
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం సంస్థల అధినేత భరత్‌కు మరో భారీ షాక్ తగిలింది. రుణాల చెల్లింపు ఎగవేసిన కారణంగా భరత్ తండ్రి పట్టాభి రామారావు సహా ఇతర కుటుంబీకుల ఆస్తుల జప్తునకు అబిడ్స్ కరూర్ వైశ్యా బ్యాంకు నోటీసులు జారీ చేసింది. కాగా టెక్నో యూనిక్ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భరత్ కుటుంబీకులు తీసుకున్న రుణం అసలు, వడ్డీ కలిపి రూ. 124 కోట్ల 39 లక్షల 21 వేల, 485 పైసలు.. జనవరి 21, 2020లోగా చెల్లించాలని గతంలో బ్యాంకు నోటీసులు జారీ చేసింది. అయితే వారు ఇందుకు స్పందించపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ క్రమంలో రుణం కోసం బ్యాంకులో తాకట్టు పెట్టిన గాజువాక మండలం, భీమిలి మండలంలోని భూములను స్వాధీనం చేసుకుని, వేలం వేస్తామని హెచ్చరించింది. ఇక గతంలో భరత్ ఆంధ్రా భ్యాంకుకు సుమారు రూ. 100 కోట్ల రుణం ఎగవేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కరూర్ వైశ్యా బ్యాంకుకు రుణం ఎగవేయడంతో ఆస్తుల జప్తునకు నోటీసు జారీ అయ్యింది. కాగా గత ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment