
- 400 కుటుంబాలపై కూటమి ప్రభుత్వం బహిష్కరణ వేటు
- వైఎస్ జగన్ ను కలిసిన పిన్నెళ్లి గ్రామస్తులు
- ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
- ‘చలో పిన్నెళ్లి’ కార్యక్రమానికి సిద్ధమవుతున్న వైఎస్సార్ సీపీ
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసే మంచి ఏమీ లేకపోయినా కక్ష సాధింపు చర్యలు మాత్రం తీవ్రతరమవుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే పల్నాడు జిల్లా పిన్నెళ్లి గ్రామంలోని 400 కుటుంబాలపై బహిష్కరణ వేటు వేసింది. బహిష్కరణకు గురైన వారంతా ఎస్సీ, బీసీ, మైనార్టీలే. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. బహిష్కరణకు గురైన పిన్నెళ్లి గ్రామంలోని కుటుంబాలకు అండగా నిలిచారు వైఎస్ జగన్

ఈ క్రమంలోనే అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. గ్రామంలోకి వస్తే తమను చంపుతామని బెదిరిస్తున్నారని వారు వైఎస్ జగన్‌కు విన్నవించుకున్నారు. వీరికి వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. దీనిలో భాగంగా ‘చలో పిన్నెళ్లి’ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ‘ సిద్ధమైంది. రెండు నెలల్లో చలో పిన్నెళ్లి’ కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్‌సీపీ‘ నిర్ణయించింది. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సహా పిన్నెల్లి, తురకపాలెం, మాదెనపాడు, చెన్నాయపాలెం గ్రామస్తులున్నారు.


Comments
Please login to add a commentAdd a comment