Abids
-
హైదరాబాద్ : అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)
-
పాప సేఫ్ ... అబిడ్స్ కిడ్నాప్ కథ సుఖాంతం
-
అబిడ్స్ పీఎస్ వద్ద టెన్షన్.. కిడ్నాపర్‌పై పాప బంధువుల దాడి
సాక్షి, అబిడ్స్: హైదరాబాద్‌లోని అబిడ్స్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆరేళ్ల పాపను కిడ్నాప్ కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం, పాప కుటుంబ సభ్యులు స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో నిందితుడిని చితకబాదారు. దీంతో, స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.వివరాల ప్రకారం.. అబిడ్స్‌లో కిడ్నాప్‌నకు గురైన ఒకటో తరగతి బాలిక ప్రగతి సురక్షితంగా ఉంది. శనివారం సాయంత్రం అబిడ్స్‌లోని కట్టెలమండిలో ఆడుకుంటున్న చిన్నారిని ఎండీ బిలాల్(కిడ్నాపర్) చాక్లెట్ ఇచ్చి ఆటోలో తీసుకెళ్లాడు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐదు బృందాలతో గాలించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇనుముల నర్వలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.కాగా, కిడ్నాపర్ బిలాల్‌ను బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును చేధించారు. చిన్నారిని అబిడ్స్ పీఎస్‌కు పోలీసులు తీసుకువచ్చారు. మరోవైపు నిందితుడిని కూడా పోలీసులు పీఎస్‌కు తీసుకొచ్చారు. ఆ సమయంలో చిన్నారి కుటుంబసభ్యులు, బంధువులు అతడిపై దాడి చేశారు. పోలీసులు అతికష్టంమీద నిందితుడిని పీఎస్ లోపలికి తీసుకెళ్లారు. దీంతో, అక్కడ ఉద్రికత్తకర పరిస్థితులు నెలకొన్నాయి. -
Hyderabad: ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్
అబిడ్స్: ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్‌కు గురైన ఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బేగంబజార్ ఛత్రి ప్రాంతానికి చెందిన ప్రియాంక తన సోదరుడి కుమార్తె ప్రగతిని తీసుకొని శనివారం మధ్యాహ్నం కట్టెలమండిలోని పుట్టింటికి వచ్చింది. కాసేపటి తర్వాత ప్రగతి కట్టెలమండి ముత్యాలమ్మ ఆలయం ముందు ఆడుకుంటాన్నంటూ బయటకు వెళ్లింది. ఆమెతో పాటు ప్రియాంక సోదరి కుమారుడైన రుత్విక్ కూడా వెళ్లాడు. రుత్విక్ ఒక్కడే ఇంటికి రాగా ప్రగతి కనిపించలేదు. వెంటనే కుటుంబ సభ్యులు బాలిక కోసం పరిసరాల్లో గాలించి అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందుగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు రాత్రి వేళ బాలిక కిడ్నాప్ అయ్యిందని గుర్తించారు.ప్రగతిని ఓ గుర్తుతెలియని వ్యక్తి నడుచుకుంటూ వెంట తీసుకెళ్తున్న సీసీ ఫుటేజీలో రికార్డు అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
కలకత్తా యువతులతో వ్యభిచారం
అబిడ్స్: కలకత్తా నుంచి యువతులను తీసుకువచ్చి అబిడ్స్ ఫార్చూన్ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులు, యువతులు, విటులను నగర టాస్‌్కఫోర్స్, అబిడ్స్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. హైటెక్ తరహాలో అందరి కళ్లుగప్పి వ్యభిచారం నిర్వహిస్తున్న వారందరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అఖిలేష్ (36) (అఖిలేష్ ఫహిల్వాన్) అనే వ్యక్తి అబిడ్స్‌లో ఫార్చూన్ లాడ్జిని కొనసాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా కలకత్తా నుంచి యువతులను తీసుకువచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. సమాచారం అందుకున్న నగర సెంట్రల్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు, అబిడ్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. లాడ్జి యజమాని అఖిలే‹Ù, మేనేజర్ రఘుపతి, 16 మంది యువతులు, 6 మంది విటులను అరెస్టు చేశారు. వీరిలో యువతులను తుక్కుగూడలోని రెస్క్యూహోమ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ నర్సింహరాజు తెలిపారు. మిగతా వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసును అబిడ్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అబిడ్స్ వ్యభిచారం కేసు.. రాంనగర్ అఖిల్ పహిల్వాన్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం ముఠా గుట్టు రట్టైంది. ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ ముఠా పట్టుబడింది. రామ్‌నగర్‌కు చెందిన అఖిల్ పహిల్వాన్ ఆధ్వర్యంలో ఈ దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో 16 మంది అమ్మాయిలు, ఆరుగురు కస్టమర్లు, ఇద్దరు ఆర్గనైజర్లు పట్టుబడ్డారు. వారి నుంచి 22 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి ఉద్యోగాల పేరుతో బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం. రామ్‌నగర్ అఖిల్ పహల్వాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. రాంనగర్ అఖిల్ వ్యభిచారం కేసు పోలీసుల దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అఖిలేష్ పూర్వ ట్రాక్ రికార్డ్లను పోలీసులు బయటికి తీయగా.. అతడి మొబైల్లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు. అఖిల్ రోజుకి 20 నుంచి 30 కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు తేలింది. పశ్చిమబెంగాల్ నుంచి 16 మంది అమ్మాయిలను ఫార్చ్యూన్ హోటల్లో 25 రోజులుగా వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వకుండా 25 రోజులుగా అమ్మాయిలను హోటల్లో ఉంచిన అఖిల్.. ఈ 25 గదుల్లో 16 రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నట్లు విచారణలో తేలింది. సినీ ప్రముఖులకు అమ్మాయిలను సరాఫరా చేస్తున్నట్లు అఖిల్‌పై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సలువడి అఖిలేష్, పక్కల రఘుపతి, అభిషేక్ బాటి, కేశవ్ వ్యాస్, అబ్దుల్ ఖలీద్, సంతోష్ అరెస్ట్ చేసి లోతుగా విచారిస్తున్నారు. చదవండి: పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తా అప్పగింతకు కోర్టు ఓకే -
హైదరాబాద్ అబిడ్స్‌లో ఐఫోన్స్ పేరుతో భారీ మోసం
-
బిర్యానీ గొడవ: కస్టమర్లపై దాడి.. రాజాసింగ్ సీరియస్
హైదరాబాద్: హైదరాబాద్‌లోని అబిడ్స్ గ్రాండ్ హోటల్లో బిర్యానీ విషయంలో గొడవ కాస్త పరస్పర దాడి దారి తీసింది. మటన్ బిర్యానీ సరిగా ఉడకలేదని.. డబ్బులు చెల్లించమని హోటల్ వెయిటర్లతో వినియోగదారులు చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెద్దది కావటంతో వెయిటర్లు వినియోగదారులపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది యువతీ యువకులకు గాయాలై ఆస్పత్రి పాలయ్యారు. ఫిర్యాదు రావడంతో.. 10మంది వెయిటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు హోటల్ యజమానిపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కస్టమర్లపై దాడి చేసిన ముగ్గురు వెయిటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. ధూల్‌పేటకు చెందిన కస్టమర్లపై దాడి చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాండ్ హోటల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: బైరి నరేష్ అడ్డగింత.. వాహనం ఢీ కొట్టి అయ్యప్ప భక్తుడికి గాయాలు -
ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థులతో సందడి చేసిన గీతా మాధురి (ఫోటోలు)
-
అబిడ్స్‌లో రాంజీ గోండ్ మ్యూజియం
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ పోరాట యోధుడు రాంజీగోండ్ పేరిట ప్రత్యేకంగా ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున అబిడ్స్‌లోని గిరిజన సంక్షేమశాఖ స్థలంలో కేంద్రమంత్రులు అర్జున్‌ముండా, జి.కిషన్‌రెడ్డిల చేతుల మీదుగా సోమవారం శంకుస్థాపన జరిపేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఏర్పాట్లు చేసింది. రూ.35 కోట్లపైగానే వ్యయం రాంజీగోండ్ మ్యూజియం ఏర్పాటుకు రూ.35 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభు త్వం రూ.10 కోట్లు విడుదల చేసింది. మరిన్ని నిధులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంది. రూ.10 కోట్లు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా అడుగు ముందుకు పడలేదు. మొదట్లో బాపూఘాట్ వద్ద మ్యూజియం ఏర్పాటు చేయాలని భావించారు. కానీ భూ సమస్య కారణంగా ఆదిలోనే ఆగిపోయింది. దీంతో అబిడ్స్‌లో ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మ్యూజియంలో ప్రధానంగా గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల వివరాలు, చరిత్ర, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి తెస్తారు. గిరిజన సంక్షేమశాఖ పరిధిలో ఈ మ్యూజియం నిర్వహణ ఉంటుంది. దీని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంది. టీసీఆర్టీఐ భవన ప్రారంభోత్సవం కూడా... మాసాబ్‌ట్యాంక్‌లోని దామోదరంసంజీవయ్య సంక్షేమభవన్ ఆవరణలో గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ (టీసీఆర్టీఐ)భవనం నిర్మించారు. దీనికి కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులు విడుదల చేసింది. నాలుగు అంతస్తుల్లో సుమారు 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనానికి కేంద్రం ఇప్పటివరకు రూ.6.5 కోట్లు ఇచ్చినట్టు అధికారులు చెబుతు న్నారు. గిరిజన సంక్షేమశాఖలో టీసీఆర్టీఐ ఒక భాగమే అయినా, కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. సోమ వారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ భవనాన్ని కేంద్రమంత్రులు అర్జున్‌ముండా, జి.కిషన్‌రెడ్డి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. -
దంపతుల మధ్య ‘బ్యూటీ పార్లర్’ చిచ్చు.. భర్త కోరిక తీర్చడానికి ప్రయత్నించి..
సాక్షి, హైదరాబాద్: తనని మోడల్‌గా చూడాలనుకున్న భర్త కోరికను తీర్చడానికి ప్రయత్నం చేసిన ఓ మహిళకు బ్యూటీ పార్లర్ షాక్ ఇచ్చింది. పొడవాటి కురుల కోసం ప్రయత్నించి ఉన్న జుట్టును పొగొట్టుకుంది. అందం కోసం చేసిన ప్రయత్నం విఫలమైంది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ మహిళ అబిడ్స్‌లోని బ్యూటీ పార్లర్‌కి వెళ్లింది. జుట్టును అందంగా చేస్తానని చెప్పిన బ్యూటిషియన్.. ముందుగా మహిళ హెయిర్ కొంచెం కట్ చేసింది. బాధిత మహిళ అభ్యంతరం చెబుతున్నా విన్నకుండా ఏదో హెయిర్ ఆయిల్ కూడా పూసారు. ఇంటికెళ్లిన తర్వాత ఆ మహిళ జుట్టు మొత్తం ఊడిపోయింది. జుట్టు ఊడిపోయిన భార్యను చూసి భర్త షాక్ అయ్యాడు. అందగా కనిపించాలనుకున్న తన భార్యకు వెంట్రుకలు ఊడిపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆలుమగల మధ్య చిచ్చు పెట్టిన బ్యూటీ పార్లర్‌పై బాధితురాలు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊడిపోయిన జుట్టును పట్టుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: భార్యతోనే స్నేహితుడికి వలపు వల..! చివరికి.. బ్యూటీ పార్లర్ బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ, హెయిర్ కలర్ కోసం అబిడ్స్‌లోని న్యూ క్వీన్ బ్యూటీ సెలూన్‌కి వచ్చాను. స్పెషల్ హెయిర్ స్టైల్ చేస్తానని నా హెయిర్ మొత్తం కాలిపోయేలా చేసింది. పార్లర్ నిర్వహకురాలు సొంతంగా తయారు చేసిన హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడతామన్నారు. అది వాడితే పూర్తిగా నా జుట్టు రాలిపోయింది. వాటర్ పెడితే.. దువ్వెనతో దువ్వినా కూడా జుట్టు రాలిపోతుంది. క్వీన్ పార్లర్‌ను వెంటనే సీజ్ చేయాలి’’ అని ఆమె పేర్కొంది. -
అబిడ్స్‌లో బ్యూటీపార్లర్ నిర్వాకం.. ఆయిల్ పెట్టగానే ఊడిపోయిన మొత్తం జుట్టు
సాక్షి, హైదరాబాద్: హెయిర్ కట్ చేయించుకునేందుకు బ్యూటీపార్లర్‌కు వెళ్లిన మహిళకు షాక్ తగిలింది. బ్యూటీషియన్ నిర్వాకంతో ఆ మహిళకు జట్టు ఊడిపోయిన ఘటన అబిడ్స్‌లో జరిగింది. మహిళకు హెయిర్ కట్ చేసి ఆయిల్ పెట్టగానే మొత్తం జుట్టు ఊడిపోయింది. పీఎస్‌లో బాధితురాలి ఫిర్యాదు మేరకు పార్లర్‌పై కేసు నమోదు చేశారు. బ్యూటీ పార్లర్ నిర్వాహకుల నిర్వాకంతో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోడంతో బ్యూటీ పార్లర్ అంటే మహిళలు హడలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫేస్ వ్యాక్స్ చేయించుకున్న మహిళలకు ముఖంపై ఎర్రగా కంది నీటి పొక్కులు రావడం, ఫేస్‌మాస్క్ వికటించి మొహం నల్లగా మారిపోవడం వంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. కొంతమంది బ్యూటీషియన్లకు సరైన అవగాహన లేకపోవడం, నాణ్యమైన మెటీరియల్ వాడకపోవడంతో మహిళలకు సమస్యలు ఎదురవుతున్నాయి. చదవండి: వదినపై అందరూ చూస్తుండగానే... -
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తెల్ల బుల్లెట్ ప్రూఫ్ కారు
అబిడ్స్: తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మొరాయిస్తోందని, నూతన వాహనాన్ని సమకూర్చాలని గత కొద్దిరోజులుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్న విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించింది. ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చింది. ఈ మేరకు సోమవారం పోలీసు శాఖ అధికారులు నూతనంగా కేటాయించిన తెలుపురంగు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయన నివాసానికి తరలించారు. కాగా ఈ విషయమై ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సంప్రదించగా తాను శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉన్నట్లు తెలిపారు. తెలుపు రంగు, 2017 మోడల్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తన ఇంటి వద్ద ఉంచినట్లు తెలిపారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించడం సంతోషకరమని, ప్రస్తుతం కేటాయించిన వాహనం ఏ కండీషన్లో ఉందో చూడాల్సి ఉందన్నారు. -
అబిడ్స్ పోస్టాఫీస్ వద్ద సామూహిక గీతాలాపనలో కేసీఆర్
-
జాతి పండగకు జేజేలు
సాక్షి, హైదరాబాద్: భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నగరంలోని అబిడ్స్ జీపీఓ సర్కిల్ నెహ్రూ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన జరగనుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఉద్యోగులతో పాటు కళాశాల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గోనున్నారు. జీపీఓ సర్కిల్ వద్ద స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాలు ప్రదర్శించనున్నారు. రంగురంగుల బ్యానర్లు, గీతాలాపన చేయడానికి మైక్ ఏర్పాట్లు చేశారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకంతో కళాకారుడి ఆనంద హేల సామూహిక గీతాలాపన ఏర్పాట్లను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జీఏడీ కార్యదర్శి శేషాద్రి, అడిషనల్ డీజీపీ జితేందర్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, కార్యదర్శి వాకాటి కరుణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు ఉన్నారు. ర్యాలీ నిర్వహిస్తున్న అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యాపకులు తిరంగా సంబరం తరంగమై ఎగిసింది. నగరం అంగరంగ వైభవంగా మెరిసింది. మువ్వన్నెల జెండా వజ్రోత్సవంలా మురిసింది. స్వాతంత్య్ర శోభ వెల్లివిరిసింది. ఇళ్లు, వీధులు, వాహనాలపై త్రివర్ణ పతాకాలు సమున్నతంగా ఆవిష్కృతమయ్యాయి. సోమవారం నగరంలో స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు అంబరమంటాయి. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో భారీ జెండాలతో బైక్ ర్యాలీలు, కారు ర్యాలీలు జోరుగా సాగాయి. భారీ జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాతబస్తీలో జాతీయ జెండాలతో ఉత్సాహంగా ముస్లిం మహిళలు వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి పది మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన పతాకాలు చూడముచ్చగా కనువిందు చేశాయి. సంజీవయ్య పార్క్ సమీపంలో జాతీయ జెండాలతో వింటేజ్ కార్లతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. అబిడ్స్ మొజంజాహీ మార్కెట్ వేదికగా అతి పొడవైన జాతీయ జెండాతో చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాశాలు, స్కూళ్లలో వేడుకలు ఆనందోత్సాహాలతో సాగాయి. కళాకారులు దేశభక్తి ఉట్టిపడేలా తయారైన విధానం అందరినీ ఆకట్టుకుంది. ట్యాంక్‌బండ్‌పై త్రివర్ణ పతాకాలతో ర్యాలీ నగరంలోని చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలతో పాటు నలుమూలలా వ్యాపించి ఉన్న కార్పొరేట్ ఆఫీసుల్లో, ఐటీ కంపెనీల్లో, విద్యా సంస్థల్లో 75 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గోల్కొండ కోట వేదికగా ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలతో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాల్లో నగర యువత ఆసక్తిగా పాల్గొని సందడి చేశారు. వజ్రోత్సవాల్లో భాగంగా నగరానికి చెందిన మైక్రో ఆరి్టస్టు కృష్ణ ఉట్ల బియ్యపు గింజపై జాతీయ జెండాను రూపొందించారు. చిన్న పరిమాణంలో ఉండే బియ్యపు గింజపై అశోక చక్రం, మూడు వర్ణాలతో ఉన్న జాతీయ జెండాను వేసి దేశభక్తిని చాటుకున్నాడు. – సాక్షి, సిటీబ్యూరో (చదవండి: దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ శక్తులను అడ్డుకోవాలి) -
అమర్నాథ్లో ఆకస్మిక వరదలు.. ఆ దృశ్యం కళ్లారా చూశా: రాజాసింగ్
అబిడ్స్ (హైదరాబాద్): అమర్నాథ్ యాత్రకు వెళ్లిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ శుక్రవారం దైవదర్శనం చేసుకున్నారు. కుండపోత వర్షంతో అమర్నాథ్లో వరదలు రావడంతో వేలాది మంది భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి రాజాసింగ్ ‘సాక్షి’ తో ఫోన్లో మాట్లాడారు. కుటుంబంతో కలిసి అమర్నాథ్ దర్శనం చేసుకుని జమ్మూకశ్మీర్ వరకు తరలి వచ్చినట్లు తెలి పారు. హెలికాప్టర్ అందుబాటులో లేకపోవడంతో గుర్రాలపై చేరుకున్నామన్నారు. వరదలు రావడం కొద్ది దూరం నుంచి కళ్లారా చూశానని, తన కళ్ల ముందే టెంట్లు కొట్టుకుపోయాయని వివరించారు. దీంతో వెంటనే అక్కడి నుంచి తరలి పోయామని చెప్పారు. కాగా, శనివారం వైష్ణవీదేవి దర్శనానికి వెళ్తున్నట్లు రాజాసింగ్ తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి👉🏾Hyderabad: కుండపోత.. సిటీలో రోజంతా వర్షం -
జేఈఈ మెయిన్స్‌కు ‘సర్వర్’ షాక్
సాక్షి, హైదరాబాద్/సుల్తాన్‌బజార్: జేఈఈ మెయిన్స్ పరీక్ష శుక్రవారం విద్యార్థులకు చుక్కలు చూపింది. ప్రధానంగా హైదరాబాద్‌లోని అబిడ్స్, మూసారాంబాగ్‌లలో ఓ ప్రైవేటు కాలేజీకి చెందిన రెండు కేంద్రాల్లో సాంకేతిక సమస్యలతో పరీక్ష గంటల తరబడి ఆలస్యమైంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆ పరీక్ష కేంద్రాల వద్ద ఆందోళనకు దిగారు. పరీక్ష నిర్వహణలో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విఫలమైందని మండిపడ్డారు. కొందరు విద్యార్థులు కాలేజీ అద్దాలు పగలగొట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని శాంతింపజేశారు. సర్వర్ మొరాయించడంతో... దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ తొలిదశ పరీక్షను ఈ నెల 23 నుంచి 29 వరకు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లోని మూసా రాంబాగ్ పరీక్ష కేంద్రంలో శుక్రవారం ఉద యం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా విద్యార్థులు 8 గంటలకే కేంద్రానికి చేరుకున్నారు. అయితే ఆడ్మిట్ కార్డుపై బార్ కోడ్‌ను స్కాన్ చేసే సమయంలో ఎన్టీఏతో అను సంధానమైన సర్వర్ మొరాయించింది. చాలా సేపటి వరకూ అది పనిచేయలేదు. చివరకు కనెక్ట్ అవ్వడంతో విద్యార్థులను పరీక్ష హాలు లోకి పంపారు. అప్పటికే మానసిక ఆందోళనకు గురైన విద్యా ర్థులు పూర్తిస్థాయి లో పరీక్ష రాయలేకపోయి నట్లు తెలిపారు. కంప్యూ టర్ స్క్రీన్‌పై కొన్ని ప్రశ్నలు సైతం సరిగ్గా కని పించలేదని.. ఫలితంగా పదుల సంఖ్యలో మార్కులు కోల్పో యామని పేర్కొ న్నారు. మధ్యాహ్నం 3 గంట ల సెషన్లోనూ ఇదే సమస్య తలెత్తింది. కొంద రు విద్యార్థులు మొత్తం ప్రశ్నలు కన్పించలేదని తెలిపారు. అబిడ్స్‌లోని పరీక్ష కేంద్రంలోనూ ఇదే రకమైన సమస్య ఎదురైంది. ఉదయం 9 గంటలకు జర గాల్సిన పరీక్ష 10:30 గంటలకు మొదలైంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన పరీక్ష సాంకేతిక కారణాలతో సాయంత్రం 5 గంటల వరకు మొదలుకాక పోవడంతో ఆ కేంద్రంలో పరీక్షను ఎన్టీఏ వాయిదా వేసినట్లు కాలేజీ నిర్వాహకులు ఓ నోట్ విడుదల చేశారు. పరీక్ష తేదీని ఎన్టీఏ త్వరలో ప్రకటిస్తుందన్నారు. గణితం తికమక... ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈజీ రెండేళ్ల జేఈఈ మెయిన్స్ పేపర్‌తో పోలిస్తే ఈసారి తేలికగానే ఉంది. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా ఆన్లైన్ బోధన జరగడం వల్ల కొంత ఇబ్బంది పడే వీలుంది. గణితం 5 నుంచి 10 న్యూమరికల్ ప్రశ్నలు మినహా సమాధానాలు గుర్తించడానికి ఎక్కువ సమయం తీసుకుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రశ్నలు గతంలో వచ్చినవే ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఎన్సీఈ ఆర్టీ సిలబస్ నుంచే ప్రశ్నలు వచ్చాయి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 300 మార్కులకు 78 నుంచి 87 మార్కులు తెచ్చుకుంటే అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థులు 60 నుంచి 65 మార్కులతో క్వాలిఫై అవుతారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40–50 మార్కులతో క్వాలిఫై అయ్యే అవకాశం కనిపిస్తోంది. – ఎంఎన్‌రావు, గణిత శాస్త్ర నిపుణుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాం దాదాపు 4 గంటలు ఎండలో ఉండాల్సి వచ్చింది. సర్వర్ పనిచేయడం లేదని చెప్పారు. ఆ తర్వాత తర్వాత పరీక్ష రాసినా తీవ్ర ఆందోళన మధ్య సరిగా సమాధానాలు ఇవ్వలేకపోయాం. ఈ పరీక్షను తిరిగి నిర్వహిస్తే బాగుంటుంది. – అతావుల్లా, జేఈఈ పరీక్ష రాసిన విద్యార్థి, టౌలిచౌకి అరోరా కాలేజీ వద్ద ఉద్రిక్తత అబిడ్స్ అరోరా కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఇంకా జరగలేదు. ఇదే విషయంపై సిబ్బందిని ప్రశ్నిస్తే సర్వర్‌డౌన్, టెక్నికల్ ప్రాబ్లమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు కాలేజీ కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ బయట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. దీంతో అబిడ్స్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చదవండి: (అర్ధరాత్రి ఫోన్.. భర్త వార్నింగ్.. గంట తర్వాత చూస్తే..) -
ఆబిడ్స్ పీఎస్ లో ఎమ్మెల్యే రఘునందన్ పై కేసు
-
హంతకులను ఉరి తీయాలి.. నీరజ్ పన్వార్ భార్య సంజన డిమాండ్
అబిడ్స్/నాంపల్లి: నీరజ్ పన్వార్‌ను తన బంధువులే చంపారని, హత్య చేసిన వారిని ఉరి తీయాలని మృతుడి భార్య సంజన డిమాండ్ చేశారు. తాను, నీరజ్.. ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరమా అని ప్రశ్నించారు. తన కజిన్ బ్రదర్సే నీరజ్‌ను చంపారని వెల్లడించారు. ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణ జరపాలని, నిందితులపై పీడీయాక్ట్ నమోదు చేయాలని కోరారు. నీరజ్ హత్యను నిరసిస్తూ.. సంజన, స్థానిక వ్యాపారులు శనివారం ఆందోళనకు దిగారు. దీంతో బేగంబజార్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది వ్యాపారులు దుకాణాలను మూసివేసి ఆందోళన చేశారు. షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ ముందు 2 నెలల పసికందుతో సంజన, ఆమె బంధువులు, వ్యాపారులు దాదాపు 3 గంటల పాటు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. హంతకులను ఉరితీయాలని, అంతవరకు ఆందోళన చేస్తామని బైఠాయించారు. వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం సంజన మీడియాతో మాట్లాడారు. హంతకులు తన 2 నెలల కొడుకును కూడా చంపుతారన్న భయాందోళన వ్యక్తం చేశారు. వాళ్లు గతంలో తనను, నీరజ్‌ను చాలాసార్లు బెదిరించారని చెప్పారు. తనకు, అత్తామామలకు, తన కొడుకుకు పోలీసులు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారికి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తన కళ్లెదుటే నీరజ్‌ను పొడిచేశారని అతని తాత జగదీశ్ పన్వార్ వాపోయారు. తను, నీరజ్ బేగంబజార్ ఫిష్‌మార్కెట్ వద్ద వెళ్తుండగా, వెంబడించిన ఐదుగురు దుండగులు తమ ముందుకొచ్చి కళ్లల్లో ఏదో చల్లారన్నారు. దీంతో తమకు ఏమీ కనిపించలేదని చెప్పారు. దుండగులు నీరజ్ తలపై బండరాయితో కొట్టి కత్తులతో పొడిచారని పేర్కొన్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించగా తనపై కూడా దాడి చేశారన్నారు. చంపుతామని బెదిరిస్తున్నారని ఏడాది క్రితమే అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇలా జరిగిందని రోదిస్తూ వెల్లడించారు. కులాంతర వివాహం నచ్చకే.. బేగంబజార్ పరువు హత్య కేసును షాహినాయత్‌గంజ్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నీరజ్‌ను హత్య చేసిన ఆరుగురిలో నలుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. అరెస్టయిన వారిలో ఒక మైనర్ బాలుడు ఉన్నట్లు పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం గోషామహల్‌లోని షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు హత్య వివ రాలు వెల్లడించారు. ‘కోల్సావాడికి చెందిన రాజేంద్రప్రసాద్ పన్వార్ కుమారుడు నీరజ్(20) వృత్తిరీత్యా వేరుశనగ గింజల వ్యాపారం చేస్తుంటారు. అదే బస్తీలో ఉండే సంజనను నీరజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే సంజన తల్లిదండ్రులు ఈ వివాహాన్ని వ్యతిరేకించారు. దీంతో పాతబస్తీలో ఫలక్‌నుమాలోని శంషీర్‌గంజ్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నీరజ్, సంజన జీవిస్తున్నారు. అయితే నీరజ్ వ్యాపారం బేగంబజార్‌లో ఉండటంతో రోజూ ఫలక్‌నుమా నుంచి వచ్చి పోతుండేవారు. కులాంతర వివాహం చేసుకున్న నీరజ్‌ను అంతమొందించాలని 15 రోజుల నుంచి సంజన బంధువులు బేగంబజార్‌కు వచ్చి రెక్కీ నిర్వహించారు. కోల్సావాడికి చెందిన సంజన బంధువులైన మదన్‌లాల్ కుమారుడు అభినందన్ యాదవ్ అలియాస్ నందన్(26), యాదవ్లాల్ యాదవ్ కుమారుడైన కె.విజయ్(22), జై చరణ్ యాదవ్ కుమారుడు కె.సంజయ్(25), శ్రవణ్ యాదవ్ కుమారుడు బి.రోహిత్(18), అఫ్జల్‌గంజ్ నివాసి మహేష్ అహీర్ యాదవ్ అలియాస్ గోటియా(21), మరో మైనర్ బాలుడితో కలసి హత్యకు కుట్రపన్నారు. ఇందులో భాగంగా జుమేరాత్ బజార్లో కత్తులు కొనుగోలు చేశారు. శుక్రవారం సాయంత్రం పీకల దాకా మద్యాన్ని సేవించారు. నీరజ్‌ను చంపేందుకు 2 ద్విచక్ర వాహనాలపై బేగంబజార్‌కు చేరుకున్నారు. నీరజ్ తన తాతతో కలసి వెళ్తుండగా అడ్డగించి కత్తులతో పొడిచి పారిపోయారు. నీరజ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో హత్య కేసు నమోదు చేసుకుని ఏడు బృందాలను రంగంలోకి దించాం. నగర శివార్లలో తలదాచుకున్న నలుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అభినందన్ యాదవ్, మహేష్ యాదవ్‌ను త్వరలోనే పట్టుకుంటాం’అని డీసీపీ వెల్లడించారు. -
25 నుంచి నుమాయిష్ పునఃప్రారంభం
అబిడ్స్: ఈ నెల 25 నుంచి ఎగ్జిబిషన్ (నుమాయిష్) ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి ఆదిత్య మార్గం తెలిపారు. జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్‌ను కరోనా కారణాలతో 2 నుంచి నిలిపివేయడం తెలిసిందే. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇచ్చింది. దాదాపు 1500 స్టాళ్లతో ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు స్టాళ్లతో పాటు పలు రాష్ట్రాల స్టాళ్లను కూడా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేస్తారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఎగ్జిబిషన్‌ను పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. -
HYD: ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యాన్ని అడ్డుకున్న ఆటోడ్రైవర్
సాక్షి, హైదరాబాద్: అబిడ్స్‌లోని జీపీఓ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఓ చిన్నారిపై అఘాయిత్యాన్ని ఆటోడ్రైవర్ జాహిద్ అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్పందించారు. జాహిద్‌ను తన కార్యాలయానికి పిలిపించుకుని అభినందించడంతో పాటు జ్ఞాపిక అందించారు. సీపీ చెప్పిన వివరాల ప్రకారం.. ► హఫీజ్‌పేటకు చెందిన ఓ మహిళ నిత్యం తన ఇద్దరు కుమార్తెలతో (ఆరేళ్లు, రెండేళ్లు) కలిసి ఎంఎంటీఎస్ రైలులో వచ్చి నాంపల్లి యూసిఫియాన్ దర్గా వద్ద భిక్షాటన చేసుకుని రాత్రికి తిరిగి వెళ్తూంటుంది. మంగళవారం కూడా ఇలాగే చేసిన మహిళ జీపీఓ వద్ద ఉండే తన సోదరుణ్ని కలవడానికి వెళ్లింది. అక్కడ ఆలస్యం కావడంతో వీళ్లు తిరిగి వెళ్లే రైలు సమయం దాటిపోయింది. దీంతో ఆ రాత్రికి తన సోదరుడితో కలిసి జీపీఓ వద్ద ఫుట్‌పాత్‌పై నిద్రించింది. చదవండి: తండ్రి అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక ► బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అఫ్జల్‌గంజ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఛోటూ అటుగా వెళ్తూ వీళ్లని గమనించాడు. అంతా నిద్రలో ఉన్నారని తెలుసుకుని ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి యత్నించాడు. తన ఆటోను అక్కడే పార్క్ చేసి.. ప్రయాణికుల కోసం వేచి చూస్తున్న సయ్యద్ జాహిద్ ఈ విషయం గమనించాడు. వెంటనే అప్రమత్తమై ఛోటూను వారించడంతో పాటు నిద్రిస్తున్న చిన్నారి తల్లి, ఆమె సోదరుణ్ని లేపాడు. ► వీరితో ఛోటూ వాగ్వాదానికి దిగగా... అటుగా వస్తున్న అబిడ్స్ ఠాణాకు చెందిన గస్తీ పోలీసులు గమనించారు. వారిని పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఛోటూపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాధ్యతగా స్పందించిన జాహిద్‌ను కమిషనర్ తన కార్యాలయానికి పిలిపించుకుని అభినందించారు. -
రూ.100 కోట్ల బంగారం దారి మళ్లింపు కేసులో ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: విదేశాలకు ఎగుమతి చేయాల్సిన బంగారాన్ని దారి మళ్లించి దేశీయ విపణిలో విక్రయించిన ఆరోపణలపై ఘన్‌శ్యామ్‌దాస్ జెమ్స్ అండ్ జ్యువెల్స్ సహా మరికొన్ని సంస్థలపై నమోదు చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కొరడా ఝుళిపించింది. ఈ ఏడాది మార్చిలో నమోదైన కేసుకు సంబంధించి ముగ్గురికి చెందిన రూ. 25.28 కోట్ల విలువైన ఆస్తుల్ని బుధవారం తాత్కాలిక జప్తు చేసింది. సంజయ్ కుమార్ అగర్వాల్, రాధిక అగర్వాల్, సంజయ్ కుమారుడు ప్రీత్ కుమార్ అగర్వాల్‌కు చెందిన ఖరీదైన విల్లాలతో పాటు 54 కేజీల బంగారం ఎటాచ్ చేసిన వాటిలో ఉన్నాయి. ►అబిడ్స్ కేంద్రంగా కార్యకలాపాలు నడిపే ఘన్‌శ్యామ్‌దాస్ సంస్థను సంజయ్ కుమార్ నిర్వహిస్తున్నారు. ఈయనతో పాటు ఇతరులూ విదేశాలకు ఎగుమతి చేసే నెపంతో నకిలీ పత్రాలు సృష్టించి ఎంఎంటీసీ, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, డైమండ్ ఇండియా లిమిటెడ్ సంస్థల నుంచి 250 కేజీల బంగారం ఖరీదు చేశారు. ►ఎక్స్పోర్ట్ చేసే పసిడిపై కస్టమ్స్ సుంకం లేకపోవడాన్ని వీళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ మొత్తం బంగారాన్నిదారి మళ్లించి దేశీయ విపణిలోనే విక్రయించేశారు. దానికి సంబంధించన నగదు లావాదేవీలన్నీ హవాలా రూపంలో సాగించారు. ►కోల్‌కతాకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయం గుర్తించారు. 2018 ఏప్రిల్ 4న ప్రీత్ కుమార్ అగర్వాల్‌ను కోల్‌కతా విమానాశ్రయంలో పట్టుకున్నారు. అప్పటికే సంజయ్ అగర్వాల్ హైదరాబాద్ రావడానికి ఇండిగో సంస్థకు చెందిన విమానం ఎక్కేశారు. దీన్ని గుర్తించిన డీఆర్ఐ అధికారులు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కింద వెనక్కు రప్పించి ఆయన్నూ అరెస్టు చేశారు. అదేరోజు ఇండిగో ఎయిర్‌లైన్స్ డొమెస్టిక్ కార్గోలో రెండు బాక్సుల్లో ఉన్న రూ.16 కోట్ల విలువైన 1,194 బంగారం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ►ఎంఎంటీసీ సహా మూడు సంస్థల నుంచి ఖరీదు చేసిన బంగారాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు వీళ్లు అన్ని పత్రాలు సిద్ధం చేసేవాళ్లు. విమానాశ్రయం వర కు వెళ్లిన తర్వాత ఆ బంగారాన్ని దారి మళ్లించి డొమెస్టిక్ కార్గొ ద్వారా హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తూ వచ్చారని డీఆర్ఐ తేల్చింది. దీనికిపై ఈ ఏడాది మార్చిలో కోల్‌కతాకు చెందిన ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వీళ్లు వివిధ దశల్లో రూ.100 కోట్ల విలువైన 250 కేజీల బంగారం దారి మళ్లించినట్లు తేల్చారు. ►ఈ నేపథ్యంలోనే కోల్‌కతా ఈడీ అధికారులు నగర యూనిట్ సహకారంతో ఈ ఏడాది మార్చిలో ఘన్‌శ్యామ్‌దాస్ సంస్థతో పాటు శ్రీగణేష్ జ్యువెల్స్, పీహెచ్ జ్యువెల్స్ సంస్థలోదాడులు చేసి కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసులోనే ఈడీ బుధవారం ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసం చేసిన కేసులో సంజయ్‌కుమార్ అగర్వాల్‌ను 2012 ఫిబ్రవరిలో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. -
హైదరాబాద్: అబిడ్స్ ఎస్బీఐలో కాల్పుల కలకలం
-
అబిడ్స్ ఎస్బీఐలో కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి ఏటీఎం వద్ద దుండగులు కాల్పులకు పాల్పడిన ఘటన మరవక ముందే హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. ఈ సారి ఏకంగా ఎస్బీఐ బ్యాంక్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు ఎస్బీఐ కాంట్రాక్ట్ ఉద్యోగి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వివరాలు.. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ బ్యాంక్‌లో బుధవారం కాల్పులు చోటు చేసుకున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగి సురేందర్‌పై సెక్యూరిటీ గార్డ్ సర్దార్ ఖాన్ కాల్పులు జరిపాడు. సెక్యూరిటీ వెపన్తో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు సర్దార్ ఖాన్. ఈ ఘటనలో సురేందర్ తీవ్రంగా గాయపడటమే కాక.. అక్కడే ఉన్న మహిళా కస్టమర్ కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. సురేందర్, సెక్యూరిటీ గార్డు ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం కాస్త చినికి చినికి చివరకు కాల్పులు చోటు చేసుకునే వరకు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సురేందర్‌ను, మహిళను హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డు సర్దార్ ఖాన్‌ను అబిడ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాదానికి కారణం తెలియాల్సి ఉంది. కాల్పుల ఘటనపై అబిడ్స్ ఏసీసీ వెంకట్‌రెడ్డి మాట్లాడారు. ‘‘బ్యాంక్ ఉద్యోగి, సెక్యూరిటీగార్డుకు మధ్య మాటా మాటా పెరగడంతో కాల్పులకు దారితీసింది. ఆవేశంతో సెక్యూరిటీగార్డు తన గన్‌తో సురేందర్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సురేందర్ కడుపులోకి రెండు బుల్లెట్లు దిగాయి. సెక్యూరిటీగార్డు సర్దార్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నాం’’ అని వెంకట్‌రెడ్డి తెలిపారు. -
అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: అబిడ్స్‌లోని ట్రూప్ బజార్లో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక డీకే సానిటరీ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ట్రూప్ బజార్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని వాహనాలను దారి మల్లిస్తున్నారు.