
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా యువతిని వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వివరాలు.. విశాఖపట్నం జిల్లాకు చెందిన భార్గవ్ ఫోన్ ద్వారా హైదరబాద్‌కు చెందిన యువతికి పరిచయమయ్యాడు. అనంతరం ఆమెతో పరిచయం పెంచుకొని ఆమెకు తెలియకుండా వ్యక్తిగత చిత్రాలు సేకరించాడు. ఆపై తనతో స్నేహం కొనసాగించాలని లేకపోతే అశ్లీల చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ భార్గవ్ ఆ యువతిని బెదిరించాడు. దీంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించి భార్గవ్‌పై ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో భార్గవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment