
కడెం(మంచిర్యాల): పాముకాటుకు గురై వివాహిత మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. పెద్దూర్‌కు చెందిన నేరెళ్ల రజిత (35), దాసు భార్యభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసు కుంటూ జీవనం సాగిస్తున్నారు. అద్దె ఇంటి డబ్బుల భారంతో గత కొన్నినెలలుగా పెద్దూర్ సమీపంలోని డబుల్ బెడ్రూం ఇంటికి వెళ్లారు.
ఆదివారం ఉదయం ఇంటి పరిసరాల్లో రజిత తోటకూర తెంపుతుండగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు ఆమెను కడెంలో ప్రథమ చికిత్స చేయించి, నిర్మల్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. తల్లి మృతదేహం వద్దమృతదేహం వద్ద రోదిస్తున్న కూతురు కూతుళ్ల రోదన అందరిని కంటతడి పెట్టించింది. పెద్ద కూతురు వివాహం నిశ్చయం కాగా, అంతలోనే తల్లి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయ లు అలముకున్నాయి. భర్త ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.కృష్ణసాగర్రెడ్డి తెలిపారు.