ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసపై ప్రత్యేక బృందం(SIT) దర్యాప్తు జెట్ స్పీడ్‌తో ముందుకు సాగుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో టీంను నియమించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే సిట్ బృందం దర్యాప్తు ప్రారంభమైంది.
శుక్రవారం రాత్రి నుంచి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోని 13 మంది అధికారుల బృందం దర్యాప్తులోకి దిగింది. ఈ టీంలో ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్య లత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ వి శ్రీనివాసరావు, డీఎస్పీ రవి మనోహర చారి, ఇన్స్పెక్టర్లు భూషణం, వెంకట రావు, రామకృష్ణ, జిఐ శ్రీనివాస్, మెయిన్, ఎన్ ప్రభాకర్, శివ ప్రసాద్ లు ఉన్నారు.
పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఎన్నికల అనంతర హింస లో పోలీస్ అధికారులు పాత్ర పైనా ఆరాలు తీస్తోంది. ఈ మొత్తం ఘటనలపై ఆదివారం లోగా ఈసీకి సిట్ నివేదిక ఇవ్వనుంది.
ఇంకా 144 సెక్షన్
పోలింగ్ రోజు మధ్యాహ్నం ప్రారంభమైన హింస నాలుగు రోజుల పాటు కొనసాగింది. మాచర్ల, నరసరావుపేట, పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి, తిరుపతిల్లో జరిగిన ఘటనలు స్థానికంగా ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. తాడిపత్రి, సత్తెనపల్లి, జమ్మలమడుగులో పోలీస్ పహారా ఇంకా కొనసాగుతోంది. ప్రధాన పార్టీల ఆఫీస్‌ల ముందు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలీసుల పచ్చపాత వైఖరి
మరోవైపు.. ఏపీలో పోలీసులు పక్షపాత వైఖరిపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పల్నాడు జిల్లాలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేస్తుంటే చూస్తూ ఉండిపోయారు. దాడి చేసిన టీడీపీ నేతలను వదిలేసి.. గొడవలతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్‌సీపీ నేతలను, అలాగే వైఎస్సార్‌సీపీకి ఓటేసిన వాళ్లను పోలీసులు టార్గెట్ చేస్తున్నారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు ఖండిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment