అబిడ్స్ చౌరస్తాలో స్కూల్ ఆటో బోల్తా..
Published Sat, Jul 1 2017 11:24 AM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM
హైదరాబాద్: స్కూలు పిల్లలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో అందులో ఉన్న ఐదుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని అబిడ్స్ జీపీఓ చౌరస్తా వద్ద శనివారం ఉదయం చోటు చేసుకుంది. పాఠశాలకు ఆలస్యం అవుతుందని ఆటో డ్రైవర్ వేగంగా నడుపుతుండటంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇది గుర్తించిన పోలీసులు చిన్నారులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement