బిజినేపల్లి: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిందితులను పట్టుకోవడానికి కాకుండా..అసలు నిందితులను రక్షించడానికే పనిచేస్తుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. పేపర్ లీక్ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ బోర్డుకు, ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధాలున్నాయనే ఆరోపణలు రోజురోజుకూ బలపడుతున్నాయన్నా రు.
టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యుడు లింగారెడ్డి పీఏకు గ్రూప్–1లో 127 మార్కులు ఎలా వచ్చాయని, ముఖ్యమంత్రికి ఓఎస్‌డీగా పనిచేసే రాజశేఖర్‌రెడ్డికి లింగారెడ్డి స్వయంగా మేనబావని తెలిపారు. రాజ్యాధికార యాత్ర లో భాగంగా శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో ప్రవీణ్ కుమార్ పర్య టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిట్ ఈ కేసులో అసలు దోషులను వదిలేసి, కిందిస్థాయిలో 12 మందిని అరెస్టు చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో 2009 బ్యాచ్‌కు చెందిన 200 మంది ఎస్సైల పదోన్నతుల ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టారని, అలాంటి ఫైల్స్ చూడని హోంమంత్రిపై త్వర లోనే మిస్సింగ్ కంప్లైంట్ చేస్తామన్నారు. ప్రభుత్వానికి పనిచేయాల్సిన అడ్వొకేట్ జనరల్ కవిత లిక్కర్ స్కాం కేసు కోసం ఈడీ ముందు ఎలా హాజరవుతారని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment