గణేష్‌ ఉత్సవాలతో నగరానికి కీర్తి | Ganesh celebration of the glory of the city | Sakshi
Sakshi News home page

గణేష్‌ ఉత్సవాలతో నగరానికి కీర్తి

Published Sat, Sep 10 2016 10:19 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

వినాయక పూజలో దానం నాగేందర్‌ తదితరులు

వినాయక పూజలో దానం నాగేందర్‌ తదితరులు

అబిడ్స్‌: గణేష్‌ ఉత్సవాలతో నగర ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతోందని మాజీ మంత్రి దానం నాగేందర్‌ పేర్కొన్నారు. గోషామహల్‌ హిందీనగర్‌లో మార్కెట్‌ మాజీ డైరెక్టర్‌ టి. సతీష్‌కుమార్‌ ఏర్పాటు చేసిన గణేష్‌ మండపంలో శనివారం దానం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో గ్రేటర్‌ కాంగ్రెస్‌ నేతలు సతీష్, బీజేపీ నేత బంగారు సుధీర్‌ కుమార్, టీఆర్‌ఎస్‌ నాయకులు ధన్ రాజ్, కేంద్ర ఫిలిం సెన్సార్‌ బోర్డు సభ్యులు గడ్డమీది నరేందర్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement