Palnadu
-
శ్రీచైతన్య స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి
-
వైఎస్సార్సీపీ నేత నర్రెడ్డి లక్ష్మారెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ
తాడేపల్లి : ఇటీవల టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ నేత నర్రెడ్డి లక్ష్మారెడ్డిని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఈ మేరకు నర్రెడ్డి లక్ష్మారెడ్డికి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నర్రెడ్డి లక్ష్మారెడ్డి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్‌తో మాట్లాడారు. బాధితునికి అవసరమైన అత్యుత్తమ వైద్యం అందించాలని డాక్టర్‌ను కోరారు. అదే సమయంలో పార్టీ అండగా ఉంటుందని నర్రెడ్డి లక్ష్మారెడ్డికి భరోసా ఇచ్చారు వైఎస్ జగన్కాగా, నాలుగు రోజుల క్రితం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జులకల్లులో టీడీపీ గూండాలు.. వైఎస్సార్సీపీ నేత లక్ష్మారెడ్డిపై కత్తులు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో లక్ష్మారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నర్రెడ్డి లక్ష్మారెడ్డిని అంతమొందించాలనే రాజకీయ కుట్రలో భాగంగా టీడీపీ ఊరి చివరి కాపు కాసి దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో గ్రామస్తులు అడ్డుకోవడంతో లక్ష్మారెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన్ను పిడుగురాళ్ళలోని పల్నాడు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
డయేరియా మరణాల పాపం ప్రభుత్వానిదే, ఏపీలో మైన్స్, వైన్స్ దోపిడీ
-
టీడీపీ గూండాల దాడిలో నాగరాజుకు గాయాలు.. వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, నరసారావుపేట: టీడీపీ గుండాల చేతిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్త నాగరాజును వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా నాగరాజుకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. నాగరాజును జాగ్రత్తగా చూసుకోమని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని వైఎస్ జగన్ ఆదేశించారు.పల్నాడు జిల్లా గురజాల మండలం తేలుకుట్లకు చెందిన చల్లా నాగరాజు మొదటి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తగానే పనిచేస్తున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామంలో పార్టీ తరపున పోలింగ్ ఏజెంట్‌గా వ్యవహరించాడు. దీంతో నాగరాజుపై కక్ష కట్టిన స్థానిక టీడీపీ నాయకులు, ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఆయన్ను బెదిరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కూటమి నేతల నుంచి ప్రమాదం పొంచి ఉందని గ్రహించి, తేలుకుట్ల వదిలి పులిపాడు వచ్చి అక్కడే ఉంటున్నాడు.కాగా, గత నెల 20న వ్యక్తిగత పనిమీద తేలుకుట్ల వెళ్లి పులిపాడు తిరిగి వస్తుండగా, గ్రామ శివారులోని గాడిదల వాగు వద్ద కాపుకాసిన 10 మంది టీడీపీ గుండాలు, నాగరాజుపై విచక్షణా రహితంగా కర్రలు, రాడ్లతో దాడి చేశారు. రెండు కాళ్లనూ నాలుగు చోట్ల విరగ్గొట్టారు. దీంతో, నాగరాజును వెంటనే గురజాల ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తరలించారు. అనంతరం, మెరుగైన చికిత్స కొరకు నరసారావుపేట జీబీఆర్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్యం చేసిన వైద్యులు.. నాగరాజు కుడి కాలు చికిత్స చేసే అవకాశం లేదని, మోకాలు కింద నుంచి కాలు తొలగించాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.ఇదిలా ఉండగా.. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ జగన్.. నాగరాజును ఆదివారం ఫోన్లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నాగరాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వైఎస్ ఆకాక్షించారు. ఈ సందర్భంగా నాగరాజుకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నాగరాజుకు పూర్తి వైద్య సాయం చేయించాలని, జాగ్రత్తగా చూసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని ఆదేశించారు. -
పల్నాడు జిల్లాలో పచ్చ బ్యాచ్ దౌర్జన్యం
-
టీడీపీ బరితెగింపు.
-
మెడికల్ సీట్లు వద్దని చెప్పడం దుర్మార్గం: గోపిరెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి, ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లారని, వాటిలో 5 కాలేజీలు గత విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే, ఈ ఏడాది మరో 5 కాలేజీలు కూడా మొదలై ఉండేవని తెలిపారు.కానీ, సీఎం చంద్రబాబు నిర్వాకం వల్ల.. అవి ప్రారంభం కాకపోగా.. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) పులివెందుల మెడికల్ కాలేజీకి ఇచ్చిన 50 మెడికల్ సీట్లు కూడా పోయాయని ఆక్షేపించారు. ఆ సీట్లు వద్దంటూ ఎన్ఎంసీకి ప్రభుత్వం లేఖ రాయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కొత్తగా మెడికల్ సీట్లు వస్తే మీకు (ప్రభుత్వానికి) వచ్చిన నష్టమేమిటని.. ఒక డాక్టర్‌గా అడుగుతున్నానన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అందుకు సమాధానం చెప్పాలని నిలదీశారు.40 ఏళ్ళుగా ఏపీలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. వైద్య విద్య ఎంత కష్టమైందో.. మెడిసిన్ సీటు సంపాదించడం కూడా ఎంత ఇబ్బందో అందరికీ తెలిసిందేనన్న నరసారావుపేట మాజీ ఎమ్మెల్యే.. వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ మాటలు విస్మయం కలిగించాయని చెప్పారు.ఇదీ చదవండి: తెల్ల ‘కోట్లు’!.. నీట్ ర్యాంకర్ల నిర్వేదంగత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ , వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడమే కాక.. పోస్టులన్నీ భర్తీ చేశారని స్పష్టం చేశారు. అందుకే.. మంత్రి సత్యకుమార్ సవాల్ స్వీకరిస్తున్నానని, ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో ఎంత అభివృద్ధి జరిగింది?. ఈ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు సిద్ధమని తేల్చి చెప్పారు. గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సిబ్బంది ధర్నాతో పీహెచ్‌సీల్లో వైద్య సేవలు ఆగిపోయాయని, స్పెషలిస్ట్ వైద్యసేవలూ నిల్చిపోయాయని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వివరించారు. -
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్లపై పోలీసుల ఓవర్ యాక్షన్...
-
పల్నాడు జిల్లా నరసరావుపేటలో కత్తిపోట్ల కలకలం
-
పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ నేతల అరాచకాలు
-
టీడీపీ నేతల వేధింపులకు పల్నాడు ఉద్యోగి బలి
సాక్షి, పల్నాడు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపులతో రెచ్చిపోతున్నారు. సామాన్య ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఉద్యోగులను ఎవరినీ వదలకుండా వేధింపులకు తెగపడుతున్నారు. తాజాగా పచ్చ నేతల వేధింపులకు పల్నాడులో ఓ ఉద్యోగి బలి అయ్యారు. పల్నాడు జిల్లాలోని అన్నారం సొసైటీ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని టీడీపీ సానుభూతిపరులు దొప్పలపూడి శ్రీనివాసరావు, సురేంద్రబాబులు వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అధికారులు సైతం శ్రీనివాస్ రెడ్డికి రెండు నెలల నుంచి జీతం ఆపేశారు. ఉద్యోగం మానేయాలని ఆ ఉద్యోగంలో తమ వారిని ఎంపిక చేసుకుంటామని ఆయన్ను టీడీపీ నేతలు వేధించారు. వారి వేధింపులు భరించలేక శ్రీనివాస్ రెడ్డి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆయన్ను నరసరావుపేట ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందారు. శ్రీనివాస్‌రెడ్డి మృతికి టీడీపీ నేతల వేధింపులు కారణమని కుటుంసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. -
టీడీపీ నేతల అరాచకం.. నాగరాజుకు తీవ్ర గాయాలు
పల్నాడు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒంటేరు నాగరాజు కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. కిడ్నాప్ చేసిన టీడీపీ నాయకులు.. నాగరాజును చావబాదడంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. నాగరాజును బొల్లాపల్లి స్టేషన్ తీసుకువచ్చిన పోలీసులు.. ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. కిడ్నాడ్ ఘటనకు సంబంధించ ఎనిమిది మంది కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కిడ్నాపర్లను విచారిస్తున్నారు. నిందితులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు గోప్యగా ఉంచుతున్నారు. బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైఎస్సార్సీపీ కార్యకర్త నాగరాజును కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా తీసుకెళ్లిన ప్రత్యర్థులు.. నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. -
Nagaraju Incident in Palnadu: రంగంలోకి 6 స్పెషల్ టీంలు..
-
నాగరాజుకు ఏమైనా హానీ జరిగితే తీవ్ర పరిణామాలుంటాయి: అంబటి రాంబాబు
-
AP: పచ్చమూకల దాడి.. వైఎస్ఆర్సీపీ నేతకు తీవ్ర గాయాలు
సాక్షి,పల్నాడు జిల్లా: ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకులు మళ్లీ బరితెగించారు. వైఎస్ఆర్సీపీ నేత, క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డిపై 15 మంది మాస్కులు వేసుకున్న టీడీపీ నాయకులు దారికాచి దాడి చేశారు. మంగళవారం(జులై 23)సాయంత్రం గుంటూరు నుంచి తాళ్లూరు వెళ్తుండగా ఉంగుటూరు వద్ద మాటువేసిన టీడీపీ నాయకులు సాంబిరెడ్డి కారుపై దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో కారు ధ్వంసమైంది. సాంబిరెడ్డి కాళ్లు చేతులపై ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో సాంబిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆయనను గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
వినుకొండకు వైఎస్ జగన్.. కార్యకర్తల ఘన స్వాగతం (ఫొటోలు)
-
రాజకీయ కక్షతోనే హత్య.. రషీద్ కుటుంబానికి అండగా ఉంటానన్న వైఎస్ జగన్
పల్నాడు,సాక్షి: మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి.. రాష్ట్రంలో అన్నీ దారుణాలకు తెగబడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వినుకొండలో టీడీపీ గుండా చేతిలో రెండ్రోజుల కిందట అతికిరాతకంగా హత్యకు గురైన వైఎస్సార్సీపీ యువ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. జగన్‌ను చూడగానే రషీద్ తల్లిదండ్రులు, బంధువులు భావోద్వేగానికిలోనూ కంటతడి పెట్టారు. వారిని ఓదార్చిన ఆయన.. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. చంపేసేంత కక్షలు లేవు.. ఎందుకిలా జరిగింది? అని ఆరా తీశారాయన. అయితే అవి పాత కక్షలు కావని, రాజకీయ కక్షలే అని రషీద్ తల్లి జగన్‌కు వివరించారు. వైఎస్సార్సీపీ కోసమే రషీద్ తాపత్రయపడ్డాడు. రాజకీయ కక్షతోనే మా కొడుకును బలి తీసుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని బెదిరిస్తున్నారు. నిందితుడు జిలానీకి టీడీపీతో సంబంధాలు ఉన్నాయి. ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితుల పేర్లు చేర్చలేదు. ఆయుధం సరఫరా చేసిన వ్యక్తి పేరు చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదు. నిందితుడు జిలానీ వెనుక టీడీపీ వాళ్లు ఉన్నారు. జిలానీ కాల్ డేటా తీస్తే హత్య వెనుక ఎవరున్నది తెలిసిపోతుంది. నా కొడుకును చంపిన వాళ్లను రోడ్డుపైనే ఉరి తీయాలి అని రషీద్ తల్లిదండ్రులు కోరారు. ఆ సమయంలో టీడీపీ నేతలతో జిలానీ ఉన్న ఫొటోలను జగన్‌కు రషీద్ కుటుంబ సభ్యులు చూపించారు. ‘‘హత్య వెనుక ఎవరున్నా వదలం. మీ కుటుంబానికి అండగా ఉంటాం’’ అని రషీద్ కుటుంబ సభ్యులకు జగన్ ధైర్యం చెప్పారు. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నీ దారుణాలే. కాపాడాల్సిన పోలీసులే నిందితులకు వత్తాసు పలుకుతున్నారు. మోసపు మాటలతో అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చడం లేదు’ అని అన్నారాయన. అలాగే.. రషీద్ కుటుంబానికి అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు.ఆ టైంలోనూ ఆ కుటుంబ సభ్యుల్ని ఆయన ఓదార్చారు. అంతకు ముందు రషీద్ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. ఈ పరామర్శలో జగన్ వెంట పలువురు కీలక నేతలు కూడా ఉన్నారు. అడుగడుగునా ఆంక్షలు.. ఆటంకాలుపోలీసుల ఆంక్షలు.. అడుగడుగునా వాళ్లు కల్పించిన ఆంటకాలతో వైఎస్ జగన్ వినుకొండ పర్యటన కొనసాగింది. దారి మధ్యలో ఆయన వెంట పార్టీ నేతలు రాకూడదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. 15 చోట్ల ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆయన పర్యటన ఆలస్యంగా కొనసాగింది. అయినప్పటికీ ఆయన ఓపికగా ముందుకు సాగారు.దారివెంట అభిమాన గణంజగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించినా.. అభిమానులు మాత్రం పోటెత్తారు. దారి పొడవునా జై జగన్ అంటూ నీరాజనాలు పట్టారు. వినుకొండలో ఆయన కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు వెళ్లింది. అయితే పరామర్శ కార్యక్రమానికి వెళ్తున్నప్పటికీ.. అంత పెద్ద ఎత్తున వచ్చిన పార్టీ కేడర్‌ను నిరుత్సాహపర్చడం ఇష్టం లేని వైఎస్ జగన్.. బయటికి వచ్చి అభివాదం చేశారు. జగన్ భద్రతపై నిర్లక్ష్యంమాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతపై చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే వైఎస్ జగన్‌కు భద్రతను తగ్గించిన ప్రభుత్వం.. ఆయనకు పాత బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. రిపేర్‌లో ఉన్న బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం ఇవ్వడంతో మార్గంలో పలుమార్లు వాహనం మొరాయించింది. దీంతో మధ్యలోనే బుల్లెట్ ఫ్రూప్ వాహనం నుంచి దిగిన వైఎస్ జగన్.. మరో వాహనంలో వినుకొండ చేరుకున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆ వాహనం కండిషన్లో ఉందని చెప్పడం కొసమెరుపు. -
పల్నాడులో రాజకీయ కక్షతో YSRCP కార్యకర్త దారుణ హత్య
-
ఆయన ఉంటే ఇలా జరిగేది కాదు.. వినుకొండ ఘటనపై అంబటి ట్వీట్
సాక్షి, పల్నాడు జిల్లా: సార్వత్రిక ఎన్నికల సమయంలో పల్నాడులో దాడులు, దౌర్జన్యాలు, రిగ్గింగ్‌లకు పాల్పడిన టీడీపీ నేతలు మరోసారి వైఎస్సార్ సీపీ కార్యకర్తలే టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కంచి శ్రీనివాసరావు ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న రెండు రోజుల్లోనే పల్నాడులో హింసాకాండ తిరిగి మొదలైంది.ఎస్పీ స్వయంగా వినుకొండలో ఉన్న సమయంలోనే తెలుగు యువత నాయకుడి తమ్ముడు నడిరోడ్డుపై హత్యకు తెగబడ్డాడు. కాగా ఈ ఘటనపై పూర్తి విచారణ చేయకుండా వ్యక్తిగత కక్షలే కారణమని కొత్తగా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కంచి శ్రీనివాసరావు ఫక్తు రాజకీయ నేత మాదిరిగా వ్యాఖ్యానించడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.వినుకొండ ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. ‘‘మల్లికా గార్గ్ పల్నాడు ఎస్పీగా ఉండి ఉన్నట్లయితే వినుకొండలో ఈ దారుణ హత్య జరిగి ఉండేది కాదు!’’ అంటూ ట్వీట్ చేశారు.మల్లికా గార్గ్ పల్నాడు ఎస్పీగా ఉండి ఉన్నట్లయితే వినుకొండలో ఈ దారుణ హత్య జరిగి ఉండేది కాదు !— Ambati Rambabu (@AmbatiRambabu) July 17, 2024 ఇదీ చదవండి: గూండారాజ్.. రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య -
రాబందుల రాజ్యంలో 'రాక్షస కాండ'.. పేట్రేగిపోతున్న టీడీపీ గూండాలు
రాష్ట్రంలో రక్తం ఏరులైపారుతోంది.. మధ్యయుగాల నాటి మారణకాండను తలపిస్తూ నడిరోడ్డు పైనే, అదీ అందరూ చూస్తుండగానే మనుషులను నరికిపారేస్తున్నారు. తాలిబన్లను మించి అత్యంత పాశవికంగా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో మారణకాండను సృష్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు.. నెల రోజులుగా పచ్చ మూక ఉన్మాదానికి నెత్తురు కట్టలు తెంచుకుంటోంది.. తలకాయలు తెగిపడుతున్నాయి. వారి అధికార మదానికి ప్రాణాలు దూదిపింజల్లా రాలిపోతున్నాయి. సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌ను బుధవారం రాత్రి టీడీపీ నేత జిలానీ కత్తితో దాడి చేసి రెండు చేతులు తెగనరికాడు.. అదే కత్తితో తలపైనా, మెడపైనా విచక్షణారహితంగా నరికాడు. ఇంతటి దారుణ హత్య ఎక్కడో చీకట్లోనో.. దొంగచాటుగానో చేయలేదు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బహిరంగంగానే ఇంతటి ఘోరానికి ఒడిగట్టాడు. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు.. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని నారా లోకేశ్ హోర్డింగుల సాక్షిగా స్పష్టం చేశారు.. దీంతో పోలీసు యంత్రాంగం పక్కకు తప్పుకుని టీడీపీ అరాచకాలకు రాచబాట పరిచింది.. అంతకంటే ఇంకేం కావాలని టీడీపీ రౌడీలు మారణాయుధాలు చేతబట్టి కాలకేయుళ్లా రాష్ట్రంపై దండెత్తారు. ఇదీ చంద్రబాబు రాక్షసపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖచిత్రం.. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో నెలకొన్న అరాచక రాజ్యం. మధ్యయుగాలనాటి గజినీ, ఘోరీల దురాగతాలను మించి టీడీపీ గూండాలు హత్యలకు తెగబడుతున్నారు. తాలిబన్ మూకలను మించి పచ్చ మూకలు స్వైరవిహారం చేస్తూ కర్కశంగా విరుచుకుపడుతున్నాయి. తమ పదఘట్టనల కింద యథేచ్ఛగా విధ్వంసకాండ కొనసాగిస్తున్నాయి. నడిరోడ్లపై రాక్షసరాజ్యం కరాళ నృత్యం చేస్తోంది. 75ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు చూడని రీతిలో హింసాకాండతో చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది. చంద్రబాబు అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే టీడీపీ మూకల దాడుల్లో 31 మంది హత్యకు గురయ్యారు. మరో 35 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇలా హత్యలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. ఇళ్లు, ఆస్తులు, మహానేత విగ్రహాలను నేలమట్టం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయాలను కూలుస్తున్నారు. ప్రభుత్వ ప్రేరేపిత దాడులతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారినా పట్టించుకునేవారే లేరు. నెల రోజుల్లోనే 31 హత్యలు మహాభారతంలో బకాసురుడి కథ అందరికీ తెలిసిందే. అతడికి ఒక ఎడ్ల బండి నిండుగా అన్ని రకాల ఆహార పదార్థాలను పంపేవారు. ఆ ఆహార పదార్థాలను, బండికి కట్టిన ఎద్దుల్ని, బండిని తోలుకొచ్చిన మనిషిని కూడా కరకరానమిలి పారేసేవాడు. ఇలా రోజూ ఎడ్లబండి నిండుగా ఆహార పదార్థాలను నింపి మనిషితో పంపాల్సిందే. భీముడు వెళ్లి బకాసురుడిని సంహరించే వరకు ఈ అరాచకం కొనసాగింది. ఇప్పుడు బకాసురుడి రీతిలోనే చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ రౌడీలు రోజుకొకరిని అత్యంత కిరాతకంగా అంతమొందిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక్క నెల రోజుల్లోనే రాష్ట్రంలో 31 మందిని పచ్చ నేతలు, కార్యకర్తలు దారుణంగా హత్య చేశారు. వీరి దాడులు, వేధింపులను తట్టుకోలేక 35 మంది తమ ప్రాణాలను బలితీసుకున్నారు. ఇవన్నీ ఇప్పటివరకు నమోదైన అధికారిక లెక్కలు. కానీ వాస్తవంగా అంతకుమించిన రాక్షస కాండలో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. టీడీపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగుతున్న దౌర్జన్యకాండ కావడంతో ఫిర్యాదులు చేసేందుకు పలువురు బాధితులు వెనుకంజ వేస్తున్నారు. వీరంతా ఫిర్యాదు చేస్తే మరిన్ని కేసులు వెలుగుచూసేవి.నెల రోజుల్లో వేయికిపైగా దాడులు.. 300 హత్యాయత్నాలుటీడీపీ రౌడీ మూకలు రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసకాండ కొనసాగిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు వ్యాపారులు, సాధారణ ప్రజలపై కర్కశంగా విరుచుకుపడుతున్నారు. నెల రోజుల్లోనే రాష్ట్రంలో 1,050 దాడులకు తెగబడటం టీడీపీ యథేచ్ఛగా కొనసాగిస్తున్న దౌర్జన్యకాండకు నిదర్శనం. వాటిలో 300కుపైగా హత్యాయత్నాలే కావడం గమనార్హం. అంటే టీడీపీ గూండాలు రోజుకు సగటున 100 దాడులు.. 10 హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. ఒక్క ప్రాంతమని లేదు.. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు రాష్ట్రవ్యాప్తంగా రాక్షస కాండను కొనసాగిస్తున్నారు. ఎస్సీ కాలనీలపై దాడులు చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. ఇళ్లు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో చీనీ తోటలను నరికేస్తున్నారు.ఊళ్లు వదిలిపోయిన వేలాది కుటుబాలుటీడీపీ రౌడీమూకలు హత్యాకాండకు తెగబడుతుండటంతో సామాన్యులు ప్రాణభయంతో తమ గ్రామాలు వదిలేసి వెళ్లిపోతున్నారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే 1,500 కుటుంబాలు తెలంగాణకు వెళ్లి తలదాచుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. చిత్తూరు జిల్లాలో దాదాపు 500, అనంతపురం జిల్లాలో 350, శ్రీసత్యసాయి జిల్లాలో 100, అన్నమయ్య జిల్లాలో 120, కర్నూలు జిల్లాలో 135 కుటుంబాలు తమ సొంత ఊళ్లను విడిచిపెట్టేశాయి. వ్యాపారులను కూడా టీడీపీ మూకలు వదిలిపెట్టడం లేదు. నెల రోజుల్లోనే రాష్ట్రంలో 560 ప్రైవేటు ఆస్తులు, 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికే పోలీస్ శాఖ సలాం..డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని పాటించాల్సిన పోలీసు శాఖ నారా లోకేశ్ విరచిత రెడ్‌బుక్ రాజ్యాంగానికే సలాం కొడుతోంది. రెడ్‌బుక్ పేరిట రాష్ట్రంలో హోర్డింగులు పెట్టి మరీ దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసు శాఖ చోద్యం చూస్తోంది. రెడ్‌బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తూ టీడీపీ అరాచకాల అడుగులకు మడుగులొత్తుతోంది. రాష్ట్రస్థాయిలో లోకేశ్‌ను అనుసరిస్తూ నియోజకవర్గ స్థాయిల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తలో రెడ్‌బుక్‌ను తెరపైకి తెచ్చి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తమ హింసాకాండను అడ్డుకుంటే పోలీసుల సంగతి తేలుస్తామని టీడీపీ ప్రభుత్వ పెద్దలు బహిరంగంగానే ప్రకటిస్తుండటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. -
వనవాసంలో పల్నాడు ప్రజలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఏపీలో అధికారమే అండగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు రక్తపుటేర్లు పారించడం తెలిసిందే. ఇప్పుడు అధికారం కూడా తోడవడంతో వారు స్వైరవిహారం చేస్తున్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను ఊరి నుంచి తరిమేశారు. మహిళలు, వృద్ధులు, పిల్లలను సైతం తరిమికొట్టారు. చివరకు పోలీసులు కూడా టీడీపీ నేతలకే వంతపాడుతూ.. వెళ్లిపొమ్మని ఒత్తిడి చేయడంతో గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం వదిలి అజ్ఞాతవాసం చేస్తున్నారు. చెట్టుకొకరు, పుట్టకొకరు మాదిరిగా భయంతో పారిపోయి తలదాచుకుంటున్నారు. ఇలా పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన వందల కుటుంబాలు గెంటివేతకు గురయ్యాయి. రాష్ట్రాన్ని వదిలేసి తెలంగాణకు వలస వెళ్లి అక్కడక్కడ కొందరు అద్దె ఇళ్లు తీసుకొని జీవనం సాగిస్తుండగా మరికొందరు బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఇలా తెలంగాణలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కృష్ణపట్టె ప్రాంతానికి తరలి వచ్చిన కుటుంబాలను కదిలిస్తే ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ.వందల ఇళ్లు ధ్వంసం.. టీడీపీ రెడ్‌బుక్ రాజ్యాంగంలో పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు గ్రామంలో బతకలేని పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్సీపీ వారెవరూ గ్రామంలో ఉండడానికి వీల్లేదని గ్రామంలో దండోరా వేయించారంటే టీడీపీ నేతల దురాగతాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. టీడీపీ గూండాలు దాడులు చేస్తూ అక్కడి ప్రజలను కట్టుబట్టలతో గ్రామాల నుంచి గెంటివేశారు. ఇంకోవైపు కాపాడాల్సిన పోలీసులే ‘మీరు గ్రామంలో ఉండొద్దు.. ఉంటే గొడవలవుతాయి.. కాబట్టి వెళ్లిపోండి’ అంటూ గ్రామస్తులను వేరే చోటకు పంపించివేస్తున్నారు. గ్రామంలో దాదాపు 3,700 కుటుంబాలు ఉంటే ఇప్పటివరకు 1,035 కుటుంబాలను వెళ్లగొట్టినట్లు చెబుతున్నారు. మరోవైపు 150 వరకు తాళాలు వేసి ఉన్న ఇళ్లు, కిటీకీలు పగులగొట్టి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఇళ్లలో ఉన్న బియ్యాన్ని కూడా వదలకుండా పారబోసినట్లు వాపోయారు. గ్రామంలో ఉన్న దాదాపు 7 వేల ఓట్లలో వైఎస్సార్సీపీ కంటే టీడీపీకే 60 ఓట్లు అత్యధికంగా వచ్చినా, అసలు వైఎస్సార్సీపీ సానుభూతిపరులెవరూ గ్రామంలో ఉండడానికి వీల్లేదన్నట్టు వెళ్లగొట్టారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వలస కూలీలుగా బతకాల్సిన దైన్యంగ్రామంలో వైఎస్సార్సీపీ పార్టీ నేతలు, కార్యకర్తల్లో అత్యధికంగా బడుగు, బలహీన వర్గాల వారే. అయినా పేదలనే కనికరం లేకుండా వారిని టీడీపీ నేతలు వెళ్లగొట్టారు. దీంతో గ్రామంలో భూములు ఉండటంతో వ్యవసాయం చేసుకున్న రైతులు ఇప్పుడు వేరే ప్రాంతాలకు వెళ్లి వలస కూలీలుగా బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. మరికొందరు చిన్నాచితకా పనులు చేసుకుంటున్నారు. ఎంపీటీసీగా ఉండొద్దని హుకుం జారీ చేశారు..మాది పిన్నెల్లి గ్రామం. ఎంపీటీసీ భర్తను. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. దీంతో ఎంపీటీసీగా ఉండడానికి వీల్లేదని టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. మా గ్రామ మాజీ సర్పంచ్, టీడీపీ నేత చింతపల్లి అన్ని గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందినవారెవరూ ఉండడానికి వీల్లేదని మమ్మల్ని బయటకు తరిమే శారు. పోలీసులు వారికే కొమ్ముకాస్తున్నారు. – చింతపల్లి పెద్దసైదా (మాస్టర్), వైఎస్సార్సీపీ మండల అధికార ప్రతినిధి, మాచవరంకట్టుబట్టలతో గ్రామం విడిచివచ్చాంటీడీపీ నేతలు మమ్మల్ని వెళ్లగొడితే కట్టుబట్టలతో గ్రామం విడిచివచ్చాం. మాకు వ్యవసా యం తప్ప వేరే పని తెలియదు. దీంతో కుటుంబ సభ్యులతో తెలంగాణలోని కృష్ణపట్టెకు వ చ్చి వ్యవసాయ పనులు చేస్తున్నాం. ఇక్కడే రెండెకరాల పొలం కౌలుకు తీసుకున్నా. కొంత చెల్లించినా మిగతావి కట్టేందుకు డబ్బుల్లేవు. – తొండా సైదు, రైతు, పిన్నెల్లి మా ఇంటిని ధ్వంసం చేశారు.. ఎన్నికల్లో టీడీపీ గెలవగానే మా ఇంటిని క్రేన్‌తో ధ్వంసం చేశారు. బైకును తగలబెట్టారు. బీరువాలో ఉన్న డబ్బులు, బంగారం ఎత్తుకుపోయారు. మాకు 8 ఎకరాల పొలం ఉన్నా ప్రాణభయంతో వచ్చేశాం. మా ఇంటిలో ఉన్న పిల్లల సర్టిఫికెట్లు తీసుకురమ్మని మా బంధువులను పంపితే వారిని కూడా కొట్టి పంపారు. తిరిగి మా పైనే కేసులు పెట్టారు. – గుంటూరు జమీల, పిన్నెల్లి ఆడపిల్లలను బూతులు తిడుతూ బట్టలు తగలబెట్టారు..టీడీపీ వాళ్లు మా ఇంటి తాళాలు పగులగొట్టి సీసాలు పగులగొట్టి ఇంట్లో వేశారు. ఇల్లంతా చిందర వందర చేశారు. మా అమ్మాయిలను బూతులు తిడుతూ బట్టలు తగలబెట్టారు. – గుంటూరు బషీరున్, పిన్నెల్లి -
అన్ని అనుమతులతో పల్నాడు ఆఫీసు నిర్మించాం
-
పల్నాడులో టీడీపీ, జనసేన అరాచకం
-
పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ ఎత్తివేత
-
పల్నాడులో 144 సెక్షన్ ముగిసింది
సాక్షి, నరసరావుపేట: ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో విధించిన 144 సెక్షన్ అమలు ముగిసిందని కలెక్టర్ శ్రీకేశ్ బి. లత్కర్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం నరసరావుపేటలోని కలెక్టరేట్లో ఎస్పీ మలికా గార్గ్, జేసీ శ్యాంప్రసాద్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు జరిగిన ఘర్షణల నేపథ్యంలో జిల్లాలో 28 రోజులు 144 సెక్షన్ అమలు చేశామని, శాంతి భద్రతలు అదుపులోకి రావడంతో ఆ నిబంధన ఎత్తేశామని చెప్పారు. ర్యాలీలు, సమావేశాలకు మాత్రం పోలీసుల అనుమతి తప్పనిసరి అని అన్నారు. కౌంటింగ్ తరువాత జిల్లాలో చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయని, ఆ ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా మళ్లీ ఆంక్షలు విధిస్తామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ సమయంలో గొడవలతో జిల్లాకు మచ్చ పడినప్పటికి, కౌంటింగ్ ప్రశాంతంగా జరిగి జిల్లాకు తిరిగి మంచిపేరు వచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రశాంతంగా కౌంటింగ్ ముగిసిన జిల్లాల్లో పల్నాడు ముందుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగేలా పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్ ప్రక్రియలో 13,739 మంది సిబ్బంది, కౌంటింగ్‌లో 2,136 మంది పాల్గొన్నారన్నారు. ముఖ్యంగా జిల్లాలో 86.5 శాతం ఓటింగ్ నమోదు చేసిన ఓటర్లను ప్రత్యేకంగా అభినందించారు.దాడులకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ మలికా గార్గ్ కౌంటింగ్ ముగిసిన తరువాత జిల్లాలో అక్కడక్కడా గొడవలు జరుగుతున్నాయని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ హెచ్చరించారు. గత రెండు రోజుల్లో గొడవలకు దిగిన వారిపై 46 కేసులు నమోదు చేసి, 140 మందిని అరెస్ట్ చేశామన్నారు. ప్రభుత్వ భవానాలపై రంగులు, విగ్రహాలు నచ్చకపోతే స్థానిక సంస్థలలో తీర్మానాలు చేసి అధికారికంగా మార్చాలని, చట్టాలను చేతుల్లోకి తీసుకోరాదన్నారు. సమస్యాత్మక గ్రామాలలో పోలీస్ పెట్రోలింగ్ కొనసాగుతుందని చెప్పారు. గ్రామాలలో శాంతి కమిటీలు ఏర్పాటు చేసి గొడవలు జరగకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పోలింగ్ సమయంలో జిల్లాలో 168 కేసులు నమోదు చేసి 1,338 మందిని అరెస్ట్ చేశామని, త్వరలో ఛార్జిïÙట్లు వేసి తప్పు చేసిన వారికి శిక్షలు పడేలా చూస్తామని చెప్పారు.