కదిరి కళాశాలలో కలకలం
- ఇంటర్ విద్యార్థిపై బ్లేడ్‌తో దాడి
- బైక్‌పై పరారైన దుండగులు
కదిరిలోని బసిరెడ్డి జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిపై దుండగులు బ్లేడ్‌తో దాడిచేసి గాయపరచడం కలకలం రేగింది. వివరాల్లోకెళితే.. మూర్తిపల్లికి చెందిన నరసింహనాయక్ సీఈసీ ఫస్టియర్ చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం కళాశాల వెలుపల మూత్ర విసర్జనకు వెళ్లాడ. ముఖానికి మాస్కు ధరించిన ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి వెంకటేష్ ఎక్కడ..? అని అడిగారు. నా సోదరుడే ఏంటి.. అని నరసింహనాయక్ అనడంతో ఆ వ్యక్తులు బ్లేడుతో అతని కుడి చేతికి, అరచేతికి, కుడికాలికి విచక్షణారహితంగా కోసి బైక్‌పై వెళ్లిపోయారు. రక్త గాయాలతో విద్యార్థి గట్టిగా కేకలు వేయగా తోటి విద్యార్థులు పరుగున వచ్చారు. ప్రిన్సిపల్ సునీల్‌కుమార్‌రెడ్డి, తోటి విద్యార్థులు వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు రాజేంద్ర ఆస్పత్రికి చేరుకుని విద్యార్థిని పరామర్శించారు. కళాశాల ఆవరణలోనే ఇలాంటి దురాగతాలు జరగడం దురదృష్టకర మన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల మధ్య తలెత్తిన విభేదాలతో దాడి జరిగిందా.. లేక ఇంకేదైనా కారణం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.