- భూ దాహం.. భరతుడి వ్యామోహం!
- తాత బాటలో భూ కబ్జాలు..
- తండ్రి బాటలో బ్యాంకు రుణాల డిఫాల్టర్
- రూ.124 కోట్లు ఎగ్గొట్టే యత్నం...
- గీతం వర్సిటీ పేరుతో రూ.500 కోట్ల భూ ఆక్రమణలు
- చంద్రబాబు హయాంలో రూ.2 వేల కోట్ల భూమిని కారుచౌకగా దోపిడీ
- గత ఎన్నికల్లో భరత్‌కు బుద్ధి చెప్పిన విశాఖ
- మళ్లీ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి..
ఎక్కడైనా కుటుంబంలో ఒకరో ఇద్దరో తేడాగా ఉంటారు..వీళ్లేంటిరా.. కుటుంబం మొత్తం తేడాయేనా...అని సందేహం వ్యక్తపరుస్తాడు ఓ సినిమాలో హాస్యనటుడు...అలాంటి పోలికను విశాఖలోనూ చూడొచ్చు...తాత భూ కబ్జాదారు..తండ్రి బ్యాంకు డిఫాల్టర్...మనవడు..వీరి అక్రమాల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు...తాత ఎంవీవీఎస్ మూర్తి ఉరఫ్ గోల్డ్‌స్పాట్ మూర్తి, గీతం వ్యవస్థాపకుడు. తండ్రి పట్టాభిరామారావు రుణాల ఎగవేతదారు..పిల్లనిచ్చిన మామ బాలకృష్ణ...సినీ నటుడు..ఆడవాళ్ల గురించి అసభ్య నిర్వచనం ఇచ్చే ప్రవచనకర్త.. వీరి వారసుడు భరత్ గీతం యూనివర్సిటీ ప్రస్తుత అధ్యక్షుడు, టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్.. వెరసి అక్రమాల్లో గుగ్గురువు చంద్రబాబు బంధుగణంలోని ముఖ్యుడు.
భరత్ కబ్జాకు నాటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబూ తనవంతు సహకారం అందించారు...ఇదంతా చూసిన తర్వాత...కబ్జాలు చేయడం, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టడమే ఎన్నికల్లో పోటీకి అర్హతగా నేటి రాజకీయాలు మారిపోయాయని విశాఖ వాసులు నవ్విపోతున్నారు...విద్య వినయం, సౌశీల్యం నేర్పుతుందంటారు.. ఈ భరతుడికి మాత్రం తాత, తండ్రి అక్రమాల వారసత్వాన్ని నేరి్పంది...ప్రభుత్వ భూమినే వరకట్న కానుకగా పొందిన ఈ కబ్జాదారుకు గత ఎన్నికలు ఓటమి గుణపాఠం నేర్పినా...ఆ పాఠాన్ని మరిచి మళ్లీ విశాఖ బరిలో టీడీపీ ఎంపీ అభ్యరి్థగా రంగంలోకి దిగుతున్నారు.
సాక్షి, విశాఖపట్నం: తాత ఎంవీవీఎస్ మూర్తి ఉరఫ్ గోల్డ్‌స్పాట్ మూర్తి వందల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుంటే.. దానిపై అక్రమాల అంతస్తులు కట్టేశాడో భరతుడు. తాతకు మించి నాలుగాకుల అక్రమాలు ఎక్కువే చదివాడు...బ్యాంకుల ఉదారత ఎలాంటిదంటే రుణా లు ఎగ్గొట్టే పెద్దోళ్లకే పిలిచి మరీ రుణాలిస్తుంటాయి.. గీతం సంస్థ పేరుతో బ్యాంకుల నుంచి కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టేందుకు భరత్ ప్రయత్నించారు. తాత కబ్జా వారసత్వాన్ని కొనసాగించేందుకు రాజకీయాల్లోకి వచ్చిన భరత్ నిజస్వరూపం తెలుసుకుని ఓసారి విశాఖపట్నం ప్రజలు తిరస్కరించినా.. ఇప్పుడు మళ్లీ ఏ మాత్రం సిగ్గుపడకుండా ఓట్లడిగేందుకు సిద్ధమయ్యారు... విశాఖపట్నం ఎంపీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడుతున్న భరత్ అసలు స్వరూపమిదీ.
అక్రమాల పునాదులపై ‘గీతం’.!
