prostitution
-
నైజీరియన్ యువతులతో వ్యభిచారం...
తిరువొత్తియూరు: కోయంబేడు మార్కెట్ ఎదురుగా ఉన్న మంగమాల్ నగర్ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతోందని స్థానిక పోలీసులకు బుధవారం సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ అరుల్ మణిమారన్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. నైజీరియాకు చెందిన యువతులు ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత వ్యభిచారం నిర్వహిస్తున్న నైజీరియాకు చెందిన 9 మంది యువతులను పోలీసులు రక్షించారు. అద్దె ఇంట్లో ఉంటూ సెల్ ఫోన్ యాప్ ద్వారా కస్టమర్లను సంప్రదించి ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు సమాచారం. రక్షించబడిన 9 మంది నైజీరియన్ మహిళలను మైలాపూర్‌లోని ప్రభుత్వ ఆశ్రమానికి అప్పగించారు. వీరితో సంబంధం ఉన్న ముఠాలపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: వీధుల్లో వ్యభిచారం!
మూసాపేట: రాష్ట్రంలో వ్యభిచారం చట్టరీత్యా నేరం. దీంతో సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టారు. కమిషనరేట్ పరిధిలో బస్టాప్‌లు, నిర్మానుష్య ప్రాంతాలలో అడ్డాలు ఏర్పాటు చేసుకొని వీధుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుల ఆటకట్టించారు. గత నెల రోజుల్లో వివిధ ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న 53 మంది మహిళలు, ట్రాన్స్జెండర్లను బైండోవర్ చేశారు. వ్యభిచారంపై నిఘా పెట్టేందుకు మానవ అక్రమ రవాణా విభాగం (ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్‌తో పాటు కూకట్పల్లి, కేపీహెచ్‌బీ పోలీసులతో బాలానగర్ డీసీపీ కే సురేష్ కుమార్ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీటికి కూకట్పల్లి ఏసీపీ కే శ్రీనివాస రావు నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో ఒక ఏసీపీ, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, 7 మంది ఎస్ఐలు, ఇద్దరు ఏఎస్ఐలు, 36 మంది కానిస్టేబుళ్లతో మొత్తం 49 మంది సిబ్బంది ఉంటారు. బుధవారం రాత్రి భాగ్యనగర్ బస్టాప్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ల పరిధిలో జాయింట్ ఆపరేషన్స్ నిర్వహించి 31 మంది మహిళలు, నలుగురు ట్రాన్స్జెండర్లను బైండోవర్ చేశారు. బీఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్–35 కింద నోటీసులు జారీ చేశారు. వీరిపై అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం–1956 కింద కూకట్‌పల్లిలో మూడు, కేపీహెచ్బీలో ఒక కేసు నమోదయ్యాయి. ఈ నెల ప్రారంభంలో నిర్వహించిన జాయింట్ ఆపరేషన్స్‌లోనూ 22 మందిని పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. -
అమెరికాలో వ్యభిచారం.. ఏడుగురు భారతీయుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో వ్యభిచారం చేస్తూ ఏడుగురు భారతీయులు పట్టుబడ్డారు. వీరిలో ఐదుగురు తెలుగు యువకులు ఉన్నట్టుగా స్థానిక అధికారులు వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డెంటన్ కౌంటీ షెరీఫ్ అధికారులు వ్యభిచారాన్ని అరికట్టడానికి హాయ్‌ల్యాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో మంగళవారం టెక్సాస్‌లోని డెంట¯న్లో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో మొత్తం 18 మంది నిందితులు పట్టుబడ్డారు. వీరిలో ఏడుగురు భారతీయులు ఉండగా.. అందులో ఐదుగురు తెలుగువారని అధికారులు వెల్లడించారు. స్థానిక పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేకల, కార్తీక్ రాయపాటి ఉన్నారు. వీరిలో పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆరోపణలపై బండి నిఖిల్, కుమ్మరి నిఖిల్‌ను అరెస్ట్ చేశామని, వ్యభిచారం చేయాలని కోరిన ఆరోపణలపై గల్లా మోనిష్, అమిత్‌కుమార్, పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకోవడంతోపాటు 18 ఏళ్లలోపు మైనర్‌ను వ్యభిచారం చేయాలని కోరిన ఆరోపణలపై మేకల జైకిరణ్ రెడ్డిని, వ్యభిచారం చేయాలని అభ్యర్థించిన ఆరోపణలపై రాయపాటి కార్తీక్, నబిన్ శ్రేష్ఠలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పట్టుబడిన మొత్తం 18 మందిలో ఇద్దరి వద్ద అక్రమ ఆయుధాలు సైతం ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఈ వ్యభిచార ముఠాతో సంబంధాలున్న ఇతర వ్యక్తుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, పట్టుబడిన తెలుగు యువకులు రాయపాటి కార్తీక్ చౌదరి, గల్లా మోనిష్చౌదరి టెక్సాస్ ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ కో–ఆర్డినేటర్లు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
నా కుమార్తెను వ్యభిచారంలోకి దించేందుకు నా ఫ్రెండ్ ప్రయత్నిస్తోంది
సాక్షి, అమరావతి: తన కుమార్తెను తన స్నేహితురాలు డబ్బు కోసం వ్యభిచార వృత్తిలో దించేందుకు ప్రయత్నిస్తోందని, తన కుమార్తెను తనకు అప్పగించేలా ఆదేశించాలని కోరుతూ రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొంతకాలం క్రితం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆ బాలికను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. పోలీసులు ఆ బాలికను కోర్టు ముందు హాజరుపరచగా.. మంగళగిరి వద్ద ఉన్న ఉజ్వలా హోంలో ఉంచాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. ఆ బాలిక వ్యవహారంపై ప్రాథమిక విచారణ జరిపి, బాధ్యులపై కేసు నమోదు చేయాలంది. అంతేకాక ఈ కేసులో సదరు జిల్లా ఎస్పీని ప్రతివాదిగా చేర్చింది. అలాగే పిటిషనర్ తన స్నేహితురాలిగా పేర్కొన్న మహిళ కూడా కోర్టు ముందు హాజరయ్యారు. తాను కుట్టుపని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటానని, ఆ బాలికను తాను అక్రమంగా నిర్భంధించలేదని ఆ మహిళ తెలిపారు. ఆ బాలిక తన వద్దకు వచ్చి మూడు నెలలు ఉందని, ఆ సమయంలో ఆ బాలికకు టైలరింగ్ నేర్పించానని తెలిపారు. అనంతరం హైకోర్టు ఈ వ్యవహారంలో ప్రభుత్వ వాదన వినాలని నిర్ణయించి అప్పుడు విచారణను వాయిదా వేసింది. విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి.. ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు రాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హాజరయ్యారు. ఆ బాలికను వ్యభిచార వృత్తిలోకి దించేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారని కోర్టుకు వివరించారు. బాధిత బాలిక సంరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, నిస్సహాయ బాలికలు, మహిళలను మానవ అక్రమ రవాణాదారుల నుంచి కాపాడాలని, ఈ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అలాగే మానవ అక్రమ రవాణాదారుల ఉచ్చులో నుంచి బయటపడిన బాలికలు, మహిళల పునరావాసం కోసం కూడా చర్యలు తీసుకోవాలంది. ప్రస్తుతం చట్టంలో విటులను బాధితులుగా పేర్కొన్నారని, వాస్తవానికి వారిని నిందితులుగా పేర్కొనాల్సిన అవసరం ఉందని తెలిపింది. దీనిపై ఏజీ ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ, మానవ అక్రమ రవాణాదారుల నుంచి బాలికలు, మహిళలను కాపాడే విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే పునరావాసం విషయంలో అన్ని చర్యలు తీసుకుంటామని నివేదించారు. సమగ్ర వివరాలతో విధానపరమైన నివేదిక సమర్పిస్తామన్నారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 11కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి దర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
వ్యభిచార గృహాలుగా ఫాంహౌస్‌లు!
మొయినాబాద్: వారాంతపు విడిదిలు వ్యభిచార గృహాలుగా మారుతున్నాయి. వీకెండ్లో సరదాగా గడపడానికంటూ నగర శివారు ప్రాంతాల్లో నిర్మించుకుంటున్న ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. అప్పుడప్పుడు పోలీసులు దాడిచేసి గుట్టురట్టు చేస్తున్నా మళ్లీ కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు ఫాంహౌస్‌లను లీజ్‌కు తీసుకుని వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో వాటికి ఆకర్షితులై యువత పెడదారి పడుతుంది. హైదరాబాద్ శివారుల్లోని మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో చాలా మంది బడాబాబులు ఫాంహౌస్‌లు నిర్మించుకుంటున్నారు. 111 జీఓ పరిధిలో ఉన్న మొయినాబాద్, శంకర్పల్లి, శంషాబాద్ మండలాల్లో ఫాంహౌస్‌లు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఒక్క మొయినాబాద్ మండలంలోనే సుమారు వెయ్యికి పైగా ఫాంహౌస్లున్నాయి. హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న మొయినాబాద్ మండలంలో చాలా మంది 10 గుంటల నుంచి 1 ఎకరం వరకు భూమి కొనుగోలు చేసి అందులో ఫాంహౌస్ నిర్మిస్తున్నారు. వీకెండ్స్‌లో పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ఫాంహౌస్‌లు నిర్మించుకుని తర్వాత వాటిని ఇతరులకు లీజుకు, అద్దెకు ఇస్తున్నారు. నిర్వాహకుల అడ్డగోలు దందా.. ఫాంహౌస్‌లను అద్దెకు తీసుకున్న నిర్వాహకులు అడ్డగోలు దందాలు చేస్తున్నారు. గెట్ టూ గెదర్ పారీ్టలు, ఫ్యామిలీ పారీ్టలు, బర్త్డేలంటూ రోజువారీగా అద్దెకు ఇస్తున్నారు. ఫాంహౌస్‌లకు వచ్చే యువకులను ఆకర్షించే విధంగా ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఫాంహౌస్‌లలో ఉంచుతున్నారు. అమ్మాయిలను వ్యభిచారం రొంపిలోకి దింపి యువకుల దగ్గర డబ్బులు దండుకుంటున్నారు. మొయినాబాద్ మండలంలోని కనకమామిడి, చాకలిగూడ, సురంగల్, శ్రీరాంనగర్, తోలుకట్ట, ఎత్బార్పల్లి, నక్కలపల్లి, అప్పారెడ్డిగూడ, ఎలుకగూడ, కుత్బుద్దీన్‌గూడ, రెడ్డిపల్లి, ఎనికేపల్లి, అజీజ్‌నగర్, బాకారం, అమ్డాపూర్ తదితర గ్రామాల పరిధిలో ఉన్న ఫాంహౌస్‌లలో ఈ దందాలు జోరుగా కొనసాగుతున్నాయి. నిఘా వైఫల్యం! ఫాంహౌస్‌ల్లో జరుగుతున్న వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలకు పోలీసుల నిఘా వైఫల్యమే కారణమని తెలుస్తుంది. ఫాంహౌస్లపై నిఘా పెట్టాల్సిన పోలీసులు నిర్వాహకులతో మిలాకత్ అవుతున్నట్లు సమాచారం. అందుకే ఫాంహౌస్‌ల్లో రాత్రిపూట ఎంత హంగామా జరిగినా పోలీసులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఎలుకగూడ సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహించడం వల్ల యువకుల మధ్య జరిగిన గొడవలు ఓ యువకుడి ఆత్మహత్యకు దారితీసినట్లు సమాచారం. అప్పడప్పుడు ఫాంహౌస్లపై జరుగుతున్న దాడులు ఎస్ఓటీ పోలీసులు చేస్తున్నవే కావడం విశేషం. వరుస ఘటనలు... మొయినాబాద్ మండలంలోని ఫాంహౌస్‌ల్లో వరుసగా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆరు నెలల క్రితం కనకమామిడి రెవెన్యూలోని మ్యాంగోహుడ్ ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. తాజాగా గురువారం రాత్రి కనకమామిడి రెవెన్యూ పరిధిలోని హ్యాపీహోంస్లో ఉన్న రాజు ఫాంహౌస్‌పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఇద్దరు నిర్వాహకులు, నలుగురు విటులు, ఓ వాచ్మెన్, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పేకాట స్థావరాలపై సైతం ఎస్ఓటీ పోలీసులు దాడులు చేస్తున్నారు. -
అబిడ్స్ వ్యభిచారం కేసు.. రాంనగర్ అఖిల్ పహిల్వాన్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం ముఠా గుట్టు రట్టైంది. ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ ముఠా పట్టుబడింది. రామ్‌నగర్‌కు చెందిన అఖిల్ పహిల్వాన్ ఆధ్వర్యంలో ఈ దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో 16 మంది అమ్మాయిలు, ఆరుగురు కస్టమర్లు, ఇద్దరు ఆర్గనైజర్లు పట్టుబడ్డారు. వారి నుంచి 22 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి ఉద్యోగాల పేరుతో బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం. రామ్‌నగర్ అఖిల్ పహల్వాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. రాంనగర్ అఖిల్ వ్యభిచారం కేసు పోలీసుల దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అఖిలేష్ పూర్వ ట్రాక్ రికార్డ్లను పోలీసులు బయటికి తీయగా.. అతడి మొబైల్లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు. అఖిల్ రోజుకి 20 నుంచి 30 కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు తేలింది. పశ్చిమబెంగాల్ నుంచి 16 మంది అమ్మాయిలను ఫార్చ్యూన్ హోటల్లో 25 రోజులుగా వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వకుండా 25 రోజులుగా అమ్మాయిలను హోటల్లో ఉంచిన అఖిల్.. ఈ 25 గదుల్లో 16 రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నట్లు విచారణలో తేలింది. సినీ ప్రముఖులకు అమ్మాయిలను సరాఫరా చేస్తున్నట్లు అఖిల్‌పై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సలువడి అఖిలేష్, పక్కల రఘుపతి, అభిషేక్ బాటి, కేశవ్ వ్యాస్, అబ్దుల్ ఖలీద్, సంతోష్ అరెస్ట్ చేసి లోతుగా విచారిస్తున్నారు. చదవండి: పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తా అప్పగింతకు కోర్టు ఓకే -
సినీ సహాయ నటీమణులతో వ్యభిచారం ఇద్దరు అరెస్ట్
కర్ణాటక: ఆంధ్రాకు చెందిన సినీ సహాయ నటీమణులను తీసుకువచ్చి చైన్నె వేలచ్చేరిలోని నివాస ప్రాంతంలో వ్యభిచారం చేయిస్తున్న ఇద్దరు బ్రోకర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఇద్దరు సహాయ నటీమణులను విడిపించారు. చైన్నె వేలచ్చేరి కరుమారియమ్మ నగర్ గోల్డెన్ అవెన్యూ ప్రధాన రోడ్డులో ఉన్న నివాస ప్రాంతంలోని ఒక భవనంలో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వ్యభిచార నిరోధకపు విభాగం సహాయ కమిషనర్ రాజ్యలక్ష్మి ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ సెల్వరాణి నేతృత్వంలో పోలీసులు గురువారం అర్ధరాత్రి నిఘా చేశారు. ఆ సమయంలో ఓ ఇంటిలో వ్యభిచారం జరుగుతున్నట్టు గుర్తించి వ్యభిచారం నడుపుతున్న బ్రోకర్లు తిరునల్వేలి జిల్లాకు చెందిన సుమియోన్ జార్జ్ (26), కాంచీపురానికి చెందిన కాళిదాసు (28)ను అరెస్టు చేశారు. వారి నుంచి ఇద్దరు సహాయ నటీమణులను విడిపించారు. వారి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
మొదట్లో భూకబ్జాలు..సెటిల్మెంట్లు ఆపై మోసాలు...బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: మొదట్లో భూకబ్జాలు, సెటిల్మెంట్లు చేశాడు.. అవి సెట్ కాలేదు...దీంతో ఐఆర్ఎస్ అధికారి అవతారం ఎత్తి సినీ ప్రొడ్యూసర్లను బెదిరించాడు.. చివరకు వ్యభిచారదందా కూడా నిర్వహించాడు.. మోసాలు, బెదిరింపులకు లెక్కేలేదు. మాదాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో రేవ్‌పార్టీ నిర్వహిస్తూ గురువారం తెలంగాణస్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు (టీఎస్–నాబ్) చిక్కిన ఫిల్మ్ ఫైనాన్షియర్ కారుమూరి వెంకటరత్నారెడ్డి అలియాస్ వెంకటరమణారెడ్డి ఘనచరిత్ర ఇది. ఇతడితోసహా చిక్కిన ముగ్గురిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన గుడిమల్కాపూర్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. గుంటూరులోని నెహ్రూనగర్‌కు చెందిన వెంకటరత్నారెడ్డి డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. చేసేందుకు ఏ ఉద్యోగమూ దొర కలేదు. దీంతో బతుకుతెరు వుకు స్నేహితులతో కలిసి భవన శిథిలాల తొలగింపు వ్యాపారంలోకి దిగాడు. అందులోనూ నష్టాలు రావడంతో మోసాలు చేసి డబ్బు దండుకోవాలని పథకం వేశాడు. నకిలీ ఐఆర్ఎస్ అధికారిగా అవతారమెత్తి.. నకిలీ ఐఆర్ఎస్ అధికారి అవతారం ఎత్తిన వెంకటరత్నారెడ్డి ఆ పేరుతో సినీ నిర్మాతలు సి.కల్యాణ్, రమేష్‌ల నుంచి రూ.30 లక్షలు వసూలు చేశాడు. దీనిపై బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. తిరుమలలో దర్శనానికి కేవీ.రత్నారెడ్డి పేరుతో ఐఆర్ఎస్ అధికారిగా నకిలీ గుర్తింపుకార్డు తయారు చేసుకున్నాడు. దీని ఆధారంగా తనతో సహా 9 మందికి బ్రేక్ దర్శనం టిక్కెట్లు ఇవ్వాలని దరఖాస్తు చేసి చిక్కాడు. ఓ ఐఆర్ఎస్ అధికారిణిని వివాహం చేసుకొని మోసం చేసిన ఆరోపణలు ఉన్నాయి. ఎన్నారై మహిళలను టార్గెట్ చేసి.. ఎన్నారై మహిళలను టార్గెట్‌గా చేసుకుని, తానూ ఎన్నారైనే అంటూ నమ్మబలికి పెళ్లి పేరుతో మోసాలకు తెరలేపాడు. భర్త నుంచి విడాకులు తీసుకుని అమెరికాలో ఉంటున్న నగరానికి చెందిన ఓ మహిళ భారత్‌మాట్రిమోనీలో ఇతగాడి ప్రొఫైల్ చూసి వివాహమాడింది. ఆమెతో పాటు అమెరికా వెళ్లిన వెంకట్ కేవలం 20 రోజులే కాపురం చేశాడు. ఆపై అత్యవసర పని ఉందని, ఆమె నుంచి రూ.20 లక్షలు తీసుకుని ఇక్కడకు వచ్చాడు. ఆ తర్వాత పత్తా లేకపోవడంతో ప్రొఫైల్‌ను ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన బాధితురాలి మేనమామ అతడికి నేరచరిత్ర ఉందని, తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు తెలుసుకున్నాడు. దీంతో ఆయన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేశారు. మరో ముగ్గురు ఎన్నారై మహిళలకు ఇతగాడు ఎర వేసినట్టు అప్పట్లో తేలింది. వెంకట్‌పై జూబ్లీహిల్స్ పరిధిలో వ్యభిచార కేసు కూడా ఉంది. విదేశీ మద్యం అక్రమఅమ్మకం, తాను గుంటూరు ఎస్పీ గన్‌మెన్ అని చెప్పి మోసం చేయడం, దొంగ పాస్‌పోర్టు పొందడం సహా ఇతడిపై ఏపీ, తెలంగాణల్లోని వివిధ ఠాణాల్లో 25 కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్ని రాజీ కాగా, మరికొన్ని వీగిపోయాయి. 10 కేసులు వివిధ దశల్లో ఉన్నాయి. ఆ 18 మంది కోసం వేట ముమ్మరం వెంకట్‌తోపాటు అరెస్టు అయిన బాలాజీ కాల్‌డేటాను పరిశీలించిన టీఎస్–నాబ్ అధికారులు 18 మంది డ్రగ్స్ వినియోగదారులను గుర్తించారు. విశాఖకు చెందిన రామ్‌తో పాటు బెంగళూరులో ఉంటున్న నైజీరియన్లు అమ్మోది చికూడి ముగుముల్, ఇగ్వారే, థామస్ అన్హాల నుంచి వీరు డ్రగ్స్ ఖరీదు చేస్తున్నట్టు నిర్ధారించి గాలిస్తున్నారు. వీరి కస్టమర్లు రామ్‌చంద్, అర్జున్, రవి ఉప్పలపా టి, సుశాంత్‌రెడ్డి, ఇంద్రతేజ, కల్హర్రెడ్డి, సురే ష్, రామ్‌కుమార్, ప్రణీత్, సందీప్, సూర్య, శ్వేత, కార్తిక్, నర్సింగ్, ఇటాచి, మహ్మద్‌అ జామ్, అమ్‌జద్‌ల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వెంకట్ దగ్గర డ్రగ్స్ కొన్నవారిలో నటులు, ప్రముఖులున్నట్టు అనుమానిస్తున్న అధికారులు ఆరా తీస్తున్నా రు. గతంలో ఇతగాడు ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి నగరంలో భారీ వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులను పార్టీలకు పిలిచి బురిడీ కొట్టించేవాడు. కొన్నాళ్లుగా ఫిల్మ్ ఫైనాన్షియర్ అవతారం ఎత్తి డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నాడు. -
స్పా ముసుగులో వ్యభిచారం..
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా సెంటర్‌పై భవానీపురం పోలీసులు దాడి చేశారు. నిర్వాహకురాలిని అరెస్ట్‌చేసి, 11 మంది యువతులను హోంకు తరలించారు. పోలీసుల కథనం మేరకు.. భవానీపురం బైపాస్ రోడ్డు దియాస్ బార్ సమీపంలోని ఓ భవనంలో నగరానికి చెందిన సంపర శ్రీవిద్య తనిష్క బ్యూటీ వరల్డ్ అండ్ స్పా నిర్వహిస్తోంది. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో స్పా సెంటర్‌పై పోలీసులు దాడిచేశారు. సంపర శ్రీ విద్య, ఆమె భర్త సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. దాడి సమయంలో స్పా సెంటర్లో 11 మంది యువతులు, ముగ్గురు విటులు ఉన్నారు. స్పా సెంటర్ నిర్వాహకురాలు శ్రీవిద్య, ఆమె భర్త సత్యనారాయణపై కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపి నట్లు సీఐ సలాం తెలిపారు. 11 మంది యువతులను కౌన్సెలింగ్ నిమిత్తం హోంకు తరలించినట్లు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. -
Hyderabad: మసాజ్ ముసుగులో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని సీక్రెట్ ఆఫ్ హెయిర్ అండ్ ఫ్యామిలీ సెలూన్లో మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు సదరు సెలూన్‌పై దాడులు చేశారు. ప్రకాశ్ అనే వ్యక్తి.. ఫ్యామిలీ సెలూన్ నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి క్రాస్ మసాజ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పది మంది యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలో యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు సెలూన్‌ను సీజ్ చేశారు. -
వ్యభిచారం గుట్టు రట్టు.. యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని
హోసూరు: యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపి వారితో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సిఫ్‌కాట్ పోలీసులు. వివరాల్లోకి వెళితే.. పారిశ్రామిక ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకొని కొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి బృందావన్ నగర్ ప్రాంతంలో ఓ ఇంటిపై ఆకస్మిక దాడులు నిర్వహించగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు రుజువైయ్యింది. నామక్కల్ జిల్లా తిరుచ్చంగోడు ప్రాంతానికి చెందిన వెంకటాచలం (56), భార్య మధుబాల (48)ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఘటనలో.. గుట్కా, కారు సీజ్ హోసూరు: కర్ణాటక నుంచి కరూర్‌కు అక్రమంగా తరలిస్తున్న గుట్కాను సిప్కాట్ పోలీసులు స్వాధీనపరుచుకొని డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. సిఫ్‌కాట్ పోలీసు హోసూరు– బెంగళూరు హైవేపై జూజువాడి చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం రాత్రి తనిఖీలు చేశారు. ఓ కారులో సోదాలు చేయగా రూ. 1.86 లక్షల విలువ చేసే గుట్కా పట్టుబడింది. ప్రవీణ్ (28) అనే డ్రైవర్‌ను అరెస్టు చేసి గుట్కాను, కారును స్వాధీనం చేసుకున్నారు. చదవండి హైదరాబాద్: మీర్‌పేటలో దారుణం.. బీరు బాటిళ్ల కోసం గొడవ.. కత్తితో పొడిచి.. -
HYD: వ్యవభిచార కూపాలుగా స్పా సెంటర్లు!
