని ఓ విద్యార్థిపై ఆ తల్లి అసూయ పెంచుకుంది. చివరికి ఆ విద్యార్థిని మట్టు మెట్టేందుకు సిద్ధమైంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. పుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్‌లో ఓ ప్రైవేటు పాఠశాల ఉంది. ఇందులో రాజేంద్రన్, మాలతి దంపతుల కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఈ విద్యార్థి హఠాత్తుగా స్పహ తప్పి పడిపోయాడు. చివరికి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అక్కడి సిబ్బంది ఆస్పత్రికి సకాలంలో తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, ఆ బాలుడు విషం తాగినట్లు వైద్యుల పరిశీలన తేలింది. సెక్యూరిటీ ఇచ్చిన శీతలపానీయంతో.. ఆ పాఠశాల సెక్యూరిటీ ఇచ్చిన శీతల పానీయం తాగడంతోనే తాను అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు కోలుకున్న తరువాత తల్లిదండ్రుల దృష్టికి ఆ విద్యార్థి తీసుకెళ్లాడు. దీంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించగా, ఓ మహిళ తనకు కూల్‌డ్రింక్ ఇచ్చి ఆ విద్యార్థికి ఇవ్వాలని సూచించినట్లు వాంగ్ములం ఇచ్చాడు. డబ్బులకు కక్కుర్తిపడి తాను ఆమె చెప్పినట్లు చేశానని తెలిపాడు. దీంతో పోలీసులు ఆ పరిసరాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించారు. ఓ మహిళ రెండు కూల్ డ్రింక్ బాటిళ్లను సెక్యూరిటీ సిబ్బందికి ఇవ్వడాన్ని గుర్తించారు. ఆ దృశ్యాల ఆధారంగా సహాయరాణి విక్టోరియా అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఎప్పుడూ తరగతిలో ఫస్ట్ వచ్చే తన కుమారుడిని అధిగమించి రాజేంద్రన్, మాలతి కుమారుడు తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడని పోలీసులకు ఆమె వివరించింది. తన కుమారుడి కంటే అధికంగా మార్కులు సాధిస్తున్న ఈ విద్యార్థిపై తనకు ఈర్ష్య, కోపం పెరిగిందని, అందుకే విషం ఇచ్చి మట్టుబెట్టే ప్రయత్నం చేశానని అంగీకరించింది. ఇది విని పోలీసులు కూడా నివ్వెరపోయారు. చదవండి: సినీ అవకాశాల పేరుతో అశ్లీల వీడియోలు.. 30కి పైగా హార్డ్‌డిస్క్‌లు -
CBSE Results:టెన్త్‌లో కుమార్తెకు 100శాతం మార్కులు.. బాధపడుతున్న తల్లి!
చండీగఢ్: తమ పిల్లలు ఫస్ట్ క్లాస్‌లో పాసైతేనే తల్లిదండ్రులు సంతోషంలో అందరికీ చెప్పుకుంటారు. అలాంటిది 100 శాతం మార్కులు సాధిస్తే ఎగిరి గంతేస్తారు. తమ పిల్లల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. కానీ, ఓ తల్లి తన కూతురికి పదో తరగతిలో 100 శాతం మార్కులు వచ్చాయని బాధపడుతున్నారు. ఆమె బాధకు గల కారణాలేంటి? హర్యానాకు చెందిన అంజలి యాదవ్ అనే విద్యార్థిని ఇటీవల సీబీఎస్ఈ ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100 శాతం మార్కులు సాధించింది. కానీ, ఆమె తల్లి మాత్రం ఓ పక్క సంతోషంగా ఉన్నా.. మరోవైపు బాధపడుతున్నారు. తన కుమారఢ్ను పైచదువులకు ఏ విధంగా పంపించాలో తెలియటం లేదని తనలోతానే మదనపుడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కడాని కుటుంబం వారిది. దీంతో పైచదువులకు అయ్యే ఖర్చుపై ఆందోళన చెందుతున్నారు. విద్యార్థినికి డాక్టర్ కావాలనేది కల. ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్‌లో చదవాలనుకుంటోంది. కానీ, వారి కుటుంబంలో తల్లి పని చేస్తేనే పూట గడిచే పరిస్థితులు ఉన్నాయి. వారికి కొద్ది పాటి వ్యవసాయ భూమి ఉన్నా.. అందులో పండేవి ఇంటికే సరిపోవు. విద్యార్థిని తండ్రి పారామిలిటరీలో చేరిన క్రమంలో 2010లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అనారోగ్య సమస్యలతో 2017లో తన విధుల నుంచి వైదొలిగారు. ఆ సమయంలో పీఎఫ్ ద్వారా రూ.10 లక్షలు అందాయి. కానీ, అవి అప్పులు, ఇతర ఖర్చులకే అయిపోయాయని వాపోయారు విద్యార్థిని తల్లి ఊర్మిళ. విద్యార్థిని సోదరుడు ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. సిలార్పుర్‌లో నివాసం ఉంటున్న విద్యార్థిని అంజలి.. మహోందర్‌గఢ్‌లోని ఇండస్ వాలీ పబ్లిక్ స్కూల్లో చదవుతోంది. ‘ఆమె కష్టపడి చదువుతుంది. తాను అనుకున్నది సాధిస్తే మన కష్టాలు తొలగిపోతాయని చెబుతుంటుంది. ఆమెకు ఎప్పుడూ మద్దతు ఇస్తూ చదువుపై దృష్టి పెట్టాలని చెప్పేదాన్ని. ’ అని పేర్కొన్నారు ఊర్మిళ. నెలకి రూ.20వేల స్కాలర్షిప్.. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఆదివారం ఫోన్ చేసి విద్యార్థినిని అభినందించారు. ఈ క్రమంలో తన కుటుంబ పరిస్థితుల గురించి సీఎంకు వివరించింది విద్యార్థిని. దీంతో ఆమెకు నెలకు రూ.20వేల స్కాలర్షిప్ ప్రకటించారు ముఖ్యమంత్రి. అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ‘ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించటమే గగనంగా మారింది. అందుకే మా పరిస్థితులపై ముఖ్యమంత్రికి తెలియజేశాను. స్కాలర్షిప్ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ’ అని విద్యార్థిని తల్లి ఊర్మిళ పేర్కొన్నారు. ఇదీ చదవండి: Ukraine Students: ‘మా పిల్లల భవిష్యత్తుకు కేంద్రమే భరోసా కల్పించాలి’ -
రాత మారితే తలరాత మారుతుంది.. సులువైన ఈ టిప్స్ పాటిస్తే చాలు!
బాలానగర్/హైదరాబాద్: అందమైన చేతిరాతతో ఏ పబ్లిక్ పరీక్ష అయినా మంచి మెరుగైన మార్కులు సాధించడానికి ఉపమోగపడుతుందని చేతి రాత నిపుణులు అంటున్నారు. అక్షరాలను ముత్యాల్లాగా రాసేవారికి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెబుతున్నారు. పరీక్ష ఏదైనా విద్యార్థులు మంచి మార్కులు సాధించాలంటే చేతిరాత ఓ ఆయుధం అని ఉపాధ్యాయులు సైతం పేర్కొంటున్నారు. విద్యార్థులకు రాతతో పాటు పరీక్ష రాసే విధానంపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. పాటించాల్సిన మెలకువలు... చదవండి👉🏻 300 మందికి పైగా ఔట్సోర్సింగ్ జేపీఎస్‌లకు ఉద్వాసన ► ప్రశ్నకు జవాబు రాసే తీరు పరీక్ష పేపర్ దిద్దడానికి ఇబ్బంది పెట్టే విధంగా ఉండరాదు. విద్యార్థులు రాసే సమాధానాలు ఉపాధ్యాయుడికి తెలుసన్న సంగతి గుర్తుంచుకోవాలి. ► జవాబు పత్రాలు ఆకట్టుకోవాలంటే పేజీకి 18 నుంచి 19 లైన్ల వరకు మించి రాయకూడదు. ► మెదటి లైను రాసే సమయంలో మార్జిన్ చేస్తూ సమాంతరంగా రాయకపోతే మిగతా లైన్లు క్రమపద్ధతిలో రావు. ► వరుస ముగింపులోని పదం పూర్తిగా ఉండేలా చూసుకోవాలి. అలా కాకుండా ఒక అక్షరం ఒక వరుసలో వచ్చి మిగిలిన అక్షరాలు మరో వరుసలో రాయకూడదు. అలా రాస్తే పరీక్ష పత్రాన్ని దిద్దేవారికి పూర్తి పదం త్వరగా అర్ధం కాకపోవచ్చు. ► అంకెలు రాసేటప్పుడు స్పష్టత లేకపోతే ఉపాధ్యాయుడు అర్ధం చేసుకోలేక మార్కులు వేయకపొవచ్చు. ► సైన్స్ (సామాన్య శాస్త్రం)లో బొమ్మలు గీస్తే ఆ బొమ్మల్లోని భాగాలు గుర్తించడంలో ఒక క్రమ పద్ధతిని పాటించాలి. ► కొన్ని పాఠశాల్లో విద్యార్థులు గీతల పేజీల నోట్‌బుక్‌లో జవాబులు రాస్తుంటారు. అటువంటి విద్యార్థులు తప్పనిసరిగా తెల్ల కాగితాలపై సాధన చేయాలి. ► జవాబు పత్రం పైభాగంలో అంగుళం స్థలం వదలాలి. ఎడమ వైపు అదే స్థాయిలో మార్జిన్ విడిచిపెట్టాలి. కుడివైపున అర అంగుళం ఖాళీ విడిచి రాయాలి. ► గణితంకు సంబంధించి అంకెలు సక్రమంగా రాయాలి. ► వ్యాకరణ దోషాలు లేకుండా జాగ్రత్తపడాలి. జవాబులు రాయడం మెదలు పెట్టిన స్థలం నుంచి చివరి వరకు సమాంతరంగా రాయాలి. అక్షరాలు పైకి లేదా కిందికి రాయకూడదు. ఒక వరుస ఎలా రాస్తే మిగిలిన వరుసలు కూడా అలానే రావడంతో పాటు జవాబు పత్రం కూడా చూడ ముచ్చటగా చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది. పదం పదం మధ్యలో తగిన ఖాళీ ఉండాలి. చదవండి👉 మనీషా సాబూ ఉన్నత పదవి ఉపాధ్యాయుడి సూచనతో చదువు, చేతి రాతపై దృష్టి సారించా.. అక్షరాలు నీటిగా రాస్తే మీ చేతిరాత మార్కులను తెచ్చిపెడుతుందని మా ఉపాధ్యాయులు శ్రీశైలం అంటూండే వారు. ఆయన మాటలు నమ్మిన నేను పదో తరగతిలో కాస్లు ప్రారంభం నుంచే చేతిరాత మీద దృష్టి సారించా. ప్రతి రోజు హిందీ, తెలుగు, ఇంగ్లిష్ ఒక్కో పేపర్ చొప్పున రాస్తుండే వాడిని. ఇప్పుడు నా చేతి రాత నాకే చాలా అందంగా కనిపిస్తోంది. ఇది వరకు నాకే అర్థమయ్యేది కాదు. నా రాతను చూసి మా ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు మెచ్చుకుంటున్నారు. పదో తరగతి పరీక్షల్లో మంచిగా చదవడంతో పాటు నా చేతి రాతతో మంచి మార్కులు సాధిస్తా. – రవిశంకర్, విద్యార్థి, బాలానగర్ చేతి రాతతోనే ఎన్నో అంశాలు గుర్తుండిపోతాయి ఎవరైనా ఏదైనా అంశాన్ని పదిసార్లు చదివిన దానికంటే ఒకసారి రాస్తే చాలు గుర్తుండిపోతుంది. అందుకే నేను ప్రతి రోజూ చేతి రాతను ప్రాక్టీస్ చేస్తున్నా. ఉపాధ్యాయులు పెట్టే పరీక్షల్లో మంచి మార్కులు వస్తుండేవి. అంతే కాకుండా వేగంగా రాయడం అలవాటైంది. మా ఉపాధ్యాయులు నా కృషికి తగ్గ విధంగా గతంలో కంటే ఇప్పుడే మంచి మార్కులు వేస్తున్నారు. నా చేతి రాత బాగుంటుందని మెచ్చుకుంటున్నారు. – గౌతమి, బాలానగర్ చదువుతో పాటు చేతి రాత కూడా ముఖ్యమే.. ప్రతి విద్యార్థికి చదువుతో పాటు అందమైన చేతి రాత కూడా ముఖ్యమే. అందుకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలు పాటించాలి. చేతి రాతే భవిష్యత్‌లో ప్రభావం చూపుతుంది. మంచి మార్కులు రావటానికి దోహదపడుతుంది. అందుకే నేను నా విద్యార్థులకు ముందుగా చదువుకంటే మీరు పరీక్షల్లో రాసే జవాబులు అర్థమయినప్పుడే ఉపాధ్యాయులకు మన మీద మంచి భావం ఏర్పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ చేతి రాతను మంచిగా నేర్చుకొనేందుకు చేయూత అందిస్తున్నా. – ఎం.శ్రీశైలం, చేతి రాత నిపుణులు, బాలానగర్ -
వివక్ష, వివాదం ఉంటేనే జోక్యం
న్యూఢిల్లీ: ప్రభుత్వ పాలనా విధానాల్లో స్పష్టంగా వివక్ష, వివాదకర అంశాలు ఉన్న సందర్భాల్లోనే కోర్టులు కలగజేసుకోవాలని, విధానాలు సవ్యంగా ఉన్నపుడు జోక్యం అనవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. బోనస్ మార్కుల విషయంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎన్హెచ్ఎం, ఎన్ఆర్హెచ్ఎం సిబ్బంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ధర్మాసనం విచారించింది. ‘ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ అవసరాలకు తగ్గట్లుగా శిక్షణ పూర్తిచేసుకుని రాజస్తాన్ గ్రామీణ, ఎడారి ప్రాంతాల్లో పనిచేసిన ఆ సిబ్బందికి అదనపు పరిజ్ఞానం, అనుభవం ఉంటుంది. అందుకే వారికి అదనంగా బోనస్ మార్కులు ఇవ్వడం సబబే. ఇలాంటి పరిపాలనా విధానాల్లో కలగజేసుకోవడంలో కోర్టులు తొందరపాటు పనికిరాదు. వివాదాలు ఉంటేనే న్యాయం అందించేందుకు నెమ్మదిగా జోక్యం చేసుకోవాలి’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అనవసర వ్యాఖ్యలొద్దు న్యూఢిల్లీ: ఏదైనా కేసుపై విచారణ జరిపేటప్పుడు దానితో సంబంధం లేని అనవసర వ్యాఖ్యలు చేయద్దని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టులు పరిధులను అతిక్రమించరాదని, వాద, ప్రతివాదుల మధ్య వివాదాలకు తలెత్తేలా వ్యవహరించరాదని, అనవసర వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఓ టెండర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత్ ఫ్రిట్జ్ వెర్నర్ లిమిటెడ్ అనే సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో హైకోర్టు వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఢిల్లీ హైకోర్టు కనీసం రిట్ పిటిషన్ అర్హతను కూడా నిర్ణయించలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆక్షేపించింది. కేసుతో సంబంధం లేని అనవసర వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హితవు పలికింది. -
AP: టెన్త్ పరీక్షల్లో గ్రేడ్లతో పాటు మార్కులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఇకపై విద్యార్థులకు గ్రేడ్లతో పాటు మార్కులు కేటాయించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం జీవో 55 విడుదల చేశారు. 2019–20 విద్యాసంవత్సరం నుంచి ఇది వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 6 నుంచి 10వ తరగతి వరకు గ్రేడింగ్ విధానం అమల్లో ఉంది. 2018–19 వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలలో గ్రేడింగ్ విధానం అమలు చేశారు. కరోనా కారణంగా 2019–20, 2020–21 సంవత్సరాల విద్యార్థులకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగలేదు. దీంతో విద్యార్థులు ఆయా తరగతుల్లో ఏడాదిపాటు నిర్వహించిన పరీక్షల్లో అంతర్గత మార్కుల ఆధారంగా టెన్త్ ఫలితాలు ప్రకటించారు. చదవండి: అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు హైపవర్ కమిటీ సూచనల మేరకు ఈ ఫలితాలను ఇచ్చారు. హైపవర్ కమిటీ సూచన మేరకు విద్యార్థులకు గ్రేడ్లతో పాటు మార్కులను కూడా అవార్డు చేయనున్నారు. పై చదువులకు, ఉపాధి అవకాశాలకు మెరిట్ నిర్ణయించేటప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2019–20 బ్యాచ్ నుంచి టెన్త్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల్లో గ్రేడ్లతో పాటు మార్కులు కూడా ఇస్తారు. చదవండి: ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ బీమా -
ఓవరాక్షన్లో మెడల్‌ను గట్టిగా కొరికేశాడు, ఆపై..
సాధారణంగా ఒలింపిక్స్ మెడల్స్ సాధించి.. ఫొటోగ్రాఫర్ల ఫోజుల కోసం పంటిగాట్లు పెట్టినట్లు అథ్లెట్లు నటించడం చూస్తున్నదే. కానీ, ఓ మేయర్ అతి వల్ల జపాన్‌లో రాజకీయ దుమారం చెలరేగింది. అథ్లెట్ నుంచి మెడల్ అందుకుని.. కసితీరా పంటితో గాట్లు పెట్టాడు ఆయన. ఈ చర్యకతో ఆయనకి వ్యతిరేకంగా ఏడు వేల ఫిర్యాదులు రావడం విశేషం. సాఫ్ట్ బాల్ ప్లేయర్ మియూ గోటో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం కైవసం చేసుకుంది. సంబురాల్లో భాగంగా సొంత వూరు జపాన్ సెంట్రల్ సిటీ నయోగాలో జరిగిన ఓ ఈవెంట్‌కి ఆమె హాజరైంది. అక్కడే ఆ నగర మేయర్ టకాషి కవామురా అత్యుత్సహం ప్రదర్శించాడు. ఆమె నుంచి గోల్డ్ మెడల్‌ను అందుకుని మెడలో వేసుకున్న కవామురా.. తన ముఖానికి ఉన్న మాస్క్ కిందకి లాగేసి మరీ ఆ గోల్డ్ మెడల్‌ను గట్టిగా కొరికేశాడు. మెడల్‌పై పంటిగాట్లు బలంగా పడ్డాయి. ఈవెంట్ తర్వాత ఆ డ్యామేజ్ చూసి ఆందోళన చెందిన మియూ వెంటనే టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకుల్ని సంప్రదించింది. చదవండి: గ్రేటెస్ట్ జాబితాలో బల్లెం వీరుడి ప్రదర్శన ఇక టోక్యో నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఆ మెడల్‌ను మార్చేందుకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మార్చడానికి సుముఖత వ్యక్తం చేసింది. అంతేకాదు ఆ మెడల్ మార్పిడికి అయ్యే ఖర్చును ఐవోసీనే భరించబోతోంది. మరోవైపు కరోనా టైంలో మాస్క్ తీసేసి నిర్లక్క్ష్యంగా వ్యవహరించడం, పైగా ఆమె విజయాన్ని అగౌరవపర్చడం తీవ్ర నేరాలంటూ మేయర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెతున్నాయి. ఈ తరుణంలో తన స్థాయిని మరిచి ప్రవర్తించిన తీరుకు టకాషి కవామురా క్షమాపణలు తెలియజేశాడు. ఆమెకు కృతజ్ఞతలు ఒక టోక్యో ఒలింపిక్స్ వేదికగా మరో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. జమైకా హర్డ్లింగ్ అథ్లెట్ హన్స్లే పర్చమెంట్ 110 మీటర్ల రేసులో స్వర్ణం సాధించాడు. అయితే రేసుకి ముందు పొరపాటున వేరే వేదిక దగ్గరికి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న వలంటీర్ ఒకామె.. జరిగిన పొరపాటును గుర్తించి సరైన వేదిక దగ్గరికి వెళ్లడం కోసం హన్స్లేకి డబ్బులిచ్చి మరీ సాయం చేసింది. View this post on Instagram A post shared by Hansle Parchment, OLY (@parchment_hansle) దీంతో డిస్క్వాలిఫైయింగ్ను తప్పించుకుని అతను అర్హత సాధించడం, ఆపై ఫైనల్ రేసులో గోల్డ్ సాధించాడు. ఇక తన విజయానికి మూల కారణమైన ఆ వలంటీర్‌ను వెతుక్కుంటూ వెళ్లి మరీ కృతజ్ఞతలు తెలియజేశాడు ఈ జమైకన్ అథ్లెట్. -
నీట్(యూజీ) 2021: ఇలా ప్రిపేరయితే విజయం ఖాయం
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) –యూజీ–2021.. ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్ష! గత కొన్ని నెలలుగా.. నీట్ ఎప్పుడు జరుగుతుందా? అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు.. ఎట్టకేలకు ఎన్టీఏ స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 12న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా పరీక్ష విధానంలో కొన్ని కీలక మార్పులు ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో.. నీట్–యూజీ–2021లో మార్పులు.. పరీక్ష విధానం, ప్రిపరేషన్ గైడెన్స్.. నీట్–యూజీ–2021 నిర్వహణ తేదీపై సందేహాలకు ఫుల్స్టాప్ పెడుతూ.. ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్స్) తాజాగా పరీక్ష తేదీని అధికారికంగా ప్రకటించింది.దీంతో గత కొన్ని నెలలుగా నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. సెప్టెంబర్ 12వ తేదీన నీట్ పరీక్షను పెన్–పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. మరోవైపు నీట్లో కొత్తగా ప్రవేశపెట్టిన మార్పులను గుర్తించి.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఛాయిస్ విధానం నీట్ పరీక్షలో ఈ ఏడాది ఛాయిస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి సబ్జెక్టులో సెక్షన్బీలోని 15 ప్రశ్నల్లో పదింటికి సమాధానం ఇస్తే సరిపోతుంది. నీట్లో గతేడాది వరకు బోటనీ, జువాలజీ రెండు సబ్జెక్ట్‌లను కలిపి బయాలజీ విభాగం పేరుతో 90 ప్రశ్నలు అడిగేవారు. కాని ఈ ఏడాది బోటనీ, జువాలజీలను రెండు వేర్వేరు సబ్జెక్టులుగా పేర్కొన్నారు. ఒక్కోదాన్ని నుంచి 45 ప్రశ్నలు అడగనున్నారు. రెండు సెక్షన్లు ► మొత్తం నాలుగు సబ్జెక్ట్‌ల్లో(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ) పరీక్ష జరుగుతుంది. ► ప్రతి సబ్జెక్టులో సెక్షన్–ఏ, సెక్షన్–బీ పేరుతో రెండు విభాగాలు ఉంటాయి. ► ప్రతి సబ్జెక్టులోనూ సెక్షన్–ఏ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్–బీ నుంచి 15 ప్రశ్నలు అడుగుతారు. ► సెక్షన్–బీలోని 15 ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా వదిలేసి.. 10 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ► ప్రతి సబ్జెక్ట్ నుంచి మొత్తం 50 ప్రశ్నలు అడిగినా.. సెక్షన్–బీలో కల్పించిన ఛాయిస్ విధానం వల్ల 45 ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే సరిపోతుంది. ► అంటే.. ప్రతి సబ్జెక్ట్ నుంచి 45 ప్రశ్నలు చొప్పున.. నాలుగు సబ్జెక్టుల నుంచి మొత్తం 180 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 720 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ► నెగెటివ్ మార్కింగ్ నిబంధన ప్రకారం– ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. పదమూడు భాషలు నీట్‌ను ఇంగ్లిష్, హిందీ సహా మొత్తం 13 భాషల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తాము ఏ మాధ్యమంలో పరీక్ష రాయాలనుకుంటున్నారో తెలియజేయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ కోరుకుంటే.. కేవలం ఇంగ్లిష్ ప్రశ్న పత్రం అందిస్తారు. హిందీ కోరుకుంటే.. ఇంగ్లిష్/హిందీ ఇలా రెండు భాషల్లో.. అంటే బైలింగ్వల్ టెస్ట్ బుక్‌లెట్‌ను ఇస్తారు. అలాగే ఏదైనా ప్రాంతీయ భాషను ఎంచుకుంటే.. సదరు ప్రాంతీయ భాష/ఇంగ్లిష్ బుక్లెట్ అందిస్తారు. ఉదాహరణకు తెలుగును కోరుకున్న విద్యార్థులకు తెలుగు/ఇంగ్లిష్.. ఇలా రెండు భాషల్లో ప్రశ్న పత్రం ఉంటుంది. ఛాయిస్ కల్పించినా.. పెరగని సమయం ఈ ఏడాది నీట్లో ప్రశ్నల సంఖ్య పెంచి ఛాయిస్ విధానాన్ని కల్పించినా.. పరీక్ష సమయాన్ని పెంచలేదు. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది విద్యార్థులు అదనంగా 20 ప్రశ్నలు చదివి, వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పరీక్షలో సమయాభావానికి దారితీసే ఆస్కారముందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. సెక్షన్ బీలో 10 ప్రశ్నలు అటెంప్ట్ చేయాల్సి ఉన్నా.. మొత్తం 15 ప్రశ్నలు చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఛాయిస్‌గా వదిలేయాల్సిన ప్రశ్నలపై స్పష్టత తెచ్చుకునేందుకు సమయం పడుతుంది. బోటనీ, జువాలజీ వేర్వేరుగా ► బయాలజీ విషయానికొస్తే.. ఈ ఏడాది కొత్తగా బోటనీ, జువాలజీ పేరుతో రెండు ప్రత్యేక సబ్జెక్టులుగా పరీక్ష నిర్వహించనున్నారు. ► బోటనీలో ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్ అండ్ ఎవల్యూషన్, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్‌లను ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్ట్ట్‌లపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్స్ అండ్ పాపులేషన్, ఎకోసిస్టమ్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పాఠ్యాంశాలపై దృష్టిపెట్టడం లాభిస్తుంది. ప్లాంట్ ఫిజియాలజీలో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్‌లో కణ విభజన(సమ విభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు,కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయోమాలిక్యూల్స్ నుంచి కంటెంట్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీప్రొడక్షన్ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను బాగా అధ్యయనం చేయాలి. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్‌హెరిటన్స్‌లో రెప్లికేషన్, ట్రాన్స్‌స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, రెగ్యులేషన్లపై దృష్టిపెట్టాలి. నీట్లో ఇంటర్ సిలబస్‌లో లేని అంశాలను గుర్తించి.. వాటికోసం ప్రత్యేక సమయం కేటాయించాలి. ► జువాలజీకి సంబంధించి హ్యూమన్ ఫిజియాలజీ, ఎకాలజీ, జెనిటిక్స్, ఎవల్యూషన్ టాపిక్స్‌పై విద్యార్థులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీతోపాటు ఇంటర్ పుస్తకాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి గత ప్రశ్న పత్రాలను, ఇంటర్లో ఆయా చాప్టర్స్ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్సీఈఆర్టీ, ఇంటర్ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ► ఫిజిక్స్‌లో.. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఇంటర్ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. రొటేషనల్ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇండక్షన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లను చదవడంతోపాటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ► కెమిస్ట్రీలో.. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్ స్టేట్, ద్రావణాలు, సర్ఫేస్ కెమిస్ట్రీ; ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీ, ధర్మాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలను మర్చిపోతుంటారు. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. కెమిస్ట్రీలో ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలను వాటి వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేరవ్వాలి. ఫిజికల్ కెమిస్ట్రీలో ఫార్ములాలతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. పీరియాడిక్ టేబుల్‌పై పట్టు సాధిస్తే.. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. రివిజన్‌కు ప్రాధాన్యం ► నీట్లో మంచి స్కోర్ సాధించేందుకు విద్యార్థులు సిలబస్‌పై గట్టి పట్టు బిగించాలి. ► ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకొని.. ఆయా సబ్జెక్ట్‌ల అభ్యసనం చేయాలి. ► ప్రస్తుత సమయంలో స్వీయ సామర్థ్యాలపై స్పష్టతతో వ్యవహరించాలి. ► నిర్దిష్ట సమయంలో అవగాహన పొందేలా ముందుకు కదలాలి. ► ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం కేటాయించుకోవాలి. ► ప్రతి రోజు చదవాల్సిన టాపిక్స్‌ను ముందుగానే విభజించుకుని దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి. ► ప్రతి రోజు మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ► ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో రివిజన్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ► మోడల్ కొశ్చన్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. ► డైరెక్ట్ కొశ్చన్స్ కంటే ఇన్‌డైరెక్ట్ కొశ్చన్స్‌నే ఎక్కువ అడుగుతున్న విషయాన్ని గుర్తించాలి. దీనికి అనుగుణంగా మోడల్ టెస్ట్‌లను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. ఇది పరీక్షకు ముందు ర్యాపిడ్ రివిజన్‌కు ఉపయోగపడుతుంది. నీట్–యూజీ(2021) సమాచారం ► పరీక్ష తేదీ: సెప్టెంబర్ 12, 2021 (మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు) ► పరీక్ష వ్యవధి: మూడు గంటలు(పెన్, పేపర్ విధానంలో) ► అర్హత: బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సుల ఉత్తీర్ణత. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► వయో పరిమితి: డిసెంబర్ 31 నాటికి కనిష్ట వయోపరిమితి 17ఏళ్లు, గరిష్ట వయో పరిమితి 25ఏళ్లు ఉండాలి. ► ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: జూలై 13 నుంచి ఆగస్ట్ 6 వరకు. ► ఆన్లైన్లో దరఖాస్తులో సవరణ అవకాశం: ఆగస్ట్ 8 నుంచి ఆగస్ట్ 12 వరకు. ► పరీక్ష కేంద్రం కేటాయింపు ప్రకటన: ఆగస్ట్ 20, 2021. ► అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ సదుపాయం: పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు. ► పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తుకు వెబ్‌సైట్స్: https://ntaneet.nic.in ఈజీ టు డిఫికల్ట్ పరీక్ష రోజున అభ్యర్థులు తొలుత ప్రశ్న పత్రం చదివేందుకు పది, పదిహేను నిమిషాలు కేటాయించాలి. ఛాయిస్ సెక్షన్ విషయంలో వీలైనంత వేగంగా ప్రశ్నలను అర్థం చేసుకొని.. తమకు కచ్చితంగా సమాధానాలు తెలిసిన ప్రశ్నలపై స్పష్టత తెచ్చుకోవాలి. ముందుగా సులభమైన ప్రశ్నలతో సమాధానాలు గుర్తించడం ప్రారంభించాలి. ప్రిపరేషన్ పరంగా.. ఎక్కువ సమయం రివిజన్‌కు కేటాయించాలి. అదే విధంగా మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు హాజరై తమ సామర్థ్యం స్థాయి తెలుసుకొని.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి. – బి.రాజేంద్ర, బోటనీ సబ్జెక్ట్ నిపుణులు -
బంపర్ ఆఫర్: మొక్కలు నాటితే ఎక్స్ట్రా మార్కులు..
చండీగఢ్: చదువులో భాగంగా మొక్కలు నాటిన విద్యార్థులకు ఎక్స్ట్రా మార్కులు ఇవ్వనున్నట్లు హరియాణ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు. 8-12 తరగతుల విద్యార్థులకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన చేశారు. పంచకుల జిల్లాలోని నేచర్ క్యాంప్ తప్లి అండ్ నేచర్ ట్రయల్స్ ఆఫ్ మోర్నిహిల్స్ ప్రాంతంలో పంచకర్మ వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మనోహర్‌లాల్ ఖట్టర్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతూ.. ‘‘పర్యావరణ పరిరక్షణలో చెట్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో విద్యార్థులను ప్రకృతితో కలిపేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. రాష్ట్రపరిధిలోని పాఠశాలలకు ఈ నియమం వర్తిస్తుంది. 8-12వ తరగతి విద్యార్థులు తమ పాఠశాల పరిధిలో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలి. దీని ప్రకారం ఆఖరి పరీక్షలో వారికి మార్కులు కేటాయిస్తాం. త్వరలోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటిస్తాం’’ అని తెలిపారు. చదవండి: ఆమె అడవిగా విస్తరించింది -
అరెస్ట్‌కి డిమాండ్.. దణ్ణం పెట్టిన యువిక
సాక్షి, ముంబై : క్షణికావేశంలో నోరు జారడం.. ఇబ్బందులు చుట్టుముట్టాక క్షమాపణలు చెప్పడం సెలబ్రిటీలకు అలవాటుగా మారింది. అయితే ఏకంగా అరెస్ట్ చేయాలనేంత డిమాండ్ బహుశా బాలీవుడ్ నటి యువికా చౌదరి విషయంలోనే జరిగిందేమో!. నిమ్న వర్గాలను కించపరిచేలా కామెంట్ చేసిందంటూ #ArrestYuvikaChaudhary హ్యాష్ ట్యాగ్‌తో విరచుకుపడ్డారు ట్వీపుల్స్. ఈ మేరకు ఇన్‌స్ట్రామ్‌లో చేతులు జోడించి ఆమె నెటిజన్స్‌కి క్షమాపణలు చెప్పుకుంది. తాను మాట్లాడింది ఆ అర్థంతో కాదని, మాట్లాడేటప్పుడు తాను సోయి లేకుండా వ్యవహరించానని కామెంట్ చేసింది. తన వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని కోరుతూ ఆ వీడియోలో ఆమె కోరింది. మరోవైపు తనకు ఎవరీని నొప్పించే ఉద్దేశం లేదని ట్విట్టర్లో ఓ ట్వీట్ యువిక. ‘ఫిర్ బీ దిల్ హై హిందుస్థానీ’, ఓం శాంతి ఓం లాంటి సినిమాలతో పాటు డజనుకి పైగా టీవీ షోలతో 37 ఏళ్ల యువిక నార్త్ ఆడియొన్స్‌లో మంచి క్రేజ్ దక్కించుకుంది. View this post on Instagram A post shared by Yuvikachaudhary (@yuvikachaudhary) నటి యువికా చౌదరికి ఒక యూట్యూబ్ వ్లోగ్ ఉంది. అందులో తన భర్త హేయిర్ క్రాఫ్ చేయించుకుంటుండగా వీడియో తీసింది ఆమె. ఆ టైంలో వ్లోగ్ వీడియో తీసిన ప్రతీసారి తన అవతారం భంగీ(దళితులు, డ్రైనేజీలు శుభ్రం చేసేవాళ్లు)ల్లాగే ఎందుకు ఉంటుందో తెలియడం లేదని కామెంట్ చేసింది. ఆ కామెంట్‌పై నెటిజన్స్ విరుచుకుపడ్డారు. యువికాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్లో రెండు రోజులగా హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్ నడిపించారు. దీంతో యువికా క్షమాపణలు చెప్పింది. ఇక బుల్లితెరపై మరో నటి మున్ మున్ దత్తా యూట్యూబ్‌లో ఈ తరహా కామెంట్లు చేయడంతో ఆమెపై ఎస్సీఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. -
సొమ్ములిస్తే మార్కులేస్తాం..
భీమవరం: కరోనా వైరస్ కొన్ని విద్యాసంస్థలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత చేయిస్తామంటూ కొన్ని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ములు గుంజుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని ఒక కార్పొరేట్ విద్యాసంస్థ తమ విద్యార్థుల నుంచి సొమ్ములు వసూలుకు సంబంధించి ఫోన్లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోవిడ్–19 కారణంగా మార్చి 22వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు బ్రేక్ పడింది. కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. 10వ తరగతి పరీక్షలను జూలై నెలలో నిర్వహిస్తామని ముందుగా ప్రకటించి ఆ మేరకు షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. వైరస్ రోజురోజుకు విస్తరిస్తుండడంతో విద్యార్థులందరినీ ఒకచోట చేర్చి పరీక్షలు నిర్వహించడం వల్ల ఇబ్బందులు వస్తాయని భావించిన ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను రద్దు చేసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల మంది పదో తరగతి విద్యార్థులు ఉండగా వీరిలో సుమారు 390 ప్రైవేటు హైసూ్కల్స్‌లో 17 వేల మందికి పైగా పదో తరగతి విద్యార్ధులున్నారు. సమ్మెటివ్ ఎస్సెస్మెంట్ పరీక్ష ఫలితాల ఆధారంగా గ్రేడ్ల నిర్ణయం పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యాశాఖ ఇంతకు ముందు విద్యార్థులకు నిర్వహించిన ఫార్మటివ్ ఎస్సెస్మెంట్(ఎఫ్ఏ), సమ్మెటివ్ ఎస్సెస్మెంట్(ఎస్ఏ) పరీక్షల మార్కులు ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు నిర్ణయించాలని ఆదేశాలిచ్చింది. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు పదో తరగతి విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ములు వసూలుచేసి ఎక్కువ మార్కులు వేయడానికి కార్యాచరణ రూపొందించినట్లు తెలిసింది. విద్యా సంవత్సరం ప్రారంభం అయిన నాటి నుంచి విద్యార్థులకు నాలుగు ఫార్మటీవ్ ఎస్సెస్మెంట్, ఒక సమ్మెటివ్ అస్సెస్మెంట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరీక్షా ప్రశ్నాపత్రాలను ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులే తయారుచేస్తారు. అలాగే పరీక్షల అనంతరం వాటిని అక్కడి ఉపాధ్యాయులే వేల్యూయేషన్ చేసి మార్కులు వేస్తారు. వాటిని విద్యాశాఖ ఆన్లైన్ సీఎస్ఈ సైట్‌ను అప్లోడ్ చేస్తుంటారు. ప్రస్తుత విద్యాసంవత్సరం పూర్తిగా క్లాసులు జరగకపోవడంతో ఎఫ్ఏ పరీక్షలు మూడు నిర్వహించగా ఎస్ఏ పరీక్ష ఒకటి నిర్వహించారు. ఎస్ఏ పరీక్షలు నిర్వహించినా ఇంతవరకు వాటిని సీఎస్ఏ సైట్లో అప్లోడ్ చేయలేదని తెలిసింది. ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల మార్కులు ఆధారంగా గ్రేడ్లు నిర్ణయించడంతో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు తమ విద్యార్థులకు ఫోన్లు చేసి గతంలో మీరు ఎఫ్ఏ పరీక్ష సరిగా రాయలేదని ప్రస్తుతం ఎస్ఏ పరీక్షలో అత్యధిక మార్కులు రాకుంటే మంచి గ్రేడ్ వచ్చే అవకాశం లేనందున సొమ్ములిస్తే మంచి మార్కులు వేస్తామంటూ బేరాలు పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా ఒక్కొక్క విద్యార్ధి నుంచి రూ.5 వేలు నుంచి రూ.8 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా తెలిసింది. గతంలో రాసిన ఎస్ఏ పరీక్ష పత్రం స్థానంలో సొమ్ములు ఇచ్చిన విద్యార్థులతో మళ్లీ జవాబులు రాయించి పాతపేపర్ల స్థానంలో వీటిని పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సొమ్ముల వసూలుపై ఎవరికైనా ఫిర్యాదు చేస్తే తమ బిడ్డల భవిష్యత్తు పాడవుతందనే భయంతో తల్లిదండ్రులు నోరు మెదపడం లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు భీమవరం ప్రాంతంలోని ఒక కార్పొరేట్ స్కూల్లో విద్యార్థుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదు. అక్కడ డీఐతో విచారణ చేయించాం. ఎక్కడైనా ఇటువంటి అవకతవకలకు పాల్పడితే ఆయా విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటాం. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించక పోవడంతో ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్ష మార్కుల ఆధారంగానే విద్యార్థులకు గ్రేడ్ నిర్ణయించే అంశంపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. – సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారిణి -
మార్కులు తక్కువ వచ్చాయని చిన్నారిని హింసించిన టీచర్
-
మార్కులు తక్కువ వచ్చాయని..
చండీగఢ్ : మార్కులు తక్కువగా వచ్చాయనే ఆగ్రహంతో నాలుగో తరగతి చదివే చిన్నారి ముఖంపై నల్లరంగు పూసి స్కూల్లో అందరి ముందూ తిప్పిన టీచర్ ఉదంతం హరియాణాలోని హిసార్‌లో వెలుగుచూసింది. టీచర్ చిన్నారిని హింసించడంతో బాలిక తల్లితండ్రులు స్కూల్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు నిరసన చేపట్టారు. ఈ ఘటన చోటుచేసుకున్న ప్రైవేట్ పాఠశాలను తక్షణమే మూసివేయాలని బాధిత బాలిక తండ్రి డిమాండ్ చేశారు. ఈనెల 6న నిర్వహించిన పరీక్షలో తమ కుమార్తెకు మార్కులు తక్కువగా రావడంతో మహిళా టీచర్ తమ కుమార్తె ముఖానికి స్కెచ్ పెన్‌తో నల్లరంగు అద్దారని, స్కూల్ చుట్టూ తిప్పారని ఆయన ఆరోపించారు. చిన్నారికి పరీక్షలో మార్కులు తక్కువగా వచ్చినా టీచర్ ఇలా చేసి ఉండాల్సింది కాదని అన్నారు. మరోవైపు ఈ బాలికతో పాటు మరో ముగ్గురు బాలికల పట్ల కూడా మార్కులు తక్కువ వచ్చాయంటూ టీచర్ ఇదే తీరుగా వ్యవహరించారని విద్యార్ధులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
టిఫిన్ తినకుంటే మార్కులు తగ్గుతాయి!
లండన్: పిల్లలు ఉపాహారం తినకుండానే స్కూల్‌కు వెళ్తున్నారా? అయితే పరీక్షల్లో వారి మార్కులు తగ్గే అవకాశాలు ఎక్కువంటున్నారు శాస్త్రవేత్తలు. బ్రిటన్‌లోని కొందరు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులపై లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ఈ విషయం తేలింది. తగినన్ని పోషకాలు లేకపోవడం విద్యార్థుల మార్కులపై ప్రభావం పడుతుందని తాము గుర్తించామని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కేటీ అడోల్ఫస్ తెలిపారు. పరిగణనలోకి తీసుకున్న విద్యార్థులందరి గ్రేడ్స్‌ను పాయింట్ల రూపంలోకి మార్చినప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేసే వారికి ఎక్కువ పాయింట్లు రాగా, మిగిలిన వారికి తక్కువ వచ్చాయి. సామాజిక, ఆర్థిక స్థితిగతులతోపాటు, వయసు, బీఎంఐ, ఆడ? మగ? అన్న ఇతర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నా ఫలితాల్లో మార్పేమీ లేదని వివరించారు. -
ఇంటర్నల్ చెలగాటం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పలు ఉన్నత పాఠశాలల్లో చది విన పదోతరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల నమోదు విషయం గందరగోళంగా మారింది. మార్చి నెలలోపు జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలలు పది విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను ఆన్లైన్లో నమోదుచేశారు. అయితే ఆన్లైన్ సాఫ్ట్వేర్ తప్పిదాల వల్ల తెలుగు పరీక్ష ఫలితాలు సంస్కృతాని కి, సంస్కృతం ఫలితాలు తెలుగుకు.. ఇలా పలు లాంగ్వేజ్ ఇంటర్నల్ మార్కుల ఫలితాల్లో తప్పిదాలు చోటుచేసుకున్నా యి. ఆవిధంగా జిల్లాలో 32 పాఠశాలలున్నట్లు గుర్తించారు. వారు వెంటనే రికార్డులను తీసుకుని మరోసారి అప్లోడ్ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ అకస్మికంగా ఉత్తర్వులు జారీచేసింది. దీంతో బుధవారం ఉదయం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు డీఈఓ కార్యాలయం వద్దకు రికార్డులతోపరుగులు తీశారు. అయితే సర్వర్ మొరాయించడం, ఫలితాలు అప్లోడ్ కాకపోవడం, పరీక్షల విభాగం అధికారుల పర్యవేక్షణ లోపంతో హెచ్ఎంలు నిరీక్షిం చాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎంతసేపటికీ సర్వర్ పనిచేయకపోవడంతో పలువురు హెచ్ఎంలు వెనుదిరిగారు. 32 పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 550 మంది విద్యార్థుల ఫలితాలు నమోదు కాలేదని సమాచారం. ఇంటర్నల్ మార్కులు నమోదు కాకపోతే తుది ఫలితాల్లో వ్యత్యాసం కనిపించి విద్యార్థులు ఫెయిల్ కావడానికి అవకాశాలుంటాయని హెచ్ఎంలు అంటున్నారు. అదే జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇంటర్నల్ ఫలితాల్లో ఉన్న సమస్యలను సరిదిద్ది నమోదు చేసిన తరువాతే ఫలితాలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
సివిల్స్ టాపర్‌కు 55.35 శాతం మార్కులే
న్యూఢిల్లీ: యూపీఎస్సీ ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా టాపర్‌గా నిలిచిన కనిష్క్ కటారియా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో 55.35 శాతం మార్కులు సాధించారు. దీన్నిబట్టి యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఐఐటీ బాంబే నుంచి బీటెక్ పూర్తి చేసిన కటారియా సివిల్స్ పరీక్షలో మొత్తం 2,025 మార్కులకు గాను 1,121 (55.35 శాతం) మార్కులు సాధించగా.. అందులో రాత పరీక్షలో 942, ఇంటర్వ్యూలో 179 మార్కులు సాధించినట్లు యూపీఎస్సీ తాజాగా వెల్లడించింది. 2వ ర్యాంకు సాధించిన అక్షత్ జైన్ 1,080 మార్కులు (53.3 శాతం) సాధించగా, రాత పరీక్షలో 882, ఇంటర్వ్యూలో 198 మార్కులు సాధించారు. ఈనెల 5న యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్ 2018 పరీక్ష ఫలితాల్లో మొత్తం 759 మంది అభ్యర్థులు ఎంపికవగా అందులో 577 మంది పురుషులు, 182 మంది మహిళలున్నారు. -
ర్యాంకు ఘనం.. నైపుణ్యం శూన్యం !
గుంటూరు నగరంలోని కొరిటెపాడుకు చెందిన నరేష్ పదవ తరగతి చదువుతున్నాడు. చదువులో ముందుండే నరేష్‌కి బయట జరిగే విషయాలపై అవగాహన శూన్యం. తనకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను కూడా ఎదుర్కోలేక బేలగా తయారవుతాడు.. విషయం గ్రహించిన తల్లిదండ్రులు ఇటీవల మానసిక నిపుణుల వద్దకు తీసుకు వచ్చారు. అతనికి కౌన్సెలింగ్ చేయగా, తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు నిర్ధారించారు. లబ్బీపేట(విజయవాడ తూర్పు): నేటి విద్యా విధానం కేవలం మార్కులు, ర్యాంకులు సాధించడమే లక్ష్యంగా కొనసాగుతోంది. విద్యార్థుల్లో నైతిక విలువలు, సమస్య సాధన, ఇంటెలిజెన్స్ వృద్ధి చెందకపోవడంతో జీవితంలో సక్సెస్కాలేక చతికిల పడుతున్నారు. నేటి కాలంలో సక్సెస్ సాధించాలంటే సిలబస్‌తో పాటు, నైపుణ్యం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో వర్క్‌షాపులు, సదస్సులు నిర్వహిస్తూ వివరిస్తున్నారు. విలువలతో కూడిన బోధన అవసరం గురువు బోధన చేస్తే సోధించి సాధించే మనస్తత్వాన్ని అలవర్చుకున్నప్పుడే విద్యార్థి పరిపూర్ణవంతుడుగా ఎదుగుతాడు. పరిశోధనాత్మకంగా ఆలోచిస్తూ దేనినైనా సాధించాలనే గుణాలను కలిగి వుంటారు. కానీ నేడు విద్యార్థులతో సిలబస్‌నే బట్టీ పట్టిస్తూ ర్యాంకులు.. మార్కులు సాధించేలా తయారు చేస్తున్నారు. వారిలో ఎలాంటి స్కిల్స్ పెంపొందించకపోవడంతో కేవలం జిరాక్స్ మిషన్లు వలే మారుతున్నారనేది విద్యావేత్తలు, నిపుణులు ఆవేదన. విలువలతో కూడిన విద్యాబోధన ద్వారానే సంపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఎదుగుతాడని, సృజనాత్మకతను పెంపొందించుకుంటారని నిపుణులు చెపుతున్నారు. జీవితంలో విజయం సాధించలేక.. నేటి విద్యార్థుల్లో కమ్యునికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్స్కిల్స్, మోరల్ వాల్యూస్ పెంపొందడం లేదని చెబుతున్నారు. దీంతో సిలబస్‌ను బట్టీపట్టి ఐఐటీలో ర్యాంకు సాధించిన విద్యార్థి సైతం, అక్కడ రాణించలేక విఫలం అవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అందుకు అవసరమైన స్కిల్స్ స్కూల్స్ స్థాయినుంచి పెంపొందించాల్సిన అవసరం ఉంది. పాఠశాలలో విద్యార్థి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం పెంపొందించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెపుతున్నారు. ఇంజినీరింగు పూర్తి చేసిన విద్యార్థులు పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్ లేక ఉద్యోగావకాశాలు పొందలేక పోతున్నట్లు పారిశ్రామిక వర్గాలు చెపుతున్నాయి. మానవ సంబంధాలు కోల్పోతున్న వైనం.. విలువలనేవి నేర్చుకుంటే వచ్చేవి కావు. గురువులు, తల్లిదండ్రుల ద్వారా సమాజ స్థితిగతులను తెలుసుకుని విలువలను పెంపొందించుకోవాలి. ప్రస్తుతం తల్లిదండ్రులు బిజీ లైఫ్‌తో పిల్లలతో గడిపే సమయం లేక పోవడం, స్కూల్స్ సిలబస్‌కే పరిమితం కావడంతో నైతిక విలువలు దెబ్బతింటున్నాయి. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడంలో మోరల్ వాల్యూస్, సోషల్ రిలేషన్స్ ఎంతో కీలకమని నిపుణులు చెపుతున్నారు. ఇదే విషయమై ఇటీవల కాలంలో పలు వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. సమస్యలను పరిష్కరించుకోలేక.. నిత్యం పర్యవేక్షణతో కూడిన చదువులతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న చిన్నారులు చిన్న సమస్య ఎదురైన పరిష్కరించుకోలేక పోతున్నారు. దీంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారిలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంపొందిస్తే, ఒత్తిడిని అధిగమిస్తారనేది నిపుణుల వాదన.. జీవితంలో ఎదురయ్యే సమస్యలను సాధించడానికి కావాల్సిన మానసిక శక్తిని విద్యార్థుల్లో వృద్ధి చేయాల్సిన బాధ్యత స్కూల్స్‌పై ఉంది. విజయవాడ నగరంలోని గవర్నర్‌పేటకు చెందిన రమేష్ చదువులో చురుగ్గా ఉంటాడు. ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకులే వస్తాయి. కానీ నలుగురితో కలిసి మాట్లాడలేక పోవడం, మానవ సంబంధాలపై అంతగా ఆసక్తి చూపకపోవడం.. ఒంటరితనంలో ఆనందం వెదుక్కోవడం అతనిలో కనిపిస్తున్న లక్షణాలు.. ఆఖరికి బంధువులను ఏమని పిలవాలో కూడా తెలియని పరిస్థితికి దిగజారిపోయాడు.. దీంతో తల్లిదండ్రులు మానసిక వైద్యులను ఆశ్రయించారు. ఇలాంటి చిన్నారులను ఇటీవల కాలంలో మానసిక వైద్యుల వద్దకు తీసుకొస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. స్కిల్స్ పెంపొందించాలి నేటి విద్యార్థులు ర్యాంకులు, మార్కులు సాధిస్తున్నారే కానీ, జీవితంలో సక్సెస్ కాలేక పోతున్నారు. అందుకు వారికి అవసరమైన స్కిల్స్ పెంపొందించక పోవడమే కారణం. ప్రతి విద్యార్థిలో నైతిక విలువలు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, సోషల్ రిలేషన్స్ పెరిగేలా చూడాల్సిన బాధ్యత స్కూల్స్‌పై వుంది. ఒక విద్యార్థిలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించి పరిపూర్ణ వంతుగా తీర్చిదిద్దినప్పుడే జీవితంలో సక్సెస్‌గా రాణించగలుగుతాడు. – డాక్టర్ గర్రే శంకర్రావు,మానసిక విశ్లేషకులు -
ఎంబీబీఎస్ విద్యార్థిని బలవన్మరణం
చిట్టినగర్ (విజయవాడ వెస్ట్): మార్కులు సరిగా రాకపోవడంతో మానసికంగా కుంగిపోయిన ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపేట మాకిన వారి వీధికి చెందిన చోడవరపు జ్యోతి ప్రకాష్ ఆర్ఎంపీ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. జ్యోతి ప్రకాష్ భార్య రాజరాజేశ్వరి ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్ కాగా కుమార్తె హిమజా(22) ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతుంది. రెండో సంవత్సరంలోని కొన్ని సబ్జెక్టులు మిగిలిపోవడంతో ఇటీవల సప్లిమెంటరీ రాసింది. అందులో కూడా మార్కులు సరిగా రాలేదు. దీంతో కొంత కాలంగా మానసికంగా కుంగి పోయింది. ఈ నేపథ్యంలో హిమజా బుధవారం సాయంత్రం 5 గంటలకు యూనివర్సిటీ నుంచి ఇంటికి వచ్చిం ది. అప్పుడు తండ్రి జ్యోతిప్రకాష్ క్లినిక్ వెళ్లేందుకు బయలుదేరారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న హిమజా కొంత సేపటి తర్వాత లోపలకు వెళ్లి ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత పక్క వీధిలో నివాసం ఉండే అక్క ప్రియాంక ఇంటికి వచ్చి చూడగా చెల్లెలు ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో వెంటనే తన భర్తకు ఫోన్ చేయగా, హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటేనే తండ్రికి సమాచారం ఇచ్చి హిమజాను కిందకు దింపి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే హిమజా మృతి చెందినట్లు గుర్తించారు. కొత్తపేట పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ సుబ్రహ్మణ్యం ఘటనకు సంబంధించి వివరాలను నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
విద్యార్థులను ఇతరులతో పోల్చవద్దు
న్యూఢిల్లీ: మార్కులు, గ్రేడ్ల విషయంలో విద్యార్థులను తోటివారితో పోల్చవద్దని తల్లిదండ్రులు, టీచర్లకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సూచించింది. విద్యార్థుల్లో ఉన్న బలహీనతలను మరొకరితో పోల్చడం వల్ల వారిలో ఆత్మన్యూనతా భావం వస్తుందని ఫలితంగా ఆత్మగౌరవం దెబ్బతింటుందని పేర్కొంది. దీనికి సంబంధించి ఎన్సీఈఆర్టీ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక విద్యార్థి సాధించిన ఫలితాలను వేరొకరితో పోల్చడం సరికాదని తెలిపింది. దీని కంటే అదే విద్యార్థి గతంలో సాధించిన ఫలితాలతో పోల్చి సలహాలు, సూచనలు ఇవ్వడం ద్వారా మెరుగైన విజయాలు సాధించగలరని పేర్కొంది. అలాగే ఓ విద్యార్థి మెరుగైన ఫలితాలు సాదించినప్పుడు వారిని అభినందించడం కూడా ముఖ్యమని సూచించింది. ఇలాంటి చర్యలతో వారిలో నేర్చుకోవాలనుకునే తపనతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపింది. నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అనేది కేవలం ఉపాధ్యాయుల బాధ్యత మాత్రమే కాదని స్పష్టం చేసింది. దీనిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రిన్సిపల్స్ సహా అందరూ తమ బాధ్యతగా స్వీకరించాలని సూచించింది. -
ఏటా నిరాశే!
ఎచ్చెర్ల క్యాంపస్ విజయనగరం : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయం ఇంకా బాలారిష్టాల్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. వర్సిటీ ఏర్పాటై ఇన్నేళ్లయినా డిగ్రీలో కనీస స్థాయి ఫలితాలు సాధించలేకపోతోంది. కొత్త కొత్త ప్రయోగాలు ఎన్ని చేస్తున్నా ఉత్తీర్ణత శాతం మాత్రం పెరగడం లేదు. ప్రస్తుతం ప్రథమ సంవత్సరం డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. మూడు, ఐదు సెమిస్టర్ల క్లాస్ వర్క్ ప్రారంభం కానుంది. గతంలో వార్షిక పరీక్షలు నిర్వహించేవారు. ప్రస్తుతం సెమిస్టర్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2016లో సెమిస్టర్ విధానం ప్రారంభం కాగా, ఈ ఏడాది సెమి స్టర్ విధానంలో మొదటి బ్యాచ్ విద్యార్థులు రిలీవ్ అయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం 2008 జూన్ 25న ఏర్పాటు జరగ్గా, అఫిలియేషన్ కళాశాలలు 2010లో ఏయూ నుంచి విభజించి స్థానిక వర్సిటీకి అప్పగించారు. 2013లో మొదటి డిగ్రీ బ్యాచ్ రిలీవ్ అయ్యింది. ప్రస్తుతం వర్సిటీ పరిధిలో 12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 1 ఎయిడెడ్ కళాశాల, 88 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. డిగ్రీ ఫలితాలు మాత్రం ఏటా నిరాశాజనకంగానే ఉన్నాయి. మూడేళ్ల డిగ్రీ కోర్సులో ఆరో సెమిస్టర్ పరీక్ష రాసిన విద్యార్థులు 1, 2, 3, 4, 5 అన్ని సెమిస్టర్లలో ఉత్తీర్ణత సాధించి, ఆరో సెమిస్టర్ పాస్ అయితేనే డిగ్రీ పాస్ కిందకు లెక్క. విద్యార్థులు డిగ్రీ చివరి ఏడాది ఐదు, ఆరు సెమిస్టర్లలో 60 శాతం దాటి ఉ త్తీర్ణత సాధిస్తున్నా, బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఉండిపోతున్నాయి. ఆరో సెమిస్టర్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థి మొదటి సెమిస్టర్లో బ్యాక్‌లాగ్‌తో సతమతమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. సెమిస్టర్లలో డిటెన్షన్ విధానం లేకపోవటం వల్ల హాజరు ప్రాతిపదికన విద్యార్థులు ఆరో సెమిస్టర్ వరకు ప్రమోట్ అవుతున్నారు. దీంతో చివరి సెమిస్టర్ నాటికి విద్యార్థులకు బ్యాక్ లాగ్ సబ్జెక్టులు ఉండిపోతున్నాయి. తరగతుల నిర్వహణే ప్రధాన సమస్య వర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ తరగతుల నిర్వహణ ఎక్కడా సక్రమంగా సాగడం లేదు. బయోమెట్రిక్ హాజరు విద్యార్థులకు అమలు చేయనున్నట్లు చెబుతున్నా అమలు మాత్రం జరగడం లేదు. ప్రతి సెమిస్టర్‌కు తప్పని సరిగా 100 రోజులు తరగతులు నిర్వహించాలి. ఈ స్థాయిలో తరగతులు జరగటం లేదు. విద్యార్థులకు హాజరు మాత్రం చాలా కళాశాలల్లో నడుపుతున్నారు. దీంతో ఈ ప్రభావం ఉత్తీర్ణత శాతంపై పడుతుంది. ప్రభుత్వ కళాశాలల్లో ప్రతిభ గల విద్యార్థులు చేరుతున్నా ఫలితాలు మాత్రం ఆ స్థాయిలో రావటం లేదు. అర్హులు ఉన్నారా..? ప్రైవేట్ కళాశాలల్లో చాలా కళాశాలల్లో అర్హులైన అధ్యాపకుల కొరత ప్రధాన సమస్యగా ఉంది. పార్ట్ టైం అధ్యాపకులతో తరగతులు నెట్టుకువస్తున్నారు. వేతనాలు తక్కువగా ఇవ్వటం వంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ కళాశాలలు మాత్రమే విద్యా ప్రమాణాలు పాటిస్తున్నాయి. కొన్ని కళాశాలలు నిర్వహణకు ఇస్తున్న ప్రాధాన్యత బోధనకు ఇవ్వటం లేదు. దీంతో పరీక్షల్లో ఎక్కువగా కెమిస్ట్రీ, ఫిజిక్స్, గణితం, బోటనీ, జువాలజీ, హిస్టరీ, ఫౌండేషన్, ఇంగ్లీష్ వంటి సబ్జెక్టుల్లో విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ అన్ని కోర్సులతో పోల్చి చూస్తే డిగ్రీ ఉత్తీర్ణత అట్టడుగున ఉంటోంది. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ ఉలా అన్ని కోర్సుల్లో సైతం కనీసం 50 శాతం ఉత్తీర్ణత సాధ్యం కావటం లేదు. ఈ ఏడాది విడుదలైన ఆరో సెమిస్టర్లో 9664 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 6032 మంది ఉత్తీర్ణత సాధించారు. 63.74 శాతం ఫలితాలు నమోదు కాగా, 1, 2, 3, 4, 5 సెమిస్టర్లతో బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఉన్న కారణంగా 34.77 శాతం మంది వరకు మాత్రమే రిలీవ్ అయ్యారు. -
ఫ్చ్.. రెండు రెక్కలుండుంటే..!
చదువు దోషి కాదు.మార్కులు బోన్లో నిలబడక్కర్లేదు.ర్యాంకులు క్రైమ్ కాదు.లక్ష్యాలు శిక్షలు కావు. ఓటమి అపరాధం కాదు.లుపు చట్టం కాదు. పిల్లలు ఎగరాలనుకునే అమ్మానాన్న..వాళ్లకు రెక్కలు లేవని తెలుసుకోవాలి.ఉంటే.. ర్యాంకులు తెగిన పక్షుల్లాఇలా నేల రాలిపోతారా?! ‘‘అమ్మా.. అఖిల వాళ్లింటికెళుతున్నా! అఖిల చెల్లి హరిప్రియ రిజల్ట్స్ చూసుకొని బిల్డింగ్ పైనుంచి దూకేసిందటమ్మా! ఈ విషయం వాళ్లమ్మకింకా తెలియదట. అదొక్కతే వాళ్ల నాన్నతో పాటు వెళ్లి, ఆసుపత్రి నుంచి ఫోన్ చేసింది. హరిప్రియకు 20 పర్సంటే ఛాన్సెస్ అన్నారట’’.. అక్షిత గొంతు బొంగురుపోయింది. మరో అరగంటలో మళ్లీ ఫోనొచ్చింది... హరిని కాపాడటానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయనీ, తను చనిపోయిందనీ! అక్షిత తల్లి అచేతనంగా నిలబడిపోయింది. (ఇటీవలే హైదరాబాద్‌లో జరిగి, మీడియా దృష్టికి రాని ఒక దుర్ఘటన ఇది. గోప్యత కోసం పేర్లు మార్చాం). ఎంత పని చేశావే.. నా తల్లీ! అల్లరల్లరిగా ముద్దులొలికిస్తూ ఆడిపాడే హరిప్రియ చనిపోయిందా? నమ్మలేకపోయింది అక్షిత తల్లి. ఏ తల్లి బిడ్డయితేనేం పద్దెనిమిదేళ్లు కడుపులో పెట్టుకొని పెంచుకున్న బంగారు తల్లి బలవంతంగా చావుని కోరి తెచ్చుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎంత త్వరగా వెళ్లినా ఆ అమ్మాయింటికి చేరేసరికి గంటన్నర పట్టింది. అదురుతున్న గుండెలతో వాళ్ల ఇంట్లోకి అడుగుపెట్టింది అక్షిత తల్లి. ఇంకా హరిప్రియను ఇంటికి తీసుకురాలేదేమో! హాల్లో నేలమీద పడి హరిప్రియ తల్లి తలబాదుకుంటోంది. ఆమె చేతిలో హరిప్రియ బర్త్‌డే కేక్ ఇవ్వడానికొచ్చినప్పుడు వేసుకొచ్చిన కొత్తబెల్ స్లీవ్స్ టాప్! దానిని గుండెలకి హత్తుకొని హత్తుకొని ఏడుస్తోంది. ఇంట్లో ఉన్నంతసేపూ అమ్మ చుట్టూ తిరిగే తన బిడ్డ చనిపోలేదనీ, ఎక్కడికో వెళ్లుంటుందనీ, తనకి ఒంటరిగా నిద్ర పట్టదు కాబట్టి ఎక్కడున్నా వచ్చేస్తుందనీ, తనను హత్తుకుని పడుకుంటుందనీ ఇలా ఏదో కలలోలా మాట్లాడుతోంది హరి తల్లి. మధ్య మధ్యలో నమ్మక తప్పని వాస్తవం ఆమె నవనాడుల్నీ మెలిపెట్టేస్తోంది కాబోలు గట్టిగా ఏడుపు. చూసే వాళ్ల కళ్లూ ధారాపాతంగా వర్షిస్తున్నాయి. నిన్న మళ్లీ.. హైద్రాబాద్‌లో నిన్నటికి నిన్న ముద్దులొలికే జస్లీన్ కౌర్ ఆత్మహత్య పిల్లల తల్లిదండ్రుల్లో భయోత్పాతాన్ని సృష్టించింది. నీట్ (జాతీయ వైద్య విద్య)కు అర్హత సాధించలేకపోయానన్న కారణంతో.. పది అంతస్తుల మెట్లెక్కి మరీ దూకేసింది. తక్కువ ఎత్తులో నుంచయితే బతుకుతానేమోననే భయం కూడా ఉన్నట్లుంది! అన్ని మెట్లెక్కుతున్నప్పుడు ఒక్క మెట్టుదగ్గరైనా ఒక్క క్షణం ఆగి ఉంటే ఆ చిన్నారి ఆవేదన చల్లారేదేమో. కానీ ఏకబిగిన అన్నీ ఎక్కేసి అంతా దూకొద్దని కిందనించి అరుస్తున్నా వినిపించుకోకుండా దూకేసింది. అంతకన్నా విషాదం.. ఆమె తల్లి టీవీ విజువల్స్‌లో ఎవరి బిడ్డో దూకేస్తోందని చూస్తూ చివరికి అది తన కూతురేనని గుర్తించడం. ఏ రోజూ మార్కులు తక్కువొచ్చినందుకు ఆ తల్లి ఒక్కమాటా అనలేదు. అయినా జస్లీన్ తన నిండు నూరేళ్ల జీవితాన్ని బలవంతంగా ముగించుకుంది. తమిళనాడులో.. ఢిల్లీలో నీట్ పరీక్షలో సరైన ర్యాంకు రాలేదన్న బెంగతో నిరుపేద కుటుంబం తనపై పెట్టుకున్న ఆశలను అడియాశలు చేశానన్న న్యూనతతో తమిళనాడులోని విలుపురం జిల్లా చెంజి పెరవలూరుకు చెందిన 19 ఏళ్ల ప్రతిభ పురుగుల మందు తాగేసి ఆత్మహత్య చేసుకొంది. నీట్లో అతి తక్కువ మార్కులు రావడమే ఆమె బలవన్మరణానికి కారణం. ఇది తమిళనాడులో నీట్నే రద్దుచేయాలనే డిమాండ్‌ని ముందుకుతెచ్చింది. ఇదే తమిళనాడు అసెంబ్లీని ఓ కుదుపు కుదిపేసింది. నిన్ననే ఢిల్లీలో ప్రవర్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మార్కులే మింగేశాయా? దీనిని క్షణికావేదన అందామా? ఒత్తిడి అందామా? కేవలం మార్కులే వీళ్లందర్నీ మింగేసాయందామా? అప్పటి వరకూ వాళ్లు ఇల్లూ, స్కూలూ తప్ప లోకం తెలియని పిల్లలు. బాగా చదివే పిల్లలు కూడా ఎందుకిలా ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. ఒక్క వైఫల్యానికే మరణం దిశగా పయనించే పిరికితనం ఏమిటి? సరిగ్గా ఈ ప్రశ్నలోనే సమాధానం ఉందనిపిస్తుంది. లోకం తెలియకుండా పెంచడం కూడా పిల్లల్లో సవాళ్ల నెదుర్కొనే మానసిక స్థైర్యాన్ని మాయం చేస్తోంది. ఎప్పుడూ.. మార్కులెక్కువొచ్చిన పిల్లలతోనే పోలిక, తక్కువొచ్చినా ఫరవాలేదు అనే భరోసా ఇవ్వకపోవడం, విజయం సాధించేందుకు మళ్లీ మళ్లీ ప్రయత్నించే అవకాశం మనచేతిలోనే ఉందంటూ లాలించే సున్నితత్వం ఇటు తల్లిదండ్రుల్లోనూ, అటు ఉపాధ్యాయుల్లోనూ కొరవడడం వల్లనే చిన్నారుల మరణాలు సంభవిస్తాయా? మార్కుల మాయాజాలంతో పాటు పిల్లల్లో స్పోర్టివ్‌నెస్ క్షీణించడం కూడా ఇందుకు కారణం కావొచ్చు. మెడిసిను, ఇంజినీరింగేనా?! పెద్దలు పిల్లల గురించి పెద్దపెద్ద కలలకు కనడం కాదు. పిల్లలకు కలలు కనడం నేర్పాలి. ఆ కలలు సాకారమయ్యే అవకాశాలు ఒక్కటి కాదు, వందలు వేలున్నాయని చెప్పాలి. తన జీవితానికి ఒక్క మెడిసిన్, లేదంటే ఇంజనీరింగ్ ఒక్కటే కాదనీ ఇంకా మన ముందున్న ప్రత్యమ్నాయాలెన్నింటినో వారికి ప్రత్యక్షంగా చూపించాలి. బంధువుల్లోనే పడిలేచిన కెరటాలను వాళ్లకు పరిచయం చేస్తుండాలి. పదిసార్లు ఫెయిలయినా పదకొండోసారి 99 శాతం తెచ్చుకోవచ్చన్న ఆత్మవిశ్వాసాన్ని అందించాలి. ఇది కాకపోతే ఇంకొకటి. అమ్మనాన్నలని బాధించేది తక్కువ మార్కులు కాదనీ, తమ బిడ్డల మరణమే వారిని చిత్రవధ చేస్తుందనీ వారికి తెలపాలి. ప్రేమగా, లాలనగా.. గుండెలకు చేర్చుకుంటే.. మన ప్రేమలోని ప్రతి స్పర్శా వారికి కొండంత ధైర్యాన్నిస్తుంది. వాళ్లని నిండు నూరేళ్లూ బతకనిస్తుంది. దోషులు ఎవరు? విజయాలనే కాదు అపజయాలనూ స్వీకరించాలనే మనస్తత్వం పిల్లలకు తల్లిదండ్రుల నుంచే రావాలి. గెలుపుఓటములు నాణేనికి చేరోవైపేననీ, ఈ రోజు అపజయం కూడా రేపటి విజయానికి బలాన్నిస్తుందనీ నేర్పగలిగే చైతన్యం పిల్లల్లో నే కాదు, తల్లిదండ్రుల్లోనూ రావాలి. ప్రతి ఓటమి నుంచి నేర్చుకునేదెంతో ఉంటుందని అధ్యాపకులు బోధించ గలిగే ఆరోగ్యకరమైన తరగతి గదులు కావాలి. పక్కింటి పిల్లాడికో, అమ్మాయికో తక్కువ మార్కులొచ్చాయని తెలిసీ ఫోన్‌చేసి గుచ్చి గుచ్చి అడిగే బంధువులో, ఇంకొకరో.. ఈ మరణాలకి కారణం కావొచ్చు. హరిప్రియ అయినా, జస్లీన్ కౌర్ అయినా, ప్రతిభ అయినా ఇలాంటి ఏదో ఒక కారణం వాళ్లని మనస్తాపానికి గురిచేసి ఉండొచ్చు. కేవలం ఉపాధ్యాయులో, తల్లిదండ్రులో, స్నేహితులో మారడం కాదు. చదువుల అర్థం కూడా మారాలి. విద్య పట్ల అవగాహన మారాలి. హరిప్రియ అక్క ఇదే అంటోంది. ‘‘నా చెల్లి మరణానికి మా ఇంటి పరిస్థితులో, లేక పాఠశాల పరిస్థితులో కారణం కాదు. సొసైటీయే కారణం. మేమేమీ అనకపోయినా మా బంధువులో, ఎక్కడో ఉన్న మా పరిచయస్తులో ఏదైనా అంటారేమోనని, నాన్న ప్రతినిత్యం జపించే పరువు పోతుందేమోనని హరి తనువు చాలించింది. అందుకే సొసైటీలో మార్పు రావాలి’ అంటోంది తను. - అత్తలూరి అరుణ ఆత్మహత్యల నివారణకు..! తమ పిల్లల చదువుకంటే తమ పిల్లల నిండు జీవితమే చాలా ప్రధానమని తమ తల్లిదండ్రులు భావిస్తున్నారనే ఆలోచననను పిల్లలకు కలిగేలా తల్లిదండ్రుల ప్రవర్తన ఉండాలి. పిల్లలు ఈ అభిప్రాయానికి వచ్చేలా తల్లిదండ్రుల మాటలు, చేష్టలు ఉండాలి. ఈ మార్కులు, ర్యాంకులు మాత్రమే జీవితం కాదనే ఆలోచనను పిల్లలో ఎప్పుడూ కలిగిస్తుండాలి. కొందరు తల్లిదండ్రులు పిల్లలకు మొదట్నుంచీ చదువు గొప్పదనాన్ని నిత్యం నూరిపోస్తూ... పరీక్షకు ముందెప్పుడో మార్కులు తక్కువచ్చినా పర్లేదులే అని మొక్కుబడిగా అంటారు. అది సరికాదు. ఈ మాటను మనస్పూర్తిగా పిల్లలకు చెప్పాలి. పిల్లల అపజయాలకు ఎప్పుడూ వారిని అవమానించకూడదు. కించపరచకూడదు. పిల్లలను ఎప్పుడూ మరొకరితో పోల్చనే కూడదు. పిల్లల్లో ఎవరికి వారే ప్రత్యేకం. చదువుతోపాటు పిల్లలు ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉండటానికి కావాల్సినవీ చేయాలి. అలా ఉండే పిల్లలే ఎలాంటి విజయాలైనా సాధిస్తారు. - డాక్టర్ పద్మ పాల్వాయి సీనియర్ ఛైల్డ్ సైక్రియాట్రిస్ట్ -
సివిల్స్ టాపర్ మార్కులు 55.6 శాతం
న్యూఢిల్లీ: 2017లో సివిల్స్‌కు ఎంపికైన వారి మార్కులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆదివారం విడుదల చేసింది. అత్యంత కఠినంగా ఉండే సివిల్స్‌లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్ తెలుగు విద్యార్థి దురిశెట్టి అనుదీప్ 55.60 శాతం మార్కులు సాధించాడు. సివిల్స్ మెయిన్స్ 1,750 మార్కులు, ఇంటర్వ్యూ 275 కలిపి మొత్తం 2,025 మార్కులకు.. అనుదీప్ రాతపరీక్షలో 950, ఇంటర్వ్యూలో 176 మార్కులతో మొత్తం 1,126 మార్కులు సాధించాడు. రెండో ర్యాంకు సాధించిన అను కుమారి 1,124 (రాత పరీక్షలో 937, ఇంటర్వ్యూలో 187) మార్కులతో 55.50%, మూడో ర్యాంకర్ సచిన్ గుప్తా 55.40 శాతం (946 రాతపరీక్ష, ఇంటర్వ్యూలో 176) మార్కులు సాధించారు. ఈ పరీక్షల్లో 750 మంది పురుష, 240 మహిళా అభ్యర్థులు మొత్తం 990 మంది కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు అర్హత సాధించినట్లు యూపీఎస్సీ పేర్కొంది. 990వ ర్యాంకు సాధించిన హిమాంక్షి భరద్వాజ్ 830 మార్కుల (687 రాతపరీక్ష, 143 ఇంటర్వ్యూ)తో 40.98శాతం సాధించాడు. -
‘విద్యార్థులకు 2 మార్కులు కలుపుతాం’
న్యూఢిల్లీ: పదోతరగతి ఆంగ్ల ప్రశ్న ప్రతంలో దొర్లిన తప్పుకుగాను విద్యార్థులకు 2 మార్కులు కలపాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. మార్చి 12న జరిగిన ఈ పరీక్షలో ప్రశ్నపత్రంలో తప్పుదొర్లిందని విద్యార్థులు, ఉపాధ్యాయులు బోర్డు దృష్టికి తీసుకురావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఈ ప్రశ్నకు సమాధానం రాయడానికి ప్రయత్నించిన వారందరికీ రెండు మార్కులు కలపాలని బోర్డు నిర్ణయించింది’ అని సీబీఎస్ఈ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
పెరిగిన టాప్ మార్కులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ద్వితీయ సంవత్స ర ఫలితాల్లో ఈసారి టాప్ మార్కులు పెరిగాయి. గతేడాది ఎంపీసీలో టాప్ మార్కులు 993 కాగా.. ఈసారి 994 వచ్చాయి. బైపీసీలో గతేడాది 991 మార్కులు టాప్కాగా.. ఈసారి 992 మార్కులు వచ్చాయి. ఈసారి ఎంపీసీ, బైపీసీ రెండు విభాగాల్లోనూ ఇద్దరు చొప్పున విద్యార్థులు టాప్ మార్కులు సాధించారు. ఇక ఎంఈసీలో గతేడాది 986 అత్యధిక మార్కులు కాగా.. ఈసారి ఒక విద్యార్థికి 987 మార్కులు వచ్చాయి. సీఈసీలో గతేడాది 976 టాప్ మా ర్కులుకాగా.. ఈసారి ముగ్గురు విద్యార్థులు 977 మార్కులు సాధించారు. హెచ్ఈసీలో గతే డాది 950 టాప్ మార్కులుకాగా.. ఈసారి 958 టాప్ మార్కులను ఒక్క విద్యార్థి సాధించారు. ప్రథమ సంవత్సరంలో.. ఇక ప్రథమ సంవత్సరం ఎంపీసీలో గతేడాది 467 టాప్ మార్కులుకాగా.. ఈసారి కూడా 467 మార్కులే టాప్. అయితే గతేడాది టాప్ మార్కులు 12 మందికే రాగా.. ఈసారి 24 మంది విద్యార్థులకు వచ్చాయి. బైపీసీలో గతేడాది 436 టాప్ మార్కులను 11 మంది సాధించగా.. ఈసారి ఏడుగురు 437 టాప్ మార్కులు పొందారు. ఎంఈసీలో గతేడాది ఆరుగురు 493 టాప్ మార్కులు సాధించగా.. ఈసారి ఒక విద్యార్థి 495 టాప్ మార్కులు పొందారు. సీఈసీలో గతేడాది ఒక విద్యార్థి 492 టాప్ మార్కులు పొందగా.. ఈసారి టాప్ మార్కులు తగ్గిపోయాయి. ఒక విద్యార్థి మాత్రమే 490 టాప్ మార్కులు సాధించారు. గతేడాది హెచ్ఈసీలో 470 టాప్ మార్కులను ఒక్క విద్యార్థి పొందగా.. ఈసారి ఒక విద్యార్థికి 483 మార్కులు వచ్చాయి. టాపర్లు వీరే.. సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీలో టాప్ మార్కులను (994) వరంగల్ జిల్లాకు చెందిన వర్ణం శ్రీజ, ఖమ్మం జిల్లాకు చెందిన అయిలూరి శ్రుతి సాధించారు. ఖమ్మం జిల్లాకు చెందిన సహదేవుడి సాయి రాకేశ్ 993 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు. ఇక బైపీసీలో 992 మార్కులతో హైదరాబాద్‌కు చెందిన పొదిల గాయత్రి, వి. శ్రీరామ్ ఆనంద్ టాపర్లుగా నిలిచారు. తర్వాత 991 మార్కులను ఐదుగురు విద్యార్థులు సాధించారు. ఎంఈసీలో హైదరాబాద్‌కు చెందిన నగరూరు రక్షిత (987 మార్కులు) టాపర్‌గా నిలవగా.. సీఈసీలో అత్యధికంగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఆర్పీ భావన, వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన బంబాక్ హర్ష, పత్తి శృతి 977 మార్కులు పొందారు. హెచ్ఈసీలో 958 మార్కులతో హైదరాబాద్ జిల్లాకు చెందిన సుంకరి శ్రీసాయి తేజ టాపర్‌గా నిలిచారు. ప్రథమ సంవత్సరంలో.. ఫస్టియర్ ఎంపీసీలో 467 టాప్ మార్కులను 24 మంది విద్యార్థులు.. బైపీసీలో 437 టాప్ మార్కులను ఏడుగురు విద్యార్థులు సాధించా రు. ఎంఈసీలో 495 టాప్ మార్కులను హైదరాబాద్‌కు చెందిన గంపా గాయత్రి.. సీఈసీలో 490 టాప్ మార్కులను సిద్దిపేట జిల్లాకు చెందిన బోయిని శ్రీ మహాలక్ష్మి.. హెచ్ఈసీలో 483 టాప్ మార్కులను వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన జి.జాన్సన్ సాధించారు. ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్ అవుతా.. ఇంటర్లో ఎలాగైనా స్టేట్ టాపర్లలో ఒకరిగా ఉండాలనుకున్నాను. కానీ ఏకంగా నేనే టాపర్‌గా నిలవడం సంతోషంగా ఉంది. ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్ కావాలనేది నా ధ్యేయం. అమ్మ, నాన్న కృష్ణారెడ్డి, లీలావతి ఇద్దరూ రైతులే. వారిచ్చిన స్ఫూర్తితోనే ఈ విజయం సాధించాను.. – ఎ.శృతి, ఎంపీసీ స్టేట్ టాపర్ (994 మార్కులు) ఐఏఎస్ కావడమే లక్ష్యం నమ్మకంతో చదివిస్తున్న తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చేందుకు ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహం, సూచనలతోనే మంచి మార్కులు సాధించగలిగా. మరింత పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటా.. – ఆర్.పి.భావన, సీఈసీ స్టేట్ టాపర్ (977 మార్కులు) -
పరీక్షల బెంగతో విద్యార్థి ఆత్మహత్య
పీలేరు : మండలంలోని తలపుల పంచాయతీ జంగంపల్లెలో చెరువులో దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. జంగంపల్లెకు చెందిన జి.ఎం.కృష్ణయ్య, రేణుక దంపతుల పెద్ద కొడుకు భానుప్రకాష్ (15) తలపుల హాస్టల్లో ఉంటూ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. ఎంత చదివినా పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తున్నాయని నెల రోజులుగా మథనపడే వాడు. మరింత కష్టపడితే పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయని తల్లిదండ్రులు ధైర్యం చెప్పేవారు. మంగళవారం సాయంత్రం పాఠశాలలో సంకల్పం కార్యక్రమంలో భాగంగా సోషియల్ పరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో భానుప్రకాష్తోపాటు అతని స్నేíßహితుడు బిట్లను చూసి రాసినట్టు గుర్తించిన ఉపాధ్యాయుడు ఇద్దరినీ మందలించారు. ఇలా చేయడం వల్ల పబ్లిక్ పరీక్షల్లో పట్టుబడితే డిబార్ అవుతారని హెచ్చరించారు. మరింత కష్టపడితే మంచి మార్కులు వస్తాయని వివరించారు. ఈ విషయాన్ని భానుప్రకాష్ తండ్రి కృష్ణయ్యకు ఉపాధ్యాయుడు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. మార్కులు తక్కువ వస్తున్నాయని.. ఎంత చదివినా పాఠ్యాంశాలు గుర్తుండకపోవడం, మార్కులు తక్కువగా వస్తుండడంతో ఆవేదన చెం దాడు. స్కూల్ నుంచి హాస్టల్‌కు వెళ్లిన భానుప్రకాష్ హాస్టల్లో పుస్తకాల బ్యాగు పెట్టి ఎక్కడికో వెళ్లి పోయాడు. భానుప్రకాష్ కనిపించడం లేదన్న విషయాన్ని హాస్టల్ ఇన్చార్జి వార్డెన్‌కు పిల్లలు తెలి పారు. ఆందోళనకు గురైన వార్డెన్ వెంటనే విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు తెలిపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిసర గ్రామాలు, బంధువుల ఇళ్ల వద్ద గాలించినా ఆచూకీ లేదు. బుధవారం సాయంత్రం హాస్టల్ సమీపంలోని గోవిందరెడ్డి చెరువులో విద్యార్థి మృతదేహం తేలడాన్ని స్థానికులు గుర్తించారు. విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్తులు, బంధువులు చెరువు వద్దకు చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. పీలేరు ఎస్ఐ సుధాకర్‌రెడ్డి విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి మృతిపై తలపుల హెచ్ఎం బాబురెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కష్టపడి చదివి ఉద్దరిస్తాడనుకున్న కొడుకు అకాలమరణంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. -
ఆన్లైన్లో విద్యార్థుల మార్కులు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల మార్కులను ఆన్లైన్లో పొందుపరిచేందుకు పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థుల సమగ్ర వివరాలను అప్లోడ్ చేసే చైల్డ్ఇన్ఫో వెబ్సైట్లో మార్కులనూ అప్లోడ్ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాలలు ఏటా నాలుగుసార్లు నిర్వహించే ఫార్మేటివ్ పరీక్షలు, రెండుసార్లు నిర్వహించే సమ్మేటివ్ పరీక్షల్లో వచ్చే మార్కుల వివరాలు ప్రస్తుతం ఆన్లైన్లో పొందుపరచటం లేదు. దీంతో ఆ పరీక్షలు ఎలా నిర్వహిస్తున్నారు? విద్యార్థులకు ఎన్ని మార్కులు వేశారు? అన్న వివరాలు తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మార్కుల వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని నిర్ణయించింది. తద్వారా భవిష్యత్తులో పూర్తి వివరాలను ఒక్క క్లిక్‌తో పొందటంతో పాటు నకిలీ సర్టిఫికెట్లకు ఫుల్స్టాప్ పెట్టవచ్చని విద్యాశాఖ భావిస్తోంది. -
ప్రతిభకు మార్కులు కొలమానం కాదు
సాక్షి, సిద్దిపేట: విద్యార్థుల ప్రతిభకు మార్కులే కొలమానంగా పెట్టి చూడటం సరికాదని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు, ప్రముఖకవి నందిని సిధారెడ్డి అన్నారు. కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించిన బాల ప్రతిభా మేళా కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ప్రతీ విషయంపై అవగాహన కలిగించేలా చూడాలని, అందుకు ముందుగా వారు ఉపాధ్యాయుడు చెప్పిన విషయాన్ని వినేలా ప్రోత్సహించాలని చెప్పారు. బట్టీ పట్టించడం, మార్కులు ఎక్కువగా వస్తే తెలివైన విద్యార్థిగా చిత్రీకరించడం సరికాదన్నారు. విద్యార్థుల మనసులో మెదిలే ప్రతీ ఆలోచన బహిర్గతం చేసేలా స్వేచ్ఛనివ్వాలని, తప్పొప్పులను చెప్పి నూతన ఆవిష్కరణలకు దోహదపడేలా ప్రోత్సహిం చాలన్నారు. తనకు చిన్నప్పుడు పాటలంటే ఇష్టమని, కానీ వాటిని పాడటం కష్టంగా ఉండేదని, పాటలు రాసి ఇతరులు పాడితే సంతోషపడ్డానని అన్నారు. సీఎం కేసీఆర్ చిన్ననాటి నుంచి ఉపన్యాస పోటీల్లో ముందుండే వారని, అదే ఆయనను మంచి వక్తగా మార్చి తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచేందుకు దోహద పడిందన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు రాష్ట్రం ముస్తాబవుతున్న తరుణంలో ఇటువంటివి నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్ డైరెక్టర్ సజన, కవి సీతారాం, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇకపై అభ్యర్థుల మార్కులు బహిర్గతం
న్యూఢిల్లీ: పోటీ పరీక్షల్లో అభ్యర్థులు సాధించే మార్కుల వివరాలను ఇకపై ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. ఈ మార్కుల ఆధారంగా ప్రైవేటు సంస్థలు కూడా నియామకాలు చేపట్టడానికి తోడ్పడుతుందని పేర్కొంది. ఇందులో భాగంగా యూపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షల్లో తుది ఇంటర్వూ్య వరకు వెళ్లిన అభ్యర్థుల విద్యార్హతతోపాటు ఈ పోటీ పరీక్షలో సాధించిన మార్కులను ఆన్లైన్లో పొందుపరచనున్నారు. తద్వారా అభ్యర్థుల ప్రతిభ, సామర్థ్యాన్ని ప్రైవేటు సంస్థలు గుర్తించి వారికి ఉపాధి కల్పిస్తాయని యూపీఎస్సీ పేర్కొంది. ఇందుకోసం పబ్లిక్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు వీరి సమాచారాన్ని అనుసంధానం చేసేలా అంతర్గత సమాచార వ్యవస్థతో కూడిన వెబ్‌సైట్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అభివృద్ధి చేస్తోంది. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేపుడు అభ్యర్థులు తమ సమాచారాన్ని బహిర్గతం చేయడానికి సుముఖంగా ఉన్నారా లేదా అన్న విషయాన్ని తెలపాల్సి ఉంటుంది. -
ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
దేవనకొండ: మార్కులు తక్కువ వచ్చాయనే కారణంతో బుధవారం.. ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది. ఈ ఘటన దేవనకొండ మండలం డీ కోటకొండ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కృష్ణ స్వామిల కుమార్తె సునిత(17) కర్నూలులోని ఓ కళాశాలలో ఇంటర్ సీఈసీ గ్రూపు చదివింది. ఇటీవల వచ్చిన ఫలితాల్లో మార్కులు తక్కువచ్చాయని కుంగి పోయింది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. -
ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
– మార్కులు తక్కువ వస్తాయని భయపడి ఆత్మహత్య ఎమ్మిగనూరు రూరల్: మార్కులు తక్కువ వస్తాయని భయపడి గుడేకల్ గ్రామానికి చెందిన ఇంటర్ మీడియట్ విద్యార్థిని..బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు...నందవరం మండలం నాగలదిన్నె గ్రామానికి చెందిన కొండయ్య, శాంతమ్మలకు కుమార్తె కె.ఇందిరమ్మ ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజిలో రెండో సంవత్సరం బైపీసీ చదువుతుంది. నాగలదిన్నె నుంచి రోజు బస్సుకు రావటం ఎందుకని మండల పరిధిలోని గుడేకల్‌లో తన తాత గోవిందప్ప దగ్గర ఉంటోంది. రెండు రోజుల కిత్రం ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. మొదటి సంవత్సరంలో ఒక సబ్జెక్్ట ఫెయిల్ అయ్యానని, రెండో సంవత్సరం పరీక్షలు సరిగా రాయలేదని ..మార్కులు తక్కువ వస్తాయని మదన పడేది. బుధవారం ఇంట్లో ఎవరూ లేకపోవటంతో చీరతో ఉరివేసుకుంది. విగతజీవిగా మారిన మనవరాలిని చూసి అవ్వాతాతలు బోరున విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ వేణుగోపాల్ పేర్కొన్నారు. -
సర్వేలో నాకు మార్కులు తగ్గాయట..!
ఒళ్లు దగ్గరపెట్టుకుని పని చేయాల్సిందే సిరిసిల్ల: ‘సర్వేలో నాకు మార్కులు తగ్గాయట.. జాగ్రత్తగా పనిచేయాలి.. ఇక ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాల్సిందే’నని మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో శనివారం సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్యకర్తలతో కొంతగ్యాప్ వచ్చిన మాట వాస్తవమేనని, కానీ మున్ముందు అందుబాటులో ఉంటానన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమంపై స్పష్టమైన మాస్టర్ ప్లాన్, విధానం తనకు ఉందన్నారు. తనను ఇంతవాణ్ణి చేసిన ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. బూత్‌స్థాయిలో పార్టీ సభ్యత్వాలు ఇవ్వాలన్నారు. -
కేసీఆర్ మార్కులు నాకెందుకు?: జానా
సాక్షి, హైదరాబాద్: ‘‘నా నియోజకవర్గంలో నాకు సానుకూల పరిస్థితులున్నాయి. కేసీఆర్ వేసే మార్కులు నాకు అవసరం లేదు. ఇలాంటి సర్వేలపై ఆధారపడి కాదు... ప్రజలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నా’’అని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగం తర్వాత తన చాంబర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేలపై, వాస్తవ పరిస్థితులపై మీడియా కూడా సరైన విశ్లేషణలను అందించడం లేదన్నారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం సర్వేలను చేయించడం దుబారా ఖర్చన్నా రు. ‘‘నేను ఓడిపోతానని పోటీ చేసిన ప్రతీ సారి సర్వేలు చేసి చెప్పారు. అయినా అన్నిసార్లు గెలిచాను. ఈ సర్వేలు కేవలం చదువుకోవడానికే. ఎవరో సీఎం అవుతారని అనగానే అయిపోము. దానికి చాలా సమీకరణాలుంటాయి’ అన్నారు. తాను సీఎం అవుతానని ఏనాడూ, ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. -
లవ్ లెటర్‌కు మార్కులు వేసిన లవర్
-
ఒత్తిడితో బాల్యం చిత్తు
–చదువుల పరుగులో రనౌట్ –ఇష్టమైన రంగాన్ని ఎంచుకోనివ్వని తల్లిదండ్రులు –కార్పొరేట్లో బాల్యం సమిధ యూనివర్సిటీ క్యాంపస్: నేటి తల్లిదండ్రులది ఒకటే కోరిక.. అదేమంటే.. తమ పిల్లలు ఐఐటీల్లో సీటు సాధించాలి. ఇంజినీరు కావాలి. లేదా మెడిసిన్ సీటు సాధించి డాక్టర్ కావాలి. దానికోసం ఎంత ఖర్చయినా భరించడానికి.. ఏ కష్టమైనా పడటానికి సిద్ధం అన్న ధోరణిలో ఉన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న తల్లిదండ్రులు కూడా ఇదే ఆలోచనా సరళితో ఉన్నారు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు తమలా తమ పిల్లలు కష్ట పడకూడదని తలుస్తున్నారు. అందుకోసం లక్షలు వెచ్చించి కార్పొరేట్ సంస్థల్లో చేర్పిస్తున్నారు. దీంతో తరగతి గదుల్లో వికసించాల్సిన బాల్యం ఒత్తిడికి గురై, మోడువారి పోతుంది. ప్రస్తుతం ఆత్మహత్యలకు పాల్పడే వారిలో 90 శాతం టీనేజీ వారే ఉండగా, వారిలో చదువు కారణంగా ఆత్మహత్యకు చేసుకునేవారు 75 శాతం ఉన్నారు. ఈ గణంకాలు పరిశీలిస్తే చిన్నారుల ఆత్మహత్యలు ఎంత ప్రమాదకరస్థాయిలో ఉన్నాయో అవగతమవుతుంది. విద్యార్థి ఆసక్తికి తగ్గిన ప్రాధాన్యం ర్యాంకులు, డాక్టర్ , ఇంజినీరు చదువులే లక్ష్యంగా ప్రస్తుత విద్యావిధానం కొనసాగుతోంది. పాఠశాలల యాజమాన్యాలు కూడా తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగా నడుస్తున్నాయి. విద్యార్థులకు ఇష్టమైన చదువు చదువుకునే స్వేచ్ఛ ఇవ్వడం లేదు. విద్యార్థుల్లోని ఇష్టాన్ని, వారికి ఏ రంగంపై ఆసక్తి ఉందన్న విషయం గుర్తించి ప్రొత్సాహిస్తే అందులో వారు రాణించగలరు. ప్రఖ్యాత క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తాను చదువులో ఫెయిల్ అయినప్పటికీ తనకు ఇష్టమైన క్రికెట్లో రాణించి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు అందుకున్నారు. నిన్నటికి నిన్న పీవీ సింధు రియో ఒలంపిక్స్‌లో రజతం సాధించి పేరు ప్రఖ్యాతులు సాధించారు. అలాగే చిన్నతనంలో పేపర్ బాయ్ పనిచేసిన అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్‌గా ఎదిగి రాష్ట్రపతి అయ్యారు. ప్రపంచంలో 64 కళలు ఉన్నాయి. ఏ కళపైన అయినా ఆసక్తిని గుర్తించి ప్రోత్సహిస్తే వారు రాణిస్తారు. అయితే ఆ దిశగా ఏ తల్లీదండ్రీ ఆలోచించడం లేదు. ఫలితంగా వికాసానికి బాటలు వేయాల్సిన విద్య, భారంగా మారుతోంది. విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. దాన్ని తట్టుకోలేక, అనుకున్న లక్ష్యాలు సాధించలేక, తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలు నెరవేర్చలేని స్థితిలో చిన్నారులు బలవర్మణాలకు పాల్పడుతున్నారు. నిబంధనలు ఏం చెపుబుతున్నాయంటే.. దేశంలో విద్యావిధానంపై కొఠారి కమిషన్ కొన్ని సిఫారసులు చేసింది. అలాగే 1952లో మొదలియార్ కమిషన్ ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య ఎలా ఉండాలన్న అంశంపై పలు సిఫారసులు చేసింది. 2010 ఏప్రిల్ 1నుంచి అమలులోకి వచ్చిన విద్యహక్కు చట్టం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేయమని చెప్పింది. అయితే అది విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య అయి ఉండాలి. విద్యార్థుల మానసిక వికాసం ఎదుగుదలకు అవకాశం ఇవ్వాలి. ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి 1:25 గా ఉండాలి. ప్రతి పీరియడ్ 45 నిమిషాల పాటే ఉండాలి. ఉదయం 4, సాయంత్రం 3 పీరియడ్లు మాత్రమే ఉండాలి. ఇందులో కో–కరికులం యాక్టివిటీస్ అంటే క్రీడలు, సంగీతం, నత్యం, కళలకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే 6 గంటలకు మించి విద్యార్థులకు తరగతులు నిర్వహించకూడదు. విద్యార్థులను శిక్షించకూడదు. ఐదేళ్లు నిండిన తరువాతే పాఠశాలలో చేర్చాలి. అర్హత కల్గిన ఉపాధ్యాయులను నియమించాలి. ఏదేనా ప్రమాదం జరిగితే ప్రతి గదికి ఫైర్ ఇంజన్ వెళ్లే విధంగా విద్యాసంస్థ భవనాలు ఉండాలి. చక్కటి క్రీడా మైదానం ఉండాలి. తప్పని సరిగా సైకాలజిస్ట్ ఉండాలి. జరుగుతుందేమిటి? నిబంధనల్లో ఉన్నదానికి విరుద్ధంగా నేటి విద్యావిధానం కొనసాగుుతోంది. గాలి, వెలుతురు లేని గదుల్లో వందకు మించి విద్యార్థులను కుక్కుతున్నారు. అపార్ట్మెంట్లు, ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. అర్హతలేని వారితో విద్యబోధన చేయిస్తున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. హాస్టల్ విద్యార్థులను ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు చదివిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు 6 గంటలు కూడా నిద్ర పోలేక పోతున్నారు. సరైన మార్కులు పొందని తెచ్చుకోని వారిని అవమానాలకు గురి చేస్తున్నారు. వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. తల్లిదండ్రల నుంచి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఇదే నేటి ఈ పరిస్థితికి దారితీస్తోంది. -
అమ్మా నాన్నా.. ఆలోచించండి
– మార్కులు, ర్యాంకుల విధానంతో అసలుకే మోసం – కన్నపేగుకు కడుపుకోతను మిగులుస్తున్న వైనం – ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ వైఖరిని మార్చుకోవాలి – కళాశాలలు, ఇంటి వాతావరణం మారాలన్న విద్యావేత్తలు మార్కుల వేటలో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. తమ కళాశాల విద్యార్థి అగ్రస్థానంలో ఉండాలని కళాశాలలు, తమ బిడ్డను ఉన్నత స్థానంలో చూడాలని తల్లిదండ్రులు ఆశిస్తుండటమే ఇందుకు కారణం. కన్నవారి, కళాశాలల ఆశలు, ఆకాంక్షలను ఆందుకోలేక పోతున్నామని మార్కుల సాధనలో వెనుకబడుతున్నామనే ఆందోళనే విద్యార్థుల్లో ఒత్తిడి పెంచుతోంది. మానసిక సంఘర్షణకు లోనవుతన్న విద్యార్థులు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా గురువారం నారాయణ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న వై. ప్రణయ్‌రెడ్డి రైలుకింద పడి బలన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లాలో గత రెండేళ్లలో నారాయణ విద్యా సంస్థల్లోనే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడారు. ఇతర కాలేజీలు, పాఠశాలలు కలుపుకొని ఈ సంఖ్య మొత్తం ఏడుకు చేరుకుంది. – కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు) గ్రూపు కుదించారని.. నన్నూరులోని నారాయణ బాయ్స్ క్యాంపస్‌లో గతేడాది సెప్టెంబర్ నాలుగో తేదీన శ్రీకాంత్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మరణించాడు. ఇతని గ్రూపును కుదించడంతో తోటి విద్యార్థుల ఎదుట తలెత్తుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తల్లిదండ్రులకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు దూరమయ్యాడు. అధ్యాపకుడు కొట్టాడని.. 2016 జూలైలో కర్నూలులోని బుధవార పేటకు చెందిన సందీప్ అనే విద్యార్థి ఆర్‌ఎంకే ప్లాజాలోని నారాయణ జూనియర్ కళాశాలలో చదువుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విద్యార్థిని తరగతి గదిలోనే అధ్యాపకుడు కొట్టినట్లు సమాచారం. అంతేకాక సూటిపోటీ మాటలు కూడా కుంగదీయడంతో రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రై వేటు పాఠశాలలు, కళాశాలల చదువు దారేటో తెలియడం లేదు. కార్పొరేట్ విద్యా సంస్థల మధ్య పోటీతో విద్యార్థులను విశాంత్రి లేకుండా పరుగులెత్తించి ఊపిరి తీస్తున్నారు. భవిష్యత్‌లో ప్రయోజకులవుతారో లేదో కానీ చదువు పూర్తి కాకుండానే ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు లోకాన్ని విడిచిపెట్టి పోతున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిలిస్తున్నారు. కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేకున్నా బలవంతంగా చదువు పేరుతో అధ్యాకుల వేధింపులు కొనసాగుతున్నాయి. సెల్లార్ లాంటి తరగతి గదుల్లో వందలాది మంది పిల్లలను కూర్చోబెట్టి చదువులు చెబుతుండడంతో గురువులు చేప్పే బోధనాభ్యాసం తికమక పెట్టి కొందరు ఆయోమంలో పడుతున్నారు. మరోవైపు తరగతిలో నలుగురి మధ్య మార్కుల పేరుతో విభజించి అధ్యాపకులు అవమాన పరుస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు కనీసం వయస్సును కూడా చూడకుండా బెత్తంతో కొడుతూ బర్రెల్లాగా వ్యవహరిస్తున్నారు. అవమాన పరుస్తున్నారు. దీనికి కుంగి, కషించి విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. నిబంధనలు పాటించని ప్రై వేట్ విద్యా సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా నారాయణ, చైతన్య పాఠశాలల యాజమాన్యాలకు నేరుగా ప్రభుత్వంతోనే సంబంధాలు ఉండడంతో సర్కార్ అటువైపు చూడడం లేదు. ఏదో కంటితుడుపు చర్యగా అప్పటికప్పుడు కమిటీలు వేసి చేతులు దులుపుకొంటోంది. ఇప్పటి వరకు చాలా కమిటీలు ఆచరణలోకి వచ్చిన నివేదిక ఇచ్చినవి మాత్రం ఒక్కటి లేదు. తల్లిదండ్రుల్లో మార్పు రావాలి – తమ పిల్లలను ఇంజనీరు, డాక్టర్ చేయాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు రూ. లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేటు విద్యా సంస్థల్లో చేర్పిస్తున్నారే కానీ ఎలా చదువు చెబుతున్నారో పరిశీలించడం లేదు. – వారానికో.. పది రోజులకే ఇంటికి ఫోన్ చేస్తేమార్కులు తక్కువచ్చాయి.. ఇలాగైతే ర్యాంకు ఎట్లా వస్తుందని కోపగించుకుంటున్నారే కానీ పిల్లలు ఎదుర్కొంటున్న కష్టాలను పట్టించుకోవడం లేదు. – కళాశాలలో ఒత్తిడిని బరించలేక చదువు మానేస్తామని విద్యార్థులు చెబుతున్నా తల్లిదండ్రులు మాత్రం రూ. లక్షలు కట్టాం..ఎలాగైనా పూర్తి చేయాలని సూచిస్తున్నారే కానీ ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపలేకపోతున్నారు. – కార్పొరేట్ కళాశాలలో చదివిన వారు మాత్రమే ఉన్నత ఉద్యోగాలు చేయడం లేదనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించడం లేదు. – ప్రస్తుతం విద్యా సంస్థల్లో సాంస్కతిక, ఆటలు, పాటలు, ఇతర కార్యక్రమాలకు ప్రాధాన్యం లేదు. ఈ విషయాలపై తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యాలను ప్రశ్నించడం లేదు. పిల్లల అభిరుచిని గమనించాలి: చెన్నయ్య, ప్రిన్సిపాల్ టౌన్ మోడల్ జూనియర్ కళాశాల, కర్నూలు తల్లిదండ్రుల ఆలోచన తీరు మారాలి. పిల్లల మనసత్వాన్ని కనుగొని కోర్సులు, కళాశాలల ఎంపిక చేసుకొనివ్వాలి. అంతేకాని పిల్లలకు ఇష్టం లేకునా తల్లిదండ్రుల కోరికలను పిల్లలపై రుద్ది సాధించాలని ఒత్తిడి చేస్తే అలాంటి పిల్లల తల్లిదండ్రులకు దూరమయ్యే ప్రమాదముంది. యాజమాన్యాలు స్వేచ్ఛనివ్వాలి : వై.నరసింహులు, వీసీ, రాయలసీమ యూనివర్సిటీ యాజమాన్యాలు విద్యార్థుల మనసును తెలుసుకొని బోధన చేయాలి. మార్కులు ర్యాంకులతో చదవాలని ఒత్తిడి చేయరాదు. విద్యార్థికి ఇష్టమైన సమయంలోనే చదవనివ్వాలి. వారికే పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి. లేదంటే భవిష్యత్‌లో ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. -
డిగ్రీలో మార్కులకు బదులుగా గ్రేడ్‌పాయింట్స్
ఈఎంఆర్సీ డైరెక్టర్, ప్రొఫెసర్ విష్ణువర్ధన్‌రెడ్డి జడ్చర్ల టౌన్ : మార్కులకు బదులుగా గ్రేడ్‌పాయింట్స్ ఇచ్చేలా యూజీసీ డిగ్రీ విద్యలో అనేక మార్పులు చేపట్టిందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈఎంఆర్సీ డైరెక్టర్, ప్రొఫెసర్ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. సోమవారం బూర్గుల రామకృష్ణారావు జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీకళాశాలలో నిర్వహించిన సీబీసీఎస్ (చాయిల్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్) వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని ప్రొజెక్టర్ ప్రదర్శన ద్వారా జిల్లాలోని డిగ్రీ కళాశాలల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. డిగ్రీ విద్యావిధానంలో మార్పులు చోటుచేసుకున్నాయని, సంప్రదాయ విధానం కాకుండా విద్యార్థికి వెసులుబాటు కల్పించే విధంగా తనకు నచ్చి విషయాన్ని ఐచ్చికంగా ఎన్నుకోవచ్చన్నారు. సైన్స్ విద్యార్థి ఆర్ట్స్‌లో ఒక సబ్జెక్ట్‌ను ఐచ్చికంగా తీసుకొవచ్చన్నారు. పరిసరాల విజ్ఞానం, ఆంగ్లం, ఆధునిక భారతీయ భాషల్లో ఒకదానిని తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. వర్క్‌షాప్‌ను పాలమూరు యూనివర్సిటి రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి పర్యవేక్షించగా పీయూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ మధుసూదన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ భక్తవత్సల్‌రెడ్డి, ఎంవీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ యాదగిరి, కళాశాల అధ్యాపకులు కృష్ణకుమార్, తమ్మిరెడ్డి, సురేష్, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు. -
సీబీఎస్ఈకి ఇంటర్ విద్యార్థుల మార్కులు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థుల మార్కుల వివరాలతో కూడిన సీడీని ఇంటర్‌బోర్డు సీబీఎస్ఈకి గురువారం పంపింది. జేఈఈ ఆలిండియా ర్యాంకులను ఖరారు చేసేందుకు ఈ సీడీని అందించింది. జేఈఈ మెయిన్స్ కోర్కు 60% వెయిటేజీ, ఇంటర్ మార్కుల స్కోరుకు 40% వెయిటేజీ ఇచ్చి పర్సంటైల్ నార్మలైజ్ చేసి ఆల్ఇండియా జేఈఈ మెయిన్ర్యాంకులను ఖరారు చేస్తుంది. వీటి ఆధారంగానే ఎన్ఐటీ, ఐఐఐటీలలో ప్రవేశాలను చేపడతారు. ఈ ర్యాంకులను ఈ నెల 30న లేదా అంతకంటే ముందే సీబీఎస్ఈ ప్రకటించనుంది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆలిండియా ర్యాంకులను ఈ నెల 12న విడుదల చేసేందుకు ఐఐటీ గువాహటి చర్యలు చేపట్టింది. -
గాడ్జెట్లతో గడిపితే మార్కులు అంతంత మాత్రమే
టొరంటో: వీడియో గేమ్స్, ఫోన్లు, టీవీలతో ఎక్కువ సమయం గడిపే టీనేజీ కుర్రాళ్లకు మాథ్స్, ఇంగ్లిష్‌లలో తక్కువ మార్కులు వస్తాయని తాజా పరిశోధనలో తేలింది. ఎక్కువ సమయం వివిధ గాడ్జెట్లతో గడపడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందని యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకు చెందిన పరిశోధకుడు అమి ఫీన్ తెలిపారు. ఒకై వైపు టీవీ చూస్తూ ఫోన్ వాడడం లాంటి పనులు ఒకేసారి చేయడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుందని ఫీన్ అన్నారు. 73 మంది టీనేజీ కుర్రాళ్లపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయని ఆయన చెప్పారు. ‘పరిశోధనలో పాల్గొన్న విద్యార్థులు సగటున వారానికి 12 గంటలు టీవీ చూసినా, వారంలో 25 శాతం సమయాన్ని ఫోన్లు, వీడియోగేమ్స్‌తో గడిపేవారు. మిగతా వారికంటే ఈ విద్యార్థులకు పరీక్షలలో చాలా తక్కువ మార్కులు వచ్చాయ’ని ఫీన్ పేర్కొన్నారు. ఈ వివరాలు స్ప్రింగర్ సైకోనమిక్ బులిటెన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ ప్రిలిమ్స్‌లో జాగ్రఫీలో ఎక్కువ మార్కులు సాధించడం ఎలా? - ఎన్. ప్రియబాంధవి, అనంతపురం సివిల్స్ ప్రిలిమ్స్‌లో జాగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ నుంచి 24 నుంచి 30 ప్రశ్నల వరకు వస్తున్నాయి. జాగ్రఫీ, ఎకాలజీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రణాళికలో వీటికి అధిక సమయం కేటాయించాలి. సిలబస్‌లో ‘భారతదేశం, ప్రపంచ భౌతిక, సామాజిక, ఆర్థిక, భూగోళ శాస్త్రం’ అని పేర్కొన్నారు. అభ్యర్థులు భారత భౌగోళిక అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. మనదేశానికి సంబంధించి వ్యవసాయం, వ్యవసాయ సంక్షోభం, రుతువులు, నదులు, అడవులు - అటవీ భూముల ఆక్రమణ, అంతరిస్తున్న జీవ జాతులు, శక్తి వనరులు తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. రవాణా, పట్టణీకరణ ప్రక్రియ, సరిహద్దుల వివాదాలు వంటివీ ముఖ్యమే. కోర్ ఎకాలజీ నుంచి ప్రధానంగా రెండు అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అవి.. ఎకాలజీ బేసిక్ కాన్సెప్టులు. -
మట్టిలో మాణిక్యాలు
పేదరికం వెంట వచ్చినా.. ఆర్థిక కష్టాలు వెంటాడినా.. చదువులో మాత్రం వారు మెరిశారు. వారి కష్టానికి మార్కుల రూపంలో ప్రతిఫలం అందుకున్నారు. మట్టిలో మెరిసిన ఈ మాణిక్యాలు ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించారు హైదరాబాద్ విద్యార్థులు కన్నవారి కష్టానికి మార్కుల కానుక.. హిమాయత్‌నగర్: తండ్రి చిన్న కంపెనీలో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తల్లి ఇంటి పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. చదువు విలువ తెలిసినవారు కూతురిని చదివిస్తున్నారు. అందుకు తగ్గట్టే ఆ బాలిక చదువులో రాణించి ఉత్తమ మార్కులు సాధించి కన్నవారికి కానుకగా ఇచ్చింది. ఈసీఐఎల్‌కు చెందిన షేక్ ఖజామియా మాదాపూర్‌లో ఓ పరిశ్రమలో కాపలాదారుగా పనిచేస్తున్నాడు. వస్తున్న తక్కువ వేతనంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతని కుమార్తె షేక్ మస్తానీ హిమాయత్‌నగర్ న్యూ చైతన్య కళాశాలలో ఇంటర్లో చేరింది. జూనియర్ ఇంటర్లో 420/440 మార్కులు సాధించి శెభాష్ అనిపించుకుంది. డాక్టర్ కావాలనే ఆకాంక్షతో బైపీసీ గ్రూప్‌లో చేరినట్టు తెలిపింది. చాయ్ అమ్ముతూ చదువు.. హిమాయత్‌నగర్: ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాలలో చదువుకునే విద్యార్థి తరగతులు పూర్తవగానే సాయంత్రం తన తండ్రికి సాయంగా చాయ్బడ్డీలో పనిచేస్తాడు. అయితేనేం.. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. హిమాయత్‌నగర్‌లోని న్యూ చైతన్య కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న అభిషేక్ 477/500 మార్కులు సాధించాడు. ఇతడి తండ్రి సుల్తాన్‌బజార్‌లో చిన్న చాయ్బడ్డీ నడుపుతున్నాడు. తండ్రి పడే కష్టాన్ని చూడలేని అభిషేక్ కళాశాల అవ్వగానే నాన్నకు సాయంగా దుకాణంలో పనిచేస్తాడు. తన బిడ్డ చదువులో రాణించడంతో కన్నవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వికసించిన విద్యా కుసుమం.. జీడిమెట్ల: అటో డ్రైవర్ కుమార్తె సీనియర్ ఇంటర్ ఎంపీసీలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది. తండ్రి పడే కష్టానికి తగిన ఫలితం సాధించాలని కష్టపడి ఈ ఘనతను సొంతం చేసుకుంది. అపురూప కాలనీకి చెందిన అటో డ్రైవర్ శ్రీహరిరాజు కుమార్తె బి.ఎన్.వి. సౌజన్య ఇంటర్ ఎస్ఆర్ నగర్‌లోని నారాయణ కళాశాలలో చదివింది. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో ఎంపీసీలో 988/1000 మార్కులు సాధించింది. పదో తరగతిలో సైతం 10/10 పాయింట్లు సాధించి శభాష్ అనిపించుకుంది. భవిష్యత్తులో ఇంజినీర్ కావాలన్నదే తన ధ్యేయమని సౌజన్య తెలిపింది. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సంబేపల్లె: చెంచురెడ్డిగారిపల్లెకు చెందిన పూజిత(16) అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని తక్కువ మార్కులు వచ్చాయని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది. సంబేపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అమరనాథరెడ్డి, వెంకటేశ్వరమ్మ రెండవ కుమార్తె పూజిత. విజయవాడ చైతన్య కాలేజీలో ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసింది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో 440కి గాను 406 మార్కులు వచ్చాయి. ఇతరుల కంటే తనకు తక్కువ మార్కులు వచ్చాయని విష ద్రావణం తాగింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. -
470కి 406 మార్కులే వచ్చాయని..
కడప: ఇవ్వాళ ఇంటర్ పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఫస్ట్ ఇయర్ పూర్తిచేసిన పూజిత మంచి మార్కులతో పాసైంది. 470కిగానూ ఆమెకు 406 మార్కులు వచ్చాయి. మామూలు పిల్లలైతే ఎగిరి గంతేసి ఎంజాయ్ చేసేవారు. కానీ పూజిత అలా చెయ్యలేదు. సెంట్ పర్సెంట్ కు 64 మార్కులు తక్కువొచ్చాయే అని బాధపడింది. ఎందుకంటే ఆమె టీచర్ల బిడ్డమరి! అవును. పూజిత తల్లిదండ్రులిద్దరూ టీచర్లు. ఇంకా చెప్పాలంటే సొంతంగా చేతగాక పిల్లల ర్యాంకులతో 'హోదా' కోరుకునే సోకాల్డ్ 'చైల్డ్ లవింగ్' పేరెంట్స్. పిల్లలు బాగా చదవాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ మార్కుల రేసులో పిల్లల్ని పరుగెత్తించడం తప్పు. ఇప్పుడు పూజిత ఈ లోకంలో లేదు. తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు దండించడంతో పురుగుల మందుతాగి ప్రాణాలు వదిలింది. వైఎస్సార్ కడప జిల్లాలోని సంబేపల్లిలో అమరనాథ్ రెడ్డి దంపతులు టీచర్లుగా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి మంచి మార్కులు సాధిస్తూ చదువుల్లో ముందుకు వెళుతోంది. చిన్నమ్మాయి పూజిత కూడా తెలివైన విద్యార్థినే. ఇంటర్ మొదటిసంవత్సరం పరీక్షలు రాసింది. మంగళవారం వాటి ఫలితాలు విడుదల అయ్యాయి. పూజితకు 470 మార్కులకు 406 మార్కులు వచ్చాయి. ఆమెకు వచ్చిన మార్కులతో తల్లిదండ్రులు సంతృప్తి పడలేదు. పెద్ద కూతురి మార్కులతో పోల్చుతూ పూజితను అవమానించారు. మనస్తాపం చెందిన ఆ చదువుల తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడింది. ఇది గమనించిన తల్లిదండ్రులు ప్రాణాపాయంలో ఉన్న పూజితను సంబేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స చేస్తుండగానే ఆ విద్యార్థిని ప్రాణాలు వదిలింది. ఈ సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. టీచర్ కుటుంబంలోనే ఇలాంటి సంఘటన జరగటం చర్చనీయాంశం అయింది. -
తాగితేనే మార్కులేస్తా..!
బీజింగ్: మీరు ఎంత మద్యం సేవించగలరు? నేను మీకు రేటింగ్ ఇస్తాను.. అంటూ విద్యార్ధులు అధికంగా మద్యం సేవించే విధంగా ప్రేరేపించిన ఓ చైనా ప్రొఫెసర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. గు జోయూ ప్రావిన్సులో గు జోయూ ఒకేషనల్ ఇన్స్టిట్యూట్లో సంప్రదాయ చైనీ మందుల కోర్సులో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నగుజోయూ అన్షున్.. విద్యార్ధులు మద్యం సేవించే విధంగా ప్రొత్సహించినందుకు బాధ్యతల నుంచి తప్పించారు. ఓ విద్యార్థి ఆన్లైన్ లో ఉంచిన వివరాల ప్రకారం.. ఎవరైతే ఒక పూర్తి గ్లాసు మద్యాన్ని సేవిస్తారో వారికి 10 మార్కులు, సగం తాగిన వారికి 90 మార్కులు, ఒకసారి రుచి చూసిన వారికి 60 మార్కులు, అసలు ముట్టుకోకపోతే ఫెయిల్ చేస్తానని టీచర్ తెలిపినట్లు పోస్ట్ చేశారు. గూ అలా చెప్పడం జోక్ కావచ్చని సంస్థ డైరక్టర్ గుయ్షెంగ్ అన్నారు. ఈ విషయం ఆన్లైన్లో టీచర్‌పై మండిపడిన వారు కొందరైతే, ఈ టీచరైన విద్యార్థులపై కరుణ చూపించాడని మరికొందరు పోస్ట్‌లు చేశారు. -
మార్కులు తక్కువ వచ్చాయని..
-
మార్కులు తక్కువ వచ్చాయని..
విద్యార్థిని చితక్కొట్టిన ఉపాధ్యాయుడు రాజాం: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు అందుకు భిన్నంగా వ్యవహరించారు. మార్కులు తక్కువగా వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ విద్యార్థిని చితక్కొట్టాడు. ఈ సంఘటన రాజాంలో శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో చోటుచేసుకుంది. ఎల్ఐసీ కార్యాలయం వెనుక నివసిస్తున్న గుల్లల రాజ్‌కుమార్ సారధి రోడ్డులో ఉన్న ఓ కాన్వెంట్లో పదో తరగతి చదువుతున్నాడు. వారం రోజుల క్రితం నిర్వహించిన యూనిట్ పరీక్ష ఫిజిక్స్ సబ్జెక్టులో 25కు 14 మార్కులు వచ్చాయి. దీంతో ఈ సబెక్టు బోధించే ఉపాధ్యాయుడికి కోపం వచ్చింది. రాజ్‌కుమార్‌ను ఒల్లంతా తట్టులు తేరేలా కర్రతో కొట్టారు. తండ్రి మృతి చెందడం, తల్లి ఇంటికే పరిమితం కావడంతో విషయాన్ని సాయంత్రం తమ బంధువులకు చెప్పాడు. వారుసంబంధిత ఉపాధ్యాయుడిని ఫోన్లో సంప్రదించగా దిక్కున్నచోట చెప్పుకోమన్నారని విద్యార్థి, అతని బంధువులు ఆరోపించారు. కాగా దెబ్బలు తిన్న రాజ్‌కుమార్‌ను బంధువులు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించగా వైద్యుడు కరణం హరిబాబునాయుడు చికిత్సనందించి పోలీసులకు సమాచారం అందించారు. -
ఆన్లైన్ అడ్మిషన్లు..విద్యార్థులకు శాపం
టీటీడీ విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ప్రతిభ ఉన్నా, ఎక్కువ మార్కులు సాధించినా కళాశాలలో సీటు పొందలేక పోతున్నారు. - ప్రతిభ ఉన్నా టీటీడీ విద్యాసంస్థల్లో దక్కని సీట్లు - అత్తెసరు మార్కులు పొందినవారికి రాచ మార్గం యూనివర్సిటీక్యాంపస్: చిత్తూరుకు చెందిన ఓ విద్యార్థి ఇంటర్లో 98 శాతం మార్కులు సాధించాడు. టీటీడీ విద్యాసంస్థల్లో డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తు చేశాడు. ఇంటర్లో మంచి మార్కులు సాధించినందువల్ల తనకు సీటు ఖాయం అనుకున్నాడు. అయితే టీటీడీ ప్రకటించిన మెరిట్‌లిస్టులో అతనిపేరు లేదు. అతని కన్నా తక్కువ మార్కులు వచ్చిన, 50 శాతం మార్కులు సాధించిన వారికి సీట్లు వచ్చాయి. తనకు మాత్రం రాలేదు. సీటు ఎందుకు రాలేదని సంబంధిత కళాశాలకు వెళితే అంతా ఆన్లైన్ తప్పిదమే..తప్ప తమది కాదని తప్పించుకుంటున్నారు. జాబితాలో సదరు అభ్యర్థి దరఖాస్తు కూడా లేకపోవడంతో సీటు రాక నిరాశకు గురయ్యాడు. ఇదీ టీటీడీ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. టీటీడీ విద్యాసంస్థల్లో అత్తెసరు మార్కులు పొందినవారు రాచ మార్గంలో సీట్లు పొందుతున్నారు. దీంతో వారు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. సాంకేతిక సమస్యల వల్ల సీటు పొందని వారికి రెండో విడతలో అడ్మిషన్ ఇస్తామంటున్నారు. తీరా చూస్తే వారి దరఖాస్తులు కనిపించడంలేదు. దీంతో ఆ విద్యార్థులు బోరున విలపిస్తున్నారు. విద్యాసంస్థల్లో ఆన్లైన్ విధానం అమలు కోసం టీటీడీ రూ.20 లక్షల వ్యయం చేసి, ఓ సాఫ్ట్వేర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే అడ్మిషన్ల వ్యవహారంపై ఈ సంస్థ ముందస్తు చర్యలు తీసుకోలేదు. అలాగే సాంకేతిక సమస్యలు తలెత్తితే సరి చేసేందుకు, ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రతినిధిని నియమించలేదు. దీంతో తప్పులు దొర్లి విద్యార్థులు నష్టపోతున్నారు. 22 తర్వాత దరఖాస్తులు పరిశీలించిన అధికారులు టీటీడీ ఆన్లైన్ విధానం ప్రకారం గత జూన్ మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో వేడుకగా అభిషేకం జరిపారు. సాయంత్రం 5.30 గంటలకు ఉభయ దేవేర్లతో కలిసి స్వామివారు ఊంజల్‌పై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారిని వేంచేపుగా ఆలయం నుంచి వాహన మండపానికి తీసుకొచ్చి అక్కడే సిద్ధంగా ఉంచిన హనుమంత వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబరాలు, వజ్ర వైఢూర్య ఆభరణాలతో స్వామివారిని సుందరంగా అలంకరించారు. తదుపరి సర్వాంగ సుందరంగా అలంకృతుడైన స్వామివారు హనుమంతునిపై కొలువై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా తిరువీధుల్లో భక్తులు స్వామి వారికి కర్పూర హారతులు సమర్పించారు. కార్యక్రమాల్లో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఏఈవో నాగరత్న, సూపరింటెండెంట్లు రవి, వరప్రసాద్, ఆర్జితం, ప్రసాదం ఇన్స్పెక్టర్లు గురవయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు. నేడు గరుడ సేవ.. అవతారోత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం రాత్రి 7.15గంటలకు సుందరరాజస్వామివారు గరుడ వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే మధ్యాహ్నం 2గంటలకు అభిషేకం, సాయంత్రం 5.30గంటలకు ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు. -
ఇంటర్ మూల్యాంకనంలో అక్రమాలు
-
తక్కువ మార్కులు వచ్చాయని.. టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
సరూర్‌నగర్: పదవతరగతి పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులు రావడంతో మనస్థాపం చెంది ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం సూర్యాపేటకు చెందిన జంగయ్య కుటుంబం మీర్‌పేటలోని ఓల్ట్ విలేజ్‌లో అద్దెకుంటూ కూలి పని చేసుకుంటూ జీవిస్తోంది. జంగయ్య కూతురు త్రివేణి జిల్లెలగూడలోని చల్ల లింగారెడ్డి జిల్లాపరిషత్ పాఠశాలలో టెన్త్ చదివింది. శనివారం వెలువడిన పరీక్షా ఫలితాల్లో తన స్నేహితులకు 9.5, 9.3 జీపీఏ రాగా.. త్రివేణికి 7.3 జీపీఏ వచ్చింది. స్నేహితుల కంటే తాను బాగా చదివేదాన్ని అని, తనకంటే వారికి ఎక్కువ మార్కులు వచ్చాయని అదే రోజు సాయంత్రం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. అది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మీర్‌పేటలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
ఆంట్వన్ బ్లోయి
Antoine Bloye ఒక ఫ్రెంచి నవల. 1933లో అచ్చయింది. రచయిత పాల్ నైజాన్ (1905-40). ఇతడు జా పాల్ సార్త్‌క్రు సహాధ్యాయి. డన్కిర్క్ వద్ద జరిగిన యుద్ధంలో మరణించాడు. 1973లో మంత్లీ రివ్యూ ప్రెస్ వాళ్లు పునర్ముద్రించిన ఈ నవలను ఒక ఫర్గాటెన్ మాస్టర్‌పీస్ అంటారు మార్క్సిస్టు సాహిత్యకారులు. ఇది రాసినప్పుడు నైజాన్ ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడేగానీ నవలలో ఎక్కడా ప్రచారార్భాటమూ సైద్ధాంతిక చర్చా ఉండదు. ముక్కుకు మూదాడేసి (కనీసం నాకు) చదివించే కథనం పాఠకుడిని సుడిగుండంలా తనలోకి లాక్కుంటుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థలో కార్మికులు పరాయీకరణ చెందుతారన్నాడు మార్క్స్. సాధారణ రైల్వే ఉద్యోగి ఆంట్వన్ బ్లోయి తన తోటివారి నుండి క్రమంగా పరాయీకరణ చెందిన క్రమాన్ని అద్భుతంగా చిత్రించాడు పాల్ నైజాన్. తనలో మార్పు వచ్చిన విషయాన్ని కథానాయకుడు గుర్తించను కూడా లేడు. కానీ జీవితం నిస్సారమైందని తెలుస్తుందొకనాడు. మనుషుల్ని ప్రేమించే శక్తి తగ్గిపోతుంది. గుజ్జు తీసిన పండులాగవుతుంది బతుకు. ఎందుకు ఉద్యోగంలో కొనసాగుతున్నాడో తెలియదు. కానీ ఇష్టంలేని ఉద్యోగం చెయ్యకుండా ఉండలేడు.నవలలో భాష గణితమంత కచ్చితంగా ఉంటుంది. ‘‘రోజు తర్వాత రోజు, రాత్రి తర్వాత రాత్రి తన జీవితం కొనసాగించాడు ఆంట్వన్. రసం తీసిన పిప్పిగా మారతాడు. కానీ అందులో ఒక సుఖమున్నది. సాంత్వననూ అనుభవించాడు. అందువల్ల ఎప్పుడూ ప్రతిఘటించే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ‘‘ఇల్లున్నది. చక్కటి లావుపాటి భార్యున్నది. పిల్లలు ఎదిగారు. త్వరలో వాళ్లూ ఓ ఇంటివాళ్లవుతారు. వృద్ధాప్యంలో జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది’’ అని తనను తాను నమ్మించుకుంటాడతను. కార్మికుడిగా ప్రారంభించిన బ్లోయి పెటీ బూర్జువాగా పరిణామం చెందుతాడు. మేనేజిమెంటుతో లాలూచీ పడతాడు. యజమాని కూతుర్ని పెళ్లి చేసుకొని తాను అధికారవర్గంలో చేరిపోయాననుకుంటాడు. ‘‘బ్లోయి మరెవరో కాదు. నువ్వే’’ అని పలుమార్లు పాఠకుడ్ని హెచ్చరిస్తాడు నైజాన్. రచయిత కొన్ని సార్లు అతడి గురించి వ్యంగ్యంగా రాసినా, జీవితానందాన్ని ఆవిరి చేసుకున్న బ్లోయిని చూస్తే మనకు విషాదనాయకుడే గుర్తుకువస్తాడు. నిస్సందేహంగా ఇది మార్క్సిస్టు నవలే. వ్యాఖ్యానించినప్పుడు మార్క్సిస్టు పరిభాష కూడా కనిపిస్తుంది. ‘‘తాత్వికత అంటే జీవితాన్ని యథాతథంగా అంగీకరించడం కాదు. దాన్ని మార్చే ప్రయత్నం చేయటమని బ్లోయి గ్రహించలేదు’’ అంటాడు నైజాన్.ఈ పుస్తకం నాకు దొరకడం కేవలం యాదృచ్ఛికం. కొన్నాళ్ల క్రితం దేశంకాని దేశంలో పుస్తకాల వేట కొనసాగిస్తున్నప్పుడు, పాత పుస్తకాల షాపులో ఓ మూలన నక్కివుంది. అప్పటికి నాకు రచయిత గురించిగానీ, పుస్తకం గురించిగానీ ఏమీ తెలియదు. మంత్లీ రివ్యూ ప్రెస్ వాళ్ల ప్రచురణ కావడం వల్ల హస్తభూషణంగా ఉంటుందనీ, చవకగా వచ్చిందనీ తీసుకున్నాను. కానీ చదవడం ప్రారంభించాక మధ్యలో ఆపలేకపోయాను. మన జీవితాల్ని మైక్రోస్కోపు కింద పెట్టి పరీక్షించాడీ రచయిత అనిపించింది.డాన్ కిహోటీ, మృతజీవులు, అన్నా కరేనినా, హకల్ బెరీఫిన్, సింగర్ కథలు వగైరా పుస్తకాలను ఎప్పుడైనా, ఎక్కడైనా చదవడానికి అనువుగా ఉంటాయని అందుబాటులో పెట్టుకుంటాను. ఇప్పుడు వాటి సరసన చేరింది ఆంట్వన్ బ్లోయి. ముక్తవరం పార్థసారథి -
ఇంప్రూవ్‌మెంట్‌లో ఫెయిలైతే అంతే!
అంతకు ముందు పాస్ అయినా పరిగణనలోకి తీసుకోరు: ఇంటర్ బోర్డు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో తక్కువ మార్కులు వచ్చాయని ఇంప్రూవ్‌మెంట్‌కు వెళ్లేవారు ఇకపై జాగ్రత్త పడాలి. వార్షిక పరీక్షలో వచ్చిన మార్కుల కంటే ఎక్కువ మార్కుల కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఇంప్రూవ్మెంట్ రాస్తే, వచ్చిన ఫలితాలే పరిగణనలోకి తీసుకుంటారు. ఫెయిల్ అయితే ఫెయిల్ కిందే లెక్క. వార్షిక పరీక్షల్లో వచ్చిన మార్కులను లెక్కలోకి తీసుకోరు. వార్షిక పరీక్షలు, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాటినే పరిగణనలోకి తీసుకునే విధానం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికే పరిమితమని, ద్వితీయ సంవత్సరంలో అలా ఉండదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్‌లో వార్షిక పరీక్షలే లెక్క ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ తుది ర్యాంకుల ఖరారులో (జేఈఈ స్కోర్‌కు 60 శాతం, ఇంటర్ మార్కులకు 40 శాతం) ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మార్కులను పరిగణలోకి తీసుకోరు. ఈ విషయాన్ని ఇటీవల తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తెలియజేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకులు సాధించిన వారు ఇకపై ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలంటే రాష్ట్ర బోర్డు నుంచి హాజరైన విద్యార్థుల్లో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి. లేదా బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు సాధించాలి. ఈ నిబంధనను ఈసారి ఐఐటీ ప్రవేశాల్లో అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఇంప్రూవ్మెంట్ కోసం రాసే విద్యార్థుల సంఖ్య తగ్గనుంది. ఎంసెట్‌లో రెండూ.. ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ తుది ర్యాంకును ఖరారు చేస్తారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయి, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో పాస్ అయితే ఆ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. వాటి ఆధారంగా విద్యార్థి ఎంసెట్ తుది ర్యాంకును ఖరారు చేస్తారు. -
ఇప్పుడు ఉన్నది నైతిక అంధత్వం...
తాజా పుస్తకం ఇప్పటి దాకా తత్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు. వ్యాఖ్యానించడం కంటే దానిని మార్చడం ముఖ్యం అని మార్క్స్ అన్నాడు. స్థలం, కాలం చూపుకీ చేతికీ అందినప్పుడు వ్యాఖ్యానం కానీ మార్పుకి ప్రయత్నంకానీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్న వ్యవస్థ చూపుకిగానీ చేతికిగానీ అందనంత వేగంగా పరిగెడుతోంది. కర్త ఎవరో తెలియదు. కాని ఆడక తప్పని పరిస్థితి. వలసలు, భూమి నుంచి ఎడబాటు, డిస్ప్లేస్మెంట్, మూలాలు విచ్ఛిన్నం కావడం, కన్స్యూమరిజం, మార్కెట్, అస్థిర ఉద్యోగాలు ఇవన్నీ మనిషి జీవనాన్ని కలవరపెడుతున్నాయి. ఇది స్థిరమైన అస్థిర వర్తమానం. దీనిని వ్యాఖ్యానించడం, అర్థం చేసుకోవడం కోసం పోలెండ్‌కు చెందిన జిగ్మండ్ బౌమన్ అనే తత్త్వవేత్త ప్రతిపాదించిన సిద్ధాంతమే ‘లిక్విడ్ మోడర్నిటీ’. అంటే ఇప్పుడున్న సమాజం ఆధునిక సమాజం కాదనీ ‘ద్రవాధునిక సమాజం’ అనీ అంటాడాయన. సమాజానికి ‘ద్రవ స్వభావం’ ఉంటే ఏమవుతుందో వివరించే ప్రయత్నం చేస్తాడు. దీనికి పూర్వరంగంగా రెండు ప్రపంచ యుద్ధాలు చేసిన విధ్వంసం, ప్రపంచాన్ని శాసించడానికి బ్రిటన్, అమెరికాలు చిరకాలంగా సాగించిన క్రూరత్వం, ‘స్వేచ్ఛ’ను ఒక పావులా వాడి అవి స్థిరపరిచిన అస్థిరత వీటిని చర్చిస్తాడు. విస్తృతంగా ఆయన చేసిన వ్యాఖ్యానాలను తెలుగు పాఠకులకు సులభంగా అర్థం చేయించే ప్రయత్నంగా పాపినేని శివశంకర్ రాసిన పుస్తకమే ‘ద్రవాధునికత’. బౌమన్ చెప్పిన విషయాలను వెల్లడి చేస్తూనే వాటిని మన సమాజానికి అన్వయిస్తూ వ్యాఖ్యానం చేస్తారు పాపినేని శివశంకర్. పెళ్లి, స్త్రీ పురుష సంబంధాలు, అభివృద్ధి, ఆహారం, సాంస్కృతిక పతనం, ప్రకృతి ఈ అంశాలన్నింటినీ వాటి వర్తమాన స్థితికి కారణమైన ‘కుట్రలను’ అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తకాన్ని పరిశీలించాలి. బౌమన్ చెప్తున్న అంశాలలో కొన్నింటిని వ్యాఖ్యామాత్రంగా చూద్దాం. పెట్టుబడిదారీ వ్యవస్థ రెండు రకాలు. ఒకటి భార సహితమైనది (హెవీ కాపిటలిజమ్). రెండు భార రహితమైనది (లైట్ కాపిటలిజమ్). మొదటిదానికి మిచిగన్ రాష్ట్రంలో డెట్రాయిట్ సరస్సు ఒడ్డున ఉన్న భారీ కార్ల కంపెనీ- జనరల్ మోటార్స్ ఉదాహరణ. రెండో దానికి సియాటిల్ (రెడ్మండ్) నగరంలో ఉంటూ ప్రపంచమంతటికీ తన రెక్కలు సాచిన మైక్రోసాఫ్ట్ సంస్థ మరో ఉదాహరణ. ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగి జీవనం అక్కడే ముగుస్తుంది. మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఆ గ్యారంటీ లేదు. ద్రవాధునికతలో పెట్టుబడికి వినియోగదారుడితోనే సంబంధం. కనుక కార్మికశక్తి మృదువుగా మారింది. వెనుకటి సంఘీభావం, యూనియన్ యాక్షన్లు ఈ కాలంలో ఉండవు. ద్రవాధునికత ‘పౌరుణ్ణి’ ‘వ్యక్తి’గా మారుస్తుంది. ఈ వ్యక్తికి ఏకాంతాన్నిచ్చే నగరం కావాలి. అందువల్ల నగరీకరణ పెరుగుతుంది. నగరంలో మనిషి అపరిచితం అవుతాడు. అపరిచితులు అపరిచితులను కలుసుకుంటూ అపరిచితులుగా మిగిలిపోయే నివాస ప్రాంతమే నగరం. ద్రవాధునికతలో నైతిక అంధత్వం వస్తుంది. అంటే ప్రపంచంలో జరిగేవాటిపట్ల నిర్లక్ష్యం అన్నమాట. నైతిక అంధత్వం కలిగినవారు జరిగిన చెడుపనికి ఎడంగా జరుగుతారు. దాన్ని ధైర్యంగా ఖండించలేక ఎదుర్కోలేక మౌనం వహిస్తారు. ఒక్కోసారి ప్రతికూల వాదన చేస్తూ దెబ్బ తిన్నవారినే తప్పు పడతారు. చిరకాలం తన ఆకృతిని నిలుపుకోలేకపోవడం ద్రవపదార్థాల ముఖ్యలక్షణం. ద్రవాధునికతలో మానవ సంబంధాలు కూడా అంతే. గాఢమైన ప్రేమలు ఉండవు. ఆకర్షణ దాటి ప్రేమ అంకురించేంత సమయం, దాని కోసం తపన, చిరకాల త్యాగం ఉండవు. కోరికకి, కోరినదాన్ని పొందడానికి మధ్య దూరం తగ్గిపోయింది. పొందడమే ముఖ్యమైనప్పుడు మనసు స్థానాన్ని శరీరం ఆక్రమిస్తుంది. ప్రేమ తావును సెక్స్ ఆక్రమిస్తుంది. ఈ బౌమన్ ప్రతిపాదనలను తెలుగు సమాజం, సాహిత్యంలోని ఉదాహరణలతో వివరించే ఈ ప్రయత్నాన్ని ఈ పుస్తకంలో చేశారు పాపినేని శివశంకర్. ఆలోచనాపరులు తప్పక పరిశీలించదగ్గ పుస్తకం ఇది. ద్రవాధునికత- పాపినేని శివశంకర్; వెల- రూ.70 ప్రతులకు: నవచేతన - 040- 24224458 -
కొంచెం కష్టం... ఫలితం అధికం
ఇంటర్... భవిష్యత్ నిర్దేశించే కీలక సమయం. మూడు రోజుల్లోనే ఫైనల్ పరీక్షలు... ఆ వెంటనే ఐఐటీ- జేఈఈ, ఎంసెట్ తరుముకుంటూ వచ్చేస్తున్నాయి. ఏడాది పొడవునా కష్టపడినా కాస్తంత మెలకువలు పాటించకుంటే ఆ కష్టమంతా వృథా అయిపోతుంది. చిన్నపాటి సూచనలు పాటిస్తే మంచి మార్కులు సాధించవచ్చంటున్నారు నిపుణులు. ఇంకెందుకాలస్యం... ఆచరించండి.. మంచి ఫలితాలు సాధించండి. ఆల్ ది బెస్ట్. - గుంటూరు ఎడ్యుకేషన్ మరో మూడు రోజుల్లో ఇంటర్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. ఉన్నత భవితను వెతుక్కుంటూ ఏడాది పొడవునా శ్రమించిన విద్యార్థులు చదివిన అంశాలను పేపర్‌పై పెట్టే సమయం వచ్చేసింది. దీంతో పాటు ఐఐటీ-జేఈఈఈ, ఎయిమ్స్, ఎంసెట్ వంటి జాతీయ, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు పోటీ పరీక్షలకు సింహద్వారం వంటి ఇంటర్ దశలో తడబడకుండా ముందుడుగు వేయాలి. ఐఐటీ-జేఈఈఈ, ఎంసెట్ పరీక్షల్లో ఇంటర్మీడియేట్ మార్కులకు ఉన్న వెయిటేజీ దృష్ట్యా విద్యార్థులు అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతో అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఇందుకు పాఠ్యాంశాల పునశ్చరణ, ప్రాధమిక సూత్రాలను పాటించడం ద్వారా నూరు శాతం మార్కులు సాధించవచ్చంటున్నారు సబ్జెక్టు నిపుణులు. ఈ నెల 11వ తేదీన ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు జిల్లాలో 98,090 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అత్యధిక విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్‌పైనే దృష్టిసారిస్తున్నారు. తరువాతి స్థానిలో చార్టెడ్ అకౌంటెంట్స్ కావాలన్న యోచనతో కామర్స్ ఎంచుకుంటున్నారు. సూత్రాల అధ్యయనంతో గణితంలో విజయం గణితం పేపర్-1లో అధిక మార్కులు సాధించేందుకు ప్రధమ సంవత్సర విద్యార్థులు సలభమైన సూత్రాలను పాటించాలి. కొత్త అంశాల జోలికి వెళ్ళకుండా చదివినవే రివిజన్ చేసుకోవాలి. సమస్యాత్మకమైన ప్రశ్నలను ముందు గా పరిష్కరించేందుకు ప్రయత్నించడం వల్ల సమయం వృధా అవుతుంది. ఫంక్షన్స్, ధీరమ్స్, డొమైన్, రేంజ్, హైపర్ బోలిక్ ఫంక్షన్స్, వెక్టార్స్ విభాగాలను గుర్తుంచుకోవాలి. ఇన్వర్ట్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఉన్న ఎత్తులు, దూరాలు, పరిష్కార మార్గాలు, మ్యాట్రిస్లో డిఫనేషన్స్ ఉదాహరణలు, లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఫార్ములా బేస్డ్, ప్రాధమిక సూత్రాలను అధ్యయనం చేయాలి. తప్పులు, అంచనాలు, రోల్స్, లెగ్రైండ్, ధీరమ్స్, ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ ఫంక్షన్స్, త్రీడీలో డిసీజ్, డీఆర్సీ, ప్లేన్స్‌లో రెండు మార్కుల లెక్కలకు సమాధానాలను సిద్ధం చేసుకోవాలి. గరిష్ట మార్కుల సాధన పునశ్చరణపైనే ఆధారపడి ఉంటుంది. పి. అంకినీడు ప్రసాద్, గణిత శాస్త్ర అధ్యాపకుడు సీనియర్ ఇంటర్ విద్యార్థులు శ్రమించాల్సిందే పోటీ పరీక్షలకు హాజరయ్యే సీనియర్ ఇంటర్ విద్యార్థులు గణితంపై కొద్దిగా శ్రమిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. మిగతా సబ్జెక్టుల కంటే గణితంలో నూటికి నూరు మార్కులు సాధనకు ఎక్కువ అవకాశాలున్నాయి. కాంప్లెక్స్ నంబర్స్, డీమోవర్స్, థీరంలో పోలార్ ఫామ్, లోకస్ గుర్తుంచుకోవాలి. కోడ్రాడిక్ ఈక్వేషన్స్‌లో రెసిప్రోకల్ ఈక్వేషన్స్, రేంజ్ ప్రాబ్లమ్స్, బైనామియల్ ధీరమ్లో కో-ఎఫిషియెంట్, న్యూమర్రీకల్లీ గ్రేటెస్ట్, ఇన్ ఫైనిట్ సిరీస్‌కు సంబంధించిన అంశాలు ముఖ్యమైనవి. ప్రీబబుల్టీ అండ్ రాండమ్ వేరియబుల్‌లో నిర్వచనాలు, స్టాటిస్టిక్స్‌లో ఫార్ములాలు, కాలిక్యులేషన్స్ ఎక్కువగా చేయాలి. క్రానిక్స్ విభాగంలో థీరమ్స్, ఫార్ములా, ఏరియాస్‌లో డయాగ్రమ్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్లు, అర్డర్ అండ్ డిగ్రీ, మోడల్ ప్రాబ్లమ్స్, ఇంటిగ్రేషన్స్లో అన్ని ఫార్ములాలు చేయాలి. వి.వెంకట్రావు, గణిత శాస్త్ర అధ్యాపకుడు కాస్తంత కష్టపడితే బోటనీలో అధిక మార్కులు పటాలను గీయడం ద్వారా బోటనీలో అధిక మార్కులు సాధించవచ్చు. స్వల్ప సమాధాన ప్రశ్నలను పునశ్చరణ చేసుకోవాలి. పటాలు గీసేటప్పుడు భాగాలను తప్పనిసరిగా గుర్తించాలి. జూనియర్, సీనియర్ విద్యార్థులు వేరు, కాండ రూపాంతరాలు, అనిశ్చిత పుష్ప విన్యాసం, ఫలదీకరణ, పిండాకార నిర్మాణం, వేరు, కాండం, పత్ర అంతర్నిర్మాణాలను పటాలతో సహా నేర్చుకోవాలి. ఆవరణ శాస్త్రం నుంచి ఆరు మార్కులకు రానుండటంతో అధికంగా పునశ్చరణ చేసుకోవడం మేలు. కణజాలు, ప్రధమ దశ-1లో ఉప దశలు, క్రోమోజోముల వర్గీకరణ, సమవిభజన, అసమ విభజన, మద్యభేదాలను అధ్యయనం చేయాలి. సీనియర్ ఇంటర్ విద్యార్థులు వృక్ష శరీర ధర్మ శాస్త్రం నుంచి అతి స్వల్ప సమాధాన ప్రశ్నలను దీర్ఘ సమాధాన ప్రశ్నలను అధ్యయనం చేయాలి. కెల్విన్ వలయం, గ్లెకాలసిస్, క్రెబ్స్ వలయం, డీఎన్ఏ సాంకేతిక పరిజ్ఞానం, కణజాల వర్ణనం తదితర అంశాలను క్షుణ్ణంగా చదవాలి. కణజాల వర్ణనంలో ఫ్లో చార్ట్ గీయడం ద్వారా అధిక మార్కులు సాధించవచ్చు. డీఎన్ఏ, ఆర్ఎన్ఏ మద్య భేదాలు కనుగొనడంపై దృష్టి సారించాలి. ఏ చాప్టర్ నుంచి 8 మార్కుల ప్రశ్నలు వస్తాయో గుర్తించి, చదివిన అంశాలనే ఎక్కువగా పునశ్చరణ చేసుకోవాలి. చిత్రపటాలు, ఫ్లో చార్టులు గుర్తుంచుకోవాలి. - ఎం. రాజేంద్రప్రసాద్, బోటనీ అధ్యాపకుడు జీవశాస్త్రంలో ప్రతిభ చూపవచ్చు జూనియర్ ఇంటర్లో 4, 7, 8 యూనిట్ల నుంచి ఎనిమిది మార్కుల ప్రశ్నలకు ఆయా యూనిట్లలో దీర్ఘరూప సమాధాన ప్రశ్నలను పటాలతో సహా అధ్యయనం చేయాలి. యూనిట్-4లో బొద్దింక గురించి ఒక పటం తప్పనిసరిగా అడుగుతారు. ప్రతి పాఠ్యాశం వెనుక ఇచ్చిన ప్రశ్నలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. 4, 8 మార్కుల ప్రశ్నలకు అనుబంధంగా పటాలు ఉంటే తప్పకుండా గీయాలి. రెండు మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు ఒకటి నుంచి 10 వరకూ అదే వరుస క్రమంలో ఒకే చోట రాయాలి. జవాబు రాసేటప్పుడు సమయపాలన ముఖ్యం. 4 మార్కుల ప్రశ్నలకు 60 నుంచి 70 నిమిషాలు, మిగిలిన సమయాన్ని 8 మార్కుల ప్రశ్నలకు కేటాయించుకోవాలి. సీనియర్ ఇంటర్లో మానవ అంతర్నిర్మాణం నుంచి దీర్ఘరూప సమాధాన ప్రశ్నలు, జన్యుశాస్త్రం అధ్యయనం చేయాలి. దంతం నిలువుకోత, మూత్ర పిండం నిలువుకోత, నెఫ్రాన్ నిర్మాణం, కశస్త్రమ దండం అడ్డుకోత పటాలను ప్రాక్టీస్ చేయాలి. జన్యుశాస్త్రంలో క్రిస్-క్రాస్ అను వంశిక, బహుళ యుగ్య వికలక్షణాలు, రక్త వర్గాలు, డ్రాసోఫిలాలో లింగ నిర్ధారణ చదవాలి. జీవ పరిణామశాస్త్రంలో లామార్కిజం, డిర్వినిజం, మానవ పరిణామం గురించి అధ్యయనం చేయాలి. - ఎ. ప్రసాద్‌బాబు, జీవశాస్త్ర అధ్యాపకుడు మెలకువలతో ఫిజిక్స్‌లో మంచి ఫలితాలు ఎక్కువ మంది విద్యార్థులు కష్టమని భావించే భౌతికశాస్త్రంలో మెలకువలు పాటించడం ద్వారా అధిక మార్కులు సాధించే వీలుంది. ప్రధమ సంవత్సర విద్యార్థులు సమతలంలో చలనం, గమన నియమాలు, కణాల వ్యవస్థలు, భ్రమ గమనం, గురుత్వాకర్షణ, ఘన పదార్థాల యాంత్రిక ధర్మాలు, పదార్ధ ఉష్ణ ధర్మాలు, అణుచలన సిద్ధాంతం, గమన నియమాలు, పని, సామర్ధ్యం శక్తి, డోలనాలు, ఉష్ణ గణితశాస్త్రం పాఠ్యాంశాలు చదవాలి. ద్వితీయ సంవత్సర విద్యార్థులు దృశాశాస్త్రం, తరంగ శాస్త్రం, విద్యుదావేశాలు, క్షేత్రాలు, స్థిర విద్యుత్ పొటెన్షియల్, కెపాసిటర్స్, విద్యుత్ ప్రవాహం, అయస్కాంతత్వం, పదార్ధం, వికిరణాల ద్వంద్వ స్వభావం, పదార్ధం, ఏకముఖ విద్యుత్, అర్థవాహక పరికరాలు పాఠ్యాంశాల్లోని 4 మార్కుల ప్రశ్నలను బాగా ప్రాక్టీసు చేయాలి. తరంగాలు, ఆవేశాల చలనం, అయస్కాంతత్వం, పరమాణువులు, కేంద్రకాలు, చాప్టర్ల నుంచి 8 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు కోసం శ్రమించాలి. - ఎస్. మస్తాన్ సాహెబ్, భౌతికశాస్త్ర అధ్యాపకుడు మౌలిక భావనలతోనే కెమిస్ట్రీ ఈజీ రసాయన శాస్త్రంలో మౌలిక భావనలపై దృష్టి సారించాలి. ప్రథమ సంవత్సరంలో పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక నుంచి 8 మార్కుల ప్రశ్నలు వస్తాయి. రసాయన బంధం, కర్బన రసాయ శాస్త్రంలో నామకరణం, ఒక పదార్థం నుంచి వేరొక దానిని రాబట్టటంపై దృష్టి సారించాలి. స్టాకియోమెట్రిలో మొలారిటీ నార్మాలిటీ, అను భావిక, అణుఫార్మలాతో వాయు స్థితిలో అణుమేఘాలకు సంబంధించిన సమస్యలు సాధన చేయాలి. ద్వితీయ సంవత్సరంలో రసాయన గణితశాస్త్రం, విద్యుత్ రసాయనశాస్త్రం, కర్బన రసాయన శాస్త్రంపై అధిక దృష్టి సారించాలి. లఘు ప్రశ్నలకు దైనందిన జీవితంలో రసాయన శాస్త్రం, పరివర్తన మూలకాలు, లోహ సంగ్రహణం, జీవాణువులు, కర్బన రసాయన శాస్త్రంలో నామకరణ చర్యలపై అధిక దృష్టి సారించాలి. సమస్యలపై ద్రావణాలు, విద్యుత్ రసాయన శాస్త్రం, ఘన స్థితిపై దృష్టి నిలపాలి. - ఫ్రాన్సిస్ జేవియర్, రసాయనశాస్త్ర అధ్యాపకుడు -
పబ్లిక్ పరీక్షలు.. మెరుగైన మార్కులకు మార్గాలు!!
పదో తరగతి, ఇంటర్మీడియెట్/+2 కోర్సులు ప్రతి విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైన దశ. అలాంటి కీలకమైన పదో తరగతి, ఇంటర్మీడియెట్, +2 పబ్లిక్ పరీక్షల సమయం ఆసన్నమైంది. మరికొద్ది రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. అదే విధంగా సీబీఎస్ఈ నిర్వహించే టెన్త్, +1, +2 పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. నెలల తరబడి క్లాస్ రూంలో నేర్చుకున్న అంశాల్లో నైపుణ్యాలకు నగిషీలు దిద్దుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పటివరకు ప్రిపరేషన్ సాగించడం ఒక ఎత్తయితే.. ఇప్పుడు పరీక్షల సమయంలో అనుసరించే ప్రిపరేషన్ ప్లాన్ మార్కుల సాధనలో అత్యంత కీలకం. పదో తరగతి, ఇంటర్మీడియెట్, +2 విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించేందుకు అనుసరించాల్సిన మార్గాలు తెలుసుకుందాం.. ప్రస్తుతం.. పునశ్చరణే ప్రధానం పదో తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్థులందరూ ఇప్పటికే సిలబస్‌ను పూర్తి చేసుకుని ఉంటారు. కాబట్టి ప్రస్తుత సమయంలో రివిజన్ (పునశ్చరణ)కు ప్రాధాన్యమివ్వాలి. పాఠ్యాంశాల్లో కష్టంగా భావించి విస్మరించిన అంశాలపై కొత్తగా దృష్టి పెట్టడం ఆశాజనకం కాదు. ఇప్పటికే పూర్తి స్థాయిలో నేర్చుకున్న అంశాల్లో మరింత పట్టు సాధించేలా ప్రస్తుత సమయాన్ని వినియోగించుకోవాలి. ఆయా అంశాలకు సంబంధించి ముఖ్యాంశాలను షార్ట్ నోట్స్ రూపంలో, తమకు అనుకూలమైన రీతిలో షార్ట్ కట్ మెథడ్‌లో పొందుపర్చుకుంటే రివిజన్ సులువుగా సాగుతుంది. పదో తరగతి- సమకాలీనంపైనా పదో తరగతి విద్యార్థులు ఈ ఏడాది కొత్త తరహా పరీక్షను ఎదుర్కోనున్నారు. సీబీఎస్ఈ టెన్త్ కరిక్యులం మాదిరిగానే రాష్ట్ర బోర్డ్‌లలోనూ కరిక్యులం మారింది. విషయ పరిజ్ఞానంతోపాటు సమకాలీన అంశాలపై అవగాహనను ప్రశ్నించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణకు సోషల్ సబ్జెక్ట్‌ను పరిశీలిస్తే లింగ వివక్షను రూపుమాపడానికి కొన్ని మార్గాలు సూచించండి? ఈ ప్రశ్నకు సంబంధించి ప్రాథమిక అవగాహన కల్పించే విధంగా సిలబస్‌లో సమాచారం ఉంది. కానీ నేరుగా ప్రశ్న-సమాధానం రూపంలో అది లభించదు. భావనల ఆధారంగా సొంత శైలి సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌ల్లోనూ సొంత శైలిలో సమాధానం రాసే విధంగా ప్రశ్నలు అడగనున్నారు. ఆ ప్రశ్నలు ఒక భావనను అన్వయించే విధంగా ఉంటాయి. ఉదాహరణకు బయాలజీ నమూనా ప్రశ్నపత్రంలోని ఒక ప్రశ్నను చూద్దాం.. ప్ర: తిలక్ తనకు ఆకలైనప్పటికీ సరైన సమయానికి అన్నం తినలేదు. కొంతసేపటికి అతనికి క్షుద్బాధ తీరి సరైన స్థితికి వచ్చాడు. కారణమేమై ఉంటుంది? అదే విధంగా మ్యాథమెటిక్స్‌లోనూ సమస్య-సాధన ద్వారా పరిష్కారంతోపాటు అన్వయం అనుసంధానం చేసి సమాధానం రాబట్టే విధంగానూ ప్రశ్నలు ఉంటాయి. ఉదాహరణ: 7తో భాగించగలిగే రెండంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? ఈ తరహా ప్రశ్నలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటివరకు తాము నేర్చుకున్న కాన్సెప్ట్‌లను అన్వయించే సమయస్ఫూర్తి, నైపుణ్యం సొంతం చేసుకోవాలి. పరిశీలన ప్రధానంగా కొత్త సిలబస్‌లోని అన్ని సబ్జెక్ట్‌ల ప్రశ్నలు విద్యార్థుల్లోని పరిశీలన సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. ఉదాహరణకు టేబుల్స్, గ్రాఫ్స్, చార్ట్‌ల రూపంలో కొంత సమాచారం లేదా డేటా ఇచ్చి దాని ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. అదేవిధంగా పటాల ప్రశ్నలను కొత్త తరహాలో అడిగే అవకాశముంది. బొమ్మ ఇచ్చి అందులో ముఖ్య భాగాలు, వాటి ప్రాధాన్యతను వివరించమని అడగొచ్చు. కాబట్టి పరిశీలనాత్మక అధ్యయనం ఎంతో అవసరం. విశ్లేషణ నైపుణ్యం ఆధారంగా పదో తరగతి పరీక్షల్లో విద్యార్థుల్లో విశ్లేషణ నైపుణ్యాన్ని పరీక్షించే విధంగానూ ప్రశ్నలు ఎదురయ్యే ఆస్కారముంది. ఉదాహరణ: ఆధునిక యుద్ధాలకు పారిశ్రామికీకరణ ఏ విధంగా కారణమైంది? అనే ప్రశ్న. ఇది విశ్లేషణాత్మక సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్న. ఇందుకోసం పాఠ్యపుస్తకంలోని యూనిట్లో ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి, విశ్లేషించాలి. దాంతోపాటు దినపత్రికల్లో వ్యాసాలు, వార్తలు చదివి ముఖ్యాంశాలు గుర్తుంచుకోవాలి. పదో తరగతి పరీక్షల్లో ఈసారి బిట్ పేపర్లో అడిగే ప్రశ్నల తీరు కూడా భిన్నంగా ఉండొచ్చు. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలకే పరిమితం కాకుండా అసెర్షన్ అండ్ రీజన్ తరహా ప్రశ్నలు ఇచ్చే అవకాశముంది. విద్యార్థిలోని తులనాత్మక, పరిశీలనాత్మక నైపుణ్యాలను పరీక్షించడమే ప్రధాన లక్ష్యంగా భావించడమే అందుకు కారణం. సక్సెస్ టిప్స్ విషయ పరిజ్ఞానంతోపాటు, సమకాలీన అవగాహన, భావ వ్యక్తీకరణలకు ప్రాధాన్యం పెరిగిన పదో తరగతి పరీక్షలకు సంబంధించి ప్రస్తుత సమయంలో విద్యార్థులకు అనుకూలించే చిట్కాలు.. ప్రతి అంశంలోని మూల భావనలను, ముఖ్యాంశాలను నోట్స్ రూపంలో పొందుపరచుకోవాలి. వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే అవకాశమున్న అంశాలను గుర్తించి, వాటికి సంబంధించి సమకాలీన పరిణామాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి. సైన్స్, మ్యాథమెటిక్స్‌లలో ఒక భావన లేదా సూత్రం ఆధారంగా ఉండే ప్రశ్నలకు పలు ప్రత్యామ్నాయ సమాధానాలను ప్రాక్టీస్ చేయాలి. లాంగ్వేజెస్‌లో గ్రామర్‌తోపాటు భావ వ్యక్తీకరణ పొందేలా ప్రాక్టీస్ చేయాలి. మార్కులకు దోహదం చేసే చక్కటి చేతిరాతపైనా దృష్టి పెట్టాలి. ప్రతి సబ్జెక్ట్‌లోనూ కనీసం రెండు మోడల్ టెస్ట్‌లకు హాజరు కావాలి. ఈ ప్రక్రియను మార్చి 15లోపు ముగించడం మేలు. సీబీఎస్ఈకి ప్రత్యేకంగా సీబీఎస్ఈ పరీక్షల్లో గత రెండు మూడేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్‌లలో ఇల్లస్ట్రేషన్ ఆధారిత ప్రశ్నల ప్రాధాన్యం పెరుగుతోంది. దీన్ని గుర్తించి సొంత భావ వ్యక్తీకరణ నైపుణ్యం సాధించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. పాఠ్యాంశాల్లోని అన్ని విభాగాలు, ఉప-విభాగాలకు సమ ప్రాధాన్యం ఉంటోంది. కాబట్టి పుస్తకంలోని అన్ని అంశాలపై పట్టు సాధించాలి. లాంగ్ ఆన్సర్ ప్రశ్నల సంఖ్య కొంత పెరుగుతోంది. కాబట్టి ముఖ్యమైన పాయింట్లతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. ఈసారి సీబీఎస్ఈ అందుబాటులోకి తెచ్చిన ప్రీ-ఎగ్జామినేషన్ ఆన్లైన్ ట్యూషన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలి. తద్వారా ఆయా సబ్జెక్ట్‌ల నిపుణులు, ప్రిన్సిపాల్స్ ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. టైం మేనేజ్మెంట్ ప్రిపరేషన్లో టైం మేనేజ్మెంట్ పాటించేలా చూసుకోవాలి. ముందుగా అందుబాటులో ఉన్న రోజుల్ని, ప్రతిరోజు తాము గరిష్టంగా చదవగలిగే సమయం ఆధారంగా అన్ని సబ్జెక్ట్‌లకు సమ ప్రాధాన్యం ఇచ్చేలా టైం టేబుల్ రూపొందించుకోవాలి. ఒక రోజు ఒకే సబ్జెక్ట్‌కు పరిమితమైతే బోర్ కొట్టే ఆస్కారముంది. కాబట్టి ప్రతి రోజు తప్పనిసరిగా కనీసం మూడు సబ్జెక్ట్‌లు చదివే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. మ్యాథమెటిక్స్‌కు ప్రతి రోజు ప్రత్యేక సమయం కేటాయించడం తప్పనిసరి. పరీక్షలు ప్రారంభయ్యే తేదీకి వారం రోజుల ముందునాటికే రివిజన్ పూర్తి చేసుకునేలా ప్రిపరేషన్ సాగించాలి. ఇంటర్మీడియెట్, +2 సాగాలిలా ఇంటర్మీడియెట్, +2 విషయానికొస్తే.. మారిన సిలబస్, అడుగుతున్న ప్రశ్నల శైలిని గమనిస్తే అప్లికేషన్ ఓరియెంటెడ్ ప్రశ్నలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రతి సబ్జెక్ట్‌లో ముఖ్య ఫార్ములాలను గుర్తించి వాటి అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలు/సమస్యలను సాధన చేయాలి. ఎంసెట్, జేఈఈ, ఇతర పోటీ పరీక్షల ప్రిపరేషన్‌కు విరామమివ్వాలి. ప్రాక్టీస్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు ప్రాధాన్యమివ్వాలి. గ్రూప్ సబ్జెక్ట్‌ల్లో బలహీనంగా ఉన్న వాటి విషయంలో ప్రత్యేక సమయం కేటాయించాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల సబ్జెక్టులకు ప్రాక్టీస్ తప్పనిసరి. కేవలం రీడింగ్ ఆధారిత ప్రిపరేషన్ సరికాదు. ఇంటర్మీడియెట్, +2 విద్యార్థులు కనీసం రెండు ప్రీ-ఫైనల్ టెస్ట్‌లు, రెండు మోడల్ టెస్ట్‌లకు హాజరు కావాలి. పరీక్ష హాల్లో చూపిన ప్రతిభే కీలకం క్లాస్ రూం, సెల్ఫ్ లెర్నింగ్ పరంగా ఎంత కృషి చేసినా.. పరీక్ష హాల్లో అనుసరించే తీరే ఫలితాల్లో కీలకం. పరీక్షకు లభించే మొత్తం సమయంలో మొదటి పది నిమిషాలు కచ్చితంగా ప్రశ్నపత్రం ఆసాంతం చదవడానికి కేటాయించాలి. ముందుగా సులభంగా ఉన్న ప్రశ్నలను, తర్వాత ఓ మోస్తరు ప్రశ్నలను, చివరగా మాత్రమే కష్టంగా ఉన్న ప్రశ్నలవైపు దృష్టి పెట్టాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వంటి ప్రాబ్లమ్ బేస్డ్ పరీక్షల్లో.. ముందుగానే ప్రశ్న పత్రం పరిశీలన ఆధారంగా ప్రశ్నలకు లభించే సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ సాగాలి. సమస్యను సాధించే క్రమంలో లభించే సగటు టైమ్ కంటే ఎక్కువ సమయం పడుతోందనిపిస్తే వెంటనే మరో ప్రశ్న వైపు దృష్టి పెట్టాలి. థియరీ సబ్జెక్ట్‌లు (పదో తరగతిలో సోషల్ స్టడీస్, లాంగ్వేజెస్; ఇంటర్మీడియెట్‌లో హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ తదితర) విషయంలోనూ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనుసరించాలి. లాంగ్ ఆన్సర్ కొశ్చన్స్‌కు వాటికి కేటాయించిన మార్కులకు అనుగుణంగా సమాధాన నిడివిని నిర్ణయించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో ఈసారి కొత్త విధానం అమలు చేస్తున్న నేపథ్యంలో ముందుగా 15 నిమిషాలు ప్రశ్నపత్రం అవగాహనకు కేటాయించారు. తద్వారా తమకు బాగా వచ్చిన అంశాలను ముందుగానే గుర్తించే అవకాశం లభిస్తుంది. నిపుణులేమంటున్నారు..! గ్రేడ్లు, వెయిటేజ్‌ల గురించి మర్చిపోవాలి వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ఫలితాలు, లభించే గ్రేడ్లు, వెయిటేజ్‌ల ఆలోచనను మైండ్లోంచి తొలగించాలి. పరీక్షల ఒత్తిడిని అధిగమించే క్రమంలో మొదటి సాధనం ఇది. ఎగ్జామ్ టెన్షన్ పోవడానికి ప్రతిరోజూ ప్రత్యేకంగా వ్యవహరించాలి. ముందుగా తమకు ఇష్టమైన సబ్జెక్ట్లతో ప్రిపరేషన్ మొదలుపెట్టి తర్వాత వేరే సబ్జెక్ట్స్‌కు మళ్లాలి. తద్వారా ప్రిపరేషన్ సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని జయించొచ్చు. - సీతామూర్తి, ప్రిన్సిపాల్, సిల్వర్ ఓక్స్ స్కూల్ గ్రూప్ సబ్జెక్టులపై గురి ఇంటర్మీడియెట్ విద్యార్థులు ప్రస్తుత సమయంలో గ్రూప్ సబ్జెక్ట్స్‌పై పట్టు సాధించేలా కృషి చేయాలి. తద్వారా పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపొచ్చు. ఆ దిశగానే విద్యార్థి ప్రిపరేషన్ ప్రణాళిక ఉండాలి. ప్రతి విద్యార్థి తనకు అనుకూలమైన రీతిలో షార్ట్‌కట్ మెథడ్స్‌తో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. ఇది రివిజన్ సమయంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. - పి.వి.ఆర్.కె.మూర్తి, శ్రీ గాయత్రి అకాడమీ సొంత శైలి అవసరం పదో తరగతిలో మారిన సిలబస్ ప్రకారం సొంత శైలికి ప్రాధాన్యం పెరిగింది. కాబట్టి అకాడమీ పుస్తకానికో, మరే ఇతర మెటీరియల్‌కో పరిమితమవడం సరికాదు. సొంత ఆలోచన, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి. అదే విధంగా సమయస్ఫూర్తి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగిన అన్ని కోణాలపై అవగాహన పెంచుకోవాలి.- పి.నీలకంఠం, బయాలజీ టెక్ట్స్‌బుక్ రచయిత సోషల్.. సమకాలీన నైపుణ్యం పదో తరగతి సోషల్ స్టడీస్ పేపర్లో మంచి మార్కులకు సమకాలీన అంశాలపై అవగాహన తప్పనిసరిగా మారింది. స్వీయ భావ వ్యక్తీకరణ, విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు అడిగే అవకాశముంది. ఇది విద్యార్థులకు మేలు చేసే అంశమే. ముఖ్యంగా లాంగ్ ఆన్సర్ కొశ్చన్స్‌లో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు, డేటా ఆధారిత ప్రశ్నలు. పాఠ్యాంశం నుంచి వచ్చిన ప్రశ్నకు సమాధానం తెలియకపోతే.. ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు, డేటా ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. - సురేశ్‌కుమార్, పదో తరగతి సోషల్ టెక్ట్స్‌బుక్ రచయిత మ్యాథమెటిక్స్ మేడ్ ఈజీ కొత్త సిలబస్‌లో మ్యాథమెటిక్స్‌కు సంబంధించి దాదాపు 50 శాతం ప్రశ్నలు భావనల ఆధారిత దత్తాంశాల రూపంలో ఉండటం బాగా అనుకూలించే అంశమే! ఆయా భావనలపై పట్టు సాధిస్తే సులువుగా మంచి మార్కులు సాధించొచ్చు. గతంలో మాదిరిగా డెరైక్ట్ కొశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉండవు. ఇప్పటివరకు చదివిన అంశాలకు సంబంధించి కాన్సెప్ట్ మ్యాపింగ్ వంటి టెక్నిక్స్ ద్వారా పునశ్చరణ చేయాలి. - ఎ.రాజేంద్రప్రసాద్, జడ్పీహెచ్ఎస్, చౌటుప్పల్ ప్రాక్టీస్, కంపేరిటివ్ అప్రోచ్‌కు ప్రాధాన్యం సీబీఎస్ఈ విద్యార్థులు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. కంపేరిటివ్ అప్రోచ్‌తో ముందుకు సాగాలి. +2 స్థాయిలో ఎలక్టివ్స్‌తోపాటు లాంగ్వేజెస్‌కు కూడా ప్రిపరేషన్లో సముచిత సమయం కేటాయించాలి. - ఆదిలక్ష్మి, ప్రిన్సిపాల్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ -
బుజ్జి జీవానుబంధం
పిల్లలకు సరిగా మార్కులు రాకపోతే... ‘వెళ్లి గొర్రెలు కాసుకో...’ అని తిట్టే తల్లిదండ్రులను, టీచర్లను మనం చూస్తూనే ఉన్నాం. అయితే గొర్రెలు కాయడం అంటే మరీ అవమానమైన పని కాదని, దీంట్లో కూడా మంచి గుర్తింపు ఉందని, చిన్న వయసులోనే గొర్రెలను కాయడం గర్వించదగ్గ అంశమని ఈ సంఘటనతో రుజువవుతోంది. ఆ బుడ్డోడి పేరు ఆర్థర్ జోన్స్. వయసు రెండేళ్లు. ఆర్థర్ వంశంలో ఐదోతరం గొర్రెల కాపరి ఇతడు. ప్రస్తుతం 80 గొర్రెల సంరక్షణ బాధ్యతను చూస్తున్నాడు. స్థానికంగా ‘యంగెస్ట్ షెఫర్డ్’ గుర్తింపును సొంతం చేసుకొన్నాడు జోన్స్. ఉదయం లేచింది మొదలు.. తన మినీ బైక్‌లో తమ గొర్రెల ఫారమ్‌లో తిరుగుతూ వాటిని కాస్తుంటాడు. వాటికి ఫీడింగ్ ఇవ్వడం, నీళ్లను తాపడం జోన్స్ బాధ్యతలు. జోన్స్ నాయనమ్మ ఈ ఫారమ్ యజమాని. ఇక్కడ తన మనవడు గొర్రెలు కాయడాన్ని, వీడియోల రూపంలో ఫోటోల రూపంలో చిత్రీకరించి చిన్న పిల్లల యాక్టివిటీస్‌కు సంబంధించిన పోటీలకు ఆ వీడియోలను పంపింది. వాటితో జోన్స్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటి వరకూ ఈ రెండేళ్ల గొర్రెల కాపరికి మూడు అవార్డులు వచ్చాయి. బుజ్జిమూగజీవులతో ఈ బుజ్జాయి పెంచుకొన్న అనుబంధం గురించి ప్రత్యేక డాక్యుమెంటరీలే రూపొందుతున్నాయిప్పుడు. ఇప్పుడైనా ఒప్పుకుంటారా మరి! గొర్రెల కాయడం చాలా గ్రేటైన పని అని! -
గతం ‘గర్జన’ విందాం
నవంబర్ 7వ తేదీకి మానవేతిహాసంలో మహోన్నత స్థానం ఉంది. 1917లో (96 ఏళ్ల క్రితం) రష్యాలో లెనిన్ నేతృత్వంలో, కమ్యూనిస్టు పార్టీ సారథ్యంలో కష్టజీవులు సంఘటితమై దోపిడీ వర్గాల పాలనను అంతమొందించారు. శ్రమజీవుల రాజ్యాన్ని స్థాపించుకున్నారు. అదే యుఎస్ఎస్ఆర్ అప్పటికి రష్యా పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. 13 శాతం మంది మాత్రమే పారిశ్రామిక కార్మి కులు ఉండేవారు. దేశంలో అత్యధిక భాగంలో ‘కులక్’ (జమీందారుల వంటి భూస్వాముల) పెత్తనం ఉండేది. ప్రజలు ఆ భూస్వామ్య ప్రభువుల దోపిడీ, దుర్మార్గం, అణ చివేతలను అనుభవిస్తుండేవారు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రావడంతోనే జారీ చేసిన తొలి ‘డిక్రీ’ (చట్టం) భూస్వామ్య వ్యవస్థ రద్దు చేసిం ది. ‘భూదేవి! నువ్వు సహజంగా నీ సహచరుడైన రైతు కూ లి స్వేదంతో మమేకమై పుష్పించి ఫలించాలని ఆరాటపడతావు. అలాంటి వాంఛకు విరుద్ధంగా భూస్వాములు ని న్ను తమ నిర్బంధంలో ఉంచుకున్నారు. నేటితో నీకు విముక్తి లభిస్తున్నది. నీ ప్రియమైన రైతుకూలితో కలిసి ఆనం దించు’ అంటూ హృద్యంగా సాగుతుంది ఆ డిక్రీ పాఠం. రష్యాలో శ్రామికరాజ్యం మార్క్స్ ప్రవచించిన దానికి మక్కికి మక్కీగా ఏర్పడలేదు. పెట్టుబడిదారీ విధానం పూర్తిగా అభివృద్ధి చెందిన తదనంతర పరిణామంగా కాకుండా, భూస్వామ్య వ్యవస్థలోనే ‘సోషలిస్టు రాజ్యం’గా ఆవిర్భవించింది. ఆకలి, దారిద్య్రం, అవిద్య, అజ్ఞానం, అణచివేత, నిరుద్యోగం వంటి వాటిని నిర్మూలించే దిశగా, అలాగే స్త్రీల, మైనారిటీల అణచివేతను నిర్మూలించే దిశగా యూఎస్ఎస్ఆర్లో కమ్యూనిస్టు పార్టీ ప్రస్థానాన్ని ఆరం భించింది. యూఎస్ఎస్ఆర్ నాటి ప్రపంచ కష్టజీవులకు ఆదర్శప్రాయమై, దోపిడీ సామ్రాజ్యవాద శక్తులకు పక్కలో బల్లెమైంది. విమోచన కోసం పోరాడుతున్న జాతులకు అండగా నిలిచింది. వియత్నాం, క్యూబా విప్లవాలకు రష్యా ఇచ్చిన చేయూత అనితరసాధ్యమైంది. సోవియట్ యూనియన్ వెన్నుదన్నుగా నిలువకపోయి ఉండినట్లయి తే చైనాలో మావో నేతృత్వంలో కమ్యూనిస్టు పార్టీ విజ యం మరింత జటిలం, ఘోరమూ అయి ఉండేది! సోవి యట్ రష్యా ప్రసక్తి లేకుండా, తూర్పు యూరప్ రాజ్యా లతో సోషలిస్టు శిబిరం సాధ్యమై ఉండేది కాదు. రెండవ ప్రపంచ యుద్ధంలో పరమ కిరాతకమైన ఫాసిస్టు హిట్లర్ నేతృత్వంలోని, నాజీ సైన్యాన్ని ఓడించడంలో సోవియట్ యూనియన్ ధైర్యమూ, కృషీ, త్యాగమూ మరువలేనివి. నూతనంగా స్వాతంత్య్రం పొందిన భారత్, ఈజిప్టు వంటి దేశాలకు, తొలినాళ్లలో సోవియట్ అందించిన సాయం నిర్మాణాత్మకమైనది. భారీ పరిశ్రమల ఏర్పాటుకై నెహ్రూ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు పశ్చిమ దేశాలు తొంటి చెయ్యి చూపితే రష్యా సాయం చేసింది. అంతరి క్షంలోకి తొలి వ్యోమగామిని పంపి శాస్త్రసాంకేతిక రంగా లలో సైతం శ్రమజీవుల రాజ్య ప్రాధాన్యాన్ని చాటింది. కానీ ఆ తర్వాత అదే మార్గాన యుఎస్ఎస్ఆర్ ప్రస్థా నం సాగలేదు. ఇప్పుడు యుఎస్యస్ఆర్ ప్రపంచ చిత్ర పటంలో లేదు. విచ్ఛిన్నమైన రష్యా భూభాగాలలో సైతం సోషలిజం లేదు. కష్టజీవుల రాజ్యం స్థానంలో తిరిగి పెట్టు బడిదారీ రాజ్యం వచ్చింది. ఎందుకలా జరిగింది? ఈ చిన్న వ్యాసంలో ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం అసా ధ్యం. కానీ మార్క్స్ ప్రవచించిన చారిత్రక భౌతికవాద క్రమానికి సోవియట్ అవతరణ ఒక నిరూపణ చేసే ఘట్టం అని మాత్రం చెప్పగలం. పారిస్ కమ్యూన్ 72 రోజులు ఉంది. ఆ సమయం లోనే నూతన మార్గాన్ని పారిస్ నగరంలో ప్రవేశపెట్టింది. సోవియట్ యూనియన్ 72 ఏళ్లు ఉంది. ఆ వెలుగులు ‘ప్రపంచ పారిశ్రామికులారా ఏకమవండి. పోరాడితే మీకు పోయేదేమీలేదు. బానిస బంధనాలు తప్ప’ అన్న మార్క్స్ పిలుపు ఆచరణ రూపం దాల్చగలిగితే ప్రపంచం ఎలా ఉం టుందో చెప్పే చిత్రాన్ని మనముందుంచింది. నేడు వియత్నాం, క్యూబా, చైనా వంటి దేశాలు ఆ మార్గాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్నాయి. అదంతా ప్రచార్భాట మని కొట్టిపారవేయనవసరం లేదు. కానీ సోవియెట్ ‘రష్యా’ అదృశ్యం కావడానికి ఏ ఆర్థిక, స్వకీయ కార ణాలు దోహదం చేశాయో ఆ కారణాలు నేటి ప్రపంచం మొత్తంలో పొంచి ఉన్నాయన్నది నిజం. -డా॥ఏపీ విఠల్, మార్క్సిస్టు విశ్లేషకులు (నవంబర్ 7 రష్యా విప్లవ దినోత్సవం)