Snake Bite
-
రైలులో పాము కాటు.. ప్రయాణికుల తొక్కిసలాట
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. రైలులోని జనరల్ కోచ్‌లో ఝాన్సీ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ యువకుడిని పాము కాటు వేసింది. దీంతో ప్రయాణికులంతా భయపడిపోయారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. గ్వాలియర్‌లో అధికారులు రైలును నిలిపివేసి, బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్‌కు చెందిన 30 ఏళ్ల భగవాన్‌దాస్ ఢిల్లీకి వెళ్లేందుకు ఖజురహో-ఝాన్సీ రైలులోని జనరల్ కోచ్‌లో ఎక్కాడు. బోగీలో జనం ఎక్కువగా ఉండడంతో డోర్ వెనకే నిలబడ్డాడు. రాత్రి 10 గంటల సమయంలో దబ్రా-గ్వాలియర్ మధ్య రైలు నడుస్తుండగా భగవాన్‌దాస్‌ను పాము కాటువేసింది. దీంతో అతను భయంతో కేకలు వేశాడు. అక్కడున్న ప్రయాణికులు అ పామును చూసి, హడలిపోయిన దూరంగా జరిగే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది.ఇంతలో ఒక ప్రయాణికుడు రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి కాల్ చేసి, సంఘటన గురించి అధికారులకు తెలియజేశాడు. రైలు 10.30 గంటలకు గ్వాలియర్‌కు చేరుకోగానే, రైలు అధికారులు బాధితుడిని రైలు నుండి దింపి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా రైల్వే పీఆర్ఓ మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ నిజానికి రైలులో ఇటువంటి పాములు ఉండవని, వికృత చేష్టలకు పాల్పడే కొందరు ఇలాంటి పనికి పాల్పడి ఉంటారన్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ మార్క్.. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి కీలక పదవులు -
వైరల్: ఆసుపత్రిలో కలకలం.. కాటేసిన పామునే మెడలో వేసుకుని..
భాగల్పూర్: తనను కాటేసిన పాము నోటిని గట్టిగా పట్టుకుని ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. బీహార్‌లోని భాగల్పూర్లో ఈ ఘటన జరిగింది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఐదు పాములలో ఒకటైన రస్సెల్స్ వైపర్ కాటుకు గురైన ప్రకాశ్ మండల్.. పాముని మెడలో వేసుకుని ఆస్పత్రికి వైద్యం కోసం రావడంతో అక్కడ వారంతా షాక్ అయ్యారు. భయంతో పరుగులు తీశారు.ఈ సమయంలో పామును చేతిలో పట్టుకుని ఆసుపత్రి అంతా తిరుగుతూ కొంతసేపు నేలపై పడుకున్నాడు. అతని ఎడమ చేతికి పాము కాటు వేయగా, అక్కడ ఉన్న డాక్టర్లు కూడా అతని దగ్గరికి వచ్చే ధైర్యం చేయలేకపోయారు. పామును పట్టకుని ఉంటే వైద్యం కష్టమని వైద్యులు తెలిపారు. దీంతో అతి కష్టం మీద పామును ఒక సంచిలో వేసి కట్టేసిన తర్వాత ప్రకాశ్ మండల్‌కు చికిత్స ప్రారంభించారు. ఆసుపత్రిలో జరిగిన ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు.बिहार के भागलपुर में एक शख्स को सांप ने काट लिया, जिसके बाद आदमी सांप पकड़कर अपने साथ अस्पताल ले आया. pic.twitter.com/jwoxj1N1sM— Priya singh (@priyarajputlive) October 16, 2024 ఇదీ చదవండి: 82 ఏళ్ల జీవితకాలంలో ఒక్క మహిళని కూడా చూడలేదట..! -
రీల్స్ పిచ్చి: పాము కాటుకు యువకుడు బలి
సాక్షి,కామారెడ్డిజిల్లా: సోషల్‌మీడియాలో పాపులర్ అవ్వాలన్న కోరిక మరో ప్రాణాన్ని బలిగొన్నది. సాహసం చేసి పేరుతెచ్చుకునే మాట అటుంచితే యుక్త వయస్సులోనే ఆయుష్షు పూర్తయిపోయింది. కామారెడ్డి జిల్లా దేశాయిపేటలో శుక్రవారం(సెప్టెంబర్6) విషాద ఘటన జరిగింది. సోషల్‌మీడియాలో వైరల్ అయ్యేందుకు శివరాజు అనే యువకుడు ఏకంగా విష సర్పాన్నే నోటితో కరిచి పట్టుకున్నాడు. ఈ దృశ్యాలను వీడియో తీయాల్సిందిగా స్నేహితులకు చెప్పాడు. ఇంకేముంది షరామామూలుగానే పాము తన సహజ స్వభావంతో యువకున్ని కాటు వేసింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన శివరాజును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివరాజు తుద్విశ్వాస విడిచాడు. యువకుడు అకారణంగా చనిపోవడంపై కుటుంబసభ్యులు కనీరుమున్నీరవుతున్నారు. పాముకాటుతో మృతిచెందిన శివరాజు ఇటీవల పాములు పట్టడంలో శిక్షణ పొందుతున్నట్లు తెలిసింది. -
Snake bite: ఇంటి పామే కాటు వేసింది!
ఖానాపూర్: మండలంలోని గోసంపల్లెకు చెందిన అరుగుల గంగమ్మ (65)మంగళవారం పాముకాటుతో మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వృద్ధురాలు నివాసం ఉంటున్న ఇంట్లోనే పాముల పుట్ట ఉంది. పలుమార్లు పుట్టలోంచి బయటకు వచ్చిన పాము పరిసరాల్లో సంచరిస్తూ ఉండేది. సోమవారం ఇంటిని శుభ్రం చేసే క్రమంలో పుట్టవద్ద శుభ్రం చేస్తుండగా నాగుపాము బయటకు వచ్చి వృద్ధురాలిని కాటువేసింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి కుమార్తె రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై లింబాద్రి తెలిపారు. -
India: పాముకాటుతో ఏటా 50 వేల మంది మృతి.. ప్రపంచంలోనే అత్యధికం
న్యూఢిల్లీ: భారత్‌లో పాము కాటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విష సర్పాల కారణంగా దేశంలో ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మేరకు పాముకాటు మరణాలపై బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ లోక్‌సభలో మాట్లాడుతూ.. దేశంలో ప్రతి ఏటా పాము కాటు వల్ల 50 వేల మంది మరణిస్తున్నారని బిహార్ బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ వెల్లడించారు. ప్రపంచంలోనే పాము కాటు వల్ల మరణిస్తున్న వారిలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు.ఆయన మాట్లాడుతూ.. ‘భారత్‌లో ఏటా 30 నుంచి 40 లక్షల మంది ప్రజలు పాము కాటుకు గురవుతున్నారు. అందులో 50 వేల మంది మరణిస్తున్నారు. ఇది ప్రంపంచలోనే అత్యధికం’అని పేర్కొన్నారు. అదే విధంగా బిహార్ చాలా పేద రాష్ట్రమని, పేదరికంతోపాటు సహజంగా వాతారవణ మార్పులు సైతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. ఇది ఆందోళన కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారుమరోవైపు వేలూరు ఎంపీ ఎం.కతీర్ ఆనంద్ .. బీడీ కార్మికుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. బీడీ కార్మికుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారన్నారు. కేంద్రం నిధులు సరిపోవడం లేదని, వారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులు దుమ్ము, ఇతర వృత్తిపరమైన ప్రమాదాలకు గురికావడాన్ని గమనించి బడ్జెట్ కేటాయింపుల్లో పరిగణనలోకి తీసుకుని 60 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ అందించాలని కేంద్రాన్ని కోరారు. -
విషమంగానే ‘నాగరాజు’ పరిస్థితి
సత్యసాయి జిల్లా: కదిరిలో నాగుపాముతో ఆటలాడి.. కాటుకు గురైన యువకుడు నాగరాజు పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అతను బతికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని గురువారం ఉదయం బులిటెన్ ద్వారా ప్రకటించారు. పూటుగా మద్యం సేవించిన నాగరాజు.. రోడ్డు మీద ఓ నాగుపాముతో ఆటలాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మద్యం మత్తులో ఉన్న నాగరాజు ఆ యువకుడు అక్కడున్న వారు వద్దని చెప్పినా వినిపించుకోలేదు. నాగుపాము తల వద్ద చేయి పెట్టి ఆడుతుండగా అది కాటేసింది. పాము కాటేసినా నాగరాజు దాన్ని వదలలేదు. దాన్ని కాలుతో తొక్కాడు. చివరకు అది పొదల్లోకి పారిపోయింది. ఆ తర్వాత నాగరాజును బలవంతంగానే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. … pic.twitter.com/cV7yv0iQ2v— Telugu Scribe (@TeluguScribe) July 24, 2024 -
Snake Bite: 40 రోజుల్లో ఏడుసార్లు పాముకాటు
ఉత్తరప్రదేశ్: ఫతేపూర్ జిల్లాలో నలభై రోజుల వ్యవధిలో ఏడు సార్లు పాము కాటుకు గురయ్యాడో యువకుడు. ఇంకా రెండు సార్లు సైతం పాము తనను కాటు వేస్తుందని తెలిపాడు. 9వసారి కాటు వేసిన తర్వాత ఎవరూ కాపాడలేరని చెప్పడం గమనార్హం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపుర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సౌరా గ్రామానికి చెందిన వికాస్ దూబే అనే యువకుణ్ని 40 రోజుల వ్యవధిలోనే వేర్వేరు పాములు ఏడుసార్లు కాటు వేశాయి.ప్రస్తుతం వికాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 12 నుంచి 14 గంటల్లో వికాస్ స్పృహలోకి రాకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని వైద్యుడు జవహర్ లాల్ తెలిపారు. ఆరోసారి పాము కాటుకు గురైన సమయంలో వికాస్ ఓ ఆశ్చర్యకరమైన విషయం బయటపెట్టాడు. అతడికి ఓ కల వచ్చిందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. కలలో తనను ఒకే పాము 9 సార్లు కాటు వేసిందని, చివరిసారి తనను ఎవరూ కాపాడలేరని వివరించాడు. ఎలాంటి చికిత్స అందించినా సరే 9వ సారి పాము కాటు నుంచి తనను ఎవరూ రక్షించలేరని తెలిపాడు. తనను ప్రతి సారి ఆడ పాము కాటు వేస్తోందని అది కూడా శని లేదా ఆదివారాల్లో మాత్రమే ఇలా జరుగుతోందని చెప్పాడు. వరుస పాము కాటుల నేపథ్యంలో వికాస్ కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు వికాస్ దూబే చికిత్స అందించిన వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
భార్యను కాటేసిన పాము.. ఆసుపత్రికి తీసుకెళ్లిన భర్త ఏం చేశాడంటే
సాధారణంగా పామును చూస్తేనే దానికి దూరం పరుగెత్తుతారు. ఒకవేళ పాము కాటుకు గురైతే భయపడిపోయి ప్రాణభయంతో వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి పరుగుతీస్తాం. కానీ బీహార్ ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పాముకాటుకు గురైన మహిళను ఆమె భర్త ఆసుపత్రికి తీసుకురాగా ఆమెతోపాటు కాటు వేసిన పామును కూడా తీసుకురావడంతో వైద్యులు షాక్‌కు గురయ్యారు.సబౌర్‌లోని జుర్ఖురియా గ్రామంలో నిషా అనే మహిళ తన ఇంటిని శుభ్రం చేస్తుండగా పాము కాటుకు గురైంది. సాయం కోసం కేకలు వేయడంతో, భర్త రాహుల్ ఆమె దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు. ఈ లోపు పాము పారిపోతుంటే దాని వెంట వెళ్లి ఇంట్లో దేవుడి ఫోటోల వెనక్కి నక్కిన పాము కనిపించింది.వెంటనే కర్రతో దానిని తీసి బకెట్లో వేశాడు. అప్పటికే నిషా స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను తన బైక్‌పై కూర్చోబెట్టి, బకెట్లో పాముతోపాటు బైక్ హ్యాండిల్‌కు వేలాడదీశాడు. భాగల్పూర్ జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లిన తర్వాత వైద్యులు మొదట పామును చూసి భయపడిపోయారు.అయితే ఆ పాము తన భార్యను కరిచిందని చెబుతూ.. ఆమెను కాపాడాల్సిందిగా వైద్యులను వేడుకున్నాడు నిషా భర్త.. అనంతరం దానిని దూరంగా ఉంచమని చెప్పి.. మహిళను చికిత్స కోసం అత్యవసర విభాగానికి పంపారు. ఆ పాము విషాన్ని అంచనా వేయడం ద్వారా ఆమెకు వైద్యులు చికిత్స చేశారు. ప్రస్తుతం నిషా పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పామును మళ్లీ అడవిలో విడిచిపెట్టారు. -
ఇద్దరు బాలికలకు పాముకాటు..
మహబూబ్‌నగర్: వేర్వేరు చోట్ల ఇద్దరు బాలికలను పాముకాటు వేయగా.. చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు. మరొకరిని చికిత్స నిమిత్తం ఖిల్లా ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్య సిబ్బంది పాముకాటు మందులు, అంబులెన్స్ లేవు అని చెప్పడంతో చావుబతుకుల మధ్య బాలికను ఆర్టీసీ బస్సులో మహబూబ్‌నగర్‌కు తరలించారు.ఈ ఘటనలు వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం కొత్తపల్లి తండా, ఊరంచు తండాలో మంగళవారం చోటుచేసుకున్నాయి. ఆయా కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా.. మండలంలోని కొత్తపల్లి తండాకు చెందిన ముడావత్ రవినాయక్ కుటుంబ సభ్యులతో కలిసి రోజులానే ఇంట్లో నిద్రించారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో కూతురు ఇందు (10)ను ఓ పాము కాటు వేసింది.వెంటనే నిద్రలేచిన ఇందు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఇళ్లంతా వెతకగా కట్లపాము కనిపించింది. దానిని చంపి పాపను చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బాలిక మృతిచెందింది. తండ్రి రవినాయక్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.షాపురం ఊరంచు తండాలో..ఇదిలాఉండగా, మండలంలోని షాపురం ఊరంచు తండాకు చెందిన రెడ్యానాయక్ కూతురు లలిత తిమ్మాజిపేట గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ఇటీవల తండాకు వచ్చిన లలిత మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి పొలం వద్దకు వెళ్లింది. పొలంలో నడుస్తున్న క్రమంలో ఓ పాము బాలిక లలితను కాటువేసింది. విషయాన్ని తల్లిదండ్రులకు తెలపగా.. కాట్లు గుర్తించి చికిత్స నిమిత్తం ఖిల్లాఘనపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పాముకాటుతో బాలుడి దుర్మరణం
రాయగడ: నిద్రస్తున్న సమయంలో ఒక పాము కాటు వేయడంతో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన జిల్లాలోని బిసంకటక్ సమితి గొంటిఖాల్ గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు అదే గ్రామానికి చెందిన రబి సరక కొడుకు వివేక్ సరకగా గుర్తించారు. ఆదివారం రాత్రి ఎప్పటిలాగే భోజనం చేసి ఆరుబయట పడుకున్న వివేక్‌కు పొదల నుంచి వచ్చిన ఒక పాము కాటు వేసింది. దీంతో ఏడ్చిన వివేక్‌ను చూసిన తల్లిదండ్రులు చుట్టుపక్కల పరిశీలించగా, ఒక పాము అటువైపుగా వెళ్తుండడం గమనించి వెంటనే చికిత్స కోసం బిసంకటక్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే కాటువేసిన పామును గ్రామస్తులు కొట్టి చంపారు. -
కాటేసిన నాగుపాము, ఆ రైతు ఏం చేశాడంటే..
వేలూరు: కాటేసిన నాగుపాముతో ఓ రైతు ప్రభుత్వాస్పత్రికి వచ్చిన సంఘటన కలకలం రేపింది. తిరుపత్తూరు జిల్లా వాదనవాడి గ్రామానికి చెంది న వేలాయుధం రైతు. ఇతడి వ్యవసాయ బావిలో పూడికతీత పనులు సాగుతున్నాయి. ఆ సమయంలో రైతు వేలాయుధం కాలుపై పాము కరిచినట్లు కనిపించింది. దీంతో అక్కడ కనిపించిన నాగు పామును కొట్టి చంపి దాన్ని ప్లాస్టిక్ కవర్లో వేసుకొని వెంటనే తిరుపత్తూరు ప్రభు త్వాస్పత్రికి తెచ్చాడు. దాన్ని చూ సిన అత్యవసర విభాగంలోని వైద్యులు అవాక్కయ్యారు. కాగా వేలాయుధం తనను ఈ పాము కరిచిందని వెంటనే వైద్యం అందజేయాలని తెలిపి స్పృహ త ప్పి పడిపోయాడు. దీంతో వైద్య సిబ్బంది వెంటనే రైతుకు వైద్యం చేశారు. -
పాముల్లో విషం తయారవ్వడానికి ఎంత టైం పడుతుందో తెలుసా..?
వర్షాకాలం వచ్చిందంటే చాలు పల్లెల్లో పాముల బెడద మొదలవుతుంది. పొలం పనులకు వెళ్లిన వారు ఎక్కువగా పాముకాటుకు గురవుతుంటారు. గతంలో పాముకాటుతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేక, మందుల కొరతతో ప్రాణాలు కోల్పోయేవారు. కానీ గత ప్రభుత్వంలో మారుమూల ప్రాంతాలకూ వైద్యసేవలను చేరువచేయడంతో పాటు క్వాలిఫైడ్ వైద్యులను నియమించి, తగిన మందులు అందుబాటులో ఉంచడంతో సకాలంలో మెరుగైన వైద్యం అందుతోంది. ఈ సీజన్లోనే ఇప్పటి వరకు దాదాపు వంద మంది పాముకాటుకు గురవగా ఒక్కరికి కూడా ప్రాణాపాయం లేదు. ఒంగోలు టౌన్: ఇప్పటి దాకా వేసవి ఎండల వలన గుంతలు, పొదలు, గుబురుగా ఉండే చెట్ల మధ్య, గడ్డివాముల్లో తల దాచుకునే పాములు అలా వర్షాలు కురుస్తాయే లేదో బుసలు కొడుతూ బయటకు వస్తాయి. పొలం గట్ల మీద తిరుగుతుంటాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పడగ విప్పి కాటేస్తాయి. పల్లెల్లో చింత చెట్ల మీద తాచు పాములు, నాగు పాములు, పసిరిక పాములు, కట్లపాములు కనిపిస్తుంటాయి. పాము కాటు బాధితుల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు, రైతు కూలీలే ఉండడం గమనార్హం. మారుమూల ప్రాంతాల్లో పాము కరిచినప్పుడు సాధ్యమైనంత త్వరగా వైద్యశాలకు వెళ్లే సౌకర్యం లేకపోవడంతో గతంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకునేవారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు సరిగా ఉండేవి కావు. ఎక్కడో ఒకటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండేది. అక్కడ వైద్యుడు ఉండేవారు కాదు. సిబ్బంది కూడా అంతంత మాత్రంగా ఉండేవారు. పాము కాటుకు విరుగుడు ఇంజక్షన్లు ఉండేవి కావు. 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇద్దరు క్వాలిఫైడ్ వైద్యులను నియమించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రైతు కూలీలు పాము కాటుకు గురవుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం పాము కాటు విరుగుడుకు ఉపయోగించే యాంటి వీనమ్ ఇంజక్షన్లను అందుబాటులో ఉంచింది. దీంతో ఇప్పడు పాము కాటు వలన చనిపోయేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది 100 పాముకాట్ల నమోదు: జూన్ నుంచి అక్టోబర్ వరకు పాముకాట్లు ఎక్కువగా ఉంటాయి. మామూలు సమయాల్లో జిల్లాలో రోజుకు 1 నుంచి 2 పాము కాటు కేసులు వస్తే వర్షాకాలం ప్రారంభమైన తరువాత రోజుకు 4 నుంచి 5 కేసుల వరకు వస్తున్నాయి. జిల్లాలో ప్రతి ఏడాది పాముకాట్లు పెరుగుతున్నాయి. అయితే పాముకాటు వలన మరణించేవారి సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గింది. 2022 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబరు వరకు 119 మంది పాముకాటుకు చికిత్స కోసం ఒంగోలు లోని జీజీహెచ్‌కు వచ్చారు. వీరిలో 56 మంది పురుషులు కాగా 63 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 99 మంది అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. 2023 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబరు వరకు 393 మంది పాముకాటు చికిత్స కోసం వచ్చారు. వీరిలో 240 మంది పురుషులు కాగా 153 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 305 మంది అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నారు. ఒకరు మరణించారు. ఇక 2024లో జనవరి నుంచి జూన్ వరకు ఈ ఆరు నెలల్లో 100 మంది పాము కాటుకు గురై చికిత్స కోసం వచ్చారు. వీరిలో 63 మంది పురుషులు కాగా 37 మందిమహిళలు ఉన్నారు. ఈ వంద మందిలో కేవలం 87 మంది మాత్రమే చికిత్స కోసం అడ్మిట్ అయ్యారు. ఎలాంటి మరణాలు సంభవించలేదు. గత రెండేళ్లలో పాము కాటు వలన మరణించిన వారిలో కేవలం పురుషులు మాత్రమే ఉండడం గమనార్హం. మరణాలు గణనీయంగా తగ్గడానికి సకాలంలో వైద్యం అందడమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇంజక్షన్లు సరిపడా ఉన్నాయి: జిల్లాలో పాము కాటుకు వినియోగించే ఇంజక్షన్లు సరిపడా ఉన్నాయి. జిల్లాలోని అన్నీ ప్రభుత్వ వైద్యశాలలకు అవసరమైన ఔషధాలను తొలి త్రైమాసికంలోనే పంపించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 3642 డోసుల యాంటి స్నేక్ వీనం ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. స్నేక్ వీనం యాంటి సీరం అనే ఇంజక్షన్లు 229 డోసులు ఉన్నాయి. లక్షణాలను ఇలా గుర్తించాలి... పాము కాటు వేసిన చోట వాపు, నొప్పి ఉంటుంది. కొంత మందిలో మూత్రంలో రక్తం పోతుంది. అందుకే మూత్రం ఎర్రగా వస్తుంది. కళ్లు మూత పడడం, మింగడానికి ఇబ్బందిగా ఉండడం, శ్వాస ఆడక ఇబ్బంది పడతారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యం చేస్తామని జీజీహెచ్ జనరల్ ఫిజీషియన్ డా.కళ్యాణి చెప్పారు. మూఢనమ్మకాలను నమ్మవద్దు: పాముకాటు వేసిన వారు మూడు రోజుల పాటు నిద్ర పోకూడదని గ్రామీణ ప్రాంతాల్లో ఒక నమ్మకం విస్తృతంగా ప్రచారంలో ఉంది. అలాగే ఫలానా వస్తువులు తినకూడదని పత్యాలు పెడుతుంటారు. నిజానికి ఎలాంటి ఆందోళన చెందకుండా నిద్రపోవచ్చు. ఆహారం విషయంలో కూడా ఎలాంటి పత్యాలు లేవు.విష పాములను గుర్తించడం ఎలా...? పాము కాటేసిన వెంటనే విషం కంటే పాము కాటేసిందన్న భయమే ఒళ్లంతా పాకేస్తుంది. మానసిక ఆందోళనతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారే ఎక్కువగా ఉంటున్నారని వైద్య నివేదికలు చెబుతున్నాయి. నిజానికి పాములన్నీ విషపూరితమైనవి కావు. ఇందులో కొన్ని పాములు విష పాములు ఉంటే మరికొన్ని విషరహిత పాములుంటాయి. విష పాములకు రెండు కోరలు ఉంటాయి. విషరహిత పాములకు ఎలాంటి కోరలు ఉండవు. అందుకే పాము కాటేసినప్పడు గాయాన్ని నిశితంగా పరిశీలించాలి. శరీరంపై రెండు గాట్లు దిగినట్లు కనిపిస్తేనే విష సర్పం కాటేసినట్లు గుర్తించాలి. ఒకసారి పాము కాటేసిన పాములో తిరిగి విషం ఉత్పత్తి కావడానికి 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో ఎక్కువగా నాగు పాము, కట్ల పాములు ఉన్నాయి. నాగుపాము కాటేసినప్పుడు నొప్పితో విలవిల్లాడిపోతారు. అదే కట్ల పాము కనుక కాటేస్తే చీమ కుట్టినట్టు మాత్రమే ఉంటుంది. దాంతో పాము కాటు వేసినట్లు అనుమానించరు. నిర్లక్ష్యం చేస్తారు. ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది.జిల్లాలో 72 పీహెచ్‌సీలు.. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పీహెచ్సీలో ఇద్దరేసి క్వాలిఫైడ్ వైద్యులను నియమించారు. ప్రతి వైద్యశాలలోనూ అత్యవసర వైద్య సేవలను అందించేందుకు తగిన సిబ్బంది, ఔషధాలను ఏర్పాటు చేశారు. నగర శివారు ప్రజలకు అందుబాటు ఉండేలా 18 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక్క ఒంగోలు నగరంలోని శివారు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా 9 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. నామ మాత్రంగా హాస్పిటళ్లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకోకుండా ప్రతి యూపీహెచ్సీల ఒక ఎంబీబీఎస్ వైద్యుడితో పాటు ఏడుగురు సిబ్బందిని నియమించారు. ప్రతి పీహెచ్సీ, యూపీహెచ్‌సీలో పాముకాటు ఇంజక్షన్లు అందుబాటులో ఉంచారు. దీంతో పాముకాటుకు గురైన వారిని సకాలంలో వైద్య చికిత్స చేసేందుకు అవకాశం ఏర్పడింది.సకాలంలో వైద్యశాలకు తరలించాలి ఎవరికైనా పాము కరిస్తే ఆందోళన చెందకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించాలి. మన ప్రాంతంలో ఎక్కువగా విష సర్పాలు లేవు. ఉన్నా డ్రైడ్ పాములు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ధైర్యంగా ఉండాలి. కాటుకు పై భాగంలో ఎలాంటి కట్లు కట్టాల్సిన అవసరం లేదు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం మంచి వైద్యం అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీలైనంత త్వరగా వైద్యశాలకు తరలించి సుశిక్షితులైన వైద్యులచేత చికిత్స చేయించడం మంచిది. –డాక్టర్ ఎన్.కళ్యాణి, జనరల్ ఫిజీషీయన్, హెచ్ఓడీప్రజల్లో అవగాహన కలిగించాలి అన్నీ రకాల పాములు విషపాములు కావు. పాము కాట్లన్నీ ప్రమాదం అని అనుకోకూడదు. అలాగని నిర్లక్ష్యం వహించకూడదు. ముందుగా ఎలాంటి పాము కాటు వేసిందో నిర్ధారించాలి. అది విషం కలిగిన పాము అయితే వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి సకాలంలో వైద్యం చేయిస్తే చాలు. జీజీహెచ్‌లో పాము విషం విరుగుడు ఇంజక్షన్లతోపాటుగా తగిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. – డాక్టర్ జీ.దుర్గాదేవి, సూపరింటెండెంట్, జీజీహెచ్, ఒంగోలు. -
మహిళను కాటేసిన అత్యంత విషపూరితమైన పాము
నెల్లూరు(అర్బన్): నెల్లూరు దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో రత్నమ్మ అనే అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికురాలిని అత్యంత విషపూరితమైన రక్తపింజరి పాము కాటేసింది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. సిబ్బంది కథనం మేరకు.. రోజులాగే రత్నమ్మ సోమవారం విధులకు వచ్చింది. సంబంధిత సూపర్వైజర్ మెడికల్ కళాశాల ఆవరణలో గడ్డిని తొలగించే పనిని ఆమెకు అప్పగించారు. దీంతో గడ్డిని తొలగిస్తుండగా పాము ఆమె చేతి వేలిపై కాటువేసింది. రత్నమ్మ కేకలు వేయగా సహచర సిబ్బంది వచ్చి ఆమెను ఆస్పత్రి క్యాజువాలిటీలో చేర్చారు. డాక్టర్ ప్రాథమిక వైద్యం అనంతరం ఐసీయూకి తరలించారు. ఈసీజీ తీశారు. అనంతరం అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ అయిన ఎజైల్ గ్రూపు మేనేజర్ కొండయ్య మరికొన్ని రక్తపరీక్షలను బయట ల్యాబ్‌లో చేయించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.గతంలో ఓ కార్మికురాలి మృతిగతంలో ఓపారిశుద్ధ్య కార్మికురాలు పెద్దాస్పత్రి ఆవరణలో గడ్డి కోస్తుండగా పాము కాటు వేసింది. తర్వాత భయాందోళనకు, ఒత్తిడికి లోనైంది. రెండో రోజు మృతి చెందింది. ఈ ఘటన అప్పట్లో ఆస్పత్రిలో సంచలనం రేకెత్తించింది. ఆమె మృతితో కుటుంబం వీధిన పడింది. ఏజెన్సీ ఎజైల్ సంస్థ తదితరులు సుమారు రూ.లక్ష సాయం అందించారు.పెస్ట్ కంట్రోల్ వైఫల్యంఆస్పత్రిలో పాములు లేకుండా, చెదపురుగులు పట్టకుండా, ఎలుకలు లేకుండా చూసే బాధ్యత పెస్ట్ కంట్రోల్ది. దీనికి సంబంధించి కాంట్రాక్ట్‌ను పొందిన వ్యక్తికి ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.50 లక్షలు చెల్లిస్తోంది. అయితే ఆ సంస్థ నిబంధనలు గాలికొదిలేశారని ఆరోపణలున్నాయి. మందును స్ప్రే చేయడం మినహా మిగతా పనులు చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలుకలు పట్టేందుకు బోనులు పెట్టాలి. పాములు నివసించేందుకు అనువైన పుట్టలు, బొరియలుంటే తొలగించాలి. బొద్దింకలు, ఇతర చెదపురుగులు చేరకుండా మందులు వాడాలి. ప్రతి నెలా రూ.లక్షలో బిల్లులు తీసుకుంటున్నా నిబంధనల మేరకు పని చేయడంలేదని విమర్శలున్నాయి. సరిపడా ఉద్యో గులను నియమించలేదని తెలుస్తోంది. అయినా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆ ఏజెన్సీకి ఫుల్ మార్కులు వేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి లోపాలు సరిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. -
ఏ పాము కరిచిందని అడుగుతారని..
రాయపర్తి(వరంగల్): తన పెద్దమ్మ పాముకాటుకు గురికాగా, ఆస్పత్రికి వెళితే వైద్యులు ఏ పాము కరిచిందనే ప్రశ్నలు వేస్తారని ముందుగానే ఊహించిన వరుసకు కుమారుడయ్యే వ్యక్తి ఆ పామును చంపి మరీ ప్లాస్టిక్ సంచిలో వేసుకొచ్చాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన వృద్ధురాలు మేరుగు ఎల్లమ్మ వరండాలో కూర్చోగా, వీపుపై పాము కాటువేసింది.దీంతో ఆమె కేకలువేయడంతో రమేశ్ అక్కడికి చేరుకుని పామును చంపేశాడు. వెంటనే ఎల్లమ్మను చికిత్స నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చాడు. అనంతరం వైద్యులు ఎల్లమ్మకు వైద్యం అందించారు. ప్రస్తుతం ఎల్లమ్మ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. -
పాముకాటుతో ఇంటర్ విద్యార్థిని మృతి
తాండూరు రూరల్: పాముకాటుతో ఓ ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన తాండూరు మండల పరిధిలోని ఓగిపూర్ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. కరన్‌కోట్ ఎస్ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం అల్లాకోట్‌కు చెందిన ఎడెల్లి రవి, కుటుంబ సభ్యులతో కలిసి ఓగిపూర్ సమీపంలోని నాపరాతి క్వారీల వద్ద నివాసముంటున్నారు. అక్కడే పాలిషింగ్ యూనిట్లో కార్మికుడిగా పని చేస్తున్నారు. రవి కూతురు పూజ(16), జినుగుర్తి సమీపంలోని ఓ హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతోంది.సెలవులు ఉండటంతో తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. శనివారం రాత్రి 1 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న పూజ కుడికాలును పాము కాటేసింది. వెంటనే పూజ ఆరవడంతో తల్లిదండ్రులు లేచి చూడగా పాము కనిపించింది. పూజను తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూజ పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు తరలించారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
snake bite: పట్టిన పామే కాటేసింది
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరంలోని బిబి రోడ్డులో ఓ కారులో పాము దూరింది అని కాల్ చేయడంతో పాముల నిపుణుడు పృథ్వీరాజ్ వచ్చి పట్టుకొన్నాడు, ఈ సమయంలో ఏమరుపాటుగా ఉండగా పాము కాటేసింది. కారులో పాము దూరిందని తెలిసి ఆయన వచ్చారు. పామును చాకచక్యంగా పట్టుకుని బయటకు తీసి బైక్‌లో సంచి కోసం వెతకసాగారు. ఈ సమయంలో జన సందోహం చేరి ఫోటోలు, వీడియోలు తీస్తుండగా పాము గిరుక్కున తిరిగి పృథి్వరాజ్ను తొడ పట్టుకుంది. కష్టమ్మీద పామును విడిపించి, దానిని సంచిలో వేశారు. కాగా, ఇది ర్యాట్ స్నేక్ అని, విషపూరితం కాదని తెలిసింది. ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. -
పాముకాటుతో యువతి మృతి
మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి పనాస్‌పూట్ పంచాయతీ డబలగూడ గ్రామంలో ఒక యువతి పాముకాటుతో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి గ్రామంలో రాందాస్ హంతాల్ కుమార్తె షకీల(20) ఇంటి బయట నిద్రపోయింది. అయితే అర్థరాత్రి 2 గంటల సమయంలో తనను ఏదో జంతువు కాటువేసినట్లు తెలియడంతో పెద్దగా కేకలు వేస్తూ లేచింది. వెంటనే చుట్టుపక్కల చూడగా ఒకపాము పక్కనే ఉన్నటువంటి గోతిలోకి వెళ్లడం గమనించారు. దీంతో హుటాహుటిన జోడాంబ్లో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జోడాంబ్ పోలీసులు కేసు నమోద్ చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి శనివారం తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. -
అసలేంటి ఈ స్నేక్ వెనమ్: సెలబ్రిటీలకు అంత మోజు ఎందుకు?
రేవ్ పార్టీలలో బడాబాబులు, సెలబ్రేటీలు అమ్మాయిలతో డ్యాన్సులు, మాదక ద్రవ్యాలు, అశ్లీల డ్యాన్సులు సాధారణంగా వినిపించేవి. మరి కొందరు మత్తు పదార్థాలూ తీసుకుంటారు. మరి సీక్రెట్‌గా పోలీసుల కంట పడకుండా రేవ్ పార్టీల్లో పాము విషం ఎందుకు హల్చల్ చేస్తోంది. పాము విషం చాలా ప్రమాదకరం. కొన్ని పాములు కరిచిన క్షణాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసి పోవడం ఖాయం. మరి ఇంత ఖరీదైన పార్టీల్లో పాము విషానికి కోట్లాది రూపాయల డిమాండ్ ఎందుకు? చాలామంది సెలబ్రిటీలు పాము విషాన్ని డ్రగ్‌లా ఎందుకు వాడుతున్నారు? వివరాలను ఒకసారి చూద్దాం! ప్రముఖ యూట్యూబర్, ఓటీటీ 'బిగ్ బాస్' విజేత ఎల్విష్ యాదవ్, రేవ్ పార్టీలలో పాము విషాన్ని విక్రయించిన ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. వీరినుంచి స్వాధీనం చేసుకున్న శాంపిల్స్‌లో నాగుపాము, క్రైట్ జాతుల విషం ఉన్నట్లు ఫోరెన్సిక్ విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో స్నేక్ వెనమ్ అడిక్షన్ అంటే ఏమిటి? దీన్ని ఎందుకు తీసుకుంటారు అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్నేక్ వెనమ్ అడిక్షన్ అంటే ఏమిటి? అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన నాగు పాముల విషానికి రేవ్ పార్టీలలో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. పాము విషాన్ని పౌడర్‌గా ప్రాసెస్ చేస్తారు. డ్రగ్స్ మాఫియాలో ఇదొక ఘోరమైన రూపంగా అవతరిస్తోంది. ఈ పౌడర్‌లోని న్యూరోటాక్సిన్ల కారణంగా విపరీత మైన మత్తు రావడంతోపాటు, ఇతర అనేక రకాల లక్షణాలను ప్రేరేపిస్తుంది. ఈ రకమైన వ్యససాన్ని అఫిడిజం అని పిలుస్తారు. బాగా ఎత్తును పొందుతారు, ఎక్కువ గంటలు నృత్యం చేయగలరు. ఈ పౌడర్ బలాన్ని బట్టి ఆరు-ఏడు గంటల నుంచి ఐదు-ఆరు రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది. నిజానికి స్నేక్ వెనమ్ అడిక్షన్ చాలా ప్రమాదకరమైనది , ప్రాణాంతకమైనది కూడా. దీర్ఘకాలంగా దీన్ని వినియోగిస్తున్న వారు అనేక శారీరక, మానసిక రుగ్మతలకు లోనవుతారు. అందుకే నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో దీన్ని సేవిస్తారట. స్నేక్ వెనమ్ ప్రోటీన్-ఆధారిత టాక్సిన్ అని, ఇది కడుపులోని ఆమ్లాలు, జీర్ణ ఎంజైమ్‌ల సహాయంతో జీర్ణమవుతుందని చెబుతున్నారు. విషానికి విరుగుడుగా వైద్యులు అందించే సూది మందును సైతం చాలా కొద్ది పరిమాణంలో విషంతో తయారు చేస్తారట. ముఖ్యంగా విదేశాల్లో పాము విషానికి డిమాండ్ ఎక్కువ, ఇది క్రమ మన దేశానికి పాకుతుండటం గమనార్హం. గుండె సంబంధిత వ్యాధులు, రక్త పోటు వంటి రోగాలకు ఉపయోగించే కొన్నిరకాల ఔషధాల్లోనూ పాము విషాన్ని వినియోగిస్తారట. పాము కాటు వేస్తే ఏం జరుగుతుంది? కట్ల పింజరి, కట్ల పాము, రాచ నాగు లాంటితో పోలిస్తే నాగు పాములే అత్యంత విషపూరితమైనవిగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,500 రకాల పాములు ఉన్నాయట. అయితే వీటిలో 25 శాతం మాత్రమే విషపూరితమైనవి. ఒక విషపూరితమైన పాము మనిషిని లేదా ఇతర జీవులను కాటు చేసినప్పుడు అది విషపూరితమైన ప్రోటీన్లు, ఎంజైమ్‌లు, ఇతర పరమాణు పదార్ధాల సంక్లిష్ట మిశ్రమాన్ని రక్త ప్రవాహంలోకి చేరతాయి. దీంతో ఆ పాము విష తీవ్రతను బట్టి, గుండెలోని రక్తం గడ్డ కట్టడం, పక్షవాతం, అంతర్గత రక్తస్రావం లాంటి ప్రమాదకర సంకేతాలు కనిపిస్తాయి. కోలుకోలేని విధంగా మూత్రపిండాలు పాడు కావడం, కణజాల నష్టం,శాశ్వత వైకల్యం , అవయవాలను కోల్పోవడం లాంటివి జరగవచ్చు. ప్రతీ ఏడాది 50 లక్షలమందికిపైగా పాము కాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఆఫికా, ఆసియా, మధ్య , దక్షిణ అమెరికా తదితర దేశాల్లో పాము కాటు అనేది తీవ్రమైన సమస్యగా పేర్కొంటారు. 2023 లెక్కల ప్రకారం ప్రతీ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 5.4 మిలియన్ల మంది ప్రజలు పాము కాటు బారిన పడుతున్నారు. సుమారు 81 వేలనుంచి లక్షా,38 వేల దాకా మరణిస్తున్నారు. 1.8 నుండి 2.7 మిలియన్ల మంది పాము కాటు ప్రభావానికి గురవుతున్నారు. మూడు రెట్లకు పైగాబాధితులు శాశ్వత వికలాంగులుగా మారిపోతున్నారు. వ్యవసాయ కార్మికులు, పిల్లలు ఎక్కువగా పాము కాటుకు గురవుతున్నారు. -
షూటింగ్ సమయంలో నిజంగానే పాము కరిచింది: ప్రేమ
కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘దేవి’ ఒకటి. ఈ చిత్రంలో హీరోయిన్ ప్రేమ టైటిల్ పాత్రను పోషించగా, వనిత , షిజు , అబు సలీం, భానుచందర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు . ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన తొలి సినిమా ఇది. ఈ సోషియో ఫాంటసీ చిత్రం విడుదలై నేటికి(మార్చి 12, 1999న రిలీజ్) సరిగ్గా 25 ఏళ్లు. ఈ సందర్భంగా అలనాటి హీరోయిన్ ప్రేమ ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘అప్పట్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తక్కువగా వచ్చేవి. రిస్క్ చేసి మరి ‘దేవి’ చిత్రాన్ని తెరకెక్కించాడు కోడి రామకృష్ణ. ఈ మూవీ ఆ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ఆయనే. ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. సీన్ సరిగా రాకపోతే మళ్లీ మళ్లీ చేయించేవాడు. ఓక్కో సీన్‌కి 50 టేకులపైగా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. నాతో డైలాగ్స్ బాగా ప్రాక్టీస్ చేయించేవారు. దేవత ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడాలని చెప్పేవారు. గెటప్ వేశాక నా హావభావాలు ఆటోమెటిక్‌గా మారిపోయేవి. టీమ్ అంతా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేశాం. షూటింగ్ సమయంలో ఓ వ్యక్తిని నిజంగానే పాము కాటేసింది. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లినా బతికించుకోలేకపోయాం. ఆ బాధతో రెండు రోజుల పాటు షూటింగ్‌ని నిలిపివేశాం. క్లైమాక్స్ షూటింగ్ సమయంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాం. మంచులో షూటింగ్ చేయడం సవాల్‌గా మారింది. సినిమా రిలీజ్ తర్వాత మా కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఫీలయ్యాం. ప్రేక్షకుల స్పందన చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. నా కెరీర్లో ‘దేవి’ స్పెషల్ మూవీ’ అని ప్రేమ చెప్పుకొచ్చింది. 25 years for Blockbuster #Devi 🔥🔥 A supernatural phenomenon film which attracted the audience to theaters for a long time. 🙌 Directed by #KodiRamakrishna Produced by @MSRajuOfficial A Rockstar @ThisIsDSP musical 🎶#Prema #Shiju @Actor_Mahendran #25YearsForDevi pic.twitter.com/Xr6V5BKl0J — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 12, 2024 -
పాముకాటుతో బాలిక మృతి
వాంకిడి(ఆసిఫాబాద్): పదేళ్ల బాలికకు పాముకాటుతో నూరేళ్లు నిండాయి. ఈ విషాదకర ఘటన శుక్రవారం కుమురంభీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండల కేంద్రంలోని మజీద్‌వాడలో నివాసం ఉంటున్న బావునె సునీత, విలాస్ దంపతులకు కుమారుడు, కుమార్తె కల్పన(10) ఉన్నారు. కల్పన స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. శుక్రవారం విలాస్ చౌపన్‌గూడకు పని కోసం వెళ్లగా, తల్లితో కలిసి బాలిక ఇంట్లోనే ఉంది. బెడ్‌పై పడుకుని ఇంటి గోడ సెల్ఫ్‌లపై కాళ్లు పెట్టి సెల్‌ఫోన్‌తో ఆడుకుంటుండగా మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఓ విషసర్పం కల్పన ఎడమ కాలు బొటన వేలి కింద కాటేసింది. దీంతో కాలును గట్టిగా కదపడంతో బెడ్ బలంగా తాకి తీవ్ర రక్తస్రావమైంది. ఇంట్లోనే ఉన్న తల్లి గమనించినా కాలుపై రక్తం ఎక్కువగా ఉండటంతో పాముకాటు పసిగట్టలేకపోయింది. ఆ తర్వాత విషయం తెలుసుకుని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అనంతరం ఆసిఫాబాద్‌లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కల్పన తండ్రి విలాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పాముకాటుతోవ్యక్తి మృతి.. ఇంకా..
హన్వాడ: పాముకాటుకు గురై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం ఉదయం మండలంలోని వేపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కొత్త చెన్నయ్య (45) మూడురోజుల కిందట రోజులాగే పొలానికి వెళ్లగా గట్టుపై పాము కాటువేసింది. వెంటనే కుటుంబసభ్యులు నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం కొమ్మూర్‌లోని నాటువైద్యుడికి చూపించారు. మూడురోజులుగా అక్కడే చికిత్స పొందుతుండగా ఆదివారం ఉదయం పరిస్థితి విషమించి మృతిచెందాడు. కొత్త చెన్నయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనుమానాస్పద స్థితిలోమరొకరు.. గద్వాల క్రైం: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం పట్టణంలోని సుంకులమ్మమెట్టు కాలనీలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన తెలుగు కృష్ణ (48) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే దౌదర్‌పల్లికాలనీకి చెందిన వెంకటలక్ష్మితో 25ఏళ్ల క్రితం వివాహమైంది. ఇరువురి మధ్య కొన్నేళ్ల క్రితమే కుటుంబ సమస్యల కారణంగా భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఇంట్లో కృష్ణ ఒంటరిగా ఉంటున్నాడు. శనివారం రాత్రి ఇంట్లోకి వెళ్లి కృష్ణ ఆదివారం ఉదయం 10గంటలైన బయటకు రాకపోవడంతో స్థానికులు కిటికిలో నుంచి చూడగా ఉరేసుకుని ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుప్రతికి తరలించారు. అనుమానస్పద కేసుగా నమోదు చేసుకుని మృతికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మందిపల్లిలో యువకుడు.. మరికల్: పెళ్లి జరిగిన ఆరు నెలలకే అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. అందుకు సంబంధించి ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధన్వాడ మండలం మందిపల్లికి చెందిన విష్ణువర్ధన్(30)కు ఆరు నెలల కిందట వివాహమైంది. రెండు రోజుల కిందట ఇంటి నుంచి బయలుదేరే ముందు, గొర్రెల వద్దకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఆదివారం సొంత పొలం వద్దకు వెళ్లిన తండ్రికి నీటి గుంత గట్టుపై కుమారుడి దుస్తులు, చెప్పులు, ఫోన్ కనిపించింది. ఆయన నీటి గుంతలో పరిశీలించగా.. కుమారుడి మృతదేహం కనిపించింది. ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. రైలు కిందపడి మహిళ ఆత్మహత్య మహబూబ్‌నగర్ క్రైం: రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే ఎస్ఐ సయ్యద్ అక్బర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బోయపల్లి గేట్ సమీపంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని మహిళ(35) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి దగ్గర ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, మృతదేహం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
జీవితం మీద విరక్తితో.. వివాహిత తీవ్ర నిర్ణయం..!
పాన్‌గల్: అనారోగ్యం కారణంతో మనస్తాపం చెంది ఓ వివాహిత ఉరేసుకుని మృతిచెందిన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ వేణు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కేతేపల్లికి చెందిన కాకం కాశమ్మ(38) కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో కూలి పనలు చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ నుంచి మంగళవారం సొంత గ్రామానికి చేరుకుంది. మనస్తాపంతో బుధవారం తెల్లవారుజామున ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, అనారోగ్యంతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు. మృతురాలికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com పాము కాటుతో మహిళ మృతి నర్వ: పాము కాటుకు గురై మహిళ మృతిచెందిన సంఘటన నర్వ మండలం పెద్దకడ్మూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దకడ్మూర్కి చెందిన ఎల్లంపల్లి కుర్వ అక్కెమ్మ(45) తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లింది. అక్కడ మోకాలి వద్ద పాము కాటు వేయడంతో భయంతో ఇంటికి వచ్చింది. చుట్టుపక్కల వారు వెంటనే ఆమెను మక్తల్ మండలం గుడిగండ్ల వద్ద నాటువైద్యానికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ పరిస్థితి విషమించడంతో నర్వ పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. ఇక్కడి వైద్య సిబ్బంది మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రైవేటు వాహనంలో తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్తతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇది చదవండి: ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిపై హత్యాయత్నం.. దాడిచేసింది వారే..! -
పుట్టలో పాలుపోసి వచ్చాక.. ఇలా జరగడంతో.. భయాందోళనలో స్థానికులు!
సాక్షి, కరీంనగర్: నాగుల పంచమి సందర్భంగా పుట్టలో పాలుపోసిన ఓ మహిళ.. తన కుటుంబసభ్యులను సల్లంగా చూడాలని వేడుకుంది. నాగదేవతకు పూజలుచేసింది. ఆ రాత్రే ఆమె అనూహ్యంగా పాముకాటుకు గురై ప్రాణాలు విడిచింది. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధి అంబేడ్కర్‌నగర్‌కు చెందిన బొడ్డెల భారతి(40) శుక్రవారం రాత్రి పాముకాటుతో మృతి చెందింది. ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో కింద వేసుకున్న దుప్పట్లలో దూరిన పాము భారతినికాటు వేసింది. ఏదో కుట్టినట్లుగా ఉండడంతో నిద్రలేచేసరికి పాము కనిపించిందని, శరరంపై గాట్లు కూడా ఉండడంతో వెంటనే స్థానిక సామాజిక వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు.. గోదావరిఖనికి తరలించగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా నాగులపంచమి సందర్భంగా పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించిన సదరు మహిళ.. పాముకాటుకు గురికావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇవి చదవండి: వివాహం కావడంలేదని.. యువకుడు మనస్తాపంతో ఇలా.. -
అంతరిక్షంలోకి స్నేక్ రోబో.. నాసా ఆవిష్కరణలో భారత మేధస్సు
న్యూయార్క్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ సరికొత్త రోబోను తయారుచేసింది. చంద్రుడు, అంగారక గ్రహంపై జీవం పుట్టుక ఆనవాళ్లను పసిగట్టడానికి ఈ రోబో ఉపయోగపడనుంది. సరిగ్గా పాములాగే కనిపించే ఈ రోబో ఎలాంటి ప్రతికూల ప్రదేశాలకైన ప్రయాణించగలదు. అయితే.. దీని తయారీ వెనక ఓ భారతీయ కుర్రాడి ప్రతిభ దాగి ఉంది. నాగ్‌పుర్‌లో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన రోహణ్ టక్కర్ నాసాలో పనిచేస్తున్నారు. ‘ఎగ్జోబయోలజీ ఎక్స్టంట్ లైఫ్ సర్వేయర్(ఈఈఎల్ఎస్)’ పేరుతో పిలుస్తున్న ఈ రోబోను టక్కర్ కనిపెట్టాడు. పైథాన్‌లా ప్రయాణించే ఈ రోబో ఎలాంటి గరుకైన ప్రదేశాలకైన వెళ్లగలదు. కొండలు, గుహల్లోనూ సునాయసంగా ప్రయాణించగలదు. ఇతర గ్రహాలపైనా జీవం పుట్టుకను కూడా ఇది అన్వేషించగలదు. విపత్తు నిర్వహణల్లోనూ ఇది ఉపయోగపడనుంది. నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన టక్కర్.. నాసా కోసం మార్టిన్ హెలికాప్టర్‌ను రూపొందించారు. ఐఐటీ చదివిన బాబ్ బలరామ్ నుండి ప్రేరణ పొందినట్లు పంచుకున్నారు. తను ఐఐటీ సాధించడంలో విఫలమయ్యానని అయినప్పటికీ నాసాలో విజయం సాధించానని చెప్పారు. చంద్రయాన్ 3 విజయం భారత్‌కు గర్వకారణం అని అన్నారు. ఇదీ చదవండి: బైడెన్‌తో జిన్‌పింగ్ భేటీ -
ఉదయాన్నే నిద్రలేచి చూసేసరికి..
సాక్షి, మహబూబాబాద్: పాము కాటుతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలో జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన గుంజె స్వాతి, రాజు దంపతులు తమ కుమారుడు నిఖిల్(12)తో కలిసి ఇంట్లో కింద నిద్రించారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున బాలుడి నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన తల్లిదండ్రులు వెంటనే ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. గమనించిన వైద్యులు బాలుడు మృతి చెందాడని నిర్ధారించారు. కాగా, ఒక్కగానొక్క కొడుకు పాము కాటుతో మృతి చెందడంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చదవండి: సినిమాల్లో అవకాశాలు రాలేదని..