క్రైమ్: వ్యభిచార కూపాలుగా మారిన స్పా సెంటర్ల గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం వెస్ట్ జోన్ పరిధిలో జరిగిన టాస్క్ ఫోర్స్ దాడుల్లో పలు మసాజ్ సెంటర్లు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతులు లేకుండా నడుస్తున్న స్పా సెంటర్లనే కాకుండా.. వాటిల్లో వ్యభిచారం కోసం ప్రత్యేక గదుల్ని ఏర్పాటు చేయడాన్ని గుర్తించారు. దాదాపు 10 మసాజ్ పార్లర్ల మీద దాడులు చేసి.. 34 మంది నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ స్టేషన్ల పరిధిలో లైసెన్లు లేకుండా నిర్వహిస్తున్నారని సమాచారం మీద దాడులు చేశారు. జీహెచ్ఎంసీ లైసెన్స్‌లతో పాటు సీసీ కెమెరాల డీవీఆర్లు, ప్రొఫెషనల్ థెరపిస్ట్‌లు లేకపోవడం, కస్టమర్ల ఎంట్రీ రిజిస్ట్రర్ సైతం లేవని తేలింది. అలాగే.. మార్గదర్శకాలు ఫాలో కాకుండా మహిళలతో క్రాస్ మసాజ్ చేస్తూ చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నట్లు గుర్తించారు. -
బంజారాహిల్స్ స్పాలో వ్యభిచారం... ప్రముఖుల కుమారులు
బంజారాహిల్స్: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తుండగా సహ నిర్వాహకుడితో పాటు నలుగురు విటులను అరెస్టు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు.12లోని పీస్ రెయిన్ స్పాలో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు దాడులు చేశారు. సహ నిర్వాహకుడు సయ్యద్ బిల్లాల్, విటులు ఫహద్, హసీదుద్దిన్, మహ్మద్ ఇమ్రానంద్, కమల్ కిషోర్‌లను అరెస్టు చేశారు. వీరంతా నగరంలోని ప్రముఖుల కుమారులని తెలిసింది. స్పాలో ఉద్యోగం పేరిట ఐదుగురు యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్టు తేలింది. ఈ ఐదుగురిని రెస్క్యూ హోంకు తరలించారు. వారి నుంచి రెండు సెల్ఫోన్లు, 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
గుట్టుగా వ్యభిచారం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
తమిళనాడు: సెలూన్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి చెరలో ఉన్న ముగ్గురు యువతులకు విముక్తి కలిగించారు. తిరువళ్లూరు జిల్లా శివందినగర్ ప్రాంతంలోని సలూన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు ఇన్స్పెక్టర్ మల్లికకు రహస్య సమాచారం అందింది. దీంతో పోలీసులు మంత్ర సలూన్‌లో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. చైన్నెకు చెందిన రాజేష్(47) అన్ననూర్కు చెందిన గాయత్రి(23)లను అరెస్టు చేశారు. వీరి చెరలో ఉన్న ముగ్గురు యువతులను రిమాండ్‌కు తరలించారు. కాగా పరారీలో ఉన్న విఘ్నేష్ అనే యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
బంజారాహిల్స్.. స్పా ముసుగులో వ్యభిచార ముఠా గుట్టురట్టు...
హైదరాబాద్: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని రువాన్ థాయ్ స్పాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. వివరాలివీ... రోడ్ నెం. 12లోని రువాన్ థాయ్ స్పాలో థాయ్‌లాండ్‌కు చెందిన నన్ని, సుజి, హనా, అవా, ఆప్లే మసాజ్ థెరపిస్టులుగా పని చేస్తున్నారు. స్పా యజమాని సల్మాన్, ఖాలీద్ అనే వ్యక్తులు వీరిని సెక్స్ వర్కర్లుగా మార్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం రాత్రి సదరు స్పాపై దాడులు నిర్వహించారు. నిర్వాహకుడు సల్మాన్ పరారు కాగా, ఖాలీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రసూన్ ప్రకాష్ అనే వ్యక్తి కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. యువతులను పునరావాస కేంద్రానికి తరలించిన పోలీసులు నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పది మంది విటులకు నోటీసులు జారీ చేశారు. -
తల్లి ఘాతుకం.. బాలిక శరీర భాగాలు పెరిగేందుకు ఇంజెక్షన్లు, టాబ్లెట్లు
విజయనగరం (క్రైమ్): ఆ బాలిక తల్లి దారి తప్పింది. పెళ్లయిన కొన్నేళ్లకే మొదటి భర్తకు విడాకులిచ్చింది. ఆ తరువాత సబ్ ఇంజనీర్‌ను వివాహం చేసుకుంది. కొంతకాలానికి అతనితోనూ తెగతెంపులు చేసుకుని వ్యభిచారం ప్రారంభించింది. చివరకు తన 15 ఏళ్ల కుమార్తెను కూడా వ్యభిచార కూపంలోకి దింపాలని, అనంతరం సినీ, టీవీ రంగంలోకి పంపించాలని భావించింది. ఆ బాలిక శరీర భాగాలు విపరీతంగా పెరిగేలా.. యుక్తవయసు అమ్మాయిలా కనిపించేలా చేసేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లను వాడించడం మొదలుపెట్టింది. తల్లి చేష్టలను భరించలేక బాధిత బాలిక 1098 నంబర్‌కు ఫోన్‌చేసి చైల్డ్ లైన్‌ను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. నవోదయ పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసి అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. ఆ బాలిక విజయనగరంలో ఉంటున్న తల్లి దగ్గరకు ఇటీవల వచ్చింది. తెలియని వ్యక్తులు తరచూ ఇంటికి రావడం.. తల్లి తనముందే వారితో వ్యభిచరించడాన్ని భరించలేక.. తల్లితో విభేదించింది. బాలికను కూడా తన మాదిరిగానే ఇంటికి వచ్చే వ్యక్తులతో చనువుగా ఉండాలని తల్లి ఒత్తిడి చేయడాన్ని తట్టుకోలేకపోయింది. శరీర భాగాలు పెరిగేందుకు ఇచ్చే ఇంజెక్షన్లు, టాబ్లెట్ల వల్ల అనారోగ్యానికి గురయింది. ఈ పరిస్థితుల్లో తల్లి ఒత్తిడిని తట్టుకోలేక గురువారం రాత్రి చైల్డ్‌లైన్ 1098కి కాల్ చేసి రక్షణ కోరింది. రంగంలోకి దిగిన చైల్డ్‌లైన్ సభ్యులు, దిశ పోలీసులు ఆ బాలికను దిశ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ జరిపారు. బాలిక నుంచి ఫిర్యాదు తీసుకున్నాక అదేరోజు రాత్రి స్వధార్ హోమ్‌కు తరలించారు. అనంతరం విశాఖలోని ప్రభుత్వ బాలికల పునరావాస కేంద్రంలో చేర్పించారు. బాలిక సంక్షేమం చూడాలంటూ పునరావాస కేంద్రం సూపరింటెండెంట్‌కు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు సూచించారు. ఈ విషయాన్ని విజయనగరం ఎస్పీ ఎం.దీపిక దృష్టికి తీసుకువెళ్లారు. బాలిక తల్లిని అదుపులోకి తీసుకుని చిల్డ్రన్స్ కోర్టులో విచారణ జరిపారు. -
మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం
హోసూరు: హోసూరు ప్రాంతంలో మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. గత రెండు నెలలుగా పోలీసులు నిర్వహించిన దాడుల్లో 20 మందికిపైగా నిందితులను అరెస్ట్ చేసి హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. కార్పొరేషన్ పరిధిలోని మసాజ్ సెంటర్ల పేరుతో మహిళలను ఉంచి వ్యభిచారాలు కొనసాగుతున్నాయని సోమవారం రాత్రి డీఎస్పీకి రహస్య సమాచారం అందింది. దీంతో మసాజ్ సెంటర్లలో పోలీసులు సోదాలు నిర్వహించగా, దీపిక (32), చూడప్ప (40), తులసీరామన్ (21)లు వేశ్యావాటికలు నిర్వహిస్తూ పట్టుబడ్డారు. వీరి వద్ద ఉన్న 7 మంది మహిళలకు విముక్తి కల్పించి అనాథ శరణాలయాలకు తరలించారు. మసాజ్ సెంటర్లపై నిఘా ఉంచి తప్పుడు పనులు చేసేవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. -
ఫైవ్ స్టార్ హోటల్లో వ్యభిచారం.. ప్రముఖ నటి అరెస్ట్!
మహారాష్ట్రలోని పుణె పోలీసులు భారీ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. పుణేలోని వాకాడ్ ప్రాంతంలోని ఫైవ్ స్టార్ హోటల్లో నిర్వహిస్తున్న భారీ వ్యభిచార రాకెట్‌ను ఛేదించారు. ఈ దాడుల్లో భోజ్‌పురి నటితో సహా ఓ మోడల్, ఏజెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (ఇది చదవండి: అవునా.. ఆ వార్త నావరకు రాలేదు: నిహారిక) వ్యభిచార ముఠా గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం సాయంత్రం హోటల్‌పై దాడులు నిర్వహించారు. వారిలో ఒకరు మోడల్, మరొకరు భోజ్‌పురి నటిగా పోలీసులు గుర్తించారు. వీరు మహిళలను మభ్యపెట్టి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పింప్రీ, చించ్వాడ్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇన్స్పెక్టర్ దేవేంద్ర చవాన్ వార్నింగ్ ఇచ్చారు. (ఇది చదవండి: సితార.. నీ హృదయంతో చేయి.. నమ్రత పోస్ట్ వైరల్!) ఇన్స్పెక్టర్ దేవేంద్ర మాట్లాడుతూ..' ఫైవ్ స్టార్ హోటల్లో ఏజెంట్‌తో కలిసి భోజ్‌పురి నటి, మోడల్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. మేం వెంటనే ఓ డమ్మీ కస్టమర్‌ను అక్కడికి పంపాం. ఏజెంట్‌ను ఆన్లైన్ ద్వారా సంప్రదించాం. ఏజెంట్.. డమ్మీ కస్టమర్‌ని ఫైవ్ స్టార్ హోటల్లో గదిని బుక్ చేయమని చెప్పాడు. నటి, మోడల్ ఫోటోలను కూడా షేర్ చేశాడు. అన్ని నిర్ధారించుకున్న తర్వాతే అటాక్ చేశాం.' అని వెల్లడించారు. -
మోడల్స్‌తో వ్యభిచారం.. ప్రముఖ నటి అరెస్ట్!
ముంబయి పోలీసులు హై లెవెల్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. మోడల్స్‌తో వ్యభిచారం నిర్వహిస్తున్న నటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని గోరెగావ్‌లోని ఓ హోటల్లో వ్యభిచార దందా నడుస్తోందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భోజ్‌పురి నటి సుమన్ కుమారిని అరెస్ట్ చేశారు. వ్యభిచార కూపం నుంచి ముగ్గురు మోడల్స్‌ను పోలీసులు రక్షించారు. ఈ దందాలో భోజ్‌పురి నటి యువతులను ట్రాప్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భోజ్‌పురి నటి వయసు 24 ఏళ్లు కాగా.. గోరేగావ్‌లోని రాయల్ పామ్ హోటల్లో నిందితురాలు ఈ వ్యాపారాన్ని పోలీసులకు సమాచారం అందింది. శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు దాడులు నిర్వహించగా.. నటి చీకటి దందా బయటపడింది. కాగా.. భోజ్‌పురి చిత్ర పరిశ్రమకు చెందిన సుమన్ కుమారి ‘లైలా మజ్ను సినిమాలో నటించింది. అలాగే వెబ్ సిరీస్ జామ్‌స్టిక్ బాక్స్, భోజ్‌పురి కామెడీ ఎపిసోడ్ ‘బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రి’లో పనిచేసింది. ఈనె హిందీ, పంజాబీ మ్యూజిక్ ఆల్బమ్‌లలో కూడా పనిచేసింది. Maharashtra | A Bhojpuri actress Suman Kumari (24) has been arrested by Mumbai Police for allegedly forcing girls (models) into prostitution. Police also rescued 3 models. Further investigation is being done: Crime Branch, Mumbai police — ANI (@ANI) April 21, 2023 -
Nellore: స్పా ముసుగులో వ్యభిచారం.. 14 మంది అరెస్ట్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని పలు స్పా సెంటర్లపై శుక్రవారం పోలీసులు దాడులు చేపట్టారు. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు ఆరుగురు యువతులు, ఆరుగురు విటులు, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఫొటో చూడు.. క్యాష్ ఎంత ఇస్తావో చెప్పేయ్.. అమ్మాయిలు మస్త్ మస్త్‌గా ఉన్నారు!
ఫొటో చూడు.. క్యాష్ ఎంత ఇస్తావో చెప్పేయ్.. సమయాన్ని బట్టి ధర..నాకు ఎంత.. పోలీసోళ్లను కూడా చూసుకోవాలి.. మా వాళ్లే అన్ని చూసుకుంటారు.. ఇబ్బంది లేకుండా.. కొంత ఎక్కువే చెప్పండి.. ఇదే కాదు, ఇంకా చాలా ఫొటోలు ఉన్నాయి.. అమ్మాయిలు మస్త్ మస్త్‌గా ఉన్నారు.. లెక్క కుదిరితే తీసుకెళ్తా.. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ బ్రోకర్ అదే జిల్లాకు చెందిన యువకుడితో ఇటీవల సంభాషించిన మాటలు ఇవి. జిల్లాలో వ్యభిచార దందా ఏ విధంగా సాగుతుందో దానితోపాటు ఖాకీల చెడు సావాసానికి ఇది అద్దం పడుతోంది. న్యూడ్‌కాల్స్ వ్యవహారానికి సంబంధించి ‘డర్టీ పిక్చర్’ సంఘటనను జోగుళాంబ గద్వాల జిల్లా ప్రజలు ఇంకా మరిపోనేలేదు. జిల్లా ప్రతిష్ట మసక బార్చేలా వ్యవహరింన తీరుపై అప్పట్లో ప్రభుత్వ పెద్దలు, పోలీస్ ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగంపై సీరియస్ అయ్యారు. అయినా ఆ శాఖలోని పలువురు అవినీతి ఖాకీలు తమ పంథాను మార్చుకోలేదు. జిల్లాలో వ్యభిచార దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లు కొనసాగడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. దీనికంతటికీ ఆమ్యామ్యాల కక్కుర్తే కారణం. అనుమానం వచ్చి ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే తప్ప ఎలాంటిచర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అసాంఫిక కార్యకలాపాలపై పకడ్బందీగా నిఘా పెట్టి ఉక్కు పాదం మోపాల్సిన వారే.. అక్రమార్కులకు ప్రత్యక్షంగా, లేకుంటే పరోక్షంగా సహకారం అందిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సృజన ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వ్యభిచార దందాకు సహకరిస్తున్న కీలక పోలీసులు ఎవరు..రాజకీయ నేతల పాత్ర ఏమిటి.. ఎవరి ఒత్తిళ్లు ఏఅధికారిపై ఉన్నాయి.. అనే కోణంలో గుట్టుచప్పుడు కాకుండా ఆరా తీస్తున్నారు. ఈనేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం. అరోపణలు ఇలా ► ఫిబ్రవరి 19న గద్వాల పట్టణం భీం నగర్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేశారు. వ్యభిచారకేంద్రం నిర్వాహకురాలితో పాటు ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపైనే కేసు పెట్టారు. కానీ.. ఈ సంఘటనలో కొందరిని తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ► 2022 ఆగస్టు 7న గద్వాల బీరోలు రోడ్డు (తాయమ్మ గుడి) సమీపంలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా సభ్యురాలు, ఇద్దరు మహిళలు, ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు పరారీలో ఉన్నారని.. వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్పినప్పటికీ ఎవరి పైనా చర్యలు లేకుండాపోయాయి. ►2021 మే 6న గద్వాల పట్టణంలోని సాయిహోంకాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుపోలీసులకు సమాచారం అందింది. తెల్లవారుజామునే సోదాలు చేసి ముగ్గురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. రెండురోజుల పాటు విచారణ చేశారు. ఓ అధికారప్రజాప్రతినిధికి చెందిన ముఖ్య అనుచరుడితో పాటు పలువురు చోటామోటా నాయకులు వ్యభిచారం చేస్తూ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినప్పటికీ కేసు నమోదుచేయలేదు. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులుమారినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఇతర రాష్ట్రాల నుంచి యువతులు విజయవాడకు చెందిన ముఠాసభ్యులు గద్వాల కేరాఫ్ అడ్రాస్గాఎంచుకుని గుట్టుగా శివారు కాలనీలో ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. ఎవరికి అనుమానం కలుగకుండా ఒక్కో యువతిని దిగుమతి చేసుకుంటూ.. ఇళ్లు మారుస్తూ వ్యభిచార దందా నడిపిస్తున్నారు. ప్రధానంగా గద్వాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు, విజయవాడ, కర్నూలు, గుంటూరు జిల్లాలతోపాటు తెలంగాణలోని హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరునుంచి అమ్మాయిలను తీసుకొచ్చి పడుపువృత్తి చేయిస్తున్నారు. -
కేడీ పోలీస్.. గుట్టుగా వ్యభిచారం! మహిళా ఎస్ఐ కుటుంబసభ్యులే అలా..!
తిరుపతి రూరల్: తిరుపతి ముత్యాలరెడ్డి పల్లె పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళా ఎస్ఐ కుటుంబసభ్యులే గుట్టుగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. ఏపీలోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి మహిళలను రప్పించి జోరుగా ఈ దందాను నడుపుతున్నారు. ఆ ఎస్ఐ ఏ స్టేషన్లో పనిచేస్తే ఆ స్టేషన్ పరిధిలోనే వీరు దుకాణం తెరుస్తారు. ట్రాన్స్ఫర్ అయితే అక్కడకు మకాం మారుస్తారు. అందులో భాగంగా ఆ మహిళా ఎస్ఐ తిరుచానూరులో పనిచేస్తున్నప్పుడు ఆ స్టేషన్ పరిధిలోని లింగేశ్వరనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆమె ముత్యాలరెడ్డిపల్లెకు వచ్చిన తర్వాత ఆ స్టేషన్ పరిధిలోకి వచ్చి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో నిఘా పెట్టిన ఎంఆర్ పల్లె పోలీసులు సీఐ సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ధనలక్ష్మి నగర్లో దాడులుచేశారు. మహిళా ఎస్ఐ తమ్ముడు ప్రశాంత్, తల్లి, తిరుపతి అవిలాల, హైదరాబాదుకు చెందిన ఇద్దరు మహిళలు, తిరుచానూరుకు చెందిన ఓ విటుడిని పోలీసులు అరెస్ట్‌చేశారు. కేసు నమోదు చేసినట్లు సీఐ సురేంద్రరెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా తల్లి, తమ్ముడు వ్యవహారశైలి నచ్చక, వారితో గొడవ పడి మహిళా ఎస్ఐ ఏడాది నుంచి వారికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఎస్ఐ మెడికల్ లీవ్‌లో వెళ్లిన తర్వాత మూడు నెలలుగా ధనలక్ష్మినగర్‌లో అద్దె ఇంటిని తీసుకుని ఆమె తల్లి, తమ్ముడు వ్యభిచార గృహం నడుపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
Kukatpally: బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై కూకట్పల్లి ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వెంకట నరసింహారాజు (31) సూరారంలోని చిత్తారమ్మ దేవాలయం సమీపంలో నివాసం ఉటున్నాడు. కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలోని లావిష్ బ్యూటీ పార్లర్, వెల్నెస్ స్పా నిర్వహిస్తున్నాడు. స్పా సెంటర్ ముసుగులో విటులను రప్పించి వాట్సప్‌లో యువతుల ఫొటోలు పంపుతూ విటులకు ఎరవేసి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ, కూకట్పల్లి పోలీసులు ఇంటిపై దాడి చేసి నిర్వాహకుడితో పాటు నలుగురు విటులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బంజారాహిల్స్ లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం..
హైదరాబాద్: స్పా ముసుగులో క్రాస్‌మసాజ్ చేస్తూ వ్యభిచార గృహాలుగా మార్చిన నాలుగు స్పాలపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేయడమే కాకుండా వ్యభిచారానికి పాల్పడుతున్న యువతులను పునరావాసకేంద్రాలకు తరలించారు. ఈ స్పాలన్నీ బంజారాహిల్స్ రోడ్ నెం.12 ప్రధాన రహదారిలో కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే...బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని కృష్ణ టవర్‌లో కొనసాగుతున్న ఔరం సెలూన్ అండ్ స్పా, రోడ్ నెం.12లోని హదర్వా హమామ్ స్పా, కిమ్తి స్వేర్‌లోని ఎఫ్2 లగ్జరీ థాయ్ స్పా, బంజారాగార్డెన్ బిల్డింగ్‌లోని హెవెన్ ఫ్యామిలీ స్పాలపై దాడులు చేశారు. మసాజ్ థెరపిస్ట్‌ల పేరుతో కొంత మంది యువతులను నియమించుకొని క్రాస్ మసాజ్‌కు పాల్పడుతూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసుల దాడుల్లో తేలింది. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఈ సెలూన్ అండ్ స్పాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. ఔరం సెలూన్ అండ్ స్పాలో థాయ్‌లాండ్ నుంచి ఐదుగురు యువతులను రప్పించి వీరికి మసాజ్ థెరపిస్ట్ అనే పేరు తగిలించి క్రాస్ మసాజ్‌కు పాల్పడుతున్నట్లుగా తనిఖీల్లో వెల్లడైంది. థాయ్‌లాండ్ యువతులను పునరావాస కేంద్రానికి తరలించి మేనేజర్ సమీర్‌పై కేసు నమోదు చేశారు. నిర్వాహకుడు జంగం సుధాకర్ పరారీలో ఉన్నారు. అలాగే హదర్వ హమామ్ స్పా మేనేజర్ యామిన్ జిలానీ, యజమాని భీమ్‌సింగ్‌లను కూడా అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకుండా కస్టమర్ ఎంట్రీ రిజిష్టర్ లేకుండా, జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్ లేకుండా వీటిని కొనసాగిస్తున్నట్లుగా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ముగ్గురు లేడీ కిలాడీలు.. అమాయక యువకులను సైగలతో ఆకర్షించి
సాక్షి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వ్యభిచారం ముసుగులో దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను మామునూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్‌జోన్ డీసీపీ వెంకటలక్ష్మీ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు కొత్తూరు గ్రామానికి చెందిన విజయ్‌కుమార్, పర్వతగిరికి చెందిన రాయపురం సరిత, కేసముద్రంకు చెందిన కోడం స్వరూప, నూనె స్వప్నలు కలిసి ఒక ముఠాగా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇందులో ముగ్గురు లేడీ కిలాడీలు ముఠాగా ఏర్పడి బస్స్టేషన్లలో అమాయకులైన యువకులను తమ సైగలతో ఆకర్షించి వారిని ప్రలోభ పెట్టి ఓ వాహనంలో ఎక్కించుకుని నిర్మాణుష్య ప్రదేశాలకు తీసుకెళ్లే వారు. ఈ క్రమంలో విజయ్‌కుమార్ సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకుని యువకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికీ మామునూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో రూ.20వేలు, సెల్‌ఫోన్, గీసుకొండ పీఎస్ పరిధిలో రూ.3వేలు, సెల్ఫోన్లను బలవంతంగా దోచుకున్నారు. ఈ ముఠాపై ప్రత్యేక నిఘా ఉంచి మామునూరు ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ తన సిబ్బందితో సోమవారం రాంగోపాల్‌పురం వద్ద నిందితురాళ్లను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏసీపీ నరేష్కుమార్, ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, ఎస్సై రాజిరెడ్డి, కానిస్టేబుళ్లు సర్థార్‌పాషా, రోజాలను ఈస్ట్‌జోన్ డీసీపీ అభినందించారు.