passenger
-
విమానంలోనూ వైఫై
దేశీయ ప్రయాణం కోసం విమానం ఎక్కుతున్నామంటే మన మొబైల్ ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఆన్ చేయాల్సిందే. నో సిగ్నల్స్.. నో ఇంటర్నెట్... సెల్‌ఫోన్‌ని మడిచి లోపల పెట్టుకోవాల్సిందే. ఇది ఒకప్పటి మాట. కానీ ఇకమీదట... విమానంలో ప్రయాణిస్తూ ఇంటర్నెట్ ద్వారా సినిమాలు చూడొచ్చు. మీ బంధువులు, స్నేహితులతో వీడియో కాల్స్ మాట్లాడొచ్చు. ఆఫీస్ పని చేసుకోవచ్చు. ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఎయిర్ ఇండియా.దేశీయ విమాన ప్రయాణికులకు కొత్త ఏడాదిలో సరికొత్త కానుక అందిస్తోంది ఎయిర్ ఇండియా. దేశంలోనే మొట్టమొదటిసారిగా.. తమ విమానాల్లో ప్రయాణించే దేశీయ ప్రయాణికులకు వైఫై ద్వారా జనవరి 1 నుంచి ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రారంభ ఆఫర్లా ఈ సదుపాయాన్ని కొంతకాలం ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతానికి కొన్ని సర్వీసులకే పరిమితమైన ఈ సౌకర్యం త్వరలో ఎయిర్ ఇండియాలోని అన్ని విమానాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తారట. ఒకరు ఒకే సమయంలో ఒకటికంటే ఎక్కువ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటివాటితోనూ కనెక్ట్ కావొచ్చు. ఇప్పటికే ఎయిర్ఇండియా న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వెళ్లే విదేశీ విమానాల్లో పైలట్ ప్రోగ్రామ్‌గా ఈ సదుపాయం అందిస్తోంది.ఎయిర్ ఇండియా వైఫై ఇలా..ఈ సౌకర్యం వినియోగించుకోవాలంటే ప్రయాణికులు వైఫై ఆన్ చేసి, సెటింగ్స్‌లో ‘ఎయిర్ ఇండియా వైఫై నెట్వర్క్’ ఎంపిక చేసుకోవాలి. ఎయిర్ ఇండియా పోర్టల్‌కు వెళ్లాక పీఎన్ఆర్ వంటి వివరాలు ఇవ్వాలి. ఆ తరవాత ఇంటర్నెట్ సేవలు వాడుకోవచ్చు.ఏయే విమానాల్లో..?అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఎయిర్‌బస్ ఎ350, బోయింగ్ 787–9, ఎంపికచేసిన ఎ321 నియో నియో విమానాలువిమానంలో నెట్ ఎలా?భూమ్మీద నెట్ వాడాలంటే మన చేతిలో ఒక ఫోనో ల్యాప్‌టాపో ఉండి.. సమీపంలో సెల్ టవర్ ఉంటే సరిపోతుంది. కానీ విమానం అలా కాదు కదా. విమానాల్లో వైఫై ద్వారా ఇంటర్నెట్ రావాలంటే 2 రకాల పద్ధతులు ఉన్నాయి. మొదటిది.. భూమిపై ఉండే సెల్ టవర్లు. దీన్నే ఎయిర్ టు గ్రౌండ్ (ఏటీజీ) టెక్నాలజీ అంటారు. ఇక రెండోది శాటిలైట్ ఆధారిత కనెక్షన్. ఈ రెండూ పనిచేయాలంటే విమానం లోపలా, బయటా ప్రత్యేక యాంటెనాల వంటి కొన్ని పరికరాలు అమర్చాలి. వైఫై లేనప్పుడు మన సమీపంలో ఎవరికైనా నెట్ కావాలంటే ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో హాట్‌స్పాట్ ఆప్షన్ ఆన్ చేసి నెట్ ఇస్తాం. మన ఫోన్ మరొకరికి హాట్ స్పాట్‌లా ఎలా మారుతుందో.. యాంటెనాలూ, సర్వర్లు, రౌటర్ల వంటి వాటితో ఉన్న విమానం వందలాది మంది ప్రయాణికులకు ఒక హాట్ స్పాట్‌లా మారిపోతుంది.సెల్ టవర్ సిగ్నల్స్ఈ సిగ్నళ్లు అందుకోడానికి విమానం కింది లేదా అడుగు భాగంలో యాంటెనాలు ఏర్పాటు చేస్తారు. విమానం భూమి మీద బయలుదేరగానే ఆ యాంటెనాలు.. సమీపంలోని సెల్ టవర్ల నుంచి సిగ్నళ్లు అందుకుంటాయి. ఆ సిగ్నళ్లు క్యాబిన్ సర్వర్‌కు, అక్కడి నుంచి రౌటర్‌కు వెళ్తాయి. అక్కడి నుంచి ప్రయాణికులకు వెళ్లి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాయి.శాటిలైట్ సిగ్నల్స్సెల్ టవర్ల ద్వారా సిగ్నల్ అందు తున్నంతసేపూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సముద్రాలు, ఎడారి ప్రాంతాల వంటి వాటి పైనుంచి వెళ్లేటప్పుడు సెల్ టవర్ సిగ్నళ్లు అందవు. శాటిలైట్ సిగ్నళ్ల సాయం కావాల్సిందే. ఇందుకోసం విమానం పై భాగంలో యాంటెనా లు ఏర్పాటుచేస్తారు. అవి తమకు అత్యంత సమీపంలోని శాటిలైట్‌తో అనుసంధానమవుతాయి. ప్రయాణికుల ఫోన్లు, ల్యాప్‌టాపుల వంటివి విమాన క్యాబిన్లో ఉండే వైఫై యాంటెనాకు కనెక్ట్ అవుతాయి.ఆ పరికరాల నుంచి ఈ యాంటెనాలకు వచ్చే సిగ్నళ్లు విమానంలోని సర్వర్‌కు వెళ్తాయి. విమానం పైన ఉండే యాంటెనా ద్వారా ఆ సిగ్నళ్లు శాటిలైట్‌కు వెళతాయి. శాటిలైట్ వాటిని భూమిపై ఉండే స్టేషన్ లేదా టెలిపోర్టుకు పంపితే అక్కడి నుంచి తిరిగి సిగ్నళ్లు శాటిలైట్‌కు అందుతాయి. వాటిని విమానానికి పంపుతుంది శాటిలైట్. శాటిలైట్ సిగ్నళ్లు విమానంలోకి క్యాబిన్ సర్వర్‌కు, అక్కడి నుంచి రౌటర్‌కు వెళ్తాయి. అలా ప్రయాణికులు నెట్ వాడుకోవచ్చు.ఏటీజీ – శాటిలైట్ఏటీజీ ద్వారా ఇంటర్నెట్ అంటే చాలా పరిమితులు ఉంటాయి. అంతరాయాలు ఎక్కువ, స్పీడు కూడా తక్కువ ఉండొచ్చు. కానీ, శాటిలైట్ కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్లో అంతరాయాలు తక్కువని, స్పీడు కూడా ఎక్కువని అంతర్జాతీయ విదేశీ ప్రయాణికుల అనుభవాలు చెప్తున్నాయి.2003లో మొదటిసారిగా...⇒ 2003 జనవరి 15న జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ మొట్టమొదటగా తమ అంతర్జాతీయ విమానంలో ప్రయాణికులకు ఇంటర్నెట్ అందించింది.⇒ దేశీయ విమాన ప్రయాణికులకు (2013లో) ఇంటర్నెట్ అందించిన మొదటి సంస్థ అమెరికాకు చెందిన జెట్ బ్లూ.⇒ ప్రపంచంలో ప్రస్తుతంవైఫై ద్వారా ఇంటర్నెట్ అందిస్తున్న కొన్ని విమానయాన సంస్థలు నార్వేజియన్ ఎయిర్‌లైన్స్, ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్, ఫిజి ఎయిర్వేస్, జెట్ బ్లూ, ఎమిరేట్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఖతార్ ఎయిర్వేస్, డెల్టా ఎయిర్వేస్, మొదలైనవి.‘ప్రయాణాల్లో ఇప్పుడు ‘కనెక్టివిటీ’ తప్పనిసరి అవసరమైపోయింది. కొంతమంది సరదాకోసం, షేరింగ్ కోసం ఇంటర్నెట్ వాడితే, మరికొందరు తమ వృత్తి, వ్యాపార అవసరాల కోసం వాడుతుంటారు. ఎయిర్ ఇండియా ఈ సదుపాయం తీసుకొచ్చి విమానాల్లో సరికొత్త ప్రయాణ అనుభూతి అందిస్తోంది. – ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అధికారి రాజేష్ డోగ్రా -
నీళ్లు పోసి నిద్ర లేపుతున్నారు..
-
Year Ender 2024: 999 బెదిరింపులు.. రెండు కంపెనీల మూసివేత.. ఎయిర్‌లైన్స్ పరిణామాలు
దేశంలోని విమానయాన రంగానికి 2024 మిశ్రమంగా గడిచింది. ఈ సంవత్సరం రెండు విమానయాన సంస్థలు మూసివేతకు గురయ్యాయి. ఒక విమానయాన సంస్థ దివాలా ప్రక్రియకు దారితీసింది. ఈ ఏడాది దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య రెండుసార్లు రికార్డు స్థాయిలో ఐదు లక్షలను అధిగమించింది.దేశంలో దీపావళి, ఛత్ సందర్భంగా విమానయాన టిక్కెట్ల ఛార్జీల్లో రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది నవంబర్ 14 వరకు విమానయాన సంస్థలకు మొత్తం 999 సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. విచారణలో అవి ఫేక్ అని తేలింది. ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 వద్ద పైకప్పు కూలిపోయిన దుర్ఘటనలో ఒకరు మృతిచెందారు.2025లో చోటుచేసుకోబోయే మార్పులివే..శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ విమానయాన రంగం 2025లో పెను మార్పులను చూడబోతోంది. భారీ విలీనాలతో పాటు, విమానాల సంఖ్య మరింతగా పెరగనుంది. ఇంతేకాకుండా పలు కొత్త ఎయిర్‌లైన్స్‌లు ప్రారంభం కానున్నాయి. మార్చి 2025తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ట్రాఫిక్ 164 నుంచి 170 మిలియన్లకు పెరుగుతుందనే అంచనాలున్నాయి. వైడ్-బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను పెంచడం, ఎక్కువ సంఖ్యలో ప్రత్యక్ష విదేశీ విమాన లింక్‌లను ఏర్పాటు చేయడం, దేశాన్ని గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మార్చడంపై పరిశ్రమ దృష్టి కేంద్రీకృతమై ఉంది.ఇటీవల అకాసా ఎయిర్ హెడ్ వినయ్ దూబే మాట్లాడుతూ భారతీయ విమానయాన మార్కెట్‌కు అవకాశాలు అపరిమితంగా ఉన్నాయన్నారు. కాగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ 60కి పైగా వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సహా 800 విమానాల సముదాయాన్ని కలిగి ఉంది. 157 విమానాశ్రయాలకు సేవలు అందిస్తోంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యమైన విస్తారాతో ఎయిర్ ఇండియా తన విలీనాన్ని ఇటీవలే పూర్తి చేసింది. ఎయిరిండియా ఫ్లైట్ రిటర్న్ ప్రోగ్రామ్ పేరును 'మహారాజా క్లబ్'గా మార్చాలని టాటా గ్రూప్ నిర్ణయించింది. అలాగే ఎయిర్ ఇండియా మరో 100 ఎయిర్‌బస్ విమానాల కొనుగోలుకు ఆర్డర్ చేసింది. వీటిలో10 వైడ్-బాడీ ఏ350, 90 నారో బాడీ ఏ320 విమానాలున్నాయి.ఇది కూడా చదవండి: Kisan Diwas 2024: ఈ పథకాల వినియోగంతో రైతే రాజు -
శంషాబాద్.. షంషేర్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రయాణికుల రద్దీకి సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ (ఆర్జీఐ) అగ్రగామిగా నిలిచింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజా డేటా వెల్లడించిన విశేషాలివే...మన తర్వాతే బెంగళూరుమునుపటి ఏడాదితో పోలిస్తే గత ఏప్రిల్–సెప్టెంబర్‌లో భారతదేశంలోని మొదటి ఐదు మెట్రోలలో ప్రయాణికుల రద్దీ పెరుగుదలలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అత్యధిక వృద్ధిని సాధించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మన ఎయిర్‌పోర్ట్‌లో 11.7 శాతం పెరుగుదల నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న బెంగళూరు (10.1), కోల్‌కతా (9.4), ఢిల్లీ (7.4), ముంబై (5.4), చెన్నై 3.3 శాతం రద్దీని పెంచుకున్నాయి. దేశ విదేశీ ప్రయాణికుల రద్దీతో...ప్రస్తుతం 72 దేశీయ, 18 అంతర్జాతీయ గమ్యస్థానాలను కలుపుతున్న శంషాబాద్ విమానాశ్రయం అమెరికా, యూకేలకు దాదాపు 20 లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తోంది. గత అక్టోబర్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు 25 లక్షల మంది ప్రయాణికుల తాకిడి చవిచూసింది..ఆ నెలలో రద్దీ 22 శాతం పెరిగింది. దేశీయ అంతర్జాతీయ ప్రయాణాల్లోనూ ఈ వృద్ధి కనిపించింది. దేశీయ ప్రయాణికుల రద్దీ సంవత్సరానికి 22.7 శాతం, అంతర్జాతీయ ట్రాఫిక్ 16.3 శాతం వరకూ పెరిగింది. ఒక్కరోజే...87 వేలతో రికార్డుగత అక్టోబర్ 14న ఒక్కరోజే 87,000 మంది ప్రయాణికుల రాకతో శంషాబాద్ విమానాశ్రయం సరికొత్త రికార్డు సృష్టించింది. అదే నెలలో 17,553 విమానాల రాకపోకలు జరిగాయి. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 19 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది. గత 2021 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల రద్దీ 80 లక్షలు ఉండగా 2024లో 2.5 కోట్లకు నాలుగు రెట్లు పెరిగింది అంటే.. ఈ వృద్ధి రేటు 45 శాతం కావడం విశేషం. -
గగనతలంలో 17 కోట్ల మంది!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 16.4–17 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. 2023–24తో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 7–10 శాతం పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదిక తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో దేశీయంగా 7.93 కోట్ల మంది విమానాల్లో రాకపోకలు సాగించారు. 2023–24 ఏప్రిల్–సెప్టెంబర్‌తో పోలిస్తే 5.3 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. తీవ్రమైన వేడి గాలులు, ఇతర వాతావరణ సంబంధిత అంతరాయాలతో 2024 ఏప్రిల్–సెప్టెంబర్ కాలం పాక్షికంగా ప్రభావితమైంది. భారతీయ విమానయాన సంస్థలకు అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 16.2 శాతంగా ఉందని ఇక్రా వివరించింది. ద్వితీయార్థం పుంజుకోవచ్చు..గతేడాదితో పోలిస్తే 2024 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య విమానయాన సంస్థల ఆదాయాలు క్షీణించాయి. విమానాలు నిలిచిపోవడం, అధిక ఇంధన ధరలు ఇందుకు కారణం. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం ప్రయాణికుల సంఖ్య పెరిగి ఆదాయాలు పుంజుకోవచ్చని అంచనా. ఎయిర్‌లైన్స్ వ్యయాల నిర్మాణం సాధారణంగా రెండు కీలక భాగాలైన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు, రూపాయి మారకం కదలిక ఆధారంగా ఉంటుంది. గతేడాదితో పోలిస్తే 2024–25 మొదటి ఎనిమిది నెలల్లో సగటు ఏటీఎఫ్ ధరలు 6.8 శాతం తగ్గి కిలోలీటరుకు రూ.96,192కు చేరుకున్నాయి. అయితే కొవిడ్‌కు ముందు కాలం 2019–20 మొదటి ఎనిమిది నెలల్లో ఇది రూ.65,261 నమోదైందని ఇక్రా వివరించింది. విదేశీ కరెన్సీలో చెల్లింపులు..మొత్తం వ్యయాల్లో ఇంధన ఖర్చులు దాదాపు 30 నుంచి 40 శాతం వరకు ఉంటాయి. నిర్వహణ వ్యయాలు 35–50 శాతంగా ఉన్నాయి. విమానాల లీజు చెల్లింపులు, ఇంధన ఖర్చులు, విమానాలు, ఇంజన్ నిర్వహణ వ్యయాలు డాలర్ పరంగా నిర్ణయించబడతాయి. కొన్ని విమానయాన సంస్థలు విదేశీ కరెన్సీ రుణాన్ని కలిగి ఉన్నాయి. దేశీయ విమానయాన సంస్థలు కూడా తమ అంతర్జాతీయ కార్యకలాపాలకు అనుగుణంగా ద్వారా వచ్చే ఆదాయాలపై విదేశీ కరెన్సీలో నికర చెల్లింపులు చేయాల్సి ఉందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.ఇదీ చదవండి: యాపిల్‌లో ఉద్యోగం జైలు జీవితం లాంటిది!గత నష్టాల కంటే తక్కువగా..దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌లో నిరంతర వృద్ధి మధ్య భారతీయ విమానయాన పరిశ్రమపై ‘స్థిర(స్టేబుల్)’ రేటింగ్‌ను ఇక్రా కొనసాగించింది. 2024–25లో విమానయాన పరిశ్రమ నష్టం రూ.2,000–రూ.3,000 కోట్ల వరకు ఉంటుందని చెబుతోంది. పరిశ్రమ 2025–26లో ఇదే స్థాయిలో నష్టాన్ని నివేదించవచ్చని అంచనా వేస్తున్నట్లు ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కో–గ్రూప్ హెడ్ కింజాల్ షా తెలిపారు. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ‘రాక్షసుడు’
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు భోలో కరమ్‌వీర్ జాట్ అలియాస్ రాహుల్..స్వస్థలం హర్యానాలోని రోహ్తక్లో ఉన్న మోక్రా ఖాస్...గతంలో రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల్లో నేరాలు చేశాడు. ఇటీవల ‘రైల్వే’ కిల్లర్‌గా మారాడు. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి ఆదివారం (ఈ నెల 24) మధ్య 35 రోజుల్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో సంచరిస్తూ ఐదు రాష్ట్రాల్లో ఐదు మర్డర్లు చేశాడు. వీటిలో కొన్ని సొత్తు కోసమైతే..మరికొన్ని అత్యాచారం, హత్యలు. గుజరాత్‌లోని వల్సాద్ పోలీసులు ఈ నరహంతకుడిని సోమవారం పట్టుకున్నారు. విచారణలో ఆఖరి ఘాతుకాన్ని ఆదివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులకు వల్సాద్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో పీటీ వారెంట్‌పై కరమ్వీర్ను నగరానికి తీసుకురావడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. వల్సాద్ ఎస్పీ డాక్టర్ కరణ్‌రాజ్ సింగ్ వాఘేలాను మంగళవారం ‘సాక్షి’ ఫోన్ ద్వారా సంప్రదించింది. ఆయన ఈ సీరియల్ కిల్లర్ పూర్వాపరాలు వెల్లడించారు.చిన్ననాటి నుంచి చిత్రమైన ప్రవర్తన..హర్యానాలోని వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రాహుల్‌కు ఎడమ కాలికి పోలియో సోకింది. ఫలితంగా చిన్నతనం నుంచి ఆటపాటలకు దూరంగా ఉంటూ ఒంటరిగా ఉండేవాడు. విపరీతమైన భావాలు, చిత్రమైన ప్రవర్తన కలిగి ఉండేవాడటంతో కుటుంబం దూరంగా పెట్టింది. ఐదో తరగతితో చదువుకు స్వస్తి చెప్పిన రాహుల్ లారీ క్లీనర్‌గా పని చేస్తూ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అయితే పోలియో కారణంగా ఇతడికి ఎవరూ డ్రైవర్‌గా ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో హైవే దాబాలో కారి్మకుడిగా మారిన రాహుల్... అక్కడ పార్క్ చేసి ఉన్న లారీలను తస్కరించడం మొదలెట్టాడు. దీంతో పాటు లూటీలు, కిడ్నాప్‌లకు పాల్పడ్డాడు. ఈ ఆరోపణలపై రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల్లో 13 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే వరకు రాజస్థాన్‌లోని జోద్పూర్ జైల్లో గడిపిన రాహుల్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అక్కడ నుంచి గుజరాత్‌లోని ఉద్వాడ పట్టణానికి చేరుకుని ఓ హోటల్లో కారి్మకుడిగా చేరాడు. కొన్ని రోజులు పని చేసి వాపి ప్రాంతానికి చేరుకుని ఫుట్‌పాత్స్ పైన గడిపాడు.ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని..వివిధ రైళ్లల్లో దివ్యాంగుల కోసం చివరలో ప్రత్యేక బోగీలు ఉంటాయి. వీటిలో ప్రయాణించే దివ్యాంగులను సాధారణంగా టీసీలు సైతం తనిఖీ చేయరు. పాసులు కలిగి ఉంటారనే ఉద్దేశంలోనే వదిలేస్తుంటారు. దీన్ని తనకు అనువుగా మార్చుకున్న రాహుల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లోని దివ్యాంగుల బోగీల్లో ఎక్కి దేశం మొత్తం తిరగడం ప్రారంభించాడు. ఈ ఏడాది జూన్ రెండో వారం నుంచి ఇలా దేశ సంచారం చేస్తున్న రాహుల్ అక్టోబర్ 17న తొలి హత్య చేశాడు. ఆ రోజు బెంగళూరు–మురుదేశ్వర్ రైలులో ప్రయాణిస్తుండగా బీడీ కాల్చడంపై తోటి ప్రయాణికుడు అభ్యంతరం చెప్పాడు. దీంతో విచక్షణకోల్పోయిన రాహుల్ గొంతు నులిమి చంపేశాడు. ఆపై అతడి వద్ద ఉన్న సొత్తు, సొమ్ము తీసుకుని రైలు దిగిపోయాడు. దీనిపై మంగుళూరులో ఉన్న ముల్కీ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. వరుసపెట్టి మరో నాలుగు హత్యలు..ఆపై కతిహార్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన రాహుల్ పశ్చిమ బెంగాల్ లోని హౌరా స్టేషన్లో మరో వృద్ధుడి గొంతు కోసి చంపి దోపిడీకి పాల్పడ్డాడు. పుణే–కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లో మరో మహిళపై అత్యాచారం చేసి, కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. వీటిపై ఆయా ఠాణాలో కేసులు నమోదయ్యాయి. ఈ నెల 14న ఉద్వాడలో తాను పని చేసిన హోటల్‌కు వెళ్లి జీతం తీసుకోవాలని భావించాడు. అక్కడకు వచ్చిన రాహుల్‌కు స్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌పై ఒంటరిగా సంచరిస్తున్న యువతి కనిపించింది. ఆమెను సమీపంలోని మామిడి తోటలోకి లాక్కెళ్లి, అత్యా చారం చేసి చంపేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న వల్సాద్ పోలీసులు ఘటనాస్థలిలో లభించిన బ్యాగ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. వివిధ రైల్వేస్టేషన్లలోని 2500 సీసీ కెమెరాల్లో ఫీడ్‌ను అధ్యయనం చేసి నిందితుడిని గుర్తించారు. ఉద్వాడ నుంచి రైలులో ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం చేరుకు న్న రాహుల్ అట్నుంచి షిర్డీ, ఆపై బాంద్రా చేరుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో మహిళ హత్య..అక్కడ నుంచి సికింద్రాబాద్ వచ్చిన రాహుల్ ఆదివారం తెల్లవారుజామున రైలు దిగాడు. ఆ సమయంలో తొమ్మిదో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై మంగుళూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉంది. దాని సీట్ కమ్ లగేజ్ ర్యాక్ (ఎస్ఎల్ఆర్) కోచ్‌లో ఓ మహిళ ఒంటరిగా ఉండటం గమనించాడు. ఆమెను గొంతునులిమి చంపేసిన రాహుల్ నగదు, సెల్‌ఫోన్ తస్కరించాడు. అక్కడ నుంచి రైలులోనే ఉడాయించాడు. ఈ హత్యపై సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివిధ రైళ్లు మారిన రాహుల్ బాంద్రా–భుజ్ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం గుజరాత్‌లోని వాపి చేరుకున్నాడు. అప్పటికే ఇతడి కదలికలు సాంకేతికంగా గమనిస్తున్న వల్సాద్ పోలీసులు అక్కడ వలపన్ని పట్టుకున్నారు. అతడి నుంచి సికింద్రాబాద్‌లో చంపిన మహిళ నుంచి తీసుకున్న సెల్‌ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. ఇతడి అరెస్టుపై సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
రైలులో పాము కాటు.. ప్రయాణికుల తొక్కిసలాట
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. రైలులోని జనరల్ కోచ్‌లో ఝాన్సీ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ యువకుడిని పాము కాటు వేసింది. దీంతో ప్రయాణికులంతా భయపడిపోయారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. గ్వాలియర్‌లో అధికారులు రైలును నిలిపివేసి, బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్‌కు చెందిన 30 ఏళ్ల భగవాన్‌దాస్ ఢిల్లీకి వెళ్లేందుకు ఖజురహో-ఝాన్సీ రైలులోని జనరల్ కోచ్‌లో ఎక్కాడు. బోగీలో జనం ఎక్కువగా ఉండడంతో డోర్ వెనకే నిలబడ్డాడు. రాత్రి 10 గంటల సమయంలో దబ్రా-గ్వాలియర్ మధ్య రైలు నడుస్తుండగా భగవాన్‌దాస్‌ను పాము కాటువేసింది. దీంతో అతను భయంతో కేకలు వేశాడు. అక్కడున్న ప్రయాణికులు అ పామును చూసి, హడలిపోయిన దూరంగా జరిగే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది.ఇంతలో ఒక ప్రయాణికుడు రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి కాల్ చేసి, సంఘటన గురించి అధికారులకు తెలియజేశాడు. రైలు 10.30 గంటలకు గ్వాలియర్‌కు చేరుకోగానే, రైలు అధికారులు బాధితుడిని రైలు నుండి దింపి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా రైల్వే పీఆర్ఓ మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ నిజానికి రైలులో ఇటువంటి పాములు ఉండవని, వికృత చేష్టలకు పాల్పడే కొందరు ఇలాంటి పనికి పాల్పడి ఉంటారన్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ మార్క్.. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి కీలక పదవులు -
రాజమండ్రి విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి విమానాశ్రయంలో బుల్లెట్లు కలకలం రేపాయి. విజయవాడకు చెందిన ఎం.సుబ్బరాజు అనే ప్రయాణికుడు వద్ద బుల్లెట్లు లభ్యమయ్యాయి. ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహించిన భద్రతా తనిఖీల్లో ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఎస్పీఎఫ్ సిబ్బంది ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో లైసెన్సుడ్ గన్ బుల్లెట్లు తన వద్ద ఉండిపోయాయని చెప్పారు. ఆరు బుల్లెట్లు స్వాధీనం చేసుకుని ప్రయాణికుడు సుబ్బరాజును కోరుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
లోయలో పడిన బస్సు.. 36 మంది మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అల్మోరాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో నిండిన ఒక బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బస్సు పౌరీ నుంచి రాంనగర్ వైపు వస్తుండగా ప్రమాదానికి గురైంది. నైనిటాల్ జిల్లా పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఒక కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఒక చిన్న నది ప్రవహించడాన్ని వీడియోలో గమనించవచ్చు.ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. సంఘటనా స్థలంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. जनपद अल्मोड़ा के मार्चुला में हुई दुर्भाग्यपूर्ण बस दुर्घटना में यात्रियों के हताहत होने का अत्यंत दुःखद समाचार प्राप्त हुआ। जिला प्रशासन को तेजी के साथ राहत एवं बचाव अभियान चलाने के निर्देश दिए हैं।घटनास्थल पर स्थानीय प्रशासन एवं SDRF की टीमें घायलों को निकालकर उपचार के लिए…— Pushkar Singh Dhami (@pushkardhami) November 4, 2024ఇది కూడా చదవండి: హిందూ ఆలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడి -
తృటిలో తప్పిన రైలు ప్రమాదం
పూర్ణియా: బీహార్‌లోని పూర్నియా జిల్లాలో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. రాణిపాత్ర రైల్వే స్టేషన్ సమీపంలో కతిహార్ నుండి జోగ్బానీకి వెళ్తున్న డీఎంయూ రైలులోని ఓ చక్రానికి ఒక రాడ్డు అడ్డుపడింది. పైలట్ సమయస్ఫూర్తితో రైలును ఆపివేయడంతో, పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే రాణిపాత్ర స్టేషన్ అధికారులు జీఆర్పీ ఫోర్స్ సాయంతో రైలు చక్రానికి అడ్డుపడిన రాడ్‌ను తొలగించారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. రైల్వే ట్రాక్‌పై రాడ్ వేస్తున్న దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, నిందితులను గుర్తించి, తదుపరి చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: వినబడదు.. మాటలు రావు.. అయినా అన్నింటిలోనూ ఫస్టే -
రైలు ప్రమాదం.. ఒకరు మృతి
కైరో: ఈజిప్ట్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్ రైలును వెనుక నుంచి మరో రైలు ఇంజన్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు మృతిచెందాడు. 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. రైల్వే అధికారులు గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.ఈ ప్యాసింజర్ రైలు కైరోకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన రైలు ఇంజిన్ ఢీకొనడంతో పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో ప్యాసింజర్ రైలులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన అనంతరం రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.ఉత్తరాఫ్రికా దేశమైన ఈజిప్టులో నెల రోజుల వ్యవధిలో ఇది రెండో రైలు ప్రమాదం. కైరోకు దక్షిణాన 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినాయా ప్రావిన్స్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించిందని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: దుర్గా నిమజ్జనంలో హింస.. ఒకరు మృతి -
మెట్రోలో నవరాత్రి సందడి
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ మెట్రోలోనూ ఈ వేడుకల సందడి కనిపిస్తోంది. తాజాగా ఢిల్లీ మెట్రోకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి గిటార్ వాయిస్తూ అమ్మవారి పాటలు పాడటం కనిపిస్తుంది. ఈ వీడియో క్యాప్షన్‌గా ‘జై మాతా ది’ అని రాశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ముచ్చట పడుతున్నారు.ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఒక వ్యక్తి గిటార్ ప్లేచేస్తూ పాటలు పాడుతుండగా, అక్కడున్న ఇతర ప్రయాణికులు అతనితో కలిసి పాడటం కనిపిస్తుంది. మరికొందరు దానిని వీడియో తీస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన చాలా మంది.. గిటార్ వాయిస్తూ పాటలు పాడుతున్న వ్యక్తిని మెచ్చుకుంటున్నారు. फूहड़ रील वालों ने मेट्रो को दूषित कर दिया था और इन्होंने मेट्रो का शुद्धिकरण कर दिया😍जय माता शेरावाली🙏 pic.twitter.com/pjOULqMCSu— Vikash Mohta (@VikashMohta_IND) October 5, 2024ఇది కూడా చదవండి: దుర్గమాసుర సంహారం -
లోయలో పడిన బస్సు.. 30 మంది దుర్మరణం
పౌరీ: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళుతున్న ఒక బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 30 మంది వరకు మృతిచెందివుంటారని ప్రాథమిక సమాచారం.ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో ఓ వివాహ వేడుక కోసం అతిథులతో వచ్చిన ఒక బస్సు హరిద్వార్ సమీపంలోని లాల్ ధంగ్ ప్రాంతం నుంచి పౌరీ జిల్లాలోని బిరోంఖల్ గ్రామానికి వెళ్తోంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సు గమ్యస్థానానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘాట్ రోడ్డులో కొండ పైకి వెళుతుండగా, బస్సు అదుపు తప్పి 200 అడుగుల లోయలో పడిపోయింది.ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 40 నుంచి 50 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీరిలో 30 మందికి పైగా అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: హర్యానా ఓటింగ్ వేళ.. నలుగురు నేతలకు బీజేపీ షాక్ -
ఎయిర్‌పోర్ట్‌లో భారీగా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు స్వాధీనం..
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు భారీగా పట్టుబడ్డాయి. ఇటీవలే యాపిల్ సంస్థ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అచితూ ఈ ఫోన్లను అక్రమంగా తీసుకెళ్తున్న ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ తన వ్యానిటీ బ్యాగ్‌లో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను టిష్యూ పేపర్లలో చుట్టి దాచిపెట్టిందని అధికారులు తెలిపారు. కాగా ఐఫోన్ సిరీస్‌లో.. 16 ప్రో మాక్స్ టాప్ మోడల్.ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. హాంగ్‌కాంగ్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఓ మహిళ 26 ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను తీసుకొచ్చింది.ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో ఆమెను పట్టుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి మరింత విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. స్మగ్లింగ్ చేసిన ఆ ఫోన్లు ఖరీదు సుమారు 37 లక్షలు ఉంటుందని అంచనా. -
అమెరికాలో బస్సు హైజాక్ కలకలం
వాషింగ్టన్ డీసీ : అమెరికాలో బస్ హైజాక్ కలకలం రేపుతోంది. అయితే ఆ బస్సులో హైజాకర్స్ ఎంత మంది ఉన్నారు. బందీలు ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.పలు అమెరికన్ మీడియా కథనాల ప్రకారం.. లాస్ ఏంజిల్స్‌లోని 6వ స్ట్రీట్, సౌత్ అలమెడా స్ట్రీట్ సమీపంలో నిందితులు బస్సును హైజాక్ చేశారని, ప్రయాణికుల్ని బంధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన జరిగిన ప్రాంతంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.హైజాక్‌పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీలను క్షణ్ణంగా పరిసీలించారు. బస్సుల్లో డ్రైవర్, ప్రయాణికులు, హైజాకర్స్ ఉన్నట్లు తేలింది. అయితే హైజాకర్స్ నుంచి డ్రైవర్ తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు అమెరికా మీడియా కథనాలు చెబుతుండగా.. హైజాక్ గురించి మరిన్ని వివరాలు సేకరించేందుకు అధికారులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో సైతంఈ ఏడాది మార్చిలో సైతం లాస్ ఏంజెల్స్ డౌన్టౌన్లో బస్సును నిందితుడు బస్సును హైజాక్ చేశాడు. బస్సును తన ఆధీనంలోకి తీసుకున్న హైజాకర్ ఇతర వాహనాల్ని ఢీకొట్టి నానా హంగామా చేశాడు. ⚡️ Los Angeles Police engaged in a standoff with a hijacked bus, the driver and passengers are reportedly being held insideOnline images show that a SWAT team is at the sceneFollow us on Telegram https://t.co/8u9sqgdo0n pic.twitter.com/jQlQQbiDN6— RT (@RT_com) September 25, 2024 -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విషాదం
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విషాదం చోటుచేసుకుంది. అస్వస్థతకు గురై ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. ఎయిర్‌పోర్టులోనే ప్రయాణికులు కుప్పకూలారు. గోవా నుంచి వచ్చిన ప్రయాణికుడు నితిషా, జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికురాలు సకీనా అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరిని ఎయిర్‌పోర్టులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందారు.ఇదీ చదవండి: నాకే కెమెరా పెడతారా?.. మీడియాపై జానీ భార్య చిందులు -
తిరోగమనంలో విమానయానం
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం తర్వాత వేగంగా కోలుకున్న రాష్ట్ర విమానయాన రంగం తొలిసారిగా నేలచూపులు చూసింది. లాక్డౌన్ తర్వాత ప్రతీ నెలా క్రమంగా పెరుగుతూ వచి్చన ప్రయాణికుల సంఖ్య జూలై నెలలో తగ్గిపోయింది. తాజాగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. గతేడాది జూలై నెలతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ఒక్క విజయవాడ తప్ప రాష్ట్రంలోని మిగిలిన ఐదు విమానాశ్రయాల్లో ప్రయాణికుల సంఖ్యలో భారీ క్షీణత నమోదయ్యింది. రాయలసీమ ప్రాంతంలో ఆ క్షీణత ఇంకా ఎక్కువగా ఉంది.తిరుపతి విమానాశ్రయంలో 4.4 శాతం తగ్గితే కర్నూలులో 63.5 శాతం, కడప విమానాశ్రయంలో 47.4 శాతం తగ్గింది. గతేడాది జూలై నెలలో కడప విమానాశ్రయం నుంచి 6,944 మంది ప్రయాణిస్తే ఇప్పుడు ఆ సంఖ్య 3,650కు పడిపోయింది. అదే సమయంలో కర్నూలులో ప్రయాణికుల సంఖ్య 3,419 నుంచి 1,247కు పడిపోయింది. తిరుపతి విమానాశ్రయంలో కూడా ప్రయాణికుల సంఖ్య తగ్గడం గమనార్హం. విశాఖపట్నంలో కూడా ప్రయాణికుల సంఖ్య 2,28,897 నుంచి 2,25,261కు తగ్గిపోయింది. కానీ ఒక్క విజయవాడలో 15.5 శాతం పెరిగింది.తగ్గించేస్తున్న సరీ్వసుల సంఖ్యప్రయాణికుల సంఖ్య తగ్గడంతో విమానయాన సంస్థలు తమ సరీ్వసులను తగ్గించేస్తున్నాయి. కర్నూలులో విమాన సరీ్వసులు 108 నుంచి 64కు తగ్గిపోయాయి. కడపలో 200 నుంచి 138కు రాజమండ్రిలో 748 నుంచి 694కు సరీ్వసులు తగ్గాయి. ఒక్క విజయవాడలో మాత్రం విమాన సర్వీసులు 1,272 నుంచి 1,553కు పెరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఆర్థిక కార్యకలాపాలు తగ్గడంతో విమాన ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.ప్రభుత్వం రాజధాని అమరావతి అంటూ ఆ ఒక్క ప్రాంతానికే ప్రాధాన్యత ఇస్తుండటంతో మిగిలిన ప్రాంతాల్లో కార్యకలాపాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయని, దానికి నిదర్శనమే విశాఖతో సహా మిగిలిన విమానాశ్రయాల్లో ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి కారణంగా నిపుణులు విశ్లేíÙస్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన కె.రామ్మోహన్నాయుడు ఉన్నప్పటికీ విమాన సరీ్వసులు, ప్రయాణికుల సంఖ్య తగ్గుతున్నాయని, ఇదే విధమైన పరిస్థితి కొనసాగితే త్వరలోనే కడప, కర్నూలు విమానాశ్రయాల్లో సేవలు నిలిచిపోయే ప్రమాదముందని ఆ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
Delhi: మెట్రో సరికొత్త రికార్డు.. ఒక్క రోజులో 77 లక్షల మంది ప్రయాణం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తుంటారు. ఆగస్టు నెలలో ఢిల్లీ మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అన్ని రికార్డులను అధిగమించింది. ముఖ్యంగా ఆగస్టు 20వ తేదీన ఒక్కరోజులో ఢిల్లీ మెట్రోలో 77,49,682 మంది ప్రయాణించారు. ఇది ఇప్పటి వరకు ఒక్కరోజులో అత్యధికంగా ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య.ఢిల్లీ మెట్రోలో ప్రతిరోజూ ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య సాధారణంగా 72 లక్షల నుంచి 78 లక్షల మధ్య ఉంటుంది. పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) శుక్ర, శనివారాల్లో అన్ని లైన్లలో అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు మెట్రో అధికారులు తెలిపారు.డీఎంఆర్సీ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) అనూజ్ దయాల్ మీడియాతో మాట్లాడుతూ పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, డీఎంఆర్సీ అన్ని లైన్లలో అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించిందన్నారు. మొత్తం 84 అదనపు ట్రిప్పులను శుక్రవారం, శనివారాల్లో నడపనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: Hindi Day: హిందీ అధికారిక భాష ఎలా అయ్యింది? -
Uttar Pradesh: నేడు వందేభారత్ రైలులో ఉచిత ప్రయాణం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్-లక్నోల మధ్య నేటి నుంచి వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. మీరట్-లక్నో-మీరట్(22490/22491) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు, రాకపోకల జాబితాను రైల్వేశాఖ విడుదల చేసింది.ఈరోజు (శనివారం) ఈ రైలు తొలిసారిగా పట్టాలు ఎక్కనుంది. నేడు అతిథి ప్రయాణికులకు రైల్వేశాఖ మీరట్-లక్నోల మధ్య ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. లక్నో-మీరట్(22491), మీరట్-లక్నో(22490) వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల రెగ్యులర్ ఆపరేషన్ ఆదివారం నుండి ప్రారంభంకానుంది. శుక్రవారం ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఈ రైలు అప్డేట్ అయిన తర్వాత టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారు.బరేలీ జంక్షన్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ రైలు మీరట్-లక్నో మధ్య మొరాదాబాద్, బరేలీ జంక్షన్లలో మాత్రమే ఆగుతుంది. ఈ రైలుకు సంబంధించిన బుకింగ్ ప్రారంభమైన నేపధ్యంలో సెప్టెంబర్ 5 తర్వాత తేదీల ప్రయాణం కోసం సీట్లు వేగంగా బుక్ అవుతున్నాయి. ప్రస్తుతం బరేలీ జంక్షన్లో రైలుకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మీరట్-లక్నో వందే భారత్ మీరట్ నుండి ఉదయం 6:35 గంటలకు బయలుదేరి, 8:35 గంటలకు మొరాదాబాద్, 9:56 గంటలకు బరేలీ చేరుకుని మధ్యాహ్నం 1:45 గంటలకు లక్నో చేరుకుంటుంది. అలాగే లక్నో-మీరట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లక్నో నుండి మధ్యాహ్నం 2:45 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:02 గంటలకు బరేలీకి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి రాత్రి 7:32 గంటలకు మొరాదాబాద్, రాత్రి 10 గంటలకు మీరట్ చేరుకుంటుంది. -
నేటి నుంచి ర్యాపిడ్ రైలు సేవల్లో మరో ముందడుగు
దేశంలో నేటి నుంచి ర్యాపిడ్ రైలు మరింత దూరం పరుగులు తీయనుంది. ఇది ఆధునిక రైల్వే యుగంలో మరో ముందడుగు కానుంది. మీరట్ సౌత్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ నుంచి ర్యాపిడ్ రైలు రాకపోకలు ప్రారంభం కానున్నాయిని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) తెలిపింది. దీంతో ఢిల్లీలోని ప్రయాణికులు ఎన్సీఆర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ వరకు రాకపోకలు సాగించగలుగుతారు.82 కిలోమీటర్ల రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్)లో 42 కి.మీల వినియోగం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఎన్సీఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈరోజు (ఆదివారం) మీరట్ మొదటి స్టేషన్ మధ్యాహ్నం రెండు గంటలకు తెరుచుకోనుంది. ఇప్పటి వరకు నమో భారత్ రైలు సర్వీసులు ఘజియాబాద్ నుంచి మోదీనగర్ నార్త్ వరకు మాత్రమే నడిచేవి. ఇప్పుడు మీరట్ నగరంలో సర్వీసు ప్రారంభం కావడంతో ఘజియాబాద్, ఢిల్లీ వైపు వెళ్లే వారి ప్రయాణం మరింత సులభతరం కానుంది.ఆర్ఆర్టీఎస్ 2023, అక్టోబర్‌లో ఘజియాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఘజియాబాద్‌లోని సాహిబాబాద్- దుహై డిపోల మధ్య 17 కిలోమీటర్ల దూరం ఉంది. ఇప్పటి వరకు ఈ మార్గంలో 22 లక్షల మంది ప్రయాణించారు. ఢిల్లీ - మీరట్ మధ్యనున్న కారిడార్‌లో మొత్తం 25 స్టేషన్లున్నాయి. జూన్ 2025 నాటికి ఢిల్లీ- మీరట్ మధ్య మొత్తం విస్తరణను పూర్తి చేయాలని ఎన్సీఆర్టీసీ భావిస్తోంది. -
‘బ్యాగులో బాంబుందా’?: ప్రశ్నించిన ప్రయాణికుడి అరెస్టు
కొచ్చి: కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం(ఆగస్టు11) ఉదయం విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మనోజ్‌కుమార్(42) అనే ప్రయాణికుడు సెక్యూరిటీ చెక్ వద్ద తన బ్యాగ్ తీసుకుంటూ అందులో బాంబేమైనా ఉందా అని ప్రశ్నించాడు. దీంతో ఎయిర్‌పోర్టు ఎక్స్‌రే బ్యాగేజ్ స్కాన్ పాయింట్ వద్ద ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది బాంబు స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేశారు. మనోజ్‌కుమార్ క్యాబిన్ బ్యాగులతో పాటు చెకిన్ బ్యాగేజీని బాంబు డిటెక్షన్ మెషిన్‌తో జల్లెడ పట్టారు. తనిఖీల తర్వాత మనోజ్‌కుమార్‌ను పోలీసులకు అప్పగించారు. మనోజ్‌కుమార్ ఎయిర్ఇండియా విమానంలో కొచ్చి నుంచి ముంబై వెళ్లాల్సిఉంది. -
ఇకపై ట్రైన్ లో పేదవాడు ప్రవేశించలేని పరిస్థితి
-
మాంసాహారం వడ్డన.. వందేభారత్ రైలులో వెయిటర్‌పై దాడి
కలకత్తా: వందేభారత్ రైల్లో ఇటీవల అనుకోని ఘటన జరిగింది. భోజనం అందించిన వెయిటర్‌పై ఓ ప్రయాణికుడు దాడికి దిగాడు. కొద్ది రోజుల క్రితం ఓ వృద్ధుడు పశ్చిమ బెంగాల్‌లోని హవ్డా నుంచి రాంచీకి వందేభారత్ రైలులో ప్రయాణించాడు. భోజనం కోసం థాలీ ఆర్డర్ చేశాడు. అయితే ఒక వెయిటర్ పొరబాటున మాంసాహారం వడ్డించారు. ఆ వృద్ధ ప్రయాణికుడు కొద్దిసేపటికి అది నాన్-వెజ్ భోజనం అని గుర్తించాడు. Kalesh b/w a Passenger and Waiter inside Vande Bharat over A person slapped a waiter for mistakenly serving him non-vegetarian foodpic.twitter.com/Oh2StEthyX— Ghar Ke Kalesh (@gharkekalesh) July 29, 2024 శాకాహారి అయిన తనకు మాంసాహారాన్ని వడ్డించాడన్న ఆగ్రహంతో వెయిటర్‌పై దాడికి దిగాడు. ఎంతమంది అడ్డుకున్నా ఆగకుండా వెయిటర్‌పై చేయి చేసుకున్నాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ప్రయాణికుడి తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ ఘటనపై తూర్పు రైల్వే స్పందించింది. ‘అవును, పొరబాటు జరిగింది. అంగీకరిస్తున్నాం. సమస్యను పరిష్కరించాం’అని క్లారిటీ ఇచ్చింది. -
అమృత్సర్: రైల్లో మంటలు.. ప్రయాణికుల హహాకారాలు
పంజాబ్‌లోని అమృత్సర్ రైల్వే స్టేషన్‌కు కిలోమీటరు దూరంలో అమృత్సర్-హౌరా మెయిల్ కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు రైలు డ్రైవర్‌కు సమాచారం అందించడంతో వెంటనే రైలును నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది తక్షణం అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రైలులో మంటలు చెలరేగాయని తెలియగానే కొందరు ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ రైలు దిగిపోయారు.ఈ నేపధ్యంలో ఓ మహిళా ప్రయాణికురాలికి కాలికి గాయమైంది. దీంతో అధికారులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. మంటలు చెలరేగిన కంపార్ట్మెంట్ను రైలు నుంచి వేరు చేశాక, మిగిలిన రైలును అధికారులు గమ్యస్థానానికి తరలించారు. కాగా ఇటీవల మధ్యప్రదేశ్‌లోని విదిశాలో జోధ్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. వెంటనే భద్రతా సిబ్బంది రైలును ఆపి, మంటలను అదుపులోకి తెచ్చారు. -
నాన్‌స్టాప్‌గా ఎగిరిపోదాం!
న్యూఢిల్లీ: అమెరికా, యూరప్ తదితర దేశాలకు వెళ్లే భారతీయ విమాన ప్రయాణికులు ఇన్‌డైరెక్ట్ ఫ్లయిట్ల కన్నా నాన్–స్టాప్, డైరెక్ట్ ఫ్లయిట్లకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ ట్రావెల్ డేటా సంస్థ ఓఏజీ గణాంకాల ప్రకారం గత కొన్నాళ్లుగా ఈ ధోరణి పెరుగుతోంది.2023లో 3.72 కోట్ల మంది ప్యాసింజర్లు నాన్–స్టాప్ ఫ్లయిట్స్‌లో ప్రయాణించారు. కోవిడ్ పూర్వం 2019తో పోలిస్తే ఇది ఇరవై లక్షలు అధికం. ఇదే వ్యవధిలో ఒకటి లేదా అంతకు మించి స్టాప్స్‌లో ఆగుతూ వెళ్లే ఇన్‌డైరెక్ట్ ఫ్లయిట్స్‌లో ప్రయాణించిన వారి సంఖ్య 25 లక్షలు తగ్గి 2023లో 2.74 కోట్లకు పరిమితమైంది. 2023లో ప్రయాణించిన మొత్తం 6.46 కోట్ల మంది ప్యాసింజర్లలో 57 శాతం మంది నాన్–స్టాప్ ఫ్లయిట్స్‌నే ఎంచుకున్నారు. 2019లో ఇది 53 శాతంగా ఉంది.పశ్చిమాసియా హబ్‌లకు తగ్గిన ప్రయాణికులు అమెరికా, యూరప్‌లకు వెళ్లే ఫ్లయిట్స్ కోసం భారతీయులు ఎక్కువగా పశ్చిమాసియా హబ్‌ల వైపు మొగ్గు చూపే ధోరణి తగ్గింది. ఓఏజీ గణాంకాల ప్రకారం 2019–2023 మధ్య కాలంలో పశ్చిమాసియా హబ్‌లకు ప్యాసింజర్ల సంఖ్య 10 లక్షల మేర తగ్గింది. ఆ నాలుగేళ్ల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా ఇతర హబ్‌లకు కూడా ప్రయాణికుల సంఖ్య 28 లక్షల మేర తగ్గింది. మరోవైపు, కొత్తగా 52 అంతర్జాతీయ రూట్లను జోడించడంతో ఇన్‌డైరెక్ట్ ఫ్లయిట్ ప్యాసింజర్లకు సంబంధించి దేశీ హబ్‌లలో ప్రయాణికుల సంఖ్య 10 లక్షల మేర పెరిగింది.ఓఏజీ విశ్లేషణ ప్రకారం గల్ఫ్ దేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (యూఏఈ) 36 లక్షల మంది, సౌదీ అరేబియాలో 26 లక్షల మంది ఉన్నారు. ఇంటర్నేషనల్ రూట్లలో భారతీయులను గమ్యస్థానాలకు చేరవేయడంలో పశ్చిమాసియా దేశాల ఎయిర్‌లైన్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ విషయంలో దశాబ్దం క్రితం గల్ఫ్ దేశాల ఎయిర్‌లైన్స్ వాటా 48 శాతంగా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇది 50 శాతానికి పెరిగింది.