Inter
-
పదో తరగతి, ఇంటర్ పరీక్షలు.. కేంద్రాల్లోకి షూస్, సాక్స్‌లకు నో ఎంట్రీ
గాంధీ నగర్ : త్వరలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ పరీక్షల నిర్వహణలో భాగంగా సెకండరీ, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు షూస్, సాక్స్‌లు ధరించొద్దని ఆదేశించింది. ఈ మార్గదర్శకాలు ఎక్కడంటే?గుజరాత్లో ఫిబ్రవరి 27 నుంచి పదోతరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో విద్యార్థులకు గుజరాత్ సెకండరీ,హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ పలు సూచనలు ఇచ్చింది.పరీక్షల్లో జరిగే కాపీయింగ్‌ను అరికట్టేందుకే గుజరాత్ ప్రభుత్వం పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు షూస్,సాక్సులు ధరించకూడదని సూచించింది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. విద్యార్థులు మొబైల్, ఎలక్ట్రానిక్ వాచ్ లేదా ఎలాంటి గాడ్జెట్లు ధరించకూడదని ఆదేశించింది. ఇప్పటికే 2018 నుండి బీహార్ బోర్డు ఈ తరహాలో పరీక్షలు నిర్వహిస్తుంది. అయితే,ప్రతికూల వాతావరణం కారణంగా కొనసాగుతున్న ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు, త్వరలో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. బీహార్ బాటలో ఉత్తరప్రదేశ్ బోర్డు సైతం పరీక్షల సమయంలో కొన్ని కేంద్రాల్లో పరీక్షలు రాసే విద్యార్థులు మాత్రమే షూస్,సాక్స్‌లు లేకుండా రావాలని తెలిపింది. తాజాగా,గుజరాత్ సైతం పరీక్షల్లో కాపీయింగ్‌ను అరికట్టే దిశగా చర్యలు తీసుకుంది. కాగా,ఈ సంవత్సరం గుజరాత్లో 10వ తరగతి, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు 14.30 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. -
ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల య్యాయి. ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేసింది.విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలను ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.comలో చూడొచ్చు.ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 3 వరకూ జరిగాయి. సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేశారు. ఈసారి ఇంటర్ మొదటి సంవత్సరం సప్లమెంటరీ పరీక్షలకు 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లమెంటరీ (జనరల్) ఫలితాల కోసం క్లిక్ చేయండిఇంటర్ ఫస్ల్ ఇయర్ సప్లమెంటరీ(వొకేషనల్) ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
18 నుంచి ఇంటర్ ‘సప్లిమెంటరీ’ ఫీజు చెల్లింపు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈనెల 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఓ ప్రకటనలో తెలిపారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఇదే తేదీల్లో ఫీజు చెల్లించాలని సూచించారు. జవాబు పత్రాల (ఒక్కో పేపర్) రీ వెరిఫికేషన్‌కు రూ.1300, రీకౌంటింగ్‌కు రూ.260 చెల్లించాలన్నారు. సప్లిమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా రూ.550, ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూవ్మెంట్ కోసం రూ.550 పరీక్ష ఫీజుతో పాటు పేపర్‌కు రూ.160 చొప్పున చెల్లించాలి. మొదటి, రెండో సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటే.. సైన్స్ విద్యార్థులు రూ.1440, ఆర్ట్స్ విద్యార్థులు రూ.1240 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు తమతమ కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు. కాగా, మే 25 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని, ఫీజు చెల్లింపునకు మరో అవకాశం ఉండదని, ఈ విషయం అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ గుర్తించాలని సౌరభ్ గౌర్ విజ్ఞప్తి చేశారు. -
ప్రైవేట్ కాలేజీల్లో 50 శాతం పెరిగిన ఇంటర్ ఫీజులు...‘ఇంటర్’ ద డ్రాగన్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ ఫీజుల మోత మోగుతోంది. ప్రైవేటు కాలేజీలు అడ్డగోలుగా ఫీజులు పెంచేశాయి. గత ఏడాదితో పోలి స్తే ఏకంగా 40–50% అదనంగా డిమాండ్ చేస్తున్నా యి. ఇటీవలే టెన్త్ పరీక్షలు మొదలైన నేపథ్యంలో.. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్మీడియట్లో చేర్చేందుకు కాలేజీల్లో ఆరా తీస్తున్నారు. ఇదే అదనుగా కాలేజీల యాజమాన్యాలు ఫీజు దోపిడీకి తెరతీశాయి. నిర్వహణ ఖర్చు, బోధన వ్యయం పెరిగిందని చెప్పుకొస్తున్నాయి. కాలేజీలు చెప్తున్న ఫీజుల మొత్తాన్ని చూసి.. తల్లిదండ్రులు హతాశులవుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని.. ఫీజుల నియంత్రణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాలేజీల అడ్డగోలు ఫీజు వ్యవహారంపై ఇంటర్ బోర్డు అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. ఫీజుల కట్టడిపై రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేకంగా ఆదేశిస్తే తప్ప ప్రస్తుతం తామేమీ చేయలేమని అంటున్నారు. 4 లక్షల మంది విద్యార్థులపై భారం రాష్ట్రంలో ఏటా 4 లక్షల మంది వరకు విద్యార్థులు టెన్త్ పాసవుతున్నారు. గత ఏడాది గణాంకాలను చూస్తే ఇంటర్ ఫస్టియర్‌లో 3,27,202 మంది చేరారు. రాష్ట్రంలో మొత్తం 3,339 ఇంటర్ జూనియర్ కాలేజీలు ఉండగా.. అందులో ప్రైవే టువి 1,441 ఉన్నాయి. వాటిలో 2,02,903 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోనూ 2 లక్షల మందికిపైగా ప్రైవేటు కాలేజీల్లోనే ఉంటారు. వారంతా కాలేజీల యాజ మాన్యాలు చెప్పినంత ఫీజులు కట్టాల్సి న పరిస్థితి. వాస్తవానికి కరోనా మహ మ్మారి ఎఫెక్ట్ తర్వాత కాలేజీలు ఏటా 10– 20% మేర ఫీజులు పెంచుతున్నాయి. ఈసారి గరిష్టంగా 50% వర కూ పెంచాయి. అన్ని ఖర్చులు పెరిగాయి కాబట్టి ఫీజులు పెంచుతున్నామని యాజమాన్యాలు చెప్తున్నాయి. కోవిడ్ సమయంలో కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులు ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయారని, కొరత కారణంగా ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తోందని అంటున్నాయి. నిర్వహణ భారం పెరిగిందని చెప్పుకొస్తున్నాయి. అఫిలియేషన్ ఫీజు పెంచకున్నా.. రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు మూడు కేటగిరీల కింద అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇస్తుంది. ప్రతీ విద్యాసంస్థలో గరిష్టంగా 960 మందిని చేర్చుకునేందుకు అనుమతిస్తారు. అఫిలియేషన్ ఫీజు కింద ఏటా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాలేజీల నుంచి రూ.1.20 లక్షలు, మున్సిపాలిటీల పరిధిలోని కాలేజీల నుంచి రూ.60 వేలు, గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల నుంచి రూ.20వేల చొప్పున వసూలు చేస్తారు. రెండేళ్లకోసారి ఈ ఫీజులను సమీక్షించి పెంచాల్సి ఉన్నా.. ఇంటర్ బోర్డు కొన్నేళ్లుగా పెంచలేదు. 50శాతం దాకా పెంపు.. సాధారణ జూనియర్ కాలేజీల్లో గత ఏడాది వరకూ గరిష్టంగా రూ.60 వేల ఫీజు ఉంటే.. ఈసారి రూ.90 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. కార్పొరేట్ కాలేజీలు రూ.1.25 లక్షల నుంచి రూ. 2 లక్షలకుపైగా (కాలేజీని బట్టి) డిమాండ్ చేస్తున్నాయని.. అదే హాస్టల్‌నూ కలిపితే ఏకంగా రూ.3.25 లక్షల వరకు చెప్తున్నారని వాపోతున్నారు. కార్పొరేట్ కాలేజీలు ఫీజులు పెంచడాన్ని చూసి.. సాధారణ కాలేజీలు కూడా పెంచుతున్నాయని చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల పరిధిలోనూ వార్షిక ఫీజులను రూ.75 వేలకు తక్కువ వసూలు చేయడం లేదని అంటున్నారు. మరోవైపు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్కుల ధరలు కూడా గత ఏడాదితో పోల్చితే 20శాతం మేర పెరిగాయని.. ప్రైవేటు కాలేజీల రవాణా, ఆటో చార్జీలు కూడా 30శాతం వరకూ పెంచారని తల్లిదండ్రులు చెప్తున్నారు. దీంతో ఇంటరీ్మడియట్ విద్య కోసమే రూ.లక్షల్లో వెచి్చంచాల్సి వస్తోందని వాపోతున్నారు. అంత ఫీజు ఎలా కట్టగలం? ఇటీవల టెన్త్ పరీక్షలు రాసిన మా అబ్బాయిని చేరి్పంచాలంటూ ఓ ప్రైవేటు కాలేజీ సిబ్బంది వెంటపడ్డారు. అడ్మిషన్ కోసం వెళ్తే ఏటా రూ.2.25 లక్షల ఫీజు అని చెప్పారు. కావాలంటే ఓ రూ.25 వేలు రాయితీ ఇస్తామన్నారు. అంత ఫీజేమిటని అడిగితే ఈ ఏడాది ఖర్చులు పెరిగాయని, అందుకే ఫీజులు పెంచామని చెప్పారు. రెండేళ్లకు రూ.4 లక్షల ఫీజు ఎలా కట్టగలం. వేరే కాలేజీల్లో ఆరా తీసినా అడ్డగోలుగా పెంచారు. ప్రభుత్వం నియంత్రణ చేపడితే పేదలకు ఊరటగా ఉంటుంది. – సుచిత్ర, ఇంటర్ విద్యార్థి తల్లి, హైదరాబాద్ దోపిడీని నియంత్రించకుంటే ఆందోళన ప్రైవేటు కాలేజీల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సర్కారు నుంచి ఏ విధమైన ఆదేశాలూ లేకపోవడంతో అధికారులు పట్టించుకోవడం లేదు. పేదలు భరించలేని విధంగా కాలేజీలు ఫీజులు పెంచుతున్నాయి. తక్షణమే నియంత్రణ చేపట్టాలి. లేని పక్షంలో ఆందోళనలు చేపడతాం. – టి.నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కార్పొరేట్ ఆగడాలను అడ్డుకోరా? అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తవకుండానే ప్రైవేటు ఇంటర్ కాలేజీలు అడ్మిషన్లు చేపట్టడం చట్ట విరుద్ధం. దీనికితోడు పేదలు ఏమాత్రం భరించలేని విధంగా ఫీజులు పెంచడం దుర్మార్గం. పాలక వర్గాలు దీన్ని అడ్డుకోవడంలో విఫలమవుతున్నాయి. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి.. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల ఫీజు దోపిడీని అడ్డుకోవాలి. – చింతకాయల ఝాన్సీ, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఫీజుల నియంత్రణ అవసరం కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఇష్టానుసారం ఫీజులు పెంచడం వల్ల అన్ని కాలేజీలూ ఆ నింద మోయాల్సి వస్తోంది. ప్రభుత్వమే కాలేజీలను కేటగిరీలుగా విభజించి, ఫీజుల నిర్ణయం చేయాలి. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. పేదలకు ఇంటర్ విద్యను అందుబాటులోకి తేవడానికి ఫీజుల కట్టడి చట్టాలు అవసరం. – గౌరీ సతీశ్, తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు ఫిర్యాదులు వస్తున్నాయి.. పరిశీలిస్తున్నాం ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల పెంపుపై అన్ని వర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. నియంత్రణ కోసం ఏం చేయాలనేది పరిశీలిస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఇంటర్ బోర్డ్ సిద్ధంగా ఉంది. – జయప్రదాబాయి, ఇంటర్ బోర్డ్ సీనియర్ అధికారి -
త్వరలో ఇంటర్, పది ఫలితాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. విద్యార్థులపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉండకూడదన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను ఈ ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి 30 వరకు నిర్వహించింది. వెంటనే విద్యాశాఖ అధికారులు మూల్యాంకనం చేపట్టారు. ఇంటర్మీడియట్లో రెండు సంవత్సరాల విద్యార్థులు మొత్తం 9,99,698 మంది పరీక్షలు రాశారు. వీరి జవాబుపత్రాల మూల్యాంకనం కోసం సుమారు 23 వేలమంది అధ్యాపకులను ఇంటర్ విద్యామండలి నియమించింది. పదో తరగతి పరీక్షలను 6,30,633 మంది రాశారు. వీరికి సంబందించిన 47,88,738 జవాబుపత్రాల వేల్యూయేషన్ కోసం 25 వేలమంది ఉపాధ్యాయులను నియమించి 26 జిల్లాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. గతంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించి ఈ ఏడాది మూల్యాంకనం కేంద్రంలో గరిష్టంగా 900 మంది వేల్యూయేటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. గతేడాది ఏప్రిల్ 26న ఇంటర్, మే 6న టెన్త్ ఫలితాలు షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం గురువారంతో ముగియనుంది. తరువాత పునఃపరిశీలన, మార్కుల నమోదు వంటి ప్రక్రియ నిర్వహించనున్నారు. అనంతరం ఈనెల 12వ తేదీ నాటికి ఇంటర్మీడియట్ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభమైన పదో తరగతి మూల్యాంకనం కూడా ఈనెల ఎనిమిదో తేదీ నాటికి పూర్తికానుంది. ఈ ఫలితాలను సైతం వారం, పదిరోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. మూల్యాంకన ప్రక్రియలో ఎక్కువమంది సిబ్బంది నియామకం, టెక్నాలజీ వినియోగం, ప్రతి మూల్యాంకన కేంద్రానికి బోర్డు నుంచి ప్రత్యేక అధికారుల పరిశీలన వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం ఇంటర్మీడియట్, టెన్త్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తారు. 2022–23 విద్యాసంవత్సరంలో జరిగిన వార్షిక పరీక్షలకు సంబంధించి ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 26న, టెన్త్ ఫలితాలను మే 6వ తేదీన విడుదల చేశారు. -
ఇంటర్ విద్యలో డిజిటల్ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించేందుకు బోర్డు డిజిటల్ విధానాలను అనుసరిస్తోంది. ఇప్పటికే డిజి లాకర్లో 2006 నుంచి 2023 మధ్య ఇంటర్మీడియట్ పాసైన 68.73 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచగా, ఈ ఏడాది నుంచి ఫీజు చెల్లింపు నుంచి ప్రాక్టికల్స్ మార్కుల నమోదు వరకు అన్ని అంశాలను ఆన్లైన్ విధానంలోకి మార్చింది. దీంతో విద్యార్థులు, పాఠశాలల యాజమాన్యాలకు సమయాభావం తగ్గడంతో పాటు వేగవంతమైన సేవలు అందుబాటులోకి వచ్చినట్లయింది. గతంలో చలాన్ రూపంలో ఫీజు చెల్లించగా, వాటిని పరిశీలించి మదింపు చేసేందుకు బోర్డుకు చాలా సమయం పట్టేది. కానీ, ఈ ఏడాది ఫీజులను, నామినల్ రోల్స్‌ను కూడా ఆన్లైన్ చేయడంతో గత ఇబ్బందులన్నీ తొలగించినట్లయింది. ఇంటర్ పరీక్షలకు 9,59,933 మంది.. ఇక మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొదటి సంవత్సరంలో 5,17,591 మంది, రెండో ఏడాది 4,45,342 మంది మొత్తం 9,59,933 మంది పరీక్ష రాయనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1,559 పరీక్షా కేంద్రాలను సిద్ధంచేశారు. ఇప్పటికే ఆయా జూనియర్ కాలేజీల్లోని పరీక్ష జరిగే గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. అలాగే, ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలకు 2,130 సెంటర్లను సిద్ధంచేశారు. ఈసారి ప్రాక్టికల్స్ పూర్తయిన వెంటనే మార్కులను ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఇందుకోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఎగ్జామినర్ రెండుసార్లు ఆన్లైన్లో మార్కులు నమోదు చేసేలా చర్యలు తీసుకున్నామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. ఇకపై ఇదే ఆన్లైన్ విధానం కొనసాగుతుందన్నారు. డిజిలాకర్‌లో 68.73 లక్షల సర్టిఫికెట్లు.. రాష్ట్రంలో ఇంటర్ పాసైన విద్యార్థులు తమ సర్టిఫికెట్లను ఆన్లైన్లో సులభంగా పొందే వెసులుబాటును ఇంటర్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. పాస్ సర్టిఫికెట్, మైగ్రేషన్, ఈక్వ లెన్సీ, జె న్యూనెస్ సర్టిఫికెట్లు ఎప్పుడు కావాలన్నా తీసుకునేలా ‘డిజిలాకర్’ (https://digilocker.gov.in)లో ఉంచింది. ఇందుకోసం ‘జ్ఞానభూమి’ ని డిజిలాకర్‌కు అనుసంధానించింది. ఇందులో ఇప్పటివరకు 2006 నుంచి 2023 వరకు ఇంటర్ పూర్తిచేసిన 68,73,752 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచారు. సర్టిఫి కెట్లలో తప్పుపడిన పేరును సరిదిద్దేందుకు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీలను సవరించడం వంటి ఇతర సేవలను కూడా ఆన్లైన్లో డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా విద్యార్థులు పొందవచ్చు. డిజి లాకర్‌గా పిలుస్తున్న ‘డిజిటల్ డాక్యుమెంట్స్ రిపోజిటరీ’లో ఇంటర్ పరీక్షలు పూర్తిచేసిన విద్యార్థులు తమ పత్రాలను పొందవచ్చు. గతంలో సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారు ‘డూప్లికేట్’ పొందాలంటే పోలీసు వి భాగం ఎన్ఓసీ, నోటరీ అఫిడవిట్‌తో దరఖాస్తు చేయడంవంటి వ్యయప్రయాసలు పడాల్సి వచ్చే ది. ఈ ప్రక్రియకు స్వస్తి పలుకుతూ డిజి లాకర్‌తో జ్ఞానభూమిని అనుసంధానం చేయడంతో విద్యార్థి తన మొబైల్ ఫోన్లోని డిజిలాకర్ యాప్ ద్వారా సర్టిఫికెట్లను ఎప్పుడైనా, ఎక్కడైనా పొందే విధానాన్ని బోర్డు అందుబాటులోకి తెచ్చింది. -
ఇంటర్ విద్యార్థినిపై కన్నేసిన కామాంధుడు
-
ర్యాంకుల కోసం ప్రణాలు పణం.. విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి!
"1, 2, 3.. పదిలోపు ర్యాంకులు మా విద్యార్థులవే.. పరీక్షలు ఏవైనా మెరుగైన ర్యాంకులు మా విద్యా సంస్థలదే.. అని కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు ఊదరగొడితే.. 'మా అబ్బాయికి మొదటి ర్యాంకు వచ్చింది.. మా అమ్మాయికి రెండో ర్యాంకు వచ్చింది..' అంటూ తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకొంటారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ మధ్యలో విద్యార్థులు ఎంతటి ఒత్తిడి అనుభవిస్తున్నారు.. ఎలా చదువుకుంటున్నారు.. అని మాత్రం ఎవరూ పట్టించుకోరు.. ఈ క్రమంలో ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం ఒకరిపై ఒకరు నెట్టుకొంటూ విద్యాసంస్థలు చేతులు దులుపుకొంటే.. తల్లిదండ్రులు కడుపు కోతతో జీవితాలను నెట్టుకొస్తున్నారు.. మొత్తంగా తల్లిదండ్రుల అత్యాశ.. విద్యాసంస్థల ధనదాహం.. ప్రభుత్వ పట్టింపులేని తనం వల్ల విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు.." - మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ ర్యాంకుల కోసం విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నారు. సమయం.. సందర్భం లేకుండా ఎప్పుడూ ప్రిపరేషన్ అంటూ పుస్తకాలతో కుస్తీ పట్టిస్తున్నారు. రోజువారి సాధారణ తరగతులే కాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతుల పేరిట విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీటిని కొందరు విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ మెరుగైన ఫలితాలు సాధిస్తే.. మరికొందరు మాత్రం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం మహబూబ్‌నగర్‌లోని మైనార్టీ గురుకులంలో ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు తీవ్రమైన ఒత్తిడే కారణం అన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఇన్నాళ్లు ప్రైవేట్‌లో చోటుచేసుకున్న పై సంఘటనలు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యా సంస్థలకు విస్తరిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. - గత వారం రోజుల క్రితం క్రిష్టియన్‌పల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సెలవు దినాలు, ఆదివారాల్లోనూ తరగతులు నిర్వహిస్తూ.. పరీక్షలు పెడుతున్నారని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పాఠశాల విద్యార్థులే స్వయంగా డీఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన ఎంఈఓతో విచారణ జరిపించారు. స్పెషల్ క్లాస్‌లు, పరీక్షల నిర్వహణ నిజమే అని తేలడంతో పాఠశాలను హెచ్చరించారు. పాఠశాల స్థాయి నుంచే.. ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు ఐఐటీ, నీట్లో సీట్లు సాధించాలన్న ఉద్దేశంతో చాలా ప్రైవేట్ పాఠశాలల్లో 8వ తరగతి నుంచే మెటీరియల్స్ పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రుల నుంచి అదనంగా రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ తరగతులు పూర్తయిన వెంటనే స్పెషల్ క్లాస్‌ల పేరిట ఐఐటీ, నీట్ కోసం శిక్షణ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు వార్షిక పరీక్షల సిలబస్‌పై దృష్టి సారించాలా.. లేక ఐఐటీ, నీట్ వంటి వాటిపై దృష్టిపెట్టాలా అన్న అంశాలతో గందరగోళానానికి గురవుతున్నారు. ఇవి చదవండి: సైబర్ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. మెసేజ్ క్లిక్ చేయగానే బిగ్ షాక్! -
తర్ఫీదు ఇవ్వకుంటే చిక్కులే!
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్‌లో కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఇంగ్లీష్ సబ్జెక్టులోనూ ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించినా, ఇందుకు సంబంధించిన సన్నద్ధత ఎక్కడా కన్పించడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో దీనిపై ఏమాత్రం శ్రద్ధ పెట్టకపోవడం సందేహాలకు తావిస్తోంది. అసలీ సంవత్సరం ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఉంటాయా? ఉండవా? అనే అనుమానం విద్యార్థులతో పాటు అధ్యాపకుల నుంచీ వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు సాధారణ క్లాసులే కొనసాగుతుండటం, ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌పై ఏ విధమైన కసరత్తు ప్రారంభం కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బోర్డు నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలు రాలేదని అధ్యాపకులు అంటున్నారు. మార్చి, ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలుంటాయని, మొదట్నుంచీ సరైన శిక్షణ లేకుంటే పరీక్షలు ఎలా రాస్తారని కొంతమంది అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాక్టికల్స్ విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, మాక్ టెస్టులు నిర్వహించడం అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. దసరా తర్వాత కార్యాచరణ ఈ ఏడాది నుంచే ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నాం. దసరా తర్వాత అన్ని స్థాయిల్లోనూ అవగాహన కల్పించేందుకు ప్రయల్పింస్తున్నాం. అధ్యాపకులకూ దీనిపై స్పష్టత వచ్చేలా చేస్తాం. ఇంటర్ ప్రవేశాలు ఇంకా జరుగుతున్న కారణంగా ప్రాక్టికల్స్‌కు సమయం ఉంది. –జయప్రదాభాయ్ (ఇంటర్ పరీక్షల నియంత్రణాధికారి) విధివిధానాలు విడుదలైతే స్పష్టత ఇంగ్లీష్‌లో ప్రాక్టికల్స్ తీసుకురావాలన్న ప్రయోగం మంచిదే. దీనిపై అన్ని స్థాయిల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. విధివిధానాలపై బోర్డు త్వరలో స్పష్టత ఇస్తుందని భావిస్తున్నాం. – మాచర్ల రామకృష్ణగౌడ్ (ప్రభుత్వ జూనియర్ కాలేజీల అధ్యాపకుల సంఘం రాష్ట్ర కన్వీనర్) ఆఖరులో హడావుడితో నష్టం ఆంగ్ల సబ్జెక్టులో 80 మార్కులకు థియరీ పరీక్ష ఉంటుంది. మిగిలిన 20 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. విద్యార్థి ఒక నిమిషంలో తనకు నఇంగ్లీష్ న టాపిక్‌లో మాట్లాడటం, రికార్డు రాయడం, విద్యార్థులు ఇంగ్లీష్‌లో ముచ్చటించడం, ఇంగ్లీష్ చదవడం అనే అంశాలు ప్రాక్టికల్స్‌లో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఏదైనా అంశం గురించి మాట్లాడటం అనే దానిపై తరగతి గదిలో తర్ఫీదు అవ్వాల్సి ఉంటుందని అధ్యాపకులు అంటున్నారు. లేనిపక్షంలో అప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్‌పై బట్టీ పట్టి వచ్చే అవకాశం ఉంటుందని, అందువల్ల ప్రయోజనం ఏమిటని ప్రన్పిస్తున్నారు. విద్యార్థులకు ఇంగ్లీష్‌పై పట్టు పెరగాలంటే విద్యార్థులు పరస్పరం ఇంగ్లీష్‌లో సంభాషించుకోవడం ముఖ్యం. ఈ ఉద్దేశంతోనే దాన్ని ప్రాక్టికల్స్‌లో చేర్చారు. మరికొద్ది నెలల్లో పరీక్షలు జరగనుండగా ఇప్పటికీ ఈ తరహా ప్రయోగాలు కాలేజీల్లో జరగడం లేదు. రికార్డుల విషయంలోనూ ఇదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. తీరా పరీక్షల ముందు హడావుడి చేస్తే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. మరోవైపు చాలావరకు ప్రైవేటు కాలేజీల్లో ఇప్పటికే సిలబస్ మొత్తం పూర్తయి రివిజన్‌కు వెళ్తున్నారు. ఇంగ్లీష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్‌పైనా విద్యార్థులకు శిక్షణ నడుస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. -
రాష్ట్రంలో కొత్తగా 20 కేజీబీవీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఈ దిశగా మంగళవారం విద్యాశాఖ జీవో జారీ చేసింది. వీటి ఏర్పాటుకు రికరింగ్ బడ్జెట్‌గా రూ.60 లక్షలను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. జిల్లాల విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన మండలాల్లో 20 కేజీబీవీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించగా, ఆయా ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో 2014లో రాష్ట్రంలో 391 కేజీబీవీలుండేవి. 2017–18లో కొత్తగా 84 కేజీబీవీలను మంజూరు చేశా రు. దీంతో రాష్ట్రంలో కేజీబీవీల సంఖ్య 475కు చేరింది. తాజాగా మంజూరైన వాటి తో వీటి సంఖ్య 495కు చేరింది. వీటిల్లో 245 కేజీబీవీల్లో ఇంటర్ విద్య, మరో 230 కేజీబీవీలను పదోతరగతి వరకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఏర్పాటు చేసినవి ఇవే.. మావల (ఆదిలాబాద్), బీర్పూర్, బుగ్గారం (జగిత్యాల), కొత్తపల్లి, గన్నేరువరం (కరీంనగర్), దంతాలపల్లి (మహబూబాబాద్), మహ్మదాబాద్ (మహబూబ్‌నగర్), నార్సింగి, నిజాంపేట, హవేలి, ఘన్పూర్ (మెదక్), నిజామాబాద్ (సౌత్), నిజామాబాద్ (నార్త్), నాగలిగిద్ద, మెగ్గుంపల్లి, వట్పల్లి, గుమ్మడిదల, చౌటకూరు (సంగారెడ్డి), దూల్మిట్ట (సిద్దిపేట), చౌడాపూర్ (వికారాబాద్). -
ఇంటర్ ఆంగ్లంలోనూ ప్రాక్టికల్స్
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఇంటర్మీడియె ట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల్లోనే ప్రాక్టి కల్స్ పరీక్షలు ఉండగా ఈ ఏడాది నుంచి కొత్తగా ఆంగ్లం సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్ పరీక్షలు ఉండబో తున్నాయి. మొత్తం నాలుగు విభాగాలుగా ప్రాక్టి కల్స్ను విడగొట్టి ఒక్కో విభాగానికి 4 మార్కులు చొప్పన కేటాయించనున్నారు. దీంతోపాటే మొద ట్నుంచీ క్లాస్‌వర్క్ మాదిరి రికార్డు రాయడాన్ని చేర్చనున్నారు. దీనికి కూడా 4 మార్కులు ఇవ్వను న్నారు. మొత్తం 20 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటా యి. ఇందులో విద్యార్థులు కనీసం 7 మార్కులు తెచ్చుకోవాలి. థియరీని 80 మార్కులకు నిర్వహించనుండగా అందులో కనీసం 28 మార్కులు రావా లి. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరంలోనే ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ఇ ప్పటికే కసరత్తు చేపట్టిన ఇంటర్ బోర్డు... నిపుణుల చేత ఆంగ్ల ప్రాక్టికల్ విధానంపై వివరాలను క్రోడీ కరించి ముఖ్య విషయాలను పరిగణనలోకి తీసు కుంది. ఆంగ్ల భాష కీలకమైనది కావడం, ఇంటర్ పూర్తయినా విద్యార్థులకు దీనిపై పట్టులేకపోవడంతో ప్రాక్టికల్స్‌ను అనివార్యంగా భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర అధ్యయనాలు సైతం ఇంటర్ విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించాలని చెబుతుండటం, విదేశీ విద్యకు వెళ్లేందుకూ ఆంగ్లంపై పట్టు అనివార్యం కావడంతో ఈ దిశగా చర్యలు చేపట్టింది. కాలేజీలకు సూచనలు... ఆంగ్ల సబ్జెక్టులో ప్రాక్టికల్స్ విధానంపై క్షేత్రస్థాయిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొనేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమవుతోంది. పరీక్షలకు కావల్సిన సమయం ఉన్నప్పటికీ బోధన సమయంలోనే విద్యార్థులను సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రాక్టి కల్స్ ఆవశ్యకత, సన్నద్ధత ఎలా ఉండాలనే దానిపై ప్రతి కాలేజీలోనూ అవగాహన కల్పించాలని ప్రభు త్వ, ప్రైవేటు కాలేజీలను ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్‌కు ప్రా ధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. తరగతి గదిలో పరస్పర సంభాషణలు, ఏదైనా అంశంపై మాట్లా డించే పద్ధతిని అనుసరించాలని సూచించారు. వారానికి ఒక గంటపాటు ఈ తరహా కసరత్తు చేయాలని పేర్కొన్నారు. ఆంగ్లంలో ధారాళంగా చదవడం, రాయడం కూడా అభివృద్ధి చేయాల న్నారు. దీంతోపాటే స్పెల్లింగ్లపైనా పట్టు సాధించేలా ప్రోత్సహించాలని, ఆంగ్ల దినపత్రికలను చదవడం ద్వారా దీన్ని పెంచాలని భావిస్తున్నారు. కోవిడ్ దెబ్బతో సాధ్యమా? ఇంగ్లిష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ నిర్వహణ సాధ్యా సాధ్యాలపై అధ్యాపకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండేళ్లుగా టెన్త్‌లో కోవిడ్ ప్రభావం కన్పిస్తోంది. లెర్నింగ్ లాస్ ఎక్కువగా ఉందని విద్యాశాఖ సైతం పేర్కొంది. ముఖ్యంగా ఆంగ్ల భాషలో గ్రామర్, స్పెల్లింగ్లపై విద్యార్థులు సరైన స్థాయిలో పట్టు సాధించలేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇంటర్ ప్రాక్టికల్స్‌లోకి తీసుకొనే అంశాలన్నీ గ్రామర్‌తో ముడివడి ఉన్నాయి. గ్రామర్‌లో బేసిక్స్ లేకుండా సరైన కమ్యూనికేషన్ స్కిల్స్‌ను గుర్తించడం కష్టమని అధ్యాపకులు అంటున్నారు. రోల్ ప్లే, లిజనింగ్ కాంప్రహెన్షన్లోనూ విద్యార్థులు వెనుకబడొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక శిక్షణ ఇస్తాం ఇంగ్లిష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ నిర్వహణపై రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ ఇస్తాం. ఇంటర్ అడ్మిషన్లు పూర్తయ్యాక ప్రతి జిల్లాలోనూ సబ్జెక్టు లెక్చరర్లకు ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తాం. విద్యార్థులను అన్ని విధాలా సిద్ధం చేయడం దీని ముఖ్యోద్దేశం. ప్రాక్టికల్స్ కొత్తగా చేపడుతున్నా విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. – జయప్రదాబాయ్, ఇంటర్ పరీక్షల విభాగం ముఖ్య అధికారి -
ఏపీ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల.. సెలవులు ఇవే
సాక్షి, విజయవాడ: ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్కి 227 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ►జులై 24 నుంచి 26 వరకు యూనిట్-1 పరీక్షలు ►ఆగస్ట్ 24 నుంచి 26 వరకు యూనిట్ -2 పరీక్షలు ►సెప్టెంబర్ 16 నుంచి 23 వరకు క్వార్టర్లీ పరీక్షలు ►అక్టోబర్ 16 నుంచి 18 వరకు యూనిట్ -3 పరీక్షలు ►అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు ►నవంర్ 23 నుంచి 25 వరకు యూనిట్ -4 పరీక్షలు ►డిసెంబర్ 18 నుంచి 23 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు ►2024 జనవరి 11 నుంచి 17 వరకు ఇంటర్ కళాశాలలకి వేసవి సెలవులు ►2024 ఫిబ్రవరి రెండవ వారంలో ఇంటర్ ప్రాక్టికల్స్ ►2024 మార్చ్ మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు ►2024 మార్చ్ 28 చివరి వర్కింగ్ డే ►2024 మార్చ్ 29 నుంచి మే 31 వరకు వేసవి సెలవులగా అకడమిక్ క్యాలెండర్ విడుదల చదవండి: శ్వేత మృతికి కారణం ఏంటంటే..? షాకింగ్ విషయాలు వెల్లడించిన సీపీ -
టీఎస్ ఇంటర్ ఫలితాల విడుదల ఎప్పుడంటే..?
తెలంగాణలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. ఇంటర్ ప్రథమ , ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 9,48,010 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షలు మార్చి 29వ తేదీతో (బుధవారం) ముగిశాయి. ఇంటర్ సెకండియర్ పరీక్షలకు మొత్తం 4,17,525 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 4,02,630 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫస్టియర్ ఇంటర్‌కు 4,82,619 మంది ఉన్నారు. ఇక ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మాత్రం మళ్లీ పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతున్నారు. మే మొదటి వారంలోనే ఫలితాలు.. పరీక్షలు ముగియడంతో ఇంటర్ బోర్డ్ పేపర్ల వాల్యుయేషన్ పై దృష్టి సారించింది. గత వారంలోనే వాల్యుయేషన్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంటర్ బోర్డ్ భావిస్తోంది. గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో వాల్యుయేషన్, టేబులేషన్ లో ఎలాంటి తప్పులు దొర్లకుండా చర్యలు చేపట్టింది ఇంటర్ బోర్డ్. అన్ని అనుకున్నట్లు జరిగితే.. మే మొదటి వారంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే జూన్ 1వ తేదీ నుంచి తిరిగి ఇంటర్ తరగతులను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. డిజిటల్ మూల్యాంకనం ఇలా.. ఈ ఏడాది 35 లక్షల ప్రశ్నాపత్రాలకు ఆన్లైన్లో మూల్యాంకన చేపట్టాలని నిర్ణయించామని మిత్తల్ తెలిపారు. టెన్త్ పరీక్షలు పూర్తయ్యేనాటికే ఇంటర్ కాలేజీల అఫ్లియేషన్ ప్రక్రియ ముగించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. అఫ్లియేషన్ లేకపోతే పరీక్షకు బోర్డ్ అనుమతించదనే విషయమై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఈసారి ముందే అంగీకారం తీసుకునే వీలుందన్నారు.ఇక ఇంటర్ ప్రవేశాలను ఆన్లైన్ ద్వారా చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. -
పది రోజుల్లో ఇంటర్ పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జూనియర్ కాలేజీలకు మరో పది రోజుల్లో ఇంటర్ పాఠ్య పుస్తకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, తెలుగు అకాడమీ డైరెక్టర్ దేవసేన తెలిపారు. ‘సాక్షి’ప్రతినిధితో సోమవారం ఆమె మాట్లాడుతూ.. పేపర్ కొరత కారణంగానే ముద్రణ ఆలస్యమైందన్నారు. ‘‘ఈ పుస్తకాలకు నాణ్యమైన పేపర్‌ను ఉపయోగిస్తాం. పేపర్ రేట్లు ఇటీవల విపరీతంగా పెరిగాయి. పాత కాంట్రాక్టు సంస్థల్లో ఒకటి మాత్రమే పేపర్ అందించడానికి ముందు కొచ్చింది. ప్రభుత్వం ఇటీవల వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంతో తెలుగు అకాడమీ ముద్రించే పుస్తకాలకు డిమాండ్ పెరిగింది. దీంతో గతంలో వచ్చిన పేపర్ అవి ముద్రించడానికే ఉపయోగించాల్సి వచ్చింది. అవసరమైన పేపర్‌ను తెప్పించేందుకు అధికారులు సంబంధిత సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రవాణాకు ఇబ్బంది ఏర్పడింది’’అని చెప్పారు. మార్కెట్లో ఖరీదుకు అందించే పుస్తకాలను ఇప్పటికే ముద్రించామని, ప్రభుత్వ కాలేజీలకు ఉచితంగా ఇవ్వాల్సిన పుస్తకాల్లో కొన్ని ముద్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పేపర్ అందిన మూడు రోజుల్లో ప్రింటింగ్ పూర్తి చేస్తామని తెలిపారు. తర్వాత వారం రోజుల్లో అన్ని కాలేజీలకు అందిస్తామన్నారు. పేపర్ కొరత సమస్య తెలంగాణకే కాదని, అన్ని రాష్ట్రాలకూ ఉందని వెల్లడించారు. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత అంతర్జాతీయంగానూ పేపర్ ఖరీదు పెరిగిందన్నారు. తాము టెండర్లు పిలిచినప్పటికి, ఇప్పటికి పేపర్ ఖరీదు రెట్టింపు అయిందని, అయినా నాణ్యత విషయంలో రాజీ పడకుండా విద్యార్థులకు మంచి పుస్తకాలు అందించాలనే సంకల్పంతో ఉన్నామని వివరించారు. -
ఇంటర్‘నెట్’ స్టడీతో ఫస్టియర్ ఫట్..!
సాక్షి, హైదరాబాద్: అదిగో.. ఇదిగో.. అంటూ ఫలితాల విషయంలో విద్యార్థులను హైరానా పెట్టిన ఇంటర్ బోర్డు ఎట్టకేలకు గురువారం ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను విడుదల చేసింది. ఒకేషనల్స్‌తో కలిపి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలకు 4,59,242 మంది విద్యార్థులు హాజరవగా 2,24,012 (49 శాతం) మందే పాసయ్యారు. ఫలితాల్లో బాలికలు ముందు వరుసలో నిలిచారు. బాలికలు 56 శాతం మంది, బాలురు 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మేడ్చల్‌లో అత్యధికంగా 63 శాతం మంది, మెదక్‌లో అతి తక్కువగా 20 శాతం మంది పాసయ్యారు. అన్ని గ్రూపుల్లోనూ అత్యధిక మార్కులు ప్రైవేటు సంస్థలకే దక్కాయి. అరకొర విద్యాబోధన సాగిన ప్రభుత్వ కాలేజీలు గరిష్ట మార్కుల్లో ప్రైవేటుతో పోటీ పడలేకపోయాయి. ‘ఏ’ గ్రేడ్ ఉత్తీర్ణులే ఎక్కువ పాసైన విద్యార్థుల్లో 75 శాతానికి పైగా మార్కులను (ఏ గ్రేడ్) సాధించినవాళ్లే ఎక్కువున్నారు. మొత్తం 1,15,358 మంది ‘ఏ’ గ్రేడ్ సాధించారు. ఎంపీసీ విద్యార్థులు 1,58,139 మంది పరీక్ష రాస్తే 61 శాతం, బైపీసీలో 1,05,585 మంది రాస్తే 55 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ గ్రూపులో ప్రభుత్వ కాలేజీల్లో గరిష్ట మార్కు 466 కాగా, ప్రైవేటు కాలేజీల్లో 467. బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ గ్రూపుల్లోనూ ఇదే ట్రెండ్ కనిపించింది. ఏడాది మొత్తం సంక్షేమ హాస్టళ్లు తెరవకపోవడంతో అక్కడ గరిష్ట మార్కులు ప్రభుత్వ కాలేజీల కన్నా తక్కువగా వచ్చాయి. ఒకేషనల్ కోర్సుల్లో ప్రభుత్వ కాలేజీల్లోనే ఉత్తీర్ణత ఎక్కువుంది. మొత్తం 49,331 మంది ఒకేషనల్ పరీక్షకు హాజరైతే 24,226 (49 శాతం) మంది ఉతీర్ణలయ్యారు. ఇందులో బాలికలు 62 శాతం ఉన్నారు. చప్పుడు లేకుండా.. ఇంటర్ బోర్డు మీడియాకు కనీస సమాచారం ఇవ్వకుండా మధ్యాహ్నం 3 గంటలకు గుట్టుచప్పుడు కాకుండా ఫలితాలను వెబ్సైట్లో పెట్టేసింది. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గతంతో పోలిస్తే మరీ తక్కువగా ఉండటంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని చడీచప్పుడు లేకుండా ఫలితాలు వెల్లడించింది. ఆన్లైన్ చదువులు విద్యార్థులకు అర్థం కాకపోవడం, ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులకు సక్రమంగా ఆ సదుపా యం అందుబాటులో లేకపోవడంతో కొన్ని వర్గాలు ఆందోళన చెందినట్టే ఉత్తీర్ణత 49 శాతం దాటలేదు. అనుక్షణం ఉత్కంఠగానే.. మొదటి ఏడాది ఇంటర్ పరీక్షలు ఈ ఏడాది అనుక్షణం ఉత్కంఠగానే సాగాయి. మార్చిలో జరగాల్సిన పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. తొలుత అందరినీ రెండో ఏడాదికి ప్రమోట్ చేశారు. థర్డ్ వేవ్ ఆందోళనలతో ఫస్టియర్ పరీక్షలు అనివార్యమని బోర్డు భావించింది. సెప్టెంబర్ నుంచి ఇదే టెన్షన్. చివరకు అక్టోబర్, నవంబర్‌లో పరీక్షలు జరిగాయి. రీ వెరిఫికేషన్‌కు 22 వరకు చాన్స్ విద్యార్థులు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఇంటర్ బోర్డు వెబ్సైట్ ద్వారా మార్కులు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఐడీ, పాస్వర్డ్ సంబంధిత కాలేజీలకు పంపినట్టు బోర్డు తెలిపింది. తప్పులుంటే ప్రిన్సిపాల్స్ ద్వారా బోర్డుకు ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలంది. -
ఇంటర్ చదివి.. 20 ఫేక్ కంపెనీల సృష్టి!
సాక్షి, విశాఖపట్నం: కేవలం ఇంటర్ వరకే చదివిన ఆ యువకుడు చిన్న చిన్న వ్యాపార సంస్థల్లో పనిచేస్తూ.. జీఎస్టీ లొసుగుల్ని పసిగట్టాడు. అంతే, గుంటూరు, హైదరాబాద్ మొదలైన నగరాల్లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 ఫేక్ కంపెనీలను సృష్టించి.. పన్ను మోసాలకు పాల్పడేందుకు ఎత్తుగడవేశాడు. నిరంతర తనిఖీల్లో భాగంగా విశాఖపట్నంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) అధికారులు ఆ యువకుడి మోసాన్ని బట్టబయలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన 34 ఏళ్ల యువకుడు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో 20 నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి బిల్లులు సృష్టించాడు. ఈ సంస్థల నుంచి దేశంలోని వివిధ నగరాల్లోని కంపెనీలకు సరకు లావాదేవీలు జరిపినట్టు రూ.265 కోట్ల మేర నకిలీ ఇన్వాయిస్లను రూపొందించాడు. వీటిని ఉపయోగించుకుని రూ.31 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ.. పన్నుల చెల్లింపును ఎగవేసేలా వ్యూహాన్ని అమలుపరిచాడు. ఈ భారీ నకిలీ ఇన్వాయిస్లని పరిశీలించిన డీజీజీఐ, సెంట్రల్ జీఎస్టీ వర్గాలు.. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు 20 నకిలీ సంస్థల రాకెట్ గుట్టు రట్టయ్యింది. వెంటనే రంగంలోకి దిగి.. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ విశాఖపట్నం జోనల్ యూనిట్ జాయింట్ డైరెక్టర్ భాస్కరరావు చెప్పారు. గతేడాది నవంబర్ నుంచి ఈ తరహా మోసాలపై దేశవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విశాఖపట్నం జోనల్ యూనిట్ పరిధిలో దాదాపు 180 నకిలీ కంపెనీల గుట్టు రట్టు చేసి రూ.60 కోట్లు రికవరీ చేయడంతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు భాస్కరరావు చెప్పారు. -
తెలంగాణ: ముగిసిన తొలిరోజు ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. కరోనా నేపథ్యంలో గతంలో వాయిదా పడిన పరీక్షలను నేడు ప్రారంభించిన విషయం తెలిసిందే. కోవిడ్ నిబంధల ప్రకారం పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం అధికారులు 1,768 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 4,59,228 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 70 ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దించనుంది. ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11 వేల 354 మంది విద్యార్దులు పరీక్షలు రాయనున్నారు.ద్రాల వద్ద ధర్మల్ స్క్రీనింగ్ టెస్టులు,శానిటైజేశన్,మాస్కులు తప్పని సరి చేశారు .పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇవ్వమని చెప్పిన నేపధ్యంలో విద్యార్దులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు తరలివచ్చారు. చివరి నిమిషంలో కూడ కొందరు విద్యార్దులు పరుగులు తీసిన దృశ్యాలు కనిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా థర్మల్ స్క్రీనింగ్‌లో అస్వస్థతగా ఉన్నట్లు గుర్తిస్తే ఐసోలేషన్ గదిలో ఉంచుతారు. ఓపిక ఉంటే అక్కడైనా పరీక్ష రాయొచ్చని అధికారులు చెప్పారు. విద్యార్థులు ఏమైనా ఇబ్బందులకు గురైతే 040–24601010 లేదా 040–24655021కు కంట్రోల్‌రూం నంబర్లకు ఫోన్ చేయవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. చదవండి: ఆలస్యమైనా తప్పనిసరి -
ఆటో డ్రైవర్ కూతురు ఇంటర్లో అదరగొట్టింది
డెహ్రాడూన్ : చదువులో ప్రతిభ కనపర్చడానికి కుటుంబ ఆర్థిక పరిస్థితి అడ్డుకాదని నిరూపించిందో యువతి. ఇంటర్లో 98 శాతం మార్కులు సాధించి తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. వివరాలు.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన ఐరమ్(18) అక్కడి పూల్‌చంద్ నారి శిల్ప బాలికల ఇంటర్ కాలేజ్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. తండ్రి ఆటో డ్రైవర్ చాలీ చాలని సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పిల్లల చదువు దగ్గర ఏమాత్రం రాజీ పడలేదు. తండ్రి కష్టాన్ని వృధాకానీకుండా.. ఐరమ్ చదువు తన ఊపిరిగా చేసుకుంది. ఇష్టపడి చదివి ఇంటర్లో 98 శాతం మార్కులు సాధించింది. అంతేకాదు బయాలజీలో 99 శాతం మార్కులు సాధించింది. దీనిపై ఐరమ్ మాట్లాడుతూ.. ‘‘వైద్యురాలు కావాలన్నదే నా లక్ష్యం. నేనిప్పుడు నీట్‌కు సిద్ధం అవుతున్నాను. నేను డాక్టర్ అవ్వటం వల్ల మా ఇంటి ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నాను. నాకు ఆర్థికంగా సహాయం చేసిన నా ఉపాధ్యాయులకు ఎంతో రుణపడి ఉన్నాను. కోవిడ్ కారణంగా నాన్న సంపాదన బాగా తగ్గింది. నేను, మా అక్క ఇద్దరం ఒకే ఫోన్లో ఆన్లైన్ తరగతులు విన్నాం’’ అని పేర్కొంది. ఐరమ్ తండ్రి ఇర్ఫాన్ అహ్మద్ మాట్లాడుతూ.. ‘‘ నా పిల్లలకు మంచి విద్య అందించటానికి డెహ్రాడూన్ వచ్చాను. నాకొచ్చే అరకొర సంపాదనతో నా నలుగురు పిల్లలను చదివించటం సాధ్యపడలేదు. అందుకే పెద్ద బిడ్డను చదువు మాన్పించి నాకు సహాయంగా ఉండమని కోరాను. అయితే, లాక్డౌన్ కారణంగా ఉన్న పని కూడా పోయింది. లోన్ల ద్వారా పిల్లలకు చదువు చెప్పించాను. వారందరూ చక్కగా డిగ్రీ చదువులు పూర్తి చేస్తారనుకుంటున్నాను. ఐరమ్ ఇంటర్లో ప్రతిభ కనపర్చడం గర్వంగా ఉంది. నా పిల్లలెవరూ భవిష్యత్తులో ఆటో నడపరని భావిస్తున్నాను’’ అని అన్నాడు. -
టెన్త్, ఇంటర్ ఫలితాలపై దృష్టి సారించాలి: మంత్రి సురేష్
సాక్షి, అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు నేపథ్యంలో ఇక ఫలితాల వెల్లడిపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. త్వరితగతిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వారం రోజుల్లో ఫలితాలు ప్రకటించేలా చూడాలన్నారు. ఇక పాఠశాలలు తెరిచే అంశాన్ని పరిశీలించాలన్నారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సూచనల మేరకు తేదీ నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. 2021-22 అకడమిక్ క్యాలెండర్ తయారు చేసి విద్యాబోధన దిశగా తరగతులు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశాలన్నింటిపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి సురేష్ ఆదేశించారు. చదవండి: విద్యాభివృద్ధికి ‘సాల్ట్’ పథకం: మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపీ: పంటల రవాణాపై ఆంక్షలు లేవు.. -
TS : ఇంటర్ 2nd ఇయర్ పరీక్షలపై కీలక ఉత్తర్వులు
-
ఏపీ: టెన్త్, ఇంటర్ పరీక్షలపై విద్యాశాఖ కీలక ప్రతిపాదనలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. కరోనా అదుపులోకి వస్తుండటంతో పరీక్షల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. నేడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు ప్రతిపాదనలు తీసుకెళ్లనుంది. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. జులై 7 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంటర్‌బోర్డ్ కొన్ని ప్రతిపాదనలు చేసింది. రోజు విడిచి రోజు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి.11 పేపర్లకు బదులు 7 పేపర్లకు పరీక్షలు నిర్వహించనుంది. సెప్టెంబర్ 2 లోపు టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. -
తెలంగాణలో ఇంటర్ ఆన్లైన్ తరగతులు వాయిదా
-
ఒకటి నుంచి ఇంటర్ ఆన్లైన్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ ఒకటి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వీరితో పాటు, డిగ్రీ, పీజీ విద్యార్థులకు కూడా అదే రోజు నుంచి ఆన్లైన్ బోధన ప్రారంభం అవుతుందని ఆమె స్పష్టం చేశారు. అలాగే పాఠశాల విద్యార్థులకు కూడా డిజిటల్ బోధన ఉంటుందని తెలిపారు. దీని కోసం అధ్యాపకులు, ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి చేశామని తెలిపారు. అధ్యాపకులు ఈ నెల 27 నుంచే కళాశాలలకు వెళ్ళాలని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 5న రాధాకృష్ణ జయంతి కార్యక్రమం, ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం కూడా ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా వుండగా వచ్చే నెల 1 నుంచి పాఠశాల విద్యార్థులకు కూడా ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. (చదవండి: ఓపెన్ విద్యార్థులందరూ పాస్) (చదవండి: ఫస్ట్ నుంచి ఆన్లైన్ పాఠాలు) -
ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపౌట్స్ పెరిగిపోతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని నివారించడంతోపాటు విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గార్డెన్ అభివృద్ధి చేసి అక్కడే తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు కృషి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్యను సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో ప్రత్యేకంగా అభినందించారు. జడ్చర్లలో ఏర్పాటు చేసే బొటానికల్ గార్డెన్‌కు కావాల్సిన రూ.50 లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఇలాంటి ప్రయత్నం జరగాలని ఆకాంక్షించారు. త్వరలోనే అన్ని కాలేజీల బోటనీ అధ్యాపకులతో సమా వేశమై గార్డెన్ల అభివృద్ధి కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది.. జడ్చర్ల జూనియర్ కాలేజీ విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, అక్కడి ప్రభుత్వ లెక్చరర్ రఘురామ్ సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారన్న విషయం తెలిసి సీఎం వారిని అభినందించారు. లెక్చరర్ రఘురామ్ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన భవనాన్ని కూడా మంజూరు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు మాత్రమే సొంతమైన నల్లమలలో పెరిగే ఆండ్రో గ్రాఫిస్ నల్లమలయాన మొక్కను ముఖ్యమంత్రికి సదాశివయ్య బహూకరించారు. కార్యక్రమంలో మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ పాల్గొన్నారు. -
ప్రాక్టికల్ ‘ప్రాబ్లమ్’
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రయోగాత్మక విద్యే విద్యార్థి భవితకు పునాది. కొన్నేళ్లుగా ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణ అంతా లోపభూయిష్టంగా కొనసాగుతూ వచ్చింది. పారదర్శకంగా నిర్వహించేందుకు జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మార్కులు, ర్యాంకులాటలో మునిగి తేలుతున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రలోభాల ఎసరు పెట్టి ఈ విధానాన్నీ కలుతం చేస్తున్నాయి. ఎక్కడైతే మాకేంటి అంటూ ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, చీఫ్ సూపరింటెండెంట్లకు ముడుపుల మత్తు చల్లి తమ దారికి తెచ్చుకుంటున్నాయి. దీనికిగాను అయ్యే ఖర్చులను విద్యార్థుల నుంచే దండుకుంటున్నాయి. ఒక్కొక్కరి నుంచి రూ.3 వేలు వసూలు ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజ్‌కు ప్రాధాన్యత పెరిగింది. అయినప్పటికీ ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు కూడా ప్రాక్టికల్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదు. విద్యార్థులకు ఏదో ఒక విధంగా ప్రాక్టికల్స్ గండం తప్పించటానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేస్తున్నారు. ఒక్కో విద్యార్థి చేత రూ.2 నుంచి రూ.3 వేల వరకు వసూల్ చేసి ప్రాక్టికల్స్ మార్కులు వేయిస్తామని హామీ ఇస్తున్నారు. ప్రాక్టికల్స్ కోసం సమయం వెచ్చించే తీరిక లేకపోవటం, నేర్చుకున్నా చేయగలమో లేదోనన్న భయంతో విద్యార్థులు అడిగినంత డబ్బులు చెల్లించటానికి సిద్ధపడుతున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ఉపయోగం లేదు ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల అక్రమాలను అడ్డుకోవటానికి అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని బోర్డు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాలను జంబ్లింగ్ విధానంలో కేటాయిస్తోంది. గతేడాది నుంచి ఎగ్జామినర్లను కూడా జంబ్లింగ్ విధానంలో నియమిస్తోంది. ఇన్ని చర్యలను తీసుకుంటున్నా అక్రమాలకు అలవాటు పడ్డ వారు తమ కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. వారికున్న పరిచయాలు, పలుకుబడితో గతేడాది కూడా నిరి్వగ్నంగా అక్రమాలకు పాల్పడ్డారు. కనీసం ఈ ఏడాదైనా అవకతవకలను ఆరికట్టి సమర్థవంతంగా నిర్వహిస్తారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న నేపధ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతునన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్... సీనియర్ ఇంటర్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 298 కళాశాలల నుంచి ఇంటరీ్మడియట్ రెండో ఏడాదికి చెందిన 36,460 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో ఎంపీసీ విభాగం నుంచి 29,458, బైపీసీ విభాగం నుంచి 7,002 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాక్టికల్స్ నిర్వహణకు పూర్తిస్థాయిలో ప్రయోగశాలలు, పరికరాలు ఉన్న 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్స్‌ను సమర్థవంతంగా పూర్తి చేయటానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని జిల్లా ఆర్ఐవో తెలిపారు. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల నిర్లక్ష్యం వాస్తవమే ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలలో ప్రాక్టికల్స్ ప్రాక్టీస్ చేయించటం లేదన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఆయా యాజమాన్యాలు కేవలం థీయరీపైనే దృష్టి సారిస్తున్నాయి. దీని వల్ల విద్యార్థులు ప్రాక్టికల్స్ సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీల తనిఖీల్లో ఇటువంటి పరిస్థితి గుర్తించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశాం. ప్రాక్టికల్స్ విషయంలో ఎటువంటి అవకతవకలకు పాల్పడినా సహించం. – జెడ్ఎస్ రామచంద్రరావు, ఇంటర్ బోర్డు ఆర్ఐవో, గుంటూరు -
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఆదివారం ఫలితాలను విడుదల చేశారు. గత మార్చిలో నిర్వహించిన రెగ్యులర్ పరీక్షల ఫలితాల్లో దొర్లిన సాంకేతిక తప్పులు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు. మొదటి సంవత్సరం ఫలితాలను వారంలోపు విడుదల చేస్తామన్నారు. ఆన్లైన్ మెమోలను అందుబాటులో పెట్టామని, ఈ సారి ఆన్లైన్లో ఫిర్యాదులు తీసుకుంటామని చెప్పారు. పరీక్షలకు హాజరైన వారిలో 37.76 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు ఆయన వెల్లడించారు. ఇందులో బాలికలు 41.35 శాతం, బాలురు 35.4 శాతం పాసయ్యారని తెలిపారు. -
వరంగల్‌లో ఇంటర్ ప్రశ్నాపత్రాల గల్లంతు
-
గురుకులాల్లో ఇంటర్ సీట్లకు డిమాండ్
పాడేరు : ఏజెన్సీలోని మూడు బాలికల గురుకుల కళాశాలల్లో ఇంటర్ ప్రవేశం కోసం గురువారం స్థానిక అంబేడ్కర్ ఇండోర్ స్టేడియం ఆవరణలో కౌన్సెలింగ్ నిర్వహించారు. గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్న 2050 మంది విద్యార్థినులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. పాడేరు, అరకు గురుకుల బాలికల జూనియర్ కళాశాలల్లో(ఆంగ్ల మాధ్యమం) 9 గ్రూపులకు 330 సీట్లు, జీకే వీధిలోని (తెలుగు మీడియం) మూడు గ్రూపులకు 120 సీట్లు ఉన్నాయి. గ్రూపు కు పరిమితంగా సీట్లు ఉండడంతో చాలా మందికి సీట్లు దక్కలేదు. టెన్త్‌లో 8.0 గ్రేడ్‌పాయింట్లు, పీటీజీ వారికి 7.0 గ్రేడ్ పాయింట్లు పైగా సాధించి న వారికి ఇంగ్లిష్ మీడియం కళాశాలల్లోను, 9.0 గ్రేడ్ పాయింట్లు పైగా వచ్చిన వారికి మాత్రమే తెలుగు మీడియం కళాశాలల్లో సీట్లు లభించాయి. ఈ మూడు కళాశాలల్లో అన్ని గ్రూపుల్లో మొత్తం 450 సీట్లు కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేశారు. సీట్లు పెంచాలని విద్యార్థినుల వినతి : ఏటా గురుకులాల్లో సీట్లు లభించక విద్యార్థినులు సతమతమవుతున్నారు. ఏజెన్సీలో గిరిజన బాలికల కోసం గురుకుల జూనియర్ కళాశాలలు మాత్రమే ఉండడం, తక్కువ సీట్లు ఉండడంతో అడ్మిషన్లు పొందలేకపోతున్నారు. ప్రతి ఏడాది వందలాది మంది విద్యార్థినులు గురుకులాల్లో సీట్లు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. గతేడాది 1500 మంది దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది వారి సంఖ్య రెండువేలకు దాటింది. సీట్లు దక్కక పలువురు నిరాశతో వెనుదిరుగుతున్నారు. గురుకుల కళాశాలల్లో సీట్లు పెంచాలని బాలికలు ఐటీడీఏ వద్దకు చేరి అధికారులను కోరారు. 500 సీట్లు పెంపునకు ప్రతిపాదన : మూడు గురుకుల కళాశాలల్లో 500 సీట్లు పెంపు కోసం ప్రతిపాదనలు చేశామని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది టెన్త్ పాస్ పర్సంటేజి పెరగడంతో పాటు విద్యార్థులు మంచి గ్రేడ్ పాయింట్స్ సాధించడంతో గురుకులాల్లో ఇంటర్ సీట్ల పెంపు అవసరాన్ని ముందే గుర్తించి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డి.కె బాలాజీ గురుకుల కార్యదర్శి భాను ప్రసాద్‌తో మాట్లాడారని తెలిపారు. ప్రస్తుతం మొదటి కౌన్సెలింగ్‌లో 450 సీట్లు భర్తీ చేశామని, సీట్లు పెంపు అనుమతి రాగానే మలివిడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. -
తల్లిదండ్రులు మందలించారని..
అల్వాల్: ఇంటర్లో మార్కులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాసానికిలోనైన ఓ బాలిక భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వరప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భీమవర ప్రాంతానికి చెందిన సత్యనారాయణ బతుకుదెరువు నిమిత్తం కుటుంబంతో సహా నగరానికి వలస వచ్చి అల్వాల్ ఫాదర్ బాలయ్యనగర్‌లో ఉంటూ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వీరి కుమార్తె రామలక్ష్మి(17) బీమవరంలో ఇంటర్ మీడియేట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో తక్కువ మార్కులు రావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికిలోనైన రామలక్ష్మి బుధవారం తల్లితోపాటు ఇంటిపై పనులు చేస్తూ రెండో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు సాయంత్రం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు. -
నో... హాలిడేస్ !
గుంటూరు ఎడ్యుకేషన్ : ‘వేసవి సెలవుల్లో జూనియర్ కళాశాలల విద్యార్థులకు తరగతులు నిర్వహించరాదు. మే నెలాఖరులో ఇంటర్లో ప్రవేశాలకు బోర్డు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాతే జూన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలి. విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహించిన ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల గుర్తింపు రద్దు చేస్తాం’ ఇవి ఇంటర్మీడియెట్ బోర్డు విడుదల చేసిన నిబంధనల సారాంశం. కానీ జిల్లాలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు అప్పడే ఇంటర్æ తరగతులను ప్రారంభించేశాయి. వేసవి సెలవుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించరాదన్న బోర్డు ఉత్తర్వులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పరీక్షల హడావుడితో అలసినవిద్యార్థులు సేద తీరేదెన్నడు ? ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకూ నిర్వహించిన ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు జిల్లాలో 93,932 మంది విద్యార్థులు హాజరయ్యారు. అదే విధంగా మార్చి 18 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకూ నిర్వహించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 59 వేల మంది హాజరయ్యారు. ఏడాది పొడవునా తరగతి గదులకు పరిమితమై పరీక్షల హడావుడి, ఆందోళనతో అలసిపోయి సెలవులతో సేద తీరాల్సిన సమయంలో ఊపిరి తీసుకునే సమయం లేకుండా ఇంటర్ తరగతులు ప్రారంభించడంతో విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు డే స్కాలర్‌తో పాటు హాస్టల్ క్యాంపస్‌లలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయి. గుంటూరు నగరంతో పాటు నగర శివారు గోరంట్ల, రెడ్డిపాలెం, పెద పలకలూరులో ఉన్న హాస్టళ్లలో యథేచ్ఛగా తరగతులు జరుగుతున్నాయి. విద్యార్థులకు జూన్ నెలలో ప్రవేశాలు కల్పించి తరగతులు ప్రారంభించాలని ఇంటర్‌బోర్డు అకడమిక్ కేలండర్లో పొందుపర్చగా, కాలేజీల యాజమాన్యాలు ఇందుకు కొత్త భాష్యాన్ని చెబుతున్నాయి. జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాల్సిన దృష్ట్యా వేసవి సెలవులను ఎంజాయ్ చేయడం వల్ల విద్యార్థులు వెనుకబడి పోతారని తల్లిదండ్రులకు నమ్మబలికి, వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రథమ సంవత్సర పరీక్షలు రాసినవిద్యార్థులకు సైతం... సీనియర్ ఇంటర్ విద్యార్థులను జేఈఈ–అడ్వాన్స్డ్, నీట్ శిక్షణ పేరుతో క్యాంపస్‌లలో పెట్టి రుద్దుతున్న కాలేజీల యాజమాన్యాలు ప్రథమ సంవత్సర విద్యార్థులను సైతం వదలడం లేదు. టెన్త్ విద్యార్థులతో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు సైతం కళాశాలలు ద్వితీయ సంవత్సర తరగతులను ప్రారంభించాయి. దీనికి బ్రిడ్జి కోర్సు, ఐఐటీ కోచింగ్ అంటూ రకరకాల పేర్లు పెట్టారు. జిల్లాలో ఈ విధంగా టెన్త్ పూర్తి చేసిన, ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు రాసిన దాదాపు 30 వేల మంది విద్యార్థులకు నిబంధనలకు విరుద్ధంగా తరగతులు జరుగుతున్నా ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదు. వేసవి సెలవుల్లో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఇంటర్ తరగతులను రద్దు చేయాలని పలు విద్యార్థి సంఘాలు ఇంటర్‌బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కళాశాలలపై చర్యలు తీసుకోవాలి గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాలలపై కఠిన చర్యలు చేపట్టాలని ఆర్ఐవో జెడ్.ఎస్ రామచంద్రరావుకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.భగవాన్‌దాస్, జిల్లా అధ్యక్షుడు పి.మనోజ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం సాంబశివపేటలోని ఆర్ఐవో కార్యాలయంలో రామచంద్రరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ఇంటర్‌బోర్డు మార్చి 29 నుంచి మే 31 వరకూ వేసవి సెలవులు ప్రకటించినప్పటికీ, గుంటూరు నగరంతో పాటు జిల్లా వివిధ కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. టెన్త్ విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సుల పేరుతో అడ్మిషన్లు ప్రారంభించి రెగ్యులర్ తరగతులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇంటర్‌బోర్డు నిబంధనలకువిరుద్ధంగా వ్యవహరిస్తున్న కళాశాలలపైకఠిన చర్యలు చేపట్టని పక్షంలో ఎస్ఎఫ్ఐఆధ్వర్యంలో కళాశాలల వద్ద ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఆర్ఐవోను కలిసిన వారిలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఎం.కిరణ్, రాజేష్ తదితరులున్నారు. తరగతులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం. మే నెలాఖరులో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాతే ప్రవేశాలు కల్పించాలి. విద్యార్థులకు ఆటవిడుపు లేకుండా తరగతుల నిర్వహణపై విద్యార్థి సంఘాల నుంచి ఫిర్యాదులు అందాయి. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలపై దాడులు నిర్వహించి క్రమశిక్షణ చర్యలు చేపడతాం.– జెడ్.ఎస్ రామచంద్రరావు,ఇంటర్‌బోర్డు ఆర్ఐవో -
ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళన
-
మార్కుల పోటీలో... రాలిపోతున్న విద్యాకుసుమాలు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మార్కులు, ర్యాంకులే ప్రధానమనే భ్రమలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇదే అదునుగా కళాశాలల యాజమాన్యం విద్యార్థులపై చదువు పేరుతో తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. దీంతో పిల్లలు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చదువు తప్ప వేరే ధ్యాస లేకుండా పోతోంది. సెలవుల్లోనూ ఆటవిడుపుకు దూరం అవుతున్నారు. తమ బాధను అర్థం చేసుకునే వారు లేక, తీవ్ర ఒత్తిడిని భరించలేక పసి హృదయాలు తల్లడిల్లుతున్నాయి. ఒకానొక దశలో పిల్లలు జీవితంపై విరక్తి చెంది అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తిరుపతి ఎడ్యుకేషన్ : ఆత్మహత్యకు పాల్పడుతున్న విద్యార్థుల్లో అత్యధిక శాతం ఇంటర్ విద్యార్థులే ఉంటున్నారు. ఉన్నత విద్యకు వారధి ఇంటర్ కావడంతో వీరిపై ఒత్తిడి ఎక్కువ అవుతోంది. పదో తరగతి వరకు స్వేచ్ఛగా విద్యనభ్యసించిన విద్యార్థులు ఇంటర్‌కు వచ్చే సరికి చతికిలబడుతున్నారు. ముఖ్యంగా జైలును తలపించే కార్పొరేట్ రెసిడెన్షియల్ కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంటోంది. ఆటలు, షికారులు లేకపోవడంతో మానసిక రోగిలా మారుతున్నారు. విద్యావ్యవస్థలో మార్పు తీసుకొచ్చి ఒత్తిడి లేని విద్యనందించేలా చర్యలు తీసుకోవాలంటూ మేధావులు, విద్యావేత్తలు సూచిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అందువల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లల ఇష్టాలు తెలుసుకోవాలి ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లల ఆసక్తి, వారి ఇష్టాలను పట్టించుకోవడం లేదు. తమ ఆశలు, ఆకాంక్షలను వారిపై రుద్ది ఇంజినీరింగ్, మెడిసిన్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పిల్లలు ఆయా కోర్సులను అర్థం చేసుకోలేక, తమకు ఇష్టమైన కోర్సు చదవలేక మథన పడుతున్నారు. తల్లిదండ్రుల్లో మార్పు వచ్చినప్పుడే పిల్లల బలవన్మరణాలు తగ్గుతాయని మానసికవేత్తలు, మేథావులు చెబుతున్నారు. తరచూ మాట్లాడాలి తల్లిదండ్రులు తరచూ పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. వారు చదువులో ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీయాలి. మానసికంగా ధైర్యం నింపడం ద్వారా వారిలో ఉన్న ఆందోళన దూరం అయి చురుగ్గా ఉంటారు. విద్యార్థిని అనుమానాస్పద మృతి గత మూడేళ్లల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరందరూ వివిధ కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నవారే. తాజాగా శుక్రవారం ఉదయం తిరుపతి సమీపంలోని తనపల్లి రోడ్డులో ఉన్న శ్రీచైతన్య రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థిని కె.శ్రుతి(17) అనుమానాస్పదంగా మృతి చెందింది. వాయల్పాడు మండలం శాకంవారిపల్లికి చెందిన సిద్ధమల్లు, కళావతి దంపతుల కుమార్తె కె.శ్రుతి ఆ కళాశాలలో ఇం టర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అనారోగ్య సమస్యతోనే మృతి చెందిం దంటూ తల్లిదండ్రులు, కళాశాల యాజమానులు చెబుతున్నారు. పోస్టుమార్టం చేస్తే నిజాలు తెలిసొచ్చేవని, పోస్టుమార్టం చేయకుండానే మృతదేహాన్ని తీసుకెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు చెబుతున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్ విద్యార్థి సంఘం, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, ఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. విద్యార్థిని మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలం టూ డిమాండ్ చేశారు. రెసిడెన్షియల్ కళాశాలను నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతులు లేవని, నిబంధనలకు విరుద్ధంగా కళాశాలను నిర్వహిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని విద్యాశాఖాధికారులను ప్రశ్నించారు. చదువు పేరుతో విద్యార్థులను బలితీసుకుంటున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమన్నారు. కళాశాలలు పునఃప్రారంభమైన కొద్ది రోజులకే ఆత్మహత్యల పర్వం మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు బనాయించాలని, గుర్తింపు రద్దు చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు సుధీర్, హేమంత్‌కుమార్‌రెడ్డి, శివకృష్ణ, జయప్రకాష్, ప్రసాద్, దిలీప్, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఇమామ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు శివారెడ్డి, చలపతి, ఎస్ఎఫ్ఐ నాయకులు మాధవకృష్ణ, గిరి, ఎన్ఎస్యూఐ నాయకుడు వసీం, ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నగేష్ తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్లో ఇంటర్ ఫస్టియర్ కొత్త పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ప్రథమ సంవత్సరంలో వివిధ భాషలకు సంబంధించిన సిలబస్‌ను మార్పు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్ భాషలకు సంబంధించిన పుస్తకాల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. ఈ సిలబస్ 2018–19 విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి వస్తుందని తెలిపింది. పుస్తకాలను మార్కెట్లో అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. మరోవైపు గతంలో ఫెయిలైన విద్యార్థులు 2019 మార్చి వార్షిక పరీక్షల్లో, మే/జూన్ నెలలో జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో పాత సిలబస్‌లో పరీక్షలు రాయవచ్చని పేర్కొంది. మూడు రోజుల్లో రిఫండ్ చేస్తాం: టీఎస్పీఎస్సీ సాక్షి, హైదరాబాద్: పేమెంట్లు ఫెయిలైన అభ్యర్థులకు తిరిగి 3 రోజుల్లోగా రిఫండ్ చేస్తామని టీఎస్పీఎస్సీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. గ్రూప్–4, టీఎస్ఆర్టీసీలో వివిధ పోస్టుల భర్తీలో భాగంగా పేమెంట్లను ఎస్బీఐ ఈ–పే ద్వారా స్వీకరిస్తున్న తరుణంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని పేర్కొంది. ఈ నెల 7 నుంచి 11వరకు చేసిన పేమెంట్ల సమస్యల్ని పరిష్కరించినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. పాలీసెట్ చివరి దశ సీట్లు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: పాలీటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలీసెట్–2018 ప్రవేశాల కౌన్సెలింగ్ ముగిసింది. చివరి దశ కౌన్సెలింగ్‌లో కొత్తగా 9,100మంది విద్యార్థులకు సీట్లు లభించినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రం లోని 170 పాలిటెక్నిక్ కాలేజీల్లో 38,359 సీట్లు అందుబాటులో ఉండగా, చివరి దశ కౌన్సెలింగ్ కలుపుకొని 29,663 సీట్లు భర్తీ అయ్యాయని, 8,696 సీట్లు మిగిలిపోయాయని ఆయన తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు శుక్రవారం లోగా నెట్ బ్యాంకింగ్/క్రెడిట్‌కార్డు/డెబిట్‌కార్డు ద్వారా ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలని, కాలేజీల్లో నేడు, రేపు చేరాలని సూచించారు. -
బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్
బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో 2018–19 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కళాశాల ఇన్చార్జి వీసీ డాక్టర్ అశోక్‌కుమార్ బుధవారం కళాశాలలో నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఆరేళ్ల బీటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరేందుకు పదో తరగతి చదివిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానికులకు (తెలంగాణ రాష్ట్రం) 85 శాతం, స్థానికేతరులకు 15శాతం సీట్లు కేటాయించినట్లు తెలిపారు. భర్తీ కాని సీట్లను గ్లోబల్, ఎన్ఆర్ఐ కోటా కింద 5 శాతం మేర కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ కోటా కింద బయట ఇంటర్ పూర్తి చేసినవారికి నేరుగా బీటెక్ ఫస్టియర్‌లో ప్రవేశం కల్పించనున్నట్లు వివరించారు. ఈ నెల 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. విద్యార్హతలు, ధ్రువీకరణ పత్రాలను జూన్4లోపు పంపించాలన్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితా జూన్ 11న ప్రకటించి, 18, 19 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. జూలై 2న ఓరియంటేషన్ నిర్వహించి, 3న తరగతులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లు www.rgukt.ac.in, http://admissions.rgukt. ac.inలలో సంపద్రించాలని సూచించారు. -
కేజీబీవీల్లో ఇంటర్
ఆర్థిక స్థోమత లేక చదువు మధ్యలో మానేసిన.. తల్లిదండ్రులు లేని నిరుపేద బాలికలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఇకనుంచి ఇంటర్ కూడా కొనసాగించనున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అభ్యర్థన మేరకు కేంద్రప్రభుత్వం అంగీకరించి.. ఇంటర్ బోధనకు సిద్ధమైంది. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం ఆరు నుంచి 10వ తరగతి వరకు విద్య అందుతుండగా.. ఇక నుంచి ఇంటర్ వరకు బోధించనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు చదువుకు అవసరమైన నిధులు విడుదల చేస్తుండగా.. 9, 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. కరీంనగర్‌ఎడ్యుకేషన్: డిప్యూటి సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో బాలికల విద్య సబ్ కమిటీ సమావేశం గత డిసెంబర్లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవదేకర్‌ను కలిసి కేజీబీవీల్లోఇంటర్ వరకు విద్యను పొడగించాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. తాజాగా శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఇంటర్ విద్యను కేజీబీవీల్లో ప్రవేశపెట్టేందుకు అంగీకరించడంతో కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థులకు మేలు జరుగనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రవేశాలు జరుగనున్నాయి. జిల్లాలో 11 కేజీబీవీలు కరీంనగర్ జిల్లాలో మొత్తం 11 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో 5,370 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున ఈ విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలల్లో చదివిన వారికి వసతితోపాటు నాణ్యమైన భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. భోజనం మెనూలో కూడా ఇటీవల ప్రభుత్వం మార్పు చేసింది. వారానికి రెండుసార్లు మటన్, నాలుగుసార్లు చికెన్, రోజు కోడిగుడ్డు, నెయ్యి, ఆకుకూరలు, కూరగాయలు, పెరుగు, పాలు, ఇతర స్నాక్స్ అందిస్తున్నారు. అంతేకాకుండా న్యాప్కిన్స్, కాస్మోటిక్ కిట్లను అందిస్తున్నారు. భవనాలు నిర్మించి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. కంప్యూటర్ విద్యను కూడా అందిస్తున్నారు. నాణ్యమైన విద్య అందించడంతో పేద కుటుంబాలకు చెందిన బాలికలు చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పది తర్వాత చదువు కొనసాగించే వీలు కేజీబీవీల్లో చదివి పదో తరగతి ఉత్తీర్ణులైన చాలామంది ఇంటర్ విద్యను కొనసాగించలేకపోతున్నారు. గురుకులాల్లో ఇతర కళాశాలల్లో అందరికీ సీట్లు లభించకపోవడం.. సొంత గ్రామాలకు వెళ్లిపోవడం.. ఆర్థిక స్థోమత లేకపోవడంతో అక్కడికే చదువును ఆపేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లి చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు మేలు జరుగనుంది. ఉన్నత చదువు చదువుకునే వీలుంటుంది. పదో తరగతి వరకు కేజీబీవీలో చదివిన వారు ఆ తర్వాత అక్కడే విద్యను కొనసాగించేందుకు అవకాశం కల్పించడంతో తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లలపై భద్రత భావం ఉంటుంది. ఎట్టకేలకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేజీబీవీలను ఇంటర్ విద్య వరకు పొడిగిస్తామని పలుసార్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలిక విద్య ఉపసంఘానికి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చైర్మన్‌గా ఉండడంతో అమలుకు నోచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణులైన వారు ఆ కేజీబీవీల్లోనే ఇంటర్ చదువుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 2100 మంది ఉన్నారు. ఉత్తీర్ణులైన వారందరికీ ప్రయోజనం చేకూరనుంది. విద్యార్థులకు ప్రయోజనం– అనురాధ, ఆర్వీఎం సెక్టోరియల్ అధికారి ప్రభుత్వ నిర్ణయంతో పేద విద్యార్థులకు మేలు జరుగనుంది. కేజీబీవీల్లో ప్రస్తుతం పదో తరగతి వరకే విద్య అందుతోంది. పది పూర్తయిన తర్వాత కొంత మంది పిల్లలు ఇంటర్ అభ్యసించకుండా చదువు మానేస్తున్నారు. కేజీబీవీల్లో ఇంటర్ ఏర్పాటు చేయడం వల్ల పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఆనంతరం ఇక్కడే చదువుకోవచ్చు. -
ఇంటర్లో చేరేముందు ఇలా..
నిడమర్రు:పది పరీక్షలు ముగిసాయి. టెన్త్ తర్వాత విద్యార్థులు ఇంటర్ చదివేందుకు ఆసక్తి చూపడం సహజం. ప్రత్యేక నైపుణ్యాలతో కూడిన మెడికల్ కోర్సులు చేయాలన్నా, ఇంజనీరింగ్‌లాంటి సాంకేతిక కోర్సులు చదవాలన్నా, సంప్రదాయక డిగ్రీలో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా.. ఇంటర్మీడియట్తోనే అరంగేట్రం చేయాల్సిందే. అయితే ఇంటర్లో ఉండే గ్రూపులు, వాటి ఎంపికల్లో విద్యార్థికి కొన్ని మార్గదర్శకాలు.. ఉన్నత విద్యకి ఇంటర్ వారధి ఉన్నత విద్యకు ఇంటర్ ‘వారధి’లాంటిది. అందుకే ఇంటర్లో గ్రూపును ఎంచుకోవడమే అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే ఈ గ్రూపు మీదే మిగిలిన(ఉన్నత) విద్య అంతా ఆధారపడి ఉంటుంది. పాఠశాల విద్యకు, ఉన్నత విద్యకూ మధ్య వారధిలాంటి ఇంటర్లో చేరేముందు వివిధ గ్రూపుల గురించి తెలుసుకుని, వారు ఏ రంగంలో రాణించగలరో విద్యార్థులు ముందే ఒక నిర్థారణకు రావాలి. ఇంటర్లో ఉండే గ్రూపుల గురించి విద్యార్థికి అడ్మిషన్లకు ముందే కొంత పరిజ్ఞానం పొందాలి. అంతకంటే ముందు ఆయా గ్రూపుల్లోని సబ్జెక్ట్లపై తన బలాలు, బలహీనతలు బేరీజు వేసుకుని గ్రూపులను ఎంపిక చేసుకోవాలి. విద్యార్థి అభిరుచి, సామర్థ్యం రెండింటిని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు కూడా ఏ గ్రూపులో చేరాలనే విషయమై అతడికి సలహా ఇవ్వాలి. పోటీ పరీక్షలకు కొత్తరూపు కేంద్ర ప్రభుత్వం ఇంజనీరింగ్, మెడికల్ ప్రవేశాలకు ఉమ్మడి పరీక్షలను నిర్వహించేలా ప్రయత్నం నేపథ్యంలో ఎంసెట్ తదితర పరీక్షలపై విద్యార్థి అవగాహన పెంచుకోవాలి. మెడికల్‌కు నీట్, ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు ఐసీట్ లను నిర్వహిస్తున్నందున, రూపు మారుతున్న పోటీ పరీక్షలకు అనుగుణంగా విద్యార్థులు గ్రూపులను ఎంచుకోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. 85 గ్రూపు కాంబినేషన్స్ ఇంటర్ బోర్డు వివిధ కాంబినేషన్లలో సుమారు 85 గ్రూపులను రూపొందించింది. అయితే ఇందులో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీలు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ/ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఈ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. సైకాలజీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మిస్ట్రేషన్, మ్యూజిక్, కామర్స్, సోషియాలజీ వంటి సబ్జెక్ట్‌లు కొన్ని గ్రూపుల్లో కాంబినేషన్‌గా ఉన్నాయి. ఎంపీసీ గ్రూప్ ప్రధానంగా ఇంజనీరింగ్ వృత్తిలో స్థిరపడాలనుకునేవారు ఈ గ్రూప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎంసెట్‌తోపాటు ఐఐటీల్లో ప్రవేశ పరీక్ష జేఈఈ–మెయిన్ రాసేందుకు ఈ గ్రూపులో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి. బిట్స్ పిలానీలో ప్రవేశానికి జరిగే బిట్‌శాట్ రాసేందుకు ఎంపీసీ విద్యార్థులే అర్హులు. బీఎస్సీ ఇంటర్ తర్వాత బీఎస్సీలో చేరేటప్పుడు మ్యాథ్స్ –ఫిజిక్స్–కెమిస్ట్రీ కాంబినేషన్స్‌లో వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన గ్రూపుల్లో చేరవచ్చు. బైపీసీ గ్రూపు వైద్య సంబంధిత, ఇతర వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునేవారు బైపీసీ వైపు మొగ్గు చూపుతారు. అగ్రికల్చర్ కోర్సులకూ ఈ గ్రూపే ప్రాతిపదిక. ఓపిగ్గా చదవడం, చక్కగా బొమ్మలు వేయడం ఈ గ్రూపు విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాలు. బయోటెక్నాలజీ, ఫార్మసీ, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, జియాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, ఫారెస్ట్ రేంజర్, జియాలజీ, హార్టీకల్చర్ తదితర రంగాల్లో ఈ గ్రూపు విద్యార్థులకు అవకాశాలు ఉన్నాయి. ఎంఈసీ, సీఈసీ గ్రూపులు సేవారంగంవైపు చూసేవారు, సైన్స్, ఆర్ట్స్ గ్రూపులపై పెద్దగా ఆసక్తి లేనివారు లెక్కలు, గణాంకాలు, కామర్స్ సబ్జెక్టులతో కూడిన కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్ సబ్జెక్టులున్న ఎంఈసీ, సీఈసీల్లో చేరవచ్చు. చార్టెర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కమర్షియల్ లాయర్లు, బ్యాంకు మేనేజర్, చార్టెర్డ్ ఫైనాన్షియల్ ఎనాలిస్ట్, ట్యాక్స్ ఆడిటర్ లాంటి వృత్తుల్లో స్థిరపడాలనుకునేవారు, బీమా సంస్థల్లో, స్టాక్ మార్కెట్లలో ఉద్యోగాలు పొందాలనుకునేవారు ఈ గ్రూపులను ఎంచుకోవచ్చు. ∙గణితం, కామర్స్ సబ్జెక్టులు రెండూ అధ్యయనం చేయడం వల్ల మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. సీఏ, ఐసీడబ్ల్యూఏ, బిజినెస్ మేనేజ్మెంట్, కంప్యూటర్ రంగాలోŠల్ ఉన్నత విద్యకు అవకాశం ఉంది. ఇటీవల ఇంటర్లో కామర్స్ ఒక సబ్జెక్టుగా గ్రూపులు ఎంచుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుంది. ఆర్ట్స్ గ్రూపులు పోటీ పరీక్షలకు దృష్టిలో పెట్టుకునేవారు గతంలో ఆర్ట్స్ గ్రూపుల్లో చేరేవాళ్లు. కానీ ఐటీ రంగానికి కష్టకాలం రావడం, ఇంజనీరింగ్ చేసినవారిలో నిరుద్యోగత ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో మళ్లీ ఆర్ట్స్ గ్రూపులపై మొగ్గు చూపుతున్నారు. కార్పొరేట్ కళాశాలలు సైతం యూపీఎస్సీని దృష్టిలో ఉంచుకుని ఇంటర్ నుంచే శిక్షణనిస్తున్నాయి. దీంతో ఆర్ట్స్ గ్రూపులకు ఆదరణ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. సివిల్స్‌లో రాణించేందుకు కొన్ని పోటీ పరీక్షల్లో మంచి స్కోర్లు సాధించేందుకు ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ గ్రూపుల్లో చేరుతున్నారు. డిగ్రీలో సోషల్ సైన్సెస్(సోషల్, కల్చ రల్, పొలిటికల్, ఎకనమిక్స్ సబ్జెక్టుల్లో) చేరేందుకు కూడా ఈ గ్రూపులు అనుకూలం. విదేశీ భాషల్లో పరిజ్ఞానం సాధించడం ద్వారా ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. చైనీస్, స్పానిష్ లాంటి భాషల్లో ప్రావీణ్యం ఉన్న వారికి అనువాదకులుగా ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉంది. -
ఇంటర్ లేక ఇబ్బందులు
మన్ననూర్ : ఇంటర్ చదివేందుకు కళాశాల లేక నల్లమల్ల లోతట్టు చెంచు విద్యార్థులు పలు ఇబ్బందులు పడుతున్నారు. మన్ననూర్‌లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరారు. చెంచుల పిల్లలు పదో తరగతి వరకు చదివి ఉన్నత చదువులకు దూరమవుతున్నారని నాలుగేళ్ల క్రితం పీటీజీ పాఠశాలను అప్ గ్రేడ్ చేస్తూ ఎక్సలెన్స్ పేరుతో జూనియర్ కళాశాల ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎక్సలెన్స్ విధి విధానాలకు అనుకూలమైన వసతులు ప్రభుత్వం కల్పించకపోవడంతో గత నెలలో ఈ కళాశాలను హైదరాబాద్ సమీపంలోని మోయినాబాద్‌కు తరలించారు. దీంతో ప్రస్తుతం కళాశాల భవనం ఖాళీగా చూసే వాళ్లను ఎక్కిరిస్తున్నట్లు ఉంది. ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రులు ఇదిలా ఉండగా పీటీజీ పాఠశాలలో ప్రత్యేకించి చెంచు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఉన్నత చదువుల కోసం చెంచు విద్యార్థులు పట్టణ ప్రాంతాలకు వెళ్లడం కలగానే మిగులుతుందంటున్నారు. సంభందిత అధికారులు స్పందించి కనీసం ఇంటర్ విద్య వరకు చెంచు విద్యార్థులకు కళాశాల అందుబాటులో ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లలేం పట్టణ ప్రాంతాలకు వెళ్లి చదువుకునే స్థాయి సౌకర్యాలు లేవు. ఇక్కడే అందుబాటులో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలి. అధికారులు మా జీవన విధానాలను దృష్టిలో ఉంచుకుని ఉన్నత విద్య అవకాశాలు కల్పించాలి. – మల్లేష్, పీటీజీ విద్యార్థి, మన్ననూర్ పట్టణ ప్రాంతాలకు వెళ్లలేరు నిర్బంధంగా పాఠశాల విద్యాభ్యాసం చేస్తున్న చెంచు విద్యార్థులు ఇంటర్ విద్యను ఒక్కసారిగా పట్టణ ప్రాంతాల్లో ఉండి చదువడం కొంచెం కష్టమే. ఇక్కడి పీటీజీ పాఠశాల అప్‌గ్రేడ్ చేసి ఇంటర్ విద్యను అందిస్తే వయస్సుతో పాటూ ఆలోచన విధానాల్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. – రాజారాం, ప్రిన్సిపాల్, పీటీజీ పాఠశాల, మన్ననూర్ -
ఇంటర్ ప్రీ ఫైనల్ పరీక్షలు రీషెడ్యూల్
సాక్షి, విశాఖపట్నం: ఇంటర్మీడియట్ విద్యార్థులు జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. తాజాగా ఇంటర్ ప్రీ-ఫైనల్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. జనవరి 2 నుంచి 11 వరకు పది రోజుల పాటు జన్మభూమి కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. జన్మభూమిని దృష్టిలో ఉంచుకుని వీరికి ముందుగా నిర్ణయించిన సంక్రాంతి సెలవులను కూడా మార్పు చేసింది. వాస్తవానికి ఇంటర్మీడియట్ బోర్డు జనవరి 7 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అయితే ఈ సెలవులను జనవరి 12 నుంచి 20 వరకు మార్పు చేసింది. ఇప్పుడు ఈనెల 19 నుంచి 25 వరకు జరగాల్సిన ప్రీ-ఫైనల్-1 పరీక్షల తేదీలను మార్చింది. తాజా నిర్ణయం ప్రకారం వీటిని 22 నుంచి 25 వరకు, 30, 31 తేదీల్లో నిర్వహించాలని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 26న గణతంత్ర దినోత్సవం, 27న ఎథిక్స్ పరీక్ష, 28న ఆదివారం, 29న ఎన్విరాన్మెంటల్ పరీక్ష ఉన్నందున ఆయా రోజుల్లో ప్రీ-ఫైనల్ పరీక్షలు నిర్వహించరాదని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఆర్ఐవోలు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇంటర్మీడియెట్‌లో 8పాయింట్ల గ్రేడింగ్
-
8పాయింట్ల గ్రేడింగ్
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్‌లో ఎనిమిది పాయింట్ల గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు మొదలుపెట్టింది. ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకొని, గ్రేడింగ్ విధానం అమలుకు ఉత్తర్వులు జారీ చేయనుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. 2018 మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, 2019లో రెండో సంవత్సర విద్యార్థులకు ఈ విధానాన్ని వర్తింపజేసే అవకాశం ఉంది. మార్కుల విధానం వల్ల తల్లి దండ్రులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల నుంచి తీవ్ర ఒత్తిడి నెలకొనడంతో ఆ అంచనాలను అందుకోలేని విద్యార్థులు ఆత్మహత్యలవైపు మళ్లుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్కుల విధానానికి స్వస్తిపలికి కేవలం గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తేవాలని ఇంటర్ బోర్డు, తల్లిదండ్రులు, ప్రైవేటు యాజమాన్య ప్రతినిధులతో ఏర్పాటైన సలహా కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం ఇంటర్లో గ్రేడింగ్ విధానం ఉన్నా ఏ గ్రేడ్‌లో ఎంత మంది ఉత్తీర్ణులవుతున్నారనే వివరాలను మాత్రమే బోర్డు ఇస్తోంది. విద్యార్థుల మెమోల్లో గ్రేడ్లను ఇవ్వడం లేదు. కానీ ఇకపై మార్కులు ఇవ్వకుండా గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తేవాలని బోర్డు నిర్ణయానికి వచ్చింది. పదో తరగతి తరహాలోనే.... రాష్ట్రంలో పదో తరగతి తరహాలోనే ఇంటర్లో గ్రేడింగ్ విధానాన్ని బోర్డు అమల్లోకి తేనుంది. ఎనిమిది పాయింట్లుగా తీసుకురానున్న ఈ విధానంలో ప్రతి సబ్జెక్టుకు మార్కుల పరిధిని బట్టి గ్రేడ్ పాయింట్లు, గ్రేడ్, అన్ని సబ్జెక్టుల్లో గ్రేడ్ పాయింట్లనుబట్టి గ్రేడ్ పాయింట్ల యావరేజ్ ఇస్తారు. అలాగే ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో వచ్చిన గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల యావరేజ్నుబట్టి ఓవరాల్ గ్రేడ్ ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఫెయిల్ అయిన వారికి మాత్రం జీరో గ్రేడ్ పాయింట్‌తో ఈ గ్రేడ్ ఇస్తారు. ఎంసెట్‌లో వెయిటేజీపై 3 ప్రతిపాదనలు... గ్రేడింగ్ విధానం అమలు నేపథ్యంలో ఇంటర్ మార్కులకు ఉన్న వెయిటేజీ విషయంలో బోర్డు ప్రభుత్వానికి పంపేందుకు మూడు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో తొలి ప్రతిపాదన ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని తొలగించి ఎంసెట్ మెరిట్ ఆధారంగానే ప్రవేశాలు చేపట్టడం. ఇక రెండోది మార్కులకు బదులు సబ్జెక్టులవారీగా గ్రేడ్లను పరిగణనలోకి తీసుకోవడం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో వచ్చే గ్రేడ్లనుబట్టి వెయిటేజీని లెక్కించి ఇవ్వడం. ఇక మూడోది విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చినా బోర్డు వద్ద మార్కులు ఉంటాయి కాబట్టి ఎంసెట్ ర్యాంకుల ఖరారు కోసం విద్యార్థుల మార్కులను బోర్డు ఎంసెట్ కన్వీనర్‌కు అందజేస్తే ఆ మార్కుల ఆధారంగా వెయిటేజీ లెక్కించి ఎంసెట్ ర్యాంకులు ఖరారు చేయడం. అయితే ఈ మూడు ప్రతిపాదనల్లో వెయిటేజీ రద్దుపైనే బోర్డు దృష్టిసారిçంచినట్లు తెలిసింది. ఎందుకంటే విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఇంప్రూవ్మెంట్ రాసినా, ఇంటర్ మార్కుల కోసం లేదా జవాబు పత్రం ఫొటోకాపీ కోసం దరఖాస్తు చేసుకున్నా మార్కులు వారికి తెలిసేటప్పటికి ప్రవేశాలు పూర్తవుతాయి కాబట్టి ఇబ్బంది ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. -
ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తాం..
-
ఇంటర్‌లోనూ గ్రేడింగ్
సాక్షి, అమరావతి: పదో తరగతి మాదిరిగానే ఇంటర్‌లోనూ ర్యాంకుల విధానానికి స్వస్తి పలికి గ్రేడింగ్ పద్ధతిని అమలు చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటిం చారు. ఈ విద్యా సంవత్సరం నుంచే దీనిని అమల్లోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యం లో సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి గంటా, డీజీపీ సాంబశివరావు తది తరులు.. కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఈ వివరాలను మంత్రి గంటా మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది నుంచి ర్యాంకుల విధానాన్ని ఎత్తి వేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ మార్కులకు వెయిటేజీ విషయాన్ని ఎంసెట్ నిర్వాహకులు చూసుకుంటారని చెప్పారు. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులను రోజుకు పద్దెనిమిది న్నర గంటల పాటు చదివిస్తున్నారని, దీంతో ఒత్తిడికి గురైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చింద న్నారు. కాలేజీల యాజమాన్యాలు పద్ధతి మార్చుకోవాలని.. లేదంటే కఠిన చర్య లు తప్పవన్నారు. ఇకపై విద్యార్థులకు విధిగా ఆదివారం సెలవు ఇవ్వాల్సిందే నని స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తాం.. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల బలవన్మర ణాలపై త్వరలో ఉన్నత స్థాయి కమిటీ వేయనున్నట్టు గంటా తెలిపారు. ఈ కమిటీ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి నివేదిక ఇస్తుందని, దీని ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేటు కాలేజీల హాస్టళ్లు 150కి పైగా ఉన్నాయని.. మూడు నెలల్లోగా అనుమతులు తెచ్చుకోకపోతే వాటిని రద్దు చేస్తామన్నారు. ప్రతి కార్పొరేట్ కాలేజీ కూడా ఒక మానసిక వైద్యుడిని నియమించుకొని, విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని 2012 నుంచి ఇప్పటి వరకూ 35 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని.. వీరిలో శ్రీ చైతన్య కాలేజీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని గంటా వెల్లడించారు. -
ఓపెన్ పది, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్: సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. స్థానిక రాజేంద్ర నగరపాలక ఉన్నత పాఠశాల కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ఖాజా మొహిద్దీన్ తనిఖీ చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డీఈఓ లక్ష్మీనారాయణ, ఆర్ఐఓ సురేష్‌ను ఆయన ఆదేశించారు. ముఖ్యంగా అన్ని కేంద్రాల్లోనూ ఫర్నీచర్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఇంటర్ పరీక్షకు 585 మంది విద్యార్థులకు గాను 438 మంది హాజరయ్యారు. పదో తరగతి పరీక్షకు సంబంధించి ఐదుగురుకు గాను గాను ముగ్గురు హాజరైనట్లు వివరించారు. -
అంతర్ రాష్ట్ర నేరస్తుల అరెస్టు
రూ. 20 లక్షల బంగారు, వెండి వస్తువుల స్వాధీనం కాకినాడ క్రైం : వారు ముగ్గురూ అంతర్ రాష్ట్ర నేరస్తులు.. రాష్ట్రంలో పలు పోలీస్స్టేషన్లలో పోలీసు కేసులున్నాయి.. పగటిపూట సింగిల్‌గా ఉంటున్న ఇళ్లవద్ద రెక్కీ నిర్వహించడం, రాత్రిపూట ఇంట్లో పడి దోచుకోవడం... జైలుకెళ్లడం... బెయిల్‌పై వచ్చి చోరీలకు పాల్పడుతూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న ముగ్గురు అంతర రాష్ట్ర నేరస్తులను ఎట్టకేలకు కాకినాడ క్రైం పోలీసులు పట్టుకున్నారు. నేరస్తుల నుంచి సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ విశాల్ గున్ని నేరస్తుల వివరాలను వెల్లడించారు. జిల్లాలో కాజులూరు బ్రాహ్మణ వీధికి చెందిన ముప్పయ్ సంవత్సరాల షేక్ అజీజ్ (నాని), పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట, కొండగూడెంకు చెందిన ఇరవై ఆరేళ్ల అంతర్ రాష్ట్ర నేరస్తుడు చీకట్ల సతీష్, రాజమహేంద్రవరం మల్లిఖార్జునగర్కు చెందిన నలభై అయిదేళ్ల షేక్ బాషి (బాషా)లతో కలసి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో 21 ఇళ్లల్లో రాత్రి పూట చోరీలకు పాల్పడ్డారు. ఇందులో షేక్ అజీజ్‌పై గతంలో కాకినాడ, రాజమహేంద్రవరం, పెదపూడి, రాయవరం, అనపర్తి, అన్నవరం, రామచంద్రపురం, ద్రాక్షరామ, అంబాజీపేట, విజయవాడ, భీమడోలు, తణుకు, ఏలూరు జరిగిన 50 చోరీ కేసులలో అరెస్ట్ శిక్ష అనుభవించాడు. చీకట్ల సతీష్ హైదరాబాద్, ఒంగోలు, మచిలీపట్నం, ఏలూరు, కూచిపూడి, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, వైజాగ్, విజయనగరం లో సుమారు 40 కేసుల్లో అరెస్టయి 2016 డిసెంబర్లో జైలు నుంచి బయటకు వచ్చి చోరీలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. షేక్ అజీజ్ మార్చి నెలలో జైలులో ఉన్న నేరస్తుడు చీకట్ల సతీష్‌ని బెయిల్‌పై తీసుకొచ్చి మరో నేరస్తుడు షేక్ బాషితో కలసి రావులపాలెం, నిడదవోలు,2015 జనవరిలో సర్పవరం కాకినాడ పబ్లిక్ స్కూలు, 2016లో అశోక్‌నగర్ ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డారు. చీకట్ల సతీష్ కాకినాడ టూటౌన్ పరిధిలోని రెండు మోటార్ సైకిళ్లు, పశ్చిమగోదావరి జిల్లాలో లక్కవరం, ద్వారకా తిరుమల, నర్సాపురం, సమిశ్రగూడెంలో ఏడు ఇళ్లలలో దొంగతనాలకు పాల్పడ్డాడు. వీరి ముగ్గురిలో షేక్ అజీజ్‌పై 12 కేసులు, చీకట్ల సతీష్‌పై 12 , షేక్ బాషిపై 3 కేసులలో అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నేరస్తులు కాజులూరులో షేక్ అజీజ్ ఇంటిలో ఉన్నట్టు సమాచారం రావడంతో సోమవారం కాకినాడ క్రైం డీఎస్పీ ఏ.పల్లపురాజు ఆధ్వర్యంలో క్రైం ఎస్సైలు కేవీవీ రామారావు, జి.హరీష్కుమార్ల ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి ముగ్గురు నేరస్తులను అరెస్ట్ చేశారు. 500 గ్రాముల విలువైన బంగారు ఆభరణాలు, 9.323 కిలోల వెండి ఆభరణాలు, రెండు మోటార్ సైకిల్స్, ఒక ఎల్ఈడీ టీవీని నేరస్తుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. శాంతి భద్రతలను కాపాడటం, గంజాయి అక్రమ రవాణా, మిలీషియా çకమాండర్ అరెస్ట్, దొంగతనాల రికవరీలలో సిబ్బంది మంచి ఫలితాలు సాధిస్తున్నారని కితాబిచ్చారు. క్రైం డీఎస్పీ పల్లపురాజు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. -
ఇంటర్ అడ్వాన్స్‌డ్‌లో ‘అనంత’ ఆఖరు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. తొలిసంవత్సరం ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే చివరిస్థానంలో నిలవగా, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 8వ స్థానం దక్కించుకుంది. మొదటి సంవత్సరం పరీక్షలకు సంబంధించి మొత్తం 24,620 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 17,166 మంది 70 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 12,633 బాలురకు గానూ 8,293 మంది 66 శాతం ఉత్తీర్ణులయ్యారు. అలాగే 11,987 మంది బాలికలకు గానూ 8873 మంది 74 శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించి 8986 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4180 మంది 47 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 5366 మంది బాలురకు గానూ 2413 మంది 45 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే 3620 మంది బాలికలను గానూ 1767 మంది 49 శాతం ఉత్తీర్ణత సాధించారు. -
‘గురుకుల’ కౌన్సెలింగ్ గందరగోళం
– కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయని అధికారులు – ఇబ్బందులు పడిన విద్యార్థులు డోన్ టౌన్: గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశానికి డోన్ పట్టణంలోని గురుకుల పాఠశాలలో శనివారం నిర్వహించిన కౌన్సెలింగ్ గందరగోళంగా మారింది. జిల్లావ్యాప్తంగా గురుకుల 880 సీట్లు ఉండగా.. 2,300 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. పట్టణానికి 5 కి.మీ దూరంలో ఉన్న ఈ పాఠశాల ఆవరణలో కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. ఒక క్రమపద్ధతి పాటించకపోవడంతో, ఒకే సారి కేంద్రంలోకి విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను అనుమతించడంతో తోపులాట జరిగింది. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో 9 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్.. పోలీసులు వచ్చిన తరువాత 12 గంటలకు ప్రారంభమైంది. కనీస సౌకర్యాలేవీ..? పాఠశాల ఆవరణలోని మరుగుదొడ్లకు తాళాలు వేయడంతో విద్యార్థినులు చాలా ఇబ్బందులు పడ్డారు. తాగునీటి వసతి లేకపోవడంతో దాహంతో అల్లాడారు. జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరవుతారని అధికారులకు తెలిసినా..ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వచ్చాయి. పట్టణం నుంచి పాఠశాలకు ఎలాంటి వాహన సౌకర్యం లేకపోవడంతో ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేశారు. ఇదిలా ఉండగా.. కౌన్సెలింగ్ నిర్వాహణను జిల్లా కో ఆర్డినేటర్ కృష్ణమూర్తి తనిఖీ చేశారు. ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి సౌకర్యం వెంటనే కల్పించాలని ప్రిన్సిపాల్ ఉమాకుమారిని ఆదేశించారు. సౌకర్యాలు లేకుండా కౌన్సిలింగ్ ఎలా నిర్వహిస్తారని జిల్లా కో ఆర్డినేటర్ కృష్ణమూర్తితో ఎస్ఎఫ్ నాయకులు శివశంకర్, ఏఐఎస్ఎఫ్ నాయకులు శివన్న తదితరులు వాగ్వాదానికి దిగారు. -
26న గురుకుల కళాశాల కౌన్సెలింగ్
అనంతపురం రూరల్ : సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఇంటర్ ప్రవేశానికి ఈ నెల 26 నుంచి రెండు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ ఉషారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 26న బాలురకు కాళసముద్రం, 27న కురుగుంట కళాశాలలో బాలికలకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. కౌన్సెలింగ్ వచ్చే విద్యార్థులు తమ సర్టిఫికెట్లు, ఫిజికల్ పిట్నెస్ ధ్రువపత్రంతో పాటు 4పాస్ ఫొటోలతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు. -
ఇంటర్‌కు ఆధార్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ప్రవేశాలకు ఆధార్ నంబరు తప్పనిసరని ఇంటర్మీడియెట్ బోర్డు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి విద్యార్థి ఆధార్ కార్డును సమకూర్చుకోవాలని బోర్డు సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, మోడల్ స్కూల్స్, గురుకులాలు, అన్ని మేనేజ్మెంట్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్‌లో చేరాలనుకునే విద్యార్థులు 201718 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆధార్‌ను సిద్ధం చేసుకోవాలని తెలిపింది. -
ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్›డ్ సప్లిమెంటరీ ప్రధాన పరీక్షలు శని వారం ముగిశాయి. చివరిరోజు కెమిస్ట్రి, కామర్స్ పరీక్షలు నిర్వహి ంచారు. ఉదయం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షకు 17,618 మంది విద్యార్థులకుగాను 16,808 మంది హాజరయ్యారు. 810 మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 16,846 మందికి గాను 16,186 మంది హాజరయ్యారు. 660 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులకు సంబంధించి 772 మందికి గాను 622 మంది హాజరయ్యారు. 150 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు సంబంధించి 3,113 మంది విద్యార్థులకుగాను 2,930 మంది హాజరయ్యారు. 183 మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 2687 మందికి గాను 2554 మంది హాజరయ్యారు. 133 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 426 మందికి గాను 376 మంది హాజరయ్యారు. 50 మంది గైర్హాజరయ్యారు. -
చౌతాలా (82) ఇంటర్ పాసయ్యారు!
చండీగఢ్: హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా(82) హయ్యర్ సెకండరీ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. టీచర్ల నియామక కుంభకోణంలో దోషిగా తేలిన చౌతాలా ప్రస్తుతం తీహార్ జైలులో పదేళ్ల శిక్షఅనుభవిస్తున్నారు. తీహార్‌లో ఖైదీల కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ స్కూలింగ్ ద్వారా చౌతాలా హయ్యర్ సెకండరీ పూర్తి చేసినట్లు ఆయన కుమారుడు, ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింగ్ చౌతాలా చెప్పారు. ప్రస్తుతం మనవడు దుష్యంత్ వివాహం కోసం పెరోల్‌పై ఉన్న ఆయన.. ఏప్రిల్ 23న జైల్లో నిర్వహించిన పరీక్షకు హాజరైనట్లు అభయ్ వెల్లడించారు. -
నేటి నుంచి ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు
– జిల్లాలో 80 పరీక్ష కేంద్రాల ఏర్పాటు - సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్ సçప్లమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి 23వ తేది వరకు జరగనున్న పరీక్షలకు జిల్లాలో మొత్తం 80 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటుంది. జిల్లాలో మొదటి సంవత్సర పరీక్షలకు 29,272 మంది, రెండో సంవత్సర పరీక్షలకు 9549 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సెంటర్ల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసి వేయించాలని ఇప్పటీకే అధికారులు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో 12 సమస్యాత్మకమైన కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. 11 కేంద్రాలకు సకాలంలో బస్సుల సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బోర్డు అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్ష సమయంలో కరెంట్ కట్ కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. ప్రతి కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ ఒకరు, డిపార్ట్మెంటల్ అధికారి ఒకరు ఉంటారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇన్విజిలేటర్లను ఆ కేంద్ర పర్యవేక్షకులు నియమించుకుంటారు. -
ఇంటర్ ప్రవేశానికి 15న తుది గడువు
అనంతపురం రూరల్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల పాఠశాలలు, కళాశాలల జిల్లా కోఆర్డినేటర్ ఉషారాణి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను www.apswreis.inలో డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాలు, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన మార్కుల జాబితాను జత చేసి దగ్గరలోని గురుకుల కళాశాలలో ఈనెల 15లోపు అందజేయాలన్నారు. -
రేపు జాబ్‌మేళా
– డీవీఈవో సుబ్రమ్మణేశ్వరరావు వెల్లడి కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఇంటర్ ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి సోమవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా వృత్తివిద్యాధికారి (డీవీఈఓ) టి.వి.సుబ్రమణ్యేశ్వరరావు తెలిపారు. ఇదే అంశంపై శనివారం స్థానిక ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ కె.గాంధీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 2014 నాటికి ఇంటర్ ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ జాబ్‌మేళాకు అర్హులన్నారు. వివిధ కంపెనీలు పాల్గొంటున్నందున అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు, ఆధార్‌కార్డు జిరాక్స్, 2 ఫొటోలు తెచ్చుకోవాలని కోరారు. ఇంజనీరింగ్, పారా మెడికల్, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి ఇది మంచి అవకాశమన్నారు. బీక్యాంప్‌లోని ప్రభుత్వ ఒకేషనల్ వృత్తి విద్య కళాశాలలో ఉదయం 10.00 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని, అభ్యర్థులు ముందుగానే పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమానికి డిప్యూటీ డీవీఈఓ కె.వెంకట్రావ్, వృత్తి విద్య కోర్సుల ప్లేస్మెంట్ అధికారి బి.వి.మాధవరావు కూడా హాజరయ్యారు. -
8న జాబ్ మేళా
కర్నూలు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు ఒకేషనల్ జూనియర్ కాలేజీల్లో చదివి 2014లోపు పాస్ అయిన విద్యార్థు«లకు ఈ నెల 8వ తేదీన జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు జిల్లా వృత్తి విద్యాధికారి టి.వి సుబ్రమణ్యేశ్వరరావు సోమవానం ప్రకటనలో తెలిపారు. స్థానిక బిక్యాంపులోని ఒకేషనల్ కాలేజీలో నిర్వహించే ఈ జాబ్ మేళాను ఒకేషనల్ కోర్సులు చేసిన నిరుద్యోగ, యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
వసతి..కిరికిరి
- అనుమతుల్లేకుండా హాస్టళ్ల నిర్వహణ - ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల ఇష్టారాజ్యం - 16 కాలేజీలకు అనుమతులు లేవని నివేదిక - వీటిలో టీడీపీ నాయకుల అనుచరుల కాలేజీలు - త్వరలో షోకాజ్ నోటీస్‌లు జారీ చేస్తామన్న ఇంటర్ బోర్డు అధికారులు కర్నూలు సిటీ: జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు అడ్డగోలుగా హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. అనుమతులు లేకుండా, నిబంధలు పాటించకుండా ఇంటర్ విద్యార్థులకు వసతి కల్పిస్తున్నారు. ప్రైవేట్ కళాశాల హాస్టల్ విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో పోలీసుల విచారణ జరపగా..ఈ విషయం వెలుగుచూసింది. విద్యార్థుల బలవన్మరణాలకు ఆయా విద్యా సంస్థలు నిర్వహిస్తున్న హాస్టళ్లలో సరైన సదుపాయలు లేకపోవడమే కారణమని తేలింది. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం, భద్రత కోసం సరైన సిబ్బందిని నియమించక పోవడమూ కారణమని ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అనుమతులు లేకుండా హాస్టళ్లు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు ఇంటర్ బోర్డు అధికారులు రంగం సిద్ధం చేశారు. జిల్లాలో ఇలా నిర్వహిస్తున్న కాలేజీలు 16 ఉన్నట్లు తేలింది. వీటిపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డుకు నివేదిక పంపారు. ఒక్క కాలేజీకి మాత్రమే అనుమతి...! జిల్లాలో కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీలు 99 ఉన్నాయి. వీటిలో జిల్లాలో నంద్యాలోని రాపూస్ జూనియర్ కాలేజీకి మాత్రమే హాస్టల్‌తో కూడిన అనుమతి ఉంది. మిగతా వాటికి ఒక్కదానికి అనుమతి లేదు. హాస్టళ్లతో కలిపి కాలేజీలను నిర్వహిస్తున్నవి సుమారు 30 శాతం ఉంటాయి. అయితే ఇంటర్ బోర్డు అధికారులు కేవలం 16 మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఈ వివరాలతో కూడిన నివేదికను బోర్డుకు అందజేశారు. త్వరలోనే ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలపై తనిఖీ చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఇందుకు ముందే గుర్తించిన కాలేజీలకు నోటీస్‌లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. టీడీపీ నాయకుల అనుచరులకు చెందిన విద్యా సంస్థలు కూడా అనుమతులు లేకుండా హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. అయితే ఆ కాలేజీలపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి. తనిఖీలు చేయని బోర్డు అధికారులు...! జిల్లాలో ప్రైవేట్ కాలేజీలకు అనుమతులు ఇస్తున్న అధికారులు కచ్చితంగా తనిఖీ చేయాలి. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో ప్రతి కాలేజీని తనిఖీ చేసిన నివేదికను ఇంటర్ బోర్డుకు అందజేయాలి. అయితే అధికారులు ప్రైవేట్ కాలేజీలను తనిఖీ చేయడంలేదు. కాలేజీల్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడే హడావుడి చేసి తూతూ మంత్రంగా నివేదికలు ఇవ్వడం పరిపాటిగా మారింది. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమన్యాలు ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క కాలేజీకి మాత్రమే అనుమతి – వై.పరమేశ్వరరెడ్డి, ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి జిల్లాలోని ప్రైవేట్ కాలేజీల్లో కేవలం నంద్యాలలోని రావూస్ జూనియర్ కాలేజీకి మాత్రమే హాస్టల్ అనుమతి ఉంది. అనుమతులు లేకుండా హాస్టళ్లు నిర్వహిస్తున్న కాలేజీల వివరాలను ఇంటర్ బోర్డుకు అందజేశాం. వీరిపై చర్యలు తీసుకునే అంశం కమిషనర్ పరిధిలో పరిశీలనలో ఉంది. -
ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
దేవనకొండ: మార్కులు తక్కువ వచ్చాయనే కారణంతో బుధవారం.. ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది. ఈ ఘటన దేవనకొండ మండలం డీ కోటకొండ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కృష్ణ స్వామిల కుమార్తె సునిత(17) కర్నూలులోని ఓ కళాశాలలో ఇంటర్ సీఈసీ గ్రూపు చదివింది. ఇటీవల వచ్చిన ఫలితాల్లో మార్కులు తక్కువచ్చాయని కుంగి పోయింది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. -
ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యాయత్నం
– మార్కులు తక్కువొచ్చాయని ఒకరు – ఫెయిల్ అయ్యానని మరొకరు – ఇరువురి పరిస్థితి సీరియస్ – కర్నూలుకు తరలింపు ఇంటర్ ఫలితాలు ఇద్దరు విద్యార్థుల మనస్సులను గాయపరిచాయి. గురువారం వెలువడిన పరీక్షా ఫలితాలు జీర్ణించుకోలేక ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు, ఫెయిల్ అయ్యానని మరొకరు బలవన్మరణానికి ప్రయత్నించారు. ఈ రెండు సంఘటనలు మండల పరిధిలోని వేర్వేరు గ్రామాల్లో చోటుచేసుకున్నాయి. కోవెలకుంట్ల: మండల పరిధిలోని గుళ్లదూర్తి గ్రామానికి చెందిన గంగన్న, సుదర్శనమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం. గంగన్న ఉయ్యాలవాడ మండలంలో వెలుగు కార్యాలయంలో సీసీగా పనిచేస్తున్నాడు. కూతురు అల్లూరు సుమలత నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సర బైపీసీ చదువుతోంది. ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో ఫెయిల్ అయినట్లు తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పుంటించుకుంది. స్థానికులు మంటలు ఆర్పి 108 అంబులెన్స్‌లో కోవెలకుంట్ల ఆస్పత్రికి తరలించారు. 70శాతం శరీరభాగాలు కాలిపోవడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్కులు తక్కువ వచ్చాయని.. మండలంలోని గుంజలపాడు గ్రామానికి చెందిన రాజారెడ్డికి ఇద్దరు కుమారులు సంతానం. పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ పిల్లలను చదివిస్తున్నాడు. రెండో కుమారుడు సతీష్‌రెడ్డి కర్నూలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సర బైపీసీ చదువుతున్నాడు. ఫలితాలు విడుదల కానుండటంతో తండ్రితోపాటు కోవెలకుంట్లకు వచ్చాడు. ఇంటర్ ఫలితాల్లో 420 మార్కులు రావడంతో తన స్నేహితుడికంటే మార్కులు తక్కువ వచ్చాయని మనోవేదనకు గురయ్యాడు. తాను తర్వాత వస్తానని తండ్రిని ఆటో ఎక్కించి పంపాడు. క్రిమి సంహారక గుళికలు మింగి బైక్‌పై ఇంటికి చేరుకుని వాంతులు చేసుకోవడంతో గమనించిన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీధర్ పేర్కొన్నారు. -
అమ్మాయిలు అదుర్స్!
- ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల - మొదటి సంవత్సరంలో 59 శాతం - రెండో సంవత్సరంలో 75 శాతం ఉత్తీర్ణత - ఉత్తీర్ణత శాతాల్లో స్వల్పతేడాలు - వంద శాతం ఉత్తీర్ణత సాధించిన మిడుతూరు ప్రభుత్వ కళాశాల కర్నూలు(సిటీ): ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు గురువారం విజయవాడలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ విడుదల చేశారు. రెండు ఫలితాల్లోనూ బాలికలు సత్తా చాటారు. ప్రథమ సంవత్సర ఫలితాల్లో పదో స్థానం, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఏడో స్థానంలో జిల్లా నిలిచింది. గత ఏడాది కంటే మొదటి, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో స్వల్ప తేడాలు ఉన్నాయి. గత ఏడాది ఫస్ట్ ఇయర్ 64 శాతం ఉత్తీర్ణత కాగా ఈ ఏడాది 59 శాతానికి, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో గత ఏడాది 71 శాతం కాగా ఈ ఏడాది కాస్త పెరిగి 75 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. జిల్లాలో మొత్తం 76,807 మంది మొదటి, ద్వితీయ సంవత్సర విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం 36,398 మంది పరీక్షకు హాజరు కాగా.. 21,307 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 19,448 మందికి గాను 10,128 మంది (58 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 16,950 మంది పరీక్షకు హాజరు కాగా 11,179 మంది (66 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం 30,694 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 23,164 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 16,081 మందికి గాను 11,357 మంది (71 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 14,613 మందికి గాను 11,807 మంది (81 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం విద్యార్థుల ఫలితాల్లో జిల్లా గత ఏడాది 7వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 10వ స్థానానికి పడిపోయింది. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో గత ఏడాది 8వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 7వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ కళాశాలల్లో 42.94 శాతం ఉత్తీర్ణత... జిల్లాలో మొత్తం 41 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో మొదటి సంవత్సరం 6,838 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 2,936 మంది (42.94 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 53 శాతం ఫలితాలు రాగా, ఈ ఏడాది 42.94 శాతానికి తగ్గింది. ఈ ఫలితాల్లో దేవనకొండ మండలం జిల్లాలో అత్యధిక శాతం ఫలితాలు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఓర్వకల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల 88.89 శాతం, ఆస్పరి ప్రభుత్వ జూనియర్ కళాశాల 88.18 శాతంతో తృతీయ స్థానంలో నిలిచింది. అతి తక్కువ ఉత్తీర్ణత శాతం కౌతాళం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 230 మంది విద్యార్థులకు గాను కేవలం 14 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అదే విధంగా గూడూరు జూనియర్ కళాశాలలో 230కి గాను 29 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,418 మంది విద్యార్థులకు గాను 3,844 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 67 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా స్వల్పంగా పెరిగి 70.95 శాతానికి చేరుకున్నాయి. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన ఏకైక ప్రభుత్వ జూనియర్ కళాశాలగా మిడుతూరు గుర్తింపు పొందింది. 44.91 శాతంతో అతి తక్కువ ఉత్తీర్ణత ఫలితాలు సాధించిన కళాశాలగా గూడూరు నిలిచింది. ఎయిడెడ్ కళాశాలలు... జిల్లాలోని ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సర విద్యార్థులు 1,766 మంది పరీక్షలకు హాజరు కాగా 627 మంది (37.50 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 1,332 మంది విద్యార్థులకు 831 మంది (62.37 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో పాణ్యం సిమెంట్ జూనియర్ కళాశాల, బేతంచెర్ల అత్యధిక ఫలితాలు సాధించగా బాలశివ జూనియర్ కళాశాల అతితక్కువ ఫలితాలు సాధించి చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఒకేషనల్ కళాశాలలు... జిల్లాలోని ఒకేషనల్ కళాశాలకు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులు 1,242 మంది పరీక్షలకు హాజరు కాగా 734 మంది (59.10 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 1,132 మందికి గాను 930 మంది (82.66 శాతం) ఉత్తీర్ణులయ్యారు. -
రేపు ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు
అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరపు పరీక్షల ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. విజయవాడలోని గేట్‌వే హొటల్లో మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నామని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన అన్ని ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి ఒకటో తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు 10,31,285 మంది రాశారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5,23,099 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 5,08,186 మంది ఉన్నారు. 1,445 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. గత ఏడాదికన్నా ఈసారి పరీక్ష ఫలితాలను వారం రోజులు ముందుగా విడుదల చేస్తుండడం విశేషం. పరీక్ష ఫలితాలను ‘సాక్షిఎడ్యుకేషన్.కామ్’లో చూసుకోవచ్చు. ఈ సేవ, మీసేవ, రాజీవ్ సిటిజన్ సర్వీస్సెంటర్లు, ఏపీ ఆన్లైన్ సెంట్లర్ల ద్వారా కూడా పరీక్ష ఫలితాల సమాచారాన్ని పొందవచ్చని బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఎస్ఎంఎస్ల ద్వారా ఫలితాల సమాచారం తెలిపే ఏర్పాట్లు చేశారు. ఫస్టియర్ జనరల్ ఫలితాలకు 54242కు ఐపీఈ1 స్పేస్ హాల్‌టిక్కెట్ నెంబర్ పంపాలి. సెకండియర్ జనరల్ ఫలితాలకు ఇదే నెంబర్‌కు ఐపీఈ2 స్పేస్ ఇచ్చి హాల్‌టిక్కెట్ నెంబర్ పంపించాలి. 5676750 నెంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపి సమాచారం తెలుసుకోవచ్చని బోర్డు పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను ఈ నెల 17న విడుదల చేయాలని ఇంటర్ బోర్డు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నది. వాస్తవానికి ఈ నెల 27న విడుదల చేయాలని భావించినా జేఈఈ ఫలితాలను విడుదల చేస్తుండడంతో ఇంటర్ ఫలితాలను ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. బుధవారం ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ పూర్తికానున్నది. 17న ఫలితాలను విడుదల చేస్తామని, సాంకేతిక సమస్యలు తలెత్తితే 18న ప్రకటిస్తామని బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
– మార్కులు తక్కువ వస్తాయని భయపడి ఆత్మహత్య ఎమ్మిగనూరు రూరల్: మార్కులు తక్కువ వస్తాయని భయపడి గుడేకల్ గ్రామానికి చెందిన ఇంటర్ మీడియట్ విద్యార్థిని..బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు...నందవరం మండలం నాగలదిన్నె గ్రామానికి చెందిన కొండయ్య, శాంతమ్మలకు కుమార్తె కె.ఇందిరమ్మ ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజిలో రెండో సంవత్సరం బైపీసీ చదువుతుంది. నాగలదిన్నె నుంచి రోజు బస్సుకు రావటం ఎందుకని మండల పరిధిలోని గుడేకల్‌లో తన తాత గోవిందప్ప దగ్గర ఉంటోంది. రెండు రోజుల కిత్రం ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. మొదటి సంవత్సరంలో ఒక సబ్జెక్్ట ఫెయిల్ అయ్యానని, రెండో సంవత్సరం పరీక్షలు సరిగా రాయలేదని ..మార్కులు తక్కువ వస్తాయని మదన పడేది. బుధవారం ఇంట్లో ఎవరూ లేకపోవటంతో చీరతో ఉరివేసుకుంది. విగతజీవిగా మారిన మనవరాలిని చూసి అవ్వాతాతలు బోరున విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ వేణుగోపాల్ పేర్కొన్నారు. -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
– చివరి రోజు 601 మంది గైర్హాజరు కర్నూలు సిటీ : ఈనెల ఒకటిన ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు ఆదివారంతో ముగిసాయి. దీంతో విద్యార్థులతోపాటు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. వాస్తవానికి ఈ నెల 13 నాటికి పరీక్షలు ముగియాల్సి ఉంది. అయితే పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసన మండలి ఎన్నికల కారణంగా ఈ నెల9న జరగాల్సిన పరీక్ష 19కి వాయిదా పడింది. చివరి పరీక్ష రోజున 26962 మంది విద్యార్థులకుగాను, 26361 మంది హాజరయ్యారు. మొత్తం 601 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిన నలుగురు విద్యార్థులను మాస్ కాపీయింగ్ కింద బుక్ చేశారు. సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ జరుగనున్న నేపథ్యంలో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ఉదయం సెషన్‌కు సెలవు ఇచ్చారు. ఇదిలా ఉండగా పరీక్షలు ముగియడంతో విద్యార్థుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. పరీక్ష కేంద్రాల దగ్గర విద్యార్థులు ఒకరికొకరు బాయ్ చొప్పుకోవడం కనిపించింది. పెట్టెబేడా సర్దుకుని సొంతూళ్లకు బయలుదేరివెళ్లారు. -
ఇంటర్ ‘స్పాట్’ ప్రారంభం
– ఎలాంటి పొరబాట్లకు తావివ్వొద్దు – విద్యార్థులకు నష్టం కల్గితే చర్యలు తప్పవు – ఆర్ఐఓ వెంకటేశులు – కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆందోళన అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం స్థానిక కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం సాయంత్రం 3.30 గంటలకు ప్రారంభమైంది. తొలిసారి బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలవుతుండడంతో రిజిస్ట్రేషన్లకు చాలా సమయం పడుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఈ ప్రక్రియే సాగింది. ఒక్కొక్కరికి 15 పేపర్లు ఇచ్చారు. తొలివిడతగా మొదటి సంవత్సరం తెలుగు, ఇంగ్లిషు, గణితం, పౌరశాస్త్రం, హిందీ జవాబు పత్రాలు మూల్యాంకనం చేయనున్నారు. ముందుగా ఎగ్జామినర్లు, సీఈలతో ఆర్ఐఓ సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశమని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఏస్థాయి ఉద్యోగి అలసత్వం చేసినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సీసీ కెమరాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర అధికారులు ఆన్లైన్లో పర్యవేక్షిస్తారన్నారు. ముఖ్యంగా బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేస్తున్న నేపథ్యంలో అందరూ వేళకు చేరుకోవాలన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన బోర్డు అధికారులు తమను మూల్యాంకనం విధులకు నియమిస్తే ఇక్కడి అధికారులు తీసుకోవడం లేదంటూ కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళనకు దిగారు. సాంకేతిక సమస్య కారణంగానే కాంట్రాక్ట్ అధ్యాపకులను విధులకు నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయని, వాటిని రద్దుచేసి రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలంటూ రాష్ట్ర అధికారులు ఆదేశించారని ఆర్ఐఓ, డీవీఈఓ తెలిపారు. ఇందుకు కాంట్రాక్ట్ అధ్యాపకులు ససేమిరా అన్నారు. దీంతో కాస్త సమయం ఇవ్వాలని కోరగా వారు ఆందోళన విరమించారు. ఇంతలోనే నియామక ఉత్తర్వులు వచ్చిన కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో సమస్య సద్దుమణిగింది. -
విద్యార్థిని అదృశ్యం
కర్నూలు: కర్నూలు నగరం టౌన్‌మోడల్ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సుచరిత (17) రెండు రోజులుగా కనిపించడం లేదు. కల్లూరు ఎస్టేట్‌లోని భగవాన్నగర్లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు, సరస్వతి దంపతులకు ఇద్దరు సంతానం కాగా. పెద్ద కూతురు సుచరిత టౌన్‌మోడల్ కళాశాలలో చదువుతోంది. గురువారం రాత్రి 8గంటల సమయంలో దుకాణానికి వెళ్తున్నట్లు చెప్పి బయటికి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో ఆమె కోసం నగరమంతా గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఛామన చాయ ఉండి, 5అడుగుల ఎత్తు ఉంటుంది. ఇంటి నుంచి బయటికి వెళ్లే టపుడు పంజాబీ డ్రస్సు ధరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తల్లిదండ్రులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నాలుగో పట్టణ సీఐ నాగరాజురావు తెలిపారు. -
ఇంటర్ పరీక్షల్లో నలుగురు డిబార్
డోన్ టౌన్ : ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం పరిక్షల్లో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న నలుగురు విద్యార్థులను సిట్టింగ్ స్క్వాడ్ సోమవారం డిబార్ చేసింది. డోన్ మోడల్ స్కూల్ కేంద్రంగా నిర్వహిస్తున్న పరీక్షలను సోమవారం జిల్లా సిట్టింగ్ స్క్వాడ్ నాగస్వామి నాయక్, డిపార్ట్మెంటల్ అధికారి నాగయ్య, ప్రిన్సిపాల్ నాగరవీందర్ తనిఖీలు చేశారు. మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న నవోదయ, వెంకటేశ్వర, ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు చెందిన నలుగురిని గుర్తించి డిబార్ చేశారు. -
ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 33, 563 మంది విద్యార్థులకుగాను 32,824 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 739 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైట్లు ఆర్ఐఓ పరమేశ్వరరెడ్డి తెలిపారు. వాస్తవానికి జిల్లాలో పరీక్షకు హాజరుకావాల్సింది 37,912 మంది అని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. పరీక్ష జరిగిన రోజున మాత్రం ఆదే అధికారులు 33,563 మంది మాత్రమే పరీక్షకు అర్హులని చెబుతున్నారు. రికార్డు పరంగా ఇచ్చిన వివరాల ప్రకారం సుమారు 4,349 మంది విద్యార్థులు తక్కువ చూపుతున్నారెందుకని ఆర్‌ఐఓను అడిగితే మిగతా వారు ఫీజులు కట్టని వారు, హాజరు శాతం తక్కువగా ఉన్న వారు ఉంటారని చెబుతున్నారు. -
’సర్వీస్’ దోపిడీ
– ఇంటర్ కాలేజీల నయా దందా – విద్యాపన్ను అంటూ రూ.1200 వసూలు – రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందంటూ బుకాయింపు – పరీక్షకు ముందు వసూళ్ల పర్వం సాక్షి, రాజమహేంద్రవరం : ఇంటర్ పరీక్షలకు ముందు కొన్ని కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వసూళ్ల పర్వానికి తెరతీశాయి. హాజరు శాతం తగ్గిందన్న పేరుతో పరీక్షకు ఒక్కరోజు ముందు నిబంధనలకు విరుద్ధంగా రూ.2,000 వరకు వసూలు చేసిన వైనం మంగళవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అడిగినంతా కట్టకపోతే హాల్‌టిక్కెట్లు ఇవ్వబోమని చెబుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు డబ్బులు కట్టేస్తున్నారు. హాజరు దోపిడీ ఇలా సాగిస్తున్న కార్పొరేట్ కాలేజీలు ‘విద్యాపన్ను’ పేరిట వసూలు చేస్తున్న విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. సర్వీస్ టాక్స్ అంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల నుంచి రూ.1200 చొప్పున వసూలు చేస్తున్నారు. అదీ హాల్‌టిక్కెట్లు ఇచ్చే ముందు ఈ తంతు కొనసాగిస్తున్నారు. ఇదేమిటీ అని అడిగిన వారికి సర్వీస్ టాక్స్ అంటూ కాలేజీ సిబ్బంది సమాధానమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాపన్ను పేరిట రూ.1200 చెల్లించాలని చెబుతున్నారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులకు, కాలేజీ సిబ్బందికి వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. రాజమహేంద్రవరంలోని కొన్ని కార్పొరేటర్ కాలేజీల్లో విద్యార్థుల నుంచి సర్వీస్ టాక్స్ పేరిట రూ.1200 వసూలు చేస్తున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో హాల్‌టిక్కెట్లు ఇచ్చే ముందు కాలేజీ యాజమాన్యాలు ఈ విధంగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటోంది. పరీక్షలకు ముందు డబ్బుల కోసం పిల్లలను ఇలా వేధించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇంటర్ రెండో ఏడాది పరీక్షలకు హాజరు కావాల్సిన తన కుమార్తెకు హాల్‌టిక్కెట్టు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెట్టిందని, చివరికి రూ.1200 కడితేనే గాని హాల్‌టిక్కెట్టు ఇవ్వలేదని రాజమహేంద్రవరం నగరానికి చెందిన విద్యార్థిని తండ్రి దివ్యాంగుడైన ఎ.తారకేశ్వరరావు వాపోయారు. ఎలాంటి పన్నూ లేదు... విద్యాపన్ను వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయలేదు. అలా ఎవరైనా వసూలు చేస్తున్నట్టయితే విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు మాకు ఫిర్యాదు చేయాలి. అలా చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఫీజుల వసూళ్లకు సంబంధించి ఏవైనా పెండింగ్ ఉంటే టీసీ ఇచ్చే సమయంలో వసూలు చేసుకోవాలని కాలేజీలకు చెప్పాం. హాల్‌టిక్కెట్లు ఇచ్చే సమయంలో ఈ విధంగా చేసి విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దని స్పష్టం చేశాం. – ఎ.వెంకటేష్, ఆర్ఐవో, రాజమహేంద్రవరం. -
ఇలా మొదలయ్యాయి
ఇంటర్ పరీక్షలు ప్రశాంతం ఫస్టియర్ పరీక్షలకు 36,108 మంది హాజరు 1,845 మంది గైర్హాజరు ఏలూరు సిటీ : ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా మొదలయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు ఉత్సాహంగా కేంద్రాలకు పయనమయ్యారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, 8గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు, బంధువులు విద్యార్థుల వెంట రావడంతో పరీక్షా కేంద్రాల వద్ద కోలాహలం కనిపించింది. మొదటి రోజు తెలుగు, సంస్కృతం, హిందీ పేపర్1 పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 104 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 37,953 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా, 1,845 మంది గైర్హాజరయ్యారు. 36,108 మంది పరీక్షలు రాశారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎస్ఏ ఖాదర్ మాట్లాడుతూ జిల్లాలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్నిచర్యలు తీసుకున్నామని తెలిపారు. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. 4 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 5 సిట్టింగ్ స్క్వాడ్స్‌ను నియమించి ఎప్పటికప్పుడు తనిఖీ చేపట్టేలా చూస్తున్నామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కాపీ కొడితే నాలుగేళ్లు డిబార్ విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే నాలుగేళ్లపాటు పరీక్షలు రాయకుండా డిబార్ చేయాలంటూ ఆదేశాలు అందాయని ఆర్ఐవో తెలిపారు. -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
– 96.96 శాతం హాజరు – గైర్హాజరైన వారిలో సైన్స్ విద్యార్థులే అధికం కర్నూలు సిటీ: బుధవారం నుంచి ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజున తెలుగు, హిందీ, సంస్కృతం పరీక్షలు జరిగాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరే సమయంపై ముందు నుంచే అధికారులు ప్రచారం కల్పించ పోవడంతో అక్కడక్కడ కొంత ఆలస్యంగా కేంద్రాలకు చేరుకున్నారు. అదే విధంగా మరి కొన్న చోట్ల పరీక్ష సమయానికి చేరుకోలేక పోయిన వారికి అనుమతించక పోవడంతో విద్యార్థులు కన్నీళ్ళు పెట్టుకుంటు వెనుదిరిగారు. 1213 మంది విద్యార్థులు గైర్హాజరు : జిల్లాలో ఉన్న 218 జూనియర్ కాలేజీలకు చెందిన మొత్తం 39963 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్లు వచ్చాయి. వివిధ కారణాల వల్ల 38750 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 1213 మంది పరీక్షలకు హాజరు కాలేకపోయినట్లు ఆర్ఐఓ తెలిపారు. మొదటి రోజు జిల్లాలో ఎక్కడ కూడా మాల్ ప్రాక్టిస్ కానీ, కాపీయింగ్ జరుగలేదని అధికారులు పేర్కొన్నారు. హాజరుకానివారిలో సైన్స్ విద్యార్థులే అధికం: నిర్ణీత హాజరు శాతం లేని సైన్స్ విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వక పోవడంతో చాలా మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆర్ట్స్ విద్యార్థులకయితే నిర్ణీత రుసం చెల్లించి పరీక్షలకు హాజరు కావచ్చు. అయితే మంగళవారం బ్యాంకు అధికారుల ధర్నా వల్ల బ్యాంకులు తెరుచుకోలేదు. ఈ కారణంతో మరి కొంతమంది విద్యార్థులు హాల్ టికెట్లు పొందలేకపోవడంతో పరీక్షలు రాయలేకపోయారు. ఈ విషయంపై ముందు నుంచే విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చిరించినా బోర్డు అధికారులు సరైన రీతిలో స్పందించక పోవడం వల్ల చాలా మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేక పోయారని తెలుస్తోంది. నిర్ణీత సమయానికి కేంద్రాలకు...! ఇంటర్ బోర్డు అధికారులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించిన మేరకు కేంద్రాలకు చేరుకున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రమే కొంత ఆలస్యంగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. మరికొన్ని చోట్ల నిర్ణీత సమయానికి చేరుకోలేక పోయారని వెనిక్కి పంపించారు. ఆర్ఐఓ వై.పరమేశ్వరరెడ్డి నగరంలోని వాసవి, కోల్స్, అమరావతి జూనియర్ కాలేజీలను తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ... నంద్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ పరిశీలించారు. పరీక్షల నిర్వహణపై కళాశాల ప్రిన్సిపల్ సునీతను అడిగి తెలుసుకున్నారు. -
ఇంటర్ విద్యార్థి దుర్మరణం
కోసిగి: ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి దుర్మరణం చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. డి.బెళగల్ గ్రామానికి చెందిన కిష్టప్ప, తాయమ్మఽ దంపతుల కుమారుడు రాజు(17) కోసిగి జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం ఆటోలో కళాశాలకు బయలుదేరాడు. మరో పది నిమిషాల్లో ఆటో పట్టణంలోకి చేరుకుటుండగా హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో కుక్క అడ్డు రావడంతో ఆటోడ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థి రాజుతో పాటు మరో విద్యార్థి రామాంజినేయులు, ప్రయాణికులు మూకయ్యశెట్టి, గర్భిణి మహాలక్ష్మి, డ్రైవర్ వీరేష్, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించగా రాజు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రామాంజనేయులు పరిస్థితి విషమంగా ఉంది. రాజు తండ్రి కిష్టప్ప నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి తాయమ్మ వికలాంగురాలు. ఒక చెల్లెలు ఉంది. సెలవుల్లో రాజు వ్యవసాయ పనులు చేస్తూ చదువులోనూ రాణించేవాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతితో తల్లి రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది.ఽ సమాచారం అందుకున్న కళాశాల విద్యార్థులు, సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని సంతాపం ప్రకటించారు. విద్యార్థి మృతితో కళాశాలకు, పాఠశాలకు ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాసులు సెలవు ప్రకటించారు. ఎస్ఐ ఇంతియాజ్ బాషా సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
జబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్స్
– నేటి నుంచి ప్రారంభం కర్నూలు(సిటీ): ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల్లో జబ్లింగ్ విధానాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన కార్పొరేట్ల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆరేళ్ల తర్వాత ఎట్టకేలకు జబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఈనెల 22వరకు జిల్లాలో మొత్తం 93 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు 20,734 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. -
రేపటి నుంచి ఇంటర్‌ప్రాక్టికల్స్
ఈ ఏడాది నుంచి జంబ్లింగ్ పరీక్షలకు సర్వసిద్ధం చేసిన జిల్లా ఇంటర్‌బోర్డు అధికారులు జిల్లాలో హాజరుకానున్న 33,594 మంది విద్యార్థులు ఈ ఏడాది నుంచి జంబ్లింగ్ కంబాలచెరువు : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు సర్వసిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న ఈ పరీక్షలకు జిల్లా ఇంటర్‌బోర్డు అధికారులు సమయాత్తమయ్యారు. ఇంటర్ విద్యాశాఖ అధికారులు టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 96 కళాశాలల్లో.. ఈనెల మూడోతేదీ నుంచి 22 వరకు ఈ పరీక్షలు జిల్లావ్యాప్తంగా మొత్తం 96 కళాశాలల్లో జరగనున్నాయి. వీటికి మొత్తం 33,594 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం తొమ్మిది నుంచి మ«ధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు సెషన్లుగా వీటిని నిర్వహించనున్నారు. నాలుగు స్పెల్స్‌లో జరిగే ఈ పరీక్షలు ప్రథమ స్పెల్‌గా 43 కళాశాలలు, రెండో స్పెల్‌లో 48 కళాశాలలు, మూడో స్పెల్‌లో 51 కళాశాలలు, నాలుగో స్పెల్స్‌లో 43 కళాశాలల్లో జరగనున్నాయి. సైన్స్ విద్యార్థులకు బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో, ఒకేషనల్ విద్యార్థులకు 19 రకాల సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రైవేట్ కళాశాలల్లో జరిగే ప్రాక్టికల్స్‌కి 32 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు. ఈ ఏడాది నుంచి జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు. అలాగే నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్స్, కలెక్టర్‌తో ఉండే హైపవర్ కమిటీలో అధికారిగా జిల్లా ఆర్‌ఐవోగా పనిచేసిన వెళ్లిన కేపీ దాశరథి వ్యహరించనున్నారు. వీరితో పాటు రెవెన్యూ స్క్వాడ్, పోలీస్‌శాఖ ఉంటుంది. ఆర్జేడీ ఎ.అన్నమ్మ, ఆర్ఐఓ ఎ.వెంకటేష్, డీవీఈవో కె.హెప్సీరాణి ఆధర్యంలో ఈనెల 24న సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాక్టికల్స్, మార్చిలో జరిగే పరీక్షలకు సంబంధించి ఎటువంటి అవాంతరాలు రాకుండా ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్‌శాఖ వి««ధులపై ఆ శాఖాధికారితో, ఆరోగ్య సమస్యలపై మెడికల్ అధికారులతో, పరీక్ష సమయంలో విద్యుత్ అవాంతరాలు రాకుండా విద్యుత్ అధికారులతో సమీక్షించారు. పరీక్షా కేంద్రంలోకి విధులు నిర్వర్తించే డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో సహా ఎవరూ సెల్‌ఫోన్ వాడరాదని ఉత్తర్వులు జారీచేశారు. -
నారాయణ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
కర్నూలు(అర్బన్): కర్నూలు నగర శివారు నన్నూరులో సమీపంలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న రఫీక్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. డోన్ పట్టణం కొత్తపేటకు చెందిన లాల్‌బాషాæ కుమారుడైన రఫీక్ గత సంవత్సరం శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంపీసీ కోర్సులో చదువుతూ మధ్యలో ఆపేశాడు. తిరిగి ఈ విద్యా సంవత్సరం నన్నూరులోని నారాయణ కళాశాలలో చేరి బైపీసీ గ్రూపు తీసుకున్నాడు. ఇటీవల జరిగిన ప్రీఫైనల్ పరీక్షల్లో రెండు సబ్జెక్టుల్లో మార్కులు తక్కువ రావడంతో మనస్థాపానికి లోనయ్యాడు. కళాశాల యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో మంగళవారం రాత్రి హెయిర్ డయ్యర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కళాశాల సిబ్బంది వెంటనే అతన్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం కోలుకుంటున్నాడు. -
‘జంబ్లింగ్’ రద్దు కోసం ధర్నా
కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్ కాలేజీ విద్యార్థులకు ప్రాక్టికల్‌లో అమలు చేస్తున్న జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలని ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం డిమాండ్ చేసింది. సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో రాజ్‌విహార్ సెంటర్ నుంచి పెద్దపార్కు, పాత కంట్రోల్ రూం మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ఐఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు శేషిరెడ్డి, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్‌లు మాట్లాడుతూ.. ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మొట్ట మొదటి సారిగా అమలు చేస్తున్న జంబ్లింగ్ విధానంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలన్నీ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయన్నారు. అనంతరం ఆర్ఐఓ వై.పరమేశ్వరరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు రామచంద్రారెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జంబ్లింగ్‌లో గ్యాంబ్లింగ్
- జంబ్లింగ్‌లో ‘కార్పొరేట్’ మాయ - సెంటర్లను మార్చుకున్న కార్పొరేట్ కాలేజీలు? - ఇంటర్ బోర్డులో చక్రం తిప్పిన వైనం - వ్యతిరేకిస్తున్న ప్రైవేట్ కళాశాలలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: రెండు కార్పొరేట్ జూనియర్ కళాశాలలు..పరస్పర అవగాహన..ఫలితం..జంబ్లింగ్ ప్రాక్టికల్ పరీక్షలు అపహాస్యం. ఆ కాలేజీలోని విద్యార్థులు ఈ కాలేజీ...ఈ కాలేజీలోని విద్యార్థులు ఆ కాలేజీలో పరీక్ష రాసే ఒప్పదం.. జంబ్లింగ్ పేరుతో పరీక్ష సెంటర్ల ఏర్పాటులో జరిగిన అక్రమాలు ఇవి. ఇందుకు జిల్లా కేంద్రమైన కర్నూలు నగరమే సాక్షి. కుడిఎడమైతే పొరపాటులేదోయ్ అనుకున్నారో ఏమో కానీ అధికారులు కూడా జంబ్లింగ్ విధానమని మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జంబ్లింగ్ పేరుతో జరుగుతున్న ఈ మొత్తం నాటకం కేవలం రెండు కాలేజీలకే మేలు చేసేందుకే అన్న ఆరోపణలూ తాజాగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జంబ్లింగ్ అసలు స్ఫూర్తితో ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మరోవైపు తమను నష్టం చేసేందుకే ఈ జంబ్లింగ్ నాటకం తెరమీదకు వచ్చిందనే ప్రైవేటు కాలేజీలు మండిపడుతున్నాయి. వ్యతిరేకిస్తున్న ప్రైవేట్ కాలేజీలు...! కార్పొరేట్ కాలేజీలు ఆడుతున్న నాటకంలో విద్యార్థులతో పాటు సాధారణ ప్రైవేటు కాలేజీలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. అసలు ప్రాక్టికల్స్ పరీక్షలకు జంబ్లింగ్ విధానం దేశంలో ఎక్కడా లేదని వాదిస్తున్నాయి. ఇది కార్పొరేట్ కాలేజీలు ఆడుతున్న నాటకం అని మండిపడుతున్నాయి. రెండు కార్పొరేట్ కాలేజీలు సెంటర్లను తమకిష్టం వచ్చినట్టుగా కేటాయించుకుని....తమ విద్యార్థులను సమిధలు చేస్తున్నాయని వాపోతున్నాయి. ఇంటర్ ఫలితాల్లో ఈ రెండు కార్పొరేట్ కాలేజీలను కాదని తమ విద్యార్థులకు ర్యాంకులు వస్తుండటంతో ఈ విధంగా కేవలం వారు మాత్రమే లాభపడి... తమ విద్యార్థులను మోసం చేస్తున్నాయనేది సాధారణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల వాదనగా ఉంది. అయితే, అంతిమంగా విద్యార్థులు మాత్రమే ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోతున్నారు. విద్యార్థులే సమిధలు.. వాస్తవానికి ఇటు జంబ్లింగ్ విధానమైనా... సాధారణ విధానంలోనైనా విద్యార్థులే ఇబ్బందుల పాలవుతున్నారు. అటు కార్పొరేట్ కాలేజీల్లోనూ ఇటు ప్రైవేటు కాలేజీల్లోనూ ప్రాక్టికల్స్ పరీక్షలు జరగడం లేదు. వాస్తవానికి ప్రాక్టికల్స్ పరీక్షల్లో వచ్చే సబ్జెక్టును ప్రయోగాత్మకంగా చేసి చూస్తే థియరీ పరీక్షలు రాసే సమయంలో వారికి ఉపయుక్తంగా ఉంటుంది. అయితే, ఎక్కడా కూడా ప్రాక్టికల్స్ పరీక్షలు జరగడం లేదు. ఫలితంగా తీరా పరీక్ష సమయానికి వచ్చే సరికి విద్యార్థులు తెల్లమొహం వేయాల్సి వస్తోంది. దీంతో దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని కాలేజీ యాజమాన్యాలు పరీక్ష పాస్ కావాలంటే సబ్జెక్టుకు ఇంత మొత్తం ఇవ్వాలని వసూలు చేస్తున్నాయి. ఈ మొత్తాన్ని పరీక్షను పర్యవేక్షించేందుకు వచ్చే ఇన్విజిలేటర్లకు ఇస్తున్నామని బహిరంగంగానే విద్యార్థులకు చెబుతున్నాయి. మీకు 30కి 30 మార్కులు ఏమీ చేయకపోయినా రావాలంటే సబ్జెక్టుకు కొంత మొత్తం ఇవ్వాలని యాజమాన్యాలు ఖరాఖండిగా తేల్చిచెబుతున్నాయి. అంటే కాలేజీలు చేస్తున్న తప్పునకు విద్యార్థులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందన్నమాట. కాలేజీల కేటాయింపు అధికారం బోర్డుదే: వై. పరమేశ్వరరెడ్డి, ఆర్ఐవో జంబ్లింగ్ విధానంలో పరీక్షా కేంద్రాలను కేటాయించే అధికారం ఇంటర్మీడియట్ బోర్డుకు ఉంటుంది. ఆ కాలేజీ విద్యార్థులు ఈ కాలేజీలో.. ఈ కాలేజీ విద్యార్థులు ఆ కాలేజీలో పడ్డారన్న సమాచారం లేదు. అయితే, జంబ్లింగ్ విధానంలో ఏ కాలేజీ విద్యార్థులు అదే కాలేజీలో మాత్రం పరీక్ష రాసేందుకు అవకాశం ఉండదు. -
నేడు ‘నైతిక’ పరీక్ష
కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల మేరకు శనివారం ఇంటర్ విద్యార్థులకు నైతిక, మానవ విలువల పరీక్ష నిర్వహించనున్నట్లు డీవీఈఓ టీవీ సుబ్రమణ్యేశ్వరరావు, ఆర్ఐఓ వై.పరమేశ్వరరెడ్డిలు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నైతిక పరీక్ష, ఈ నెల31వ తేదీన పర్యావరణ విద్య పరీక్ష నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. -
పరీక్షా కాలం
ఇంటర్మీడియెట్‌లో ప్రాక్టికల్స్‌కూ జంబ్లిగ్ విధానం ఫిబ్రవరి 3నుంచి ప్రాక్టికల్స్ మార్చి 1నుంచి పబ్లిక్ పరీక్షలు ఏలూరు సిటీ : ఇంటర్మీడియెట్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. తొలిసారిగా ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్ విధానంలో జరగనున్నాయి. సంక్రాంతి సెలవులు ముగిశాక.. పక్షం రోజుల్లోనే ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు మొదలవుతాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లోని సైన్స్ ల్యాబ్‌లను సందర్శించి.. అక్కడి పరిస్థితులను ముందుగానే పరిశీలించుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఈనెల 28న ఎథిక్స్ అండ్ హ్యుమన్ వేల్యూస్, 31న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. 21,925 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 3నుంచి 22వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 61 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రభుత్వ కాలేజీల్లో 29, ఎయిడెడ్ కాలేజీల్లో 11, ప్రైవేట్ విద్యాసంస్థల్లో 21 కేంద్రాలు ఉన్నాయి. ఉదయం 9నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2నుంచి 5 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. బైపీసీ విద్యార్థులు 4,662 మంది, ఎంపీసీ విద్యార్థులు 17,263 మంది కలిపి మొత్తం 21,925 మంది ప్రాక్టికల్స్‌కు హాజరు కావాల్సి ఉంది. పబ్లిక్ పరీక్షలకు 104 కేంద్రాలు : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను మార్చి 1నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఉదయం 9నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 104 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో ప్రభుత్వ కాలేజీలు 29, ఎయిడెడ్ కళాశాలలు 14, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలు 3, ప్రైవేట్ విద్యాసంస్థలు 58 ఉన్నాయి. ఫస్టియర్ విద్యార్థుల్లో జనరల్ 33,499 మంది, ఒకేషనల్ విద్యార్థులు 4,011 మంది, సెకండ్ ఇంటర్లో జనరల్ విద్యార్థులు 32,211 మంది, ఒకేషనల్ విద్యార్థులు 3,516 మంది పరీక్షలు రాయాల్సి ఉంది. జిల్లాలో 194 జూనియర్ కాలేజీలు, 60 ఒకేషనల్ కళాశాలలు ఉన్నాయి. పరీక్షలకు అంతా సిద్ధం ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్షా కేంద్రాలు ఉన్న కళాశాలల ప్రిన్సిపల్స్ ల్యాబ్‌లను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశాం. విద్యార్థులు సైన్సు ల్యాబ్‌లను ముందుగానే పరిశీలించుకునే అవకాశం కల్పించాం. ఈనెల 19న కలెక్టరేట్లో ఇంటర్ విద్యామండలి కమిషనర్‌తో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లాలోని 61 పరీక్షా కేంద్రాల ప్రిన్సిపల్స్ విధిగా హాజరుకావాలి. ఎస్ఏ ఖాదర్, ఆర్ఐవో -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్ : చదువులో వెనుకబడిన ఇంటర్ విద్యార్థి మెడిసిన్ సీటు వస్తుందో రాదోనన్న భయాందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలో నేవీలో పనిచేస్తున్న గోపాల్ కుమారుడు చక్రవర్తి (17) అనంతపురంలోని హౌసింగ్‌బోర్డులో ఉంటూ కార్పొరేట్ కళాశాలలో బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మొదటి సంవత్సరంలో మంచి మార్కులతో పాసైన ఇతను రెండో సంవత్సరంలో కొంత వెనుకబడినట్లు కళాశాల నుంచి పలుమార్లు కుటుంబ సభ్యులకు ఫోన్‌ద్వారా సమాచారమందించారు. రెండో సంవత్సరంలో మార్కులు తక్కువ వస్తే మెడిసిన్‌లో సీటు వస్తుందో రాదో అని తల్లితో చెప్పి బాధపడేవాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన చక్రవర్తి సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ సీఐ రాఘవన్, ఎస్ఐ రంగయాదవ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజనాసుపత్రికి తరలించారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
దివిలి (పెద్దాపురం) : ఆ మనస్సుకు ఏ కష్టమొచ్చిందో, ఏమో.. ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దాపురం మండలం దివిలి బీఎస్ఆర్ కళాశాలలో మొల్లేరు మల్లవరానికి చెందిన టేకుమూడి సునీత(17) చంద్రమాంపల్లిలోని తన పిన్ని గుబ్బల లక్ష్మి ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని స్వగ్రామమైన మల్లవరానికి పంపించేశారు. బుధవారం సాయంత్రానికి ఈ విషయం బయటకు పొక్కడంతో ఎస్సై వై.సతీష్ చంద్రమాంపల్లిలోని మృతురాలి పిన్ని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. కళాశాల యాజమాన్యం బుధవారం సెలవు ప్రకటించింది. -
మేల్కొంటున్నారు
ప్రయోగాలపై పట్టు సాధిస్తున్న విద్యార్థులు జంబ్లింగ్ విధానం ఖరారుతో ముమ్మర సాధన బాలాజీచెరువు(కాకినాడ) :ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ప్రయోగ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించనున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో సైన్స్ విద్యార్థులు ప్రయోగంపై పట్టు సాధించి మంచి మార్కులు కైవసం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు. ఉన్నది రెండు నెలలే.. ప్రయోగ పరీక్షలు 2017 ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. ఇటీవల వరకు ఈ పరీక్షలు విద్యార్థులు ఏ కళాశాలలో చదువుతున్నారో! అక్కడే జరిగేవి. ఈ విధానం వల్ల కొంత మంది విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిం చాయి. చాలా ప్రైవేట్ కళాశాల్లో ప్రయోగశాలలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకుండా తూతూమంతంగా విద్యార్థులను తయారు చేస్తున్నారనే విమర్శలు వినిపించాయి. పరీక్షల నిర్వహణకు వచ్చే వారిని ప్రసన్నం చేసుకుని ఎక్కువ మా ర్కులు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు వేస్తున్నారనే అపవా దూ ఉంది. ఈ నేపథ్యలో ప్రభుత్వం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్‌కు జంబ్లింగ్ విధానం ప్రకటిస్తూనే పరీక్షలు దగ్గరికి వచ్చే సరికి వాయిదా వేస్తూ వచ్చారు. ఈ సారి మాత్రం ముందుగానే కొత్త విధానంలో ప్రయోగ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేయడంతో అన్ని కళాశాలలు ఈ ప్రాక్టికల్స్‌పై దృష్టిసారించాయి. ఏంపీసీ విద్యార్థులు భౌతిక, రసాయనశాస్రా్తలు, బైపీసీ విద్యార్థులు రసాయన, భౌతిక శాస్రా్తలతో పాటు వృక్ష, జంతు శాస్రా్తల ప్రయోగాలపై పట్టు సాధిస్తున్నారు. సమయం రెండు నెలలే ఉండడంతో విద్యార్థులు రికార్డులు, రసాయనాల విశ్లేషణ, కణజాలల గుర్తింపు, స్లైడ్ చూడటం, బొమ్మల తర్ఫీదు వంటి పనుల్లో బిజీగా ఉన్నారు. అ«లాగే అధ్యాపకులు విద్యార్థులను జంబ్లింగ్ విధానానికి అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు. జంబ్లింగ్ ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు పూర్తి ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ జంబ్లింగ్ విధానంలోనే జరుగుతాయి. విద్యార్థులకు ఏవిధమైన అసౌకర్యం లేకుండా ల్యాబ్‌లలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పరీక్ష కేంద్రాల నిర్వాహకులను ఆదేశించాం. – ఎం.వేంకటేష్, ఇంటర్మీడియట్ కళాశాలల తనిఖీ అధికారి, రాజమండ్రి -
ఇంటర్ పరీక్షలకు దరఖాస్తులు
ఏలూరు సిటీ : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాసేందుకు దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించేందుకు నవంబర్ 1తేదీ వరకు అపరాద రుసుము లేకుండా అవకాశం ఉందని ఇంటర్ విద్యమండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎస్ఏ «ఖాదర్ మంగళవారం తెలిపారు. రూ.120ల అపరాధ రుసుముతో నవంబర్ 10తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.500ల అపరాధ రుసుముతో 17తేదీ వరకు, రూ.వెయ్యి అపరాద రుసుముతో 28తేదీ వరకు, రూ.2వేలు అపరాద రుసుముతో డిసెంబర్ 21తేదీ వరకు, రూ.3వేలు అపరాద రుసుముతో డిసెంబర్ 31తేదీ వరకు, రూ.5వేలు అపరాధ రుసుముతో 2017 జనవరి 18తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజులు చెల్లించాలని ఆయన కోరారు