pd act
-
కూటమి సర్కార్.. సోషల్ మీడియానే టార్గెట్ గా భారీ కుట్రలు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వంలో భావ ప్రకటనా స్వేచ్చకు భంగం ఏర్పడుతోంది. రాష్ట్రంలో సోషల్ మీడియానే లక్ష్యంగా భారీ కుతంత్రాలు జరుగుతున్నాయి. చంద్రబాబు సర్కార్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.కూటమి సర్కార్ పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం ఏర్పడుతోంది. ఈ క్రమంలో ప్రశ్నిస్తే పీడీ యాక్ట్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియానే టార్గెట్ గా భారీగా కుతంత్రాలు జరుగుతున్నాయి. చంద్రబాబు పాలనలో నల్ల చట్టాలతో అణచివేసే కుట్రలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. ఐటీ యాక్ట్ ను కూడా పీడీ యాక్ట్ పరిధిలోకి తెచ్చేలా ప్లాన్ చేస్తోంది కూటమి సర్కార్. రాష్ట్రంలో రెడ్ బుక్ అమలు చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోంది. కూటమి నిర్ణయాలపై రాజకీయ మేధావులు సైతం విస్తుపోతున్నారు. -
హరియాణాలో మళ్లీ ఉద్రిక్తత
గురుగ్రామ్: మత ఘర్షణలతో అట్టుడికిన హరియాణాలోని నూహ్ జిల్లాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బుధవారం రాత్రి 11.30 గంటలకు ఓ వర్గానికి చెందిన రెండు ప్రార్థనా మందిరాలు స్వల్పంగా దగ్ధమయ్యాయి. ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే, ఒక ప్రార్థనా మందిరం కరెంటు షార్ట్ సర్క్యూట్‌తో, మరొకటి గుర్తుతెలియని కారణాలతో మంటలు అంటుకోవడంతో దగ్ధమైనట్లు పోలీసులు చెప్పారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టారు. గురుగ్రామ్‌లోనూ ఉద్రిక్తత కొనసాగుతోంది. కాగా, హరియాణాలో మత ఘర్షణలకు సంబంధించి ఇప్పటిదాకా 93 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి(హోం) ప్రసాద్ చెప్పారు. 176 మందిని అరెస్టు చేశామని, వీరిలో 78 మందిని పీడీ చట్టం కింద అదుపులోకి తీసుకున్నామని తెలియజేశారు. నూహ్ అల్లర్లలో అరెస్టయిన యువకులు -
HYD: ‘గుంటూరు పోకిరి’ గణేష్‌పై పీడీ యాక్ట్
సాక్షి, మేడ్చల్: సోషల్ మీడియాలో యువతులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న గుంటూరుకు చెందిన ఓ యువకుడిపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్ విధించారు. అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. గుంటూరుకు చెందిన లక్ష్మీ గణేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి అమ్మాయిలతో ఛాటింగ్ చేసేవాడు. హ్యాకింగ్ స్కాం , ఇంటర్ ది డ్రాగన్ , కింగ్ ఈజ్ బ్యాక్ , తేజ రౌడీ పేరు తో గ్రూప్‌లు, ఐడీలు క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో వాళ్ల ఫోన్ నెంబర్లు సైతం సంపాదించి వేధించడం చేయడం ప్రారంభించాడు. అసభ్యకరమైన మెసేజ్‌లు, ఫొటోలు, ఎమోజీలు పంపుతూ ఇబ్బందులకు గురి చేశాడు. ఇంటర్మీడియట్ వరకు చదివిన లక్ష్మీ గణేష్.. పోకిరిగా, జులాయిగా తిరుగుతూ వస్తున్నాడు. చాలాకాలంగా ఇలాంటి పనులు చేస్తూ వస్తున్నాడు. గతంలో ఓ యువతి ఘట్కేసర్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేయగా.. జైలులో ఉన్నాడు. తిరిగి విడుదల అయ్యాక కూడా అదే పని చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో మరో మూడు ఫిర్యాదులు నమోదు కావడంతో.. పీడీ యాక్ట్ విధించి కటకటాల వెనక్కి నెట్టారు రాచకొండ పోలీసులు. -
నిందితుల పై పీడీ యాక్ట్..!
-
మరోసారి తెరపైకి మన్నెగూడ వైశాలి కిడ్నాప్ కేసు
సాక్షి, హైదరాబాద్: మన్నెగూడ వైశాలి కిడ్నాప్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. వైద్య విద్యార్థినిని అపహరించిన కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిపై నమోదైన పీడీ యాక్ట్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కాగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడలో గతేడాది వైశాలి కిడ్నాప్ కేసు అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలిని నవీన్ డిసెంబర్ 9న కిడ్నాప్ చేశాడు తన అనుచరులతో కలిసి ఒక్కసారిగా ఆమె ఇంటిపై, అడ్డు వచ్చిన వారిపై దాడికి తెగబడ్డారు. అనంతరం ఆమెను వదిలేశాడు. వైశాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు ఇప్పటి వరకు దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. నవీన్ రెడ్డిని సైతం పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాచకొండ పోలీసులు ఇటీవల నవీన్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు రిమాండ్ చేశారు. దీనిని సవాల్ చేస్తూ నవీన్ రెడ్డి తన న్యాయవాది ద్వారా హైకోర్టులో పిటిషన్ వేసాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నవీన్ రెడ్డిపై విధించిన పీడీ యాక్ట్‌ను కొట్టివేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. చదవండి: మిస్టరీగా వికారాబాద్ శిరీష కేసు -
గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ టీడీపీ నేతలు
పుత్తూరు రూరల్ (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలో గంజాయి విక్రయిస్తూ ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం దొరికిపోయారు. వారిలో ఒకరు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మాజీ మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు. వీరిద్దరితోపాటు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇన్చార్జి డీఎస్పీ రామరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పుత్తూరు పట్టణంలోని స్వర్ణా హౌసింగ్ కాలనీలో గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో సీఐ లక్ష్మీనారాయణ అక్కడికి సిబ్బందితో వెళ్లారు. ముళ్ల పొదల మధ్యలో 8 మంది గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారిని పట్టుకోబోగా, ఆరుగురు దొరికారు. మరో ఇద్దరు పరారయ్యారు. అరెస్టయిన వారిలో నాగలాపురం మండలం వినోబానగర్‌కు చెందిన ఎ.విజయభాస్కర్ (22), నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన కె.యూకేష్ (21), పుత్తూరుకు చెందిన కాశీం మస్తాన్ (29), టి.సందీప్‌కుమార్ (27), సి.ఎం.శరవణ (35), బి.ఎస్.హరికృష్ణ అలియాస్ హరి (30) ఉన్నారు. వీరి నుంచి రూ.2.52 లక్షలు విలువ చేసే 21.05 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా అరకుకు చెందిన వెంకటేష్ వద్ద గంజాయిని కొని పుత్తూరులో విక్రయిస్తున్నట్లు నిందితులు విచారణలో తెలిపారు. పరారైన మోనిష్, బాలుతో పాటు అరకుకు చెందిన వెంకటేష్‌ను త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. గంజాయి విక్రేతలపై పీడీ యాక్టు పెట్టేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. గతంలోనూ అరెస్టయిన హరికృష్ణ అరెస్టయిన వారిలో హరికృష్ణ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు. గతంలో పుత్తూరు పట్టణ తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. శరవణ ప్రస్తుతం టీడీపీ పుత్తూరు పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు. గత ఏడాది జనవరి 10న విజయనగరం జిల్లా కాపుసోంపురం వద్ద 28 కిలోల గంజాయిని కారులో తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేసిన నలుగురిలో హరికృష్ణ రెండో నిందితుడు. అదే రోజు అరెస్టయిన వారిలో మరో టీడీపీ నాయకుడు హేమంత్ మూడో నిందితుడు. ఆ కేసులో బెయిల్‌పై బయటికి వచ్చిన హరికృష్ణ మరోసారి గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డాడు. -
నకిలీ మద్యం సరఫరా చేస్తే పీడీ యాక్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయానికి గండికొట్టేందుకు ఇతర రాష్ట్రాల్లోని మద్యాన్ని సరఫరా చేస్తున్నారని అలాంటి వారిని గుర్తించి పీడీ యాక్టు నమోదు చేయాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖలోని టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను పటిష్టపర్చాలని ఆదేశించారు. ఒడిషాలో నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్రానికి సరఫరా చేస్తున్న మాఫియాను ఎక్సైజ్ అధికారులు సమర్థవంతంగా అడ్డుకున్నారని మంత్రి అభినందించారు. అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్ర, గోవా నుంచి రాష్ట్రానికి వస్తున్న నకిలీ మద్యాన్ని కూడా అరికట్టాలన్నారు. ఎక్సైజ్ ఆదాయం పెరిగేందుకు అధికారులు నిబద్ధతతో కృషి చేయడమే కారణమన్నారు. సమీక్షాసమావేశంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, అడిషనల్ కమిషనర్ అజయ్ కుమార్, జాయింట్ కమిషనర్లు ఖురేషి, కె ఏ బి శాస్త్రి, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, బ్రివరేజ్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ తప్పదు: తెలంగాణ డీజీపీ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నకిలీ విత్తనాల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలో నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. కాగా, నకిలీ విత్తనాలపై దాడుల నేపథ్యంలో డీజీపీ అంజనీకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 990 కేసులు నమోదు చేశాము. 2014 నుంచి 2022 వరకు 1,932 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పదేపదే నకిలీ విత్తనాలు అమ్ముతున్న 58 మందిపై పీడీ యాక్ట్ పెట్టినట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే నకిలీ విత్తనాలపై ఎస్పీలు, కమిషనర్లు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. -
రేవంత్‌రెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ప్రగతి భవన్ పేల్చాలన్న వాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైల్లో పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ,మండలి మీడియా పాయింట్ల్లో బుధవారం వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర డీజీపీతోపాటు పార్లమెంట్ స్పీకర్‌కు రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో రేవంత్ సంఘ విద్రోహ శక్తులు మాట్లాడే భాష మాట్లాడుతున్నారని ఆరోపించారు. పేల్చేయడం, కూల్చేయడమే కాంగ్రెస్ ఎజెండానా? దీనితో ప్రజలకు ఆయన ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వానికి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులను డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నేర పరిశోధన, ఫంక్షనల్ వర్టికల్స్ పనితీరు, పీడీ చట్టం కింద కేసుల నమోదు, రైతు ఆత్మహత్యలు, కోర్టు కేసులు తదితర అంశాలపై డీజీపీ అంజనీకుమార్ శనివారం తన కార్యాలయం నుంచి సమీక్షించారు. సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్, మహిళా భద్రత విభాగం అడిషనల్ డీజీ షికాగోయల్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి జోనల్ ఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజిటింగ్ వీసాలపై రాష్ట్రానికి వచ్చే విదేశీయుల కదలికలపైనా నిఘా పెట్టాలని డీజీపీ సూచించారు. విదేశీయులు రాష్ట్రంలో ఏ అనధికారిక సమావేశాల్లో పాల్గొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, పీడీయాక్ట్ కేసుల నమోదులో నిబంధనలను అనుసరించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల పరిధిలో పీడీ చట్టం కేసుల నమోదు ఏకరీతిన ఉండాలని సూచించారు. పీడీ చట్టం ప్రయోగంపై కోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల నమోదులో తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ పేర్కొన్నారు. వచ్చే వారంలో జరిగే శివరాత్రి పర్వదినం సందర్బంగా ఏ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు ధిక్కరణ (కంటెంప్ట్) లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. త్వరలో భారీ సంఖ్యలో పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవనున్న నేపథ్యంలో శిక్షణపై దృష్టి పెట్టాలన్నారు. పీడీ చట్టాల నమోదులో తీసుకోవలసిన జాగ్రత్తలపై హైకోర్టులో పోలీస్ శాఖ జీపీ ముజీబ్ వివరించారు. -
శేషన్నపై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీంకు సుదీర్ఘకాలం కుడిభుజంగా మెలిగిన ముద్దునూరి శేషయ్య అలియాస్ శేషన్నపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ మేరకు సిటీ కొత్వాల్ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. శేషన్నపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఠాణాల్లో 11 కేసులు ఉన్నాయి. 2004లో అచ్చంపేటలో వి.రాములు, 2005లో మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ టీచర్ కనకాచారి, అదే ఏడాది అక్కడే చెంచు గోవిందు, 2011లో పహాడీషరీఫ్‌లో శ్రీధర్‌రెడ్డి, బొగ్గులకుంటలో పటోళ్ల గోవర్థన్‌రెడ్డి, 2013లో అచ్చంపేటలో మాజీ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, 2014లో నల్లగొండలో మాజీ నక్సలైట్ కొనాపురి రాములు హత్య కేసులతోపాటు పలు బెదిరింపుల కేసులు శేషన్నపై ఉన్నాయి. 2016లో నయీం ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇటీవల నగరంలో బెదిరింపుల దందా చేయడానికి వచ్చిన శేషన్నను గోల్కొండ పోలీసులు సెప్టెంబర్ 27న అరెస్టు చేశారు. అప్పట్లో ఇతడి వద్ద నాటుతుపాకీ, తూటాలు లభించాయి. హుమాయున్‌నగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్లాకు ఇతడు గతంలో తుపాకీ సరఫరా చేసినట్లు వెలుగులోకి వచ్చింది. శేషన్నపై ఆంధ్రప్రదేశ్‌లోనూ అనేక కేసులు ఉన్నాయి. ఇతడి నేరచరిత్రను పరిగణనలోకి తీసుకున్న కొత్వాల్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. -
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరిపై పీడీయాక్ట్
సాక్షి, రంగారెడ్డి: గుట్టుచప్పుడు కాకుండా ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిపై రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు మీర్‌పేట పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఎల్లంపేటకు చెందిన గంధ భవానీ(25) తన స్నేహితుడైన తూర్పుగోదావరి జిల్లా అన్నవరంకు చెందిన కసిరెడ్డి దొరబాబు (23)తో కలిసి మీర్‌పేట టీకేఆర్ కళాశాల సమీపంలో ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తోంది. సులువుగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఇతర ప్రాంతాల నుంచి మహిళలను రవాణా చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న మీర్‌పేట పోలీసులు అక్టోబరు 13వ తేదీన ఇంటిపై దాడి చేసి నిర్వాహకులు గంధ భవానీ, కసిరెడ్డి దొరబాబును అరెస్ట్ చేసి.. నగరానికి చెందిన ఇద్దరు మహిళలను రక్షించారు. భవిష్యత్‌లో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడకుండా సీపీ ఆదేశాల మేరకు పోలీసులు భవానీ, దొరబాబుపై బుధవారం పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. చదవండి: మహిళా యూట్యూబర్‌పై ముంబై ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్.. -
అందమైన యువతులతో వ్యభిచారం.. నిర్వాహకుడిపై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్(చైతన్యపురి): సెలూన్ పేరుతో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్న వ్యక్తిపై సరూర్‌నగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బండ్లగూడ నూరినగర్కు చెందిన షేక్ అయాజ్ (24), దిల్‌సుఖ్‌నగర్‌లో స్పా అండ్ సెలూన్ నిర్వహించే బలరాం కలిసి సులువుగా డబ్బు సంపాదించేందుకు వ్యభిచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. లలితానగర్‌లోని సిగ్నేచర్ స్టూడియో హెయిర్ అండ్ స్కిన్ మేకప్ అకాడమీకి అందమైన యువతులను తెప్పించి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు అక్టోబర్ 7న స్పాసెంటర్పై దాడి చేశారు. షేక్ అయాజ్, బలరాంలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుని రెస్క్యూ హోంకు తరలించారు. కాగా, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు నిందితుడు షేక్ అయాజ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసి బుధవారం చర్లపల్లి జైలుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. చదవండి: (వివాహేతర సంబంధం తెలిసి భర్త మందలించాడు.. ప్రియుడితో కలిసి..) -
రాజాసింగ్‌పై వందకుపైగా క్రిమినల్ కేసులు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వందకుపైగా క్రిమినల్ కేసులున్నాయని, అందులో ఒక హత్య కేసు కూడా ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గతంలో ఆయనపై నమోదైన రౌడీషీట్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించింది. రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య టి. ఉషాభాయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి, జస్టిస్ జె.శ్రీదేవి ధర్మాసనం బుధవారం కూడా విచారణను కొనసాగించింది. ప్రభుత్వ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ హాజరై వాదనలు వినిపించారు. 1860లో ఏర్ప డిన ఉత్తరప్రదేశ్‌లోని ఇస్లామిక సెమినరీ ప్రకారం.. ‘ఆకా’‘మౌలా’అనే పదాలు ప్రవక్తను చూచి స్తాయని చెప్పారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడిన వీడియో సీడీని కోర్టు అందజేశారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగానే మూడు క్రిమినల్ కేసుల ఆధారంగా రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు. అనంతరం ధర్మాసనం.. విచారణను గురువారానికి వాయిదా వేసింది. చదవండి: నన్ను చంపి బతికి బట్ట కట్టగలమని అనుకుంటున్నారా?.. ఈటల హెచ్చరిక -
కావాలనే నా మాటలు వక్రీకరించారు.. హైకోర్టుకు రాజాసింగ్ నివేదన
సాక్షి, హైదరాబాద్: మహ్మద్ ప్రవక్తపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎలాంటి ఆరోపణలు చేయలేదని, కొందరు కావాలనే ఆయన మాటలను వక్రీకరించారని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. ప్రవక్తను చెడుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో రాజాసింగ్ పోస్టు చేశారనే అభియోగాలకు ఆధారమైన ట్రాన్స్లేషన్ చేసిన వ్యక్తి ఎవరో పోలీసులు ఇంత వరకు వెల్లడించలేదన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశారని, దాన్ని రద్దు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే భార్య టి.ఉషాభాయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజాసింగ్‌ను 12 నెలలపాటు జైల్లో ఉంచేందుకు వీలుగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 90ని కొట్టేయాలని కోరుతూ ఆమె అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి, జస్టిస్ జె.శ్రీదేవి ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు. రాజాసింగ్‌పై ఉన్న కేసుల్లో కిందికోర్టు రిమాండ్‌కు పంపేందుకు నిరాకరించిందని గుర్తుచేశారు. దీంతో ఉద్దేశపూర్వకంగా ఆయనపై తప్పుడు ఆరోపణలు చేసి పీడీ యాక్ట్ ప్రయోగించారని చెప్పారు. గత పదేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం పలువురిపై నమోదు చేసిన పీడీ యాక్ట్ కేసుల్ని కోర్టు కొట్టేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. చదవండి: వెటర్నరీ వర్సిటీలో ర్యాగింగ్ ‘కలకలం’.. 34 మందిపై చర్యలు! సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధం.. గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించారన్నారు. ప్రవక్తను రాజాసింగ్ ‘ఆకా’అనే పదంతో ఉచ్ఛరించారనడాన్ని న్యాయవాది వ్యతిరేకించారు. ఆకా అంటే పెద్ద అన్న అని అర్థమని చెప్పారు. ప్రవక్త గురించి రాజాసింగ్ తప్పుడుగా మాట్లాడినట్లు వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారని, అసలు ఆ వీడియోలోని వాయిస్ ఆయనది కాదన్నారు. 50 ఏళ్ల వ్యక్తి 6 ఏళ్ల బాలికను వివాహం చేసుకోవడం గురించి మాత్రమే ఆగస్టు 22న రాజాసింగ్ మాట్లాడారని చెప్పారు. రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి పోలీసులు చూపుతున్న 15 కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్‌ను రద్దు చేయాలని ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది సదాశివుని ముజీబ్ కుమార్ గత వారం వాదనలు వినిపించారు. తదుపరి వాదనలు నేడు కొనసాగనున్నాయి. -
పీడీ యాక్ట్‌పై రాజాసింగ్ అప్పీల్ తిరస్కరణ
-
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాక్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భారీ షాక్ తగిలింది. పీడీ యాక్ట్ ఎత్తేయాలన్న రాజాసింగ్ విజ్ఞప్తి తిరస్కరణకు గురైంది. ఈ మేరకు ఆయనపై నమోదు అయిన పీడీయాక్ట్పై బుధవారం అడ్వైజరీ బోర్డు తీర్పు వెలువరించింది. ఈ కేసును నిశితంగా పరిశీలించి ఇరువర్గాల వాదోపవాదాలు విని విచారణ చేపట్టిన కమిటీ.. పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్‌ను సమర్థించింది. అంతేకాదు.. పీడీ యాక్ట్ ఎత్తేయాలన్న రాజాసింగ్ విజ్ఞప్తిని తిరస్కరించింది. దీంతో ఆయనకు ప్రతికూలంగా బోర్డు ఇవాళ తీర్పు వెలువరించింది. రాజాసింగ్‌పై 101 కేసులు ఉన్నాయని, అందులో 18 కేసులు కమ్యూనల్(మత సంబంధిత) ఉన్నాయని పోలీసులు కమిటీకి నివేదించారు. దీంతో హైదరాబాద్ పోలీసుల వాదనతో ఏకీభవించింది అడ్వైజరీ కమిటీ. -
Hyderabad: గంజాయి సరాఫరా.. మహిళా డ్రగ్ పెడ్లర్లపై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ ముఠాలో సభ్యులుగా ఉన్న ఇద్దరు మహిళా పెడ్లర్లపై రాచకొండ పోలీసులు మంగళవారం పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 8 మంది నిందితులపై పీడీ చట్టం ప్రయోగించిన సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన ప్రధాన డ్రగ్ పెడ్లర్ ఆకాశ్ కుమార్ ఆదేశాల మేరకు ముఠా సభ్యులు సాయినాథ్ చౌహాన్, అతడి భార్య రవళి, ఆమె స్నేహితురాలు సంగీత, షేక్ నవాజుద్దీన్, వినాయక్, బానావత్ కిషన్, బానావత్ నాగలు రెండు కార్లలో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన రాజు, సంసాయిరావు, నుంచి 480 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. హైదరాబాద్ మీదుగా కర్ణాటకకు తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం అందుకున్న హయత్‌నగర్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో రవళి, సంగీతలపై హయత్‌నగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి, చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
రాజాసింగ్ ఎపిసోడ్‌కు త్వరలోనే ఎండ్ కార్డ్?
తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ ఒక ఫైర్ బ్రాండ్. ఓ వివాదం కారణంగా ఆయనపై పార్టీ వేటు వేసింది. ఆయనపై విధించిన సస్పెన్షన్‌పై బీజేపీ హైకమాండ్ పునరాలోచనలో పడిందా? రాజాసింగ్ వివరణతో పార్టీ సంతృప్తి చెందిందా? సస్పెన్షన్‌ను ఎత్తివేసే ఆలోచన చేస్తోందా? రాజాసింగ్ ఎపిసోడ్‌కు త్వరలోనే ఎండ్ కార్డ్.! గ్రేటర్ హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎపిసోడ్‌కు త్వరలోనే ఎండ్ కార్డ్ వేయాలని కమలనాథులు భావిస్తున్నారు. నార్త్ ఇండియన్ అయిన రాజాసింగ్ హైదరాబాద్‌లోని ఉత్తరాదివారితో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ ఇష్యూలో రాజాసింగ్ చేసిన కామెంట్స్‌పై దుమారం రేగింది. ఆ తర్వాత రాజాసింగ్ విడుదల చేసిన వీడియో అగ్నికి ఆజ్యం పోసింది. ఈ వ్యవహారం మరింత ముదరకుండా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ హైకమాండ్. అసలుకే మోసం జరిగిందా? రాజాసింగ్ సస్పెండ్ చేయడంతో కట్టర్ హిందువులు పార్టీకి దూరమవుతారనే విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో త్వరలోనే ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రాజాసింగ్‌పై పెట్టిన పీడీ యాక్ట్‌ను ఎత్తివేయాలంటూ కొన్ని రోజులుగా హిందూ సంఘాల సైతం డిమాండ్ చేస్తున్నాయి. పార్టీ కేడర్‌లో, హిందూ సంఘాల్లో రాజాసింగ్‌కు పెరుగుతున్న మద్దతు చూసి.. బీజేపీ నాయకత్వం అంతర్మథనంలో పడింది. పీడీ యాక్ట్‌పై వ్యతిరేక గళం కమెడియన్ మునావర్ ఫారూఖీ హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో హిందు దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యానిస్తారని రాజాసింగ్ ముందు నుంచే చెబుతూ వచ్చారు. హైదరాబాద్‌లో ఫారుఖీ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తే ఆందోళన చేస్తామని కూడా ఆయన హెచ్చరించారు. రాజాసింగ్, హిందూ సంఘాల హెచ్చరికల నేపథ్యంలో భారీ భద్రత నడుమ మునావర్ ఫారుఖీ షోను నిర్వహించారు. షో ముగిసిన తర్వాత రాజాసింగ్ వివాదాస్పద వీడియో విడుదల చేయడంపై పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. అందుకే పీడీ యాక్ట్‌పై పార్టీ శ్రేణులు వ్యతిరేక గళం విప్పుతున్నాయి. ఇప్పటికే విజయశాంతి ఓ ప్రకటనలో రాజాసింగ్‌కు మద్ధతిచ్చారు. వివరణ ఓకే అయితే సవరణే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని భావించి కమలనాథులు ఎమ్మెల్యే రాజాసింగ్ ను సస్పెండ్ చేశారు. షోకాజ్ నోటీస్‌కు వివరణ ఇచ్చేందుకు 10 రోజుల సమయం ఇచ్చింది బీజేపీ హైకమాండ్. కానీ రాజాసింగ్ జైల్లో ఉండటంతో రిప్లై ఇవ్వలేకపోయారు. పార్టీ నుంచి గడువు తీసుకుని రాజాసింగ్ షోకాజ్ నోటీసుకు స్పందించారు. తాను పార్టీ లైన్ ఎక్కడా దాటలేదని, హిందువులకు సేవ చేసే అవకాశాన్ని తిరిగి కల్పించాలని సంజాయిషీ నోటీస్‌కు సమాధానంలో కోరారు. ఈ తరుణంలో కమలం పార్టీ అగ్రనేతలు తమ నిర్ణయాన్ని పునసమీక్షించుకునే అవకాశం ఉందని గోషామహల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజాసింగ్‌కు సంబంధించి బోలెడు పోస్టర్లు అక్కడ వెలిశాయి. -
బీజేపీలో హాట్‌టాపిక్.. రాజాసింగ్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన విజయశాంతి!
రాజాసింగ్ ఫైర్ బ్రాండ్ నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఏం మాట్లాడినా సంచలనం, వివాదాస్పదమే. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతోనే బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు. తర్వాత జైలు పాలయ్యారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర బీజేపీ నాయకులు కక్కలేక.. మింగలేక ఇబ్బందిపడుతున్నారు. రాములమ్మ మాత్రం భిన్నంగా రియాక్టయ్యారు. ఇంతకీ ఆమె ఏమన్నారు?.. కక్కలేక మింగలేక కమలం.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో ఏమి చేయాలో అర్థంకాక, కేడర్‌ను సముదాయించలేక తెలంగాణ బీజేపీ నేతలు సతమతం అవుతున్నారు. మహమ్మద్ ప్రవక్త మీద రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ హైకమాండ్ సీరియస్‌గా స్పందించింది. ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై అప్పటివరకు నమోదైన కేసులను పరిగణలోకి తీసుకుంటూ పీడీ యాక్ట్ పెట్టి.. చర్లపల్లి జైలుకు పంపింది. ప్రస్తుతం రాజాసింగ్ జైలులో ఉన్నారు. సస్పెన్షన్ తొలగించే విషయంలో బీజేపీ హై కమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎప్పుడొస్తారు సర్..? రాజాసింగ్ జైలుకు వెళ్లి నెల రోజులు అవుతుంది. జైలు నుండి ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితి. రాజాసింగ్ జైల్లో ఉండటంపై బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు, హిందూ సంఘాల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడా నిరసనలు, బందులు కూడా జరుగుతున్నాయి. ఈ ఘటనలన్నీ రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. రాజాసింగ్‌ను బీజేపీ నుండి సస్పెండ్ చేసినా కార్యకర్తలు మాత్రం బ్యానర్లు, ఫ్లెక్సీలపైన ఆయన ఫొటోలను తీసివేయడం లేదు. బండి సంజయ్ సంగ్రామ యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల మీద కూడా రాజాసింగ్ ఫొటోలు దర్శనమిచ్చాయి. టైగర్ ఎక్కడ..? పార్టీ హై కమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ స్థానిక శ్రేణులు పెద్దగా పట్టించుకోవడంలేదు. వారం క్రితం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు రాజాసింగ్‌ను విడుదల చేయాలంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. పార్టీ సస్పెండ్ చేసినా కార్పొరేటర్లు మాత్రం ఆయనకు మద్దతుగా కౌన్సిల్ మీటింగ్‌లో తమ అభిమానం చాటుకున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బీజేపీ కార్యకర్తలు, పార్టీ నేతలు మాట్లాడుతున్నప్పుడు ఆటంకం కల్పించారు. టైగర్ రాజా సింగ్ ఎక్కడ అని ప్లకార్డ్స్ ప్రదర్శించారు. స్లోగన్స్ ఇచ్చారు. దీంతో బండి సంజయ్ జోక్యం చేసుకొని వారిని సముదాయించారు. బండి సంజయ్ ఎక్కడా కూడా రాజాసింగ్ పేరును ప్రస్తావించలేదు. పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి ఆయన పేరు చెబుతూ మాట్లాడలేరు. రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టి జైలులో వేసినా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. పార్టీ బ్యానర్ మీద ఆందోళన చేయలేని స్థితి. అలాగని పార్టీ రాజాసింగ్‌ను సస్పెండ్ చేసింది కాబట్టి ఆయన కోసం ఏమీ చేయలేమని కేడర్‌కు చెప్పలేని సంకట పరిస్థితి. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి మాత్రం రాజాసింగ్‌కు మద్దతుగా ఒక ప్రకటన విడుదల చేయడం కలకలం రేపుతోంది. పార్టీ రాష్ట్ర నేతలు రాజాసింగ్ పేరును ప్రస్తావించకుండా సపోర్ట్ చేస్తుండగా.. విజయశాంతి పార్టీ లైన్ దాటి నేరుగా రాజాసింగ్‌ను సపోర్ట్ చేస్తూ ప్రకటన విడుదల చేయడంపై పార్టీలో చర్చ సాగుతోంది. మొత్తం మీద రాజాసింగ్ విషయంలో తెలంగాణ బీజేపీ నేతల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. రాజాసింగ్‌ను దూరం చేసుకోలేరు. అలాగని హైకమాండ్ ఆదేశాలను అతిక్రమించలేరు. -
పీడీ.. వ్యక్తిగత స్వేచ్ఛపై దండయాత్రే: సుప్రీం
న్యూఢిల్లీ: ముందస్తు నిర్బంధం(పీడీ) అనేది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై తీవ్రమైన దండయాత్రేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇలాంటి చర్యలు చేపట్టే విషయంలో రాజ్యాంగం, చట్టాలు కల్పించిన రక్షణలు, నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. 2021 నవంబర్ 12న త్రిపుర ప్రభుత్వం జారీ చేసిన పీడీ ఉత్తర్వును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ జేబీ పార్దీవాలాల ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. పీఐటీఎన్‌డీపీఎస్ చట్టం–1988 కింద అరెస్టు చేసిన నిందితుడిని వెంటనే విడుదల చేయాలని çఆదేశించింది. పీడీ చట్టం కింద అరెస్టు చేస్తే నిందితులు ఏడాదిపాటు జైల్లోనే ఉండాల్సి వస్తోందని, దీనివల్ల వారికి తమపై నమోదైన కేసుల్లో నిరపరాధినని నిరూపించుకొనే అవకాశం లేకుండా పోతోందంది. ప్రచారం కోసం ఇక్కడికి రావొద్దు కేవలం ప్రచారం కోసం న్యాయస్థానానికి రావొద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎంల)ను ఎన్నికల సంఘం (ఈసీ) కాకుండా కొన్ని కంపెనీలు నియంత్రిస్తున్నాయంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన జన్ వికాస్ పార్టీ వేసిన పిటిషన్‌పై Ôజస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘దేశంలో దశాబ్దాలుగా ఈవీఎంలు వాడకంలో ఉన్నాయి. కానీ, ఎప్పటికప్పుడు సమస్యలు లేవనెత్తేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటువంటిదే ఇది. ఓటర్ల ఆదరణ పెద్దగా పొందలేని ఓ రాజకీయ పార్టీ ఇటువంటి పిటిషన్ల ద్వారా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది’అని ధర్మాసనం పేర్కొంది. నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టు గ్రూప్–సి ఉద్యోగుల సంక్షేమ సంఘంలో రూ.50 వేలు జమ చేయాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
పీడీ యాక్ట్ బోర్డు ఎదుట ఎమ్మెల్యే రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నమోదు అయిన పీడీ యాక్ట్‌పై అడ్వైజరీ బోర్డు విచారణ చేపట్టింది. పీడీ యాక్ట్ బోర్డ్ చైర్మన్ జస్టిస్ భాస్కరరావు నేతృత్వంలో విచారణ సాగుతోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ జరిగిన విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఇదిలా ఉంటే.. ముహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్‌పై అభియోగాలు నమోదు అయ్యాయి. అయితే.. ‘నేను మహ్మద్ ప్రవక్త గురించి వీడియోలో మాట్లాడానని కొందరు ఆరోపిస్తున్నారు. నేను వీడియోలో ఎక్కడా మహ్మద్ ప్రవక్త పేరును ప్రస్తావించలేదు’ అంటూ మరో వీడియోను అరెస్ట్‌కు ముందు రిలీజ్ చేశారు రాజాసింగ్. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైల్లో ఉన్నారు. మరోవైపు.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్లో రాజాసింగ్ క్రిమినల్ కేసులు పొందుపరచలేదంటూ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించి.. నవంబర్ 1 లోగా సమాధానం ఇవ్వాలని రాజాసింగ్ తరపు న్యాయవాదుల్ని కోరింది. -
హైదరాబాద్: MIM నేత కషఫ్‌పై పీడీయాక్ట్
-
హైదరాబాద్‌లో మరో నేతపై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్:సోషల్‌మీడియాలో తన వీడియోల ద్వారా రెండు వర్గాల మధ్య విద్వేషాలు రగిలిస్తున్న ఓల్డ్ మలక్‌పేటకు చెందిన యువకుడిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. చాదర్‌ఘాట్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...ఓల్డ్‌మలక్‌పేటకు చెందిన అబ్దాహు ఖాద్రీ అలియాస్ కసఫ్ తన ట్విట్టర్ ఖాతాలో తరచూ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా, శాంతికి భంగం కలిగించేలా పోస్ట్‌లు పెట్టేవాడు. ఈనెల 22, 23న బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న అతను రెచ్చగొట్టేలా నినాదాలు చేశాడు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతడి చర్యల వల్ల నగరంలో పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగింది. పోలీసు వాహనాలపై, వేటు వ్యక్తుల వాహనాలపై పలువురు దాడులు జరిగాయి. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కసఫ్‌పై గతంలోనూ నగరంలోని మీర్‌చౌక్, చాదరఘాట్, సీసీఎస్‌లో కేసులు ఉన్నట్లు తెలిపారు. అతడి విద్వేష పూరిత, రెచ్చగొట్టే వీడియోలు, నినాదాలు ప్రజల భద్రతపై ప్రభావాన్ని చూపిస్తాయని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: తెలంగాణలో ఇలాంటి ఘటన ఇదే తొలిసారి! ఈ నేపథ్యంలో నగర కమిషనర్ ఆదేశాల మేరకు అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. మంగళవారం చాదర్‌ఘాట్ పోలీసులు భారీ బందోబస్తు మధ్య అతడిని అదుపులోకి తీసుకుని చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. కసఫ్ గతంలో ఎంఐఎం సోషల్‌మీడియా కన్వీనర్‌గా పని చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సోషల్‌మీడియాలో రెచ్చగొట్టే వీడియోలు పెడుతున్న కారణంగా పార్టీ అతడిని దూరంగా పెట్టినట్లు తెలిసిందని ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపారు. -
అదే జరిగితే.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఏడాది జైల్లోనే!
ఓ నేరం చేసి అరెస్టు కావడం..బెయిల్ పొంది బయటకు రావడం.. మళ్ళీ అదే ‘దందా’ కొనసాగించడం.. నగర కమిషనరేట్ పరిధికి చెందిన అనేకమంది రౌడీషీటర్లు, చైన్ స్నాచర్లు, సాధారణ దొంగల పంథా ఇది. ఇలాంటి వారికి చెక్ చెప్పడానికి పోలీసు విభాగం పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్ (ముందస్తు నిర్బంధం) చట్టాన్ని వినియోగిస్తోంది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు ప్రస్తుతం ఇదే అస్త్రాన్ని ప్రయోగించారు. ఓ ఎమ్మెల్యేని పీడీ చట్టం కింద అదుపులోకి తీసుకుని జైలుకు పంపడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి కావడం గమనార్హం అప్పట్లో ఎక్సైజ్ విభాగమే... నాటుసారా తయారీ–విక్రయం, మాదక ద్రవ్యాల అక్రమరవాణా–అమ్మకం, బందిపోటు దొంగతనాలు, మనుషుల అక్రమ రవాణా, భూ కబ్జాలు, గూండాయిజం.. ఈ తరహా నేరాలతో రెచ్చిపోతున్న వారిని నియంత్రించే ఉద్దేశంతో 1986లో పీడీ యాక్ట్‌ను అమల్లోకి తీసుకువచ్చారు. ఓసారి ఈ చట్టం కింద అదుపులోకి తీసుకుంటే, ప్రభుత్వం ఆమోదిస్తే 12 నెలల పాటు ఎలాంటి విచారణ లేకుండా జైల్లోనే ఉంచవచ్చు. ఆరు కేటగిరీలకు చెందిన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించే అవకాశం ఉన్నా.. ఒకప్పుడు కేవలం నాటుసారా కేసుల్లో ఎక్సైజ్ విభాగం మాత్రమే దీన్ని వినియోగించేది. చాలా అరుదుగా మాత్రమే పోలీసు విభాగం ప్రయోగించేది. రాష్ట్రం ఏర్పడటంతో మారిన విధానం పీడీ యాక్ట్‌ను మెజిస్టీరియల్ అధికారాలున్న జిల్లా కలెక్టర్ లేదా పోలీసు కమిషనర్ మాత్రమే వినియోగించగలరు. నగరంలో పదేపదే నేరాలకు పాల్పడుతున్న, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని 2014లో నగర పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం స్పెషల్ బ్రాంచ్‌లో సంయుక్త పోలీసు కమిషనర్ నేతృత్వంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. అదనపు డీసీపీ, న్యాయ సలహాదారుతో సహా 12 మంది సిబ్బందిని ఈ సెల్‌కు కేటాయించారు. పీడీ యాక్ట్ ప్రయోగ ప్రతిపాదనల్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించి, దాని పరిధిలోకి వచ్చే వారిపై యాక్ట్ ప్రయోగానికి కొత్వాల్‌కు సిఫారసు చేయడం వీరి విధి. రాజాసింగ్ వ్యవహారంలోనూ ఈ విభాగం సిఫారసు ఆధారంగానే పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నిర్ణీత కాలంలో మూడు నేరాలు చేస్తే.. నిర్ణీత కాలంలో మూడు నేరాలు చేసి కేసులు నమోదైన వారిపై ఈ యాక్ట్ ప్రయోగించే అవకాశం ఉంది. ఏదైనా పోలీసుస్టేషన్‌కు చెందిన ఇన్స్పెక్టర్ ఈ తరహా నిందితులను గుర్తించి పీడీ యాక్ట్ ప్రయోగానికి ప్రతిపాదిస్తారు. దీన్ని ఏసీపీ సమీక్షించిన తర్వాత డీసీపీ ద్వారా కొత్వాల్‌కు చేరుతుంది. ఆయన పూర్వాపరాలు పరిశీలించాల్సిందిగా పీడీ సెల్‌ను ఆదేశిస్తారు. ఆ సెల్ ఒకే అని నివేదిక ఇస్తే, ఆ వ్యక్తికి నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకుంటారు. ఒకవేళ అతను అప్పటికే జైల్లో ఉంటే అక్కడే ఇస్తారు. ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి పీడీ యాక్ట్ ప్రయోగించడాన్ని ప్రభుత్వం సమర్ధించాల్సి ఉంటుంది. ఈ యాక్ట్ కింద అదుపులోకి తీసుకున్న వ్యక్తి పూర్తి వివరా లను ప్రభుత్వానికి పంపడం ద్వారా 12 రోజుల్లోగా ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆపై కేసు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన అడ్వైజరీ బోర్డుకు వెళ్తుంది. ఈ బోర్డు సదరు వ్యక్తి/ కుటుంబీకుల వాదనను విని, నేరచరిత్రను పరిగణనలోకి తీసుకుని పోలీసుల నిర్ణయాన్ని సమర్ధించడమో, లోపాలుంటే తిరస్కరించడమో చేస్తుంది. ఆ తర్వాత అప్పీల్ హైకోర్టులోనే ఉంటుంది. నగర కమిషనరేట్ పరిధిలో మొత్తం 5 జోన్లు (ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్, సౌత్), 60 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. 2014 నుంచి పీడీ యాక్ట్ ప్రయోగాల్లో అత్యధికం పశ్చిమ మండల పరిధిలోనే జరిగాయి. రాజాసింగ్ కూడా ఈ మండల పరిధిలోని నివాసే కావడం గమనార్హం. కాగా, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (పీడీ యాక్ట్)కు తెలంగాణ ప్రభుత్వం 2018లో ఈ చట్టానికి సవరణలు చేసింది. అదనంగా.. కల్తీ విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువులు, ఆహార పదార్థాల కల్తీ, గేమింగ్, లైంగిక నేరాలు, పేలుళ్లు, ఆయుధాలు, వైట్‌కాలర్ ఆర్థికనేరాలు, అటవీ నేరాలు, నకిలీ పత్రాల తయారీ తదితరాలను దీని పరిధిలోకి తెచ్చింది. 2018లో మొత్తం 385 మందిపై, 2020లో 350 మందిపై ఈ చట్టం కింద కేసులు పెట్టారు. ఈ చట్టం ద్వారా ఒక వ్యక్తిని కనీసం మూడు నెలల నుంచి గరిష్టంగా 12 నెలల వరకు జైలులో నిర్బంధించవచ్చు. ఇది కూడా చదవండి: హైదరాబాద్ పోలీసుల సంచలన ప్రకటన.. రాజా సింగ్‌పై పీడీ యాక్ట్ -
ఎమ్మెల్యే రాజా సింగ్‌పై పీడీ యాక్ట్.. ఈ చట్టం ఉద్దేశం ఏంటి?
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ తెలంగాణ రాజకీయాల్లో కాకపుట్టిస్తోంది. ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా చేసిన ఆయన వ్యాఖ్యలు భాగ్యనగరంలో అలజడి సృష్టించాయి. గత వారం రోజుల్లో రెండు సార్లు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈసారి ఆయనపై ఏకంగా పీడీ యాక్ట్ నమోదు చేశారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్లో గతంలో రాజాసింగ్‌పై రౌడీషీట్ ఉండటంతో పీడి యాక్ట్ నమోదు చేసినట్టు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదవడం ఇదే తొలిసారి. ఈక్రమంలో పీడీ యాక్ట్ హాట్ టాపిక్ అయింది. ఇంతకూ పీడీ చట్టం అంటే ఏంటి? దీనిని ఎలాంటి సందర్బాల్లో ఉపయోగిస్తారు.. అసలు ఈ చట్టం ఉద్ధేశం ఏంటో తెలుసుకుందాం. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (పీడీ యాక్ట్) ను మన దేశంలో 1950లో అమల్లోకి తీసుకొచ్చారు. పేరుమోసిన నేరస్థులను ఒక సంవత్సరం పాటు జైలులో ఉంచడానికి పోలీసులు అమలు చేసే చట్టం ఇది. ఈ చట్టం ద్వారా ఒక వ్యక్తిని కనీసం మూడు నెలల నుంచి గరిష్టంగా 12 నెలల వరకు జైలులో నిర్బంధించవచ్చు. విద్వేషపూరిత ప్రసంగం, అల్లర్లు, విచక్షణారహిత హింస, తీవ్రవాదం, అంతర్రాష్ట్ర దొంగలు, హంతకులు, ఆన్లైన్ మోసగాళ్లు, వ్యభిచార నిర్వహణ, మాదక ద్రవ్యాల ముఠాలు.. ఇలా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై దీన్ని ప్రయోగిస్తారు. ప్రజల భద్రతలకు హాని కలిగించడం.. సమాజానికి ముప్పుగా పరిణమించే వారిపై ఈ చట్టాన్ని బ్రహ్మాస్త్రంగా వినియోగిస్తారు. నేరాల అదుపునకు విచారణ అవసరం లేకుండా వ్యక్తులను కట్టడి చేయడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. తెలంగాణలో మరిన్ని తెలంగాణ ప్రభుత్వం 2018లో ఈ చట్టానికి సవరణలు చేసింది. అదనంగా.. కల్తీ విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువులు, ఆహార పదార్థాల కల్తీ, గేమింగ్, లైంగిక నేరాలు, పేలుళ్లు, ఆయుధాలు, వైట్‌కాలర్ ఆర్థికనేరాలు, అటవీ నేరాలు, నకిలీ పత్రాల తయారీ తదితరాలను దీని పరిధిలోకి తెచ్చింది. 2018లో మొత్తం 385 మందిపై, 2020లో 350 మందిపై ఈ చట్టం కింద కేసులు పెట్టారు. అయితే పీడీ చట్టంపై విమర్శలూ ఎక్కువే. వ్యవస్థీకృత నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలన్న ఉద్ధేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం దుర్వినియోగానికి గురవుతూ విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. తీవ్రమైన నేరాలు చేసి.. సమాజ భద్రతకు ముప్పుగా మారే అవకాశమున్నవారిపై ఉపయోగించాల్సిన ఈ యాక్ట్‌ను చిల్లర దొంగతనాలు, చిట్టీల వ్యాపారాలు, వ్యభిచార నేరాలకు పాల్పడినవారిపైనా ప్రయోగించి పోలీసులు విమర్శలు ఎదుర్కొన్న దాఖలాలున్నాయి. క్రిమినల్ లా ప్రకారం వారిని విచారించి శిక్షించాల్సింది పోయి పీడీ చట్టం కింద ఏడాది పాటు జైలులో పెట్టడమే లక్ష్యంగా దీన్ని వినియోగిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఎక్కువే. నిర్బంధమే లక్ష్యంగా ఈ చట్టాన్ని వినియోగించడం రాజ్యాంగంలోని అధికరణ 21కి విరుద్ధమే! (క్లిక్: ఒక్క ఉప ఎన్నిక కోసం బీజేపీ ఇంత బరితెగించాలా) -
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్
-
హైదరాబాద్ సీపీ సంచలన ప్రకటన.. రాజా సింగ్‌పై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు అయినట్టు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. చాలాసార్లు ఒక మతాన్ని, వర్గాన్ని కించపరిచేలా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ఆయన గురువారం మీడియాకు తెలిపారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్లో గతంలో రాజాసింగ్‌పై రౌడీషీట్ ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ కేసులు ఆధారంగా చేసుకొని బీజేపీ ఎమ్మెల్యేపై పీడి యాక్ట్ నమోదు చేసినట్టు చెప్పారు. అరెస్టుకు ముందు ఆయనకు 32 పేజీల పీడీ యాక్ట్ డాక్యుమెంట్‌ను అందించినట్టు కమిషనర్ వెల్లడించారు. కాగా, ఈనెల 22న ఓ యూట్యూబ్ చానల్లో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా అభ్యంతరకరంగా రాజాసింగ్ మాట్లాడారని అన్నారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదవ్వడం ఇదే తొలిసారి. ఇక 2004 నుంచి రాజాసింగ్‌పై 101 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 మతపరమైన కేసులు ఉన్నాయి. వీటిలో కొన్ని సరైన సాక్ష్యాధారాలు లేక వీగిపోయాయి. మరికొన్నికోర్టు విచారణలో ఉన్నాయి. చదవండి: ఒక్క ఉప ఎన్నిక కోసం బీజేపీ ఇంత బరితెగించాలా: ఎంపీ అసదుద్దీన్ -
యువతులు, ఒంటరి మహిళలే టార్గెట్.. జీవనోపాధి కల్పిస్తానని చెప్పి
సాక్షి, హైదరాబాద్: వ్యభిచారం నిర్వహిస్తూ అమాయక మహిళలను మోసం చేసిన ఓ మహిళపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ గురువారం పీడీ యాక్టు నమోదు చేశారు. జవహర్‌నగర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిగాడి అరుణ దమ్మాయిగూడ వాయుశక్తినగర్లో ఓ ఇంట్లో నివాసం ఉంటూ కళాశాల యువతులు, ఒంటరి మహిళలకు జీవనోపాధి కల్పిస్తానని చెప్పి వ్యభిచారం నిర్వహిస్తుంది. వ్యభిచారం నిర్వహిస్తున్న అరుణను జూన్ 16న పోలీసులు అదుపులోకి తీసుకొని చంచల్‌గూడ జైలులో తరలించారు. ఈ మేరకు అరుణపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు తెలిపారు. మసాజ్ సెంటర్‌పై దాడి.. ముగ్గురు మహిళల అరెస్టు అనుమతి లేకుండా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్న బ్యూటీ సెలూన్ వెల్నెస్ సెంటర్‌పై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్న ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పనామా చౌరస్తాకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న ఎస్బీ బ్యూటీ అండ్ సెలూన్ వెల్నెస్ సెంటర్లో అనుమతి లేకుండా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారం అందంది. దీంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా బుధవారం దాడి చేశారు. అందులో పనిచేస్తున్న ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. మసాజ్ సెంటర్ నిర్వాహకుడు రాధామనోహర్‌రెడ్డి, మేనేజర్ ప్రశాంత్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ వారి నుంచి 4 సెల్ఫోన్లు, రూ. 500 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువతులను ట్రాప్ చేసి బలవంతంగా వ్యభిచార ఊబిలోకి..
సాక్షి, ఉప్పల్: యువతులను ట్రాప్ చేసి బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దింపుతున్న యువకుడిపై పీడీయాక్ట్ నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాసవి రవితేజ (35), రామంతాపూర్ గోకులేనగర్‌లో నివాసముంటున్నాడు. అమాయక యువతులను ట్రాప్ చేసి బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దింపుతున్నాడు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు గత నెల 7న రవితేజను రిమాండ్‌కు తరలించారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు శనివారం పీడీయాక్ట్ నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాసవి రవితేజ (35) చదవండి: రాత్రి ఇంట్లో నిద్రించారు.. తెల్లారేసరికి మాయం.. ఎటు వెళ్లినట్లు? -
వెబ్సైట్లో యువతుల చిత్రాలు పెట్టి వ్యభిచారం..
సాక్షి, చైతన్యపురి: వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలోని మరో ఇద్దరిపై చైతన్యపురి పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన అల్లని శ్యాం (49), విజయవాడకు చెందిన రామిశెట్టి సంధ్య (32) హైదరాబాద్‌కు వచ్చి సులువుగా డబ్బు సంపాదించేందుకు లొకాంటో వెబ్సైట్లో యువతుల అర్ధనగ్న చిత్రాలు పెట్టి ఆన్లైన్ ద్వారా వ్యభిచారం ప్రారంభించాడు. పేదలు, కార్మికుల, ఒంటరి మహిళలకు డబ్బు ఆశచూపి వారి ద్వారా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. మార్చి నెలలో అల్కాపురిలోని ఓ అపార్టుమెంటులో పోలీసులు దాడి చేసి నిర్వహకులతో పాటు పలు యువతులను రక్షించారు. అనంతరం నిందితులు ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఇద్దరి పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: జూబ్లీహిల్స్: ఓయో రూమ్‌లో వ్యభిచారం.. -
ఆన్లైన్ సెక్స్ రాకెట్.. నిర్వాహకుడిపై పీడీయాక్ట్
సాక్షి, హైదరాబాద్ : ఆన్లైన్లో వ్యభిచారం నిర్వహిస్తున్న కీసరకు చెందిన వంశీరెడ్డిపై రాచకొండ పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. ఉద్యోగం పేరుతో పశ్చిమ బెంగాల్ నుంచి అందమైన అమ్మాయిలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి వారితో బలవంతంగా వ్యభిచారం చేయించేవాడు. ఆన్లైన్లో అమ్మాయిల ఫోటోలను పోస్ట్ చేసి విటులను ఆకర్షించేవాడు. నచ్చిన అమ్మాయిను వారి వద్దకు పంపించి రూ.వేలల్లో డబ్బు తీసుకునేవాడు. ఈ వ్యవహారం మొత్తం ఆన్లైన్లోనే సాగిపోయేది.(ఏడాదిన్నర చిన్నారి కిడ్నాప్ కేసు విషాదాంతం!) దీనిపై సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు వీరి స్థావరంపై దాడి చేసి అమ్మాయిలను రక్షించారు. వంశీరెడ్డితో పాటు అంజలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యువతుల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరించిన వంశీరెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశించారు. దీంతో పోలీసులు అతడిపై అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు.(పీఎన్బీ స్కాం : నీరవ్ భార్యకు రెడ్ కార్నర్ నోటీసు) -
నూకల మనోహర్‌పై పీడీ యాక్ట్
కోవెలకుంట్ల/ కర్నూలు(టౌన్): కోవెలకుంట్ల కేంద్రంగా నిషేధిత గుట్కా వ్యాపారం చేస్తున్న నూకల మనోహర్‌పై పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ సుబ్బరాయుడు ఆదివారం కోవెలకుంట్ల సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన మనోహర్ కొన్నేళ్ల నుంచి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యక్తులతో కలిసి గుట్కా వ్యాపారం చేస్తున్నాడు. జిల్లాలోని ఆళ్లగడ్డ, శిరివెళ్ల, నంద్యాల, బనగానపల్లె, కొలిమిగుండ్ల తదితర ప్రాంతాలకు గుట్కా ప్యాకెట్లను సరఫరా చేసేవాడు. ఇందుకు సంబంధించి అతనిపై 14 కేసులు నమోదయ్యాయి. కోవెలకుంట్ల పోలీస్‌స్టేషన్‌లో ఎనిమిది, ఆళ్లగడ్డ పీఎస్‌లో మూడు, ఆళ్లగడ్డ రూరల్, శిరివెళ్ల, నంద్యాల తాలూకా స్టేషన్లలో ఒక్కొక్క కేసు ఉన్నాయి. ఈ కేసుల్లో పలుమార్లు అరెస్టయ్యి.. జైలుకు కూడా వెళ్లొచ్చినా నేర ప్రవృత్తిని మాత్రం మార్చుకోలేదు. గత నెల 22వ తేదీన రూ.60 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి తెస్తూ స్పెషల్ పార్టీ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని గుట్కా వ్యాపారాన్ని సీరియస్‌గా పరిగణించిన పోలీసులు పీడీయాక్ట్ నమోదు కోసం జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్పకు ప్రతిపాదనలు పంపగా..వారు అనుమతి ఇచ్చారు. దీంతో మనోహర్‌పై పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం కడప సెంట్రల్ జైలుకు తరలించారు. -
గుట్కా డాన్‌పై పీడీ యాక్ట్..
సాక్షి, కర్నూలు జిల్లా: గుట్కా డాన్ నూకల మనోహర్‌పై కోవెలకుంట్ల పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. అతనిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో మనోహర్‌పై 14 కేసులు నమోదయ్యాయి. బళ్లారి, రాయచూరు, హైదరాబాద్‌ల నుండి గుట్కా కొనుగోలు చేసి కర్నూల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో గుట్కా సరఫరా కొనసాగిస్తున్నారు. పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించిన నేర ప్రవృత్తి మార్చుకోకుండా గుట్కా సరఫరా చేస్తున్న గుట్కా డాన్‌పై సెస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. మనోహర్‌పై పీడీయాక్ట్ నమోదుకు కలెక్టర్‌కు జిల్లా ఎస్పీ ప్రతిపాదనలు పంపించగా.. కలెక్టర్ వీరపాండ్యన్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇసుక, మద్యం అక్రమార్కులపై రౌడీషీట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమాల కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టినట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ వెల్లడించారు. ప్రభుత్వ లక్ష్యాలను సాధించే దిశగా డీజీపీ సవాంగ్ ఆదేశాల మేరకు ఎస్ఈబీ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ► ఇసుక, మద్యం అక్రమ రవాణాలో పట్టుబడే వారిపై కఠిన చర్యలు చేపడతాం. ప్రత్యేక నిఘా వ్యవస్థతో మెరుపుదాడులు నిర్వహిస్తాం. ► అక్రమాలకు పాల్పడే పాత నేరస్థులపై పీడీ యాక్టు ప్రయోగిస్తాం. ఎస్ఈబీ హెచ్చరికలను పెడచెవిన పెట్టి నిబంధనలు ఉల్లంఘించే అక్రమార్కులపై రౌడీషీట్స్ తెరిచే యోచనలో ఉన్నాం. ► పట్టుబడిన అక్రమార్కుల ఆస్తుల జప్తునకు చర్యలు తీసుకుంటాం. వారిని వెంటనే రిమాండ్‌కు పంపించేలా న్యాయ వ్యవస్థనూ సంప్రదిస్తున్నాం. మద్యం, ఇసుక అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్రంలోని అన్ని సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు ముమ్మరం చేస్తాం. ► రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉండే ఇసుక, సిలికాన్, గ్రావెల్ నిల్వలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ► ఇసుక అక్రమంగా తరలింపు, మద్యం అక్రమ రవాణా, మద్యం అక్రమ తయారీపై నిఘా పెంచాం. రాత్రివేళల్లోను గస్తీని ముమ్మరం చేశాం. మొబైల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. ► ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ప్రత్యేకంగా ఉపయోగించుకుంటున్నాం. ► అక్రమ రవాణా జరిగే ప్రాంతాలు, మార్గాలను ఇప్పటికే గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను వినియోగిస్తాం. ► ప్రత్యేకంగా ఇన్ఫార్మర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఎస్ఈబీ అధికారులు ఎంత పటిష్టంగా పనిచేస్తున్నప్పటికీ ప్రజల సహకారం కూడా కీలకమే. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరిస్తే ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో ఎస్ఈబీ సాధిస్తుంది. ► గడిచిన 15 రోజుల్లో ఇసుక అక్రమాలకు పాల్పడిన 955 మందిపై 485 కేసులు నమోదు చేసాం. 730 వాహనాలు సీజ్ చేశాం. 29,629.075 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నాం. -
అక్రమార్కులపై పీడీ పంజా!
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే–అవుట్లపై ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. పీడీ అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా అక్రమార్కులకు ముకుతాడు వేయనుంది. అనుమతుల్లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెంచర్లను నియంత్రించడానికి కఠిన చర్యలు తప్పవని భావించిన సర్కారు.. పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా పదేపదే అనధికార లే–అవుట్లు చేస్తున్న డెవలపర్లు/భూ యజమానులపై ఈ చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా ఆలోచన చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ... ఒకట్రెండు రోజుల్లో ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయనుంది. లే–అవుట్లకు అనుమతిలో గ్రామ పంచాయతీలకు ఎలాంటి పాత్ర ఉండదు. పట్టణాభివృద్ధి సంస్థలు, డీటీసీపీ (డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్)కి మాత్రమే లే–అవుట్లను మంజూరు చేసే అధికారం ఉంటుంది. అయితే, ఈ నిబంధనలను పట్టించుకోని రియల్టర్లు.. పంచాయతీల పాలకవర్గాలతో కుమ్మక్కైఅడ్డగోలుగా వెంచర్లను అభివృద్ధి చేస్తున్నారు. డీటీసీపీ, పట్టణాభివృద్ధి సంస్థలు అనుమతులు జారీ చేసే లే–అవుట్లతో పోలిస్తే.. ఇందులో స్థలాల ధరలు చౌకగా ఉండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ప్లాట్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా ఇబ్బడిముబ్బడిగా అనధికార లే–అవుట్లు వెలుస్తున్నాయి. దాదాపు 3 వేల పైచిలుకే..! రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా అక్రమ లే–అవుట్లు ఉన్నట్లు పంచాయతీరాజ్‌శాఖ లెక్క తేల్చింది. నిబంధనలు ఉల్లంఘించి అనధికార లే–అవుట్లు చేసిన రియల్టర్లపై పీడీ చట్టం మేరకు కేసులు నమోదు చేసే అధికారాన్ని పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వనుంది. ఈ అంశంపై పోలీసుశాఖతో కూడా చర్చించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి ‘సాక్షి’కి తెలిపారు. -
పొట్టి రవిపై పీడీ యాక్టు
జేసీ కోటలో ఆయనో అరాచకశక్తి. పెద్దాయన (మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి) అండ.. చిన్నాయన (మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి) సపోర్టు చూసుకొని పాతికేళ్లుగా తాడిపత్రిలో ఆయన చెప్పిందే వేదం. ఏకంగా తాడిపత్రికి ‘చిన్నబాస్’గా ఎదిగాడు. రూ.కోట్లకు పడగెత్తాడు. ఆయన ఎవరో కాదు.. టీడీపీ నాయకుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి. నియోజకవర్గంలో పొట్టిరవిగా చలామణి అవుతూ సెటిల్మెంట్స్ కింగ్‌గా పేరుగడించాడు. పాతికేళ్లుగా అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ అతడ్ని ‘టచ్’ చేయడానికే పోలీసులు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి. సమాజ భద్రతకు, ప్రశాంతతకు భంగం కలిగిస్తున్న పొట్టిరవిపై తాజాగా పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించడం జిల్లాలో సంచలనం కలిగిస్తోంది. సాక్షి, అనంతపురం : తాడిపత్రి మండలం దిగువపల్లికి చెందిన ఉపాధ్యాయుడు సంగటి వీరారెడ్డి కుమారుడు సంగటి రవీంద్రారెడ్డి. 2003లో జేసీ సోదరుల పంచన చేరాడు. అప్పటి నుంచి జేసీ సోదరుల నమ్మకాన్ని చూరగొన్న రవీంద్రారెడ్డి క్రమక్రమంగా వారికి నమ్మినబంటుగా మారాడు. అప్పటి నుంచి జేసీ సోదరులను అడ్డుపెట్టుకుని చేయని దందా అంటూ లేదు. తాడిపత్రిలో మీడియాను తన గుప్పిటో పెట్టుకుని హవా నడిపించాడు. స్వయంగా ఓ మీడియాను స్థాపించడమే కాకుండా మిగతా పత్రికల్లో తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే దాడులు చేయించడంతో పాటు తన సొంత మీడియాలో అసభ్యకరంగా రాతలు రాయించడం లాంటి బ్లాక్మెయిల్ కార్యకలాపాలకు పాల్పడేవాడు. దీంతో పాతికేళ్లుగా తాడిపత్రిలో చీకటిరాజ్యం బాహ్య ప్రపంచానికి తెలియకుండా పోయింది. పెద్ద, చిన్న బాస్‌లతో పాటు పొట్టిరవి పేరు చొప్పుకొని అనేక మంది తాడిపత్రిలో పేకాట, మట్కా డాన్లుగా ఎదిగారు. గతేడాది పక్కా సమాచారంతో తాడిపత్రిలో ఓ ఇంటిపై కడప సీఐ హమీద్‌ఖాన్ దాడిచేసి నిందితులను పట్టుకునేందుకు యత్నించాడు. పోలీసులనే తిప్పికొట్టే పనిలో భాగంగా సీఐ హమీద్‌ఖాన్‌తో పాటు మరో కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో పాటు పోలీసులు వచ్చిన వాహనాన్ని తగలబెట్టించారు. తాడిపత్రిలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల విషయం స్థానిక పోలీసులకు తెలిసినప్పటికీ వారి జోలికెళ్లే సాహసం చేయలేకపోయారు. ప్రబోధానంద కేసులో ఏకంగా పోలీసుస్టేషన్పైకే దాడికి యత్నించిన ఘటనలో పొట్టి రవి కీలకంగా వ్యవహరించాడు. సహకార ఉద్యోగి హత్య కుట్ర భగ్నం తాడిపత్రిలో ఇటీవల సహకార సొసైటీ ఉద్యోగి హత్యకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆశ్చర్యకర విషయం తెలిసింది. హత్యకు యత్నించే ముందు దుండగులు ఎస్వీ రవీంద్రారెడ్డితో ఫోన్లో సంభాషించారు. తర్వాత తప్పించుకున్న విషయం కూడా తెలియపరిచినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఈ కేసులో పొట్టి రవి కూడా నిందితుడని తేలింది. దీంతో ఇటీవల ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇలాంటి ఉదంతాలు అనేకం ఉన్నట్లు పోలీసువర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎస్వీ రవీంద్రారెడ్డిపై పీడీ యాక్టు తాడిపత్రిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న రవీంద్రారెడ్డి అలియాస్ పొట్టి రవిపై పీడీ యాక్టు ప్రయోగించినట్లు పోలీసులు ప్రకటించారు. హత్యాయత్నం, దొమ్మి, మారణాయుధాలు కలిగి ఉండటం తదితర 11 కేసుల్లో ఎస్వీ రవీంద్రారెడ్డి నిందితుడుగా ఉన్నాడు. ఇతని నుంచి సమాజ ప్రశాంతతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పీడీ యాక్టుపై కడప సెంట్రల్ జైలుకు తరలించారు. రవీంద్రారెడ్డిపై నమోదైన కేసుల్లో కొన్ని.. 2003లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్న ఘటన(క్రైం నెంబర్155/03,332,160 ఐసిఎస్). 2004లో ( క్రైం నెంబర్ 43/04,147, 148,324,332,435,27 ) ఆయుధ చట్టం కింద కేసు. 2015లో అల్ట్రాటెక్ సిమెంటు పరిశ్రమలో సామగ్రిని ధ్వంసం చేసిన కేసులో హెడ్‌కానిస్టేబుల్ వన్నూర్రెడ్డి ఫిర్యాదు మేరకు(క్రైం నెంబర్ 246/15) రూరల్ పీఎస్‌లో కేసు. 2017లో తాడిపత్రి మండలం పెద్దపొలమడ గ్రామ సమీపంలో శ్రీ ప్రభోదాశ్రమానికి చెందిన ఓ ట్యాంకర్‌ను దగ్ధం చేసిన కేసులో ఎస్వీ రవీంద్రారెడ్డి నిందితుడు. శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో (క్రైంనెంబర్292/17) కేసు నమోదు. 2018లో వినాయక చవితి నిమజ్జనోత్సవం సందర్భొంగా చెలరేగిన ఘర్షణల్లో వద్దిపాటి దేవేంద్ర ఫిర్యాదు మేరకు (క్రైం నెంబర్ 210/18) కేసు. ఈ ఘటనలో ఎస్వీ రవీంద్రారెడ్డిపై నాలుగు కేసులు నమోదు చేశారు.(క్రైం నెంబర్ 210, 211, 212, 227) 2019లో వీరాపురం గ్రామానికి చెందిన అనీల్కుమార్రెడ్డిపై హత్యాయత్నం కేసు(క్రైం నెంబర్ 182/19). -
ఆటోలో తిరుగుతూ దొంగతనాలు చేస్తారు
సాక్షి, గోదావరిఖని : జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. రామగుండం అడిషనల్ డీసీపీ అశోక్‌కుమార్ కమిషనరేట్‌లో శనివారం వివరాలు వెల్లడించారు. రామగుండం మండలం రాయదండికి చెందిన గుమ్మాల వసంతకుమార్, ఓ మైనర్, పాత రామగుండం హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన పల్లికొండ సురేష్ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఏడాది క్రితం మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మోటార్ల దొంగతనానికి పాల్పడి జైలుకు వెళ్లి వచ్చారు. మహిళను కత్తితో బెదిరించి.. అంతకు పదినెలల ముందుగానే 2017నవంబర్‌లో పెద్దపల్లి జిల్లా అంతర్గాం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దంపేట గ్రామశివారులో పత్తి చేనులో పత్తి తీస్తున్న విమలను బెదిరించి రూ.1.05 లక్షల విలువైన మూడు తులాల బంగారు పుస్తెలుతాడు చోరీచేశారు. అప్పటినుంచి అనుమానం రాకుండా సెంట్రింగ్ కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని పగటిపూట ఆటోలో తిరుగుతూ.. పంటపొలాల్లో ఒంటరిగా ఉన్నమహిళలను టార్గెట్ చేసుకొని వారిని బెదిరించి దొంగతనాలు చేశారు. ఎఫ్‌సీఐ టౌన్‌షిప్‌లోని ఆలయం, టెలిఫోన్ కార్యాలయాల్లో సైతం చోరీలకు పాల్పడ్డారు. దొంగతనం చేసిన సొత్తును అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సా చేసేవారు. శనివారం సీఐ బుద్దస్వామి, అంతర్గాం ఎస్సై రామకృష్ణ, సీసీఎస్ సీఐ వెంకటేశ్వర్లు బి–పవర్‌హౌస్ వద్ద ఆకస్మికంగా వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఈ ముగ్గురు పట్టుపడ్డారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలు అంగీకరించారు.మూడు తులాల బంగారు పుస్తెలుతాడు రికవరీ చేశారు. నిందితులపై పీడీయాక్టు.. నిందితులపై పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు అడిషనల్ డీసీపీ వెల్లడించారు. మైనర్‌ను జూవైనల్ హోంకు తరలిస్తామన్నారు. నిందితులను పట్టుకోవడంలో శ్రమించిన సీసీఎస్ సీఐలు ఎ.వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రావు, ఎస్సైలు మంగిలాల్, నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి, కానిస్టేబుళ్లు దేవేందర్, సుధాకర్, శ్రీనివాస్, అలెక్స్, రవి, రమేష్‌లను అడ్మిన్ డీసీపీ అభినందించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ రవికుమార్, సీఐలు బుద్దె స్వామి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రావు, ఎస్సై రామక్రిష్ణ పాల్గొన్నారు. -
రౌడీ షీటర్లపై నిఘా
సాక్షి, అనకాపల్లి (విశాఖపట్నం) : త్వరలో జరగనున్న పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామాలు, పట్టణాల్లో ఉండే రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ చెప్పారు. అనకాపల్లిలోని కొత్తూరు మహార్షి ఫంక్షన్ హాల్లో పోలీస్‌సబ్ డివిజన్ పరిధిలో అధికారులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది నేరాల సంఖ్యను తగ్గించామన్నారు. పాఠశాలలు, కళాశాలల వద్ద ఈవ్ టీజింగ్‌కు పాల్పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. అలాగే ప్రస్తుతం ఎక్కువగా గొడవలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై రౌడీ షీట్ నమోదు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది వేసవిలో చోరీలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో క్రైం రేటు తగ్గించగలిగామన్నారు. ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారించేందుకు ఆర్అండ్బీ, రవాణాశాఖ, వివిధశాఖల అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మావోస్టుల ప్రభావం ఏజెన్సీ ప్రాంతంలో తగ్గుముఖం పట్టిందని, గతంలో గిరిజనులు వారికి ఆశ్రయం ఇచ్చేవారని, ఇప్పడు ఆ పరిస్థితి లేకుండాపోయిందన్నారు. గిరిజనులు అభివృద్ధి చెందాలని రోడ్లు, సెల్‌టవర్లు ఏర్పాట్లు చేసేందుకు సహకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. బెల్ట్‌షాపులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, అటువంటి వారు తరుచూ ఏర్పాటు చేసినట్లయితే పీడీ యాక్టులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. గంజాయి రవాణా చేస్తున్న పాత నేరస్తులపై ఎప్పటికప్పుడు దృష్టిపెడుతూ, ఎక్సైజ్ శాఖతో చర్చిస్తున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. సమావేశంలో డీఎస్పీ ఎస్.వి.వి.ప్రసాదరావు, సీఐలు కిరణ్‌కుమార్, తాతారావు, రామచంద్రరావు, శ్రీనివాసరావు, ఎస్సైలు పాల్గొన్నారు. -
తప్పును కప్పిపుచ్చుకునేందుకు పీడీ యాక్టా?
సాక్షి, హైదరాబాద్: ఓ కేసులో నిందితుడిని తీవ్రంగా గాయపరిచిన పోలీసులు, దానిని కప్పిపుచ్చుకునేందుకు అతనిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. అతన్ని వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించే వెసులుబాటును బాధితునికి ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. తన సోదరుడు శీలం వినయ్‌కుమార్‌ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ శీలం రవికుమార్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది బి.మోహనారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఓ కేసుకు సంబంధించి వినయ్కుమార్ని పోలీసులు గత ఏడాది అక్టోబర్ 8న అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. మాదాపూర్ ఎస్ఐ రామకృష్ణ, సీఐ నాగేశ్వరరావులు కలిసి వినయ్‌ను కొట్టారని, దీంతో ప్రస్తుతం అతను కూర్చునే, నిలబడే పరిస్థితిలో కూడా లేడని ఆమె వివరించారు. అతను తీవ్ర హింసకు గురైనట్లు నిమ్స్ వైద్యులు సైతం ధ్రువీకరించారని తెలిపారు. దీంతో పోలీసులు వినయ్‌పై పలు కేసులున్నాయని పేర్కొంటూ పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారని తెలిపారు. దీనిని సమర్థిస్తూ హోంశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం, పోలీసుల తీరును తప్పుపట్టింది. ఒక్క కేసు ఉన్న వ్యక్తిపై పలు కేసులున్నట్లు పేర్కొంటూ పీడీ చట్టం కింద ఉత్తర్వులు జారీ చేయడం సమంజసం కాదని తేల్చింది. -
టార్గెట్ సెల్‌ఫోన్స్!
సాక్షి, సిటీబ్యూరో: అతనో రౌడీషీటర్ నగర పోలీసులు రెండుసార్లు అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు... అయినా పంథా మార్చుకోని అతను మరో ముగ్గురితో కలిసి దృష్టి మళ్లించి సెల్ఫోన్లు తస్కరించడం మొదలెట్టాడు. ఇటీవల కాలంలో మొత్తం ఐదు చోరీలు చేసిన ఈ ముఠాలో ముగ్గురిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం పటుకున్నారు. వీరి నుంచి 11 సెల్ఫోన్లు, ఆటో స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. యాకత్‌పురకు చెందిన మహ్మద్ పర్వేజ్ అలియాస్ ఫర్రు వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. దురలవాట్లకు బానిసైన అతను నేరాలు చేయడం మొదలెట్టాడు. హత్య, హత్యాయత్నం, ఆయుధ చట్టం కింద నమోదైన వాటితో సహా మొత్తం 24 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉండటంతో రెయిన్‌బజార్ పోలీసులు రౌడీషీట్ తెరిచారు. ఇతడి నేరచరిత్రను పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు విభాగం 2015, 2017ల్లో పీడీ యాక్ట్ ప్రయోగించింది. ఈ రెందు సందర్భాల్లోనూ ఏడాది చొప్పున జైల్లో ఉండి బయటకు వచ్చిన ఇతను సైనిక్‌పురికి మకాం మార్చాడు. మురాద్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్, చిలకలగూడ వాసి మహ్మద్ నదీమ్‌లతో పాటు గౌస్‌తో ముఠా కట్టాడు. వీరిలో నేరచరితుడైన ఇమ్రాన్‌పై మూడు కేసులు ఉన్నాయి. పర్వేజ్ పరిచయస్తులైన ఆటో యజమానుల నుంచి వాహనాన్ని అద్దెకు తీసుకునేవాడు. తాను ఆటోడ్రైవర్‌గా నటిస్తూ తన ముగ్గురు అనుచరులను ప్యాసింజర్ల మాదిరిగా వెనుక కూర్చోబెట్టుకుంటాడు. సికింద్రాబాద్ బస్టాండ్, రైల్వేస్టేషన్లతో పాటు మెహదీపట్నం బస్టాండ్లలో మాటు వేసూ ఈ ముఠా ఒంటరి ప్రయాణికుల్ని ఎంపిక చేసుకుని వారు వెళ్లాల్సిన గమ్యాలను చేరుస్తామని ఎర వేసి ఎక్కించుకుంటుంది. ఆటో కాస్త ముందుకు వెళ్లిన తర్వాత ప్రయాణికుడి దృష్టి మళ్లించే నిందితులు అతడి సెల్‌ఫోన్ కాజేస్తారు. ఆపై తమకు వేరే పని ఉందంటూ మార్గమధ్యంలో ఆ ప్రయాణికుడిని దింపేసి.. అతడు సెల్‌ఫోన్ పోయిన విషయం గుర్తించేలోపే వేగంగా ఉడాయిస్తారు. ఈ గ్యాంగ్ ఇటీవల కాలంలో ఇదే తరహాలో మహంకాళి, గోపాలపురం. ఆసిఫ్‌నగర్, బంజారాహిల్స్, రాయదుర్గం ఠాణాల పరిధిలో 11 సెల్ఫోన్లు చోరీ చేశారు. వీటిని అమ్మగా వచ్చిన మొత్తాన్ని అంతా పంచుకుని జల్సాలు చేస్తుంటారు. ఈ తరహా ఫిర్యాదులు వరుసగా అందడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ ఆధారంగా అనుమానితులను గుర్తించారు. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు బి.పరమేశ్వర్, కేఎస్ రవి, కె.శ్రీకాంత్ తమ బృందాలతో వలపన్నారు. సికింద్రాబాద్‌లోని 31 బస్టాప్ వద్ద గౌస్ సహా మిగిలిన ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును మహంకాళి పోలీసులకు అప్పగించారు. -
‘పీడీ’కిలి బిగిసింది
రాష్ట్రంలో క్రైమ్‌రేటు తగ్గుదలలో పీడీ యాక్ట్ బాగా ఉపకరించింది. సాధారణ దొంగలు, రౌడీషీటర్లు, పదే పదే లైంగిక వేధింపులకు గురిచేస్తున్నవారు తదితర నిందితులపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. దీనివల్ల వ్యవస్థీకృత నేరాల్లో తగ్గుదల కనిపించినట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. పీడీ యాక్ట్ కింద కేసులు మోపబడిన వారు చేసే నేరాల్లో గతేడాదికి ఇప్పటికీ 37% క్రైమ్ రేటు తగ్గుదల కనిపించిందని వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2018 డిసెంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,199 మంది నేరస్థులపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. – సాక్షి, హైదరాబాద్ ఒత్తిడి ఉన్నా తగ్గేది లేదు... ఈ మొత్తం నేరాల్లో కొంతమంది రాజకీయ నాయకుల అనుచరులు కూడా ఉండటంతో వారిపై పీడీ యాక్ట్ అమలు చేయకుండా పోలీస్‌శాఖపై మొదట్లో ఒత్తిడి వచ్చినట్టు తెలిసింది. అయితే, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో పోలీస్ ఉన్నతాధికారులు కేసుల నమోదుకు వెనుకాడలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేరాల నియంత్రణలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదన్న వైఖరితో పీడీ యాక్ట్ అమలు చేశారు. పీడీ యాక్ట్ మోపబడినవారిలో ముగ్గురు లైంగిక వేధింపులకు గురిచేసిన వారుండటం సంచలనం రేపుతోంది. షీ టీమ్స్ ద్వారా ఈవ్‌టీజింగ్, లైంగిక వేధింపుల నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌శాఖ చర్యలు చేపడుతోంది. మొదటిసారి పట్టుబడ్డ వారికి కౌన్సెలింగ్ ఇస్తుండగా, రెండోసారి పట్టుబడ్డ వారికి కౌన్సెలింగ్, వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. మూడోసారి పట్టుబడితే ఏకంగా కేసు నమోదు చేసి రిమాండ్ చేస్తున్నారు. ఇన్ని చేసినా నాలుగోసారి పట్టుబడుతున్న వారిని పీడీ యాక్ట్‌కు సిఫారసు చేసినట్టు స్పష్టమవుతోంది. పదే పదే అదే నేరానికి పాల్పడితే ఉపేక్షించకుండా పీడీ యాక్ట్ అమలు చేస్తున్నామని ఐజీ స్వాతి లక్రా స్పష్టం చేశారు. నేరాలను బట్టి చూస్తే... రౌడీషీటర్లు–129, బూట్ లెగ్గర్– 18, అనైతిక కార్యకలాపాల నేరాలు–67, డ్రగ్ సరఫరా నేరస్థులు–42, మోసపూరిత వ్యక్తులు–62, పీడీఎస్ బియ్యం దొంగలు–17, మత ఘర్షణ, సంబంధిత నేరస్థులు– 2, డెకాయిటీస్–13, రాబరీ నేరస్థులు–55, దోపిడీ దొంగలు–202, చైన్‌స్నాచర్లు–122, దృష్టి మరల్చే దొంగలు–98, గూండాలు–34, లైంగిక వేధింపుల నిందితులు–3, ఆర్థిక నేరస్థులు–15, వాహనాల దొంగలు–2, ఇతర సాధారణ నేరస్థులు–57.. మొత్తం 1,199 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. అటవీ శాఖ కూడా.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేటకు పాల్పడే వారిపై అటవీశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అక్రమ కలప రవాణాతో ముడి పడిన వివిధ అంశాలపై జిల్లాల్లో పోలీసు అధికారు లతో కలిసి అటవీశాఖ సంయుక్తంగా అమలుచేస్తున్న కార్యా చరణ కారణంగా ఇప్పటికే 200 కేసులకు పైగా నమోదు చేశారు. వివిధ జిల్లాల్లో దాదాపు రూ. 40–50 లక్షల విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 500మంది బడా స్మగ్లర్లను అటవీ అధి కారులు గుర్తించారు. కలప అక్రమ రవాణాపై సాగిస్తున్న ప్రత్యేక కార్యాచరణను ఈ నెలాఖరు వరకు కొనసాగించ నున్నట్లు ప్రభుత్వవర్గాల సమాచారం. ఆ తర్వాత కూడా నిరంతర నిఘా కొనసాగుతుందని అటవీ అధికారులు చెబుతున్నారు. కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేటపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా వారిపై పీడీయాక్ట్ సహా కఠినమైన చట్టాల ప్రయోగానికి ఆ శాఖ సిద్ధమవుతోంది. కఠిన శిక్షలు అమలు..: తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా ఆదిలాబాద్, నాగర్‌కర్నూలు తదితర జిల్లాల్లో దాదాపు 20 మంది స్మగ్లర్లపై పీడీయాక్ట్ ప్రయోగానికి అనువుగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రెండు, మూడురోజుల వ్యవధిలోనే పలువురిపై పీడీయాక్ట్ కింద కేసు నమోదుచేసి, ఏడాదిపాటు బెయిల్ దొరకని విధంగా శిక్ష విధించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారిపైనే కాకుండా వారి వెనక ఉండి ప్రోత్సహించే వారిని కూడా పీడీ యాక్ట్ పరిధిలోకి తీసుకొస్తున్నారు. కలప స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు పీసీసీఎఫ్ (విజిలెన్స్) రఘువీర్ సాక్షికి తెలిపారు. ఈ చర్యల్లో భాగంగా నిరంతర నిఘాతోపాటు ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
క్రైమ్స్ డౌన్
సాక్షి, సిటీబ్యూరో: సిటీ కమిషనరేట్ పరిధిలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. వీటిని కొలిక్కి తేవడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయి. పీడీ యాక్ట్ ప్రయోగం వంటి చర్యలతో నేరగాళ్ల దూకుడుకు కళ్లెం పడింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే అన్ని రకాల నేరాలూ సరాసరి ఆరు శాతం తగ్గాయి. తీవ్రమైన నేరాల్లో పోలీసులు 92 శాతం రికవరీ సాధించారు. వరకట్న మరణాలు నగరంలో 38 శాతం నమోదు కాగా, మహిళలపై జరిగే దాడులు కూడా తగ్గాయి. హత్య కేసులు మాత్రం గత ఏడాదికంటే 8 శాతం పెరిగాయి. బుధవారం చౌమొహల్లా ప్యాలెస్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కొత్వాల్ అంజనీ కుమార్ 2018 నేర గణాంకాలను విడుదల చేశారు. ప్రతి అంకంలోనూ టెక్నాలజీ వినియోగం... నేరాలు కొలిక్కి తీసుకురావడంలో సీసీ కెమెరాల కీలకపాత్ర... నేరాలు నిరోధించడంలో పీడీ యాక్ట్ ప్రయోగం వంటి చర్యలు... వెరసి నగరంలో నేరాలు నమోదు గణనీయంగా తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే అన్ని రకాలైన నేరాల్లోనూ కలిపి సరాసరిన ఆరు శాతం తగ్గుదల నమోదు చేసుకుంది. సొత్తు సంబంధం నేరాలు 20.5 శాతం తగ్గాయి. తీవ్రమైన నేరాల్లో రికవరీ 92 శాతానికి చేరుకుంది. వరకట్న చావుల్లో 38 శాతం తగ్గుదల కనిపించడంతో పాటు మహిళలపై నేరాలు సైతం తగ్గాయి. కేవలం హత్య కేసులు మాత్రం గత ఏడాదితో పోలిస్తే 8 శాతం పెరిగాయి. పాతబస్తీలోని చౌమొహల్లా ప్యాలెస్‌లో బుధవారం నిర్వహించిన వార్షిక విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించిన కొత్వాల్ అంజనీ కుమార్ ఆ గణాంకాలను విడుదల చేశారు. కోర్టుల్లో కేసుల నిరూపణ సైతం 10 శాతం పెరిగి 34కి చేరిందని తెలిపారు. ట్రాఫిక్ విభాగం అధికారులు తీసుకున్న చర్యల కారణంగా నగరంలో మరణాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు సరాసరి వేగం గంటలకు 18 నుంచి 25 కిమీకి చేరిందని వివరించారు. ఈ ఏడాది కొత్తగా సిటీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, వెరీ ఫాస్ట్ యాప్, ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్, ఉమెన్ ఆన్ వీల్స్ (వావ్) బృందాలను రంగంలోకి దింపారు. ‘ఈ ఏడాది సాధించిన విజయాలపై నేను మాట్లాడుతున్నా... అవి సాధించడంలో కొత్వాల్ నుంచి కానిస్టేబుల్ వరకు అహర్నిశలు శ్రమించారు’ అని అంజనీకుమార్ పేర్కొన్నారు. ‘ఫోర్స్’ చూపిన ‘టాస్క్’... నగర పోలీసు కమిషనర్ టాస్క్‌ఫోర్స్‌లో ప్రస్తుతం డీసీపీ, అదనపు డీసీపీలతో పాటు ఐదు జోన్లకు ఐదుగురు ఇన్స్పెక్టర్లు ఉన్నారు. కేసుల్ని కొలిక్కి తీసుకురావడంతో పాటు ఇతర రాష్ట్రాల ముఠాలను చెక్ చెప్పడంతో వీటిది ప్రత్యేక పాత్ర. సిటీలో నమోదైన భారీ, సంచలనాత్మక నేరాల్లో దాదాపు 80 శాతం ఈ టీమ్స్ ద్వారానే కొలిక్కి వచ్చాయి. ఈ ఏడాది టాస్క్‌ఫోర్స్ టీమ్స్ 20 హత్య, 54 దోపిడీ, 4 బందిపోటు దొంగతనం, 100 చోరీలు, 33 స్నాచింగ్స్, 29 దాడులు, 63 డ్రగ్ కేసుల్లో నిందితుల్ని పట్టుకున్నాయి. 54 క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై దాడులు చేసి 101 మందిని అరెస్టు చేశాయి. ఇతర నేరాల్లో 85 మందిని పట్టుకున్నాయి. 107 చీటింగ్ కేసుల్లో 121 మందిని అరెస్టు చేశాయి. వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న 103 నాన్–బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేశాయి. -
‘పీడీ’తో పరార్!
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనర్ పీడీ యాక్ట్ ప్రయోగించడంతో పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో ఐదు నెలలుగా పరారీలో ఉన్న ఘరానా దొంగను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గతంలో ఓసారి ఈ యాక్ట్ కింద ఏడాది జైల్లో ఉన్నా ఇతడిలో మార్పు రాలేదని అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌కు చెందిన మహ్మద్ మన్సూర్‌కు కాలా కవ్వా, దేవ వంటి మారుపేర్లూ ఉన్నాయి. వృత్తిరీత్యా ఆటోడ్రైవర్ అయిన అతను కొన్నేళ్లుగా చోరీలు చేయడమే ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. ఇతడిపై 2015 నాటికే 32 కేసులు నమోదయ్యాయి. వీటిలో సెల్‌ఫోన్ స్నాచింగ్, అక్రమాయుధాలతో సంచరించడం, సెల్‌ఫోన్స్ చోరీ వంటివి ఉన్నాయి. దీంతో నగర పోలీసులు 2015లో పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపారు. ఏడాది పాటు కటకటాల్లో ఉండి బయటకువచ్చినా ఇతడి వైఖరిలో మార్పు రాలేదు. మళ్లీ పాత పంథానే అనుసరించడంతో గత ఏడాది మరోసారి అరెస్టయ్యాడు. తాజాగా అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్, చార్మినార్, మలక్‌పేట ఠాణాల్లో మరో 10 నేరాలు చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు మరోసారి ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ ఉత్తర్వులు అతడికి చేరేలోగా బెయిల్‌పై బయటికి వచ్చిన మన్సూర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇతడి కోసం రంగంలోకి దిగిన ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సైలు పి.రమేష్, జి.శ్రీనివాస్‌రెడ్డి, గోవిందు స్వామి, సి.వెంకటేష్ ముమ్మరంగా గాలించి శుక్రవారం పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. -
‘ప్రణయ్’ నిందితులపై పీడీ యాక్ట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసు నిందితులపై పీడీ యాక్ట్ మోపాలని పోలీస్‌శాఖ నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం ఈ కేసు దర్యాప్తు తీరుతెన్నులపై నల్లగొండ ఎస్పీ రంగనాథ్‌తో వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ కేసులో ఉన్న నిందితుల నేరచరిత్ర వెలుగులోకి తీసుకురావడంతో పాటు పాత నేరాల ఆధారంగా వారిపై పీడీ యాక్ట్ మోపాలని నిర్ణయించినట్టు తెలిసింది. మరోవైపు ప్రణయ్ భార్య అమృతకు సోషల్ మీడియాలో వస్తున్న బెదిరింపులపై స్టీఫెన్ రవీంద్ర ఆరా తీశారు. అమృతను బెదిరిస్తున్న వారి సోషల్‌మీడియా ఖాతా వివరాలు తెలుసుకోవటంతో పాటు హంతకులతో వారికేమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో దర్యా ప్తు చేపట్టాలని ఐజీ ఆదేశించినట్లు తెలిసింది. బెదిరింపుల వ్యవహారంపై ఇప్పటికే అమృత పోలీసులకు ఫిర్యాదు చేసిందని, దీంతో ఆమెకు భద్రతగా ఇద్దరు సాయుధ సిబ్బందితో పాటు ఇద్దరు మహిళా పోలీసుల్ని కూడా నియమించినట్లు నల్లగొండ పోలీసులు తెలిపారు. ఆమెకు వస్తున్న బెదిరింపులు, భద్రత వ్యవహారలపై ఎప్పటికప్పుడు నిఘా విభాగం అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
మహిళల అక్రమ రవాణా.. దంపతులపై పీడీ యాక్ట్
నాగోలు: మహిళలను అక్రమ రవాణా చేస్తూ వ్యభిచార గృహాలకు తరలిస్తున్న ఇద్దరి నిందితులపై రాచకొండ పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెస్ట్ బెంగాల్, కోల్‌కతా ప్రాంతానికి చెందిన బెనిడ్ వర్మా ఆలియాస్ షేక్ మిజాన్ (35) ఇతడి భార్య షేక్ నియాల్ఫా అలియాస్ లీలా(35) ఇద్దరు కలిసి నగరానికి వచ్చి నేరెడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చంద్రగిరి కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. కొంత కాలం వివిధ కంపెనీల్లో పనిచేసినా సరిపడా డబ్బులు రాచపోవడంతో వ్యభిచార దందాను నిర్వహించాలనుకున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ నుంచి బాలికలను, మహిళలను నెల జీతం లెక్కన తీసుకువచ్చి నగరంలో వ్యభిచార దందాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వర్మను 2014లో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. గత నెల 17న నేరెడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేయగా ఇద్దరు బంగ్లాదేశ్ మహిళలు పట్టుబడ్డారు. దీంతో వీరిని నేరెడ్మెట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జైలులో ఉన్న వీరిపై కమిషనర్ పీడీయాక్ట్ నమోదు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
అసలు సూత్రధారులు ఎవరు?
-
మైనర్లకు ‘ఇంజెక్షన్’ ఇస్తున్నదెవరు?
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో వ్యభిచార వృత్తి నివారణకు రాచకొండ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. బలవంతంగా.., బతుకుదెరువు కోసం.. ఇలా పలు రకాల్లో జరుగుతున్న వ్యభిచార వృత్తికి అడ్డుకట్ట వేయడానికి చేస్తున్న ప్రయత్నాలు నీరుగారిపోతున్నాయి. ఈ వృత్తి కోసం బాలికల అక్రమ రవాణాను ఎంచుకున్నారన్న విషయం బయటపడటంతో పోలీసు యంత్రాంగం కంగుతింది. ప్రస్తుతం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడంపై పోలీసులు దృష్టిపెట్టారు. కాగా, యాదగిరిగుట్టలో తరచూ పోలీసులు కార్డన్ సెర్చ్, ఇతరత్రా తనిఖీలు చేస్తున్నా ఇలాంటి అమానుష సంఘటన వెలుగు చూడటం నిఘా సంస్థల వైఫల్యమేనని విమర్శలు వస్తున్నాయి. మూడేళ్ల క్రితం పట్టుబడిన వ్యక్తి ద్వారా బాలికల అక్రమ రవాణా విషయం వెలుగు చూసినప్పటికీ దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టకపోవడం వల్లే అది కొనసాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. యాదగిరిగుట్ట పట్టణంలో జరుగుతున్న దందాను అరికట్టడానికి ఇప్పటికే పలువురిపై పీడీయాక్ట్ నమోదు చేశారు. అయినా అది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉండటం వెనుక గల వైఫల్యాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ డాక్టర్ ఎవరు? పలు ప్రాంతాల నుంచి సుమారు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలను యాదగిరిగుట్ట పట్టణానికి తీసుకువస్తున్నారు. వీరిని త్వరగా వ్యభిచార వృత్తిలో దింపడానికోసం నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ముందుగా ఇతరులకు అనుమానం రాకుండా స్థానికంగా బాలికలను చదివించి, వారికి 12 సంవత్సరాలు రాగానే శరీర పెరుగుదలకు ఇంజెక్షన్లు ఇస్తున్న విషయాన్ని రాచకొండ సీపీ మహేష్‌భగవత్ వెల్లడించారు. కాగా, వ్యభిచార గృహాలతో సంబంధం పెట్టుకున్న ఓ ఆర్ఎంపీ వైద్యుడు రూ.20 వేల నుంచి రూ.50 వేలు తీసుకుని 12 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలకు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఇంజెక్షన్ ఇవ్వడంవల్ల చిన్న వయసులో ఉన్న పిల్లలు యుక్తవయసు ఉన్న అమ్మాయిల్లా కనిపించడంతో పాటు వారి శరీర ఎదుగుదలలో కూడా భారీ మార్పులు వస్తాయి. అసలు ఈ ఇంజెక్షన్ ఇస్తున్న వైద్యుడు యాదగిరిగుట్టకు చెందిన వ్యక్తా లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇస్తున్నాడా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ వైద్యుడిని పట్టుకుని విచారిస్తే ఇప్పటి వరకు ఎంత మందికి ఇంజెక్షన్లు ఇచ్చారనేది తేలుతుందని అంటున్నారు. అసలు సూత్రధారులు ఎవరు? చిన్నారులను అక్రమంగా తరలిస్తున్నది ఎవరు? అనే అంశం పోలీసులను వెంటాడుతోంది. ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా జరుగుతున్న వ్యభిచార నిర్మూలన ఒక్కరోజుతో అంతమయ్యేది కానప్పటికీ నివారణ కోసం చేస్తున్న ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించడంలేదు. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన శంకర్ అనే వ్యక్తికి చిన్నారుల అక్రమ రవాణాతో సంబంధం ఉన్నట్లు 2015లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కేసు నమోదైంది. శంకర్‌తో పాటు కంసాని యాదగిరి అనే వ్యక్తి పేరు కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. యాదగిరి, యాదగిరిగుట్ట మండలం రామాజీపేట శివారులో వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తుంటాడు. ఇప్పటివరకు ఇక్కడి ప్రజలకు ఈ విషయం మాత్రమే తెలుసు. కానీ శంకర్‌తో పాటు యాదగిరి సైతం చిన్నారుల అక్రమ రవాణాలో ప్రధాన వ్యక్తి అని తాజా విచారణలో తెలిసింది. ఇదిలా ఉండగా శంకర్ గత ఏడాది క్రితమే మరణించగా ఇటీవలనే పీడీ యాక్టు కింద యాదగిరి జైలులో ఉన్నాడు. చిన్నారుల అక్రమ రవాణా గుట్టు తెలియాలంటే యాదగిరిని విచారించాలని పలువురు అంటున్నారు. అంతేకాకుండా చిన్నారిని ఇబ్బందులకు గురిచేసిన కంసాని కల్యాణికి సంబంధించిన ఓ వ్యక్తికి సైతం అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. మూడున్నర ఏళ్ల క్రితమే చర్యలు తీసుకుని ఉంటే.. మూడున్నర ఏళ్ల క్రితమే సికింద్రాబాద్‌లో నమోదైన కేసు నేపథ్యంలో అక్రమ రవాణా ముఠాపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇంత దారుణాలు జరిగేవి కాదని వివిధ స్వచ్ఛంద సంస్థలు అంటున్నాయి. యాదగిరిగుట్ట కేంద్రంగా సాగుతున్న చిన్నారుల అక్రమ రవాణా వ్యాపారానికి చెక్ పెట్టాలంటే వ్యభిచార గృహాల నిర్వాహకులకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించాలని ఆ సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. పోలీసుల అదుపులో ఆర్ఎంపీ డాక్టర్? వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జీల నిర్వాహకులపై రౌడీషీట్ సాక్షి, యాదాద్రి: బాలికలు త్వరగా యుక్త వయసులోకి రావడానికి ఈస్ట్రోజన్ ఇంజక్షన్లు ఇచ్చాడనే అనుమానంతో యాదగిరిగుట్టకు చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాలికలను కొనుగోలు చేసి వ్యభిచార వృత్తిలోకి దించుతున్న నిర్వాహకులను పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 11మంది బాలికలను కాపాడిన నేపథ్యంలో వారికి ఈస్ట్రోజన్ ఇంజక్షన్లు ఇప్పిస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. దీంతో వ్యభిచారం నిర్వహిస్తున్నవారితో సంబంధాలు కలిగి ఉన్న ఆర్ఎంపీ వైద్యుడిని అదుపులోకి తీసుకుని నిజానిజాలు తెలుసుకోవడానికి అతడిని విచారిస్తున్నట్లు తెలిసింది. ఎంత మంది పిల్లలకు ఇంజక్షన్లు ఇచ్చారు, ఈ దారుణం వెనుక ఎవరెవరి హస్తం ఉంది, ఏ మేరకు డబ్బులు చేతులు మారుతాయి.. వంటి పలు అంశాలపై విచారణ జరుగుతున్నట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా పోలీసులు మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. లాడ్జీలపై నిఘా తీవ్రతరం యాదగిరిగుట్ట, వడాయిగూడెం, భువనగిరి, బీబీనగర్ ప్రాంతాల్లో గల లాడ్జీలు, రిసార్ట్స్లపై దాడులు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించిన కొన్ని లాడ్జీలను సీజ్ చేయడంతోపాటు నిర్వాహకులపై ఇప్పటికే పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. రెండు కంటే ఎక్కువసార్లు కేసులు నమోదైన వారిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇళ్ల మధ్య గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని కూడా గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు -
ఇద్దరు దొంగలపై పీడియాక్ట్ నమోదు
రాజేంద్రనగర్ రంగారెడ్డి : వరుస దొంగతనాలకు పాల్పడుతూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఇద్దరు దొంగలపై సైబరాబాద్ కమిషనర్ వి.సి.సజ్జనార్ పీడీ యాక్ట్ నమోదు చేశారు. గత నెలలో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు చిక్కిన ఇద్దరిపై మొదటిసారిగా పీడీ యాక్ట్‌ను ప్రయోగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అప్కోకాలనీలో సతీష్ ఉత్తమ్‌కుమార్ రాథోడ్(24), కేతావత్ రాజు(25)లు నివసిస్తున్నారు. రాథోడ్ ప్రైవేటు డ్రైవర్ కాగా, రాజు కూలి పని చేస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో ఆదర్శ్‌నగర్‌కాలనీ, ముస్తాఫానగర్, టీఎన్జీఓస్ కాలనీ, టాటానగర్, మధుబన్‌కాలనీలలో సంచరిస్తూ ఇంటికి తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవారు. అనంతరం ఇళ్లల్లోకి ప్రవేశించి విలువైన వస్తువులను తస్కరించేవారు. కేవలం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని 8 దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగతనమే వృత్తిగా ఎంచుకున్న వీరు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చిన అనంతరం తిరిగి ఇదే దందాను కొనసాగిస్తున్నారు. దీంతో పోలీసులతో పాటు స్థానికులకు కంటినిద్ర కరువైంది. గత నెల 7వ తేదీన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు నిందితులిద్దరూ పట్టుబడ్డారు. ఆ సమయంలో వారి నుంచి రూ.13 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్, నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై సైబరాబాద్ కమిషనర్ శుక్రవారం పీడీ యాక్ట్‌ను ప్రయోగించారు. -
దొంగలపై పీడీయాక్ట్ నమోదు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేశారు. నాందేడ్‌కు చెందిన సతీష్ ఉత్తమ్ కుమార్, కేతవాద్ రాజులు నగరంలోని రాజేంద్ర నగర్ ఆప్కో కాలనీలో నివసిస్తున్నారు. సతీష్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. కేతవాద్ రాజు కూలీగా పనిచేస్తున్నాడు. ఈ ఇద్దరు కలిసి రాత్రి వేళలో సంచరిస్తూ.. మారడ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆప్కో, ఆదర్శ్, ముస్తఫా నగర్, టీఎన్జీవో, టాటా నగర్, మదుబాన్ కాలనీల్లో తాళాలు వేసిన ఎనిమిది ఇళ్లలోకి చోరబడి 13 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను దొంగలించారు. పగలు రిక్కీ నిర్వహించి రాత్రి వేళలో చోరీలకు తెగబడే వీరిని శుక్రవారం మారేడ్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరికి నేరచరిత్ర ఉండటంతో పీడీయాక్ట్ నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
సిటీ పోలీసులకు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: అయూబ్‌ఖాన్ అనే వ్యక్తిపై పీడీ యాక్ట్ ప్రయోగించిన హైదరాబాద్ సిటీ పోలీసులకు హైకోర్టులో చుక్కెదురైంది. అయూబ్‌ఖాన్‌పై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గతేడాది జనవరి 25న జారీ చేసిన ఉత్తర్వులను, ఆ ఉత్తర్వులను సమర్థిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి మార్చి 24న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టే సింది. న్యాయమూర్తులు జస్టిస్ సురేశ్ కెయిత్, జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాద్రావుల ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. తన తండ్రి అయూబ్‌ఖాన్‌పై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను, వాటిని సమర్థిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి జారీ చేసిన ఉత్తర్వులనూ కొట్టేయాలని కోరుతూ షాబాజ్ అనే వ్యక్తి హైకోర్టులో గతేడాది పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కెయిత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాదులు సి.వి.మోహన్‌రెడ్డి, బి.మోహనారెడ్డి వాదనలు వినిపించారు. పీడీ యాక్ట్ ఉత్తర్వులు, వాటిని సమర్థిస్తూ జారీ అయిన ఉత్తర్వులు ఇంగ్లిష్‌లోనే ఉన్నాయని, కాని అయూబ్‌ఖాన్ మాతృభాష ఉర్దూ అని వారు కోర్టుకు వివరించారు. నిబంధనల ప్రకారం నిర్బంధానికి గురైన వ్యక్తికి తెలియని భాషలో ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఇంగ్లిష్రాని అయూబ్‌ఖాన్ తన నిర్బంధంపై ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించుకునే అవకాశం కోల్పోయారని, ఇది అతని హక్కులను హరించడమేనని వివరించారు. 27.2.17న సలహా బోర్డు ముందు అయూబ్‌ఖాన్‌ను ప్రవేశపెట్టిన అధికారులు, మార్చి 3న అతనికి ఉర్దూలో నిర్బంధ ఉత్తర్వులు అందజేశారని కోర్టుకు నివేదించారు. -
నలుగురు ఎస్కార్ట్ పోలీసుల సస్పెన్షన్
సాక్షి, యాదాద్రి/వరంగల్: వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ నయీమ్ ముఖ్య అనుచరుడు పాశం శ్రీనివాస్‌కు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై ఇద్దరు ఏఎస్ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ శుక్రవారం సస్పెండ్ చేశారు. నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అతడికి సహకరించిన పాశం శ్రీనివాస్‌పై పీడీ యాక్టు పెట్టి వరంగల్ సెంట్రల్ జైలుకు గత ఏడాది జూలైలో తరలించారు. 2016 జూలై 15న పీడీ యాక్టు నమోదు కాగా.. 2017 జూలై 14తో ముగిసి పోయింది. తాజాగా పోలీసుల ఫోన్‌తో జైలులో ఉన్న శ్రీనివాస్ తనను బెదిరించినట్లు బాధితులు రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్కార్ట్ పోలీసులు రమేష్, పాషా, రమేష్, లక్ష్మీనారాయణల సెల్ఫోన్లతో శ్రీనివాస్ కాల్స్ చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో వీరిపై కమిషనర్ సస్పెండ్ చేశారు. కాగా పాశం శ్రీనివాస్‌కు సహకరిస్తున్న అతని అనుచరులైన అందె సాయి కృష్ణ, అంగడి నాగరాజు, మెరుగు శివశంకర్, పులి శ్రీనివాస్, పాశం అమర్నా«థ్లపై కేసులు నమోదు చేసి గురువారం అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇదిలాఉండగా.. పాశంను వరంగల్ సెంట్రల్ జైలులోని హైసెక్యూరిటీ బ్యారక్‌లో ఉంచినందున సెల్ఫోన్లు వినియోగించే అవకాశం లేదని జైలు అధికారులు చెబుతున్నారు. -
నకిలీ విత్తన వ్యాపారిపై పీడీ యాక్ట్
రాష్ట్రంలో తొలిసారిగా.. సాక్షి, హైదరాబాద్: నకిలీ విత్తనాలు తయారుచేసి రైతు లను మోసగిస్తున్న ఓ వ్యాపారిపై రాష్ట్రంలో తొలిసారిగా పీడీ యాక్ట్ నమోదు చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన చిన్నం జానకిరామ్ అలియాస్ గోపీకృష్ణపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మంగళవారం పీడీ యాక్ట్ ప్రయోగించారు. రాచకొండ పోలీసు కమిషనరేట్, మహబూబ్‌నగర్ జిల్లాలో నకిలీ విత్తనాల తయారీకి సం బంధించి మూడు కేసుల్లో ఇతను నిందితుడు. స్వతహాగా తన తండ్రి విత్తనాల వ్యాపారంలో ఉండటంతోనే బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన జానకిరామ్ 2004లోనే ఈ వ్యాపారంలో అడుగుపెట్టాడు. తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో నాణ్యతలేని విత్తనాలు తయారు చేసి ఏజెంట్ల ద్వారా విక్రయించడం మొదలుపెట్టాడు. సృష్టి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో హైబ్రిడ్ బీటీ ఇంద్ర, భీష్మ, బలరామ్ విత్తనాలు తయారుచేసి రైతులకు విక్ర యించి మోసం చేస్తున్నాడు. ఈ కేసులో జూన్ 27న హయత్‌నగర్ పోలీసులు జానకిరామ్‌ను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. ఇతను విడుదలై బయ టకు వస్తే మళ్లీ నకిలీ విత్తనాల ముసుగులో ఎంతో మంది రైతులకు ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టానికి కూడా కారకుడయ్యే అవకాశం ఉందని మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. నకిలీ విత్తనాలతోపాటు ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై కొరడా ఝళిపిం చేందుకు ఇటీవలే పీడీ యాక్ట్‌కు సవరణ తెచ్చారు. -
ఆహార కల్తీపై ‘నియంత్రణ’ ఏదీ..?
► ఆహార నియంత్రణ శాఖను పట్టించుకోని ప్రభుత్వం ► రాష్ట్రవ్యాప్తంగా ఉన్నది 20 మంది ఉద్యోగులే సాక్షి, హైదరాబాద్: కల్తీలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఆహార కల్తీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశిస్తోంది. ఎలాంటి కల్తీలు జరిగినా బాధ్యులపై పీడీ చట్టం ప్రయోగించాలని చెబుతోంది. అయితే ఆహార నాణ్యతను పర్యవేక్షించే ఆహార నియంత్రణ శాఖను మాత్రం పట్టించుకోవడంలేదు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉండే ఆహార నియంత్రణ విభాగాన్ని అరకొర సిబ్బంది సమస్య వేధిస్తోంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆహార నమూనాలను వెంటనే సేకరించే పరిస్థితి ఎక్కడా లేదు. కనీసం జిల్లాకు ఒక్క అధికారి కూడా లేని పరిస్థితి. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) మార్గదర్శకాల ప్రకారం నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 50 వేల మంది జనాభాకు ఒక ఆహార నియంత్రణ అధికారి ఉండాలి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి లక్ష మంది జనాభాకు ఒక ఆహార నియత్రణ అధికారి ఉండాలి. అయితే మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి దయనీయంగా ఉంది. ఆహార నియంత్రణ విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 20 మంది అధికారులు మాత్రమే ఉన్నారు. వీరిలో ముగ్గురు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పని చేస్తున్నారు. మిగిలిన 17 మంది జిల్లాల్లో ఉన్నారు. ఈ లెక్కన ఆహార నియంత్రణ విభాగం లేని జిల్లాలో 13 ఉన్నాయి. ఎఫ్ఎస్ఎస్ఏఐ మార్గదర్శకాల ప్రకారం కాకున్నా.. నగరపాలక సంస్థలు మినహా ప్రతి జిల్లాలో కనీసం ముగ్గురు చొప్పున అధికారుల ఉండాల్సిన అవసరం ఉంది. నమూనాలు ఎట్లా.. నీరు, ఔషధాలు, మద్యం.. మినహా మనుషులు తీసుకునే ప్రతి ఆహార పదార్థం నాణ్యత పర్యవేక్షణ బాధ్యత ఆహార నియంత్రణ విభాగం పరిధిలోనే ఉంటుంది. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఇప్పుడు ఆహార ఉత్పత్తుల తయారీ విపరీతంగా పెరిగింది. అయితే నాణ్యత విషయంలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే నమూనాలను సేకరించే పరిస్థితి లేదు. ఆహార నియంత్రణ అధికారి ఒక్కరే ఉన్న జిల్లాలు వరంగల్ అర్బన్, మహబూబాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, రంగారెడ్డి, వికారా బాద్, మేడ్చల్, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజా మాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్. -
ప్రతి దానికీ పీడీ యాక్టా..!
♦ పోలీసుల తీరుపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర ఆక్షేపణ ♦ నేరాన్ని రుజువు చేయడంలో విఫలమవుతున్నారని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: నేర తీవ్రతతో సంబంధం లేకుండా పోలీసులు ప్రతీ నేరానికి పీడీ యాక్ట్ ప్రయోగిస్తుండటాన్ని ఉమ్మడి హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. సాధారణ నేర చట్టాల కింద కేసులు నమోదు చేయాల్సిన వ్యవహారాల్లోనూ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నారని, ఇది ఎంత మాత్రం సరికాదంది. సాధారణ కేసులు నమోదు చేసిన పోలీసులు సదరు వ్యక్తులపై నేరాన్ని రుజువు చేయడంలో విఫలమతున్నారని, దీంతో వారు సులభంగా బయటకు వచ్చేస్తున్నారని పేర్కొంది. ఓ వ్యక్తి చర్యలు మొత్తం వ్యవస్థకు ప్రమాదకరంగా మారినప్పుడే ‘పబ్లిక్ ఆర్డర్’కింద పీడీ యాక్ట్ ప్రయోగించాలే తప్ప... ఓ కుటుంబాన్నో, వ్యక్తినో బెదిరించినంత మాత్రాన దానిని ‘పబ్లిక్ ఆర్డర్’కు వి«ఘాతంగా చూపుతూ పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదంది. ప్రస్తుత కేసులో పీడీ యాక్ట్ ఎదుర్కొంటున్న చిర్రబోయిన కృష్ణయాదవ్ అలియాస్ గొల్ల కిట్టుపై ఓ కుటుంబాన్ని బెదిరించారనే ఆరోపణలున్నాయని, ఇందుకు అతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించారని, ఓ కుటుంబాన్ని బెదిరించినంత మాత్రాన మొత్తం ప్రజా వ్యవస్థ స్తంభించిపోదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది సరికాందంటూ కృష్ణయాదవ్ నిర్భందానికి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. వ్యవస్థను ప్రక్షాళన చేయాలి... రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నేర వ్యవస్థలో ఉన్న లొసుగులను పూడ్చి మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ధర్మాసనం స్పస్టం చేసింది. నిపుణులైన పోలీసు అధికారులను , అలాగే సమర్థత, తగిన విషయ పరిజ్ఞానం, నిజాయితీ ఉన్న న్యాయవాదులను పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమించుకోవాలంది. -
అది హక్కును హరించడమే
⇒ పీడీ చట్టం కింద నమోదు చేసే కేసుల్లో ఉమ్మడి హైకోర్టు స్పష్టీకరణ ⇒ చిత్తూరు జిల్లా ఎస్పీకి రూ.25 వేల జరిమానా సాక్షి, హైదరాబాద్: ముందస్తు నిర్భంధ చట్టం (పీడీ యాక్ట్) కింద ఓ వ్యక్తిని నిర్భంధంలోకి తీసుకున్నప్పుడు, ఆ ఉత్తర్వులు, ఇతర డాక్యుమెంట్లను మాతృభాషలో అందజేయకపోవడం అతడి రాజ్యాంగ హక్కును హరిం చడమేనని హైకోర్టు స్పష్టం చేసింది. అలా అంద జేయడంలో విఫలమైనం దుకు చిత్తూరు జిల్లా ఎస్పీకి రూ.25 వేల జరిమానా విధించింది. ఇందులో రూ.10 వేలను హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీకి, రూ.15 వేలను పిటిషనర్‌కు చెల్లించాలంది. ఈ మొత్తాన్ని ఎస్పీ జీతం నుంచి మినహాయించాలంది. కాగా అజయ్‌కుమార్ అనే వ్యక్తిపై పీడీ చట్టం ప్రయోగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సురేశ్ కైత్, జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావుల ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. -
నయీం అనుచరుడు శ్రీధర్‌పై పీడీ యాక్ట్
నాగోలు: గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడు, రౌడీ షీటర్ పొలిమేటి శ్రీధర్‌పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు. మంగళవారం ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు..సైదాబాద్ కాలనీ కరన్‌భాగ్, లక్ష్మీమనోహర్ ఎన్‌క్లేవ్‌కు చెందిన పొలిమేటి శ్రీధర్ అలియాస్ శ్రీకాంత్ అలియాస్ అయ్యప్ప (49) గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అక్రమాల్లో పాలు పంచుకునేవాడన్నారు. ఇతనిపై పహడీషరీఫ్, ఆదిభట్ల, వనస్థలిపురం, సరూర్‌నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో పలు హత్యలు, కిడ్నాప్‌లు, చీటింగ్, భూ కబ్జాలకు సంబందించి వివిధ పోలీస్ స్టేషన్లలో 8 కేసులుఉన్నాయన్నారు. 2016 సెప్టెంబర్ 2న పహడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో బెదిరింపుల కేసు నమోదైందన్నారు. 2013లో పీఎన్టీ కాలనీకి చెందిన ప్రభాకర్‌ని కిడ్నాప్ చేసి శ్రీశైలం అడవుల్లో హత్యచేసిన కేసులోనూ ఇ తను నిందితుడుగా ఉన్నట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ తెలిపారు. -
కల్తీకారం వ్యాపారిపై పీడీయాక్ట్
ఖమ్మం: కల్తీ కారం కేసులో ఓ వ్యక్తి పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఖమ్మం పట్టణానికి చెందిన కల్తీ కారం వ్యాపారి పటోరి చైతన్యపై త్రీటౌన్ పోలీసులు గురువారం పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి వరంగల్ జిల్లా కారాగారానికి తరలించారు. దీంతో కల్తీకారం కేసులో పీడీ యాక్ట్ కింద నమోదైన కేసులు మూడుకు చేరాయి. గత కొంతకాలంగా జిల్లాలో కల్తీకారం దందాలు కొనసాగుతున్నాయి. కల్తీకారం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు దృష్టి సారించారు. -
నయీం కేసులో మరో కీలక మలుపు
నయీం గ్యాంగులో కీలక సభ్యుడు, అతడితో కలిసి కిడ్నాపులు, మోసాలు, నేరపూరిత కుట్రలు, భూ ఆక్రమణలు, బెదిరించి డబ్బు వసూళ్లు తదితర నేరాలకు పాల్పడిన సామా సంజీవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై పీడీ యాక్టు నమోదు చేశారు. హయత్‌నగర్ పరిధిలోని సాహెబ్‌నగర్ ప్రాంతానికి చెందిన సంజీవరెడ్డి నయీం గ్యాంగులో కీలక సభ్యుడని, అతడితో కలిసి ఆరు నేరాల్లో ఇతడిపై కేసులు ఉన్నాయని రాచకొండ పోలీసు కమిషనరేట్ ఒక ప్రటకనటలో తెలిపింది. పహాడి షరీఫ్, ఆదిభట్ల పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రధానంగా ఇతడు నేరాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడి పనులు ప్రజాభద్రతకు ముప్పుగా పరిణమించాయని, అతడిని కొన్నాళ్ల పాటు సమాజానికి దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో పీడీ చట్టం కింద కొంతకాలం పాటు జైల్లో ఉంచామని పోలీసులు తెలిపారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలను కాపాడేందుకు అతడిపై పీడీ చట్టం పెట్టాల్సిందిగా పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశించారన్నారు. కాగా, మరోవైపు నయీం అనుచరుడు పుల్లూరి మహేష్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నయీం ఎన్కౌంటర్ జరిగినప్పటి నుంచి మహేష్ పరారీలో ఉన్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి అతడి మృతదేహం కనిపించడంతో ఏమై ఉంటుందా అన్న ఆసక్తి నెలకొంది. -
‘నకిలీ మిరప’లో అధికారుల పాత్రపై విజిలెన్స
► వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల సహా కమిషనరేట్‌లో విచారణ ► కంపెనీలకు లెసైన్సులు జారీ చేసిన అధికారులపై ఆరా సాక్షి, హైదరాబాద్: నకిలీ మిరప విత్తనాలను రైతులకు అంటగట్టిన కంపెనీలు, డీలర్లపై చర్యలకు దిగిన ప్రభుత్వం... ఇప్పుడు జిల్లాల్లో వ్యవసాయాధికారులు, కమిషన రేట్లోని ఉన్నతస్థాయి అధికారుల పాత్రపై ఆరా తీస్తోంది. ఈ మేరకు నిఘా విభాగం (విజిలెన్స) విచారణ చేస్తున్నట్లు తెలిసింది. నకిలీ మిరప విత్తనాలను సరఫరా చేశారన్న కారణంతో దాదాపు 110 మంది డీలర్ల లెసై న్సులను వ్యవసాయ శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆరుగురిపై పోలీసు లు పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. ఆయా కంపెనీల ఫ్యాక్టరీల పరిధిలోని ముగ్గురు వ్యవసాయాధికారులను సస్పెండ్ చేశారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో నకిలీ మిరప విత్తనాలను విక్రయిస్తున్నా ఏమాత్రం పట్టించుకోని వ్యవసాయాధికారుల పాత్రపైనా విజిలెన్స తాజాగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఆయా కంపెనీలకు రాష్ట్రస్థాయి లో వ్యవసాయ కమిషనరేట్ స్థారుులో లెసైన్సులు ఎలా జారీచేశారన్న అంశంపైనా నిఘా విభాగం ఆరా తీస్తోంది. వ్యవసాయాధికారులపైనా చర్యలు? ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో వేలాది మంది రైతులు నకిలీ మిరప విత్తనాలు వేసి పెద్ద ఎత్తున నష్టపోయారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 72 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. నకిలీ మిరప విత్తనాలపై ప్రభుత్వం వ్యవసాయ సైంటిస్టులు, అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. వారు ఆయా జిల్లాల్లో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నకిలీ విత్తనాలతో మిరప రైతులు నష్టపోయారని బృందం ప్రభుత్వానికి నివేదించింది. దీంతో ప్రభుత్వం ఇప్పటివరకు 110 మంది డీలర్ల లెసైన్సులు రద్దు చేసింది. ఆరు కంపెనీ యాజమాన్యాలపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసింది. స్థానికంగా ఉన్న మండల వ్యవసాయాధికారులు కొం దరు నకిలీ విత్తనాలు విక్రరుయించే డీలర్ల నుంచి ముడుపులు పుచ్చుకొని చూసీ చూడ నట్లుగా వదిలేశారన్న ఆరోపణలు న్నాయి. అంతేకాదు రాష్ట్రస్థాయిలో వ్యవసాయశాఖ అధికారులు నకిలీ విత్తన కంపెనీలకు ఎలా లెసైన్సులు జారీచేశారన్న ప్రశ్న తలెత్తుతోంది. వ్యవసాయశాఖ వైఫల్యం వల్లే నకిలీ మిరప విత్తనాలు రైతుల వద్దకు చేరాయని, దీనికి వ్యవసాయశాఖ బాధ్యత వహించాల్సి ఉం టుందని విజిలెన్స అధికారులు చెబుతు న్నారు. ఈ అంశంలో కొందరు మండల వ్యవ సాయాధికారులపై చర్యలుండే అవకాశం ఉంది. సంబంధిత విత్తన కంపెనీల లెసైన్సు ఫైలు వివిధస్థారుు అధికారుల నుంచి కమిష నరేట్లోని ఇద్దరు ముఖ్యమైన అధికారుల ఆమోదం తర్వాతే జారీ అరుు ఉంటుందని అంటున్నారు. లెసైన్సుల జారీలో ఆ ఇద్దరి పాత్ర ఉంటే వారిపైనా చర్యలుంటాయని ఒక అధికారి వ్యాఖ్యానించారు. -
109 నకిలీ మిరప విత్తన డీలర్ల లెసైన్సులు రద్దు?
- రంగం సిద్ధం చేసిన వ్యవసాయశాఖ - వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ - పీడీ యాక్ట్ కింద పలుచోట్ల అరెస్టులు సాక్షి, హైదరాబాద్: నకిలీ మిరప విత్తన డీలర్లపై ప్రభుత్వం కొరఢా ఝుళిపిస్తోంది. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో 109 మంది విత్తన డీలర్లకు సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ ఎప్పటికప్పుడు సమస్య తీవ్రతను వెలికితీసింది. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలకు వ్యవసాయ, ఉద్యాన శాఖలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ‘నకిలీ మిరప విత్తనాలు విక్రయించి రైతులకు తీవ్ర నష్టం చేకూర్చిన మీ డీలర్షిప్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ’ నోటీసులు జారీ చేసింది. డీలర్లు ఇచ్చే సమాధానం తర్వాత వారి లెసైన్సులు రద్దు కానున్నాయి. షోకాజ్ నోటీసులు కేవలం న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఇచ్చినవేనని... నకిలీ విత్తనాలు రైతులకు సరఫరా చేసినట్లు నిర్ధారణ జరిగినందున ఆ డీలర్లందరి లెసైన్సులు రద్దు చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఖమ్మం జిల్లాలో 98 మంది డీలర్లు, వరంగల్ జిల్లాలో 9 మంది, నల్లగొండ జిల్లాలో ఇద్దరు డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటికే కొందరి డీలర్షిప్ లెసైన్సులు రద్దు చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు విచారణలో నకిలీ మిరప విత్తనాలు విక్రయించిన కంపెనీ ప్రతినిధులు, డీలర్లను అనేకచోట్ల పీడీ యాక్టు కింద అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో ఇంత భారీ ఎత్తున డీలర్షిప్ లెసైన్సులు రద్దు చేసే పరిస్థితి తలె త్తడం వ్యవసాయశాఖ చరిత్రలో ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. ఇదిలావుంటే రైతులకు నష్టం జరిగిందని తేల్చిన ప్రభుత్వం.. నష్టపరిహారం చెల్లించే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వడంలేదు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. నకిలీవని తేల్చిన నిజనిర్ధారణ కమిటీ.. నకిలీ మిరప విత్తనాలు అంటగట్టి రైతుల జీవితాలను విత్తన కంపెనీలు, వారికి సంబంధించిన డీలర్లు నిలువెల్లా నాశనం చేశారు. అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం మూడు జిల్లాల్లో 4,420 ఎకరాల మిరప పంటకు నకిలీ విత్తనాల కారణంగా నష్టం జరిగింది. మొత్తం 3,531 మంది రైతులు నష్టపోయారని తేల్చారు. వారికి 121 మంది డీలర్లు నకిలీ మిరప విత్తనాలను అంటగట్టారు. నకిలీ విత్తనాల వల్లే మిరప పంటకు నష్టం జరిగిందని.. ఆయా విత్తనాలు సరఫరా చేసిన ఆరు మిరప విత్తన కంపెనీలు, సంబంధిత డీలర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ బృందం ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. -
నకిలీ చీడపై పీడీ
♦ కేసులు నమోదు చేయాల్సిందిగా సీఎస్ ఆదేశాలు ♦ ‘సాక్షి’ వరుస కథనాలతో కదిలిన సర్కారు సాక్షి, హైదరాబాద్: నకిలీ మిరప విత్తనాలు అంటగట్టి రైతుల పొట్టగొట్టిన కంపెనీల ప్రతినిధులు, డీలర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా నకిలీ మిరప విత్తనాలతో నష్టపోయిన ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో నకిలీ కంపెనీల ప్రతినిధులు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలను ఆదేశించినట్లు తెలిసింది. సీఎస్ ఆదేశాలు అందుకున్న అధికారులు తక్షణమే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఎవరిపై కేసులు నమోదు చేశారన్న విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోవడంపై ‘సాక్షి’ ఇటీవల ప్రత్యేక కథనాలను ప్రచురించింది. ముఖ్యంగా మూడు జిల్లాల్లో డీలర్లు, విత్తన కంపెనీ ప్రతినిధుల అరెస్టులకు రంగం సిద్ధమవుతోంది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలోని తిరుమలాయపాలెం, కూసుమంచి, కొణిజర్ల, వైరా, ఏన్కూరు, ఇల్లెందు మండలాలు, వరంగల్, మహబూబాబాద్, నల్లగొండ జిల్లాల్లోని వివిధ మండలాల్లోని రైతులు దాదాపు 14 వేల ఎకరాల్లో నకిలీ మిరప విత్తనాలు వేసి నష్టపోయారు. ఒక అంచనా ప్రకారం నకిలీ మిరప విత్తనాల కారణంగా రైతులు రూ.450 కోట్ల మేరకు నష్టపోయారు. విత్తనాలు నకిలీవేనని వ్యవసాయశాఖ నియమించిన నిజనిర్ధారణ శాస్త్రవేత్తలు, అధికారుల బృందం తేల్చి చెప్పింది. దీంతో ప్రభుత్వం పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తోంది. అయితే నకిలీ విత్తనాలతో నష్టపోయిన 5 వేల మంది రైతులకు పరిహారం ఇచ్చే విషయంపై మాత్రం ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన జారీ కాలేదు. -
ఏపీలో పీడీ యాక్ట్ అస్త్రం
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పీడీ యాక్ట్ అమలును మరో మూడు నెలలపాటు పొడగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లకు అధికారాలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అక్టోబర్ 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 వరకూ పీడీ యాక్ట్ అమలు గడువును ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్రంలో నెలకొన్న కాపు ఉద్యమం, బందర్ పోర్టు ఉద్యమం, ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమాలను అణగదొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ ను తీసుకోస్తుంది. -
పరిహారం చెల్లించకపోతే పీడీ యాక్టు
అమరావతి: నకిలీ విత్తన కంపెనీలు రైతులకు నష్ట పరిహారం చెల్లించకపోతే యజమానులపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. గుంటూరు ఎస్సీ కార్పొరేషన్ హాలులో శుక్రవారం నిర్వహించిన 13 జిల్లాల వ్యవసాయాధికారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హైబ్రీడ్ విత్తనాలు అమ్మకం దారులకు ఆర్ఎన్డీ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. కంపెనీలు ఎక్కడ విత్తనాలు వేసి పండించాయో సాక్ష్యం లేకపోయినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. విత్తనాలను డిపార్ట్మెంట్ పరీక్షించిన తర్వాతే బయటకు రిలీజ్ చేయాలని సూచించారు. తయారుదారీ కంపెనీల బిల్లులు లేకుండా డీలర్లు విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 200 బయో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రైవేటుగా ప్రో ఫార్మర్స్ అడ్వకేట్స్ను పెట్టుకొని కేసులు పరిష్కరించాలని తెలిపారు. వీటిపై రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ డెరైక్టర్ ధనుంజయరెడ్డిని ఆదేశించారు. డీలర్‌ను సస్పెండ్ చేస్తే మార్పు రాదని, కంపెనీ యజమానులను బాధ్యులను చేసి అరెస్టు చేయాలని సూచించారు. జీవీ, బ్రహ్మపుత్ర, ఆధార్ వంటి నకిలీ విత్తనాల కంపెనీలపై జేడీలు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలకు సంబంధించి ఆరు ప్రత్యేక బృందాలతో విచారణ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. డీడీలు, ఏడీలకు ఆరునెలల పాటు వాహన సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. 15 రోజుల తరువాత మళ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని, ఆలోగా ఎన్ని కేసులు పరిష్కరించారు, ప్రగతిని బేరీజు వేస్తానని తెలిపారు. -
నకిలీ విత్తన తయారీదారులపై ఉక్కుపాదం
- వారిపై పీడీ చట్టం ప్రయోగించండి - సీఎస్, డీజీపీలకు ముఖ్యమంత్రి ఆదేశం - ‘సాక్షి’ వరుస కథనాలతో స్పందించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ విత్తనాలు తయారు చేయాలంటేనే వణికిపోయే పరిస్థితులు ఏర్పరచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో నకిలీ విత్తనాల విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తన తయారీదారులపై పీడీ చట్టం ప్రయోగించి ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మలను ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో నకిలీ విత్తనాల అంశంపై సీఎం సమీక్షించారు. రైతులు ఎన్నో ఇబ్బందులకు ఓర్చి పెట్టుబడులు పెట్టి ఆరుగాలం కష్టపడితే.. నకిలీ విత్తన తయారీదారుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలపై తక్షణమే విచారణ జరిపి మూడు జిల్లాల కలెక్టర్లతో నివేదిక తెప్పించాలని ఆదేశించారు. పేకాట, గుడుంబా, గుట్కాను తరిమికొట్టడంలో ప్రభుత్వం విజయం సాధించిందని, ఆ తరహాలోనే నకిలీ విత్తన తయారీదారులు పారిపోయేలా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. నకిలీ విత్తనాలను మార్కెట్లో విక్రయించకుండా చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై వెంటనే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. నకిలీ విత్తన తయారీదారుల ఆస్తులు స్వాధీనం చేసుకునే అవకాశాన్ని చట్టపరంగా పరిశీలించాలని సూచించారు. ప్రజలకు నష్టం చేకూర్చే అక్రమార్కుల విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితిల్లోనూ రాజీపడదని సీఎం స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టర్లు, ఎస్పీలు సంఘ వ్యతిరేక శక్తులపై పూర్తిస్థాయిలో నిఘాపెట్టే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జరిగే కలెక్టర్లు, ఎస్పీల భేటీ ఈ అంశంపై పూర్తి స్థాయిలో సమీక్షించనున్నట్లు తెలిపారు. సమీక్షలో సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, అదనపు కార్యదర్శి శాంతికుమారి, సీఎంవో ఉన్నతాధికారులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. నష్టపరిహారంపై స్పష్టత లేమి మిరప నకిలీ విత్తనాలు, రైతులు నష్టపోయిన అంశంపై ‘సాక్షి’ వరుసగా కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో సీఎస్ రాజీవ్‌శర్మ స్పందించి సమగ్ర నివేదికకు, చర్యలకు ఆదేశించిన మరుసటి రోజే వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి చర్యలు చేపట్టారు. నష్టపరిహారం చెల్లింపుపై మాత్రం ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. రైతులు మిరప పంటల సాగు, విత్తనాల కోసం రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేశారని నివేదికలోనే ప్రస్తావించారు. కాబట్టి రైతులందరికీ కూడా ఆ స్థాయిలో పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంపై వ్యవసాయశాఖ ప్రకటన జారీ చేయలేదు. ముగ్గురు వ్యవసాయాధికారుల సస్పెన్షన్ రైతులకు నకిలీ మిరప విత్తనాలు అంటగట్టిన విత్తన కంపెనీలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు వ్యవసాయాధికారులపై వేటు పడింది. నకిలీ విత్తన కంపెనీల లెసైన్సులు రద్దు అయ్యాయి. ఈ మేరకు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లా రైతులు వివిధ కంపెనీల విత్తనాలు వేసి నష్టపోయారు. దీంతో రాష్ట్రస్థాయి శాస్త్రవేత్తల బృందం ఆయా జిల్లాల్లో పర్యటించింది. రైతులను కలసి వ్యవసాయశాఖ కార్యదర్శికి నివేదిక అందజేశారు. అనంతరం హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో సంబంధిత కంపెనీల ప్రధాన కార్యాలయాలు, ప్రాసెసింగ్ కేంద్రాలు, గోదాములను ఈ నెల 4న తనిఖీ చేశారు. గ్రీన్ ఎరా, జీవా అగ్రిటెక్స్, క్యాంప్సన్ సీడ్స్, లక్కీ సీడ్స్, అగ్రోజెన్స్, మహానంది సీడ్స్‌పై క్రిమినల్ చర్యలు తీసుకునేలా సంబంధిత కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. క్యాంప్సన్ సీడ్స్, లక్కీ సీడ్స్, అగ్రో జెన్స్, మహానంది సీడ్స్ కంపెనీల లెసైన్స్‌లను రద్దు చేసేందుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పార్థసారథి తెలిపారు. గ్రీన్ ఎరా, జీవా అగ్రి జెనెటిక్స్ కంపెనీల లెసైన్సులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. సంబంధిత జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు విత్తన డీలర్ల లెసైన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. ఇక నకిలీ విత్తనాలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యం వహించినందుకు కుత్బుల్లాపూర్ వ్యవసాయాధికారి జి.ప్రసన్నలక్ష్మి, హైదరాబాద్ అర్బన్ వ్యవసాయాధికారి ఐ.పల్లవి, సరూర్‌నగర్ వ్యవసాయాధికారి సుందరిని సస్పెండ్ చేశారు. ఆ మూడు జిల్లాల్లో డీలర్లపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేసేలా కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశాలు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నకిలీ విత్తనాలతో ఈ మూడు జిల్లాల్లో 4,420 ఎకరాల మిరప పంటకు నష్టం వాటిల్లింది. మొత్తం 3,531 మంది రైతులు నష్టపోయారు. వారికి 121 మంది డీలర్లు నకిలీ మిరప విత్తనాలను అంటగట్టారు. -
బాబుపై ‘అవినీతి కేసు’ పెట్టాలి
- ధ్వజమెత్తిన అంబటి రాంబాబు - ఉద్యమకారులపై పీడీ చట్టం అన్యాయం సాక్షి, హైదరాబాద్: ప్రజా ఉద్యమాలు చేసే రాజకీయ పార్టీల నేతలు, ఉద్యమకారులపైన పీడీ (ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్) చట్టం ప్రయోగించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశాలివ్వడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల మండలి (పీఏసీ) సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ దోచుకుంటున్నందుకు చంద్రబాబుపైనే అవినీతి నిరోధక చట్టం కేసును పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఉద్యమాలను అణచి వేయాలని చంద్రబాబు చెప్పడం చూస్తూంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నియంత పాలనలో ఉన్నామా! అనే అనుమానం కలుగుతోందని విమర్శించారు. భీమవరం వద్ద అక్వాఫుడ్ పార్కును వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. నేరాలను కప్పిపుచ్చుకోవడానికే.. సచివాలయాన్ని వెలగపూడికి తరలించడానికి తామెంత మాత్రం వ్యతిరేకం కాదని, అయితే అరకొర వసతుల మధ్య ‘తాత్కాలిక శాసనసభ’, ‘తాత్కాలిక సచివాలయం’కు మార్చడం సరికాదని అంబటి చెప్పారు. చంద్రబాబు తాను చేసే ప్రతి కార్యక్రమంలోనూ, ప్రతి సంతకంలోనూ అవినీతికి పాల్పడుతూ ‘వైట్ కాలర్’ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. హైదరాబాద్‌లో ఉండే పోలీసు వ్యవస్థ, ఇతర వ్యవస్థలు తన పరిధిలో ఉండవని, అదే విజయవాడలో అయితే అన్ని వ్యవస్థలూ తన ఆధీనంలోనే ఉంటాయి కాబట్టే ఈ తరలింపు జరుగుతోందని చెప్పారు. దోమలతో బాబు పోటీ! ‘‘ఓ పిల్ల దోమ, తల్లి దోమతో... ‘మనపై చంద్రబాబు ఎందుకు దండయాత్ర చేస్తున్నారు?అని ప్రశ్నించింద ట. అందుకు తల్లి దోమ సమాధానమిస్తూ... ‘ప్రజలు నిద్రపోయాక మనం రక్తం తాగుతున్నాం, చంద్రబాబు ప్రజల రక్తాన్ని నిలువెల్లా పీల్చేస్తున్నారు. ఇందులో పోటీ ఉండకూడని, తానే పీల్చాలనే ఉద్దేశంతో మనపై దండయాత్ర చేస్తున్నారు’ అని చెప్పిందట..’’అంటూ పిట్టకథ చెబుతూ అంబటి ఎద్దేవా చేశారు. -
'కాపులపై కేసులు పెడితే జైళ్లు సరిపోవు'
సాక్షి, హైదరాబాద్: ప్రజా ఉద్యమాలు, ఆందోళనకారులపై పీడీ యాక్ట్ (ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్) పెట్టయినా అణచివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వడాన్ని కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ఆక్షేపించారు. రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపులపై పీడీ యాక్ట్ పెట్టాలని చూస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జైళ్లు కూడా సరిపోవన్నారు. జైళ్లకు, బెయిళ్లకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉద్యమాలను అణచివేయడంలో చంద్రబాబుది అందవేసిన చేయ్యేనని, తాము చేస్తున్నది న్యాయమైన పోరాటమైనందున ఎవ్వరికీ భయపడబోమన్నారు. రిజర్వేషన్ల పోరాట భవిష్యత్ కార్యచరణను చర్చించేందుకు నగరానికి వచ్చిన ముద్రగడ, ఆయన అనుచరులు సోమవారం కాపు రిజర్వేషన్లకు మద్దతిస్తున్న వివిధ వర్గాల మేథావులను, ఇతర బీసీ సంఘాల నేతల్ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన తన పోరాట నేపథ్యాన్ని వివరించారు. దీక్ష సందర్భంగా తనపైన, తన కుటుంబ సభ్యులపైన పోలీసుల అనుచిత ప్రవర్తనను వివరించారు. తనను ఎంతగా క్షోభ పెట్టినా రిజర్వేషన్ల సమస్యను విడిచిపెట్టే సమస్యే లేదన్నారు. తమ పోరాటం మిగతా బీసీ వర్గాలకు వ్యతిరేకమైందో, వారికిస్తున్న రిజర్వేషన్ల కోటాను లాక్కోవాలన్నదో కాదని స్పష్టం చేశారు. గతంలో ఉన్న రిజర్వేషన్లనే అమలు చేయమని కోరుతున్నామని, చంద్రబాబు కాపు వర్గాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని డిమాండ్ చేస్తున్నామని వివరించారు. బీసీ కమిషన్ ఛైర్మన్ మంజునాధ్‌కు ఇప్పటికే తమ సమస్యలను వివరిస్తూ మహాజర్లు ఇచ్చామని, ఆయన ఏ జిల్లాకు వెళ్లినా కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల వారు వినతి పత్రాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్‌లో చేపట్టబోయే ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ముద్రగడ అన్ని వర్గాల ప్రజలను, పార్టీల నాయకులను కోరారు. కాపు ప్రముఖులతో మంగళవారం భేటీ రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన రిజర్వేషన్ల పోరాట సమితీ జేఏసీల సమావేశం తీర్మానాలను చర్చించి భవిష్యత్ కార్యచరణను ఖరారు చేసేందుకు మంగళవారం ఇక్కడ కాపు ప్రముఖుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముద్రగడతో పాటు కాపు ప్రముఖులు, సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు, ప్రముఖ నటుడు చిరంజీవి, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, వైఎస్సార్ సీపీ నాయకులు బొత్సా సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, తోట చంద్రశేఖర్, అద్దేపల్లి శ్రీధర్, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, కఠారి అప్పారావు, సీహెచ్ జనార్ధన్ తదితరులు హాజరవుతారు. కాపు రిజర్వేషన్ల పోరాట సమితీ భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్ర స్థాయి జేఏసీ ఏర్పాటు వంటి అంశాలను సమావేశంలో చర్చిస్తారు. -
‘బాబుపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టాలి’
-
అన్యాయాన్ని నిలదీస్తే అరెస్టు చేస్తారా..?
* పీడీ యాక్టు కింద కేసులు పెడతారా! * సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు * వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ధ్వజం పట్నంబజారు: సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తే ... ప్రజా సమస్యలపై ఇదేమని ప్రశ్నిస్తే ... పీడీయాక్టులు పెడతాం... అరెస్టులు చేయిస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరండల్‌పేటలోని పార్టీ నగర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు పాలనను చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. రాజధాని ప్రాంతంలో రైతులు అన్యాయమని మొరపెట్టుకుంటుంటే వారిపై, హోదా కోసం పోరాడుతున్న యువతపై పీడీయాక్ట్ పెట్టాలని చెప్పడం దారుణమన్నారు. వారేమైనా అసాంఘిక శక్తులా? రౌడీలా? గుండాలా? అని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం నోరెత్తిన ప్రతి ఒక్కరినీ అణచి వేసే ధోరణ సరికాదన్నారు. విద్యార్థులు, రైతులు, యువతను సభలకు వెళ్లకుండా అడ్డుకోవాలని కలెక్టర్, ఎస్పీ స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసులు పెట్టినంత మాత్రాన బెదిరేది లేదని, హోదా, రైతన్నల కోసం యువత, విద్యార్థులను కలుపుకుని ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే ప్రజలు ఇచ్చిన తీర్పుతో భూస్థాపితం అయిన పార్టీలు ఎన్నో చరిత్రలో ఉన్నాయన్నారు. ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన ప్రజలు టీడీపీని మట్టికరిపించేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు రాతంశెట్టి సీతారామాంజనేయులు, లక్కాకుల థామస్ నాయుడు, ఎం.డి.నసీర్ అహ్మద్ మాట్లాడారు. -
పీడీ యాక్ట్ పెట్టాలి
నకిలీ విత్తన కంపెనీలపై టీటీడీపీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ, కల్తీ విత్తనాలు సరఫరా చేస్తున్న విత్తన కంపెనీలు, డీలర్లపై పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలు డిమాండ్ చేశారు. ఇలాంటి కంపెనీలను శాశ్వతంగా నిషేధించేందుకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు. శుక్రవారం టీడీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మారుస్తామని సీఎం కేసీఆర్ చెబుతున్నారని, అయితే నకిలీ విత్తన భాండాగారంగా మారుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విమర్శించారు. మిర్చి, పత్తి వంటి విత్తనాలు మొలకెత్తక రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారని పేర్కొన్నారు. ఈ నష్టాన్ని ఆయా కంపెనీల ద్వారా రైతులకు ప్రభుత్వం ఇప్పించాలని లేదా ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. శనగ విత్తనాల ధరను ఒకేసారి 90 శాతానికి పైగా పెంచి, రైతుకిచ్చే సబ్సిడీని 51 శాతం నుంచి 31 శాతానికి తగ్గించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. సెప్టెం బర్ 20తో ముగిసిన ఖరీఫ్ కాలానికి రూ.17,800 కోట్ల రుణ ప్రణాళికను ప్రకటించగా, బ్యాంకులు రూ.8 వేల కోట్లు మాత్రమే రుణాలిచ్చాయన్నారు. -
ప్రశ్నించే గొంతు నొక్కేందుకే పీడీ యాక్టు
పంజగుట్ట: ప్రశ్నించిన ప్రతీ ఒక్కరినీ పీడీ యాక్టు పేరుతో భయపెట్టడం తగదని మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ప్రభుత్వాలు ప్రజల ఆందోళనకు కారణాలను గుర్తించి సమస్య పరిష్కరించాలని కోరారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ‘తెలంగాణలో నిర్భంధం ఎవరిమీద ..? పీడీ యాక్ట్ ఎందుకోసం’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రమైన నేరాలకు ఉద్ధేశించిన పీడీ యాక్టును చిన్న చిన్న కేసులకు, ప్రజా ఆందోళనలు, ఉద్యమాలు చేసే వారిపై ప్రయోగించడం దారుణమన్నారు. పీడీయాక్టు అమలుపై గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలన్నారు. ప్రజాస్వామ్యంలో పీడీ, నాసా తదితర నిర్భంధ చట్టాలను అమలు చేయాలనుకోవడం మంచిది కాదన్నారు. చెరుకు సుధాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం పీడీ యాక్ట్ సర్వసాధారణమైపోయిందన్నారు. ఖమ్మం జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న 80 మంది గిరిజనులపై పీడీ యాక్టు ప్రయోగించడం విడ్డూరంగా ఉందన్నారు. పోడు వ్యవసాయం అటవీ హక్కు చట్టం ప్రకారం వారి హక్కుగా పేర్కొన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే నయీంతో సంబంధాలు ఉన్న అధికార పార్టీ నాయకులపై పీడి యాక్ట్ పెట్టాలని హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యెన్న శ్రీనివాస్ రెడ్డి, ఎపూరి సోమన్న, సందీప్ చమల్, శ్రీనివాస్ గౌడ్, మేరీ మాదిగ, వనజ తదితరులు పాల్గొన్నారు. -
రూటు మార్చిన ఎర్రదొంగలు
⇒ మదనపల్లె కేంద్రంగా అక్రమ రవాణా ⇒ బెంగళూరు, చెన్నైకి తరలుతున్న ఎర్రచందనం మదనపల్లె టౌన్ : జిల్లాలో ఎర్రచందనం దొంగలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడ దాడులు చేసి పెద్ద సంఖ్యలో ఎర్రకూలీలను, స్మగ్లర్లను అరెస్టు చేస్తున్నారు. కొంతమందిపై పీడీ యాక్టును సైతం నమోదు చేసి జైలుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఎర్రదొంగలు రూటు మార్చారు. మదనపల్లెను కేంద్రంగా చేసుకుని బెంగళూరు, చెన్నైకి ఎర్రచందనం దుంగలను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. వారిని పట్టుకోవడంలో మదనపల్లె ఫారెస్టు అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడేళ్లలో ఒక్క కేసు కూడా నమోదుకాకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. పోలీసులు మాత్రం 72 మంది స్మగ్లర్లను అరెస్టుచేసి వారి నుంచి 13 వాహనాలు, 1490 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.4.16 కోట్లు ఉంటుందని అంచనా. గత నెల 5వ తేదీన నిమ్మనపల్లెలో 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ముఖ్యంగా వైఎస్సార్ కడప జిల్లా, తిరుపతి, జిల్లేళ్ల మంద, కేవీపల్లె, కలకడ, రాయచోటి పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామీణులు, స్మగ్లర్లకు ఎర్రచందనం దుంగలను సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. గుర్రంకొండకు చెందిన కొందరు డ్రైవర్లు వాహనాలను సమకూర్చడంతోపాటు పైలెట్లుగా వ్యవహరిస్తూ మినీ లారీలు, సుమోల్లో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులకు ఎర్రచందనం తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల వీరి కార్యకలాపాలు ఊపందుకున్నట్లు తెలిసింది. అధికారులు నిఘా పెంచినా దొంగలు ముందుగానే సమాచారం అందుకుని ఎప్పటికప్పుడు రూటు మారుస్తూ తమ వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటున్నట్టు సమాచారం. ఇందుకు కొందరు అటవీశాఖ అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఎర్రచందనాన్ని పీలేరు మీదుగా చెన్నైకి తరలించేవారు. పోలీసు అధికారులు వరుస దాడులతోపాటు, ఎన్కౌంటర్లు చేయడంతో రూటుమార్చినట్టు తెలుస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఎఫ్ఆర్వో మాధవరావును వివరణ కోరగా స్మగ్లర్ల కదలికలపై నిఘా పెట్టామన్నారు. కర్ణాటకకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్నట్లు తమకు సమాచారం లేదని తెలిపారు. -
మంత్రి శంకర్‌పై మళ్లీ పీడీయాక్ట్
ఉస్మానియా యూనివర్సిటీ: ఘరాన దొంగ మంత్రి శంకర్‌పై ఓయూ పోలీసులు రెండోసారి పీడీయాక్టు నమోదు చేశారు. ఆదివారం సీఐ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... 1979 నుంచి చోరీలు చేస్తున్న మంత్రి శంకర్ 155 కేసుల్లో నిందితుడు. ఓయూ పోలీసులు 2015లో శంకర్ పై పీడీయాక్టు నమోదు చేసి జైలుకు తరలించారు. ఏడాది పాటు జైలు జీవితాన్ని గడిపి మే నెలలో విడుదలైన శంకర్ మళ్లీ చోరీలు చేస్తున్నాడు. ఇటీవల హబ్సిగూడ స్ట్రీట్ నంబర్.8లో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు శంకర్‌పై రెండవసారి పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్టు చేశారు. మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందిన మంత్రి శంకర్ మూడు పెళ్లిళ్లు చేసుకొని నగరంలో స్థిరపడ్డాడని పోలీసులు తెలిపారు. 11 కేజీల గంజాయి పట్టివేత సీతాఫల్మండి డివిజన్ రవీంద్రనగర్ (పిట్టల బస్తీ)లోని ఓ ఇంటిపై ఓయూ పోలీసులు దాడి చేశారు. 11 కేజీల గంజాయిని పట్టుకొని ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి కథనం ప్రకారం...రవీంద్రనగర్‌లో గంజాయి విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు కామిని సాయి ఇంటిపై దాడి చేసి 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సాయిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్ చేసుకుంటాడు
చాంద్రాయణగుట్ట: పీడీ యాక్ట్‌కు నమోదు చేసి జైలుకు పంపినా.. లెక్క చేయకుండా మళ్లీ ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ ఘరానా దొంగను మాదన్నపేట పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి రూ. 15,77,900ల విలువజేసే 50.90 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... మెదక్ జిల్లా న్యాల్కల్ మండలానికి చెందిన ఉషాల యాదులు అలియాస్ యాది (33) మాదన్నపేట కుర్మగూడలో నివాసం ఉంటున్నాడు. 17 ఏళ్ల వయసప్పుడే తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని చోరీలు మొదలెట్టాడు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని బోయిన్‌పల్లిలో–9, సీసీఎస్‌లో–4, కార్ఖానాలో–1, మొఘల్‌పురాలో–1, సైదాబాద్‌లో–4, నారాయణగూడలో–2, మలక్‌పేటలో–2, చిక్కడపల్లిలో–1, వనస్థలిపురం, జీడిమెట్ల, అల్వాల్, మాదాపూర్, కుషాయిగూడలలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 29 చోరీలు చేశాడు. దీంతో ఇతనిపై గతేడాది మార్చిలో పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన యాదులు మళ్లీ తన పాత పంథాలోనే పయనిస్తున్నాడు. కాగా, చోరీ చేసిన నాలుగు తులాల బంగారు గొలుసును మాదన్నపేట భరత్‌నగర్‌లో విక్రయించేందుకు యత్నిస్తుండగా ఏఎస్సై దానయ్య, కానిస్టేబుళ్లు మౌసిన్, సి.శ్రీనివాసు కలిసి యాదులును అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు ఈ గొలుసు స్థానికంగా చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. పోలీసులు మరింత లోతుగా విచారించగా కేవలం నాలుగు నెలల వ్యవధిలో సంతోష్‌నగర్ డివిజన్‌లోనే ఎనిమిది ఇళ్లల్లో చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. పీడీ యాక్ట్‌ల నమోదుతో కరుడుగట్టిన రౌడీషీటర్లే సత్ప్రవర్తనతో మెలుగుతున్నారని....కాని యాదులు మాత్రం తిరిగి అదే దారిలో పయనించాడని డీసీపీ తెలిపారు. ఇతనిపై మరోసారి పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. సమావేశంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబూరావు, సంతోష్‌నగర్ ఏసీపీ వి.శ్రీనివాసులు, మాదన్నపేట ఇన్స్పెక్టర్ కేపీవీ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక స్మగ్లర్లపై పీడీ యాక్టు
వాహనాల సీజ్.. నిరంతర నిఘా అక్రమ రవాణా నిరోధానికి మెుబైల్ టీమ్స్ సిరిసిల్ల ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్ అధికారులతో సిరిసిల్ల ఆర్డీవో సమావేశం కార్యాచరణకు సంయుక్త బృందాలు సిరిసిల్ల : ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిరోధించేందుకు ఇసుక స్మగ్లర్లపై పీడీ యాక్టును ప్రయోగించాలని గనులశాఖ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఇసుకను అక్రమంగా తరలించేవారు ఎవరైనా సరే కేసు నమోదు చేసి వారిని జైలుకు పంపించాలన్నారు. ఇసుక స్మగ్లర్లు రవాణాశాఖ అధికారులపై బుధవారం తెల్లవారుజామున దాడికి యత్నించిన ఘటనను తీవ్రంగా పరిగణించిన మంత్రి ఈ మేరకు శుక్రవారం సిరిసిల్ల ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌కు ఆదేశాలిచ్చారు. వెంటనే ఆర్డీవో పోలీసు, మైనింగ్, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికార యంత్రాంగం సమష్టిగా ఇసుక అక్రమ రవాణాను నిరోధించాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ పి.సుధాకర్, మైనింగ్ ఏడీ సుధాకర్‌రెడ్డి, సీఐలు శ్రీధర్, శ్రీనివాసరావు, ఎంవీఐ శ్రీనివాస్, మైనింగ్ ఏజీ కిరణ్, తహసీల్దార్లు పవన్, గంగయ్య, రేణుకాదేవి, సదానందం, శ్రీనివాస్, రవీంద్రచారి, ప్రసాద్, రమేశ్, డీటీ దివ్య, ఎస్సైలు మారుతి, శ్రీనివాస్, రాజ్‌కుమార్‌గౌడ్, డీఏఓ వేణు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు – ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇసుక రవాణా చేయాలి. ఆ తరువాత ఏ వాహనంలోనూ రవాణా చేయెుద్దు. ఒకవేళ్ల చేస్తే కేసు నమోదు చేయాలి. – రెవెన్యూ పర్మిట్ లేకుండా ఇసుక రవాణా చేయడం నేరం. నిర్ధిష్ట సమయాల్లో స్థానిక అవసరాలకు పర్మిట్లు జారీ చేయాలి. – సిరిసిల్ల మండలం జిల్లెల్ల వద్ద చెక్‌పోస్ట్‌ను బలోపేతం చేయాలి. – పోలీస్, రెవెన్యూ, మైనింగ్, ఎంవీఐ అధికారులతో మెుబైల్ టీమ్‌ల ఏర్పాటు. – వేయింగ్ బ్రిడ్జిల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు. – ఇసుక క్వారీ వద్దనే ఓవర్ లోడు నియంత్రణ. – ఇసుక నిల్వలు, డంపులున్న భూయజమానిపై కేసు పెట్టాలి. ఆ ఇసుకను వెంటనే వేలం వేసి తరలించాలి. – క్షేత్రస్థాయి పనితీరుపై రోజువారి నివేదికలను కలెక్టర్‌కు అందించాలి. శనివారం నుంచే కార్యాచరణ ప్రారంభించాలని అధికారుల సమావేశంలో నిర్ణయించారు. -
తీరు మారని దొంగపై పీడీ యాక్ట్
దొంగతనాలకు పాల్పడుతూ ప్రవర్తన మార్చుకోని దాసరి నరేష్(27)పై జూబ్లీహిల్స్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. బోరబండ శివగంగ నగర్లో నివసించే దాసరి నరేష్ దొంగతనాలు చేయడంలో దిట్ట. గత కొంత కాలంగా నేరేడ్మెట్, వనస్థలిపురం, హయత్‌నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే అయిదు దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి. ఎన్నిసార్లు జైలుకు వెళ్లినా ఏ మాత్రం ప్రవర్తన మారకపోగా జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కూడా మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నల్లగొండ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన నరేష్ 2013లో హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసి పట్టుబడ్డాడు. ఆ తర్వాత వరుసగా దొంగతనాలకు పాల్పడుతుండటంతో పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. -
అంతర్జాతీయ స్మగ్లర్ అజయ్‌పై పీడీ యాక్టు
చిత్తూరు: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అజయ్ (47)పై పీడీ యాక్టు నమోదుచేయాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కేరళ రాష్ట్రం కాలికట్ జిల్లాలో ఏప్రిల్ 6న అజయ్‌ను చిత్తూరు పోలీసులు అరెస్టుచేశారు. ఎర్రచందనాన్ని దేశవిదేశాలకు సుమారు 200 టన్నుల వరకు అజయ్ స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. ప్రస్తుతం కడప జైలులో ఉన్న అతనిపై పీడీ యాక్డు పెట్టాలన్న పోలీసులు ప్రతిపాదనకు కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. ఇప్పటికే అజయ్‌పై 13 కేసులు నమోదై ఉన్నాయి. -
ఎర్రస్మగ్లర్ వెంకటేశ్‌పై పీడీయాక్ట్ నమోదు
శేషాచలం అటవీప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న జీఎం వెంకటేష్ పై పీడీయాక్ట్ నమోదు చేసినట్లు తిరుచానూరు సీఐ సురేంద్రనాయుడు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు...ఎర్రచందనం కేసులో పట్టుబడిన కర్ణాటక రాష్ట్రం బెంగళూరు జిల్లా , హొస్కోట తాలూకా, జగదానహల్లీ, గోవిందపురం గ్రామానికి చెందిన జి.ఎం. వెంకటేష్ (30), తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులరెడ్డి (33), రేణిగుంట మండలం కురకాల్వకు చెందిన బాలాజీ అలియాస్ బాల (31), తిరుపతిలోని లీలామహల్ వద్ద నివాసం ఉంటున్న హరిబాబు(29)లు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో... 2016 ఏప్రెల్ 7వ తేదీన సాయంత్రం తిరుచానూరు గ్రామ పంచాయితీ సమీపంలోని చైతన్యపురం ప్రైమరీ స్కూల్ సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. రబ్బరుచెట్ల పొదల వద్ద వీరంతా దాంకొని ఉండగా పట్టుకోవడం జరిగింది. ఎర్రచందనం రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్న స్కార్పియోతో పాటు 206 కేజీల బరువు ఉన్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. అయితే జీఎం. వెంకటేష్ గతంలో కూడా తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలోని రేణిగుంట అర్బన్ పీఎస్ , చిత్తూరు జిల్లా పీలేరు పీఎస్, యర్రావారిపాళ్యం పీఎస్, కలకడ పీఎస్ ఇలా 6 కేసుల్లో ఎర్రచందనం అక్రమరవాణా చేస్తూ పట్టుబడ్డాడు. నిందితుడుపై పీటీ ఆరెంట్ అరెస్ట్ కాబడి ప్రస్తుతం తిరుపతి సబ్జైల్లో ఉన్నాడు. ఇలా పలుకేసుల్లో నేరస్థులుగా ఉన్న వెంకటేష్‌పై పీడీ యాక్ట్ నమోదు చేస్తూ అర్బన్ జిల్లా పోలీసులు కలెక్టర్ సిద్దార్థజైన్‌కు సిఫార్సు చేశారు. ఈ సిఫార్సు మేరకు సోమవారం జీఎం వెంకటేష్‌పై పీడీయాక్ట్ నమోదు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అతని పై పీడీయాక్ట్ నమోదు చేసి తిరుపతి సబ్‌జైల్ నుంచి కడప సెంట్రల్ జైల్‌కు తరలించామన్నారు. -
ముగ్గురు చైన్స్నాచర్లపై పీడీ యాక్టు
హైదరాబాద్: నేరం చేసి అరెస్టు కావడం...బెయిల్ పొంది బయటకు రావడం...మళ్లీ అదే పంథా కొనసాగిస్తూ ప్రజలను భయభాంత్రులకు గురి చేస్తున్న ముగ్గురు కరుడుగట్టిన చైన్స్నాచర్లపై సైబరాబాద్ పోలీసులు శుక్రవారం పీడీ యాక్ట్ నమోదు చేసి నిర్భంధంలోకి తీసుకున్నారు. జంట పోలీసు కమిషనరేట్లతో పాటు మెదక్ జిల్లాలో చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలు చేస్తున్న బీదర్‌కు చెందిన టకీ ఆలీ, సల్మాన్ ఆలీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన గోవింద్‌లపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ నమోదు చేశారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లకు సంబంధించి 66 కేసుల్లో ప్రమేయమున్న టకీఆలీ, 113 కేసుల్లో ప్రమేయమున్న సల్మాన్ అలీ కొంతమంది చైన్స్నాచర్లకు సారథ్యం వహిస్తున్నారు. రాజేంద్రనగర్ శాస్త్రిపురంలో నివాసముంటున్న గోవింద్ జంట పోలీసు కమిషనరేట్లలో 27 చైన్ స్నాచింగ్‌లు చేసి ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాడని సైబరాబాద్ క్రైమ్స్ ఓఎస్డీ నవీన్ కుమార్ తెలిపారు. -
కోర్టు ఉత్తర్వులున్నా ఆగని తవ్వకాలు
► పెదపులిపాక క్వారీ వద్ద ఉద్రిక్తత ► పచ్చనేతకు అండగా పోలీసులు ► గ్రామస్తులు, టీడీపీ నేతల ఆందోళన పెనమలూరు : పెదపులిపాక క్వారీలో ఇసుక తవ్వకాలు నిలుపుదల చేయాలని హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు. కోర్టు ఉత్తర్వులు గ్రామస్తులు శనివారం అధికారులకు,పోలీసులకు అందజేసినా తమకు కోర్టు నుంచి ఉత్తర్వులు నేరుగా రానందున తవ్వకాలు ఆపేదిలేదని పోలీసులు దగ్గర ఉండి ఇసుక తవ్వకాలు చేశారు. పచ్చనేతకు పోలీసులు అండగా ఉండడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో క్వారీ వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. పెదపులిపాక ఇసుక క్వారీలో పెనమలూరు నియోజకవర ్గ ముఖ్యనేత దాదాపు ఆరు యంత్రాలను కృష్ణానదిలో దించి అడ్డగోలుగా లోడింగ్ చేయిస్తున్నారు. దీనిపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేయగా పీడీ యాక్టు పెట్టిస్తామని పోలీసులతో బెదిరించారు. దీంతో గ్రామస్తుల సహకారంతో వల్లూరు శ్రీమన్నారాయణ(బీజేపీ), ముసునూరు శ్రీనివాసరావు(టీడీపీ) న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించడంతో ఈనెల 28న తవ్వకాలు నిలిపివేయాలని కోర్టు స్టే మంజూరు చేసింది. ఆగని ఇసుక తవ్వకాలు కోర్టు స్టే ఉత్తర్వులను గ్రామస్తులు శనివారం అన్ని శాఖల అధికారులకు అందజేశారు. అయితే లారీలు క్వారీ వద్దకు రావడంతో కోర్టు స్టే ఇచ్చిందని తిరిగి వెళ్లిపోవాలని వాహనదారులను గ్రామస్తులు కోరడంతో చాలా వాహనాలు తిరిగి వెళ్లిపోయాయి. ఈ సమాచారం తెలుసుకున్న పచ్చనేత పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఇసుక లోడింగ్ ఆగిందన్న సమాచారంతో తూర్పు డివిజన్ ఏసీపీ విజయభాస్కర్, సెంట్రల్ ఏసీపీ సత్యానందం క్వారీ వద్దకు వచ్చి స్టే ఉత్తర్వులు తమకు అందలేదని వాహనాలు నిలపవద్దని గ్రామస్తులకు సూచించారు. తాము టీడీపీకి చెందిన వారమేనని నియోజకవర్గ నేత ఆగడాల వల్లఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. యంత్రాలతో తవ్వడంతో ఇసుకతోపాటు మట్టి కూడా వస్తుందని, భూగర్బ జలాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పీడీ యాక్టు పెడతామని బెదిరింపులకు పాల్పడటం న్యాయం కాదని,తాము ఉగ్రవాదులం కాదని గ్రామస్తులు పోలీసులకు వివరించారు. అయినా పోలీసులు తమకు నేరుగా ఉత్తర్వులు అందలేదని సాకు చూపి ఇసుక వాహనాలను దగ్గరుండి పంపించారు. చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తాం పెదపులిపాక గ్రామస్తులను ఇబ్బందులు పెడుతున్న టీడీపీ నియోజకవర్గ ముఖ్యనేతపై సీఎం చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేస్తామని పెదపులిపాక టీడీపీ నేతలు, గ్రామస్తులు విలేకరులకు తెలిపారు. తమ గ్రామాన్ని సర్వనాశనం చేసేందుకు టీడీపీ ముఖ్యనేత కంకణం కట్టుకున్నాడని ఆరోపించారు. టీడీపీ నేతకు అండగా ఉన్న పోలీసులపై కోర్టు ధిక్కార కేసు కూడా వేస్తామన్నారు. -
సినీహీరో ఉదయ్‌కిరణ్‌పై పీడీ యాక్ట్
హైదరాబాద్: మొదటిసారిగా నగర పోలీసులు సినీ హీరోపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో, కాకినాడ, మాదాపూర్ పోలీస్స్టేషన్ల పరిధిలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సినీ హీరో నండూరి ఉదయ్‌కిరణ్(30)పై జూబ్లీహిల్స్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. గత నెల 23వ తేదీ రాత్రి జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్ ఓవర్ ద మూన్ పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా సిబ్బందిని బెదిరించి హంగామా చేసిన ఘటనలో అరెస్టయ్యి చంచల్‌గూడ జైలులో ఉన్న ఉదయ్‌కిరణ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి ఆ మేరకు శనివారం జైలులోనే ఆయనకు నోటీసు కూడా జారీ చేశారు. మాదాపూర్ ఫార్చూన్ టవర్స్‌లో నివసించే ఉదయ్కిరణ్ది తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీలోని కమలాదేవి వీధి గాంధీనగర్. సినిమాలపై మోజుతో నగరానికి వచ్చి మూడు సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. తల్లి హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వాస్పత్రిలో హెడ్‌నర్స్‌గా పని చేస్తున్నారు. అమ్మాయిలతో జల్సాలు, డ్రగ్స్, మద్యం, పబ్‌లు, క్లబ్‌లు, జూదం అలవాటుపడ్డ ఉదయ్‌కిరణ్ డ్రగ్స్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నిందితుడిగా ఉన్నాడు. మొత్తం 10 కేసుల్లో ఆయన నిందితుడు. మాదాపూర్ పీఎస్‌లో నిర్భయచట్టం కింద కేసు నమోదై ఉంది. కాకినాడ వన్‌టౌన్, టుటౌన్ పోలీస్ స్టేషన్లలోనూ కేసులు నమోదై ఉన్నాయి. దీంతో పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. -
ఇసుక మాఫియాపై ఉక్కు పాదం
►ఐజీ ఎన్.సంజయ్ మాదిపాడులో చెక్‌పోస్టు ప్రారంభం ►ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, ఉచితంగా ఇసుకను వినియోగించుకోవాలి ►జిల్లాలో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు మాదిపాడు (అచ్చంపేట) రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా,ఉచితంగా ఇసుకను వినియోగించుకోవచ్చని, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని గుంటూరు రేంజి ఐజీ ఎన్.సంజయ్ అన్నారు. మండలంలోని మాదిపాడు వద్ద సోమవారం ఆయన ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలి వెళ్లకుండా చెక్ పోస్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలి వెళ్లకుండా గుంటూరు జిల్లాలో ఆరు చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని పొందుగల, తంగెడ, నాగార్జున సాగర్, మాదిపాడు, గోవిందాపురం, జట్టిపాలెంల వద్ద చెక్ పోస్టులు ప్రారంభించామని చెప్పారు. ఈ చెక్ పోస్టుల వద్ద పోలీస్ సిబ్బంది 24 గంటలు నిఘా ఉంచుతారని చెప్పారు. మోతాదు మించి రవాణా చేయడం, ఇసుకను నిల్వ ఉంచడం నేరమన్నారు. ఒక్కసారి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాన్ని వదిలేది లేదని, పిడియాక్ట్ కింద వేలం పెడతామన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు గ్రామ ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. నిబంధనలను అతిక్రమించినా, గూండాగిరి చేసినా ఉపేక్షించేది లేదన్నారు. ప్రకటించిన రీచ్‌లలోనే ఇసుక రవాణా చేసుకోవాలన్నారు. లోడింగ్, ట్రాన్స్‌పోర్టు చార్జీలను మాత్రమే వినియోగదారుల నుంచి వసూలు చేయవలసి ఉంటుందని, అంతకు మించి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయండి మీమీ గ్రామాల్లో, ప్రాంతాల్లో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా రవాణా చేసినట్లయితే వెంటనే 18005994599 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణాను పట్టించిన వారికి బహుమతులను ఇస్తామని, బాధ్యతాయుతంగా పనిచేసిన పోలీస్ సిబ్బందికి రివార్దులు ఇస్తామని చెప్పారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా రూరల్ ఎస్పీ నారాయణ్‌నాయక్, సత్తెనపల్లి డీఎస్సీ ఎం.మధుసూదనరావు, సీఐ కోటేశ్వరరావు, అచ్చంపేట ఎస్ఐ గుడి రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు. పొందుగలలో పోలీస్ ఔట్‌పోస్టు ప్రారంభం పొందుగల(దాచేపల్లి) : మండలంలోని పొందుగల గ్రామంలో పోలీస్ ఔట్‌పోస్ట్‌ను మంగళవారం ఐజి ఎన్.సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిందని, ఇసుక నిజమైన లబ్ధిదారుడికి అందేలా తమవంతు చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుకను అక్రమంగా రాష్ట్రం దాటి తరలించినా,ఇసుక నిల్వలకు పాల్పడినా చర్యలు తప్పవన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకే ఇక్కడ చెక్‌పోస్ట్ ఏర్పాటుచేశామన్నారు. ఐజీ వెంట జిల్లా రూరల్ ఎస్పీ కె. నారాయణ్‌నాయక్, డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ ఆళహరి శ్రీనివాసరావు తదితరులున్నారు. -
టీడీపీ నేత రాఘవులు నాయుడిపై పీడీ యాక్ట్
- ఆదేశాలు జారీ చేసిన చిత్తూరు కలెక్టర్ - ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యం చంద్రగిరి (చిత్తూరు): ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు రాఘవులు నాయుడిపై ఆదివారం పీడీ యాక్ట్ నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెకు కూతవేటు దూరంలో ఉన్న బందార్లపల్లె గ్రామానికి చెందిన రాఘవులు నాయుడు కొన్నేళ్లుగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇతడు తిరుపతి, బెంగళూరు, విజయవాడ సమీప ప్రాంతాల్లో రూ.కోట్ల విలువైప ఆస్తులను సంపాదించాడని ఆరోపణలున్నాయి. ఫిబ్రవరి నాలుగో తేదీన చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లె సమీపంలో ఎర్రచందనం దుంగలను తరలించేందుకు సిద్ధం చేస్తుండగా రాఘవులునాయుడును పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. అప్పటినుంచి అతడు తిరుపతి సబ్‌జైలులో ఉన్నాడు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి రాఘవులునాయుడుపై పలు కేసులు ఉండటంతో అతనిపై పీడీ యాక్టు నమోదు చేస్తూ కలెక్టర్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారని చంద్రగిరి సీఐ శివప్రసాద్ తెలిపారు. అనంతరం రాఘవులునాయుడును తిరుపతి సబ్‌జైలు నుంచి కడప సెంట్రల్ జై లుకు తరలించారు. -
ఇసుక స్మగ్లింగ్ చేస్తే కఠిన చర్యలు
► స్మగ్లర్లపై క్రిమినల్ కేసులు ► మూడుసార్లు తప్పు చేస్తే పీడీ యాక్ట్ ► అధికారులకు కలెక్టర్ కోన శశిధర్ ఆదేశం ► ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 6401 అనంతపురం అర్బన్ : ఇసుకను ఎవరైనా ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోన శశిధర్ హెచ్చరించారు. క్రిమినల్ కేసులు పెట్టి, వాహనాలు సీజ్ చేయాలని, మూడు సార్లు తప్పు చేస్తే పీడీ యాక్ట్ ప్రయోగించాలని అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబరు 1800 425 6401 ఏర్పాటు చేశామన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్డీఓలు, డీఎస్పీలతో ఇసుక విధానంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానం పక్కదారి పట్టకూడదన్నారు. జిల్లాలో కంబదూరు మండలం చెన్నంపల్లిలో మూడు రీచ్‌లు, రాంపురం, రామగిరి మండలం పేరూరు, బ్రహ్మసముద్రం మండలం అంజినయ్యదొడ్డి, కన్నపల్లి, కాళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రంలో రెండు రీచ్‌లు మొత్తం తొమ్మిది రీచ్‌లలో ఒక మీటరు లోపు కూలీల చేత ఉచిత ఇసుకను తవ్వకోవచ్చన్నారు. ముదిగుబ్బ మండలం పెద్ద చిగుల్ల రేవు, శింగనమల మండలం ఉల్లికల్లు, తాడిపత్రి మండలం చిన్న చిగుల్ల రేవుల్లో యంత్రాలతో ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణానికి ఒక మీటరు లోపున ఇసుక తవ్వుకోవచ్చన్నారు. ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఇసుక తవ్వకాలు జరగాలన్నారు. రాత్రి తొమ్మిది గంటల తరువాత ఇసుక రవాణా చేసే వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. యంత్రాలతో తవ్వే రీచ్‌ల్లో ఇసుకను తీసుకెళ్లే వాహనాలకు జీపీఎస్ (గ్లోబెల్ పోజిషనింగ్ సిస్టం) అమర్చాలని ఆదేశించారు. రీచ్‌ల వద్ద స్థానికుల గుత్తాధిపత్యం లేకుండా చూడాలన్నారు. ఇసుక వాహనాలను, రవాణా ధరను స్వచ్ఛందంగా డీటీసీ వద్ద లేదా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించే వె సులుబాటు కల్పించాలన్నారు. -
‘ఎక్సైజ్’ ఎక్సర్సైజ్ !
సారా అంతానికి కసరత్తు సారా త యారవుతున్న గ్రామాలు 241 ఏ క్లాస్ సెంటర్లు 37, బీ క్లాస్ సెంటర్లు 58, సీ క్లాస్ సెంటర్లు 145 తయారీ మానకపోతే పీడీ యాక్టుల నమోదు ఇప్పటికే 400 మందిపై బైండోవర్ కేసులు ఏప్రిల్ నాటికి సారా రహిత జిల్లా చేస్తామంటున్న ఎక్సైజ్ శాఖ చిత్తూరు: జిల్లాలో నాటుసారా కనిపించకుండా చేయాలని ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. సారా తయారీదారులపై పీడీ యాక్టు నమోదు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సారా తయారీ గ్రామాలు, తయారీదారుల జాబితాలను ఆ శాఖ సిద్ధం చేసింది. 400 మంది సారా తయారీదారులపై లక్ష రూపాయల పూచీకత్తుతో బైండోవర్ కేసులు కూడా నమో దు చేసింది. నవోదయం కార్యక్రమం పేరుతో చిత్తూరును సారా రహిత జిల్లా చేయాలని ఎక్సైజ్ శాఖ సంకల్పించింది. ఫిబ్రవరి 1 నుంచే ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించారు. తొలుత సారా తయారీ కేంద్రాలు, తయారీదారులను గుర్తించారు. వీటిని ఏ,బీ,సీలుగా విభజించారు. జిల్లా వ్యాప్తంగా ఏ- క్లాస్ సారా తయారీ కేంద్రాలు 37 ఉండగా, 59 బీ-క్లాస్, 145 సీ - క్లాస్ తయారీ కేంద్రాలున్నాయి. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో సారా తయారీ కేంద్రాలు అధికంగా ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఏప్రిల్ చివరి నాటికి జిల్లాలో నాటుసారా లేకుండా చేయాలని ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. తొలుత నాటుసారా తయారీ గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టనున్నారు. పోలీసు, రెవెన్యూ, న్యాయ విభాగాలతోపాటు వివిధ శాఖల అధికారులతో కలిసి చైతన్యకార్యక్రమాలు నిర్వహించనున్నారు. సారా తయారీ వల్ల నష్టాలు, కష్టాలు వివరించడంతో పాటు తయారీ నేరమనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 15 నుంచి సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ శాఖ తొలి విడత దాడులు నిర్వహించనుంది. రెండుమార్లు పట్టుబడిన సారా తయారీదారులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేయనున్నారు. మరోవైపు సారా రహిత చిత్తూరు జిల్లా చేయాలని కలెక్టర్ పలువురు అధికారులతో స్టడీ టీమ్ ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌లో న్యాయమూర్తి, తహశీల్దార్, షుగర్ కేన్ కమిషనర్, మార్కెఫెడ్ ఎండీ, కమర్షియల్ ట్యాక్స్ అధికారితో పాటు పలు శాఖల అధికారులు ఉన్నారు. కుప్పంతో పాటు పలు నియోజకవర్గాల పరిధిలో అధికార పార్టీ ముఖ్య నేతలే నాటుసారా తయారీలో కీలక భూమిక పోషిస్తున్న విషయం అధికారుల మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. నాటుసారా తయారీకి ఎట్టి పరిస్థితిలోనూ అడ్డుకట్ట వేయాలని, అవసరమైతే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి జిల్లా కలెక్టర్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు నాటుసారా తయారీకి నల్లబెల్లం అధికంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో బెల్లాన్ని నాటుసారా వ్యాపారులు కాకుండా ప్రభుత్వమే రైతుల నుంచి కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ సిద్థార్థ్‌జైన్ షుగర్ కేన్, మార్కెఫెడ్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నాటికి చిత్తూరును సారా రహిత జిల్లాగా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చిత్తూరు ఎక్సైజ్ శాఖ డీసీ సత్యప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. నాటుసారా తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొ న్నారు. తయారీ ఆపకపోతే పీడీ యాక్టులు తప్పవన్నారు. -
రికవరీ @79%
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది సొత్తు సంబంధ నేరాలు తగ్గాయి. దోపిడీకి గురైన సొత్తులో అత్యధికంగా 79 శాతం రికవరీ అయింది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. సొత్తు స్వాధీనంలో హైదరాబాద్ వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది నమోదైన నేరాల్లో అత్యధికంగా 62 శాతం బాడ్లీ క్రైమ్ (అత్యాచారాలు, భౌతిక దాడులు, హత్యలు..) చోటుచేసుకున్నాయి. ఆ తర్వాతి స్థానంలో 16 శాతంతో సొత్తు సంబంధ నేరాలు, 12 శాతం రోడ్డు ప్రమాదాలు, 8 శాతం మహిళలపై నేరాలు, రెండు శాతం భూకేసులు నమోదయ్యాయి. ఈమేరకు సైబరాబాద్ క్రైమ్ వార్షిక నివేదికను కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం వెల్లడించారు. - సాక్షి, హైదరాబాద్ * ‘సొత్తు’ స్వాధీనంలో సైబరాబాద్ హ్యాట్రిక్ * రికవరీలో రాష్ర్టంలోనే నెంబర్ వన్ * ప్రాపర్టీ ఆఫెండర్స్ల నుంచి 79 శాతం వసూలు * మహిళలపై పెరిగిన నేరాలు, రోడ్డు ప్రమాదాల్లో సైతం పెరుగుదల * కబ్జాదారులపై పీడీ యాక్ట్ * వార్షిక సమావేశంలో సీపీ సీవీ ఆనంద్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘ఎఫెక్టివ్ పోలీసింగ్‌తో గత మూడేళ్లలో ఏటికేడు సొత్తు సంబంధ నేరాలు తగ్గాయి. 2013లో 6,218, 2014లో 5,404, 2015లో 4,980 ప్రాపర్టీ క్రైమ్స్ జరిగాయి. ఆయా కేసుల్లో నిందితులను పట్టుకోవడంతో పాటు సొత్తు భారీ స్థాయిలోనే స్వాధీనం చేసుకున్నాం. 2013లో 76 శాతం, 2014లో 75 శాతం రికవరీ చేసిన మేం ఈసారి 79 శాతం సాధించాం. మొత్తంగా 28.80 కోట్లు నష్టపోతే రూ.22.61 కోట్లు స్వాధీనం చేసుకున్నాం. రాష్ట్రంలోనే ఇదే అత్యధిక రికవరీ. అంతకుముందు రెండేళ్లలో తొలి వరుసలోనే ఉన్న మేం ఈసారి కూడా ఆ స్థానాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ సాధించడం ఆనందంగా ఉంద’ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. 2015కు సంబంధించి వార్షిక వివరాలు వెల్లడించేందుకు మంగళవారం ఆయన గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా నేరాల నమోదు తీరుతెన్నుల నివేదికలను విడుదల చేశారు. సీవీ ఆనంద్ మాట్లాడుతూ...ఈ ఏడాది కస్టోడియల్ డెత్‌లు, ఎక్కడా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని, పోలీసుల పనితీరుపై ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా తగ్గాయన్నారు. ‘ఈ ఏడాది నమోదైన నేరాల్లో అత్యధికంగా 62 శాతం బాడ్లీ క్రైమ్ చోటుచేసుకున్నాయి. ఆ తర్వాతి స్థానంలో 16 శాతంతో సొత్తు సంబంధ నేరాలు, 12 శాతం రోడ్డు ప్రమాదాలు, ఎనిమిది శాతంతో మహిళలపై నేరాలు, రెండు శాతం భూకేసులు నమోదయ్యా’యని తెలిపారు. లెక్కకు మించి కేసులు... అయితే ఈ ఏడాది సైబరాబాద్‌లో అత్యధికంగా 30,527 కేసులు నమోదుచేశామన్న ఆయన...ఎల్బీనగర్ జోన్లో అత్యధికంగా 8670 ఉన్నాయన్నారు. ఎల్బీనగర్ పోలీసు స్టేషన్లో అత్యధికంగా 1,590 కేసులు నమోదుకాగా, తక్కువగా కందుకూర్ పోలీస్‌స్టేషన్‌లో 269 నమోదయ్యాయని తెలిపారు. విస్తీర్ణంలో రెండో అతి పెద్ద కమిషనరేట్ అయిన సైబరాబాద్‌లో పోలీసు సిబ్బంది సంఖ్య పెంచాల్సిన అవసరముందని తెలిపారు. ప్రస్తుతం సిబ్బంది తక్కువగానే ఉన్నా నేరాలు నియంత్రించడంలో సైబరాబాద్ పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. చైన్‌స్నాచింగ్‌లు తగ్గాయి... శివ ఎన్కౌంటర్ తర్వాత సైబరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌లు తగ్గుముఖం పట్టాయి. అయితే అప్పుడప్పుడు ఇరానీ గ్యాంగ్ ముఠాలు రెచ్చిపోయి..మహిళల మెడలో నుంచి గొలుసు లాగే ప్రయత్నంలో కిందకు నెట్టేస్తున్నారు. దీంతో వారు గాయపడి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తోంది. అం దుకే హింస తీవ్రత పెరగడంతో నవంబర్ నుంచి చైన్స్నాచర్లపై దోపిడీ కేసు నమోదుచేస్తున్నాం. నవంబర్, డిసెంబర్లలో ఇప్పటివరకు 16 కేసులు రాబరీ కింద నమోదు చేశాం. గతేడాది 793 చైన్ స్నాచింగ్‌లు జరిగితే ఈసారి 372 జరిగాయి. దాదాపు 53 శాతం తగ్గిన ఈ చైన్ స్నాచింగ్ కేసుల్లో దాదాపు 290 కేసుల్లో నిందితులను అరెస్టు చేశారు. ఇరానీ గ్యాంగ్ ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి భారీ సంఖ్యలో సొత్తు కూడా స్వాధీనం చేసుకున్నామని సీవీ ఆనంద్ తెలిపారు. షీటీమ్స్ ద్వారా 660 కేసులు నమోదు చేశామని, 825 మందిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చామని చెప్పారు. 658 భూ తగాదా కేసుల్లో ఇప్పటివరకు 60 మందిపై పీడీ యాక్ట్ పెట్టామని వివరించారు. సైబర్‌పై ప్రత్యేక దృష్టి... ఈసారి సైబర్ నేరాలు తగ్గాయి. జీడీఎస్ రూపంలో ఎంట్రీ చేసి, ఇప్పటివరకు 800 కేసుల్లో బాధితులకు న్యాయం చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేషన్ బియ్యం కుంభకోణంతో పాటు నకిలీ క్రెడిట్ కార్డు, పాన్‌కార్డు, ఓటరు ఐడీ కార్డు కేసుల్లో ఎస్వోటీ బృందం సమర్థంగా పనిచేసింది. 2192 కేసుల్లో రూ.23కోట్ల 34 లక్షల 87వేల 260ల సొత్తును స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ ఈ చలాన్ సిస్టమ్ వల్ల జంట పోలీసు కమిషనరేట్లలో ట్రాఫిక్ ఉల్లంఘనులు ఇట్టే దొరికిపోతున్నారని, దీనివల్ల దాదాపు 5.4 లక్షల కేసులు పెరిగాయన్నారు. ఠాణాల ఆధునీకరణపై దృష్టి ఇప్పటికే సైబరాబాద్ పరిధిలోని ఠాణాల ఆధునీకరణపై దృష్టి పెట్టామని, బాధితులకు సాంత్వన చేకూర్చడంతో పాటు పోలీసుల పనితీరును గమనించేందుకు పోలీసు స్టేషన్లలోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు కమ్యూనిటీల్లో ప్రజల సహకారంతో 2000 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు. హైవేస్పైనే అధికం... సైబరాబాద్ పరిధిలో రోడ్డు ప్రమాదాల్లో 18 శాతం పెరుగుదల కనిపించిందని, గతేడాది 3293 జరిగితే ఈసారి 3896 చోటుచేసుకున్నట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ ఏడాది ప్రమాదాల్లో 1156 మంది మృతి చెందగా 3,499 మంది గాయపడ్డారు. అయితే ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు పది హైవేల్లో జరిగిన ప్రమాదాల్లోనే దాదాపు 536 మంది మృతి చెందారు. అంటే అంతర్గత రహదారుల్లో 620 మంది చనిపోయారు. వచ్చే ఏడాదిలో ఈప్రమాదాలు తగ్గముఖం పడతాయని ట్రాఫిక్ డీసీపీ అవినాశ్ మహంతి అన్నారు. ‘ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరిస్తే వారి ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. ఇప్పటికే 75 వేల మందికి హెల్మెట్ జరిమానా విధించామ’ని ఆయన తెలిపారు. ఈ వార్షిక సమావేశంలో క్రైమ్స్ ఓఎస్డీ నవీన్‌కుమార్, ఐదు జోన్ల డీసీపీలు, ఏసీపీలు, ట్రాఫిక్ ఏసీపీలు పాల్గొన్నారు. -
‘సొత్తు’ స్వాధీనంలో సైబరాబాద్ హ్యాట్రిక్
‘సొత్తు’ స్వాధీనంలో సైబరాబాద్ హ్యాట్రిక్ రికవరీలో రాష్ర్టంలోనే నెంబర్ వన్ {పాపర్టీ అఫెండర్ల నుంచి 79 శాతం వసూలు మహిళలపై పెరిగిన నేరాలు, రోడ్డు ప్రమాదాల్లో సైతం పెరుగుదల కబ్జాదారులపై పీడీ యాక్ట్ వార్షిక సమావేశంలో సీపీ సీవీ ఆనంద్ వెల్లడి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది సొత్తు సంబంధ నేరాలు తగ్గాయి. దోపిడీకి గురైన సొత్తులో అత్యధికంగా 79 శాతం రికవరీ అయింది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. వరుసగా మూడోసారి సొత్తు స్వాధీనంలో అగ్రస్థానంలో నిలిచిన సైబరాబాద్ హ్యాట్రిక్ సాధించింది. ఈ ఏడాది నమోదైన నేరాల్లో అత్యధికంగా 62 శాతం బాడ్లీ క్రైమ్(అత్యాచారాలు, భౌతిక దాడులు, హత్యలు..ఒక రకంగా చెప్పాలంటే శరీరానికి హాని కలిగించే కేసులన్నీ..) చోటుచేసుకున్నాయి. ఆ తర్వాతి స్థానంలో 16 శాతంతో సొత్తు సంబంధ నేరాలు, 12 శాతం రోడ్డు ప్రమాదాలు, ఎనిమిది శాతం మహిళలపై నేరాలు, రెండు శాతం భూకేసులు నమోదయ్యాయి. ఈమేరకు సైబర్‌బాద్ క్రైమ్ వార్షిక నివేదికను కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. - సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: ‘ఎఫెక్టివ్ పోలీసింగ్‌తో గత మూడేళ్లలో ఏటికేడు సొత్తు సంబంధ నేరాలు తగ్గాయి. 2013లో 6,218, 2014లో 5,404, 2015లో 4,980 ప్రాపర్టీ క్రైమ్స్ జరిగాయి. ఆయా కేసుల్లో నిందితులను పట్టుకోవడంతో పాటు సొత్తు భారీ స్థాయిలోనే స్వాధీనం చేసుకున్నాం. 2013లో 76 శాతం, 2014లో 75 శాతం రికవరీ చేసిన మేం ఈసారి 79 శాతం సాధించాం. మొత్తంగా 28.80 కోట్లు నష్టపోతే రూ.22.61 కోట్లు స్వాధీనం చేసుకున్నాం. రాష్ట్రంలోనే ఇదే అత్యధిక రికవరీ. అంతకుముందు రెండేళ్లలో తొలి వరుసలోనే ఉన్న మేం ఈసారి కూడా ఆ స్థానాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ సాధించడం ఆనందంగా ఉంద’ని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. 2015కు సంబంధించి వార్షిక వివరాలు వెల్లడించేందుకు మంగళవారం ఆయన గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా నేరాల నమోదు తీరుతెన్నుల నివేదికల్ని విడుదల చేశారు. సీవీ ఆనంద్ మాట్లాడుతూ...ఈ ఏడాది కస్టోడియల్ డెత్‌లు, ఎక్కడా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని, పోలీసుల పనితీరుపై ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా తగ్గాయన్నారు. ‘ఈ ఏడాది నమోదైన నేరాల్లో అత్యధికంగా 62 శాతం బాడ్లీ క్రైమ్ చోటుచేసుకున్నాయి. ఆ తర్వాతి స్థానంలో 16 శాతంతో సొత్తు సంబంధ నేరాలు, 12 శాతం రోడ్డు ప్రమాదాలు, ఎనిమిది శాతంతో మహిళలపై నేరాలు, రెండు శాతం భూకేసులు నమోదయ్యా’యని తెలిపారు. లెక్కకు మించి కేసులు... అయితే ఈ ఏడాది సైబరాబాద్‌లో అత్యధికంగా 30,527 కేసులు నమోదుచేశామన్న ఆయన...ఎల్బీనగర్ జోన్లో అత్యధికంగా 8670 ఉన్నాయన్నారు. ఎల్బీనగర్ పోలీసు స్టేషన్లో అత్యధికంగా 1,590 కేసులు నమోదుకాగా, తక్కువగా కందుకూర్ పోలీసు స్టేషన్లో 269 నమోదయ్యాయని తెలిపారు. విస్తీర్ణంలో రెండో అతి పెద్ద కమిషనరేట్ అయిన సైబరాబాద్‌లో పోలీసు సిబ్బంది సంఖ్య పెంచాల్సిన అవసరముందని తెలిపారు. ప్రస్తుతం సిబ్బంది తక్కువగానే ఉన్నా నేరాలు నియంత్రించడంలో సైబరాబాద్ పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. చైన్‌స్నాచింగ్‌లు తగ్గాయి... శివ ఎన్కౌంటర్ తర్వాత సైబరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌లు తగ్గుముఖం పట్టాయి. అయితే అప్పుడప్పుడు ఇరానీ గ్యాంగ్ ముఠాలు రెచ్చిపోయి..మహిళల మెడలో నుంచి గొలుసు లాగే ప్రయత్నంలో కిందకు నెట్టేస్తున్నారు. దీంతో వారు గాయపడి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తోంది. అం దుకే హింస తీవ్రత పెరగడంతో నవంబర్ నుంచి చైన్స్నాచర్లపై దోపిడీ కేసు నమోదుచేస్తున్నాం. నవంబర్, డిసెంబర్లలో ఇప్పటివరకు 16 కేసులు రాబరీ కింద నమోదు చేశాం. గతేడాది 793 చైన్ స్నాచింగ్‌లు జరిగితే ఈసారి 372 జరిగాయి. దాదాపు 53 శాతం తగ్గిన ఈ చైన్ స్నాచింగ్ కేసుల్లో దాదాపు 290 కేసుల్లో నిందితులను అరెస్టు చేశారు. ఇరానీ గ్యాంగ్ ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి భారీ సంఖ్యలో సొత్తు కూడా స్వాధీనం చేసుకున్నామని సీవీ ఆనంద్ తెలిపారు. షీటీమ్స్ ద్వారా 660 కేసులు నమోదు చేశామని, 825 మందిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చామని చెప్పారు. 658 భూ తగాదా కేసుల్లో ఇప్పటివరకు 60 మందిపై పీడీ యాక్ట్ పెట్టామని వివరించారు. సైబర్‌పై ప్రత్యేక దృష్టి... ఈసారి సైబర్ నేరాలు తగ్గాయి. జీడీఎస్ రూపంలో ఎంట్రీ చేసి, ఇప్పటివరకు 800 కేసుల్లో బాధితులకు న్యాయం చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేషన్ బియ్యం కుంభకోణంతో పాటు నకిలీ క్రెడిట్ కార్డు, పాన్‌కార్డు, ఓటరు ఐడీ కార్డు కేసుల్లో ఎస్వోటీ బృందం సమర్థంగా పనిచేసింది. 2192 కేసుల్లో రూ.23కోట్ల 34 లక్షల 87వేల 260ల సొత్తును స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ ఈ చలాన్ సిస్టమ్ వల్ల జంట పోలీసు కమిషనరేట్లలో ట్రాఫిక్ ఉల్లంఘనులు ఇట్టే దొరికిపోతున్నారని, దీనివల్ల దాదాపు 5.4 లక్షల కేసులు పెరిగాయన్నారు. ఠాణాల ఆధునీకరణపై దృష్టి ఇప్పటికే సైబరాబాద్ పరిధిలోని ఠాణాల ఆధునీకరణపై దృష్టి పెట్టామని, బాధితులకు సాంత్వన చేకూర్చడంతో పాటు పోలీసుల పనితీరును గమనించేందుకు పోలీసు స్టేషన్లలోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు కమ్యూనిటీల్లో ప్రజల సహకారంతో 2000 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు. హైవేస్పైనే అధికం... సైబరాబాద్ పరిధిలో రోడ్డు ప్రమాదాల్లో 18 శాతం పెరుగుదల కనిపించిందని, గతేడాది 3293 జరిగితే ఈసారి 3896 చోటుచేసుకున్నట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ ఏడాది ప్రమాదాల్లో 1156 మంది మృతి చెందితే, 3,499 మంది గాయపడ్డారు. అయితే అవుటర్ రింగ్ రోడ్డుతో పాటు పది హైవేల్లో జరిగిన ప్రమాదాల్లోనే దాదాపు 536 మంది మృతి చెందారు. అంటే అంతర్గత రహదారుల్లో 620 మంది చనిపోయారు. వచ్చే ఏడాదిలో ఈప్రమాదాలు తగ్గముఖం పడతాయని ట్రాఫిక్ డీసీపీ అవినాశ్ మహంతి అన్నారు. ‘ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరిస్తే వారి ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. ఇప్పటికే 75 వేల మందికి హెల్మెట్ జరిమానా విధించామ’ని ఆయన తెలిపారు. ఈ వార్షిక సమావేశంలో క్రైమ్స్ ఓఎస్డీ నవీన్‌కుమార్, ఐదు జోన్ల డీసీపీలు, ఏసీపీలు, ట్రాఫిక్ ఏసీపీలు పాల్గొన్నారు. -
మట్కా బీటర్లపై పీడీ యాక్ట్
తాండూరు రూరల్ (రంగారెడ్డి) : మట్కా నిర్వాహకులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు. ఆమె శనివారం మధ్యాహ్నం తాండూరు సర్కిల్ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. శుక్రవారం రాత్రి తాండూరులో పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురిపై కేసులు పెట్టి, రిమాండ్‌కు తరలించాలని సూచించారు. అలాగే కాగ్నా నది నుంచి ఇసుక పర్మిట్లు మండల పరిషత్ అధికారులు జారీ చేస్తున్నందున పర్యవేక్షణ బాధ్యతలు కూడా వారే చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. పర్మిట్లు దుర్వినియోగం కాకుండా చూసుకునే పని వారిదేనని ఎస్పీ అన్నారు. -
ఎర్ర స్మగ్లర్లపై పీడీ యాక్ట్
ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ అరెస్టయిన నలుగురు స్మగ్లర్లపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టు నమోదు చేసి గురువారం కడప జైలుకు తరలించినట్టు చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ అరెస్టయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కర్ణాటకకు చెందిన ఎన్టీ. సతీష్‌కుమార్(45), చిత్తూరుకు చెందిన పటాస్ నిస్సార్ అహ్మద్ ఖాన్ (42), తిరువణ్నామలైకు చెందిన పి. రాజేంద్రన్ (34), తిరునన్వేలికి చెందిన మురుగన్ (42)పై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసి కడప జైలుకు తరలించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 53 మంది ఎర్రచందనం స్మగర్లపై పీడీ యాక్టులు పెట్టామన్నారు. పీడీ యాక్టు నమోదైనవారు మళ్లీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే.. వారిపై రౌడీషీట్లు తెరుస్తామని వివరించారు. ఇప్పటికే 18 మంది స్మగ్లర్లపై రౌడీషీట్లు పెట్టామని వివరించారు. -
పీడీ యాక్టు అమలయ్యేనా?
ఇసుక అక్రమార్కుల విషయంలో గందరగోళం టీడీపీ నేతలపై కేసులు పెడతారా అంటున్న జనం అక్రమార్కుల విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే నంటున్న అధికారులు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలు నవ్వుకునేలా ఉంటున్నాయి. జీవనదుల్లోని ఇసుకకు డిమాండ్ సృష్టించి సొమ్ము చేసుకున్న టీడీపీ నేతలపై అనేక ఆరోపణలున్నాయి. అయితే అక్రమార్కులపై పీడీ (ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్) యాక్టు అమలు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విని అంతా నవ్వుకుంటున్నారు. సామాన్య, మధ్యతరగతి వ్యక్తులు ఇల్లు కట్టుకోవాలంటే ఒకప్పుడు సిమెంట్, ఐరెన్ ధరల్ని చూసి గగ్గోలు పెట్టేవాడు. ఇప్పుడుఇసుక ధరను చూసి బెంబేలెత్తిపోయిన పరిస్థితి. క్యూబిక్ మీటర్‌కు ఇసుక ధరను సృష్టించి, మహిళా సంఘాలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ దీని వెనుక ఎంతమంది బినామీలు, టీడీపీ కార్యకర్తలు, జన్మభూమి కమిటీ సభ్యులు, నేతలు లబ్ధి పొందారో రాష్ట్రవ్యాప్తంగా తెలిసిందే. సీసీ కెమెరాలు, ఆన్లైన్ వ్యవస్థ, జీపీఎస్ సిస్టమ్ అంటూ ఊదరగొట్టినా అవన్నీ ప్రకటనలకేనని, రాత్రి వేళల్లో ఎంత స్థాయిలో ఇసుక అక్రమరవాణా జరుగుతుందో అందరికీ తెలిసిందే. అక్రమాలు పెరిగిపోతుండడంతో పీడీ యాక్టు తప్పదని ప్రభుత్వం ప్రకటించినా అదీ కొన్నాళ్లకే పరిమితమని అధికారులే చెబుతున్నారు. ఇలా జరిగింది.. టీడీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో 32 ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు జరిగాయి. వంశధార, నాగావళి నదుల పరీవాహక ప్రాంతాల్లో రీచ్‌ల్ని ఏర్పాటు చేశారు. సుమారు 10 లక్షల క్యూబిక్ మీటర్ల మేర విక్రయాలు నిర్వహించినప్పటికీ ఇందులో ఎవరి వాటాలు వారికి చేరిపోయాయి. అనధికారికంగా మరో 2 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అక్రమంగా తరలిపోయిందనే ఆరోపణలొచ్చాయి. ఐదు నియోజకవర్గాల్లో అక్రమాలు చోటు చేసుకోగా చాలా ప్రాంతాల్లో టీడీపీ నేతల అనుచరుల ప్రమేయమే బయటపడింది. ఏడాది కాలంలో ఈ అక్రమాలవల్ల ప్రభుత్వానికి కనీసం రూ.10 కోట్లు చేరకుండా పోయిందని అంచనా. కొత్తూరు మండలంలో ఓ రీచ్ నిర్వహించినా అది కొన్నాళ్లే నడిచింది. సుమారు 2,250 క్యూబిక్ మీటర్ల విక్రయాల అనంతరం దాన్ని మూసేశారు. నరసన్నపేట మండలం చేనులవలసలో మరో ర్యాంపు ఏర్పాటు చేస్తే 60 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయాలు చేపట్టగా వాటిలో చాలా మటుకు టీడీపీకి చెందిన కార్యకర్తలే సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలొచ్చాయి. అక్కడ ఏ విధంగా అన్యాయం జరిగిందో కలెక్టర్ సైతం గుర్తించారు. ఆమదాలవలస పరిధిలో సింగూరు, ముద్దాడపేట, తోటాడ పరిధిలో ఇప్పటివరకు రూ.3 కోట్ల అమ్మకాలు జరిగాయని అధికారులు చెబుతుండగా అంతకు రెండింతల అనధికార రవాణా జరిగిందనే విమర్శలున్నాయి. కొన్నాళ్ల క్రితం రేగిడి మండలం కందిశలో, సంతకవిటి మండలం తమరాంలో రీచ్లేర్పాటు చేసినా ఫలితం రాలేదు. పొన్నాడ రేవులో సుమారు 18 వేల క్యూబిక్ మీటర్ల విక్రయించగా రూ.కోటి వరకు ఆదాయం వచ్చింది. ముద్దాడపేటలో సుమారు 42 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయిస్తే సుమారు రూ.2.36కోట్ల ఆదాయం వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. గత ఆగస్టులో ఈ రెండింటినీ నిలిపేసినా అక్రమ రవాణా ఇంకా కొనసాగుతోందని ఇటీవల విజిలెన్స్ అధికారులు చేపట్టిన దాడుల్లో స్పష్టమైంది. రానున్న రోజుల్లో తమరాం, తలవరం, హయాతినగరం రేవుల్లో విక్రయాలు ప్రారంభిస్తామని చెబుతున్నా పొరుగు జిల్లాకే అది పరిమితం అవుతుందని అధికారులే చెబుతున్నారు. హయాతినగరంలో జరిగిన అక్రమాల్ని ‘సాక్షి’ గతంలో వెలుగులోకి తీసుకురావడంతో కొన్నాళ్లు ఇసుక సరఫరా ఆపేశారు. మంత్రి బంధువులు దాని జోలికి వెళ్లకుండా విపక్షపార్టీ నేతలు అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్నా కేసులు నమోదు చేయని అధికారులు..ఇప్పుడు ప్రభుత్వం పీడీ యాక్టు అమలు చేస్తామని ప్రకటించడంతో అంతా నవ్వుకుంటున్నారు. -
నిత్య పెళ్లి కూతురిపై పీడీయాక్ట్
హైదరాబాద్ : జాయింట్ కలెక్టర్‌ను అని నమ్మించి పలు మోసాలకు పాల్పడిన ఓ మహిళపై పోలీసులు పీడీయాక్ట్ కేసు నమోదు చేశారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ జి.వి.రమణగౌడ్ తెలిపిన వివరాలు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తాండ్ర హేమ అలియాస్ శైలు,అలియాస్ రాణి,బుజ్జి అలియాస్ అలేఖ్యారెడ్డి,హేమలత బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి సరూర్‌నగర్‌లో ఉండేది. కూలి పని చేసుకునే ఆమె ఎల్బీనగర్కు చెందిన రవీంద్రను వివాహం చేసుకుంది. కొద్ది కాలంపాటు అతడితో కాపురం చేసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన హేమ భర్త వేధిసున్నాడంటూ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసుపెట్టింది. అనంతరం మోతీనగర్, బోరబండ ప్రాంతానికి వచ్చి జగదీష్‌ను రెండో పెళ్లి చేసుకుని అతడిపై కూడా కేసుపెట్టింది. తర్వాత పూర్ణచందర్‌ను మూడోపెళ్లి చేసుకుని అతనిపైనా కేసు పెట్టింది. చివరగా కరీంనగర్‌కు చెందిన కిశోర్‌ను నాలుగో పెళ్లి చేసుకుంది.ఆ తరువాత రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్,ఆర్.ఐగా పనిచేస్తున్నానని పరిచయం చేసుకుని పలువురిని మోసం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలామంది వద్ద నుంచి భారీమొత్తంలో డబ్బులు వసూలు చేసిందని పోలీసులు తెలిపారు. చివరగా ఆస్తికోసం బంధువులు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన నిత్య పెళ్లి కూతురిని ఫిబ్రవరి 11న ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే తాజాగా ఆమెపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఎల్బీనగర్, ఎస్ఆర్నగర్, జూబ్లీహిల్స్ స్టేషన్లలో ఏడు కేసులు ఉన్నాయన్నారు. -
రాజుసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు
హైదరాబాద్: మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ రాజుసింగ్‌పై నగర పోలీసులు పీడీ యాక్ట్ విధించారు. మంగళ్‌హాట్ ప్రాంతంలో నివసించే రాజుసింగ్‌పై ఒక హత్యకేసుతో పాటు పలు కేసులు ఉన్నాయి. కాగా, ఒక కేసులో చంచల్‌గూడ జైల్లో శిక్ష కూడా అనుభవిస్తున్నాడు. గురువారం పీడీయాక్ట్ ఆదేశాలను చంచల్‌గూడ జైల్లో ఉన్న రాజుసింగ్కు జారీ చేసినట్లు తెలిపారు. పీడీయాక్ట్ విధించడం ద్వారా ఏడాదిపాటు జైల్లోనే ఉండవలసి వస్తుంది. నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ విధిస్తామని ఇన్స్పెక్టర్ ఆర్. శ్రీనివాస్ హెచ్చరించారు. -
డాబా శీనుపై పీడీ యాక్టు
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలో పేరొందిన ఎర్రచందనం స్మగ్లర్ డాబా శీనుపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టును ప్రయోగిస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. బంగారుపాళ్యం మండలం చీకూరిపల్లెకు చెందిన శ్రీనివాసులు (34) అలియాస్ డాబా శీను ఎర్రచందనం స్మగ్లర్. పదో తరగతి వరకు చదువుకున్న అతను 2004 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా వ్యాపారంలో ఉన్నాడు. అతనిపై జిల్లాలో దాదాపు 51 కేసులు ఉన్నాయి. ఇటీవల అతణ్ని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న శీనుపై కలెక్టర్ ఆదేశాల మేరకు పీడీ యాక్టు ప్రయోగించి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. -
'సారా తయారుచేస్తే పీడీ యాక్ట్'
తాండూరు (రంగారెడ్డి) : సారా తయారు చేసినా, విక్రయించినా పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని రాజేంద్రనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ దశరథ్ అన్నారు. మంగళవారం తాండూరులో సారా తయారీ, విక్రయాల నియంత్రణపై సమీక్షా సమావేశం జరిగింది. దీనికి హాజరైన సందర్భంగా దశరథ్ మాట్లాడారు. అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుందని, ఆ లోపే సారా తయారీని పూర్తిగా అరికడతామని చెప్పారు. అక్టోబర్ నుంచి చౌక మద్యం అందుబాటులోకి రానుందని, జిల్లాల్లో కొత్తగా 10 బార్లు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. -
మరో ఇద్దరు ఎర్ర చందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: మరో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరులో ఇరువరానికి చెందిన షేక్ అబ్దుల్ మజీబ్(36), రొంపిచెర్ల మండలం గానుగులచింతకు చెందిన కె.పురుషోత్తంరెడ్డి(28)లపై పలు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. ఆ ఇద్దరు స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు అనుమతించాలని గతేడాది డిసెంబర్ 20న చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీనిపై ఆ ఇద్దరూ తమకు ఎర్రచందనం స్మగ్లింగ్‌తో సంబంధం లేదని, పీడీ చట్టాన్ని ప్రయోగించవద్దని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై విచారించిన పీడీ యాక్ట్ సలహా మండలి ఆ ఇద్దరి దరఖాస్తులను దోచిపుచ్చింది. వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు అనుమతి ఇచ్చింది. -
సాదత్ అహ్మద్‌పై పీడీయాక్ట్
కుత్బుల్లాపూర్: శాంతి భద్రతల విషయంలో పోలీసులకు తలనొప్పి పుట్టిస్తున్న సాదత్ అహ్మద్‌పై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సాదత్‌ను జీడిమెట్ల పోలీసులు ఇటీవలే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం సైబరాబాద్ సీపీ ఆనంద్ ఆదేశాల మేరకు సాదత్‌పై పీడీ యాక్ట్ తెరిచారు. సూరారం కాలనీ షిర్డీ సాయిబాబానగర్‌కు చెందిన సాదత్ అహ్మద్ గతంలో హ్యుమన్ రైట్స్ ఇంటర్నేషనల్ ఎస్ఏ ఆర్గనైజేషన్ పేరుతో తన ఇంటినే అడ్డాగా చేసుకుని కుత్బుల్లాపూర్, దుండిగల్, షాపూర్‌నగర్, జీడిమెట్ల ప్రాంతవాసులను భయబ్రాంతులకు గురి చేసి అక్రమార్జనకు తెర లేపాడు. ఫోర్జరీ, చీటింగ్, మహిళలపై అఘాయిత్యాలు, దాడులు వంటి పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటంతో అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. 2015, నవంబర్ 25న జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు వచ్చిన సాదత్ తన పంథా మార్చుకోకుండా మళ్లీ రోడామిస్త్రీనగర్కు చెందిన ఓ వ్యక్తిని బెదిరించాడు. ఈ కేసులో తాజాగా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. సాదత్ అతిప్రమాదకరమైన వ్యక్తిగా భావించిన పోలీసులు చివరకు పీడీ యాక్ట్ నమోదు చేశారు. -
అక్రమాలపై ఉక్కుపాదం!
* ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రక్షాళనకు సర్కారు కసరత్తు * ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా చర్యలకు ఉపక్రమణ *బోగస్ డీలర్లపై కేసులు, రేషన్ అక్రమార్కులపై పీడీ యాక్ట్ * అక్రమాల నిరోధానికి అక్టోబర్ నుంచి ఈపాస్‌ను ప్రవేశపెట్టే యోచన సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. డూప్లికేట్ కార్డుల తొలగింపు ప్రక్రియను ఇప్పటికే దిగ్విజయంగా పూర్తి చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం బోగస్ డీలర్లు, రీసైక్లింగ్‌కు పాల్పడుతున్న మిల్లర్లు, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. పౌర సరఫరాల శాఖలో పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ ఈ-పాస్(ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలను, సరుకులు సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసేలా కసరత్తు ఆరంభించింది. అక్రమాల్లో అందరూ పాత్రధారులే..! రేషన్ దుకాణాల నిర్వహణ పూర్తిగా బోగస్ డీలర్ల చేతిలోకి వెళ్లిందని, దీనివల్లే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న సరుకులు పక్కదారి పడుతున్నాయని పౌర సరఫరాల శాఖ అంతర్గతంగా ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక సమర్పించింది. జంట నగరాల్లోనే సుమారు 270 మంది బోగస్ డీలర్లు ఉన్నారని, డూప్లికేట్ రేషన్ కార్డుల ద్వారా అక్రమంగా బియ్యాన్ని కర్ణాటక, మహారాష్ట్రకు తరలిస్తున్నారని గుర్తించింది. మొత్తంగా రాష్ట్రంలో 15 నుంచి 20 శాతం సరుకులు పక్కదారి పడుతున్నాయని, ఇందులో అధికారులు సహా, మిల్లర్లు, స్టేజ్-1 కాంట్రాక్టర్లు పాత్రధారులని తేల్చింది. ఎంఎల్ఎస్ పాయింట్‌కు సైతం రాకుండానే 40 శాతం బియ్యం పక్కదారి పడుతోందని నివేదికలో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం అక్రమాల కట్టడికి చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఇటీవల అధికారులు రేషన్ దుకాణాల్లో తనిఖీలు ఆరంభించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 200 దుకాణాలను తనిఖీ చేయగా 50 మందిని బోగస్‌గా తేల్చి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న మిల్లులపైనా దాడులు కొనసాగుతున్నాయి. అక్రమాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. -
గుడుంబాపై ఉక్కుపాదం
వ్యాపారులపై పీడీ యాక్ట్ నల్లబెల్లం, పటిక అమ్మితే శిక్షిస్తాం.. ఎక్సైజ్ అధికారుల హెచ్చరిక వరంగల్‌క్రైం : జిల్లా ఎక్సైజ్ అధికారులు గుడుంబా వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అధికారులు వివిధ శాఖల సమన్వయంతో గ్రామాలు, తండాల్లో గుడుంబాపై అవగాహన సదస్సులు విస్తృ తంగా నిర్వహిస్తూనే.. మరోపక్క రాటుదేలిన గుడుంబా వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వేలాది లీటర్ల గుడుంబాను ధ్వంసం చేయడంతోపాటు నిత్యం దాడులు చేస్తూ గుడుంబా విక్రయదారులు, ముడిసరుకు సరఫరా చేసేవారిని అదుపులోకి తీసుకుంటున్నారు. పెద్దఎత్తున గుడుంబా విక్రయాలు, ముడిసరుకు అమ్మే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొట్టమొదటగా నర్సంపేటకు చెందిన గుడుంబా విక్రయదారుడు ముప్పిడి రమేశ్‌పై మహబూబాబాద్ ఈఎస్టీఎఫ్ పీడీ యూక్ట్ ప్రయోగించి సెంట్రల్ జైలుకు తరలించింది. ముడిసరుకు రవాణాదారుడిపై పీడీ యాక్ట్ హన్మకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో విరివిగా నల్లబెల్లం, పటికను సరఫరా చేస్తున్న పరకాలకు చెందిన వ్యాపారి చిటికేశి సదాశివుడుపై తాజాగా పీడీ యాక్ట్ నమోదు చేశారు. గుడుంబా ముడిసరుకు సరఫరాకు చెందిన పలు కేసుల్లో సదాశివుడు ముద్దారుు. దీంతో తిరిగి అలాంటి నేరాలకు పాల్పడకుండా పీడీ యాక్ట్-1986 కింద నిర్బంధించడానికి కలెక్టర్ గత నెల 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ నర్సారెడ్డి ఆదేశాల మేరకు సదాశివుడిని అదుపులోకి తీసుకుని ఈనెల 1వ తేదీన వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. సదాశివుడిని హన్మకొండ ఎక్సైజ్ సీఐ గండ్ర దేవేందర్‌రావు, టాస్క్‌ఫోర్స్ సీఐ రామకృష్ణ, హన్మకొండ ఎస్సైలు బిక్షపతి, సుబ్బరాజు సిబ్బంది అరెస్టు చేశారు. అలాగే గుడుంబా కేంద్రాలకు నల్లబెల్లం, పటిక వంటి ముడి సరుకును రవాణా చేస్తే కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా సీఐ దేవేందర్‌రావు హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖకు సంబంధం ఉన్న పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వారిని పీడీ యాక్ట్ ద్వారా నిర్బంధిస్తామని తెలిపారు. -
సంప్రదాయమా..? చట్ట నిబంధనలా..?
* పీడీ కేసుల్లో వ్యక్తి నిర్బంధాన్ని ‘హెబియస్’ రూపంలో సవాలు చేయడం చట్ట నిబంధనలకు విరుద్ధమన్న ఏజీ * అయితే ఇది 50 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయమన్న సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి * దీంతో హెబియస్ కార్పస్ రూపంలోనా.. రిట్ పిటిషన్ రూపంలోనా... అనేది తేల్చాలని హైకోర్టు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఏ వ్యక్తినైనా పోలీసులు ముందస్తు నిర్బంధ చట్టం(పీడీ యాక్ట్) కింద నిర్బంధిస్తే దానిని అక్రమ నిర్బంధంగా పేర్కొంటూ అతన్ని కోర్టుముందు హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలంటూ హెబియస్ కార్పస్ రూపంలో పిటిషన్ వేయడం యాభై ఏళ్ల నుంచి హైకోర్టులో వస్తున్న సంప్రదాయం.. పీడీ కేసుల్లో వ్యక్తి నిర్బంధాన్ని సవాలుచేస్తూ హెబియస్ కార్పస్ రూపంలో పిటిషన్ వేయడానికి వీల్లేదని, ఇది చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న సమయంలో జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా మౌఖికంగా జారీచేసిన ఆదేశం.. గత 50 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు కొనసాగించాలా..? లేక చట్ట నిబంధనలను అమలు చేయాలా..? అన్న కీలక విషయాన్ని తేల్చాలని హైకోర్టు తాజాగా నిర్ణయించింది. దీనిపై లోతైన విచారణ జరపనున్నట్టు పేర్కొంది. తమ భర్తలను పోలీసులు పీడీ యాక్ట్ కింద అక్రమంగా నిర్బంధించి కడప కేంద్ర కారాగారంలో ఉంచారని, వారిని వెంటనే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలంటూ నెల్లూరుకు చెందిన జి.అర్చన, చిత్తూరుకు చెందిన బి.హిమబిందు వేర్వేరుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ రూపంలో పిటిషన్లు వేశారు. ఇవి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ముందు బుధవారం విచారణకొచ్చాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... పిటిషనర్ల భర్తలైన జి.రామనాథరెడ్డి, నాగేంద్రనాయక్లను పోలీసులు పీడీ యాక్ట్ కింద అక్రమంగా నిర్బంధించారని నివేదించారు. దీనిపై అడ్వొకేట్ జనరల్(ఏజీ) పి.వేణుగోపాల్ జోక్యం చేసుకుంటూ.. పీడీ యాక్ట్‌కు సంబంధించిన కేసులను ఇలా హెబియస్ కార్పస్ రూపంలో దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. వాటిని రిట్ పిటిషన్ రూపంలో సింగిల్ జడ్జి ముందు దాఖలు చేసుకోవాలని, ఇదే విషయాన్ని హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. ఏజీ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. బాంబే హైకోర్టు కూడా ఈ విషయాన్ని చెప్పిందని వ్యాఖ్యానించింది. దీనికి మోహన్‌రెడ్డి అడ్డుచెబుతూ.. గత 50 ఏళ్లుగా ఉమ్మడి హైకోర్టులో పీడీ కేసుల్లో నిర్బంధాన్ని హెబియస్ కార్పస్ రూపంలోనే సవాలు చేస్తూ వస్తున్నామని, అదిక్కడ సంప్రదాయంగా కొనసాగుతోందని తెలిపారు. పీడీ కేసుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయకూడదని రాజ్యాంగంలోగానీ, చట్ట నిబంధనల్లోగానీ, సుప్రీంకోర్టు తీర్పుల్లోగానీ ఎక్కడా లేదని, ఏజీకి సైతం ఈ విషయం స్పష్టంగా తెలుసని వివరించారు. సంప్రదాయం కొనసాగుతున్న మాట వాస్తవమేనని ఏజీ అంగీకరించారు. దీంతో ధర్మాసనం, అయితే సంప్రదాయాన్ని కొనసాగించాలా..? లేక చట్ట నిబంధనలను అమలు చేయాలా..? అన్న విషయంపై లోతైన విచారణ చేపడతామని, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రత్యక్షంగా, పరోక్షంగా వెలువరించిన తీర్పులేవైనా ఉంటే, వాటిని తమ ముందుంచాలని ఇరుపక్షాల న్యాయవాదులను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. -
ఐదుగురు ఎర్రస్మగ్లర్లపై పీడీ యాక్టుకు రెడీ
- కలెక్టర్‌కు నివేదిక - టాస్క్‌ఫోర్స్ ఏఎస్పీ రత్న సాక్షి, చిత్తూరు: ఐదుగురు ఎర్రస్మగ్లర్లపై పీడీ యాక్టుకు సిద్ధం చేస్తూ కలెక్టర్‌కు నివేదించినట్లు టాస్క్ఫోర్సు ఏఎస్పీ రత్న తెలిపారు. కలెక్టర్ సంతకమే తరువాయి అన్నారు. వీరితోపాటు మరో ముగ్గురిపైనా పీడీయాక్టులు పెడుతున్నట్లు చెప్పారు. సోమవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. గతంలో మాదిరి కాకుండా పీడీ యాక్టును కఠినతరం చేశామన్నారు. పీడీయాక్టు నమోదైతే ఆరు నెలలకు తగ్గకుండా శిక్ష పడుతుందన్నారు. దీంతో పాత స్మగ్లర్లు స్మగ్లింగ్‌కు ముం దుకు వచ్చే అవకాశం తక్కువన్నారు. చైనాస్మగ్లర్ యాంగ్‌పింగ్‌ను విచారిస్తే మరిన్ని స్మగ్లింగ్ ముఠాలు బయటపడే అవకాశం ఉందన్నారు. దానిని బట్టి తదుపరి వ్యూహరచన ఉంటుందన్నారు. చెన్నై స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలను వ్వూహాత్మకంగా నిలిపివేసినట్లు ఆమె చెప్పారు. ఇప్పటికే వారి కుటుంబాలు అజ్ఞాతంలో ఉన్నాయన్నారు. కొన్ని రోజులు ఆగి దాడులు కొనసాగిస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కఠిన చట్టాలు లేకపోవడం వల్లే ఎర్రచందన స్మగ్లింగ్ ను వెనువెంటనే అరికట్టే పరిస్థితి లేదన్నారు. జాతీయస్థాయిలో చ ట్టాలను కఠినతరం చేయాల్సి ఉందన్నారు. చట్టాలను సవరించి కఠిన చట్టాలు తీసుకువస్తే ఎర్రచందనం అక్రమ రవాణా ఆగిపోతుం దన్నారు. స్మగ్లర్లను పట్టుకోవడంతోపాటు చందనం అక్రమ రవాణా నేరమనే విషయంపై గ్రామాల్లో అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు, అటవీ సిబ్బంది కలిసి రేయింబవళ్లు కృషి చేస్తున్నట్లు రత్న చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరించిన పోలీసు, అటవీ సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని ఆమె తెలిపారు. -
కలప స్మగ్లింగ్, భూముల కబ్జాపై పీడీ యాక్ట్
హైదరాబాద్ : కలప స్మగ్లింగ్, అటవీ భూముల కబ్జాపై పీడీ యాక్ట్‌తో కేసులు నమోదు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. సోమవారం ఆయన హరితాహారం పథకంపై కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో 24 శాతం అటవీ ప్రాంతముందని, దాన్ని 33 శాతానికి పెంచాలని సూచించారు. సమగ్ర ప్రణాళికతో తెలంగాణవ్యాప్తంగా చెట్ల పెంపకం చేపట్టాలని, సమాజంలోని అన్నివర్గాలను చెట్ల పెంపకంలో భాగస్వామ్యం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీ సిబ్బందికి వాహనాలతో పాటు ఆయుధాలు ఇస్తామని కేసీఆర్ తెలిపారు. -
‘పచ్చ’ తమ్ముళ్లే ఎర్ర దొంగలు!
సీఎంతో ఎర్రచందనం స్మగ్లర్లకు ప్రత్యక్ష అనుబంధం సాక్షి హైదరాబాద్,నెట్వర్క్: ఎర్రచందనం స్మగ్లింగ్ పుట్ట తవ్వినకొద్దీ తెలుగుతమ్ముళ్ల పేర్లే బయటకు వస్తున్నాయి. టీడీపీ అధినేతతోపాటు కీలక నేతలతో ప్రత్యక్ష సంబంధాలున్న స్థానిక నేతలదే స్మగ్లింగులో కీలకభూమికని వెల్లడవుతోంది. తమపార్టీలోని బడా స్మగ్లర్లను రక్షించుకునేందుకే 20 మంది కూలీలను ఎన్కౌంటర్ చేయించారన్న విమర్శలూ వినవస్తున్నాయి. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలో పీడీ చట్టం కింద కేసులు నమోదైన వారిలో అత్యధికులు టీడీపీ నేతలు కావడమే ఇందుకు నిదర్శనం. గత ఎన్నికల్లో పలువురు ఎర్రస్మగ్లర్లకు టీడీపీ టిక్కెట్లు ఇవ్వడమే ప్రత్యక్షసాక్ష్యం. ఒకప్పుడు బతుకుదెరువుకోసం కువైట్ వెళ్లి వచ్చిన వారే పచ్చ గొడుగు నీడలో బడా స్మగ్లర్లుగా మారారు. రాష్ట్రంలోని తిరుపతి, హైదరాబాద్ లాంటి నగరాల్లోనే కాకుండా బెంగళూరు, చెన్నైల్లో సైతం భారీ భవంతులకు అధినేతలయ్యారు. వేలకోట్ల విలువైన ఎర్రచందనం కొల్లగొట్టి వందలకోట్లు పార్టీకి విరాళాలుగా ఇచ్చారు. పోలీసు, అటవీ అధికారులకు నోట్ల కట్టలు వెదజల్లారు... లొంగని వారిని బెదిరించారు. పచ్చజెండా అండతో మరికొందరు తెలుగు తముళ్లుకూడా శేషాచలం అడవుల బాట పడుతున్నారు. వారి నుంచి పార్టీ అధినేతకు భారీగా ముడుతోందనే ఆరోపణలు అధికార పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. గురుశిష్యులతో అనుబంధం ఎర్రచందనం స్మగ్లింగ్‌తో సంబంధం ఉన్న టీడీపీ నాయకుల పేర్ల జాబితా కొండవీటి చాంతాడంతవుతుంది. ముందుగా చప్పిడి మహేష్‌నాయుడు, మద్దిపెట్ల రెడ్డినారాయణ అనే గురుశిష్యుల గురించి తెలుసుకుందాం. వైఎస్సార్ జిల్లా సుండుపల్లె, సంబేపల్లె మండలాల పరిధిలో ఆ ఇరువురి గ్రామాలున్నాయి. జీవనోపాధికోసం ఇద్దరూ కువైట్‌కు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత పక్కనే ఉన్న శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ మొదలుపెట్టారు. 15 ఏళ్లుగా అదే ప్రధానవృత్తిగా జీవనం సాగిస్తున్నారని పోలీసు రికార్డులు తేటతెల్లం చేస్తున్నాయి. గ్రామీణులను అడవులకు పంపించి చందనం చెట్లు నరికించి చెన్నై పంపించడం ద్వారా స్మగ్లింగ్ మొదలుపెట్టిన వీరు ఇప్పుడు అంతర్జాతీయ స్మగ్లర్లుగా ఎదిగిపోయారు. వీరి వ్యవహారాలకు అడ్డు నిలిచిన అటవీ అధికారులపై అనేకసార్లు దాడులకు తెగబడ్డారు. ఆమేరకు సుండుపల్లె, సంబేపల్లె పోలీసుస్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. వారే టీడీపీలో కీలక నేతలుగా ఎదిగారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారనే కారణంగా వైఎస్సార్ జిల్లాకు చెందిన ఆకేపాటి అమర్నాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు ఎమ్మెల్యే పదవులు కోల్పోయిన సందర్భంగా జరిగిన ఉప ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ తరఫున ఈ గురుశిష్యులే ప్రధాన భూమిక పోషించారు. రాజంపేట అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా మహేష్‌నాయుడుకు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అతని పిలుపుతోప్రచారం నిమిత్తం సుండుపల్లెకు హెలికాప్టర్లో వెళ్లారు. ఆ సభలో మహేష్‌నాయుడును తన పక్కనే కూర్చోబెట్టుకొని పొగడ్తలతో ముంచెత్తారు. రాయచోటి నియోజకవర్గ పరిధిలో రెడ్డినారాయణ నిర్ణయాలకే బాబు ప్రాధాన్యం ఇచ్చారు. అప్పటికే ఓమారు పీడీ యాక్టు కింద అరెస్టయిన రెడ్డినారాయణకు సంబేపల్లె జెడ్పీటీసీ అభ్యర్థిగా బీఫారం ఇచ్చారు. ఆయనను ప్రజలు ఓడించారు. సుండుపల్లె మండలంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక మహేష్‌నాయుడు కనుసన్నల్లో సాగింది. స్మగ్లింగు సొమ్మును నీళ్లలా ఖర్చుచేసి ఆయన తల్లి శ్రీలతదేవికి జీ.రెడ్డివారిపల్లె ఎంపీటీసీగా గెలిపించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘ఎర్రదండు’ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎర్రచందనం స్మగ్లర్లనే టీడీపీ ప్రోత్సహించింది. సుండుపల్లె మండలం జీకే రాచపల్లెకు చెందిన పటాల రమణపై పలు కేసులున్నాయి. ఆయన సోదరుడు వీరమల్లనాయుడుకు టీడీపీ సుండుపల్లె జడ్పీటీసీ టికెట్ ఇచ్చింది. ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లె ఎంపీటీసీ సుబ్బానాయుడు, రాజంపేట మండలం బసినాయుడుగారిపల్లెకు చెందిన దేవానాయుడు, సాతుపల్లెకు చెందిన సత్యాల రామకృష్ణ మీద కూడా స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. మైదుకూరు మండలం జాండ్లవరానిక చెందిన టీడీపీ నేత శ్రీనివాసులనాయుడు ప్రస్తుతం పీడీ యాక్టు కింద రాజమండ్రి జైల్లో ఉన్నారు. బి.మఠం మండలంలో టీడీపీ కీలక నేత చెంచయ్యగారిపల్లెకు చెందిన సి.సుబ్బారెడ్డికీ ఈ స్మగ్లింగ్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. టీడీపీ మైదుకూరు ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ అనుచరులు చినమల నరసింహులు యాదవ్, కటారి చిన్న వీరయ్యపైనా ఈ కేసులు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో....: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని కొందరు టీడీపీ నేతలకు కూడా ఈ స్మగ్లింగ్‌తో సంబంధాలున్నాయి. రుద్రవరం మండలం నాగులవరం గ్రామానికి చెందిన గంధం భాస్కరరెడ్డి 2014 ఎన్నికల ముందు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయనపై రుద్రవరం పోలీసు స్టేషన్లో రౌడీషీట్ కూడా ఉంది. తర్వాత ఎర్రచందనం అక్రమ రవాణా కేసు నమోదైంది. కొత్తపల్లి మాజీ సర్పంచ్ సావిత్రి భర్త రాఘవరెడ్డిపై కూడా ఎర్రచందనం అక్రమ రవాణా కేసు ఉంది. ఆయన టీడీపీ నేత గంగుల ప్రతాప్‌రెడ్డి ముఖ్య అనుచరుడు. పీడీ యాక్టులో అత్యధికులు టీడీపీ నేతలే వైఎస్సార్ జిల్లాలో ఇటీవల కాలంలో 16 మందిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదుకాగా ఇందులో ఎనిమిది మంది టీడీపీ మద్దతుదారులే. జాండ్లవరం శ్రీనివాసులునాయుడు, ఒంటిమిట్ట మండలంలోని గాండ్లపల్లె జంగాల శివశంకర్, అదేమండలంలోని పట్రపల్లెకు చెందిన బొడ్డే శ్రీనివాసులు, కాశినాయన మండలానికి చెందిన ఎంబడి జయరాజు, సిద్దవటం మండలం తుర్రావెంకటసుబ్బయ్య, సంబేపల్లె మండలానికి చెందిన రెడ్డినారాయణ, సుండపల్లె మండలానికి చెందిన మహేష్‌నాయుడు, శివప్రసాద్‌నాయుడు అలియాస్ గుట్ట బాబు పీడీ యాక్టు కింద గతంలో అరెస్టయ్యారు. వీరంతా టీడీపీ మద్దతుదారులే. మిగిలిన వారిలో ఐదుగురికి ఏ రాజకీయ పక్షంతో సంబంధం లేదని అటవీ అధికారులు తెలిపారు. సీఎం సొంత జిల్లాలో.... సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పలువురు టీడీపీ నేతలు ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా భారీగా సంపాదించి విదేశాల్లో సైతం వ్యాపారాలు సాగిస్తున్నారు. టీడీపీ ప్రచార కార్యదర్శిగా పనిచేసిన చెరుకూరి వసంతకుమార్‌పై జిల్లాలో ఏడు ఎర్రచందనం కేసులు ఉన్నాయి. గతంలో పోలీసులు అరెస్టు చేసినా బెయిల్‌పై బయటకు వచ్చేశారు. ఆయనపై పీడీ యాక్టు కింద కేసు పెట్టినా సీఎం తనయుడు లోకేష్ స్వయంగా కల్పించుకోవడంతో అడ్వయిజరీ బోర్డు సమావేశం పెట్టకుండానే ప్రభుత్వం కేసు ఎత్తివేసింది. అందుకు ప్రతిఫలంగా గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పలువురు టీడీపీ అభ్యర్థులకు వసంతకుమార్ డబ్బు పంపిణీ చేశారు. యాదమరి మండలానికి చెందిన పాపిదేశి ఆనందనాయుడు, చుండ్లవంకకు చెందిన శ్రీశైలం ఆంజనేయులు, చిన్నగొట్టిగల్లు తుమ్మిచేనపల్లెకు చెందిన ఆవుల మోహనరెడ్డిలపై కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. -
నలుగురు ‘ఎర్ర’ స్మగ్లర్లపై పీడీ యాక్ట్
చిత్తూరు అర్బన్: ఎర్రచందనం అక్రమ రవాణాలో పేరుమోసిన నలుగురు స్మగ్లర్లపై పీడీ యాక్టు నమోదయింది. ఈ మే రకు మంగళవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో ఓఎస్డీ రత్న వివరాలను వెల్లడించారు. అజాజ్షరీఫ్, నాగేం ద్రనాయక్, అబ్దుల్ ఖాదర్‌బాషా, ఇలియాజ్ ఖాన్‌ను పీడీ యాక్టు కింద వైఎస్సార్ కడప జిల్లాకు తరలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు మొత్తం 35మందిపై పీడీ యాక్టులు నమోదు చేశామన్నారు. వీరిలో 11 మంది బెయిల్‌పై వచ్చినప్పటికీ వీరిపై అనుమానిత కేసులు తెరిచి నిఘా ఉంచామన్నారు. జిల్లాలో దాదాపు 200మంది వరకు ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేయడం ద్వారా ఎర్రచందనం రవాణాను కాస్త తగ్గించామన్నారు. ఈ సమావేశంలో సీఐలు చంద్రశేఖర్, సురేంద్రరెడ్డి, ఆదినారాయణ, నర్శింహులు, ఎస్ఐ వెంకటచిన్న తదితరులు పాల్గొన్నారు. అజాజ్ షరీఫ్: ఇతనికి అజ్జూ భాయ్, అన్వర్ షరీఫ్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇతను బెంగళూరులోని కటిగనహళ్లికి చెందిన అంతర్రాష్ట్ర స్మగ్లర్. వ్యవసాయం చేస్తూ విలాసవంతమైన జీవితం గడపడానికి ఐదేళ్లుగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 20 టన్నుల ఎర్రచందనం అక్రమంగా రవాణా చేశాడు. ఇతనిపై ఇప్పటి వరకు 20 వరకు కేసులు ఉన్నాయి. బుక్కా నాగేంద్ర నాయక్: చిత్తూరు జిల్లా పీలేరులోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఇతడిని రాంజీ నాయక్ అని కూడా పిలుస్తారు. వృత్తి రీత్యా డ్రైవర్ అయినప్పటికీ ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరించాడు. ఐదేళ్లుగా 20 టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడు. ఇతనిపై జిల్లాలో 23 కేసులు ఉన్నాయి. అబ్దుల్ ఖాదర్‌భాషా: చప్పాని, చప్పు అనే పేర్లతో కూడా పిలవబడే ఇతడు చిత్తూరు నగరంలోని వినాయకపురంలో కాపురం ఉంటున్నాడు. బీకామ్ వరకు చదువుకుని ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేశాడు. మూడేళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఉన్నాడు. ఇతనిపై జిల్లాలో 33 కేసులు ఉన్నాయి. ఇలియాజ్ ఖాన్: బెంగళూరులోని అడగారకలహళ్లికి చెందిన ఇతడు రెండేళ్లుగా స్మగ్లింగ్ వృత్తిలో ఉన్నాడు. గత ఏడాది జిల్లాకు చెందిన పోలీసులు బెంగళూరులో దాడులు చేయగా, వారిపై దాడులకు సైతం తెగబడ్డాడు. ఇతనిపై 10 కేసులు ఉన్నాయి. -
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్
చిత్తూరు : ఎర్రచందనం అక్రమ రవాణాలో పేరుమోసిన నలుగురు స్మగ్లర్లపై పీడీ యాక్టు నమోదయింది. చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో ఓఎస్డీ రత్న మంగళవారం మీడియాకు ఆ వివరాలను వెల్లడించారు. అజాజ్షరీఫ్, నాగేంద్రనాయక్, అబ్దుల్ ఖాదర్‌భాషా, ఇలియాజ్ ఖాన్‌లను పీడీ యాక్టు కింద వైఎస్సార్ జిల్లా సెంట్రల్ జైలుకు తరలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 35 మందిపై పీడీ యాక్టులు నమోదు చేశామన్నారు. వీరిలో 11 మంది బెయిల్‌పై బయటకు వచ్చినప్పటికీ వీరిపై అనుమానిత కేసులు తెరిచి నిఘా ఉంచామని చెప్పారు. జిల్లాలో దాదాపు 200 మంది వరకు ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేయడం ద్వారా ఎర్రచందనం రవాణాను కాస్త తగ్గించామన్నారు. ఈ సమావేశంలో సీఐలు చంద్రశేఖర్, సురేంద్రరెడ్డి, ఆదినారాయణ, నర్శింహులు, ఎస్ఐ వెంకటచిన్న తదితరులు పాల్గొన్నారు. నలుగురు ఎర్రస్మగ్లర్లపై ఉన్న కేసుల వివరాలు : అజాజ్ షరీఫ్ : ఇతనికి అజ్జూ భాయ్, అన్వర్ షరీఫ్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇతను బెంగళూరులోని కటిగనహళ్లికి చెందిన అంతర్రాష్ట్ర స్మగ్లర్. వ్యవసాయం చేస్తూ విలాసవంతమైన జీవితం గడపడానికి ఐదేళ్లుగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 20 టన్నుల ఎర్రచందనం అక్రమంగా రవాణా చేశాడు. ఇతనిపై ఇప్పటి వరకు 20 వరకు కేసులు ఉన్నాయి. బుక్కా నాగేంద్ర నాయక్ : చిత్తూరు జిల్లా పీలేరులోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఇతడిని రాంజీ నాయక్ అని కూడా పిలుస్తారు. వృత్తి రీత్యా డ్రైవర్ అయినప్పటికీ ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరించాడు. ఐదేళ్లుగా 20 టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడు. ఇతనిపై జిల్లాలో 23 కేసులు ఉన్నాయి. అబ్దుల్ ఖాదర్‌భాషా : చప్పాని, చప్పు అనే పేర్లతో కూడా పిలవబడే ఇతడు చిత్తూరు నగరంలోని వినాయకపురంలో కాపురం ఉంటున్నాడు. బీకామ్ వరకు చదువుకుని ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేశాడు. మూడేళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఉన్నాడు. ఇతనిపై జిల్లాలో 33 కేసులు ఉన్నాయి. ఇలియాజ్ ఖాన్ : బెంగళూరులోని అడగారకలహళ్లికి చెందిన ఇతడు రెండేళ్లుగా స్మగ్లింగ్ వృత్తిలో ఉన్నాడు. గత ఏడాది జిల్లాకు చెందిన పోలీసులు బెంగళూరులో దాడులు చేయగా, వారిపై దాడులకు సైతం తెగబడ్డాడు. ఇతనిపై 10 కేసులు ఉన్నాయి. -
బిల్లా పవన్‌పై పీడీ యాక్ట్..?
బంజారాహిల్స్(హైదరాబాద్): దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న రహ్మత్‌నగర్ నివాసి బిల్లా పవన్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకుగాను అతనిపై ఉన్న కేసులను తిరగదోడనున్నారు. ఇప్పటికే అతనిపై ఎనిమిది కేసులు ఈ పోలీస్‌స్టేషన్‌లో నమోదై ఉన్నాయి. ఇందులో ఓ హత్యాయత్నం కూడా ఉంది. దీంతో రెండు రోజుల క్రితం పోలీసులు పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే పవన్ రహ్మత్ నగర్ నుంచి సరూర్‌నగర్‌కు మకాం మార్చాడు. రహ్మత్‌నగర్, శ్రీకృష్ణానగర్ ప్రాంతాల్లో కొంతకాలంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పవన్ కేంద్రబిందువుగా మారాడని పోలీసులు అంటున్నారు. -
ఇసుక అక్రమంగా తరలిస్తే పీడీ యాక్టు
తాండూరు రూరల్: కాగ్నా నది పరీవాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని కలెక్టర్ రఘునందన్‌రావు హెచ్చరించారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన శుక్రవారం తాండూరు నియోజకవర్గంలో పర్యటించారు. బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం తాండూరు ఎంపీడీఓ అతిథి గృహాంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్ చేస్తామని, యజమానులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఇకనుంచి ఇసుక అక్రమ రవాణాపై నిఘాపెంచుతామని, రాత్రి వేళ తనిఖీలను ముమ్మరం చేయాలని సిబ్బందికి సూచించామని కలెక్టర్ వెల్లడించారు. తాండూరు పరిసరాల్లో అక్రమంగా నాపరాతి తవ్వకాలు చేపడితే యజమానులపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో అధికారులు తాండూరులో పేదలకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చారని, కానీ వాటికి స్థలాలు చూపలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో మట్లాడి వివరాలు సేకరిస్తానన్నారు. క్రమబద్ధీకరణలో 42 వేల దరఖాస్తుల పరిశీలన జిల్లాలో ఇప్పటి వరకు 42,462 క్రమబద్ధీకరణ దరఖాస్తులను పరిశీలించామని, జిల్లా వ్యాప్తంగా లక్షా 50 వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. మిగతా దరఖాస్తులను త్వరలోనే విచారిస్తామన్నారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్-2 ఆమ్రపాలి, వికారాబాద్ సబ్‌కలెక్టర్ అలుగు వర్షిణి ఉన్నారు. ఆకస్మిక తనిఖీ బషీరాబాద్: బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ రఘునందన్‌రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. సిబ్బంది కొరతపై ఆరా తీశారు. అనంతరం రెవెన్యూ, మండల పరిషత్, ఉపాధి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బషీరాబాద్ ఎంపీపీ కరుణ, జెడ్పీటీసీ సభ్యురాలు సునిత, బషీరాబాద్ సర్పంచ్ జయమ్మలు కలెక్టర్‌ను మండల సమస్యలను విన్నవించారు. బషీరాబాద్- తాండూరు రోడ్డు మార్గం పనులు కొనసాగడం లేదని, పనులను త్వరగా పూర్తి చేయించాలని కోరారు. మండల పరిధిలోని కొర్విచెడ్, నవల్గ, క్యాద్గిరా గ్రామాలకు చెందిన నాపరాతి కార్మికులకు నాపరాతిని తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ రవికుమార్, ఏపీఓ వీరాంజనేయులు తదితరులున్నారు. -
పీడీ యాక్ట్ కింద ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్ సిటీ: రాంగోపాల్‌పేట పోలీసులు పీడీ యాక్ట్ కింద ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దూల్‌పేటకు చెందిన నరేశ్ బల్కీ(20) అలియాస్ ఇమ్రాన్, కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందిన జి. విజయ్ కుమార్ చౌదరీ(22) అలియాస్ ఒమర్‌లు ఒంటరిగా ఉన్న మహిళల మెడలో నుంచి మంగళసూత్రాలను దొంగతనం చేస్తూ పలుమార్లు పట్టుబడ్డారు. నరేష్‌పై 24 కేసులు, విజయ్‌పై 17 కేసులు నగరంలోని వివిధ పోలీస్స్టేషన్లలో ఉన్నాయి. వీరిపై దొంగతనం, గూండా, మాదకద్రవ్యాల సరఫరా లాంటి పలు నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
కబ్జాలు చేసేవాళ్లు ఎంతటివారైనా వదలం..
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల కబ్జాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో నివాసం ఉన్నవారు పేదలైతే భూమి పట్టాలు ఇవ్వాలని... ఆక్రమణదారులైతే వెంటనే స్వాధీనం చేసుకోవాలని ...అధికారులకు సూచించారు. భూకబ్జాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఆక్రమణదారులపై అసవరం అయితే పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. భూ కబ్జాలు చేసేవాళ్లు ఎంతటివారైనా..ఏ పార్టీ వారైనా వదిలిపెట్టొద్దని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఆక్రమించుకోబడ్డ భూములను కూడా తిరిగి స్వాధీనం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. అలాగే ఈనెల 9న భూముల రక్షణపై కేసీఆర్ మరోసారి అధికారులతో సమావేశం కానున్నారు. కాగా హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల రక్షణ కోసం అధికారులతో ఓ కమిటీ వేయనున్నారు. -
భూకబ్జాలు, రౌడీయిజం చేసే వారిపై పీడీ యూక్ట్
నేర సమీక్ష సమావేశంలో డీఐజీ మల్లారెడ్డి వరంగల్‌క్రైం : భూకబ్జాలకు పాల్పడుతూ రౌడీయిజం చెలాయించేవారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని వరంగల్ రేంజ్ డీఐజీ బి.మల్లారెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. వరంగల్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా వరంగల్ రూరల్, అర్బన్ పోలీసు అధికారులతో బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ చరిత్ర ప్రసిద్ధికెక్కిన వరంగల్ జిల్లాలో విధులు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని, దేశంలోనే వరంగల్ జిల్లా పోలీ సులకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. గతంలో జిల్లాలో ఉన్న మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించి దేశంలోని ఇతర రాష్ట్రాల పోలీసులకు ఆదర్శంగా నిలిచామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని ఈ సమస్యలను పరిష్కరించే దిశగా మనమంతా సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నగరంలో రౌడీయిజాన్ని తరిమివేయాలంటే పీడీ యాక్ట్ ఉపయోగించక తప్పదని, ఇందుకోసం పోలీస్‌స్టేషన్లవారిగా ముఖ్యమైన రౌడీలను గుర్తించాలన్నారు. ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా మాట్లాడుతూ భూపాలపల్లి బ్యాంక్ దోపిడీ ఘటనను దృష్టిలో పెట్టుకుని పోలీసు అధికారులు తమ పరిధిలోని బ్యాంకుల భద్రతపై బ్యాంకు అధికారులతో సమీక్షించాలన్నారు. సమావేశంలో అర్బన్, రూరల్ పోలీస్స్టేషన్ల పనితీరుతోపాటు అధికారులు, సిబ్బంది పనితీరుపై సమీ క్ష జరిపారు. సమావేశంలో అర్బన్, రూర ల్ అదనపు ఎస్పీలు యాదయ్య, అనిల్ కుమార్, జాన్‌వెస్లీతోపాటు కాజీపేట, హన్మకొండ, వరంగల్, మామునూరు, ములుగు, పరకాల, మహబూబాబాద్, జనగామ, ట్రాఫిక్ డీఎస్పీ లు జనార్దన్, శోభన్‌కుమార్ , సురేంధ్రనాథ్, మహేందర్, రాజమహేంద్రనాయక్, సంజీవరావు, నాగరాజు, సురేందర్, వెంకటేశ్వర్రావుతోపాటు సీఐ, ఆర్ఐ, ఎస్సైలు పాల్గొన్నారు. -
‘చిట్టీలరాణి’ కేసు హుష్‌కాకి..!
వడ్డీ వ్యాపారులపై సీసీఎస్ ఉదాసీనత మరోపక్క పీడీ యాక్ట్ ప్రయోగిస్తామంటున్న కమిషనర్ సాక్షి, సిటీబ్యూరో: వడ్డీ వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని ఓ పక్క నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి హెచ్చరిస్తుంటే.... మరోపక్క సీసీఎస్ పోలీసులు మాత్రం వడ్డీ వ్యాపారులకు ఎర్రతివాచీ పరిచి దొడ్డి దారిన సాగనంపారు. వడ్డీల రూపంలో రూ.1.95 కోట్లు వసూలు చేసిన 28 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని చెప్పిన సీసీఎస్ అధికారులు ఆరు నెలలైనా ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీవీ ఆర్టిస్టు విజయరాణి అరెస్టు సందర్భంగా ఏప్రిల్ 11న మీడియాతో డీసీపీ పాలరాజు ఏమన్నారంటే... ‘‘చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి తోటి ఆర్టిస్టులను నిలువునా దోచుకున్న టీవీ ఆర్టిస్టు విజయరాణి అలియాస్ చిట్టీలరాణి (46) రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు చిట్టీలు నిర్వహించేది. అయితే ఒక్కో గ్రూప్‌లో పూర్తిగా సభ్యులు చేరకపోయినా చిట్టీలు నిర్వహించడంతో ఆమెకు నష్టాలొచ్చాయి. వీటిని పూడ్చేందుకు తెలిసిన వారి వద్ద రూ.3 నుంచి రూ.20 వరకు వడ్డీకి అప్పు తీసుకుంది. ఈ వడ్డీలు చెల్లించేందుకు మరికొంత మంది దగ్గర లక్షలాది రూపాయలు అప్పు చేసింది. ఓ వ్యక్తి వద్ద ఆమె రూ.లక్ష అప్పు తీసుకుని కేవలం వడ్డీ రూపంలో ప్రతి రోజు అతనికి రూ.3,500 చెల్లించేది. ఆమె నుంచి అధిక వడ్డీలు వసూలు చేసిన 28 మందిపై కేసులు నమోదు చేస్తాం’’ అన్నారు. ఆరు నెలలైనా ఇప్పటి వరకు ఒక్క వడ్డీ వ్యాపారిపై కూడా కేసు నమోదు చేయలేదు. ఆర్థికంగా నష్టపోయి బెంగళూరుకు పరార్... ఎర్రగడ్డకు చెందిన టీవీ ఆర్టిస్టు విజయరాణి నాలుగేళ్ల నుంచి ఇంట్లోనే ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేటుగా రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు చిట్టీలు నిర్వహించేది. ఆర్ధికంగా పూర్తిగా దిగజారడంతో అప్పుల బాధ పెరిగిపోయింది. కొందరు అప్పుల వారు ఆమెను ఏకంగా బెదిరించడంతో పిల్లాపాపలతో కలిసి ఇల్లు ఖాళీ చేసి మార్చి నెలలో బెంగళూరుకు పారిపోయింది. దీంతో చిట్టీలు వేసి మోసపోయిన సుమారు 80 మంది బాధిత ఆరిస్టులు రూ.10 కోట్ల వరకు మోసపోయామని సీసీఎస్ పోలీసులను ఆశ్రయించడంతో అదే నెల 11న ఆమెతోపాటు మరో ఏడుగురిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వడ్డీ రూపంలో రూ.1.95 కోట్లు చెల్లింపు... విజయరాణికి 54 మంది నుంచి సుమారు రూ.1.20 కోట్లు రావాల్సి ఉంది. వీరు కూడా ఆమె వద్ద చిట్టీలు వేశారు. ఇక ఆమె చిట్టీలు ఎత్తుకోని 78 మందికి సుమారు రూ.2.20 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆమె వడ్డీల రూపంలో రూ.1.95 కోట్లు చెల్లించిందని విచారణలో తేలింది. అరెస్టు సమయంలో ఆమె విక్రయించిన మూడు ఇళ్లు, కారు, మూడు బైక్‌లు, రూ.845 నగదు, కొన్ని బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని కోర్టు ద్వారా విక్రయించి బాధితులకు అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఆమె వడ్డీలకే అధికంగా డబ్బులు కట్టడంతో నష్ట పోయిందని చెప్పిన అధికారులు ఆ వడ్డీ వ్యాపారుల విషయంలో మాత్రం చేతులెత్తేశారు. అలాగే ఆమె నుంచి అధిక వడ్డీలు వసూలు చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. అయితే వారి పేర్లు, వివరాలు సీసీఎస్పోలీసుల చేతికి అందినా నేటి వరకు కూడా ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఇప్పుడైనా స్పందించి వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేయాలని బాధితులు కోరుతున్నారు. -
ఎర్రస్మగ్లర్లపై పిడికిలి
ఆరుగురిపై పీడీ యాక్టు ఉత్తర్వులు జారీచేసిన కలెక్టర్ సిద్ధ్దార్థజైన్ చిత్తూరు (అర్బన్): జిల్లాలో పేరొందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లపై ఎట్టకేటలకు ‘పిడి’కిలి బిగించారు. ఎర్రచందనం స్మగ్లర్లకు రా జకీయ అండదండలు ఉన్నాయనే నేపథ్యంలో ‘సాక్షి’లో ఈనెల 11న ‘రాజకీయ పిడికిలి’ పేరిట వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. పలువురు ఎర్ర స్మగ్లర్లపై చిత్తూరు, తిరుపతి ఎస్పీలు పీడీ యాక్టు నమోదు చేయాలని కలెక్టర్‌కు 20 రోజుల క్రితం ఫైలు పంపడం, ఇప్పటివరకు అవి పెండింగ్‌లో ఉండడంపై సాక్షిలో సవిరంగా వార్తా కథనం ప్రచురితమయ్యింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సిద్ధ్దార్థజైన్ ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్టుకు అనుమతిస్తూ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. వీరిపై పీడీ యాక్టు పీడీ యాక్టు నమోదుకు అనుమతిచ్చిన వారిలో చంద్రగిరి మండలం ఎ.రంగంపేట గ్రామానికి చెందిన దొడ్డికాళ్ల కృష్ణారెడ్డి అలియాస్ రంగారెడ్డి కృష్ణారెడ్డి అలియాస్ మునికృష్ణారెడ్డి (44) ఉన్నాడు. ఇతను 2009లో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో పట్టుబడ్డాడు. దాని తరువాత ఆరుసార్లు బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇతనిపై మొత్తం 7 కేసులు నమోదు కాగా,ఇందులో అటవీశాఖకు చెందిన ఒక కేసు, మిగిలినవి పోలీసులు కేసులు. గతంలో విధి నిర్వహణలో ఉన్న అటవీశాఖ అధికారుల్ని కొట్టి చంపిన కేసుల్లో సైతం ఇతను నిందితుడిగా ఉన్నాడు. ఇతను ప్రస్తుతం తిరుపతి సబ్‌జైలులో ఉండగా, పీడీ యాక్టు నమోదుకు తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి కలెక్టర్‌కు ఫైలు పంపారు. ఈ మేరకు ఇతనిపై పీడీ యాక్టుకు అనుమతి ఇచ్చారు. చిత్తూరు నగరం సాయినగర్ కాలనీకి చెందిన టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి సీ.వసంతకుమార్ అలియాస్ వసంత్‌పై కూడా పీడీ యాక్టుకు అనుమతి ఇచ్చారు. ఇతనిపై భారకాపేట, పలమనేరు, చిత్తూరు వన్‌టౌన్, పీలేరు తదితర పోలీసు స్టేషన్లలో ఎర్రచందనం కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలుమార్లు జిల్లా పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పీడీ యాక్టు నుంచి తప్పించుకోవడానికి ఏకంగా రాష్ట్ర మంత్రి నుంచి కూడా ఒత్తిళ్లు తీసుకొచ్చారు. అయితే ‘సాక్షి’లో దీనిపై వరుస కథనాలు రావడంతో పీడీ యాక్టు నుంచి వసంత్‌ను మినహాయించడానికి అధికారపార్టీ నేతలు, అధికారులు వెనుకడుగు వేశారు. ఇతనితో పాటు చిత్తూరు నగరం న్యూబాలాజీ కాలనీకి చెందిన ఎం.విజయకుమార్ అలియాస్ కుళ్లకుమార్, వైఎస్ఆర్ జిల్లా రామాపురానికి చెందిన ఎస్.రెడ్డెప్పరెడ్డి, టీ.సుండుపల్లెకు చెందిన గుత్తాబాబు అలియాస్ జి.శివప్రసాదనాయుడు, చెన్నైకి చెందిన ఆర్.శెల్వరాజ్‌లపై కూడా పీడీ యాక్టు నమోదుకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు. -
ఇక చైన్ స్నాచర్లపై పీడీ యాక్ట్:సీపీ
హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు ఇకపై ఎస్సెమ్మెస్ అలర్ట్ ఇస్తామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో మహేందర్ రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... నగరంలో చైన్ స్నాచింగ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. గత ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 804 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 428 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. చైన్‌స్నాచింగ్ పాల్పడేవారిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తామన్నారు. ముస్తఫా కేసు దర్యాప్తులో సైనికాధికారులు సహకరిస్తున్నారని చెప్పారు. సాధ్యమైనంత త్వరలో ఈ కేసును చేధిస్తామని మహేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. -
తొమ్మిది మందిపై పీడీ యాక్టు
చిత్తూరు(అర్బన్): జిల్లాలో ఎర్ర చందనం అక్రమ ర వాణా చేయడంలో అంతర్జాతీయ స్థా యిలో పేరొందిన తొమ్మిది మంది స్మగ్లర్లపై పీడీ యూక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం చిత్తూ రు నగరంలోని పోలీసు అతిథి గృహం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, అదనపు ఎస్పీ అన్నపూర్ణారెడ్డిలు ఈ వివరాలను వెల్లడించారు. జిల్లా ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేశామన్నారు. వీరిలో పాత స్మగ్లర్లయిన రియాజ్ ఖాన్, అసీఫ్ అలీఖాన్, లక్ష్మణ్‌నాయక్, ఆయి ల్ రమేష్, ఎన్.శరవణన్, హమీద్ ఖా న్, మహ్మద్ రఫీ, విక్రమ్ మెహందీ, ఎం.లక్ష్మణన్‌పై పీడీ యాక్టు నమోదు చేసినట్లు తెలిపారు. మరో ముగ్గురిపై పీడీ యాక్టుకు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. త్వరలోనే వీరిని సైతం సెంట్రల్ జైలుకు పంపుతామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి రూ.వేల కోట్లు గడిం చిన స్మగ్లర్ల ఆస్తులను స్వాధీనం చేసుకునే విషయమై ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఎస్పీ తెలిపారు. దీనిపై న్యాయ సలహా తీసుకుని ముం దుకు వెళుతున్నట్లు తెలిపారు. అలాగే విదేశాల్లో ఉన్న స్మగ్లర్లపై కేసులు నమో దు చేసి, వారిని అరెస్టు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పా రు. ఇంటర్ పోల్ (అంతర్జాతీయ ద ర్యాప్తు సంస్థ)తో మాట్లాడటానికి ప్రభుత్వానికి ఫైలు పంపామన్నారు. ప్రభుత్వం కేంద్రంతో చర్చించి, కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారుల సాయంతో విదేశాల్లో ఉన్న స్మగ్లర్లను అరెస్టు చేయా ల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ కూడా త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే ఇప్పటి వరకు ఎర్ర చం దనం రవాణాలో పేరుమోసిన స్మగ్లర్లను సమాజ బహిష్కరణ దిశగా కూడా చర్య లు చేపట్టామన్నారు. దీనిని అమలు చేయడానికి అన్ని విధి విధానాలు రూ పొందిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. 506 కేసులు.. 4175 మంది అరెస్టు జిల్లాలో 2011 నుంచి ఇప్పటి వరకు ఎర్రచందనం కేసుల్లో సుమారు 506 కేసులు నమోదు చేసి, మొత్తం 4175 మందిని అరెస్టు చేశామన్నారు. ఇందు లో చోటా పెలైట్ల నుంచి అంతర్జాతీయ స్మగ్లర్లు కూడా ఉన్నారన్నారు. జూలై ఒక్క నెలలోనే 18 ఎర్ర చందనం అ క్రమ రవాణా కేసులు నమోదు చేసి 122 మంది నిందితులను అరెస్టు చేసి 15 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 2011లో 60 కేసులు నమోదైతే 351 మందిని అరెస్టు చేసి, 41 వేల కిలోల ఎర్రచందనం దుంగల్ని స్వాధీ నం చేసుకున్నామన్నారు. 2012లో 134 కేసుల్లో 895 మందిని అరెస్టు చేసి, 98 వేల కిలోల దుంగల్ని, 2013లో 181 కేసుల్లో 1166 మందిని అరెస్టు చేసి 94 వేల కిలోల దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. 2014లో 131 కేసుల్లో 1763 మందిని అరెస్టు చేసి 52 వేల కిలలో ఎర్ర చందనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. దీంతో పాటు నిందితులకు చెందిన 4300 వాహనాలను సీజ్ చేశామన్నారు. -
పీడీ యాక్ట్ కింద ఉద్యోగులను అరెస్ట్ చేయాలి: పాల్వాయి
హైదరాబాద్: సమ్మెను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉపేక్షించడం సరికాదని, తక్షణమే పీడీ యాక్ట్ కింద ఉద్యోగులను అరెస్ట్ చేయాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ సంక్షోభం తలెత్తకుండా ఉద్యోగుల సేవలను తీసుకోవాలని కోరారు. అసెంబ్లీకి వచ్చే తెలంగాణ తీర్మానంపై ఓటింగ్ ఉండదని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను మాత్రమే తీసుకుంటారన్నారు. తీర్మానాన్ని ఓడిస్తామంటూ సీఎం కిరణ్ సమైక్యవాదులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆస్తుల దాడి వెనుక ఎంపీ లగడపాటి రాజగోపాల్ హస్తం ఉందని పాల్వాయి ఆరోపించారు.