ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ఉప్పల్: యువతులను ట్రాప్ చేసి బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దింపుతున్న యువకుడిపై పీడీయాక్ట్ నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాసవి రవితేజ (35), రామంతాపూర్ గోకులేనగర్‌లో నివాసముంటున్నాడు. అమాయక యువతులను ట్రాప్ చేసి బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దింపుతున్నాడు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు గత నెల 7న రవితేజను రిమాండ్‌కు తరలించారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు శనివారం పీడీయాక్ట్ నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
బాసవి రవితేజ (35)
చదవండి: రాత్రి ఇంట్లో నిద్రించారు.. తెల్లారేసరికి మాయం.. ఎటు వెళ్లినట్లు?
Comments
Please login to add a commentAdd a comment