ఇంటర్ విద్యార్థి దుర్మరణం
Published Mon, Feb 6 2017 11:51 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
కోసిగి: ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి దుర్మరణం చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. డి.బెళగల్ గ్రామానికి చెందిన కిష్టప్ప, తాయమ్మఽ దంపతుల కుమారుడు రాజు(17) కోసిగి జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం ఆటోలో కళాశాలకు బయలుదేరాడు. మరో పది నిమిషాల్లో ఆటో పట్టణంలోకి చేరుకుటుండగా హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో కుక్క అడ్డు రావడంతో ఆటోడ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థి రాజుతో పాటు మరో విద్యార్థి రామాంజినేయులు, ప్రయాణికులు మూకయ్యశెట్టి, గర్భిణి మహాలక్ష్మి, డ్రైవర్ వీరేష్, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించగా రాజు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రామాంజనేయులు పరిస్థితి విషమంగా ఉంది. రాజు తండ్రి కిష్టప్ప నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి తాయమ్మ వికలాంగురాలు. ఒక చెల్లెలు ఉంది. సెలవుల్లో రాజు వ్యవసాయ పనులు చేస్తూ చదువులోనూ రాణించేవాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతితో తల్లి రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది.ఽ సమాచారం అందుకున్న కళాశాల విద్యార్థులు, సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని సంతాపం ప్రకటించారు. విద్యార్థి మృతితో కళాశాలకు, పాఠశాలకు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాసులు సెలవు ప్రకటించారు. ఎస్‌ఐ ఇంతియాజ్ బాషా సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement