విద్యార్థి ఉసురు తీసిన విద్యుత్ తీగ
పెనుకొండ రూరల్ : తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగ ఓ విద్యార్థి ఉసురు తీసింది. ఎస్‌ఐ లింగన్న కథనం మేరకు.. మునిమడుగుకు చెందిన గోపాల్, గంగమ్మ దంపతుల పెద్ద కుమారుడు నవశంకరనాయుడు(21) హిందూపురంలో ఐటీఐ చేస్తున్నాడు. సోమవారం ఉదయం గ్రామంలో బహిర్భూమికోసం బయల్దేరాడు. అయితే అప్పటికే తక్కువ ఎత్తులో వేలాడుతున్న సర్వీసు వైరు అతని తలకు తగిలింది. అంతే తలకు బలమైన గాయమైంది. బంధువులు హుటాహుటిన ఆటోలో పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే బీకే పార్థసారథి విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.