
పిడుగురాళ్ల: గూడ్స్ రైలు ఇంజన్ బోగీలను వదిలి వెళ్లిన ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో బుధవారం జరిగింది. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తోన్న గూడ్స్ రైలు పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ సమీపంలోని 65వ గేటు వద్ద బోగీలను వదిలి ఇంజన్ వెళ్లిపోయింది. ఇది గమనించిన గూడ్స్ రైలు గార్డ్ రైల్వే అధికారులకు, గూడ్స్ రైలు డ్రైవర్‌కు సమాచారమిచ్చారు.
జానపాడు రైల్వే గేటు దాటి వెళ్లిన ఇంజన్‌ను రైల్వే గూడ్స్ డ్రైవర్ బోగీలు ఆగిన ప్రదేశానికి తీసుకొని వచ్చాడు. రైల్వే అధికారులు, సిబ్బంది గూడ్స్ బండి ఇంజన్, బోగీలను కలిపించారు. ఇదంతా 15 నిమిషాల సమయం పట్టింది. ఆ సమయంలో పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ వైపు వచ్చే రైళ్లు ఏమీ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని, లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేదని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: ‘ఉపాధి’ పనులను పరిశీలించిన కేంద్ర బృందం
Comments
Please login to add a commentAdd a comment