Rachakonda Police
-
న్యూ ఇయర్ ఎఫెక్ట్.. పబ్బులపై నిఘా..
-
మోహన్ బాబుపై కేసు నమోదు..
-
హతమార్చి.. పోలీసులను ఏమార్చి!
సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో మహిళలపై అఘాయిత్యాలకు తెగబడటం, ప్రతిఘటించిన వారిని హత్య చేసి పరారయ్యే హంతకుడిని పట్టుకోవడంలో రాచకొండ పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. హత్య చేసి ఏడాదిన్నర కాలం పాటు పోలీసుల కళ్లగప్పి వారి ముందే తిరుగుతున్నా గుర్తించలేకపోయారు. మరో ఇద్దరిని హత్య చేసి, తనంతట తాను దొరికితే తప్ప విచారణాధికారులు నిందితుడిని పట్టుకోలేకపోయారు. శాస్త్రీయ కోణంలో ఆధారాలు సేకరించి తొలి కేసులోనే నిందితుడిని పట్టుకుని ఉంటే.. ఇద్దరు ప్రాణాలతో మిగిలేవారు. కేసుల దర్యాప్తులో రాచకొండ పోలీసుల డొల్లతనంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాగితే అఘాయిత్యమే.. దాసర్లపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల శివ కుమార్ మద్యం మత్తులో సైకోలాగా ప్రవర్తిస్తుంటాడు. తాగిన మైకంలో ఫామ్ హౌస్‌లు, నిర్మానుష్య ప్రాంతాల్లో సంచరిస్తూ ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిపై కన్నేసేవాడు. అదను చూసి మద్యం తాగి వారిపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఎవరైనా ప్రతిఘటిస్తే అక్కడే ఉన్న పదునైన ఆయుధంతో వారిని హత్య చేసి పరారయ్యేవాడు. ఈ ఘటనను ఎవరైనా చూస్తే.. సాక్ష్యం మిగలకుండా వారిని కూడా అంతం చేసేందుకు వెనుకాడేవాడు కాదు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే అతను తన కార్యకలాపాలను ఎప్పటికప్పుడు వాటిలో పోస్ట్ చేస్తూ పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఆధారాల సేకరణలో విఫలం.. దాసర్లపల్లిలోని అరుణ ఫామ్ హౌస్‌లో పనిచేసే శైలజ అనే మహిళపై కన్నేసిన అతను గతేడాది మార్చి 3న ఆమెను హత్య చేశాడు. అనంతరం హతురాలి ఇంట్లో ఉన్న రెండు విదేశీ మద్యం బాటిళ్లు నిందితుడికంట పడ్డాయి. దీంతో ఒక బాటిల్‌ను తీసుకుని, మరొకటి తీస్తుండగా చేయి జారి కింద పడిపోయింది. పగిలిన బాటిల్‌పై ఉన్న నిందితుడి వేలిముద్రలను పోలీసులు సేకరించారు. అయితే హతురాలు, నిందితుడు ఇద్దరూ అదే గ్రామానికి చెందినవారే అయినా పోలీసులు ఊరిలో ఉన్న అనుమానితులను విచారించలేదు. దీంతో నిందితుడు శివ కళ్ల ముందు ఉన్నా గుర్తించలేకపోయారు. అంతే కాకుండా హత్య అనంతరం సంఘటనా స్థలానికి పోలీసులు వచి్చన సమయంలోనూ నిందితుడు కూడా అక్కడే ఉండి ఆధారాల సేకరణలో వారికి సహాయపడినట్లు తెలిసింది. వాసన పసిగట్టి డాగ్ స్క్వాడ్ వెంబడిస్తాయని ముందుగానే తెలుసుకున్న నిందితుడు... అవి రాకముందే అక్కడ్నుంచి పరారయ్యేవాడు. శైలజా రెడ్డిని హత్య చేసిన తర్వాత ఏడాదిన్నర కాలం పాటు అదే ఊర్లో తిరుగుతున్నా పోలీసులు గుర్తించలేకపోయారు. మరోసారి మద్యం మత్తులో మ్యాంగో ఆర్చిడ్స్ ఫామ్ హౌస్‌లో పని చేస్తున్న శాంతమ్మపై అత్యాచారానికి యతి్నంచాడు. ఆమె ప్రతిఘటించడంతో వేట కొడవలితో హత్య చేశాడు. ఇది చూశాడన్న అనుమానంతో ఆమె భర్త మూగ హోసయ్యనూ అంతం చేశాడు. తొలి కేసులోనే పోలీసులు హంతుకుడు శివను పట్టుకుని ఉంటే ఇద్దరి ప్రాణాలకు దక్కేవని స్థానికులు పేర్కొంటున్నారు.పాత కేసులపై ఆరా.. హత్యలు జరిగిన రెండు ఫామ్ హౌస్‌లలోనూ సీసీటీవీ కెమెరాలు లేకపోవడం కూడా పోలీసుల దర్యాప్తునకు సవాల్‌గా మారింది. రూ.కోట్లు ఖర్చు పెట్టి వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసుకునే యజమానులు, సిబ్బంది భద్రత, రక్షణ కోసం కనీసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఉండాల్సిందని పోలీసులు సూచిస్తున్నారు. ఫామ్ హౌస్‌లకు వచ్చివెళ్లే దారిలో కూడా ఎలాంటి నిఘా నేత్రాలు లేకపోవడం నిందితులు ఎలాంటి బెరుకు లేకుండా నేరాలకు పాల్పడుతుంటారని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా నిందితుడు సాయంత్రం వేళల్లో మద్యం తాగి, మహిళలపై అత్యాచారానికి పాల్పడుతుంటాడు. అడ్డుపడిన వారిపై పదునైన ఆయుధంతో హత్య చేస్తుంటాడు. దీంతో మహేశ్వరం జోన్ పరిధిలో ఇదే తరహాలో ఏమైనా హత్య కేసులు నమోదయ్యాయా అనే కోణంలో పోలీసులు పునఃసమీక్షిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, ఫామ్ హౌస్‌లు, గృహాలలో సాయంత్రం వేళల్లో జరిగిన మహిళల హత్య కేసులను ఆరా తీస్తున్నారు. -
‘అందుకనేగా అర్ధాంగి అంటారు’.. రాచకొండ పోలీసుల పోస్ట్ వైరల్
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. బ్యాంక్ సిబ్బంది, ప్రభుత్వ అధికారుల పేరుతో ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఓటీపీ అడిగి బ్యాంక్‌లోని డబ్బులను దోచేస్తున్నారు. అయితే ఇలాంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వుండాలని ఎప్పటికప్పుడు పోలీసులు ప్రజలకు హెచ్చరిస్తూనే ఉన్నారు.ఈ మోసాల గురించి మరింత వివరంగా చెప్పేందుకు రాచకొండ పోలీసులు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఇందుకు కాస్త హాస్యాన్ని జోడించారు. ఓ ఫన్నీ కపుల్ జోక్‌తో ప్రజలను హెచ్చరించారు. ఓ అర్థాంగి అమాయకత్వం సైబర్ కేటుగాళ్ల నుండి ఎలా కాపాడిందో తెలియజేస్తూ సాగిన చిన్న ఫన్నీ స్టోరీని రాచకొండ పోలీస్ కమీషనరేట్ అధికారిక ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేశారు. చివరగా.. బ్యాంకు అకౌంట్ వివరాలు, ఓటీపీలు, ఏటీఎం లేదా క్రెడిట్ కార్డు వివరాలను ఎవరితో పంచుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు చెప్పారు. రాచకొండ పోలీసుల రావుగారి 'అర్థాంగి' స్టోరీ కింద చదవండి: -
‘స్కూటీ’అంటే పాప.. ‘బైక్’అంటే బాబు
సాక్షి, న్యూఢిల్లీ: పసికందుల విక్రయానికి అంతర్రాష్ట్రముఠా కోడ్ భాష వినియోగించినట్టు రాచకొండ పోలీసులు గుర్తించారు. పాపను ‘స్కూటీ’గా, బాబును ‘బైక్’గా పిలుస్తూ ఇలా కోడ్ భాష ఎంచుకున్నట్లు స్పష్టమైంది. చిన్నారులను రాష్ట్రాలు దాటించి పిల్లలు లేని దంపతులకు అమ్ముతున్న అంతర్రాష్ట్రముఠా గుట్టును రాచకొండ పోలీసులు భగ్నం చేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంలో పోలీసులు మరింత దూకుడుగా ముందుకెళుతున్నారు. బుధవారం ఢిల్లీతోపాటు పుణే, యూపీ, నోయిడా, హరియాణాల్లోని పలు సిటీల్లో రాచకొండ పోలీసులు బృందాలుగా తనిఖీలు చేశారు. స్థానిక పోలీసుల సహకారంతో కొందరిని అదుపులోకి తీసుకొని విచారించినట్టు తెలుస్తోంది.వాట్సాప్‌లో మెసేజ్‌లు పాప కావాలి అంటే ‘స్కూటీ’ కావాలా?, బాబు కావాలి అంటే మీకు ‘బైక్’ కావాలా అని ముఠా సభ్యులు వాట్సాప్‌లో పిల్లలు లేని దంపతులకు మెసేజ్‌లు పంపేవారు. డైరెక్టుగా పాప కావాలా లేదా బాబు కావాలా అని మెసేజ్‌లు చేస్తే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ముఠాసభ్యులు ఈ కోడ్ భాషను వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు.ఎవరైనా తెలియక పాప లేదా బాబు కావాలి అని మెసేజ్ చేస్తే వారికి వాట్సాప్ కాల్ చేసి మరీ ఈ కోడ్ భాష గురించి చెప్పేవారని, అనంతరం పిల్లలు లేని దంపతులు కూడా కోడ్ భాషను వినియోగించే వారని తెలిసింది. ఈరకంగా పలు ప్రాంతాల్లో పసికందులను విక్రయించినట్టు సమాచారం. ప్రస్తుతం రాచకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన వారి వివరాలతోపాటు వీరికి సంబంధించిన ప్రతి ఒక్క కదలికలపై నిఘా పెంచారు. కొంతకాలంగా వీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలను తెలుసుకున్నారు. వీటితో పాటు వాట్సాప్/టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా చాట్ చేసిన వివరాలు సేకరించారు. ఈ చాటింగ్‌లలో పోలీసులకు క్లూ లభించినట్టు తెలుస్తోంది. ఈ క్లూతోనే ఢిల్లీ, ఫుణే, హర్యానా వంటి ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు కొందరికి నోటీసులు కూడా జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.ఆ చిన్నారులు మా వద్ద క్షేమంగా ఉన్నారు.పెంపుడు తల్లిదండ్రులకు పిల్లలను ఇచ్చేది లేదు: కాంతి వెస్లీవెంగళరావునగర్(హైదరాబాద్): రాచకొండ పోలీసులు 11 మంది చిన్నారులను శిశువిహార్‌కు అప్పగించారని, వారంతా తమ వద్ద క్షేమంగా ఉన్నారని మహిళ,శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ చెప్పారు. బుధవారం కొందరు తల్లిదండ్రులు, మీడియా మహిళ, శిశు సంక్షేమశాఖ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూసినా ఎవరినీ లోపలకు అనుమతించలేదు. ఆ తర్వాత కాంతి వెస్లీ బయటకు వచ్చి మీడియాకు పలు విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులను విక్రయించడం, కొనడం చట్టరీత్యా నేరం.. వారికి కఠినశిక్షలు పడతాయని హెచ్చరించారు. ఆ విధంగా తీసుకొని పెంచుకోవడం కూడా తప్పేనన్నారు. చిన్నారులను కొని పెంచిన వారు ఇప్పుడు వచ్చి మా పిల్లలను మాకివ్వండి అని అడుగుతున్నారని, వారికి పిల్లలను ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని తేల్చిచెప్పారు. అలాంటి తల్లిదండ్రులు ఎవరూ ఇక్కడకు రావొద్దని పేర్కొన్నారు. సంతానం లేనివారు ఎవరైనా పిల్లలు కావాలంటే మా వద్దకు వచ్చి దరఖాస్తు చేసుకుంటే విచారణ అనంతరం దత్తత ఇస్తామన్నారు. పెంపుడు తల్లిదండ్రులు దత్తత కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి ఈ పిల్లలను మ్యాచ్ చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. -
చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
-
వాట్సాప్‌లో ఫొటోలు.. ముహూర్తం రోజున డెలివరీ..
సాక్షి, హైదరాబాద్: పాలుతాగే పసికందులను అపహరించి, విమానాలు, రైళ్లలో రాష్ట్రాలు దాటించి పిల్లలు లేని దంపతులకు విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. ఫెర్టిలిటీ సెంటర్లు, ఆస్పత్రులు, క్లినిక్‌లలో పనిచేసే ఫోర్త్‌క్లాస్ ఉద్యోగులను ఏజెంట్లుగా పెట్టుకొని, దంపతుల సమాచారం సేకరించి, మధ్యవర్తుల సహాయంతో ఐదేళ్లుగా ఈ అక్రమ దందా సాగుతోంది. ఢిల్లీ, పుణే నగరాల్లో రోజుల శిశువులను ఎత్తుకొచ్చి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ఒక్క పసికందును రూ.1.80 లక్షల నుంచి రూ.5.50 లక్షల చొప్పున అమ్మేస్తున్నారు. ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించిన 11 మంది మధ్యవర్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలను మల్కాజ్గిరి డీసీపీ పీవీ.పద్మజ, శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) అధికారులతో కలిసి రాచకొండ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి మంగళవారం మీడియాకు వెల్లడించారు.👉ఈనెల 22న పీర్జాదిగూడలో మూడు నెలల పాపను విక్రయిస్తుండగా మేడిపల్లి పోలీసులు స్థానిక ఆర్ఎంపీ శోభారాణితోపాటు స్వప్న, షేక్ సలీంలను అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులను విచారించగా వీరి తరహాలోనే ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 8 మంది మధ్యవర్తుల పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసును రివర్స్ ఇన్వెస్టిగేషన్ చేశారు. అన్నోజిగూడకు చెందిన బండారి హరిహర చేతన్– బండారి పద్మ, కుషాయిగూడకు చెందిన యాట మమత, ఉప్పుగూడకు చెందిన ముధావత్ రాజు, విజయవాడకు చెందిన బలగం సరోజ, ముధావత్ శారద, ముంతాజ్, జగన్నాథం అనురాధలను పట్టుకున్నారు. ఈ మధ్యవర్తుల సహాయంతో ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణేకు చెందిన కన్నయ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంతానం లేని దంపతులకు పిల్లలను విక్రయిస్తున్నారు. ఐదేళ్లలో 60 మంది శిశువులను విక్రయించారు. తాజా కేసులో 16 మంది పిల్లలను విక్రయానికి పెట్టగా.. ఏడుగురిని ఏపీ, 9 మందిని తెలంగాణకు చెందిన దంపతులు కొనుగోలు చేశారు. మధ్యవర్తులను విచారించిన పోలీసులు 16 మంది చిన్నారులను కాపాడారు. శిశువిహార్‌కు తరలించారు. వీరిలో 12 మంది అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలున్నారు. ప్రతి శిశువు అమ్మకంపై ఒక్క ఏజెంట్‌కు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు లాభం పొందేవారు. పరారీలో ఉన్న నిందితులు కిరణ్, ప్రీతి, కన్నయ్యల కోసం పోలీసులు గాలిస్తున్నారు.ముహూర్తం చెబితే పిల్లాడు డెలివరీవాట్సాప్, టెలిగ్రాం వంటి సామాజిక మాధ్యమాలలో పిల్లల ఫొటోలు పంపిస్తారు. శిశువుల రంగు, ముఖ కవలికలను బట్టి ఎంపిక చేసుకుంటారు. ఫలానా ముహూర్తానికి పిల్లాడు కావాలని చెబితే చాలు ఆ సమయానికే పిల్లాడిని తీసుకొచ్చి అప్పగిస్తారు. రోజుల వయస్సున శిశువులనే దంపతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ వయసులో అయితేనే తనకు పుట్టిన బిడ్డగా, పిల్లలకు కూడా వీరే సొంత తల్లిదండ్రులని భావిస్తారు.పిల్లలకు దూరం చేయకండి పిల్లలను రెస్క్యూ హోంకు తరలిస్తుండగా అప్పటివరకు పెంచి పోషించిన తల్లిదండ్రులు తమ పిల్లలను దూరం చేయొద్దంటూ రాచకొండ కమిషనరేట్ ముందు అడ్డుపడ్డారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు తల్లిదండ్రులను మేడిపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఓ దంపతులను ‘సాక్షి’ పలకరించగా.. పెళ్లై 12 ఏళ్లు అయినా పిల్లలు కలగలేదని, ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోవడంతో ఆఖరికి దిక్కుతోచని స్థితిలో రెండున్నర ఏళ్ల క్రితం ఆరు రోజుల పసికందును కొనుగోలు చేశామని రావులపాలెంకు చెందిన ఓ జంట తెలిపారు. రూ.3.5 లక్షలు ఖర్చు చేసి 21వ రోజును ఘనంగా చేశామన్నారు. రూ.కోట్లాది ఆస్తిపాస్తులను వారసుడి పేరు మీద రాసేందుకూ సిద్ధమయ్యామని చెప్పారు. ఇలాంటి సమయంలో పిల్లాడిని పోలీసులు తమ నుంచి దూరం చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. -
క్యూఆర్ కోడ్ బందోబస్త్
సాక్షి, సిటీబ్యూరో: వినాయక నిమజ్జనానికి రాచకొండ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలోని చెరువులు, రూట్ మ్యాప్‌లను సిద్ధం చేసిన పోలీసులు.. సాంకేతిక వినియోగంపై దృష్టిసారించారు. ఈసారి గణేష్ బందోబస్తు ప్రక్రియను క్యూఆర్ కోడ్ ద్వారా పరిశీలించనున్నారు. దీని కోసం కమిషనరేట్ పరిధిలో దాదాపు 10 వేల వినాయక మండపాలకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను ఇచ్చారు. ఇందులో విగ్రహ ప్రతిష్టాపన తేదీ, నిమజ్జనం తేదీ, రూట్ మ్యాప్ వంటి వివరాన్నీ ఈ కోడ్‌లో భధ్రపరిచారు. నిమజ్జనానికి సిద్ధం చేసిన చెరువుల వద్ద ఏర్పాటు చేసిన 500 సీసీటీవీ కెమెరాల లొకేషన్స్‌ను జియో ట్యాగింగ్ చేశారు. వీటిని ఈ క్యూఆర్ కోడ్‌కు జత చేశారు. విశేషంగా ఈ క్యూఆర్ కోడ్‌లో ఏ వినాయక మండపం వద్ద ఏ తరహా వినాయకుడిని నిలబెట్టారు? ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఇంకాఎన్ని ఉన్నాయనేవి రియల్ టైంలో తెలిసిపోతాయి. ఆకతాయిలపై షీ టీమ్స్ నిఘా.. సాధారణ ప్రయాణికులు, భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిమజ్జన ఏర్పాట్లు సాగేలా గట్టి చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకించి నిమజ్జనానికి వచ్చే మహిళ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించారు. అలాగే ఆకతాయిలపై నిఘా పెట్టేందుకు 10 షీ టీమ్స్ బృందాలు మఫ్టీలో తిరుగుతుంటాయి. వీటితో పాటు రాచకొండలో ఉన్న 1.83 లక్షల సీసీటీవీ కెమెరాలతో శాంతి భద్రతల పరిస్థితులను పోలీసు ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణతో పాటు విశ్లేషిస్తున్నారు. కమిషనర్ డీఎస్ చౌహాన్ నిమజ్జన బందోబస్తుతో పాటు నిరంతరం మండపాల వద్ద తనిఖీలను చేస్తూ పరిస్థితులను తెలుసుకుంటున్నారు. -
HYD: ‘గుంటూరు పోకిరి’ గణేష్‌పై పీడీ యాక్ట్
సాక్షి, మేడ్చల్: సోషల్ మీడియాలో యువతులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న గుంటూరుకు చెందిన ఓ యువకుడిపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్ విధించారు. అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. గుంటూరుకు చెందిన లక్ష్మీ గణేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి అమ్మాయిలతో ఛాటింగ్ చేసేవాడు. హ్యాకింగ్ స్కాం , ఇంటర్ ది డ్రాగన్ , కింగ్ ఈజ్ బ్యాక్ , తేజ రౌడీ పేరు తో గ్రూప్‌లు, ఐడీలు క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో వాళ్ల ఫోన్ నెంబర్లు సైతం సంపాదించి వేధించడం చేయడం ప్రారంభించాడు. అసభ్యకరమైన మెసేజ్‌లు, ఫొటోలు, ఎమోజీలు పంపుతూ ఇబ్బందులకు గురి చేశాడు. ఇంటర్మీడియట్ వరకు చదివిన లక్ష్మీ గణేష్.. పోకిరిగా, జులాయిగా తిరుగుతూ వస్తున్నాడు. చాలాకాలంగా ఇలాంటి పనులు చేస్తూ వస్తున్నాడు. గతంలో ఓ యువతి ఘట్కేసర్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేయగా.. జైలులో ఉన్నాడు. తిరిగి విడుదల అయ్యాక కూడా అదే పని చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో మరో మూడు ఫిర్యాదులు నమోదు కావడంతో.. పీడీ యాక్ట్ విధించి కటకటాల వెనక్కి నెట్టారు రాచకొండ పోలీసులు. -
అశోక్‌రెడ్డి బెట్టింగ్ కథ.. అక్షరాలా వందకోట్ల రూపాయలు.. ఐపీఎల్–2023 లోనూ
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల కిందట బెట్టింగ్‌లోకి అడుగుపెట్టాడు. అడ్డదారిలో డబ్బు సంపాదనపై ఆసక్తి ఉన్నవాళ్లతో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. అది మొదలు క్రమంగా బెట్టింగ్‌కు బానిసై క్రికెట్ మొదలు హార్స్‌రైడింగ్‌వరకు అన్ని క్రీడలపై పందేలు నిర్వహించాడు. ఈ క్రమంలో రూ.100 కోట్లు పోగొట్టుకున్నాడు. ఇటీవల ఐపీఎల్–2023లోనూ బెట్టింగ్‌కు పాల్పడి.. నగదు వసూలుకు వెళ్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఇది శుక్రవారం రాచకొండ పోలీసులు అరెస్టు చేసిన జక్కిరెడ్డి అశోక్‌రెడ్డి కథ. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసిన పోలీసులు.. మీడియాకు శనివారం వివరాలు వెల్లడించారు. ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ మురళీధర్, రాచకొండ సీపీ దేవేంద్రసింగ్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘నేషనల్ ఎక్స్ఛేంజ్9’ పేరుతో.. శ్రీ వెంకటరమణ కాలనీకి చెందిన అశోక్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఈజీ మనీకోసం బెట్టింగ్‌లోకి ప్రవేశించాడు. నాగోల్‌లోని బండ్లగూడలో ఉంటున్న మిర్యాలగూడకు చెందిన ఏడుకుళ్ల జగదీష్ తో అతనికి పరిచయం ఏర్పడింది. అశోక్, జగదీష్ ఇరువురు కలిసి సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తనకు ముందే పరిచయం ఉన్న, ప్రధాన బుకీలైన ఏపీకి చెందిన పలాస శ్రీనివాసరావు, సురేష్ మైలబాతుల అలియాస్ శివ, హరియాణకు చెందిన విపుల్ మోంగాలను జగదీష్ కు అశోక్ రెడ్డి పరిచ యం చేశాడు. కూకట్‌పల్లిలోని భక్తినగర్‌కు చెందిన ఐటీ ఉద్యోగి వొడుపు చరణ్‌ను కలెక్షన్ ఏజెంట్‌గా నియమించుకొని ఒక ముఠాగా ఏర్పడ్డారు. ముగ్గురు కలిసి ‘నేషనల్ ఎక్స్ఛేంజ్9’ ద్వారా క్రికెట్ బెట్టింగ్‌లను నిర్వహిస్తున్నారు. బెట్టింగ్‌లో పాల్గొనేవారికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇస్తారు. నగదు వసూలుకు వెళ్తూ.. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ఈ ముఠా నిర్వహించిన బెట్టింగ్‌లో పంటర్ల నుంచి నగదు వసూలు చేసేందుకు వెళ్తున్నట్లు ఎల్బీనగర్ ఎస్ఓటీ, చైతన్యపురి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు శుక్రవారం వాసవికాలనీ రోడ్‌నంబర్–9లోని బసంతి బొటిక్ వద్ద అశోక్, జగదీష్, చరణ్‌లను పట్టుకున్నారు. శ్రీనివాసరావు, సురేష్ , విపుల్ మోంగాలు పరారీలో ఉన్నారు. ఐపీఎల్లో రూ.3 కోట్లు బెట్టింగ్.. పట్టుబడిన ముగ్గురు నిందితులకు చెందిన ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ ఖాతాలను పోలీసులు పరిశీలించగా.. ఐపీఎల్–2023 సీజన్లో ఇప్పటివరకు రూ.3 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితుల నుంచి రూ.20 లక్షల నగదుతో పాటు బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ. 1.42 కోట్ల నగదును సీజ్ చేశారు. ఒక కారు, ఏడు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. -
నవీన్‌ను ఎలా చంపావ్? హత్య కేసు సీన్ రీ కన్స్ట్రక్షన్
సాక్షి, హైదరాబాద్/నాగోలు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసు విచారణలో భాగంగా రాచకొండ పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. ప్రేమించిన ప్రియురాలు దూరం అవుతుందన్న సాకుతో ఫిబ్రవరి 17 న తోటి స్నేహితుడిని అత్యంత పాశవికంగా నిందితుడు హరిహరకృష్ణ హత్య చేసిన సంగతి తెలిసిందే. హత్య అనంతరం పోలీసులు గుర్తుపట్టకుండా మృతదేహాన్ని క్రూరంగా చేతి వేళ్ళు, పెదాలు, గుండె, మర్మాంగాలను కోసి దహనం చేశాడు. అనంతరం దొరికిపోతాననే భయంతో తానే స్వయంగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు ఎదుట గత నెల 24న లొంగిపోయాడు. ఈ క్రమంలో పోలీసులు హత్యకు ముందు, తర్వాత పరిణామాలను సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి తెలుసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నిందితుడు హరిని హత్య జరిగిన ప్రదేశం అబ్దుల్లాపూర్ మెట్ కు తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. దానికంటే ముందు నిందితుడు హరిని చర్లపల్లి జైలు నుంచి తరలించి వనస్థలిపురం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి కస్టడీ విచారణ ప్రారంభించారు. యువతితో పరిచయం, సేహితుడి మధ్య విభేదాలను ప్రశ్నల రూపంలో అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడు హరిని తిరిగి చర్లపల్లి జైలులో రిమాండుకు తరలించారు. హసన్‌తో పాటు హరి సోదరినీ విచారించిన పోలీసులు నిందితుడు హరి సోదరి మూసారాంబాగ్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను కూడా విచారించినట్టు తెలిసింది. హత్య గురించి ఆమెకు ముందే తెలుసునని అనుమానించిన పోలీసులు ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా నిందితుడు హరి స్నేహితుడు హసన్‌ను కూడా శనివారం మరోసారి పోలీసులు విచారించినట్టు తెలిసింది. యువతికి సంబంధించిన ఆధారాలు దొరకలేదు– రాచకొండ సీపీ చౌహాన్ అబ్దుల్లాపూర్ మెట్ హత్య కేసులో యువతి కి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు పోలీసులకు దొరకలేదని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ చెప్పారు. హరిని విచారిస్తున్నామని అన్ని ఆధారాలూ సేకరిస్తున్నామని తెలిపారు. దర్యాప్తులో ఉన్న కేసుపై ఇప్పుడే పూరిస్థాయిలో సమాచారం చెప్పలేమన్నారు. -
రూ.కోటి విలువ చేసే స్థలం కొట్టేయాలని..
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ పత్రాలు సృష్టించి రూ.కోటి విలువ చేసే భూమిని కొట్టేయాలని పథకం రచించిన ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మల్కాజ్గిరి ఎస్ఓటీ డీసీపీ గిరిధర్‌తో కలిసి రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ శనివారం వివరాలు వెల్లడించారు. ►బీబీనగర్‌లోని రాఘవాపూర్‌కు చెందిన దొంతి సత్తిరెడ్డి స్థానికంగా వ్యాపారి. కొన్నేళ్లుగా మాగ్జిమా రిసార్ట్స్ ఫామ్ ఫేజ్–1లోని ప్లాట్ నంబర్ 204, 221లోని 2,420 గజాల రెండు ప్లాట్లు ఖాళీగా ఉండటాన్ని గమనించాడు. యజమానుల రాకపోకలు లేకపోవటంతో దానిని స్వాహా చేయాలని పథకం రచించాడు. ఈ క్రమంలో నకిలీ పత్రాలతో ప్లాట్లను విక్రయించడంలో సిద్ధహస్తుడైన పాత నేరస్తుడు, రియల్ ఎస్టేట్ బ్రోకర్, కీసరలోని చీర్యాలకు చెందిన దాడి ధర్మేందర్ రెడ్డిని సంప్రదించాడు. ►ఇద్దరు కలిసి సదరు భూమికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీలను సంపాదించారు. అనంతరం ధర్మేందర్ రెడ్డి సూచన మేరకు ఉప్పర్‌పల్లికి చెందిన సయ్యద్ నజీర్ ఉర్ రహ్మాన్ (ప్రస్తుతం మరణించాడు) నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్లు, నకిలీ ఆధార్ కార్డులను సృష్టించాడు. వీటి సహాయంతో భూమిని ఇతరులకు విక్రయించాలని భావించారు. ►ఇందుకోసం ముందుగా భూమిని జనరల్ పవరాఫ్ అటార్నీ (జీపీఏ) చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు ప్లాట్ల అసలు యజమానులైన కేబీ ఖురానా, అనిల్ ఖురానాల వయసుకు సరిపోయే లా వ్యక్తులను చూడాలని కోరుతూ బోరబండకు చెందిన మహ్మద్ షౌకాత్ అలీని సంప్రదించారు. ►దీంతో కేబీ ఖురానా లాగా యూసుఫ్‌గూడకు చెందిన గొర్రె రమేష్, అనిల్ ఖురానా లాగా వల్లపు రాములు నటించారు. ఆ పైన ప్లాట్లను బోరబండకు చెందిన చాకలి రాముకు జీపీఏ చేసినట్లు రిజిస్ట్రేషన్ ఆఫీసులో సంతకాలు చేశారు. రసూల్‌పురకు చెందిన మహ్మద్ ఇబ్రహీం, యూసుఫ్‌గూడకు చెందిన వాలి బాలకృష్ణ సాక్షి సంతకాలు చేశారు. ఈ డాక్యుమెంట్ల సహాయంతో సత్తిరెడ్డి, ధర్మేంద్రరెడ్డి ఆయా ప్లాట్లను రూ.65 లక్షలకు విక్రయించేందుకు ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందగా.. మల్కాజ్గిరి ఎస్ఓటీ డీసీపీ కూపీ లాగడంతో ముఠా లింకు బయటపడింది. ఇప్పటివరకు ఈ ముఠా 12 నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ప్లాట్లను విక్రయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఇబ్రహీం, బాలకృష్ణ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.7 లక్షల నగదు, 9 నకిలీ డాక్యుమెంట్లు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
పెళ్లి పేరుతో యువకుడికి ‘మాయలేడి’ వల.. రూ.31లక్షలకు టోకరా
సాక్షి, హైదరాబాద్: మత్తెక్కించే మాటలతో ఆకట్టుకుంటుంది. చూపు తిప్పుకోలేని అందమైన ఫొటోలు, వీడియోలతో ఆకర్షిస్తుంది. పెళ్లి చేసుకుందామని నమ్మించి జేబు ఖాళీ చేసేస్తుంది ఈ మాయలేడి! సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు తెరిచి యువకులకు గాలం వేస్తున్న యువతితో పాటు ఆమెతో సహజీవనం చేస్తున్న మరొకరిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ బీ రాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా, గిద్దలూరుకు చెందిన పరాస తనుశ్రీ, పరాస రవితేజ ఇద్దరు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలని భావించిన ఇరువురూ పథకం వేశారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతా తెరిచి యువకులను ఆకర్షించాలని నిర్ణయించుకున్నారు. తనుశ్రీ పేరుతో ఇన్‌స్ట్రాగామ్‌లో నాలుగు అకౌంట్లు తెరిచి అందమైన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసేది. దీంతో తక్కువ సమయంలోనే ఆమెకు ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. కామెంట్లు పెట్టేవారిలో బ్యాచిలర్స్, అమాయకులను ఎంపిక చేసుకుని వారికి రిప్లై ఇచ్చేది. ఫోన్ నంబర్లు తీసుకుని తియ్యని మాటలతో ప్రేమగా మాట్లాడుతూ నమ్మించేది. ఈ క్రమంలో ఓ రోజు ఫిర్యాదుదారుడికి తనుశ్రీ ఇన్‌స్ట్రాగామ్ నుంచి మెసేజ్ వచ్చింది. తక్కువ సమయంలో ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఒకరికొకరు ఫోన్ నంబర్లు మార్చుకొని గంటల కొద్దీ మాట్లాడుకునేవారు. తల్లికి ఆరోగ్యం బాలేదని, గృహ రుణం వాయిదా చెల్లించాలని, కరోనా వచ్చిందని ఇలా రకరకాల సాకులతో ఖర్చులకు డబ్బులు కావాలని అడగడంతో 8 నెలల కాలంలో రూ.31.66 లక్షలు బదిలీ చేశాడు. ఒక రోజు యువతి బాధితుడితో పెళ్లి చేసుకుందామని చెప్పింది. నిజమేనని నమ్మిన బాధితుడు ఎదురుచూశాడు. ఆపై ఆమె నుంచి రిప్లై రాకపోవటంతో మోసపోయానని గుర్తించి రాచకొండ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సాంకేతికత ఆధారాల ఆధారంగా తనుశ్రీ, రవితేజలను అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు వీరు ఇద్దరూ పలువురు యువకులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే వీరిపై మేడిపల్లి ఠాణాలోనూ కేసు నమోదయింది. ఇదీ చదవండి: Anti Hijab Protests: ఆస్కార్ విన్నింగ్ మూవీ నటి అరెస్ట్ -
హైదరాబాద్ నుంచి విదేశాలకు డ్రగ్స్
అల్వాల్: హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు డ్రగ్స్‌ను కొరియర్ ద్వారా తరలిస్తున్న ఐదుగురు సభ్యుల అంతర్జాతీయ ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారివద్ద నుండి 9 కోట్ల రూపాయల విలువ చేసే 8.5 కేజీల సుడోపెడ్రిస్ అనే సింథటిక్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకొన్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలను మీడియాకు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన రహీమ్, ఫరీద్, ఫైజల్ అనే వ్యక్తులు ప్రధాన సూత్రదారులుగా హైదరాబాద్, మహారాష్ట్ర కేంద్రాలుగా ఈ ముఠా కొనసాగుతోంది. సింథటిక్ డ్రగ్‌ను లుంగీల ప్యాకెట్ పేరుతో కొరియర్ ద్వారా ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నారు. పక్కా సమాచారం ప్రకారం నాచారం పోలీసుల సహకారంతో మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు ఈ రాకెట్‌ను ఛేదించారు. ఈ డ్రగ్ ఒక కేజీ బహిరంగ మార్కెట్లో సుమారు కోటి రూపాయలకు విక్రయిస్తారన్నారు. రాబోయే కొత్త సంవత్సర వేడుకలను దృష్ట్రిలో పెట్టుకొని ఈ ముఠా విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సీపీ తెలిపారు. -
Hyderabad: గంజాయి సరాఫరా.. మహిళా డ్రగ్ పెడ్లర్లపై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ ముఠాలో సభ్యులుగా ఉన్న ఇద్దరు మహిళా పెడ్లర్లపై రాచకొండ పోలీసులు మంగళవారం పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 8 మంది నిందితులపై పీడీ చట్టం ప్రయోగించిన సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన ప్రధాన డ్రగ్ పెడ్లర్ ఆకాశ్ కుమార్ ఆదేశాల మేరకు ముఠా సభ్యులు సాయినాథ్ చౌహాన్, అతడి భార్య రవళి, ఆమె స్నేహితురాలు సంగీత, షేక్ నవాజుద్దీన్, వినాయక్, బానావత్ కిషన్, బానావత్ నాగలు రెండు కార్లలో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన రాజు, సంసాయిరావు, నుంచి 480 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. హైదరాబాద్ మీదుగా కర్ణాటకకు తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం అందుకున్న హయత్‌నగర్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో రవళి, సంగీతలపై హయత్‌నగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి, చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
ముస్లిం మహిళల కోసం ‘షీ ఎరా’
సాక్షి, హైదరాబాద్: మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న రాచకొండ పోలీసులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. షీ టీమ్స్ ఎంపవరింగ్ రూరల్ ఆస్పిరెంట్స్ (షీ ఎరా) అనే ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కింద గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసం, స్వయం ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్‌లో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ (ఆర్కేఎస్సీ) మహిళా విభాగం, రాచకొండ పోలీసు కమిషనరేట్ భాగస్వామ్యమయ్యారు. త్వరలోనే పహాడీషరీఫ్‌లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ వంటి శిక్షణ ఇస్తారు. ఇందుకు వందల సంఖ్యలో దరఖాస్తులు రాగా.. తొలి విడతలో 50 మంది మహిళలను ఎంపిక చేశారు. వీరిని రెండు బ్యాచ్‌లుగా విభజించి, రోజుకు నాలుగు గంటల చొప్పున ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. వారికే ఎందుకంటే? ఇటీవలి కాలంలో పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికలను, పిల్లలను వ్యభిచార గృహ నిర్వాహకులకు విక్రయించడం, మానవ అక్రమ రవాణా తదితర కేసులు వెలుగు చూశాయి. ఆయా కేసులలో బాధితులను విచారించగా.. వ్యసనాలకు అలవాటు పడిన భర్తతో విసుగుచెంది, కన్న పిల్లలను పోషించే ఆరి్ధక స్థోమత లేకపోవడంతో పిల్లలను అమ్ముకుంటున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. చట్ట ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్పటికీ.. నిరక్షరాస్యులైన మహిళలకు జీవనోపాధి కల్పిస్తే సమస్యను కొంత వరకు పరిష్కరించవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. (చదవండి: భాద్యత నాది సమ్మె విరమించండి) -
ప్రేమ పేరుతో మోసం తిరుపతిలో నిందితుడి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: ప్రేమ, పెళ్లి పేరుతో ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ జే నరేందర్ గౌడ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్‌లోని వెయిట్ లాస్ క్లినిక్‌లో బాధితురాలు పనిచేస్తుంది. తిరుపతి తిమ్మినాయుడుపాలెంకు చెందిన వేలం శివతేజ 2016లో తన శరీర బరువును తగ్గించుకునేందుకు ఈ క్లినిక్‌కు వెళ్లాడు. ఆ సమయంలో బాధితురాలి ఫోన్ నంబరుతీసుకున్నాడు. తరచు ఆమెతో చాటింగ్ చేస్తూ స్నేహం పెంచుకున్నాడు. తాను కెనడాలో ఉద్యోగం చేస్తున్నానని, తిరుపతిలో భారీగా ఆస్తులున్నాయని నమ్మబలికాడు. ఆ తర్వాత తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కొన్ని నెలలు గడిచాక.. ఆమెకు తెలియకుండా మరో మహిళలను వివాహమాడాడు. ఈ క్రమంలో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన శివతేజ.. బాధితురాలి నుంచి డబ్బు గుంజాలని పథకం వేశాడు. గతేడాది ఏప్రిల్‌లో ఆమెను సంప్రదించి.. తన బ్యాంకు ఖాతాలు స్తంభించిపోయాయని, వీసా ప్రాసెసింగ్, భవన నిర్మాణం, మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో బాధితురాలిని డబ్బు అడిగాడు. అతడి మాటలు నమ్మిన బాధితురాలు గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య కాలంలో పలు దఫాలుగా రూ.7,13,053 నిందితుడి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసింది. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోమని బాధితురాలు బలవంతం చేయడంతో స్పందించడం మానేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడు శివతేజను తిరుపతిలో అరెస్టు చేసి, హైదరాబాద్‌కు తీసుకొచి్చ, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి సెల్‌ఫోన్, రెండు సిమ్‌కార్డులను స్వా«దీనం చేసుకున్నారు. చదవండి: మామ బాగా రిచ్..స్నేహితులను ఉసిగొల్పి దోపిడీ చేయించిన అల్లుడు -
తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలు.. ఘరానా దొంగ రమేష్ అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ, పలుమార్లు జైలుకెళ్లినా బుద్ది మార్చుకోని మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు రమేష్ రాచకొండ పోలీసులకు చిక్కాడు. గతేడాది డిసెంబర్లో ఎల్బీనగర్ ఠాణా పరిధిలో ఓ కారును చోరీ చేసిన ఇతడిపై ఎల్బీనగర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు నిఘా పెట్టారు. శనివారం తెల్లవారు జామున ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రమేష్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్స్ డీసీపీ యాదగిరితో కలిసి ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ శనివారం వివరాలు వెల్లడించారు. ► సూర్యాపేట జిల్లా, చివేముల మండలం, మూ న్యా నాయక్ తండాకు చెందిన ధారావత్ రమేష్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన అతను డబ్బుల కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. జనసంచారం లేని చోట పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను చోరీ చేసి రాత్రి వేళల్లో వాటిపై కాలనీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకుని చోరీలకు పాల్పడేవాడు. ► ప్రస్తుతం రమేష్‌పై రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో 10 కేసులు, సూర్యాపేటలో 5, నల్లగొండలో 3, విశాఖపట్నంలో 2, కొత్తగూడెం, విజయవాడలో ఒక్కో కేసు న్నాయి. సూర్యాపేట టు టౌన్ పోలీసు స్టేషన్లో నమోదైన 15 కేసుల్లో రమేష్ పరారీలో ఉన్నాడు. మోత్కూరు ఠాణాలో అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) కూడా జారీ అయింది. 2017లో నాగార్జునసాగర్ పోలీసులు రమేష్‌ను దోపిడీతో పాటు హత్యాయత్నం కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించారు. చివరిసారిగా 2019లో ఖమ్మంలోని రఘునాథపాలెం పోలీసులు ఇతడిని వాహనం చోరీ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించారు. 2021 సెప్టెంబర్‌లో కరోనా కారణంగా జైలు నుంచి విడుదలయ్యాడు. అయినా ప్రవృత్తి మార్చుకోలేదు. ► గతేడాది డిసెంబర్ 22న ఎల్బీనగర్ పీఎస్ పరిధిలోని సూర్యోదయ నగర్ కాలనీలోని శ్రీదుర్గా కార్స్ ఆఫీసులో చొరబడి టేబుల్‌పైన ఉన్న కారు తాళాలను తీసుకుని స్కోడా కారును దొంగిలించాడు. ఈ కేసులో రమేష్‌పై ఎల్బీనగర్ సీసీఎస్, ఎల్బీనగర్ పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో తిరుగుతున్న అతడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.35.55 లక్షల విలువ చేసే 10 తులాల బంగారం ఆభరణాలు, 2 కార్లు, 2 బైక్‌లు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ప్రశ్నించిన పోలీసులు -
హైదరాబాద్ లో ఫింగర్ ప్రింట్ సర్జరీ ముఠా గుట్టురట్టు
-
హైదరాబాద్‌లో ఫింగర్ ప్రింట్ సర్జరీ ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. నగరంలో ఫింగర్ ప్రింట్ సర్జరీ ముఠాను రాచకొండ పోలీసులు గుట్టురట్టు చేశారు. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు కొత్త తరహాలో ఈ ముఠా ప్రయత్నాలు చేస్తోంది. గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటే వేలిముద్రలు తప్పనిసరి. అయితే ఒకసారి రిజక్ట్ అయిన యువకులు సర్జరీలతో మళ్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సంవత్సరం పాటు వేలిముద్రలు కనిపించకుండా ఉండేలా కొత్త రకం సర్జరీ చేస్తున్నట్లు సమాచారం. సర్జరీ తర్వాత దొడ్డిదారిన గల్ఫ్ దేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. యువకులకు వేలిముద్రల సర్జరీ చేస్తున్న డాక్టర్‌తో పాటు కొంత మంది సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: (అనంతపురం ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై అట్రాసిటీ కేసు నమోదు) -
నకిలీ సర్టిఫికెట్ల తయారీలో శిక్షణ!
సాక్షి, హైదరాబాద్: నకిలీ విద్యార్హత పత్రాల తయారీ ముఠా గుట్టురట్టయ్యింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లను సృష్టించి, విక్రయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఎస్ఓటీ డీసీపీ కే మురళీధర్, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌లతో కలిసి రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. చాంద్రాయణగుట్ట, క్యూబా కాలనీకి చెందిన మహ్మద్ ఖలీముద్దీన్ అలియాస్ ఖలీం నకిలీ సర్టిఫికెట్లను తయారు చేయడంలో దిట్ట. గత ఏడేళ్లుగా ఈ దందాను నిర్వహిస్తున్నాడు. ఇతనిపై చాంద్రాయణగుట్ట, అబిడ్స్ ఠాణాలలో రెండు కేసులున్నాయి. పోలీసుల నిఘా ఉండటంతో అజ్ఞాతంలో ఉంటూ తన అనుచరులకు శిక్షణ ఇస్తున్నాడు. ఖలీం స్నేహితుడైన గోల్కొండ మోతీ దర్వాజకు చెందిన ముక్తార్ అహ్మద్‌కు అడోబ్ ఫొటోషాప్‌లో ఫొటోలు, డాక్యుమెంట్ల ఎడిటింగ్‌పై మంచి అనుభవం ఉంది. దీంతో ఖలీం ఇతనికి నకిలీ సరి్టఫికెట్ల తయారీ శిక్షణ ఇచ్చాడు. అలాగే విద్యార్హత పత్రాల తయారీకి అవసరమైన యూనివర్సిటీ గుర్తింపు చిహ్నలు, హాలోగ్రామ్స్ ఇతరత్రా వస్తువులను అందించాడు. తన పేరు బయటకు రాకుండా రహస్యంగా ఉంచాలని, కమీషన్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించాడు. రాజేంద్రనగర్‌కు చెందిన అహ్మద్ ఫిరోజ్, లక్డీకపూల్ ఏసీ గార్డ్స్‌కు చెందిన మహ్మద్ ఫరూక్ అజీజ్, టోలిచౌకీ పారామౌంట్ కాలనీకి చెందిన మహ్మద్ సారూషుల్లా ఖాన్‌లను ముక్తార్ కమీషన్ ఏజెంట్లుగా నియమించుకున్నాడు. వారికి అవసరమైనట్లు నకిలీ విద్యార్హత పత్రాలను తయారు చేసేవాడు. ఒక్కో సరి్టఫికెట్‌ను రూ. లక్ష, రూ. 2 లక్షలకు విక్రయించేవాడు. ఇందులో 25 శాతం కమీషన్‌ను ఖలీంకు చెల్లించేవారు. ఈ క్రమంలో నిందితుల నుంచి హుస్సేనీఆలంకు చెందిన మహ్మద్ జుబేర్ అలీ, టోలిచౌకీకి చెందిన సయ్యద్ అతీఫుద్దిన్ రూ.లక్షకు నకిలీ విద్యార్హత పత్రాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సర్టిఫికెట్లను తీసుకునేందుకు బాలాపూర్ ఎర్రకుంటకు వెళ్లారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు చేసి సరూషుల్లా ఖాన్, జుబేర్, అతీఫుద్దిన్, ఫరూఖ్ అజీజ్, మహ్మద్ ఫిరోజ్, ముక్తార్ అహ్మద్‌లను పట్టుకున్నారు. వీరి నుంచి నకిలీ సర్టిఫికెట్లతో పాటు ల్యాప్‌టాప్, స్టాంప్‌లు, 6 సెల్ఫోన్లు ఇతరత్రా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ ముఠా 258 సర్టిఫికెట్లను తయారు చేసి, విక్రయించారని, వీరిలో పలువురు విదేశాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఎర్రగడ్డకు చెందిన సల్మాన్ యూకేకు, కాలాపత్తర్‌కు చెందిన మీర్జా యూసుఫుద్దిన్ న్యూయార్క్‌కు, మెహదీపట్నానికి చెందిన మహ్మద్ మాజీద్ అమెరికాకు, గోల్కొండకు చెందిన రెహాన్, అశ్వాక్ అహ్మద్ దుబాయ్ దేశాలకు వెళ్లినట్లు సీపీ తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి, ఫాస్ట్‌ట్రాక్ కోర్ట్‌లో శిక్ష పడేలా చేస్తామని పేర్కొన్నారు. వీరి వెనకెవరున్నారు? ఈ నకిలీ సరి్టఫికెట్ల రాకెట్‌ను నడుపుతున్న ప్రధాన నిందితుడు మహ్మద్ ఖలీముద్దిన్‌తో సహా ఇతర నిందితులు, కొనుగోలు చేసే విద్యార్థులు అందరూ ఒకే వర్గానికి చెందిన వారే కావటంతో పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వీరి నుంచి నకిలీ పత్రాలను కొనుగోలు చేసిన విద్యార్థులు ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వీరి వెనక ఎవరైనా అదృశ్య శక్తులు ఉండి ఈ రాకెట్‌ను నడిపిస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు సూత్రధారి ఖలీం పట్టుబడితేనే దీని వెనక ఎవరున్నారనేది బయటపడుతుందని ఓ పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: నకిలీ పత్రాలతో ఇల్లు విక్రయం) -
ఉప్పల్: ల్యాబ్ సెంటర్లో డ్రగ్స్ తయారీ!.. ఇద్దరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లోని అక్షజ్ మాలిక్యులర్ రీసెర్చ్ ల్యాబ్‌లో మాదక ద్రవ్యాలను తయారు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వీరి నుంచి కొకైన్ మాత్రలు, ఎల్‌సీడీలతో పాటు 53 గ్రాముల సింథటిక్ డ్రగ్స్, 3.6 కిలోల నార్కోటిక్ పదార్థాల ద్రవం, 50 కిలోల హైడ్రోక్లోరైడ్, 12 బాటిళ్ల మిథైలమైన్, రెండు కార్లు, నాలుగు సెల్ఫోన్లు ఇతరత్రా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ కే మురళీధర్‌తో కలిసి సీపీ మహేశ్ భగవత్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ►నల్లగొండ జిల్లా ఓపులాయిపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి లెనిన్ బాబు వరంగల్‌లోని సీకేఎం కాలేజీలో కర్బన్ రసాయన శాస్త్రంలో పీజీ పూర్తి చేశాడు. 2004–13 మధ్య సువాన్, మిత్రోస్, సాయి లైఫ్ సైన్సెస్, అల్బానీ వంటి పలు ఫార్మా కంపెనీలలో జూనియర్ సైంటిస్ట్‌గా పనిచేసి, ఆర్ అండ్ డీ విభాగంలో సీనియర్ కెమిస్ట్ స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత 2014లో నాచారంలోని జీవీకే బయో సైన్సెస్ సమీపంలో అక్షజ్ మాలిక్యులర్ రీసెర్చ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశాడు. కొంతకాలం నడిపిన తర్వాత దీన్ని 2019లో ఉప్పల్‌కు మార్చాడు. ►2017లో ప్రభాకర్ అనే వ్యక్తి నాంపల్లి లెనిన్‌బాబాకు గుంటూరు జిల్లా కొరటిపాడు గ్రామానికి చెందిన పులిచెర్ల శ్రీనివాస్ రెడ్డిని పరిచయం చేశాడు. అగ్రి కెమికల్స్ తయారు చేయాలని సూచించాడు. ఇద్దరి స్నేహ బలపడిన తర్వాత.. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న ఇరువురు మాదక ద్రవ్యాలను తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. అక్షజ్ మాలిక్యులర్ ల్యాబ్స్‌లో లెనిన్‌బాబు సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తే, వాటిని శ్రీనివాస్ రెడ్డి చెన్నైలోని నెపోలియన్‌కు సరఫరా చేసేవాడు. ►ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న భువనగిరి ఎస్ఓటీ, ఉప్పల్ పోలీసులు, ఉప్పల్ డ్రగ్ ఇన్స్పెక్టర్లతో కలిసి ఆకస్మిక దాడులు చేసి లెనిన్‌బాబు, శ్రీనివాస్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. నెపోలియన్ పరారీలో ఉన్నాడు. చదవండి: సికింద్రాబాద్ మహాత్మాగాంధీ రోడ్డు ఏరియాకు ఎన్నో ప్రత్యేకతలు ఏడేళ్ల నుంచి శ్రీనివాస్ రెడ్డి పరారీలోనే.. 1994లో జేఎస్ఎస్ ఫార్మసీ కాలేజీలో బీఫార్మసీ పూర్తి చేసిన శ్రీనివాస్ రెడ్డి.. తార్నాకలోని కిమ్టీ కాలనీలో స్థిరపడ్డాడు. కొంత కాలం మెడికల్ రిప్రజెంట్‌గా పనిచేశాడు. 2010లో ఎఫెడ్రిన్ సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసులో చెన్నై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. 2014లో మెథాంఫేటమిన్ డ్రగ్ సప్లయి కేసులో హైదరాబాద్ ఎన్సీబీ పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు. బెయిల్ మీద బయటికి వచ్చాక కూడా శ్రీనివాస్ ప్రవర్తనలో మార్పు రాలేదు. 2015లో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న నేపథ్యంలో 2015లో కీసర్ పీఎస్‌లో ఎన్డీపీఎస్ కేసు నమోదయింది. అప్పటి నుంచి శ్రీనివాస్ పరారీలోనే ఉన్నాడు. 2018లో ఉప్పల్ పీఎస్‌లో నమోదయిన ఎన్డీపీఎస్ కేసులోనూ శ్రీనివాస్ పరారీలోనే ఉన్నాడు. ఏడేళ్ల నుంచి పరారీలో ఉన్న శ్రీనివాస్.. తాజాగా రాచకొండ పోలీసులకు చిక్కాడు. చదవండి: ‘పతాక’ స్థాయిలో పొరపాట్లు! -
గ్రీజు డబ్బా.. గిఫ్ట్ ప్యాక్! ‘పుష్ఫ’ స్టైల్లో హష్ ఆయిల్ రవాణా
సాక్షి, నాగోలు: గంజాయి ప్రాసెసింగ్ ద్వారా తయారు చేసే హష్ ఆయిల్ స్మగ్లింగ్‌లో ఓ ముఠా ‘పుష్ఫ’ పంథాను అనుసరించింది. గ్రీజు డబ్బాతో పాటు గిఫ్ట్ ప్యాక్ రూపంలోనూ నాలుగు లీటర్లు తీసుకువస్తుండగా సమాచారం అందుకున్న ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్, డీసీపీలు సన్‌ప్రీత్‌సింగ్, మురళీధర్, ఏసీపీలు వెంకన్న నాయక్, పురుషోత్తం రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ లీటర్ హష్ ఆయిల్ రూ.4 లక్షలు.. ఏపీలోని విశాఖపట్నం జిల్లా జంపెన గ్రామానికి చెందిన కోనశివ (24) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన వంట పని కార్మికుడు నూకరాజుతో (25) ఇతడికి స్నేహం ఉంది. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి చెందిన సంతోష్‌కుమార్‌తో శివకు మూడేళ్లుగా పరిచయం ఉంది. ఇటీవల శివను కలిసిన సంతోష్ తాను ఇచ్చే హష్ ఆయిల్‌ను హైదరాబాద్‌కు చేరిస్తే రూ.40 వేలు ఇస్తానంటూ చెప్పడంతో అంగీకరించిన శివ తనకు సహకరిస్తే ఆ మొత్తంలో సగం ఇచ్చేలా నూక రాజుతో ఒప్పందం కుదుర్చుకుని వీరిద్దరూ బుధవారం విశాఖలోని లంకెలపాలెం వెళ్లి సంతోష్‌ను కలిశారు. అక్కడ సంతోష్‌తో పాటు అతడి స్నేహితుడైన సంజీవ్‌రావు కూడా ఉన్నాడు. లీటర్ హష్ ఆయిల్‌ను గిఫ్ట్‌కవర్‌లో ప్యాక్ చేసి సంతోష్ వీరికి అప్పగించాడు. గ్రీజు డబ్బా అడుగున మూడు లీటర్ల హష్ ఆయిల్‌ను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి ఉంచి, దానిపై గ్రీజు నింపిన డబ్బాను సంజీవరావు అప్పగించాడు. వీటిని తీసుకుని శివ, నూక రాజు పోలీసులకు అనుమానం రాకుండా వేర్వేరుగా బయలుదేరారు. గతంలో గంజాయి, హష్ ఆయిల్ పంపే ఏజెన్సీ ముఠాలు హైదరాబాద్‌లో ఎవరికి అందించాలే సరఫరా దారులకు చెప్పేవాళ్లు. ఇలా చేస్తే పోలీసులకు వాళ్లూ చిక్కుతున్నారనే ఉద్దేశంతో ఇటీవల పంథా మార్చారు. తొలుత హైదరాబాద్ చేరుకున్నాక తమకు ఫోన్ చేయాలని, అప్పుడు ఎవరికి అందించాలనేది చెప్తామంటూ శివ, నూకరాజుకు చెప్పారు. వీరి కదలికలపై ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందటంతో ఇన్స్పెక్టర్ సుధాకర్ నేతృత్వంలోని బృందం హయత్‌నగర్ పోలీసులతో కలిసి దాడి చేసి ఇద్దరినీ పట్టుకుని హష్ ఆయిల్ స్వాధీనం చేసుకుని సరఫరా దారుల కోసం గాలిస్తున్నారు. హష్ ఆయిల్‌ను నగరంలో లీటర్ రూ.4 లక్షలు లేదా 10 ఎంఎల్ రూ.4 వేలు చొప్పున అమ్ముతున్నట్లు గుర్తించారు. చదవండి: ట్యాక్సీ డ్రైవర్‌తో మహిళా టెక్కీ ప్రేమ పెళ్లి.. తప్పటడుగులు వేశానంటూ.. -
రాచకొండ పోలీసులను బురిడీ కొట్టించిన సీఐ నాగేశ్వరరావు
-
రాచకొండ పోలీసులను బురిడీ కొట్టించిన సీఐ నాగేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితను బెదిరించి అత్యాచారం చేసిన సీఐ నాగేశ్వరరావు రాచకొండ పోలీసులను బురిడీ కొట్టించాడు. నాగేశ్వరరావును అరెస్ట్ చేసేందుకు శనివారం సాయంత్రం ఎస్ఓటీ పోలీసులు రాగా.. డ్యూటీలో ఉన్నానని ఉదయం లొంగిపోతానని చెప్పాడు. అయితే అర్ధరాత్రి 12.15 నుంచి మొబైల్ స్వీచ్చాఫ్ చేశాడు. రెండు రోజులుగా నాగేశ్వరరావు పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. సీఐ కోసం నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి.ఇదిలా ఉండగా సీఐ నాగేశ్వరరావు అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఓ కేసులో అక్రమంగా బీఎండబ్ల్యూ కారును తన వద్దే ఉంచుకొని సీజ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా సీఐ నాగేశ్వరరావును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్‌లోని ఏసీపీ కార్యాలయాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. డీసీపీ కార్యాలయం ముందు బైఠాయించి మహిళ లు, యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులే మహిళపై అత్యాచారం చేసి బెదిరింపులకు పాల్పడితే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని డిమాండ్ చేశారు. .24 గంటల్లో సీఐ నాగేశ్వరరావుని అరెస్ట్ చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. కాగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. -
గంజాయి సరఫరా కేసులో అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్
గంజాయి సరఫరా కేసులో సినీ అసిస్టెంట్ డైరెక్టర్ హాథీరామ్ను రాచకోండ పోలీసులు అరెస్టు చేశారు. చాలా కాలం నుంచి సినిమా ఆర్టిస్టులకు హాథీరామ్ గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతని దగ్గర నుంచి దాదాపు 190 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాథీరామ్ కొంతకాలంగా కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు గంజాయిని సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసుల సమాచారం ప్రకారం.. కురుక్షేత్రం, యుద్ధం శరణం గచ్చామి సినిమాలకు హాథీరామ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో కర్ణాటక నుంచి కారులో గంజాయిని హాథీరామ్ సరఫరా చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. దీనిపై తమకు కొద్ది రోజుల క్రితమే సమాచారం అందిందని. సోమవారం ఖచ్చితమైన సమాచారం అందడంతో దాడి చేశామన్నారు. ఈ కేసులో హథిరామ్తో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. ఈ కేసులో హాథీరామ్ను ఏ2 నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
ఏసీ కోచ్‌లో గంజాయి సరఫరా
సాక్షి, హైదరాబాద్: ట్రావెల్ బ్యాగ్‌లలో గంజాయి ప్యాకెట్లు పెట్టుకొని, ఏసీ కోచ్‌లో హైదరాబాద్ మీదుగా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు నుంచి ఢిల్లీకి వెళుతున్న నలుగురు వ్యక్తులను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 52 కిలోల గంజాయి, లీటర్ హష్ ఆయిల్, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన విజయ్ ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ట్రావెల్ బ్యాగ్‌లలో సర్ది కిరాయి ఏజెంట్ల ద్వారా ఢిల్లీకి రైలులో అక్రమంగా రవాణా చేసేవాడు. ఈ దందాలో అతడికి ఢిల్లీకి చెంది న గంజాయి పెడ్లర్ ఇమ్రాన్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇమ్రాన్ నుంచి ఆర్డర్ అందుకున్న విజయ్.. 52 కిలోల గంజాయి, 25 బాటిళ్ల హష్ ఆయిల్ (ఒక్కోటి 40 మిల్లీ గ్రాములు) చొప్పున చిన్న ప్యాకెట్లుగా మార్చి వాటిని ట్రావెల్ బ్యాగ్‌లలో సర్ది, ఇమ్రాన్‌కు సమాచారం అందించాడు. దీంతో సరుకు తీసుకొచ్చేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ముహిద్దీన్‌పూర్‌కు చెందిన ఫయ్యూ మ్, జునైద్, సరిఖ్, మొహమ్మద్ నజీమ్ అనే కిరాయి ఏజెంట్లను ఇమ్రాన్ సంప్రదించాడు. ఈ నెల 3న ఢిల్లీలో రైలెక్కిన వీరు 5న వైజాగ్‌లో దిగి స్థానిక లాడ్జిలో బస చేశారు. విజయ్ నుంచి సరుకు తీసుకొని అదే రోజు రాత్రి దువ్వాడ రైల్వే స్టేషన్లో గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసుల తనిఖీలు జరుగుతున్నట్లు తెలియడంతో మౌలాలీ రైల్వే స్టేషన్లో దిగారు. రాత్రి వరకూ స్టేషన్ ఆవరణలో గడిపారు. రాత్రి 11 గంటల తర్వాత సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్ ఏసీలో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకున్నారు. రైలు ఎక్కేందుకు మౌలాలీ నుంచి బస్‌లో సికింద్రాబాద్ వెళుతుండగా సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు జెడ్టీఎస్ క్రాస్‌రోడ్స్‌లో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిరంతర నిఘాతో అడ్డుకట్ట : సీపీ రాష్ట్రంలో డ్రగ్స్‌పై నిఘా పెరగడంతో సరఫరా తగ్గింది. ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు, అరెస్ట్‌లు చేస్తుండటంతో సరఫరాదారుల్లో వణుకు పుట్టింది. గంజాయి సరఫరా తగ్గడంతో రేట్లు పెరిగాయని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. (చదవండి: ఫంక్షన్.. ఉండదిక టెన్షన్) -
క్రికెట్ బెట్టింగ్...ఏడుగురు అంతరాష్ట్ర నిందితులు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: పుదుచ్చేరిలోని యానాం కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రాచకొండ పోలీసులు బట్టబయలు చేశారు. ప్రధాన బుకీ సీహెచ్ సాయిరామ్ వర్మ పరారీలో ఉండగా.. ఏడుగురు అంతర్రాష్ట్ర నిందితులను ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.56 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాచకొండ ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఇన్స్పెక్టర్ బీ అంజిరెడ్డిలతో కలిసి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన తన్నీరు నాగరాజు 2016లో క్రికెట్ బెట్టింగ్ కేసులో వనస్థలిపురం పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా తన వైఖరి మార్చుకోలేదు. తాజాగా ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో.. మెయిన్ బుకీ సాయిరామ్ వర్మతో చేతులు కలిపి హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగ్స్ మొదలుపెట్టాడు. తన స్నేహితుడైన కృష్ణా జిల్లా, చింతకుంటపాలెం గ్రామానికి చెందిన గుండు కిశోర్‌ను రెండు నెలల పాటు కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయాలని ఇందుకు నెలకు రూ.50వేల కమీషన్ ఇస్తానని చెప్పి నగరానికి తీసుకొచ్చాడు. తన బంధువులైన ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన తన్నీరు అశోక్, చెమ్మేటి వినోద్‌లను సబ్ బుకీలుగా ఏర్పాటు చేసుకొని వనస్థలిపురంలో వినోద్ ఇంట్లో బెట్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. మ్యాచ్ మొదలు మూడు లైన్ల ద్వారా సబ్ బుకీలు పందేలు కాసే పంటర్లకు ఆన్లైన్లో లింక్‌లు పంపేవారు. మ్యాచ్ పరిస్థితిని బట్టి పంటర్లు రూ.10–50 వేల మధ్య పందేలు కాస్తుంటారు. ప్రతి బెట్టింగ్‌కు సబ్ బుకీలు రేటింగ్స్ ఇస్తుంటారు. మ్యాచ్ పూర్తయ్యాక.. ఏ పంటర్ల నుంచి ఎంత సొమ్ము వసూలు చేయాలి, ఎంత చెల్లించాలో బుకీలు ఏజెంట్లకు సూచిస్తారు. మొత్తం లాభంలో సబ్ బుకీలకు 3 శాతం కమీషన్‌గా ఇచ్చేవారు. ఆన్లైన్లో పందేలు కాసేవారి కోసం సాయిరామ్ వర్మ ‘రోమన్ క్యాథలిస్ట్ కులమదై స్వామి’ అనే పేరుతో ఐసీఐసీఐ బ్యాంక్‌లో నకిలీ ఖాతాను తెరిచాడు. గురువారం జరిగిన రాజస్థాన్ రాయల్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌పై క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు.. సత్యానగర్ కాలనీలోని స్థావరంపై దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు. సబ్ బుకీలు నాగరాజు, కిశోర్, అశోక్, వినోద్‌లతో పాటు పంటర్లు చైతన్యపురీకి చెందిన కోట్ల దినేష్ భార్గవ్, కొత్తపేటకు చెందిన మేడిశెట్టి కిశోర్, శంకర్‌పల్లికి చెందిన బోజన రాజులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.11.80 లక్షల నగదు, బ్యాంక్ ఖాతాల్లోని రూ.31,17,576 సొమ్ముతో పాటు 9 ఫోన్లు, కారు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: తుపాకీ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు) -
'ది కశ్మీర్ ఫైల్స్'.. కక్కుర్తి పడి ఆ లింక్స్ ఓపెన్ చేయకండి
Download The Kashmir Files: For Free Police Warn Against Free Links: ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఉచితంగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ లింక్ క్లిక్ చేయండి అంటూ మీకు వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఫ్రీగా సినిమా చూడొచ్చని కక్కుర్తి పడి లింక్ క్లిక్ చేశారో.. మీ బ్యాంకు ఖాతాలోని డబ్బులన్నీ ఖాళీ అయినట్లే. ఎందుకంటే సైబర్ నేరగాళ్ల దృష్టి ఇప్పుడు ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై పడింది. ఈ సినిమాను ఉచితంగా చూడొచ్చంటూ లింకులు పంపి స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇలాంటి ఫ్రీలింకులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఢిల్లీ, నోయిడాల్లో హ్యాకర్లు ఇదే పనిగా సైబర్ క్రైమ్‌కు పాల్పుడుతున్నారని పోలీసులు తెలిపారు. ది కశ్మీర్ ఫైల్స్‌ను ఉచితంగా చూడొచ్చంటూ లింకులు పంపి స్మార్ట్ఫోన్లను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసినట్లు చెప్పారు. ఒకవేళ మీకు ఇలాంటి లింకులు వస్తే 1920 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని రాచకొండ పోలీసులు సూచించారు. కాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. వారం రోజుల్లోనే వంద కోట్లు సాధించి సత్తా చాటుతోంది. ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును చేధించిన రాచకొండ పోలీసులు
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును రాచకొండ పోలీసులు గురువారం చేధించారు. మట్టారెడ్డి గ్యాంగే హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. మట్టారెడ్డితో పాటు ముగ్గురు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మట్టారెడ్డి, మొహినుద్దీన్, నవీన్‌తోపాటు మరో ఇద్దురిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్రెడ్డిని కాల్చి చంపింది సుపారీ గ్యాంగ్‌గా తేల్చారు. మోహినుద్దిన్ మట్టారెడ్డి వాచ్‌మెన్‌గా, నవీన్ శ్రీనివాస్‌రెడ్డి బినామీగా పోలీసులు గుర్తిచారు. -
HYD: మందుతాగి పట్టుబడితే.. ఇక ఆఫీస్‌లో మీ పని అంతే!
సాక్షి, హైదరాబాద్:మందుబాబులను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. డ్రంకన్ డ్రైవ్‌లో చిక్కిన వారి కుటుంబ సభ్యులను పిలిపించి మందలించే పోలీసులు.. తాజాగా డ్రంకన్ డ్రైవ్‌లో చిక్కిన ఇద్దరు మందుబాబులు పని చేస్తున్న కంపెనీలకు ఉద్యోగుల ఘనకార్యాన్ని తెలుపుతూ రాచకొండ ట్రాఫిక్ పోలీసులు లేఖ రాశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా రోడ్డు భద్రతపై ఉద్యోగులకు అవగాహన కల్పించాలని ఆ లేఖలో సూచించారు కూడా. ఈ నెల 18 నుంచి 24 వరకు మధ్య రాచకొండ పరిధిలో 413 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. రూ.8,47,500 జరిమానా విధించారు. వీరిలో 20 మందికి సంబంధిత కోర్ట్లు జైలు శిక్షను విధించాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన 34,042 మందిపై కేసులు నమోదు చేశారు. వీరికి రూ.1,37,28,710 జరిమానా విధించారు. వీటిలో అత్యధికం హెల్మెట్ లేని కేసులే. 19,866 విత్ఔట్ హెల్మెట్ కేసులు కాగా.. వీరికి రూ.36,45,300 జరిమానా విధించారు. వారం రోజుల వ్యవధిలో రాచకొండ పరిధిలో వంద రోడ్డు ప్రమాద కేసులయ్యాయి. వీటిల్లో 15 మంది మరణించగా.. 88 మందికి గాయాలయ్యాయి. చదవండి: కుట్ల నొప్పి తట్టుకోలేని తల్లి.. ఉరినే భరించింది! -
అధిక శక్తులు ఉన్నాయని లక్షలు దండుకుంటున్న కేటుగాడు
హైదరాబాద్: పూజల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న కేటుగాడిని రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల ప్రకారం.. లోయర్ ట్యాంక్ బండ్‌కు చెందిన సదరు మహిళ తన ఇంట్లో నెలకొన్న ఆర్థిక, అనారోగ్య సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. రాకేష్ అనే వ్యక్తిని ఆశ్రయించింది. ఈ క్రమంలో అతగాడు.. తనకు అధిక శక్తులు ఉన్నాయని, మంత్రాలతో మహిళ సమస్యలను దూరం చేస్తానని నమ్మించాడు. అయితే, దీనికోసం అమ్మవారికి పూజ చేయాలని దానికి పెద్ద మొత్తంలో ఖర్చుఅవుతుందని తెలిపాడు. అంతటితో ఆగకుడండా.. పూజలు చేస్తానని చెప్పి ఆ మహిళ నుంచి 1,60,000ల నగదు, 5 తులాల బంగారాన్ని రాకేష్ తీసుకున్నాడు. పూజల గురించి ఎన్నిసార్లు ప్రస్తావించిన ఆ వ్యక్తి మాటను దాటవేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ మహిళకు అనుమానం వచ్చి.. తాను ఇచ్చిన నగదు, బంగారం తిరిగి ఇచ్చేయాలని వేడుకుంది. ఈ నెల (ఆగస్టు) 10 న మహిళ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కోరింది. దీంతో మోసగాడు.. బాధిత మహిళను అసభ్యపదజాలంతో దూషించి ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టాడు. దీంతో బాధితురాలు తాను మోసపోయినట్లు గ్రహించి నెరెడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోనికి తీసుకుని పలుసెక్షన్ల కింద కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు విచారణలో రాకేష్ ఇప్పటికే మరో 5 గురిని కూడా మోసం చేసినట్లు గుర్తించారు. చదవండి: మద్యానికి బానిసైన కొడుకును మందలించినందుకు... -
మావోయిస్టుల ఇళ్లకు రాచకొండ పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : రాచకొండ పోలీసులు ఆదివారం అండర్ గ్రౌండ్లో ఉన్న మావోయిస్టుల ఇళ్లకు వెళ్లారు. మావోయిస్టులు చంద్రన్న, పల్లెపాటి రాధ కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. చంద్రన్న, రాధ మావోయిస్టు అగ్రనేత ఆర్కేకు రక్షణ దళంగా ఉన్నారు. ఈ ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయేలా సహకరించాలని వారి కుటుంబసభ్యులను కోరారు. -
ఒక్క మెసేజ్‌తో రూ. 41.98 లక్షలు కొట్టేశాడు
సాక్షి, నాగోలు: ఆన్లైన్లో నకిలీ యాప్ సృష్టించి మోసాలకు పాల్పడుతున్న మధ్యప్రదేశ్‌కి చెందిన ఆదిత్య నారాయణ్ గాడ్బోలే (37)ను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి రూ.11.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. నాగోలుకు చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్లో వచ్చిన నోటిఫికేషన్‌ను క్లిక్ చేశాడు. పెట్టుబడులు పెడితే అంతకు మించి ఆదాయం చూపిస్తామని ఓ యువతి ఫోన్లో చెప్పడంతో గత డిసెంబర్ 1వ తేదీ నుంచి 17వరకు 17 రోజుల్లోనే రూ. 41.98 లక్షల నగదును అకౌంట్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ తర్వాత అవతలి వైపు నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన ఆదిత్య నారాయణ్ గోడ్బోలేగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. ఆన్లైన్లో ఫారెక్స్ ట్రేడింగ్ యాప్‌ను చైనాకు చెందిన మౌజిబిన్ అనే వ్యక్తి తయారు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఆదిత్య నారాయణ్ గతంలో చైనాలో ఎంబీబీఎస్ చదివాడు. -
'స్నేహం చేయకపోతే అశ్లీల ఫోటోలను షేర్ చేస్తా'
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా యువతిని వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వివరాలు.. విశాఖపట్నం జిల్లాకు చెందిన భార్గవ్ ఫోన్ ద్వారా హైదరబాద్‌కు చెందిన యువతికి పరిచయమయ్యాడు. అనంతరం ఆమెతో పరిచయం పెంచుకొని ఆమెకు తెలియకుండా వ్యక్తిగత చిత్రాలు సేకరించాడు. ఆపై తనతో స్నేహం కొనసాగించాలని లేకపోతే అశ్లీల చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ భార్గవ్ ఆ యువతిని బెదిరించాడు. దీంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించి భార్గవ్‌పై ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో భార్గవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
సోఫియాను అంటూ హైదరాబాద్ వ్యక్తికి కాల్..
సాక్షి, హైదరాబాద్: గిఫ్ట్‌ల పేరుతో అమాయకులకు గాలం వేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం నేరేడ్మెట్లోని రాచకొండ సీపీ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. నైజీరియా, ఘనా తదితర దేశాలకు చెందిన ఎక్‌పాల్‌గడ్‌స్టీమ్, అడ్జల్, కిక్కి కాన్ఫిడెన్స్ దావిద్, పి. క్రోమవోయిబో, ఎజిటర్ డానియల్ కొంత కాలంగా విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చారు. ఢిల్లీలో మకాం వేసిన వీరు ‘డింగ్ టోన్’ యాప్ ద్వారా అబ్బాయిలతో అమ్మాయిలాగా, అమ్మాయితో అబ్బాయిలాగా చాటింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన యువకుడికి సోఫియా అమ్మాయి పేరుతో ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మీ కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నామని మెసేజ్ పంపారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో లాండ్ అయ్యానని, తన వద్ద 75 వేల విదేశీ కరెన్సీ, గోల్డ్ చైన్, మొబైల్ ఫోన్లు తదితర విలువైన వస్తువులు ఉన్నాయని, వాటికి సంబందించి కస్టమ్స్ ట్యాక్స్ కట్టాలని చెబుతూ బాధితుడితో డబ్బులు డిపాజిట్ చేయించుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకుని మల్కాజిగిరి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచినట్లు సీపీ తెలిపారు. నిందితుల ఆటకట్టించిన రాచకొండ సైబర్ క్రైమ్ డీసీపీ యాదగిరి, అడిషనల్ క్రైమ్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ హరినాథ్‌లను సీపీ అభినందించారు. -
కల్తీ బొగ్గు దందా గుట్టురట్టు
సాక్షి, నేరేడ్మెట్ (హైదరాబాద్): పెద్ద పరిశ్రమలు కొనుగోలు చేసిన నాణ్యమైన బొగ్గును దారి మళ్లించి కాజేసి... సగం లోడు నాసిరకం బొగ్గును నింపుతూ మోసం చేస్తున్న కల్తీ మాఫియా గుట్టును ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ, ఇబ్రహీంపట్నం పోలీసులు రట్టు చేశారు. లారీ యజమానులు, డ్రైవర్లతో కుమ్మక్కై బడా పరిశ్రమలను బురిడీ కొట్టిస్తూ కల్తీ బొగ్గు దందా చేస్తున్న 8మంది నిందితులను అరెస్టు చేశారు. 1.050 టన్నుల నాణ్యమైన బొగ్గుతోపాటు 700 టన్నుల నాసిరకం బొగ్గు, రెండు లారీలు, జేసీబీలు, రూ.2.50 లక్షల నగదుతో కలిపి మొత్తం రూ.1.62 కోట్ల విలువైన సొత్తును పోలీసులు సీజ్ చేశారు. శుక్రవారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేష్‌భగవత్ వివరాలు వెల్లడించారు. హస్తినాపురానికి చెందిన గుండె రాజు 2014 నుంచి ఇబ్రహీంపట్నం మండలం రాందాస్‌పల్లిలో బొగ్గు డంపింగ్ యార్డును ఏర్పాటు చేసుకొని బొగ్గు సరఫరా వ్యాపా రం ప్రారంభించాడు. ఈ యార్డు పక్కనే గగన్‌పహాడ్‌కు చెందిన అమీర్ మహ్మద్ డంపింగ్ యార్డు కూడా ఉంది. వీరిద్దరూ కొత్తగూడెం, సింగరేణి నుంచి తక్కువ నాణ్యత ఉన్న బొగ్గు, బొగ్గు బూడిదను కొనుగోలు చేసి తమ డంపింగ్ యార్డులకు తరలిస్తారు. అనంతరం అదే బొగ్గును స్థాని క చిన్నతరహా పరిశ్రమలకు విక్రయిస్తూ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రణాళిక ఇలా... విద్యుత్ ప్లాంట్లు, సిమెంట్, కాగితం తయారీ, అల్యూమినియం ప్లాంట్లు, ఫార్మా కంపె నీలు, ఉక్కు పరిశ్రమలకు అధిక నాణ్యత కలిగిన బొగ్గు అవసరం. లారీ డ్రైవర్లకు డబ్బులు ఆశజూపి సింగరేణి కాలరీస్ నుంచి, విదేశీ బొగ్గుతో ఏపీలోని కృష్ణపట్నం పోర్టు నుంచి వచ్చే నాణ్యమైన బొగ్గు లారీ లను తమ డంపింగ్ యార్డులకు తీసు కొచ్చి... సగం లోడు ఖాళీ చేసి నాసిరకం బొగ్గును నింపి పరిశ్రమలకు పంపేవారు. బొగ్గు కల్తీ జరుగుతోందనే విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం పోలీసులు డంపింగ్ యార్డులపై దాడి చేసి, నిందితులు గుండె రాజు, కాట్రవత్ సోమ, చల్లా అమరేందర్‌రెడ్డి, కురతాల మల్లేష్, నిజాముద్దీన్, ఎరుకల అంజయ్య, సగరాల సత్యం, రిజ్వాన్‌లను అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు ఉత్తంపల్లి లక్ష్మణ్, అమీర్ మహ్మద్, ఉమాకొండ పురుషోత్తంరెడ్డిలు పరారీలో ఉన్నారని తెలిపారు. -
పోలీసుల అదుపులో కోల్ మాఫియా గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: బొగ్గును అక్రమ రవాణా చేస్తున్న కోల్ మాఫియా గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసినట్లు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'నల్లబొగ్గు అక్రమ రవాణా చేస్తున్న ఎనిమిది నిందితులను అదుపులోకి తీసుకున్నాం. 1,050 టన్నుల బొగ్గును సీజ్ చేశాం. నిందితల నుంచి రెండు లక్షల యాభై వేల నగదు, రెండు లారీలతో సహా దాదాపు 2 కోట్ల రూపాయలు విలువ చేసే సామాగ్రి స్వాధీనం చేసుకున్నాం. ప్రస్తుతం బొగ్గు మాఫియాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నాం. ఇబ్రహీంపట్నం రాందాస్‌పల్లిలో డంపింగ్ యార్డ్ తయారు చేసుకుని ముఠా కోల్ మాఫియా కొనసాగిస్తున్నట్లు గుర్తించాం. అక్రమంగా లారీ డ్రైవర్లతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపారం నడిపిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన బొగ్గును ఈ డంపింగ్ యార్డ్‌కు తెసుకొచ్చి వాటిని కల్తీ చేసి వివిధ ప్రాంతాలకు పంపుతారు. కృష్ణ పట్నం, కొత్తగూడెం నుంచి బొగ్గు సరఫరా ఎక్కువగా అవుతుంది. ఇతర రాష్ట్రాల సిమెంట్, ఐరన్ ఫ్యాక్టరీలకు బొగ్గును సరఫరా చేస్తారు. క్వాలిటీ ఉన్న బొగ్గులో నాణ్యత లేని వాటిని మిక్స్‌చేసి పలు కంపెనీలకు సరఫరా చేస్తారు' అని మహేష్ భగవత్ తెలిపారు. -
‘దుకాణం పైనే ఉండి కన్నం వేశాడు’
సాక్షి, హైదరాబాద్: నగల దుకాణంలో దొంగతనానికి పాల్పడిన ముఠాను రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవ్ నగర్లో ఉన్న ధనలక్ష్మి జువెలరీ షాప్‌లో ఈ నెల 11 న భారీ చోరీ జరిగింది. దాదాపు పావు కిలో బంగారం, 75 కిలోల వెండి దొంగిలించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాచకొండ పోలీసులు ఎనిమిది రోజుల్లోనే ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 28 తులాల బంగారం, అరవై మూడు కిలోల వెండి, ఒక ట్రాలీ ఆటో, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. (చదవండి: భార్యను బ్లాక్మెయిల్.. రూ.కోటి వసూలు!) వీటి విలువ సుమారు రూ.47 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులంతా రాజస్థాన్ చెందినవారే కావడం గమనార్హం. దొంగతనం జరిగిన ధనలక్ష్మి నగల దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేసే పప్పు రామ్ దేవాసి ప్రధాన నిందితుడిగా కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు స్నేహితులతో కలిసి తాను పనిచేసే దుకాణానికి పప్పు రామ్ కన్నం వేసాడని చెప్పారు. నిందితుడు పప్పు రామ్ తాను పనిచేసే దుకాణం పైనే నివాసం ఉండేవాడు. దుకాణ యజమానికి అనుమానం రాకుండా నమ్మకంగా ప్రవర్తిస్తూ అతని స్నేహితులతో కలిసి చోరీకి పాల్పడ్డాడు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని కమిషనర్ తెలిపారు. -
‘ఆపన్న హస్తం అందించడం విశేషం’
సాక్షి, హైదరాబాద్: రాచకొండ కమీషనరేట్ ఆధ్వర్యంలో గుడ్ సమారిటన్ అవార్డు వేడుక నాగోలు శుభం కన్వెన్షన్ హాలులో వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సంక్షోభ సమయంలో పోలీసులకు సహకరించి పలువురికి సేవలు చేసిన వారికి అవార్డులను బహుకరించారు. పనులు లేక అవస్థలు పడుతున్న పేదవారికి నిత్యావసర వస్తువులను అందజేసిన చిలుకనగర్ డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్‌కు రాచకొండ సీపీ మహేష్ భగవత్ గుడ్ సమారిటన్ అవార్డును అందజేశారు. సీపీ మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలంలో ఆపన్న హస్తం అందించడం విశేషమని బన్నాల ప్రవీణ్‌ను కొనియాడారు. అవార్డు అందుకున్న ప్రవీణ్ మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలంలో వికలాంగులు, ఒంటరి మహిళలతో పాటు ఇతరులకు నిత్యావసర వస్తువులను అందజేసినట్లు తెలిపారు. ఇక తాను చేసిన సేవలకు గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. కోవిడ్-19 సమయంలో ఈ సేవా కర్యక్రమాలు చేయడానికి తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. -
అనసూయకు రాచకొండ పోలీసుల అభినందన
హైదరాబాద్ : ప్రముఖ యాంకర్ అనసూయ భరధ్వాజ్‌ను రాచకొండ పోలీసులు అభినందించారు. నేడు తన పుట్టినరోజు సందర్భగా.. కీసర మండలంలోని పలువురు గర్భిణి స్త్రీలకు అనసూయ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ.. గర్భిణిలకు సాయం అందజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అనసూయ భర్త సుశాంక్ భరధ్వాజ్ కూడా పాల్గొన్నారు. ఇందకు సంబంధించిన ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేసిన రాచకొండ పోలీసులు.. అనసూయను అభినందించారు. (చదవండి : హిజ్రాలకు శేఖర్ కమ్ముల చేయూత) గర్బిణీ స్రీలకు ప్రస్తుత పరిస్థితుల్లో మరింత సమర్థవంతంగా పోషకాలను అందించి.. వారిలో ధైర్యం నింపేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్టు రాచకొండ పోలీసులు తెలిపారు. నేడు (మే 15) కీసర పీహెచ్సీ పరిధిలోని గర్భిణిలకు తన బర్త్ డే సందర్భంగా అనసూయ న్యూట్రిషన్ కిట్లను అందజేశారని పేర్కొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాచకొండ సీపీ మహేష్ భగవత్ అనసూయ గొప్ప మనసును అభినందించారు. అలాగే ప్రస్తుత పిరిస్థితుల్లో గర్భిణిలు బయటకు రావొద్దని కోరారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని.. ఏదైనా సాయం కావాలంటే పోలీసు కోవిడ్ కంట్రోల్ నెంబర్ 9490617234కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి డీసీపి రక్షిత మూర్తి.. లాక్డౌన్ సమయంలో మహిళలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మరోవైపు అనసూయకు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు బుల్లితెరపై యాంకర్‌గా కొనసాగుతూనే.. వెండితెరపై కూడా తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రంగస్థలం చిత్రంలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్ర ఆమె క్రేజ్‌ను మరింతగా పెంచింది. ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో నటించనున్నట్టుగా తెలుస్తోంది. (ఫొటోలు : యాంకర్ అనసూయ భరధ్వాజ్ అదిరే స్టిల్స్) #HelpingHands Anchor Anusuya has sponsored a Healthy kits article for 100 pregnant ladies at Keesara on the occasion of her birthday. #CP_Rachakonda, @DcpMalkajgiri, @AcpKushaiguda, SHO @Keesaraps have distributed.@anusuyakhasba @TelanganaDGP @TelanganaCOPs @TelanganaCMO pic.twitter.com/lPDQC1RZN1 — Rachakonda Police (@RachakondaCop) May 15, 2020 -
చెడ్డీ గ్యాంగ్ చిక్కింది..
సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలను టార్గెట్ చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. చెడ్డీ గ్యాంగ్‌లోని ఏడుగురిని రాచకొండ, ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ గ్యాంగ్ పగటిపూట బొమ్మలు అమ్ముకుంటూ రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో దోపిడీలకు పాల్పడుతోంది. ఈ ముఠాపై హిమాచల్ ప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో మొత్తం 14 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ ఏడుగురు ముఠా సభ్యుల నుంచి 150 గ్రాముల బంగారం, రూ.3వేలు నగదు,నాలుగు వందల గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర అకోలాలో నివాసం ఉంటున్న వీరిని టెక్నికల్ ఆధారాలతో రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగర వాసులకు, పోలీసులకు నిద్ర లేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్ చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
లింక్ ఓపెన్ చేయడంతో ఆమె బుక్కైపోయింది..!
సాక్షి, హైదరాబాద్; కష్టపడటం కంటే మోసగించడం ద్వారానే ఈజీగా మనీ సంపాదించొచ్చన్న దురాశతో కొంతమంది తప్పుడు మార్గాలను ఎంచుకుని జీవితాల్ని దుర్భరం చేసుకుంటున్నారు. అలాంటి తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించే పనుల్లో ఒకటి ఆన్లైన్ మోసం. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ రకమైన ఆన్లైన్ మోసాలు ఎక్కువయ్యాయంటే అతిశయోక్తి కాదు. ఇలా ఆన్లైన్లో మోసం చేసి డబ్బులు సంపాదించడం..చేసిన తప్పు ఏదో రూపంలో బట్టబయలై నేరస్తులు కావడం వంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. నేరస్తుడిగా మారి మనిషిగా పతనమైపోవడానికి దురాశ దుఃఖానికి చేటన్న చిన్న లాజిక్‌ను మరచిపోవడమే. అలా ఓ ప్రబుద్ధుడు ఇతరుల డబ్బుల కోసం కక్కుర్తి పడి ఓ మహిళ ఫేస్బుక్ వివరాలు తస్కరించి, ఆమె స్నేహితులతో సదరు మహిళగానే చాట్ చేసి వారి నుంచి డబ్బులు తీసుకుని పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఫిషింగ్ సైట్ నుంచి లింక్ పంపి.. కొద్దికాలం క్రితం బాధిత మహిళ ఫేస్బుక్ ఖాతాకు బాలాపూర్ మండలం జిల్లెలగూడ వాసి బత్తుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఓ ఫిషింగ్ వెబ్సైట్(స్పూఫ్ సైట్) నుంచి ఓ లింక్‌ను పంపించాడు. సదరు మహిళ ఆ లింక్‌ను ఓపెన్ చేయడంతో ఆమె ఫేస్బుక్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను అతడు సేకరించాడు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి బాధిత మహిళ ఫేస్బుక్ ఖాతాను ఓపెన్ చేయడంలేదు. ఇదే సమయంలో నిందితుడు వెంకటేశ్వర్లు బాధిత మహిళ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఆమె స్నేహితులతో మహిళగా చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో తనకు రోడ్డు ప్రమాదం జరిగిందని, చికిత్స కోసం డబ్బులు సాయం చేయాలని కోరుతూ మెసేజ్‌లు పెట్టాడు. తమ స్నేహితురాలే సాయం కోరుతుందనుకుని ఆ మెసేజ్‌లకు స్పందించిన కొంతమంది అతడిచ్చిన బ్యాంకు అకౌంట్‌కు డబ్బులు జమచేశారు. డబ్బుల పంపాలంటూ బాధిత మహిళ వ్యక్తిగత స్నేహితురాలికి మెస్సేజ్ రావడంతో ఈ విషయాన్ని నేరుగా బాధితురాలి దృష్టికి తీసుకెళ్లింది. ఫేస్బుక్ ఖాతాను బాధిత మహిళ ఓపెన్ చేసినా ఓపెన్ కాకపోవడంతో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా..ఈ నేరానికి పాల్పడింది బీటెక్ చదివి ప్రస్తుతం మాదాపూర్‌లోని ఓ కంప్యూటర్ గ్రాఫిక్ కార్యాలయంలో పనిచేస్తున్న బత్తుల వెంకటేశ్వర్లుగా గుర్తించారు. దీంతో ఆదివారం అతడిని అరెస్టు చేశారు. బాధితమహిళనే కాకుండా ఇంకా ఎవరినైనా మోసం చేశాడా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, వెంకటేశ్వర్లు తను చేసిన నేరాన్ని అంగీకరించినట్లు రాచకొండ సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్ ఆశిష్ రెడ్డి తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సెల్‌కు కానీ, సోషల్ మీడియాలో గానీ లింక్‌లు వస్తే ఓపెన్ చేయవద్దని సూచించారు. -
80 కిలోల గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్: విశాఖ నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో విక్రయిస్తున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.15.2 లక్షల విలువచేసే 80 కిలోల గంజాయి, కారు, రూ.4,200ల నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. ఈ వివరాలను నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ మీడియాకు తెలిపారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం గుడెపు కుంట తండాకు చెందిన గుగులోతు సైదా నాయక్ అలియాస్ సైదా వృత్తి రీత్యా డ్రైవర్. అదే జిల్లా నూతంకల్ మండలం తీక్యా తండాకు చెందిన లవుడ్య అనిల్ కూడా డ్రైవర్. వీరిరువురు స్నేహితులు. ఈ ఇద్దరి ఆదాయం అంతంత మాత్రమే కావడంతో రవాణా రంగంలో ఉన్న సమయంలో విశాఖకు చెందిన గంజాయి విక్రయదారులతో ఏర్పడిన సత్సంబంధాలను ఉపయోగించి ఎక్కువగా డబ్బులు సంపాదించాలని ప్రణాళిక వేశారు. ఇందుకు వీరి స్నేహితులు సూర్యాపేట జిల్లాకే చెందిన లకావత్ వినోద్, లకావత్ హుస్సేన్‌ల సహకారం తీసుకున్నారు. ఇలా వీరు విశాఖ జిల్లా దారకొండ మండలం కొత్తూరు ఏజెన్సీ ప్రాంతం నుంచి అతి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్, నిజామాబాద్‌లోని కొందరికి అతి ఎక్కువ ధరకు విక్రయిస్తూ డబ్బులు సంపాదించడం మొదలెట్టారు. ఐదువేల లాభానికి విక్రయిస్తూ... విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి కిలో రూ.2 వేలకు కొనుగోలు చేసి తమ కొనుగోలుదారులకు దాన్ని రూ.7 వేలకు విక్రయిస్తున్నారు. ఇలా కొత్తూరుకు చెందిన శివ నుంచి 80 కిలోల గంజాయిని కొనుగోలు చేసి కారు డిక్కీలో, సైడ్ డోర్లో, సీట్ల కింద పెట్టి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్వోటీ, మీర్‌పేట పోలీసులు సంయుక్తంగా గాయత్రి నగర్లో తనిఖీలు చేపట్టి గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. ఆ వెంటనే నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిని కోర్టు ఎదుట హాజరుపరిచి జ్యుడీíÙయల్ రిమాండ్‌కు తరలించారు. -
గొడవపడిన భర్త..కాల్‌గర్ల్ పేరుతో భార్య ఫొటో పోస్టు
సాక్షి,హైదరాబాద్: భార్యతో గొడవ పడిన విషయాన్ని మనస్సులో పెట్టుకుని సొంత భార్య ఫొటోనే సామాజిక మాధ్యమంలో పెట్టి అల్లరిపాలు చేసిన ఓ ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్లుగా కుషాయిగూడ ఈసీఐఎల్‌లోని రాధికా థియేటర్లో ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పనిచేస్తోన్న జాన్ జార్జ్ అలియాస్ సన్నీ దమ్మాయిగూడలోని లక్ష్మీనగర్ కాలనీలో కుటుంబంతో కలసి ఉంటున్నాడు. ఈ మధ్యలో చిన్నచిన్న విషయాల్లో మనస్పర్థలు వచ్చి గొడవలు జరగడంతో ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకున్నాడు. ఎలాగైనా తన భార్య వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చాలను కున్న సన్నీ ఆమె తన స్నేహితురాళ్లతో దిగిన ఫొటోలను షేర్‌చాట్‌లో పోస్టు చేశాడు. ఆ ఫొటోలో ఉన్నవారంతా కాల్‌గర్ల్స్ అని కామెంట్ చేయడంతో పాటుగా వాయిస్ ఇచ్చాడు. ఆ ఫొటోకింద భార్య ఫోన్ నంబర్‌ను పేర్కొన్నాడు. దీంతో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి అతడి భార్యకు ఫోన్‌కాల్స్ రావటంతో బాధితురాలు శనివారం రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు టెక్నికల్ డేటా ఆధారంగా నిందితుడు సన్నీని శనివారం అరెస్టు చేశారు. -
మాజీ స్నేహితురాలిని వేధించిన కేసులో నిందితుడి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: మాజీ స్నేహితురాలిని ఆన్లైన్లో వేధించిన కేసులో నిందితుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో మేల్ నర్సుగా పని చేస్తున్న గణేష్ గతంలో కాచిగూడలోని ఆస్పత్రిలో పని చేశాడు. అప్పట్లో పరిచయమైన సహోద్యోగినితో స్నేహం చేశాడు. ఆ సందర్భంలో కొన్ని ఫొటోలు సేకరించి భద్రపరుచుకున్నాడు. ఆపై ఇద్దరూ వేర్వేరు చోట్ల స్థిరపడిన తర్వాత ఆమెను సోషల్‌మీడియా ద్వారా సంప్రదించిన అతను తనను ప్రేమించాలని వెంటపడ్డాడు. ఆమె తిరస్కరించడంతో అభ్యంతరకరమైన ఫొటోలు పంపి వేధిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
మ్యాట్రిమోని సైట్లో బురిడి కొట్టించిన మహిళ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : మ్యాట్రిమోని సైట్ల ద్వారా పెళ్లి సంబంధాలు చూసేవారు కాస్తా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మ్యాట్రిమోని సైట్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో అధికమవుతున్నాయి. తాజాగా నగరంలో ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోని సైట్లను ఆశ్రయించే వారిని అదనుగా చూసుకుని మోసాలకు పాల్పడుతున్న మహిళను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ఉంటున్న సింహాద్రి పవన్ కుమార్ తనకు తగిన వధువు కావాలని భారత్ మ్యాట్రిమోని సైట్లో అతని వివరాలు పెట్టారు. ఇదే అవకాశంగా భావించిన కొరం అర్చన అనే మహిళ తప్పుడు ప్రొఫైల్‌తో అతన్ని బురిడి కొట్టించారు. పవన్ నుంచి 4 లక్షల రుపాయలు వసూలు చేశారు. తర్వాత సదురు మహిళ చేతిలో తాను మోసపోయానని గ్రహించిన భాదితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 417, 418, 420 సెక్షన్ 66 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి మహిళను అదుపులోకి తీసుకున్నారు. -
ప్రణతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే..
సాక్షి, హైదరాబాద్ : డ్రైవర్ నిర్లక్ష్యంగా పోలీసు వాహనం మూడేళ్ల చిన్నారిపైకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ప్రణతికి తీవ్ర గాయాలు కావడంతో ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. కాసేపటి క్రితమే ప్రణతి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. మూడు రోజుల గడుస్తున్నా.. ఎలాంటి స్పందన లేదని వైద్యులు తెలిపారు. గత మూడ్రోజులుగా వెంటిలేషన్‌పైనే చిన్నారికి చికిత్సను అందిస్తున్నామని ప్రకటించారు. నిపుణులైన క్రిటికల్ కేర్ వైద్యులచే చిన్నారికి వైద్యం అందిస్తున్నామని తెలిపారు. తమ పాపను బతికించమంటూ ప్రణతి తండ్రి వైద్యులను వేడుకుంటున్నారు. చదవండి : చిన్నారిపై నుంచి దూసుకెళ్లిన పోలీసు వాహనం -
చిన్నారిపై నుంచి దూసుకెళ్లిన పోలీసు వాహనం
సాక్షి, నల్గొండ : యాదగిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్న సమయంలో మూడేళ్ల చిన్నారిపై నుంచి పోలీసులు వాహనం దూసుకెళ్లింది. వివరాలు.. యాదగిరి గుట్ట పాత నరసింహస్వామి ఆలయంలో ఈ ఘోరం జరగింది. దేవాలయం ప్రాంగణంలో దైవదర్శనానంతరం తండ్రితో కలిసి ప్రణతి(3) నిద్రిస్తున్న సమయంలో రాచకొండ పోలీసుల వాహనం ప్రణతిపై నుంచి దూసుకెళ్లింది. వెంటనే ఆ చిన్నారిని ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. కామినేని హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రసాద రావు మాట్లాడుతూ.. కడుపులోపల బలమైన గాయం కావడంతో లోపల రక్తం గడ్డ కట్టిందని పేర్కొన్నారు. మెదడుకి కూడా బలమైన గాయం కావడంతో ప్రణీత మాట్లాడలేని స్థితిలోకి వెళ్లిందన్నారు. హాస్పిటల్‌కి తీసుకొచ్చే సమయానికే పరిస్థితి విషమంగా ఉందన్నారు. కొన్ని అవయవాలు పనిచేయడం లేదని పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిపారు. రాచకొండ కమీషన్ మహేష్ భగవత్ ప్రణీతను పరామర్శించడానికి ఆసుపత్రికి వచ్చారు. -
‘ప్రత్యేక జాకెట్’తో రూ.70 లక్షల రవాణా
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా ఛత్తీస్గడ్ రాజధాని నుంచి గత కొంతకాలంగా రూ.లక్షల్లో సాగుతోన్న హవాలా సొమ్ము రవాణా గుట్టురట్టయింది. సార్వత్రిక ఎన్నికల వేళ రాచకొండ పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎవరికీ అనుమానం రాకుండా ప్రత్యేకంగా తయారు చేయించిన జాకెట్లో రవాణా చేస్తున్న రూ.70లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను నేరేడ్మెట్లోని తన కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్‌భగవత్ శనివారం విలేకరులకు వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన చంద్రకాంత్ వర్మ(33) కొంత కాలం క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చి, బేగంబజార్‌లో నివాసం ఉంటున్నాడు. జూబ్లీహిల్స్ రోడ్ నం.36లోని డైమండ్ స్టోర్, జువెల్లరి దుకాణంలో పనిచేస్తూ, మార్కెటింగ్ ఏజెంట్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. జువెల్లరి దుకాణం యజమాని కె.చంద్రప్రకాష్ సూచనల ప్రకారం చంద్రకాంత్ పలువురు వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తుంటాడు. ఇందులో భాగంగా ఈ నెల 14న చంద్రకాంత్ బస్సులో ఛత్తీస్గడ్ రాజధాని రాయపూర్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి ఆటోలో బుధాపూర్కు వెళ్లి శంకర్ అనే వ్యక్తిని కలిశాడు. ఆయన ద్వారా సునీల్ సోనీ అనే మరో వ్యక్తి కలిస్తే అతను రూ.70 లక్షలను అందజేశాడు. ఆ మొత్తాన్ని ప్రత్యేకంగా తయారు చేయించిన జాకెట్లోని రహస్య జేబుల్లో పెట్టుకొని వర్మ తిరిగి బస్సులో హైదరాబాద్ చేరుకొని ఆటోలో వెళుతున్నాడు. మరో వైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శనివారం నేరేడ్మెట్లోని ఆర్కే పురం చౌరస్తా చెక్‌పోస్టు వద్ద నేరేడ్మెట్, ఎల్బీ నగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా వాహనాలను తనిఖీ లు చేస్తున్నారు. ఆ సమయంలో ఆటోలో ఉన్న చంద్రకాంత్ కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని తనిఖీ చేశారు. దాంతో అతని వద్దనున్న రూ.70 లక్షల నగదు కట్ట లు బయటపడ్డాయి. వీటికి ఎలాంటి పత్రాలు లేకపోవడం తో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా వివరాలు వెల్లడయ్యాయి. అతను ఈ నెల7న కూడా రాయపూర్ నుంచి రూ.33 లక్షలను ఇదే తరహాలో తీసుకువచ్చి చంద్రప్రకాష్‌కు అప్పగించినట్లు వెల్లడైంది. అతన్ని పోలీసు లు అరెస్టు చేశారు. కాగా జువెల్లరి దుకాణం యజమాని చంద్రప్రకాష్‌కు రాయపూర్‌లోని సునీల్సోనీతో సంబంధాలున్నాయని, పలుమార్లు హవాలా సొమ్మును పంపించినట్టు పోలీసుల విచారణలో తేలిందని సీపీ వివరించారు. పరారీలో ఉన్న యజమాని చంద్రప్రకాష్‌పై కేసు నమోదు చేశామని, త్వరలో అరెస్టు చేయనున్నట్టు చెప్పారు. తదుపరి చర్యలకు ఆదాయపన్ను శాఖకు ఈకేసు సిఫారసు చేసినట్టు, రూ.70 లక్షల నగదు, రవాణాకు వినియోగించిన ప్రత్యేక జాకెట్‌తోపాటు రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారని చెప్పారు.ఈ నగదును పట్టుకున్న పోలీసులకు క్యాష్ రివార్డులను అందజేస్తామని సీపీ చెప్పారు. ఈ సమావేశంలో క్రైం డీసీపీ నాగరాజు, ఎస్ఓటీ అదనపు డీసీపీ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శిక్షణ.. ఉద్యోగం.. అంతా తూచ్
హైదరాబాద్: ఎస్బీఐ.. ఆర్ఆర్బీ.. ఇన్ కంట్యాక్స్ విభాగాల్లో బ్యాక్ డోర్ ఎంట్రీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో డబ్బులు తీసుకొని కోల్‌కతా కేంద్రంగా 3 నెలలు శిక్షణ ఇచ్చి నకిలీ నియామక పత్రాలు చేతిలో పెట్టి వందల మందిని మోసగించిన ఐదుగురు సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 35 లక్షల విలువైన కారు, బంగారం, నకిలీ డాక్యుమెంట్లు, రూ. 10.5 లక్షల నగదు, పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. కేసు వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ బుధవారం మీడియాకు వెల్లడించారు. కోల్‌కతా కేంద్రంగా మోసాలు.. ఒడిశాకి చెందిన కళ్లు చరణ్పాండా అలియాస్ అజయ్ అలియాస్ మనోజ్ ఐదేళ్ల క్రితం కోల్‌కతాలో స్థిరపడ్డాడు. కొంతకాలం మార్కెటింగ్ బిజినెస్ చేసి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో తన స్నేహితులైన కలావత్ రాయ్, రాజీవ్ కార్తీక్, హేమంత్, అనిల్‌తో కోల్‌కతాలో జాబ్ కన్సల్టెన్సీ ఏజెన్సీ ఏర్పాటు చేశాడు. ఇందులో యువతకు శిక్షణ ఇచ్చి ఎస్బీఐ, ఆర్ఆర్బీ, ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆన్లైన్లో ప్రకటనలు గుప్పించాడు. అయితే 2015లో వనస్థలిపురంలో నివాసముంటున్న ఆలేరుకు చెందిన శ్రీకాంత్ హైదరాబాద్‌లోని ఓ కన్సల్టెన్సీలో పనిచేస్తున్నప్పుడు చరణ్పాండేకు పరిచయమయ్యాడు. 2017లో శ్రీకాంత్‌కు ఫోన్ చేసి కోల్‌కతాలో ఎస్బీఐ, ఆర్ఆర్బీ, ఇన్‌కంట్యాక్స్ విభాగాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని చరణ్పాండే చెప్పడంతో వారి ముఠాలో సభ్యుడిగా చేరాడు. కోల్‌కతాకు నివాసం మార్చుకున్న శ్రీకాంత్ పేరును సుధామ్గా మార్చుకుని తన స్నేహితులైన రాజీవ్ కార్తీక్, ఎం.అశోక్‌రావు, వెంకట్ శిరీష్‌లకు విషయం చెప్పడంతో హైదరాబాద్‌కు చెందిన నలుగురు నిరుద్యోగులు కేతావత్ మోహన్ నాయక్, బానోత్ మోహన్, పి.కిషన్, జె.రమేశ్‌లను కోల్‌కతాకు పంపించారు. వీరి నుంచి రూ. 53.5 లక్షలు తీసుకున్న శ్రీకాంత్ కోల్‌కతాలోని ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్లో 3 నెలలు ఇతర విద్యార్థులతో కలిసి శిక్షణ ఇప్పించాడు. ఆ తర్వాత నకిలీ స్టాంప్‌లు పెట్టి ఎస్బీఐ అధికారులుగా ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ నియామక పత్రాలు ఇచ్చాడు. మిర్యాలగూడ నుంచి మరో నలుగురు మాలోత్ రమేశ్, కేతావత్ అశోక్, కుర్రా విష్ణు, యాతమ్ మహేశ్ నుంచి శ్రీకాంత్ రూ. 43.5 లక్షలు వసూలు చేసి వారికీ నకిలీ నియామక పత్రాలు అంటగట్టాడు. ట్రైనింగ్ సెంటర్లో రోజు తప్పించి రోజు శిక్షణ ఇచ్చేవాడు. శ్రీకాకుళానికి చెందిన మురళీ కృష్ణ భార్య రమా ప్రసన్న కూడా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం విద్యార్థుల నుంచి లక్షలు వసూలు చేసింది. కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న సంధ్యారాణి 35 మంది నుంచి రూ.16 కోట్లు వసూలు చేసింది. రూ.80 లక్షలు శ్రీకాంత్‌కు ఇచ్చి కోల్‌కతాకు పంపింది. ఈ ముఠా 100 మంది నుంచి రూ. 3 కోట్ల నుంచి రూ. 4 కోట్లు వరకు వసూలు చేసింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, ల్యాప్‌టాప్‌లు మోసపోయిన వారి ఫిర్యాదుతో మోసపోయిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన రమేశ్, అశోక్, విష్ణు, మహేశ్ తదితరులు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 18న శ్రీకాంత్‌ను అరెస్టు చేశారు. ఇక చరణ్పాండా, మురళీకృష్ణ, వీరరాఘవరెడ్డి, సంధ్యారాణిలను బుధవారం అరెస్టు చేశారు. వీరి నుంచి కారు, రూ. 10.5 లక్షల నగదు, మూడు ల్యాప్‌టాప్‌లు, 2 తులాల బంగారం, నకిలీ అపార్ట్మెంట్ల డాక్యుమెంట్లు, ప్రింటర్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా కలిసి ఇరు రాష్ట్రాల్లో వందల మంది నుంచి రూ. కోట్లలో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. చరణ్పాండ్యా రూ.65 లక్షలతో విలాసవంతమైన అపార్ట్మెంట్ కొన్నాడని విచారణలో తేలింది. -
కల్లు తాగితే కన్నమేయాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ఆయన ఇరవై ఎకరాల రైతు. రెండు బహుళ అంతస్తుల భవనాలకు యజమాని. భార్య మహబూబ్‌నగర్ జిల్లాలో మాజీ ఎంపీపీ. ఆర్థికంగా స్థితిమంతుడే. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ‘కల్లు’దగ్గరకు వచ్చేసరికి మాత్రం తేడా వస్తోంది. ఆ మత్తులో కనీసం ఒక ఇంటి తాళమైనా పగలకొట్టి కన్నం వేయాల్సిందే. అప్పుడప్పుడూ దత్తపుత్రుణ్ణి సైతం వెంటేసుకుని వెళ్లి దొంగతనాలకు పాల్పడుతుంటాడు. అనేకసార్లు అరెస్టు అయి నా పంథా మార్చుకోని అమర్‌సింగ్(55) మరో సారి పోలీసులకు చిక్కాడు. చిన్నప్పటి నుంచే చోరీలు చేయడం అలవాటైన ఇతగాడు తొలినాళ్లల్లో కోళ్లను దొంగిలించేవాడు. పెద్దయ్యాక ఆస్తులు సమకూరినా, భార్యకు రాజకీయంగా పలుకుబడి పెరిగినా ‘వీక్నెస్’మాత్రం పోవట్లేదు. ఏడు చోరీలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై రాచకొండ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆయనే మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలం బైరాపురంలోని నగరగడ్డ తండాకు చెందిన రత్లావత్ అమర్‌సింగ్. దత్తపుత్రుడితో కలసి... ఈయన భార్య విజయ బైరాపురం సర్పంచ్‌గా, వెల్దండ ఎంపీపీగా ప్రజాసేవ చేసి మంచి గుర్తింపు పొందారు. వీరికి తమ స్వగ్రామంలో 20 ఎకరాల వ్యవసాయభూమి ఉంది. ఆమన్‌గల్, హైదరాబాద్‌లోని చంపాపేట దుర్గాభవానీనగర్‌లో బహుళ అంతస్తుల భవనాలున్నాయి. వీటి మీదే ప్రతి నెలా దాదాపు రూ.50 వేల వరకు అద్దె వస్తుంటుంది. అమర్‌సింగ్ సోదరుడు చనిపోవడంతో అతడి కుమారుడు రామ్‌కోటిని దత్తత తీసుకున్నాడు. ఆమన్‌గల్‌లో డిగ్రీ కూడా చదివించాడు. అమర్‌సింగ్ కొన్నాళ్లు సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలోనూ నివసించాడు. ఆయనకు కల్లు తాగే అలవాటు ఉంది. ఆ మత్తులో రెక్కీ చేయనిదే అతడి కాలు, చోరీకి పాల్పడనిదే అతడి చేయి ఆగవు. మత్తులోనే తానున్న ప్రాంతంలో ఉదయం కాలినడకన తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తాడు. రాత్రిపూట మళ్లీ కల్లు తాగి వచ్చి చోరీకి అనువుగా ఉన్న ఇంటికి కన్నం వేస్తాడు. దీంతో అతడిపై హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలో పలు కేసులు నమోదయ్యాయి. కొన్ని సందర్భాల్లో దత్తపుత్రుడితో కలిసే రంగంలోకి దిగేవాడు. రామ్‌కోటి బయట కాపుకాయగా అమర్‌సింగ్ ఇంట్లోకి వెళ్లి విలువైన సామాన్లు, నగలు, డబ్బు కాజేసేవాడు. ఈ విధంగా నగరంలోని సైదాబాద్, చంపాపేట్, సరస్వతీన గర్, వినయ్‌నగర్ కాలనీ, ఎల్బీనగర్ పరిధిలోని కొన్నిచోట్ల చేతివాటం ప్రదర్శించాడు. 2012 జూలై 28న, ఆగస్టు 11న, 2013 నవంబర్‌లో నగర పోలీసులకు చిక్కి కటకటాల్లోకి వెళ్లాడు. అయినా ఇతడి పంథాలో మార్పు రాలేదు. తాజాగా సైదాబాద్, ఎల్బీనగర్ పరిధుల్లో దాదాపు ఏడు చోరీలు చేశాడు. ఇతడి కదలికలపై సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు వలపన్నారు. కల్లుతాగి చోరీలు చేయడానికి వస్తూ ఎల్బీనగర్ పరిధిలో చిక్కాడు. అమర్‌సింగ్‌ను వివిధ కోణాల్లో విచారిస్తున్న పోలీసులు నేరాల చిట్టా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. -
దొరికిన దొంగల బండి..
సాక్షి, హైదరాబాద్: నగరంలో తీవ్ర కలకలం రేపిన చైన్ స్నాచర్ల బైక్‌ను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఇరవై నాలుగు గంటల్లో 11 ప్రాంతాల్లో ఓ ముఠా చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన అలజడి సృష్టించిన విషయం తెలిసింది. దీనిపై గ్రూపులుగా విడిపోయి గాలింపు చేపట్టిన పోలీసులు పాతబస్తీలోని భవానీ నగర్ వద్దగల ముళ్లపొదల్లో బైన్‌ను గుర్తించారు. అయితే దొంగలు బైక్‌ను అక్కడ వదిలి వేరే ప్రాంతానికి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బైక్ నెంబర్ ఆధారంగా యజమానిని అదుపులోకి తీసుకుని విచారించగా.. రెండేళ్ల క్రితమే తాను ఆ బైక్‌ను అమ్మినట్లు తెలిపారు. దీంతో దోపిడిగా పాల్పడిన ముఠా హైదరాబాద్ వారే కావొచ్చనన్న కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవారియా గ్యాంగ్ పనిగా అనుమానించిన రాచకొండ పోలీసులు ఆకోణంలో విచారిస్తున్నారు. రాచకొండలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు -
చెడ్డీ గ్యాంగ్ సభ్యుల అరెస్ట్
-
ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం
సాక్షి, హైదరాబాద్ : విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి భారీగా డబ్బులు కాజేసిన నిందితున్ని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని దల్వింద్ సింగ్ అనే వ్యక్తి పేపర్లో ప్రకటన ఇచ్చారు. ప్రకటన చూసి హైదరాబాద్, మహబూబ్ నగర్‌కు చెందిన కొంత మంది అతన్ని సంప్రదించారు. దీంతో వీసా కోసమే డబ్బుతో ఢిల్లీకి రావాల్సిందిగా వారిని నమ్మబలికారు. ఉద్యోగాల కోసం ఢిల్లీకి వెళ్లిన వారిని ఓ హూటల్‌కి తరలించారు. భోజనంలో మత్తుమందు కలిసి వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బును కాజేసి హుటాయించారు. మత్తు నుంచి తేరుకున్నాక బాధితులు ఢిల్లీలోని ఝాన్సీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు సరిగా స్పందించకపోవడంతో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు హరిత ఫిర్యాదుతో నిందితుడు దల్విందర్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ మహేష్భగ్వత్ మాట్లాడుతూ.. నిందితుడు దేశంలోని పలు రాష్ట్రాల్లో వివిధ పేర్లతో మోసాలకు పాల్పడ్డాడని, గతంలో కూడా ఇదే తరహాలో మోసం చేసి పోలీసులకు చిక్కాడని పేర్కొన్నారు. -
సిటీ పోలీస్ సక్సెస్.. చెడ్డీ గ్యాంగ్ ఆటకట్టు!
సాక్షి, హైదరాబాద్ : నగర పోలీసులు మరో కేసును ఛేదించారు. తెలుగు రాష్ట్రాలను గడగడలాడించిన చెడ్డీగ్యాంగ్‌కు చెందిన కీలక సభ్యులను పట్టుకున్నారు. ఆ మధ్యకాలంలో నగరంలోకి ప్రవేశించిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులు అర్ధరాత్రి దొంగతనాలు, దాడులు చేస్తూ హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాటుమాసి.. పక్కా ప్లాన్ ప్రకారం గుజరాత్‌లోని దామోద్‌లో ముగ్గురు చెడ్డీ గ్యాంగ్ సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల్లో అరెస్టు చేసిన చెడ్డీ గ్యాంగ్‌తో పోలీసులు నగరానికి తీసుకురానున్నారు. చెడ్డీ గ్యాంగ్ దోచుకున్న సొత్తును ప్రస్తుతం పోలీసులు రికవరీ చేస్తున్నారు. ఈ గ్యాంగ్‌లో మరికొంతమంది సభ్యులు పరారీలో ఉన్నారు. -
టెక్నాలజీతో మోసాలు.. ముగ్గురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : టెక్నాలజీ సహాయంతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు టెక్నాలజీ సహాయంతో మొబైల్ కొనుగోలు చేసేటప్పడు ఆన్లైన్ ద్వారా డబ్బులు చెలించినట్టు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. వీరి వద్ద నుంచి పోలీసులు 5 లక్షల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. ఈ కేసులో అరెస్టయిన నిందితులు గతంలో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. వీరిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు ఐదు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని తెలిపారు. టెక్నాలజీ ఉపయోగించి వీరు మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు వీరు 9 కేసుల్లో నిందితులుగా ఉన్నారని అన్నారు. నిందితుల దగ్గర నుంచి 11 ఒప్పో, 8 వివో, 2 సామ్సంగ్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు తరలిచామని తెలిపారు. -
ఛీ.. బస్సులో పాడుపని
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థినితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని(20) నగరంలోని శంకర్‌పల్లిలో ఎంబీఏ చదువుతోంది. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన మన్నె రవిచంద్ర గచ్చిబౌలిలో ఉంటూ ప్రైవేటు హాస్టల్ నిర్వహిస్తున్నాడు. 23వ తేదీన 11 గంటల సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు మార్నింగ్‌స్టార్ ట్రావెల్స్ బస్సులో రవిచంద్ర, అతని భార్య సీటు బుక్ చేసుకున్నారు. అదే బస్సులో ఎంబీఏ విద్యార్థిని తనకు కాబోయే భర్తతో అదే బస్సులో ప్రయాణిస్తున్నారు. రవిచంద్ర భార్యకు సీటు దొరకగా అతనికి సీటు దొరకకపోవడంతో బస్సు డ్రైవర్ వెనుకాల కూర్చున్నాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో వెనకకు వెళ్లిన రవిచంద్ర ఎంబీఏ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అప్రమత్తమైన విద్యార్థిని పక్కనే ఉన్న కాబోయే భర్తకు విషయం చెప్పింది. అప్పటికే బస్సు హయత్‌నగర్ చేరుకోవడంతో బాధిత విద్యార్థిని హయత్‌నగర్, షీటీమ్ పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవిచంద్రను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో షీటీమ్ రాచకొండ అడిషనల్ డీసీపీ సలీమా, ఎస్ఐ రమన్‌గౌడ్ పాల్గొన్నారు. -
‘డర్టీ డజన్’గ్యాంగ్ ...
► అక్కడికి వెళ్లాక అంగడి బొమ్మలవుతున్న మహిళలు ► షేక్‌ల సమక్షంలో వేలం పాటలు.. లైంగిక దాడులు ► వారికి ఎదురుతిరిగితే బెదిరింపులు ► వ్యభిచారంలోకి దింపి నరకం చూపుతున్న వైనం ► పురుషులతో వెట్టి చాకిరీ ► 12 మంది నిందితుల్లో ఏడుగురు అరబ్ దేశాల్లో తిష్ట ► ఐదుగురిని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు సాక్షి, హైదరాబాద్ : దుబాయ్‌లో జాబ్ అంటారు.. వేలల్లో జీతమని నమ్మబలుకుతారు.. మాయమాటలు చెప్పి లక్షల్లో గుంజుతారు.. తీరా వారి మాటల్ని నమ్మి వెళ్తే నరకకూపంలో దిగినట్టే! మహిళలు, యువతులు అరబ్ షేక్‌ల ముందు అంగడి బొమ్మలై ఏళ్లకేళ్లుగా వ్యభిచార కూపంలో మగ్గిపోతారు. పురుషులు బానిస సంకెళ్లలో బందీ అయిపోయి దేశంకాని దేశంలో నానా అగచాట్లు పడతారు. గత పదేళ్లుగా అమాయకులపై ఇలా వల విసిరి మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు రట్టు చేశారు. గ్యాంగ్‌లోని ఐదుగురిని పట్టుకున్నారు. మరో ఏడుగురు దుబాయ్‌లో ఉండటంతో వారికోసం విదేశీ మంత్రిత్వ శాఖ సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ‘డర్టీ డజన్’గ్యాంగ్ గడిచిన పదేళ్ల కాలంలో దాదాపు 100 మందిని అరబ్ దేశాలకు అక్రమ రవాణా చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ శుక్రవారం వెల్లడించారు. వీరిలో దాదాపు 30 మంది మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. ముఠా నాయకుడు.. దుబాయ్ శ్రీను మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఈ ముఠా సూత్రధారి పోతుల శ్రీనుబాబు అలియాస్ దుబాయ్ శ్రీను. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇతడు అమలాపురం నుంచి వెళ్లి దుబాయ్‌లో స్థిరపడ్డాడు. ఈ దందా కోసం అక్కడా, ఇక్కడా మొత్తం 11 మంది దళారులను ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రాంతానికే చెందిన మరియమ్మ, అల్ప శ్రీను, సత్యవతి, శ్రీనివాస్ గౌడ్లతో పాటు కేరళకు చెందిన కరీంను శ్రీనుబాబు అరబ్ దేశాలకు పిలిచించుకున్నాడు. వీరిని దుబాయ్, మస్క ట్, కువైట్, ఖతార్ల్లో ఉంచి.. ఆయా చోట్ల మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీలతో సంబంధాలు ఏర్పాటు చేశాడు. ఈ ఏడుగురికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన యు.త్రిమూర్తులు, ఎం.తాతాజీ, పి.దాసు, జి.రామారావు (మరియమ్మ భర్త), ఎస్.మురళి సహకరిస్తున్నారు. వీరంతా తమ చుట్టుపక్కల ప్రాంతా ల్లో చిన్న చిన్న పనులు చేస్తున్న వారిలో అరబ్ దేశాలకు వెళ్లాలన్న ఆసక్తి ఉన్న వారిని గుర్తిస్తారు. వారి వివరాలను దుబాయ్ శ్రీనుకు చేరవేస్తారు. అరబ్ దేశాల్లో ఇంటి సహాయకురాలు, కుక్, క్లీనర్స్, కేర్ టేకర్స్ తదితర ఉద్యోగాలు ఉన్నాయని, నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు సంపాదించుకోవచ్చని బా« దితులకు ఎర వేస్తారు. అక్కడకు పంపడానికి అన్ని ఖర్చులూ కలిపి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అవుతాయని చెప్పి అందినకాడికి వసూలు చేస్తారు. ఆపై అరబ్ దేశాల్లో ఉన్న మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీల సాయంతో బో గస్ ఉద్యోగ ఆఫర్ లెటర్స్ పంపించి నమ్మిస్తారు. మహిళల వేలం పాట ముఠా సభ్యులు.. తమ మాటల్ని నమ్మి డబ్బు చెల్లించిన వారిలో కొందరికి విజిట్ వీసా, మరికొందరికి జాబ్ వీసాలు ఇప్పిస్తున్నారు. దుబాయ్‌కి వెళ్లాక పురుషులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఇక మహిళల్ని స్థానికంగా ఉన్న మ్యాన్‌పవర్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు. ఈ ఏజెన్సీలు అరబ్ షేక్‌లకు అనుబంధంగా పనిచేసే కన్సల్టెన్సీల సహకారంతో వేలంపాట నిర్వహిస్తుంటాయి. అరబ్ షేక్‌ల సమక్షంలో జరిగే ఈ వేలంపాటల్లో ఆకర్షణీయంగా ఉన్న వారికి గరిష్టంగా రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఇలా ఆ షేక్‌ల కబంధ హస్తాల్లో చిక్కిన తర్వాత ఆ మహిళల నుంచి పుస్తెలతాడు, మెట్టెలు తీయించేస్తున్నారు. తమ ఇళ్లకు తీసుకువెళ్లి బుర్ఖాలు ధరించాలని ఒత్తిడి చేస్తూ బానిసలుగా చూస్తున్నారు. లైంగిక దాడులకు పాల్పడటమే కాకుండా కొన్ని సందర్భాల్లో వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. పాస్‌పోర్టులు సైతం షేక్‌ల అధీనంలోనే ఉండడంతో వారంతా ఆ నరకాల్లో మగ్గుతున్నారు. విజిట్ వీసాతో వచ్చి పని చేస్తున్నందున బయటకెళ్తే పోలీసులు అరెస్టు చేస్తారని బెదిరించి తమ ఇళ్లలోనే బందీ చేస్తున్నారు. ఎవరైనా మరీ గొడవ చేస్తే వారిని తిరిగి ‘దుబాయ్ శ్రీను అండ్ కో’కు అప్పగించేస్తున్నారు. ఆ ముఠా.. ఇక్కడున్న బాధితుల సంబంధీకుల నుంచి మళ్లీ డబ్బు వసూలు చేసి, టికెట్లు కొని పంపిస్తున్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడిస్తున్న రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్. చిత్రంలో నిందితులు ఓ జంట ఇచ్చిన ఫిర్యాదుతో.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భార్యాభర్తలు ప్రస్తుతం ఘట్కేసర్లోని అన్నోజీగూడలో నివసిస్తున్నారు. వీరిని సంప్రదించిన త్రిమూర్తులు దుబాయ్ పంపుతానంటూ వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గతేడాది వచ్చిన దుబాయ్ శ్రీను ఈ జంట నుంచి అదనంగా మరో రూ.లక్ష డిమాండ్ చేసి.. రూ.70 వేలు తీసుకున్నాడు. గతేడాది ఫిబ్రవరి 12న భార్యను, పది రోజుల తర్వాత భర్తను దుబాయ్ పంపాడు. వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాల్లో పెట్టడంతో పాటు అక్కడున్న పరిస్థితుల్ని గమనించిన వీరు తిరిగి వెళ్లిపోతామంటూ గొడవ చేశారు. దీంతో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న వీరి బంధువు నుంచి మరో రూ.70 వేలు వసూలు చేసి, ఆ తర్వాత టికెట్లు కొని పంపారు. అక్కడ్నుంచి తిరిగొచ్చిన ఈ జంట గతేడాది జూన్‌లో ఘట్కేసర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసును దర్యాప్తు చేసిన మల్కాజ్గిరి జోన్ ఎస్వోటీ పోలీసులు త్రిమూర్తులు, తాతాజీ, దాసు, రామారావు, మురళీలను అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.1.6 లక్షల నగదు, వివిధ బోగస్ పత్రాలు, విజిట్ వీసా కాపీలు స్వాధీనం చేసుకుంది. దుబాయ్ శ్రీను సహా పరారీలో ఉన్న మిగిలిన ఏడుగురిని పట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
నగరంలో వ్యభిచార ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్ : గుట్టుగా సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును రాచకొండ పోలీసులు శనివారం రట్టు చేశారు. రాచకొండ పోలీసు స్టేషన్ పరిధిలో కొందరు విదేశీ మహిళలో వ్యభిచార రాకెట్‌ను నడిపిస్తున్నారు. దీని గురించి సమాచారం అందడంతో పోలీసులు ఈ ముఠాపై దాడిచేసి.. ముగ్గురు నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ రాకెట్లో ఉన్న ఉజ్బెకిస్థాన్ మహిళలకు విముక్తి కల్పించారు. నిర్వాహకుల నుంచి ఐదు సెల్ఫోన్లు, రూ. 25వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
వృత్తి సీఏ... ప్రవృత్తి దొంగతనాలు!
సాక్షి, హైదరాబాద్: అతడి వృత్తి చార్టెడ్ అకౌంటెంట్.. స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్.. ఉన్నత చదువు చదువుకున్న అతగాడు దోపిడీ దొంగగా మారాడు.. మహారాష్ట్ర, తెలంగాణతోపాటు 5 రాష్ట్రాల్లో పంజా విసురుతున్నాడు.. తన ‘స్నేహితురాలు’, అనుచరునితో కారులో సంచరిస్తూ సుదూర కాలనీల్లోని ఒంట రి ఇళ్లను టార్గెట్ చేశాడు.. ఇలా ఏడాది కాలంలో ఈ గ్యాంగ్ ఐదు రాష్ట్రాల్లో 50కి పైగా నేరాలు చేసి 20 కేజీల బంగారం ఎత్తుకుపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నాగ్‌పూర్ ‘సిమ్’లతో ప్రారంభం.. ఇండోర్‌కు చెందిన ఈ ఘరానా దొంగ చార్టెడ్ అకౌంటెంట్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇండోర్ లో కాక వేరే ప్రాంతంలో ఓ కారును అద్దెకు తీసుకుం టాడు. తన ‘స్నేహితురాలి’తో పాటు డ్రైవర్‌గా వ్యవహరించే అనుచరుడితో కలసి బయలుదేరతాడు. ఈ గ్యాంగ్ స్వరాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ఎలాంటి నేరం చేయదు. తొలుత ఈ బృందం మహారాష్ట్రలోని నాగ్ పూర్ చేరుకుంటుంది. అక్కడే 2 సిమ్‌లు, ఫోన్లు ఖరీ దు చేసి వినియోగిస్తారు. నాగ్‌పూర్‌లో చోరీతో ప్రారంభించి రాష్ట్రంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ వరుసగా చోరీలు చేస్తూ ఏపీ, తమిళనాడు, కర్ణాటక వెళ్తారు. పగటిపూటే చోరీలు.. కారులో సంచరించే ఈ గ్యాంగ్ పగటిపూటే చోరీలు చేస్తుంది. ప్రధాన, జాతీయ రహదారులకు సమీపంలోని కాలనీలను ఎంచుకుంటుంది. ఖరీదైన ఇంటిని గుర్తించి.. దానికి తాళం వేసి ఉంటే క్షణాల్లో పని ముగించేస్తుంది. ప్రధాన చోరుడు తాళం పగులకొట్టి ఇంట్లోకి ప్రవేశించగా.. అనుచరుడు బయట ఉండి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తుంటాడు. ఆ సమీపంలో నిలిపి ఉంచిన కారులో ‘స్నేహితురాలు’ఉంటుంది. చోరీ చేస్తున్నంత సేపూ ప్రధాన చోరుడు, అనుచరుడు ఫోన్లో కనెక్ట్ అయ్యే ఉంటారు. నగరంలోని తిరుమలగిరి, ఆదిభట్ల తదితర ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ పంజా విసిరింది. నగరంలో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల మధ్య చోరీలకు పాల్పడింది. ఇండోర్ చేరుకోవడానికి ముందే ఆధారాలు లేకుండా సిమ్‌లు, ఫోన్లను ధ్వంసం చేస్తుంది. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు.. చోరీ కోసం ప్రధాన చోరుడు ఓ ఇంట్లోకి వెళ్లగా.. సమీపంలో నిలిపిన కారులో ఓ మహిళ కూర్చుని ఉండటం, సమీపంలో మరో వ్యక్తి సెల్ఫోన్లో మాట్లాడుతుండటంతో అనుమానించిన అధికారులు వారిని నిలదీశారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో ఇరువురినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే అనుచరుడి ఫోన్ ప్రధాన చోరుడి ఫోన్‌తో కనెక్ట్ అయి ఉండటంతో ఇదంతా విన్న అతడు ఆ ఇంటి వెనుక వైపు నుంచి జారుకున్నాడు. చాకచక్యంగా వ్యవహరించి ప్రధాన చోరుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించిన రాచకొండ పోలీసులు గ్యాంగ్‌లో మరికొందరు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ ముఠాను ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. బంగారం రికవరీపైనా దృష్టి పెట్టారు. ముప్పుతిప్పలు పెట్టిన ముఠా.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసుల్ని ఈ ముఠా ముప్పుతిప్పలు పెట్టింది. 6 నెలల కాలంలో దఫదఫాలుగా పంజా విసిరింది. అనేక ఘటనాస్థలాలకు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్లో వీరు వినియోగించిన కారు, కదలికలు రికా ర్డు అయినప్పటికీ చాలాకాలం వరకు 3 కమిషనరేట్ల అధికారులు పట్టుకోలేకపోయారు. కొన్ని రోజుల క్రితం మరోసారి ఈ గ్యాంగ్ సిటీకి వచ్చింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సంచరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞా నం వినియోగించి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. -
ఎల్బీనగర్ చౌరస్తా రేపటి నుంచి మూసివేత
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఎల్బీనగర్ చౌరస్తా రేపటి నుంచి మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. యూ టర్న్ ఏర్పాటుతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ జాం సమస్యను పరిష్కరించే క్రమంలో కూడళ్లలో యు టర్న్ పద్ధతిని ప్రవేశపెడుతున్నట్లు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇప్పటికే పలు కూడళ్లలో యూ-టర్న్ పద్ధతి సఫలమైన నేపథ్యంలో నిత్యం వేలాది వాహనాలతో బారులుతీరే ఎల్బీనగర్ కూడలిలోనూ ఈ పద్ధతిని ఆదివారం నుంచి అవలంభించబోతున్నట్లు తెలిపారు. మెట్రో రైలుతోపాటు, స్కైవే పనులు సైతం జరుగుతున్నందున ఈ చౌరస్తాలో వాహనదారులకు ఇబ్బంది కలుగని రీతిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాచకొండ ట్రాఫిక్ డీసీపీ రమేష్, అదనపు డీసీపీ దివ్యచరణ్రావు, ఏసీపీ శ్రీధర్‌లు ఎల్బీనగర్ చౌరస్తాను పరిశీలించారు. ఇక్కడ యు టర్న్ ఎంత మేరకు సఫలమవుతుందోనని అంచనా వేశారు. ఈ మేరకు ఆదివారం నుంచి ఎల్బీనగర్ కూడలిని మూసివేసి ఇటు ఎల్పీటీ మార్కెట్, అటు డీమార్ట్ ముందు యు టర్న్ తెరుస్తారు. అయితే, హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారిలో యథావిధిగా రాకపోకలు ఉంటాయి. విజయవాడ నుంచి ఉప్పల్ వెళ్లే వాహనాలు ఎల్బీనగర్ చౌరస్తా దాటాక డీ మార్ట్ వద్ద కుడివైపు యు టర్న్ తీసుకోవాలి. దిల్సుఖ్నగర్ నుంచి సాగర్ రింగ్ రోడ్డువైపు వెళ్లే వాహనాలు చౌరస్తా దాటాక ఎల్పీటీ మార్కెట్ వద్ద కుడివైపు యు టర్న్ తీసుకోవాలి. ఉప్పల్ నుంచి సాగర్ రోడ్డు, దిల్సుఖ్నగర్ వెళ్లే వాహనాలు ఎల్బీనగర్ చౌరస్తాలో ఎడమవైపు మలుపు తీసుకుని ఎల్పీటీ మార్కెట్ వద్ద కుడివైపు యూ టర్న్ తీసుకోవాలి. సాగర్ రోడ్డు నుంచి ఉప్పల్ వెళ్లే వాహనాలు చౌరస్తాలో ఎడమవైపు మలుపు తిరిగి డీ మార్ట్ వద్ద యు టర్న్ తీసుకోవాలి. ప్రధానంగా ఆర్టీసీ బస్సులను కూడలి, యు టర్న్‌కు సమీపంలో ఆపరాదని.. విజయవాడ వెళ్లే బస్సులను ఆరెంజ్ ఆస్పత్రి ముందు నిలపాలని ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీధర్ సూచించారు. -
సిగరెట్ల దొంగల ముఠా అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా: అంతర్రాష్ట్ర సిగరేట్ల దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. గత నెల 20న కంటైనర్‌లో తిరుపతి రేణిగుంట నుంచి ట్రాన్స్ పోర్ట్ చేస్తున్న 647 కాటన్ సిగరెట్ బాక్సులను కంజర్ గ్యాంగ్ దోపిడీ చేసింది. ఫింగర్ ప్రింట్స్, టోల్ ప్లాజాల్లో సీసీ ఫుటేజ్ ల ఆధారంగా కేసును ట్రేస్ చేశాం. మధ్యప్రదేశ్ కు చెందిన 25 మంది సభ్యుల కంజర్ గ్యాంగ్ రెక్కీ వేసి దోపిడీ చేసింది. ఈ కేసులో ఇప్పటికి నలుగురిని మధ్యప్రదేశ్‌లోని దేవస్ జిల్లాలో అరెస్ట్ చేశాం. మధ్యప్రదేశ్ లో కంజర్ గ్యాంగ్ పేరు మోసిన దొంగల ముఠా. దోపిడీలో పాల్గొన్న మరో 20 మంది కోసం గాలిస్తున్నాం. ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు 5 రాష్ట్రాల్లో 50 కోట్లకు పైగా విలువైన గూడ్స్ ను దోపిడీ చేశారని కమిషనర్ తెలిపారు. -
సిగరెట్ల దొంగల ముఠా అరెస్ట్
-
మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
హైదరాబాద్ : నగర శివారలో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న పలువురు నైజీరియన్లతో పాటు విజయవాడకు చెందిన ఓ యువతిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2.50 లక్షలతో పాటు భారీగా ఎల్ఎస్డీ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో నైజీరియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నాడు. వీరందరినీ పోలీసులు రహస్యప్రాంతంలో విచారణ జరుపుతున్నారు. కాగా ప్రేమికుల ముసుగులో గత కొంతకాలంగా వీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వెంట ఉన్నా తంటాలే!
-
వెంట ఉన్నా తంటాలే!
⇒ మందుబాబుల కారులో ‘మద్యం తాగిన స్థితి’లో వెళ్లినా కేసే ⇒ ‘మద్యం కేసుల’పై రాచకొండ పోలీసుల దృష్టి సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి ఉన్న స్థితిలో.. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నడుపుతున్న వాహనంలో ప్రయాణిస్తున్నారా..? అయితే మీపైన కూడా ఇకపై కేసు తప్పదు. ప్రస్తుతం ఎదుటి వారి మరణానికి కారణమైన కేసులకు మాత్రమే ఈ నియమాన్ని వర్తింపజేయాలని నిర్ణయించిన రాచకొండ పోలీసులు.. భవిష్యత్తులో మిగిలిన కేసులకూ అమలు చేయాలని యోచిస్తున్నారు. మద్యం తాగిన స్థితిలో, మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్లు చేసిన ప్రమాదాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ మహేష్ ఎం. భగవత్ నిర్ణయించారు. వీరిపై భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 304 పార్ట్ 2 సెక్షన్ కింద కేసు నమోదు చేయనున్నామని ఆయన వెల్లడించారు. నేరం నిరూపితమైతే వీరికీ శిక్ష తప్పదు.. మద్యం మత్తులో ప్రమాదానికి కారణమై, ఎదుటి వారి ప్రాణం తీసిన వాహనం డ్రైవర్‌తో పాటు అతడి వెంట ఉన్న వారినీ నిందితులుగా చేర్చాలని రాచకొండ పోలీసులు నిర్ణయించారు. మద్యం మత్తులో.. అదే స్థితిలో ఉన్న వ్యక్తిని డ్రైవింగ్ చేయడానికి అనుమతించడం అంటే ప్రమాదానికి ప్రేరేపించడం అనే అర్థం వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఐపీసీలోని 109 సెక్షన్ కింద వీరినీ నిందితులుగా చేర్చనున్నామని వివరిస్తున్నారు. న్యాయస్థానంలో నేరం నిరూపితమైతే వీరికీ శిక్ష తప్పదు. తెలిసీ తప్పు చేసినట్లే.. సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణిస్తే ఐపీసీలోని 304(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేస్తుంటారు. ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యారనేది ప్రధాన అభియోగం అవుతుంది. అయితే ప్రమాదానికి కారణమైన వ్యక్తి మద్యం మత్తులో ఉంటే మాత్రం ఆ కేసును 304 పార్ట్ 2 సెక్షన్‌గా నమోదు చేయనున్నారు. దీని ప్రకారం కేసు నమోదు చేస్తే ఎదుటి వారి మరణానికి కారణమవుతుందని తెలిసీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది ప్రధాన అభియోగం అవుతుంది. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం ఎదుటి వారికి ప్రమాద హేతువని తెలిసీ ఆ స్థితిలో వాహనం నడిపినందుకు ఇలా కేసు నమోదు చేయనున్నారు. ఈ కేసుల్లో బెయిల్ పొందడం చాలా కష్టం. మరోవైపు ఈ కేసులో నేరం నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.