Special Investigation Team
-
సిట్ విచారణకు వచ్చినప్పుడు అంతా ఒకటే మాట చెప్పాలి
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుమల: తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిశాయంటూ ‘కొవ్వు ప్రకటన’ చేసిన సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు షాకివ్వడంతో ఆయన వ్యూహం మార్చారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌ను పక్కనపెట్టిన అత్యున్నత న్యాయస్థానం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యుల బృందానికి విచారణ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ బృందంలో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఇద్దరు, కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ నుంచి ఒకరు ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కొత్త వ్యూహానికి తెరతీశారు. ఇందులో భాగంగా శుక్రవారం తిరుమలలో స్వామివారికి పట్టు వ్రస్తాలు సమర్పించిన సీఎం శనివారం టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘తిరుమల లడ్డూ కోసం వినియోగించిన నెయ్యిపై మన స్టాండ్ ఏమిటో మీకు తెలుసుకదా. సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ బృందం విచారణకు వస్తే అంతా ఒకటే మాట మీద ఉండాలి. ఎవరూ నా మాటకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు. అందరికీ ఈ మేరకు ట్రైనింగ్ ఇవ్వండి. ఆ బృందంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు అనుకూలమైనవారే ఉంటారు. ఆ ఇద్దరు అన్నీ చూసుకుంటారు’ అని ముఖ్య అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు సీఎం చంద్రబాబు తిరుమల పద్మావతి అతిథిగృహంలో ఐదుగురు ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీఐపీ సంస్కృతి తగ్గాలి.. తిరుమలలో గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులను ఆదేశించారు. ఐదుగురు అధికారులతో సమావేశం ముగిశాక ఆయన దేవదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తదితరులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ప్రతిఒక్కరూ పనిచేయాలని ఆదేశించారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు. ప్రశాతంతకు ఎక్కడా భంగం కలగకూడదని, ఏ విషయంలోనూ రాజీ పడొద్దని సూచించారు. భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలని, ముందస్తు ప్రణాళిక చాలా అవసరమన్నారు. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతంపైగా పెంచాలన్నారు. వచ్చిన ప్రతి భక్తుడికి అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలని సూచించారు. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగానే టీటీడీ పనిచేయాలన్నారు. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి సూచించారు. లడ్డూ, అన్న ప్రసాదాల్లో నాణ్యత పెరిగిందని, ఇది ఎల్లప్పుడూ కొనసాగాలని ఆదేశించారు. అలాగే తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని, ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదన్నారు. టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలన్నారు. స్విమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలని ఆదేశించారు. కాగా తిరుమలలో చంద్రబాబు కేంద్రీకృత వకుళమాత వంటశాలను ప్రారంభించారు. పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున ఔటర్ రింగ్ రోడ్డు పక్కన నిర్మించిన అధునాతనమైన ఈ వంటశాలను సుమారు రూ.13.45 కోట్ల వ్యయంతో టీటీడీ నిర్మించింది. 37,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సౌకర్యాలతో దీన్ని నిర్మించారు. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ కొత్త కేంద్రీకృత వంటశాలలో 1.20 లక్షల మంది యాత్రికులకు అన్నప్రసాదాలు అందిస్తారు. సమావేశం కారణంగానే షెడ్యూల్లో మార్పులు..వాస్తవానికి శనివారం ఉదయం 7.35 గంటలకు వకుళమాత వంటశాల ప్రారంభం తర్వాత సీఎం చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉంది. అయితే సీబీఐ నేతృత్వంలో ఏర్పాటు కానున్న సిట్ బృందం తిరుమలకు వచ్చి విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఆయన టీటీడీ ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించారని చెబుతున్నారు.టీటీడీ అధికారులు, మార్కెటింగ్ సిబ్బందిని సిట్ ఏమడుగుతుంది? ఏం సమాధానం చెప్పాలి? ఎలా స్పందించాలి? అనే విషయాలపై సీఎం చంద్రబాబు ముఖ్య అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు టీటీడీ ఉన్నతాధికారులు సిబ్బందికి కూడా దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.ఎమ్మెల్యే డిక్లరేషన్‌పై వివాదంచిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ శుక్రవారం శ్రీవారి దర్శనం సందర్భంగా ఇచ్చిన డిక్లరేషన్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. స్వామి వారి దర్శనానికి వెళ్లే సమయంలో తాను క్రిస్టియన్‌ను అని, శ్రీవారిపై విశ్వాసం ఉందంటూ ఎమ్మెల్యే డిక్లరేషన్ ఇచ్చారు. క్రిస్టియానిటీ తీసుకుంటే.. ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని, బీసీ కేటగిరీలోకి వస్తారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన జీడీ నెల్లూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే థామస్‌పై అనర్హత వేటు వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తనకు తానుగా తిరుమలలో క్రిస్టియన్‌గా డిక్లరేషన్ ఇచ్చాక ఎస్సీ రిజర్వేషన్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నిస్తున్నారు. -
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై సీబీఐ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘సిట్’ను పక్కనపెట్టిన సుప్రీంకోర్టు
-
తప్పు చేసిన బాబు క్షమాపణ చెప్పాలి
ఇంత స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశించినా.. చంద్రబాబులో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. ఆయనకు వ్యక్తిత్వం ఉంటే ముందు ప్రజలను క్షమాపణ కోరాలి. తర్వాత స్వామి వారిని వేడుకోవాలి. నిజానికి సుప్రీంకోర్టు ఎవరిని తప్పు పట్టింది? ఎవరు దేవుడి దగ్గర దోషిగా నిలబడాలి? మన ఖర్మ ఏమిటంటే.. చంద్రబాబు వంటి అన్యాయమైన నాయకుడు మనకున్నాడు. రాబోయే రోజుల్లో బాబు పాపం.. దేవుడి కోపం రాష్ట్ర ప్రజలపై పడకూడదు. అది చంద్రబాబుకే పరిమితం కావాలి. ఆయన మాట్లాడింది పచ్చి అబద్ధం అని తెలిసినా ఆయన్ను మోస్తున్న కూటమికి, ఆ నాయకులకే దేవుడి కోపం పరిమితం కావాలని దేవుణ్ని వేడుకుంటున్నాను. ఇవన్నీ వెలుగులోకి వచ్చాయంటే దేవుడి దయతోనే. వేంకటేశ్వరస్వామే నడిపిస్తారు. ఆయనే వారికి మరిన్ని మొట్టికాయలు వేస్తాడు. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే అంశంపై దాఖలైన వ్యాజ్యంపై శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టులో శుక్రవారం, సెపె్టంబరు 30న జరిగిన పరిణామాలను గమనిస్తే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని, రాజకీయ దుర్బుద్ధితో రెచ్చగొడుతున్నారనేది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది కాబట్టే ఘాటైన వ్యాఖ్యలు చేసిందన్నారు. దేవుణ్ని రాజకీయాల్లోకి లాగొద్దని.. పొలిటికల్ డ్రామాలు చేయెద్దంటూ చంద్రబాబుకు మొట్టికాయులు వేసిందన్నారు. చంద్రబాబు స్వయంగా వేసుకున్న ‘సిట్’ను కూడా రద్దు చేసిందని చెప్పారు. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు.. వారికి సహకారం అందించడానికి రాష్ట్ర పోలీసు శాఖ నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి ఒక అధికారి సభ్యులుగా స్వతంత్ర దర్యాప్తు బృందం(సిట్)ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిందన్నారు. దేవుడంటే భయం, భక్తి ఉంటే తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని చంద్రబాబును వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. చేసిన తప్పుకు క్షమించాలని తిరుమల శ్రీవారి పాదాల చెంత వేడుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. చంద్రబాబుకు భయం, భక్తి లేవు తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను రాజకీయ దుర్బుద్ధితో.. కావాలని అబద్దాలు చెప్పి, జంతువుల కొవ్వు వాడి లడ్డూలు తయారు చేసి భక్తులకు ఇస్తే, వారవి తిన్నట్లు సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేశారు. అలా ఆయన తిరుమల లడ్డూను, శ్రీవెంకటేశ్వరస్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను అపవిత్రం చేశారు. వీటన్నింటికీ సంబంధించి నేను సాక్ష్యాధారాలతో సహా చూపించాను. కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని దెబ్బ తీస్తూ, చంద్రబాబు ఎలా అబద్ధాలు చెప్పాడనేది చూస్తే.. చంద్రబాబు సీఎం అయ్యాక, తను నియమించుకున్న ఐఏఎస్ అధికారి, టీటీడీ ఈవో చంద్రబాబు ప్రకటనలకు విరుద్ధంగా స్వయంగా ప్రకటనలు చేశారు. చంద్రబాబు మామూలుగా మంచి వ్యక్తి అయితే, ఇన్ని ఆధారాలు కనిపిస్తుంటే, కొద్దో గొప్పో సిగ్గు పడాలి. తన మాటలకు వ్యతిరేకంగా ఇన్ని సాక్ష్యాధారాలు కనిపించినప్పుడు, దేవుడంటే భయం, భక్తి ఉన్న వారెవరైనా పశ్చాత్తాప పడతారు. ప్రజలకు క్షమాపణ చెబుతారు. కానీ చంద్రబాబుకు పశ్చాత్తాపం ఉండదు. ఆయనకు దేవుడంటే భయం, భక్తి రెండూ లేవు.ప్రధానికి లేఖ.. ‘సుప్రీం’లో పిటిషన్ ఒక అబద్ధానికి రెక్కలు కట్టి గోబెల్స్ ప్రచారంలో భాగంగా రాజకీయ దురుద్దేశంతో అబద్ధాలు ఆడి, తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాశస్త్యం, లడ్డూ విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు అన్న మాటలపై మేము ప్రధానికి లేఖ రాశాం. సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించాం. సుప్రీంకోర్టు సైతం ఈ కేసు వినేటప్పుడు.. కోర్టులో న్యాయమూర్తులు ఎలా స్పందించారో ఒకసారి గుర్తు చేసుకొండి (గత సోమవారం సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా న్యాయమూర్తులు ఏమన్నారన్నది చదివి వినిపించారు). ఇవన్నీ నేషనల్ మీడియాలో రిపోర్ట్ అయ్యాయి. ఆ రోజు (గత నెల 30న) సుప్రీంకోర్టు ఇంకా చాలా చెప్పింది. (వాటిని ప్రస్తావిస్తూ.. ఆ కాపీ స్లైడ్‌లో చూపారు) సీఎం చంద్రబాబును ఆక్షేపిస్తూ, సుప్రీంకోర్టు స్వయంగా ఈ వ్యాఖ్యలు చేసింది. తప్పులను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్ సెప్టెంబర్ 25న రిజిస్టర్ చేస్తే.. అంతకు ముందే సెప్టెంబరు 18న ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చారు. సిట్ ఏర్పాటైంది సెప్టెంబరు 26న అయితే.. అంతకన్నా ముందే ఎలా ప్రకటన ఇచ్చారని సుప్రీంకోర్టు ప్రశి్నంచింది. సీఎం బహిరంగ వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తీస్తుందని చెప్పింది. ఇన్ని రకాలుగా చంద్రబాబును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. మళ్లీ ఇవాళ కూడా న్యాయస్థానం కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు చేసిన తప్పును ఎత్తి చూపింది. చంద్రబాబు తాను స్వయంగా ఏర్పాటు చేసుకున్న సిట్ ను రద్దు చేస్తూ.. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర అధికారులు సహాయ పడతారని చెబుతూ వీరికి తోడు ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి ఒకరు నియమితులవుతారని.. వీరందరూ లడ్డూకు సంబంధించిన విషయంపై నివేదిక ఇస్తారని ఆదేశించింది. అయినా అన్ని సాక్ష్యాదారాలను ప్రజల ముందు ఉంచాం. సుప్రీంకోర్టుకూ అందజేశాం. రేపు విచారణలో ఇదే స్పష్టమవుతుంది.గత నెల 30న సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలివి» కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పినా, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? » ఆధారాలు లేకపోయినా సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడుతారు? » ఒకవైపు విచారణ జరుగుతుండగా.. ఆ వ్యాఖ్యలతో సిట్ ప్రభావితం కాదా? » తమ నివేదిక తప్పు కావచ్చని స్వయంగా ఎన్డీడీబీ రిపోర్టులోనే రాశారు కదా? » ఎన్డీడీబీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అదొక్కటే కాదు దేశంలో ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి కదా? » ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈవో ప్రకటన ఉంది. సీఎం చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తునకు ఆదేశించినప్పుడు పదాల గారిడీ ఎంత మాత్రం అవసరం లేదు. ఎన్డీడీబీ నివేదిక జూలైలో వస్తే దానిపై ముఖ్యమంత్రి ఎందుకు సెపె్టంబరులో మాట్లాడినట్లు? » జూలైలోనే ఎందుకు మాట్లాడలేదు? » మీడియాతో మాట్లాడ్డానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైనదని సీఎం భావించలేదా? » అసలు బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి? దాని వల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా? అది కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తుందని తెలియదా? » సిట్ ఏర్పాటు చేసినా, ఇంకా కల్తీ నెయ్యిపై ప్రకటన ఎలా చేస్తారు? మీడియాతో ఎలా మాట్లాడతారు? -
సుప్రీం అక్షింతలు.. దర్యాప్తు నిలిపివేసిన సిట్
సాక్షి,తిరుపతి: టీటీడీ నెయ్యికల్తీ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు నిలిపివేసింది. లడ్డూ వివాదంపై సోమవారం(సెప్టెంబర్30) సుప్రీంకోర్టులో జరిగిన విచారణ నేపథ్యంలో సిట్ దర్యాప్తు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. నెయ్యి కల్తీపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కొనసాగించాలా లేక వేరే సంస్థతో దర్యాప్తు చేయించాలా అన్న విషయంలో సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది. దీంతో లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే దాకా సిట్ తన దర్యాప్తును నిలిపివేసింది. తిరుపతి లడ్డూ తయారీలో వాడే నెయ్యికల్తీ అయిందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డితో పాటు సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: సుప్రీం వ్యాఖ్యలు బాబుకు చెంపపెట్టుకాగా, నెయ్యి కల్తీ వ్యవహారంపై సిట్ మూడు రోజులపాటు దర్యాప్తు చేసింది. కల్తీపై ఫిర్యాదులో జాప్యం ఎందుకు జరిగింది అనే అంశంతో పాటు పలు కీలక విషయాలపై టీటీడీ అధికారుల నుంచి సిట్ సమాచారం రాబట్టింది. టీటీడీ మార్కెటింగ్, ప్రొక్యూర్మెంట్ జీఎం కార్యాలయంలోనూ తనిఖీలు చేసింది. -
ఇక చంద్రబాబు కోరినట్టే సిట్ నివేదిక: ఎంపీ విజయసాయి రెడ్డి
సాక్షి, ఢిల్లీ: లడ్డూ ప్రసాదం వివాదంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సిట్ చంద్రబాబు కోరుకున్నట్టు గానే నివేదిక ఇస్తుందని చెప్పుకొచ్చారు.ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ టీడీపీ నిరాధారమైన ఆరోపణలు చేసింది. ఆ నిరాధార ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన సిట్ పూర్తిగా టీడీపీ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఈ కమిటీ స్వతంత్రంగా పూర్తిస్థాయిలో విచారిస్తుందన్న నమ్మకం లేదు. చంద్రబాబు కోరుకున్నట్టుగానే ఆ నివేదికను సిట్ ఇస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. The Special Investigation Team (SIT) formed to probe TDP’s unfounded allegations of adulteration in the sacred Tirupati temple laddus is entirely controlled by the TDP government. Led by a police officer and with two additional police members, this committee lacks any real…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 25, 2024ఇది కూడా చదవండి: సిట్.. బాబు స్కిట్ -
ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ ప్రభాకర్‌రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అమెరికాలో ఉన్న ఆయన్ని భారత్‌కు రప్పించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఇంటర్‌పోల్‌కు సీబీఐ లేఖ రాసింది.తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ప్రభాకర్‌రావు ఉన్న సంగతి తెలిసిందే. ఎస్ఐబీ మాజీ చీఫ్ అయిన ప్రభాకర్‌రావు.. ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన టైంలోనే విదేశాలకు వెళ్లిపోయారు. విచారణ నిమిత్తం రావాలన్నా.. సహకరించడం లేద దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసు జారీకి సీబీఐ అనుమతి ఇచ్చింది. తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, విచారణ నుంచి తనకు ఊరట కావాలని ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ.. నాంపల్లి కోర్టు అందుకు అనుమతించలేదు. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో సిట్, తెలంగాణ సీఐడీ సాయంతో సీబీఐని ఆశ్రయించింది. దీంతో.. జాతీయ దర్యాప్తు సంస్థ రెడ్ కార్నర్ నోటీసు జారీకి సీబీఐ అనుమతించింది. ప్రభాకర్‌రావుతో పాటు ఐన్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్‌పైనా రెడ్ కార్నర్ నోటీసులకు అనుమతి జారీ చేసింది. త్వరలో ఇంటర్‌పోల్ వీళ్లిద్దరినీ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయనుంది. అదే జరిగితే.. వాళ్లను భారత్‌కు రప్పించడం సులువు అవుతుంది. -
ప్రభాకర్‌రావును రప్పించేందుకు రెడ్‌కార్నర్ నోటీసులు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న మాజీ ఐపీఎస్‌లు ప్రభాకర్‌రావు, శ్రవణ్ రావుల మీద రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. సీబీఐ సాయంతో తెలంగాణ సీఐడీ ఈ నోటీసుల్ని జారీ చేయించింది. తద్వారా ఇంటర్‌పోల్ ద్వారా వాళ్లను స్వదేశానికి రప్పించాలని చూస్తోంది.ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్‌రావు అరెస్ట్ అయిన వెంటనే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు విదేశాలకు వెళ్లిపోయారు. ఈ కేసును విచారించిన ప్రత్యేక బృందం(సిట్).. ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా ప్రభాకర్‌రావు కనుసైగల్లోనే ట్యాపింగ్ వ్యవహారమంతా జరిగిందని నిర్ధారించుకుంది. ఏ1గా ప్రభాకర్‌రావు పేరును చేర్చింది. అటుపై ఆయన అమెరికాలో ఉన్నట్లు గుర్తించింది. అయితే..ఈలోపు ప్రభాకర్‌రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్లు, లుక్ అవుట నోటీసులు జారీ అయ్యాయి. అయితే తనకు ఆరోగ్యం బాగోలేదని, ఇప్పట్లో హైదరాబాద్ రాలేనని ప్రభాకర్‌రావు బదులు పంపించారు. కావాలంటే వర్చువల్‌గా విచారణకు హాజరవుతానని తెలియజేశారు. ప్రభాకర్‌రావు పంపిన లేఖను పోలీసులు నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఆ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభాకర్‌రావుతో పాటు ఈ కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ కుమార్‌ను కూడా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే శ్రవణ్ ఆచూకీని గుర్తించలేకపోయామని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. దీంతో ఏపీ సీఐడీ సాయంతో సీబీఐ ద్వారా ప్రభాకర్‌రావు, శ్రవణ్ మీద రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయించింది సిట్. ఏ1గా ఉన్న ప్రభాకర్‌రావును విచారిస్తే కీలక విషయాలు బయటకు వస్తాయని దర్యాప్తు బృందం భావిస్తోంది. ఎలాగైనా ఆయన్ని భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇంటర్‌పోల్ సాయం కోరే ప్రయత్నాల్లో ఉంది. త్వరలో ప్రత్యేక దర్యాప్తు అధికారుల బృందం అమెరికాకు వెళ్లే అవకాశం కూడా ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు.ఇదిలా ఉంటే.. గతంలోనే ప్రభాకర్‌రావు మీద రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఆ టైంలో అధికారులు అదంతా ఉత్తదేనని తేల్చారు.రెడ్ కార్నర్ నోటీసులు.. ఇతర దేశాలకు పరారైన నిందితుల్ని కోర్టు విచారణ కోసం రప్పించేందుకు లేదంటే దోషుల శిక్ష అమలు కోసం రప్పించేందుకు జారీ చేసే నోటీసులు రెడ్ కార్నర్ నోటీసులు. ప్రపంచంలో ఉన్న 195 దేశాల జాతీయ దర్యాప్తు సంస్థల ఒప్పందం మేరకే ఈ వ్యవహారం నడుస్తుంది. ఇందుకోసం ఇంటర్‌పోల్ మధ్యవర్తితత్వం వహిస్తుంది. భారత్‌లో సీబీఐ సంస్థ రెడ్ కార్నర్ నోటీసుల జారీ, నిర్వహణను చూసుకుంటుంది. -
సిట్ నివేదిక: టీడీపీకి కొమ్ముకాసిన అధికారుల్లో టెన్షన్
సిట్ ప్రాధమిక నివేదికపై కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు ఎలా ఉంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల వెనుక పోలీసు వైఫల్యాన్ని సిట్ బట్టబయలు చేసింది. విధి నిర్వహణలో కొందరు పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ తన ప్రాధమిక నివేదికలో పేర్కొంది. ఈ నేపధ్యంలో సిట్ నివేదిక ఆధారంగా పోలీసులపైనా కేసులు నమోదు చేసి విచారణ జరపాలని ఎన్నికల సంఘం ఆదేశించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికల అనంతర ఘర్షణలపై సిట్ ప్రాధమిక నివేదిక.. ఇపుడు పోలీసుల మెడకు చుట్టుకోబోతోంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ రెండు రోజుల పాటు విచారణ జరిపి డీజీపీ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రాధమిక నివేదిక పంపారు. ఈ మూడు జిల్లాలలో 33 ప్రధాన సంఘటనలపై క్షేత్రస్ధాయిలో విచారణ జరిపారు. పల్నాడు జిల్లాలోని గురజాల, నరసారావుపేట, మాచర్ల నియోజకవర్గాలలో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక పోలీసు అధికారుల వైఫల్యాన్ని సిట్ గుర్తించింది. ముఖ్యంగా నరసారావుపేట, మాచర్ల నియోజకవర్గాలలోని 18 కేసులలో 474 మంది నిందితులుంటే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడాన్ని సిట్ తీవ్రంగా పరిగణించింది. ఇందులో 307 మంది నిందితులను గుర్తించాల్సి ఉందని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారుల స్టేట్ మెంట్ ని కూడా సిట్ సీరియస్ గా తీసుకుంది. ఇక తాడిపత్రిలో ఏకంగా పోలీసులు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి సీసీ కెమెరాలను ద్వంసం చేయడం వెనుక కారణాలను సిట్ విశ్లేసించింది. ఈ మూడు జిల్లాలలో జరిగిన 33 హింసాత్మక ఘటనల్లో దాదాపు 1370 మంది నిందితులుంటే కేవలం 124 మందినే అరెస్ట్ చేయడంపై పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ అభిప్రాయపడింది. ఇదే సమయంలో పల్నాడు లాంటి జిల్లాలలో కొందరు పోలీసు అధికారులు టీడీపీ నేతల దగ్గర లంచాలు తీసుకుని తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాశారని.. కొన్ని చోట్ల పోలింగ్ బూత్ లలో ఓటర్లని రానివ్వకుండా టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని వైఎస్సార్సీపీ ఇప్పటికే ఈసీకి, డీజీపీ, సిట్ కు కూడా ఫిర్యాదులు చేసింది. పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం కొత్తగణేషునిపాడులో ఎస్సీ, ఎస్టీలపై ఎన్నికల తర్వాత టీడీపీ నేతలు దాడులు చేయడంతో వారంతా ఊళ్లు వదిలి వెళ్లిపోయారు. ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో కూడా మైనార్టీలు టీడీపీ దాడులతో గ్రామం విడిచి కుటుంబాలతో సహా వెళ్లిపోయారు. ఇంత జరిగినా ఆయా గ్రామాలలో జరిగిన ఘటనలపై పోలీసులు పూర్తిస్ధాయిలో కేసులు నమోదు చేయలేదు. అరెస్ట్ లు కూడా చేయలేదు. పైగా టీడీపీ దాడులతో భీతిల్లి గ్రామాలు విడిచివెళ్లిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలైన ఆ బాదితులపైనే పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని సిట్ గుర్తించింది. మరోవైపు నరసారావుపేట టీడీపీ అభ్యర్ధి చదలవాడ అరవిందబాబు పోలింగ్ రోజు ఇతర ప్రాంతాల నుంచి గూండాలని రప్పించి వైఎస్సార్సీపీ అభ్యర్ధి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడులు చేయడం, అక్కడున్న కార్లపై కర్రలు, రాళ్ల దాడిచేయడం, ఇంటిని ద్వంస చేసారు.అడ్డుకునే ప్రయత్నం చేసిన గోపిరెడ్డి మామ కంజుల కోటిరెడ్డిపైనా హత్యాయత్నానికి పాల్పడ్డారు.ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు టీడీపీ అభ్యర్ధి అరవిందబాబుని అరెస్ట్ చేయలేదు. పోలింగ్ తర్వాత పెట్రో బాంబులు, రాడ్లు, కర్రలు, గాజుసీసాలు వంటి మారణాయుదాలతో టీడీపీ నేతలు దొరికినా కూడా పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని పోలీసులని సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.ఈ నేపధ్యంలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలలో పోలీసులు దర్యాప్తు సరిగ్గా చేయలేదని సిట్ ప్రాధమిక నివేదికలో పేర్కొంది. సీరియస్ ఘటనలలో సైతం కొందరు పోలీసులు తూతూ మంత్రంగా దర్యాప్తు చేసి బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేశారని...కోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు నమోదు చేయాలని సిట్ ప్రాధమిక నివేదికలో పేర్కొంది.రాళ్లు, కర్రలు, పెట్రో బాంబులు వంటి వాటితో దాడుల జరగాలంటే ముందుగానే వాటిని సేకరించి ఉంటారని...ఇందుకోసం ముందస్తుగానే ప్రిపేర్ అయ్యారని..ప్రీ ప్లాన్ గానే ఈ దాడులు జరిగాయని సిట్ భావించింది. ఈ ఘటనలలో పోలీసుల వైఫల్యాలని సిట్ సీరియస్ గానే తీసుకున్నట్లు కన్పిస్తోంది.వైఎస్సార్సీపీ ఆరోపణలకి తగ్గట్లుగా పోలీసులు టీడీపీకి కొమ్ముకాయడాన్ని సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్, పల్నాడు ఎస్పీ బిందుమాధవ్ తో పాటు సంఘటనలు జరిగిన మూడు జిల్లాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 12 మంది పోలీసులని సస్పెన్షన్ చేయడంతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇద్దరు ఎస్పీలతో పాటు 12 మంది పోలీసు అధికారులకు 15 రోజులలో సమాధానం ఇవ్వాలని నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో పాటు శాఖాపరంగానూ విచారణ ప్రారంభం కానుంది.మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘానికి సిట్ ప్రాధమిక నివేదిక చేరడంతో తదుపరి చర్యలు ఎలా ఉంటాయోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల రోజు.. ఆ తర్వాత ఘటన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పటకే ప్రాధమిక చర్యలు తీసుకోవడంతో సిట్ పూర్తి స్ధాయి నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయనే మరో వాదన కూడా ఉంది. రెండు రోజుల పాటు విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇచ్చిన సిట్ ఇపుడు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. సిట్ ఆదేశాల మేరకు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఇప్పటికే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆయా జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. ఈ నేపధ్యంలో ఇంకా అరెస్ట్ కాకుండా ఉన్న దాదాపు 1,200 మందికి పైగా నిందితులకు సంకెళ్లు వేసే పనిలో పోలీసులు పడ్డారు. నిందితుల అరెస్ట్ తో పాటు దర్యాప్తు కూడా వేగవంతంగా కొనసాగాల్సి ఉండటంతో ప్రస్తుతానికి ఈసి కూడా సిట్ పూర్తిస్ధాయి నివేదిక కోసం వేచిచూడవచ్చంటున్నారు.ఒకవేళ ప్రాధమిక నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకోవాలని భావిస్తే మాత్రం సస్పెండ్ అయిన ఇద్దరు ఎస్పీలు, 12 మంది పోలీసు అధికారులతో కొందరిపై కేసులు నమోదుకు ఆదేశించవచ్చంటున్నారు.కేసులు నిరూపణ జరిగితే సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం లేదా జైలు శిక్ష లేదంటే రిటైర్ తర్వాత పెన్షన్ రాని పరిస్ధితులు ఉంటాయని చెబుతున్నారు. అదే జరిగితే పోలీసులపై కేసు సంచలనంగా మారే అవకాశాలున్నాయి. మొత్తంగా టీడీపీకి కొమ్ముకాసిన పోలీసులకి ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో కంటిమీద కునుకు లేకుండా పోయింది. -
AP: అంతా ప్రీ ప్లాన్డ్‌గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
సాక్షి, విజయవాడ: ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై డీజీపీకి ఇచ్చిన సిట్ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 150 పేజీల ప్రాథమిక నివేదికను సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ డీజీపీకి అందజేశారు. సిట్ ప్రాథమిక నివేదికలో పోలీసుల వైఫల్యాలు బయటపడ్డాయి. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు చేపట్టింది. నాలుగు బృందాలుగా మూడు జిల్లాల్లో పర్యటించిన సిట్.. 33 ఘటనలలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, సీసీ కెమెరాలను పరిశీలించింది.ఈ అల్లర్లలో 1370 మంది నిందితులకు 124 మందినే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 639 మంది నిందితులను ఇంకా గుర్తించాల్సి ఉందని సిట్ పేర్కొంది. 1100 మందిని ఇంకా అరెస్ట్ చేయకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన సిట్.. దర్యాప్తులో పోలీస్ శాఖ వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించింది.రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించిన సిట్.. రెండు గ్రూపుల మధ్య రాళ్ల దాడులు మరణాలకి కారణమయ్యాయని పేర్కొంది. ప్లీ ప్లాన్డ్‌గానే రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్లు గుర్తించింది. దాడులను ముందస్తుగా ఊహించడంలో అధికారులు విఫలమయ్యారని సిట్ నివేదిక పేర్కొంది.ఎన్నికలకి ముందు పోలీస్ అధికారుల బదిలీలే ఘటనలకు కారణంగా సిట్ నివేదికలో వెల్లడించింది. పరారీలో ఉన్న వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలని సూచించిన సిట్.. కోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు జోడించాలని పేర్కొంది. సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను డీజీపీ ఆదేశించారు. -
ఏపీ పోలింగ్ ఘటనలు: డీజీపీకి సిట్ ప్రాథమిక నివేదిక అందజేత
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక విచారణ బృందం(సిట్) నేటితో ముగియనుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు సిట్ ఇన్చార్జి.. ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నివేదికను అందజేశారు. 150 పేజీల ప్రాధమిక నివేదికను డీజీపీకి అందజేశారు. ఈ నివేదకను డీజీపీ.. ఈసీకి పంపనున్నారు. కాగా రాష్ట్రంలో న్నికల అనంతరం హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు సిట్ విచారించిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు నాలుగు బృందాలుగా క్షేత్రస్థాయిలో పర్యటించింది సిట్. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో పర్యటించిన సిట్ బృందాలు.. హింసాత్మక ఘటనలకు కారణాలను విశ్లేషిస్తూ ప్రాథమిక నివేదిక రూపొందించింది. అయితే రెండ్రోజుల్లో సమాచార సేకరణకే సమయం సరిపోవడంతో లోతైన దర్యాప్తు కోసం గడువు పొడిగించాలని సిట్ బృందం డీజీపీని కోరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల పరిధిలోని పీఎస్‌లలో నమోదు అయిన 33 ఎఫ్ఐఆర్లను సిట్ పరిశీలించింది. వీటి ఆధారంగా 300 మందిని ఈ హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్లు నిర్ధారించుకుంది. ఇందులోనూ 100 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు.. పరారీలో ఉన్న మిగతా వాళ్ల కోసం పోలీస్ బలగాలు గాలింపు చేపటినట్లు సిట్ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. అదే సమయంలో పోలీసులకు సిట్ బృందాలు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.ఇక క్షేత్రస్ధాయి పర్యటనలో కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ బృందాలు.. సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం క్షుణ్ణంగా పరిశీలించింది. హింసాత్మక ఘటనలు ముందస్తుగా ఊహించడంలో పోలీస్ఉన్నతాధికారుల వైఫల్యంపైనా పరిశీలన చేసింది. సస్పెండ్ అయిన పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ల పనితీరుపైనా సిట్ అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. హింసాత్మక ఘటనల సమయంలో పోలీసుల ఉదాసీనతపైనా నివేదిక అందించింది. నేర స్వభావం కలిగిన వ్యక్తులని పూర్తిస్ధాయిలో బైండోవర్ చేయడంలో విఫలమయ్యారని ఆరోపించింది. ప్లీప్లాన్గానే హింసాత్మక ఘటనలు జరిగాయని, కర్రలు, రాళ్లు వంటివి ముందుగానే సిద్దం చేసుకోవడం ద్వారా హింసికు పాల్పడ్డారని సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠఈసీ ఆదేశాలనుసారం సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం సిట్‌కు పూర్తి అధికారులు అప్పగించింది. రెండ్రోజుల గడువులో క్షేత్రస్థాయి సమాచార సేకరణ మాత్రమే చేపట్టింది. ప్రధాన ఘటనలకు సంబంధించిన దర్యాప్తును మాత్రమే సిట్ సమీక్షించింది. అయితే ఈ అల్లర్ల వెనుక ఉన్న కుట్రను చేధించాలన్నా.. హింసకు కారణమైన రాజకీయ పెద్దలను గుర్తించాలన్నా పూర్థిస్తాయిలో దర్యాప్తు అవసరం. అందుకే గడువు పొడిగించాలని సిట్ ఇన్చార్జి వినీత్ బ్రిజ్‌లాల్ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే డీజీపీ ప్రాథమిక నివేదికను ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది. దీంతో ఈసీ సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందా? లేదంటే పూర్తిస్థాయి దర్యాప్తు నివేదిక వచ్చేదాకా ఎదురు చూస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. -
ఇవాళే డీజీపీకి నివేదిక.. సిట్ పొడిగింపు?
విజయవాడ, సాక్షి: రాష్ట్రంలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక విచారణ బృందం(సిట్) ఇవాళ్టితో ముగియనుంది. సోమవారం సాయంత్రం రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు సిట్ ఇన్చార్జి.. ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నివేదికను సమర్పించనున్నారు. అయితే రెండ్రోజుల్లో సమాచార సేకరణకే సమయం సరిపోవడంతో లోతైన దర్యాప్తు కోసం గడువు పొడిగించాలని సిట్ బృందం డీజీపీని కోరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ‘‘హింసాత్మక ఘటనలపై ఈసీకి ఇవాళ నివేదిక ఇస్తాం. నాలుగు జిల్లాల్లో టీమ్‌లు దర్యాప్తులో ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు చెప్పి.. కొన్ని కేసుల్లో అదనపు సెక్షన్లు చేరుస్తాం. అలాగే కొంతమంది నిందితులను గుర్తించాం. నేటి నుంచి దర్యాప్తును పర్యవేక్షిస్తాం’’ అని సిట్ ఇన్చార్జి వినీత్ బ్రిజ్‌లాల్ ఓ మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా వ్యాఖ్యానించారు. సిట్ ఇలా.. ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా జరిగింది. నాలుగు బృందాలుగా విడిపోయిన సిట్ సభ్యులు.. అలర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు. పల్నాడులో అడిషనల్ ఎస్పీ సౌమ్యలత నేతృత్వంలో రెండు బృందాలు, తిరుపతి చంద్రగిరిలో ఒక టీం, అనంతపురం తాడిపత్రిలో మరో టీం పర్యటించింది. డీఎస్పీ ఆద్వర్యంలో ఇద్దరు సీఐలతో ప్రతీ బృందం క్షేత్రస్ధాయిలో సమాచార సేకరణ చేపట్టింది. అదే సమయంలో.. వినీత్ బ్రిజ్‌లాల్, ఐజీ (సిట్ ఇన్‌ఛార్జి)రమాదేవి, ఏసీబీ ఎస్పీసౌమ్యలత, ఏసీబీ అదనపు ఎస్పీరమణమూర్తి, శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీపి.శ్రీనివాసులు, సీఐడీ డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు, ఒంగోలు ఏసీబీ డీఎస్పీ రవి మనోహరచారి, తిరుపతి ఏసీబీ డీఎస్పీవి.భూషణం, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (గుంటూరు రేంజ్) కె.వెంకటరావు, ఇన్స్పెక్టర్(ఇంటెలిజెన్స్), విశాఖపట్నంరామకృష్ణ, ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌జీఐ శ్రీనివాస్, ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌మోయిన్, ఇన్స్పెక్టర్, ఒంగోలు పీటీసీఎన్.ప్రభాకర్, ఇన్స్పెక్టర్, అనంతపురం ఏసీబీశివప్రసాద్, ఇన్స్పెక్టర్, ఏసీబీసిట్ హెడ్ క్వార్టర్స్‌లో ఉంటూ ఎప్పటికపుడు నాలుగు బృందాల నుంచి సమాచారాన్ని తీసుకుని నివేదిక సిద్దం చేసే పనిని మరో అదనపు ఎస్పీకి అప్పగించారు. మొత్తంగా.. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల పరిధిలోని పీఎస్‌లలో నమోదు అయిన 33 ఎఫ్ఐఆర్లను సిట్ పరిశీలించింది. వీటి ఆధారంగా 300 మందిని ఈ హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్లు నిర్ధారించుకుంది. ఇందులోనూ 100 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు.. పరారీలో ఉన్న మిగతా వాళ్ల కోసం పోలీస్ బలగాలు గాలింపు చేపటినట్లు సిట్ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. అదే సమయంలో పోలీసులకు సిట్ బృందాలు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.ఇక క్షేత్రస్ధాయి పర్యటనలో కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ బృందాలు.. సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం క్షుణ్ణంగా పరిశీలించింది. అదే సమయంలో పోలీస్ ఉన్నతాధికారుల వైఫల్యంపైనా పరిశీలన చేసింది. సస్పెండ్ అయిన పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ల పనితీరుపైనా సిట్ అనుమానాలు వ్యక్తం చేసినట్లుసమాచారం. ఇక సిట్ బృందాలకు వైఎస్సార్సీపీ, టీడీపీలు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నాయి. టీడీపీ శ్రేణులు ఘర్షణలకి దిగడానికి ఈ ఇద్దరి ఎస్పీల వైఫల్యమే కారణమంటూ ఇప్పటికే ఈసీకి, సిట్ బృందాలకి కూడా YSRCP ఫిర్యాదు చేసింది. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠఈసీ ఆదేశాలనుసారం సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం సిట్‌కు పూర్తి అధికారులు అప్పగించింది. రెండ్రోజుల గడువులో క్షేత్రస్థాయి సమాచార సేకరణ మాత్రమే చేపట్టింది. ప్రధాన ఘటనలకు సంబంధించిన దర్యాప్తును మాత్రమే సిట్ సమీక్షించింది. అయితే ఈ అల్లర్ల వెనుక ఉన్న కుట్రను చేధించాలన్నా.. హింసకు కారణమైన రాజకీయ పెద్దలను గుర్తించాలన్నా పూర్థిస్తాయిలో దర్యాప్తు అవసరం. అందుకే గడువు పొడిగించాలని సిట్ ఇన్చార్జి వినీత్ బ్రిజ్‌లాల్ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే డీజీపీ ప్రాథమిక నివేదికను ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది. దీంతో ఈసీ సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందా? లేదంటే పూర్తిస్థాయి దర్యాప్తు నివేదిక వచ్చేదాకా ఎదురు చూస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. -
AP: సిట్ దూకుడు.. అజ్ఞాతంలోకి టీడీపీ నేతలు!
సాక్షి, విజయవాడ: ఏపీలో ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఘటనలపై సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ రేపు(సోమవారం) ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. కాగా, ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో సిట్ బృందం పని ప్రారంభించింది. ఈ మేరకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ రేపు ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ బృందం ప్రధానంగా దృష్టిసారించింది. కాగా, హింసాత్మక ఘటన తర్వాత అనుమానితుల్లో కొందరు అజ్ఞాతంలోకి, మరికొందరు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మరోవైపు.. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు పరిశీలించి అవసరమైన చోట అదనపు ఎఫ్ఐఆర్లను సిట్ నమోదు చేయనుంది. అయితే, కొందరు పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్లో పలు సెక్షన్లు మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు సిట్ గుర్తించింది. ఇక, హింసాత్మక ఘటనలకు సంబంధించి సీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను సిట్ బృందం పరిశీలిస్తోంది. -
AP: జెట్ స్పీడ్‌గా సిట్ దర్యాప్తు
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసపై ప్రత్యేక బృందం(SIT) దర్యాప్తు జెట్ స్పీడ్‌తో ముందుకు సాగుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో టీంను నియమించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే సిట్ బృందం దర్యాప్తు ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి నుంచి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోని 13 మంది అధికారుల బృందం దర్యాప్తులోకి దిగింది. ఈ టీంలో ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్య లత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ వి శ్రీనివాసరావు, డీఎస్పీ రవి మనోహర చారి, ఇన్స్పెక్టర్లు భూషణం, వెంకట రావు, రామకృష్ణ, జిఐ శ్రీనివాస్, మెయిన్, ఎన్ ప్రభాకర్, శివ ప్రసాద్ లు ఉన్నారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఎన్నికల అనంతర హింస లో పోలీస్ అధికారులు పాత్ర పైనా ఆరాలు తీస్తోంది. ఈ మొత్తం ఘటనలపై ఆదివారం లోగా ఈసీకి సిట్ నివేదిక ఇవ్వనుంది.ఇంకా 144 సెక్షన్పోలింగ్ రోజు మధ్యాహ్నం ప్రారంభమైన హింస నాలుగు రోజుల పాటు కొనసాగింది. మాచర్ల, నరసరావుపేట, పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి, తిరుపతిల్లో జరిగిన ఘటనలు స్థానికంగా ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. తాడిపత్రి, సత్తెనపల్లి, జమ్మలమడుగులో పోలీస్ పహారా ఇంకా కొనసాగుతోంది. ప్రధాన పార్టీల ఆఫీస్‌ల ముందు బందోబస్తు ఏర్పాటు చేశారు.పోలీసుల పచ్చపాత వైఖరిమరోవైపు.. ఏపీలో పోలీసులు పక్షపాత వైఖరిపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పల్నాడు జిల్లాలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేస్తుంటే చూస్తూ ఉండిపోయారు. దాడి చేసిన టీడీపీ నేతలను వదిలేసి.. గొడవలతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్సీపీ నేతలను, అలాగే వైఎస్సార్సీపీకి ఓటేసిన వాళ్లను పోలీసులు టార్గెట్ చేస్తున్నారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడాన్ని వైఎస్సార్సీపీ నేతలు ఖండిస్తున్నారు. -
ఓటీటీలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా రిలీజ్
అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ్ హీరోలుగా నటాషాదోషి ప్రధాన పాత్ర పోషించిన కొత్త చిత్రం 'యస్. ఐ. టి'. ఎస్ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) పేరుతో జీ5లో స్ట్రీమింగ్ కానుంది.యంగ్ ఇండియా సినిమాతో హీరోగా పరిచయమైన అరవింద్ కృష్ణ ఇప్పటికే ఇట్స్ మై లవ్ స్టోరీ, రుషి వంటి చిన్న చిత్రాల్లో మెప్పించాడు. రవితేజ రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో కూడా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో మెరిశాడు. తాజాగా 'యస్. ఐ. టి' (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) చిత్రం ద్వారా వస్తున్నాడు. వి.బి.ఆర్. (VBR) దర్శకత్వం వహించిన ఈ చిత్రం సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది. మే 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. -
కిడ్నాప్ కేసులో రేవణ్ణ అరెస్ట్
సాక్షి, బెంగళూరు: మహిళ కిడ్నాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జేడీ (ఎస్) సీనియర్ నేత, పార్టీ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను సిట్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ ఆయన పెట్టుకున్న ముందస్తు బె యిల్‌ను ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ని రాకరించిన వెంటనే సిట్ రేవణ్ణను అదుపులో కి తీసుకోవడం గమనార్హం. గతంలో రేవణ్ణ ఇంట్లో పనిచేసిన బాధితురాలిని రేవణ్ణ అనుచరుడు సతీశ్ బాబన్న కిడ్నాప్ చేశాడని బాధితురాలి కుమారుడు గురువారం రాత్రి మైసూరులో ఫిర్యాదుచేయ డంతో పోలీసులు రంగంలోకి దిగారు. శనివారం బెంగళూరులోని పద్మనాభనగర్లోని మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ నివాసంలో ఉన్న రేవణ్ణను అక్కడే అరెస్ట్‌చేశారు. తర్వాత ఆయనను బౌరింగ్ ఆస్పత్రికి వైద్యపరీక్షల కోసం తీసుకెళ్లారు. ఈ కేసులో రేవణ్ణ సహచరుడు సతీశ్‌ను ఇప్పటికే అరెస్ట్‌చేశారు. ఈ కే సులో నిర్బంధంలో ఉన్న మహిళను మైసూ రు జిల్లాలోని కలెనహళ్లి గ్రామంలోని ఫామ్‌హౌజ్‌లో పోలీసులు శనివారం కాపాడారు. ప్రజ్వల్‌పై బ్లూ కార్నర్ నోటీస్!: లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్‌పై నమోదైన కేసులో విచారణను సిట్ వేగవంతంచేసింది. ఇందులోభాగంగా ప్రజ్వల్‌కు సీబీఐ బ్లూ కార్నల్ నోటీసును జారీచేసే వీలుందని తెలుస్తోంది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిట్ అధికారులతో ముఖ్యమైన సమావేశం ఏర్పాటుచేశారు. ప్రజ్వల్‌ను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకునేలా కేసు దర్యాప్తును ముమ్మరంచేయాలని ఆదేశించారు. -
ఉగ్రవాదులు టార్గెట్ చేసిన రాష్ట్రాలు ఇవేనా?
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు హైదరాబాద్–భోపాల్‌లలో అరెస్టు చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముమ్మరం చేసింది. ఈ కేసును ఢిల్లీ యూనిట్ గత నెల 24న రీ–రిజిస్టర్ చేసిన విషయం తెలిసిందే. దీని దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక ఎన్ఐఏ బృందం సోమవారం ఢిల్లీ నుంచి భోపాల్ చేరుకుంది. ఏటీఎస్ అధికారులతో సమావేశమైన ఈ టీమ్.. కేసు పూర్వాపరాలు తెలుసుకుంది. గత నెల 9న∙ఏటీఎస్ అధికారులు హైదరాబాద్‌లో ఐదుగురు, భోపాల్‌లో 11 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (హెచ్‌యూటీ) ఉగ్ర సంస్థకు చెందిన ఈ మాడ్యుల్ షరియత్ స్థాపనే లక్ష్యంగా విధ్వంసాలకు పథక రచన చేసింది. వీరి టార్గెట్‌లో అనేక ప్రాంతాలతో పాటు మత నాయకులు కూడా ఉన్నట్లు ఏటీఎస్ ఆరోపిస్తోంది. కాగా, ఈ ఉగ్రవాదులు తెలంగాణ, మధ్యప్రదేశ్‌తో పాటు ఏయే రాష్ట్రాలను టార్గెట్‌గా చేసుకున్నారనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు పేలుడు పదార్థాలనూ సమీకరిస్తున్న వీరి అసలు కుట్ర ఏమిటి అన్నదానిపై ఎన్ఐఏ దృష్టి సారించింది. ఈ 16 మంది ఉగ్రవాదులను అధికారులు ఇప్పటికే రెండుసార్లు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఎన్ఐఏ అధికారులు సైతం హైదరాబాద్, భోపాల్‌లకు చెందిన మహ్మద్ సలీం, యాసిర్ ఖాన్‌లతో పాటు మిగిలిన వారినీ మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా త్వరలో వీరిని హైదరాబాద్ తీసుకురావాలని ఎన్ఐఏ నిర్ణయించింది. -
టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనంగా మారిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకంపై.. టీఎస్పీఎస్సీ మెంబర్లను విచారించాలని సిట్ నిర్ణయించింది. టీఎస్పీఎస్సీలో ఏడుగురు బోర్డు సభ్యుల స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. కాగా, ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ దూకుడు పెంచింది. పేపర్ లీకేజీకి సంబంధించి ముగ్గురు నిందితులను సిట్ తన కస్టడీకి తీసుకుంది. నాంపల్లి కోర్టు అనుమతితో నిందితులు షమీమ్, సురేష్, రమేష్‌ను సిట్ ఐదు రోజుల పాటు ప్రశ్నించనుంది. ఇక, ముగ్గురు నిందితుల్లో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులే కావడం గమనార్హం. అయితే, పేపర్ లీకేజీలో నిందితులు కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు, పేపర్ కేసు ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్‌తో వీరికి ఉన్న సంబంధాలపై సిట్ ఆరా తీస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు 15 మంది అరెస్ట్ అయ్యారు. పలువురికి నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో, అరెస్ట్‌ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. చదవండి: ఆ ఆరు పరీక్షలపై దృష్టి -
సిట్ విచారణపై విశ్వాసం లేదు
సాక్షి, హైదరాబాద్: ఒక లోక్‌సభ సభ్యుడిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావాల్సి ఉందని.. అందువల్ల తాను టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో శుక్రవారం విచారణకు రాలేనని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సిట్‌కు లేఖ రాశారు. వాస్తవానికి తనకు సిట్ ఆఫీస్ నుంచి నేరుగా ఎలాంటి నోటీసులు అందలేదని, వాటిలో ఏముందో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. సిట్ నోటీసులు జారీ చేసినట్టు మీడియా వార్తల ద్వారా తన దృష్టికి రావడంతో లేఖ రూపంలో స్పందిస్తున్నట్టు వివరించారు. ‘‘టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ఆ«దీనంలోని సిట్ జరుపుతున్న విచారణపై మాకు నమ్మకం లేదని పేపర్ లీకేజీ స్కాం బయటపడిన నాటి నుంచీ చెప్తున్నాం. అధికార పీఠానికి దగ్గరగా ఉన్న వారి అండదండలు లేకుండా ఇలాంటివి జరిగే అవకాశం లేదని మేం నమ్ముతున్నాం. ఈ కేసులో హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మేం గట్టిగా నమ్ముతున్నందున.. సిట్ ఏర్పాటే సరైంది కాదని భావిస్తున్నాం. సిట్‌పై ఎలాంటి విశ్వాసం, నమ్మకం లేనప్పుడు పేపర్ లీకేజీకి సంబంధించి మా వద్ద ఉన్న సమాచారాన్ని పంచుకునే విషయమే ఉత్పన్నం కాదు. అందువల్ల నమ్మకమున్న విచారణ లేదా దర్యాప్తు సంస్థలకే సమాచారాన్ని చేరవేసే మా హక్కును ఉపయోగించుకోవాలని భావిస్తున్నాం..’’అని సిట్‌కు రాసిన లేఖలో సంజయ్ పేర్కొన్నారు. రావాలంటే.. హాజరవుతా.. ఈ అంశంలో తాను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ తాను సిట్ అధికారుల ఎదుట హాజరుకావాలని విచారణ సంస్థ భావిస్తే.. వచ్చేందుకు సుముఖంగానే ఉన్నానని పేర్కొన్నారు. అయితే పార్లమెంట్ సమావేశాల తేదీలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ తేదీని తెలియజేయాలని కోరారు. -
నిందితులను రక్షించడానికే సిట్: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
బిజినేపల్లి: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిందితులను పట్టుకోవడానికి కాకుండా..అసలు నిందితులను రక్షించడానికే పనిచేస్తుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. పేపర్ లీక్ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ బోర్డుకు, ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధాలున్నాయనే ఆరోపణలు రోజురోజుకూ బలపడుతున్నాయన్నా రు. టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుడు లింగారెడ్డి పీఏకు గ్రూప్–1లో 127 మార్కులు ఎలా వచ్చాయని, ముఖ్యమంత్రికి ఓఎస్డీగా పనిచేసే రాజశేఖర్‌రెడ్డికి లింగారెడ్డి స్వయంగా మేనబావని తెలిపారు. రాజ్యాధికార యాత్ర లో భాగంగా శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో ప్రవీణ్ కుమార్ పర్య టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిట్ ఈ కేసులో అసలు దోషులను వదిలేసి, కిందిస్థాయిలో 12 మందిని అరెస్టు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 2009 బ్యాచ్‌కు చెందిన 200 మంది ఎస్సైల పదోన్నతుల ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టారని, అలాంటి ఫైల్స్ చూడని హోంమంత్రిపై త్వర లోనే మిస్సింగ్ కంప్లైంట్ చేస్తామన్నారు. ప్రభుత్వానికి పనిచేయాల్సిన అడ్వొకేట్ జనరల్ కవిత లిక్కర్ స్కాం కేసు కోసం ఈడీ ముందు ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. -
బీజేపీ నేతల విచారణ పై కొనసాగుతున్న ఉత్కంఠ
-
‘ఎర’కు బీజం ఎక్కడ పడింది? మూలాలను పసిగట్టే పనిలో సిట్..
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం అదికారులు వేగవంతం చేశారు. ఎరకు ఎక్కడ? ఎప్పుడు బీజం పడిందో తేల్చే పనిలో పడ్డారు. రామచంద్రభారతి, నందు, సింహయాజీలకు ఒకరితో మరొకరికి పరిచయం ఎలా ఏర్పడింది? వీరిని ఎవరెవరు కలిశారు? అనే వివరాలను రాబట్టడంలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులు ఫరీదాబాద్‌కు చెందిన పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త నందకుమార్, తిరుపతికి చెందిన స్వామి సింహయాజీల ఇళ్లు, ఆశ్రమాలలో సోదాలు చేశారు. హైదరాబాద్, తిరుపతి సహా హరియాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలోని ఏడు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లకు చెందిన సుమారు 80 మంది పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నందును ఎవరెవరు కలిశారు? ఇళ్లు, ఆశ్రమాలలో సోదాలు చేస్తున్న అధికారులు కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. నందకుమార్‌కు చెందిన ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్లో, ఆయన ఇంటిలోనూ పోలీసులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. హిల్‌టాప్ అపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకొని.. నందును కలవటానికి ఎవరెవరు వచ్చారనే అంశంపై ఆరా తీశారు. అలాగే రామచంద్రభారతికి చెందిన హరియాణలోని ఫరీదాబాద్, అలాగే కర్ణాటకలోని పుత్తూరులో ఉన్న ఇళ్లల్లో సిట్ అధికారులు సోదాలు చేశారు. తిరుపతిలోని సింహాయాజీ ఇంటిలో కూడా తనిఖీలు చేపట్టారు. కుటుంబ సభ్యులు, స్థానికులను విచారించి పలు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. ఆయా సోదాల సందర్భంగా పలు రికార్డులు, కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మరోవైపు గత నెల 26న హైదరాబాద్‌కు వచ్చిన రామచంద్రభారతి, సింహయాజీలు నందకుమార్‌కు చెందిన డెక్కన్ కిచెన్ హోటల్లోనే బస చేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి సీసీటీవీ కెమెరాలలో ఇది రికార్డయినట్లు ఓ అధికారి తెలిపారు. తుషార్, భారతి మధ్యన కేరళ వైద్యుడు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలను రెండు రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు.. వారి నుంచి పలువురి పేర్లు రాబట్టినట్లు తెలిసింది. దీంతో ఈ కేసుతో వారికి ఉన్న సంబంధం, ఇతరత్రా వివరాలను సేకరించేందుకు కేరళలోని కొచ్చి ప్రాంతానికి చెందిన ఓ వైద్యుడి ఇంటిలో సోదాలు చేసినట్లు తెలిసింది. రామచంద్రభారతి, తుషార్‌కు మధ్య ఈయన వారధిలాంటి వాడని సిట్ అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. తుషార్‌కు అత్యంత సన్నిహితుడైన ఈ వైద్యుడే రామచంద్రభారతిని తుషార్‌కు పరిచయం చేశాడని గుర్తించారు. ఇందుకోసం ఆధారాలను సేకరిస్తున్నామని, ఈ కేసుతో సంబంధం ఉన్న వారి కార్యకలాపాలు, వివరాలను సేకరిస్తున్నామని సిట్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. నేడు నగరానికి సిట్ బృందాలు మరో నిందితుడు సింహయాజీ గత నెల 26న తిరుపతి నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చారని, ఈయన ప్రయాణ టికెట్‌ను ఓ జాతీయ పార్టీకి చెందిన కీలక నేత దగ్గరి బంధువే సమకూర్చారని పోలీసులు గుర్తించారు. గత 2 రోజులుగా ఇతర రాష్ట్రాలలో సోదాలలో ఉన్న సిట్ బృందాలు సోమవారం హైదరాబాద్‌కు చేరుకుంటాయని, వారు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించాక ఈ కేసులో మరికొందరిని నిందితులుగా చేసే అవకాశం ఉందని, అవసరమైతే వారిని అరెస్టు చేసి విచారించి పూర్తి వివరాలు రాబడతామని ఓ అధికారి వివరించారు. చదవండి: అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్ ఫోకస్ -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొనసాగుతున్న సిట్ సోదాలు
-
ఎమ్మెల్యేల కొనుగోలు.. ‘సిట్’లో రెమా రాజేశ్వరి.. సీవీ ఆనంద్ తర్వాత ఆమెనే!
సాక్షి, నల్లగొండ: జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరికి రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ కోసం నియమించిన ప్రత్యేక విచారణ బృందం (సిట్)లో ఆమెకు చోటు కల్పించింది. రాజకీయ ప్రమేయమున్న ఈ కీలక కేసులో జిల్లా ఎస్పీని నియమించేందుకు గాను అనేక అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో పలు కీలక కేసులను విచారించిన అనుభవంతో పాటు ఆయా కేసుల్లో పక్కా సాక్ష్యాలు సేకరించే నైపుణ్యం ఉన్న అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న రెమా రాజేశ్వరికి ఈ కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ప్రభుత్వం నియమించిన ఏడుగురు పోలీసు అధికారుల్లో సిట్‌కు నేతృత్వం వహించనున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తర్వాత సీనియర్ అధికారిణి మన ఎస్పీనే. ట్రాక్ రికార్డు అదుర్స్.. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసు రాజకీయంగా చాలా కీలకమైంది. ఈ కేసు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ యుద్ధానికి దారితీసింది. అలాంటి కీలకమైన కేసులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌లో మన ఎస్పీకి చోటు దక్కేందుకు గతంలో ఆమెకున్న ట్రాక్ రికార్డే కారణమనే చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతోంది. 2014లో పెదవూర మండలం ఏనెమీదితండాలో 12 మంది గిరిజన బాలికలపై జరిగిన లైంగిక దాడి కేసు విచారణలో ఎస్పీ రెమా రాజేశ్వరి కీలకంగా వ్యవహరించారు. ఈ ఘటన జరిగిన సమయంలో జిల్లా అదనపు ఎస్పీగా ఉన్న ఆమె పకడ్బందీగా కేసును ముందుకు నడిపించి సాక్ష్యాధారాలతో సహా నిరూపించి నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడేలా కృషిచేశారు. ఆమె మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఎరుకల శ్రీను అనే సీరియల్ కిల్లర్ కేసును కూడా ఛేదించారు. 17 మందిని పొట్టనబెట్టుకున్న నరహంతకుడిని కటకటాల పాలుజేసి సంచలన కేసు దర్యాప్తునకు నేతృత్వం వహించారు. అదే జిల్లాలో 12 మందిని హత్య చేసిన మరో సీరియల్ కిల్లర్ యూసుఫ్ ఆటకట్టించింది కూడా రెమా రాజేశ్వరీనే. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీసీపీగా పనిచేసినప్పుడు కూడా కీలక కేసుల దర్యాప్తులో తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కీలకమైన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ బాధ్యతలు అప్పజెప్పింది. -
సీబీఐ లేదా సిట్‌తో విచారణ జరిపించండి
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో దర్యాప్తు జరిపించాలని నిందితుడు కోరే నందుకుమార్ సతీమణి చిత్రలేఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘అక్టోబర్ 26న, మొయినాబాద్‌లోని రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో అవినీతి నిరోధక చట్ట ప్రకారం కేసు నమోదు చేసి నా భర్తతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 27న నిందితుల రిమాండ్‌ను పోలీసులు కోరగా, ఏసీబీ కోర్టు తిరస్కరించింది. వెంటనే విడుదల చేయాలంది. 41ఏ కింద నోటీసులు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. దీనిపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా, కిందికోర్టు ఉత్తర్వులను కొట్టివేసింది. నిందితులు వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. అనంతరం పోలీసులు నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆడియో టేపులను బయటికి లీక్ చేశారు. నందుకుమార్ ఫోన్‌ను ట్యాప్ చేసి వ్యక్తిగత సంభాషణలను రికార్డు చేశారు. ఇది టెలీగ్రాఫిక్ చట్ట నిబంధనలకు విరుద్ధం. రాష్ట్ర అధికార పార్టీ నేరుగా ప్రమేయం ఉన్న ఈ కేసులో పోలీస్ విచారణ సక్రమంగా సాగుతుందన్న నమ్మకం మాకు లేదు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా, కొందరు ఒత్తిడితో పెట్టిన కేసు మాత్రమే. టీఆర్ఎస్, బీజేపీ రాజకీయ యుద్ధంలో నా భర్త బలవుతున్నారు. ఈ నేపథ్యంలో కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతున్నా’అని పిటిషన్లో పేర్కొన్నారు. హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్ సీపీ, రాజేంద్రనగర్ ఏసీపీ, మొయినాబాద్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్, కేంద్రం హోంశాఖ కార్యదర్శి, కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిలను ప్రతివాదులుగా చేర్చారు. -
మరియమ్మ లాకప్ డెత్‌పై తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు
Mariyamma Lockup Death Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మరియమ్మ లాక్ అప్ డెత్ అంశంపై తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. మరియమ్మ కేసును సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఇప్పటికే ఇచ్చిన రిపోర్టు ఆధారంగా దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు పోలీసు స్టేషన్ పరిధిలో జూన్ నెలలో మృతి చెందిన మరియమ్మ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దొంగతనం కేసులో ఇంటరాగేషన్ పేరుతో మరియమ్మపై స్టేషన్లో థర్ఢ్ డిగ్రీ ప్రయోగించారు. మరియమ్మ దెబ్బలకు తాళలేక స్పృహ కోల్పోయింది. దీంతో పోలీసులు స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. నాడి పరిశీలించిన వైద్యుడు పరిస్థితి విషమంగా ఉందని, పల్స్ దొరకడం లేదని చెప్పడంతో హుటాహుటిన భువనగిరి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు చనిపోయినట్లు చెప్పారు. చదవండి: మరియమ్మ లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తు వద్దు.. ‘ఆదేశిస్తే మేము సిద్ధం' దీనిపై వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవ్వడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో బాధితురాలుకు న్యాయం చేకురుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే మరియమ్మ లాకప్ డెత్ కేసులో ముగ్గురు పోలీసు అధికారులను తెలంగాణ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఎస్సై మహేశ్వర్, కానిస్టేబుల్స్ రషీద్, జానయ్యలను శాశ్వతంగా వీధుల నుండి బహిష్కరించింది. తొలగించిన పోలీసుల పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు గతంలో ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తే ప్రజలకు పోలీసులపై నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉందని డ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న దర్యాప్తు సంస్టల చేత విచారణ జరిపించేలా చూడాలని కోరారు. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగించే విషయంపై తీర్పు వెలువరించింది. -
‘సిట్ ఆయనను రక్షించాలని చూస్తోందా?’
లక్నో: తనపై లైంగికదాడి చేసిన బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) కేసు నమోదు చేయకుండా ఎందుకు జాప్యం చేస్తోందని బాధిత న్యాయ విద్యార్థిని ప్రశ్నించింది. కాగా సెక్షన్ 164 కింద తన వాంగ్మూలాన్ని15రోజుల నుంచి దర్యాప్తు చేస్తున్నప్పటికి చిన్మయానంద్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ఆమె సిట్‌పై మండిపడింది. సిట్ బృందం నిందితుడిని రక్షించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోందని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా ఆధారాలు చూపించి కేసును తప్పుదోవ పట్టించాలని సిట్ చూస్తోందన్నారు. కేసు దర్యాప్తు పురోగతిపై నిరాశ వ్యక్తం చేస్తూ.. నిందితుడిపై చర్యలు ప్రారంభించడానికి తన జీవితాన్ని ముగిసే వరకు సంబంధిత అధికారులు ఎదురుచూస్తున్నారా? అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘నేను ఆత్మహత్య చేసుకుంటానంటే అధికారులు నమ్ముతారా? ప్రభుత్వం నా జీవితాన్ని ముగించే వరకు నిందితుడిపై చర్యలు తీసుకోదా? ఢిల్లీ మెజిస్ట్రేట్‌కు అత్యాచారంపై ఫిర్యాదు చేశాను. పోలీసులకు చిన్మయానంద్ గదిలో ఉన్న మద్యం సీసాల సమాచారం అందించాను. కేసుకు సంబంధించిన ఓ పెన్‌డ్రైవ్‌ను సిట్‌కు అప్పగించాను. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులకు అందజేశాను. కానీ ఇప్పటివరకు కేసులో పురోగతి లేదు. సిట్ పూర్తిగా చిన్మయానంద్‌కు సహకరిస్తోందని నా అనుమానం. నాకు న్యాయం జరిగే వరకు పోరాడతా‘ అని బాధితురాలు పేర్కొన్నారు. అయితే చిన్మయానంద్ అస్వస్థతకు లోనుకావడంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా సిట్ బృందం దర్యాప్తులో భాగంగా పలు ఆధారాల సేకరణ కోసం బాధిత విద్యార్థిని శుక్రవారం చిన్మయానంద్ గదికి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. -
విశాఖ భూ స్కాంపై పునర్విచారణ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విశాఖపట్నం భూ కుంభకోణంలో అక్రమాలను వెలికితీయ డంతోపాటు దోషులను నిగ్గుతేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబు సర్కారు హయాంలో విశాఖపట్నం జిల్లాలో భూ రికార్డుల మాయం.. ట్యాంపరింగ్ ద్వారా లక్ష కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయన్న విషయం తెలిసిందే. రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక రాజధాని అయిన విశాఖలో జరిగిన ఈ భారీ భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని అన్ని రాజకీయ పక్షాలు అప్పట్లో డిమాండు చేశాయి. ఈ స్కామ్‌లో పాత్రధారులు, సూత్రధారులు అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని ఓ మంత్రి, పలువురు ఎమ్మెల్యేలేనని మీడియాలో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి. అధికార పార్టీలోని ఒక మంత్రి కూడా ఇదే విధమైన ఆరోపణలు బహిరంగంగానే చేశారు. నాటి సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌పై కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలొచ్చాయి. దీంతో సీబీఐకి కేసును అప్పగిస్తే ప్రభుత్వ పెద్దల బండారం బయటపడుతుందనే భయంతో విశాఖ పోలీస్ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు జరిపిస్తున్నట్లు చంద్రబాబు హడావుడిగా ప్రకటించారు. అప్పటి రెవెన్యూ మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిన కేఈ కృష్ణమూర్తి విశాఖ వెళ్లి ఈ కుంభకోణానికి సంబంధించిన ఫిర్యాదులను వ్యక్తిగతంగా స్వీకరిస్తామని కూడా ప్రకటించారు. కానీ, ఆ మర్నాడే ఆయన పర్యటన వాయిదా పడేలా చంద్రబాబు ‘సిట్’ ప్రకటించారు. దీంతో ‘సిట్’ గురించి తనకు తెలీదని కేఈ స్వయంగా ప్రకటించడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. మరోవైపు.. 2014లో సంభవించిన హుద్‌హూద్ తుపానులో రికార్డులు కొట్టుకుపోయాయంటూ కేసును నీరుగార్చేందుకు అప్పటి సర్కారు పెద్దలు యత్నించి అభాసుపాలయ్యారు. అయితే, తుపాను 2014లో సంభవిస్తే 2017 వరకూ రికార్డులు కొట్టుకుపోయినట్లు గుర్తించలేదా? అన్న ప్రశ్నకు వారి వద్ద సమాధానం కరువైంది. నాడు ‘సిట్’కు పరిమితులు ఇదిలా ఉంటే.. ‘సిట్’ దర్యాప్తులో నిజాలు వెలుగుచూడకుండా అప్పటి ప్రభుత్వం అనేక పరిమితులు విధించింది. జిల్లా మొత్తానికి సంబంధించిన ఈ స్కామ్‌పై దర్యాప్తును కేవలం రెండు మూడు మండలాలకే పరిమితం చేసింది. అలాగే, ఈ బాగోతాన్ని పక్కదోవ పట్టించేందుకు 2004 నాటి నిరభ్యంతర పత్రాలనూ ‘సిట్’ పరిధిలోకి తెచ్చింది. కాగా, సీఎం కుటుంబంతోపాటు మంత్రులపై అభియోగాలున్నందున రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అధికారులతో దర్యాప్తు జరిపిస్తే వాస్తవాలు బయటకు రావని, సీబీఐతోనే దర్యాప్తు జరిపించాలని అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్‌తోపాటు బీజేపీ, సీపీఐ, సీపీఎం.. ప్రజా సంఘాలు డిమాండు చేశాయి. అలాగే, అసైన్డ్ భూములను కొనుగోలు చేసి విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థ (వుడా)కు భూ సమీకరణ కింద ఇచ్చి వందల కోట్ల విలువైన భూమిని అప్పట్లో ఒక టీడీపీ నేత కొట్టేశారని కూడా ఆధారాలతో సహా వార్తలొచ్చాయి. వీటన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా.. మధురవాడలోని 178, కొమ్మాదిలోని 92 ఎకరాలకు సంబంధించిన 25 రికార్డులు మాత్రమే టాంపరింగ్ అయినట్లు ‘సిట్’ అధికారులు ప్రకటించి తూతూమంత్రంగా నివేదికను సమర్పించారు. దీనిని కేబినెట్ ఆమోదించినట్లు చంద్రబాబు వెల్లడించినప్పటికీ ఆ నివేదికను మాత్రం బహిర్గతం చేయలేదు. పక్కా ఆధారాలతోనే పునర్విచారణ ఈ నేపథ్యంలో.. భీమిలీ, మధురవాడ తదితర ప్రాంతాల్లో అత్యంత విలువైన భూముల రికార్డులను తారుమారు చేసి సొంతం చేసుకున్నట్లు ఒక మంత్రితోపాటు కొందరు టీడీపీ ఎమ్మెల్యేలపై పక్కా ఆధారాలున్నా వారి పేర్లు దోషుల జాబితాలో లేకుండా తప్పించినట్లు తీవ్రమైన ఆరోపణలున్నాయి. అందువల్ల ఈ బాగోతంపై మరోసారి ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా నిష్పక్షపాతంగా లోతైన విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలన్న సదుద్దేశంతో నిజాయితీ గల ఐఏఎస్, లేదా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో దీనిని జరిపించాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
ఐటీ గ్రిడ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
-
ఐటీ గ్రిడ్ కేసు.. దర్యాప్తు వేగవంతం చేసిన సిట్
సాక్షి, హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్ డేటా చోరీ కేసుపై సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ డేటా చోరీపై ఇప్పటికే ఆధార్ అథారిటీ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసుపై ఆధార్ అధికారులు కూడా మాదాపూర్‌లో ఫిర్యాదు చేశారు. రెండు రాష్ట్రాల కి చెందిన ఆధార్ డేటా చోరీ అయ్యిందని అందులో ఫిర్యాదు చేశారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులను సిట్ అధికారులు ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. ఎఫ్ఎస్ఎల్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా చర్యలు చేపట్టేందుకు సిట్ అధికారులు సిద్దమయ్యారు. ఇప్పటికే దాదాపు 40 హార్డ్ డిస్క్‌లను ఎఫ్ఎస్ఎల్ విశ్లేషించింది. ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే మూడు సార్లు నోటిసులు ఇచ్చామన్నారు. అశోక్‌తో పాటు మరికొంత మందిని అరెస్ట్చేసేందుకు రంగం సిద్దం చేసింది. -
ఐటీ గ్రిడ్స్ కంపెనీ నిర్వాహకులపై మరో కేసు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్ కేసుపై మరోకేసు నమోదైంది. ఆదార్ సంస్థ పలు సెక్షన్ల కింద ఐటీ గ్రిడ్స్‌పై కేసులు వేసింది. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఆధార్ సమాచారంపై యూఐడీఏఐ కేంద్ర అధికారులను సిట్ వివరణ కోరింది. ఈ మేరకు ఆధార్ యాక్ట్‌లోని 37,38,40,42,44 సెక్షన్ల కింద మాదాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసును పోలీసులు సిట్‌కు బదిలీ చేశారు. -
మరికొన్ని ‘ఐటీ గ్రిడ్స్’ హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారంతోపాటు తెలంగాణ ప్రజల డేటాను కూడా చోరీ చేసిన టీడీపీ యాప్ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై నమోదైన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగం పెంచింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో శనివారం కూడా సిట్ బాస్, ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో మరోసారి సోదాలు నిర్వహించారు. సిట్ అధికారులు శ్వేతారెడ్డి, రోహిణీరెడ్డిల సమక్షంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో సాంకేతిక ఆధారాల సేకరణ కోసం క్లూస్ టీంను కూడా రంగంలోకి దించారు. ఈ సందర్భంగా మరికొన్ని హార్డ్‌డిస్క్‌లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందన్నారు. సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసమే ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. పరారీలో ఉన్న సంస్థ డైరెక్టర్ అశోక్ గూగుల్, అమెజాన్‌లో దాచిన క్లౌడ్ డేటాను సేకరించేందుకు ఆ రెండు కంపెనీలకు లేఖ రాశామని, వాటి నుంచి ఇంకా సమాధానం రావాల్సి ఉందన్నారు. ఈ కేసులో ఆ కంపెనీల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. శనివారం ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌లను కోర్టులో ప్రవేశపెట్టి తరువాత ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతామన్నారు. అశోక్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పైనా రవీంద్ర స్పందిస్తూ ఈ అంశంపై తాము కూడా కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఎస్సార్ నగర్లో నమోదైన కేసుకు సంబంధించిన వివరాలు ఇంకా అందాల్సి ఉందని, అవి రాగానే దానిపైనా దర్యాప్తు మొదలుపెడతామన్నారు. -
బయటపడుతున్న సిట్ విచారణలో డొల్లతనం
-
మోదీకి క్లీన్‌చిట్‌పై పిటిషన్ : విచారణ జనవరికి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోదీకీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ జకియా జాఫ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం వాయిదా వేసింది. ఈ అల్లర్ల వెనుక కుట్ర కోణానికి అవసరమైన ఆధారాలను సమర్పించేందుకు పిటిషనర్లు సమయం కోరడంతో పిటిషన్‌పై విచారణను కోర్టు జనవరి మూడో వారానికి వాయిదా వేసింది. గుజరాత్ అల్లర్ల కేసులో మోదీని సిట్ అధికారులు 9 గంటల పాటు ప్రశ్నించిన మీదట ఈ ఘర్షణల్లో ఆయన పాత్ర లేదని సిట్ క్లీన్చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. గోద్రా అనంతర ఘర్షణల్లో పెద్దసంఖ్యలో చోటుచేసుకున్న మృతుల్లో ఒకరైన మాజీ ఎంపీ ఇషాన్ జాఫ్రి భార్య జకియా సిట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చేసుకున్న అప్పీల్‌ను గుజరాత్ హైకోర్టు గత ఏడాది అక్టోబర్ 5న తిరస్కరించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషనర్లు సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. జకియా జాఫ్రి పిటిషన్ విచారణను జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ హేమంత్ గుప్తాతో కూడిన సుప్రీం బెంచ్ జనవరి మూడో వారానికి వాయిదా వేసింది. సిట్ మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషనర్ ప్రత్యేక న్యాయస్ధానం ఎదుట నిరసన వ్యక్తం చేసినా దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేసు మూసివేత నివేదికను సిద్ధం చేశారని జాఫ్రి న్యాయవాది సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించారు. -
వైఎస్ జగన్‌పై హత్యయత్నం కేసును నీరుగారుస్తున్నదెవరు?
-
సిట్.. ఒక కీలుబొమ్మ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన ప్రతీసారి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) తెరపైకి తీసుకొస్తోంది. అధికార పార్టీ పెద్దలు, ప్రజాప్రతినిధుల అవినీతి, అక్రమాలు.. నేరాలపై చర్యలు తీసుకోకుండా ‘సిట్’ పేరిట కాలయాపన చేస్తూ తప్పించుకుంటోంది. కుంభకోణాలు, సంచలన çఘటనలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడం.. ఆ తర్వాత నివేదికలను బుట్టదాఖలు చేయడం, విచారణను అటకెక్కించడం పరిపాటిగా మారింది. విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై విచారణకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ ఘటన జరిగిన ఆరు రోజులు గడిచినా ఇప్పటిదాకా ‘సిట్’ తేల్చిందేమీ లేకపోవడం గమనార్హం. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీల కాల్చివేత, విశాఖలో భూ కుంభకోణం, కాల్‌మనీ సెక్స్ రాకెట్, విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై భూకబ్జా కేసు, హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబుపై ఓటుకు కోట్లు కేసులో ఫోన్ ట్యాపింగ్, తాజాగా విశాఖ మన్యంలో మావోయిస్టులు చేసిన జంట హత్యలు వంటి కీలక ఘటనలపై సిట్ దర్యాప్తులతో ఎలాంటి ఫలితంలేదు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు ప్రభుత్వ పెద్దల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (కాల్‌డేటాను దాటని విచారణ) ► శేషాచలం అడవుల్లో 2015 ఏప్రిల్ 7న ఏపీ టాస్క్‌ఫోర్స్ పోలీసుల కాల్పుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించారు. ఈ ఘటనపై పౌరహక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో రాష్ట్ర సర్కారు 2015 ఏప్రిల్ 24న సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్.రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు అసలు నేరస్తుల పాత్ర బయటపడలేదు. ► తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటును టీడీపీ అభ్యర్థికి వేయించుకోవడానికి రూ.50 లక్షలు ఇస్తుండగా, 2015 మే నెలలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు ఆధారాలతో సహా పట్టుకున్నారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు పలువురిపై ఏపీలో 88 ఫోన్ ట్యాపింగ్ కేసులు నమోదు చేయించింది. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు 2015 జూన్ 17న సిట్ ఏర్పాటు చేసింది. ఈ విచారణ అడ్రసు లేకుండా పోయింది. ► విశాఖపట్నం రూరల్‌లో అధికార టీడీపీ ముఖ్యనేతల కనుసన్నల్లోనే భూ కుంభకోణం జరగిందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో గతేడాది జూన్‌లో గ్రేహౌండ్స్ డీఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. భూ కుంభకోణంలో టీడీపీ మంత్రులు, నేతలదే ప్రధాన పాత్ర అని తేలడంతో ‘సిట్’ విచారణ అటకెక్కేసింది. ► విశాఖ ఏజెన్సీలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మట్టుబెట్టేందుకు మావోయిస్టులకు స్థానిక టీడీపీ నేతలే ఉప్పందించారని పోలీసులు నిర్ధారించి అరెస్టులు కూడా చేశారు. కానీ, సిట్ అధికారులు ఎక్కడా బహిరంగంగా మాట్లాడకుండా, నివేదిక ఇవ్వకుండా అర్ధంతరంగా వదిలేశారు. ► విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై భూ కబ్జా కేసుతో టీడీపీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఈ నేపథ్యంలోనే విశాఖ తరహాలోనే విజయవాడ, గుంటూరులలో భూ వివాదాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసి, అసలు వివాదాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేసింది. ► రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడలోని కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చేసిన దర్యాప్తు మూడేళ్లు దాటినా అతీగతీ లేదు. థర్ట్‌పార్టీ దర్యాప్తు ఎందుకంటే.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పని చేసే ప్రత్యేక దర్యాప్తు బృందాలపై నమ్మకం సన్నగిల్లుతోంది. అధికార పార్టీ నేతల అరాచకాలను ఇప్పటివరకు ఏ ఒక్క సిట్ కూడా తేల్చలేకపోయింది. ఒక్కరికైనా శిక్ష పడేలా ఆధారాలను సంపాదించలేదు. తాజాగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర డీజీపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఘటన జరిగిన రోజే వారు చేసిన వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థతో(థర్డ్ పార్టీ) విచారణ జరిపిస్తేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. -
‘గౌరీ’ హత్య కేసులో మరో అరెస్ట్
సాక్షి, బెంగళూరు: గత ఏడాది సెప్టెంబర్‌లో హత్యకు గురైన సాహితీవేత్త, పాత్రికేయురాలు గౌరీలంకేశ్ హత్య కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం పురోగతి సాధించింది. ఈ హత్య కేసులో గోవాకు చెందిన వ్యక్తిని ప్రధాన సూత్రధారిగా గుర్తించింది. ఇతడే మహారాష్ట్రకు చెందిన ఇద్దరు షార్ప్ షూటర్లతో లంకేశ్‌ను హత్య చేయించినట్లు విచారణలో వెల్లడైంది. లంకేశ్ హంతకులే బెంగళూర్‌కు చెందిన సాహితీవేత్త భగవాన్ను గత నెల హత్య చేయడానికి పథకం రచించినట్లు సమాచారం. -
గౌరీ లంకేశ్ కేసు... సీబీఐ కాదు సిట్ కరెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య కేసు విచారణను కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అప్పగించిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ విచారణకు కూడా ఆదేశించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)ను అస్సలు నమ్మలేమని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టే తాము సీబీఐ విచారణను వద్దంటున్నామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ కేసు విచారణకు సిట్ కరెక్ట్. సీబీఐను నమ్మటానికి అస్సలు లేదు. అది నైతిక విలువలు లేని ఓ సంస్థ అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సందీప్ దీక్షిత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక మరో నేత పీఎల్ పునియా ఘటనను భావ ప్రకటన హక్కుపై దాడిగా అభివర్ణించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం వీలైనంత త్వరగా కేసు చిక్కుముడి విప్పుతుందని భావిస్తున్నట్లు పునియా తెలిపారు. ఐజీపీ ఇంటలిజెన్స్ అధికారి బీకే సింగ్ నేతృత్వంలో 19 మంది అధికారులతో కూడిన సిట్ బృందాన్ని కర్ణాటక ప్రభుత్వం గౌరీ లంకేశ్ హత్య కేసు కోసం నియమించింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు మాత్రం సీబీఐ విచారణకు ఆదేశించాలని పట్టుబడుతుండగా, అందుకు తాము సిద్ధమేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెబుతున్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ కూడా పూర్తి నివేదికను ఇవ్వాలంటూ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
సిట్ దర్యాప్తు షురూ
విశాఖ సిటీ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ జిల్లా భూకుంభకోణాలపై విచారణకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికార కార్యకలాపాలు మంగళవారం నుంచి ప్రారంభించనుంది. సిట్ బృందంలో కీలక సభ్యురాలైన విశాఖ జాయింట్ కలెక్టర్ సృజన సెలవులో ఉండటంతో.. జీవో జారీ అయి వారం రోజులు గడిచినా విచారణ ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఆమె రావడంతో మంగళవారం నుంచి అధికారిక విచారణకు రంగంలో దిగేందుకు సిట్ బృందం సమాయత్తమవుతోంది. దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను మంగళవారం సాయంత్రం ప్రకటించే అవకాశముంది. ఇప్పటి వరకూ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు వచ్చిన 168 ఫిర్యాదులపై మాత్రమే విచారణ చేపడతారా.. లేకపోతే.. గ్రీవెన్స్‌కి వచ్చిన ఫిర్యాదులపైనా దృష్టిసారిస్తారా అనే అంశంపై ఇంకా సందిగ్ధం నెలకొంది. రెండు నెలల్లో సిట్ బృందం నివేదికను సమర్పించాల్సి ఉండగా.. వారం రోజుల ఆలస్యంగా విచారణ ప్రారంభిస్తున్నారు. మరోవైపు... సిట్ కంటే.. సీబీఐ విచారణ, జ్యుడిషియల్ ఎంక్వయిరీతోనే భూబాధితులకు న్యాయం జరుగుతుందని అఖిలపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సీబీఐ విచారణకు ఈ కేసును అందించాలంటూ జీవీఎంసీ కార్యాలయం సమీపంలో గాంధీ విగ్రహం వద్ద లోక్‌సత్తా, సీపీఐ, సీపీఎం, ఆంధ్ర చైతన్య పార్టీల నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. -
బిగుస్తున్న ఉచ్చు
సిట్ లేదా సీఐడీకి కేసు.. పన్ను ఎగవేత కుంభకోణంపై సర్కారు సీరియస్ సీఎస్ ఎస్పీ సింగ్ ప్రత్యేక సమీక్ష అక్రమార్కుల గుండెల్లో రైళ్లు నిజామాబాద్ : వాణిజ్య పన్నుల శాఖ పన్ను ఎగవేత కుంభకోణంలో అక్రమార్కులపై ఉచ్చు బిగుస్తోంది. ఈ కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ మేరకు సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే కీలక సూత్రధారి శివరాజ్ అతని కుమారుడు సునీల్‌తోపాటు, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బందిపై బోధన్‌లో కేసు నమోదైన విషయం విదితమే. వీరిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని నియమించారు. మరోవైపు ఎగవేసిన పన్నును వసూలు చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ చర్యలు చేపట్టిన విషయం విధితమే. మొత్తం 117 మంది వ్యాపారులకు నోటీసులు జారీ చేసిన అధికారులు ఎగవేసిన రూ.50 కోట్లను రాబట్టే చర్యలను ముమ్మరం చేశారు. లోతైన విచారణ కేవలం 2012–13, 2013–14 ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.50 కోట్ల పన్ను ఎగవేసినట్లు ప్రకటించినప్పటికీ, ఆ శాఖ ఉన్నతాధికారులు దశాబ్ద కాలంగా జరిగిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు అందుబాటులో ఉన్న డాటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే బోధన్‌లోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో రికార్డులు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, కీలక సూత్రధారి శివరాజ్ కార్యాలయంలో ఉన్న రికార్డులను, ఫైళ్లను, కంప్యూటర్ హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిని ఆ శాఖ కమిషనరేట్‌కు తరలించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ఆ శాఖలో నిపుణులైన అధికారులు, సిబ్బందిని నియమించి లావాదేవీలను పరిశీలిస్తున్నా రు. డాటా అందుబాటులో ఉన్న 2005 నుంచి జరిగిన లావాదేవీలను ఆరా తీస్తున్నారు. బోగస్ చలానాలు, బోగస్ బ్యాంకు ఖాతాలు సృష్టించి పన్ను ఎగవేసిన వ్యాపారులు ఎవరనే అంశంపై ఆరా తీసున్నారు. -
నయీం కేసులో మరో సంచలనం!
-
నయీం కేసులో మరో సంచలనం!
నయీముద్దీన్ కేసులో సరికొత్త సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో చాలామంది పోలీసులతో పాటు.. కొందరు అధికార పార్టీ నాయకుల పేర్లు కూడా బయటపడ్డాయి. నయీం బినామీలను విచారించినప్పుడు.. వాళ్లు ఇచ్చిన వాంగ్మూలంలో కొందరు ముఖ్యనేతల పేర్లు ఇప్పుడు వచ్చాయి. టీఆర్ఎస్ నాయకుడు, శాసనమండలి వైస్‌చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు పేరు ఇందులో ప్రముఖంగా ఉంది. గంగసాని రవీందర్‌రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. మధుకర్ రెడ్డి వాంగ్మూలంలో మరో టీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వర్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం నల్లగొండ జిల్లాకు చెందిన మరికొందరు ప్రజాప్రతినిధుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఆరోపణలు వచ్చినప్పుడు కొందరు నాయకులు తమకు సంబంధం లేదని.. ఎలాంటి ఆరోపణలనైనా ఎదుర్కొంటామని అన్నారు. ఇప్పుడు నేరుగా మండలి వైస్‌చైర్మన్ పేరే బయటకు రావడంతో ఆయన రాజీనామా చేస్తారా.. లేక ప్రజల ముందుకు వచ్చి తన వివరణ తెలియజేస్తారా అన్న చర్చ జోరుగా జరుగుతోంది. నయీం ఎన్కౌంటర్ తర్వాత అతడి బినామీలలో పలువురిని పోలీసులు అరెస్టుచేశారు. వాళ్లను విచారించినప్పుడు పలువురు నాయకులు, పోలీసుల పేర్లు తెలిశాయన్న ప్రచారం జరిగినా, అవేవీ బయటకు మాత్రం రాలేదు. అయితే.. సీపీఐ నాయకుడు నారాయణ ఈ అంశంపై కోర్టులో కేసు దాఖలు చేయడంతో.. మూడు వారాల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు భువనగిరి కోర్టులో సిట్ తన నివేదికను సమర్పించింది. అందులో.. తాము విచారించిన వారి వాంగ్మూలాల్లో ఎవరెవరి పేర్లు ప్రస్తావనకు వచ్చాయో వెల్లడించింది. వెలగపూడి శివరాంప్రసాద్ వాంగ్మూలంలో డీఎస్పీ మద్దిలేటి శ్రీనివాసరావు పేరు, యూసుఫ్‌ఖాన్ వాంగ్మూలంలో డీఎస్పీ మస్తాన్‌వలీ పేరు ఉన్నాయి. అలాగే లక్ష్మారెడ్డి ఇచ్చిన స్టేట్మెంటులో సీఐ వెంకట్‌రెడ్డి పేరు ఉంది. ఇప్పుడు బయటకు వచ్చిన పేర్లే కాకుండా ఇంకా చాలామంది పోలీసులు, నాయకుల పేర్లు ఈ కేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికి 156 కేసులు నమోదు చేసి వంద మందికి పైగా అరెస్టు చేశారు. ఇప్పుడు తాజా వాంగ్మూలాలతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 13 మంది పోలీసు అధికారుల సర్వీసు రివాల్వర్లను కూడా సరెండర్ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కేసులో వందలకోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు, వందల ఎకరాల భూముల వివాదాలు ఉండటంతో.. దీనిపై సీబీఐ విచారణ జరపాలన్న డిమాండ్లు కూడా వస్తుండటంతో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కేసు ఆలస్యం అయ్యేకొద్దీ బాధితులకు అన్యాయం జరుగుతుందని, న్యాయం జరిగే అవకాశం లేదని అనడంతో మళ్లీ కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. ఇప్పుడు కొత్తగా బయటపడిన పేర్లు ఉన్నవారికి ఎప్పుడు నోటీసులు జారీచేస్తారు, ఎప్పుడు అరెస్టులు జరుగుతాయనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. -
సిట్ పర్యవేక్షణాధికారిగా అంజనీకుమార్
- నయీమ్ కేసుల దర్యాప్తు వేగవంతం కోసం నియామకం - ప్రస్తుత చీఫ్ నాగిరెడ్డితో కలసి పర్యవేక్షిస్తారని డీజీపీ వెల్లడి - కేసులను త్వరగా కొలిక్కి తెచ్చేందుకు సిబ్బంది పెంపు - నయీమ్ గ్యాంగ్‌పై 72 కేసులు నమోదు, 80 మంది అరెస్టు సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు సంబంధించిన కేసులను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పర్యవేక్షణాధికారిగా శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు డీజీపీ అనురాగ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ చీఫ్‌గా ఉన్న ఐజీ వై.నాగిరెడ్డితో కలసి అంజనీకుమార్ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తారని అందులో పేర్కొన్నారు. ఈ కేసును వీలైనంత త్వరగా కొలిక్కి తెచ్చేందుకు సిట్‌లో అదనంగా మరికొంత మంది అధికారులు, సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపారు. నయీమ్ వ్యవహారంలో మెరుగైన దర్యాప్తుతో పాటు నిందితులకు సంబంధించిన పక్కా ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుల విచారణలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా న్యాయ సలహా తీసుకోవాలని సిట్‌ను ఆదేశించారు. అదనపు సిబ్బంది ఏర్పాటు నయీమ్ కేసు దర్యాప్తును వేగిరం చేసేందుకు ప్రభుత్వం సిట్‌లో మరికొందరు సిబ్బందిని నియమించింది. నయీమ్ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటి వరకు 72 కేసులు నమోదవగా.. 80 మంది అరెస్టయ్యారు. రోజు రోజుకూ మరెన్నో కొత్త అంశాలు వెలుగు చూస్తుండడంతో.. ప్రస్తుతమున్న సిబ్బంది సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో డీజీపీ అనురాగ్‌శర్మ మరికొంత మంది సీనియర్ అధికారులను, సిబ్బందిని నియమించారు. ఇప్పటివరకు దర్యాప్తు బృందంలో ఒక ఐజీ, అదనపు ఎస్పీ, కొందరు ఇన్స్పెక్టర్లు, కింది స్థాయి సిబ్బంది ఉన్నారు. తాజాగా కరీంనగర్ అదనపు ఎస్పీ ప్రియదర్శిని, ఖమ్మం అదనపు ఎస్పీ సాయికృష్ణ, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అదనపు ఎస్పీ ఎండీ ఇస్మాయిల్, గోషామహల్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ పి.జైపాల్, నార్సింగ్ సీఐ పి.రామచంద్రరావులను నియమించారు. సిట్‌కు మరో ఫిర్యాదు నయీమ్ అక్రమాలకు సంబంధించి సిట్‌కు సోమవారం మరో ఫిర్యాదు అందింది. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన గోళి సుధాకర్‌రెడ్డి ఈ ఫిర్యాదు చేశారు. వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ శివారులోని సర్వే నంబర్లు 29,44, 48, 49, 50, 55/1 లతో పాటు చెరుకూరు గ్రామ శివారులోని 95, 97, 98, 122, 44, 46, 302 సర్వే నంబర్లలో కలిపి మొత్తం 164 ఎకరాల భూమి కోసం గతంలో నయీమ్ గ్యాంగ్ తనను వేధించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను చంపుతామంటూ ముంబై నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సిట్‌కు అందజేశారు. -
‘గ్యాంగ్‌స్టర్’మూలాల కోసం వేట
గ్యాంగ్‌స్టర్ సన్నిహితులెవరనే దానిపై నజర్ ‘కూరపాటి’ని టార్గెట్ చేయడంపై ‘సిట్’ ఆరా విచారణలో వెలుగు చూడనున్న అసలు ‘కథ’ సాక్షి ప్రతినిధి నిజామాబాద్ : జిల్లాలో గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్‌కు అత్యంత సన్నిహితులు ఎవరు? డిచ్పల్లి జెడ్పీటీసీ కూరపాటి అరుణ భర్త గంగాధర్‌ను ఆ గ్యాంగ్ కు టార్గెట్ చేసిందెవరు? ఎంతకాలంగా జిల్లాలో నయీం ముఠా కార్యకలాపాలు సాగిస్తోంది? ఈ ముఠాకు ఇన్నాళ్లు సహకరిస్తున్నదెవరు? అన్న అంశాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) రెండు రోజులుగా జిల్లాలో ఆరా తీస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. నల్గొండ జిల్లా భువనగిరి ఠాణాలో తెలంగాణ రైసుమిల్లర్ల సంఘం అధ్యక్షుడు గంపా నాగేందర్ ఈ నెల 17న శాసనమండలి డిప్యూటీ చైర్మన్, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌పై ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఈ మేరకు ఆయనపై క్రైం నంబర్ 234/2016 ప్రకారం ఎఫ్ఐఆర్ జారీ అయిన అనంతరం జిల్లాలో ‘సిట్’ దర్యాప్తు ముమ్మరం చేయడం కలకలం రేపుతోంది. నేతి విద్యాసాగర్‌కు బంధువులు, సన్నిహితులు, వారి గత చరిత్రపై ఆరా తీస్తుండటం జిల్లాలో చర్చనీయాంశం అవుతోంది. ‘కూరపాటి’ని టార్గెట్ చేసిందెవరు? గ్యాంగ్ స్టర్ నయీంపై డిచ్పల్లి పోలీసుస్టేషన్లో నమోదైన క్రైం నంబర్ 125/2016. నల్గొండ జిల్లాలో అనేక ఆగడాలు కొనసాగించిన నయీం డిచ్పల్లి జెడ్పీటీసీ భర్తపై బెదిరింపులకు పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లాలో మొదటిసారి నయీం డబ్బుల కోసం బెదిరించడం జరిగింది. గంగాధర్‌కు సంబంధించి ఆస్తులు, వ్యక్తిగత వివరాలు నయీం పేర్కొన్నడం సంచలనం రేపింది. దీనిని బట్టి నయీంకు జిల్లా పరిస్థితులు, స్థానికంగా వివరాలు తెలిసిన వారే అనుచరులుగా కొనసాగుతున్నట్లు అనుమానాలకు తావిస్తోంది. నయీంకు కూరపాటి గంగాధర్‌కు సంబంధించి వివరాలు అందించింది ఎవరు? అసలు ఆయనను ఎందుకు టార్గెట్ చేశారు? అన్న అంశాలే ఇప్పుడు కీలకంగా మారాయి. నల్గొండ జిల్లా భువనగిరి పోలీసుస్టేషన్లో నేతి విద్యాసాగర్‌పై కేసు నమోదైన నేపథ్యంలో.. సిట్ జిల్లాలోని ఆయన బంధువర్గం వివరాలు ఆరా తీయడం కలకలం రేపుతోంది. నల్కొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీకి సమీప బంధువు దీంతో సిట్ జిల్లాలోని నయీం బెదిరింపు కాల్స్‌కు సంబంధించి ఆరా తీయనుంది. ఒకవేళ సదరు ప్రజాప్రతినిధి డిచ్పల్లి గంగాధర్‌కు చెందిన వివరాలు అందించారా? రాజకీయ లబ్ధి కోసం గంగాధర్‌ను భయపెట్టేందుకు చేసిందా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా నయీం అనుచరులు ఎవరెవరు ఉన్నారు? ఎక్కడెక్కడ ఉన్నారు? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నయూం మూలాలపై త్వరలో నివేదిక డిచ్పల్లి పోలీస్‌స్టేషన్‌లోనే కేసు నమోదు కావడంతో ఒక్కొక్కరిపై సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, ఇతర ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఏమిటన్న చర్చ జరుగుతోంది. భువనగిరి ఠాణాలో ఎఫ్ఐఆర్ నమోదైన నల్గొండ ఎమ్మెల్సీ సమీప బంధువు జిల్లాలో సెటిల్మెంట్లు చేయడం పరిపాటి. ఇప్పటికీ ఉన్నతస్థాయి కోర్టు కేసులు ఎదుర్కొంటున్న అయన 2019 ఎన్నికలు లక్ష్యంగా కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం కూడా చేస్తున్నట్లు ప్రచారం ఉంది. ఇదే క్రమంలో నయీంతో సంబంధాలు పెట్టుకొని జిల్లాలో మరిన్ని సెటిల్మెంట్లు చేసేందుకు పూనుకున్నడా? కూరపాటిని టార్గెట్ చేయడం ద్వారా.. ఆయన సీనియర్ నాయకులకు హెచ్చరిక చేయదలచుకున్నాడా? ఈ క్రమంలోనే గ్యాంగ్‌స్టర్‌గా గడగడలాడించిన నయీంతో జత కట్టాడా? అన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో రాజకీయంగా పట్టుసాధించే క్రమంలో నయీం గ్యాంగ్‌ను దగ్గరయ్యాడా? అన్న వాదన కూడా సాగుతోంది. కాగా వీటన్నింటిని పక్కన బెడితే ‘సిట్’ పూర్తి స్థాయి విచారణ జరిపితే జిల్లాలో నయీం అనుచరుల ఎవరెవరు? ఒక వేళ నయీం కూడా నిజామాబాద్ వచ్చి వెళ్లేవాడా? వచ్చి వెళితే నయీంకు ఆశ్రయం కల్పించిన వారెవరు? అతని వెంట ఎవరెవరు ఉన్నది? అన్న విషయాల గుట్టు వెలుగులోకి రానుంది. గుట్టు చప్పుడు కాకుండా నయీం కార్యకలాపాలు కొనసాగించేవాడన్నది బహిరంగ రహస్యమే అయినా... జిల్లాలో నయీం మూలాలు ఎక్కడనేది? తేల్చే పనిలో ఇప్పుడు సిట్ నిమగ్నమైంది. త్వరలోనే నాగిరెడ్డి నేతృత్వంలోని సిట్ బృందం జిల్లాకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి తీసుక రానుందన్న చర్చ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. -
బిల్లు రూ.50 వేలు దాటితే ‘పాన్’ తప్పనిసరి
హోటల్ బిల్లు, విదేశీ ప్రయాణ టికెట్లు మొదలైన వాటికి వర్తింపు * జనవరి 1 నుంచి అమల్లోకి * దేశీయంగా నల్లధనం కట్టడికి కేంద్రం చర్యలు న్యూఢిల్లీ: నల్లధనం చలామణిని కట్టడి చేసే దిశగా కేంద్రం నిబంధనలు కఠినతరం చేసింది. హోటల్ బిల్లులు, విదేశీ ప్రయాణ టికెట్లు మొదలైన వాటి కి రూ. 50,000కు మించి నగదు రూపంలో జరిపే చెల్లింపులకు పాన్ (పర్మనెంటు అకౌంటు నంబరు) తప్పనిసరి చేసింది. లగ్జరీయేతర అంశాలకు సంబంధించి నగదు లావాదేవీల విషయంలో రూ. 2 లక్షలు దాటితేనే పాన్ నంబరు తప్పక ప్రస్తావించాల్సి ఉంటుంది. ఇక చిన్న ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చేలా రూ. 50,000 పైచిలుకు పోస్టాఫీస్ డిపాజిట్లకు పాన్ తప్పనిసరి నిబంధనను కేంద్రం తొలగించింది. మరోవైపు పాన్ తప్పనిసరిగా పేర్కొనాల్సిన స్థిరాస్తి క్రయ, విక్రయాల లావాదేవీ విలువ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచింది. ఇది అందుబాటు ధరలోని గృహాలు కొనుగోలు చేసే వారికి ఊరటనివ్వనుంది. గతంలో రూ. 5 లక్షల విలువ చేసే స్థిరాస్తుల క్రయ,విక్రయాలకు కూడా పాన్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావించింది. తాజా నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. బ్లాక్‌మనీ చలామణి ఎక్కువగా జరిగే ఆభరణాలు.. బులియన్ కొనుగోళ్ల లావాదేవీ విలువ రూ. 2 లక్షలు మించితే పాన్ పేర్కొనక తప్పదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పరిమితి రూ. 5 లక్షలకు మించి ఉంది. మరోవైపు, రూ. 2 లక్షలకు మించిన అన్ని నగదు లావాదేవీలకు పాన్ నంబరును పేర్కొన డం తప్పనిసరిగా చేస్తూ త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో తెలిపారు. 2015-16 బడ్జెట్ ప్రసంగంలో రూ. 1 లక్ష పైగా విలువ చేసే క్రయ, విక్రయ లావాదేవీలన్నింటికీ పాన్ తప్పనిసరి చేయనున్నట్లు ప్రకటించినా జైట్లీ తాజాగా ఆ పరిమితిని పెంచారు. బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపుల దాకా .. క్యాష్ కార్డులు లేదా ప్రీపెయిడ్ సాధనాల కొనుగోలుకు రూ. 50,000కు మించి నగదు చెల్లింపులు జరిపినా లేదా అన్‌లిస్టెడ్ కంపెనీల్లో షేర్ల కొనుగోలుకు రూ. 1లక్షకు పైగా చెల్లించినా పాన్ తప్పనిసరి కానుంది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు మినహా ఇతరత్రా బ్యాంకు ఖాతాలేవీ తెరవాలన్నా పాన్ తప్పదని అధియా వివరించారు. విలాసవంతమైన ఖర్చులు అయినందున.. హోటల్, విదేశీ పర్యటన బిల్లులను ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు అధియా పేర్కొన్నారు. రూ. 2 లక్షలు మించిన మిగతా అన్ని నగదు లావాదేవీలకూ పాన్ నంబరు తప్పనిసరన్నారు. ఇది తాత్కాలికమేనని, అంతిమంగా ఈ పరిమితిని రూ. 1 లక్షకు తగ్గించడమే తమ ఉద్దేశమని ఆయన వివరించారు. కొన్నింట ఊరట.. సిసలైన లావాదేవీలకు నిబంధనల చిక్కులు తొలగించేందుకు, అదే సమయంలో భారీ లావాదేవీల వివరాలను సరిగ్గా రాబట్టేందుకు మరికొన్ని చర్యలు తీసుకున్నట్లు అధియా చెప్పారు. ఇందులో భాగంగానే స్థిరాస్తి కొనుగోలు, విక్రయాల లావాదేవీ విలువ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచినట్లు వివరించారు. హోటల్, రెస్టారెంటు బిల్లుల పరిమితిని రూ. 25,000 నుంచి రూ. 50,000కు పెంచినట్లు పేర్కొన్నారు. ఇక, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో షేర్ల క్రయ,విక్రయాల విలువనూ రూ. 50,000 నుంచి రూ. 1 లక్షకు పెంచినట్లు వివరించారు. బేసిక్ ల్యాండ్‌లైన్ లేదా సెల్‌ఫోన్ కనెక్షన్ తీసుకునే విషయంలో పాన్ నిబంధనను సడలించినట్లు అధియా తెలిపారు. రూ. 50,000కు మించిన నగదు డిపాజిట్లు లేదా ఒకే రోజున అంత మొత్తం విలువ చేసే బ్యాంక్ డ్రాఫ్ట్/పే ఆర్డర్లు/ బ్యాంకర్స్ చెక్ మొదలైనవి తీసుకున్నా, రూ. 50,000 జీవిత బీమా ప్రీమియం చెల్లింపులకు పాన్ తప్పనిసరి నిబంధన యథాప్రకారంగా కొనసాగుతుందని ఆయన వివరించారు. బ్లాక్‌మనీపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) .. రూ. 1 లక్ష పైగా విలువ చేసే అన్ని రకాల వస్తువులు, సర్వీసుల క్రయ,విక్రయాలకు పాన్ నంబరు తప్పనిసరి చేయాలంటూ సూచించిన నేపథ్యంలో కేంద్రం తాజా చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
సెక్స్ రాకెట్ కేసు సిట్‌కు!
-
సెక్స్ రాకెట్ కేసు సిట్‌కు!
ప్రభుత్వాన్ని కోరనున్న సీపీ అరెస్టయిన నిందితులకు 28 వరకు రిమాండ్ ప్రజల్లో అపోహలు కలిగించొద్దన్న సీపీ విజయవాడ సిటీ : కాల్‌మనీ మాటున మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసిన కేసు దర్యాప్తును సిట్ (ప్రత్యేక విచారణ బృందం)కు అప్పగించాలనే ఆలోచనలో పోలీసు పెద్దలు ఉన్నట్టు తెలిసింది. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, యువతులు ఉన్నందున లోకల్ పోలీసుల కంటే సిట్ అధికారులైతే సమర్థవంతమైన పాత్ర పోషిస్తారనేది ఉన్నతాధికారుల అభిప్రాయం. సిట్ ఏర్పాటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ జె.వి.రాముడును కమిషనర్ గౌతమ్ సవాంగ్ కలవనున్నట్టు తెలిసింది. ఈ నెల 11న కాల్‌మనీ పేరిట లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కేసు వెలుగులోకి వచ్చింది. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసిన మాచవరం పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల్లో కొందరు రాష్ట్రం విడిచి పరారైనందున పట్టివేతపై ప్రత్యేక దృష్టిసారించారు. కేసు దర్యాప్తులో మరికొందరు నిందితులను కూడా చేర్చే అవకాశాలు ఉన్నాయి. కేసు పూర్వాపరాలు విచారించడంతోపాటు నింది తులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలనే ఆలోచనలో పోలీసు అధికారులు ఉన్నారు. ఈ క్రమంలోనే సిట్ ఆలోచన చేస్తున్నారు. దర్యాప్తులో వేగం సిట్ ఏర్పాటు ద్వారా కాల్‌మనీ కేసు దర్యాప్తు వేగం పెంచనున్నారు. ఇప్పటికే ఈ కేసులో నిందితుల పట్టివేతతో పాటు ఆధారాల సేకరణకు టాస్క్‌ఫోర్స్‌లోని రెండు బృందాలతో పాటు మాచవరం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సోమవారం కమిషనరేట్ కార్యాలయానికి 30 మందికి పైగా బాధితులు వచ్చి కాల్‌మనీ వ్యాపారుల ఆగడాలపై ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా కృష్ణలంక, మాచవరం, పటమట, సత్యనారాయణపురం, సూర్యారావుపేట పోలీసు స్టేషన్లకు చెందిన బాధితులు కమిషనరేట్ పెద్దలను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. యలమంచిలి రాము ముఠా కేసుకు సంబంధం లేనివారు కూడా అనేక మంది బాధితులు వస్తున్న నేపథ్యంలో సిట్ ఏర్పాటు అవసరమని పోలీసు కమిషనర్ సవాంగ్ నిర్ణయించారు. సిట్ ఏర్పాటు ద్వారా మాచవరం కేసును వెంటనే ముగించడంతో పాటు ఇతర కాల్‌మనీ కేసుల్లో బాధితులకు తగిన న్యాయం చేసేందుకు అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. కాల్‌మనీ మాటున సెక్స్ రాకెట్ కేసులో మాచవరం పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేసిన యలమంచిలి శ్రీరామ మూర్తి అలియాస్ రాము, దూడల రాజేష్‌కు ఈ నెల 28 వరకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అరెస్టు చేసిన నిందితులను సోమవారం మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా ఇన్చార్జి న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో వీరిని గన్నవరం సబ్ జైలుకు తరలించారు. రాజకీయం చేయొద్దు కాల్‌మనీ కేసులో మహిళను బెదిరించి వంచించిన కేసుపై రాజకీయం చేయొద్దని నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. సీనియర్ నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం వల్ల ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తుతాయన్నారు. చట్ట పరిధిలో పోలీసులు చేయాల్సినవన్నీ చేస్తున్నామని చెప్పారు. సీఎం, డీజీపీ సైతం సెక్స్ రాకెట్‌పై ఆగ్రహంగా ఉన్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర దర్యాప్తు ద్వారా నిందితుల గుర్తింపు, అరెస్టులు చేయనున్నామని పోలీసు కమిషనర్ తెలిపారు. కాల్‌మనీ వంటి సామాజిక సమస్యను ప్రతి ఒక్కరూ కలిసి చర్చించుకోవడం ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. ఇందుకు అందరూ కలిసి రావాలని పోలీసు కమిషనర్ అన్నారు. -
ఏపీది కక్షసాధింపు చర్య
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌కు కవిత ఫిర్యాదు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు టీఆర్ఎస్ ఎంపీ కె.కవిత ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆమె కేంద్ర మంత్రిని కలసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే పట్టుబడిన అనంతరం ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటుచేసిందని, తెలంగాణకు సంబంధించిన అధికారులపై మాత్రమే కాకుండా సీఎం కేసీఆర్‌పై కేసులు నమోదు చేసిందని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హోంమంత్రి స్పందిస్తూ సిట్ దర్యాప్తు గురించి తన దృష్టికి రాలేదని, అలా ఎందుకు ఏర్పాటు చేశారంటూ ఆశ్చర్యం వ్యక్తంచేసినట్టు కవిత మీడియాకు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కూడా కేంద్ర మంత్రికి వివరించినట్టు తెలిపారు. కాల్‌డేటాలోని వివరాలు బహిర్గతమైతే దేశ అంతర్గత భద్రతకే ఇబ్బంది కలుగుతుందని మంత్రికి వివరించినట్టు తెలిపారు. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ నుంచి కూడా కాల్ డేటా, ట్యాపింగ్ వివరాలు వెల్లడించాలన్న విజ్ఞప్తి వస్తోందని, వీటిని బయటకు వెల్లడించడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరగుతుందని వివరించినట్టు తెలిపారు. రిషితేశ్వరి కేసు సీబీఐకి ఇవ్వాలి.. నాగార్జున వర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి బలవన్మరణం ఘటనలో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు కవిత పేర్కొన్నారు. ఏపీ సీఎం సమగ్ర విచారణ జరిపిస్తారన్న నమ్మకం లేదని చెప్పినట్టు చెప్పారు. హైకోర్టు విభజనకు చంద్రబాబే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. -
బ్లాక్ మండే...
కుప్పకూలిన సూచీలు; మూడో రోజూ నష్టాలే.. 551 పాయింట్ల పతనంతో 27,561కు సెన్సెక్స్ 161 పాయింట్లు క్షీణించి 8,361కు నిఫ్టీ సూచీలు ఎందుకు పడ్డాయంటే... - పీ-నోట్ల కట్టడికి సిట్ సూచనలు - చైనా షాంఘై సూచీ 9 శాతం క్షీణించడం - కంపెనీల జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండడం - మరో మూడు రోజుల్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల ముగింపు - రూపాయి క్షీణించడం - సంస్కరణలపై అనిశ్చితి - ఫెడ్ వడ్డీరేట్ల పెంపు భయాలు - వచ్చే వారమే ఆర్బీఐ రివ్యూ - కమోడిటీల ధరలు తగ్గుతుండటం సుప్రీం కోర్టు నల్లధనంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పీ నోట్లపై చేసిన సిఫార్సులు సోమవారం(మండే) స్టాక్ మార్కెట్లో మంటలు పుట్టించాయి. దీనికి చైనా షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ 8 శాతానికి పైగా పతనం కావడం తోడవడంతో సోమవారం భారత స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 551 పాయింట్లు క్షీణించి 27,561 పాయింట్ల వద్ద, నిఫ్టీ 161 పాయింట్లు నష్టపోయి 8,361 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది ఐదు వారాల కనిష్టస్థాయి. జూన్ 2 తర్వాత సెన్సెక్స్ ఒక్క రోజులో ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి. సిట్ సూచనలపై ఆర్థిక మంత్రి చెప్పిన ఉపశమన మాటలు సైతం ఇన్వెస్టర్లకు ఉపశమనం కలిగించలేకపోయింది. అమ్మకాల సునామీ... పీ నోట్లు, చైనా పతనం, కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగా ఉండడం, సంస్కరణలపై అనిశ్చితి, జూలై నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో మూడు రోజుల్లో ముగియనుండడం.. ఇవన్నీ మార్కెట్ పతనంపై ప్రభావం చూపాయని, రెండు రోజుల పాటు జరగనున్న ఫెడరల్ రిజర్వ్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానుండడం దీన్ని ఎగదోసిందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచుతుందన్న ఆందోళనలు, కమోడిటీ ధరలు కరిగిపోవడం అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లను పడదోశాయన్నారు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో సైతం లోహ, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, విద్యుత్తు, రియల్టీ, వాహన, ఆయిల్- గ్యాస్, ఐటీ... అన్ని రంగాల సూచీలూ నేల చూపులే చూశాయి. చైనా షాంఘై షాక్... చైనా షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ 9.2 శాతం (345 పాయింట్లు) పతనమై 3,726 పాయింట్లకు క్షీణించింది. ఒక్క రోజులో ఈ సూచీ ఇన్ని పాయింట్లు నష్టపోవడం ఎనిమిదేళ్లలో ఇదే తొలిసారి. ఈ పతనాన్ని నిరోధించడానికి చైనా ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నా అవి ఫలితాలనివ్వలేదు. ఇది ఆసియా మార్కెట్లపై ప్రభావం చూపింది. మన మార్కెట్లలో 30 సెన్సెక్స్ షేర్లలో ఒక్క బజాజ్ ఆటో మాత్రమే లాభపడింది. టాటా స్టీల్ 5.17%, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, లార్సెన్ అండ్ టుబ్రో, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, లుపిన్, ఓఎన్జీసీ, భారతీ ఎయిర్టెల్, భెల్‌లు 2-4% శ్రేణిలో నష్టపోయాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,961 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.16,417 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.4,08,520 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.860 కోట్ల నికర అమ్మకాలు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.239 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. సెన్సెక్స్ పతనంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.50 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 102 లక్షల కోట్లకు తగ్గింది. -
అర్ధంతరంగా ముగిసిన ‘సిట్’ విచారణ
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై {పత్యేక బృందం దర్యాప్తు తమిళనాడులోనే సాక్షుల నుంచి వాంగ్మూలాల నమోదు యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి)/పుత్తూరు: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై సాక్షుల విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం అర్ధంతరంగా ముగించింది. ఏప్రిల్ 7న శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలు ఎన్కౌంటర్లో చనిపోయిన కేసు విచారణకు హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ‘సిట్’ 20 రోజులుగా సాక్షుల విచారణకు శ్రీకారం చుట్టింది. ఎన్కౌంటర్ బూటకమని సాక్షులుగా ఉంటున్న తమిళనాడుకు చెందిన కూలీలు బాలచందర్, శేఖర్, ఇలన్‌గోవన్ ఇప్పటికే హైకోర్టులో ఫిర్యాదు చేశారు. వారిని వారి ప్రాంతాల్లోనే విచారించాలని జూన్ 29న సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆ మేరకు ఈనెల 15న సిట్ బృందం తమిళనాడులోని మధురై వెళ్లింది. అక్కడ పీపుల్స్ వాచ్ సంస్థ అధీనంలో ఉన్న సాక్షులకు నోటీసులు ఇచ్చి 20వ తేదీన తమిళనాడు, ఏపీ పోలీసుల పటిష్ట భద్రత మధ్య తిరుణ్ణామలైకి సాక్షులను పిలిపించి విచారించారు. మంగళవారం తెల్లవారుజామున వారిని తిరుపతికి తీసుకు రావడానికి ప్రయత్నించారు. పుత్తూరు పట్టణానికి వచ్చిన తరువాత సాక్షుల్లో ఒకరైన బాలచందర్ తాను తిరుపతికి రానని స్పష్టంచేశారు. ఏపీ పోలీసులంటే తనకు భయమనీ, తన కుటుంబ సభ్యులను అంతం చేసిన విధంగానే తనను ఏమైనా చేస్తారనే అనుమానం ఉందన్నారు. దీంతో అధికారులు పుత్తూరు బస్టాండులో ఆయన వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ఈనెల 27న విచారణకు అందుబాటులో ఉండాలని చెప్పి బందోబస్తు మధ్య తమిళనాడు పంపారు. అనంతరం మిగిలిన ఇద్దరు సాక్షులను తిరుపతికి తీసుకొచ్చి మహిళా వర్సీటీలోని అతిథిగృహంలో విచారించారు. అనంతరం సిట్ అధికారి రమణకుమార్ మీడియాతో మాట్లాడుతూ సాక్షులు సహకరించనందున విచారణ అర్ధాంతరంగా ముగిసిందని తెలిపారు. వచ్చే నెల మూడో తేదీన హైకోర్టుకు స్టేటస్ రిపోర్టు అందజేస్తామని చెప్పారు. -
లోకాయుక్త కేసు సీబీఐకి?
న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న సీఎం లోకాయుక్త న్యాయమూర్తి రాజీనామాకు పెరుగుతున్న డిమాండ్ బెంగళూరు: రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా లోకాయుక్త స్థానంలో ఉన్న వ్యక్తిపై భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ పెరుగుతోంది. లోకాయుక్తపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపేందుకుగాను ప్రత్యేక విచారణ బృందాన్ని(ఎస్ఐటీ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎస్ఐటీ విచారణ పారదర్శకంగా సాగే అవకాశాలు కనిపించడం లేదని, అందువల్ల ఈ అంశంలో నిజానిజాలు వెల్లడి కావాలంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇక ఇదే విషయంపై అసెంబ్లీలో విపక్షాలు తమను నిలదీసేందుకు వ్యూహం రచిస్తున్నాయని తెలుసుకున్న ప్రభుత్వం విపక్షాలకు ఆ అవకాశం ఇవ్వకుండా ముందుగా తనే నిర్ణయం తీసుకోవాలనే దిశగా పావులు కదుపుతోంది. ఇక ఈ అంశంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు సైతం ఇందుకు ఊతమిస్తున్నాయి. బెళగావిలోని సువర్ణసౌధ వద్ద ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషయంపై స్పందిస్తూ, ఈ కేసును సీబీఐకి అప్పగించే విషయంపై న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. లోకాయుక్త ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ కావడంతో తాము వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతున్నామని సిద్ధరామయ్య తెలిపారు. ఇక ఇదే అంశంపై ప్రతిపక్షం జేడీఎస్ శాసనసభలో అధికార పక్షాన్ని నిలదీసింది. జేడీఎస్ శాసనసభ్యులు వై.వి.దత్తా మాట్లాడుతూ, ‘ఏడీజీపీ కమల్‌పంత్ మూడు నెలల విదేశీ పర్యటనకు వెళుతున్నారు. అలాంటి సందర్భంలో ఆయన నేతృత్వంలో ఎస్ఐటీని ఏర్పాటు చేయడంపై ప్రభుత్వ వైఖరిని ఎలా అంచనా వేయాలి?’ అని ప్రశ్నించారు. లోకాయుక్త రాజీనామాకు పెరుగుతున్న డిమాండ్ ఇక లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు రాజీనామా చేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని న్యాయవాదులు లోకాయుక్త భాస్కర్‌రావు రాజీనామా చేయాల్సిందేనంటూ ధర్నాలకు దిగుతున్నారు. న్యాయవాదుల సంఘంతోపాటు మరికొన్ని ప్రజాసంఘాల కార్యకర్తలు బుధవారమిక్కడి ఎం.ఎస్.బిల్డింగ్‌లోని లోకాయుక్త కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయవాదుల పరిషత్ అధ్యక్షుడు పి.పి.హెగ్డే మాట్లాడుతూ, లోకాయుక్త కార్యాలయంతోపాటు ఆయన నివాసంలో సైతం ఎంతో మంది అధికారులను బెదిరించి లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కుమారుడితో కలిసి కోట్ల రూపాయల డీలింగ్‌లకు పాల్పడ్డ వై.భాస్కర్‌రావు ఆ పదవిలో కొనసాగేందుకు ఎంత మాత్రం అర్హులు కారని విమర్శించారు. ఇక పెద్ద సంఖ్యలో లోకాయుక్త కార్యాలయానికి చేరుకున్న న్యాయవాదులు లోకాయుక్త కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించడంతో కాసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని న్యాయవాదులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లోకాయుక్త కార్యాలయం వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. -
60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయండి
-
60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయండి
‘ఎన్కౌంటర్’పై సిట్‌కు హైకోర్టు ఆదేశం ⇒ మేం ఏర్పాటు చేసిన బృందంగానే పనిచేయాల్సి ఉంటుంది ⇒ దర్యాప్తుపై ఏ అధికారినీ సంప్రదించనక్కర్లేదు ⇒ అవసరముంటే తమ అనుమతి తీసుకోవాలని స్పష్టీకరణ ⇒ దర్యాప్తు పురోగతి సరైన దిశలో సాగడం లేదన్న ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: తిరుపతి శేషాచలం అడవుల్లో చోటు చేసుకున్న ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని హైకోర్టు మంగళవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఆదేశించింది. ఇది తాము ఏర్పాటు చేసిన బృందంగానే పనిచేయాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ‘సిట్’ తన దర్యాప్తును కొనసాగించి.. అవసరమైన వ్యక్తి, వ్యక్తులను చట్టప్రకారం విచారించి తగిన ఆధారాలు సేకరించవచ్చని, ఈ విషయంలో ఏ అధికారినీ సంప్రదించనక్కర్లేదంది. ఒకవేళ సంప్రదించదలచుకుంటే కోర్టు అనుమతితో చేయాలంది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కేసు డైరీని తక్షణమే సిట్‌కు నేతృత్వం వహిస్తున్న అధికారికి అందచేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. దర్యాప్తు పురోగతిని తెలుసుకునేందుకు వీలుగా కేసును శుక్రవారం విచారిస్తామని తెలిపింది. ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తుకోసం పౌర హక్కుల సంఘం నేత చిల్కా చంద్రశేఖర్, తమ భర్తల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ మునియమ్మాళ్ తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది.గతవారం ఆదేశించిన మేరకు ఈ కేసు డైరీ(సీడీ)ని అడ్వొకేట్ జనరల్(ఏజీ) పి.వేణుగోపాల్ కోర్టు ముందుంచారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం.. కేసు దర్యాప్తు సరైన దిశలో సాగుతున్నట్లు అనిపించడం లేదంది. ఈ ఎన్‌కౌంటర్‌పై ఫిర్యాదు తీసుకునేముందు, ఆ తరువాత కేసు నమోదు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయం కోరడంపట్ల తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చింది. అటువంటి అభిప్రాయం తీసుకోనక్కర్లేదని తేల్చిచెప్పింది. సీఆర్పీసీ సెక్షన్ 154 ప్రకారం ఇటువంటి వ్యవహారంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) తన అభిప్రాయాన్ని తెలియచేయకూడదని పేర్కొంటూ.. ఇలాంటి కేసుల్లో పీపీ అభిప్రాయం తీసుకోవాలని చట్టంలో ఎక్కడా లేదని గుర్తుచేసింది. తన అభిప్రాయం తెలిపిన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఈ కేసులో నియమించుకోవడానికి వీల్లేదంటూ.. వేరే ఇతర స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించుకోవాలని, అవసరమైతే మరో ప్రాంతానికి చెందినవ్యక్తిని స్పెషల్ పీపీగా ఏర్పాటు చేసుకోవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. ఐజీ నేతృత్వంలోని సిట్‌ను ఈ ఎన్కౌంటర్ కేసు దర్యాప్తుకోసం ఏర్పాటు చేయలేదని, దీనిని సమగ్ర దర్యాప్తుకోసం ఏర్పాటు చేసినట్లు ఉందని తెలిపింది. దర్యాప్తుపై సందేహాలుంటే వాటిని నివేదిక గా తమ దృష్టికి తీసుకురావాలని సిట్‌కు స్పష్టం చేసింది. సిట్ అధికారుల్లో కొందరి నిష్పాక్షికత, ఔచిత్యంపై పిటిషనర్లు సందేహాలు వ్యక్తం చేయగా.. అందుకు ఆధారాలను కౌంటర్ అఫిడవిట్లుగా శుక్రవారానికల్లా వేయాలని వారిని ఆదేశించింది. -
సిట్ చీఫ్‌గా శాండిల్య
వికార్ ఎన్‌కౌంటర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు సభ్యులుగా ఖమ్మం ఎస్పీ షానవాజ్, మరో నలుగురు సమగ్ర దర్యాప్తు తర్వాత కోర్టుకు నివేదిక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాది వికారుద్దీన్ ముఠా ఎన్‌కౌంటర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐజీ(పర్సనల్) సందీప్ శాండిల్యను సిట్ చీఫ్‌గా నియమించింది. ఖమ్మం జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసిం, ఇంటెలిజెన్స్ విభాగం డీఎస్పీ ఎం.దయానంద్ రెడ్డి, ఏసీపీ ఎం.రమణకుమార్, ఇన్ స్పెక్టర్లు రాజా వెంకటరెడ్డి, ఎస్.రవీందర్ సిట్ సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. వరంగల్ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉన్న వికారుద్దీన్, సయ్యద్ అంజద్, ఎండీ జాకీర్, ఎండీ హనీఫ్, ఇజార్‌ను ఈ నెల 7న కోర్టు విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా నల్లగొండ జిల్లా ఆలేర్ సమీపంలో ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. పోలీసుల ఆయుధాలు లాక్కుని కాల్పులు జరిపేందుకు వికార్ గ్యాంగ్ యత్నించడంతో ఎదురుకాల్పుల్లో నిందితులంతా చనిపోయినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌పై ఆలేర్ పోలీసుస్టేషన్లో క్రైం నెంబరు 35/2015 కింద ఐపీసీ, ఆయుధాల చట్టం, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచారణ ఖైదీల మృతికి దారితీసిన పరిస్థితులను వెలుగులోకి తెచ్చేందుకు సిట్ ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు చేయిస్తున్నట్లు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దర్యాప్తులో భాగంగా ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించాలని, లోపాలుంటే వెలికి తీయాలని సిట్‌ను ఆదేశించింది. దర్యాప్తు నివేదికను సంబంధిత న్యాయస్థానంలో సిట్ సమర్పిస్తుందని తెలిపారు. -
ఎయిమ్స్ వైద్యుడికి థరూర్ ఈ-మెయిల్స్!
న్యూఢిల్లీ : సునంద పుష్కర్ మృతి కేసులో ఎయిమ్స్ మెడికల్ బోర్డు చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తాను సిట్ అధికారులు ప్రశ్నించారు. సునంద మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన బృందానికి గుప్తా నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. గుప్తా సమర్పించిన రిపోర్ట్ ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సునంద పుష్కర్ మరణాన్ని హత్య కేసుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్న డీసీపీ పీఎస్ కుష్వా, ఇన్స్పెక్టర్ రాజేందర్ సింగ్ బృందం గురువారం గుప్తాను పలు విషయాలపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. శశిథరూర్ తనకు కొన్ని ఈ-మెయిల్ సందేశాలు పంపినట్లు గుప్తా పోలీసులు విచారణలో తెలిపారు. అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న శశిథరూర్ ...గుప్తాపై ఒత్తిడి తెచ్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు శశిథరూర్ పంపిన సందేశాలను పోలీసులు పరిశీలించినట్లు తెలుస్తోంది. కాగా గుప్తాకు శశిథరూర్ ఎందుకు ఈ-మెయిల్స్ పంపాల్సి వచ్చిందనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. శశిథరూర్‌ను త్వరలోనే ఈకేసు విషయంపై ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. sunanda pushkar, shashi tharoor, sunanda murder, sudhir gupta, సునందా పుష్కర్, శశి థరూర్, సునంద హత్య, సుధీర్ గుప్తా -
చర్చి దగ్ధంపై సిట్ దర్యాప్తు
న్యూఢిల్లీ: రాజధాని నగరంలోని ఓ చర్చిలో అనుమానాస్పద రీతిలో మంటలు చెలరేగడంపై విచారణ జరిపేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. చర్చి దగ్ధం ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకొని న్యాయవిచారణకు ఆదేశించాలని క్రైస్తవ సమాజం డిమాండ్ చేసింది. ఇతర రాష్ట్రాలలో కూడా తమ మతం వారిపై జరుగుతున్న హింసపై కూడా విచారణ జరపాలని కోరింది. ఈశాన్య ఢిల్లీలోని తాహిర్పూర్లో గల సెయింట్ సెబాస్టియన్ చర్చిలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు పోలీస్ జాయింట్ కమిషనర్ (క్రైం) రవీంద్ర యాదవ్ నేతృత్వంలో ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని అంతకుముందు ఢిల్లీ ఆర్చ్‌బిషప్ అనిల్ కౌటో నేతృత్వంలోని ఓ ప్రతినిధి బృందం ఎల్జీని కోరింది. ఢిల్లీ హైకోర్టు ప్రస్తుత లేదా విశ్రాంత జడ్జీతో న్యాయ విచారణ జరిపించాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. కేవలం ఢిల్లీ చర్చి దగ్ధం ఘటనపైనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో క్రైస్తవులు, క్రైస్తవ సంస్థలకు వ్యతిరేకంగా జరుగుతున్న విద్వేషపూరితమైన ప్రచారంపై కూడా దర్యాప్తు జరిపించాలని వారు కోరారు. రాజధాని నగరంలో మతపరమైన హింసను తామెంతమాత్రం సహించబోమని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పేర్కొన్నారు. చర్చి దగ్ధం ఘటనపై దర్యాప్తును వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. వేలాది మందితో ప్రదర్శన చర్చి దగ్ధం ఘటనను నిరసిస్తూ వేలాది మంది క్రైస్తవులు ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం ముందు భారీ ప్రదర్శన నిర్వహించారు. మైనారిటీలకు రక్షణ కల్పించాలని, చర్చి ఆస్తులకు భద్రతనివ్వాలని వారు డిమాండ్ చేశారు. ఐటీఓ జంక్షన్‌ను రెండు గంటల పాటు స్తంభింప చేశారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆందోళనకారులు పోలీసు కార్యాలయంలోపలికి బలవంతంగా ప్రవేశిం చేందుకు విఫలయత్నం చేశారు. చర్చిని దగ్ధం చేసిన దుండగులను పట్టుకోవడంలో పోలీసులు జాప్యం చేశారని రాష్ట్రీయ ఇసాయి మహాసంఘ్ ప్రతినిధి అనితా బెంజమిన్ ఆరోపించారు. చర్చి ఆఫ్ నార్త్ ఇండియా బిషప్ కరమ్ మసీహ, పౌర హక్కుల నాయకుడు డాక్టర్ జాన్ దయాళ్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో ప్రస్తావన చర్చి దగ్ధం ఘటనను పార్లమెంట్లో పలువురు విపక్ష నేతలు ఖండించారు. లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన సీపీఎం సభ్యుడు కరుణాకరన్, ముందస్తు ప్రణాళిక ప్రకారమే చర్చిని దగ్ధం చేశారని ఆరోపించారు. పోలీసులు కూడా ఆలస్యంగా అక్కడికి వచ్చారని, అప్పటికి అంతా కాలి బూడిదయ్యిందని అన్నారు. పలువురు కాంగ్రెస్ సభ్యులు సైతం ఈ ఘటనను ఖండించారు. -
విదేశీ మారక అక్రమాలపై ఈడీ దర్యాప్తు
‘నల్లధన’ సిట్ విజ్ఞప్తి న్యూఢిల్లీ: విదేశీ మారకంలో నిబంధనల ఉల్లంఘనలు, అక్రమ నిధులను అరికట్టడానికి ఆర్బీఐ, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని నల్లధనంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కోరింది. రూ. 100 కోట్లకుపైగా ఎగుమతి బకాయిల వివరాలను ఈడీకి అందజేసింది. సాధారణంగా బ్యాంకులు ఇప్పటివరకు ఈ సమాచారాన్ని డీఆర్ఐ, కస్టమ్స్ సంస్థలకే ఇచ్చేవి. ప్రస్తుత ప్రొటోకాల్ ప్రకారం విదేశాలకు ఎగుమతి చేసే వారు తమకు రావలసిన బకాయిల సమాచారాన్ని 9 నెలల్లోగా ఆర్బీఐకి ఇవ్వాలి. లేకపోతే అక్రమాలకు పాల్పడుతున్నట్లు భావిస్తారు. వీటిని విదేశీ మారకం నిబంధనల ఉల్లంఘన, హవాలా కేసులుగా పరిగణిస్తారు. ఇలాంటి కేసులు చాలా ఉన్నట్లు సిట్ గుర్తించింది. -
నల్లధనంపై సుప్రీంకు సిట్ తొలి నివేదిక
న్యూఢిల్లీ: నల్లధనంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన తొలి నివేదికను బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. నివేదికపట్ల సుప్రీంకోర్టు సంతృప్తిని కూడా వ్యక్తంచేసింది. తనకు అప్పగించిన బాధ్యతమేరకు సిట్ మరో రెండు నెలలు నల్లధనంపై దర్యాప్తును కొనసాగించి నివేదిక దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, నివేదిక పరిశీలనకు అనుమతించాలంటూ పిటిషనర్, సీనియర్ న్యాయవాది, రాంజెఠ్మలానీ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ, నివేదిక పూర్తిగా రహస్యమని స్పష్టంచేసింది. విదేశీ బ్యాంకులనుంచి నల్లధనాన్ని స్వదేశానికి తెప్పించేందుకు మార్గాలను, పద్ధతులను సూచించేందుకు రాంజేఠ్మలానీ, ఆయన తరఫున న్యాయవాదులు సిట్‌తో స్వేచ్ఛగా సంప్రదింపులు జరపవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. కాగా, జర్మనీలోని బ్యాంకుల్లో న ల్లధనం దాచుకున్నవారి జాబితాలో ఒక మాజీ ప్రధాని పేరు ఉందని ఆరోపిస్తూ జేఠ్మలానీ రాసిన లేఖలకు సంబంధించి, జర్మనీ అధికారుల స్పందనపై కేంద్రం ప్రతిస్పందించాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. జెఠ్మలానీ తాను జర్మనీ అధికారులకు రాసిన లేఖలను అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్కే కౌల్‌కు అందజేయాలని కోరింది. నవంబర్ 11న తదుపరి విచారణ సందర్భంగా, ఈ లేఖలపై కౌల్ కోర్టుకు వాంగ్మూలం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నల్లధనాన్ని రప్పించేందుకు చర్యలు తీసుకోవాలంటూ జెఠ్మలానీ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షా నేతత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని గతంలోఏర్పాటు చేసింది. -
రంగంలోకి ప్రత్యేక విచారణ బృందం
సాక్షి, చెన్నై : మౌళివాకం ఘటన విచారణకు ప్రత్యేక బృందం(సిట్) రంగంలోకి దిగనుంది. చెన్నై మహానగర పోలీసు కమిషనర్ జార్జ్ పర్యవేక్షణలో ఓ జాయింట్ కమిషనర్ నేతృత్వంలో ఈ బృందం విచారణ వేగవంతం చేయనుంది. ఈ వ్యవహారం కొందరు సీఎండీఏ అధికారుల మెడకు బిగుసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. మౌళివాకంలో బహుళ అంతస్తుల భవనం కూలిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన అత్యధిక మంది ఈ ఘటనలో దుర్మరణం చెందారు. ఈ ఘట నను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. న్యాయ విచారణ ఓ వైపు జరుగుతుంటే, మరో వైపు ఈ కేసు విచారణ వేగవంతం చేయడానికి ప్రత్యేక విచారణ బృందం (సిట్)ను రంగంలోకి దించింది. ఆదివారం ఇందుకు సంబంధించిన ఆదేశాల్ని సీఎం జయలలిత జారీ చేశారు. మౌళివాకం ఘటనకు సంబంధించి మాంగా డు పోలీసు స్టేషన్లో కేసు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కేసులో ఆ భవన యజమాని, ఆర్కిటెక్ట్, ఇంజనీర్లు అరెస్టు అయ్యారని వివరించారు. విచారణను వేగవంతం చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించుతున్నామని ప్రకటించారు. చెన్నై మహానగర పోలీసు కమిషనర్ జార్జ్ పర్యవేక్షణలో ఓ జాయింట్ కమిషనర్ నేతృత్వంలో ఈ బృందం విచారణ వేగవంతం చేస్తుందన్నారు. నిర్మాణ రంగంలోని సాంకేతిక అంశాలు, అనుమతుల పరంగా పరిశీలన, నిబంధనల గురించి ఈ విచారణ బృందానికి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. చెన్నై ఐఐటీ,అన్నా వర్సిటీ నిపుణులు ఈ బృందానికి సహకారంగా ఉంటారని, సాంకేతిక ఆలోచనలు, విధానాలను ఆ నిపుణులు ఎప్పటికప్పుడు బృందానికి అందించనున్నారని ప్రకటించారు. అధికారుల మెడకు ఉచ్చు : మౌళివాకం ఘటన పలువురు సీఎండీఏ అధికారుల మెడకు బిగుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణ బృందానికి సర్వాధికారాల్ని సీఎం జయలలిత ఇచ్చారు. అలాగే, సాంకేతిక అంశాలు, అనుమతుల పరంగా, నిబంధనల పరంగా అవగాహన చేసుకోనున్న దృష్ట్యా, అధికారుల చేతివాటం వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ కేసు పరిధిలోకి మాంగాడు పోలీసులు ఆర్కిటెక్ట్, స్ట్రక్చర్ ఇంజనీర్లను ఏ విధంగా చేర్చారో అదే తరహాలో సీఎండీఏ అధికారుల పేర్లను చేర్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. రోడ్డు విస్తరణకు సంబంధించి రెవెన్యూ అనుమతులు, కుండ్రత్తూరు పంచాయతీ అధికారులు ఇచ్చిన అనుమతులను ఈ బృందం పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సీఎండీఏలో అనుమతుల, అంచనాల విభాగం అధికారులు, ప్రధాన సభ్యుడు ఒకరు సైతం భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చిన ధృవీకరణ పత్రాల్లో సంతకాలు చేసి ఉన్న దృష్ట్యా, వీరందర్నీ విచారణ బృందం ప్రశ్నించే అవకాశాలున్నాయి. -
భవనం కూలిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు
చెన్నై: నగరంలో 11 అంతస్తుల భవనం కూలి భారీ ప్రాణ నష్టం సంభవించిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తుకు రంగం సిద్ధమైంది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదివారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ పార్టీల డిమాండ్ అధికంగా కావడంతో జయలలిత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భవనం ఆకస్మికంగా కూలి 61 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. భవన నిర్మాణాన్ని చేపట్టే క్రమంలో ప్రణాళిక లోపం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుపడటంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. ఈ బృందానికి నగర జాయింట్ పోలీస్ కమీషనర్ నేతృత్వం వహించనున్నారు. ఇందుకు గాను సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్ ఇంజనీర్లు సహకారం కూడా తీసుకోనున్నారు. గత శనివారం చెన్నై మొగలివాక్కంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కుప్ప కూలింది. ఆ భవన నిర్మాణంలో కార్మికులుగా పని చేస్తున్న ఉత్తరాంధ్రకు చెందిన అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయారు. -
కొత్త అటార్నీ జనరల్ ఎవరు?
SBI POs, Clerks General Awareness 1. The Union Cabinet constituted a special investigation team (SIT) to look into the issue of black money in May 2014. The SIT is headed by? 1) Justice B.S. Chauhan 2) Justice Dipak Misra 3) Justice T.S. Thakur 4) Justice M.B. Shah 5) None of these 2. Who was appointed as the National Security Adviser (NSA) on May30, 2014? (He succeeded Shivshankar Menon) 1) M.K. Narayanan 2) Ajit Doval 3) Shyam Saran 4) Rajiv Mathur 5) Dilip Trivedi 3. The 35th edition of the National Games will be held in which of the following States in January-February 2015? 1) Goa 2) Karnataka 3) Kerala 4) Maharashtra 5) Manipur 4. Who was appointed as the Vice President and Auditor General of the World Bank on May 23, 2014? 1) Haruhiko Kuroda 2) Hiroshi Naka 3) Kikuo Iwata 4) Masaaki Shirakawa 5) Takehiko Nakao 5. Who was appointed as the 14th Attorney General of India in May 2014? (He succeeded Gulam Vahanavati) 1) Rohinton Nariman 2) Gopal Subramaniam 3) Mohan Jain 4) Siddharth Luthra 5) Mukul Rohatgi 6. The European Union banned the import of four vegetables from India from May 1, 2014. Which of the following is not one of them? 1) Eggplant 2) Taro plant 3) Bitter gourd 4) Snake gourd 5) Bottle gourd 7. Which of the following Prizes is given annually to six persons, one from each of the world's six geographic regions? 1) Abel Prize 2) Pulitzer Prize 3) Templeton Prize 4) Nobel Prize 5) Goldman Environmental Prize 8. The Department of Posts has allotted customized pin code to the Supreme Court of India. It is? 1) 100200 2) 112200 3) 110022 4) 110201 5) 111121 9. 'Jiyo Parsi' scheme for containing population decline of Parsis in India was launched by the Ministry of? 1) Home 2) External Affairs 3) Finance 4) Human Resource Development 5) Minority Affairs 10. Gyan Correa is the Director of which of the following films? 1) The Lunchbox 2) English Vinglish 3) Bhaag Milkha Bhaag 4) Celluloid 5) The Good Road 11. If a Basic Savings Bank Deposit Account (BSBDA) holder has any other existing savings bank account in that bank, he/she will be required to close it within how many days from the date of opening a BSBDA? 1) 15 days 2) 30 days 3) 45 days 4) 60 days 5) 90 days 12. Who is the Chairman of a four member Committee that was appointed to clear the ambiguity between Foreign Direct Investment (FDI) and Foreign Institutional Investors (FII)? 1) Sumit Bose 2) G.S. Sandhu 3) R.S. Gujral 4) Arvind Mayaram 5) Rajiv Takru 13. The General Anti Avoidance Rules (GAAR) provisions will come into force from? 1) July 1, 2014 2) April 1, 2016 3) April 1, 2015 4) January 1, 2015 5) January 1, 2016 14. Which of the following countries is/are considered Tax Haven? 1) Mauritius 2) Lichtenstein 3) Switzerland 4) Luxemburg 5) All the above 15. Simona Halep is the winner of the 2013 Kremlin Cup held in Moscow. She is a tennis player from? 1) Australia 2) France 3) Romania 4) Russia 5) Kazakhstan 16. Who among the following did not score a double century in one day international cricket matches? 1) Sachin Tendulkar 2) Virendra Sehwag 3) Virat Kohli 4) Rohit Sharma 5) Both 3 and 4 17. The Global Gender Gap Report was first published in 2006 by the? 1) World Bank 2) International Monetary Fund 3) United Nations Development Program 4) World Economic Forum 5) None of these 18. 'Time To Act' is a declaration of the United Nations General Assembly against? 1) Illiteracy 2) Poverty 3) Sexual violence 4) Global warming 5) AIDS 19. Robusta is a species of which of the following crops that has its origins in Africa? 1) Tobacco 2) Rubber 3) Banana 4) Coffee 5) Cocoa 20. The Aswan High Dam is situated in which of the following African countries? 1) Sudan 2) Nigeria 3) Egypt 4) Algeria 5) Tanzania 21. Who played the lead role in the film Paan Singh Tomar? 1) Farhan Akhtar 2) Vinay Pathak 3) Rajkumar Rao 4) Salman Khan 5) Irrfan Khan 22. What does 'S' denote in the abbreviation UNSC? 1) Social 2) Scientific 3) Security 4) Secular 5) Sensitive 23. Which Indian batsman scored the fastest One Day International century (in 52 balls) in October 2013? 1) Rohit Sharma 2) Sachin Tendulkar 3) Virendra Sehwag 4) Shikar Dhawan 5) Virat Kohli 24. Which of the following seeks to check tax avoidance by investors routing their funds through tax havens? 1) GST 2) FDI 3) CCEA 4) GAAR 5) FII 25. Which is the largest recipient of foreign remittances in 2013? 1) India 2) China 3) Philippines 4) Mexico 5) Nigeria 26. 'Migration and Remittance Flows: Recent Trends and Outlook 2013-16' is a report released by the? 1) World Bank 2) United Nations General Assembly 3) United Nations Security Council 4) World Economic Forum 5) International Monetary Fund 27. Which of the following committees looked into the backwardness of States? 1) Vijay Kelkar Committee 2) C. Rangarajan Committee 3) Raghuram Rajan Committee 4) Y.V. Reddy Committee 5) None of these 28. Based on Multi Dimensional Index (MDI) scores, which is the most developed State in India? 1) Goa 2) Kerala 3) Tamil Nadu 4) Punjab 5) Maharashtra 29. Which of the following panels has recommended a ban on development activities in 60,000 sq km ecologically sensitive area in Western Ghats? 1) Rajendra Pachauri 2) K. Kasturirangan 3) U.R. Rao 4) Arundhati Roy 5) Anil Kakodkar 30. Which team won the Women's Hockey Asia Cup 2013 in Kuala Lumpur, Malaysia? 1) Japan 2) South Korea 3) India 4) China 5) Malaysia 31. Which of the following was set up on the recommendations of Royal Commission on Indian Currency and Finance? 1) EXIM Bank 2) NABARD 3) SBI 4) BSE 5) RBI 32. Indian Banks' Association (IBA) was formed in which of the following years? 1) 1947 2) 1946 3)1950 4) 1956 5)1951 33. The central office of the Reserve Bank of India was permanently shifted to Mumbai from Kolkata in? 1) 1935 2) 1936 3) 1937 4) 1949 5)1947 34. UK's Department for Intern- ational Development (DFID) has launched a new affordable housing scheme for low-income households in urban areas of India in collaboration with the? 1) SBI 2) SIDBI 3) HUDCO 4) NHB 5) NABARD 35. Who is the author of the book 'Gulliver's Travels'? 1) Charles Dickens 2) Charles Lamb 3) T.S. Eliot 4) O Henry 5) Jonathan Swift 36. Which of the following constitutional amendments is known as 'Mini Constitution'? 1) 40th 2) 42nd 3) 41st 4) 45th 5) None of these KEY 1) 4 2) 2 3) 3 4) 2 5) 5 6) 5 7) 5 8) 4 9) 5 10) 5 11) 2 12) 4 13) 2 14) 5 15) 3 16) 3 17) 4 18) 3 19) 4 20) 3 21) 5 22) 3 23) 5 24) 4 25) 1 26) 1 27) 3 28) 1 29) 2 30) 1 31) 5 32) 2 33) 3 34) 4 35) 5 36) 2 ఉద్యోగాలు ఇండియన్ నేవీ ఇండియన్ నేవీ 10+2 క్యాడెట్(బీటెక్) ఎంట్రీ స్కీమ్‌కు దరఖాస్తులు కోరుతోంది. అర్హత: 70 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణులు. పదోతరగతి/ఇంటర్ స్థాయిలో 50 శాతం మార్కులతో ఇంగ్లిష్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 17 నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక: ఇంటర్ మార్కులు, సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ ఆధారంగా ఇంటర్వ్యూ కేంద్రం: విశాఖపట్నం ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూన్ 23 వెబ్సైట్:www.nausena-bharti.nic.in బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కింది పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. 1. ఏఎస్ఐ (రేడియో మెయింటనెన్స్- ఆర్ఎం): 68 2. హెడ్ కానిస్టేబుల్(హెచ్‌సీ) (రేడియో ఆపరేటర్-ఆర్ఓ): 417 3. హెడ్ కానిస్టేబుల్(హెచ్‌సీ) (ఫిట్టర్): 11 అర్హతలు: నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు ఉండాలి దరఖాస్తులకు చివరి తేది: జూలై 7 వెబ్సైట్: http://bsf.nic.in ప్రవేశాలు దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ, విశాఖపట్నం కింది కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు: బీఏ ఎల్ఎల్బీ (హానర్స్) -ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ సీట్ల సంఖ్య: 120 అర్హత: క్లాట్-2014 స్కోరు ఆధారంగా దరఖాస్తులకు చివరి తేది: జూలై 16 వెబ్సైట్: www.dsnlu.ac.in శ్రీ వేంకటేశ్వర వేదాంత వర్థినీ సంస్కృత కళాశాల తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర వేదాంత వర్థినీ సంస్కృత కళాశాల, సికింద్రాబాద్ కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. 1. ఆరు నుంచి పదో తరగతి: ఓఎస్ఎస్ సిలబస్‌తో ఇంగ్లిష్, తెలుగు మాధ్యమం 2. పీడీసీ: రెండేళ్లు అర్హత: పదో తరగతి లేదా అర్హత పరీక్షలో ఉత్తీర్ణత వయసు: 16 ఏళ్లు 3. బీఏ(ఎల్): మూడేళ్లు అర్హత: పీడీసీ సంస్కృతంలో లేదా ఇంటర్ ఉత్తీర్ణులైనవారు వయసు: 18 ఏళ్లు 4. సంస్కృతం, కంప్యూటర్ చిరునామా: శ్రీ వేంకటేశ్వర వేదాంత వర్థినీ సంస్కృత కళాశాల, ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్, న్యూబోయిన్‌పల్లి, సికింద్రాబాద్ - 500011 ఫోన్: 040-27750032 మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.sakshieducation.com చూడవచ్చు. -
నల్లధనంపై దర్యాప్తు వేగవంతం
సిట్ తొలి సమావేశంలో నిర్ణయం న్యూఢిల్లీ: నల్లధనం కేసుల దర్యాప్తునకు కేంద్రం నియమించిన ప్రత్యేక విచారణ బృందం(సిట్) తొలి సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎం.బి. షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నల్లధనానికి సంబంధించిన కేసులను వేగంగా చేపట్టడంపై పరిశీలన జరపాలని నిర్ణయించారు. విదేశాల్లోని బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనం అంశంపై ఏ విధంగా ముందుకు వెళ్లాలో రోడ్ మ్యాప్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. రెండు గంటల పాటు జరిగిన సమావేశం అనంతరం ఆర్థిక శాఖ ఇందుకు సంబంధించి ఒక ప్రకటన జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చ జరిగిందని, రోడ్ మ్యాప్ ఖరారైందని వెల్లడించింది. అయితే, ఆ రోడ్ మ్యాప్ (అనుసరించాల్సిన ప్రణాళిక) ఏమిటన్నది చెప్పలేదు. తదుపరి సమావేశం త్వరలోనే జరుగుతుందని ప్రకటించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్, సీబీఐ ఇతర దర్యాప్తు సంస్థలు చేపట్టిన నల్లధనం, మనీలాండరింగ్ కేసుల వివరాలు, ప్రగతి గురించి వివరాలు ఇవ్వాలని ఆదేశించినట్లు సమవేశంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో సిట్ వైస్ చైర్మన్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అరిజిత్పసాయత్, ఐబీ సహా 11 కేంద్ర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నల్లధనంపై నేడే ‘సిట్’ భేటీ
న్యూఢిల్లీ: విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం వెలికితీతపై కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. సిట్ అధినేత, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలో జరగనున్న ఈ భేటీలో సిట్ వైస్ చైర్మన్ జస్టిస్ అరిజిత్ పసాయత్తోపాటు 11 ఉన్నత విభాగాలకు చెందిన అధికారులు పాల్గొననున్నారు. నల్లధనంపై ప్రభుత్వ విధానం, ఇప్పటివ రకు జరిగిన దర్యాప్తుల్లో వెలుగుచూసిన అంశాలు, బ్లాక్‌మనీకి సంబంధించి వివిధ విభాగాల వద్ద ఉన్న సమాచారంపై ఇందులో చర్చించనున్నారు. తమ దర్యాప్తుల్లో వెల్లడైన సమగ్ర సమాచారంతో ఈ సమావేశానికి రావాలని ఇప్పటికే ఆయా విభాగ ఉన్నతాధికారులను కోరారు. హసన్ అలీ ఉదంతంతోపాటు నల్లధనానికి సంబంధించిన ఇతర కేసులూ భేటీలో చర్చకు రానున్నాయి. ఇప్పటికే విచారణ మొదలైన, పెండింగ్‌లో ఉన్న, మొదలు కావాల్సిన, లేదా పూర్తయిన అన్ని కేసులపైనా సిట్‌కు న్యాయ పరిధి ఉంటుందని ఆర్థికశాఖలోని రెవెన్యూ విభాగం తెలిపింది. తన పనితీరు, కేసుల పురోగతిపై సిట్ ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టుకు స్థాయీ నివేదికలు సమర్పించనుంది. సిట్ ఏర్పాటు తర్వాత జరుగుతున్న ఈ తొలి సమావేశంలో రెవెన్యూ విభాగం కార్యదర్శి, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, ఇంటెలిజెన్స్ బ్యూరో డెరైక్టర్, డెరైక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) డెరైక్టర్, సీబీఐ డెరైక్టర్, సీబీడీటీ చైర్మన్, జనరల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డెరైక్టర్, డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డీజీ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ డెరైక్టర్, ‘రా’ కార్యదర్శి, ఆర్థికశాఖ (విదేశీ పన్నులు, పన్నుల పరిశోధన) సంయుక్త కార్యదర్శి తదితరులు పాల్గొనున్నారు. -
పెద్దలనూ వదలబోం: జస్టిస్ ఎంబీ షా
* నల్లధనం కేసులపై సత్వర విచారణ * వీలైనంత త్వరగా పని ముగిస్తాం * తన ట్రాక్ రికార్డే నిదర్శనమన్న షా అహ్మదాబాద్: నల్లధనం సంబంధిత కేసుల్లో ఎవరినీ వదిలేది లేదని సిట్ చైర్మన్ జస్టిస్ ఎం.బి.షా ప్రకటించారు. రాజకీయ పెద్దలు, కార్పొరేట్ ప్రముఖులు నల్లధనాన్ని విదేశాల్లో పోగేసినట్టు తేలితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన సారథ్యంలో సిట్ ఏర్పాటుకు మంగళవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న అనంతరం ఆయన పీటీఐ వార్తా సంస్థతో ఫోన్లో మాట్లాడారు. పలువురు నేతలు, కార్పొరేట్ పెద్దలు విదేశాల్లో భారీగా నల్లధనాన్ని దాచుకున్నారన్న వార్తల నేపథ్యంలో వారి విషయంలో ఎలా వ్యవహరిస్తారన్న ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. ‘‘నేను చాలా ఏళ్లపాటు న్యాయమూర్తిగా ఉన్నాను. 15 ఏళ్లు హైకోర్టులో, ఐదేళ్లు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పని చేశాను. వ్యక్తులను, వారి పరపతి తదితరాలను ఏనాడూ లెక్క చేయలేదు. అందుకే అలాంటి విషయాల్లో నన్ను సంప్రదించేందుకు కూడా ఎవరూ సాహసించలేదు’’ అని గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు కూడా అంతే. కాబట్టి నల్లధనంపై విచారణ విషయంలో ఎవరూ సందేహించాల్సిన పని లేదు’’ అంటూ భరోసా ఇచ్చారు. అయితే ఈ ఉదంతంలో సంక్లిష్టమైన అంశాలెన్నో ఉన్నాయని జస్టిస్ షా అభిప్రాయపడ్డారు. అయినా విచారణ వేగవంతంగా జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా తాము పని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఒడిశా, గోవాల్లో అక్రమ మైనింగ్‌పై వేసిన కమిషన్‌కు సారథిగా కేవలం రెండు నెలల్లో తొలి మధ్యంతర నివేదిక సమర్పించానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశించింది గనుక సిట్‌ను కేంద్రం ఏర్పాటు చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. అంతకంటే మరోదారి లేకపోయిందన్నారు. నల్లధనాన్ని వెలికితీయడం కొత్త ప్రభుత్వానికి కూడా తప్పనిసరేనని అభిప్రాయపడ్డారు. -
‘నల్లధనం’పై సిట్‌కు వారం గడువు
‘బ్లాక్‌మనీ’ సమాచారాన్ని ప్రతివాదులకు ఇవ్వాలి: సుప్రీం న్యూఢిల్లీ: నల్లధనం కేసుల దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎం.బి.షా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందా(సిట్)న్ని ఏర్పాటు చేయటానికి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మరో వారం రోజుల సమయం ఇచ్చింది. నల్లధనం కేసులపై సిట్ నియామకానికి సంబంధించి మూడు వారాల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని సుప్రీంకోర్టు మే 1వ తేదీన కేంద్రానికి నిర్దేశించిన విషయం తెలిసిందే. దేశంలోనూ, విదేశాల్లోనూ నల్లధనం కేసుల దర్యాప్తులో మార్గదర్శనం, పర్యవేక్షణ కోసం ఏర్పాటయ్యే ఈ సిట్ చైర్మన్‌గా మాజీ జడ్జి ఎం.బి.షా, వైస్ చైర్మన్‌గా మరో మాజీ జడ్జి అరిజిత్పసాయత్లను కూడా కోర్టు అప్పుడే నియమించింది. జర్మనీలోని లీక్టెన్స్టీన్లో గల ఎల్ఎస్టీ బ్యాంకులో పలువురు భారతీయులు నల్లధనం దాచారన్న ఆరోపణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దర్యాప్తులో భాగంగా సేకరించిన పత్రాలు, సమాచారం మొత్తాన్నీ.. ఈ అంశంపై పిటిషన్ వేసిన సీనియర్ న్యాయవాది రామ్‌జెఠ్మలానీ తదితరులకు అందించాలని కూడా అప్పుడు ఆదేశించింది. సిట్ ఏర్పాటుకు ఇచ్చిన గడువు గురువారంతో ముగిసిన నేపథ్యంలో తాజాగా జస్టిస్ బి.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ.కె.సిక్రిల నేతృత్వంలోని ధర్మాసనం మరో వారం రోజుల గడువు ఇచ్చింది. అలాగే.. నల్లధనానికి సంబంధించిన కొన్ని కీలక ఫైళ్లు శాస్త్రిభవన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయని సీనియర్ న్యాయవాది రామ్‌జెఠ్మలానీ ఆరోపించటంతో.. నల్లధనానికి సంబంధించిన పత్రాలన్నిటినీ రెవెన్యూ విభాగంలోని కార్యదర్శి స్థాయి అధికారి సంరక్షణలో ఉంచాలని కూడా ధర్మాసనం నిర్దేశించింది. అయితే.. జెఠ్మలానీ ఆరోపణలను సొలిసిటర్ జనరల్ మోహన్పరాశరన్ ఖండించారు. నల్లధనానికి సంబంధించిన పత్రాలన్నిటినీ నార్త్‌బ్లాక్‌లో ఉంచటం జరిగిందని, శాస్త్రిభవన్‌లో కాదని ఎస్జీ పేర్కొన్నారు. -
నిడో తానియం మృతిపై 'సిట్' దర్యాప్తు
దేశ రాజధానిలో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన విద్యార్థి నిడో తానియం (19) మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆ దర్యాప్తు బృందాన్ని సౌత్ ఈస్ట్ డీసీపీ పి.కరుణాకరన్ పర్యవేక్షించనున్నారని తెలిపారు. అయితే ఆ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను గుర్తించామని, వారిలో ముగ్గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన నిందితుల కోసం హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. గత బుధవారం లజ్‌పత్ నగర్‌లోని స్వీట్ షాప్‌లో నిడో తానియంపై దాడి జరిగింది. ఆ మరునాడు అతడు మరణించాడు. దాంతో నిడో తానియం మృతిపై విచారణ జరపాలని హస్తినలోని జంతర్ మంతర్ వద్ద ఈశాన్యరాష్ట్రవాసులతోపాటు స్థానికులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆందోళనకారులను పరామర్శించారు. ఆ ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తామని ఆందోళనకారులకు ఆయన హామీ ఇచ్చారు. రాహుల్ అక్కడి నుంచి వెళ్లిన గంటకే సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసుల ప్రకటించడం గమనార్హం. నిడోతానియం మృతిపై నిరసనకు దిగిన ఆందోళనకారులకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. నిడో తానియం మృతిపై విచారణ వేగవంతం చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నిడో తానియం మృతిపై మంగళవారం న్యూఢిల్లీలో జరిగే ధర్నాలో కేజ్రీవాల్ పాల్గొనున్నారు. -
తుండా కస్టడీపిటీషన్ పై నేడు విచారణ
-
బీహార్ 'మిడ్ డే మీల్స్'లో మరొకరు అరెస్ట్
బీహార్ రాష్ట్రంలోని శరన్ జిల్లాలో ధర్మసతి గందమన్ గ్రామంలో పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా విషాహారం తిని 23 మంది చిన్నారుల మృతి చెందిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కొంత పురోగతి సాధించింది. ఆ కేసులో ఎరువుల వ్యాపారి వకిల్ రాయ్‌ను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. అతడు విష్ణుపుర్ గ్రామంలో ఎరువుల దుకాణం నడుపుతున్నట్లు చెప్పారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మీనా దేవీ భర్త అర్జున్ రాయ్ తమ విచారణలో వెల్లడించిన సమాచారం మేరకు వకిల్‌ను ఆదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఆ కేసులో ఇప్పటికే హత్య, కుట్ర తదితర కేసులను మీనాదేవీపై నమోదు చేసినట్లు వివరించారు. ఆ కేసులో నిందితుడైన ఆమె భర్త అర్జున్ రాయ్ ఈ నెల 9న పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో అతడిని విచారించిన పోలీసులకు పలు కీలక సమాచారం సేకరించారు. అందులోభాగంగానే వకిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జులై 16న రాష్ట్రంలోని శరన్ జిల్లాలోని గందమాన్ గ్రామంలో మధ్యాహ్న భోజన పథకం కింద కలుషిత ఆహారం తిని 23 మంది మరణించారు. దాంతో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నితీష్ ప్రభుత్వం నియమించింది. చిన్నారులకు వడ్డించిన ఆ ఆహార పదార్థాల్లో క్రిమిసంహారక మందులు కలసినట్లు ప్రయోగశాలలో జరిపిన పరీక్షల్లో వెల్లడైంది. దాంతో ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలులతోపాటు పలువురిపై కేసులు నమోదు చేశారు.