కర్నూలు నగరం టౌన్‌మోడల్ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సుచరిత (17) రెండు రోజులుగా కనిపించడం లేదు.
కర్నూలు: కర్నూలు నగరం టౌన్‌మోడల్ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సుచరిత (17) రెండు రోజులుగా కనిపించడం లేదు. కల్లూరు ఎస్టేట్‌లోని భగవాన్‌నగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు, సరస్వతి దంపతులకు ఇద్దరు సంతానం కాగా. పెద్ద కూతురు సుచరిత టౌన్‌మోడల్ కళాశాలలో చదువుతోంది. గురువారం రాత్రి 8గంటల సమయంలో దుకాణానికి వెళ్తున్నట్లు చెప్పి బయటికి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో ఆమె కోసం నగరమంతా గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఛామన చాయ ఉండి, 5అడుగుల ఎత్తు ఉంటుంది. ఇంటి నుంచి బయటికి వెళ్లే టపుడు పంజాబీ డ్రస్సు ధరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తల్లిదండ్రులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నాలుగో పట్టణ సీఐ నాగరాజురావు తెలిపారు.