గోల్డ్ స్పాట్ మూర్తి గీతం ప్రైవేటు కళాశాలను పెట్టి.. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తూట్లు పొడిచి.. గీతం విద్యాసంస్థను వర్సిటీగా విస్తరించారు. రెండుసార్లు ఎంపీగా పూర్తి పదవీకాలం పని చేసిన మూర్తి.. కేవలం సొంత గీతం కళాశాలకు, రక్తసంబం«దీకులైన బంధుగణానికి తప్పించి.. విశాఖ నగరానికి ఈ మంచి పని చేశాను.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెచ్చాను.. అనే ఒక్క పనీ చేయలేదనేది కళ్లెదుటే కనిపించే పచ్చి నిజం. తెలుగుదేశం పాలనలో ఆయన గీతం కళాశాల, తదనంతరం డీమ్డ్ యూనివర్శిటీ పేరిట చేసిన భూ ఆక్రమణల వ్యవహారాలు ఇప్పటికీ కోర్టుల్లో నలుగుతున్నాయి. ఆయన మనుమడు, టీడీపీ ఎంపీ అభ్యర్థి, బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ అదే బాటలో వెళ్తున్నారు. ‘ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు శ్రీలంక యూనివర్సిటీ 25 ఎకరాల్లోనే ఉంది.
విశాఖలోని గీతం (గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్) యూనివర్సిటీకి వందల ఎకరాలు కావాలా? అని ఆ పారీ్టకి చెందిన అప్పటి రాష్ట్ర మంత్రి సీహెచ్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు గతంలో తీవ్ర దుమారాన్ని రేపాయి. తొలుత పాతిక ఎకరాల్లో ఏర్పాటైన ఈ విద్యాసంస్థ ఆ తర్వాత క్రమక్రమంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసుకుంటూ 110 ఎకరాల విస్తీర్ణంలో డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి చేరింది. ప్రభుత్వ భూములు కబ్జా చేయడం ఆనక ఎలినేషన్ చేసుకుంటూ వాటిని సొంతం చేసుకోవడం గీతం యాజమాన్యానికే చెల్లింది. సంస్థ ఆధీనంలో ఉన్న 35 ఎకరాల భూములను లీగల్‌గా కైవసం చేసుకునేందుకు అప్పటి కలెక్టర్ ఆరోఖ్యరాజ్ ద్వారా 2012 మే 28న ఎలినేషన్ ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనను రెండేళ్ల పాటు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కిపెట్టింది.
అప్పట్లో సీసీఎల్‌ఏ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈ ప్రతిపాదనను నిర్‌ద్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలో ఉన్న ఈ భూములను అప్పటికే వివిధ అవసరాల నిమిత్తం భూములు కావాలని కోరిన ఆరు ప్రభుత్వ శాఖలకు కేటాయిస్తూ 2014 ఫిబ్రవరి 26న ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. దళిత విద్యార్థుల కళాశాల, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ నిర్మాణం, బలహీన వర్గాల గృహనిర్మాణం, అధికారులకు రెసిడెన్షియల్ క్వార్టర్స్, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ సెంటర్ ఇలా వివిధ ప్రభుత్వ అవసరాల కోసం ఈ భూములు కేటాయించారు. గీతం మూర్తి వాటినీ వదల్లేదు. వీటికి అదనంగా తమ అ«దీనంలో ఉన్న మరో 7.52 ఎకరాలను కలిపి తమ సంస్థకు కేటాయించాలని, ఈ మేరకు సిఫార్సు చేయాలని 2016లో జిల్లా కలెక్టర్ యువరాజ్‌పై ఒత్తిడి తెచ్చారు. యువరాజ్ బదిలీ అయిన తర్వాత గత కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ఈ ప్రతిపాదనలు రావడమే తరువాయి వివిధ శాఖలకు కేటాయిస్తూ గత సీఎస్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఆ భూములను గీతం సంస్థకే కట్టబెట్టేందుకు వీలుగా బాబు కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ గజం రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతోంది. ఈ లెక్కన ఎలినేషన్ ప్రతిపాదనలు పంపిన 42.52 ఎకరాల భూముల విలువ అక్షరాల రూ.514 కోట్ల పైమాటే. వీటన్నింటి గురించీ భరత్‌కు తెలుసు. అవి ఆక్రమిత భూములనీ తెలుç Üు. అయినా.. ఆ భూముల్ని తన కబంధ హస్తాల్లో ఉంచేసి.. కొత్తగా భవనాలు నిరి్మంచేందుకు పక్కా ప్లాన్ వేసి.. స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గీతం యూనివర్సిటీ కాంపౌండ్ వాల్‌ను తొలగించి కబ్జాలో ఉన్న 40.51 ఎకరాలను స్వా«దీనం చేసుకుంది. సర్వే నంబర్ 10, 17, ,30, 15, 16, 19, 20లో మొత్తం 26 ఎకరాల ప్రభుత్వ భూమికి రక్షణ వలయం ఏర్పాటు చేశారు. లేదంటే.. ఈ భరతుడు హాంఫట్ చేసేందుకు రెడీగా ఉన్నారు.
కారు చౌకగా.. రూ.2 వేల కోట్ల భూమి...
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా.. అధికారం చేతిలో ఉంది కదా అని పెళ్లి కోసం ప్రభుత్వ స్థలాన్ని కట్నంగా కొట్టేసిన వరుడిగా భరత్ గుర్తింపు పొందారు. రూ.2 వేల కోట్ల విలువ చేసే భూమితో పాటు కట్నం కింద ఎంపీ టికెట్‌నూ పొందిన అల్లుడీయన. చంద్రబాబు, బాలకృష్ణ సహకారంతో భరత్.. ఈ దోపిడీని ఎంత పకడ్బందీగా చేశారంటే.. అధికారాన్ని అడ్డంగా ఉపయోగిస్తూ దందాను అధికారికంగానే సాగించేశారు. జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో సర్వే నెంబర్ 93లో ఉన్న 498.9 ఎకరాల ప్రభుత్వ భూమిని భరత్‌కు చెందిన ఏబీసీ అనే ఫెర్టిలైజర్స్ కంపెనీకి కేవలం నామమాత్ర ధరకి కట్టబెట్టారు.
ఎకరం రూ.80 వేల చొప్పున మొత్తం 500 ఎకరాలు కూడా కేవలం రూ.4 కోట్లకి కట్టబెట్టారు. జయంతిపురంలో భరత్‌కు ఇచి్చన 500 ఎకరాలకు డిమాండ్ పెంచడానికి ఏకంగా ఆ ప్రాంతం మొత్తాన్ని రాజధాని ఏపీసీఆర్‌డీఏ పరిధిలోకి తెస్తూ 2015 సెపె్టంబర్‌లో చంద్రబాబు ఏకంగా జీవోనే జారీ చేసేశారు. భరత్ సంస్థకు భూముల్ని కట్టబెట్టిన కేవలం నెల రోజుల్లోనే జీవో. 207 తీసుకొచ్చి జయంతిపురంలో ఇచ్చిన స్థలం మొత్తాన్ని ఈ జీవో ద్వారా సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకొచ్చారు. కేవలం ఎకరం రూ.80 వేలకు కట్టబెట్టిన స్థలం సీఆర్‌డీఏ పుణ్యాన ఈ రోజు ఎకరం రూ.4 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ పెరిగిపోయింది. ప్రస్తుత మార్కెట్ విలువ 500 ఎకరాలకు గాను రూ.2 వేల కోట్ల పై చిలుకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
బ్యాంకులకీ కన్నం వేసేద్దామని.!
విద్యావంతుడిగా బిల్డప్ ఇచ్చే భరత్.. రుణాలు ఎగ్గొట్టడంలోనూ సిద్ధహస్తుడే. రుణాల బకాయిలు ఎగవేసిన కారణంగా భరత్ తండ్రి పట్టాభి రామారావు సహా ఇతర కుటుంబీకుల ఆస్తుల జప్తునకు హైదరాబాద్ అబిడ్స్ కరూర్ వైశ్యా బ్యాంకు 2020 ఫిబ్రవరిలో నోటీసులు జారీ చేసింది. టెక్నో యూనిక్ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న పట్టాభిరామారావుతో పాటు ఆయన తండ్రి, గీతం వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ఎంవీవీఎస్ మూర్తి కుటుంబీకులు తీసుకున్న రుణం అసలు, వడ్డీ కలిపి రూ.124,39,21,000గా తేల్చింది. జనవరి 21, 2020లోగా చెల్లించాలని బ్యాంకు నోటీసులు జారీ చేసింది.
ఈ నోటీసులకు వారు స్పందించకపోవడంతో రుణం కోసం విశాఖ జిల్లా గాజువాక మండలం, భీమిలి మండలంలో తాకట్టు పెట్టిన భూములను, విశాఖ నగరం దొండపర్తి ప్రాంతంలోని ఆస్తులను స్వా«దీనం చేసుకుని వేలం వేస్తామంటూ జప్తు నోటీసులు జారీ చేసింది. 2019 అక్టోబర్‌లో భరత్ సహా 11 మంది ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు విశాఖ నగరంలోని ఆంధ్రా బ్యాంకు సీతమ్మధార బ్రాంచ్ డిఫాల్టర్ నోటీసు జారీ చేసింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల వద్ద మెసర్స్ వీబీసీ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కోసం తీసుకున్న రుణం ఎగవేయడంతో అప్పట్లో ఆంధ్రాబ్యాంక్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. భరత్‌కు చెందిన సంస్థ మొత్తం రూ.13,65,69,000 బాకీ పడిందని పేర్కొంది. ఇలా బ్యాంకుల డిఫాల్టర్ భరత్.. విశాఖ ఎంపీ విషయంలోనూ డిఫాల్టరే... అంటూ 2019లో ప్రజలు తీర్పునిచ్చారు.
ఏం మొహం పెట్టుకుని ఓట్లడుగుతావ్ భరత్..?
2019లో కట్నం కింద విశాఖ ఎంపీ టికెట్ దక్కించుకున్న భరత్.. నిజస్వరూపాన్ని ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో విశాఖ ప్రజలు గమనించారు. ఎన్నికల ముందే తన తాత పవిత్రమైన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని దయ్యాల కొంప అంటూ పొగరుతో మాట్లాడినప్పుడు విద్యావేత్తగా చెప్పుకునే భరత్ కనీసం నోరు మెదపకపోవడం చర్చనీయాంశమైంది. ఎందరో మహానుభావుల్ని అందించిన విశ్వవిద్యాలయాన్ని నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేసినా స్పందించని భరత్ ఒక విద్యావంతుడా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కనీసం ఖండించని భరత్‌ని విశాఖ ప్రజలు ఓటు అనే ఆయుధంతో ‘గీతం’ కే పరిమితం చేసేశారు.
రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకున్న చంద్రబాబు అండ్ కో బ్యాచ్‌తో మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఈసారి ఎంపీగా గెలిచి.. ప్రభుత్వం స్వా«దీనం చేసుకున్న రూ.వందల కోట్ల భూముల్ని తిరిగి కబ్జా చేసుకోవాలన్న కుట్రతో భరత్ ప్రయతి్నస్తున్నారు. ఇలాంటి దోపీడీ దారులకు ఓటు వేస్తే.. విశాఖ భవిష్యత్తు నాశనం చేసి.. ఉన్న భూములన్నీ మనవడి పేరున, మనవరాలి కట్నం కోసం ధారాదత్తం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వైజాగ్‌వాసులు దుమ్మెత్తి పోస్తున్నారు. కేవలం విశాఖ ప్రజల్ని దోచుకోవడానికే ఈ కుటుంబం పుట్టిందన్నట్లుగా దోపిడీ పర్వం సాగుతోందని భరత్ వ్యవహారశైలిపై పలువురు విమర్శిస్తున్నారు.
భరత్‌పై కేసులు
భరత్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. బెంగళూరులోని గీతం క్యాంపస్‌లో విద్యార్థుల భద్రతపై సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే తన కుమారుడు బ్రహ్మసాయిరెడ్డి ఆరో అంతస్తుపై నుంచి పడి మృతి చెందాడనీ.. దీనికి కారణం గీతం అధినేత భరత్ నిర్లక్ష్యమేనని దాసరి వెంకట శివారెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై 2024లో బెంగళూరులోని దొడబళ్లాపుర పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 304(ఏ) కింద భరత్‌పై కేసు నమోదైంది. అదేవిధంగా.. బెంగళూరు గీతం క్యాంపస్ నిర్మాణం పూర్తయినా డబ్బులు చెల్లించడం లేదంటూ ఎంఎస్ రామయ్యా ప్రై.లిమిటెడ్‌సంస్థ భరత్‌పై దొడబళ్లాపుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు భరత్‌పై 506, 379,380, 420,448, 323, 506(బీ) సెక్షన్లపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment