సాక్షి, మేడ్చల్: సోషల్ మీడియాలో యువతులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న గుంటూరుకు చెందిన ఓ యువకుడిపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్ విధించారు. అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.
గుంటూరుకు చెందిన లక్ష్మీ గణేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి అమ్మాయిలతో ఛాటింగ్ చేసేవాడు. హ్యాకింగ్ స్కాం , ఇంటర్ ది డ్రాగన్ , కింగ్ ఈజ్ బ్యాక్ , తేజ రౌడీ పేరు తో గ్రూప్‌లు, ఐడీలు క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో వాళ్ల ఫోన్ నెంబర్లు సైతం సంపాదించి వేధించడం చేయడం ప్రారంభించాడు. అసభ్యకరమైన మెసేజ్‌లు, ఫొటోలు, ఎమోజీలు పంపుతూ ఇబ్బందులకు గురి చేశాడు.
ఇంటర్మీడియట్ వరకు చదివిన లక్ష్మీ గణేష్.. పోకిరిగా, జులాయిగా తిరుగుతూ వస్తున్నాడు. చాలాకాలంగా ఇలాంటి పనులు చేస్తూ వస్తున్నాడు. గతంలో ఓ యువతి ఘట్‌కేసర్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేయగా.. జైలులో ఉన్నాడు. తిరిగి విడుదల అయ్యాక కూడా అదే పని చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో మరో మూడు ఫిర్యాదులు నమోదు కావడంతో.. పీడీ యాక్ట్ విధించి కటకటాల వెనక్కి నెట్టారు రాచకొండ పోలీసులు.
Comments
Please login to add a commentAdd a comment