‘ప్రయాణికులకు విజ్ఞప్తి.. రైలు నంబరు‌ 13228.. 72 గంటలు లేటుగా ..’ | Fourth Largest Rail Network in The World This Train has a World Record for Being Late | Sakshi
Sakshi News home page

‘ప్రయాణికులకు విజ్ఞప్తి.. రైలు నంబరు‌ 13228.. 72 గంటలు లేటుగా ..’

Published Mon, Feb 3 2025 10:53 AM | Last Updated on Mon, Feb 3 2025 11:30 AM

Fourth Largest Rail Network in The World This Train has a World Record for Being Late

భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌ను కలిగివున్నాయి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు  రైళ్ల సాయంతో  తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. అయితే పలుమార్లు రైళ్ల ఆలస్యం కారణంగా  ప్రయాణికులు  ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పుడు మనం ఆలస్యంగా రావడంలో ప్రపంచ రికార్డు సృష్టించిన రైలు గురించి తెలుసుకుందాం.

భారతీయ రైల్వేల(Indian Railways) ద్వారా దేశంలోని  ఏ ప్రాంతానికైనా చేరుకోవచ్చు. రైల్వేలు నిరంతరం  అభివృద్ధి, విస్తరణ దిశగా పయనిస్తున్నాయి. భారతీయ రైల్వే రోజుకు దాదాపు 13 వేల రైళ్లను నడుపుతోంది. భారతదేశంలో రైల్వే లైన్ల పొడవు 1,26,366 కిలోమీటర్లు. దీనిలో రన్నింగ్ ట్రాక్ పొడవు 99,235 కిలోమీటర్లు.యార్డులు, సైడింగ్‌లు వంటి వాటితో సహా మొత్తం మార్గం 1,26,366 కిలోమీటర్లు. భారతదేశంలో రైల్వే స్టేషన్ల సంఖ్య 8,800ను దాటింది. అయితే ఉత్తరప్రదేశ్‌లో రైలు నెట్‌వర్క్ పొడవు 9,077.45 కి.మీ.

భారతదేశంలో రైళ్లు ఆలస్యంగా రావడమనేది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. శీతాకాలంలో చాలా రైళ్లు 5-6 గంటలు ఆలస్యంగా నడుస్తుంటాయి. అయితే గత కొన్ని సంవత్సరాల్లో పరిస్థితి మెరుగుపడింది. కానీ ఇప్పటికీ చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే భారతదేశ రైల్వే చరిత్రలో ఒక రైలు రికార్డు స్థాయి(Record level)లో లేటుగా వచ్చింది.

మీడియా దగ్గరున్న వివరాల ప్రకారం ప్రకారం 2017లో కోట(రాజస్థాన్‌) - పట్నా(బీహార్‌) మధ్య నడుస్తున్న రైలు (13228) డౌన్ కోట-పట్నా ఎక్స్‌ప్రెస్ అత్యంత ఆలస్యంగా నడిచి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ రైలు ఏకంగా 72 గంటలకు పైగా ఆలస్యంగా నడిచింది. రైల్వే అధికారిక వెబ్‌సైట్ ప్రకారం దీనికిముందు  అత్యంత ఆలస్యం(Very late)గా నడిచిన రైలు రికార్డు మహానంద ఎక్స్‌ప్రెస్ పేరిట ఉంది. డిసెంబర్ 2014లో మహానంద ఎక్స్‌ప్రెస్ మొఘల్‌సరాయ్-పట్నా సెక్షన్‌కు 71 గంటలు ఆలస్యంగా చేరుకుంది.

ఇది కూడా చదవండి: మంచు దుప్పటిలో ఉత్తరాది.. 12 రాష్ట్రాలపై పొగమంచు దెబ్బ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement