
సాక్షి, హైదరాబాద్: దేశంలో పలు రాష్ట్రాలకు సంబంధించి చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో విస్తుపోయే అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన ఇప్పటి వరకు 27 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆడ శిశువును నాలుగు లక్షలకు, మగ శిశువులను ఆరు లక్షలకు అమ్మినట్టు దర్యాప్తులో వెల్లడైంది.
వివరాల ప్రకారం.. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ముంబై, యూపీలోని పలు ఏరియాలను టార్గెట్ చేసి ట్రాఫికింగ్ ముఠా.. చిన్న పిల్లలకు విక్రయిస్తోంది. పశ్చిమ బెంగాల్, చెన్నై, తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాల్లో పిల్లలు లేని తల్లిదండ్రులకు వీరిని విక్రయిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు 27 మందిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో దర్యాప్తులో భాగంగా పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
అయితే, చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలకు సంబంధించిన వారు ఎక్కువగా ఆసుపత్రుల్లోనే పనిచేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా కార్తీక్ ఉండగా.. అజంపుర UPHCలో ఆశ వర్కర్‌గా అమూల్య పనిచేస్తోంది. మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో ఇస్మాయిల్ సూపర్‌వైజర్‌గా ఉన్నారు. ఇక, ఈ కేసులో దళారులతో పాటు పిల్లల్ని కొనుగోలు చేసిన తల్లిదండ్రులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల నుండి వేల కిలోమీటర్లు బస్సుల్లో చిన్నారులను దళారులు తీసుకువస్తున్నారు.
కాగా, 25 మంది చిన్నారులను అక్రమంగా విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడించారు. ఇప్పటికే 14 మంది చిన్నారులను రెస్క్యూ చేసినట్టు తెలిపారు. మరో 11 మంది చిన్నారుల కోసం రాచకొండ పోలీసులు గాలిస్తున్నారు. ఈక్రమంలో ఆడ శిశువును మూడు లక్షలకు విక్రయించి నాలుగు లక్షలకు అమ్మకం.. మగ శిశువును నాలుగు లక్షలకు విక్రయించి ఆరు లక్షలకు అమ్మకం జరుపుతున్నట్టు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment