సాక్షి, పల్నాడు: ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల వాతావరణాన్ని దెబ్బ తీసేందుకు తెలుగు దేశం పార్టీ ప్రయత్నిస్తోంది. ఓటమికి ముందుగానే భయపడి.. పోలింగ్‌కు కొన్నిరోజుల ముందు నుంచే దాడుల పర్వానికి దిగింది. ఈ క్రమంలో మాచర్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు దాడికి యత్నించాయి.
పోలింగ్‌బూత్ పరిశీలనకు పిన్నెల్లి వెళ్తున్నారనే సమాచారంతో టీడీపీ శ్రేణులు మాటు వేశాయి. రెంటచింతల మండలం పాల్వాయి గేటు వద్ద టీడీపీ గుండాలు దాడికి దిగారు. కర్రలు.. రాడ్లు.. మారణాయుధాలతో దాడికి దిగారు. ఈ దాడి నుంచి పిన్నెల్లి సురక్షితంగా బయటపడగా, ఆయన తనయుడు గౌతమ్‌రెడ్డికి గాయాలు అయ్యాయి.
అయితే.. పది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తలలు పగిలాయి. అదే సమయంలో పిన్నెల్లి వాహన శ్రేణి పూర్తిగా ధ్వంసం అయ్యింది.
సాక్షి టీవీతో గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ..
ఉదయం నుంచి పాల్వాయి గేట్ ఓటర్లను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ఆ సమాచారం అందుకుని పాల్వాయి గేటు వద్దకు మేం వెళ్ళాం. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు రౌడీలాగా ప్రవర్తిస్తూ మా నాన్నపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. మేం అడ్డుకోవడంతో మమ్మల్ని విచక్షణారహితంగా కొట్టారు. మారణాయుధాలతో దాడి చేశారు. నాతోపాటు కార్యకర్తల తలలు పగిలాయి. మాపై దాడి చేసిన వారిలో టీడీపీ అభ్యర్థి బ్రహ్మ రెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి కూడా ఉన్నారు . ఇంత జరుగుతున్నా కారంపూడి సీఐ నారాయణ స్వామి స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment