ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. రైలులోని జనరల్ కోచ్‌లో ఝాన్సీ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ యువకుడిని పాము కాటు వేసింది. దీంతో ప్రయాణికులంతా భయపడిపోయారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. గ్వాలియర్‌లో అధికారులు రైలును నిలిపివేసి, బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్‌కు చెందిన 30 ఏళ్ల భగవాన్‌దాస్ ఢిల్లీకి వెళ్లేందుకు ఖజురహో-ఝాన్సీ రైలులోని జనరల్ కోచ్‌లో ఎక్కాడు. బోగీలో జనం ఎక్కువగా ఉండడంతో డోర్ వెనకే నిలబడ్డాడు. రాత్రి 10 గంటల సమయంలో దబ్రా-గ్వాలియర్ మధ్య రైలు నడుస్తుండగా భగవాన్‌దాస్‌ను పాము కాటువేసింది. దీంతో అతను భయంతో కేకలు వేశాడు. అక్కడున్న ప్రయాణికులు అ పామును చూసి, హడలిపోయిన దూరంగా జరిగే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది.
ఇంతలో ఒక ప్రయాణికుడు రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి కాల్ చేసి, సంఘటన గురించి అధికారులకు తెలియజేశాడు. రైలు 10.30 గంటలకు గ్వాలియర్‌కు చేరుకోగానే, రైలు అధికారులు బాధితుడిని రైలు నుండి దింపి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా రైల్వే పీఆర్‌ఓ మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ నిజానికి రైలులో ఇటువంటి పాములు ఉండవని, వికృత చేష్టలకు పాల్పడే కొందరు ఇలాంటి పనికి పాల్పడి ఉంటారన్నారు.
ఇది కూడా చదవండి: ట్రంప్ మార్క్.. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి కీలక పదవులు
Comments
Please login to add a commentAdd a comment