విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి
Published Mon, Jan 30 2017 11:13 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
బొల్లవరం (ముప్పాళ్ళ) : మోటారుకు విద్యుత్ సరఫరా కావటంతో నీళ్లు పడుతున్న విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలోని బొల్లవరం గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన కాలే వీరేంద్ర(10) స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చి మోటార్‌తో నీళ్లు పడుతుండగా షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. కూలి పనులకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు ఈశ్వరరావు, శివకుమారిలు కొడుకు విగతజీవిగా మారడంతో భోరున విలపించారు.
Advertisement
Advertisement