ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
Published Wed, Mar 22 2017 11:13 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
– మార్కులు తక్కువ వస్తాయని భయపడి ఆత్మహత్య
ఎమ్మిగనూరు రూరల్: మార్కులు తక్కువ వస్తాయని భయపడి గుడేకల్ గ్రామానికి చెందిన ఇంటర్ మీడియట్ విద్యార్థిని..బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు...నందవరం మండలం నాగలదిన్నె గ్రామానికి చెందిన కొండయ్య, శాంతమ్మలకు కుమార్తె కె.ఇందిరమ్మ ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజిలో రెండో సంవత్సరం బైపీసీ చదువుతుంది. నాగలదిన్నె నుంచి రోజు బస్సుకు రావటం ఎందుకని మండల పరిధిలోని గుడేకల్‌లో తన తాత గోవిందప్ప దగ్గర ఉంటోంది. రెండు రోజుల కిత్రం ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. మొదటి సంవత్సరంలో ఒక సబ్జెక్్ట ఫెయిల్ అయ్యానని, రెండో సంవత్సరం పరీక్షలు సరిగా రాయలేదని ..మార్కులు తక్కువ వస్తాయని మదన పడేది. బుధవారం ఇంట్లో ఎవరూ లేకపోవటంతో చీరతో ఉరివేసుకుంది. విగతజీవిగా మారిన మనవరాలిని చూసి అవ్వాతాతలు బోరున విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ వేణుగోపాల్ పేర్కొన్నారు.
Advertisement