అన్నవరంలోని ఓ రెస్టారెంట్‌లో ఫర్నిచర్ ధ్వంసం, సిబ్బందిపై దాడి
ఎమ్మెల్యే బాలకృష్ణకు నిర్వాహకుల ఫిర్యాదు
నిందితులపై కేసు పెట్టాలని సీఎంవో నుంచి ఫోన్ చేయించిన వైనం
అయితే అనుచరులపై కేసు లేకుండా మంత్రిస్థాయిలో పోలీసులపై ఒత్తిళ్లు
తలలు పట్టుకుంటున్న పోలీసులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారిని ఆనుకుని కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలోని ఓ రెస్టారెంట్‌లో తెలుగు తమ్ముళ్లు విధ్వంసానికి పాల్పడ్డ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. బాధితుల కథనం మేరకు.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక రియల్టర్, ఇద్దరు హేచరీల నిర్వాహకులు కలిసి పొరుగున అన్నవరంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఒక రెస్టారెంట్‌కు ఇటీవల వచ్చారు. రెస్టారెంట్‌లో ఎటువంటి ఆర్డర్ ఇవ్వకుండా గంటల తరబడి కూర్చోవడంపై రెస్టారెంట్ నిర్వాహకులు ప్రశి్నంచారు.
కస్టమర్లు వస్తున్నారు, వ్యాపారం దెబ్బతింటున్నదని టేబుల్ ఖాళీ చేయాలని రెస్టారెంట్ సిబ్బంది వారికి సూచించడంతో ఒక్కసారిగా వారు రెచి్చపోయారు. హోంమంత్రి తాలూకా తమనే రెస్టారెంట్ నుంచి వెళ్లిపోమంటావా, ఖాళీ చేయిస్తావా అంటూ రెస్టారెంట్‌లో నానా రాద్ధాంతం సృష్టించారు. నిర్వాహకులు సర్దిచెబుతున్నా లెక్క చేయకుండా రెస్టారెంట్ ఎలా నిర్వహిస్తావో చూస్తామంటూ బెదిరించి కురీ్చలు తన్నేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారు అదే రోజు సాయంత్రం సుమారు 20 మంది అనుచరులతో గుంపుగా మరోసారి వచ్చి రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి నిర్వాహకులతో గొడవకు దిగారు.
మంత్రి తాలూకా అంటూ బిల్లు ఇచ్చేది లేదని మీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ కురీ్చలు తన్నేసి నానా గొడవ సృష్టించి సిబ్బందిని బయటకు తీసుకొచ్చి చితకబాదారు. రెస్టారెంట్ నిర్వాహకులు కూడా తెలుగుదేశంపార్టీ సానుభూతిపరులే కావడంతో.. విషయాన్ని సిబ్బంది విదేశాల్లో ఉన్న హోటల్ నిర్వాహకునికి తెలియజేశారు. దీంతో ఆయన తన ఆతీ్మయుడైన సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఫోన్‌చేసి మంత్రి పేరు చెప్పి గలాటా సృష్టిస్తున్నారని వారిని కట్టడి చేసి కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారని తెలిసింది. రెస్టారెంట్‌లో కురీ్చలు గిరాటేసి దాడులకు పాల్పడ్డ గలాటా తాలూకా వీడియోలు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
మంత్రి పేరు చెప్పి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన సీరియస్‌గా తీసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎంవో ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఇంతలో గలాటా సృష్టించిన తెలుగు తమ్ముళ్లు అక్కడి నుంచి జారుకున్నారు. ఈ వివాదంపై రెస్టారెంట్ నిర్వాహకులు అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.
విషయం తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు మంత్రి ద్వారా రాజీ కోసం ప్రయతి్నస్తూ కేసు లేకుండా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇదే విషయమై అన్నవరం సబ్ ఇనస్పెక్టర్ కిశోర్‌బాబును సంప్రదించగా రెస్టారెంట్‌లో స్వల్ప వివాదం జరిగినట్టు స్థానికుల ద్వారా తెలిసిందన్నారు. అయితే గొడవ విషయంపై తమకు నిర్వాహకుల నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment