Train bogies
-
పట్టాలపై లైఫ్‌లైన్
నర్సు ఓల్గా.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంతటా విరామం లేకుండా తిరుగుతూనే ఉన్నారు. రోగుల ఆక్సిజన్ స్థాయిలను తనిఖీ చేసి నోట్ చేసుకుంటున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న రోగులను ఓ కంట కనిపెడుతున్నారు. ఓ ఆస్పత్రిలో ఇదో సాధారణ దృశ్యం. కానీ ఆమె పనిచేస్తున్నది నడుస్తున్న రైలులో. వైద్యం అందిస్తున్నది యుద్ధంలో గాయాలపాలైన సైనికులకు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడానికి ఉక్రెయిన్ ఈ రైలాస్పత్రిని నడుపుతోంది. ఆ దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఇప్పుడిది కీలక భాగంగా మారింది. యుద్ధంలో గాయపడిన సైనికుల కోసం తూర్పు ఉక్రెయిన్‌లోని చాలా నగరాల్లోని ఆసుపత్రుల్లో పడకలు లేవు. అవి ఖాళీ చేయడానికి కొందరిని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అంబులెన్సుల్లో సుదూర ప్రయాణంతో సైనికుల ప్రాణాలకే ముప్పుకావచ్చు. రష్యా దాడుల నేపథ్యంలో హెలికాప్టర్ అంబులెన్స్‌లు కూడా ఉపయోగించలేరు. ఈ క్లిష్ట స్థితిలో రైళ్లు సైనికుల ప్రాణాలను కాపాడుతున్నాయి. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే ఇందులోని బోగీలు పూర్తి స్థాయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లుగా పనిచేస్తున్నాయి. ఆర్మీ డాక్టర్లు, ఇతర సిబ్బంది సైనికులకు రైలులోనే సేవ లు అందిస్తున్నారు. కదులుతున్న రైలులో ఐసీయూ యూనిట్ నడపడం చాలా కష్టమైన పని. అయినా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ‘ఇక్కడ మా సామర్థ్యం చాలా పరిమితం. ఏదైనా జరిగితే బయటి కన్సల్టెంట్‌ను పిలవలేం. రక్తస్రావాన్ని ఆపడానికి చిన్న చిన్న ఆపరేషన్లు వంటివి చేస్తాం. పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు చేయలేం’అని డాక్టర్స్ చీఫ్ ఒకరు తెలిపారు. పర్యాటక రైలు కాస్తా ఆస్పత్రిగా.. యుద్ధం ప్రారంభంలో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఉక్రెయిన్ సమయస్ఫూర్తికి రైలాస్పిత్రి ఒక ఉదాహరణ. 2022 ఫిబ్రవరిలో దేశంపై రష్యా దాడులు ప్రారంభించినప్పుడు ఉక్రెయిన్ వద్ద ఎటువంటి మెడికల్ రైలు బోగీలు లేవు. గాయపడిన సైనికులను సాధారణ రైళ్లలోకి కిటికీల గుండా బలవంతంగా ఎక్కించేవారు. దీనికి పరిష్కారం ఆలోచించిన ఉక్రెయిన్ రైల్వే.. సాధారణ రోజుల్లో పర్యాటకులను కార్పాతియన్ పర్వతాలకు తీసుకెళ్లడానికి ఉపయోగించే రైళ్లను పునరుద్ధరించింది. అలా ఆస్పత్రి రైలుకు రూపకల్పన జరిగిందని ఉక్రెయిన్ రైల్వే ప్యాసింజర్ ఆపరేషన్స్ సీఈఓ ఒలెక్సాండర్ పెర్తోవ్స్కీ చెప్పారు. గంటకు 50 మైళ్ల వేగంతో.. ఈ రైలు గంటకు 80 కిలోమీటర్లు (50 మైళ్లు) వేగంతో ప్రయాణిస్తుంది. సాధారణ రైలు వేగంలో సగమే అయినప్పటికీ ఐసీయూ మాత్రం అటూఇటూ కదిలిపోతూంటుంది. దీంతో పనిచేసేటప్పుడు సిబ్బంది చాలా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంబులెన్స్ రైళ్లను మొదట 1850లలో క్రిమియన్ యుద్ధం సమయంలో ఉపయోగించారు. కానీ ఈ ఆధునిక వెర్షన్లలో వెంటిలేటర్లు, లైఫ్ సపోర్ట్ యంత్రాలు, అ్రల్టాసౌండ్ స్కానర్లు, పోర్టబుల్ ఎయిర్ కండిషనర్లు ఉన్నాయి. ప్రతి క్యారేజీలో నిరంతర విద్యుత్ కోసం జనరేటర్లుంటాయి. బోగీల్లో పిల్లల చిత్రాలు, ఉక్రెయిన్ జాతీయ జెండాలు ఉంటాయి. గాయపడిన సైనికులకు ఇవి కొంత ఓదార్పును అందిస్తాయి. రెండు భిన్న దృశ్యాలు.. తొమ్మిది గంటల ప్రయాణం తరువాత రైలాస్పత్రి ఒక నగరంలోని రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించగానే.. అంబులెన్సులు సైనికుల కోసం ఎదురు చూస్తుంటాయి. ఐసీయూ లోని నర్సులు సైనికులను ప్లాట్‌ఫామ్‌పై ఎదురుచూస్తున్న వైద్యులకు అప్పగిస్తారు. స్టేషన్ నుంచి అంబులెన్సులు బయల్దేరి వెళ్లాక ఊపిరి పీల్చుకుంటారు. వారికి ఎదురుగా కొత్తగా రిక్రూట్ అయిన సైనికులతో ఓ రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది. తల్లిదండ్రులకు వీడ్కోలు పలుకుతూ పిల్లలు కనపడతారు. సాయంత్రానికి ఆ యువసైనికులు అపస్మారక స్థితిలోనో, తీవ్ర గాయాలతోనే అదే రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. ఈ రెండు దృశ్యాలకు ప్రత్యక్ష సాకు‡్ష్యలు రైలాస్పత్రి సిబ్బందే. యుద్ధం మిగుల్చుతున్న అంతులేని విషాదమిది. ‘యుద్ధ క్షేత్రం నుంచి తీవ్రంగా గాయపడి వచ్చే సైనికులను చూడటం బాధాకరమైన విషయమే. కానీ, వారికి సేవ చేస్తున్నామన్న తృప్తి మాత్రం మాకు మిగులుతుంది’అని చెబుతున్నారు ఐసీయూ నర్సు ఓల్గా. 2015లో సైన్యంలో నర్సుగా చేరిన ఆమె.. 2022 నుంచి యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స అందిస్తున్నారు. అలసిపోయాం.. యుద్ధం చెల్లించుకుంటున్న మూల్యానికి ఈ రైలాస్పత్రి ఓ చిన్న ఉదాహరణ. ‘రష్యన్ విసిరిన గ్రెనేడ్‌తో నా చేతులు, భుజాలు, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు శబ్దాలు నా వినికిడి శక్తినే దెబ్బతీశాయి. నేనే కాదు.. చాలా మందికి మనోధైర్యం ఉంది. కానీ చాలా అలసిపోయారు. ఇలాంటప్పుడు ఏదేమైనా కానీ భారమంతా దేవుడిదే అనుకుంటాం’అని చెబుతున్నారు రష్యా డ్రోన్ దాడిలో గాయపడి రైలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 35 ఏళ్ల సైనికుడు. అలసట యుద్ధక్షేత్రంలోని సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోందనడానికి ఇదో ఉదాహరణ. ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఈయన 18 నెలల నుంచి డోనెట్స్క్ ప్రాంతంలోని పదాతిదళంలో యాంటీ ట్యాంక్ గన్నర్‌గా పనిచేస్తున్నారు. ఇన్ని రోజుల్లో కేవలం 45 రోజులు మాత్రమే ఫ్రంట్‌లైన్‌కు దూరంగా ఉన్నారు. గాయాల నుంచి ప్రేరణ.. ఈయనకు కొన్ని పడకల దూరంలో కూర్చున్న స్టానిస్లావ్ మూడు నెలల క్రితం స్వచ్ఛందంగా సైన్యంలో చేరారు. అతడున్న కందకంపైన డ్రోన్ దాడి జరగడంతో ఊపిరితిత్తులకు గాయమైంది. పక్కటెముకలు విరిగాయి. అయినా స్టానిస్లావ్ పూర్తి భిన్నమైన మానసిక స్థితిలో కనిపించారు. ‘‘గాయపడ్డాక నాలో ఆత్మస్థైర్యం తగ్గలేదు. నేను మరింత ప్రేరణ పొందాను’’అని చిరునవ్వుతో చెబుతున్నారు. యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నుజ్జునుజ్జు అయిన 5 భోగీలు
-
మళ్లీ ‘లోకల్’ ఫైట్: మెడపట్టి రైలులో నుంచి..
ఢిల్లీ మెట్రో- ముంబై లోకల్ మధ్య వైరల్ వీడియోల వార్ జరుగుతోంది. రీల్స్ చేయడం మొదలుకొన్ని ప్రయాణికులు పరస్పరం తన్నుకునేవరకూ ఇలా లెక్కలేనన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజా వీడియో ముంబై లోకల్ ట్రైన్‌కు సంబంధించినది. వేగంగా వెళుతున్న రైలులో డోరు దగ్గర నిలుచున్న ఇద్దరు ప్రయాణికుల మధ్య వివాదం చేటుచేసుకోవడాన్ని వీడియోలో చూడవచ్చు. ముంబై మేటర్స్ పేరుతో ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసిన ఈ వీడియోలో ఇద్దరు ప్రయాణికులు రైలు డోర్ దగ్గర నిలుచుని ఉండటం కనిపిస్తుంది. వారిద్దరూ ఏదో విషయమై గొడవపడుతుంటారు. ఇంతలో ఒక వ్యక్తి తన ఎదురుగా ఉన్న వ్యక్తి గొంతుపట్టి అతనిని రైలు నుంచి బయటకు నెట్టివేసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఆ వ్యక్తి ట్రైన్ గ్రిల్ పట్టుకుని తనను తాను కాపాడుకుంటాడు. దీనిని చూసిన రైలులోని తోటి ప్రయాణికులు పెద్దగా కేకలు పెడతారు. ఈ వీడియోను చూసినవారికి తృటిలో ప్రమాదం తప్పిందని అనిపిస్తుంది. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో పలువురు యూజర్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ముంబై మెట్రోలో ఇది నిత్యకృత్యమై పోయిందని కామెంట్ చేయగా, మరొక యూజర్ ‘ఇంత చిన్న గొడవకే ప్రాణాలు తీసుకుంటారా?’ అని ప్రశ్నించాడు. ఇది కూడా చదవండి: ఈ ఆమ్లెట్ తింటే లక్ష.. కండీషన్స్ అప్లై! Commuter Fights inside speeding #MumbaiLocal trains that too near the Open Doors (Gate) is very very Risky. Whenever the much promised conversion of all the Mumbai local trains into AC Local trains (with doors) happens, commuters can fight in cool comfort without sweating &… pic.twitter.com/d8KCxYc9Np — मुंबई Matters™ (@mumbaimatterz) October 11, 2023 -
రైలు బోగీలో మంటలు
ఏలూరు టూ టౌన్/ఏలూరు టౌన్: ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్లో శనివారం రాత్రి రైల్వే ట్రాక్ మెషిన్ సిబ్బంది ప్రయాణించే రైలు బోగీ అగ్ని ప్రమాదానికి గురైంది. దీనిని రైల్వే లైన్ మరమ్మతుల కోసం ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులు, అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాక్ మరమ్మతుల కోసం వినియోగించే ఈ బోగీని ఏలూరు రైల్వేస్టేషన్ ట్రాక్ నంబర్ 7లో చివర లూప్లైన్లో నిలిపి ఉంచారు. రాత్రి 7.30–8 గంటల మధ్య ఈ బోగీకి మంటలు అంటుకుని ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన రైల్వే అధికారులు ఏలూరు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ ఆధ్వర్యంలో రెండు ఫైర్ ఇంజిన్లు అక్కడకు చేరుకుని అదుపు చేశాయి. బోగీలో నిల్వ ఉంచిన 10 వరకు ఆయిల్ డ్రమ్ములను బయటకు లాగి వేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వీటికి నిప్పు అంటుకుని ఉంటే అదుపు చేయడం కష్టమయ్యేది. ఆ బోగీలో విలువైన బ్యాటరీలు, ఎలక్ట్రికల్ వైర్లు, ట్రాక్ మరమ్మతులకు వినియోగించే సామగ్రి, కూలర్ వంటివి బయటికి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం రైల్వే ఇంజనీరింగ్ విభాగానికి చెందిన క్యాంపింగ్ కోచ్ ఫర్ ట్రాక్ మెషిన్ సిబ్బంది ప్రయాణించే ప్రత్యేక రైలు బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ఏలూరు అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ చెప్పారు. శనివారం విపరీతమైన వేడి ఉండటం వల్ల అందులోని వైర్లు షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం జరిగిందని మీడియాకు చెప్పారు. ఈ రైలు బోగీలో రైల్వే సిబ్బందితో పాటు డీజిల్ ట్యాంకులు, యంత్ర పరికరాలు ఉంటాయన్నారు. పక్క బోగీలోనే భారీగా డీజిల్ నిల్వలు ఉన్నాయన్నారు. మంటలు వ్యాప్తి చెందక ముందే అదుపు చేశామని చెప్పారు. బోగీలోని 15 మంది సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని వివరించారు. ఆస్తి నష్టం అంచనా వేయాల్సి ఉందన్నారు. -
ఇలా చేస్తే ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవచ్చు! ఖర్చు ఎంతవుతుందో తెలుసా?
IRCTC Entire Train Or Coach Booking In Online: భారతదేశంలో సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు విమానాలను మాత్రమే కాకుండా ట్రైన్స్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. కుటుంబం మొత్తం ప్రయాణించాలనుకున్నప్పుడు ముందుగా రిజర్వ్ చేసుకున్నప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కో చోట సీట్లు అలాట్ చేస్తారు. కానీ మీరందరూ కలిసి వెళ్లాలనుకున్నప్పుడు ఒక కోచ్ మొత్తమ్ బుక్ చేసుకోవచ్చు. ఇది 'ఐఆర్సీటీసి'లో ఎలా బుక్ చేసుకోవాలి? ఎంత ఖర్చు అవుతుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బుక్ చేసుకునే విధానం ఏదైనా టూర్ వెళ్లాలనుకుని ఒక బృందం మొత్తం ప్రయాణించాలనుకున్నప్పుడు 'పుల్ టారిఫ్ రేట్' అనే బుకింగ్ ఆప్షన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ సర్వీసు కింద ఒక కోచ్ లేదా మొత్తం ట్రైన్ బుక్ చేసుకోవచ్చు. అయితే దీనికోసం ఒక ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్వర్డ్ వంటివి క్రియేట్ చేసుకోవాలి. దీని కోసం మీరు https://www.ftr.irctc.co.in/ftr/ అనే వెబ్సైట్ సందర్సించాల్సి ఉంటుంది. ఇది ఓపెన్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. ఈ విధంగా మీరు తర్వాత మీరు మొత్తం ట్రైన్ బుక్ చేసుకోవాలా.. లేదా ఒక కోచ్ మాత్రమే బుక్ చేసుకోవాలా.. అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీకు కావలసిన ఆప్షన్ ఎంచుకుని అవసరమైన అన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత చెల్లించాల్సిన మొత్తం అమౌంట్ పే చేసిన తరువాత మీ బుకింగ్ కంప్లీట్ అవుతుంది. ఇందులో మీరు ఏసీ ఫస్ట్ క్లాస్,ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, ఏసీ 2 కమ్ 3 టైర్, స్లీపర్ కోచ్‌లను బుక్ చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..) ఇండియన్ రైల్వే రూల్స్ ప్రకారం, మీరు ఒక కోచ్ బుక్ చేసుకోవాలనుంటే ముందుగా రూ. 50,000 వరకు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఇది మీరు ప్రయాణించే దూరం, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒకవేళా ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు రూ. 9 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ఇలాంటి బుకింగ్ కోసం కనీసం 30 రోజులు లేదా 6 నెలల ముందే బుక్ చేసుకోవాలి. -
బోగీలను వదిలి వెళ్లిపోయిన గూడ్స్ రైలు ఇంజన్
పిడుగురాళ్ల: గూడ్స్ రైలు ఇంజన్ బోగీలను వదిలి వెళ్లిన ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో బుధవారం జరిగింది. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తోన్న గూడ్స్ రైలు పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ సమీపంలోని 65వ గేటు వద్ద బోగీలను వదిలి ఇంజన్ వెళ్లిపోయింది. ఇది గమనించిన గూడ్స్ రైలు గార్డ్ రైల్వే అధికారులకు, గూడ్స్ రైలు డ్రైవర్‌కు సమాచారమిచ్చారు. జానపాడు రైల్వే గేటు దాటి వెళ్లిన ఇంజన్‌ను రైల్వే గూడ్స్ డ్రైవర్ బోగీలు ఆగిన ప్రదేశానికి తీసుకొని వచ్చాడు. రైల్వే అధికారులు, సిబ్బంది గూడ్స్ బండి ఇంజన్, బోగీలను కలిపించారు. ఇదంతా 15 నిమిషాల సమయం పట్టింది. ఆ సమయంలో పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ వైపు వచ్చే రైళ్లు ఏమీ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని, లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేదని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ‘ఉపాధి’ పనులను పరిశీలించిన కేంద్ర బృందం -
గూడ్సు రైలుకు ఊడిన లింక్
ఎర్రుపాలెం: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రైల్వేస్టేషన్ సమీపాన గురువారం ఒక గూడ్స్ రైలు బోగీలు, ఇంజన్‌కు లింక్ తెగిపోయింది. విజయవాడ నుండి ఖమ్మం వైపు అప్‌లైన్‌లో వెళ్తున్న గూడ్స్ ఇంజన్ నుంచి బోగీలకు లింక్ ఊడిపోవడంతో.. ఇంజన్ కొన్ని బోగీలతో కిలోమీటర్ మేర ముందుకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే అధికారులు, సిబ్బంది మరమ్మతుల అనంతరం గూడ్సును పంపించారు. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని అధికారులు స్పష్టం చేశారు. -
రైలు బోగీలో ప్రసవం
సామర్లకోట: చెన్నై నుంచి జార్ఖండ్ వెళుతున్న ఓ గర్భిణి ఆదివారం రైలులో ప్రసవించింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన శంకర్ క్రికిత్త ఉద్యోగ రీత్యా చెన్నైలో ఉంటున్నాడు. అతడి భార్య వాసకుమారి(21) ప్రస్తుతం ఏడో నెల గర్భిణి. దీంతో శంకర్ ఆమెను పుట్టిల్లయిన జార్ఖండ్ తీసుకువెళుతున్నాడు. భార్యాభర్తలిద్దరూ బొకారో ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి జార్ఖండ్ బయలుదేరారు. రైలు తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట వచ్చాక ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమెను భర్త బాత్రూమ్కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీనిపై తోటి ప్రయాణికులు 108కు సమాచారం ఇచ్చారు. రైలును కొద్దిసేపు సామర్లకోటలో నిలిపివేశారు. స్టేషన్‌కు చేరుకున్న 108 సిబ్బంది తల్లీబిడ్డలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడ తీసుకెళ్లాల్సిందిగా వారికి సూచించారు. -
ఆర్టీపీపీలో గంజాయి కలకలం
ఎర్రగుంట్ల: వైఎస్సార్ జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో బొగ్గును సరఫరా చేసే రైలు వ్యాగన్లో మంగళవారం గంజాయి ప్యాకెట్లు దొరికాయి. ఆర్టీపీపీకి ఒడిశా, సింగరేణి నుంచి బొగ్గు వ్యాగన్లు వస్తాయి. మంగళవారం వచ్చిన వ్యాగన్ నుంచి లోడు దించుతుండగా సుమారు 10 కిలోలు ఉన్న గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. వీటిని ఆర్టీపీపీ అధికారులు కలమల్ల పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఈ విషయంపై కలమల్ల ఎస్ఐ చంద్రమోహన్‌తో మాట్లాడగా గంజాయి ప్యాకెట్లను ఆర్టీపీపీ కోల్ ప్లాంట్ అధికారులు స్టేషన్‌కు తెచ్చారన్నారు. ఇది మాకు సంబంధం లేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జీఆర్పీ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించినట్లు తెలిపారు. ఎర్రగుంట్ల జీఆర్పీ వారిని వివరణ కోరగా ఆర్టీపీపీకి ప్రైవేటు రైల్వే లైన్ అయినందున తమకు సంబంధం లేదని వారు చెప్పారు. ఎస్ఈబీ సీఐ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ గంజాయి ప్యాకెట్ల విషయం తమ దృష్టికి రాలేదన్నారు. గంజాయి ప్యాకెట్లు వ్యవహారంపై ఏ శాఖ అధికారులు సంబంధం లేదంటూ దాటేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపితే పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉంది. -
ఇకపై అన్నీ ఆధునిక బోగీలే
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) రైలు బోగీలు క్రమేణా కనుమరుగు కానున్నాయి. ప్రయాణికుల భద్రత, వేగం పెంపు, నిర్వహణ ఖర్చులో పొదుపు తదితరాల దృష్ట్యా ఆధునిక లింక్ హాఫ్‌మెన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) బోగీలు వాటి స్థానాన్ని ఆక్రమించుకోనున్నాయి. ముదురు ఎరుపు రంగులో ఉండే ఈ బోగీలు రెండు దశాబ్దాల క్రితం నీలిరంగులోకి మారాయి. అయితే ప్రస్తుతం వస్తున్న ఎల్‌హెచ్‌బీ బోగీలు నారింజ రంగు ప్రధానంగా ఉంటున్నాయి. భారతీయ రైల్వే ఇప్పటికే దాదాపు 18 వేల వరకు ఇలాంటి ఆధునిక కోచ్‌లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా పాత బోగీలన్నీ మార్చి వీలైనంత తొందరలో కొత్తవి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వాటి ఉత్పత్తిని కూడా భారీగా పెంచింది. ఐసీఎఫ్లు పూర్తిగా పక్కకు.. భారతీయ రైల్వే ఇంతకాలం సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌లను వినియోగిస్తూ వస్తోంది. తమిళనాడులోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో వీటిని ఉత్పత్తి చేస్తున్నందున ఐసీఎఫ్ బోగీల పేరిటే కొనసాగుతున్నాయి. స్టెయిన్లెస్ స్టీల్‌తో చాలా మందంగా ఉండే ఈ కోచ్‌లతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా ప్రత్యామ్నాయం లేక దశాబ్దాలుగా వాటినే వాడుతూ వస్తోంది. అయితే కొన్నేళ్ల కిందట జర్మనీ పరిజ్ఞానంతో కొత్తగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు అందుబాటులోకి రావటంతో వాటివైపు మొగ్గుచూపింది. ఈ పరిజ్ఞానంతో కొత్త కోచ్‌ల తయారీకి పంజాబ్‌లోని కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీని కేటాయించింది. రైలు ప్రమాదాల సమయంలో భారీ ప్రాణనష్టం సంభవించకుండా తప్పించాలంటే ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల ఏర్పాటు అవశ్యమని నిపుణులు రైల్వేకు సిఫారసు చేయటంతో ఐసీఎఫ్ కోచ్‌ల తయారీని రెండేళ్ల కిందట నిలిపేశారు. కానీ వినియోగంలో ఉన్న ఆ కోచ్‌లు నాణ్యతతో ఉండటంతో వాటిని కొనసాగిస్తున్నారు. తాజాగా.. అవి మన్నికగా ఉన్నా సరే పక్కన పెట్టేయాలని రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని కోచ్ ఫ్యాక్టరీల్లో ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల తయారీ సామర్థ్యాన్ని పెంచింది. తయారైనవి తయారైనట్టుగా వినియోగంలోకి తెచ్చి సంప్రదాయ కోచ్‌లను పక్కన పెట్టేయాలని నిర్ణయించింది. దీంతో మరి కొన్నేళ్లలోనే ఐసీఎఫ్ బోగీలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది ప్రయాణికుల భద్రతే ప్రధానం బోగీల మార్పు వెనక భద్రతే ప్రధాన కారణంగా కినిపిస్తోంది. ఇప్పటివరకు ఐసీఎఫ్ బోగీలలో డ్యూయల్ బఫర్ హుక్ కప్లర్స్‌ను వినియోగిస్తున్నారు. బోగీకి బోగీకి మధ్య ఇవే అనుసంధానంగా ఉంటాయి. దీంతోనే సమస్య ఏర్పడుతోంది. రైలు ప్రమాదాలు జరిగినప్పుడు బోగీలు పరస్పరం ఢీకొని ఒకదానిమీదికొకటి ఎక్కుతున్నాయి. దీంతో భారీ ప్రాణనష్టం సంభవిస్తోంది. రైలు ప్రమాద మరణాల్లో 90 శాతం ఈ కప్లింగ్ వల్లనే సంభవిస్తున్నాయని గుర్తించారు. ఎల్‌హెచ్‌బీ బోగీలకు సెంటర్ బఫర్ కప్లర్లుంటాయి. ప్రమాదాలు జరిగినప్పుడు బోగీలు పక్కకు పడిపోతాయి తప్ప ఒకదానిమీదకు ఒకటి ఎక్కవు. బరువు తక్కువ .. వేగం ఎక్కువ ఐసీఎఫ్ బోగీలు గరిష్టంగా గంటకు 160 కి.మీ. వేగంతో వెళ్లేలా రూపొందించారు. కానీ వాటికి అనుమతించిన గరిష్ట వేగం 120 కి.మీ. మాత్రమే. కాగా 110 కి.మీ. వరకు మాత్రమే నడుపుతున్నారు. అంతకంటే ఎక్కువ వేగంతో వెళ్తే బోగీలు ఊగిపోవటం, పెద్ద శబ్దాన్ని సృష్టించటం ఇబ్బందిగా మారింది. ఇక ఎల్‌హెచ్‌బీ బోగీలు 200 కి.మీ. వేగాన్ని తట్టుకునేలా రూపొందుతున్నాయి. అయితే వాటిని ప్రస్తుతం 160 కి.మీ. వేగానికి పరిమితం చేశారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల బరువు తక్కువగా ఉండటంతో ఎక్కువ వేగంతో పరుగులు తీస్తున్నాయి. కుదుపులు కూడా చాలా తక్కువగా ఉండటంతో గరిష్ట వేగానికి అనుమతించినా ఇబ్బంది ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. కుదుపులకు తావులేని సస్పెన్షన్ వ్యవస్థ ఐసీఎఫ్ బోగీలకు సంప్రదాయ స్ప్రింగ్ సస్పెన్షన్ విధానం ఉంటుంది. రైలు వేగంగా ప్రయాణించిన సమయంలో బోగీలు పైకి కిందకు ఊగకుండా కొంతమేర అడ్డుకోగలుగుతాయి, కానీ ఊయల లాగా పక్కకు ఊగకుండా నిలువరించలేకపోతున్నాయి. ఇది ప్రయాణికులకు కొంత అసౌకర్యంగా ఉంటోంది. ఒక్కోసారి పైనుంచి బ్యాగులు కిందపడేంతగా బోగీలు ఊగుతున్నాయి. ఎల్‌హెచ్‌బీ బోగీల్లో ఎయిర్ కుషన్ సస్పెన్షన్ వ్యవస్థ ఉంటోంది. దీనివల్ల వేగంగా వెళ్లినా పెద్దగా కుదుపులు ఉండటం లేదు. మరోవైపు సంప్రదాయ బోగీల్లో సాధారణ ఎయిర్ బ్రేక్ విధానం ఉంటుంది. బ్రేక్ వేశాక వెంటనే నిలిచిపోతే బోగీలు పట్టాలు తప్పే ప్రమాదముంది. దీంతో బ్రేకు వేశాక చాలా ముందుకు వెళ్లి ఆగుతుంది. ఎల్‌హెచ్‌బీ బోగీలకు డిస్క్ బ్రేకు విధానం ఉంటుంది. కాసేపటికే ఆగినా బోగీలు పట్టాలు తప్పే ప్రమాదముండదు. ఖరీదు ఎక్కువే అయినా.. ఐసీఎఫ్ కోచ్‌ల తయారీ ఖర్చు తక్కువ. స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందే ఈ కోచ్‌లలో ఏసీ బోగీకి రూ.కోటిన్నర, స్లీపర్ బోగీకి రూ.85 లక్షల వరకు ఖర్చు అవుతోంది. అదే మైల్డ్ స్టీల్‌తో రూపొందే ఎల్‌హెచ్‌బీ ఏసీ కోచ్‌లు రూ. రెండున్నర కోట్లు, స్లీపర్ అయితే రూ.కోటిన్నర వరకు ఖర్చు అవుతోంది. తయారీ ఖరీదే అయినా నిర్వహణ వ్యయం మాత్రం తక్కువగా ఉంటుంది. విడిభాగాల అవసరం కూడా చాలా తక్కువ. అయితే మన్నిక విషయంలో మాత్రం ఎల్‌హెచ్‌బీలే ముందుండటం గమనార్హం. ఇక సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌లో 64 మంది ప్రయాణికులకు అవకాశం ఉంటుంది. దీనికంటే దాదాపు 2 మీటర్ల పొడవు ఎక్కువుండే ఎల్‌హెచ్‌బీ బోగీలో 72 మంది ప్రయాణించవచ్చు. -
తప్పిన పెను ప్రమాదం: అరగంటలో రెండుసార్లు
సాక్షి, ముంబై: బాంద్రా టర్మినస్ నుంచి రామ్‌నగర్ బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు రెండు సార్లు విడిపోవడంతో రైళ్ల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పశ్చిమ రైల్వే మార్గంలోని బాంద్రా టర్మినస్ నుంచి గురువారం ఉదయం రామ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. కొద్ది సేపటికే పశ్చిమ ఉప నగరంలోని జోగేశ్వరీ–రామ్ మందిర్ స్టేషన్ల మధ్య కప్లింగ్ ఊడిపోయి చివరి రెండు బోగీలు విడిపోయాయి. రంగంలోకి దిగిన సాంకేతిక సిబ్బంది గంటన్నరకుపైగా శ్రమించి వాటిని జోడించి రైలును పంపించారు. దీంతో ఫాస్ట్ మార్గంలో లోకల్ రైళ్లతో పాటు దూర ప్రాంత ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా నిలిచిపోయాయి. ఆ తర్వాత నగర శివారు ప్రాంతమైన నాయిగావ్–వసై రోడ్ స్టేషన్ల మధ్య మళ్లీ ఆ బోగీలు విడిపోయాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ఆ బోగీలను మళ్లీ రైలుకు జోడించకూడదని నిర్ణయం తీసుకున్నారు. వాటి స్థానంలో మరో రెండు ఎల్‌హెచ్‌బీ బోగీలను తెప్పించి జోడించడం కుదరదని అధికారులు గుర్తించారు. దీంతో ఆ రెండు బోగీల్లో ఉన్న ప్రయాణికులను దింపి అదే రైలులో మిగతా బోగీల్లో సర్దుబాటు చేసి పంపించారు. అందుకు మరో 25 నిమిషాల సమయం పట్టింది. రెండుసార్లు జరిగిన ఈ ఘటనపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని పశ్చిమ రైల్వే నిర్ణయం తీసుకుంది. రైల్వే నియమాల ప్రకారం దూరం నుంచి వచ్చిన ప్రతీ రైలును యార్డులో నిర్వహణ పనులు పూర్తయిన తర్వాతే మళ్లీ పంపించడానికి సిద్ధం చేస్తారు. అంతా సవ్యంగా ఉంటేనే రైలును ప్లాట్ఫారం పైకి తెస్తారు. కానీ ఇలా బయలుదేరిన అర గంటలోపే రెండు సార్లు బోగీలు విడిపోవడం వర్క్ షాపు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కొత్త టెక్నాలజీతో తయారైన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఇలా విడిపోవడం రైల్వే సిబ్బంది నిర్వహణ లోపం, నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. చదవండి: ఇంజన్లో ఇరుక్కున్న బైక్, ఆగిన రైలు ఆమె కోసం ఇల్లు అమ్మేసి... ఆటోలోనే తిండి, నిద్ర -
రైల్వే గ్రీన్ సిగ్నల్!
సాక్షి, సిటీబ్యూరో: ఎట్టకేలకు కోవిడ్ కేర్ బోగీలఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కరోనా ఉధృతి దృష్ట్యా వైద్య సేవల కోసం ఈ బోగీలను అందజేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రైల్వేశాఖ తాజాగా 60 కోవిడ్ కేర్ బోగీలను కేటాయించింది. సికింద్రాబాద్, కాచిగూడ, ఆదిలాబాద్ స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు.. ఒక్కో బోగీలో సుమారు 16 పడకల చొప్పున మొత్తం 960 పడకలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న రాష్ట్రాలను ఆదుకునేందుకుకేంద్రం చేపట్టిన సహాయ కార్యక్రమాల్లో భాగంగాఈ బోగీలను ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీ,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణ ప్రభుత్వాల కోరిక మేరకు కోవిడ్ కేర్ బోగీలను కేటాయించారు. అవసరమైతే మరిన్ని బోగీలను అందజేసేందుకు కూడా దక్షిణమధ్య రైల్వే సిద్ధంగా ఉంది. మొత్తం 481 బోగీలను కరోనా పేషెంట్ల కోసం వినియోగించేందుకు వీలుగా లాలాగూడ వర్క్‌షాప్‌లో మార్పులు చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. స్లీపర్ క్లాస్ బోగీలను మాత్రమే ఇందుకోసం వినియోగించారు. ఇప్పటి వరకు కేవలం వర్క్షాప్నకే పరిమితమై ఉన్న ఈ బోగీలను తాజాఉత్తర్వులతో పట్టాలెక్కించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా వీటిని సికింద్రాబాద్, కాచిగూడ, ఆదిలాబాద్ స్టేషన్లలో ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్ల రాకపోకలు సాగిస్తున్న ప్రస్తుత తరుణంలో కోవిడ్ కేర్ బోగీలను ఏర్పాటు చేయడం ఎలాసాధ్యమనేది చర్చనీయాంశంగా మారింది. సికింద్రాబాద్‌లో కష్టమే.. లాక్డౌన్ సడలింపుల అనంతరం ప్రయాణికుల రాకపోకల కోసం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ప్రతిరోజు సుమారు 25 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 10 రెగ్యులర్ రైళ్లు, మరో సికింద్రాబాద్–న్యూఢిల్లీ వీక్లీ స్పెషల్ ట్రైన్లు ఇక్కడి నుంచే బయలుదేరుతున్నాయి. దీంతో పాటు నాంపల్లి స్టేషన్‌ను కూడా ప్రయాణికుల రాకపోకల కోసం వినియోగిస్తున్నారు. ప్రత్యేక రైళ్లతో పాటు శ్రామిక్ రైళ్లు కూడా ఈ రెండు స్టేషన్ల నుంచి బయలుదేరుతున్నాయి. మొత్తం 10 ప్లాట్‌ఫాముల్లో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రస్తుతం ఒకటి, పదో నంబర్ ప్లాట్‌ఫాముల్లో నుంచి ప్రయాణికుల రాకపోకలు సాగుతున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ రెండు స్టేషన్ల నుంచి రాకపోకలు కొనసాగుతున్నాయి. కానీ ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ స్టేషన్లోనే కోవిడ్ కేర్ బోగీలను ఏర్పాటు చేస్తే సాధారణ ప్రయాణికులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. పాజిటివ్ లక్షణాలు ఉన్న వారిని అనుమానితులను కోవిడ్ కేర్ బోగీల్లో ఉంచేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేశారు. అలాంటి బోగీలు ఉండే స్టేషన్ నుంచి ప్రయాణికులు రాకపోకలు కొనసాగించడం వల్ల మరింత మందికి కరోనా సోకే అవకాశం ఉంది. కాచిగూడ ఓకే.. ప్రస్తుతానికి నగరంలో కాచిగూడ స్టేషన్ ఒక్కటి మాత్రమే కోవిడ్ కేర్ బోగీల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ స్టేషన్ నుంచి ఇప్పటి వరకు ప్రయాణికుల రాకపోకలు తిరిగి ప్రారంభించకపోవడం వల్ల దీనిని కోవిడ్ సేవల కోసం వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. దీంతో పాటు ఆదిలాబాద్‌లోనూ ఏర్పాటు చేయవచ్చన్నారు. కోవిడ్ బోగీలను ఏర్పాటు చేయడమంటే పేషెంట్లు లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు వీలుగా ప్లాట్‌ఫామ్ ఉండాలి. అలాగే తాగునీటి సదుపాయం, పారిశుధ్య వసతి అందుబాటులో ఉండాలి. దీనిని దృష్టిలో ఉంచుకొని కోవిడ్ బోగీల ఏర్పాటుపై సమాలోచనలు చేస్తున్నాం.’ అని చెప్పారు. ఏర్పాట్లు ఇలా.. పేషెంట్లకు పడకలు, నీరు, పారిశుధ్యం తదితర మౌలిక సదుపాయాలను దక్షిణమధ్య రైల్వే కల్పిస్తుంది. అలాగే కోచ్‌ల నిర్వహణకు లైజన్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేస్తారు. వైద్య సేవలు, డాక్టర్లు, మందులు, వైద్యసిబ్బంది తదితర రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. -
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
రేణిగుంట (చిత్తూరు జిల్లా): కాచిగూడ నుంచి చిత్తూరుకు వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు సోమవారం భారీ ప్రమాదం తప్పింది. రెండు బోగీల మధ్య లింకు ఊడిపోవడంతో కొన్ని బోగీలు రైలు నుంచి వేరుపడి నిలిచిపోయాయి. వివరాలు.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఉదయం 7.30 గంటలకు రేణిగంట మండలం మామండూరు రైల్వేస్టేషన్ దాటాక అకస్మాత్తుగా ఎస్2, ఎస్3 బోగీల మధ్య కప్లింగ్ ఊడిపోవడంతో ఎస్3 నుంచి వెనుకవైపున్న బోగీలు వేరుపడి నిలిచిపోయాయి. ఈ విషయాన్ని గుర్తించే లోపు రైలు అరకిలోమీటర్ దూరం ప్రయాణించింది. అప్రమత్తమైన లోకోపైలట్లు రైలును విడిపోయిన బోగీల వద్దకు వెనక్కి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న మామండూరు స్టేషన్ మాస్టర్లు సిబ్బందితో రైలు వద్దకు చేరుకుని తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.దీంతో 8.25 గంటలకు రైలు రేణిగుంట జంక్షన్‌కు చేరుకుంది. -
ఇంజన్ నుంచే కరెంట్..!
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో బోగీలకు విద్యుత్ సరఫరా కోసం కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ కొన్నేళ్లుగా యత్నిస్తోంది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో కూడిన రైళ్లలో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రతి రైలుకు రెండు పవర్‌కార్లను వినియోగిస్తున్నారు. డీజిల్‌తో ఇందులో విద్యుత్‌ను ఉత్పత్తి చేసి బోగీలకు సరఫరా చేస్తుంటారు. ఇది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావటంతో పాటు శబ్ద, వాయు కాలుష్యాలకు కారణమవుతోంది. దీంతో పవర్కార్లు లేకుండా నేరుగా ఇంజన్ నుంచే విద్యుత్‌ను సరఫరా చేసే ‘హెడ్ ఆన్ జనరేషన్ (హెచ్ఓజీ)’పేరుతో కొత్త విధానానికి రైల్వే శ్రీకారం చుట్టింది. తొలుత హైదరాబాద్–ఢిల్లీ మధ్య తిరిగే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం నుంచి ప్రారంభించారు. ఏంటా విధానం.. విద్యుత్‌తో నడిచే రైళ్లకు ఈ విధానం అందుబాటులో ఉంటుంది. విద్యుత్ వైర్ల నుంచి రైలుకు 25 కేవీ విద్యుత్ తీసుకుంటారు. వైర్ల నుంచి యాంటీనా వంటి ఉపకరణం విద్యుత్‌ను ఇంజన్‌కు అందిస్తుంది. ఇప్పుడు ప్రత్యేకంగా మరో ఉపకరణాన్ని ఇంజన్ వద్ద అమరుస్తారు. అది 25 కేవీ విద్యుత్‌ను 110 వోల్టులకు మార్చి ఇంజన్‌కు అవసరమైన దాన్ని ఇంజన్‌కు సరఫరా చేసి మిగతా దాన్ని బోగీలకు మళ్లిస్తుంది. ఆ విద్యుత్‌తో బోగీల్లో ఫ్యాన్లు, లైట్లు, ఏసీ పనిచేస్తాయి. -
భెల్ బోగీలు ఆహుతి!
సాక్షి, ముంబై : నగరంలో అగ్ని ప్రమాదాలు జరిగిన లోకల్ రైళ్లలో ఎక్కువ శాతం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) కంపెనీ తయారుచేసిన బోగీలు ఉన్నట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సెంట్రల్ రైల్వే మార్గంలో భెల్ కంపెనీ తయారుచేసిన కొన్ని లోకల్ రైళ్లు తిరుగుతున్నాయి. వాటిలో మార్పులు చేయాలని లేదా కాలం చెల్లిన రైళ్లను కార్ షెడ్డుకు పరిమితం చేయాలని గతంలోనే అప్పటి రైల్వే సేఫ్టీ కమిషనర్ చేతన్ బక్షి రైల్వే బోర్డుకు ప్రతిపాదన పంపించారు. కానీ, నిరక్ష్యం చేయడంతో తరుచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తొమ్మిది సార్లు అగ్నిప్రమాదం.. గత శుక్రవారం రాత్రి దాదర్ స్టేషన్లో లోకల్ రైలు బోగీకి మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు థానేలో సైడింగ్ ట్రాక్‌లోకి వెళుతున్న ఓ లోకల్ రైలుకు ఇలాగే మంటలు అంటుకున్నాయి. తాజాగా జరిగిన ఈ రెండు సంఘటనలతో ప్రయాణికుల భద్రత మరోసారి తెరమీదకు వచ్చింది. అదృష్టవశాత్తు ఈ రెండు ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సెంట్రల్ రైల్వే మార్గంలో తిరుగుతున్న భెల్ కంపెనీ లోకల్ రైళ్లను ప్రయాణికులు భద్రతను దృష్టిలో ఉంచుకుని 2014 ఏప్రిల్ 16వ తేదీన సేవల నుంచి తొలగించాలని చేతన్ బక్షి రైల్వే బోర్డుకు ప్రతిపాదించారు.ప్రస్తుతం సెంట్రల్ రైల్వే అధీనంలో భెల్ కంపెనీ తయారీ రైళ్లు ఆరు ఉన్నాయి. గడచిన ఐదేళ్లలో భెల్ కంపెనీ లోకల్ రైళ్లలో తొమ్మిది సార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇలా నిత్యం రద్దీగా ఉండే లోకల్ రైళ్లలో అగ్ని ప్రమాదాలు జరగడం ప్రయాణికులను భయాందోళనలకు గురిచేస్తోంది. దాదర్‌లో జరిగిన ఘటనపై కారణాలను వెలికి తీసేందుకు సెంట్రల్ రైల్వే ఎంక్వైరీ కమిటీ నియమించింది. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక సమర్పించనుంది. సెంట్రల్ రైల్వే మార్గంలో జరిగిన అగ్ని ప్రమాదాలు... 2014 ఏప్రిల్ 3వ తేదీ– కర్జత్ నుంచి సీఎస్ఎంటీ వెళుతున్న లోకల్ రైలుకు దాదర్ ఆరో నంబరు ప్లాట్‌ఫారంపై అగ్ని ప్రమాదం జరిగింది. 2012 డిసెంబర్ 4వ తేదీ–అంధేరీ–సీఎస్ఎంటీ వెళుతున్న రైలుకు డాక్‌యార్డ్ స్టేషన్లో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా, 8 మంది స్వల్పంగా గాయపడ్డారు. 2012 ఏప్రిల్ 8వ తేదీన–కోపర్ రైల్వే స్టేషన్లో బోగీ నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు కిందికి దూకేశారు. ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 2013 మార్చి 15వ తేదీ–ఘాట్కోపర్ స్టేషన్లో బోగీకి మంటలు అంటుకున్నాయి. 2018 ఫిబ్రవరి 2వ తేదీ– దాదర్ స్టేషన్లో ఒకటో నంబరు ప్లాట్‌పారంపై థానే వెళుతున్న లోకల్ రైలుకు మంటలు అంటుకున్నాయి. -
ఏ రైలుకైనా 22 బోగీలే!
న్యూఢిల్లీ: రైలు బోగీల సంఖ్యలో ఏకరూపత తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అవసరమైనప్పుడు ఏ మార్గంలోనైనా ప్రయాణించడానికి వీలుగా అన్ని రైళ్లలో 22 బోగీలు అమర్చాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్లాట్‌ఫాంల పొడవు, ఇతర మౌలిక వసతుల్లో మార్పులు చేర్పులు చేస్తామని రైల్వే శాఖ మంత్రి పీయూశ్ గోయల్ మంగళవారం చెప్పారు. ప్రస్తుతం రైలు నడిచే మార్గం, డిమాండ్ ఆధారంగా ఒక్కో బండిలో 12, 16, 18, 22, 26 చొప్పున బోగీలను అమర్చుతున్నారు. దీని వల్ల ఒక రైలు స్థానంలో మరో రైలును నడపడం సాధ్యం కావట్లేదు. ఏదైనా రైలు ఆలస్యమైనట్లయితే అందుబాటులో ఉన్న బండిని దాని స్థానంలో పంపేందుకు తాజా ప్రతిపాదన ఉపకరిస్తుందని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. తొలి దశలో ఈ మార్పులు చేయడానికి 300 రైళ్లను గుర్తించారు. -
అస్సాంలో పట్టాలు తప్పిన రైలు
-
పట్టాలు తప్పిన గువహటి ఎక్స్ ప్రెస్, పలువురికి గాయాలు
అస్సాం: గువహటి-సిప్ హుంగ్ ఎక్స్ ప్రెస్ శనివారం ఉదయం పట్టాలు తప్పింది. అస్సాంలోని కోక్రాజహార్, బాసుగౌన్ ప్రాంతంలో బ్రిడ్జి దాటుతున్న సమయంలో ఆకస్మాత్తుగా రైలు బోగీలు అదుపుతప్పాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. గువహటి-సిప్ హుంగ్ ఎక్స్ ప్రెస్ ఉత్తర బెంగాల్, అలీపురద్వర్ నుంచి బయలుదేరి గువహటి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇక సామగ్రి సోదా
సాక్షి, ముంబై: దూరప్రాంతాల ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్ల బోగీలు తరచూ అగ్నిప్రమాదాలకు గురవుతుండడంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఇందులోభాగంగా ఇకపై ప్రయాణికుల సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని నగర పరిధిలో బుధవారం ప్రారంభించింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇదిలాఉంచితే ఇప్పటిదాకా జరిగిన అగ్నిప్రమాదాలకు బాధ్యులెవరనే విషయం ఇంకా తేలలేదు. అయితే వందలాది మంది అమాయక ప్రయాణికుల ప్రాణాలు మాత్రం గాలిలో కలసిపోయాయి. నగరంలోని ఐదు స్టేషన్లనుంచి దూరప్రాంత ఎక్స్‌ప్రెస్, మెయిల్, ప్యాసింజర్ రైళ్లు బయల్దేరతాయి. ఈ రైళ్లు ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ), దాదర్ టెర్మినస్, కుర్లా లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ), ముంబై సెంట్రల్, బాంద్రా టెర్మినస్లనుంచి బయల్దేరతాయి. ఇటీవల కాలంలో మూడు వేర్వేరు రైల్వే మార్గాల్లో బోగీలకు మంటలు అంటుకోవడంతో అనేకమంది చనిపోయారు. పదిరోజుల క్రితం బెంగళూర్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు మంటల అంటుకున్న ఘటన నుంచి ఇంకా ప్రయాణికులు తేరుకోనేలేదు. తాజాగా స్థానిక బాంద్రా టెర్మినస్ నుంచి బయల్దేరిన డె హ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం తెల్లవారుజామున డహాణు స్టేషన్ సమీపంలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మూడు బోగీలు మాడిమసయ్యాయి. ఇలా ఒకదాని వెంట మరో ఘటన చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రయాణికుల సామగ్రిని తనిఖీ చేయాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) నిర్ణయించింది. నిబంధనల ప్రకారం బాణసంచా, సిగరెట్లు, బీడీలు,అగ్గిపెట్టె, గ్యాస్ లైటర్ తదితర మండే స్వభావం కలిగిన సామగ్రిని తీసుకెళ్లకూడదు. అయితే నగరంలోని పలు టోకు మార్కెట్లలో ఇవి అత్యంత చవక ధరలకు లభిస్తుండడంతో కొందరు ఇక్కడే కొనుగోలు చేసుకుని స్వగ్రామాలకు తీసుకెళుతుంటారు. ఇలా చేయడం ప్రాణాలతో చెలగాటమాడడమేనని తెలిసినప్పటికీ వారు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. సాధారణ బోగీల్లోని ఫ్యాన్ జాలీల మధ్య తాగిపడేసిన సిగరెట్, బీడీ ముక్కలు దొరుకుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అనేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఫలితం దక్కడం లేదు. దీంతో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తేరుకున్న రైల్వే పరిపాలనా విభాగం ఆర్పీఎఫ్ను అప్రమత్తం చేసింది. మండే పదార్థాలను తరలిస్తూ పట్టుబడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ రైల్వే పరిధిలోని సీఎస్టీ, దాదర్, ఎల్టీటీ, ఠాణే, కల్యాణ్, పన్వేల్ తదితర రద్దీ స్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు. మండే స్వభావం కలిగిన పదార్థాలు తరలిస్తూ పట్టిబడితే పోలీసులు వారి వద్ద నుంచి కేవలం రూ.200 మాత్రమే జరిమానా కింద వసూలు చేస్తున్నారు. ఇది అతి తక్కువ కావడంతో ప్రయాణికులు తేలిగ్గా తీసుకుంటున్నారని, అందువల్ల ఈ మొత్తాన్ని పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఓ రైల్వే అధికారి చెప్పారు. బెంబేలెత్తుతున్న ప్రయాణికులు కొంతకాలంగా జరుగుతున్న అగ్నిప్రమాద ఘటనలతో రైళ్లలో రాకపోకలు సాగించాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. మరోవైపు ప్రమాదం జరిగిన ప్రతిసారి దర్యాప్తునకు ఆదేశించడం, ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సర్వసాధారణంగా మారిపోయింది. బాంద్రా-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో అగ్నిప్రమాదం ఘటనలో తొమ్మిది మంది మరణించడంతో ప్రయాణికుల భద్రత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కాగా గడచిన పదిరోజుల వ్యవధిలో మొత్తం మూడు అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో 35 మంది ప్రయాణికులు మృతిచెందారు. డి సెంబర్ చివరివారంలో నాందేడ్-బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ అనంతరపురంలో అగ్నిప్రమాదానికి గురైన విషయం విదితమే. ఏసీ బోగీలో జరిగిన ఈ ఘటనలో 26 మంది మరణించారు. వీటితోపాటు ఈ నెల మూడో తేదీన ఠాణేలో నిలిచిఉన్న ఓ లోకల్ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రయాణికులెవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఆరో తేదీన చాలీస్‌గావ్ రైల్వేస్టేషన్ సమీపంలో ముంబై-హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది.