ఎర్రుపాలెంలో ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
ఎర్రుపాలెం: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రైల్వేస్టేషన్ సమీపాన గురువారం ఒక గూడ్స్ రైలు బోగీలు, ఇంజన్‌కు లింక్ తెగిపోయింది. విజయవాడ నుండి ఖమ్మం వైపు అప్‌లైన్‌లో వెళ్తున్న గూడ్స్ ఇంజన్ నుంచి బోగీలకు లింక్ ఊడిపోవడంతో.. ఇంజన్ కొన్ని బోగీలతో కిలోమీటర్ మేర ముందుకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే అధికారులు, సిబ్బంది మరమ్మతుల అనంతరం గూడ్సును పంపించారు. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment