geetam university
-
గీతం యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి,సంగారెడ్డి: గీతం యూనివర్సిటీ సంగారెడ్డి క్యాంపస్ హాస్టల్లో ఇంజినీరింగ్ విద్యార్థిని వర్ష (19) ఆత్మహత్య చేసుకుంది.వర్ష గీతం ఇంజినీరింగ్ కాలేజీలో బీ.టెక్(సీఎస్ఈ) 3వ సంవత్సరం చదువుతోంది.వర్ష స్వస్థలం అనంతపురంగా పోలీసులు గుర్తించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతికి గల కారణాలపై కాలేజీ సిబ్బంది, తోటి విద్యార్థులను ఆరా తీస్తున్నారు.ఇదీ చదవండి: విద్యార్థిని మృతిపై అనుమానాలు నివృత్తి చేయండి -
గోల్డ్ స్పాట్ కుటుంబం.. గోల్మాల్ ‘గీతం’
ఎక్కడైనా కుటుంబంలో ఒకరో ఇద్దరో తేడాగా ఉంటారు..వీళ్లేంటిరా.. కుటుంబం మొత్తం తేడాయేనా...అని సందేహం వ్యక్తపరుస్తాడు ఓ సినిమాలో హాస్యనటుడు...అలాంటి పోలికను విశాఖలోనూ చూడొచ్చు...తాత భూ కబ్జాదారు..తండ్రి బ్యాంకు డిఫాల్టర్...మనవడు..వీరి అక్రమాల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు...తాత ఎంవీవీఎస్ మూర్తి ఉరఫ్ గోల్డ్‌స్పాట్ మూర్తి, గీతం వ్యవస్థాపకుడు. తండ్రి పట్టాభిరామారావు రుణాల ఎగవేతదారు..పిల్లనిచ్చిన మామ బాలకృష్ణ...సినీ నటుడు..ఆడవాళ్ల గురించి అసభ్య నిర్వచనం ఇచ్చే ప్రవచనకర్త.. వీరి వారసుడు భరత్ గీతం యూనివర్సిటీ ప్రస్తుత అధ్యక్షుడు, టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్.. వెరసి అక్రమాల్లో గుగ్గురువు చంద్రబాబు బంధుగణంలోని ముఖ్యుడు.భరత్ కబ్జాకు నాటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబూ తనవంతు సహకారం అందించారు...ఇదంతా చూసిన తర్వాత...కబ్జాలు చేయడం, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టడమే ఎన్నికల్లో పోటీకి అర్హతగా నేటి రాజకీయాలు మారిపోయాయని విశాఖ వాసులు నవ్విపోతున్నారు...విద్య వినయం, సౌశీల్యం నేర్పుతుందంటారు.. ఈ భరతుడికి మాత్రం తాత, తండ్రి అక్రమాల వారసత్వాన్ని నేరి్పంది...ప్రభుత్వ భూమినే వరకట్న కానుకగా పొందిన ఈ కబ్జాదారుకు గత ఎన్నికలు ఓటమి గుణపాఠం నేర్పినా...ఆ పాఠాన్ని మరిచి మళ్లీ విశాఖ బరిలో టీడీపీ ఎంపీ అభ్యరి్థగా రంగంలోకి దిగుతున్నారు.సాక్షి, విశాఖపట్నం: తాత ఎంవీవీఎస్ మూర్తి ఉరఫ్ గోల్డ్‌స్పాట్ మూర్తి వందల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుంటే.. దానిపై అక్రమాల అంతస్తులు కట్టేశాడో భరతుడు. తాతకు మించి నాలుగాకుల అక్రమాలు ఎక్కువే చదివాడు...బ్యాంకుల ఉదారత ఎలాంటిదంటే రుణా లు ఎగ్గొట్టే పెద్దోళ్లకే పిలిచి మరీ రుణాలిస్తుంటాయి.. గీతం సంస్థ పేరుతో బ్యాంకుల నుంచి కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టేందుకు భరత్ ప్రయత్నించారు. తాత కబ్జా వారసత్వాన్ని కొనసాగించేందుకు రాజకీయాల్లోకి వచ్చిన భరత్ నిజస్వరూపం తెలుసుకుని ఓసారి విశాఖపట్నం ప్రజలు తిరస్కరించినా.. ఇప్పుడు మళ్లీ ఏ మాత్రం సిగ్గుపడకుండా ఓట్లడిగేందుకు సిద్ధమయ్యారు... విశాఖపట్నం ఎంపీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడుతున్న భరత్ అసలు స్వరూపమిదీ.అక్రమాల పునాదులపై ‘గీతం’.! గోల్డ్ స్పాట్ మూర్తి గీతం ప్రైవేటు కళాశాలను పెట్టి.. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తూట్లు పొడిచి.. గీతం విద్యాసంస్థను వర్సిటీగా విస్తరించారు. రెండుసార్లు ఎంపీగా పూర్తి పదవీకాలం పని చేసిన మూర్తి.. కేవలం సొంత గీతం కళాశాలకు, రక్తసంబం«దీకులైన బంధుగణానికి తప్పించి.. విశాఖ నగరానికి ఈ మంచి పని చేశాను.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెచ్చాను.. అనే ఒక్క పనీ చేయలేదనేది కళ్లెదుటే కనిపించే పచ్చి నిజం. తెలుగుదేశం పాలనలో ఆయన గీతం కళాశాల, తదనంతరం డీమ్డ్ యూనివర్శిటీ పేరిట చేసిన భూ ఆక్రమణల వ్యవహారాలు ఇప్పటికీ కోర్టుల్లో నలుగుతున్నాయి. ఆయన మనుమడు, టీడీపీ ఎంపీ అభ్యర్థి, బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ అదే బాటలో వెళ్తున్నారు. ‘ఎల్కేజీ నుంచి పీజీ వరకు శ్రీలంక యూనివర్సిటీ 25 ఎకరాల్లోనే ఉంది. విశాఖలోని గీతం (గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్) యూనివర్సిటీకి వందల ఎకరాలు కావాలా? అని ఆ పారీ్టకి చెందిన అప్పటి రాష్ట్ర మంత్రి సీహెచ్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు గతంలో తీవ్ర దుమారాన్ని రేపాయి. తొలుత పాతిక ఎకరాల్లో ఏర్పాటైన ఈ విద్యాసంస్థ ఆ తర్వాత క్రమక్రమంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసుకుంటూ 110 ఎకరాల విస్తీర్ణంలో డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి చేరింది. ప్రభుత్వ భూములు కబ్జా చేయడం ఆనక ఎలినేషన్ చేసుకుంటూ వాటిని సొంతం చేసుకోవడం గీతం యాజమాన్యానికే చెల్లింది. సంస్థ ఆధీనంలో ఉన్న 35 ఎకరాల భూములను లీగల్‌గా కైవసం చేసుకునేందుకు అప్పటి కలెక్టర్ ఆరోఖ్యరాజ్ ద్వారా 2012 మే 28న ఎలినేషన్ ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనను రెండేళ్ల పాటు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కిపెట్టింది. అప్పట్లో సీసీఎల్ఏ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈ ప్రతిపాదనను నిర్ద్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలో ఉన్న ఈ భూములను అప్పటికే వివిధ అవసరాల నిమిత్తం భూములు కావాలని కోరిన ఆరు ప్రభుత్వ శాఖలకు కేటాయిస్తూ 2014 ఫిబ్రవరి 26న ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. దళిత విద్యార్థుల కళాశాల, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ నిర్మాణం, బలహీన వర్గాల గృహనిర్మాణం, అధికారులకు రెసిడెన్షియల్ క్వార్టర్స్, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ సెంటర్ ఇలా వివిధ ప్రభుత్వ అవసరాల కోసం ఈ భూములు కేటాయించారు. గీతం మూర్తి వాటినీ వదల్లేదు. వీటికి అదనంగా తమ అ«దీనంలో ఉన్న మరో 7.52 ఎకరాలను కలిపి తమ సంస్థకు కేటాయించాలని, ఈ మేరకు సిఫార్సు చేయాలని 2016లో జిల్లా కలెక్టర్ యువరాజ్‌పై ఒత్తిడి తెచ్చారు. యువరాజ్ బదిలీ అయిన తర్వాత గత కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలు రావడమే తరువాయి వివిధ శాఖలకు కేటాయిస్తూ గత సీఎస్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఆ భూములను గీతం సంస్థకే కట్టబెట్టేందుకు వీలుగా బాబు కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ గజం రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతోంది. ఈ లెక్కన ఎలినేషన్ ప్రతిపాదనలు పంపిన 42.52 ఎకరాల భూముల విలువ అక్షరాల రూ.514 కోట్ల పైమాటే. వీటన్నింటి గురించీ భరత్‌కు తెలుసు. అవి ఆక్రమిత భూములనీ తెలుç Üు. అయినా.. ఆ భూముల్ని తన కబంధ హస్తాల్లో ఉంచేసి.. కొత్తగా భవనాలు నిరి్మంచేందుకు పక్కా ప్లాన్ వేసి.. స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గీతం యూనివర్సిటీ కాంపౌండ్ వాల్‌ను తొలగించి కబ్జాలో ఉన్న 40.51 ఎకరాలను స్వా«దీనం చేసుకుంది. సర్వే నంబర్ 10, 17, ,30, 15, 16, 19, 20లో మొత్తం 26 ఎకరాల ప్రభుత్వ భూమికి రక్షణ వలయం ఏర్పాటు చేశారు. లేదంటే.. ఈ భరతుడు హాంఫట్ చేసేందుకు రెడీగా ఉన్నారు.కారు చౌకగా.. రూ.2 వేల కోట్ల భూమి... అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా.. అధికారం చేతిలో ఉంది కదా అని పెళ్లి కోసం ప్రభుత్వ స్థలాన్ని కట్నంగా కొట్టేసిన వరుడిగా భరత్ గుర్తింపు పొందారు. రూ.2 వేల కోట్ల విలువ చేసే భూమితో పాటు కట్నం కింద ఎంపీ టికెట్‌నూ పొందిన అల్లుడీయన. చంద్రబాబు, బాలకృష్ణ సహకారంతో భరత్.. ఈ దోపిడీని ఎంత పకడ్బందీగా చేశారంటే.. అధికారాన్ని అడ్డంగా ఉపయోగిస్తూ దందాను అధికారికంగానే సాగించేశారు. జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో సర్వే నెంబర్ 93లో ఉన్న 498.9 ఎకరాల ప్రభుత్వ భూమిని భరత్‌కు చెందిన ఏబీసీ అనే ఫెర్టిలైజర్స్ కంపెనీకి కేవలం నామమాత్ర ధరకి కట్టబెట్టారు. ఎకరం రూ.80 వేల చొప్పున మొత్తం 500 ఎకరాలు కూడా కేవలం రూ.4 కోట్లకి కట్టబెట్టారు. జయంతిపురంలో భరత్‌కు ఇచి్చన 500 ఎకరాలకు డిమాండ్ పెంచడానికి ఏకంగా ఆ ప్రాంతం మొత్తాన్ని రాజధాని ఏపీసీఆర్డీఏ పరిధిలోకి తెస్తూ 2015 సెపె్టంబర్లో చంద్రబాబు ఏకంగా జీవోనే జారీ చేసేశారు. భరత్ సంస్థకు భూముల్ని కట్టబెట్టిన కేవలం నెల రోజుల్లోనే జీవో. 207 తీసుకొచ్చి జయంతిపురంలో ఇచ్చిన స్థలం మొత్తాన్ని ఈ జీవో ద్వారా సీఆర్డీఏ పరిధిలోకి తీసుకొచ్చారు. కేవలం ఎకరం రూ.80 వేలకు కట్టబెట్టిన స్థలం సీఆర్డీఏ పుణ్యాన ఈ రోజు ఎకరం రూ.4 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ పెరిగిపోయింది. ప్రస్తుత మార్కెట్ విలువ 500 ఎకరాలకు గాను రూ.2 వేల కోట్ల పై చిలుకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.బ్యాంకులకీ కన్నం వేసేద్దామని.! విద్యావంతుడిగా బిల్డప్ ఇచ్చే భరత్.. రుణాలు ఎగ్గొట్టడంలోనూ సిద్ధహస్తుడే. రుణాల బకాయిలు ఎగవేసిన కారణంగా భరత్ తండ్రి పట్టాభి రామారావు సహా ఇతర కుటుంబీకుల ఆస్తుల జప్తునకు హైదరాబాద్ అబిడ్స్ కరూర్ వైశ్యా బ్యాంకు 2020 ఫిబ్రవరిలో నోటీసులు జారీ చేసింది. టెక్నో యూనిక్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న పట్టాభిరామారావుతో పాటు ఆయన తండ్రి, గీతం వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ఎంవీవీఎస్ మూర్తి కుటుంబీకులు తీసుకున్న రుణం అసలు, వడ్డీ కలిపి రూ.124,39,21,000గా తేల్చింది. జనవరి 21, 2020లోగా చెల్లించాలని బ్యాంకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు వారు స్పందించకపోవడంతో రుణం కోసం విశాఖ జిల్లా గాజువాక మండలం, భీమిలి మండలంలో తాకట్టు పెట్టిన భూములను, విశాఖ నగరం దొండపర్తి ప్రాంతంలోని ఆస్తులను స్వా«దీనం చేసుకుని వేలం వేస్తామంటూ జప్తు నోటీసులు జారీ చేసింది. 2019 అక్టోబర్‌లో భరత్ సహా 11 మంది ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు విశాఖ నగరంలోని ఆంధ్రా బ్యాంకు సీతమ్మధార బ్రాంచ్ డిఫాల్టర్ నోటీసు జారీ చేసింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల వద్ద మెసర్స్ వీబీసీ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కోసం తీసుకున్న రుణం ఎగవేయడంతో అప్పట్లో ఆంధ్రాబ్యాంక్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. భరత్‌కు చెందిన సంస్థ మొత్తం రూ.13,65,69,000 బాకీ పడిందని పేర్కొంది. ఇలా బ్యాంకుల డిఫాల్టర్ భరత్.. విశాఖ ఎంపీ విషయంలోనూ డిఫాల్టరే... అంటూ 2019లో ప్రజలు తీర్పునిచ్చారు.ఏం మొహం పెట్టుకుని ఓట్లడుగుతావ్ భరత్..?2019లో కట్నం కింద విశాఖ ఎంపీ టికెట్ దక్కించుకున్న భరత్.. నిజస్వరూపాన్ని ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో విశాఖ ప్రజలు గమనించారు. ఎన్నికల ముందే తన తాత పవిత్రమైన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని దయ్యాల కొంప అంటూ పొగరుతో మాట్లాడినప్పుడు విద్యావేత్తగా చెప్పుకునే భరత్ కనీసం నోరు మెదపకపోవడం చర్చనీయాంశమైంది. ఎందరో మహానుభావుల్ని అందించిన విశ్వవిద్యాలయాన్ని నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేసినా స్పందించని భరత్ ఒక విద్యావంతుడా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కనీసం ఖండించని భరత్‌ని విశాఖ ప్రజలు ఓటు అనే ఆయుధంతో ‘గీతం’ కే పరిమితం చేసేశారు. రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకున్న చంద్రబాబు అండ్ కో బ్యాచ్‌తో మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఈసారి ఎంపీగా గెలిచి.. ప్రభుత్వం స్వా«దీనం చేసుకున్న రూ.వందల కోట్ల భూముల్ని తిరిగి కబ్జా చేసుకోవాలన్న కుట్రతో భరత్ ప్రయతి్నస్తున్నారు. ఇలాంటి దోపీడీ దారులకు ఓటు వేస్తే.. విశాఖ భవిష్యత్తు నాశనం చేసి.. ఉన్న భూములన్నీ మనవడి పేరున, మనవరాలి కట్నం కోసం ధారాదత్తం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వైజాగ్‌వాసులు దుమ్మెత్తి పోస్తున్నారు. కేవలం విశాఖ ప్రజల్ని దోచుకోవడానికే ఈ కుటుంబం పుట్టిందన్నట్లుగా దోపిడీ పర్వం సాగుతోందని భరత్ వ్యవహారశైలిపై పలువురు విమర్శిస్తున్నారు.భరత్‌పై కేసులు భరత్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. బెంగళూరులోని గీతం క్యాంపస్‌లో విద్యార్థుల భద్రతపై సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే తన కుమారుడు బ్రహ్మసాయిరెడ్డి ఆరో అంతస్తుపై నుంచి పడి మృతి చెందాడనీ.. దీనికి కారణం గీతం అధినేత భరత్ నిర్లక్ష్యమేనని దాసరి వెంకట శివారెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై 2024లో బెంగళూరులోని దొడబళ్లాపుర పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 304(ఏ) కింద భరత్‌పై కేసు నమోదైంది. అదేవిధంగా.. బెంగళూరు గీతం క్యాంపస్ నిర్మాణం పూర్తయినా డబ్బులు చెల్లించడం లేదంటూ ఎంఎస్ రామయ్యా ప్రై.లిమిటెడ్‌సంస్థ భరత్‌పై దొడబళ్లాపుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు భరత్‌పై 506, 379,380, 420,448, 323, 506(బీ) సెక్షన్లపై కేసు నమోదు చేశారు. -
ఏపీ వివరణ ఆమోదయోగ్యమైనదే
సాక్షి, విజయవాడ: ఆర్టీసీ వివాదంలో ఆంధ్రప్రదేశ్ ఇస్తోన్న వివరణ సరైనదే అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ. శనివారం దాసరి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రెండు రాష్ట్రాల మధ్య ఐదేళ్ల పాటు ఉన్న ఒప్పందం ముగిసింది. దాంతోనే ఈ ఇబ్బంది తలెత్తింది. మేము ఎన్ని కిలో మీటర్లు తిప్పితే మీరు అన్నే తిప్పాలి అంటూ తెలంగాణ, ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోంది. లక్ష 26 వేల కిలోమీటర్లు తిప్పుతున్న ఏపీ దానిని తగ్గించుకునేందు సైతం ముందుకు వచ్చింది. ప్రైవేటు ట్రావెల్స్ వల్ల ఏపీకి మూడు కోట్లు, తెలంగాణకు రెండు కోట్ల రూపాయల నస్టం వస్తుంది. ప్రైవేటు ట్రావెల్స్ తగ్గిస్తే ప్రజలకు ఉపయోగం అని ఏపీ ప్రభుత్వం ఆలోచన. ప్రైవేటు వారు బాగుపడిన ఫర్వాలేదు కానీ ఏపీకి లాభం రాకూడదన్న రీతిలో తెలంగాణ ప్రభుత్వం కక్ష పూరిత వైఖరిని అవలంబిస్తోంది. ఆర్టీసీ 400 రూపాయలు వసూలు చేస్తే.. ప్రైవేట్ ట్రావేల్స్ 1000 రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికైనా ఇరువురు సీఎంలు చొరవ తీసికోవాలి’ అని కోరారు. (చదవండి: టీఎస్ఆర్టీసీ కోరినట్లే ప్రతిపాదనలు పంపాం) చంద్రబాబు తప్పు చేశాడు ‘విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీ మూర్తి గారు ప్రభుత్వ భూమిని కొంత ఆసుపత్రి కోసం తీసుకున్నామని ఎప్పుడో చెప్పారు. బీఆర్ఎస్ ప్రకారం ఫైన్ వేయవచ్చు.. చర్యలు తీసుకోవచ్చు కూల్చి వేయడం కరెక్ట్ కాదు. కట్టేటప్పుడు చూస్తూ ఉండి కట్టాక కూల్చేస్తున్నారు. విశాఖలో2వేల ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమణలో ఉంది. కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని ఏపీలో బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తారు. మోదీ ఏపీకి ఇచ్చిన హామీలు నిరవేర్చలేదు. పోలవరం ప్రాజెక్ట్‌కు కావాల్సిన డబ్బులు కేంద్రమే ఇవ్వాలి. ఇది జాతీయ ప్రాజెక్ట్.. పోలవరం కడతా అని చంద్రబాబు తప్పు చేశాడు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సుమారు 5వేల కోట్ల రూపాయలు జీఎస్టీ బకాయిలు రావాలి. కేంద్ర మంత్రులు రాష్టానికి వచ్చి అబద్దాలు చెప్పి పోతున్నారు’ అంటూ మండి పడ్డారు. (చదవండి: గీతం వర్సిటీలో ఆక్రమణల తొలగింపు) మోదీ, ట్రంప్ నాటకరాయుళ్లు ‘ప్రపంచలోనే గొప్ప నాటకరాయుళ్లు, రాజకీయ కళాకారులు ట్రంప్, మోదీలు. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు చనిపోతే.. బిహార్ ఎన్నికల్లో ఓట్లకోసం బిహార్ రెజ్మెంట్ అని మోదీ ప్రచారం చేస్తున్నారు. బిహార్ రెజ్మెంట్లో బిహారీలు ఒక్కరే ఉండరు. తెలంగాణ వాసిని బిహార్ వాసిగా చెపుతున్నారు. ఇది జాతి ద్రోహం కాదా. నైతికంగా ఇంత దిగజారిన ప్రధానిని మేము చూడలేదు. శవాల మీద పేలాలు వేరుకునే తంతుగా అబద్దాలతో ఓట్లు అడుగుతున్నారు. ఓట్ల కోసం దేశాన్ని తప్పు దోవపట్టించే ఇలాంటి ప్రధానిని మేము చూడలేదు’ అని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీడీపీ కార్యాలయం కూడా ఆక్రమణలోనే..
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్సిటీ ఆక్రమణలో 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. భూ ఆక్రమణలపై అధికారులు వారి బాధ్యతను వారు నిర్వహిస్తే టీడీపీ నేతలు ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడి భూమి స్వాధీనం చెసుకుంటే టీడీపీ నేతలు ఎందుకు గోగ్గులు పెడుటున్నారని దుయ్యబట్టారు. రూ.800 కోట్లు విలువ చేసే 40 ఎకరాలు భూమిని గీతం యూనివర్సిటీ అక్రమించిందని, భూ ఆక్రమణలు తొలగిస్తే టీడీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గీతం యూనివర్సిటీ ఆక్రమించిన భూమిపై కోర్టులో కేసుల్లో లేదు, ఓ ప్రైవేట్ యాజమాన్యం భూమి అక్రమిస్తే వాటిని స్వాధీనం చేసుకోవడం తప్పా అని మండ్డిపడ్డారు. టీడీపీ పొలిట్‌బ్యూరోలో ఉన్నవారంతా అత్యంత అవినీతికి పాల్పడ్డవారే అని, ఈఎస్ఐ స్కామ్‌లో ఉన్న అచ్చెన్నాయుడికి టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చిందని దుయ్యబట్టారు. భూములు కాజేసినవారికే టీడీపీలో పదవులు ఇస్తున్నారని, టీడీపీ కార్యాలయం కూడా ఆక్రమణలోనే ఉందన్నారు. ఆక్రమించిన భూమికి నోటీసీలు ఇవ్వకుండా, వందల కోట్ల విలువ చేసే భూమి అక్రమిస్తే చూస్తూ ఉరుకోవాలా అని నిలదీశారు. ప్రభుత్వం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపుతో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. విశాఖలో ఆక్రమణకు గురైన విలువైన భూములు కాపాడుతామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. టీడీపీ హయంలో వేసిన సిట్ వాస్తవాలు బైటకు రాలేదని, గజం భూమి కూడా సీఎం వైఎస్ జగన్ పాలనలో కబ్జాకు గురికాదని అన్నారు. చదవండి: గీతం యూనివర్సిటీలో ఆక్రమణల తొలగింపు గీతం యూనివర్సిటీలో గాంధీ పేరు చెప్పుకొని గాడ్సే పనులు జరుగుతున్నాయని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు మండిపడ్డారు. విలువైన భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో విశాఖ ప్రజల్లో సంతోషం ఉందని తెలిపారు. గీతంలో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున విశాఖలో భూములను మింగేశారని అన్నారు. మాజీ మేయర్ సబ్బంహరితో పాటు పలువురు ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీ యాజమాన్యం గాంధీ పేరు చెప్పుకొని గాడ్సే పనులు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించినప్పటికీ తిరిగి స్వాధీనం చేసుకోవడం ఖాయం అన్నారు. ఆక్రమణలు తొలగిస్తే రాజకీయం చేయడం తగదని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ పేర్కొన్నారు. -
సీఏఏపై ప్రజలు అధ్యాయనం చేయాలి: ఉప రాష్ట్రపతి
సాక్షి, విశాఖపట్నం : ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణ జీవితం ఆధారంగా రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. విశాఖ గీతం విశ్వ విద్యాలయంలో శనివారం ‘ఏ చైల్డ్ ఆఫ్ డెస్టినీ ఆన్ ఆటో బయోగ్రఫీ’ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, గీతం యూనివర్సిటీ అధ్యక్షుడు శ్రీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. విశాఖ ప్రాంతంలో ఏడాదిన్నరకాలం పాటు ఉంటూ జీవితంలో ఏ విధంగా అడుగులు వేయాలో నేర్చుకున్నానని తెలిపారు. మహత్మాగాంధీ సిద్ధాంతాలు, ఆశయాలు నేటి తరానికి అందిస్తున్న వ్యక్తిగా రామకృష్ణ నిలిచారని, అందుకే ఆయన అంటే చాలా ఇష్టమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. సమాజంలో మానవ ప్రమాణాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయని, వనరులు పుష్కలంగా ఉన్న దేశం ఎందుకు ముందుకు వెళ్లలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో జీడీపీలో 5వ స్థానంలో ఇండియా ఉందని, భారత విద్యా వ్యవస్థలో మార్పు రావాలని భావించారు. భారతీయ పౌరులకు ఎవరిపై వివక్షత లేదని, భారతదేశం ఎవరిపైన దండయాత్ర చేయలేదని ప్రస్తావించారు. అదే విధంగా సీఏఏపై ప్రజలు అధ్యాయనం చేయాలని సూచించారు. -
బ్యాంకింగ్ రంగంపై గీతంలో యూబీఐ అధ్యయన పీఠం
సాక్షి, సాగర్‌నగర్ : బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులపై నిరంతర అధ్యయానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) అధ్యయన పీఠాన్ని నెలకొల్పడానికి కృషి చేస్తామని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కతూరియా హామీ ఇచ్చారు. యూబీఐ కార్పొరేట్ కార్యాలయం ఉన్నతాధికారుల బృందం బుధవా రం వర్సిటీని సందర్శించింది. ఈ సందర్భంగా కతూరియా మాట్లాడుతూ దేశంలోని బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. గీతం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.గంగాధరరావు మాట్లాడుతూ గీతం ప్రగతిని వివరించారు. వీసీ ప్రొఫెసర్ ఎం.ఎస్.ప్రసాద్ గాంధీయన్ అధ్యయన కేంద్రం, బ్యాంకింగ్ అధ్యయన కేంద్రం ప్రతిపాదనల గురించి వివరించారు. అనంతరం కతూరియాను వీసీ సత్కరించారు. కార్యక్రమంలో గీతం కార్యదర్శి బి.వి.మోహనరావు, పాలకవర్గ సభ్యుడు హమ్జాకె.మెహది, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ కె.వి.గుప్తా, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గోపాలకృష్ణ, యూబీఐ జనరల్ మేనేజర్ ఎస్.ఎస్.చంద్రశేఖర్, ప్రాంతీయ అధికారి కె.ఎస్.ఎన్.మూర్తి, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. -
శివథాను పిళ్లెకి గీతం యూనివర్సిటీ అవార్డు
సాగర్‌నగర్ (విశాఖ): గీతం విశ్వవిద్యాలయం 35వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది గీతం ఫౌండేషన్ అవార్డును సుప్రసిద్ధ శాస్త్రవేత్త బ్రహ్మాస్ క్షిపణి రూపశిల్పి డాక్టర్ ఎ.శివథాను పిళ్లైకి అందజేయనున్నట్టు వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య జి. సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఈనెల 8న విశాఖలో గీతం వ్యవస్థాపక దినోత్సవంలో గీతం అధ్యక్షుడు డాక్టర్ ఎం.వి.వి.ఎస్.మూర్తి పిళ్లైలకి ఈ అవార్డుతో పాటు రూ. పది లక్షల నగదు బహుమతిని అందజేస్తారు. భారత రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి అవసరమైన పరిశోధనను జరపడమేకాక భారత్ - రష్యా ఉమ్మడి ప్రాజెక్టు అయిన బ్రహ్మాస్ ఏరో స్పేస్ ప్రాజెక్టుకు మేనేజింగ్ డెరైక్టర్‌గా పిళ్లై వ్యవహరించారు. భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా ఆయన విశిష్ట సేవలు అందించి, భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ విశిష్ట శాస్త్రవేత్తగా ఆయన వ్యవహరిస్తున్నారు. -
‘గీతం’ ఫలితాల్లో తెలంగాణ టాప్
పటాన్చెరు: గీతం విశ్వవిద్యాలయం హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగళూరు ప్రాంగణాలలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కోర్సులలో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించిన గీతం ప్రవేశ పరీక్ష (గాట్-2015) ఫలితాలను శనివారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా 38 పట్టణాల్లో గత నెలలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 75 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. గాట్ టాప్-10 ర్యాంకర్లలో ఐదు ర్యాంకులను తెలంగాణ విద్యార్థులు సాధించారు. అందులో హైదరాబాద్‌లోని ఫిట్జీ జునియర్ కళాశాల విద్యార్థి వి.కె.విశ్రీత్ (269) ఐదవ ర్యాంకు, నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థి ఎస్.ఎన్. వెంకటేశ్వరన్ (268)కు 6వ ర్యాంకు, తరువాతి 7,8,10 ర్యాంకులలో హైదరాబాద్‌లోని శ్రీచైతన్య జునియర్ కళాశాల విద్యార్థులు ఎస్.సాయి శ్రావణి (265), వి.సుధాన్యూ (264), ఖమ్మం విద్యార్థి డి.సాయి వినీత్‌కుమార్ (263) మార్కులు సాధించారు. మొదటి పది ర్యాంకర్లకు తొలి ఏడాది ఫీజు మినహాయింపు, ఆ తరువాత 90 ర్యాంకర్లకు 50 శాతం రాయితీ ఉంటుందని ఆయన తెలిపారు. జూన్ 9 నుంచి అడ్మిషన్ కౌన్సెలింగ్ పవేశ పరీక్ష రాసిన వారిలో 28 వేల మందిని మొదటి దశ కౌన్సెలింగ్ అనుమతిస్తామని వీసీ ప్రకటించారు. జూన్ 9 నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్‌లోని గీతం ప్రాంగణం, హైదరాబాద్ సిటీ, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, బెంగళూరు గీతం ప్రాంగణాలలో నిర్వహించనున్న ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తామన్నారు. దీనికి సంబంధించిన సమాచారం గీతం వెబ్సైట్ నుంచి విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. -
భారత్ అభివృద్ధిలో భాగస్వాములు కండి
‘గీతం’ విద్యార్థులకు ఎంవీవీఎస్ మూర్తి పిలుపు సాక్షి, విశాఖపట్నం: ఉద్యోగం కోసం ఏ దేశానికి వెళ్లినా అక్కడి టెక్నాలజీని ఆకళింపుజేసుకొని సొంతగడ్డకు తీసుకురావాలని, ఇక్కడి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గీతం వర్సిటీ విద్యార్థులకు సంస్థ చైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి పిలుపునిచ్చారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో వివిధ ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన 2,527 మంది గీతం విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా ఆయా సంస్థల తరపున నియామకపత్రాలు అందజేశారు. మంగళవారం గీతం వర్సిటీలో నిర్వహించిన ఎచీవర్స్ డే ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ సెబీ ఆదేశాల ప్రకారం ప్రతి కంపెనీ డెరైక్టర్లలో మూడో వంతు మహిళలను నియమించాల్సి ఉందని, విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక సరికొత్త ఆలోచనతో బిజినెస్ లీడర్లు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో గీతం వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ జి.సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.గంగాధరరావు, ప్రొ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ డి.హరినారాయణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.పోతరాజు, ప్లేస్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఎచీవ్మెంట్ సాధించిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరుకావడంతో వేదిక స్నాతకోత్సవాన్ని తలపించింది. -
మిస్సైల్స్ రూపకర్త అవినాశ్ చందర్‌కు డాక్టరేట్
విశాఖపట్నం:మిస్సైల్స్ రూపకర్త, కేంద్ర రక్షణశాఖ శాస్త్రసాంకేతిక సలహాదారు డాక్టర్ అవినాశ్ చందర్‌కు గీతం విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. గీతమ్ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా డాక్టర్ అవినాశ్ చందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు డాక్టర్ ఆఫ్ సైన్స్ ప్రదానం చేశారు. సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ, దర్శక నిర్మాత రాఘవేంద్రరావు, పారిశ్రామికవేత్త మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్లకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. ** -
చైతన్య స్ఫూర్తి
=మానవత్వంతో మనసు గెలిచిన అ‘సామాన్యులు’ =‘గీతం’లో స్ఫూర్తి రగిలించిన వారి ప్రసంగాలు సాక్షి, విశాఖపట్నం: డ్యూటీ అయిపోయినా నాకెందుకులే అనుకోకుండా దేశం కోసం ముందుకు కదిలి కరుడుగట్టిన ఉగ్రవాదుల తూటాలను సైతం లెక్కచేయకుండా కసబ్‌ను పట్టుకున్న ఓ సాహసోపేత పోలీస్ అధికారి... మణిపూర్ రాష్ట్రంలో ఇంటికొకరు చేత్తో తుపాకీ పట్టుకుని జీవితాలనే కాలరాసుకుంటుంటే దానికి వ్యతిరేకంగా పోరాడి ప్రపంచంలోని 100మంది ప్రభావశీల మహిళల్లో ఒకరిగా నిలిచిన ఓ సాహసనారి.. 14 ఏళ్ల జైలుశిక్ష అనుభవించి బందిపోట్ల సావాసంతో గ్యాంగ్‌స్టర్‌గా మారాలనుకుని చివరకు అందరికీ పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిగా మారిన ఓ మారిన మనిషి... కేవలం ఆటో తోలుతూ తన తెలివితేటలతో యావద్దేశానికి ఐకాన్‌లా మారిన పదో తరగతి చదువుకున్న ఆటోవాలా.. ఇలా వీరంతా ఒకేచోట చేరి వారి విజయ గాథలు వినిపిస్తే.. ? గీతం యూనివర్సిటీలో శనివారం అదే జరిగింది. టెడ్ఎక్స్ కార్యక్రమంలో వారు యువతలో స్ఫూర్తి నింపారు. ప్రాణం పోయినా ఫర్వాలేదనిపించింది తీవ్రవాది కసబ్‌తోపాటు మరికొందరు ముంబైపై దాడులకు తెగబడ్డ సమయానికి గంట ముందు డీబీ మార్ స్టేషన్లో డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిపోయాను. కాని విషయం తెలిసిన వెంటనే మనసు ఊరుకోక వెంటనే సంఘటన స్థలానికి వెళ్లా. కసబ్‌ను పట్టుకున్నప్పుడు పాకిస్థాన్ బుకాయించింది. కాని మేం కసబ్ పాకిస్థానీ అని రుజువు చేయడంలో విజయం సాధించాము. దేశ భద్రతను కాపాడే బాధ్యత పోలీసులకే కాదు ప్రతి ఒక్క పౌరుడిపైనా ఉంది. దేశం బాగుంటేనే మనం బాగుంటాం. జనవరి 26న, ఆగస్టు 15న జాతీయ జెండా ఎగరేస్తాం. ఆ తర్వాత అది రోడ్డుపక్కన పడి వున్నా పట్టించుకోం. ఆ ఒక్కరోజేనా మన దేశభక్తి. పోలీసులు రోజూ ఎన్నో మంచి పనులు చేస్తుంటారు. కాని చెడు సంఘటనల గురించే ఎక్కువగా ఫోకస్ అవుతుంది. కసబ్‌ను ఉరి తీసే విషయంలో తీవ్ర జాప్యం జరిగిందని మనమంతా అనుకుంటున్నాం. కాని ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుతమైన న్యాయవ్యవస్థ మన దేశంలో ఉంది. ఎందుకంటే ఒక నిందితుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు మన న్యాయవ్యవస్థలో ఉన్నన్ని అవకాశాలు మరెక్కడా లేవు. కసబ్‌ను పట్టుకున్న తర్వాత మేం గర్వపడ్డాం. అతడిని ఉరి వేశాక మన దేశ బలం గురించి ప్రపంచానికి తెలిసినప్పుడు పోలీసుగా జీవితంలో ఎప్పుడూ లేని ఆనందాన్ని పొందాను. ఆ సమయంలో విద్రోహ శక్తులు ప్రతీకారేచ్ఛతో మమ్మల్ని ఏంచేసినా ఫర్వాలేదనిపించింది. కులం అనే పదం మనుషుల్లో ఐకమత్యాన్ని దెబ్బతీస్తోంది. మా అబ్బాయి చదువుకునే కాలేజీలోగాని, ఇతరత్రా సర్టిఫికేట్లో గానీ కులం కాలమ్‌లో ఇండియన్ అనే నమోదు చేయించాను. -సంజయ్ గోవిల్కర్ మానవత్వమే నా మతం దేవుడు మనకేం ఇవ్వకపోయినా మనం ఎదుటివారికి తోచిన సాయం చేస్తే.. అందులో ఉన్న ఆనందం మరెందులోనూ దొరకదు. నేనుండేది ముంబైలో. నడిపేది ఆటో. 14 ఏళ్లుగా అదే వృత్తి. ఆటో నడిపితే వచ్చేది కొంత మొత్తమే అయినా ఉన్న దాంట్లోనే క్యాన్సర్ పేషెంట్లు, వీధి బాలలకు సాయం చేస్తున్నా. రోగులకు మందులు కొనుక్కునే స్థోమత లేకుంటే ఆదుకోవడానికి వెనుకాడను. ఆటో ఎక్కే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బండిలో టీవీ, దినపత్రికలు, ఫోన్, ఇంటర్నెట్, టీ, సెన్సెక్స్ వివరాలు అందిస్తాను. విదేశీ పర్యాటకులు రోజంతా నా ఆటో బుక్ చేసుకుని తిరుగుతుండడం అప్పుడప్పుడు గర్వకారణంగా అనిపిస్తుంది. రోజుకు నాకు 200 రూపాయలు మిగులుతుంది. అప్పుడప్పుడు టిప్‌లు వస్తుంటాయి. ఇవన్నీ నేను సాయం చేయడానికి ఉపయోగపడతుంటాయి. ఉన్నదానిలోనే సాయం చేస్తుంటాను. ఫోన్లో నా ఆటో బుక్ చేసుకోవడానికి చాలామంది పోటీపడుతుంటారు. ఇదే నా గురించి దేశం మొత్తం తెలిసేలా చేసింది. వృద్ధులు, వికలాంగులు, దంపతులకు నా ఆటోలో 20 నుంచి 50 శాతం రాయితీ ఇస్తుంటాను. ఇవన్నీ చూసి నన్ను టైటాన్, ఐబీఎం, మేనేజ్మెంట్ క్యాంపస్‌లు ప్రసంగాలివ్వడానికి పిలుస్తున్నాయి. ఎందుకు ఇదంతా చేస్తున్నానంటే.. మానవత్వంతో మెలగడం నాకిష్టం. అదే జీవితానికి పెద్ద తృప్తి. -సందీప్ బచ్చే రోగికి మానసిక సాంత్వన చేకూర్చాలి వైద్యం అంటే రోగులను పరిశీలించి, చికిత్స చేసి పంపించేయడం కాదు. వారి కి మానసికంగా శారీరకంగా సాంత్వన చేకూర్చాలి. అప్పుడే వైద్యవృత్తికి గౌర వం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వాసిగా నేను ఎంతో గర్వపడతాను. కీళ్ల శస్త్ర చికిత్సలో ఒక్క ఏడాదిలో 4 వేల ఆపరేషన్లు చేసి ఆసియా రికార్డు నెలకొల్పినప్పుడు కొంత ఆనందం కలిగించింది. డాక్టర్ ఎంత పని ఒత్తిడిలో ఉన్నా రోగితో ఎంత సంభాషిస్తే అంతగా వారి నుంచి విషయాలు తెలుసుకుని చికిత్స చేయవచ్చు. అప్పుడే నిజమైన డాక్టర్ అనిపించుకుంటారు. -డాక్టర్ ఎ.వి.గురవారెడ్డి మహిళ సాధించలేనిది లేదు మహిళలు తమను తాము తక్కువ అంచనా వేసుకోవద్దు. వారు ఏ విషయంలోనూ తీసిపోరు. కాని ఆత్మవిశ్వాసం కొరవడడంతో విజయం సాధించడంలో కొందరు వెనుకబడిపోతున్నారు. చిన్నప్పటి నుంచి వ్యాసాలు రాయడం ఇష్టం. మణిపూర్ రాష్ట్రవాసిగా అక్కడ మహిళల కష్టాలు కరిగించాయి. అడుగడుగునా ఆయుధ పేలుళ్ల కారణంగా నరకయాతన పడ్డారు. అటువంటి వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆయుధ హింసకు వ్యతిరేకంగా పోరాడడంతోపాటు దిక్కులేని మహిళలకు దారి చూపాలనే ఆకాంక్షతో పనిచేయడం చాలా సంతృప్తినిస్తోంది. మణిపూర్‌లో ఇప్పటికీ ప్రజాస్వామ్యంలేదు. విశాఖ వస్తుంటే నాకు కలిగిన ఆనందం వేరు. ఇక్కడ విద్యాసంస్థలు, ఐటీ, పర్యాటకం చాలా ఆనందం కలిగిస్తున్నాయి. ఇటువంటి సమాజం మా ప్రాంతంలో తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నాం. మహిళలు తమకు ముందు వెనుకా ఎవరూ లేరని ఎప్పుడూ ఆందోళన చెందకూడదు. ఏదోలా స్వయం ఉపాధిపై నిలబడితేనే జీవితానికి సార్థకత. మణిపూర్‌తోపాటు 8 రాష్ట్రాల్లో నాతో కలిసి వచ్చే మహిళలు.. బట్టలు నేయడం, కుట్లు అల్లడం వంటి కుటీర పరిశ్రమలు స్థాపించుకునేలా మా సొంత డబ్బులతో వారిని ప్రోత్సహిస్తున్నాం. -బినలక్ష్మి నెప్రామ్ ప్రేమించడంలో ఉన్న ఆనందం అర్థమైంది.. క్షణికావేశం జీవితాన్ని నాశనం చేస్తుందనడానికి నేనే ఉదాహరణ. హత్యచేసి 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాక గ్యాంగ్‌స్టర్ కావాలనుకున్నా. కాని పసిపిల్లలు, పెద్దలు నన్ను చూసిన తీరు నాలో మార్పు తీసుకువచ్చింది. మాది బీహార్‌లోని పాట్నా. మా తల్లిదండ్రులు చేసిన అప్పు తీర్చలేదని మా ఊరి భూస్వామి నా కళ్లముందే అదేపనిగా నిందించాడు. తట్టుకోలేక తుపాకీతో మూడు రౌండ్లు కాల్చి చంపేశాను. న్యాయస్థానం 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జైల్లో బందిపోట్లతో కలిగిన పరిచయం.. బయటికొచ్చాక గ్యాంగ్‌స్టర్‌గా మారిపోవాలన్న కోరికను కలిగించింది. కాని అప్పుడప్పుడు జైల్లో ఖైదీల పిల్లలకు పాఠాలు చెప్పడంతోపాటు దూరవిద్య ద్వారా న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నా. శిక్ష ముగించుకుని ఇంటికి వచ్చాక.. ఊరి జనం నన్ను చూడాలంటేనే భయపడిపోయేవారు. దీంతో నా మనసు మారింది. ఏదో మంచి చేయాలనే తలంపుతో మా ఊరిలో పాఠశాల ప్రారంభించాను. ఇప్పుడు 400మంది విద్యార్థులకు ఉచితంగా పాఠాలు నేర్పుతున్నా. -దీపక్ కుమార్