ఒడిశాలో రైలు ప్రమాదం | Kamakhya Express Train Derailed Near Choudwar Of Odisha | Sakshi
Sakshi News home page

ఒడిశాలో రైలు ప్రమాదం

Published Sun, Mar 30 2025 3:19 PM | Last Updated on Sun, Mar 30 2025 3:52 PM

Kamakhya Express Train Derailed Near Choudwar Of Odisha

భువనేశ్వర్‌ : ఒడిశాలో రైలు ప్రమాదం జరిగింది. నెర్గుండి సమీపంలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 11 బోగీలు పక్కకు పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.  

ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే సీపీఆర్వో అశోక్‌ కుమార్‌ మిశ్రా వివరాల మేరకు.. కటక్‌లోని నెర్గుండి రైల్వే స్టేషన్‌ సమీపంలో ట్రైన్‌ నెంబర్‌ 12551 కామాఖ్య సూపర్‌ పాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది.

ట్రైన్‌ ప్రమాదం జరిగిన వెంటనే మెడికల్‌ ఎమర్జెన్సీ టీం ఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడిన క్షతగాత్రులకు చికిత్స అందించారు. సీనియర్‌ రైల్వే అధికారులు సైతం ఘటన స్థలానికి చేరుకున్నారు.ప్రమాదానికి గల కారణాల్ని ఆరా తీస్తున్నారు. మరోవైపు, రైల్వే రాకపోకలకు ఎలాంటి అంతరాయం జరగకుండా రూట్లను మళ్లించారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement