అబిడ్స్‌ వ్యభిచారం కేసు.. రాంనగర్‌ అఖిల్‌ పహిల్వాన్‌ అరెస్ట్‌ | Ramnagar Akhil Pailwan Arrested Due To This Reason | Sakshi
Sakshi News home page

రాంనగర్‌ అఖిల్‌ పహిల్వాన్‌ వ్యభిచార ముఠా కేసులో కొత్త కోణాలు

Published Sat, Jan 20 2024 2:33 PM | Last Updated on Sat, Jan 20 2024 5:17 PM

Ramnagar Akhil Pailwan Arrested Due To This Reason - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వ్యభిచారం ముఠా గుట్టు రట్టైంది. ఓ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ ముఠా పట్టుబడింది. రామ్‌నగర్‌కు చెందిన అఖిల్‌ పహిల్వాన్‌ ఆధ్వర్యంలో ఈ దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల తనిఖీల్లో 16 మంది అమ్మాయిలు, ఆరుగురు కస్టమర్లు, ఇద్దరు ఆర్గనైజర్లు పట్టుబడ్డారు. వారి నుంచి 22 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి ఉద్యోగాల పేరుతో బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం. రామ్‌నగర్‌ అఖిల్‌ పహల్వాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

రాంనగర్ అఖిల్ వ్యభిచారం కేసు పోలీసుల దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అఖిలేష్ పూర్వ ట్రాక్ రికార్డ్‌లను పోలీసులు బయటికి తీయగా.. అతడి  మొబైల్‌లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు. అఖిల్‌ రోజుకి 20 నుంచి 30 కాల్స్‌ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు తేలింది.  పశ్చిమబెంగాల్‌ నుంచి 16 మంది అమ్మాయిలను ఫార్చ్యూన్ హోటల్లో 25 రోజులుగా వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. 

ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వకుండా 25 రోజులుగా అమ్మాయిలను హోటల్లో ఉంచిన అఖిల్.. ఈ 25 గదుల్లో 16 రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నట్లు విచారణలో తేలింది. సినీ ప్రముఖులకు అమ్మాయిలను సరాఫరా చేస్తున్నట్లు అఖిల్‌పై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సలువడి అఖిలేష్, పక్కల రఘుపతి, అభిషేక్ బాటి, కేశవ్ వ్యాస్, అబ్దుల్ ఖలీద్, సంతోష్ అరెస్ట్ చేసి లోతుగా విచారిస్తున్నారు.

చదవండి: పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్‌ గుప్తా అప్పగింతకు కోర్టు ఓకే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement