ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. బ్యాంక్ సిబ్బంది, ప్రభుత్వ అధికారుల పేరుతో ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఓటీపీ అడిగి బ్యాంక్‌లోని డబ్బులను దోచేస్తున్నారు. అయితే ఇలాంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వుండాలని ఎప్పటికప్పుడు పోలీసులు ప్రజలకు హెచ్చరిస్తూనే ఉన్నారు.
ఈ మోసాల గురించి మరింత వివరంగా చెప్పేందుకు రాచకొండ పోలీసులు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఇందుకు కాస్త హాస్యాన్ని జోడించారు. ఓ ఫన్నీ కపుల్ జోక్‌తో ప్రజలను హెచ్చరించారు. ఓ అర్థాంగి అమాయకత్వం సైబర్ కేటుగాళ్ల నుండి ఎలా కాపాడిందో తెలియజేస్తూ సాగిన చిన్న ఫన్నీ స్టోరీని రాచకొండ పోలీస్ కమీషనరేట్ అధికారిక ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేశారు.
చివరగా.. బ్యాంకు అకౌంట్ వివరాలు, ఓటీపీలు, ఏటీఎం లేదా క్రెడిట్ కార్డు వివరాలను ఎవరితో పంచుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు చెప్పారు.
రాచకొండ పోలీసుల రావుగారి 'అర్థాంగి' స్టోరీ కింద చదవండి:
Comments
Please login to add a commentAdd a comment